‘టెస్టుల్లో ఐదు శతకాలు.. నా వరకు ఎక్కువే’ | There Were Times I Felt: Moeen Ali after retiring from international cricket | Sakshi
Sakshi News home page

‘టెస్టుల్లో ఐదు శతకాలు.. నా వరకు గొప్పే’

Published Mon, Sep 9 2024 2:08 PM | Last Updated on Mon, Sep 9 2024 2:15 PM

There Were Times I Felt: Moeen Ali after retiring from international cricket

టెస్టు క్రికెట్‌లో ఐదు శతకాలు బాదినందుకు తాను గర్వపడుతున్నానని ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ అన్నాడు. మేటి బ్యాటర్‌ జో రూట్‌ను అనుకరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించానని.. అయితే అతడిలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లడం తనకు సాధ్యంకాలేదని తెలిపాడు. ఎలాంటి వ్యూహాలు లేకుండానే క్రీజులోకి వెళ్లి సెంచరీలు చేయడం తనకే ఆశ్చర్యంగా ఉండేదని పేర్కొన్నాడు.

మూడు ఫార్మా ట్లలో త్తా చాటిన మొయిన్‌ అలీ
కాగా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్‌, టీ20 ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లండ్‌ జట్లలో సభ్యుడైన  అలీ... తన కెరీర్‌లో ఎన్నో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 2014లో ఇంగ్లండ్‌ తరఫున అరంగేట్రం చేసిన అతడు.. పదేళ్ల కెరీర్‌లో 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20 మ్యాచ్‌లూ ఆడాడు. 

బంతితో, ఇటు బ్యాట్‌తో రాణించి.. టెస్టుల్లో 3094 పరుగులు చేయడంతోపాటు 204 వికెట్లు పడగొట్టాడు. అతడి ఖాతాలో ఐదు టెస్టు సెంచరీలు ఉండటం విశేషం. అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ మొయిన్‌ అలీ తన మార్కు చూపించాడు. వన్డేల్లో 2355 పరుగులు సహా 111 వికెట్లు.. అంతర్జాతీయ టీ20ల్లో 1229 పరుగులతో పాటు 51 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

అందుకే  రిటైర్మెంట్‌
తనలో క్రికెట్‌ ఆడే సత్తా ఇంకా మిగిలే ఉందని.. అయితే, కొత్త తరానికి అవకాశం ఇవ్వడం కోసమే రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు 37 ఏళ్ల మొయిన్‌ అలీ ఆదివారం వెల్లడించాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకొన్నా.. ఫ్రాంచైజీ క్రికెట్‌లో మరి కొన్నాళ్లు ఆడతానని స్పష్టం చేశాడు.

ఆ విషయంలో విఫలమయ్యాను
ఈ నేపథ్యంలో తన టెస్టు కెరీర్‌ గురించి నెమరువేసుకున్న మొయిన్‌ అలీ.. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ నాసిర్‌ హుసేన్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను ఐదు శతకాలు బాదినందుకు గర్వపడుతున్నా. కేవలం ఐదే కదా అని అందరికీ అనిపించవచ్చు. కానీ.. డౌన్‌ ఆర్డర్‌లో వచ్చి మరీ ఇలా ఆడటం నాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది.

అసలేం చేయగలనో తెలియని స్థితిలో క్రీజులోకి వెళ్లి.. పరుగులు రాబట్టడం నా వరకు ఊహించని విషయమే. ఉన్న కాసేపైనా బ్యాటింగ్‌ చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించేవాడిని. నిజానికి జో రూట్‌లా నేనూ పక్కా ప్లాన్‌తో ఆడాలని భావించేవాడిని. కానీ విఫలమయ్యాను. అప్పటికప్పుడు పరిస్థితికి తగ్గట్లుగా మారిపోవడమే నాకు తెలుసు. 

అయితే, ఒక్కోసారి అనుకున్న మేర పరుగులు సాధించలేకపోయాననే భావన వెంటాడేది’’ అని చెప్పుకొచ్చాడు. తన కెరీర్‌ పట్ల మొయిన్‌ అలీ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ టెస్టుల్లో 12377 పరుగులు చేశాడు. ఇందులో 34 శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానమే లక్ష్యంగా రూట్‌ ముందుకు సాగుతున్నాడు.

చదవండి: Ind vs Ban: అందుకే వాళ్లిద్దరికి టీమిండియాలో చోటు దక్కలేదు!
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement