cut out
-
హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్స్ కటౌట్
-
ధోని బర్త్‌డే.. ఆకాశమంత కటౌట్, సినీ హీరోలను మించేలా!
జూలై 7(శుక్రవారం).. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 42వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. అందునా సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంతో ధోనిపై ప్రేమ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన రోజున ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ఇస్తాడని అంతా భావించారు. కానీ మరో తొమ్మిది నెలల తర్వాత తాను ఐపీఎల్ ఆడేది లేనిది చెప్తానంటూ పేర్కొన్నాడు. దీన్నిబట్టి ఫిట్‌గా ఉంటే ధోనిని వచ్చే ఐపీఎల్ సీజన్లో చూసే అవకాశం ఉంది. ఇక రేపు(జూలై 7న) ధోని బర్త్‌డే వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అతని అభిమానులు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోని పుట్టినరోజు పురస్కరించుకొని భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ధోనికి పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశారు. ధోనీ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో 52 అడుగుల పొడవైన కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. టీమిండియా జెర్సీ, బ్యాట్ పట్టుకొని ఉన్న ధోనీ ఉన్న కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 77 అడుగుల పొడవు ఉన్న ధోనీ కటౌట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.ఏపీలోని నందిగామలో ఈ కటౌట్ పెట్టినట్లు సమాచారం. సినీ హీరోలకు తీసిపోని విధంగా ధోనికి కటౌట్ ఏర్పాటు చేయడం అతని క్రేజ్ ఏంటనేది తెలుపుతోంది. ఇక క్రికెటర్లకు ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన వాటిలో ఇదే అది పెద్ద కటౌట్ అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ డ్రెస్‌లో ధోనీ ఉన్నట్టుగా ఈ కటౌట్ ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ధోనీ కటౌట్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ధోనీ క్రేజ్ మాములుగా లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. ‘మిస్టర్ కూల్’ ధోనీ సారథ్యంలో టీమిండియా 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలిచింది. మూడు ఐసీసీ టైటిళ్లను సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా కీర్తి సాధించాడు. 2004లో టీమిండియాలో కీపర్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా అరంగేట్రం చేసిన ధోని.. సుమారు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ కెరీర్లో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని కెరీర్లో 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు చేశాడు. 77 feet cut-out for MS Dhoni in Andra Pradesh. Biggest cutout for any cricketer..❤️ The craze for MS Dhoni is insane!🔥🐐 pic.twitter.com/CWZ2YPyxxp — 𝐒 𝐰 𝐚 𝐫 𝐚 (@SwaraMSDian) July 6, 2023 1st Cutout ✅ 52 feet for Dhoni at Telangana 😎 77ft Biggest Cutout loading ⏳🔥#WhistlePodu #Yellove @MSDhoni pic.twitter.com/Ylj2bbzYZV — CSK Fans Army™ (@CSKFansArmy) July 6, 2023 MS Dhoni Turns 42 Tomorrow !🥳 Watch 42 Sixes Of Him In 42 Seconds .!😉🥁#MSDhoni || @msdhoni || #HappyBirthdayDhoni MSD ICON OF WORLD CRICKET pic.twitter.com/VKqHIwTqer — One Best Shot of MS Dhoni Daily (@MSDVids07) July 6, 2023 చదవండి: #MarkWood: యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్ -
