టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. ఆ జట్టు రెగ్యూలర్ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి భార్య లూయిస్ మూడో బిడ్డకు జన్మనివ్వనుండడంతో.. బట్లర్ పితృత్వ సెలవు తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే అతడు లీగ్ దశ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ బట్లర్ దూరమైతే ఇంగ్లీష్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఆల్‌రౌండర్ మొయిన్ అలీ చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఈ మెగా ఈవెంట్‌లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 4న బార్బోడస్ వేదికగా స్కాట్లాండ్‌తో తలపడనుంది. ఇంగ్లండ్ ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా సొంత గడ్డపై నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దు అయింది.
శనివారం ఇరు జట్లు మధ్య రెండో టీ20 జరగనుంది. ఈ క్రమంలో రెండో టీ20కు ముందు మొయిన్ అలీ మీడియా సమావేశంలో మాట్లాడాడు. "నేను వైస్-కెప్టెన్‌గా ఉన్నప్పుడు జోస్ బట్లర్ గైర్హజరీలో చాలా సందర్బాల్లో జట్టును నడిపించాను. ఆ సమయంలో కెప్టెన్సీ పరంగా నేను ఎటువంటి ఒత్తిడికి లోనవ్వలేదు. కొత్తగా కూడా నాకేమి అన్పించలేదు. మనం తీసుకునే నిర్ణయాలపై ఏదైనా ఆధారపడి ఉంటుంది.
ఇక జోస్ భార్య మూడో బిడ్డకు జన్మనివ్వనుంది. బేబీ అనుకున్న సమయంలోనే ఈ ప్రపంచంలో అడుగుపెడుతుందని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా జోస్ ఎక్కువ మ్యాచ్‌లకు దూరం కాకుడదని నేను కోరుకుంటున్నాని" అలీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment