Lords test
-
'అరె శాండ్‌పేపర్ మరిచిపోయా'.. ఆసీస్ ప్రధానికి రిషి సునాక్ కౌంటర్
ప్రతిష్టాత్మ యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు ముగిశాయి. తొలి రెండింటిలో ఆసీస్ విజయం సాధించగా.. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించి రేసులో నిలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా జూలై 19 నుంచి 23 వరకు జరగనుంది. ఈ విషయం పక్కనబెడితే లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔట్ ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంతి డెడ్ కాకముందే బెయిర్ స్టో క్రీజు దాటడంతో ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ వికెట్లకు గిరాటేశాడు. నిబంధనల ప్రకారం థర్డ్ అంపైర్ బెయిర్ స్టో ఔట్ అని ప్రకటించాడు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఆస్ట్రేలియా ప్రవర్తించిందంటూ అభిమానులు సహా ఇంగ్లీష్ మీడియా తమ కథనాల్లో హోరెత్తించింది. విమర్శల స్థాయి ఎలా ఉందంటే అది మూడో టెస్టుకు కూడా పాకింది. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అలెక్స్ కేరీ కనిపించిన ప్రతీసారి ఇంగ్లీష్ అభిమానులు అతన్ని టార్గెట్ చేశారు. ఇక బెయిర్ స్టో ఔట్ వివాదంపై రెండు దేశాల ప్రధానులు కూడా జోక్యం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమంటే.. ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ రిషి సునాక్ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. అయితే క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ అని.. ఇక్కడితో ఈ వివాదానికి స్వస్తి పలకాలని ఇరు దేశాల ప్రధానులు అభిమానులను కోరారు. తాజాగా ఇరుదేశాల ప్రధానులు మరోసారి సమావేశమయ్యారు. అయితే ఈసారి దేశాల మధ్య అనుబంధం మరింత పెంపొందించేందుకు సమ్మిళిత అభివృద్ధి సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ చాలెంజెస్, యూకే-ఆస్ట్రేలియా మధ్య వ్యాపార రంగానికి సంబంధించిన విషయాలను చర్చించుకున్నారు. వీటిలోనే యాషెస్ సిరీస్ ప్రస్తావన కూడా వచ్చినట్లు ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ ట్విటర్ వేదికగా తెలిపారు. ఆసీస్ ప్రధాని ఆంథోని షేర్ చేసిన వీడియోలో.. యాషెస్పై ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. మొదట అల్బనీస్ యాషెస్‌లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉన్నట్లు ఒక పేపర్‌పై చూపించారు. ఆ తర్వాత రిషి సునాక్ లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించిన పేపర్ కట్‌ను చూపించారు. ఇక ఆసీస్ ప్రధాని ఈసారి లార్డ్స్ టెస్టులో బెయిర్ స్టో ఔటైన విధానంకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను చూపించగా.. రిషి సునాక్.. ''సారీ తాను శాండ్‌పేపర్(Sandpaper-Ball Tampering) గేట్ ఉదంతం పేపర్ క్లిప్పింగ్‌ను మరిచిపోయాను'' అంటూ పేర్కొన్నాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాండ్‌పేపర్ వివాదమేంటి? రిషి సునాక్ ప్రస్తావించిన శాండ్ పేపర్ వివాదం 2018లో జరిగింది. ఐదేళ్ల క్రితం సౌతాఫ్రికాతో టెస్టు సందర్భంగా ఆసీస్ ఆటగాడు కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్ ముక్కతో బంతిని రుద్దడం అప్పట్లో వైరల్‌గా మారింది. ఇలా చేయడం వల్ల బంతి స్వింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ శాండ్‌పేపర్ ఉదంతం వెనుక అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లది కీలకపాత్ర అని తేలడంతో ఏడాది నిషేధం పడింది. బెన్‌క్రాఫ్ట్ తొమ్మిది నెలలు నిషేధానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ తన తప్పును క్షమించమంటూ కెమెరా ముందు బోరున ఏడ్వడం ఎప్పటికి మరిచిపోలేం. ఈ ఉదంతం అనంతరం స్మిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే ఏడాది తర్వాత స్మిత్, వార్నర్‌లు మళ్లీ జట్టులోకి రాగా.. బెన్‌క్రాఫ్ట్ మాత్రం మళ్లీ అడుగుపెట్టలేకపోయాడు. And of course we discussed the #Ashes pic.twitter.com/FeKESkb062 — Anthony Albanese (@AlboMP) July 11, 2023 చదవండి: Asia Cup 2023: 'జై షా పాకిస్తాన్ వెళ్లడమేంటి?.. దాయాదుల మ్యాచ్ అక్కడే' #NovakDjokovic: 46వసారి సెమీస్‌లో.. ఫెదరర్ రికార్డు సమం -
'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి'
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔటైన తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆసీస్ జట్టు వ్యవహరించిన తీరుపై పలువురు మాజీలు సహా చాలా మంది విమర్శలు గుప్పించారు. ''ఆస్ట్రేలియా జట్టుది కపట బుద్ది అని.. గెలుపు కోసం ఎంతకైనా తెగిస్తారంటూ'' ఇంగ్లండ్ అభిమానులు ట్విటర్లో పేర్కొన్నారు. దీనిపై 'ద వెస్ట్ ఆస్ట్రేలియన్' అనే పత్రిక బెన్ స్టోక్స్ ఫోటోను మార్ఫింగ్ చేసి 'క్రైబేబీస్' అనే శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించింది. క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆసీస్‌పై మండిపడుతున్నారు. కానీ ఆస్ట్రేలియా కంటే ముందే ఇంగ్లండ్ కపటత్వం అంటే ఏంటో చూపించిందని కొంతమంది ఆసీస్ అభిమానులు పాత వీడియోలను షేర్ చేశారు. 2022లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ చూపిన కపట బుద్ధిని బయటపెట్టింది. క్రీడాస్పూర్తికి ఉప్పుపాతరేశారు. ఒక అభిమాని షేర్ చేసిన వీడియోలో అప్పటి ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన బంతిని హెన్రీ నికోల్స్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. అయితే దురదృష్టవశాత్తూ బంతి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న డారిల్ మిచెల్ బ్యాట్‌ను తాకి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. చేసేదేం లేక హెన్రీ నికోల్స్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే ఇక్కడ ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నప్పటికి వాళ్లు గెలవడానికే మొగ్గు చూపారు. అభిమాని షేర్ చేసిన వీడియోపై ఆకాశ్ చోప్రా స్పందించాడు. ''క్రీడాస్పూర్తి అనే పదాన్ని భుజాలపై ఎత్తుకొని వాదిస్తున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ వీడియోపై స్పందించండి. ఇప్పుడు ఆసీస్ చీటింగ్ చేసిందని అంటున్నారు.. న్యాయంగా మీరు ఆరోజు చేసింది కూడా చీటింగ్ కిందే వస్తుంది. మీ కపటత్వాన్ని చాటిచెప్పే పలు వీడియోలు ఇక్కడ ఉన్నాయి.అందులో ప్రస్తుత ఆటగాళ్లలో కొందరు భాగస్వాములుగా ఉన్నారు. ఇంగ్లీష్ క్రికెట్ కపటత్వం, అర్హత యొక్క భావం నా దృష్టిలో వేరే విషయం.'' అని చెప్పుకొచ్చాడు. Ouch. You can even see the torchbearer of ‘The Spirit of the Game’ shrugging his shoulders instead of initiating the process to withdraw the appeal. After all, you wouldn’t want to be remembered for things like these 🤣🫣🤪 Also, there are multiple videos circulating calling out… https://t.co/yR8Nq2UeVd — Aakash Chopra (@cricketaakash) July 4, 2023 చదవండి: #Chahal: 'మిస్టరీ గర్ల్'తో యజ్వేంద్ర చహల్.. ధనశ్రీ చూస్తే అంతే! ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు -
Ashes 2023: బెయిర్‌స్టో స్టంపౌట్ ఉదంతం.. ప్రధాని సైతం స్పందించారు..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై క్రికెట్‌ను ఎంతగానో ఇష్టపడే బ్రిటన్ ప్రధాని రిషి సునక్ స్పందించారు. బెయిర్‌స్టో విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. ఈ వివాదంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందనతో ఏకీభవించారు. ఆస్ట్రేలియా తరహాలో గేమ్ గెలవాలని తాను కోరుకోనని అన్నారు. ఆసీస్ వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాలను రిషి సునక్ ప్రతినిధి వెల్లడించారు. కాగా, యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో బెయిర్‌స్టో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఔటైన విషయం తెలిసిందే. బంతి వికెట్‌కీపర్ చేతిలో ఉండగానే బెయిర్‌స్టో ఓవర్ పూర్తయ్యిందనుకుని క్రీజ్ దాటి వెళ్లాడు. ఇది గమనించిన వికెట్‌కీపర్ వికెట్లను గిరాటు వేశాడు. సుదీర్ఘ పరిశీలన అనంతరం ధర్డ్ అంపైర్ బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. దీంతో వివాదం రాజుకుంది. నిబంధనల ప్రకారం ఇది ఔటే అయినా.. ఆసీస్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసీస్ క్రీడాస్పూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ కెప్టెన్ అయితే తాము ఆసీస్ తరహాలో మ్యాచ్ గెలవాలని ఎప్పటికీ కోరుకోమని వ్యాఖ్యానించాడు. ఇదే విషయాన్ని తాజాగా బ్రిటన్ ప్రధాని కూడా వెల్లబుచ్చారు. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌లో బెయిర్‌స్టో కీలక సమయంలో ఔట్ కావడంతో ఇంగ్లండ్ 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆసీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్, ఆసీస్ మధ్య మూడో టెస్ట్ జులై 6 నుంచి హెడింగ్లీలో ప్రారంభమవుతుంది. -
బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదం.. వాళ్లు మనుషులైతే బహిరంగా క్షమాపణ చెప్పాలి..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు సర్ జెఫ్రీ బాయ్‌కాట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆసీస్ ఆటగాళ్లు నిజంగా మనుషులైతే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసీస్, ఇంగ్లండ్ జట్లు అద్భుతమైన క్రికెట్ ఆడాయి.. ఇలాంటి ఘటనలు ఆట స్ఫూర్తికి మంచిది కాదని అన్నారు. అందరం తప్పులు చేస్తాం.. బెయిర్‌స్టో విషయంలో ఆసీస్ కూడా తప్పు చేసింది.. ఈ విషయంలో వారు తమ తప్పును అంగీకరించాలని కోరారు. ఏ పద్దతిలోనైనా గెలవాలనుకునే వారికి క్రికెట్ సరైన ఆట కాదని, ఇలాంటి (బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్) ఘటనలు జెంటిల్మెన్ గేమ్ ప్రతిష్టను మసకబారుస్తాయని తెలిపాడు. గెలవడం కోసం కష్టపడటం మంచిదే, కానీ క్రీడా స్పూర్తిని మరిచి గెలవాలనుకోవడం మాత్రం సరైంది కాదని హితవు పలికాడు. ఓ ఆటగాడు ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనప్పుడు దానికి క్రికెట్ చట్టాలను ఆపాదించడం కరెక్ట్ కాదని, ఇలాంటి సందర్భాల్లో ప్రత్యర్ధి జట్లు ఇంగితజ్ఞానం ఉపయోగిస్తే మంచిదని అభిప్రాయపడ్డాడు. కాగా, రెండో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో బెయిర్‌స్టో చేసిన అనాలోచిత పని (బంతి వికెట్ కీపర్ చేతిలో ఉండగానే క్రీజ్ వదిలి బయటికి రావడం) ఇంత వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. బెయిర్‌స్టో నిర్లక్ష్యం కారణంగా ఇంగ్లండ్ మ్యాచ్‌ను కోల్పోవడంతో పాటు ఈ విషయాన్ని పెద్దది చేసినందుకు నవ్వులపాలైంది. బెన్ స్టోక్స్ వీరోచిత ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఫలితంగా ఆసీస్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో విజయం కన్నా బెయిర్ స్టో ఔట్ వివాదం ఎక్కువగా హైలెట్ అయింది. ఆసీస్ జట్టుకు నేరుగా గెలవడం చేతగాక ఇలా చీటింగ్ చేసి గెలవాలని చూసిందంటూ ఇంగ్లండ్ అభిమానులు ఇష్టమొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. నిజానికి బెయిర్ స్టో ఔట్ సరైనదే. బంతి డెడ్ కాకముందే క్రీజులో నుంచి బయటికి వెళ్లి మాట్లాడడం తప్పు. ఇదే అదనుగా భావించిన అలెక్స్ క్యారీ వికెట్ల వైపు బంతిని వేసి తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. అయితే దీన్ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా పేర్కొంటూ ఆస్ట్రేలియా టీమ్‌పై విమర్శలు చేశారు ఇంగ్లీష్ అభిమానులు. ఐదో రోజు మొదటి సెషన్ ముగిసిన అనంతరం లార్డ్స్ లాంగ్ రూమ్‌లో ఉన్న కొందరు ఎంసీసీ సభ్యులు కూడా ఆస్ట్రేలియా ప్లేయర్లను బూతులు తిట్టారు. వీరితో ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ వాగ్వాదానికి దిగారు. సాధారణంగా మిగిలిన క్రికెట్ గ్రౌండ్లో క్రికెటర్లు, డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లే దారిలో వేరే వాళ్లు ఉండడానికి, కూర్చోవడానికి అవకాశం ఉండదు. అయిలే లార్డ్స్‌లో మాత్రం లాంగ్ రూమ్ పేరుతో ఎంసీసీ సభ్యుల కోసం ఓ లాంగ్ రూమ్ ఉంటుంది. ఇందులో మెర్లీబోన్ క్రికెట్ క్లబ్, మిడిల్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సభ్యులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.. వీళ్లు వీవీఐపీల హోదాల లాంగ్ రూమ్‌లో కూర్చొని మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచే ఇరుజట్ల క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న కొంతమంది ప్రతినిధులు ఉస్మాన్ ఖవాజాతో గొడవపడ్డారు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ ప్రతినిధులను వారించాల్సింది పోయి ఉస్మాన్ ఖవాజాను బలవంతంగా తోసేశారు. ఆ తర్వాత వార్నర్‌ను కూడా టార్గెట్ చేయడంతో తాను కూడా ఏం తగ్గలేదు. అయితే వివాదం మరింత ముదురుతుందేమోనని సెక్యూరిటీ వచ్చి వార్నర్‌ను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. దీనిపై ఉస్మాన్ ఖవాజా స్పందించాడు. ''ఇది నిజంగా చాలా నిరుత్సాహపరిచింది. వాళ్లు మమ్మల్ని బూతులు తిట్టారు. ఆ మాటలు చెప్పడానికి కూడా నాకు మాటలు రావడం లేదు. అందుకే నేను వాళ్లను నిలదీశా.. వాళ్లలో కొందరు మాపై నిందలు వేశారు. ఇది మమ్మల్ని అవమానించడమే.. ఎంసీసీ మెంబర్స్ నుంచి ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు'' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎంసీసీ ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ కోరుతూ బహిరంగ లేఖను విడుదల చేసింది.''ఆస్ట్రేలియా క్రికెట్‌కు, ఉస్మాన్ ఖవాజా, వార్నర్‌లకు క్షమాపణలు. అమర్యాదగా ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే దురుసుగా ప్రవర్తించిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది.గ్రౌండ్లో జరిగిన విషయాన్ని నిలదీస్తే అధికారం బయటివాళ్లకు లేదు. అది వాళ్లకు సంబంధం లేని విషయం.'' అంటూ ప్రకటన విడుదల చేసింది. Usman Khawaja was pulled back by security after speaking to one the members inside the long room 😳 🗣️ "I've NEVER seen scenes like that!" pic.twitter.com/2RnjiNssfw — Sky Sports Cricket (@SkyCricket) July 2, 2023 MCC Statement.#Ashes pic.twitter.com/fWYdzx1uhD — Marylebone Cricket Club (@MCCOfficial) July 2, 2023 జరిగింది ఇదీ.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని వదిలేసిన జానీ బెయిర్‌స్టో, ఓవర్ అయిపోయిందని భావించి కీపర్ వైపు చూడకుండానే ముందుకు వచ్చేశాడు. జానీ బెయిర్‌స్టో క్రీజు దాటడాన్ని గమనించిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, వికెట్లవైపు త్రో వేశాడు. అది తగలడంతో ఆస్ట్రేలియా వికెట్ కోసం అప్పీల్ చేసింది. రన్ తీయాలనే ఉద్దేశంతో జానీ బెయిర్‌స్టో క్రీజు దాటలేదు. ఓవర్ అయిపోయిందని నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో మాట్లాడాలని ముందుకు నడుచుకుంటూ వచ్చేశాడు. వెనకాల ఏం జరిగిందో కూడా తెలియని జానీ బెయిర్‌స్టో, అవుట్ కోసం అప్పీల్ చేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాక తెల్లమొహం వేశాడు. థర్డ్ అంపైర్ ఔట్ అని ఇవ్వడంతో చేసేదేం లేక నిరాశగా పెవిలియన్ చేరాడు. చదవండి: ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు 'చహల్ విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక -
బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై బెన్ స్టోక్స్.. అలాంటి గెలుపు మాకొద్దు..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ వికెట్‌కీపర్/బ్యాటర్ జానీ బెయిర్‌స్టో స్టంపౌట్ అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆసీస్ ఆటగాళ్లు క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించి బెయిర్‌స్టోను ఔట్ చేశారని కొందరంటుంటే.. రూల్స్ ప్రకారం అది కచ్చితంగా ఔటేనని మరికొందరు వాదిస్తున్నారు. మ్యాచ్ అనంతరం ఇదే అంశంపై ఇరు జట్ల కెప్టెన్లు కూడా స్పందించారు. BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 బెయిర్‌స్టో స్టంపౌట్‌ను ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ సమర్ధించుకుంటుంటే.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం ఆసీస్ ఆటగాళ్ల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఓ పక్క రూల్స్ ప్రకారం బెయిర్‌స్టో ఔటేనని చెప్పుకొచ్చిన స్టోక్స్.. ఓ ఆటగాడిని ఆ పద్దతిలో ఔట్ చేసి వచ్చే గెలుపు తమకొద్దని వ్యాఖ్యానించాడు. ఒకవేళ కీలక సమయంలో ఓ ఆటగాడిని అలా ఔట్ చేసే అవకాశం తమకు వచ్చినా తాము వదిలేస్తామని, ఆ పద్ధతిలో గేమ్ గెలవడం తమకు ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. ఇలాంటి సందర్భంలో తాము అప్పీల్ చేసినా వెనక్కు తీసుకునే వాళ్లమని తెలిపాడు. ఆసీస్‌కు అది మ్యాచ్ విన్నింగ్ మూమెంట్ కాబట్టి అలా చేశారని అన్నాడు. కాగా, ఆఖరి రోజు ఆటలో బెయిర్‌స్టో ఔట్ కావడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. స్టోక్స్ వీరోచిత పోరాటం (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) చేసినా ఇంగ్లండ్ మ్యాచ్ గెలవలేకపోయింది. భారీ లక్ష్యఛేదనలో స్టోక్స్‌కు సహకరించే వారు లేకపోవడంతో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. ఒకవేళ బెయిర్‌స్టో విషయంలో ఆసీస్ తమ అప్పీల్‌ను వెనక్కు తీసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఏది ఏమైనప్పటికీ ఆసీస్ 43 పరుగుల తేడాతో గెలుపొంది, 5 మ్యాచ్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. -
బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదం.. ఆసీస్ ఆటగాడిపై దూషణ పర్వం.. తప్పేమీ లేదన్న అశ్విన్
లార్డ్స్ టెస్టు చివరి రోజు ఆటలో బెయిర్‌స్టోను స్టంపౌట్ చేసిన తీరు వివాదాన్ని రేపి తీవ్ర చర్చకు దారి తీసింది. లంచ్ ముందు ఈ ఘటన జరిగింది. గ్రీన్ వేసిన బంతిని ఆడకుండా కిందకు వంగిన బెయిర్‌స్టో ఆ తర్వాత సహచరుడు స్టోక్స్‌తో మాట్లాడేందుకు ముందుకు వెళ్లాడు. అదే సమయంలో బంతిని అందుకున్న కీపర్ క్యారీ అండర్‌ఆర్మ్ త్రోతో ముందుకు విసరగా అది స్టంప్స్‌ను తాకింది. BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 ఆ సమయంలో బెయిర్‌స్టో క్రీజ్‌కు చాలా దూరం ఉండటంతో థర్డ్ అంపైర్ బెయిర్‌స్టోన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దాంతో ఇంగ్లండ్ బృందం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఆసీస్ తమ అప్పీల్‌ను కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో బెయిర్‌స్టో మైదానం వీడాడు. ఆ సమయంలో స్టేడియం మొత్తం ‘పాత ఆ్రస్టేలియా...ఎప్పటిలాగే మోసగాళ్లు’ అంటూ ప్రేక్షకులంతా గేలి చేశారు. Usman Khawaja was pulled back by security after speaking to one the members inside the long room 😳 🗣️ "I've NEVER seen scenes like that!" pic.twitter.com/2RnjiNssfw — Sky Sports Cricket (@SkyCricket) July 2, 2023 లంచ్ సమయంలో పరిస్థితి మరింత ముదిరింది. లార్డ్స్ మైదానంలో ప్రతిష్టాత్మక లాంగ్ రూమ్‌లో ఆసీస్ ఆటగాళ్లు నడుస్తుండగా కొందరు మాటలతో ఖ్వాజాను దూషించారు. సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. దీనిపై ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు ఆగ్రహంతో ఎంసీసీకి ఫిర్యాదు చేయగా...వారు చివరకు ఘటనపై క్షమాపణ చెప్పారు. నిబంధనల ప్రకారం చూస్తే బెయిర్‌స్టో అవుట్లో తప్పు లేదు. బంతి ఇంకా ‘డెడ్’ కాకముందే అతను క్రీజ్ వీడాడు. బయటకు వెళ్లే ముందు అతను తన కాలితో క్రీజ్ లోపల నేలను గీకడం కూడా కనిపించినా బంతి కీపర్ చేతుల్లోనే ఉంది. అప్రమత్తంగా ఉన్న క్యారీ స్టంప్ చేశాడు. దాంతో మరోసారి క్రీడా స్ఫూర్తి చర్చ ముందుకు వచ్చింది. కామెంటేటర్లంతా వాదనకు చెరో వైపు నిలిచారు. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో స్పష్టంగా ఉండే భారత స్పిన్నర్ అశ్విన్ మాత్రం ఇందులో తప్పేమి లేదని, అది అవుట్ అని స్పష్టం చేశాడు. ‘ఒకటి మాత్రం నిజం. వెనక అంత దూరం నిలబడిన కీపర్ స్టంప్స్‌పైకి బంతి విసిరాడంటే అప్పటికే బెయిర్‌స్టో ఇలాంటి ప్రయత్నం చేసి ఉండటం అతను చూసి ఉంటాడు’ అని అశ్విన్ విశ్లేషించాడు. -
బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం.. ప్రత్యర్ధి సైతం దాసోహం..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం చేశాడు. భారీ శతకంతో చెలరేగాడు. పట్టుసడలని పోరాటంతో ప్రత్యర్ధిని గడగడలాడించాడు. అదే ప్రత్యర్ధి చేతనే శభాష్ అనిపించుకున్నాడు. 2019లో హెడింగ్లీ మైదానంలో జరిగిన మ్యాచ్ తరహాలో ఒంటి చేత్తో జట్టును గెలిపించేలా కనిపించాడు. అయితే గెలుపుకు మరో 70 పరుగులు చేయాల్సిన తరుణంలో హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటై, నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఆతర్వాత ఇంగ్లండ్ 26 పరుగుల వ్యవధిలో మిగిలిన 3 వికెట్లు కోల్పోవడంతో ఓటమిపాలైంది. స్టోక్స్ వీరోచిత పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఏ స్థితిలోనైనా ‘బజ్‌బాల్’ను కొనసాగిస్తానంటూ పట్టుదలగా నిలిచి సిక్సర్లతో చెలరేగిన స్టోక్స్, చివరకు జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఫలితంగా ఆసీస్ లార్డ్స్‌లో గెలుపు జెండా ఎగరేసి 5 టెస్ట్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లండన్: ఆ్రస్టేలియా జట్టు యాషెస్ సిరీస్‌పై తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. లార్డ్స్ మైదానంలో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ 43 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 371 పరుగులను ఛేదించే ప్రయత్నంలో ఓవర్‌నైట్ స్కోరు 114/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) చెలరేగగా... బెన్ డకెట్ (112 బంతుల్లో 83; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ తలా 3 వికెట్లు పడగొట్టారు. గాయంతో ఉన్న స్పిన్నర్ లయన్ బౌలింగ్ చేయకుండానే ఆసీస్ ఈ విజయాన్ని అందుకోగలిగింది. స్టీవ్ స్మిత్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, మూడో టెస్టు గురువారంనుంచి లీడ్స్‌లో జరుగుతుంది. విజయం కోసం చివరి రోజు చేతిలో 6 వికెట్లతో 257 పరుగులు సాధించాల్సిన స్థితిలో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. డకెట్, స్టోక్స్ భారీ భాగస్వామ్యంతో జట్టును ముందుకు నడిపించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. డకెట్‌తో పాటు బెయిర్‌స్టో (10) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. విజయం కోసం మరో 178 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో స్టోక్స్ బాధ్యత తీసుకొని భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. గ్రీన్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన అతను...గ్రీన్ తర్వాతి ఓవర్లో ఒక ఫోర్ కొట్టి 82 పరుగులకు చేరుకున్నాడు. అదే ఓవర్లో వరుస బంతుల్లో 6, 6, 6 బాది అతను సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. హాజల్‌వుడ్ ఓవర్లోనూ మరో 2 సిక్సర్లు బాదిన స్టోక్స్... స్టార్క్ ఓవర్లోనూ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి 150కు చేరుకున్నాడు. ఏడో వికెట్‌కు బ్రాడ్ (11)తో కలిసి స్టోక్స్ 20.2 ఓవర్లలోనే 108 పరుగులు జోడించాడు. ఆసీస్ మూడు క్యాచ్‌లు వదిలేయడం కూడా స్టోక్స్‌కు కలిసొచ్చింది. ఇంగ్లండ్ గెలుపు దిశగా వెళుతున్నట్లు అనిపించింది. అయితే హాజల్‌వుడ్ బౌలింగ్‌లో స్టోక్స్ మరో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అంచనా తప్పడంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా బ్యాక్వర్డ్ పాయింట్ వరకు పరుగెత్తుతూ వెళ్లి కీపర్ క్యారీ అందుకోవడంతో అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత మిగిలిన 3 వికెట్లు తీసేందుకు ఆసీస్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. -
నాథన్ లయోన్‌కు నీరాజనాలు.. గాయాన్ని లెక్క చేయకుండా, కుంటుతూనే బరిలోకి..!
