'నువ్వు నిజంగానే దేవుడివయ్యా'.. రిలీజ్ రోజే సంచలన నిర్ణయం! | Sonu Sood Reduces Fateh Tickets Prices To Rs 99 On Release Day 1 | Sakshi
Sakshi News home page

Sonu Sood: 'నువ్వు నిజంగానే దేవుడివయ్యా'.. రిలీజ్ రోజే రూ.99కే టికెట్!

Published Thu, Jan 9 2025 4:38 PM | Last Updated on Thu, Jan 9 2025 4:51 PM

Sonu Sood Reduces Fateh Tickets Prices To Rs 99 On Release Day 1

బాలీవుడ్‌ హీరో సోనూ సూద్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఫతే'. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన  టీజర్‌, ట్రైలర్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఫతే మూవీ రిలీజ్ రోజు టికెట్స్ కేవలం రూ.99 కే ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోనూ సూద్ ఓ వీడియోనూ రిలీజ్ చేశారు. ట్విటర్‌లో వీడియో షేర్ చేసిన సోనూ సూద్ టికెట్స్‌ @99.. ఇంకేం ఆలోచిస్తున్నారంటూ పోస్ట్ చేశారు. కానీ సినిమా విడుదల రోజు అంతా టికెట్స్ రేట్లు పెంచాలని కోరుకుంటే.. సోనూ ఏంటి ఇలా చేశారని నెట్టింట చర్చించుకుంటున్నారు. దీనిపై ఇన్‌స్టాలోనూ వీడియో రిలీజ్ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలో సోనూ సూద్ మాట్లాడుతూ..'2020 కోవిడ్ సమయంలో సహాయం కోసం నన్ను చాలామంది సంప్రదించారు. అందులో ఎక్కువగా సైబర్ క్రైమ్ బాధితులే. వారంతా మోసపోయారు. వారి ఖాతాల నుంచి డబ్బు కొట్టేశారు. ఇది నాకు చాలా బాధ కలిగించింది. ఫతే సినిమాలో నేను సామాన్యుడి కథను చెప్పాలనుకున్నా. ఫతేహ్ అనేది సామాన్యుల కోసమే రూపొందించిన చిత్రం. ఇది భారతదేశం అంతటా అందరూ చూసేలా అందుబాటులో ఉండాలని కోరుకున్నా. అందుకే మేము మొదటి రోజు టిక్కెట్‌ల ధర కేవలం రూ.99 కే నిర్ణయించాము. ఈ సినిమా నుండి వచ్చిన మొత్తం లాభాలను స్వచ్ఛంద సంస్థగా కు విరాళంఇస్తాను.' అని ప్రకటించారు.

టికెట్ ధరలను తగ్గించడంతో పాటు ఈ సినిమా ద్వారా లాభాలను స్వచ్ఛంద సంస్థలు, అనాథ శరణాలయాలకు విరాళంగా ఇస్తానని సోనూ సూద్ ప్రకటించడం ఆయన సేవభావానికి అద్దం పడుతోంది. కేవలం కలెక్షన్ల కోసమే సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో సోనూ నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు ఆయనలోని గొప్ప మానవతం కనిపిస్తోంది. దీంతో ప్రజల గుండెల్లో సోనూ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారు. సోనూ సూద్‌ మరికొందరు హీరోలు ఇలా సాయం చేసేందుకు ముందుకు వస్తే కొంతమందికైనా ఊరట లభిస్తుంది.

ఫతే గురించి..

కాగా.. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యాన‍ర్లపై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైబర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైబర్ మాఫియా బారిన ఒక అమ్మాయిని హీరో ఏవిధంగా రక్షించాడు? అనే కోణంలో రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న బాలీవుడ్‌లో విడుదల కానుంది.

గేమ్ ఛేంజర్‌తో పోటీ..

అయితే పాన్‌ ఇండియా రేంజ్‌లో అదే రోజున గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌ కూడా రిలీజవుతోంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. పొంగల్‌ బరిలో నిలిచిన ఫతే హిందీలో గేమ్‌ ఛేంజర్‌తో పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలుగులో ప్రత్యేక గుర్తింపు..

కాగా.. అనుష్క లీడ్‌ రోల్‌లో నటించిన అరుంధతి సినిమాలో పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. టాలీవుడ్‌లో జులాయి, అతడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. తెలుగు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement