
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌పై లార్డ్స్ టెస్టులో టీమిండియా సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ విజయంలో మహ్మద్ సిరాజ్ పాత్ర మరువలేనిది. రెండు ఇన్నింగ్స్‌లు(4/94, 4/32) కలిపి మొత్తంగా 8 వికెట్లతో సిరాజ్ దుమ్మురేపాడు. అంతేకాదు సిరాజ్ సెలబ్రేషన్స్ కాస్త కొత్తగా కనిపించింది. వికెట్ తీసిన ప్రతీసారి సిరాజ్ తన నోటిపై వేలును అడ్డం పెట్టి ఏం మాట్లాడొద్దు అన్నట్లుగా సైగలు చేస్తూ వినూత్నరీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు.
అతని చర్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా సిరాజ్ చర్యలకు ఫిదా అయిన హైదరాబాదీ ఫ్యాన్స్ సినిమా హీరోల తరహాలో అతనికి భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. బ్లూకలర్ టీషర్ట్ వేసుకున్న సిరాజ్ తన నోటిపై వేలును అడ్డంగా పెట్టిన కటౌట్‌ను ఏర్పాటు చేశారు. '' హైదరాబాద్ కా షాన్.. సిరాజ్ కంగ్రాట్స్.. సిరాజ్ ఈజ్ సూపర్ స్టార్..'' అంటూ క్యాప్షన్ జత చేశారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు లీడ్స్ వేదికగా ఆగస్టు 25 నుంచి మొదలుకానుంది.
చదవండి: అందుకే సిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇవ్వలేదట!
Siraj is a Superstar, Miyan getting all the love from the cricket fans. pic.twitter.com/aKG9l00181
— Johns. (@CricCrazyJohns) August 19, 2021