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో అతను డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. అయితే నాలుగో రోజు ఆటలో ఆసీస్‌కు లయోన్ అవసరం పడటంతో అతను ఏమాత్రం సంకోచించకుండా ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. లయోన్ కమిట్మెంట్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 👏 @NathLyon421.#LoveLords | #Ashes pic.twitter.com/yx5l8w2Vu1 — Lord's Cricket Ground (@HomeOfCricket) July 1, 2023 అతను నొప్పిని భరిస్తూ కుంటుతూ మైదానంలోకి వస్తుంటే, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లతో ప్రశంసించారు. లయోన్ ఔటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలోనూ ప్రేక్షకులు చప్పట్లతో స్టేడియాన్ని మార్మోగించారు. ఆట పట్ల లయోన్‌కు ఉన్న డెడికేషన్, తాను చేయగలిగే కొన్ని పరుగులైన జట్టుకు ఉపయోగపడతాయన్న అతని కమిట్మెంట్కు నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు. లయోన్ కుంటుతూ మైదానంలోకి వస్తున్న వీడియో నెట్టింట వైరలవుతుంది. Here he comes! #Ashes pic.twitter.com/2t954CNI7g — cricket.com.au (@cricketcomau) July 1, 2023 కాగా, ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 11వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన లయోన్.. బౌండరీ సాయంతో 4 పరుగులు చేసి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం ఆసీస్ నిర్ధేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి విజయానికి 257 పరుగుల దూరంలో ఉంది. అదే ఆసీస్ గెలవాలంటే 6 వికెట్లు అవసరం. క్రీజ్‌లో డకెట్ (50), స్టోక్స్ (29) ఉన్నారు. స్కోర్ వివరాలు.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ (స్టీవ్ స్మిత్ 110, ట్రవిస్ హెడ్ 77, డేవిడ్ వార్నర్ 66; రాబిన్సన్ 3/100, టంగ్ 3/98) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 325 ఆలౌట్ (డకెట్ 98, బ్రూక్ 50; స్టార్క్ 3/88, హెడ్ 2/17) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 279 ఆలౌట్ (ఖ్వాజా 77; బ్రాడ్ 4/65) ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్: 114/4 (డకెట్ 50 నాటౌట్; కమిన్స్ 2/20) (నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి) -
ట్రెవిస్ హెడ్‌కు స్పిన్ బాధ్యతలు.. ఇంగ్లండ్ 325 ఆలౌట్
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ అయింది. 278/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 47 పరుగులు మాత్రమే జత చేసి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆసీస్‌కు 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో బెన్ డకెట్ 98 పరుగులు చేసి రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. హ్యారీ బ్రూక్ 50, జాక్ క్రాలీ 48, ఓలీ పోప్ 42 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ట్రెవిస్ హెడ్, హాజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్, నాథన్ లియోన్, కామెరాన్ గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా లంచ్ విరామ సమయానికి ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియోన్ సేవలను కోల్పోయినప్పటికి ట్రెవిస్ హెడ్ సహా పేస్ బౌలర్లు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. చదవండి: Dhananjaya-De-Silva: దెబ్బకొట్టిన నెదర్లాండ్స్; కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో పరువు నిలిపాడు ఆసియా కప్ విజేతగా భారత్.. ఎనిమిదోసారి టైటిల్ కైవసం -
'ఇదేం పాడు పని'.. వైరలవుతున్న లబుషేన్ చర్య
ఇటీవలే టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయిన లబుషేన్ ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తరపున కీలక ఇన్నింగ్స్‌లు ఆడే పనిలో ఉన్నాడు. అయితే లబుషేన్‌కు ఒక అలవాటు ఉంది. ఏ మ్యాచ్ అయినా సరే అతను చూయింగ్ గమ్ లేకుండా గ్రౌండ్లో అడుగుపెట్టడు. ఆరోజు మ్యాచ్ ముగిసేవరకు నోటిలో చూయింగ్ గమ్‌ను నములుతూనే కనిపిస్తుంటాడు. తాజాగా మార్నస్ లబుషేన్ చేసిన ఒక పని ఆలస్యంగా వెలుగు చూసింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో ఆట తొలిరోజు లబుషేన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎప్పటిలానే నోట్లో చూయింగ్ గమ్ వేసుకొని వచ్చాడు. బ్రేక్ సమయంలో బ్యాటింగ్ సిద్ధమవుతున్న తరుణంలో నోటి నుంచి చూయింగ్ గమ్ కిందపడింది. మట్టిలో పడినప్పటికి దానిని తీసి మళ్లీ నోట్లోనే పెట్టుకున్నాడు. అంపైర్ అనుమతి తీసుకొని మట్టిపాలైన చూయింగ్ గమ్‌ను కింద పడేయకుండా నోటిలో పెట్టుకోవడం ఏంటో అర్థం కాలేదు. అయితే లబుషేన్ మాత్రం చూయింగ్ గమ్‌కు మట్టి అంటినా కూడా పట్టించుకోకుండా తన స్టైల్లో నమలడం ఆరంభించాడు. ఇది కాస్త ఆలస్యంగా వెలుగుచూసినప్పటికి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో లబుషేన్ 47 పరుగులు చేశాడు. Marnus dropping his gum on the pitch and then putting it back in his mouth????pic.twitter.com/tGdYqM3w72 — 🌈Stu 🇦🇺 (@stuwhy) June 29, 2023 ఇక మ్యాచ్ విషయానికి వస్తే స్టీవ్ స్మిత్ సెంచరీ బాదడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులతో పటిష్టంగా నిలిచింది. ఇక నాథన్ లియోన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడడం ఆసీస్‌కు ఇబ్బంది కలిగించే అంశం. తీవ్ర గాయం కావడం.. స్రెచర్ సాయంతో నడుస్తున దృశ్యాలు బయటికి రావడంతో లియోన్ మ్యాచ్ ఆడడం అనుమానంగానే ఉంది. దీంతో ఆసీస్ నలుగురు బౌలర్లతోనే ఆడాల్సి వస్తుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 138 పరుగులు వెనుకబడి ఉంది. Marnus Labuschagne was sleeping and then suddenly realised his turn had arrived. pic.twitter.com/pw1xOk9IeI — Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023 చదవండి: Ashes 2023: నాథన్ లియోన్‌కు గాయం.. ఆసీస్‌కు ఊహించని షాక్! -
Ashes 2023: నాథన్ లియోన్‌కు గాయం.. ఆసీస్‌కు ఊహించని షాక్!
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ తీవ్రంగా గాయపడ్డాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆటలో లియోన్ ఫీల్డింగ్ చేస్తూ బౌండరీ లైన్ వద్ద గాయపడ్డాడు. రెండో సెషన్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో ఇది జరిగింది. ఈ క్రమంలో నొప్పి తీవ్రంగా ఉండడంతో వెంటనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాతి సెషన్‌కు లియోన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. ఇది ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ అని చెప్పొచ్చు. రెండో టెస్టులో లియోన్ 13 ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే 500వికెట్ల మార్క్‌ను అందుకునే అవకాశం ఉంది. ఇక లియోన్‌కు లార్డ్స్ టెస్టు వందోది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లియోన్ గాయంపై స్టీవ్ స్మిత్ స్పందింస్తూ.. ''నాథన్ కచ్చితంగా ఎలా ఉన్నాడో తెలియదు.. అతని గాయం తీవ్రమైతే మాత్రం తమ జట్టుకు భారీ నష్టం మిగలనుంది. అతని లోటును తీర్చడం చాలా కష్టం. ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది.''అంటూ తెలిపాడు. తాజాగా మూడోరోజు ఆటకు ఇరుజట్లు సిద్ధమవుతున్నా వేళ ఆడమ్ వైట్ అనే వ్యక్తి తన ట్విటర్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టేడియానికి వస్తున్న వీడియోనూ షేర్ చేశాడు. ఈ వీడియోలో నాథన్ లియోన్ రెండు స్రెచర్ల సాయంతో నడుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దీన్నిబట్టి లియోన్‌కు గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రెండో టెస్టుకు లియోన్ దూరమైనట్లే. నాథన్ లియోన్ స్థానంలో టాడ్ మార్ఫీ! ఒకవేళ నాథన్ గాయంతో యాషెస్ సిరీస్ కు దూరమైతే అతని స్థానంలో టాడ్ మార్ఫీని మూడో టెస్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. లియోన్ 30 యాషెస్ టెస్టుల్లో 29.41 సగటుతో 110 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పటివరకు 122 టెస్టుల్లో 31.01 సగటుతో 496 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. నాలుగు మ్యాచుల్లో 10 వికెట్లు తీసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక లార్డ్స్ టెస్టు రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ రెండోరోజు ఆట ముగిసేసమయానికి 61 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 45, బెన్ స్టోక్స్ 17 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ ప్రస్తుతం 138 పరుగులు వెనుకబడి ఉంది. The Australians have arrived 80 minutes before play as Nathan Lyon struggles with his team mates on crutches following his calf injury yesterday. @SEN_Cricket pic.twitter.com/a1lRWLIofm — Adam White (@White_Adam) June 30, 2023 చదవండి: అతడి గురించి మీకేం తెలుసు? ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వరా?: గంగూలీ ఆగ్రహం #Ashes2023: 58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్‌చేస్తే -
58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్‌చేస్తే
అభిమానం అనేది ఒక వ్యక్తిని ఎంత దూరమైనా ప్రయాణం చేసేలా చేస్తోంది. మనకిష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలన్న కుతూహలం ఉంటుంది. ఒకవేళ మనకు దగ్గర్లో ఉన్న సినిమా థియేటర్లో టికెట్ దొరక్కపోతే.. వంద కిలోమీటర్లు దూరం ఉన్నా సరే వెర్రి అభిమానం అంత దూరం మనల్ని తీసుకెళ్తుంది. అలా చూసినప్పుడే మనకు ఆత్మసంతృప్తి. క్రికెట్లో కూడా అలాంటి పిచ్చి అభిమానం ఉన్న ఫ్యాన్స్ కొందరుంటారు. ఆ కోవకు చెందిన వాడే మిస్టర్ మాట్. తస్మానియాకు చెందిన మాట్కు క్రికెట్ అన్నా.. ఆస్ట్రేలియా జట్టు అన్నా విపరీతమైన అభిమానం. ఆ వెర్రి అభిమానమే అతన్ని తస్మానియా నుంచి వయా చైనా, సైప్రస్‌లు మీదుగా ఇంగ్లండ్‌కు తీసుకొచ్చింది. 58 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణం చేసిన మ్యాట్ లార్డ్స్‌కు చేరుకున్నాడు. కానీ మ్యాట్‌కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. యాషెస్ సిరీస్ ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియా అభిమానులైతే టి20ల కంటే ఎక్కువగా యాషెస్‌ను ఆదరిస్తారు. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టు రసవత్తరంగా సాగడంతో లార్డ్స్ టెస్టుపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో టికెట్లన్నీ ఆన్ లైన్ లో మూడు రోజుల ముందే ముగిశాయి. అయితే 58 గంటలు ప్రయాణించి లార్డ్స్ కు వచ్చిన మ్యాట్.. స్టేడియంలోకి ఎంట్రీ కావడానికి టికెట్ ను ముందుగా బుక్ చేసుకోలేదు.లార్డ్స్ కు చేరుకున్నాకా అతడికి టికెట్ దక్కలేదు. దీంతో అతడు లార్డ్స్ స్టేడియం ముందు ''నాకు ఒక టికెట్ కావాలి. నేను లార్డ్స్ లో మ్యాచ్ చూసేందుకు గాను 58 గంటలు జర్నీ చేసి వచ్చాను. దయచేసి నాకు ఒక టికెట్ ఇప్పించండి.''అని ప్లకార్డు పట్టుకుని నిల్చున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ అయిన బర్మీ ఆర్మీని మ్యాట్ ఒక టికెట్ ఉంటే ఇప్పించండి అంటూ బతిమాలుకున్నాడు. దీంతో బర్మీ ఆర్మీలోని ఒక వ్యక్తి అతని అభిమానానికి కరిగిపోయి తన టికెట్‌ను అతనికి ఇచ్చేశాడు. దీంతో రెండో టెస్టు తొలి రోజున మూడో సెషన్లో అతను గ్రౌండ్లోకి చేరుకొని మ్యాచ్ వీక్షించి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Can we help Aussie Matt out? He’s travelled from Tasmania with no ticket!#Ashes pic.twitter.com/h1pZ3p4xJj — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 28, 2023 ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా క్రితం రోజు స్కోరుకు మరో 76 పరుగులు జోడించి 416 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ సెంచరీతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. మూడో సెషన్లో ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 178 పరుగులు చేసింది. బెన్ డకెట్ 86, ఓలీ పోప్ 39 పరుగులతో ఆడతున్నారు. ఇంగ్లండ్ ఓవర్‌కు 4 పరుగులకు పైగా రన్‌రేట్‌తో పరుగులు సాధిస్తుండడం విశేషం. చదవండి: టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్ దిగ్గజం సరసన Ashes 2023: కామెంటరీ కంటే ఐస్‌క్రీం ఎక్కువైపోయిందా! -
Ashes 2023: కామెంటరీ కంటే ఐస్‌క్రీం ఎక్కువైపోయిందా!
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఆసక్తిగా మొదలైంది. రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియాను.. ఇంగ్లండ్ 416 పరుగుల వద్ద తొలి సెషన్లోనే ఆలౌట్ చేసింది. ప్రస్తుతానికైతే ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. ఓవర్‌కు ఐదు పరుగుల చొప్పున సాధిస్తుండడం విశేషం. జాక్ క్రాలే 45, బెన్ డకెట్ 25 పరుగులతో ఆడుతున్నారు. ఈ విషయం పక్కనబెడితే.. రెండో టెస్టు సందర్భంగా కామెంటరీ ప్యానెల్లో కామెంటేటర్లు చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీరియస్‌గా మ్యాచ్ సాగుతుంటే కామెంటరీ చేయాల్సింది పోయి ఐస్‌క్రీం తింటుండడం ఆసక్తి కలిగించింది. అయితే మార్క్ టేలర్ తన చేతిలో ఐస్‌క్రీం పెట్టుకొని పక్కనే ఉన్న ఇషా గుహాను ఊరించేలా చేశాడు. అయితే ఇషా గుహా మాత్రం తానేం తక్కువ తిన్నానా అన్నట్లుగా మార్క్ టేలర్ చేతిలో ఉన్న ఐస్‌క్రీం నుంచి ఒక పీస్తో క్రీం తీసుకొని రుచి చూడడం ఆసక్తి కలిగించింది. మొత్తానికి మైదానంలో జరుగుతున్న విషయాలను కామెంటరీ చేయాల్సింది పోయి ఐస్‌క్రీమ్ తింటూ బిజీగా ఉండడం ఏంటని అభిమానులు కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక యూజర్ తన ట్విటర్లో షేర్ చేశాడు. #Ashes2023 Day 1 Commentators steal the show🤣 Ice Cream is more important 😛 pic.twitter.com/dgUC0S2NSg — SoRaD 🇮🇳❤️🇷🇺 (@risingstar_de) June 29, 2023 చదవండి: సూర్య, డివిలియర్స్నే మించిపోయాడు.. ఎవరయ్యా నువ్వు? అభిమానుల డిమాండ్; అశ్లీల వెబ్సైట్లో జాయిన్ అయిన ఫుట్‌బాలర్ -
లంచ్ విరామం.. స్మిత్ సెంచరీ, ఆస్ట్రేలియా 416 ఆలౌట్
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ 110 పరుగులతో సెంచరీ చేయగా.. ట్రెవిస్ హెడ్ 77, డేవిడ్ వార్నర్ 66 పరుగులు చేశారు. 339/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి సెషన్లోనే తమ పోరాటాన్ని ముగించింది. రెండోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే అలెక్స్ కేరీ వెనుదిరిగాడు. ఆ తర్వాత స్టార్క్ కూడా 6 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో కమిన్స్ స్మిత్‌కు జత కలిశాడు. ఇద్దరు కలిసి 8వ వికెట్‌కు 35 పరుగులు జోడించి జట్టు స్కోరును 400 దాటించారు. ఈ దశలో స్మిత్ టెస్టుల్లో 32వ సెంచరీ మార్క్‌ను సాధించాడు. అయితే కాసేపటికే స్మిత్ ఔట్ కావడం.. తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు టెయిలెండర్ల పని కానిచ్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, ఓలీ రాబిన్సన్లు చెరో మూడు వికెట్లు తీయగా.. జో రూట్ 2, అండర్సన్, బ్రాడ్లు ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. జాక్ క్రాలీ 6, బెన్ డకెట్ ఏడు పరుగులతో ఆడుతున్నారు. చదవండి: టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్ దిగ్గజం సరసన -
టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్ దిగ్గజం సరసన
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ శతకంతో మెరిశాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్ 169 బంతుల్లో శతకం మార్క్ అందుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తాను మాత్రం ఓపికతో ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. కాగా స్మిత్‌కు తన టెస్టు కెరీర్లో ఇది 32వ శతకం కావడం విశేషం. ఈ నేపథ్యంలో టెస్టుల్లో అత్యధిక సెంచరీల విషయంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వాతో(32 టెస్టు సెంచరీలు) కలిసి సంయుక్తంగా ఉన్నాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (51 సెంచరీలు) తొలి స్థానంలో ఉండగా.. జాక్ కలీస్(45 సెంచరీలు) రెండో స్థానంలో, రికీ పాంటింగ్(41 సెంచరీలు) మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా తరపున అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన క్రికెటర్లలో స్మిత్.. స్టీవ్ వాతో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ప్రస్తుత తరంలో టెస్టుల్లో యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు స్మిత్వే కావడం విశేషం. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యంత వేగంగా 32 సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా స్మిత్ చరిత్ర సృష్టించాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో ఆడుతున్న స్మిత్ సెంచరీకి చేరువగా వచ్చిన సమయంలో ఒత్తిడికి గురయ్యాడు. మరోవైపు ఆసీస్ కూడా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో స్మిత్ సెంచరీ చేస్తాడా అన్న అనుమానం వచ్చింది. కానీ కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక ఎండ్‌లో నిలబడి స్మిత్ సెంచరీ అయ్యేలా చూశాడు. ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసిది. స్మిత్ 110 పరుగులు, పాట్ కమిన్స్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. 🚨Steve Smith is the fastest batsman to score 32nd Hundreds in Test Cricket🚨#Ashes23 #ENGvAUS#ENGvsAUS #Ashespic.twitter.com/bKwZYRL5Ez — Cricket Videos 🏏 (@Abdullah__Neaz) June 29, 2023 A fine innings comes to an end for Steve Smith 🤝 https://t.co/gywkuUUD3T pic.twitter.com/Bxn4vbbRg5 — England Cricket (@englandcricket) June 29, 2023 In 2010 - Steve Smith made his Test debut at Lord's & batted at 8. In 2023 - Steve Smith completed his 32nd Test hundred at Lord's. One of the Greatest turn-arounds in cricket history. pic.twitter.com/UjjS9cc9Oy — Johns. (@CricCrazyJohns) June 29, 2023 చదవండి: సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్ హ్యాట్రిక్ సెంచరీ.. వరల్డ్‌కప్‌కు చేర్చడమే ధ్యేయంగా పెట్టుకున్నాడా! -
సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్
ఇంగ్లండ్ జట్టు బజ్‌బాల్ ఆటతీరుతో వరుసగా సిరీస్‌లు గెలిచిన సంగతి తెలిసిందే. స్టోక్స్ కెప్టెన్‌గా.. మెక్కల్లమ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంగ్లండ్ జట్టు 13 టెస్టుల్లో 11 విజయాలు సాధించింది. అన్నింటిలోనూ బజ్‌బాల్ ఆట దూకుడునే ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లను మట్టికరిపించి సిరీస్ విజయాలను సొంతం చేసుకుంది. ఇక యాషెస్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఇంగ్లండ్ జట్టు తమ బజ్‌బాల్ దూకుడు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అందుకు తగ్గట్టుగానే ఆసీస్‌తో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ను ఒక్కరోజులోనే డిక్లేర్ చేసింది. అయితే ప్రతీసారి మనది కాదని తెలుసుకోని ఇంగ్లండ్ ప్రపంచ టెస్టు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు తలవంచింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు ఐదోరోజు సూపర్‌గా బౌలింగ్ చేసినప్పటికి పాట్ కమిన్స్, నాథన్ లయోన్ల అద్బుత పోరాటం ఇంగ్లండ్‌కు విజయాన్ని దూరం చేసింది. కానీ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం బజ్‌బాల్ ఆటను సమర్థించుకున్నాడు. ఒక్క టెస్టులో ఓడిపోయినంత మాత్రానా బజ్‌బాల్‌ను పక్కనపెట్టేదే లేదని కుండబద్దలు కొట్టాడు. సీన్ మొత్తం రివర్స్.. అయితే బుధవారం(జూన్ 28న) లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో సీన్ మొత్తం రివర్స్ అయింది. బజ్‌బాల్ ఆటతో దూకుడు కనబరుస్తామనుకున్న ఇంగ్లండ్‌కు ఆసీస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎందుకంటే తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా వేగంగా ఆడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇలాగే ఆడుతామంటూ బజ్‌బాల్ ఆటను ఇంగ్లండ్‌కు చూపించింది. డేవిడ్ వార్నర్, ట్రెవిస్ హెడ్లు వన్డే స్టైల్లో వేగంగా ఆడితే.. స్మిత్ ఎప్పటిలాగే తన నిలకడైన ఆటను ప్రదర్శిస్తూ 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సెంచరీకి దగ్గరయ్యాడు. ఓవర్‌కు 4.08 రన్‌రేట్‌తో 83 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఒక దశలో వార్నర్-లబుషేన్, ట్రెవిస్ హెడ్- స్మిత్ జోడి ఓవర్‌కు ఐదు పరుగుల చొప్పున జోడించారు. నిజంగా ఇది ఇంగ్లండ్ ఇది ఊహించలేదు. ఇక రెండోరోజు ఆటలో స్మిత్ సెంచరీ నుంచి డబుల్ సెంచరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలెక్స్ క్యారీ, లాస్ట్ మ్యాచ్ హీరో పాట్ కమిన్స్ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. తొలి సెషన్లో వీరిని ఎంత త్వరగా ఔట్ చేస్తే ఇంగ్లండ్‌కు అంత మంచిది. రెండు సెషన్ల పాటు ఆసీస్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 500 స్కోరు దాటే అవకాశం ఉంది. అప్పుడు ఇంగ్లండ్‌కు కష్టాలు మొదలైనట్లే. బజ్‌బాల్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపిద్దామనుకున్న ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియానే ముచ్చెమటలు పట్టించేలా కనిపిస్తోంది. చదవండి: రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా భారత్ చేతిలో ఓడినా సరే.. మాకు అదే ముఖ్యం: పాక్ స్టార్ క్రికెటర్ -
రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ ఇటీవలీ కాలంలో తన ఆటను పూర్తిగా మార్చేశాడు. ఒకప్పుడు టెస్టులు, వన్డే క్రికెట్‌పై మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసిన రూట్ టి20ల్లోనూ తన పాగా వేసేందుకు ఆటశైలిని మార్చాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫలితం ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా వచ్చినప్పటికి రూట్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒక మంచి బ్యాటర్‌గా పేరు పొందిన రూట్ ఈ మధ్య కాలంలో బౌలర్‌గానూ రాణిస్తూ ఆల్‌రౌండర్ అవతారం ఎత్తినట్లుగా అనిపిస్తున్నాడు. తాజాగా లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో తొలి రోజే తన బౌలింగ్ మాయాజాలన్ని ప్రదర్శించాడు. ప్రధాన బౌలర్లకు తీసిపోని విధంగా ప్రదర్శన చేసిన రూట్.. ఆసీస్ ప్రధాన బ్యాటర్లు కామెరూన్ గ్రీన్, ట్రెవిస్ హెడ్లు ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. ఈ నేపథ్యంలో రూట్ ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అదేంటంటే.. యాషెస్ చరిత్రలో బ్యాటింగ్‌లో 2వేల పరుగులు పూర్తి చేయడంతో పాటు 20 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా రూట్ చరిత్రకెక్కాడు. ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్(2172 పరుగులు, 74 వికెట్లు), ఇంగ్లండ్‌కు చెందిన వాలీ హామండ్(2852 పరుగులు, 36 వికెట్లు) పడగొట్టారు. ఇక తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. స్మిత్ 85 పరుగులు నాటౌట్ మరో సెంచరీ వైపు దూసుకెళుతుండగా.. అలెక్స్ కేరీ 11 పరుగులతో స్మిత్‌కు సహకరిస్తున్నాడు. అంతకముందు ట్రెవిస్ హెడ్(77 పరుగులు), డేవిడ్ వార్నర్(66 పరుగులు) వన్డే తరహాలో ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్, జోష్ టంగ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. ఓలి రాబిన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు. Joe Root strikes twice in an over and Australia are 5️⃣ down! #EnglandCricket | #Ashes pic.twitter.com/wmn9hC5K6c — England Cricket (@englandcricket) June 28, 2023 చదవండి: పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో అరుదైన మైలురాయిని దాటిన స్టీవ్ స్మిత్.. ఇతని కంటే కోహ్లి ఒక్కడే బెటర్ -
పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ బజ్‌బాల్ దూకుడుకు ముకుతాడు వేస్తూ ఆసీస్ అద్బుత విజయాన్ని మూటగట్టుకుంది. అయితే కేవలం ఒక్క టెస్టు ఓడినంత మాత్రానా బజ్‌బాల్ ఆటను ఆపే ప్రసక్తే లేదని స్టోక్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ మీదకు దూసుకొచ్చిన ఆందోళనకారులు కాగా మ్యాచ్ ప్రారంభం అయిన కాసేపటికే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కొందరు ఆందోళనకారులు స్టేడియంలోని పిచ్‌పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్టేడియం నాలుగు వైపుల నుంచి ఒక్కసారిగా ఆందోళనకారులు దూసుకురావడంతో ఒక్క నిమిషం అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కాలేదు. ఇంతలో గ్రౌండ్‌స్టాఫ్ వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో బౌలింగ్ ఎండ్‌లో ఇద్దరు ఆందోళనకారులు సిబ్బందిని అడ్డుకుంటూ కిందపడేశారు. కాగా ఈ ఆందోళనకారులు ఎవరంటే.. 'జస్ట్ స్టాప్ ఆయిల్' అనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలీ కాలంలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా ఈ ఆందోళనకారులు అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లండ్‌లో ఆయిల్ టర్మినెల్స్ను కాపాడాలంటూ జస్ట్ స్టాప్ ఆయిల్ పేరుతో ఒక సోషల్ యాక్టివిస్ట్ సంస్థ 2022 నుంచి తమ ఉద్యమం కొనసాగిస్తుంది. ఏమిటీ ‘జస్ట్ స్టాప్ ఆయిల్’? పర్యావరణానికి హాని కలిగించే చమురు ఉత్పాదన కోసం కొత్త లైసెన్సులను నిలిపివేయాలని కొందరు నిరసనకారులు ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ పేరిట ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది బ్రిటన్‌లో పలు క్రీడల ఈవెంట్లను ఈ పర్యావరణ కార్యకర్తలు ఆటంకపరుస్తూ తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్, ఐర్లాండ్ క్రికెట్ మ్యాచ్, ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు, ప్రీమియర్‌షిప్ రగ్బీ ఫైనల్‌కు, ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లలోనూ తమ నిరసన గళం వినిపించారు. ఆశ్చర్యపరిచిన బెయిర్ స్టో చర్య.. ఇదంతా సీరియస్‌గా జరుగుతున్న సమయంలోనే ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో చేసిన పని అభిమానులను ఆశ్చర్యపరిచింది. తమ వైపుగా దూసుకొచ్చిన ఒక ఆందోళనకారుడిని బెయిర్ స్టో తన చేతుల్లోకి ఎత్తుకొని బౌండరీ లైన్ వద్ద ఎత్తిపడేశాడు. ''మీరు ఉద్యమం చేయడం తప్పు కాదు.. కానీ ఇలా మ్యాచ్‌కు ఆటంకం కలిగించడం మంచి పద్దతి కాదు'' అంటూ బెయిర్ స్టో అతనికి సర్ది చెప్పాడు. కాగా బెయిర్ స్టో చర్యకు అభిమానులు షాక్ తిన్నప్పటికి.. అతను చేసింది సరైన చర్యే అవడంతో చప్పట్లతో అభినందించారు. ఇక బెయిర్ స్టో తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టేటప్పుడు ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లు బెయిర్ స్టోకు అభినందనలు తెలపడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Bairstow picking up a pitch invader#Ashes pic.twitter.com/vCWCkXb3IA — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 28, 2023 Good start to the 2nd test. Bairstow has done some heavy lifting already😂😂 #Ashes2023 pic.twitter.com/f0JcZnCvEr — Ashwin 🇮🇳 (@ashwinravi99) June 28, 2023 చదవండి: విండీస్‌కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం! ‘పాకిస్తాన్ జట్టు భద్రతకై ప్రత్యేక ఏర్పాట్లు.. వాళ్లకు భయం వద్దు! నాకు నమ్మకం ఉంది’ -
Ashes 2nd Test: తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. అనుకున్న విధంగానే ఓ మార్పు
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇవాల్టి నుంచి (జూన్ 28) ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ముందుగా అనుకున్న విధంగానే మేనేజ్మెంట్ స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని తప్పించింది. అతని స్థానంలో యువ పేసర్ జోష్ టంగ్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహాయించి తొలి టెస్ట్ ఆడిన జట్టునే ఇంగ్లీష్ మేనేజ్మెంట్ యధాతథంగా కొనసాగించింది. ఆసీస్.. తమ తుది జట్టును ప్రకటించాల్సి ఉంది. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, మొయిన్ అలీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన టంగ్.. ఇటీవలే టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. యాషెస్ సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ ద్వారా టంగ్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టంగ్ 5 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్ట్ ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ పూర్తిగా పేస్ అటాక్‌తోనే బరిలోకి దిగనుంది. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్ అంటూ బొక్కబోర్లా పడింది. స్వయంకృతాపరాధంగానే ఆ జట్టు ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నా ఆ జట్టు ఓవరాక్షన్ చేసి చేతులుకాల్చుకుంది. మరి ఈ మ్యాచ్‌లో అయిన ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడుతుందో లేక మరోసారి బజ్‌బాల్ అంటూ హడావుడి చేస్తుందో వేచి చూడాలి. England have announced their playing XI for the second men’s Ashes Test at Lord’s 🏏 More 👉 https://t.co/ctbQmFfLDt pic.twitter.com/zvlpdaLzYq — ICC (@ICC) June 28, 2023 -
93 ఏళ్ల కిందటి బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 178 బంతుల్లో 24 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 182 పరుగులు చేసిన డకెట్.. 93 ఏళ్ల కిందట క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ నెలకొల్పిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్ట్‌ల్లో వేగవంతమైన 150 పరుగుల రికార్డు డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉండేది. 1930లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ 166 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. నిన్నటి వరకు లార్డ్స్ టెస్ట్‌ల్లో ఇదే వేగవంతమైన 150గా ఉండేది. అయితే నిన్నటి ఇన్నింగ్స్‌తో డకెట్ ఈ రికార్డును బద్దలు కొట్టి నయా రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. డకెట్ కేవలం 150 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసి బ్రాడ్‌మన్ రికార్డుకు ఎసరు పెట్టాడు. Ben Duckett broke Don Bradman's record for the fastest Test 150 at Lord's 🔥 #ENGvIRE pic.twitter.com/ARQcLnCtYK — ESPNcricinfo (@ESPNcricinfo) June 2, 2023 ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ 150 రికార్డు విషయానికొస్తే.. ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ పేరిట ఉంది. మెక్కల్లమ్ 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 103 బంతుల్లోనే 150 రన్స్ బాదాడు. ఆతర్వాత మహేళ జయవర్ధనే 111 బంతుల్లో, రాయ్ ఫ్రెడ్రిక్స్ 113 బంతుల్లో, హ్యారీ బ్రూక్ 115 బంతుల్లో 150 పరుగులు బాదారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం తడబడుతున్న ఐర్లాండ్ ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 141 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా 352 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దీనికి ముందు స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది. చదవండి: చరిత్ర సృష్టించిన జో రూట్ -
ఇంగ్లండ్ జట్టుకు ఘోర పరాభవం.. 19 ఏళ్ల తర్వాత తొలి సారిగా!
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో ప్రోటీస్ జయభేరి మోగించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోర్ 289/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ప్రోటీస్‌కు 161 పరుగల లీడ్ లభించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో సారెల్ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్ (47), కేశవ్ మహరాజ్ (41) పరుగులతో రాణించారు. అనంతరం 161 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 149 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక అంతకుముందు రబడా ఐదు వికెట్లతో చేలరేగడంతో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే కుప్పకూలింది. కాగా లార్డ్స్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం 19 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి . అంతకుముందు 2003లో కూడా దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. 🚨 RESULT | SOUTH AFRICA WIN BY AN INNINGS AND 12 RUNS An exceptional performance from start to finish by the entire team‼️ The bowlers sealing the victory by skittling England for 149 in the second innings to take a 1-0 lead in the 3-match series 👌#ENGvSA #BePartOfIt pic.twitter.com/WJd1eJ8P86 — Cricket South Africa (@OfficialCSA) August 19, 2022 చదవండి:ENG-W vs IND-W: ఇంగ్లండ్ కెప్టెన్‌కు సర్జరీ.. భారత్‌తో సిరీస్‌కు దూరం! -
పాపం ప్రోటీస్ కెప్టెన్.. దురదృష్టం వెంటాడితే ఇలాగే ఉంటుంది!
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైన ప్రోటిస్.. 161 పరుగుల లీడ్ సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ 93 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అంతకుముందు దక్షిణాఫ్రికా బౌలర్లు చేలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 165 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. 47 పరుగులతో నిలకడగా ఆడుతున్న ఎల్గర్‌ను లైన్ లంగ్త్ బాల్‌తో జేమ్స్ అండర్సన్ బోల్తా కొట్టించాడు. ప్రోటిస్ ఇన్నింగ్స్ 23 ఓవర్లో జేమ్స్ అండర్సన్ వేసిన బంతిని ఎల్గర్ లెగ్ సైడ్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి నేరుగా తన థై ప్యాడ్‌కు తగిలి వికెట్ల వైపు దూసుకెళ్లింది. ఎల్గర్ బంతిని ఆపే ప్రయ్నతం చేసినా అప్పటికే అది వికెట్లను గీరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు దురదృష్టమంటే ఎల్గర్దే అంటూ కామెంట్లు చేస్తున్నారు. A much-needed wicket! 💪 Live clips: https://t.co/2nFwGblL1E 🏴 #ENGvSA 🇿🇦 | #RedforRuth pic.twitter.com/Y4LqxanBX1 — England Cricket (@englandcricket) August 18, 2022 చదవండి: Asia Cup 2022 Ind Vs Pak: ‘భారత్‌తో మ్యాచ్‌లో కచ్చితంగా పాకిస్తాన్‌దే విజయం! ఎందుకంటే.. మాకు’! -
'వాళ్లిద్దరికే వికెట్లు పడుతున్నాయి.. నీ బాధ నాకు అర్థమైంది'
కొత్త కెప్టెన్.. కొత్త కోచ్ రావడంతో ఇంగ్లండ్ దశ మారినట్లుంది. క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో కివీస్ జట్టు కకావికలమైంది. ఇంగ్లీష్ బౌలర్ల దాటికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే ఆలౌటైంది. రీఎంట్రీ ఇచ్చిన అండర్సన్.. డెబ్యూ టెస్టు ఆడుతున్న మాథ్యూ పాట్స్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత కివీస్ బౌలర్లు కూడా తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా చెలరేగిపోయారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఈ సంగతి పక్కనబెడితే.. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇచ్చిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''డెవన్ కాన్వే.. నీ బాధ నాకు అర్థమయింది..'' అంటూ కాన్వే ఫోటో కాకుండా బ్రాడ్ ఫోటోను పెట్టాడు. కాన్వేకు బదులుగా బ్రాడ్ ఫోటో పెట్టడం వెనుక ఒక చిన్న కథ ఉంది. మ్యాచ్‌లో అండర్సన్, బ్రాడ్లు రీఎంట్రీ ఇచ్చారు. రొటేషన్‌లో భాగంగా విండీస్‌తో సిరీస్‌కు వీరిద్దరిని దూరంగా పెట్టారు. ఇక కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇద్దరికి అవకాశం వచ్చింది. అండర్సన్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. 4 వికెట్లు తీసి కివీస్ ఆలౌట్ కావడంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి తోడుగా డెబ్యూ బౌలర్ మాథ్యూ పాట్స్ కూడా నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు. ఇద్దరే చెరో నాలుగు వికెట్లు తీయడంతో బ్రాడ్‌కు ఒక్క వికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం కలిగింది. కానీ డెవన్ కాన్వే రూపంలో బ్రాడ్‌కు అదృష్టం తగిలింది. ఆఫ్‌స్టంప్‌కు వైడ్ రూపంలో వెళ్తున్న బంతిని అనవసరంగా గెలుకున్న కాన్వే వికెట్ సమర్పించుకున్నాడు. అలా ఎట్టకేలకు అండర్సన్, మాథ్యూ పాట్స్ల మధ్య బ్రాడ్ వికెట్ దక్కించకున్నాడు. ఇది పసిగట్టిన వార్నర్ కాస్త తెలివిని ప్రదర్శిస్తూ కాన్వేపై జాలి చూపిస్తూనే.. ఇన్‌డైరెక్ట్‌గా బ్రాడ్‌కు మెసేజ్ పంపాడు. ''ఇన్నింగ్స్‌లో వాళ్లిద్దరే వికెట్లన్నీ పడగొట్టారు.. నీకు దక్కుతుందో లేదో అని భయపడ్డా.. మొత్తానికి దక్కించుకున్నావు.. నీ బాధ నాకు అర్థమయింది'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా! -
Ind Vs Sa: వారెవ్వా.. వికెట్‌కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ..
Ind Vs Sa 2nd Test: Shardul Thakur 5 Wicket Haul Wonders At Wanderers: గత ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ టెస్టు... తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 186/6తో కష్టాల్లో పడిన స్థితిలో శార్దుల్ ఠాకూర్ కీలక అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు. శార్దుల్, వాషింగ్టన్ సుందర్ 123 పరుగుల భాగస్వామ్యం చివర్లో భారత్ గెలుపునకు కీలకంగా మారింది. ఆ తర్వాత ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై మెరుపు బ్యాటింగ్‌తో రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు (57, 60) జట్టు విజయానికి కారణంగా నిలిచాయి. అయితే బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న శార్దుల్ నుంచి తొలి ఐదు టెస్టుల్లో సరైన బౌలింగ్ ప్రదర్శన ఇంకా రాలేదని భావిస్తుండగా తనేంటో అతను వాండరర్స్‌లో చూపించాడు. మొదటి స్పెల్‌లో 14 పరుగుల వ్యవధిలో 3 ప్రధాన వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను దెబ్బ కొట్టిన అతను, ప్రమాదకరంగా మారుతున్న నాలుగో వికెట్ భాగస్వామ్యాన్ని విడదీసి మ్యాచ్‌ను మళ్లీ భారత్ వైపు తిప్పాడు. అదే జోరులో తర్వాతా మరో మూడు వికెట్లు శార్దుల్ ఖాతాలో చేరాయి. వికెట్‌కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ అనూహ్యంగా అతను వికెట్లు పడగొట్టడం, మ్యాచ్‌లను మలుపు తిప్పిన క్షణాల కారణంగా సహచరులు ‘లార్డ్’ అంటూ అతనికి ముద్దు పేరు పెట్టారు. స్వల్ప కెరీర్లోనే శార్దుల్‌కు భిన్నమైన అనుభవాలు ఉన్నాయి. అప్పుడు తొలి టెస్టులో 10 బంతులు వేయగానే.. ఆరేళ్ల పాటు ముంబై తరఫున ప్రధాన పేసర్‌గా శార్దుల్ రాణించాడు. అయితే హైదరాబాద్‌లో ఆడిన తన తొలి టెస్టులో 10 బంతులు వేయగానే గాయం కారణంగా తప్పుకోవాల్సి రాగా, రెండేళ్ల తర్వాత గానీ మరో టెస్టు ఆడే అవకాశం రాలేదు. భారత జట్టు తరఫున తొలి వన్డే ఆడినప్పుడు సచిన్ జెర్సీ నంబర్ ‘10’ వేసుకొని బరిలోకి దిగినప్పుడు ‘అంత మొనగాడివా’ అంటూ భారత క్రికెట్ అభిమానులే తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తే బిత్తరపోయి వెంటనే నంబర్ మార్చుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్ టీమ్ పంజాబ్ ఇక నీ అవసరం లేదంటూ లీగ్ మధ్యలో ఇంటికి పంపిస్తే బెదరకుండా ఫ్రాంచైజీపై బహిరంగ విమర్శలు చేసి మళ్లీ రంజీ ట్రోఫీకి వెళ్లి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. పట్టుదలతో ప్రతికూలతలను అధిగమించి జట్టులో రెగ్యులర్‌గా మారాడు. తాజా ప్రదర్శన బౌలర్‌గా శార్దుల్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఇదే ఉత్సాహంతో మున్ముందు మరిన్ని గొప్ప ప్రదర్శనలు చేయాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ శార్దూల్! చదవండి: Rassie van der Dussen Dismissal: శార్దూల్ బౌలింగ్‌లో ప్రొటిస్ ఆటగాడు అవుట్.. వివాదం! -
కోహ్లి, రూట్ కొట్టుకున్నంత పని చేశారట..!
లీడ్స్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మూడో టెస్ట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఓ సంచలనాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది. దీని ప్రభావం మూడో టెస్ట్ మ్యాచ్‌పై పడే అవకాశాలు లేకపోలేదు. ఈ అంశం ఇరు జట్ల క్రికెటర్లు, కెప్టెన్ల ఆటతీరు, వారి వ్యూహాలను ప్రభావితం చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ కోహ్లి, ఇంగ్లండ్ సారధి రూట్ మధ్య వాడివేడి వాగ్వాదం నడిచినట్లు తెలుస్తోంది. లార్డ్స్ పెవిలియన్ లాంగ్ రూమ్ వేదికగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ వాగ్వాదంలో ఇరు జట్ల ఆటగాళ్లు గ్రూపులుగా విడిపోయి వ్యక్తిగత దాడుల వరకూ వెళ్లినట్లు బ్రిటిష్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. కోహ్లి, రూట్ అయితే ఏకంగా బాహాబాహికి దిగినట్లు సమాచారం. రెండో టెస్ట్ మూడో రోజు రూట్ భారీ శతకం సాధించిన అనంతరం ఈ ఘర్షణకు బీజం పడినట్లు తెలుస్తోంది. అప్పుడు 11వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన అండర్సన్‌ను టార్గెట్‌గా చేసుకుని బుమ్రా వరుసగా షార్ట్ పిచ్ బంతులను సంధించిన విషయం తెలిసిందే. బుమ్రా గంటకు 90 మైళ్ల వేగంతో బంతులు సంధించడంతో ఆండర్సన్ గాయలపాలయ్యాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ఆండర్సన్.. ఔటైన అనంతరం బుమ్రాను దూషించడంతో ఇరు జట్ల మధ్య చిన్నపాటి యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి మ్యాచ్ పూర్తయ్యేవరకూ ఇరు జట్ల మధ్య ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. కాగా, ఈ మ్యాచ్ టీమిండియా 151 పరుగుల తేడాతో ఆతిధ్య జట్టును మట్టికరిపించిన సంగతి తెలిసిందే. చదవండి: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. అశ్విన్‌కు మరోసారి నిరాశే -
ఇంగ్లండ్ ఆటగాళ్లు అతి చేస్తుంటే కోచ్ ఏం చేస్తున్నాడు..?
లండన్: లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా పేసర్ బుమ్రాను టార్గెట్ చేస్తూ ఇంగ్లండ్ పేసర్లు అతిగా(వరుసగా బౌన్సర్లు సంధించడాన్ని) ప్రవర్తించడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తప్పుబట్టాడు. ఈ విషయంలో క్రికెట్ విలువలకు తూట్లు పొడిచిన ఇంగ్లండ్ కెప్టెన్ రూట్‌ను ఆ జట్టు కోచ్ సిల్వర్ వుడ్ మందలించకపోవడంపై మండిపడ్డాడు. మైదానంలో కెప్టెన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అడ్డుకోవాల్సిన బాధ్యత కోచ్‌పై ఉంటుందని పేర్కొన్నాడు. డ్రింక్స్ బ్రేక్‌లో కోచ్ ఎవరినైనా మైదానంలోకి పంపి బౌన్సర్లు వేయకుండా అడ్డుకొని ఉండాల్సిందని తెలిపాడు. తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకోలేకపోతే, నాటి కోచ్ డంకన్ ఫ్లెచర్ ఇలాగే సందేశాలు పంపేవాడని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ ఓటమికి కోచ్ సిల్వర్‌వుడ్ బాధ్యత లేమి మరో కారణమని ఆరోపించాడు. ఏదిఏమైనా బుమ్రాను టార్గెట్ చేసి మ్యాచ్‌ను గాలికొదిలేసిన రూట్ సేన తగిన మూల్యమే చెల్లించుకుందన్నాడు. ఫేస్బుక్ వేదికగా ఓ పోస్ట్ చేసిన వాన్.. బుమ్రా విషయంలో ఇంగ్లండ్ అతి ప్రవర్తనపై విమర్శలు గుప్పించాడు. ఐదో రోజు ఆటలో లంచ్ బ్రేక్‌కు ముందు 20 నిమిషాల ఆటనే(బుమ్రాను టార్గెట్ చేయడం) ఇంగ్లండ్ కొంపముంచిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాన్.. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్ ఇలా చేయడం నేనెప్పుడూ చూడలేదని అన్నాడు. దీన్ని ఓ పనికిమాలిన చర్యగా అభివర్ణించిన ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.. కోచ్ సహా ఇంగ్లండ్ బృందంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సరైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాడని ప్రశంశించిన వాన్.. భారత్ బృందాన్ని ఆకాశానికెత్తాడు. కాగా, లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా 151 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసి చిరస్మరణీయ విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. ఈనెల 25న లీడ్స్ వేదికగా ఇంగ్లండ్ ఢీకొట్టనుంది. చదవండి: మ్యాచ్ మధ్యలో ఆ టాప్ టెన్నిస్ స్టార్ ఏం చేశాడో చూడండి.. -
Anderson-Bumrah: అతనే అండర్సన్‌పైకి బుమ్రాను ఉసిగొల్పి ఉంటాడు..
లండన్: లార్డ్స్ టెస్ట్‌లో అండర్సన్, బుమ్రాల మధ్య జరిగిన ఆసక్తికర ఎపిసోడ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో బుమ్రా పాత్ర నామమాత్రమేనని, అతను చాలా అమాయకుడని, అసలు ఈ వివాదానికి తెరలేపింది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినేనని మంజ్రేకర్ ఆరోపించాడు. ఇంగ్లండ్ పేసర్ అండర్సన్‌ను రెచ్చగొట్టాలన్నది కోహ్లి ప్రణాళికలో భాగం అయ్యుండొచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థి జట్టులో ప్రధాన ఆటగాడిని కవ్వించాలన్నది కోహ్లి ఉద్దేశం అయ్యుండొచ్చని, అందులో భాగంగానే అండర్సన్‌పైకి బుమ్రాను ఉసిగొల్పి ఉంటాడని పేర్కొన్నాడు. According to few reports, Anderson asked Bumrah to bowl slow during this (watch video) famous 15-minute long over 😂 What we heard via stump mic- Bumrah to Buttler: I wasn't the one who asked to bowl slow. This means we're in for some aggressive cricket.#ENGvsIND pic.twitter.com/8F4TaKDRUK — Rushil Patale (@rushilpatale) August 18, 2021 లార్డ్స్ టెస్ట్‌లో అండర్సన్, బుమ్రాల ఎపిసోడ్‌పై మంజ్రేకర్ స్పందిస్తూ.. అండర్సన్‌కు బుమ్రా 90 మైళ్ల వేగంతో బంతులు వేశాడని.. పుల్ లెంగ్త్, షార్ట్ పిచ్ బంతులతో అతని దేహాన్ని టర్గెట్ చేశాడని, అప్పటివరకు 80-85 మైళ్ల వేగంతో బంతులు సంధించిన భారత పేసు గుర్రం ఒక్కసారిగా వేగం పెంచాడని పేర్కొన్నాడు. సాధారణంగా ఇది బుమ్రా స్వభావం కాదని, అతడు వేగంగా బంతులేస్తూ వికెట్లకు గురిపెడతాడని అన్నాడు. షార్ట్ పిచ్ బంతులు వేయాలన్నది బహుశా టీమిండియా కెప్టెన్ ప్రణాళిక అయ్యుంటుందని, దానిని బుమ్రా అమలు చేశాడని వ్యాఖ్యానించాడు. కాగా, లార్డ్స్ టెస్టులో భారత్, ఇంగ్లండ్ జట్ల ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకున్న సంగతి తెలిసిందే. మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన జేమ్స్ అండర్సన్‌కు బుమ్రా షార్ట్ పిచ్ బంతులు వేయడంతో వివాదం మొదలైంది. కొన్ని బంతులు దేహానికి తగలడంతో అండర్సన్ ఆవేశపడ్డాడు. అతడికి సారీ చెబుదామని వెళ్లిన బుమ్రాను తోసేసి బూతులు తిట్టాడు. ఇది చీటింగ్ అని, ఉద్దేశపూర్వకంగా బంతితో భౌతిక దాడికి దిగావని ఆరోపించాడు. ఆ తర్వాతి రోజు బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రాకు ఇంగ్లండ్ పేసర్లు కూడా అదే తరహాలో షార్ట్ పిచ్ బంతులను విసిరి గాయపర్చాలని భావించారు. కానీ అది కాస్తా బెడిసికొట్టింది. బుమ్రా, షమీ జోడీ తొమ్మిదో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్లు కూడా చెలరేగడంతో లార్డ్స్ టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో గెలుపొంది.. ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య లీడ్స్ వేదికగా మూడో టెస్ట్ ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: చెన్నై జట్టులో 'జోష్'.. మరింత పదునెక్కిన సీఎస్కే పేస్ దళం -
సిరాజ్ సెలబ్రేషన్స్ వైరల్; హైదరాబాద్‌లో భారీ కటౌట్
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌పై లార్డ్స్ టెస్టులో టీమిండియా సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ విజయంలో మహ్మద్ సిరాజ్ పాత్ర మరువలేనిది. రెండు ఇన్నింగ్స్‌లు(4/94, 4/32) కలిపి మొత్తంగా 8 వికెట్లతో సిరాజ్ దుమ్మురేపాడు. అంతేకాదు సిరాజ్ సెలబ్రేషన్స్ కాస్త కొత్తగా కనిపించింది. వికెట్ తీసిన ప్రతీసారి సిరాజ్ తన నోటిపై వేలును అడ్డం పెట్టి ఏం మాట్లాడొద్దు అన్నట్లుగా సైగలు చేస్తూ వినూత్నరీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. అతని చర్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా సిరాజ్ చర్యలకు ఫిదా అయిన హైదరాబాదీ ఫ్యాన్స్ సినిమా హీరోల తరహాలో అతనికి భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. బ్లూకలర్ టీషర్ట్ వేసుకున్న సిరాజ్ తన నోటిపై వేలును అడ్డంగా పెట్టిన కటౌట్‌ను ఏర్పాటు చేశారు. '' హైదరాబాద్ కా షాన్.. సిరాజ్ కంగ్రాట్స్.. సిరాజ్ ఈజ్ సూపర్ స్టార్..'' అంటూ క్యాప్షన్ జత చేశారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు లీడ్స్ వేదికగా ఆగస్టు 25 నుంచి మొదలుకానుంది. చదవండి: అందుకే సిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇవ్వలేదట! Siraj is a Superstar, Miyan getting all the love from the cricket fans. pic.twitter.com/aKG9l00181 — Johns. (@CricCrazyJohns) August 19, 2021 -
బుమ్రా నువ్వు చీట్ చేశావు.. ఇంత ఫాస్ట్ బౌలింగ్ ఏంటి..?
లండన్: ఆతిధ్య ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత పేసు గుర్రం బుమ్రా, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ ఆండర్సన్‌ల మధ్య జరిగిన మాటల యుద్ధం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచి, ఆతర్వాత పలు వివాదాలకు కూడా దారి తీసింది. అయితే, వారిద్దరి మధ్య గొడవ ఎలా మొదలైందన్న విషయాన్ని భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీధర్ మాట్లాడుతూ.. లార్డ్స్ టెస్ట్ మూడో రోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా బుమ్రా ప్రమాదక వేగంతో బౌలింగ్ చేశాడని, దీంతో బెంబేలెత్తిపోయిన ఆండర్సన్.. బుమ్రా నువ్వు చీటింగ్ చేస్తున్నావు.. ఎప్పుడూ లేనిది ఇంత ఫాస్ట్ బౌలింగ్ ఏంటని ప్రశ్నించాడని, అక్కడి నుంచే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైందని అసలు విషయాన్ని రివీల్ చేశాడు. బుమ్రా కెరీర్ ఆరంభం నుంచి 80 నుంచి 85 మైళ్ల వేగంతో బౌలింగ్ చేశాడని, అయితే ఆ మ్యాచ్‌లో ఆండర్సన్‌కు బౌలింగ్ చేసేటప్పుడు బుమ్రా ఏకంగా 90 మైళ్ల వేగంతో బంతులను సంధించడంతో ఆండర్సన్ దడుసుకున్నాడని శ్రీధర్ చెప్పుకొచ్చాడు. కాగా, ఆ మ్యాచ్‌లో బుమ్రా భీకరమైన వేగంతో సంధించిన బంతుల ధాటికి ఆండర్సన్ పలు మార్లు గాయపడ్డాడు. ఆతర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఆండర్సన్ కూడా బుమ్రాను భౌతికంగా టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేసినప్పటికీ అతని పాచిక పారలేదు. ఫలితంగా షమీ సహకారంతో బుమ్రా 9వ వికెట్‌కు 89 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. చదవండి: అఫ్గాన్లు ప్రపంచకప్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. -
అదిరిపోయే ఫోటో షేర్ చేసిన బుమ్రా
లండన్: ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజన గణేషన్‌తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలో బుమ్రా, సంజనాలు ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా తాజాగా జస్ప్రీత్ బుమ్రా సోషల్ మీడియా వేదికగా తన భార్య సంజనా గణేశన్‌తో దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఆ ఫోటోలో ఇద్దరూ ఆనందంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరోవైపు ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన లార్డ్స్ టెస్టులో టీమిండియా విజయంలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. బుమ్రా అటు బౌలింగ్ లోనూ... ఇటు బ్యాటింగ్ లోనూ అదరగొట్టాడు. లార్డ్స్ లో జరిగిన ఈ రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంతితో మాత్రమే కాకుండా, మహమ్మద్ షమీతో కలిసి రాణించిన బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ జోడీ 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. చదవండి:T20 World Cup: అఫ్గాన్లు ప్రపంచకప్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. View this post on Instagram A post shared by jasprit bumrah (@jaspritb1) -
అందుకే సిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇవ్వలేదట!
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన లార్ట్స్ టెస్ట్‌లో టీమిండియా విజయంలో మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి అదరగొట్టిన సిరాజ్... రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో వికెట్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. మొయిన్ ఆలీ, జోస్ బట్లర్ కలిసి 16 ఓవర్లకు పైగా వికెట్లకు అడ్డుగా నిలబడిన సమయంలో సిరాజ్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. మొయిన్ ఆలీని అవుట్ చేసి భారత శిబిరంలో ఉత్సాహం నింపిన ఈ పేసర్ తర్వాత సామ్ కరాన్‌ను డకౌట్ చేశాడు. అటు తర్వాత జోస్ బట్లర్, జేమ్స్ అండర్సన్లను పెవిలియన్ పంపి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అయితే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ దక్కుతుందని అంతా భావించారు. కానీ దానికి భిన్నంగా జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే సిరాజ్‌ను కాదని రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడంపై భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీం స్పందించాడు. సిరాజ్ ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సిందని, కానీ సిరాజ్ కంటే రాహుల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడని తెలిపాడు. ప్రతికూల పరిస్థితుల్లో రాహుల్ అద్భుత బ్యాటింగ్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడని కరీం అన్నాడు. ఆ కారణంగానే రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కిందని చెప్పుకొచ్చాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 350 దాటడంలో రాహుల్ కీలకంగా వ్యవహరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 250 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్‌తో రాహుల్ 129 పరుగులు చేశాడు. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చదవండి: VVS Laxman-Mohammed Siraj: సిరాజ్ చిన్ననాటి ఫోటో షేర్ చేసిన వీవీఎస్ లక్ష్మణ్ -
Virat Kohli: 'కోహ్లి నోరు తెరిస్తే బూతులే'
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి కోపం ఎక్కువనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాధ వచ్చినా.. సంతోషం కలిగినా కోహ్లిని ఆపడం ఎవరి వల్ల కాదు. తాజాగా లార్డ్స్ టెస్టు విజయం తర్వాత కోహ్లి చేసిన సంబరాలు సోషల్ మీడియాలోనూ హల్చల్ అయ్యాయి. అయితే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు నిక్ కాంప్టన్ కోహ్లిని తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు అతని మెడకే చుట్టుకునేలా చేశాయి. ''కోహ్లి నోరు తెరిస్తే బూతులే వస్తాయంటూ'' ట్విటర్ వేదికగా కాంప్టన్ తెలిపాడు. చదవండి: 'పిచ్ నీ సొంతం కాదు.. పరిగెత్తడానికి' అండర్సన్‌కు కోహ్లి వార్నింగ్ ''కోహ్లి నోరు తెరిస్తే అతని నోటి నుంచి బూతులే ఎక్కువగా వస్తాయి. 2012లో కోహ్లి నన్ను వేలెత్తి చూపుతూ చేసిన దూషణను నేను మర్చిపోలేదు. ఆ సమయంలో కోహ్లి అలా చేసి తనను తాను తక్కువ చేసుకున్నాడు. కోహ్లి చర్యలతో పోలిస్తే.. జో రూట్, సచిన్ టెండూల్కర్, కేన్ విలియమ్సన్ ఎంత హుందాగా ఉంటారో తెలుస్తోంది. అంటూ నిక్ కాంప్టన్ ట్వీట్ చేశాడు. కాంప్టన్ వ్యాఖ్యలపై కోహ్లి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో దెబ్బకు ట్వీట్‌ను తొలగించాల్సి వచ్చింది. నిక్ కాంప్టన్ ట్వీట్ తొలగించకముందు ''నిక్ కాంప్టన్.. నీకు సిగ్గుండాలి ఇలా మాట్లాడడానికి.. అండర్సన్ అశ్విన్‌ను అవమానించినప్పుడు.. అలాగే వీడ్కోలు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫిలాండర్‌ను బట్లర్ దూషించినప్పుడు నువ్వెక్కడున్నావు..'' .. '' లార్డ్స్ టెస్టులో బుమ్రా ఒక ఓవర్ అండర్సన్‌కు ప్రమాదకరంగా వేసిన మాట నిజమే.. కానీ అది మనసులో పెట్టుకొని బుమ్రా బ్యాటింగ్ దిగినప్పుడు అతన్ని టార్గెట్ చేయడం కరెక్టేనా..''.. '' బుమ్రాతో మీరు ప్రవర్తించిన తీరుపై మీ జట్టు మాజీ ఆటగాళ్లతో పాటు షేన్ వార్న్ లాంటి వారు కూడా తప్పుబట్టారు. కోహ్లి మ్యాచ్ గెలిచామన్న సంతోషంలో అలా చేశాడే తప్ప అతని మనుసులో ఏం లేదు.. అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఎవరు చెప్పినా వినలేదు.. అదే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ Where were you when - Anderson Insulted Ashwin Buttler insulted Philander in his farewell match. It was England who started with mouth against Bumrah when he came to bat... pic.twitter.com/I55vWshFIG — Abhinav (@Abhicricket18) August 18, 2021 What's Buttler saying to Philander Here 🤔 pic.twitter.com/YxKtrL5JA6 — Umakant (@Umakant_27) August 18, 2021 -
మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్లో టెంట్ వేసుకొని నిద్రపోయాడు
లండన్: ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ అభిమాని జార్వో చేసిన పని అందరికి గుర్తుండే ఉంటుంది. ఆట మూడోరోజు లంచ్ విరామం అనంతరం భారత ఆటగాళ్లు మైదానంలోకి వస్తుండగా జార్వో భారత జెర్సీ ధరించి వచ్చాడు. మొదట అతన్ని ఎవరు గుర్తుపట్టకపోయినా కొద్దిసేపటి తర్వాత సెక్యూరిటీ వచ్చి అతన్ని తీసుకెళ్లారు. ఈ సమయంలో..'' భారత్‌కు ఆడిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిని తానేనంటూ గట్టిగా అరుస్తూ చెప్పడం ట్రెండింగ్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. అయితే జార్వోకు ఇది కొత్త కాదట.. ఇంతకముందు జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఇలాంటివి చాలా చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా జార్వో చేసిన మరోపని తాజాగా వెలుగుచూసింది. అది ఎప్పుడు జరిగిందన్నది తెలియకపోయినప్పటికి.. వీడియో ప్రకారం అది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ అని తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. బౌలర్ బంతి విసిరిన తర్వాత జార్వో బౌండరీ లైన్‌ను క్రాస్ చేసి మైదానంలోకి వచ్చాడు. అనంతరం తనతో పాటు తెచ్చుకున్న టెంట్‌ను గ్రౌండ్లో వేసి లోపలికి వెళ్లి నిద్రపోయాడు. ఇదంతా గమనించిన ఆటగాళ్లు నవ్వాపుకోలేకపోయారు. కొన్ని సెకన్ల తర్వాత సెక్యూరిటీ సిబ్బంది టెంట్‌ను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. సరిగ్గా అప్పుడే జార్వో అందులోకి బయటికి వచ్చి తాను అనుకున్నది సాధించినట్టుగా చేతులెత్తి విక్టరీ సింబల్ చూపించాడు. ఆ తర్వాత జార్వోను అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక లార్డ్స్ టెస్టులో 151 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్ టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. అయితే మూడో టెస్టుకు 8 రోజుల గ్యాప్ వచ్చింది. కాగా ఆగస్టు 25 నుంచి లీడ్స్ వేదికగా ఇరుజట్ల మధ్య మూడో టెస్టు జరగనుంది. చదవండి: నేను భారత ఆటగాడినే.. లార్డ్స్‌లో అజ్ఞాత వ్యక్తి హల్చల్ -
లార్డ్స్ టెస్టు విజయం.. అనుష్కతో కోహ్లి లంచ్
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అద్భుత విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సంతోషంలో మునిగి తేలుతున్నాడు. మ్యాచ్ గెలిచినప్పటి నుంచి కొనసాగిస్తున్న సంబరాలు.. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా భార్య అనుష్క శర్మతో కలిసి డేట్‌కు వెళ్లిన విరాట్ ఫోటోలు వైరల్ అయ్యాయి. లండన్‌లోని టెండ్రిల్ రెస్టారెంట్‌కు వెళ్లిన విరుష్కలు అక్కడ తమకు ఇష్టమైన ఆహారాన్ని లాగించారు. అనంతం తాము నచ్చే విధంగా మీల్స్ తయారు చేసినందుకు కృతజ్ఞతగా చెఫ్‌తో కలిసి ఒక ఫోటో దిగారు. ఈ విషయాన్ని టెండ్రిల్ రెస్టారెంట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈరోజు మా రెస్టారెంట్‌కు కోహ్లి, అనుష్కలు లంచ్‌కు వచ్చారు. వారికి నచ్చే విధంగా మీల్స్ తయారు చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. మేం చాలా ఎంజాయ్ చేశాం అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక కోహ్లి తొలి రెండు టెస్టుల్లో బ్యాట్స్‌మన్‌గా విఫలమైనప్పటికీ కెప్టెన్‌గా సక్సెస్ అయ్యాడు. రెండు టెస్టులు కలిపి కోహ్లి 0, 42, 20 పరుగులు చేశాడు. మూడో టెస్టుకు టీమిండియాకు వారం రోజులు గ్యాప్ ఉండడంతో క్రికెటర్లు ఉన్న సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆగస్టు 25 నుంచి లీడ్స్ వేదికగా మూడో టెస్టు జరగనుంది. View this post on Instagram A post shared by A (mostly) vegan kitchen (@tendril_kitchen) 🇮🇳's wagging tail, 10 English wickets and the special running celebrations sealed the deal for India at Lord's 🙌🏽 Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #ENGvIND #ENGvsIND pic.twitter.com/ECZY9OVRyu — Sony Sports (@SonySportsIndia) August 16, 2021 -
మూడో టెస్టుకు మలాన్
లండన్: లార్డ్స్ టెస్టులో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ మూడో టెస్టు కోసం తమ జట్టులో కొన్ని మార్పులు చేసింది. ఘోరంగా విఫలమవుతున్న ఓపెనర్ సిబ్లీని 15 మంది సభ్యుల జట్టునుంచి తప్పించి డేవిడ్ మలాన్‌ను ఎంపిక చేసింది. సరిగ్గా మూడేళ్ల క్రితం తన చివరి టెస్టు ఆడిన మలాన్... తాజా సీజన్లో ఒకే ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడి 199 పరుగులు చేశాడు. అయితే ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నంబర్‌వన్ స్థానంలో ఉన్న మలాన్ దూకుడైన బ్యాటింగ్ శైలి తమ జట్టుకు ఉపయోగపడగలదని భావిస్తున్న ఇంగ్లండ్ అతడిని టెస్టులోకి ఎంచుకునే సాహసం చేసింది. ఆగస్టు 25నుంచి లీడ్స్‌తో మూడో టెస్టు జరుగుతుంది. రెండో స్థానానికి రూట్ దుబాయ్: భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (893 రేటింగ్ పాయింట్లు) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న రూట్... రెండు, మూడు స్థానాల్లో ఉన్న స్టీవ్ స్మిత్ (891), లబ్‌షేన్ (878)లను వెనక్కి తోసి అగ్ర స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన(901) టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. టాప్–10లో భారత్‌నుంచి కోహ్లి, రోహిత్, పంత్ వరుసగా 5, 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ (848 పాయింట్లు) తన రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా, జస్ప్రీత్ బుమ్రా 9నుంచి 10వ స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా కూడా ఒక స్థానం దిగజారి 3వ ర్యాంక్‌కు చేరుకోగా, అశ్విన్ తన 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. -
తగ్గేదేలే.. టీమిండియాకు ధీటుగా బదులిస్తాం: ఇంగ్లండ్ కోచ్
లండన్: లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇంగ్లండ్ కోచ్ సిల్వర్‌వుడ్ తెలిపాడు. చివరిరోజు ఆటలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు ఎక్కువయ్యాయని, అయితే వీటిని మ్యాచ్ గెలిచేందుకు ఉపయోగించుకోవడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నాడు. ఆండర్సన్‌ను రెచ్చగొడుతూ ముందుగా టీమిండియా ఆటగాళ్లే మాటల యుద్ధానికి తెరలేపారని, అందుకు తాము కూడా తగు రీతిలో బదులు ఇవ్వాల్సి వచ్చిందని సొంత జట్టు ఆటగాళ్లను వెనకేసుకొచ్చాడు. రెండో టెస్టులో తాము గెలవాల్సింది, కానీ.. బుమ్రా-షమీ ద్వయం మ్యాచ్‌ని మలుపు తిప్పిందని వెల్లడించాడు. టీమిండియా ఓటమి తప్పించుకునే ఉద్దేశంతోనే చివరి రోజు ఆటను మొదలుపెట్టిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ ఫలితంతో కాస్త నిరాశ చెందినప్పటికీ.. టెస్టు క్రికెట్లోని అసలైన మజాను ఆస్వాదించామని తెలిపాడు. ఏదిఏమైనా ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడాల్సిన అవసరం లేదని, మూడో టెస్ట్‌లో టీమిండియాపై కచ్చితంగా పైచేయి సాధించి లెక్క సరిచేస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. కాగా, సోమవారం ముగిసిన లార్డ్స్ టెస్ట్‌లో కోహ్లీసేన 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ హెడింగ్లే వేదికగా ఆగస్ట్ 25న ప్రారంభంకానుంది. చదవండి: నాటి టీమిండియా క్రికెటర్.. నేడు ఖగోళ శాస్త్రవేత్త -
మహ్మద్ సిరాజ్ చిన్ననాటి ఫోటో షేర్ చేసిన వీవీఎస్ లక్ష్మణ్
సాక్షి,హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్ చిన్ననాటి ఫోటోను భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ షేర్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో సిరాజ్ ప్రదర్శను చూసి గర్వపడుతున్నానని లక్ష్మణ్ అన్నాడు. సిరాజ్ క్రీడా ప్రయాణం స్ఫూర్తిదాయకంగా ఉందని.. తన కేరీర్లో మరింత రాణించాలని ఆకాక్షించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి అద్భుతమే చేసాడు సిరాజ్. మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు, రెండవ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీశాడు. దీంతో భారత్ ఇంగ్లాండ్ పై ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని సిరాజ్ ఎంతగానో మెరుగుపరుచుకున్నాడు. ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు. Met him for the first time at frmr Hyderabad great Abdul Azeem’s residence. And I feel so proud to see the rapid progress #Siraj has already made in intern’al cricket. His life is another testament of what one can achieve through hardwork & will-power.More power to you young man pic.twitter.com/MHjezzlzxz — VVS Laxman (@VVSLaxman281) August 17, 2021 -
వికెట్లను కాకుండా వ్యక్తులను టార్గెట్ చేయడమేంటి..?
లండన్: టీమిండియాతో లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న ఇంగ్లండ్ జట్టు తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది. సొంత తప్పిదంతోనే మ్యాచ్ ఓడిపోయారని బ్రిటీష్ మీడియా సహా ఆ దేశ అభిమానులు, మాజీలు దుమ్మెత్తిపోస్తున్నారు. చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ని పక్కకు పెట్టి, బుమ్రాపై ప్రతీకారానికి వెళ్లిన ఇంగ్లండ్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందని బీబీసీ ఏకి పారేసింది. ఈ ఘోర పరాభవానికి రూట్ చెత్త కెప్టెన్సీనే కారణమని, అసలు టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించడమే తప్పుడు నిర్ణయమని ధ్వజమెత్తింది. షమీ, బుమ్రాల విషయంలో ఇంగ్లీష్ బౌలర్ల అంచనా తప్పిందని, వికెట్లు తీయడానికి బదులు ఆటగాళ్లపై భౌతిక దాడికి ప్రయత్నించమే ఇంగ్లీష్ జట్టు కొంపముంచిందని బీబీసీ పేర్కొంది. ఓ పక్క స్కోరు పెరుగుతున్నా.. ఇంగ్లండ్ బౌలర్ల తీరు మారలేదని, తీరా పరిస్థితి చేతులు దాటాక ఏం చేయలేక చేతులెత్తేశారని మండిపడింది. 1980లో వెస్టిండీస్, 1990-2000లో ఆస్ట్రేలియా ఎంత బలంగా ఉన్నాయో.. ఇప్పుడు భారత్ కూడా అంతే బలంగా ఉందని ప్రముఖ ఫోర్బ్స్ వార్తా సంస్థ టీమిండియాను ఆకాశానికెత్తింది. మరోవైపు, లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు ఘోర వైఫల్యాలపై ఆ దేశ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఆటగాళ్ల కుతంత్రాలే ఇంగ్లండ్ విజయావకాశాలను దెబ్బ తీసాయని మండిపడ్డాడు. వికెట్ల మీదికి కాకుండా.. షమీ, బుమ్రాల వైపు బంతులేయడమేంటని ఆయన ఇంగ్లండ్ బౌలర్లను నిలదీశాడు. బుమ్రాని టార్గెట్ చేసి.. షమీని ఔట్ చేయడంలో నిర్లక్ష్యం వహించారని చురకలంటించాడు. కాగా, ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా-షమీ జోడీ 9వ వికెట్‌కి అజేయంగా 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో కోహ్లీ సేన.. ఇంగ్లండ్‌కు 272 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఛేదనలో టీమిండియా పేసర్ల ధాటికి రూట్ సేన 120 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (33) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా టీమిండియా 151 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. చదవండి: అక్కడ కూడా నవ్వలేదు.. ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్‌పై ప్రధాని మోదీ ఫిర్యాదు -
టాస్ గెలిచి బౌలింగ్.. రూట్ అక్కడే తప్పు చేశాడు
లార్డ్స్: చారిత్రక లార్డ్స్ టెస్టులో టీమిండియా విజయం సాధించడం తనకు సంతోషం కలిగించిందని టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్ ఎంచుకొని తప్పుచేశాడని పేర్కొన్నాడు. లార్డ్స్ టెస్టులో టీమిండియా విజయం సాధించిన అనంతరం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడాడు. ‘ఇప్పుడున్న ఇంగ్లండ్ టీమ్‌లో రూట్ తప్పితే స్థిరంగా క్రీజులో ఉండి వంద పరుగులు చేసే బ్యాట్స్‌మెన్ కనిపించడం లేదు. గతంలో అలిస్టర్ కుక్, మైకెల్ వాన్, పీటర్సన్, ఇయాన్ బెల్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో ఉండేవాళ్లు. కానీ ప్రస్తుత ఇంగ్లండ్ జట్టులో అటువంటి బ్యాట్స్మెన్లు కానరావడం లేదు. లార్డ్స్‌లో టాస్ గెలిచి కూడా రూట్ బౌలింగ్ ఎంచుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించింది.. నాకు తెలిసి రూట్ అక్కడే తప్పు చేశాడు. ఇక షమీ, బుమ్రాలు తమ బ్యాటింగ్‌తో లార్డ్స్ మైదానంలో అదరగొట్టారు. ఇక మహమ్మద్ సిరాజ్ పరిస్థితులకు తగ్గట్టు ఎలా ఆడాలో అలవరుచుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా బలవంతంగా ఉంది. రానున్న టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఇలాంటి ప్రదర్శననే నమోదు చేసి సిరీస్ గెలవాలని ఆకాక్షింస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: రూట్ ఒక్కడు ఆడితే సరిపోదు.. ఇలా అయితే కష్టం -
India Vs England: 'మాతో పెట్టుకోవద్దు'
2007 సిరీస్... నాటింగ్‌హామ్‌లో భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్. మన పేసర్ జహీర్ ఖాన్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో క్రీజ్ చుట్టూ ఇంగ్లండ్ ఆటగాళ్లు కొన్ని జెల్లీ బీన్స్ విసిరి అతడిని ఆట పట్టించేందుకు ప్రయత్నించారు. అది చూసి జహీర్‌కు బాగా కోపం వచ్చింది. ఇంగ్లండ్‌తో వాదనకు దిగిన అతను బౌలింగ్‌కు వచ్చినప్పుడు తన కసినంతా చూపించాడు. ఐదు వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చడం, భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం జరిగిపోయాయి. తాజాగా బుమ్రా ఉదంతాన్ని బట్టి చూస్తే 14 ఏళ్ల తర్వాత కూడా ఇంగ్లండ్ పాఠాలు నేర్చుకోలేదని అనిపిస్తోంది. – సాక్షి క్రీడా విభాగం లార్డ్స్ టెస్టు విజయంలో షమీ, బుమ్రా బ్యాటింగ్ ప్రదర్శన కూడా కీలక పాత్ర పోషించింది. ఏకంగా 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలిచిన వీరిద్దరు 89 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా పైచేయి సాధించడానికి కారణమయ్యారు. ఈ క్రమంలో మైదానంలో ఇంగ్లండ్ ఆటగాళ్లనుంచి వీరిద్దరు బంతులే కాదు, మాటల తూటాలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఎక్కడా తగ్గకుండా పట్టుదలగా క్రీజ్‌లో నిలబడ్డారు. షమీ తనదైన శైలిలో దూకుడుగా ఆడి ఇంగ్లండ్ బౌలర్లపై చెలరేగగా... బుమ్రా తన బ్యాటింగ్ సత్తా చూపించడంతో పాటు బౌలింగ్‌లో తన స్థాయి ఏమిటో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను రుచి చూపించాడు. నిజానికి భారత్ 8 వికెట్లు కోల్పోయిన తర్వాత మరో వికెట్ తీసే లక్ష్యంతో బౌలింగ్ చేయకుండా బుమ్రా శరీరంపైకి బంతులు ఎక్కు పెట్టి పదే పదే షార్ట్ బంతులతో ఇబ్బంది పెట్టాలని ఇంగ్లండ్ ప్రయత్నించింది. తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్‌కు ఒక ఓవర్ బుమ్రా ప్రమాదకరంగా వేసినందుకు ప్రతీకారంగా అందరూ కలిసి పాఠం చెప్పాలని భావించినట్లున్నారు. నిజానికి 164 టెస్టుల అనుభవం ఉన్న అండర్సన్‌కు ఇలాంటివి కొత్త కాదు. 2007 నాటింగ్‌హామ్‌లో టెస్టులో కూడా అతను ఆడాడు. అతనికంటే ఎక్కువగా స్పందించిన ఇతర బౌలర్లు ఈ వేడిలో బౌలింగ్‌లో గతి తప్పగా...షమీ, బుమ్రా పండగ చేసుకున్నారు. కోహ్లి దారి చూపగా... ఈ టెస్టులో భారత ఆటగాళ్ల శారీరక భాష చూస్తే ప్రతీ ఒక్కరు ఒక్కో అగ్నిగోళంగా కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రతీ క్షణం అమితోత్సాహంతో కనిపిస్తూ, తన సహచరులను ప్రేరేపిస్తున్న తీరు...వికెట్ పడినప్పుడు ప్రదర్శిస్తున్న హావభావాలు ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్లుగా క్రికెటర్లు మాటల దాడికి వెనుకాడలేదు. అండర్సన్‌తో కోహ్లి వాదన, వికెట్ తీసినప్పుడు ‘నిశ్శబ్దం’ అన్నట్లుగా నోటిపై వేలుతో సిరాజ్ సంబరాలతో మొదలైన టెస్టు బుమ్రా, బట్లర్ మాటల యుద్ధం వరకు సాగింది. ఒక దశలో ఇది శృతి మించడంతో బుమ్రా చివరకు అంపైర్‌కు కూడా ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఆ ఆగ్రహాన్నంతా బుమ్రా తర్వాత తన బౌలింగ్‌లో చూపించాడు. ‘మాలో ఒక్కడిని అంటే పది మందిని అన్నట్లే. అందుకే ఎవరిని దూషంగా అందరం మళ్లీ జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉంటాం తప్ప వెనక్కి తగ్గం’ అంటూ మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ చేసిన వ్యాఖ్య మ్యాచ్ చివరి రోజు ఎలా సాగిందో చెబుతోంది. ఆస్ట్రేలియన్లూ ఇలాగే... అడిలైడ్‌లో 36 ఆలౌట్ తర్వాత మెల్బోర్న్లో బరిలోకి దిగిన టీమిండియాను ఆసీస్ ఆటగాళ్లు మొదటి సెషన్నుంచే మాటలతో వేధించారు. అయితే రహానే నాయకత్వంలో జట్టు మరింత కసిగా ఆటను ప్రదర్శించింది. చివరకు అద్భుత విజయం సాధించి మమ్మల్ని రెచ్చగొడితే ఇలాగే ఉంటుందంటూ చూపించింది. ఇక బ్రిస్బేన్ అద్భుతం గురించి ఎంత చెప్పినా తక్కువే. సిడ్నీ టెస్టులో డ్రాకు ప్రయత్నిస్తున్న సమయంలో గాబా మైదానానికి రా చూసుకుందాం అంటూ కెప్టెన్ పైన్ సవాల్ విసిరాడు. ఇది కూడా టీమిండియా సీరియస్‌గా తీసుకుంది. అత్యద్భుత ఆట తో అనూహ్య లక్ష్యాన్ని ఛేదించి మూడు దశాబ్దాలుగా ఆసీస్ ఓటమి ఎరుగని మైదానంలో వారిని మట్టికరిపించింది. అన్నట్లు ఇటీవల ఓడిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్, న్యూజిలాం డ్ ఆటగాళ్ల మధ్య చిన్నపాటి వాదన కూడా జరగలేదు. భారత్‌ను ఎలా ఓడించాలో మాకు తెలుసన్నట్లుగా కివీస్ చాలా కూల్‌గా ఆటపై మాత్రమే దృష్టి పెట్టి ఫలితం సాధించింది! -
తక్కువ అంచనా వేశాం.. తగిన మూల్యం చెల్లించుకున్నాం: రూట్
లండన్: లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా లోయర్ ఆర్డర్‌ను తక్కువగా అంచనా వేశామని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తెలిపాడు. కెప్టెన్‌గా తాను కూడా కొన్ని పొరపాట్లు చేశానని అంగీకరించాడు. రెండో టెస్ట్‌లో తమ విజయం ఖాయమని ధీమాగా ఉన్నామని.. షమీ (70 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు)లు తమ నుంచి గెలుపును లాగేసుకున్నారని వాపోయాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. కెప్టెన్‌గా నేను కొన్ని పొరపాట్లు చేశాను. వ్యూహాత్మకంగా కొన్ని భిన్నమైన మార్పులు చేయాల్సింది. షమీ, బుమ్రాల భాగస్వామ్యం మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వారిని తక్కువ అంచనా వేసి, తగిన మూల్యం చెల్లించుకున్నామని పేర్కొన్నాడు. చదవండి: నీరజ్ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు షమీ, బుమ్రాలపై తాము ప్రయోగించిన షార్ట్ బంతుల వ్యూహం విఫలమైందని, వారి జోడి కవ్వింపులకు తాళలేక తమపై ఎదురుదాడికి దిగిందని రూట్ అంగీకరించాడు. వాస్తవానికి టీమిండియా దూకుడులో తప్పేమీ లేదని, వారు నిజాయితీగానే ఆడారని, కోహ్లీ తన సహజ శైలిలోనే ప్రవర్తించాడని పేర్కొన్నాడు. కోహ్లి సేనను ఎక్కువగా రెచ్చగొట్టడం వల్లనే వారు రాణించారని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా ఇవన్నీ ఆటలో భాగమేనని, శృతిమించనంతవరకు అన్ని బాగుంటాయని రూట్ చెప్పుకొచ్చాడు. కాగా, లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 151 పరుగుల తేడాతో ఆతిధ్య ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే. కోహ్లీసేన నిర్దేశించిన 272 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్ సేన 120 పరుగులకే ఆలౌటైంది. రూట్ (33) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. రూట్ తొలి ఇన్నింగ్స్(180 నాటౌట్)లోనూ భారీ శతకంతో రాణించిన విషయం తెలిసిందే. చదవండి: 'మీరు ఒకరి వెంటపడితే.. మేం 11 మందిమి తిరగబడతాం': కేఎల్ రాహుల్ -
'మీరు ఒకరి వెంటపడితే.. మేం 11 మందిమి తిరగబడతాం': కేఎల్ రాహుల్
లండన్: టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ ఆటగాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఒకరి వెంటపడితే.. మేం మొత్తం 11 మందిమి మీ వెంటపడతాం అంటూ గట్టిగా హెచ్చరించాడు. కవ్వింపులకు తామేమీ భయపడమని, అందుకు ఘాటుగానే బదులిస్తామన్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు టీమిండియా పేసు గర్రం బుమ్రాను లక్ష్యంగా చేసుకోవడంపై రెండో టెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడూ కూల్‌గా కనిపించే రాహుల్.. ఇంగ్లండ్ ఆటగాళ్లపై ఇలా విరుచుకుపడటం ప్రస్తుతం సోషల్ మీడియలో చర్చనీయాంశంగా మారింది. కాగా, రెండో టెస్టులో ఇంగ్లండ్, భారత్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం తార స్థాయిలో జరిగింది. మ్యాచ్‌పై భారత్ పట్టు సాధిస్తున్న తరుణంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు గొడవలకు దిగారు. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ అండర్సన్, టీమిండియా పేసర్ బుమ్రాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. ఆదివారం టీమిండియా కెప్టెన్ కోహ్లి, అండర్సన్‌ల మధ్య అగ్గి రాజుకుంది. అనంతరం ఆట చివరి రోజు ఇంగ్లండ్ ఆటగాళ్లు బుమ్రాని టార్గెట్‌గా చేసుకుని రెచ్చగొట్టారు. మార్క్ వుడ్, అండర్సన్ షార్ట్ పిచ్ బంతులతో బుమ్రాని గాయపర్చే ప్రయత్నం చేస్తూనే తమ నోటికి పని చెప్పారు. ఈ పరిణామాలన్ని దృష్టిలో పెట్టుకుని లార్డ్స్ టెస్ట్ విజయానంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. 'రెండు బలమైన జట్లు తలపడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆటగాళ్ల మధ్య యుద్ధాలే జరుగుతాయి. ఇలాంటప్పుడే ఆటగాళ్లలోని నైపుణ్యాలు బయటపడతాయి. ఈ పోరాటం గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. గెలుపు కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. అయితే, శ్రుతి మించిన కవ్వింపులకు మేమేమీ వెనుకాడం. ఓ విధంగా ఇంగ్లండ్ ఆటగాళ్ల కవ్వింపులే మా బౌలర్లలో కసి పెంచాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లు మాలో ఒకరి వెంట పడితే.. మేం మొత్తం 11 మందిమి వారి వెంట పడతాం' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా, లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్ 151 పరుగుల భారీ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన రాహుల్(248 బంతుల్లో 127; 12 ఫోర్లు, సిక్స్)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: కోహ్లి ఖాతాలో మరో ఘనత.. ఆ జాబితాలో నాలుగో స్థానానికి -
కోహ్లి ఖాతాలో మరో ఘనత.. ఆ జాబితాలో నాలుగో స్థానానికి
లండన్: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించడంతో జట్టు సారధి కోహ్లి ఖాతాలో మరో ఘనత చేరింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్ల జాబితాలో కోహ్లి నాలుగో స్థానానికి ఎగబాకాడు. కెప్టెన్‌గా కోహ్లీ 63 టెస్ట్‌ల్లో 37 విజయాలతో వెస్టిండీస్ మాజీ సారథి, దిగ్గజ ఆటగాడు క్లైవ్ లాయిడ్(36 టెస్ట్ విజయాలు)ను అధిగమించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్ 109 మ్యాచ్‌ల్లో 53 విజయాలు అందుకుని ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక స్మిత్ తరువాతి స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. పాంటింగ్ 77 మ్యాచ్‌ల్లో 48 విజయాలతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో స్టీవ్ వా(ఆస్ట్రేలియా) 57 మ్యాచ్‌ల్లో 41 విజయాలతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లి.. స్టీవ్ వా(41) మూడో స్థానంపై కన్నేశాడు. మరోవైపు, లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ గెలిచిన మూడో భారత సారథిగా కూడా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు 1986లో కపిల్ దేవ్, 2014లో ధోని మాత్రమే ఈ మైదానంలో టెస్ట్ విజయాలను అందుకున్నారు. చదవండి: 'మీరు ఒకరి వెంటపడితే.. మేం 11 మందిమి మీ వెంటపడతాం': కేఎల్ రాహుల్ లార్డ్స్ విజయంతో కోహ్లి.. సేన (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక విజయాలను అందుకున్న ఆసియా కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే, టెస్ట్‌ల్లో టాస్ ఓడిపోయిన తర్వాత మ్యాచ్ గెలవడం కోహ్లీకి ఇది ఆరోసారి. ఇంతకుముందు గంగూలీ ఐదు సార్లు, ధోని నాలుగుసార్లు ఈ ఫీట్ సాధించారు. ఇక భారత్ తరఫున అత్యధిక టెస్ట్ విజయాలు నమోదు చేసిన కెప్టెన్ల జాబితాలో కోహ్లి(37) శిఖరాగ్రానికి చేరాడు. కోహ్లి తరువాత ధోని 60 మ్యాచ్‌ల్లో 27 విజయాలతో రెండో స్థానంలో, 49 మ్యాచ్‌ల్లో 21 విజయాలతో గంగూలీ మూడో స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, చివరి రోజు ఆటలో టీమిండియా టెయిలెండర్లు షమీ(70 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) అద్భుత పోరాట పటిమ కనబర్చడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 298 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఇంగ్లండ్ గెలవాలంటే 60 ఓవర్లలో 272 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో భారత పేసు గుర్రాలు చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి, 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకొట్టిన కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: ‘ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి’.. కోహ్లి మాటను నిజం చేసిన భారత పేసు గుర్రాలు -
‘ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి’.. పేసర్లకు కోహ్లి ఉద్బోధ
లండన్: 'ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి'..ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు సహచరులతో టీమిండియా కెప్టెన్ కోహ్లి చెప్పిన మాట ఇది. అన్నట్లుగానే భారత పేసు గుర్రాలు ప్రత్యర్థిపై నిప్పులు చెరిగే బంతులతో ఎదురుదాడికి దిగి ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో వారికి రుచి చూపించారు. బుల్లెట్లలా దూసుకొచ్చే ఒక్కో బంతిని ఎదుర్కొలేక ఇంగ్లీష్ జట్టు 120 పరుగులకే కుప్పకూలడంతో కోహ్లి సేన చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఆఖరి రోజు ఆటలో మొదట బ్యాటింగ్‌లో మెరిసిన మన పేసర్లు(షమీ, బుమ్రా) తిరిగి బౌలింగ్‌తోనూ బెంబేలెత్తించారు. దీంతో లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి, 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. pic.twitter.com/VGpD8Fo3Wa — pant shirt fc (@pant_fc) August 16, 2021 కాగా, చివరి రోజు ఆటలో టీమిండియా టెయిలెండర్లు షమీ(70 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) అద్భుత పోరాట పటిమ కనబర్చడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 298 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో చివరి రెండు సెషన్లలో భారత విజయానికి 10 వికెట్ల అవసరమవ్వగా.. ఇంగ్లండ్ గెలవాలంటే 60 ఓవర్లలో 272 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మైదానంలోకి దిగేముందు కెప్టెన్ కోహ్లి జట్టు సభ్యులతో మాట్లాడాడు. తన మోటివేషనల్ స్పీచ్‌తో సహచరుల్లో స్పూర్తిని రగిల్చాడు. ఈ 60 ఓవర్లు ఇంగ్లండ్ ఆటగాళ్లకు నరకం చూపించాలనే మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అన్నట్లుగానే, టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ కేవలం ఒక్క పరుగుకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం భారత పేసర్ల దూకుడు ముందు ఇంగ్లీష్ బ్యాట్స్మెన్లు నిలదొక్కుకోలేక చేతులెత్తేశారు. ఏ దశలో ఇంగ్లండ్ ఆటగాళ్లు కుదురుకున్న పరిస్థితి కనపడలేదు. భారత పేస్ దళం క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ.. ప్రత్యర్ధి పతనాన్ని శాశించింది. ఆట ముగియడానికి మరో 9.1 ఓవర్లు మాత్రమే ఉండగా, ఇంగ్లండ్ చేతిలో 3 వికెట్లు ఉండటంతో మ్యాచ్ డ్రా అవుతుందేమోనని అందరూ భావించారు. కానీ, రాబిన్సన్ (9)ను అవుట్ చేసి బుమ్రా టీమిండియా గెలుపుకు బాటలు వేయగా.. ఒకే ఓవర్లో బట్లర్ (25), అండర్సన్ (0)లను పెవిలియన్ పంపించి సిరాజ్ మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఈ మ్యాచ్‌లో 19 వికెట్లు భారత పేసర్ల ఖాతాలో పడడం విశేషం. చదవండి: ENG Vs IND: లార్డ్స్‌లో టీమిండియా విజయం.. వైరలవుతున్న ట్రోల్స్ -
39 ఏళ్ల రికార్డు బద్దలు.. కపిల్ తర్వాత సిరాజ్ మాత్రమే
లార్డ్స్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. సిరాజ్ లార్డ్స్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. ఈ ఎనిమిది వికెట్లలో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయడం విశేషం. ఇక లార్డ్స్ టెస్టులో ఒక టీమిండియా బౌలర్ ఇన్ని వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 1982లో కపిల్ దేవ్ ఈ ఫీట్‌ను సాధించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఆ టెస్టు మ్యాచ్‌లో కపిల్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి ఓవరాల్‌గా 8 వికెట్లు సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడం విశేషం. ఇక 2014లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీశాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ 364 పరుగులకి ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (129: 250 బంతుల్లో 12x4, 1x6) టాప్ స్కోరర్‌కాగా.. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ (5/62) ఐదు వికెట్ల మార్క్‌ని అందుకున్నాడు. అనంతరం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో కెప్టెన్ జో రూట్ (180: 321 బంతుల్లో 18x4) రికార్డు శతకం నమోదు చేయగా.. మహ్మద్ సిరాజ్ (4/94), ఇషాంత్ శర్మ (3/69) ఆకట్టుకున్నారు. 27 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ జట్టులో అజింక్య రహానె (61: 146 బంతుల్లో 5x4), మహ్మద్ షమీ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. దాంతో.. రెండో ఇన్నింగ్స్‌ని 298/8తో భారత్ డిక్లేర్ చేయగా.. 272 పరుగుల టార్గెట్ ఇంగ్లాండ్ ముందు నిలిచింది. ఛేదనలో సిరాజ్ 4, బుమ్రా 3 దెబ్బకు ఇంగ్లాండ్ 120 పరుగులకే చాప చుట్టేసి 151 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. -
ఎవరు చెప్పినా వినలేదు.. అదే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్
లార్డ్స్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి రివ్యూలు అంతగా కలిసిరావనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోహ్లి రివ్యూ తీసుకున్న వాటిలో ఎక్కువ ఫలితాలు మనకు వ్యతిరేకంగానే వచ్చేనవే ఉన్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ ఎంత వద్దని వారించినా మాట వినకుండా సిరాజ్‌పై నమ్మకంతో కోహ్లి రివ్యూ కోరాడు. కానీ ఫలితం మనకు అనుకూలంగా రాలేదు. కానీ ఈసారి కోహ్లి అంచనా తప్పలేదు. అతనికి రివ్యూ కలిసి రావడమే గాక బెయిర్ స్టో లాంటి డేంజర్ ఆటగాడిని వెనక్కి పంపిచడంలో సక్సెస్ అయ్యాడు. ఒక రకంగా మ్యాచ్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. బెయిర్ స్టో అవుటైన తర్వాతి బంతికే రూట్ కూడా వెనుదిరగడం ఇంగ్లండ్ ఓటమిని దాదాపు ఖరారు చేసింది. విషయంలోకి వెళితే.. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఇషాంత్ శర్మ వేసిన 21వ ఓవర్ చివరి బంతి జానీ బెయిర్ స్టో ప్యాడ్లను తాకింది. దాంతో భారత ఆటగాళ్లంతా గట్టిగా అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దాంతో కోహ్లీ రివ్యూ తీసుకుందామని చెప్పగా ఇతర ఆటగాళ్లంతా వద్దని వారించారు. బంతి.. బ్యాట్‌కు తగిలిందనే సందేహం వ్యక్తం చేశారు. కానీ తగలలేదని గట్టి విశ్వాసంతో ఎవరూ చెప్పినా వినకుండా కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. తీరా రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకలేదు. పైగా బాల్ ట్రాకర్‌లో మిడిల్ వికెట్‌ను హిట్ చేయడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఔటిచ్చాడు. దాంతో విరాట్ కోహ్లీ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ప్రపంచకప్ గెలిచినంత సంతోషం వ్యక్తం చేశాడు. ఇతర ఆటగాళ్లు సైతం కోహ్లీ నిర్ణయాన్ని సమర్థిస్తూ మెచ్చుకున్నారు. Mann i love Virat Kohli This is India! This is Virat Kohli's India!#engvsindia #ViratKohli pic.twitter.com/MHOXvo2qcm — Adi (@_adityakush_) August 16, 2021 Celebration after #Bairstow wicket show how intensified is the game.#INDvENG #ViratKohli #IshantSharma pic.twitter.com/itnufNgcOc — शुभांकर मिश्रा (@shubhankrmishra) August 16, 2021 -
కోహ్లి సంబరాలు మాములుగా లేవు.. వీడియో వైరల్
లార్డ్స్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సంబరాలు.. అతను చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోపం వచ్చినా.. సంతోషం కలిగినా కోహ్లిని ఆపడం ఎవరి వల్ల కాదని మరోసారి నిరూపించాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం మైదానంలో భారత ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. కానీ తనదైన శైలిలో గట్టిగా అరుస్తూ తోటి ఆటగాళ్లను హగ్ చేసుకుంటూ కోహ్లి చేసిన హంగామాతో అందరి దృష్టి అతనిపైకే మళ్లింది. ఇక కోహ్లి రోహిత్‌ను హగ్ చేసుకోవడం హైలెట్‌గా నిలిచింది. ఈ ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయంటూ గతంలో పలుమార్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా వీడియోతో మా మధ్య అలాంటివేం లేవని కోహ్లి చెప్పకనే చెప్పాడు. అంతకముందు ఆట నాలుగో రోజు ముగిసిన తర్వాత లార్డ్స్ బాల్కనీలో కోహ్లి నాగిన్ డ్యాన్స్‌తో అలరించాడు. అతని నాగిన్ డ్యాన్స్‌ను చూసిన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మహ్మద్ సిరాజ్‌లు ఈలలు, గోలతో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. WHAT A SHOT! Bumrah 💥♥️ pic.twitter.com/bQoRK3YYp0 — ︎ ︎Mahi (@KohlizBitch) August 16, 2021 ఇక రెండో టెస్టులో ఒక దశలో భారత్ మ్యాచ్ ఓడిపోతుందనే సందేహాలు కలిగాయి. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత టెయిలెండర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మలు అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ ముందు మంచి లక్ష్యాన్నే నిర్ధేశించారు. ఇంగ్లండ్ టార్గెట్ 272. రెండు సెషన్లు, 60 ఓవర్లు. ఓపెనింగ్ సహా టాపార్డర్ నిలబడితే, దీనికి వేగం జతయితే ఓవర్‌కు 4 పరుగులు చేయడం ఏమంత కష్టం కాదు. కానీ బుమ్రా, షమీ వారికి ఆ అవకాశమే ఇవ్వలేదు. Happiness on the face of King Kohli when Shami smashed four. #INDvENG pic.twitter.com/LAhDBCGsaQ — ︎ ︎Mahi (@KohlizBitch) August 16, 2021 ఇద్దరు ప్రారంభ ఓవర్లలోనే బర్న్స్ (0), సిబ్లీ (0)లను ఖాతా తెరువనీయలేదు. వీళ్లిద్దరికి తోడుగా ఇషాంత్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. హమీద్ (9), బెయిర్ స్టో (2)ల పనిపట్టాడు. కెప్టెన్ రూట్ (60 బంతుల్లో 33; 5 ఫోర్లు) జట్టును కాపాడాలనుకున్నా బుమ్రా ఆ అవకాశం అతనికి ఇవ్వలేదు. ఈ స్థితిలో డ్రా చేసుకోవడం కూడా ఇంగ్లండ్‌కు కష్టమే! అయినా సరే బట్లర్ (96 బంతుల్లో 25; 3 ఫోర్లు) ప్రయత్నిద్దామనుకున్నాడు. కానీ సీన్లోకి ఈ సారి సిరాజ్ వచ్చాడు. వరుస బంతుల్లో మొయిన్ అలీ (13), స్యామ్ కరన్ (0)లను ఔట్ చేశాడు. తర్వాత బట్లర్‌ను తనే పెవిలియన్ చేర్చాడు. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌లిచ్చారు. డ్రాతో గట్టెక్కాల్సిన చోట గెలుపు సంబరమిచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) That kohli - Rohit hug at the end ❤️❤️😍#ENGvIND #engvsindia pic.twitter.com/KXv0hGB5eX — 🌊𝙉𝙊 𝙇𝙄𝙈𝙄𝙏𝙎🔥 (@VamsiChunchu_) August 16, 2021 -
Virat Kohli: 'జట్టును చూస్తే గర్వంగా ఉంది'
లార్డ్స్: చారిత్రక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ కోహ్లి స్పందించాడు. ‘తీవ్రమైన ఒత్తిడి మధ్య రెండో ఇన్నింగ్స్‌లో చాలా బాగా ఆడాం. బుమ్రా, షమీ అయితే అద్భుతం. 60 ఓవర్లలో ఫలితం రాబట్టడం మా లక్ష్యం. మైదానంలో వారి ఆటగాళ్లతో జరిగిన వాదనలు మాలో మరింత దూకుడును పెంచాయి. 2014లోనూ లార్డ్స్‌లో గెలిచినా...60 ఓవర్లలోపే విజయాన్ని అందుకోవడం ఎంతో ప్రత్యేకం. ఇక్కడ తొలి సారి టెస్టు ఆడిన సిరాజ్ బౌలింగ్ చేసిన తీరును ఎంత ప్రశంసించినా తక్కువే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడకు వచ్చి మాలో స్ఫూర్తి నింపిన భారత అభిమానులకు ఈ విజయం ఒక కానుక’ అని తెలిపాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ నిర్దేశించిన లక్ష్యం 272. రెండు సెషన్లు, 60 ఓవర్లు. ఓపెనింగ్ సహా టాపార్డర్ నిలబడితే, దీనికి వేగం జతయితే ఓవర్‌కు 4 పరుగులు చేయడం ఏమంత కష్టం కాదు. కానీ బుమ్రా, షమీ వారికి ఆ అవకాశమే ఇవ్వలేదు. ఇద్దరు ప్రారంభ ఓవర్లలోనే బర్న్స్ (0), సిబ్లీ (0)లను ఖాతా తెరువనీయలేదు. వీళ్లిద్దరికి తోడుగా ఇషాంత్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. హమీద్ (9), బెయిర్ స్టో (2)ల పనిపట్టాడు. కెప్టెన్ రూట్ (60 బంతుల్లో 33; 5 ఫోర్లు) జట్టును కాపాడాలనుకున్నా బుమ్రా ఆ అవకాశం అతనికి ఇవ్వలేదు. ఈ స్థితిలో డ్రా చేసుకోవడం కూడా ఇంగ్లండ్‌కు కష్టమే! అయినా సరే బట్లర్ (96 బంతుల్లో 25; 3 ఫోర్లు) ప్రయత్నిద్దామనుకున్నాడు. కానీ సీన్లోకి ఈ సారి సిరాజ్ వచ్చాడు. వరుస బంతుల్లో మొయిన్ అలీ (13), స్యామ్ కరన్ (0)లను ఔట్ చేశాడు. తర్వాత బట్లర్‌ను తనే పెవిలియన్ చేర్చాడు. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌లిచ్చారు. డ్రాతో గట్టెక్కాల్సిన చోట గెలుపు సంబరమిచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా టెయిలెండర్లు..
లండన్: భారత టెయిలండర్లు మహమ్మద్ షమీ(70 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), జస్ప్రీత్ బుమ్రా(64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు పేసర్లు చెలరేగి బ్యాటింగ్ చేశారు. 209 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న భారత్‌ను అద్భుత పోరాట పటిమతో విన్నింగ్ ట్రాక్‌పై నిలబెట్టారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు అజేయమైన 89 పరుగులు జోడించి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లండ్ గడ్డపై భారత్ తరఫున 9వ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా చరిత్రకెక్కారు. 39 ఏళ్ల కిందట 1982లో ఇదే వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత దిగ్గజాలు కపిల్ దేవ్-మదన్ లాల్ 9వ వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ఇప్పటివరకు ఇంగ్లండ్ గడ్డపై భారత్ తరఫున తొమ్మిదో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యంగా ఉండింది. 39 ఏళ్ల తర్వాత ఈ రికార్డును షమీ, బుమ్రా జోడి అధిగమించడం విశేషం. ఇదిలా ఉంటే, టీమిండియా నిర్దేశించిన 272 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు కేవలం 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. టీమిండియా పేసర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. తొలి ఓవర్లోనే బుమ్రా ఓపెనర్ రోరి బర్న్స్ ను డకౌట్ చేయగా, రెండో ఓవర్లో షమీ మరో ఓపెనర్ సిబ్లీని డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. అనంతరం ఇషాంత్ హసీబ్ హమీద్(9), బెయిర్‌స్టో(2)ను పెవిలియన్‌కు పంపి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ప్రస్తుతం కెప్టెన్ జో రూట్(33) క్రీజ్‌లో పాతుకుపోయాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 205 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. చదవండి: షమీ, బుమ్రాలకు లభించిన ఘన స్వాగతం చూస్తే ఔరా అనాల్సిందే..! -
షమీ, బుమ్రాలకు లభించిన ఘన స్వాగతం చూస్తే ఔరా అనాల్సిందే..!
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా టెయిలెండర్లు మహమ్మద్ షమీ(70 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), జస్ప్రీత్ బుమ్రా(64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) అద్భుత ప్రదర్శన కనబర్చారు. 209 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న భారత్‌ను అద్భుత పోరాట పటిమతో ఆదుకున్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు అజేయమైన 89 పరుగులు జోడించి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. ముఖ్యంగా షమీ ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి కెరీర్లో రెండో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. టీమిండియాకు 271 పరుగుల ఆధిక్యం లభించాక.. 298 పరగుల వద్ద కెప్టెన్ కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. A rousing reception for Mohammed Shami and Jasprit Bumrah from India's dressing room at Lord's 👏 (via @BCCI) pic.twitter.com/gvJduOK9oX — ESPNcricinfo (@ESPNcricinfo) August 16, 2021 అయితే, లంచ్ విరామ సమయంలో షమీ, బుమ్రాలు డ్రెసింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టాక.. సహచర క్రికెటర్లు వారికి ఘన స్వాగతం పలికారు. చప్పట్లు, ఈలలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సభ్యులంతా లేచి నిలబడి అద్భుత ఇన్నింగ్స్ అడిన షమీ, బుమ్రాలను కరతాళధ్వనులతో ఘనమైన రీతిలో ఆహ్వానించారు. ఆ అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. ఇదిలా ఉంటే, టీమిండియా నిర్దేశించిన 272 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. టీమిండియా పేసర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. తొలి ఓవర్లోనే బుమ్రా ఓపెనర్ రోరి బర్న్స్ ను డకౌట్ చేయగా, రెండో ఓవర్లో షమీ మరో ఓపెనర్ సిబ్లీని డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఒక్క పరుగుకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. క్రీజ్‌లో కెప్టెన్ జో రూట్, హసీబ్ హమీద్ ఉన్నారు. చదవండి: రషీద్ ఖాన్, నబీ ఇద్దరూ అందుబాటులో ఉంటారు: సన్‌రైజర్స్ -
అవును.. లార్డ్స్ ఆండర్సన్ అడ్డానే.. కోహ్లికి కౌంటరిచ్చిన బ్రాడ్
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. నాలుగోరోజు ఆటలో భాగంగా ఆండర్సన్ పలు మార్లు పిచ్‌పై పరిగెత్తడమే కాకుండా కోహ్లిని కవ్వించేలా మాట్లాడాడు. దీనికి విరాట్ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. "పిచ్ నీ సొంతం అనుకున్నావా.. పరిగెత్తడానికి'' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The Lord’s honours board suggests it’s as close to Jimmy’s backyard as Jimmy’s actual backyard. Love the fire but that language will have him in trouble — Stuart Broad (@StuartBroad8) August 15, 2021 అయితే, కోహ్లి-ఆండర్సన్‌ల మధ్య జరిగిన వాగ్వాదంపై ఇంగ్లండ్ మరో పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందించాడు. ఈ విషయమై కోహ్లికి కౌంటరిస్తూ.. అవును, లార్డ్స్ ఆండర్సన్ అడ్డానే. కావాలంటే అక్కడి హానర్ బోర్డు చూడు.. లార్డ్స్ ఆండర్సన్ అడ్డా అని గణంకాలే చెబుతాయి. కోహ్లి.. నీలోని ఫైర్ బాగుంటుంది కానీ, నువ్వు వాడే భాషే నిన్ను కష్టాల్లో పడేస్తుంది అంటూ బ్రాడ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది. కాగా, ఆండర్సన్ లార్డ్స్ మైదానంలో 5 వికెట్ల ఘనతను ఏడు సార్లు సాధించాడు. ఈక్రమంలో అతను ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ రికార్డును(7 సార్లు 5 వికెట్ల ఘనత) సమం చేశాడు. ఇదిలా ఉంటే, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (14 బ్యాటింగ్), ఇషాంత్ శర్మ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 154 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: నరాలు తెగే ఉత్కంఠత.. రోచ్ 'సూపర్' ఇన్నింగ్స్‌తో గట్టెక్కిన విండీస్ -
లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం
లార్డ్స్‌లో మూడో విజయం టీమిండియా చరిత్రాత్మక విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 151 పరుగుల తేడాతో విజయం సాధించి లార్డ్స్ మైదానంలో మూడో విజయాన్ని నమోదు చేసింది. 1986, 2014 తర్వాత లార్డ్స్ మైదానంలో భారత్ మూడో విజయం సాధించింది. దీంతో 5 టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో సిరాజ్ 4, ఇషాంత్ 3, షమీకి 2 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు. స్కోర్ల వివరాలు: భారత్: 364 & 298/8 డిక్లెర్డ్, ఇంగ్లండ్: 391& 120. సిరాజ్ ఆన్ ఫైర్.. వరుస బంతుల్లో వికెట్లు తీసిన హైదరాబాదీ బౌలర్ టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. వరుస బంతుల్లో ప్రమాదకరమైన మొయిన్ అలీ, సామ్ కర్రన్ల వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమిని దాదాపు ఖరారు చేశాడు. కర్రన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిరాజ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ గెలవాలంటే 21.4 ఓవర్లలో 182 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. క్రీజ్‌లో బట్లర్(8), రాబిన్సన్(0) ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. మొయిన్ అలీ(13) ఔట్ జడేజా వేసిన అంతకుముందు ఓవర్లో నాలుగు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మొయిన్ అలీ(13) ఎట్టకేలకు సిరాజ్ బౌలింగ్‌లో కోహ్లి చేతికి చిక్కాడు. దీంతో 90 పరుగుల వద్ద ఇంగ్లండ్ జట్టు ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లండ్ గెలవాలంటే 21.5 ఓవర్లలో 182 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. క్రీజ్‌లో బట్లర్(8), సామ్ కర్రన్(0) ఉన్నారు. ఇంగ్లండ్ ఓటమి లాంచనమే.. డేంజరస్ బ్యాట్స్‌మెన్ రూట్(33) ఔట్ క్రీజ్‌లో పాతుకుపోయి ప్రమాదకారిగా మారిన ఇంగ్లండ్ కెప్టెన్ రూట్(33; 5 ఫోర్లు)ను.. బుమ్రా బోల్తా కొట్టించాడు. ఫస్ట్ స్లిప్‌లో కోహ్లి అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో రూట్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 67 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని దాదాపుగా ఖారారు చేసుకుంది. క్రీజ్‌లో మొయిన్ అలీ, జోస్ బట్లర్ ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 205 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. చెలరేగుతున్న ఇషాంత్.. ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్ టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇదివరకే హసీబ్ హమీద్‌ను పెవిలియన్‌కు పంపిన లంబూ.. డేంజర్ బ్యాట్స్‌మెన్ బెయిర్‌స్టోను(2)కూడా ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మరోవైపు కెప్టెన్ జో రూట్(33) క్రీజ్‌లో పాతుకుపోయాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 205 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇరు జట్టు టీ బ్రేక్ తీసుకున్నాయి. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. హమీద్(9) ఔట్ ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోన్న ఇంగ్లండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ హసీబ్ హమీద్(9)ను ఇషాంత్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 44 పరుగులకే ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి డిఫెన్స్‌లో పడింది. క్రీజ్‌లో రూట్(21), బెయిర్‌స్టో(0) ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 228 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. టీమిండియా పేసర్ల విశ్వరూపం.. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ టీమిండియా నిర్దేశించిన 272 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. టీమిండియా పేసర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. తొలి ఓవర్లోనే బుమ్రా ఓపెనర్ రోరి బర్న్స్ ను డకౌట్ చేయగా, రెండో ఓవర్లో షమీ మరో ఓపెనర్ సిబ్లీని డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఒక్క పరుగుకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. క్రీజ్‌లో కెప్టెన్ జో రూట్, హసీబ్ హమీద్ ఉన్నారు. టీమిండియా 298/8 డిక్లేర్.. ఇంగ్లండ్ విజయలక్ష్యం 272 లంచ్ విరామం తర్వాత బరిలోకి దిగిన టీమిండియా.. మరో 12 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మహ్మద్ షమీ(70 బంతుల్లో 56; 5 ఫోర్లు, సిక్స్), బుమ్రా(64 బంతుల్లో 34; 3 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచారు. మొత్తం 109.3 ఓవర్లు ఆడిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, ప్రత్యర్ధికి 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అర్ధ సెంచరీతో అదరగొట్టిన షమీ.. 259 పరుగుల ఆధిక్యంలో టీమిండియా టీమిండియా బౌలర్లు మహ్మద్ షమీ(67 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), బుమ్రా(58 బంతుల్లో 30; 2 ఫోర్లు) ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. 209 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్(ఇషాంత్ (16)) కోల్పోయాక వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ.. తొమ్మిదో వికెట్‌కు అజేయమైన 77 పరుగులు జోడించారు. ముఖ్యంగా షమీ ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి కెరీర్లో రెండో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. లంచ్ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 286/8. ప్రస్తుతం భారత్ 259 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. ఇషాంత్(12) ఔట్ ఇంగ్లండ్ పేసర్ రాబిన్సన్.. ఆఖరి రోజు ఆటలో టీమిండియాను మరో దెబ్బకొట్టాడు. తొలుత కీలకమైన పంత్ వికెట్ పడగొట్టిన రాబిన్సన్.. క్రీజ్‌లో నిలదొక్కుకున్న ఇషాంత్(16; 2 ఫోర్లు)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. 90 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 211/8. ప్రస్తుతం టీమిండియా 184 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో షమీ(7), బుమ్రా(0) ఉన్నారు. లండన్: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసిన భారత్.. ఆఖరి రోజు ఆట ఆరంభం కాగానే కీలకమైన రిషభ్ పంత్ (46 బంతుల్లో 22; ఫోర్) వికెట్‌ను కోల్పోయింది. పంత్ తన ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో ఎనిమిది పరుగులు మాత్రమే జోడించి రాబిన్సన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 86 ఓవర్ల తర్వాత టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 167 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో ఇషాంత్ శర్మ (8), షమీ(0) ఉన్నారు. -
20 పరుగులకే ఔట్.. డ్రెస్సింగ్ రూమ్‌లో టవల్ విసిరి కొట్టిన కోహ్లి
లండన్: లార్డ్స్ టెస్టు 4వ రోజు విరాట్ కోహ్లీ 20 పరుగులకే వెనుదిరిగాడు. అయితే దీనిపై కోహ్లీ తన నిరాశను ప్రదర్శిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లో టవల్‌ను విసిరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై కొంత మంది నెటిజన్లు కోహ్లీకి మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు ట్రోల్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ వరుసగా ఏడు ఇన్నింగ్స్‌లలో యాభై పరుగులు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. ఇక కోహ్లీ స్కోర్లు వరుసగా 0, 62, 27, 0, 44,13, 0, 42, 20 గా ఉన్నాయి. దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ.. ‘‘కోహ్లీ! ఎంత సమయమైన తీసుకో.. కానీ మళ్లీ నీ ప్రతాపం చూడాలి. నీ ఆటతో విమర్శించే వాళ్ల నోళ్లు మూయించాలి. దాని కోసం నేను వేచి ఉంటాను.’’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. కాగా భారత ఓపెనింగ్ జోడీ రాహుల్–రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మార్క్ వుడ్ పేస్‌కు టీమిండియా బ్యాటింగ్ దళం వణికింది. 27 పరుగుల లోటుతో మొదలైన భారత రెండో ఇన్నింగ్స్‌ను ఈ ఇంగ్లండ్ సీమర్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. వుడ్ తన వరుస ఓవర్లలో రాహుల్ (5), రోహిత్ (36 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్)లను పెవిలియన్ పంపాడు. 12 ఓవర్లలో 27 పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి. పుజారాకు కెప్టెన్ కోహ్లి జతయ్యాడు. కానీ ఈ జోడీ ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 55 పరుగుల వద్ద కోహ్లి (31 బంతుల్లో 20; 4 ఫోర్లు)ని స్యామ్ కరన్ ఔట్ చేశాడు. క్రీజులోకి రహానే రాగా... ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక మార్క్ వుడ్ మళ్లీ కుదుపేశాడు. పుజారాను ఔట్ చేశాడు. తర్వాత మొయిన్ అలీ స్వల్ప వ్యవధిలో రహానే పోరాటానికి చెక్ పెట్టి... రవీంద్ర జడేజా (3)నూ బౌల్డ్ చేశాడు. మూడో సెషన్లో కీలక వికెట్లు కోల్పోయిన భారత్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 5; రోహిత్ (సి) మొయిన్ అలీ (బి) వుడ్ 21; పుజారా (సి) రూట్ (బి) వుడ్ 45; కోహ్లి (సి) బట్లర్ (బి) స్యామ్ కరన్ 20; రహానే (సి) బట్లర్ (బి) మొయిన్ అలీ 61; పంత్ (బ్యాటింగ్) 14; జడేజా (బి) మొయిన్ అలీ 3; ఇషాంత్ (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (82 ఓవర్లలో 6 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–18, 2–27, 3–55, 4–155, 5–167, 6–175. 👀 pic.twitter.com/vjhglznWvk — . (@aikdoteenchaar) August 15, 2021 -
రసపట్టులో.. భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు
తొలి టెస్టులో చివరి రోజు వర్షం శాసించి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించినా... రెండో టెస్టులో మాత్రం భారత్, ఇంగ్లండ్ జట్లలో ఒక జట్టు గెలుపు రుచి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పుజారా, రహానే మొండి పట్టుదలతో ఆడి ఆదుకునే ప్రయత్నం చేయగా... మార్క్ వుడ్, మొయిన్ అలీ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌కు మ్యాచ్‌పై మళ్లీ ఆశలు రేకెత్తించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 154 పరుగుల ఆధిక్యంలో ఉండగా... ఆఖరి రోజు భారత్‌ను సాధ్యమైనంత తొందరగా ఆలౌట్ చేయడంపై ఇంగ్లండ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తానికి లార్డ్స్ టెస్టులో చివరిదైన ఐదో రోజు ఆద్యంతం ఆసక్తికరంగా సాగడం ఖాయమనిపిస్తోంది. లండన్: మూడో రోజు ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం లభించింది. నాలుగో రోజు మ్యాచ్‌పైనే పట్టు సాధించే పరిస్థితిని సృష్టించుకుంది. ఆతిథ్య జట్టు పేస్–స్పిన్‌ల కలబోత భారత్‌ను కష్టాలపాలు చేసింది. పేసర్ మార్క్ వుడ్ (3/40) ‘టాప్’ లేపగా... స్పిన్నర్ మొయిన్ అలీ (2/52) పాతుకుపోతున్న భారత ఇన్నింగ్స్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో అజింక్య రహానే (146 బంతుల్లో 61; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (206 బంతుల్లో 45; 4 ఫోర్లు) జట్టును ఆదుకునేందుకు చేసిన పోరాటం ఆఖరిదాకా నిలువలేదు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (14 బ్యాటింగ్), ఇషాంత్ శర్మ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. కానీ చేతిలో ఒక బ్యాట్స్‌మనే ఉన్నాడు. మిగతా వాళ్లంతా బౌలర్లే! వణికించిన వుడ్ భారత ఓపెనింగ్ జోడీ రాహుల్–రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మార్క్ వుడ్ పేస్‌కు వణికింది. 27 పరుగుల లోటుతో మొదలైన భారత రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ సీమర్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. వుడ్ తన వరుస ఓవర్లలో రాహుల్ (5), రోహిత్ (36 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్)లను పెవిలియన్ పంపాడు. 12 ఓవర్లలో 27 పరుగులకే ఈ రెండు వికెట్లు పడ్డాయి. పుజారాకు కెప్టెన్ కోహ్లి జతయ్యాడు. కానీ ఈ జోడీ ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 55 పరుగుల వద్ద కోహ్లి (31 బంతుల్లో 20; 4 ఫోర్లు)ని స్యామ్ కరన్ ఔట్ చేశాడు. క్రీజులోకి రహానే రాగా... 56/3 స్కోరు వద్ద మనోళ్లు లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. రహానే అర్ధసెంచరీ తర్వాత భారత్ ఆత్మరక్షణలో పడింది. రహానే, పుజారా పూర్తిగా వికెట్లు కాపాడుకునేందుకే పరిమితమయ్యారు. దాంతో పరుగుల వేగం మందగించింది. దీంతో ఈ రెండో సెషన్లో 28 ఓవర్లు ఆడినా కూడా భారత్ 50 పరుగులు చేయలేకపోయింది. ఓవర్‌కు 2 పరుగుల రన్‌రేట్‌తో ఎట్టకేలకు 51 ఓవర్లో జట్టు స్కోరు 100కు చేరుకుంది. వికెట్ కాపాడుకున్న ప్రయోజనం నెరవేరడంతో 105/3 స్కోరు వద్ద టీ విరామానికెళ్లారు. ఆఖరి సెషన్లోనూ ఇద్దరు నెమ్మదిగానే ఆడారు. ఈ క్రమంలో 125 బంతుల్లో 5 బౌండరీలతో రహానే ఫిఫ్టీ పూర్తయింది. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక మార్క్ వుడ్ మళ్లీ కుదుపేశాడు. పుజారాను ఔట్ చేశాడు. తర్వాత మొయిన్ అలీ స్వల్ప వ్యవధిలో రహానే పోరాటానికి చెక్ పెట్టి... రవీంద్ర జడేజా (3)నూ బౌల్డ్ చేశాడు. దీంతో మూడో సెషన్ భారత్‌కు మళ్లీ ముప్పు తెచ్చింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 364; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 391; భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 5; రోహిత్ (సి) మొయిన్ అలీ (బి) వుడ్ 21; పుజారా (సి) రూట్ (బి) వుడ్ 45; కోహ్లి (సి) బట్లర్ (బి) స్యామ్ కరన్ 20; రహానే (సి) బట్లర్ (బి) మొయిన్ అలీ 61; పంత్ (బ్యాటింగ్) 14; జడేజా (బి) మొయిన్ అలీ 3; ఇషాంత్ (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (82 ఓవర్లలో 6 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–18, 2–27, 3–55, 4–155, 5–167, 6–175. బౌలింగ్: అండర్సన్ 18–6–23–0, రాబిన్సన్ 10–6–20–0, వుడ్ 14–3–40–3; స్యామ్ కరన్ 15–3–30–1, మొయిన్ అలీ 20–1–52–2, రూట్ 5–0–9–0. -
లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బాల్ టాంపరింగ్ చేసిందా?
లార్డ్స్: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ జిడ్డు బ్యాటింగ్ కొనసాగిస్తుండడంతో వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతున్న ఇంగ్లండ్ బంతి ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో ట్విటర్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఆ ఫోటోల్లో మొహాలు చూపించకపోవడంతో ఆటగాళ్లు ఎవరనేది కనిపెట్టడం కష్టంగా మారింది. ఇక వీడియోలో బంతిని ఉద్దేశపూర్వకంగా కింద పడేసి.. బూట్లతో తన్నుతూ.. బూట్ల స్పైక్స్‌తో అదిమి తొక్కుతూ... ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన భారత అభిమానులు ఉద్దేశపూర్వకంగా బాల్ టాంపరింగ్కి పాల్పడిన ఇంగ్లాండ్ ప్లేయర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఐసీసీ ఎలా రియాక్టవుతుందో చూడాలి. ఇక క్రికెట్లో బాల్‌టాంపరింగ్ ఉదంతం అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఆసీస్ ఆటగాళ్లు. 2018 కేప్‌టౌన్ టెస్ట్‌లో సాండ్ పేపర్ విధానంతో బెన్ క్రాప్ట్ బాల్‌టాంపరింగ్‌కు పాల్పడి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఈ ఉదంతంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ హస్తం కూడా ఉందని తెలియడంతో వారిద్దరిపై ఏడాది పాటు నిషేధం విధించిన ఐసీసీ బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. ఆసీస్ క్రికెటర్లు చేసిన బాల్ టాంపరింగ్ ఉదంతం క్రికెట్ కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇక రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తుంది. టాపార్డర్ విఫలమైన వేళ రహానే, పుజారాలు నెమ్మదైన ఆటను ప్రదర్శిస్తూ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా 64 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. పుజారా (33, 180 బంతులు), రహానే( 33, 106 బంతులు) క్రీజులో ఉన్నారు. https://t.co/2CqnuowAqq — GurPreet ChAudhary (@GuriChaudhary77) August 15, 2021 -
'బుమ్రా.. నన్నెందుకు టార్గెట్ చేశావ్' ; వీడియో వైరల్
లార్డ్స్: టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్ను రెండో టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మూడో రోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా బుమ్రా వేసిన ఓవర్ ప్రమాదకరంగా కనిపించింది. ఎంతలా అంటే క్రీజులో ఉన్న 11వ నంబర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్‌ను టార్గెట్ చేశాడా అనిపించింది. వరుసగా షార్ట్ బంతులు విసురుతూ అండర్సన్‌ను బెంబెలెత్తించాడు. బుమ్రా వేసిన తొలి బంతి హెల్మెట్‌కు తగలడంతో బిత్తరపోయిన అండర్సన్ కన్కషన్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా బుమ్రా తగ్గలేదు. తర్వాతి బంతి పొత్తికడుపుపై బలంగా తాకగా, మరో బంతి పక్కటెముల మీదకు దూసుకొచ్చింది. ఈ క్రమంలో బుమ్రా ఒకే ఓవర్లో 4 నోబాల్స్ సహా మొత్తం 10 బంతులు విసిరాడు. ఆ తర్వాత షమీ వేసిన ఓవర్లో అండర్సన్ బౌల్డ్ కావడంతో ఇంగ్లండ ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరుకుంటున్న క్రమంలో బుమ్రా బౌలింగ్ శైలితో ఇబ్బంది పడిన అండర్సన్ అతని వద్దకు వచ్చి.. '' నన్నెందుకు టార్గెట్ చేశావన్నట్లుగా '' అడిగాడు. దానికి బుమ్రా ఏం చెప్పకుండా చిరునవ్వుతో అతని పక్కనుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది. ఇక ఇంగ్లండ్ టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కాగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 8 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 17 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 12, కేఎల్ రాహుల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. Anderson vs Bumrah. pic.twitter.com/MJpeDinUB3 — Simran (@CowCorner9) August 15, 2021 -
Ind VS Eng 2nd Test: ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్న రహానే, పుజారా
ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్న రహానే, పుజారా ► టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తుంది. అజింక్యా రహానే 126 బంతుల్లో అర్థ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టాపార్డర్ విఫలమైన వేళ రహానే, పుజారాలు నెమ్మదైన ఆటను ప్రదర్శిస్తూ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా 69 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. పుజారా (38, 192 బంతులు), రహానే( 50, 126 బంతులు) క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు ఇద్దరి మధ్య 80 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఇక టీమిండియా 108 పరుగుల ఆధిక్యంలో ఉంది. 76 పరుగుల ఆధిక్యంలో భారత్ ►ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. టాపార్డర్ విఫలమైన వేళ పుజరా, రహానేలు సమయోచితంగా ఆడుతూ పరుగులు సాధిస్తున్నారు. మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసిన టీమిండియా ఇప్పటివరకు 76 పరుగుల ఆధిక్యం సాధించింది. పుజారా 29, రహానే 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. ► లంచ్ విరామం అనంతరం టీమిండియా జాగ్రత్తగా ఆడుతోంది. ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసిన టీమిండియా 37 పరుగుల ఆధిక్యంలో ఉంది. పుజారా 8, రహానే 8 పరుగుతో క్రీజులో ఉన్నారు. నెమ్మదిగా ఆడుతున్న పుజారా 8 పరుగులు చేయడానికి 78 బంతులు తీసుకోవడం విశేషం. లంచ్ విరామం.. 29 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ► ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో లంచ్ విరామం సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. తద్వారా 29 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్, రాహుల్‌లు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి 20 పరుగులు చేసి సామ్ కరన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇప్పటికే మూడు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా మరో రెండు సెషన్ల పాటు నిలబడి ఎన్ని పరుగులు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పుజారా 3, రహానే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ ఔట్.. రెండో వికెట్ డౌన్ ► రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తడబడుతుంది. 21 పరుగులు చేసిన రోహిత్ శర్మ మార్క్‌వుడ్ బౌలింగ్‌లో మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో మంచి టచ్‌లో కనిపించిన రోహిత్ మార్క్‌వుడ్ వేసిన షార్ట్‌బాల్‌ను అంచనా వేయడంలో పొరబడి బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం టీమిండియా 2 వికెట్ల నష్టానికి 27 పరుగులతో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని చేరుకుంది. క్రీజులో కోహ్లి(0), పుజారా(0)లు ఉన్నారు తొలి వికెట్ కోల్పోయిన భారత్ ►ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఓపెనర్ కేఎల్ రాహుల్ మార్క్ వుడ్ బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. రోహిత్ 15, పుజారా 0 క్రీజులో ఉన్నారు. లార్డ్స్: ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటకు చేరుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 27 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. ఇక నాలుగో రోజు ఆటలో భారత్ ఎంత వేగంగా ఆడుతుందనే దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇంగ్లండ్‌కు భారీ టార్గెట్ ఇచ్చే క్రమంలో వారి బౌలింగ్‌ను ఎదుర్కొంటారా లేక చతికిలపడతారా అనేది చూడాలి. అంతకముందు మూడోరోజు ఆటలో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (321 బంతుల్లో 180 నాటౌట్; 18 ఫోర్లు) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా... జానీ బెయిర్‌స్టో (107 బంతుల్లో 57; 7 ఫోర్లు) రాణించాడు. సిరాజ్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట చివరి ఓవర్ చివరి బంతికి అండర్సన్‌ను షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఆట ముగిసింది. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. -
అండర్సన్ బౌలింగ్ ఎదుర్కునే ముందు ఈ మంత్రం జపించండి..
లండన్: ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో స్వింగ్ కింగ్, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ అండర్సన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు నానా తిప్పలు పడుతున్న భారత బ్యాట్స్‌మెన్‌కు మన వీరేంద్రుడు ఓ అద్భుతమైన సలహా ఇచ్చాడు. ఆ సలహా పాటిస్తే ఆండర్సన్ బౌలింగ్‌లో ఎవరూ అవుట్ కారని భరోసా ఇస్తున్నాడు. ఇంతకీ ఆ మంత్రం ఏంటని అనుకుంటున్నారా..? అండర్సన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్న వారంతా అతను బంతి పట్టుకొని పరుగెడుతూ క్రీజ్ వద్దకు రాగానే ఒకడుగు ముందుకు వేసి గట్టిగా 'జై భజరంగ్ బలి' అనే మంత్రం పఠించాలని, అప్పుడు పరుగులు రాకపోయినా ఔట్ అయితే కాకుండా బతికిపోతారని చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ ఇచ్చిన ఈ సలహాను ఆధారాలతో సహా సమర్ధించుకోవడం విశేషం. క్రీజ్ వదిలి ముందు కొచ్చి ఆడటం వల్ల క్లీన్ బౌల్డ్ కావడం గానీ.. లోపలికి వచ్చే బంతుల వల్ల ఎల్బీడబ్ల్యూ కావడం కానీ జరగదని చెప్పుకొచ్చాడు. గతంలో పుజారా, కోహ్లీలు మాత్రమే అండర్సన్ బౌలింగ్‌లో అవుటయ్యే వారని.. ఇప్పుడు రహానే కూడా ఆండర్సన్ రెగ్యులర్ కస్టమర్ల జాబితాలో చేరాడని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాబట్టి ఈ ముగ్గురు ఈ మంత్రాన్ని జపిస్తూ ఆడేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. అయితే, సెహ్వాగ్ సలహా విని నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. కొందరైతే ఇది లగాన్ సినిమా నుంచి కాపీ చేసినట్లుందని కామెంట్లు చేస్తున్నారు. అందులో కూడా బ్రిటిష్ బౌలర్‌ను ఎదుర్కొనే ముందు పూజారి క్యారెక్టర్ వేసిన నటుడు 'జై భజరంగ్ బలి' అని అరుస్తాడు. అనంతరం బౌండరీలు కూడా బాదేస్తాడు. ఆ సీన్‌ను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, 39 ఏళ్ల వయసులో కూడా ఆండర్సన్ అదరగొడుతున్నాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. కీలక ఆటగాళ్లైన రోహిత్, పుజారా, రహానేల వికెట్లు తీసి టీమిండియాను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరగులు చేసి ఆలౌటైంది. -
నేను భారత ఆటగాడినే.. లార్డ్స్‌లో అజ్ఞాత వ్యక్తి హల్చల్
లండన్: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మూడో రోజు లంచ్ విరామం ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెడుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి వచ్చిన జార్వో అనే ఒక అభిమాని టీమిండియా ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్లోకి వెళ్లిపోయాడు. ‘బైజూస్’ లోగో సహా సరిగ్గా భారత జట్టును పోలిన జెర్సీని అతను ధరించడంతో ముందుగా ఎవరూ గుర్తించలేకపోయారు. pic.twitter.com/I4acms58Ie — Ravi_cricfreak (@ravi_cricfreak) August 14, 2021 అయితే ఆ తర్వాత తేరుకున్న భద్రతా సిబ్బంది అతడి వద్దకు వెళ్లి బయటకు పంపే ప్రయత్నం చేస్తుండగా... తన జెర్సీని చూపిస్తూ నేనూ భారత ఆటగాడినే అన్నట్లుగా సైగ చేస్తూ దాదాపుగా సిబ్బందిని ఒప్పించినంతగా ప్రయత్నించాడు. చివరకు అతడిని మైదానం బయటకు లాక్కుపోతుండగా భారత బృందంలో నవ్వులు విరిశాయి. తొలి సెషన్లో భారత బౌలింగ్ విఫలమవడం చూసి సోషల్ మీడియాలో కొందరు కోహ్లి... ‘జార్వోతో రెండు ఓవర్లు బౌలింగ్ చేయించాల్సింది’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలు విసరడం విశేషం. -
కేఎల్ రాహుల్‌పైకి బీర్ బాటిల్ మూతలు.. కోహ్లి ఆగ్రహం
లార్డ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కొందరు అభిమానులు చేసిన పని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఆగ్రహం తెప్పించింది. మూడో రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 69వ ఓవర్లో కేఎల్ రాహుల్‌ను టార్గెట్ చేస్తూ కొందరు ఆకతాయిలు బీర్ బాటిల్ మూతలు విసిరారు. ఇది చూసిన రాహుల్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లి రాహుల్ వైపు తిరిగి.. '' ఆ మూతలను తిరిగి అటువైపే విసురు'' అన్నట్లుగా సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కోహ్లి ఈ అంశాన్ని సీరియస్ చేయకుండా విడిచేయడంతో వివాదం సద్దుమణిగింది. కాగా కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ రెండో టెస్టులో భారత్‌కు గట్టి పోటీనిస్తుంది. ముఖ్యంగా కెప్టెన్ రూట్ మరోసారి సెంచరీతో దుమ్మురేపడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 94 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. రూట్ 128, మొయిన్ అలీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. Virat Kohli signaling to KL Rahul to throw it back to the crowd pic.twitter.com/OjJkixqJJA — Pranjal (@Pranjal_King_18) August 14, 2021 -
Jonny Bairstow: రెండేళ్ల తర్వాత మళ్లీ అదే లార్డ్స్‌లో
లార్డ్స్: ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టో రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు టెస్టుల్లో అర్థ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. విచిత్రమేమిటంటే.. బెయిర్ స్టో టెస్టుల్లో చివరి అర్థ సెంచరీ నమోదు చేసింది లార్డ్స్ మైదానంలోనే. 2019లో లార్డ్స్ వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బెయిర్ స్టో 52 పరుగులు చేశాడు. రెండేళ్ల తర్వాత అర్థ సెంచరీ మార్క్‌ను అందుకోవడంతో బెయిర్ స్టో తన బ్యాట్‌ను డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ సెలబ్రేషన్ చేసుకోవడం వైరల్‌గా మారింది. కెప్టెన్ రూట్ కూడా బెయిర్ స్టోను అభినందిస్తూ హగ్ చేసుకున్నాడు. కాగా బెయిర్ స్టో ఇంగ్లండ్ తరపున 76 టెస్టుల్లో 4307 పరుగులు, 89 వన్డేల్లో 3498 పరుగులు, 57 టీ20ల్లో 1143 పరుగులు చేశాడు ఇక టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతుంది. లంచ్ సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. జో రూట్ 89 పరుగులతో సెంచరీకి చేరువ కాగా.. జానీ బెయిర్ స్టో 51 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా బౌలర్లలో సిరాజ్ రెండు.. షమీ ఒక వికెట్ తీశాడు. -
IND Vs ENG 2nd Test: 27 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్
► టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు భారత్‌పై 27పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ► ఇంగ్లండ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ 111వ ఓవర్లో మొయిన్ అలీ, సామ్ కరన్‌లు వెనువెంటనే ఔటయ్యారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 112 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఆధిక్యం దిశగా ఇంగ్లండ్.. ► టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తుంది. రూట్ 151 పరుగులతో అజేయంగా ఆడుతుండగా.. మొయిన్ అలీ 27 పరుగులతో సహకరిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 24 పరుగులే వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 110 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. మూడు సెషన్ల పాటు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ పూర్తి ఆధిపత్యం కనబరచగా.. భారత బౌలర్లు రోజంతా కష్టపడి రెండు వికెట్లు మాత్రమే తీయగలిగారు. రూట్ సెంచరీ.. ఇంగ్లండ్ 243/4 ► ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ లార్డ్స్ టెస్టులో శతకంతో మెరిశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 82వ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసిన రూట్ టెస్టు కెరీర్లో 22వ శతకాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. బెయిర్ స్టో ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ► టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బెయిర్ స్టో రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన బెయిర్ స్టో సిరాజ్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రూట్, బెయిర్ స్టోల మధ్య ఏర్పడిన 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. రూట్ 99, బట్లర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. లంచ్ విరామం.. ఇంగ్లండ్ 216/3 ► టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో లంచ్ సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. జో రూట్ 89 పరుగులతో సెంచరీకి చేరువ కాగా.. జానీ బెయిర్ స్టో 51 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా బౌలర్లలో సిరాజ్ రెండు.. షమీ ఒక వికెట్ తీశాడు. ఇంగ్లండ్ ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులు వెనుకబడి ఉంది. నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్.. ► టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. 65 ఓవర్ల ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రూట్ 76, బెయిర్ స్టో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. రూట్ హాఫ్ సెంచరీ.. ఇంగ్లండ్ 150/3 ► టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 119/3 క్రితం రోజు స్కోరుతో ఇంగ్లండ్ ఆటను ఆరంభించింది. 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిరాజ్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన రూట్ అర్థ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 214 పరుగులు వెనుకబడి ఉంది. లార్డ్స్: లార్డ్స్ టెస్టు రెండో రోజు ఆటను భారత్, ఇంగ్లండ్ బౌలర్లు పది వికెట్లతో శాసించారు. పటిష్ట స్థితిలో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్, ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి మరో వంద పరుగులు కూడా జోడించలేకపోయింది. టీమిండియా పేసర్లకు తలవంచిన ఇంగ్లండ్ 108 పరుగుల వద్దే 3 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ తరఫున అండర్సన్, భారత ఆటగాళ్లలో సిరాజ్ శుక్రవారం హీరోలుగా నిలిచారు. ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... రూట్ నేతృత్వంలో ఇంగ్లండ్ మూడో రోజు ఎలాంటి పోరాట పటిమ ప్రదర్శించి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం కోసం ప్రయత్నిస్తుందో చూడాలి. -
పంత్ వద్దన్నా వినలేదు, సిరాజ్ మాట విన్నాడు.. మూల్యం చెల్లించుకున్నాడు
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్సాహం మరోసారి టీమిండియా పాలిట శాపంలా మారింది. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో వికెట్ కీపర్ పంత్ ఎంత చెప్పినా వినకుండా రివ్యూ తీసుకొని వృథా చేశాడు. దాంతో భారత కెప్టెన్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ ఎప్పుడూ ఇలానే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని జట్టు విజయావకాశాలను దెబ్బ తీస్తాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. Mohammad Siraj convinced Virat Kohli to take the review of Joe Root, but Rishabh Pant was denying. pic.twitter.com/WepEASpDWH — Mufaddal Vohra (@mufaddal_vohra) August 13, 2021 వివరాల్లోకి వెళితే.. ఇన్నింగ్స్ 23వ ఓవర్ వేసిన సిరాజ్.. నాలుగో బంతిని లైన్ అండ్ లెంగ్త్‌తో వికెట్లపైకి విసిరాడు. బంతిని డిఫెన్స్ చేసేందుకు రూట్ ప్రయత్నించగా.. అది కాస్తా బ్యాట్‌కి దొరకకుండా ఫ్యాడ్‌ని తాకుతూ వెళ్లింది. దాంతో టీమిండియా ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయగా.. అంపైర్ తిరస్కరించాడు. అయితే, బంతి కచ్చితంగా వికెట్లను తాకేలా కనిపించిందని సిరాజ్ చెప్పడంతో కోహ్లీ రివ్యూ తీసుకోవాలని భావించాడు. ఈ విషయమై పంత్ మాత్రం సిరాజ్ అభిప్రాయంతో ఏకీభవించలేదు. బంతి లెగ్ స్టంప్‌కు బయటగా వెళ్తోందని కోహ్లీతో వాదించాడు. Kohli saab noooo. #ENGvsIND pic.twitter.com/jr7r09KOaa — Manya (@CSKian716) August 13, 2021 రివ్యూ వద్దని పంత్ ఎంత వారిస్తున్నా వినని కోహ్లీ.. సరదాగా నవ్వుకుంటూనే రివ్యూకి వెళ్లాడు. తీరా అందులో నాటౌట్‌గా తేలడంతో భంగపడ్డాడు. దీంతో కోహ్లీపై నెటిజన్లు ఫైరవుతున్నారు. సిరాజ్‌పై గుడ్డి నమ్మకంతో కొంప ముంచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రివ్యూ తీసుకునే విషయంలో ధోని వద్ద కోచింగ్ తీసుకుంటే బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. సిరాజ్‌పై సెటైర్ విసిరాడు. డీఆర్ఎస్ అంటే " డోంట్ రివ్యూ సిరాజ్" అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఇటీవల కాలంలో పంత్ చాలా వరకూ డీఆర్ఎస్ కోరడంలో కోహ్లీకి సాయపడుతున్నాడు. కానీ.. లార్డ్స్‌లో పంత్ అభిప్రాయాన్ని పక్కనపెట్టిన కోహ్లీ.. సిరాజ్‌పై గుడ్డి నమ్మకంతో డీఆర్ఎస్ తీసుకొని మూల్యం చెల్లించుకున్నాడు. Rishabh pant to Kohli after review: pic.twitter.com/e8kDoYOIcO — Rajasthani Memer (@Memes_Raj) August 13, 2021 ఇదిలా ఉంటే, ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. ఆండర్సన్(5/62) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 129; 12 ఫోర్లు, సిక్స్) మరో 2 పరుగులు మాత్రమే జోడించి ఔటవ్వగా.. మిగితా జట్టంతా పేకమేడలా కూలింది. 86 పరుగుల వ్యవధిలో భారత్.. తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. పంత్(37), జడేజా(40) పర్వాలేదనిపించగా.. రహానే(1) మరోసారి నిరాశపరిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆదిలో సిరాజ్(2/34) దెబ్బతీయగా, బర్న్స్(49), రూట్(48 బ్యాటింగ్) ఆదుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. Kohli , Siraj and pant discussing whether to take review or not. pic.twitter.com/5ydv2mwuYk — Avneet Singh (@AvneetsinghAs) August 13, 2021 -
70 ఏళ్లలో ఆ ఘనత సాధించిన బౌలర్ అతనొక్కడే..
లండన్: స్వింగ్ కింగ్, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జిమ్మీ అండర్సన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీమిండియాతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన ఆండర్సన్.. గడిచిన 70 ఏళ్లలో ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన(39 ఏళ్ల 14 రోజులు) పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లార్డ్స్ టెస్టు తొలి రోజు రోహిత్ శర్మ, పుజారాలను ఔట్ చేసిన అండర్సన్.. రెండో రోజు రహానే, ఇషాంత్ శర్మ, బుమ్రా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యంత పెద్ద వయసులో 5 వికెట్లు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు జెఫ్ చబ్ పేరిట ఉంది. 1951లో ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో చబ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అప్పటికి అతడి వయసు 40 ఏళ్ల 86 రోజులు. 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అండర్సన్ 39 ఏళ్ల 14 రోజుల వయసులో ఐదు వికెట్ల ఘనత సాధించాడు. టెస్టులో ఐదు వికెట్ల ఘనత సాధించడం అండర్సన్‌కు ఇది 31వ సారి. ప్రస్తుత ఆటగాళ్లలో అశ్విన్ (30), స్టువర్ట్ బ్రాడ్ (18), షకిబుల్ హాసన్ (18), నాథన్ లియోన్ (18) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా, అండర్సన్‌కు లార్డ్స్ మైదానంలో భారత్‌పై మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన, రెండుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శనతో మొత్తంగా 33 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా అండర్సన్ 164 టెస్టుల్లో 626 వికెట్లుతో మూడో అత్యధిక టెస్ట్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే, ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. ఆండర్సన్(5/62) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆదిలో సిరాజ్(2/34) దెబ్బతీయగా, బర్న్స్(49), రూట్(48 బ్యాటింగ్) ఆదుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. -
ఐదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు.. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు
లండన్: టీమిండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ ధాటికి ఐదేళ్ల తర్వాత ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆటగాడు హసీబ్ హమీద్ బెంబేలెత్తిపోయాడు. టెప్ట్ క్రికెట్లో 1717 రోజు తర్వాత తానెదుర్కొన్న తొలి బంతికే గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆఫ్ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని సిరాజ్ విసిరిన ఫుల్ లెంగ్త్ డెలివరి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమైన హమీద్.. క్లీన్ బౌల్డయ్యాడు. ఐదేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతుండటం.. హమీద్ తడబాటుకు కారణమైనట్లు స్పష్టమైంది. హమీద్ చివరిసారి 2016 నవంబర్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. Two in two balls for India as Siraj takes out Sibley and Hameed right after tea Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #BackOurBoys #Siraj pic.twitter.com/ERCbf3Ttk1 — Sony Sports (@SonySportsIndia) August 13, 2021 కాగా, ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో సిరాజ్ వరుస బంతుల్లో వికెట్లు తీసాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ డొమినిక్ సిబ్లే(11)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కు పంపిన సిరాజ్.. ఆమరుసటి బంతికే హసీబ్ హమీద్(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ వరుస బంతుల్లో వికెట్లు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే, ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 129; 12 ఫోర్లు, సిక్స్) మరో 2 పరుగులు మాత్రమే జోడించి ఔటవ్వగా.. మిగితా జట్టంతా పేకమేడలా కూలింది. 86 పరుగుల వ్యవధిలో భారత్.. తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లతో చెలరేగగా, రాబిన్సన్, మార్క్ వుడ్ తలో 2 వికెట్లు, మొయిన్ అలీ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆదిలో సిరాజ్(2/34) దెబ్బతీయగా, బర్న్స్(49), రూట్(48 బ్యాటింగ్) ఆదుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి) అండర్సన్ 83; రాహుల్ (సి) సిబ్లీ (బి) రాబిన్సన్ 129; పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 9; కోహ్లి (సి) రూట్ (బి) రాబిన్సన్ 42; రహానే (సి) రూట్ (బి) అండర్సన్ 1; పంత్ (సి) బట్లర్ (బి) వుడ్ 37; జడేజా (సి) అండర్సన్ (బి) వుడ్ 40; షమీ (సి) బర్న్స్ (బి) అలీ 0; ఇషాంత్ (ఎల్బీ) (బి) అండర్సన్ 8; బుమ్రా (సి) బట్లర్ (బి) అండర్సన్ 0; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (126.1 ఓవర్లలో ఆలౌట్) 364. వికెట్ల పతనం: 1–126, 2–150, 3–267, 4–278, 5–282, 6–331, 7–336, 8–362, 9–364, 10–364. బౌలింగ్: అండర్సన్ 29–7–62–5, రాబిన్సన్ 33–10–73–2, స్యామ్ కరన్ 22–2–72–0, మార్క్ వుడ్ 24.1–2–91–2, మొయిన్ అలీ 18–1–53–1. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (ఎల్బీ) (బి) షమీ 49; సిబ్లీ (సి) రాహుల్ (బి) సిరాజ్ 11; హమీద్ (బి) సిరాజ్ 0; రూట్ (బ్యాటింగ్) 48; బెయిర్‌స్టో (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (45 ఓవర్లలో 3 వికెట్లకు) 119. వికెట్ల పతనం: 1–23, 2–23, 3–108. బౌలింగ్: ఇషాంత్ శర్మ 11–2–32–0, బుమ్రా 9–3–23–0, షమీ 8–2–22–1, సిరాజ్ 13–4–34–2, జడేజా 4–1–6–0. -
తొలి రోజు ఆట అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందో చూడండి..!
