Sonu Sood
-
సోనుసూద్‌ను అరెస్ట్ చేయండి.. కోర్టు ఆదేశాలు
పాటియాలా: ప్రముఖ నటుడు సోనుసూద్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది పంజాబ్‌లోని లూథియానా కోర్టు. ఈ మేరకు సోనుసూద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో కోర్టు ఇలా ఆదేశించింది.వివరాల ప్రకారం.. నటుడు సోనుసూద్ (Sonu Sood)కు లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా, లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూసూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై విచారణ చేపట్టిన లూథియానా కోర్టు.. సోనుసూద్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.పిటిషన్‌పై విచారణ అనంతరం..‘సోనుసూద్‌కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరుకాలేదు. వెంటనే అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి అని ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది. ఇక, సోనుసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోనుసూద్ తెలుగు సహా బాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.Ludhiana’s Judicial Magistrate Ramanpreet Kaur has issued an arrest warrant against Bollywood actor Sonu Sood.The warrant was issued after Sonu Sood failed to appear in court to testify in a ₹10 lakh fraud case involving the fake Rijika coin. The case was filed by… pic.twitter.com/yZ5R3gk32p— Gagandeep Singh (@Gagan4344) February 6, 2025 -
'నువ్వు నిజంగానే దేవుడివయ్యా'.. రిలీజ్ రోజే సంచలన నిర్ణయం!
బాలీవుడ్ హీరో సోనూ సూద్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఫతే'. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఫతే మూవీ రిలీజ్ రోజు టికెట్స్ కేవలం రూ.99 కే ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోనూ సూద్ ఓ వీడియోనూ రిలీజ్ చేశారు. ట్విటర్లో వీడియో షేర్ చేసిన సోనూ సూద్ టికెట్స్ @99.. ఇంకేం ఆలోచిస్తున్నారంటూ పోస్ట్ చేశారు. కానీ సినిమా విడుదల రోజు అంతా టికెట్స్ రేట్లు పెంచాలని కోరుకుంటే.. సోనూ ఏంటి ఇలా చేశారని నెట్టింట చర్చించుకుంటున్నారు. దీనిపై ఇన్‌స్టాలోనూ వీడియో రిలీజ్ చేశారు.ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలో సోనూ సూద్ మాట్లాడుతూ..'2020 కోవిడ్ సమయంలో సహాయం కోసం నన్ను చాలామంది సంప్రదించారు. అందులో ఎక్కువగా సైబర్ క్రైమ్ బాధితులే. వారంతా మోసపోయారు. వారి ఖాతాల నుంచి డబ్బు కొట్టేశారు. ఇది నాకు చాలా బాధ కలిగించింది. ఫతే సినిమాలో నేను సామాన్యుడి కథను చెప్పాలనుకున్నా. ఫతేహ్ అనేది సామాన్యుల కోసమే రూపొందించిన చిత్రం. ఇది భారతదేశం అంతటా అందరూ చూసేలా అందుబాటులో ఉండాలని కోరుకున్నా. అందుకే మేము మొదటి రోజు టిక్కెట్ల ధర కేవలం రూ.99 కే నిర్ణయించాము. ఈ సినిమా నుండి వచ్చిన మొత్తం లాభాలను స్వచ్ఛంద సంస్థగా కు విరాళంఇస్తాను.' అని ప్రకటించారు.టికెట్ ధరలను తగ్గించడంతో పాటు ఈ సినిమా ద్వారా లాభాలను స్వచ్ఛంద సంస్థలు, అనాథ శరణాలయాలకు విరాళంగా ఇస్తానని సోనూ సూద్ ప్రకటించడం ఆయన సేవభావానికి అద్దం పడుతోంది. కేవలం కలెక్షన్ల కోసమే సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో సోనూ నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు ఆయనలోని గొప్ప మానవతం కనిపిస్తోంది. దీంతో ప్రజల గుండెల్లో సోనూ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారు. సోనూ సూద్ మరికొందరు హీరోలు ఇలా సాయం చేసేందుకు ముందుకు వస్తే కొంతమందికైనా ఊరట లభిస్తుంది.ఫతే గురించి..కాగా.. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైబర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైబర్ మాఫియా బారిన ఒక అమ్మాయిని హీరో ఏవిధంగా రక్షించాడు? అనే కోణంలో రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న బాలీవుడ్లో విడుదల కానుంది.గేమ్ ఛేంజర్‌తో పోటీ..అయితే పాన్ ఇండియా రేంజ్లో అదే రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ కూడా రిలీజవుతోంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. పొంగల్ బరిలో నిలిచిన ఫతే హిందీలో గేమ్ ఛేంజర్‌తో పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది.తెలుగులో ప్రత్యేక గుర్తింపు..కాగా.. అనుష్క లీడ్ రోల్లో నటించిన అరుంధతి సినిమాలో పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. టాలీవుడ్లో జులాయి, అతడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. తెలుగు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.Tickets at र 99 Aur kya jaan loge? 🍿 Book now : https://t.co/xhsuVPftZf#FatehAt99 pic.twitter.com/pHvf5QknsC— sonu sood (@SonuSood) January 9, 2025 View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్‌తో ఢీ.. ఇప్పుడు ఆ విషయంలోనూ పోటీ..!
బాలీవుడ్ హీరో సోనూ సూద్ హీరోగా నటించిన చిత్రం ఫతే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఈ మూవీ నుంచి మరో ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ఫతే ట్రైలర్-2ను రిలీజ్ చేశారు. సరికొత్త థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సినిమాకు సోనూ సూద్ స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించారు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైబర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైబర్ మాఫియా బారిన ఒక అమ్మాయిని హీరో ఏవిధంగా రక్షించాడు? అనే కోణంలో రూపొందించారు.గేమ్ ఛేంజర్‌తో పోటీ..ఫతే సంక్రాంతి కానుకగా జనవరి 10న బాలీవుడ్లో విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే పాన్ ఇండియా రేంజ్లో అదే రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ అదే రోజు రిలీజవుతోంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. పొంగల్ బరిలో నిలిచిన ఫతే హిందీలో గేమ్ ఛేంజర్‌తో పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది.భారీ కటౌట్‌తో విద్యార్థుల ప్రదర్శన..అయితే ఫతే సినిమా రిలీజ్‌కు ముందు విద్యార్థులు సోనూపై అభిమానం చాటుకున్నారు. ఈ మూవీలో దాదాపు 590 అడుగుల పోస్టర్‌ను ప్రదర్శించారు. ఈ భారీ కటౌట్ పోస్టర్‌ను దాదాపు 500 మంది విద్యార్థులు చేతుల్లో పట్టుకుని ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియోనూ సోనూ సూద్ ట్విటర్లో పంచుకున్నారు. '390 అడుగులు..500 మంది విద్యార్థులు.. ఇదొక ఎమోషన్' అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.విజయవాడలో గేమ్ ఛేంజర్ కటౌట్..ఇటీవల గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను విజయవాడలో నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో డిసెంబర్ 29న చిత్ర యూనిట్ సమక్షంలో భారీ కటౌట్‌ను రివీల్ చేశారు.కటౌట్‌లోనూ పోటీ..ఫతేస గేమ్ ఛేంజర్ సినిమాలు బాక్సాఫీస్ పోటీకి రెడీ అయిపోయాయి. రెండు సినిమాలు ఈ నెల 10న థియేటర్లలో విడుదలవుతున్నాయి. అయితే గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుండగా.. సోనూ సూద్ ఫతే కేవలం బాలీవుడ్లో మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఫతే హీరో సోనూ సూద్ 390 అడుగుల కటౌట్ చూస్తే.. ఈ విషయంలోనూ గేమ్ ఛేంజర్‌ను దాటిపోయింది. దీంతో కటౌట్ విషయంలోనూ రామ్ చరణ్‌తో పోటీ పడుతున్నాడు సోనూ సూద్.తెలుగులో సోనూ సూద్‌కు ప్రత్యేక గుర్తింపు..కాగా.. అనుష్క లీడ్ రోల్లో నటించిన అరుంధతి సినిమాలో పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. టాలీవుడ్లో జులాయి, అతడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. తెలుగు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.390 feet 500 students 1 Emotion ❤️Fateh 🇮🇳 Jan 10th. pic.twitter.com/oZ3cH7QfHX— sonu sood (@SonuSood) January 7, 2025 -
గేమ్ ఛేంజర్‌తో పోటీ పడనున్న మూవీ.. మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ హీరో సోనూ సూద్ హీరోగా నటించిన తాజా చిత్రం ఫతే. అరుంధతి సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయిన సోనూ సరికొత్త థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాను తానే దర్శకత్వం వహించడం మరో విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.కాగా.. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైబర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైబర్ మాఫియా బారిన ఒక అమ్మాయిని హీరో ఏవిధంగా రక్షించాడు? అనే కోణంలో రూపొందించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న బాలీవుడ్లో విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే పాన్ ఇండియా రేంజ్లో అదే రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ కూడా రిలీజవుతోంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. పొంగల్ బరిలో నిలిచిన ఫతే హిందీలో గేమ్ ఛేంజర్‌తో పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాది భాషల్లోనూ ఫతే రిలీజైతే గనక చెర్రీ మూవీతో బాక్సాఫీస్ వద్ద పోరు తప్పేలా లేదు.తాజాగా ఈ మూవీ మరో ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సోనూ సూద్ ట్వీట్ చేశారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ఫతే ట్రైలర్-2 రిలీజ్ చేశారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు మహేశ్ బాబు.తెలుగులో ప్రత్యేక గుర్తింపు..కాగా.. అనుష్క లీడ్ రోల్లో నటించిన అరుంధతి సినిమాలో పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. టాలీవుడ్లో జులాయి, అతడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. తెలుగు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. An action-packed spectacle that looks absolutely amazing! Wishing all the very best to my dear friend @SonuSood Can’t wait for everyone to witness this magic on screen! 😊 #Fateh https://t.co/d9CZlhWnnk— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2025 Love you brother ❤️ https://t.co/jXadXxOqQt— sonu sood (@SonuSood) January 6, 2025 This will Hit you Hard 🔥Be Ready🪓 #Fateh Trailer-2 🩸https://t.co/DtgNrqoBd0In cinemas on 10th January.@Asli_Jacqueline @ZeeStudios_ @condor_dop @Vm_buffy @ShaktiSagarProd @Fateh4Bharat pic.twitter.com/5UKXIAqEeX— sonu sood (@SonuSood) January 6, 2025 This will Hit you Hard 🔥Be Ready🪓 #Fateh Trailer-2 🩸 pic.twitter.com/s0U9s1Iyri— sonu sood (@SonuSood) January 6, 2025 -
గేమ్ ఛేంజర్‌తో పోటీపడనున్న స్టార్ హీరో మూవీ.. టీజర్ వచ్చేసింది!
పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. టాలీవుడ్లో జులాయి, అతడు, అరుంధతి చిత్రాలతో మెప్పించారు. తెలుగు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ఫతే. ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఆ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు.తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సైబర్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైబర్ మాఫియా బారిన ఒక అమ్మాయిని హీరో ఏవిధంగా రక్షించాడు? అనే కోణంలో రూపొందించారని అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న బాలీవుడ్లో విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో ఇప్పటికైతే క్లారిటీ ఇవ్వలేదు. అయితే అదే రోజున రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా రిలీజవుతోంది.किरदार ईमानदार रखना जनाज़ा शानदार निकलेगा ! 🪓 #Fateh Teaser out now 🔥Releasing in cinemas on 10th January. @Asli_Jacqueline @ZeeMusicCompany @ShaktiSagarProd @ZeeStudios_ Link: https://t.co/wfeG5hIR3W pic.twitter.com/LV0DCjv5rb— sonu sood (@SonuSood) December 9, 2024 -
సోనూసూద్‌కు అరుదైన గౌరవాన్ని కల్పించిన 'థాయిలాండ్' ప్రభుత్వం
బాలీవుడ్ నుంచి తెలుగులో ఎంట్రీ ఇచ్చిన స్టార్ నటుడు సోనూసూద్.. తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు వేసినప్పటికీ రియల్ లైఫ్‌లో హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే నెటజన్ల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్న ఆయనకు తాజాగా థాయిలాండ్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. దీంతో సోనూసూద్ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.థాయ్‌ల్యాండ్ పేరు వింటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికి గుర్తుకొచ్చేది టూరిజం. సీజన్ ఏదైనా కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రేదేశాల నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో భారత్ నుంచి కూడా చాలామంది థాయిలాండ్‌కు వెల్లడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు థాయిలాండ్ ప్రభుత్వం సోనూసూద్‌కు అరుదైన గౌరవాన్ని కల్పించింది. తమ దేశ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన్ను నియమించింది. ఇదే సమయంలో ఆయనను టూరిజం అడ్వైజర్గాను ఆ దేశం ఎంపిక చేసింది. ఇదే విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా సోనూసూద్ తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.2000 సంవత్సరంలో హ్యాండ్సప్ అనే చిన్న సినిమా ద్వారా సోనూసూద్ తెలుగువారికి పరిచయం అయ్యారు. అయితే, సూపర్,అతడు,అరుంధతి చిత్రాలతో భారీగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా కరోనా వల్ల ఏర్పడిన లాక్డౌన్ సమయంలో వేలాది మందికి తన వంతుగా సాయం చేసి అండగా నిలిచారు. తన అమ్మగారి పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి చదువుకోవాలని తపించే పేద విద్యార్థులకు సాయం చేస్తున్నారు.Honoured and humbled at being appointed as the Brand Ambassador and Advisor for Tourism , Thailand 🇹🇭. My first international trip was to this beautiful country with my family and in my new role I am excited to advise and promote the country’s stunning landscapes & rich cultural… pic.twitter.com/0slsWp9efd— sonu sood (@SonuSood) November 10, 2024 -
సోనూ సూద్ సాయం.. వైఎస్సార్సీపీ నేతల కృతజ్ఞతలు
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడ వరద బాధితులకు సినీ నటుడు సోనూ సూద్ అండగా నిలిచారు. తన ట్రస్ట్ తరఫు నుంచి బాధితుల కోసం కనీస అవసరాల కిట్లను పంపించారాయన. వైఎస్సార్సీపీ నేత వంగవీటి నరేంద్ర ఆధ్వర్యంలో ఈ పంపిణీ జరగ్గా.. ఆపై సోనూసూద్‌తో వీడియో కాల్ మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారాయన. తెలుగు రాష్ట్రాల వరద పరిస్థితులపై సోనూసూద్ చలించిపోయి సాయానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యాయవాది సుంకర నరేష్, వరద బాధితుల కష్టాలను సోనూసూద్‌కు తెలియజేశారు. దీంతో.. బకెట్లు, చాపలు, దుప్పట్లతో కూడిన తినుబండారాలతో 2000 కిట్లను ఆయన పంపించారు. ఆ కిట్లను పాయకాపురంలో వరద బాధితులకు పంపిణీ చేసింది రాధా-రంగా మిత్ర మండలి. ఈ సంఘం అధ్యక్షుడు.. వైఎస్సార్సీపీ నేత వంగవీటి నరేంద్ర ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్‌కు వీడియో కాల్ చేసి సురేష్, నరేంద్రలు కృతజ్ఞతలు తెలియజేశారు. -
బంగ్లాదేశ్‌లో ఓ మహిళ ఆవేదన.. స్పందించిన సోనూ సూద్!
బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆ దేశ ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియాకు వచ్చేశారు. దీంతో ఆందోళనకారులు ఆమె ఇంటిని ముట్టడించి చేతికి దొరికిన వాటిని ఎత్తుకెళ్లిపోయారు. అయితే ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న హిందూవులపై సైతం దాడులు చేస్తున్నారు. తమను కాపాడాలంటూ ఓ మహిళ వేడుకుంటున్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇది చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పందించారు. దయచేసి బంగ్లాదేశ్‌లో ఉన్న మన భారతీయులందరినీ ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనదేశంలో సురక్షితంగా ఉంటారని తెలిపారు. ఇది కేవలం మన ప్రభుత్వ బాధ్యతే కాదు.. దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని సోనూ సూద్ విజ్ఞప్తి చేశారు. We should do our best to bring back all our fellow Indians from Bangladesh, so they get a good life here. This is not just the responsibility of our Government which is doing its best but also all of us.Jai Hind 🇮🇳 https://t.co/OuL550ui5H— sonu sood (@SonuSood) August 6, 2024 -
సోనూ సూద్ పుట్టిన రోజుకు విద్యార్థులు విభిన్న విషెస్
-
సోనూ సూద్ బర్త్ డే.. ఏపీ విద్యార్థుల స్పెషల్ విషెస్!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇవాళ 51వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా సినీతారలు, టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు విషెస్ తెలిపారు. అరుంధతి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనూసూద్.. బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. అయితే సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ఆయన ముందున్నారు. సోనూసూద్ ఫౌండేషన్ స్థాపించిన నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు.తాజాగా ఇవాళ సోనూ పుట్టిన రోజు కావడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కుప్పంలోని హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఆయన రూపంలో నిలబడి విషెస్ చెప్పారు. దాదాపు 1200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యాపీ బర్త్ డే రియల్ హీరో అంటూ తమ అభిమానం చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విధంగా కార్యక్రమంలో విద్యార్థుల సృజనాత్మకత, ఉత్సాహాన్ని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. కాగా.. ఇటీవలే సోనూసూద్ ఏపీకి చెందిన విద్యార్థికి చదువుకు సాయమందించిన సంగతి తెలిసిందే. నటుడు @SonuSood పుట్టినరోజు సందర్భంగా అద్భుత రీతిలో శుభాకాంక్షలు తెలిపిన కుప్పం విద్యార్థులుసోను సూద్ ముఖ చిత్రాన్ని ప్రతిబింబించేలా విద్యార్థుల అద్భుత ప్రదర్శనహాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం#sonusoodbirthday #Kuppam pic.twitter.com/tGLKlhF7ym— Telugu Galaxy (@Telugu_Galaxy) July 30, 2024 -
సాయం చేయడంలో మేటి.. సోనూ సూద్ బర్త్‌డే (ఫోటోలు)
-
'నువ్వు నేర్పించిన విలువలతోనే బతుకుతున్నా'.. సోనూ సూద్ ఎమోషనల్!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎమోషనలయ్యారు. తన తల్లి సరోజ్ సూద్ జయంతి కావడంతో ఆమెను తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ట్విటర్లో ఆమె ఫోటోను షేర్ చేస్తూ నోట్ రాసుకొచ్చారు.సోనూ సూద్ ట్వీట్లో రాస్తూ..'హ్యాపీ బర్త్‌డే అమ్మా. నువ్వు లేని ఈ ప్రపంచం అందంగా లేదు. నువ్వు నేర్పించిన సూత్రాలు, నైతిక విలువలుతో నా జీవితాన్ని కొనసాగిస్తున్నా. నిన్ను చాలా ప్రేమిస్తున్నా అమ్మా. ఒక్కసారి నిన్ను ప్రేమగా హత్తుకుని ఎంతగా మిస్ అవుతున్నానో చెప్పాలనుంది. నువ్వు చూపించిన మార్గంలో ఎప్పటికీ నడుస్తూనే ఉంటా. లవ్ యూ సో మచ్' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. అరుంధతి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనూసూద్ పలు చిత్రాల్లో నటించారు. నటన మాత్రమే కాదు.. తనవంతుగా సమాజసేవలో దూసుకెళ్తున్నారు. సోనూ సూద్ అనే ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన తల్లి సరోజ్ సూద్ పేరుతో స్కాలర్షిప్లు అందింస్తున్నారు. పేదరికంలో ఉన్న ఎందరో విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లాకు ఓ విద్యార్థికి సాయం అందించారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల ద్వారా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. Happy Birthday Maa. World without you is not that beautiful but somehow surviving with the principles and morals you taught me. I love u so much mom💔 wish I could hug you tight and tell you how much I miss you. Will always follow the path you showed me. Keep smiling till I see… pic.twitter.com/Bl1g5XNG3S— sonu sood (@SonuSood) July 21, 2024 -
సోనూ సూద్‌ను సాయం కోరిన ఏపీ విద్యార్థి.. ఆయన ఏమన్నారంటే?
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అరుంధతి సినిమాతో టాలీవుడ్లో తనదైన ముద్రవేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన జులాయి మూవీతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించారు. అయితే సోనూ సూద్ తెరపై మాత్రమే కాదు.. అభిమానుల గుండెల్లో రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచారు.అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఆయన.. సమాజ సేవలో ఎప్పుడు ముందుంటారు. గతంలో చాలామంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారు. సొంతంగా సోనూ ఫౌండేషన్ స్థాపించి సేవలందిస్తున్నారు. చాలామంది పేద విద్యార్థులకు సాయం అందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయి సోనూ సూద్‌ను సోషల్ మీడియా ద్వారా సాయం కోరింది. నా చదువుకు హెల్ప్ చేయండి సార్ అని వేడుకుంటోన్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు.ఇది చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు. అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో సోనూ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అంతకుముందు వర్షంలో తడుస్తున్న ఫ్యాన్స్‌ను అప్యాయంగా పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. I will make sure she gets admission in a college of her choice 🤍👍 https://t.co/uIwQkVwW1M— sonu sood (@SonuSood) July 19, 2024Get ready for your college. Your education won’t stop. 🇮🇳 https://t.co/7HXlgJNQHz— sonu sood (@SonuSood) July 19, 2024 -
కైసే హే ఆప్..
కుమారి ఆంటీ.. కైసే హే ఆప్ అంటూ ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సర్ప్రైజ్ చేశారు. మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్‌కు పేరుగాంచిన కుమారీ ఆంటీ గురించి అందరికీ తెలిసిందే. కుమారి ఆంటీ హోటల్‌ను సోనూ సూద్ శుక్రవారం సందర్శించి, ఆమెతో ముచ్చటించారు. అంతేకాకుండా స్వయం కృషితో ఎదిగి, మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచారన్నారు. కుటుంబం కోసం కష్టపడుతున్న తీరు ఆదర్శనీయమని అన్నారు. హోటల్లో ఎలాంటి వంటకాలు అందుబాటులో ఉంటాయో అడిగి తెలుసుకున్నారు. రూ.80కి వెజ్, రూ.120కి నాన్ వెజ్ లభిస్తాయని తెలిపారు. తను శాకాహారినని, తనకైతే వెజ్మీల్ ఎంతకు అమ్ముతావని సోనూ అడిగారు. దీనికి సమాధానంగా...ఎంతో మందికి సహాయం చేసిన మీకు ఏదైనా ఉచితంగానే ఇస్తానని తన అభిమానాన్ని చాటుకున్నారు. తను కష్టకాలంలో ఉన్నప్పుడు సోనూ సూద్ స్వయంగా ఫోన్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తోడా, తోడా హిందీ మాత్రమే వస్తుందని కుమారి ఆంటీ తెలుపగా.. ‘మీ హిందీ చాలా బాగుంది’ అని సరదాగా కితాబిచ్చారు. అనంతరం ఆమె పిల్లల గురించి పలు విషయాలు తెలుసుకున్నారు. ఎప్పుడైనా ఏ సాయం కావాలన్నా నేనున్నానని భరోసా ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ కాసేపు సందడి చేశారు. సోనూ సూద్ ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా నగరానికి వచ్చారు. ఏదేమైనా..పట్టుదల, కృషితో ముందుకొచ్చే వారిని గుర్తించడం, ప్రోత్సాహమందించడంలో సోనూ తరువాతే ఎవరైనా అని మరోసారి నిరూపించుకున్నారు. అయితే కుమారి ఆంటీని కలిసిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. -
డిస్కౌంట్ ఎంత ఆంటీ ?.. కుమారి ఆంటీతో సోను సూద్
-
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను సందర్శించిన సోనూసూద్
-
కుమారి ఆంటీని సన్మానించిన సోనూ సూద్ (ఫోటోలు)
-
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను సందర్శించిన సోనూసూద్
ఇటీవలి కాలంలో సెన్సేషన్‌గా మారిన పేరు కుమారి ఆంటీ. ఈవిడ భోజనం వడ్డిస్తే ఆహా ఏమి రుచి.. అనరా మైమరిచి.. అనుకుంటూ లొట్టలేసుకు తినాల్సిందే! తన చేతివంట రుచి చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. హైదరాబాద్ నగరంలో రోడ్డు పక్కన చిన్నపాటి హోటల్ పెట్టి వెజ్, నాన్ వెజ్ వంటకాలను అమ్ముతూ చేతినిండా సంపాదిస్తోంది. యూట్యూబ్‌లో మార్మోగిపోయిన కుమారి ఆంటీ దగ్గరికి ఆ మధ్య హీరో సందీప్ కిషన్ కూడా వెళ్లొచ్చాడు.తాజాగా నటుడు సోనూసూద్ ఆమె ఫుడ్ స్టాల్‌ను సందర్శించాడు. తనను కలిసి బిజినెస్ ఎలా సాగుతుందో అడిగి తెలుసుకున్నాడు. కుమారి ఆంటీ స్త్రీ శక్తికి తార్కాణం. కష్టపడితే ఫలితం ఉంటుందన్నదానికి ఈవిడే నిదర్శనం అని పేర్కొన్నాడు. స్వయంకృషితో ఎదిగే ఇలాంటివారిని సపోర్ట్ చేద్దామని తెలిపాడు.నేను వెజ్ తింటాను.. నాకు డిస్కౌంట్ ఎంతిస్తావని సోనూసూద్ అడగ్గా కుమారి ఆంటీ ఫ్రీగా ఇస్తానంది. ఎంతోమందిని కష్టకాలంలో ఆదుకున్నారు.. ఇంకెంతోమందికి సాయం చేస్తూనే ఉన్నారు.. అలాంటి మీకు ఏమిచ్చినా తక్కువే అని కుమారి ఆంటీ అనడంతో సోనూసూద్ సంతోషపడ్డాడు. అనంతరం ఆమెకు శాలువా కప్పి సత్కరించాడు. -
పేద కుటుంబానికి ఆదుకున్న హీరో.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పరిచయం అక్కర్లేని పేరు. అరుంధతిలో పశుపతి పాత్రలో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. అంతేకాదు.. తెలుగులో అల్లు అర్జున్ చిత్రం జులాయిలో తన నటనతో ఆకట్టుకున్నారు. చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించారు. అయితే సోనూ సూద్ తెరపై మాత్రమే కాదు.. అభిమానుల గుండెల్లో రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచారు.తాజాగా మరో నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి గొప్ప మనసును చాటుకున్నారు. డెహ్రాడూన్‌కు చెందిన ఓ పేద కుటుంబంలోని మూడేళ్ల బాలుడికి వైద్య సాయమందించారు. అత్యవసరంగా గుండెకు సర్జరీ చేయాల్సి రావడంతో సోనూ సూద్ ఆదుకున్నారు. ఆ బాలుడికి సర్జరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయించారు. ఇది చూసిన నెటిజన్స్ సోనూ రియల్ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. సోనూ సూద్ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. Appointment fixed with the doctor at 11.30 am today . Will be done ❤️✔️@SoodFoundation 🇮🇳 https://t.co/O1K88v0Pl1— sonu sood (@SonuSood) June 7, 2024 -
ఆగిపోయిన సోనూ సూద్ వాట్సాప్.. కేవలం 61 గంటల్లోనే!
అల్లు అర్జున్ మూవీ జులాయితో ప్రేక్షకులను అలరించిన నటుడు సోనూ సూద్. అరుంధతి చిత్రంతో పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో ఫతే మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే తాజాగా సోనూ సూద్ వాట్సాప్ ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో వెంటనే ట్విటర్ ద్వారా తన సమస్యను ప్రస్తావించారు.సోనూ సూద్ విజ్ఞప్తిని పరిశీలించిన వాట్సాప్ యాజమాన్యం అతని ఖాతాను పునరుద్ధరించింది. అయిదే దాదాపు 61 గంటల తర్వాత వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని సోనూ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఫైనల్‌గా నా వాట్సాప్ తిరిగి పనిచేస్తోంది.. కేవలం 61 గంటల వ్యవధిలోనే 9,483 సందేశాలు వచ్చాయి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరవుతోంది. కాగా.. సోనూ సూద్ నటిస్తోన్న ఫతే చిత్రంలో జాక్వెలీన్ ఫెర్నాండెజ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ద్వారా సోనూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి సాగర్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
స్విగ్గీ డెలివరీ బాయ్ కు సోనూసూద్ అండ.. మండిపడుతున్న నెటిజన్లు
-
దొంగతనం చేసిన డెలివరీ బాయ్‌కు సపోర్ట్.. సోనూసూద్‌పై ట్రోలింగ్
స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి.. సదరు ఇంటి ముందు షూ దొంగిలించిన ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఈ నెల 9న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రముఖ నటుడు సోనూసూద్ పాజిటివ్‌గా స్పందించాడు. 'మీకు ఫుడ్ తీసుకొచ్చే క్రమంలో డెలివరీ బాయ్ షూలు ఎత్తుకెళ్లిపోతే తిట్టుకోకండి.. దయచేసి తనమీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వీలైతే అతడికి కొత్త షూలు కొనివ్వండి. బహుశా అతడికి అవి ఎంతో అవసరమయి ఉండొచ్చు. దయతో ప్రవర్తించండి' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు సోనూసూద్‌ను విమర్శిస్తున్నారు. 'దొంగతనం చేస్తే ఏమీ అనకూడదా? పేదరికం, అవసరం ఉన్నంతమాత్రాన దొంగిలిస్తే తప్పు ఒప్పయిపోతుందా? ఈ డెలివరీ బాయ్ కంటే పేదవాళ్లు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరూ తమ కష్టార్జితంతో బతుకుతున్నారే తప్ప ఇలా పక్కవాళ్ల వస్తువులు దొంగలించిట్లేదు' అని ఓ వ్యక్తి నటుడిపై విరుచుకుపడ్డాడు. 'ఎవరైనా బంగారు గొలుసు దొంగిలించినా ఏం పర్లేదని వదిలేయాలా? అతడికి కారు అవసరమనుకోండి.. ఎవరిదో ఒకరిది ఎత్తుకుపోతే సరిపోతుందా? పేదరికంలో ఉన్నంతమాత్రాన దొంగతనం తప్పు కాకుండా పోతుందా?' అని ట్రోల్ చేస్తున్నారు. If Swiggy’s delivery boy stole a pair of shoes while delivering food at someone’s house. Don’t take any action against him. In fact buy him a new pair of shoes. He might be really in need. Be kind ❤️🙏 — sonu sood (@SonuSood) April 12, 2024 If an actor tried to be a saviour, don't take him seriously. He might running a different business using his skill. — Bodhan Biswas 🇮🇳 (@bodhan11) April 12, 2024 So if I need anything, am I allowed to steal anything from anyone’s house? This is one of the weirdest posts I have ever read. — Naveen (@_naveenish) April 12, 2024 Swiggy's drop and PICK up service. A delivery boy just took my friend's shoes (@Nike) and they won't even share his contact. @Swiggy @SwiggyCares @SwiggyInstamart pic.twitter.com/NaGvrOiKcx — Rohit Arora (@_arorarohit_) April 11, 2024 చదవండి: సల్మాన్ చెల్లితో పెళ్లి.. నా దగ్గర పైసా లేదు! నాన్నే పోషించాలని చెప్పా! -
తక్కువ అంచనా వెయ్యొద్దు!
నెగటివ్ క్యారెక్టర్స్‌లో తనదైన విలనిజాన్ని పండించిన సోనూ సూద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫతే’. ఈ చిత్రానికి సోనూయే దర్శకత్వం వహించడంతో పాటు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. రచయిత కూడా సోనూనే కావడం విశేషం. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ని ‘వచ్చేస్తున్నా’ అంటూ శనివారం విడుదల చేశారు సోనూ సూద్. సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టీజర్ స్పష్టం చేస్తోంది. కాగా.. టైటిల్‌కి ట్యాగ్‌లైన్‌గా ‘నెవర్ అండర్‌ఎస్టిమేట్ ఎ నోబడీ’ అని పెట్టారు. అంటే.. ఎవర్నీ తక్కువ అంచనా వేయొద్దు అని అర్థం. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్. భారతదేశానికి చెందినవారితో పాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. సైబర్ క్రైమ్‌లో ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
అభిమాని ప్రేమకు ఫిదా అయిపోయిన సోనూసూద్ కుటుంబం
బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు ఓ అజ్ఞాత అభిమాని సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా ఆయన తన కుటుంబంతో కలిసి ముంబైలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ వారందరితో కలిసి ఆయన భోజనం చేశాడు. తినడం అయ్యాక బిల్ చెల్లించాలని తన వద్దకు ఎవరూ రాలేదు. దీంతో సోనూసూద్ వెళ్లి బిల్లు ఎంత అయిందని అక్కడి సిబ్బందిని కోరాడు. దీంతో ఫుడ్ బిల్లు మొత్తం ఎవరో అజ్ఞాత వ్యక్తి చెల్లించాడని చెప్పారు. రెస్టారెంట్ సిబ్బంది మాటలకు సోనూసూద్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆశ్బర్యపోయారు. ఆ అజ్ఞాత వ్యక్తి సోనూసూద్‌కు ఇలా ఒక నోట్ కూడా రాసి ఉంచాడు. 'దేశం కోసం మీరు చేస్తున్న మంచి పనులకు నా తరపున చిన్న కృతజ్ఞత ఇది' అంటూ ఒక చిన్న కాగితంపై రాసి ఉంచాడు. తాజాగా ఈ విషయాన్ని సోనూ భాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా షేర్ చేశాడు. 'ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు.. కానీ, మా డిన్నర్ బిల్లు మొత్తం చ్లెలించి ఈ స్వీట్ నోట్‌ను వదిలేసి వెళ్లారు. నా హృదయాన్ని అతను గెలుచుకున్నాడు.' అంటూ సోనూ పేర్కొన్నాడు. కొవిడ్ సమయంలో లాక్డౌన్ వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.. అప్పట్లో ఆయన పలు సేవా కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం కూడా నిస్వార్థ సేవాగుణంతో దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను ఆయన సంపాదించుకున్నాడు. I don’t know who did this but someone paid for the entire bill of our dinner at a restaurant and left this sweet note .. Really touched by this gesture ❤️ Thank u buddy. Means a lot ❤️🙏 pic.twitter.com/LpeznRoqBQ — sonu sood (@SonuSood) February 22, 2024 -
డీప్‌ఫేక్ బారిన సోనూసూద్.. వీడియో వైరల్!
సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రష్మిక, అలియా భట్, కృతిసనన్ లాంటి స్టార్ హీరోయిన్లకు సబంధించిన డీప్‌ఫేక్ వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా ప్రముఖ నటుడు, ‘రియల్ హీరో’ సోనూసూద్ సైతం డీప్‌ఫేక్ బారిన పడ్డాడు. సైబర్ నేరగాళ్లు సోనుసూద్ డీప్‌ఫేక్ వీడియోతో మోసాలకు పాల్పడుతున్నారు. అతని ఫేస్‌తో ఫేక్ వీడియో రెడీ చేసి.. అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని సోనూసూద్ తన ట్విటర్(ఎక్స్) ఖాతాలో షేర్ చేస్తూ.. ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. (చదవండి: రష్మిక వీడియో.. డీప్ ఫేకర్ అరెస్ట్) ‘కొందరు నా డీప్‌ఫేక్ వీడియోని క్రియేట్ చేసి అభిమానులతో చాటింగ్, వీడియో కాల్స్ చేస్తూ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఈ వీడియోలో ఉన్నది నేనే అనుకొని సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. ఇలాంటి వీడియో కాల్స్ వస్తే నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి. నిజ జీవితంలో జరిగిన ఇలాంటి ఘటనల మీదే నేను ఫతే అనే సినిమా తీస్తున్నాను. ఫేక్ వీడియోస్, లోన్ యాప్స్ వల్ల జరుగుతున్న సైబర్ నేరాలను ఆ సినిమాలో చూపించబోతున్నాం’అని సోనూసూద్ తెలిపారు. రష్మికకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో డీప్‌ఫేక్ వ్యవహారం బయటపడింది. ఆ తర్వాత సినీ సెలెబ్రిటీలు వరుసగా డీప్‌ఫేక్ బారిన పడ్డారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో కూడా ఇటీవల నెట్టింట వైరల్‌గా మారింది. వీటిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ వీడియోను క్రియేట్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా రష్మిక డీప్‌ఫేక్ వీడియోను తయారు చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తియే ఈ ఫేక్ వీడియో తయారు చేసినట్లు తెలుస్తోంది. My film FATEH is inspired by real life incidents involving Deep Fake and fake loan apps. This is the latest incident where someone tried to extract money from an unsuspecting family, by chatting with them through video call pretending to be Sonu sood. Many innocent individuals… pic.twitter.com/cXNBsa4nvC — sonu sood (@SonuSood) January 18, 2024 -
నటుడి కుమారుడికి స్టార్ క్రికెటర్ పాఠాలు.. వీడియో వైరల్!
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ హంగామా నడుస్తోంది. ప్రతిష్ఠాత్మక వన్టే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి క్రికెట్‌పైనే ఉంది. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు రాజకీయ నాయకులు సైతం మ్యాచ్ చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు సోనూ సూద్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన చిన్న కుమారుడు అయాన్ బ్యాటింగ్ మెలకువలు నేర్చుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వరల్డ్ కప్‌లో వికెట్లతో అదరగొడుతున్న షమీ నుంచి సలహాలు తీసుకుంటున్న వీడియో తెగ వైరవులవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ భవిష్యత్ టీమిండియా క్రికెటర్‌కు చిట్కాలు నేర్పిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో గతంలో షమీ.. అయాన్‌కు మూడేళ్ల క్రితం ఇలా ట్రైనింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో షమీ తన బౌలింగ్‌తో అదరగొడుతున్నారు. అందుకే అత్యుత్తమైన క్రికెటర్‌తో నా కుమారుడు అయాన్‌కి శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అతని కోచ్‌ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం జరిగే భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్ కోసం సోనూసూద్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కాగా..సోనూ కన్నడ చిత్రం 'శ్రీమంత'లో చివరిసారిగా కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్లో 'ఫతే' షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ శక్తి సాగర్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. జీ స్టూడియోస్‌తో కలిసి రూపొందించిన 'ఫతే' మూవీ 2024లో విడుదల కానుంది. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నటిస్తోంది. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
సోనూసూద్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
బాలీవుడ్ నటుడు, నిర్మాత సోనూసూద్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. సినిమాల కంటే సామాజిక కార్యక్రమాల విషయంలోనే ఆయనకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆయన ఈసారి దీపావళిని కూడా ప్రత్యేకంగా జరుపుకున్నారు. స్క్రీన్‌పైనే విలన్ అయినప్పటికీ నిజజీవితంలో మాత్రం హీరోగా వెలుగుతూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ నటుడు తన అభిమానులతో కలిసి దీపావళీ పండుగను జరుపుకున్నాడు. సోనూసూద్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు ముంబైలోని ఆయన ఇంటి ముందు అభిమానులు భారీగా గుమిగూడారు. వారిని చూసిని ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి అందరిని ఎంతో ఆత్మీయంగా పలకరించారు. ఈ ఏడాది దీపావళిని అభిమానులతో కలిసి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి సెల్ఫీలకు పోజులిచ్చి సంబరాలు చేసుకున్నాడు. అనంతరం ఆయన మీడియాతో స్పందిస్తూ.. 'దీపావళిని ఇలా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్నట్లు భావిస్తున్నాను. వారి ప్రార్థనలతోనే నేను ఇక్కడ నిలబడి ఉన్నా. పండుగ రోజు ఏదైనా పార్టీకి వెళ్లి సరదాగా ఉండటం కంటే.. ఇలా వారితో గడపడం మనసుకు హత్తుకునేలా ఉంది. అని ఆయన అన్నారు. అనంతరం అక్కడికి వచ్చిన అందరికీ స్వీట్స్ గిఫ్ట్ ప్యాక్స్ ఇచ్చారు. కొందరికి పేద విద్యార్థులకు ట్యాబ్స్ కూడా ఇచ్చారు. చాలా మంది అభిమానులు వారికున్న ఇబ్బందులు తెలుపుతూ సాయం చేయాలని ఒక అర్జీ పత్రాన్ని సోనూసూద్‌కు ఇచ్చారు. అవన్నీ స్వీకరించిన సోనూ త్వరలో కాల్ చేస్తామని తెలిపారు. దీంతో వారంతో ఆయనతో సంతోషంగా దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. రియల్ లైఫ్ హీరో సోనూ సూద్ కరోనా సమయంలో దేశంలోని చాలా మందికి వివిధ మార్గాల్లో సహాయం చేయడం ద్వారా సోనూ సూద్ నిజ జీవితంలో కూడా హీరో అయ్యాడు. అవసరమైన వారికి సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. తాజాగా బీహార్‌లోని నవాదా నగర్లో రెండు కళ్లూ అంధుడైన ఓ చిన్నారికి వైద్య ఖర్చులు భరించాడు. దీని ద్వారా ఓ అంధ బాలుడి జీవితం వెలుగులోకి వచ్చింది. వారిద్దరికీ ప్రాణం పోసిన సోనూసూద్ బీహార్‌లోని నవాడా నగరంలోని పక్రిబరవన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోగన్ పంచాయతీ అమర్పూర్ గ్రామంలో గుల్షన్ అనే 11 నెలల పాప పుట్టుకతోనే అంధురాలు. కుటుంబం కూడా నిరుపేద కావడంతో చిన్నారికి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేదు. ఇలా చిన్నారి చికిత్సకు అయ్యే ఖర్చును భరించిన సోనూసూద్.. గుల్షన్‌కు కంటిచూపు వచ్చేలా చేశాడు. అలాగే కొన్ని నెలల క్రితం ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సోనూసూద్ సాయం చేశాడు. ఉజ్జయినిలోని కనిపూర్లోని తిరుపతి ధామ్‌లో నివసిస్తున్న అథర్వ స్పైనల్ మస్కులర్ అట్రాఫీ స్మా-2తో బాధపడుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు నటుడు సోనూసూద్‌ను కలుసుకుని చిన్నారి అనారోగ్యంపై తమ బాధను పంచుకున్నారు. అందువలన, వారు అధర్వకు చికిత్స కోసం అన్ని విధాలుగా సహాయం చేశారు. అంతే కాకుండా బిడ్డ చికిత్స కోసం వీలైనంత ఎక్కువ విరాళాలు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలో ఆ చిన్నారికి ఆపరేషన్ చేపించేందుకు ఆయన అన్నీ ఏర్పాట్లు చేశాడు. My family ❤️ https://t.co/LaC0rA58Zt — sonu sood (@SonuSood) November 10, 2023 #WATCH | Actor Sonu Sood met his fans gathered outside his residence in Mumbai today, on the occasion of #Diwali pic.twitter.com/WhdrhQNEsJ — ANI (@ANI) November 12, 2023 -
అందుకే తెలుగువారంటే ఇష్టం: సోనూ సూద్
‘‘నేను హిందీ సినిమాలు వదిలేసి తెలుగు సినిమాలు చేస్తున్నప్పుడు చాలామంది ‘ఎందుకు తెలుగు సినిమాలే చేస్తున్నారు?’ అని అడిగారు. నన్ను నటుణ్ణి చేసింది, క్రమశిక్షణ నేర్పింది తెలుగు సినిమా. అందుకే తెలుగువారన్నా, తెలుగు సినిమా అన్నా నాకు ఇష్టమని చెప్పాను’’ అని నటుడు సోనూ సూద్ అన్నారు. నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశర్య ఉల్లింగాల, పులి సీత, విజయ, శ్రీయాంక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘తురుమ్ ఖాన్లు’. శివ కల్యాణ్ దర్శకత్వంలో ఎండీ ఆసిఫ్ జాని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న సోనూ సూద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మంచి కథ ఉందని తెలుస్తోంది. మంచి హిట్ అయి, వచ్చే ఏడాది పార్ట్ 2, పార్ట్ 3 కూడా తీయాలి’’ అన్నారు. ‘‘తుపాకులగూడెం అనే గ్రామంలో విష్ణు.. ఈశ్వర.. బ్రహ్మ అనే ముగ్గురు పాత్రల చుట్టూ ఈ కథ నడుస్తుంది’’ అన్నారు శివ కల్యాణ్. ‘‘మంచి కథతో రూపొందిన మా ‘తురుమ్ ఖాన్లు’ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఎండీ ఆసిఫ్ జాని. శ్రీరామ్ నిమ్మల, అవినాష్ చౌదరి తదితరులు మాట్లాడారు. -
నటి రియా చక్రవర్తి కోసం దోశెలు వేసిన సోనూసూద్
-
ఆమెకు దూరంగా ఉండాలంటూ సోనూసూద్‌కు సలహాలిస్తున్న ఫ్యాన్స్
కరోనా సమయంలో లాక్డౌన్ నుంచి ఇప్పటివరకూ ఎంతోమందికి అపన్నహస్తం అందించి రియల్ హీరోగా సమాజానికి స్ఫూర్తినిచ్చారు నటుడు సోనూసూద్. పలు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సోషల్‌మీడియా వేదికగా అందుబాటులో ఉంటూ తనకు చేతనైనంత సాయం చేస్తున్నారు. దీంతో ఆయనను అభిమానించే వారిలో ఎక్కువగా యూత్నే ఉంటారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ) ప్రస్తుతం ఆయన తదుపరి ప్రాజెక్ట్ 'MTV రోడీస్ సీజన్ 19' షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదే ప్రాజెక్ట్‌లో నటి రియా చక్రవర్తి కూడా ఉన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతోంది. అక్కడ సెట్లో ఉన్న వారి కోసం సోనూసూద్ దోశెలు వేశారు. ఎవరికి ఎలాంటి దోశె కావాలో అడిగి మరీ సోనూ వడ్డించారు. ఇదే సమయంలో నటి రియా చక్రవర్తి కూడా అక్కడికి రాగా... 'మీకు ఎలాంటి దోశె కావాలి' అని అడిగి ఆమె కోరుకున్నట్లు టిఫిన్ సిద్ధం చేసి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన ఆయన అభిమానులు... 'మీరు అంటే మాకు ఎంతో గౌరవం.. అది ఎప్పటికీ కొనసాగుతుంది.. ఈ చర్యతో మీపై మరెంతో గౌరవం పెరుగుతుంది' అని కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..) కానీ.. ఈ వీడియో చూసిన బాలీవుడ్ యువ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు మాత్రం కొంతమేరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రియా చక్రవర్తికి దూరంగా ఉండాలని ఇలా సోనూను కోరారు. 'మీరు ఆమెకు దోశెలు చేసి పెట్టడం మాకు ఏ మాత్రం నచ్చలేదు' అంటూ... తమ అసహనాన్ని కామెంట్ల రూపంలో తెలియచేశారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని కోంతకాలం పాటు రియా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అందుకే వారు సోనూసూద్‌కు ఈ సలహా ఇచ్చారు. -
త్రిషకు అతనితో పెళ్లి చేయడమే పెద్ద మైనస్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
పవన్‌కల్యాణ్, త్రిష జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'తీన్మార్'. అయితే అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. అయితే ఈ చిత్ర పరాజయంపై దాదాపు 12 ఏళ్ల తర్వాత డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ స్పందించారు. తెలుగులో ప్రేమించుకుందాం రా, బావగారూ బాగున్నారా?, ప్రేమంటే ఇదేరా.. వంటి సూపర్‌హిట్ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ మూవీస్ ప్రేక్షకులకు అందించారు దర్శకుడు జయంత్ సి.పరాన్జీ. 2011లో విడుదలైన తీన్మార్ ఫ్లాప్ తర్వాత టాలీవుడ్‌కు దూరమయ్యారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయంత్ సినిమా ఫ్లాప్‌పై స్పందించారు. ‘తీన్మార్’ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత) జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ.. 'సినిమా ఫ్లాప్ సంగతి పక్కన పెడితే తీన్మార్ నాకిప్పటికీ ప్రెష్ లవ్ స్టోరీగానే అనిపిస్తుంది. ఈ చిత్రం ఫెయిల్ కావడానికి కారణాలు నేను చెప్పలేను. కానీ ఈ చిత్రంతో కొంత మంది ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. మరీ ముఖ్యంగా త్రిషకు సోనూసూద్‌తో వివాహం చేయడం.. ఆ తర్వాత ఆమె తిరిగి పవన్‌కల్యాణ్ వద్దకు చేరడం లాంటి సీన్స్ ప్రేక్షకులకు నచ్చలేదు. ఇదే చిత్రాన్ని అప్పుడున్న యంగ్ హీరోతో చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో.' అని అన్నారు. కాగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించిన లవ్ ఆజ్ కల్ మూవీకి రీమేక్‌గా తీన్మార్ తెరకెక్కించారు. పవన్‌కల్యాణ్, త్రిష, కృతి కర్బంద నటించిన ఈ చిత్రం మ్యూజికల్‌గా హిట్ అయినా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. (ఇది చదవండి: కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్) -
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్
ఒడిశా రైలు ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు జీవితకాలం పెన్షన్లు లేదా స్థిరమైన నెలవారీ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశాడు రియల్ హీరో సోనూ సూద్. ఈ ప్రమాదం చాలా దారుణమని ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో ద్వారా సందేశాన్ని కూడా పంపించాడు. రియల్ హీరో... ఎప్పుడూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుండే సోనూ సూద్ ఇప్పుడు రైలు ప్రమాద బాధితుల పక్షాన నిలిచి మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. బాధిత కుటుంబాలకు కంటితుడుపు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోకుండా శాశ్వత పరిహారం చెల్లించే విధంగా సహాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బాలాసోర్ రైలు ప్రమాదంపై తన ట్విట్టర్ అకౌంట్లో ఒక వీడియో ద్వారా సందేశాన్ని పంపించారు. ఒడిశాలో జరిగిన విషాదం గురించి తెలియగానే నా గుండె చెక్కలైంది. ప్రమాద బాధితులకు నా ప్రగాఢ సానుభూతులు తెలుపుతున్నాను. మనమందరం వారి కుటుంబాలకు అండగా ఉండాలని రాస్తూనే... వీడియో ద్వారా సందేశాన్ని పంపించాడు. వీడియోలో సోనూ ఏమన్నాడంటే... మనం ఈరోజు ప్రమాదం గురించి ట్వీట్ చేస్తాం, సంఘటనలో నష్టపోయిన నిర్భాగ్యుల పట్ల సానుభూతి తెలుపుతాం. కానీ వెంటనే మన పనుల్లో మనం బిజీ అయిపోతాం. కానీ వీరిలో జీవనోపాధి కోసం వేరే రాష్ట్రాలలో పనులు చేసుకుంటున్న వారి పరిస్థితి ఏమిటి? వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? రాత్రికి రాత్రి చాలా కుటుంబాలు చెదిరిపోయాయి. ఆ కుటుంబాలు మళ్ళీ నిలబడే అవకాశముందా? ఇప్పుడు ప్రకటించిన నష్టపరిహారం రెండు మూడు నెలల్లో ఖర్చయిపోతుంది. ఈ ఘటనలో తమ కుటుంబాలను పోషించుకునే అనేకమంది కాళ్ళు, చేతులు విరిగిపోయాయి. ఈ పరిహారంతో వారికి న్యాయం జరుగుతుందా? ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమే కానీ ఇటువంటి విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఎదో నష్టపరిహారం ప్రకటించి ఊరుకోకుండా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పెన్షన్లు ఇవ్వడంగానీ స్థిరాదాయం కల్పించడం గానీ చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి పునరాలోచన చేసి ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు భరోసా కల్పించాలి. అలాగే ప్రతి ఒక్కరూ బాధితులను ఆదుకునేందుకు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. Heartbroken by the news of the train tragedy in Odisha. Heartfelt deepest condolences 💔🙏 Time to show our support and solidarity for the unfortunates. 💔#OdishaTrainAccident 🇮🇳 pic.twitter.com/ZfuYYp8HK9 — sonu sood (@SonuSood) June 3, 2023 ఇది కూడా చదవండి: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ను వెంటాడిన విధి.. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత.. -
2500 కేజీల బియ్యంతో సోనూసూద్ రూపం.. వీడియో వైరల్
సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకుంటునే.. నిజ జీవితంలో మాత్రం అందరిచేత రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. కరోనా, లాక్డౌన్ సమయంలో ఎంతోమంది అన్నార్థులకు సాయం చేశాడు. లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సొంత ఖర్చులతో స్వదేశానికి తీసుకొచ్చాడు. అలాగే ఆపదలో ఉన్న ఎంతో మంది పేదకు ఆర్థిక సాయం అందించాడు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించాడు. ప్రస్తుతం ఒక స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేసి సామాజిక సేవ చేస్తున్నాడు. సోనూసూద్‌ని నటుడి కంటే గొప్ప మానవతావాదిగా అభిమానించేవాళ్లే ఎక్కువ. ప్రతి రాష్ట్రంలో సోనూసూద్ అభిమాన సంఘాలు ఉన్నాయి. తమ రియల్ హీరో మాదిరే వాళ్లు కూడా మంచి పనులు చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా సోనూ సూద్ అభిమానులు 2500 కేజీల బియ్యంతో ఆయన చిత్రాన్ని నేలపై ఆవిష్కరించారు. ప్లాస్టిక్ షీట్‌ను నేలపై పరిచి దానిపై బియ్యంతో సోనూ సూద్ రూపాన్ని తీర్చిదిద్దారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఉన్న తుకోజీరావు పవార్ స్టేడియంలో ఎకరం స్థలంలో సోనూ సూద్ చిత్రాన్ని బియ్యంతో రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Fans in Madhya Pradesh carve #sonusood's face using 2500 kilos of rice over one acre land which will be donated to the needy. pic.twitter.com/khVVS0rJ28 — Amit Karn (@amitkarn99) April 11, 2023 -
సిద్దిపేట జిల్లా లో సందడి చేసిన సోనూసూద్..ఫోటోలు వైరల్
-
సోనూసూద్.. తప్పుడు సందేశాలివ్వొద్దు!: నార్త్ రైల్వే ఆగ్రహం
రీయల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్‌పై ఉత్తర రైల్వే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్‌బోర్డుపై ట్రావేల్ చేయడం ప్రమాదకరమైన మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దంటూ ఆయనను హెచ్చరించింది. అసలు ఏమైందంటే.. ఇటీవల సోనూసూద్ రైలులో ప్రయాణిస్తున్న వీడియో షేర్ చేశాడు. ఇందులో ఆయన కదులుతున్న రైలులో ఫుట్‌బోర్డు వద్ద కూర్చుని బయటకు చూస్తూ కనిపించాడు. ఈ వీడియో చూసిన నార్త్ రైల్వే అధికారులు ఈ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చదవండి: ఇండియన్ నెంబర్ వన్ మూవీగా జాన్వీ కపూర్ చిత్రం! ‘డియర్ సోనూసూద్.. మీరు దేశంలోనే కాదు ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజలకు రోల్ మోడల్. రైలు ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం ప్రమాదకరం. ఈ రకమైన వీడియో మీ అభిమానులకు తప్పుడు సందేశాన్ని పంపవచ్చు. దయచేసి ఇలా చేయకండి! సాఫీగా, సురక్షితమైన ప్రయాణం ఆనందించండి’ అని ఉత్తర రైల్వే ట్వీట్ చేసింది. అలాగే ముంబై రైల్వే కమిషనర్ కూడా ఇది ప్రమాదకరమని పేర్కొంది. నిజ జీవితంలో ఇలాంటి స్టంట్ చేయొద్దని కోరింది. ‘’మీరు(సోనుసూద్) ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం మీ సినిమాలోని ఎంటర్టైన్మెంట్లో ఓ భాగం కావచ్చు. చదవండి: అవికా గోర్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన నాగ్ కానీ నిజ జీవితంలో కాదు. అన్ని భద్రత మార్గదర్శకాలను పాటించి అందరికి ‘హ్యాపీ న్యూ ఇయర్‌ని అందిద్దాం’’ అని జీఆర్పీ ముంబై తమ ట్వీట్లో రాసుకొచ్చింది. కాగా సోనుసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లాక్డౌన్లో ఎంతోమంది నిరాశ్రయులకు, ముంబైలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కూలీలకు ఆయన చేయూతను అందించారు. కూలీల కోసం స్పెషల్‌గా బస్సులు కేటాయించి వారి వారి సొంత రాష్ట్రాలకు చేర్చారు. అంతేకాదు ఇతర దేశాల్లో చిక్కుకున్న వారిని సైతం స్పెషల్ ఫ్లైట్స్‌లో భారత్‌కు తీసుకువచ్చారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు సోనుసూద్ నిరాంతరాయంగా సామాజిక సేవలు అందిస్తూనే ఉన్నారు. प्रिय, @SonuSood देश और दुनिया के लाखों लोगों के लिए आप एक आदर्श हैं। ट्रेन के पायदान पर बैठकर यात्रा करना खतरनाक है, इस प्रकार की वीडियो से आपके प्रशंसकों को गलत संदेश जा सकता है। कृपया ऐसा न करें! सुगम एवं सुरक्षित यात्रा का आनंद उठाएं। https://t.co/lSMGdyJcMO — Northern Railway (@RailwayNorthern) January 4, 2023 -
లగ్జరీ కారు కొన్న సోనూసూద్, దాని ఖరీదెంతో తెలుసా?
కరోనా సమయంలో అందరూ ఇంట్లో ఉండి తాళం వేసుకుంటే నటుడు సోనూసూద్ మాత్రం ఇంటికి వెళ్లలేక చిక్కుకుపోయిన వలస కార్మికులు తమ గూడు చేరుకునేందుకు ఓ మార్గం చూపించాడు. ఆక్సిజన్ లేక ప్రాణాలు కోల్పోతున్న అమాయక జనాలను చూసి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు. చికిత్సకు డబ్బుల్లేని నిస్సహాయతను చూసి చేతనైనంత మందికి తోచినంత సాయం చేశాడు. ఇలా ఒకటారెండా.. ఎన్నో మంచి పనులు చేసి రీల్ విలన్ కాస్తా రియల్ హీరో అయ్యాడు. ప్రస్తుతం సినిమాలు, సహాయకార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్న అతడు ఇటీవలే ఓ కొత్త కారు కొన్నాడు. లగ్జరీకి, బ్రాండ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారును సొంతం చేసుకున్నాడు. తన కొత్తకారు ముందు దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడీ నటుడు. ఈ కారు ఖరీదు దాదాపు రూ.1.73 కోట్లని తెలుస్తోంది. కాగా సోనూసూద్ గ్యారేజీలో పోష్ పనమేరా, మెర్సిడిస్ బెంజ్, ఆడి క్యూ 7 కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) చదవండి: ఆ హీరోకు హ్యాట్సాఫ్, తనతో ఏడాదికో సినిమా అయినా చేయాలి: లక్ష్మి మంచు లక్ష రూపాయలు పోగిట్టిందని శ్రీసత్యపై మండిపడ్డ రేవంత్ -
దయచేసి ఆ వీడియోలు షేర్ చేయొద్దు.. సోనూసూద్ విజ్ఞప్తి
పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై బాలీవుడ్ నటుడు సోనూసూద్ స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దయచేసి ఎవరూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మనం వారికి పూర్తి అండగా నిలవాలని ట్విట్టర్ ద్వారా సోనూ సూద్ కోరారు. 'చండీగఢ్ యూనివర్శిటీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. ఈ కష్ట సమయంలో మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ విషయంలో మన సిస్టర్స్‌కు అండగా నిలుద్దాం. దయచేసి ఎవరూ కూడా సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు షేర్ చేయొద్దు. ఇది మనందరికీ పరీక్ష సమయం. బాధ్యత గల పౌరులుగా మన బాధితుల తరఫున నిలుద్దాం' అని ట్విట్టర్లో సోనూసూద్ కోరారు. Something that happened in Chandigarh University is very unfortunate. It’s time for us to stand with our sisters and set an example of a responsible society. These are testing times for us, not for the victims. Be responsible 🙏 — sonu sood (@SonuSood) September 18, 2022 అసలేం జరిగిందంటే: పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సీటీలోని హాస్టల్లో దాదాపు 60 మంది యువతుల ప్రైవేటు వీడియోలను వారితో కలిసి ఉండే మరో యువతి తీయడం సంచలనంగా మారింది. అంతే కాకుండా ఆ వీడియోలు ఆ యువతి స్నేహితుల ద్వారా సోషల్ మీడియాలో షేర్ కావడంతో బాధిత యువతులు ఆందోళనకు దిగారు. కొంతమంది బాధితులు ఆత్మహత్యకు కూడా యత్నించారు. అయితే ఈ ఘటనను పోలీసులు, యూనివర్శిటీ యాజమాన్యం ఖండించింది. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. -
సోనూసూద్‌కు రక్తంతో పెయింటింగ్ గిఫ్ట్ ఇచ్చిన అభిమాని
సినిమాల్లో విలన్ పాత్రలు వేస్తూ నిజజీవితంలో మాత్రం ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరోగా నిలిచారు నటుడు సోనూసూద్. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సాయం చేసి ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు. నటనతో పాటు సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సోనూసూద్‌కి దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. తాజాగా మధు గుర్జార్ అనే ఫ్యాన్ సోనూసూద్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన రక్తంతో సోసూసూద్ పెయింటింగ్ వేసి ఆయనకే బహుమతిగా ఇచ్చాడు. అభిమాని చేసిన పనికి షాక్ అయిన సోనూసూద్ రక్తంతో తన బొమ్మను గీయడం కంటే రక్తదానం చేస్తే ఇంకా సంతోషించేవాడినని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను సోనూసూద్ ట్విట్టర్లో షేర్చేస్తూ రక్తం వృథా చేయకుండా దానం చేయాలని కోరాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సోసూసూద్ చివరగా చాంద్ బార్దాయ్ అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాడు. ख़ून दान करो मेरे भाई ख़ून से मेरी पेंटिंग बना कर व्यर्थ नहीं🙏 बहुत बहुत आभार ❤️🙏 https://t.co/6j6Pih36Fq — sonu sood (@SonuSood) September 9, 2022 -
సోనూసూద్ గొప్ప మనసు.. స్టూడెంట్ రిపోర్టింగ్‌కు ఫిదా.. సాయం చేస్తానంటూ
సోనూసూద్.. దేశంలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరేమో.. తన సినిమాల కంటే చేసిన సేవలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి.. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా మారిన మంచి మనసున్న మహారాజు. లాక్డౌన్ కాలంలో వేలాది మందికి నేనున్నానంటూ అండగా నిలిచాడు. కష్టం వచ్చిందని సోనూసూద్ దృష్టికి తీసుకొస్తే చాలు.. తనకు చేతనైనంత సాయం చేస్తుంటారు. నేటికి తన సేవలను కొనసాగిస్తున్నాడు. తాజాగా జార్ఖండ్లోనిని ఓ విద్యార్థి సమస్యకు పరిష్కారం చూపి మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఓ బాలుడు తన ప్రభుత్వ పాఠశాల దుస్థితిని వివరిస్తూ రిపోర్టర్‌గా మారిన సంగతి తెలిసిందే. సర్ఫరాజ్ అనే విద్యార్థి అచ్చం రిపోర్టర్లా నటిస్తూ పాఠశాల అంతా తిరుగుతూ తరగతి గదిలో అధ్వానమైన పరిస్థితులు, సరైన టాయిలెట్స్ లేకపోవడాన్ని రిపోర్టింగ్ చేశాడు. దీన్నంతటినీ మరో స్నేహితుడు వీడియో చిత్రీకరించాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ బాలుడి నైపుణ్యాలను ప్రశంసించారు. शायद आपने ऐसा पत्रकार नहीं देखा हो ये विडीओ है झारखंड की जहां एक छोटा बच्चा जर्नालिस्ट बन कर अपने स्कूल के बदहाली को एक्ष्पोस करता है बच्चे का नाम सरफराज है और विडीओ ज़िला गोड्डा से है। 1/2@zoo_bear @AshrafFem @khanumarfa @khan_zafarul @meerfaisal01 @alishan_jafri @IamYasmeeny pic.twitter.com/14Uw53iIRn — Mohammad Sunasara (@MdSunasara5) August 4, 2022 అయితే ఈ వీడియోపై తాజాగా సోనూసూద్ స్పందించాడు. బాలుడి వీడియోను రీట్వీట్ చేస్తూ.. ‘సర్ఫరాజ్.. ఇకపై నువ్వు కొత్త స్కూల్ నుంచి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కొత్త పాఠశాల, హాస్టల్ తమ కోసం ఎదురుచూస్తున్నాయి’ అని తెలిపారు. ఇక సోనూసూద్ గొప్ప మనసును నెటిజన్లు మరోసారి కొనియాడుతున్నారు. -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా వైరస్, లాక్డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులు, కూలీలకు సాయం అందిచిన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించి పలువురి ప్రాణాలును కాపాడారు. అప్పటి నుంచి ఆయన తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగానూ ఎంతోమందికి సహాయం అందిస్తున్నారు. చదవండి: నటికి షాకిచ్చిన కొత్త బాయ్‌ఫ్రెండ్, 2 గంటల పాటు ఎయిర్ పోర్టులోనే.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన, లేదా సర్జరీలు వంటి కోసం ఆర్థిక సాయం కావాలంటూ సోనూ సూద్‌కు ట్వీట్ చేస్తుంటారు. ఇలాంటివి తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి వారికి సాయం అందిస్తున్నారు ఆయన. అలా సామాజిక సేవతో ఎంతోమందిని ఆదుకుంటున్న ఆయన తాజాగా మరోసారి గొప్పమనసు చాటుకున్నారు. తాజాగా 7 నెలల ఓ చిన్నారికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్‌కి (కాలేయ మార్పిడి చికిత్స) సాయం చేశారు ఆయన. చదవండి: ఆయన కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ కరీంనగర్‌కు చెందిన మహ్మద్ సఫన్ అలీ అనే చిన్నారికి బైలియరీ అట్రీసియా అనే వ్యాధి బారిన పడ్డాడు. దీనివల్ల అతడి కాలేయం పూర్తిగా దెబ్బతింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్నారి వైద్యం కోసం అతడి తల్లిదండ్రులు సోనూసూద్‌ను సాయం కోరడంతో ఆయన ముందుకు వచ్చారు. తన ఛారిటీ ఫౌండేషన్ ద్వారా చిన్నారికి కేరళలోని కొచ్చి నగరంలో చికిత్స అందించారు. ఎస్తేర్ మెడ్ సిటీ హాస్పిటల్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. -
జూబ్లీహిల్స్ బాలికపై గ్యాంగ్ రేప్ వార్త నన్ను షాక్‌కు గురిచేసింది: సోనుసూద్
-
జూబ్లీహిల్స్ పబ్ కేసు: ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణం కాదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ బాలిక అత్యాచార కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! రొమేనియాకు చెందిన బాలికను ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని కారులో ఎక్కించుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులోని నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఇప్పటికే క్రైమ్‌సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తాజాగా ఈ ఘటనపై నటుడు సోనూసూద్ స్పందించాడు. ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణమనేది తప్పని వారించాడు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, మనం చూసే విధానం తప్పుగా ఉంటే చెడు ఆలోచనలు వస్తాయని పేర్కొన్నాడు. చదవండి: పెళ్లి చేసుకున్నాం, కానీ మా లైఫ్‌లో పెద్ద ఛేంజ్ ఏం లేదు మైనర్లతో సీన్ రీకన్స్ట్రక్షన్ -
ఇక ముహూర్తమే!: కొత్త జాతీయ పార్టీకి కేసీఆర్ బాస్.. చక్రం తిప్పనున్న పీకే..
ప్రత్యామ్నాయ ఎజెండా.. ‘తెలంగాణ మోడల్’ జెండా! ► టీఆర్ఎస్ జెండాను పోలిన రీతిలో కొత్త పార్టీ పతాకం.. ఎన్నికల గుర్తుగా కారును కొనసాగించేలా ఎన్నికల సంఘాన్ని కోరాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కొత్త పార్టీ ఎజెండా కూడా ఖరారైనట్టు సమాచారం. ► తెలంగాణ ఉద్యమం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో కొనసాగగా.. ఇంచుమించు ఇవే అంశాలను జాతీయ ఎజెండాలోనూ ఎత్తుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. విద్యుత్ సమస్య, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత, వివిధ రంగాల్లో టీఆర్ఎస్ సర్కారు ప్రగతిని రోల్ మోడల్‌గా చూపనున్నట్టు సమాచారం. ► పార్టీ ఎజెండాను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా.. వివిధ రంగాలకు చెందిన వారిని కూడగట్టే పనిని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు అప్పగించినట్టు తెలిసింది. ► దేశంలోని పలువురు వ్యవసాయ, ఆర్థిక, నీటి పారుదల, విద్యుత్, పాలనా రంగాల నిపుణులతో కేసీఆర్ ఇప్పటికే మంతనాలు జరిపారు. మొత్తంగా దేశం ముందు పెట్టాల్సిన ప్రత్యామ్నా య, ఆర్థిక ఎజెండాను రూపొందించే బాధ్యతను హైదరాబాద్‌లోని ఓ సామాజిక, ఆర్థిక అధ్యయన బృందానికి అప్పగించినట్టు తెలిసింది. ► ఇక పార్టీ ఎజెండాపై విస్తృత ప్రచారం కల్పించేందుకు దేశవ్యాప్తంగా పలు వర్సిటీల్లో సదస్సులు నిర్వహించేలా ఇప్పటికే కొన్ని విద్యార్థి బృందా లను సిద్ధం చేసినట్టు సమాచారం. ► తెలంగాణ ఉద్యమ వ్యాప్తి, టీఆర్ఎస్ విస్తరణలో కీలకపాత్ర పోషించిన ‘సాంస్కృతిక కళారూపాలను కొత్త పార్టీకి కూడా జోడించనున్నారు. దీనికి అవసరమైన సాహిత్యం, కళాకారులు వంటి అనేక అంశాలపై కసరత్తు జరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాతో జాతీయ పార్టీ ఏర్పాటుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. మూడు రోజులుగా ప్రగతిభవన్‌లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో మంతనాలు జరిపిన కేసీఆర్.. కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలకు తుది రూపునిచ్చినట్టు తెలిసింది. ‘భారత రాష్ట్ర సమితి’, ‘భారత నిర్మాణ సమితి’, ‘భారత ప్రజా సమితి’లలో ఒక పేరును ఖరారు చేసి.. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ చురుగ్గా కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు మంచి రోజులు ఉండటంతో సరైన ముహూర్తం చూసి.. కొత్త జాతీయ పార్టీ పేరు, ఎజెండా, నియమావళి, జెండా, ఎన్నికల గుర్తు తదితరాలను ప్రకటించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. దీంతో త్వరలోనే కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఈ కొత్త జాతీయ పార్టీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్ వ్యవహరించనుండగా.. ప్రశాంత్ కిషోర్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి లేదా సెక్రటరీ జనరల్ హోదా కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏర్పాట్లపై తుది కసరత్తు.. ‘భారత రాష్ట్ర సమితి’ లేదా ‘భారత నిర్మాణ సమితి’గా టీఆర్ఎస్ అవతరించే పక్షంలో.. ఆపై రాష్ట్రంలోనూ కొత్త పేరుతోనే మనుగడ సాగించనుంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు కొత్త జాతీయ పార్టీకి చెందిన గుర్తు, ఎజెండాపైనే ఎన్నికల బరిలోకి దిగే అవకాశముంది. జాతీయ పార్టీగా అవతరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పేరిట ఉన్న ఆస్తులు, బ్యాంక్ డిపాజిట్లు తదితరాలను కొత్త పార్టీ పేరిట మార్పిడి చేసేందుకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు, చిక్కులపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. కొత్త జాతీయ పార్టీ ఆవిర్భావ ప్రకటనతోపాటు జాతీయ కార్యవర్గం/పొలిట్ బ్యూరోను కేసీఆర్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో భావ సారూప్యత కలిగిన చిన్న పార్టీలు, వివిధ సామాజిక సంస్థలు, సంఘాలను విలీనం చేసుకుంటూ కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్టు సమాచారం. కొత్త పార్టీ కార్యవర్గంలో రాజకీయ నేతలకంటే వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావి వర్గానికి పెద్దపీట వేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాపై తమ చిత్తశుద్ధిని చాటాలని కేసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీలో బహిరంగ సభ పెట్టి.. కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపనపై ప్రకటన చేశాక.. జూలై మొదటి వారంలో దేశ రాజధాని ఢిల్లీ లేదా పరిసర రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆ సభకు తెలంగాణతోపాటు ఉత్తరాది నుంచి జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజయ్యేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్టు తెలిసింది. ఉత్తరాదిన పార్టీ విస్తరణకు అనువైన వాతావరణం ఉందని భావిస్తూ.. ఉత్తరాది రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో రాజకీయ శూన్యత లేదనే అభిప్రాయంతో ఉన్న కేసీఆర్.. సందర్భాన్ని బట్టి ముందుకు సాగాలని భావిస్తున్నారు. రైతు నేత రాకేశ్ తికాయత్ సేవలను వినియోగించుకోవడం, యూపీలో ఆర్ఎల్డీ, జార్ఖండ్‌లో జేఎంఎం, బిహార్‌లో ఆర్జేడీ, యూపీలో సమాజ్‌వాదీ వంటి పార్టీలతో ఏ తరహా సంబంధాలను కొనసాగించాలనే కోణంలోనూ కేసీఆర్ కొంతమేర స్పష్టతకు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రాల వారీగా రాజకీయ పరిస్థితులు, కలిసి వచ్చే పార్టీలు, నేతల వివరాలతో పీకే బృందం ఇప్పటికే నివేదికలు రూపొందించినట్టు సమాచారం. కొత్త పార్టీకి ‘సినీ గ్లామర్’! జాతీయ రాజకీయాల్లో వీలైనంత త్వరగా కుదురుకోవాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. కొత్త పార్టీకి సినీ గ్లామర్‌ను కూడా అద్దుతున్నారు. ఇప్పటికే నటుడు ప్రకాశ్‌రాజ్ కేసీఆర్‌తో సన్నిహితంగా మెలుగుతుండగా.. మరో నటుడు సోనూసూద్ కూడా కొత్త పార్టీలో కీలక బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సోషల్ మీడియా దన్నుతో.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ విస్తరణ కోసం కొన్ని జాతీయ మీడియా సంస్థల సాయం తీసుకోవడంతోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను విస్తృతంగా ఉపయోగించుకునేలా ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే వ్యూహ రచన చేశారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ విధానాలపై కేసీఆర్ హిందీలో చేసిన ప్రసంగాల్లోని అంశాలు ఇప్పటికే సామాజిక మాధ్య మాల ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్నాయని.. వేల సంఖ్యలో కామెంట్లు, లైక్‌లు వస్తున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
చిన్నారి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది: సోనూసూద్
రియల్ హీరో సోనూ సూద్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన రెండున్నారేళ్ల చిన్నారికి సోనూసూద్ శస్త్ర చికిత్స చేయించేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం చిన్నారికి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఏడు గంటల పాటు బాలికకు వైద్యులు శస్త్రచికిత్స చేసి విజయవంతంగా పూర్తి చేశారని తాజాగా సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆపరేషన్‌కు ముందు, తర్వాత ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. బిహార్‌లోని చిన్న గ్రామంలో నాలుగు కాళ్లు, చేతులతో చౌముఖి జన్మించింది. చదవండి: ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు: వీడియో వైరల్ ఇటివల తనకు జరిగిన శస్త్ర చికిత్స విజయంతం కావడంతో చౌముఖి త్వరలో ఇంటికి వెళ్లేందకు సిద్ధంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. కాగా కరోనా సమయంలో సోనూ సూద్ ఎంతోమందికి చేయూతను ఇచ్చారు. లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కూలీల కోసం ప్రత్యేక బసు సదుపాయం కల్పించి వారి సొంత రాష్ట్రాలకు తరలించారు. ఇతర దేశాల్లో సైతం చిక్కుకుపోయిన వారిని కూడా ప్రత్యేక విమానాల ద్వారా దేశానికి రప్పించారు. ఇలా మొదటి లాక్డౌన్ నుంచి సోనూ సూద్ పేదలకు ఆర్థిక సాయం అందిస్తూ నిరంత సామాజీక సేవలు చేస్తూనే ఉన్నారు. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు: వీడియో వైరల్
ఇంతవరకు అవిభక్త కవలల్లా జన్మించిన వాళ్లను చూశాం. చాలా మంది పిల్లలు జన్యులోపం కారణంగానో లేక మరేఇతర కారణాల వల్లనో శరీరంలో ఏదో ఒక అవయవం గానీ లేదా నడుం భాగం నుంచి అతుక్కుని పుట్టిన వాళ్లని చూశాం. కానీ ఇక్కడో అమ్మాయి మాత్రం చాలా విచిత్రంగా జన్మించింది. ఆ చిన్నారికి ఏకంగా నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించింది. వివరాల్లోకెళ్తే....బిహార్‌లోని నెవాడా జిల్లాకు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి నాలుగు కాళ్లు, చేతులతో జన్మించింది. ఆ చిన్నారి కుటుంబం వైద్యం చేయించే స్థోమతలేని పేద కుటుంబం. ఐతే ఆ చిన్నారికి చేతులు కాళ్లు ఆమె పొట్టభాగానికి అనుసంధానమై ఉన్నాయి. ఈ మేరకు ఆ చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో బాలీవుడ్ ప్రముఖ నటుడు సోను సూద్ ఆ చిన్నారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అంతేకాదు ఆ చిన్నారికి వైద్యం అందుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా ఆ చిన్నారి త్వరగా నయమవ్వాలని ప్రార్థించండి అని ట్వీట్ చేశారు. टेन्शन मत लीजिए इलाज शुरू करवा दिया है। बस दुआ करिएगा। https://t.co/gndrRhuNQJ pic.twitter.com/YoCTRoqoir — sonu sood (@SonuSood) May 28, 2022 बिहार : नवादा जिले में एक ढाई साल की बच्ची के जन्म से ही चार हाथ और पैर ◆बच्ची की माता-पिता ने इलाज के लिए SDO कार्यालय पहुंचकर मदद की गुहार लगाई pic.twitter.com/2AYHCwINfm — News24 (@news24tvchannel) May 27, 2022 (చదవండి: వీడియో: అందర్నీ ఆశ్చర్యపరిచేలా వధువు ఎంట్రీ!.. వరుడు షాక్) -
ఆచార్య: థియేటర్ వద్ద సోనూ సూద్ భారీ కటౌట్‌కి పాలభిషేకం
Fans Pouring Milk On Sonu Sood Cutout At Acharya Theatres: సోనూ సూద్.. పెద్దగ పరిచయం అక్కర్లేని పేరు. సినిమాలో విలన్‌గా కంటే నిజ జీవితంలో రియల్ హీరోగానే అందరికి తెలుసు. కరోనా సమయంలో ఎందరో అభాగ్యులకు ఆపన్న హస్తం అందించారు. తన సొంత ఖర్చులతో ఎంతోమంది వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు చేర్చారు. అప్పటి నుంచి ఎవరూ ఏ సాయం అడిగినా కాదనకుండ తనవంతుగా చేయూతనిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఫౌండేషన్ పెట్టి అనారోగ్యులకు వైద్య ఖర్చులు, పెద పిల్లలకు చదువు.. ఇలా రకరకాల సామాజిక సేవలు అందిస్తున్నారు. దీంతో సోనూ సూద్ అందరికి రియల్ హీరో అయ్యారు. చదవండి: బాలీవుడ్ నటి జావ్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఈడీ షాక్ ఈ నేపథ్యంలో సోనూ సూద్ మీద అభిమానాన్ని చాటుకున్నారు ఆయన ఫ్యాన్స్. ఆయన చిరంజీవి, రామ్ చరణ్‌ల మల్టిస్టారర్ ‘ఆచార్య’ మూవీలో ప్రతి కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిన్న(ఏప్రిల్ 29)న విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో సోనూసూద్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. అంతేకాదు ఆయన కటౌట్‌కి పాలభిషేకం చేసి.. పెద్ద దండ వేసి, బొట్టు పెట్టి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అంతేకాదు కటౌట్ ముందు టపాసులు పేలుస్తూ సందడి చేశారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి దీనిపై సోనూసూద్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని సంతరించుకుంది. The #SonuSood Phenomenon continues as the fans pour their love on the real hero once again! Such feat is rarely achieved by few super stars! @SonuSood pic.twitter.com/1hNurkpZR7 — Harish Kumar (@apparalaharishk) April 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1701356058.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సోనూ సూద్‌కు ఫన్నీ రిక్వెస్ట్, స్పందించిన రియల్ హీరో
Sonu Sood Epic Reply to Netizen: బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా వైరస్, లాక్డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులు, కూలీలకు సాయం అందిచిన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించి పలువురి ప్రాణాలును కాపాడారు. అప్పటి నుంచి ఆయన తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగానూ ఎంతోమందికి సహాయం అందిస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన, లేదా సర్జరీలు వంటి కోసం ఆర్థిక సాయం కావాలంటూ సోనూ సూద్‌కు ట్వీట్ చేస్తుంటారు. చదవండి: కాబోయే భార్యకు రణ్‌బీర్ కాస్ట్లీ గిఫ్ట్! అదేంటో తెలుసా? ఇలాంటివి తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి వారికి సాయం అందిస్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఓ బాలుడికి సోనూ ఫౌండేషన్ ద్వారా ఇటీవల హార్ట్ సర్జరీ చేయించారు సోనూ సూద్. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు. ఇదే విషయాన్ని సోనూకు తెలియజేస్తూ ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఆయనకు ట్వీటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఇది చూసిన ఓ నెటిజన్ సోనూకు ఫన్నీ ట్వీట్ చేశాడు. తాను భార్యాబాధితుడినని, తనకు కూడా చికిత్స చేయించాలంటూ సోనూ సూద్‌ను కోరాడు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: స్పెషల్ హీరోయిన్.. సో స్పెషల్ ‘సోదరా సోనూసూద్ మీరు అందరికీ చికిత్స అందేలా చేస్తున్నారు. నా భార్య రోజూ నా రక్తం తాగుతోంది. దానికి ఏదైనా చికిత్స ఉందా? ఉంటే దయచేసి సహాయం చేయండి. ఒక భార్య బాధితుడిగా చేతులు జోడించి మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సోనూ సూద్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘అది ప్రతీ భార్య జన్మ హక్కు బ్రదర్.. ఆ రక్తంతో నాలాగే మీరు కూడా బ్లడ్ బ్యాంకు ప్రారంభించండి’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు. यह हर बीवी का जन्म सिद्ध अधिकार है भाई, मेरी मानो उसी खून से एक ब्लड बैंक खोल लो 🤣 https://t.co/bXOPLzDS74 — sonu sood (@SonuSood) April 13, 2022 -
సోనూసూద్‌కు దుబాయ్ నుంచి అరుదైన గౌరవం..
Actor Sonu Sood Receives UAE Golden Visa: సోనూసూద్.. రీల్ విలన్ నుంచి రియల్ లైఫ్ హీరోగా మారాడు. సోనూసూద్ అంటే లాక్డౌన్ ముందు వరకు విలన్‌గానే అందరికీ తెలుసు, కానీ లాక్డౌన్ తర్వాత సీన్ మారింది. నిరుపేదలకు బాసటగా నిలుస్తూ, కార్మికులకు కొండంత అండగా పేద ప్రజల పాలిట పెన్నిధిగా మారి యువతకు రియల్ హీరో అయ్యాడీ రీల్ విలన్. అతడు చేసే సేవా కార్యక్రమాలకు యావత్ దేశం ఫిదా అయింది. 'ప్రభుత్వాలు చేయలేని సాయాన్ని మీరు చేశారంటూ' సోనూను ప్రతి ఒక్కరూ కొనియాడారు. చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్ తాజాగా ఆయన దుబాయ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాతకమైన గౌరవాన్ని అందుకున్నాడు. సోనూసూద్ అహర్నిశలు శ్రమిస్తూ చేసిన సమాజ సేవకు గౌరవార్థవంగా 'యూఏఈ గోల్డెన్ వీసా'ను అందించింది. ఈ దుబాయ్ గోల్డెన్ వీసాను అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు సోనూసూద్. ఇంకా నేను ఈ గోల్డెన్ వీసాను అందుకోవడం చాలా గౌరవంగా ఉంది. నేను సందర్శించేందుకు ఇష్టపడే ప్రదేశాల్లో దుబాయ్ ఒకటి. ఇది అభివృద్ధి చేందడానికి అత్యద్భుతమైన చోటు. నేను అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అని సోనూసూద్ పేర్కొన్నాడు. చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న హాట్ బ్యూటీ.. -
ఉక్రెయిన్‌లో భారతీయులు.. రంగంలోకి దిగిన సోనూ సూద్.. వీడియో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు సోనూ సూద్ అంటే బహుశా తెలియని వారు ఉండకపోవచ్చు. కరోనా సమయంలో ఎందరో అభాగ్యులకు సోనూ నేనున్నా అంటూ ఆపన్న హస్తం అందించారు. ఎవరు ఏ సాయం అడిగినా కాదనకుండా తన వంతు సాయం చేశారు. స్వస్థలాకు వెళ్లేవారి కోసం బస్సులు నడిపించారు. అన్ని తానై వేల మందికి సాయం అందజేశారు. తాజాగా ఉక్రెయిన్ ఉద్రిక్తతల సమయంలోను మరోసారి సోనూ సూద్‌ను బాధితులు గుర్తు చేసుకుంటున్నారు. సాయం కోసం సోషల్ మీడియా వేదికగా సోనూకు వినతులు పంపుతున్నారు. అయితే, ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ పట్టణంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను అక్కడి నుంచి తరలించడానికి సోనూసూద్‌కు చెందిన చారిటీ సంస్థ సేవలు అందిస్తోంది. భారతీయులను ఖర్కీవ్ నుంచి పోలాండ్ సరిహద్దు వరకు తరలించేందుకు చారిటీకి చెందిన సభ్యులు సాయం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. Students stranded in #UkraineRussiaWar thanking @SonuSood for helping them in getting out from Ukrainian soil. https://t.co/IvW59fswVC pic.twitter.com/4Cp7agyU0h— Ayushman Kumar (@Iam_Ayushmann) March 2, 2022 మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. సోనూ సూద్‌కు తమకు సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. తాము ఇక్కడి నుండి స్వదేశానికి చేరుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ వీడియోపై సోనూ ట్విట్టర్ వేదికంగా స్పందించాడు. ఇది నా బాధ్యత.. నా వంతుగా సాయం అందించినందుకు సంతోషంగా ఉందంటూ కామెంట్స్ చేశాడు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో సోనూ సూద్ పోస్టు వైరల్ అవుతోంది. #BREAKING | INDIA RAMPS UP EVACUATION As the 4th evacuation flight from #Ukraine carrying stranded Indians lands in Delhi, Mirror Now's @Iam_Ayushmann speaks to students who share their ordeal. A student said he got in touch with @SonuSood's team for guidance & help. pic.twitter.com/ew37hkEcpm— Mirror Now (@MirrorNow) March 2, 2022 -
సోనూ సూద్‌పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..?
Punjab Legislative Assembly Election 2022: ఎన్నికల ప్రవర్తనా నియామావళికి సంబంధించి పంజాబ్‌లోని మోగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సినీ నటుడు సోనూ సూద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మోగా నియోజకవర్గం నుంచి సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించకుండా అధికారులు ఆదివారం సోనూను అడ్డుకున్న సంగతి తెలిసిందే. -
సోనూసూద్ ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్న పోలీసులు!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మోగా పోలింగ్ బూత్ వద్ద బాలీవుడ్ నటుడు, సామాజిక కార్యకర్త అయిన సోనూసూద్ ఎస్యూవీ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సోనూ సూద్ సోదరి మాళవికా సూద్ సచార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన తన సోదరి మాళవిక సూద్ సచార్ కోసం బాలీవుడ్ నటుడు మోగాలో క్యాంప్ చేస్తున్నాడు. అయితే మోగా జిల్లాలోని లంధేకే గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోనూ సూద్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని (ఎస్యూవీ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల పరిశీలకుల సూచన మేరకు వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఎస్డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా సోనూ సూద్ ఇంటిపై వీడియో నిఘాను ఆదేశించారు. ఈ మేరకు సిటీ పోలీస స్టేషన్ ఆఫీసర్ దేవిందర్ సింగ్ మాట్లాడుతూ ..అనుమానాస్పద కార్యాచరణ ఆధారంగా ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నాము. లంధేకే గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర ఎస్యూవీ తిరుగుతున్నట్లు మాకు ఫిర్యాదు అందింది. మేము దానిని స్వాధీనం చేసుకున్నాము. అంతేకాదు అతను మోగాలో ప్రచారం చేస్తున్నప్పుడు ఆ వాహనాన్ని ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోనూ సూద్‌కు మోగా నియోజకవర్గంలో ఓటు లేనందున ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి వీల్లేదని ఇంట్లోనే ఉండాలని ఎస్డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా ఆదేశించారు. అయితే అతను ఆ ఆదేశాలను ఉల్లంఘించాడు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి. అని అన్నారు. ఈ విషయమై సోనూసూద్‌ను మాట్లాడుతూ.. “శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బర్జిందర్ సింగ్, అలియాస్ మఖన్ బ్రార్, నాపై తప్పుడు ఫిర్యాదు చేశారు. ఇది కేవలం పార్కింగ్ సమస్య మాత్రమే. వాహనం సరిగ్గా పార్క్ చేయలేదు. ఇంకేమీ లేదు" అని చెప్పారు. (చదవండి: కాంగ్రెస్‌కే ఓటు వేయండి అని బీజేపీ ప్రచారం ! తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ) -
దటీజ్ సోనూసూద్: యాక్సిడెంట్ వీడియో వైరల్
రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. అర్థరాత్రి రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకోవడంతో అదే దారిన పోతున్న సోనూసూద్ తనకెందుకులే అని ఊరుకోలేదు. తక్షణమే స్పందించి కారులో ఇరుక్కుపోయిన బాధితుడిని తన కారులో ఆస్పత్రికి తరలించారు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దటీజ్ సోనూసూద్, సూపర్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పంజాబ్‌లోని మోగా నగరంలోని కొట్కాపురా బైపాస్ సమీపంలో మంగళవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులో చిక్కుకున్న గాయపడిన వ్యక్తిని సోనూసూద్ గమనించారు. తన టీమ్ సభ్యులతో కలిసి గాయపడిన వ్యక్తిని కారులోంచి బయటకు తీసి అన్పీ ల్యాప్‌లో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సరైన సమయంలో తగిన చికిత్స లభించడంతో ప్రస్తుతం గాయపడిన 19 ఏళ్ల యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మెరుగైన వైద్యం అందుతోంది. కాగా కరోనా మహమ్మారి విజృంభించిన దశ మొదలు గత రెండేళ్ల కాలంగా బాధితులకు అండగా నిలుస్తున్నారు సోనూసూద్. మొదటి దశలో వలస కార్మికులకు సోనూ విశేష సేవలు పలువురి ప్రశంసలు దక్కించుకున్నాయి. అలాగే రెండో దశలో కరోనా బారిన పడిన వారికి ఆక్సిజన్ సిలిండర్లు, మందులు అంద జేయడంతోపాటు ఆన్లైన్ చదువులకోసం ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థులకు ఆయన అందించిన అండదండలు అమోఘంగా నిలిచిన సంగతి తెలిసిందే. Accident of 2 vehicles occured in Moga. Sonu Sood himself took out the unconscious boy from the car and took him to the hospital in his car. #sonusood pic.twitter.com/BM7fjvighU — Gagandeep Singh (@Gagan4344) February 8, 2022 -
చన్నీకి మరొక్కసారి అవకాశం ఇవ్వాలి: సోనూసూద్
Punjab Assembly Election 2022: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి సుదీర్ఘకాలం పదవిలో ఉండి సేవలందించే అవకాశం లభింనందున అతనికి మరొక్క అవశాశం ఇవ్వాలని బాలీవుడ్ నటుడు సోనూసూద్ అన్నారు. చన్నీ ముఖ్యమంత్రిగా చాలా తక్కువ సమయమే పని చేసినప్పటికీ చాలా ప్రశంసించదగ్గ పనులు చేశారని చెప్పారు. అంతేకాదు పంజాబ్ రాష్ట కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంచి నిజాయితీ పరుడు, హృదయ పూర్వకంగా మాట్లాడతారని అన్నారు. కాంగ్రెస్ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని, పైగా ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందన్న విషయన్ని కూడా నొక్కి చెప్పారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ని తాను చాలా ఏళ్ల క్రితం ఒక కళాకారుడిగా మాత్రమే కలిశానని చెప్పారు. ఆయన రాజకీయనాయకుడిగా ఎలా ఉంటారనే విషయం గురించి తనకు తెలియదని సోనూ సూద్ తెలిపారు. సోనూ సూద్ సోదరి 38 ఏళ్ల మాళవిక సూద్ సచార్ కాంగ్రెస్ అభ్యర్థిగా తమ పూర్వీకుల ఊరు మోగా నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తన సోదరితో కలిసి ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, చాలా కాలంగా సామాజిక సేవలో పాల్గొంటున్న తన సోదరికి మాత్రమే మద్దతు ఇస్తున్నానని సూద్ నొక్కి చెప్పారు. మొగాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ధర్మశాలలు మా కుటుంబమే నిర్మించిందని ఈ సందర్భంగా చెప్పారు. పైగా వ్యవస్థలో భాగమైతే చాలా పనులు జరుగుతాయని మాళవికను ప్రజలే రాజకీయాల్లోకి తీసుకొచ్చారని సూద్ అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లోని మోగా నియోజకవర్గంలో మంచి పనులు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిందన్నారు. అంతేకాదు తమ మానిఫెస్టోని అమలు చేయగల పార్టీగా కాంగ్రెస్‌ని విశ్వస్తున్నాని, అందువల్ల తమ సోదరి కాంగ్రెస్‌లో చేరడం మంచిదని భావించానని చెప్పుకొచ్చారు. పైగా తనకు వివిధ పార్టీ నుంచి ఆఫర్లు వచ్చాయని కూడా చెప్పారు. అయితే తాను వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వస్తానని, కాకపోతే తనవద్ద తగినంత పెద్ద టీమ్ లేదని అన్నారు. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అనంతరం జరిగిన ఆదాయపు పన్ను శాఖ రైడ్ విషయం కూడా సెటిల్ అయ్యిందని సోనూ సూద్ చెప్పారు. (చదవండి: పాటియాలా నుంచి అమరీందర్.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల) -
‘చెయ్యి’కి జై కొట్టిన సోనూ సూద్.. కాంగ్రెస్‌లోకి మాళవిక
Sonu Sood Sister Malvika Sood Joines Congress In Punjab Elections: సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకుని నిజ జీవితంలో మాత్రం అందరిచేత హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. కరోనా, లాక్డౌన్ సమయంలో ఎంతోమంది అన్నార్థులకు సాయం అందించిన సోనూ సీరియస్ పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించి ప్రాణాలు కాపాడాడు. ఇదిలా ఉంటే సోనూసూద్ సోదరి మాళవిక సూద్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన వేళ రాజకీయ పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే మోగాలోని సోనూసూద్ నివాసానికి వెళ్లిన పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ వారితో చర్చించారు. అనంతరం ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ, సిద్ధూ సమక్షంలో మాళవిక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది నవంబర్‌లో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏ పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అలాగే ఇటీవల పంజాబ్ ఐకాన్ పదవి నుంచి సోనూసూద్ తప్పుకున్నారు. ఇదిలా ఉంటే పంజాబ్‌లో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సెలబ్రిటీలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా త్వరలోనే హస్తం గూటికి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. The future of Punjab is ready! #SonuSoodWithCongress pic.twitter.com/qxyJ2yCXeT — Punjab Youth Congress (@IYCPunjab) January 10, 2022 ఇదీ చదవండి: సోనూసూద్ కీలక నిర్ణయం.. పంజాబ్ స్టేట్ ఐకాన్‌కి గుడ్‌బై -
సోనూసూద్ కీలక నిర్ణయం.. పంజాబ్ స్టేట్ ఐకాన్‌కి గుడ్‌బై
చంఢిఘర్: బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా వైరస్, లాక్డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులు, కూలీలకు సాయం అందిచిన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించి పలువురి ప్రాణాలును కాపాడారు. అయితే ఆయన తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను పంజాబ్ ‘స్టేట్ ఐకాన్’గా ఉండబోనని సోనూసూద్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. పంజాబ్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం గతేడాది సోనూసూద్‌ను ‘స్టేట్ ఐకాన్’గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోదరి మాళవిక సూద్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్టేట్ ఐకాన్ హోదా నుంచి తప్పుకున్నారు. Like all good things, this journey has come to an end too.I've voluntarily stepped down as the State Icon of Punjab.This decision was mutually taken by me and EC in light of my family member contesting in Punjab Assembly Elections. I wish them luck for future endeavours.🇮🇳 — sonu sood (@SonuSood) January 7, 2022 ‘స్టేట్ ఐకాన్‌గా నా ప్రయాణాన్ని ముగిస్తున్నా. స్వచ్ఛందంగా తాను ‘స్టేట్ ఐకాన్’ పదవి నుంచి వైదొలుగుతున్నా. ఎన్నికల సంఘంతో చర్చించి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నా. నా సోదరి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు’ అని సోనూ ట్విటర్లో పేర్కొన్నారు. నవంబర్‌లో ఆయన సోదరి మాళవిక సూద్ పంజాబ్ అసెంబ్లీలో పోటీ చేయనున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏ పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తారన్న విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. అనంతరం పంజాబ్ సీఎం చరణ్‌జిత్ చన్నీతో కూడా భేటీ అయ్యారు. అయితే ఆయన సోదరి కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్నారని వార్తలు కూడా వచ్చాయి. అదేవిధంగా ఢిల్లీలో ‘దేశ్ కా మెంటర్స్’ అనే విద్యార్థుల సంబంధించిన ఓ కార్యక్రమానికి సోనూసూద్‌ను సీఎం కేజ్రీవాల్ అంబాసిడర్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. -
సోనూ సూద్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల
Sonu Sood New Movie Fateh Poster Released: రియల్ హీరో సోనూ సూద్ లీడ్ రోల్లో రూపొందనున్న చిత్రం ‘ఫతే’. ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేసిన అభినందన్ గుప్తా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గురువారం ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించి, పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో ‘భారతదేశంలో దాక్కున్న ఒక శత్రువుపై ఒక వ్యక్తి చేసే యుద్ధం’ అని ఉంది. ‘‘కథ విన్న వెంటనే తప్పకుండా ఈ సినిమా చేయాలనిపించింది. ఆలోచింపజేసే ఈ కథను అందరికీ చూపించాలి. 2022ని మరింత యాక్షన్‌తో స్వాగతిస్తున్నాను’’ అన్నారు సోనూ సూద్. సోనూసూద్ అంటే లాక్డౌన్ ముందు వరకు విలన్‌గానే అందరికీ తెలుసు, కానీ లాక్డౌన్ తర్వాత కథ మారింది! నిరుపేదలకు బాసటగా నిలుస్తూ, కార్మికులకు కొండంత అండగా పేదప్రజల పాలిట పెన్నిధిగా మారి యువతకు రియల్ హీరో అయ్యాడీ రీల్ విలన్. అతడు చేసే సేవా కార్యక్రమాలకు యావత్ దేశం ఫిదా అయింది! ప్రభుత్వాలు చేయలేని సాయాన్ని మీరు చేశారంటూ సోనూను ప్రతి ఒక్కరూ కొనియాడారు. తన దయాగుణంతో, తలపెట్టిన మంచిపనులతో స్టార్ హీరోల కన్నా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు సోనూసూద్. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
వర్ధమాన షూటర్ కోనికా ఆత్మహత్య
జాతీయ స్థాయి షూటర్, జార్ఖండ్‌కు చెందిన 26 ఏళ్ల కోనికా లాయక్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల ఆశించిన స్థాయి ప్రదర్శన లేకపోవడంతో ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కోల్‌కతాలో మాజీ ఒలింపియన్ జాయ్దీప్ కర్మాకర్ వద్ద కోనికా శిక్షణ పొందుతోంది. సొంత రాష్ట్రం తరఫున మంచి ప్రదర్శన ఇవ్వడంతో నటుడు సోనూసూద్ ఆమెకు ప్రత్యేక రైఫిల్ కొనిచ్చి ప్రోత్సహించాడు. ఇటీవల అనూహ్య రీతిలో నలుగురు షూటర్లు ఆత్మహత్యకు పాల్పడటం చర్చకు దారి తీస్తోంది. -
సోనూసూద్‌కు బీఎంసీ మరో షాక్, మాట నిలబెట్టుకోలేదంటూ హెచ్చరిక
