బాలీవుడ్ హీరో సోనూ సూద్ హీరోగా నటించిన చిత్రం ఫతే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఈ మూవీ నుంచి మరో ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ఫతే ట్రైలర్-2ను రిలీజ్ చేశారు. సరికొత్త థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సినిమాకు సోనూ సూద్ స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించారు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైబర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైబర్ మాఫియా బారిన ఒక అమ్మాయిని హీరో ఏవిధంగా రక్షించాడు? అనే కోణంలో రూపొందించారు.
గేమ్ ఛేంజర్‌తో పోటీ..
ఫతే సంక్రాంతి కానుకగా జనవరి 10న బాలీవుడ్‌లో విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే పాన్ ఇండియా రేంజ్‌లో అదే రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ అదే రోజు రిలీజవుతోంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. పొంగల్ బరిలో నిలిచిన ఫతే హిందీలో గేమ్ ఛేంజర్‌తో పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది.
భారీ కటౌట్‌తో విద్యార్థుల ప్రదర్శన..
అయితే ఫతే సినిమా రిలీజ్‌కు ముందు విద్యార్థులు సోనూపై అభిమానం చాటుకున్నారు. ఈ మూవీలో దాదాపు 590 అడుగుల పోస్టర్‌ను ప్రదర్శించారు. ఈ భారీ కటౌట్ పోస్టర్‌ను దాదాపు 500 మంది విద్యార్థులు చేతుల్లో పట్టుకుని ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియోనూ సోనూ సూద్ ట్విటర్‌లో పంచుకున్నారు. '390 అడుగులు..500 మంది విద్యార్థులు.. ఇదొక ఎమోషన్' అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
విజయవాడలో గేమ్ ఛేంజర్ కటౌట్..
ఇటీవల గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను విజయవాడలో నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో డిసెంబర్ 29న చిత్ర యూనిట్ సమక్షంలో భారీ కటౌట్‌ను రివీల్ చేశారు.
కటౌట్‌లోనూ పోటీ..
ఫతేస గేమ్ ఛేంజర్ సినిమాలు బాక్సాఫీస్ పోటీకి రెడీ అయిపోయాయి. రెండు సినిమాలు ఈ నెల 10న థియేటర్లలో విడుదలవుతున్నాయి. అయితే గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుండగా.. సోనూ సూద్ ఫతే కేవలం బాలీవుడ్‌లో మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఫతే హీరో సోనూ సూద్ 390 అడుగుల కటౌట్ చూస్తే.. ఈ విషయంలోనూ గేమ్ ఛేంజర్‌ను దాటిపోయింది. దీంతో కటౌట్ విషయంలోనూ రామ్ చరణ్‌తో పోటీ పడుతున్నాడు సోనూ సూద్.
తెలుగులో సోనూ సూద్‌కు ప్రత్యేక గుర్తింపు..
కాగా.. అనుష్క లీడ్ రోల్‌లో నటించిన అరుంధతి సినిమాలో పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. టాలీవుడ్‌లో జులాయి, అతడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. తెలుగు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
390 feet
500 students
1 Emotion ❤️
Fateh 🇮🇳
Jan 10th. pic.twitter.com/oZ3cH7QfHX— sonu sood (@SonuSood) January 7, 2025
Comments
Please login to add a commentAdd a comment