Adil Rashid
-
ప్రపంచంలో ఆ ఐదుగురే అత్యుత్తమ బౌలర్లు..!
ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ప్రపంచంలో తాను మెచ్చిన ఐదుగురు అత్యుత్తమ బౌలర్ల జాబితాను ప్రకటించాడు. ఈ జాబితాలో రషీద్ టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానాన్ని ఇచ్చాడు. ఆతర్వాత ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్, ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్, పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ అఫ్రిదికి చోటిచ్చాడు. ఆదిల్ ప్రపంచంలో నంబర్ వన్ బ్యాటర్‌గా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఎంపిక చేశాడు.కాగా, ఆదిల్ రషీద్ ఎంపిక చేసిన బౌలర్లలో మిచెల్ స్టార్క్ అందరి కంటే ఎక్కువ అంతర్జాతీయ వికెట్లు కలిగి ఉన్నాడు. స్టార్క్ తన కెరీర్లో ఇప్పటివరకు 673 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. బౌల్ట్ ఇప్పటిదాకా 611 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి తర్వాతి స్థానంలో బుమ్రా ఉన్నాడు. బుమ్రా తన కెరీర్లో ఇప్పటివరకు 397 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తర్వాతి స్థానంలో షాహిన్ అఫ్రిది ఉన్నాడు. అఫ్రిది ఖాతాలో 313 వికెట్లు ఉన్నాయి. ఆదిల్ ఎంపిక చేసిన అత్యుత్తమ బౌలర్ల జాబితాలో చివరి స్థానంలో జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. ఆర్చర్ అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 115 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. -
T20 World Cup 2024: క్రిస్ జోర్డన్ హ్యాట్రిక్.. 6 బంతుల్లో 5 వికెట్లు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జూన్ 23) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో యూఎస్ఏ-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. యూఎస్ఏను 115 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ హ్యాట్రిక్ వికెట్లతో (2.5-0-10-4) చెలరేగాడు. యూఎస్ఏ చివరి 5 వికెట్లను 6 బంతుల వ్యవధిలో (W, W, 0,W, W, W) కోల్పోయింది. జోర్డన్ ఒకే ఓవర్లో 4 వికెట్లు తీశాడు, జోర్డన్ తీసిన హ్యాట్రిక్ ఇవాళ రెండవది. ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ కమిన్స్ ఆఫ్ఘనిస్తాన్పై హ్యాట్రిక్ సాధించాడు. ఇది అతనికి వరుసగా రెండో మ్యాచ్‌లో రెండో హ్యాట్రిక్. యూఎస్ఏతో మ్యాచ్‌లో జోర్డన్‌తో పాటు ఆదిల్ రషీద్ (4-0-13-2), సామ్ కర్రన్ (2-0-23-2), రీస్ టాప్లే (3-0-29-1) సత్తా చాటారు. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కోరె ఆండర్సన్ (29), హర్మీత్ సింగ్ (21), స్టీవ్ టేలర్ (12), ఆరోన్ జోన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు డకౌటయ్యారు. -
T20 WC 2024: 47 పరుగులకే ఆలౌట్.. వరల్డ్‌కప్‌లోనే అతిపెద్ద విజయం
టీ20 ప్రపంచకప్-2024 గ్రూప్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఒమన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సూపర్-8 ఆశలను సజీవం చేసుకుంది.కాగా వరల్డ్‌కప్-2024లో భాగంగా ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్‌లతో కలిసి ఇంగ్లండ్ గ్రూప్-బిలో ఉంది. అయితే, తొలి రెండు మ్యాచ్‌లలో ఈ డిఫెండింగ్ చాంపియన్‌కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి.స్కాట్లాండ్తో మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోగా.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో సూపర్-8కు అర్హత సాధించాలంటే ఒమన్‌తో శుక్రవారం(ఉదయం 12.30 నిమిషాలకు ఆరంభం) నాటి మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో నిలిచింది.ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు ఆదిల్ రషీద్(4/11), జోఫ్రా ఆర్చర్(3/12), మార్క్ వుడ్(3/12) చెలరేగడంతో ఒమన్ 47 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు 13.2వ ఓవర్లోనే ఆలౌట్ అయింది. View this post on Instagram A post shared by ICC (@icc)టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద విజయం ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం పందొమ్మిది బంతుల్లోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(3 బంతుల్లో 12), కెప్టెన్ జోస్ బట్లర్(8 బంతుల్లో 24 నాటౌట్), జానీ బెయిర్ స్టో(2 బంతుల్లో 8 నాటౌట్) దంచికొట్టారు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ విల్ జాక్స్(7 బంతుల్లో 5) పర్వాలేదనిపించగా.. 3.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ 50 పరుగులు చేసింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తుగా ఓడించింది. 101 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించి మెన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపె ద్ద విజయం నమోదు చేసింది. అలా అయితేనే సూపర్-8కుకాగా గ్రూప్-డి నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8 బెర్తు ఖరారు చేసుకోగా.. ఇంగ్లండ్ తమ తదుపరి మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అంతేగాకుండా స్కాట్లాండ్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో తప్పక ఓడిపోవాలి.లేదంటే ఇంగ్లండ్ సూపర్-8 చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచి, స్కాట్లాండ్ ఓడినా నెట్‌రన్‌రేటు కీలకం(ఇంగ్లండ్ 3 పాయింట్లు, +3.081), స్కాట్లాండ్ ఐదు పాయింట్లు +2.164))గా మారుతుంది. చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? View this post on Instagram A post shared by ICC (@icc) -
రాణించిన రషీద్, సాల్ట్.. పాక్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్
టీ20 ప్రపంచకప్ 2024కు ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాక్ చిత్తుగా ఓడింది. నిన్న (మే 30) ముగిసిన నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా నిన్న జరిగిన నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆదిల్ రషీద్ (4-0-27-2), లివింగ్‌స్టోన్ (3-1-17-2), మార్క్ వుడ్ (4-0-35-2) పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (36), ఉస్మాన్ ఖాన్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మొహమ్మద్ రిజ్వాన్ (23), ఇఫ్తికార్ అహ్మద్ (21), నసీం షా (16) రెండంకెల స్కోర్లు సాధించారు.అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (45), జోస్ బట్లర్ (39) దూకుడుగా ఆడటంతో 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ జాక్స్ (20), జానీ బెయిర్‌స్టో (28 నాటౌట్), హ్యారీ బ్రూక్ (17 నాటౌట్) ఇంగ్లండ్ గెలుపుకు తమవంతు సహకారాన్నందించారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి.ఇదిలా ఉంటే, యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా రేపటి నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్, ఇంగ్లండ్ జట్లు వేర్వేరే గ్రూప్‌ల్లో ఉన్నాయి. పాక్.. భారత్‌తో కలిసి గ్రూప్-ఏలో పోటీపడనుండగా.. ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టుతో పాటు గ్రూప్-బిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ టోర్నీలో భారత్-పాక్‌ల మెగా సమరం జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది. -
ICC Rankings: అక్షర్ పటేల్ తొలిసారి.. మనోడే మళ్లీ నంబర్ వన్!
టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపాడు. టీ20 మెన్స్ ర్యాంకింగ్స్ ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ తొలిసారిగా మూడో స్థానం సంపాదించాడు. బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆదిల్ రషీద్, శ్రీలంక కీలక ఆటగాడు వనిందు హసరంగ తర్వాతి స్థానం ఆక్రమించాడు.వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్ సౌతాఫ్రికాతో సిరీస్‌లో తేలిపోవడంతో ఐదు స్థానాలు దిగజారగా.. అతడి స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేశాడు. ఇక టీమిండియా నుంచి మరో స్పిన్నర్ రవి బిష్ణోయి టాప్-5లో చోటు దక్కించుకోవడం విశేషం.ఐసీసీ టీ20 మెన్స్ తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-51. ఆదిల్ రషీద్- ఇంగ్లండ్- 722 రేటింగ్ పాయింట్లు2. వనిందు హసరంగ- శ్రీలంక- 687 రేటింగ్ పాయింట్లు3. అక్షర్ పటేల్- ఇండియా- 660 రేటింగ్ పాయింట్లు4. మహీశ్ తీక్షణ- శ్రీలంక- 659 రేటింగ్ పాయింట్లు5. రవి బిష్ణోయి- ఇండియా- 659 రేటింగ్ పాయింట్లు.మనోడే మళ్లీ నంబర్ వన్ బౌలర్ల సంగతి ఇలా ఉంటే.. టీ20 బ్యాటర్ల జాబితాలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అదే విధంగా టాప్-6 ఆటగాళ్లంతా తమ తమ స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లంఢ్ సారథి జోస్ బట్లర్ ఒక ర్యాంకు మెరుగుపరచుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు.ఇక వెస్టిండీస్ స్టార్ బ్రాండన్ కింగ్ ఏకంగా ఐదుస్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకు సాధించాడు.ఐసీసీ మెన్స్ టీ20 తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-51. సూర్యకుమార్ యాదవ్- ఇండియా- 861 పాయింట్లు2. ఫిల్ సాల్ట్- ఇంగ్లండ్- 788 పాయింట్లు3. మహ్మద్ రిజ్వాన్- పాకిస్తాన్- 769 పాయింట్లు4. బాబర్ ఆజం- పాకిస్తాన్- 761 పాయింట్లు5. ఐడెన్ మార్క్రమ్- సౌతాఫ్రికా- 733 పాయింట్లు.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్ -
మరీ ఇంత బద్దకమా? క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రనౌట్.. వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో మరో ఘోర ఓటమిని ఇంగ్లండ్ చవిచూసింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను శ్రీలంక చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(46 పరుగులు) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని లంక కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లంక బ్యాటర్లలో నిస్సాంక(77 నాటౌట్), సమరవిక్రమ(65 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక లంక చేతిలో ఓటమిపాలైన ఇంగ్లీష్ జట్టు తమ సెమీస్ అవకాశాలను గల్లంతు చేసుకుంది. ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో కొనసాగుతోంది. రషీద్ చెత్త రనౌట్.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు అదిల్ రషీద్ విచిత్రకర రీతిలో రనౌటయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లో ఆఖరి బంతిని మహేష్ థీక్షణ వైడ్‌గా సంధించాడు. అయితే వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ సమయంలో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న అదిల్ రషీద్ కాస్త క్రీజును వదిలి బయటకు వచ్చాడు. సరిగ్గా ఇక్కడే మెండీస్ తన తెలివితేటలను ఉపయోగించాడు. అదిల్ రషీద్ క్రీజు బయట ఉండడం గమనించిన మెండీస్.. బంతని నాన్‌స్ట్రైక్ వైపు త్రో చేసి స్టంప్స్‌ను గిరాటేశాడు. కాగా మెండిస్ తన గ్లోవ్ తీసి మరి త్రో చేశాడు. అంతసమయం ఉన్నప్పటికీ రషీద్ నెమ్మదిగా వెనుక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. బంతి స్టంప్స్‌ను తాకే సమయానికి రషీద్ క్రీజుకు కాస్త దూరంలో ఉన్నాడు. దీంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో బద్దకంగా వ్యవహరించిన రషీద్ భారీ మూల్యం చెల్లించకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చదవండి: WC 2023: పొరపాటు చేయలేదు.. అయినా గర్వపడుతున్నాం.. మాది చెత్త టీమ్ కాదు: బట్లర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
కోహ్లికి నో ఛాన్స్! మరో టీమిండియా స్టార్‌కు చోటు.. ఆ ఐదుగురు అదుర్స్: బట్లర్
ICC ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో 2019లో మొట్టమొదటిసారిగా జగజ్జేతగా నిలిచిన ఇంగ్లిష్ జట్టు పగ్గాలు ఇప్పుడు స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ చేతిలో ఉన్న విషయం తెలిసిందే. అన్ని విభాగాల్లో పటిష్టంగా బట్లర్ బృందం పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆటగాడిగా రాణిస్తూ.. కెప్టెన్‌గానూ అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాడు ఈ వికెట్ కీపర్. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలిచిన రికార్డు బట్లర్ సొంతం. కోహ్లికి నో ఛాన్స్ ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్ పటిష్టంగా ఉండటంతో మోర్గాన్ వారసత్వాన్ని బట్లర్ నిలబెట్టే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ తన డ్రీమ్ ఎలెవన్ వన్డే టీమ్‌లో మొదటి ఛాయిస్‌గా ఐదుగురు ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాడు. అనూహ్యంగా ఇందులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మాత్రం బట్లర్ చోటివ్వలేదు. అయితే, మరో భారత స్టార్‌ను మాత్రం తన జట్టుకు ఎంపిక చేశాడు. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే? 1.ఆదిల్ రషీద్ ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్డేల్లో 5.67 ఎకానమీతో 184 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్‌కప్ టోర్నీలో 11 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గత 10 వన్డేల్లో రషీద్ ఏకంగా 22 వికెట్లు తీయడం విశేషం. ఈ నేపథ్యంలో బట్లర్ తన మొదటి ఎంపికగా ఆదిల్ పేరు చెప్పాడు. 2.క్వింటన్ డికాక్ సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ వన్డేల్లో 95.75 స్ట్రైక్‌రేటుతో 6176 పరుగులు సాధించాడు. ప్రపంచకప్ ఈవెంట్లో 450 రన్స్ తీశాడు. అదే విధంగా అతడి ఖాతాలో 190 క్యాచ్‌లు, 16 స్టంపింగ్‌లు ఉన్నాయి. కాగా తాజా వరల్డ్‌కప్ తర్వాత తాను వన్డేలకు గుడ్‌బై చెప్పనున్నట్లు డికాక్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. 3.రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో ఇప్పటి వరకు 10112 పరుగులు సాధించాడు. వరల్డ్‌కప్ టోర్నీలో 978 పరుగులు తీశాడు. 2011లో ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్.. ఈసారి సొంతగడ్డపై ఏకంగా కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనుండటం విశేషం. 4.గ్లెన్ మాక్స్వెల్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఖాతాలో 3495 వన్డే పరుగులు, 64 వికెట్లు ఉన్నాయి. బ్యాట్, బాల్ రెండింటితోనూ రాణించగల సత్తా ఉన్న ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ఆసీస్‌కు ప్రధాన బలం కానున్నాడు. భారత్‌లోని స్లో పిచ్‌లపై ఈసారి ఆఫ్ స్పిన్నర్ మాక్సీ ప్రభావం చూపే అవకాశం ఉంది. 5. అన్రిచ్ నోర్జే సౌతాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జే వన్డేల్లో ఇప్పటి వరకు 36 వికెట్లు తీశాడు. 29 ఏళ్ల ఈ ఫాస్ట్‌బౌలర్ గాయం కారణంగా వన్డే వరల్డ్‌కప్-2023టోర్నీకి దూరమయ్యాడు. 2019లోనూ చేతినొప్పి కారణంగా ఐసీసీ ఈవెంట్ ఆడే అవకాశం కోల్పోయాడు. చదవండి: WC 2023: మునుపటిలా లేదు.. కానీ ఆ జట్టు సెమీస్ చేరితే ఆపడం కష్టం! -
పాతది గుర్తొచ్చిందేమో.. చేయాలనుకొని చేయలేకపోయాడు
మన్కడింగ్ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకువచ్చే పేరు రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్లో జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడం ద్వారా అశ్విన్ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడంటే మన్కడింగ్‌ను రనౌట్‌గా చట్టబద్దం చేశారు కానీ.. అప్పట్లో అశ్విన్ చర్యపై రెండుగా చీలిపోయారు. క్రీడాస్పూర్తిని దెబ్బతీశాడంటూ కొందరు పేర్కొంటే.. అశ్విన్ చేసింది న్యాయమేనని మరికొందరు తెలిపారు. ఆ తర్వాత కూడా దీనిపై పెద్ద చర్చే నడిచింది. కాగా గతేడాది మన్కడింగ్(నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో బంతి విడువక ముందే బ్యాటర్ క్రీజు వదిలితే రనౌట్ చేయడం)ను ఐసీసీ రనౌట్‌గా మారుస్తూ నిబంధనను సవరించింది. ఏది ఏమైనా ఒక రకంగా అశ్విన్ మన్కడింగ్‌కు మూల కారకుడు అని అభిమానులు పేర్కొంటునే ఉన్నారు. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో అశ్విన్ మరోసారి మన్కడింగ్ చేయబోయాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లు ఇది చోటుచేసుకుంది. ఓవర్లో తొలి బంతి వేయడానికి ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఆదిల్ రషీద్ క్రీజు దాటాడు. ఇది గమనించిన అశ్విన్ బంతిని విడవకుండా బెయిల్స్ వైపు బంతిని ఉంచాడు. అయితే తన తొలి మన్కడింగ్ గుర్తొచ్చిందేమో అవకాశాన్ని విరమించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Just a normal day for Ashwin 😂#IPL23 #IPL2023 #ravichandranashwin @ashwinravi99 pic.twitter.com/4B7rwjhPD3— Tharaka Jayathilaka (@TharakaOfficial) April 2, 2023 చదవండి: -
పరువు తీసుకున్న బంగ్లా; క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూ
బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌ల మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చివర్లో బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 48వ ఓవర్ తస్కిన్ అహ్మద్ వేశాడు. ఆ ఓవర్లో తస్కిన్ వేసిన యార్కర్ బంతిని ఆదిల్ రషీద్ సమర్థంగా అడ్డుకున్నాడు. బంతి రషీద్ ప్యాడ్‌కు దూరంగా బ్యాట్ అంచున తాకింది. అయితే బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. అంపైర్ ఔటివ్వలేదు. దీంతో కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ వెంటనే డీఆర్ఎస్ కోరాడు. రిప్లేలో బంతి ఎక్కడా ప్యాడ్‌కు తగిలినట్లు కనిపించలేదు కదా బంతి ప్యాడ్లకు చాలా దూరంగా ఉన్నట్లు చూపించింది. దీంతో అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. వాస్తవానికి బంతి ప్యాడ్లను తాకలేదని క్లియర్‌గా కనిపిస్తుంది. మ్యాచ్ చూసే చిన్న పిల్లాడిని అడిగినా నాటౌట్ అని చెప్పేస్తాడు. బంతి ఎక్కడ పడిందన్న కనీస పరిజ్ఞానం లేకుండా తమీమ్ ఇక్బాల్ డీఆర్ఎస్ కోరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బహుశా క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోవడం మాత్రం ఖాయం. ఒక రకంగా ఔట్ కాదని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి రివ్యూకు వెళ్లి బంగ్లా పరువు తీసుకుంది. ఇంకేముంది సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయింది. బంగ్లా క్రికెట్ జట్టుపై అభిమానులు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు. ''క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూకు కాల్ ఇచ్చిన బంగ్లా జట్టుకు ఏ ప్రైజ్ ఇవ్వాలో కాస్త చెప్పండి''.. ''ఏ కోశానా అది ఔట్ చెప్పండి.. బంగ్లా కెప్టెన్‌కు కళ్లు మూసుకుపోయినట్లున్నాయి''.. ''క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ 132 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. జేసన్ రాయ్ (132 పరుగులు) సెంచరీతో కదం తొక్కడంతో పాటు బట్లర్, మొయిన్ అలీ, సామ్ కరన్ మెరవడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 194 పరుగులకే కుప్పకూలింది. షకీబ్ అల్ హసన్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తమీమ్ ఇక్బాల్ 35 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్, ఆదిల్ రషీద్‌లు చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. ఈ విజయంతో ఇంగ్లండ్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో వన్డేమ్యాచ్ సోమవారం(మార్చి 6న) చట్టోగ్రామ్ వేదికగా జరగనుంది. What prize do Bangladesh get for making the worst LBW review call in the history of cricket? pic.twitter.com/SfJWRdCpXc — Jon Reeve (@jon_reeve) March 3, 2023 Worst DRS review for LBW ever by Bangladesh! #ecb #BANvsENG pic.twitter.com/kBdX5bvPBs — Ralph Rimmer (@razorr69) March 3, 2023 Bangladesh went for a review! 😭 pic.twitter.com/bF8sHDTQ8e — Faiz Fazel (@theFaizFazel) March 3, 2023 చదవండి: జేసన్ రాయ్ విధ్వంసం; సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ ఇండోర్ పిచ్ అత్యంత నాసిరకం' -
మలాన్ వీరోచిత శతకం.. పసికూనపై అతికష్టం మీద గెలిచిన ఇంగ్లండ్
3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టు.. ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో అతికష్టం మీద 3 వికెట్ల తేడాతో నెగ్గింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 210 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను.. డేవిడ్ మలాన్ (145 బంతుల్లో 114 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత శతకంతో పోరాడి గెలిపించాడు. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్.. 161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి ఖరారు అనుకున్న దశలో మలాన్ తన అనుభవాన్ని అంతా రంగరించి, టెయిలెండర్ల సాకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా ఆదిల్ రషీద్ (29 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్)ను సమన్వయం చేసుకుంటూ మలాన్ పోరాడిన తీరు అమోఘం. మలాన్- రషీద్ జోడీ ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 51 పరుగులు జోడించి, మరో 8 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మలాన్, రషీద్ మినహా జేసన్ రాయ్ (4), ఫిలిప్ సాల్ట్ (12), జేమ్స్ విన్స్ (6), జోస్ బట్లర్ (9), క్రిస్ వోక్స్ (7), మొయిన్ అలీ (14), విఫలం కాగా.. విల్ జాక్స్ (26) కాస్త పర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహదీ హసన్ మిరాజ్ 2, షకీబ్ అల్ హసన్, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్‌గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 47.2 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (23), షాంటో (58), మహ్మదుల్లా (31) ఓ మోస్తరుగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోప్రా ఆర్చర్, మార్క్ వుడ్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, విల్ జాక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 3న ఇదే వేదికపై జరుగుతుంది. -
ఆ ఓవర్ అసాధారణం.. అతడికి ఎప్పుడు బంతిని అప్పగించినా: బట్లర్
ICC Mens T20 World Cup 2022 - Pakistan vs England, Final: ‘‘చాలా గర్వంగా ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని మార్పులు.. వాటి ఫలితాలు ఇప్పుడు అందుకుంటున్నాం. టోర్నీ చాలా అద్భుతంగా సాగింది. ఐర్లాండ్ చేతిలో ఓటమి అసలు ఎప్పుడు ఎదురైందో అనిపిస్తోంది. కోచ్ మాథ్యూ మాట్ కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చి మేం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రోత్సహించారు. స్టోక్స్ పోరాటయోధుడు. తన అనుభవంతో అతను ఏదైనా చేయగలడు. కీలక సమయాల్లో రాణించడమే స్టోక్స్ గొప్పతనం. నాలుగున్నర నెలల కెప్టెన్సీలోనే ప్రపంచకప్ దక్కిందనే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను’’ అంటూ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్ హర్షం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన పాకిస్తాన్ పర్యటన తమ ఆటగాళ్లందరూ బాగా కలిసిపోయేందుకు ఉపకరించిందని పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2022 ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లండ్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం బట్లర్ మాట్లాడుతూ.. తమ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లను అభినందించాడు. ఈ మ్యాచ్‌లో ఆదిల్ రషీద్ ఓవర్ అసాధారణమని.. అతనికి ఎప్పుడు బంతిని అప్పగించినా ఏదో ఒకటి చేసి చూపిస్తాడంటూ ప్రశంసలు కురిపించాడు. ఆ ఓవర్ స్పెషల్ కాగా పాక్ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ మొదటి బంతికే కెప్టెన్, ప్రమాదకర బ్యాటర్ బాబర్ ఆజం అవుట్ చేసిన ఆదిల్ రషీద్.. ఓవర్ మొత్తంలో ఒక్క పరుగు(మెయిడెన్) కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆదిల్‌ను ఉద్దేశించి బట్లర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా ఆల్‌రౌండర్ స్టోక్స్‌ను కొనియాడాడు. కాగా పాక్‌తో ఫైనల్లో ఆదిల్ రషీద్ తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 22 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక స్టోక్స్ విషయానికొస్తే.. ఒక వికెట్ తీయడంతో పాటుగా అజేయ అర్ధ శతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రేక్షకులంతా మాకు మద్దతు పలికేందుకే వచ్చినట్లుంది ఇంగ్లండ్ జట్టుకు అభినందనలు. మైదానంలో ప్రేక్షకులంతా మాకు మద్దతు పలికేందుకే వచ్చినట్లుంది. అందరికీ కృతజ్ఞతలు. గత నాలుగు మ్యాచ్‌లలో మా జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఫైనల్లో స్వేచ్ఛగా ఆడాలని మా ఆటగాళ్లకు చెప్పాను. కనీసం 20 పరుగులు తక్కువగా చేసినా చివరి వరకు పోరాడగలిగాం. మా బౌలింగ్ అత్యుత్తమమైంది. అఫ్రిదికి మధ్యలో గాయం కావడం కూడా మాకు ఇబ్బందిగా మారింది. అయితే అదంతా ఆటలో భాగం’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. చదవండి: టీ20 వరల్డ్‌కప్-2022 అత్యుత్తమ జట్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు T20 WC 2022 Final: బాబర్‌కు ఊహించని ప్రశ్న.. మధ్యలో తలదూర్చిన మేనేజర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
మొయిన్ అలీ, రషీద్ విషయంలో బట్లర్ పెద్ద మనసు
టి20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి రెండోసారి వరల్డ్‌కప్‌ను అందుకున్నారు. బెన్ స్టోక్స్ విజయంలో కీలకపాత్రో పోషించగా.. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి విజయంలో భాగమయ్యాడు. 2010లో టైటిల్ నిలిచిన ఇంగ్లండ్ మళ్లీ పుష్కరకాలం తర్వాత పొట్టి ఫార్మట్‌లో చాంపియన్‌గా అవతరించింది. ఈ నేపథ్యంలో వారి సెలబ్రేషన్స్‌కు అవదులు లేకుండా పోయాయి. ఇక సెలబ్రేషన్స్ సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ పెద్ద మనసు చాటుకున్నాడు. సాధారణంగా ఒక జట్టు ఎలాంటి మేజర్ టోర్నీలు నెగ్గినా షాంపెన్‌తో సెలబ్రేషన్ చేయడం చూస్తుంటాం. టైటిల్ అందుకున్న తర్వాత బట్లర్ తన జట్టుతో గ్రూప్ ఫోటో దిగాడు. ఆ తర్వాత షాంపెన్ సెలబ్రేషన్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. వెంటనే బట్లర్ రషీద్, మొయిన్ అలీని పిలిచి షాంపెన్ సెలబ్రేషన్ చేస్తున్నాం.. పక్కకు వెళ్లండి అని పేర్కొన్నాడు. అర్థం చేసుకున్న ఈ ఇద్దరు బట్లర్‌కు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లు షాంపెన్ పొంగించి సంబరాలు చేసుకున్నారు. కాగా మద్యపానం ఇస్లాంకు విరుద్ధం. మద్యపానం నిషేధం మాత్రమే కాదు.. ఎక్కడ ఈవెంట్ జరిగినా అక్కడ ముస్లింలు మద్యపానం జోలికి కూడా వెళ్లరు. అందుకే బట్లర్ ఇస్లాం మతానికి విలువనిస్తూ ఆదిల్ రషీద్, మొయిన్ అలీలను పక్కకు వెళ్లమన్నాడు. వాళ్లు వెళ్లిన తర్వాతే షాంపెన్ సెలబ్రేషన్ చేయడం పట్ల బట్లర్‌కు ఇస్లాం మతంపై ఉన్న గౌరవం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా ..''బట్లర్‌ది నిజంగా పెద్ద మనసు.. మతాలకు చాలా విలువనిస్తాడు '' అంటూ కామెంట్ చేశారు. England's captain reminded Adil Rashid to leave and checked to see that he and Moeen Ali had left before they celebrated with champagne. Respect. pic.twitter.com/y30bGRFyHG — ilmfeed (@IlmFeed) November 13, 2022 చదవండి: Ben Stokes: అప్పుడు విలన్.. ఇప్పుడు హీరో -
WC 2022 Final: పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్ బౌలర్లు.. టోర్నీ ఆసాంతం
ICC Mens T20 World Cup 2022 - Pakistan vs England, Final: టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. మెల్బోర్న్ మ్యాచ్‌లో ఆది నుంచే తమ ప్రణాళికను అమలు చేసిన ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పాక్ బ్యాటర్లకు అవకాశం ఇవ్వకుండా వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. ఐదో ఓవర్ రెండో బంతికి పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(14 బంతుల్లో 15 పరుగులు)ను అవుట్ చేసి సామ్ కరన్ శుభారంభం అందించాడు. తర్వాత ఆదిల్ రషీద్ మహ్మద్ హారీస్(8), బాబర్ ఆజం(32)ను పెవిలియన్‌కు పంపగా.. స్టోక్స్ ఇఫ్తీకర్ అహ్మద్(0) పని పట్టాడు. ఇక జోరు కనబరిచిన షాన్ మసూద్(28 బంతుల్లో 38 పరుగులు)ను అవుట్ చేసి సామ్ కరన్ రెండో వికెట్ తన ఖాతాలో వేసుకోగా..క్రిస్ జోర్డాన్ షాదాబ్ ఖాన్(20)ను ఆరో వికెట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత సామ్ మరోసారి తన మ్యాజిక్‌తో మహ్మద్ నవాజ్(5) వికెట్ తీయగా.. ఆఖరి ఓవరల్లో మహ్మద్ వసీం జూనియర్(4)ను అవుట్ చేసి జోర్డాన్ పాక్ ఇన్నింగ్స్‌లో చివరి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు ఇంగ్లీష్ బౌలర్లు. 16- 20 ఓవర్ల మధ్యలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు కూల్చారు. తమకు ఎదురులేదని మరోసారి నిరూపించుకున్నారు. పాక్‌తో ఫైనల్లో 16-20 ఓవర్లలో 16.2: సామ్ కరన్- షాన్ మసూద్ వికెట్ 17.2: క్రిస్ జోర్డాన్- షాదాబ్ ఖాన్ వికెట్ 18.3: సామ్ కరన్- మహ్మద్ నవాజ్ వికెట్ 19.3: క్రిస్ జోర్డాన్- మహ్మద్ వసీం జూనియర్ వికెట్ ఈ ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్ డెత్ ఓవర్లలో బౌలింగ్ సాగిందిలా.. 23/6 అఫ్గనిస్తాన్, పెర్త్ 30/7 ఐర్లాండ్, మెల్బోర్న్ 36/3 న్యూజిలాండ్ , బ్రిస్బేన్ 25/5 శ్రీలంక, సిడ్నీ రెండో సెమీ ఫైనల్- 68/3 ఇండియా, అడిలైడ్ ఫైనల్- 31/4 పాకిస్తాన్, మెల్బోర్న్ చదవండి: T20 WC 2022: సామ్ కరన్ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి బౌలర్‌గా -
టీమిండియాతో టీ20, వన్డే సిరీస్.. ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ దూరం..!
టీమిండియాతో స్వదేశంలో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ దూరమయ్యాడు. ఆదిల్ రషీద్ హజ్ యాత్ర నిమిత్తం ఈ సిరీస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 బ్లాస్ట్‌లో యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్.. ఇదే కారణంతో టోర్నీ అఖరి మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నాడు. ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టులో రషీద్ భాగంగా ఉన్నాడు. అయితే తాను చాలా కాలం నుంచి తీర్థయాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నట్లు రషీద్ తెలిపాడు. జూన్ 25న మిడిల్ ఈస్ట్‌కు వెళ్లేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు,యార్క్‌షైర్‌లు తనకు సెలవు మంజూరు చేసినట్లు రషీద్ చెప్పాడు. "నేను చాలా రోజుల నుంచి హజ్ యాత్రకు వెళ్లాలి అనుకుంటున్నాను. బీజీబీజీ షెడ్యూల్ వల్ల సమయం దొరకలేదు. నేను ఈ విషయం గురించి ఈసీబీ, యార్క్‌షైర్‌తో మాట్లాడాను. వారు అర్ధం చేసుకుని నాకు అనుమతి ఇచ్చారు" అని రషీద్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూలై 7న సౌతాంప్టన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో వైట్‌బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: ENG vs NZ: దురదృష్టమంటే నికోల్స్‌దే.. ఇలా కూడా ఔట్ అవ్వొచ్చా..! -
ఆ ఒక్క నిర్ణయం.. ధోని లాంటి దిగ్గజాల సరసన నిలబెట్టింది
న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డారెల్ మిచెల్ ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ 2021 అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఒత్తిడిలో సింగిల్ తీయకుండా తెలివితో వ్యహరించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించినందుకు మిచెల్‌కు ఈ అవార్డు ఇస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. విషయంలోకి వెళితే.. 2021 నవంబర్ 10న ఇంగ్లండ్, న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: ఓటమి కొనితెచ్చుకోవడమంటే ఇదే.. అనుభవించండి తొలుత బ్యాటిగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మొయిన్ అలీ అర్థసెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ లక్ష్యం దిశగా సాగుతుంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఆదిల్ రషీద్ వేశాడు. క్రీజులో జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్ ఉన్నారు. స్ట్రైకింగ్‌లో ఉన్న నీషమ్.. రషీద్ వేసిన బంతిని మిడాఫ్ దిశగా ఆడాడు. ఇక్కడ ఈజీ సింగిల్‌కు ఆస్కారమున్నప్పటికి.. బంతి కోసం పరిగెడుతున్న రషీద్‌కు మిచెల్ అడ్డువచ్చాడు. ఇక్కడే మిచెల్ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. రషీద్‌ను తోసేసి పరుగుకు వెళ్లొచ్చు.. కానీ మిచెల్ అలా చేయకుండా సింగిల్ వద్దంటూ నీషమ్‌ను వారించాడు. అలా చేస్తే అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్ కిందకు వస్తుందని.. ఇది మంచి పద్దతి కాదని మ్యాచ్ అనంతరం మిచెల్ వివరించాడు. కాగా డారిల్ మిచెల్ క్రీడాస్పూర్తికి పలువురు మాజీ ఆటగాళ్లు ఫిదా అయ్యారు. అంత ఒత్తిడిలోనూ మిచెల్ తెలివిగా వ్యవహరించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించడం గొప్ప విషయమని లైవ్ కామెంటరీలో ఉన్న మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సెన్ తెలిపాడు. ఇక మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవడంలో డారిల్ మిచెల్ కీలకపాత్ర పోషించాడు. 47 బంతుల్లో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన న్యూజిలాండ్ రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలిచిన నాలుగో న్యూజిలాండ్ ఆటగాడిగా డారిల్ మిచెల్ నిలిచాడు. అంతకముందు డేనియల్ వెటోరి, బ్రెండన్ మెక్కల్లమ్, కేన్ విలియమ్సన్‌లు ఈ అవార్డు తీసుకున్నారు. ఇక టీమిండియా నుంచి ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును ఎంఎస్ ధోని (2011), విరాట్ కోహ్లి(2019)లో గెలుచుకోవడం విశేషం. A gesture that won the hearts of millions 🙌 Daryl Mitchell – the winner of the ICC Spirit of Cricket Award 2021 👏 Details 👉 https://t.co/pLfSWlfIZB pic.twitter.com/zq8e4mQTnz — ICC (@ICC) February 2, 2022 -
రషీద్ సూపర్ డైవింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే
Adil Rashid takes spectacular diving catch: టి20 ప్రపంచకప్2021లో భాగంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఆదిల్ రషీద్ అద్బుతమైన క్యాచ్‌తో ఆభిమానులను ఆశ్చర్యపరిచాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో.. షకీబ్ అల్ హసన్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అది కాస్త మిస్ టైమ్ అయ్యి బంతి గాల్లోకి లేచింది. అయితే షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్‌ను అందకున్నాడు. కాగా ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇనస్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: T20 World Cup 2021: అలా అయితేనే టీమిండియా సెమీస్‌కు.. లేదంటే.. View this post on Instagram A post shared by ICC (@icc) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 World Cup 2021: విండీస్ విలవిల.. చెత్త రికార్డు
T20 World Cup 2021: ఐదేళ్ల క్రితం 2016 టి20 ప్రపంచకప్ అంటే ఠక్కున గుర్తొచ్చేది వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్. టైటిల్ గెలిచేందుకు చివరి ఓవర్లో వెస్టిండీస్ 19 పరుగులు చేయాల్సి ఉండగా... బ్రాత్‌వైట్ నాలుగు వరుస సిక్సర్ల విన్యాసం ప్రతి క్రికెట్ అభిమానికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఐదేళ్లు గడిచాయి. ఆ ఫైనల్‌కు కొనసాగింపు అన్నట్లు ప్రస్తుత టి20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు మరోసారి తలపడ్డాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన వెస్టిండీస్ ఈసారి పూర్తిగా తడబడింది. చెత్త ఆటతీరుతో 55 పరుగులకే ఆలౌటై ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా జరిగే టి20 లీగ్‌ల్లో ఆడే ప్రముఖ ఆటగాళ్లు... ఎనిమిదో వరుస ఆటగాడి వరకు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా... పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర జట్టుగా పేరు... అయితేనేం టి20 ప్రపంచకప్‌లోని తమ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ బోల్తా పడింది. గ్రూప్–1లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 14.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. టి20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్కిదే అత్యల్ప స్కోరు కాగా... ఓవరాల్‌గా రెండోది. 2019లో ఇంగ్లండ్‌పైనే చేసిన 45 పరుగుల తొలి స్థానంలో ఉంది. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ (4/2)తో తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. క్రిస్ గేల్ (13 బంతుల్లో 13; 3 ఫోర్లు) మాత్రమే విండీస్ జట్టులో రెండంకెల స్కోరును సాధించాడు. ఛేజింగ్‌లో ఇంగ్లండ్ 8.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టపోయి 56 పరుగులు చేసి గెలుపొందింది. జోస్ బట్లర్ (22 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు) లాంఛనం పూర్తి చేశాడు. రషీద్ మ్యాజిక్ ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మ్యాజిక్ స్పెల్‌తో వెస్టిండీస్ పని పట్టాడు. కేవలం 2.2 ఓవర్లు (14 బంతులు) వేసిన అతడు రెండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇందులో విధ్వంసకర కీరన్ పొలార్డ్ (6), ఆండ్రీ రసెల్ (0)లతో పాటు మెకాయ్ (0), రవి రాంపాల్ (3) వికెట్లు ఉన్నాయి. రషీద్‌కు మొయిన్ అలీ (2/17), టైమల్ మిల్స్ (2/17) సహకరించడంతో వెస్టిండీస్ కోలుకోలేకపోయింది. జట్టులో గేల్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... మిగిలిన పది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను అకీల్ తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాడు. అయితే లక్ష్యం మరీ చిన్నదిగా ఉండటం... బట్లర్ నిలవడంతో ఛేదనలో ఇంగ్లండ్ కాస్త తడబడినా విజయాన్ని అందుకుంది. విండీస్ ఇన్నింగ్స్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టిన మొయిన్ అలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు స్కోర్లు: వెస్టిండీస్ ఇన్నింగ్స్: సిమన్స్ (సి) లివింగ్‌స్టోన్ (బి) మొయిన్ అలీ 3; ఎవిన్ లూయిస్ (సి) మొయిన్ అలీ (బి) వోక్స్ 6; గేల్ (సి) మలాన్ (బి) మిల్స్ 13; హెట్‌మైర్ (సి) మోర్గాన్ (బి) మొయిన్ అలీ 9; బ్రావో (సి) బెయిర్‌స్టో (బి) జోర్డాన్ 5; పూరన్ (సి) బట్లర్ (బి) మిల్స్ 1; పొలార్డ్ (సి) బెయిర్‌స్టో (బి) ఆదిల్ రషీద్ 6; రసెల్ (బి) ఆదిల్ రషీద్ 0; అకీల్ హోసీన్ (నాటౌట్) 6; మెకాయ్ (సి) రాయ్ (బి) ఆదిల్ రషీద్ 0; రవి రాంపాల్ (బి) ఆదిల్ రషీద్ 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (14.2 ఓవర్లలో ఆలౌట్) 55. వికెట్ల పతనం: 1–8, 2–9, 3–27, 4–31, 5–37, 6–42, 7–44, 8–49, 9–49, 10–55. బౌలింగ్: మొయిన్ అలీ 4–1–17–2, వోక్స్ 2–0–12–1, మిల్స్ 4–0–17–2, జోర్డాన్ 2–0–7–1, ఆదిల్ రషీద్ 2.2–0–2–4. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) గేల్ (బి) రవి రాంపాల్ 11; బట్లర్ (నాటౌట్) 24; బెయిర్‌స్టో (సి అండ్ బి) అకీల్ 9; మొయిన్ అలీ (రనౌట్) 3; లివింగ్‌స్టోన్ (సి అండ్ బి) అకీల్ 1; మోర్గాన్ (నాటౌట్) 7, ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (8.2 ఓవర్లలో 4 వికెట్లకు) 56. వికెట్ల పతనం: 1–21, 2–30, 3–36, 4–39. బౌలింగ్: అకీల్ 4–0–24–2, రవి రాంపాల్ 2–0–14–1, మెకాయ్ 2–0–12–0, పొలార్డ్ 0.2–0–6–0. -
టి20 ప్రపంచకప్‌లో ఆదిల్ రషీద్ అరుదైన రికార్డు
Adil Rashid: టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా వెస్టిండీస్ జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అరుదైన రికార్డు సాధించాడు. టి20 ప్రపంచ కప్‌లో అత్యంత తక్కువ పరుగులు ఇచ్చి.. 4 వికెట్ల హాల్ సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా ఈ మ్యాచ్‌లో కేవలం 2 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు సాధించి రషీద్ ఈ ఘనత అందుకున్నాడు. అదే విధంగా పొట్టి ప్రపంచ కప్‌లో ఒక మ్యాచ్‌లో అత్యంత తక్కువ పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా రషీద్ రికార్డులెక్కాడు. అంతకు ముందు శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరత్ కేవలం 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. ఇంగ్లండ్ జట్టులో బట్లర్ 24 పరుగులతో నటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. విండీస్ బౌలర్లలో అకేల్ హోసిన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు టాస్ ఓడి భ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి కేవలం 55 పరుగులకే కూప్ప కూలిపోయింది. విండీస్ బ్యాటింగ్‌లో ఒక్క క్రిస్ గేల్ తప్ప ఒక్కరు కూడా సింగిల్ డిజిట్ స్కోర్ దాట లేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టగా, టైమల్ మిల్స్ ,మొయిన్ అలీ చెరో రెండు వికెట్లు , క్రిస్ వోక్స్, జోర్డాన్ చెరో వికెట్ సాధించారు. చదవండి: T20 WC 2021 ENG Vs WI: 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం -
Adil Rashid: ఆదిల్ రషీద్ కొత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడు
Adil Rasid IPL Debue.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ ద్వారా పంజాబ్ కింగ్స్ తరపున ఆదిల్ రషీద్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఈ నేపథ్యంలో ఆదిల్ రషీద్ కొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ అరంగేట్రం సమయానికి ఆదిల్ రషీద్ ఇంగ్లండ్‌తో పాటు మిగతా లీగ్‌లు కలిపి 201 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ డెబ్యూ సమయానికి అత్యధిక టి20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా మూడో స్థానంలో ఉన్నాడు. ఇంతకముందు డేవిడ్ మలాన్ పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేసే సమయానికి 227 టి20 మ్యాచ్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక 202 టి 20 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్న జో డెన్లీ 2019 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ తరపున ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ ఆడాడు. చదవండి: KL Rahul: 22 పరుగుల దూరం.. ఐపీఎల్ చరిత్రలో రెండో బ్యాట్స్‌మన్‌గా ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఆరంభించిన రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఎవిన్ లూయిస్, యశస్వి జైశ్వాల్‌లు తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. ప్రస్తుతం రాజస్తాన్ వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. జైశ్వాల్ 16, సంజూ శాంసన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. Ishan Porel, Adil Rashid and Aiden Markram are all set to make their debut for @PunjabKingsIPL 🙌🙌🙌#PBKSvRR #VIVOIPL pic.twitter.com/FugKDrQpub — IndianPremierLeague (@IPL) September 21, 2021 -
కోల్‌కతాకు సౌథీ, పంజాబ్‌తో ఆదిల్ రషీద్ ఒప్పందం
న్యూఢిల్లీ: సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్ పార్ట్-2 నుంచి పలువురు ఆటగాళ్లు వివిధ కారణాలు చేత తప్పుకోవడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు ఆయా ఫ్రాంచైజీలు నానా తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఇదివరకే చాలా జట్లు రిప్లేస్మెంట్ ఆటగాళ్లును ఎంపిక చేసుకుంది. తాజాగా, కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) జట్టు న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీని జట్టులోకి తీసుకోగా, పంజాబ్ కింగ్స్ జట్టు ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను జట్టులోకి చేర్చుకున్నాయి. సౌథీ.. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్‌ను రీప్లేస్ చేయనుండగా, రషీద్ ఆసీస్ పేసర్ జై రిచర్డ్సన్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఆదిల్ రషీద్ ఐపీఎల్లో తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, సౌథీ గతంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో వరుసగా ఆరు సీజన్లు ఆడిన సౌథీ గతేడాది వేలంలో అమ్ముడుపోలేదు. చివరిసారి అతను 2019 ఐపీఎల్లో కోహ్లి సారథ్యంలో ఆర్సీబీకి ఆడాడు. చదవండి: పీసీబీ అధ్యక్షుడిగా పాక్ ప్రధాని సన్నిహితుడు.. -
‘ఎసెక్స్’ విజయంలో వివాదం
లండన్: ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్లో తొలిసారి నిర్వహించిన ‘బాబ్ విల్లీస్ ట్రోఫీ’ని గెలుచుకున్న ఎసెక్స్ జట్టు సంబరాల్లో చిన్న అపశ్రుతి దొర్లింది. సోమర్‌సెట్‌తో జరిగిన ఫైనల్ ఆదివారం ‘డ్రా’గా ముగియగా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఎసెక్స్ చాంపియన్‌గా నిలిచింది. అయితే లార్డ్స్ మైదానం బాల్కనీలో జరిగిన సంబరాల్లో ఎసెక్స్ యువ ఆటగాడు ఒకడు అత్యుత్సాహంతో తన జట్టు సహచరుడు ఫెరోజ్ ఖుషీపై బీర్ పోశాడు. ఇది వివాదానికి దారి తీసింది. ఇంగ్లండ్ క్రికెట్లో ముస్లిం క్రికెటర్లతో గెలుపు వేడుకలు చేసుకునే సమయంలో ఇతర ఆటగాళ్లు సాధారణంగా మద్యం విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. జాతీయ జట్టు సభ్యులైన మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌లను కూడా తమ విజయంలో భాగంగా చేసి సంబరాల సమయంలో వారిపై షాంపేన్ చల్లకుండా ఉండే రివాజును ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్ చాలా కాలంగా పాటిస్తోంది. తాజా ఘటనపై కూడా ఎసెక్స్ కౌంటీ జట్టు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరింది. క్రికెట్లో ‘భిన్నత్వంలో ఏకత్వం’ను తాము గౌరవిస్తామని, తమ జట్టులో కూడా మతం, జాతి భేదాలు లేకుండా ఆటగాళ్లు ఉన్నారని వెల్లడించింది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, యువ ఆటగాళ్లకు ఈ విషయంలో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపడతామని పేర్కొంది. కుర్రాళ్లు తమ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారని, చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని ఎసెక్స్ స్పష్టం చేసింది. తాజా సీజన్లోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగు పెట్టిన 21 ఏళ్ల ఫెరోజ్ ఖుషీ ఎసెక్స్ తరఫున 4 మ్యాచ్‌లు ఆడాడు. -
బెన్‌స్టోక్స్ స్టన్నింగ్ క్యాచ్
-
ఈ క్యాచ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
లండన్ : ప్రపంచకప్ సమరం మొదలైందో లేదో అప్పుడే ప్రేక్షకులకు కావాల్సిన మజా దొరుకుతుంది. కళ్లు చెదిరే క్యాచ్‌లు.. ఔరా అనిపించే బౌండరీలు.. నోరెళ్లబెట్టే బంతులు.. ఆరంభ మ్యాచ్‌లోనే క్రికెట్ ప్రపంచాన్ని రంజింపచేశాయి. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ అద్భుత ప్రదర్శనతో సఫారీల ఓటమిని శాసించాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో అదరగొట్టి ఆల్‌రౌండర్ అంటే ఇలా ఉండాలని అనిపించుకున్నాడు. 79 బంతుల్లో 89 పరుగులు చేసిన స్టోక్స్.. రెండు వికెట్లు, రెండు క్యాచ్‌లు, ఒక రనౌట్‌తో సత్తా చాటాడు. ముఖ్యంగా అదిల్ రషిద్ బౌలింగ్‌లో బౌండరీ వద్ద స్టోక్స్ అందుకున్న ఆండిల్ ఫెహ్లుకోవియా క్యాచ్ ప్రస్తుతం టాక్ ఆఫ్‌ది వరల్డ్‌గా నిలిచింది. యావత్ క్రికెట్ ప్రపంచం ఈ క్యాచ్‌ను చూసి సంబరపడుతోంది. ఒంటి చేత్తో సూపర్ మ్యాన్‌లా స్టోక్స్ అందుకున్న ఈ క్యాచ్ ఈ వరల్డ్‌కప్ బెస్ట్ క్యాచ్ జాబితాలో తప్పకుండా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : బెన్‌స్టోక్స్ స్టన్నింగ్ క్యాచ్ చదవండి: అదిరే ఆరంభం ది గార్డియన్ సౌజన్యంతో Ben Stokes with the bat, Ben Stokes with the ball, Ben Stokes on the field! No question about who's the Player of the Match in the #CWC19 opener 👏 #ENGvSA #WeAreEngland pic.twitter.com/2pZwa10xEt — Cricket World Cup (@cricketworldcup) May 30, 2019 -
అచ్చం ధోనిలానే..
లీడ్స్: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, పరిమిత ఓవర్ల క్రికెట్ రెగ్యులర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనిని మరిపించాడు ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్. అచ్చం ధోని తరహాలోనే రనౌట్ చేసి వార్తల్లో నిలిచాడు. పాకిస్తాన్‌తో ఐదో వన్డేలో భాగంగా బాబర్ అజమ్ రనౌట్ చేసే క్రమంలో చూడకుండానే బంతిని స్టంప్స్‌పైకి విసిరి మన మిస్టర్ కూల్‌ను గుర్తు చేశాడు. మ్యాచ్‌లో భాగంగా 352 పరుగుల ఛేదన లక్ష్యంగా పాక్ బ్యాటింగ్‌కు దిగింది. ఇందులో భాగంగా 27 ఓవర్లో బాబర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆవలి ఎండ్‌లో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఉన్నాడు. ఆ ఓవర్లో ఆదిల్ వేసిన బంతిని కెప్టెన్ ఆడాడు. సింగిల్ తీద్దామని లెగ్ సైడ్‌కి కొట్టాడు. అయితే బంతిని గమనించని బాబర్ క్రీజు మధ్యలోకి వచ్చేశాడు. దీన్ని గమనించిన వికెట్ కీపర్ జోస్ బట్లర్ వెంటనే బంతి అందుకుని ఆదిల్వైపు విసిరాడు. దీన్ని అందుకున్న ఆదిల్..స్టంప్స్ వైపు చూడకుండానే వెనక్కి విసిరాడు. బంతి నేరుగా స్టంప్స్‌ను తాకింది. దీంతో బాబర్ ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇది ధోని కీపింగ్ స్టైల్‌ను జ్ఞప్తికి తేవడంతో నెటిజన్లు దీనిపై కామెంట్లు చేస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ధోనిని మరిపించిన ఆదిల్ రషీద్ -
ధోనిని మరిపించిన ఆదిల్ రషీద్