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(127 నాటౌట్) సూపర్ శతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే, తొలి రోజు ఆట ముగిసిన అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో లభించిన అపురూపమైన స్వాగతం రాహుల్‌కు జీవితాంతం గుర్తుండిపోతుంది. కోచ్ రవిశాస్త్రి సహా జట్టు సభ్యులంతా లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలుకుతూ అతనికి అభినందనలు తెలిపారు. క్రికెట్ మక్కాగా భావించే ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో సెంచరీ చేసినందుకు గాను అతని పేరును బాల్కనీలోని సెంచరీ హీరోల లిస్ట్‌లో చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. 🎥 Scenes as @klrahul11 returns to the dressing room after his brilliant 1⃣2⃣7⃣* on Day 1 of the Lord's Test. 👏 👏#TeamIndia #ENGvIND pic.twitter.com/vY8dN3lU0y — BCCI (@BCCI) August 13, 2021 కాగా, రాహుల్ కంటే ముందు కేవలం ఇద్దరు భారత ఓపెనర్లు మాత్రమే ఈ మైదానంలో శతకొట్టారు. 1990లో రవిశాస్త్రి, 1952లో వినోద్ మన్కడ్‌లు మాత్రమే లార్డ్స్‌లో సెంచరీ సాధించిన భారత ఓపెనర్లు. ఇదిలా ఉంటే, తొలి రోజు ప్రదర్శించిన ఆట, చేతిలో ఉన్న వికెట్లను చూస్తే భారత్ స్కోరు కనీసం 500 పరుగుల వరకు చేరగలదనిపించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు చక్కటి ప్రదర్శనతో టీమిండియాను 364 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆండర్సన్ 5, రాబిన్సన్, మార్క్ వుడ్ తలో 2 వికెట్లు, మొయిన్ అలీ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆదిలో సిరాజ్(2/34) దెబ్బతీయగా, బర్న్స్(49), రూట్(48 బ్యాటింగ్) ఆదుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. -
సూపర్ అండర్సన్.. నాలుగు సార్లు ఐదు ; రెండు సార్లు నాలుగు
లార్డ్స్: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ సీనియర్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లతో దుమ్మురేపాడు. స్వతహాగా లార్డ్స్‌లో మంచి రికార్డు కలిగిన అండర్సన్ మరోమారు ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతోపాటు అండర్సన్‌కు లార్డ్స్ మైదానంలో భారత్‌పై మంచి రికార్డే ఉంది. 2007 నుంచి చూసుకుంటే భారత్‌పై లార్డ్స్ టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అండర్సన్ మరో రెండుసార్లు నాలుగు వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా లార్డ్స్ మైదానంలో టీమిండియాపై అండర్సన్ టెస్టుల్లో ఇప్పటివరకు 33 వికెట్లు తీశాడు. ఇక టెస్టుల్లో అండర్సన్ 5 వికెట్ల ఘనతను సాధించడం ఇది 31వ సారి. ఓవరాల్‌గా అండర్సన్ 164 టెస్టుల్లో 626 వికెట్లు తీశాడు. ఇక రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ 129 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ 83, కోహ్లి 42, జడేజా 40 పరుగులు చేశారు. A 31st five-wicket haul for James Anderson! What a star 🌟#WTC23 | #ENGvIND pic.twitter.com/Y7wNXrCwec — ICC (@ICC) August 13, 2021 -
IND Vs ENG: కేఎల్ రాహుల్.. ఔటైనా రికార్డు సాధించాడు
లార్డ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కేఎల్ రాహుల్ శతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రికార్డులు సాధించిన రాహుల్ తాజాగా రెండో రోజు ఆట ప్రారంభంలోనే ఓలి రాబిన్సన్ బౌలింగ్‌లో 129 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ ఔటైనప్పటికి ఒక రికార్డు అందుకున్నాడు. లార్డ్స్ టెస్టులో భారత్ తరపున సెంచరీ సాధించడంతో పాటు అత్యధిక స్కోరు నమోదు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇంతకముందు 1952లో వినూ మన్కడ్ (184 పరుగులు), 1982లో దిలీప్ వెంగ్‌సర్కార్(157 పరుగులు), 1996లో సౌరవ్ గంగూలీ(131 పరుగులు) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అంతకముందు టెస్టు కెరీర్లో ఆరో శతకం చేసిన రాహుల్ లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించిన మూడో భారత ఓపెనర్‌గా రాహుల్ ఘనత సాధించాడు. అంతకుముందు రవిశాస్త్రి(1990), వినోద్ మన్కడ్(1952)లు మాత్రమే లార్డ్స్‌లో సెంచరీ సాధించిన భారత ఓపెనర్లు కాగా, వారి సరసన ఇప్పుడు రాహుల్ చేరిపోయాడు. కాగా, ఆసియా బయట టెస్టు ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి రాహుల్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ జాబితాలో సునీల్ గావస్కర్ 15 సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా, సెహ్వాగ్-రాహుల్‌లు తలో నాలుగు సెంచరీలు సాధించారు. ఆ తర్వాత స్థానంలో వినోద్ మన్కడ్-రవిశాస్త్రిలు తలో మూడు సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 96 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. -
ఫీల్డర్ల ఏకాగ్రతకు పరీక్ష.. వైరలవుతున్న కొత్త ఫీల్డింగ్ డ్రిల్
లండన్: టీమిండియా ఫీల్డింగ్‌ను మరింత మెరుగుపరిచేందుకు, ఫీల్డర్ల ఏకాగ్రతను పరీక్షించడానికి ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఓ వినూత్న ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు లార్డ్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ప్లేయర్స్‌కు ఓ కొత్త ఫీల్డింగ్ డ్రిల్‌ను ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ బ్యాటింగ్ చేస్తుండగా.. స్టంప్స్ వెనుక రిషబ్ పంత్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. అతని ఏకాగ్రతను పరీక్షించడానికి శ్రీధర్ తనకు రెండు వైపులా ఇద్దరు ప్లేయర్స్‌ను ఉంచాడు. How is that for a drill? Fielding coach @coach_rsridhar keeping the boys on their toes. #TeamIndia #ENGvIND @RishabhPant17 • @Wriddhipops • @prasidh43 • @Hanumavihari pic.twitter.com/LjER4lgFV0 — BCCI (@BCCI) August 10, 2021 బౌలర్ బౌలింగ్ చేస్తుండగా.. ఈ ఇద్దరు ప్లేయర్స్ అటు నుంచి ఇటు బంతిని విసురుతూ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మధ్యలో ఈ బాల్ వల్ల పంత్ తన ఏకాగ్రత కోల్పోకుండా బౌలర్ విసిరిన బంతిని పట్టుకోవాలి. ఈ వినూత్న ఫీల్డింగ్ డ్రిల్ ఎలా ఉంది అంటూ బీసీసీఐ ట్విటర్లో సంబంధిత వీడియోను పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు కొత్త ఫీల్డింగ్ డ్రిల్ ఐడియా అదుర్స్ అంటున్నారు. కాగా, రేపటి నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ కోసం టీమిండియా లార్డ్స్ మైదానంలో ముమ్మరంగా సాధన చేస్తోంది. ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆటగాళ్లు చమటోడుస్తున్నారు. -
రెండో టెస్ట్‌కు ఆ ఇద్దరు స్టార్ పేసర్లు డౌటే..
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జరగనున్న రెండో టెస్ట్‌కు ముందు ఇరు జట్లకు షాక్ తగిలింది. టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ గాయాలపాలయ్యారు. వార్మప్ సందర్భంగా బ్రాడ్ గాయపడగా.. ప్రాక్టీస్ సెషన్లో శార్దూల్‌కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఈ ఇద్దరు పేసర్లు రెండో టెస్ట్ అడేది అనుమానమే. లార్డ్స్‌లో 150వ టెస్ట్ ఆడాల్సి ఉన్న బ్రాడ్.. జట్టుకు దూరం కావడం వ్యక్తిగతంగానే కాకుండా ఇంగ్లండ్ జట్టుపై కూడా ప్రభావం చూపనుంది. సిరీస్ కీలక దశలో సీనియర్ బౌలర్ సేవలు కోల్పోవడం ఇంగ్లీష్ జట్టుకు మింగుడు పడని విషయమే. ఇప్పటికే ఆ జట్టు జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ లాంటి బౌలర్ల సేవలు కోల్పోయింది. మరోవైపు టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సేవలు కోల్పోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. తొలి టెస్ట్‌లో శార్దూల్ మెరుగ్గా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. లార్డ్స్ పిచ్ కూడా పేసర్లకు అనుకూలించనుండటంతో రెండో టెస్ట్‌లో అతని స్థానం దాదాపు ఖరారైంది. ఇలాంటి తరుణంలో గాయం కారణంగా అతను దూరం కావడం టీమిండియాను కలవరపెడుతోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో శార్దూల్ దూరమైతే అతని స్థానంలో అశ్విన్ లేదా పేస్ బౌలర్లు ఇషాంత్, ఉమేష్‌లలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. కాగా, తొలి టెస్ట్‌లో టీమిండియా గెలిచేలా కనిపించినా.. చివరి రోజు ఆట మొత్తం వర్షార్పణం కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
England Vs Newzealand: తొలి టెస్ట్ డ్రా
లండన్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు డ్రాగా ముగించుకోగలిగింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రోజు నుంచి అంతగా ప్రభావం చూపించని ఇంగ్లండ్ జట్టు ఎట్టకేలకు మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. కివీస్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, ఆఖరి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్ డామినిక్ సిబ్లీ 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, కెప్టెన్ జో రూట్ (40) పర్వాలేదనిపించాడు. రోరి బర్న్స్ (25), జాక్ క్రాలీ (2) ఆకట్టుకోలేకపోయినా.. చివర్లో సిబ్లేకు ఓలీ పోప్ (20) తోడుగా నిలిచాడు. కివీస్ బౌలర్లలో వాగ్నర్‌కు రెండు, సౌథీకి ఓ వికెట్ దక్కింది. అంతకుముందు 62/2 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 169 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్(36), రాస్ టేలర్(33) ఓ మోస్తరుగా రాణించగా, ఓలీ రాబిన్సన్ 3 వికెట్లతో సత్తా చాటాడు. కాగా, అరంగేట్రం ఆటగాడు డెవాన్ కాన్వే ద్విశతకంతో సత్తాచాటడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులు చేయగా, రోరీ బర్న్స్(132) శతకొట్టడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కివీస్ సీనియర్ పేసర్ టీమ్ సౌథీ (6/43) దారుణంగా దెబ్బ తీశాడు. ఇక అరంగేట్రంలోనే ద్విశతకంతో రాణించిన డెవాన్ కాన్వేను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు, జూన్ 10 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది. చదవండి: కోహ్లీకి పెద్ద ఫ్యాన్‌ని అంటున్న ప్రముఖ పాక్ క్రికెటర్ భార్య.. -
టిమ్ సౌథీ 'ఆరే'యడంతో న్యూజిలాండ్‌కు ఆధిక్యం
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసి, 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో టామ్ లాథమ్ (30), నీల్ వాగ్నర్ (1) ఉన్నారు. ఇంగ్లీష్ బౌలర్ ఓలీ రాబిన్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇంకా ఆటలో ఒక్కరోజే మిగిలి ఉండటంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా, వరణుడి దెబ్బకు మూడో రోజు ఆట పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. ఓవర్ నైట్ స్కోరు 111/2తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌ను కివీస్ సీనియర్ పేసర్ టీమ్ సౌథీ (6/43) దారుణంగా దెబ్బ తీశాడు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను వరుసగా పెవిలియన్‌కు పంపాడు. సౌథీకి మరో పేసర్ కైల్ జేమిసన్ (3/85) తోడవ్వడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రోరీ బర్న్స్ (132; 297 బంతుల్లో 16×4, 1×6) అద్భుత శతకానికి, కెప్టెన్ జో రూట్ (42), ఓలీ రాబిన్సన్ (42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తోడవ్వడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. వీరితో పాటు ఇంగ్లండ్ జట్టులో ఓలీ పోప్(22), స్టువర్ట్ బ్రాడ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (200) డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. కాగా, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూన్ 10 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు రెండో టెస్టులో తలపడనున్నాయి. ఈ సిరీస్ అనంతరం కివీస్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌తో తలపడనుంది. జూన్ 18న ఇరు జట్లు సౌతాంప్టన్ వేదికగా ప్రతిష్టాత్మకమైన పోరులో తలపడనున్నాయి. చదవండి: మా ఆయన మహా ముదురు.. అప్పటికే గర్ల్ ఫ్రెండ్ ఉండేది -
గంగూలీ 25 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్..
లండన్: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 25 ఏళ్ల కింద నెలకొల్పిన ఓ అరుదైన రికార్డును న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే బద్దలు కొట్టాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో బుధవారం మొదలైన తొలి టెస్ట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే అజేయమైన 136 పరుగులు సాధించిన కాన్వే.. 1996లో ఇదే వేదికపై గంగూలీ నెలకొల్పిన 131 పరుగుల అత్యధిక స్కోర్ రికార్డును అధిగమించాడు. ఈ క్రమంలో లార్డ్స్ మైదానంలో అరంగేట్రంలో సెంచరీ సాధించిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. దీంతో పాటు కాన్వే మరో రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున తొలి మ్యాచ్‌లోనే శతకం నమోదు చేసిన 12వ ఆటగాడిగా, అలాగే న్యూజిలాండ్ తరఫున అరంగేట్రంలో నాలుగో అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్‌గా రికార్డులు నెలకొల్పాడు. కాగా, గంగూలీ, కాన్వేకు సంబంధించిన కొన్ని విషయాలు యాదృచ్చికంగా ఒకేలా ఉన్నాయి. వీరిద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్, రైట్ హ్యాండ్ మీడియం పేసర్లు కాగా, వీరిద్దరి పుట్టిన రోజు కూడా ఒకే రోజు కావడం విశేషం. దాదా, కాన్వేలు జులై 8న జన్మించారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం మొదలైన తొలి టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే (240 బంతుల్లో 136 నాటౌట్; 16 ఫోర్లు), హెన్రీ నికోల్స్ (46 నాటౌట్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అజేయమైన 132 పరుగులు జోడించారు. టామ్ లాథమ్(23), కెప్టెన్ విలియమ్సన్(13), రాస్ టేలర్(14) తక్కువ స్కోర్‌కే అవుటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్ రెండు, అండర్సన్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: ఆ ఐపీఎల్ ఆటగాళ్లకు జీతాలు కట్.. -
తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి షాక్..
లండన్: న్యూజిలాండ్‌తో రేపటి నుంచి (జూన్ 2) ప్రారంభంకానున్న తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లాండ్‌కు గట్టి షాక్ తగిలింది. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా ఆ జట్టు సారధి జో రూట్ గాయపడ్డాడు. బ్యాటింగ్ సాధన చేసేటప్పుడు అతని చేతికి గాయంకావడంతో వెంటనే అతను నెట్స్ నుంచి వెళ్లిపోయాడు. నెట్స్‌లో డాగ్ థ్రోయర్ ద్వారా కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ సంధించిన బంతి నేరుగా కుడి చేతిని తాకడంతో రూట్ కొద్దిసేపు బాధతో విలవిలలాడిపోయాడు. అసిస్టెంట్ కోచ్ పాల్ కొలింగ్‌వుడ్ సహకారంతో అతను గ్రౌండ్‌ను వీడాడు. మరి కొద్దిగంటల్లో న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితుల్లో అతను గాయపడటం ఇంగ్లండ్ జట్టును కలవరపెడుతుంది. ఇప్పటికే కీలక ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, జేసన్ రాయ్ జట్టుకు దూరం కాగా, తాజాగా కెప్టెన్ రూట్ కూడా గాయం బారిన పడటంతో ఇంగ్లీష్ జట్టులో ఆందోళన మొదలైంది. గత కొద్దికాలంగా సూపర్ ఫామ్‌లో ఉన్న రూట్ ఇంగ్లండ్ విజయావకాశాలను కచ్చితంగా ప్రభావితం చేయగలడని అభిమానులు ఆశలు పెంచుకున్నారు. అయితే గాయం కారణంగా అతను మ్యాచ్‌కు దూరమైతే తమ జట్టు ఓటమి పాలవుతుందని ఇంగ్లండ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ మ్యాచ్‌కు రూట్ అందుబాటులో ఉండకపోతే అతని స్థానాన్ని సామ్ బిల్లింగ్స్ భర్తీ చేస్తాడని జట్టు యాజమాన్యం సూచన ప్రాయంగా తెలిపింది. చదవండి: త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న పాక్ కెప్టెన్ -
ఈరోజు దాదాకెంతో ప్రత్యేకం..!
కోల్‌కతా: భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సౌరవ్ గంగూలీకి ఈ రోజెంతో ప్రత్యేకం. 1996 జూన్ 22న టెస్టుల్లో అరంగేట్రం చేసిన సౌరవ్.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో అతను 131 పరుగులు సాధించాడు. టీమిండియా బౌలర్ వెంకటేష్ ప్రసాద్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ వికెట్ కోల్పోయింది. మూడో స్థానంలో వచ్చిన లెఫ్టార్మ్ బ్యాట్స్‌మన్ సౌరవ్ 310 బంతుల్లో 131 పరుగులు చేసి వెనుదిరిగాడు. వాటిలో 20 బౌండరీలు ఉండటం విశేషం. (చదవండి: దాదా ఇంట్లో మరో ఇద్దరికి కరోనా) రాహుల్ ద్రవిడ్‌తో కలిసి 94 పరుగులు జోడించిన అనంతరం జట్టు స్కోరు 296 పరుగుల వద్ద సౌరవ్ ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అప్పటికీ ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇక ద్రవిడ్‌కు కూడా ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడం మరో విశేషం. అయితే, 95 పరుగుల వద్ద ఔటైన ద్రవిడ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మొత్తం మీద 429 పరుగుల చేసిన టీమిండియా 85 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 278 పరుగుల చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 2019 అక్టోబర్‌లో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. (చదవండి: ‘అది గంగూలీకి గుర్తుందో లేదో’) -
ఐర్లాండ్ ఇంత దారుణమా?
లార్డ్స్ : మొన్ననే విశ్వవిజేతకు ముచ్చెమటలు పట్టించి అందరి మన్ననలు పొందిన ఐర్లాండ్.. నేడు దారుణ ప్రదర్శనతో అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగురోజుల టెస్ట్‌లో తొలి రోజు అతిథ్య జట్టును 85 పరుగులకే కుప్పకూల్చి ఔరా అనిపించింది. బ్యాటింగ్‌లో 207 పరుగులతో ఫర్వాలేదనిపించింది. కానీ తొలి రోజు రెచ్చిపోయిన ఐర్లాండ్ బౌలర్లు రెండో రోజు పట్టు విడిచారు. తొలి ఇన్నింగ్స్‌లో దెబ్బతిని తీవ్ర అవమానానికి గురైన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జూలు విధిల్చారు. రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులు చేసి 182 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. అయితే తొలి రోజు ఐర్లాండ్ ఆటను చూసిన వారందరికీ ఈ లక్ష్యం అంత పెద్దదేం కాదనిపించింది. ఐర్లాండ్ చరిత్ర సృష్టిస్తోందని, కనీసం గట్టిపోటీనైనా ఇస్తుందనిపించింది. కానీ ప్చ్.. కేవలం 35 పరుగులకే ఆలౌటై అందరినీ నిరాశపరిచింది. 15.4 ఓవర్లలోనే చాపచుట్టేయడం గమనార్హం. దీంతో ఆతిథ్య జట్టు 143 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 6 వికెట్లతో చెలరేగగా.. స్టువర్ట్ బ్రాడ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో జేమ్స్ మెక్‌కలమ్ (11) ఒక్కడే రెండంకలే స్కోర్ చేయడం గమనార్హం. ఇక అంతర్జాతీయ టెస్ట్‌ల్లో ఇది ఏడో అత్యల్ప స్కోర్‌గా నమోదుకాగా.. ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్న మూడో దేశంగా ఐర్లాండ్ నిలిచింది. 26 న్యూజిలాండ్- ఇంగ్లండ్ 1955 30 దక్షిణాఫ్రి- ఇంగ్లండ్ 1896 30 దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్ 1924 35 దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ 1899 36 దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్ 1902 36 దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా 1932 38 ఐర్లాండ్ -ఇంగ్లండ్ 2019 -
ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్
లార్డ్స్ : వన్డేల్లో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు టెస్టుల్లో పసికూన ఐర్లాండ్ దిమ్మతిరిగే షాకిచ్చింది. బుధవారం నుంచి ప్రారంభమైన నాలుగు రోజుల టెస్ట్‌లో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 85 పరుగులకే కుప్పకూల్చి యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను పర్యాటక జట్టు బౌలర్ టిమ్ ముర్తాగ్ 5 వికెట్లతో చెలరేగి కోలుకోలేని దెబ్బతీశాడు. ఐర్లాండ్ బౌలర్ల దాటికి ప్రపంచమేటి బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో డేన్లీ(23), కరన్(18), స్టోన్ (19) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బెయిర్‌స్టో, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్ అయితే ఖాతా కూడా తెరవలేకపోయారు. ఐర్లాండ్ బౌలర్లలో ముర్తాగ్కు తోడుగా మార్క్ అదైర్ మూడు, ర్యాంకిన్ రెండు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ కేవలం 23.4 ఓవర్లకే ముగిసింది. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఐర్లండ్ 32/1తో నిలకడగా ఆడుతోంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌కు ఇది అత్యంత చెత్త రికార్డుగా మిగిలిపోయింది. వన్డేల్లో తగిన గుర్తింపు తెచ్చుకున్న ఐర్లాండ్... సంప్రదాయ టెస్టు క్రికెట్లోనూ ఉనికి చాటుకోవడానికి వచ్చిన సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. గతేడాదే టెస్టు అరంగేట్రం చేసిన ఐర్లాండ్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లే ఆడింది. తొలి టెస్టులోనే పెద్ద జట్టయిన పాకిస్తాన్‌కు గట్టి పోటీ ఇచ్చి ఓడింది. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులోనూ పరాజయం పాలైనా ఫర్వాలేదనే ప్రదర్శన చేసింది. తాజాగా వన్డే ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌కు మచ్చెమటలు పట్టించింది. ఐర్లాండ్ జట్టులో కౌంటీల్లో ఆడిన అనుభవం ఉన్నపేసర్ టిమ్ ముర్టాగ్ చెలరేగాడు. ఇటీవలే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 800 వికెట్ల మైలురాయిని అందుకున్న ముర్టాగ్ తన సత్తా ఎంటో చూపించాడు. ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్ జాసన్ రాయ్, పేసర్ స్టోన్‌కు ఈ మ్యాచ్ ఓ పిడ కలలా మారింది. వన్డేల్లో మెరుపులు మెరిపించిన రాయ్ ఈ మ్యాచ్‌లో 5 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. -
ఇంగ్లండ్Vs భారత్ కాదు.. మెన్ Vs బాయ్స్
లండన్ : లార్డ్స్ టెస్టులో టీమిండియా ఆటగాళ్ల ఆట చిన్నపిల్లలను తలిపించిందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసీర్ హుస్సేన్ ఎగతాళి చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కనీస పోరాట పటిమ చూపించలేకపోయారని, మెన్Vs బాయ్స్ అన్నట్లు సాగిందని విమర్శించాడు. ఈ దిగ్గజ క్రికెటర్ ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘ఇక్కడి పిచ్ పరిస్థితుల్లో ఇంగ్లండ్ అద్భుతమని తెలిసిందే. కానీ ప్రపంచ నెం1 అయినా భారత్ ఎలా ఆడుతుందోనని అందరూ దృష్టిసారించారు. కానీ ఆజట్టు ఘోరంగా విఫలమైంది. ప్రపంచనెం1 అంటే ఓ తుపాకీలాంటి జట్టు. సిరీస్ హోరాహోరిగా సాగుతుందనుకుంటే మెన్Vs బాయ్స్ అన్నట్లు సాగింది. వారు అపసవ్య దిశలో పయనిస్తున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో రాణించిన కోహ్లి లార్డ్స్‌లో విఫలమయ్యాడు. వెన్నునొప్పితో అతను బాధపడినట్లు కనిపించింది. ఇక అశ్విన్ పోరాటం ఆకట్టుకుంది. కానీ మిగతా బ్యాట్స్‌మన్ వారి వైఫల్యాన్ని కొనసాగించారు. మూడో టెస్ట్ జరిగే ట్రెంట్ బ్రిడ్జ్ కూడా భారత్‌కు ప్రతికూలమే. వారు కష్టపడితే డ్రా మాత్రమే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లండ్ పేసర్స్ జేమ్స్ అండర్సన్, బ్రాడ్‌లకు మంచి రికార్డు ఉంది. కనుక ఈ మ్యాచ్ భారత్‌కు అంత సులువు కాదు. 2016 భారత్‌లో జరిగిన సిరీస్ 4-0 వైట్‌వాష్‌ను ఇంగ్లండ్ 5-0తో తిరిగివ్వనుంది. ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం ఆకలితో ఉంది. వారు విశ్రాంతి తీసుకోరు. ఇంకా ఇంకా బాగా ఆడాలని ప్రయత్నిస్తారు’ అని నాసీర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. (చదవండి: కోహ్లి ‘టాప్’ చేజారె... ) ఇక ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 159 పరుగుల తేడాతో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో చివర వరకు పోరాడి 31 పరుగులతో ఓటమి చెందింది. దీంతో ఇంగ్లండ్ 5 టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది. చదవండి: గెలిపించేదెవరు..? -
లార్డ్స్ టెస్టులో భారత్ ఘోర పరాజయం