బాలయ్య అభిమానుల అత్యుత్సాహం... వీధిన పడ్డ కుటుంబం
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ కటౌట్ పడి తల్లీబిడ్డ గాయపడ్డారు. విషయాన్ని గమనించిన అభిమానులు ఆదుకుంటామని చెప్పి చేతులెత్తేశారు. వివరాలు.. అనంతపురంలోని హౌసింగ్‌బోర్డు ఆంజనేయస్వామి ఆలయం వద్ద నివాసముంటున్న వృద్ధ దంపతులు రామచంద్ర, వెంకటలక్ష్మికి ఇద్దరు కుమారులు రాఘవేంద్ర (బుద్ధి మాంధ్యం), రాంప్రసాద్, ఇద్దరు కుమార్తెలు జయలక్ష్మి (బుద్ధి మాంధ్యం) చంద్రకళ ఉన్నారు. చిన్నపాటి పనులతో కుటుంబానికి చేదోడుగా చంద్రకళ నిలిచింది. ఇంట్లో మంచానపడిన ముగ్గురికి తల్లి సేవలందిస్తుండగా రాంప్రసాద్ పగలంతా తిరిగి అగరుబత్తీలు అమ్మినా రోజుకు వందకు మించి ఆదాయం ఉండడం లేదు. అతనికి కూడా కాళ్లు సరిగా లేవు. దీంతో కుటుంబం మొత్తం చంద్రకళ సంపాదనపైనే ఆధారపడింది. విషాదం నింపిన బాలయ్య పుట్టిన రోజు.. ఈ నెల 10న నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని అనంతపురంలోని టవర్ క్లాక్ సమీపంలో బాలయ్య అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం అటుగా వెళుతున్న వెంకటలక్ష్మి, చంద్రకళపై కటౌట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనలో చంద్రకళ నోట్లోకి కటౌట్‌కు ఏర్పాటు చేసిన వెదురు కర్ర దూసుకుపోయింది. తల్లికీ తీవ్ర గాయమైంది. అక్కడున్న వారు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చంద్రకళకు శస్త్రచికిత్స చేసి వెదురు కర్రను వైద్యులు తొలగించారు. ఆ సమయంలో ఆమె పళ్లను పూర్తిగా తొలగించి కుట్లు వేశారు. దాదాపు నెలరోజుల పాటు కుట్లు తీయడానికి వీల్లేదని వైద్యులు తెలిపారు. న్యాయం చేయండి జరిగిన అన్యాయానికి మేము ఆర్థిక సాయం కోరడం లేదు. న్యాయం చేయాలని కోరాం. ఆపరేషన్ చేయించుకున్న చెల్లెలు ఎనిమిది రోజులుగా నోరు మెదపలేకపోతోంది. మరో 25 రోజులు ఇదే పరిస్థితి అని డాక్టర్లు చెప్పారు. అన్నం.. నీరు అన్నీ పైప్ ద్వారానే అందజేస్తున్నాం. అమ్మ గొంతుకూ తీవ్రగాయమై మంచం పట్టింది. చెల్లి, అన్న బుద్ధిమాంధ్యులు, చాలా రోజులుగా అనారోగ్యంతో తండ్రి కూడా మంచాన పడ్డాడు. ఇంత మందిని చూసుకోవడం ప్రస్తుతం నావల్ల కావడం లేదు. దయచేసి మాకు న్యాయం చేయండి. – రాంప్రసాద్, -
ఇదీ ప్రభాస్ రేంజ్ అంటే ఆది పురుష్ రికార్డు బిజినెస్ ...
-
నది మధ్యలో మెస్సీ 30 అడుగుల కటౌట్.. వీడియో వైరల్
నవంబర్ 20 నుంచి ఫిఫా వరల్డ్ కప్ మొదలుకానుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవర్ మొదలైంది. కేరళలో కొందరు అభిమానులు అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్స్ మీద తమ అభిమానాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు వెరైటీగా ఆలోచించారు. 30 అడుగుల ఎత్తైన లియొనెల్ మెస్సీ కటౌట్ ఏర్పాటు చేశారు. కోజికోడ్ జిల్లాలోని పుల్లవూర్కు చెందిన కొందరు యువకులు అర్జెంటీనా ఫ్యాన్స్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. ఫిఫా వరల్డ్ కప్‌లో తమ ఫేవరెట్ టీం, ఫేవరెట్ అటగాడికి మద్దతుగా వాళ్లు కురున్గట్టు కడవు నది మధ్యలో మెస్సీ కటవుట్ పెట్టారు. ‘త్వరలో ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ ఈవెంట్‌ని మరింత స్పెషల్‌గా మార్చాలనుకున్నాం. అందుకోసం మెస్సీ నిలువెత్తు కటౌట్ పెట్టాం’ అని పేర్కొన్నారు. రోడ్డు మీదుగా మెస్సీ కటౌట్‌ని తీసుకొస్తున్న ఫొటోలు, వీడియోల్ని రిజ్వాన్ అనే యూజర్ ట్విటర్లో పెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/QYpJa7jqBK — LDF Supporters (@LDFSupporters) November 1, 2022 En Pullavoor, un pequeño pueblo de la India, pusieron una gigantografía de Messi en medio del río. pic.twitter.com/nwOZWjACxb — FOX Sports Argentina (@FOXSportsArg) October 31, 2022 చదవండి: పాక్‌కు మరోసారి టీమిండియానే దిక్కు -
అభిమానుల నుంచి నానికి అదిరిపోయే గిఫ్ట్.. థియేటర్ ముందు భారీ కటౌట్
Natural Star Nani 63 Feet Huge Cutout In Hyderabad: సినిమా హీరోలను అభిమానులు ఎంతగానో ఆదరిస్తారు. ఎవరిమీద చూపినంచా ప్రేమ ఒలకబోస్తారు. తమ ఫేవరెట్ హీరోలను 'అన్న' అని పిలుస్తూ ఇంట్లో మనిషిలా భావిస్తారు. అలాంటిది వారి అభిమాన హీరో సినిమా రిలీజ్ అంటే ఊగిపోతారు. అది పెద్ద పండగలా జరుపుకుంటారు. కటౌట్లు, పాలాభిషేకాలతో తమ అభిమానాన్ని చాటుతారు. తాజాగా నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ తమ అభిమానాన్ని భారీ కటౌట్ రూపంలో ప్రదర్శించారు. నాని ద్విపాత్రాభినయం చేసిన తాజా సినిమా 'శ్యామ్ సింగరాయ్'. సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని హార్ట్‌కోర్ ఫ్యాన్స్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ఓ థియేటర్ ముందు నాని భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. 63 అడుగులతో 'శ్యామ్ సింగరాయ్' పాత్రలో ఉన్న నాని కటౌట్‌ను పెట్టి తమ అభిమానాన్ని అంత ఎత్తులో చూపించారు. ఇప్పటివరకు చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి బడా హీరోల అభిమానులు మాత్రమే ఇలా కటౌట్లు ఏర్పాటు చేసేవారు. తాజాగా చిన్న స్థాయి నుంచి ఎదిగిన నాని భారీ కటౌట్‌ను ఫ్యాన్స్ ఏర్పాటు చేయడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను పునర్జన్మ నేపథ్యంలో రూపొందించారు. సాయి పల్లవి దేవదాసిగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్వకత్వం వహించగా జంగా సత్యదేవ్ కథను అందించారు. డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ తమిళ వెర్షన్‌కు నాని సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. The Celebrations Kick Starts in Advance for #ShyamSinghaRoy 🔱 Here are few Delightful Glimpses✨ from the ROYAL CUT OUT unveiling by Natural 🌟 @NameisNani Fans 😎#SSRonDEC24th🔥@Sai_Pallavi92 @IamKrithiShetty @vboyanapalli @Rahul_Sankrityn @MickeyJMeyer @NiharikaEnt pic.twitter.com/XVCgxdOaBe — Shyam Singha Roy 🔱 (@ShyamSinghaRoy) December 22, 2021 ఇదీ చదవండి: పునర్జన్మపై నమ్మకం ఉందన్న సాయి పల్లవి.. అదెలా అంటే ? -
సిరాజ్ సెలబ్రేషన్స్ వైరల్; హైదరాబాద్‌లో భారీ కటౌట్
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌పై లార్డ్స్ టెస్టులో టీమిండియా సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ విజయంలో మహ్మద్ సిరాజ్ పాత్ర మరువలేనిది. రెండు ఇన్నింగ్స్‌లు(4/94, 4/32) కలిపి మొత్తంగా 8 వికెట్లతో సిరాజ్ దుమ్మురేపాడు. అంతేకాదు సిరాజ్ సెలబ్రేషన్స్ కాస్త కొత్తగా కనిపించింది. వికెట్ తీసిన ప్రతీసారి సిరాజ్ తన నోటిపై వేలును అడ్డం పెట్టి ఏం మాట్లాడొద్దు అన్నట్లుగా సైగలు చేస్తూ వినూత్నరీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. అతని చర్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా సిరాజ్ చర్యలకు ఫిదా అయిన హైదరాబాదీ ఫ్యాన్స్ సినిమా హీరోల తరహాలో అతనికి భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. బ్లూకలర్ టీషర్ట్ వేసుకున్న సిరాజ్ తన నోటిపై వేలును అడ్డంగా పెట్టిన కటౌట్‌ను ఏర్పాటు చేశారు. '' హైదరాబాద్ కా షాన్.. సిరాజ్ కంగ్రాట్స్.. సిరాజ్ ఈజ్ సూపర్ స్టార్..'' అంటూ క్యాప్షన్ జత చేశారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు లీడ్స్ వేదికగా ఆగస్టు 25 నుంచి మొదలుకానుంది. చదవండి: అందుకే సిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇవ్వలేదట! Siraj is a Superstar, Miyan getting all the love from the cricket fans. pic.twitter.com/aKG9l00181 — Johns. (@CricCrazyJohns) August 19, 2021 -
వైఎస్సార్సీపీ కటౌట్లకు నిప్పు
కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు రావికమతం: మండలంలో కొత్తకోట గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన కటౌట్లను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పటించారు. ఇటీవల గ్రామంలో నిర్వహించిన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమానికి ధర్మశ్రీకి మద్దతుగా నాయకులు ఈ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్లకు నిప్పటించడంతో గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు గుమ్మడు సత్యదేవ, శీలం శంకరరావు, పందల దేవాలు సోమవారం కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్.ఐ శేఖరం కేసును నమోదు చేశారు. -
మీకు చేతగాదా చెప్పండి.. మేమే తొలగిస్తాం
‘ఫ్లెక్సీల తొలగింపు’ నివేదికలపై హైకోర్టు అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లు, రోడ్లపై ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించే వ్యవహారంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సమర్పించిన నివేదికలపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలులో ప్రభుత్వాలు విఫలమవుతున్నట్టు ఈ నివేదికలను చూస్తే అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ఫ్లెక్సీలు, తదితరాలను తొలగించడం చేతకాకపోతే ఆ విషయాన్ని తమకు చెప్పాలని, వాటిని ఎలా తొలగింపజేయాలో తమకు తెలుసునని పేర్కొంది. తామిచ్చిన ఆదేశాల ప్రకారం.. ఫ్లెక్సీలు, తదితరాలను తొలగించేందుకు ఇరు ప్రభుత్వాలకు మరో 15 రోజుల గడువునిచ్చింది. ఇదే చివరి అవకాశమని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట విరుద్ధంగా రోడ్లపై విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్.మురళీకృష్ణ 2008లో హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేశారు. -
టీఆర్ఎస్ భవన్ వద్ద కేసీఆర్ కటౌట్ కాల్చివేత
హైదరాబాద్: హైదరాబాద్‌లో టీఆర్ఎస్ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భారీ కటౌట్‌ను దుండగులు తగులబెట్టారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. -
కటౌట్‌తో సహజీవనం
లండన్: హాలీవుడ్ నటుడు బ్రాడ్లీ కూపర్ అంటే డానియెల్లీ అనే మహిళకు పిచ్చి అభిమానం. ఎంత అభిమానమంటే.. ఆ నటుడి నిలువెత్తు కటౌట్‌ను కార్డ్‌బోర్డుతో తయారు చేయించుకుని.. భర్త, ఇద్దరు పిల్లలతో పాటు ఆ కటౌట్‌నీ తమ కుటుంబంలో ఒక భాగంగా భావించేంత. ఆమె భర్త ఎడ్డీ సహా ఆమె కుటుంబమంతా బ్రాడ్లీని (ఆ కటౌట్‌ని) ప్రాణమున్న వ్యక్తిలానే భావిస్తుంటారు. జాగింగ్, తోటపని, వంటపని, షాపింగ్ లాంటి రోజువారీ పనులు కూడా వారంతా కలిసే చేసుకుంటుంటారు. బ్రాడ్లీకి డానియెల్లీ పుస్తకాలు కూడా చదివి వినిపిస్తుంటుంది. ఇంకా వివరాలు కావాలంటే mylifewithbradleycooper.com చూడండి.