'మా బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది' | strong batting line up both in top and middle order, says Moeen Ali | Sakshi
Sakshi News home page

'మా బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది'

Published Wed, Mar 9 2016 3:22 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

'మా బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది'

'మా బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది'

ముంబై: ఇంగ్లండ్ టీమ్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉందని ఆ జట్టు ఆల్ రౌండర్ మొయిన్ అలీ వ్యాఖ్యానించాడు. జో రూట్, బట్లర్, ఇయాన్ మోర్గాన్, స్టోక్స్, హేల్స్ లతో కూడిన తమ బ్యాటింగ్ ఆర్డర్ మరింత ధృఢంగా తయారైందని పేర్కొన్నాడు.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై మరో విదేశీ క్రికెటర్ ప్రశంసల జల్లులు కురిపించాడు. తనకు కూడా ఐపీఎల్ టోర్నీలో ఆడాలని ఉందని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ పేర్కొన్నాడు. కొద్దిరోజుల్లో ఐసీపీ టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో నేడు మొయిన్ అలీ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

భారత బౌలర్లపై ప్రశంసలు
ఏదో ఓ రోజు తాను తప్పకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీలోని ఓ జట్టులో సభ్యుడిని అవుతానని చెప్పాడు. ఐపీఎల్ ఆడితే టాప్ స్పిన్నర్స్, ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం పంచుకునే అవకాశం దొరికి తన ఆటతీరు మెరుగు చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. తమ జట్టు ఇంగ్లండ్.. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక జట్లతో కలిసి గ్రూప్-1 లో ఉందన్నాడు. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బంతులు వేయడంలో చాలా వైవిధ్యం చూపిస్తారని వారిని ప్రశంసించాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్లో వారిద్దరూ భారత జట్టుకు ఎంతో ప్రయోజనమని మొయిన్ అలీ అభిప్రాయపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement