T20 World Cup 2024: క్రిస్‌ జోర్డన్‌ హ్యాట్రిక్‌.. 6 బంతుల్లో 5 వికెట్లు | T20 World Cup 2024: Chris Jordan takes Hat Trick, USA Set 116 Runs Target To England | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: క్రిస్‌ జోర్డన్‌ హ్యాట్రిక్‌.. 6 బంతుల్లో 5 వికెట్లు

Published Sun, Jun 23 2024 9:44 PM | Last Updated on Sun, Jun 23 2024 9:47 PM

T20 World Cup 2024: Chris Jordan takes Hat Trick, USA Set 116 Runs Target To England

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జూన్‌ 23) జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లో యూఎస్‌ఏ-ఇంగ్లండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌.. యూఎస్‌ఏను 115 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్డన్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో (2.5-0-10-4) చెలరేగాడు. యూఎస్‌ఏ చివరి 5 వికెట్లను 6 బంతుల వ్యవధిలో (W, W, 0,W, W, W) కోల్పోయింది. జోర్డన్‌ ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీశాడు, జోర్డన్‌ తీసిన హ్యాట్రిక్‌ ఇవాళ రెండవది. 

ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ బౌలర్‌ కమిన్స్‌ ఆఫ్ఘనిస్తాన్‌పై హ్యాట్రిక్‌ సాధించాడు. ఇది అతనికి వరుసగా రెండో మ్యాచ్‌లో రెండో హ్యాట్రిక్‌. యూఎస్‌ఏతో మ్యాచ్‌లో జోర్డన్‌తో పాటు ఆదిల్‌ రషీద్‌ (4-0-13-2), సామ్‌ కర్రన్‌ (2-0-23-2), రీస్‌ టాప్లే (3-0-29-1) సత్తా చాటారు. యూఎస్‌ఏ ఇన్నింగ్స్‌లో నితీశ్‌ కుమార్‌ (30) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. కోరె ఆండర్సన్‌ (29), హర్మీత్‌ సింగ్‌ (21), స్టీవ్‌ టేలర్‌ (12), ఆరోన్‌ జోన్స్‌ (10) రెండంకెల స్కోర్లు చేశారు. యూఎస్‌ఏ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు డకౌటయ్యారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement