ఆదిల్ రషీద్
లండన్ : టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్,159 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇంత భారీ విజయం సాధించిన ఆ జట్టులో స్పిన్నర్ ఆదిల్ రషీద్ తన వంతు ఏ పాత్ర పోషించలేదు. తుది జట్టులో సభ్యుడిగా ఉండి బౌలింగ్, బ్యాటింగ్ చేయని, కనీసం ఓ క్యాచ్ కూడా పట్టని ఆటగాడిగా నిలిచిపోయాడు. టెస్టు చరిత్రలో ఇలా ఏం చేయని 14వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా 2 గ్యారెత్ బ్యాటీ (బంగ్లాదేశ్‌పై లార్డ్స్‌లో 2005లో) తర్వాత ఈ అరుదైన సందర్భంలో నిలిచిన రెండో ఇంగ్లండ్ ప్లేయర్‌గా నిలిచాడు. (చదవండి:పొరపాటు చేశాం: విరాట్ కోహ్లి)
141 ఏళ్ల టెస్టు చరిత్రలో రషీద్ కన్నా ముందు పెర్సీ చప్‌మ్యాన్, బ్రియాన్ వాలెంటైన్, బిల్ జాన్‌స్టాన్(రెండు సార్లు), ఏజీ క్రిపాల్ సింగ్, నారి కాంట్రాక్టర్, క్రైగ్ మెక్‌డెర్మాట్, అసిఫ్ ముజ్తాబ్, నీల్, అశ్వెల్ ప్రిన్స్, గారెత్ బ్యాటీ, జాక్వస్ రుడోల్ఫ్, వృద్దిమాన్ సాహాలు ఈ అరుదైన జాబితాలో ఉన్నారు. నిజానికి రషీద్‌కు బౌలింగ్, బ్యాటింగ్‌చేసే అవకాశమే రాలేదు. పేసర్లు జేమ్స్ అండర్సన్, బ్రాడ్‌లు రెచ్చిపోవడం, బ్యాటింగ్‌లో వోక్స్, బెయిర్‌స్టోలు రాణించడంతో రషీద్ సేవలు జట్టుకు అవసరమవ్వలేదు. తొలి టెస్టులో మూడు వికెట్లు పడగొట్టిన రషీద్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 29 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment