
లండన్: టీమిండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ ధాటికి ఐదేళ్ల తర్వాత ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆటగాడు హసీబ్ హమీద్ బెంబేలెత్తిపోయాడు. టెప్ట్ క్రికెట్లో 1717 రోజు తర్వాత తానెదుర్కొన్న తొలి బంతికే గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆఫ్ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని సిరాజ్ విసిరిన ఫుల్ లెంగ్త్ డెలివరి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమైన హమీద్.. క్లీన్ బౌల్డయ్యాడు. ఐదేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతుండటం.. హమీద్ తడబాటుకు కారణమైనట్లు స్పష్టమైంది. హమీద్ చివరిసారి 2016 నవంబర్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.
Two in two balls for India as Siraj takes out Sibley and Hameed right after tea
— Sony Sports (@SonySportsIndia) August 13, 2021
Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #BackOurBoys #Siraj pic.twitter.com/ERCbf3Ttk1
కాగా, ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో సిరాజ్ వరుస బంతుల్లో వికెట్లు తీసాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ డొమినిక్ సిబ్లే(11)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కు పంపిన సిరాజ్.. ఆమరుసటి బంతికే హసీబ్ హమీద్(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ వరుస బంతుల్లో వికెట్లు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఇదిలా ఉంటే, ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 129; 12 ఫోర్లు, సిక్స్) మరో 2 పరుగులు మాత్రమే జోడించి ఔటవ్వగా.. మిగితా జట్టంతా పేకమేడలా కూలింది. 86 పరుగుల వ్యవధిలో భారత్.. తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లతో చెలరేగగా, రాబిన్సన్, మార్క్ వుడ్ తలో 2 వికెట్లు, మొయిన్ అలీ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆదిలో సిరాజ్(2/34) దెబ్బతీయగా, బర్న్స్(49), రూట్(48 బ్యాటింగ్) ఆదుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి) అండర్సన్ 83; రాహుల్ (సి) సిబ్లీ (బి) రాబిన్సన్ 129; పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 9; కోహ్లి (సి) రూట్ (బి) రాబిన్సన్ 42; రహానే (సి) రూట్ (బి) అండర్సన్ 1; పంత్ (సి) బట్లర్ (బి) వుడ్ 37; జడేజా (సి) అండర్సన్ (బి) వుడ్ 40; షమీ (సి) బర్న్స్ (బి) అలీ 0; ఇషాంత్ (ఎల్బీ) (బి) అండర్సన్ 8; బుమ్రా (సి) బట్లర్ (బి) అండర్సన్ 0; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (126.1 ఓవర్లలో ఆలౌట్) 364.
వికెట్ల పతనం: 1–126, 2–150, 3–267, 4–278, 5–282, 6–331, 7–336, 8–362, 9–364, 10–364.
బౌలింగ్: అండర్సన్ 29–7–62–5, రాబిన్సన్ 33–10–73–2, స్యామ్ కరన్ 22–2–72–0, మార్క్ వుడ్ 24.1–2–91–2, మొయిన్ అలీ 18–1–53–1.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (ఎల్బీ) (బి) షమీ 49; సిబ్లీ (సి) రాహుల్ (బి) సిరాజ్ 11; హమీద్ (బి) సిరాజ్ 0; రూట్ (బ్యాటింగ్) 48; బెయిర్‌స్టో (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (45 ఓవర్లలో 3 వికెట్లకు) 119.
వికెట్ల పతనం: 1–23, 2–23, 3–108.
బౌలింగ్: ఇషాంత్ శర్మ 11–2–32–0, బుమ్రా 9–3–23–0, షమీ 8–2–22–1, సిరాజ్ 13–4–34–2, జడేజా 4–1–6–0.