టీ20 ప్రపంచకప్-2024 గ్రూప్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఒమన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సూపర్-8 ఆశలను సజీవం చేసుకుంది.
కాగా వరల్డ్‌కప్-2024లో భాగంగా ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్‌లతో కలిసి ఇంగ్లండ్ గ్రూప్-బిలో ఉంది. అయితే, తొలి రెండు మ్యాచ్‌లలో ఈ డిఫెండింగ్ చాంపియన్‌కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి.
స్కాట్లాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోగా.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో సూపర్-8కు అర్హత సాధించాలంటే ఒమన్‌తో శుక్రవారం(ఉదయం 12.30 నిమిషాలకు ఆరంభం) నాటి మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో నిలిచింది.
ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు ఆదిల్ రషీద్(4/11), జోఫ్రా ఆర్చర్(3/12), మార్క్ వుడ్(3/12) చెలరేగడంతో ఒమన్ 47 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు 13.2వ ఓవర్‌లోనే ఆలౌట్ అయింది.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద విజయం
ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం పందొమ్మిది బంతుల్లోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(3 బంతుల్లో 12), కెప్టెన్ జోస్ బట్లర్(8 బంతుల్లో 24 నాటౌట్), జానీ బెయిర్ స్టో(2 బంతుల్లో 8 నాటౌట్) దంచికొట్టారు.
ఇక వన్‌డౌన్ బ్యాటర్ విల్ జాక్స్(7 బంతుల్లో 5) పర్వాలేదనిపించగా.. 3.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ 50 పరుగులు చేసింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తుగా ఓడించింది. 101 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించి మెన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపె ద్ద విజయం నమోదు చేసింది.
అలా అయితేనే సూపర్-8కు
కాగా గ్రూప్-డి నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8 బెర్తు ఖరారు చేసుకోగా.. ఇంగ్లండ్ తమ తదుపరి మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అంతేగాకుండా స్కాట్లాండ్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో తప్పక ఓడిపోవాలి.
లేదంటే ఇంగ్లండ్ సూపర్-8 చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచి, స్కాట్లాండ్ ఓడినా నెట్‌రన్‌రేటు కీలకం(ఇంగ్లండ్ 3 పాయింట్లు, +3.081), స్కాట్లాండ్ ఐదు పాయింట్లు +2.164))గా మారుతుంది.
చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది?
Comments
Please login to add a commentAdd a comment