Sonu Sood Gets Again Notice From BMC Over Illegal Hotel: రియల్ హీరో నటుడు సోనూసూద్‌కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) మరోసారి షాకిచ్చింది. వసతి గృహం కోసం నిర్మించిన ఆరు అంతస్తుల భవవాన్ని హోటల్‌గా మార్చారని సోనూసూద్‌కు బీఏమ్సీ నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశం మేరకు అక్రంగా హోటల్‌గా మార్చిన ఆరు అంతస్తుల భవనాన్ని తిరిగి రెషిడెన్షియల్ భవంతిగా మార్చుతానని గతంలో సోనూసూద్ మాట ఇచ్చారని, దానిని ఇంకా నిలబెట్టుకోలేదంటూ బీఎంసీ తమ నోటీసులో గుర్తుచేసింది. కాగా నవంబర్ 15, 2021న బీఎంసీ ఈ నోటీసులు పంపుతూ వెంటనే స్పందించి యథాస్థితిలో బిల్డింగ్‌ను కొనసాగించాలని సోనూసూద్‌ను హెచ్చరించింది. చదవండి: Kareena Kapoor: కరీనా డ్రెస్సింగ్‌పై నెటిజన్ల విమర్శలు, ‘హే భగవాన్ ఇంకేం చూడాల్సి వస్తుందో కాగా ఈ ఏడాది ప్రారంభంలో మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేశ్ కుస్ములు అనే వ్యక్తి సోనూసూద్‌పై బీఎంసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాలికల వసతి గృహన్ని సోనూసూద్ హోటల్‌గా మార్చారని.. ఇది చట్టరిత్యా నేరం కాబట్టి ఆ భవనాన్ని వెంటనే కూల్చివేయాలంటూ తన ఫిర్యాదులో కోరాడు. దీంతో ఈ ఏడాది ప్రారంభంలోనే బీఎంసీకి సోనూసూద్ మధ్య సంప్రదింపులు జరిగాయి. ఇక ఇదే విషయంపై సోనూసూద్ సూప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు విచారణ అనంతరం తన పిటిషన్‌ను వెనక్కు తీసుకుని ఆ హోటల్‌ను తిరిగి నివాస భవనంగా మార్చేందుకు సోనూసూద్ అంగీకరించారు. చదవండి: ఎలిమినేషన్ అనంతరం పింకీ తొలి ఇంటర్య్వూ.. మానస్ గురించి ఏం చెప్పిందంటే -
భార్య బర్త్‌డే, ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సోనూసూద్
లాక్డౌన్లో ఎంతో మంది కార్మికులకు, పేద ప్రుజలకు సాయం చేసి అండగా నిలిచిన రియల్ హీరో, సినీ నటుడు సోనూసూద్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు ఆయన భార్య సోనాలి పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోనూసూద్ ఆమెకు విషెస్ తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ మేరకు భార్యపై ప్రేమ కురిపిస్తూ పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. చదవండి: అత్యంత డేంజర్ లుక్‌లో అనసూయ.. భర్తనే చంపేస్తుందట, ఇదిగో ప్రూఫ్ ఇంతకి ఆ పోస్ట్‌లో సోనూసూద్ ఏమని రాసుకొచ్చారంటే.. ‘హ్యాపీ బర్త్‌డే మై జాన్. నా జీవితాన్ని పరిపూర్ణం చేసినందుకు ధన్యవాదాలు. నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నాకు పిల్లర్‌లా నిలుస్తూ ధైర్యాన్ని ఇచ్చావు, మంచి స్నేహితురాలిగా అడ్వైజ్‌లు ఇస్తావు, ఎన్నో విషయాల్లో స్ఫూర్తినిచ్చావు. నేను చెప్పే ప్రతి మాట వింటావు.. లవ్ యూ’ అంటూ రెండు రెడ్ హార్ట్ ఏమోజీలను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: తన ఫ్రెండ్ ట్రాన్స్‌జెండర్‌తో ఉపాసన, సోదరి పెళ్లి వేడుకలకు ఆహ్వానం ఇక సోనూసూద్ పోస్ట్‌పై బాలీవుడ్‌కు చెందిన నటీనటులు తమదైన శైలిలో స్పందిస్తూ సోనాలికి బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. కాగా లాక్డౌన్లో ఎంతో మంది పేద ప్రజలకు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికులు సోనూసూద్ తన సొంత ఖర్చులతో వారి వారి రాష్ట్రాలకు తరలించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం సేవ కార్యక్రమాలు చేస్తూ అందరి చేతి రియల్ హీరోగా నీరాజనాలు అందుకుంటున్నారు సోనూసూద్. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యంపై స్పందించిన మంచు విష్ణు
Manchu Vishnu Helps To Shiva Shankar Master And His Family: ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఆయన ఊపిరితిత్తులు పాడయ్యాయని, మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. శివ శంకర్ మాస్టర్ మాత్రమే కాకుండా ఆయన మిగతా కుటుంబ సభ్యులు భార్య, పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడ్డారు. చదవండి: ‘మా’ సభ్యుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న మంచు విష్ణు మాస్టర్ భార్య హోంక్వారంటైన్లో ఉండగా కుమారుడు సైతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వారి వైద్య చికిత్సలకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా చిన్న కుమారుడు అజయ్ అర్జించాడు. అది తెలిసి ఆయనకు వైద్యం అందించేందుకు ఇప్పటికే నటుడు సోనూసూద్, తమిళ హీరో ధనుష్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు, మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు సైతం స్పందించారు. చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్ ఎంట్రీ.. శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై ఏఐజీ వైద్యులతో మాట్లాడినట్లు ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు విష్ణు ట్వీట్ చేస్తూ.. ‘శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యంపై ఆరా తీశాను. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. మాస్టర్ చిన్న కుమారుడు అజయ్‌తో కూడా ఫోన్లో మాట్లాడాడి ధైర్యం చెప్పాను. అలాగే శివశంకర్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటాం. ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అంటూ విష్ణు రాసుకొచ్చారు. చదవండి: శివశంకర్ మాస్టర్‌కు సాయం.. పబ్లిసిటీ చేయవద్దని కోరిన ధనుష్! Spoke with #AIG hospital and they assured the best care to SivaShankar Master. They are extending the best possible help and His son Mr. Ajay is also briefed. All we need now is our prayers for Master. — Vishnu Manchu (@iVishnuManchu) November 26, 2021 -
విషమంగా శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం.. రంగంలోకి దిగిన సోనూసూద్
Sonu Sood Helps To Choreographer Shiva Shankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్ఫెక్షన్ సోకగా.. ఆయన్ని రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, దాతలు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. విషయం తెలుసుకున్న రియల్ హీరో సోనూసూద్.. సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. శివశంకర్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆయన ప్రాణాలు రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటుడిగానూ అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్ షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు. Iam already in touch with the family, Will try my best to save his life 🙏 https://t.co/ZRdx7roPOl — sonu sood (@SonuSood) November 25, 2021 -
ఆ ఉత్తరాలు చదివితే నాలో కొత్త ఉత్సాహం వస్తుంది: సోనూసూద్
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఉన్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’తాజా ఎపిసోడ్లో సోనూసూద్, కపిల్ శర్మ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ షోలో భాగంగా తన తల్లి సరోజ్ సూద్‌ను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు సోనూసూద్. ‘మా అమ్మగారికి ఉత్తరాలు రాసే అలవాటు ఉంది. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఫోన్లో మాట్లాడుతున్నప్పటికీ నాకు ఉత్తరాలు రాసేవారు అమ్మ. ఫోన్లో మాట్లాడుకుంటున్నాం.. అయినా ఉత్తరాలెందుకు? అని మా అమ్మ గారిని ఓ సందర్భంలో అడిగాను. ‘నేను నిన్ను విడిచి వెళ్లిపోయినప్పుడు ఈ ఉత్తరాలు నీ దగ్గర ఉంటాయి. ఫోన్ రికార్డ్స్ చెరిగిపోతాయి’అన్నారు. మా అమ్మ రాసిన లేఖలు(దాదాపు 25)నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మా అమ్మ నాతో లేరు. కానీ ఆ ఉత్తరాలు చదువుతుంటే మా అమ్మ నాతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. నేను కాస్త ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఉత్తరాలు చదివితే నాలో కొత్త ఉత్సాహం వస్తుంది’ అన్నారు సోనూసూద్. అలాగే సరోజ్ రాసిన ఓ లేఖను షోలో చదివి వినిపించారాయన. -
శ్రీరామచంద్రకు సూపర్ హీరో సపోర్ట్! ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
Bigg Boss Telugu 5, Sonu Sood Supports Sreerama Chandra: సోనూసూద్.. లాక్డౌన్ ముందు వరకు ఈయన విలన్‌గానే అందరికీ తెలుసు, కానీ లాక్డౌన్ తర్వాత సీన్ మారింది! నిరుపేదలకు బాసటగా నిలుస్తూ, కార్మికులకు కొండంత అండనిస్తూ పేదప్రజల పాలిట పెన్నిధిగా మారి యువతకు సూపర్ హీరో అయ్యాడీ యాక్టర్. అతడు చేసే సేవా కార్యక్రమాలకు యావత్ దేశం ఫిదా అయింది! ప్రభుత్వాలు చేయలేని సాయాన్ని మీరు చేశారంటూ సోనూను వేనోళ్ల కొనియాడారు. తన దయాగుణంతో, తలపెట్టిన మంచిపనులతో స్టార్ హీరోల కన్నా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు సోనూసూద్. తాజాగా ఈయన తెలుగు బిగ్‌బాస్ షోపై స్పందించాడు. ప్రస్తుత సీజన్లో పాల్గొన్న సింగర్ శ్రీరామచంద్రకు తన మద్దతు ప్రకటించాడు. ఈ మేరకు ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో హడావుడి చేస్తోంది. 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో శ్రీరామ్‌ను చూస్తున్నారా? నేనూ చూస్తున్నాను. షోలో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్. అతడికివే నా ప్రేమాభినందనలు.. లవ్ యూ మ్యాన్' అని చెప్పుకొచ్చాడు. శ్రీరామచంద్ర ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో కింద బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వావ్ అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు 'హమ్మయ్య, ఇక బిగ్‌బాస్ కప్పు శ్రీరామ్‌దే'నని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sreerama Chandra (@sreeramachandra5) (చదవండి: శ్రీరామ్‌కే మద్దతిస్తానంటున్న ప్రముఖ కమెడియన్) (చదవండి: నా పాయింట్లో ఇదే కరెక్ట్, నేను అలానే చేస్తా.. పింకీపై షణ్ముఖ్ ఫైర్) -
Sonu Sood: కూరగాయల బండి వద్ద సోనూసూద్.. ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: కరోనా వైరస్ వేళ అభాగ్యులకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ అండగా నిలిచి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. రైతులు, కార్మికులు, రోగులు.. ఆయన్ని సాయం కోరినవారికి తనకు తోచిన సాయం చేస్తూవసున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పలువురు తమ సమస్యలను సోనూసూద్ దృష్టికి సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్తుతున్నారు. ఈ చేస్తున్న సేవలకు గాను కొంతమంది అభిమానులు ఆయన ఇంటివద్దకు వెళ్లిమరీ కృతజ్ఞతలు తెలిపినవారు ఉన్నారు. తాజాగా సోనూసూద్ తన ఇంటి ముందుకు వచ్చిన కూరగాయలు అమ్మె ఇద్దరు వ్యక్తులు మాట్లాడాడు. వారి బండిలో ఉన్న కూరగాయల ధరల గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా వారు ఎక్కడి నుంచి వచ్చారో కూడా కనుకున్నారు. బండి మీద కూరగాయాలు అమ్మెవారి వద్ద తాజా కూరగాయలు ఉంటాయని తెలిపారు. బండిమీద కూరగాయలు ఆమ్మెవారి వద్ద కొంటే చిన్న వ్యాపారులకు సాయం అందిచినట్లు అవుతుందని అన్నారు. కూరగాలయబండి వారితో మాట్లాడిన ఓ వీడియోను సోనూసూద్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘తాజా కూరగాయల డెలివరీ కోసం నాకు ఆర్డర్ చేయండి’ అని కామెంట్ చేశారు. ఇటీవల సోనుసూద్ రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు మరోమారు వినిపిస్తున్నాయి. ఇటీవల సోనూసూద్.. ఎన్నికల్లో గెలుపొందిన రాజకీయ నాయకులు తమ మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాలు అమలు చేయకపోతే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల కారణంగా సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తారని చర్చ జరుగుతోంది. Order me for a free home delivery of fresh vegetables. Eat healthy Live healthy 🌶 🌽 🍅 #supportsmallbusiness pic.twitter.com/XVdI28T13g — sonu sood (@SonuSood) November 6, 2021 -
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం.. కర్ణాటకలో హైఅలర్ట్
-
పునీత్ రాజ్‌కుమార్ మృతి, షాక్‌లో భారత సినీ పరిశ్రమ
Puneeth Rajkumar Dies: Celebrities, Fans pay Condolences: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ రోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో కన్నడ పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. OMG!!!!!!!! Nooooooo. This can’t be true! How can this be? My deepest condolences to the family. May your soul rest in eternal peace. Gone too soon 💔 #PuneethRajkumar — Lakshmi Manchu (@LakshmiManchu) October 29, 2021 I just can’t process this!! Such a passionate ,warm and humble human being !! this is so tragic . Deepest condolence to his family .may his soul rest in peace 💔 #PuneethRajkumar — Hansika (@ihansika) October 29, 2021 పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని శాండల్‌వుడ్ సినీ ప్రుముఖులతో పాటు ఇతర టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. అంతేగాక భారత సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. Heartbroken 💔 Will always miss you my brother. #PuneethRajkumar — sonu sood (@SonuSood) October 29, 2021 The nicest person I've had the honor of crossing paths with... My Raajakumara 💔 — Priya Anand (@PriyaAnand) October 29, 2021 May your soul rest in peace. Gone too soon 💔 #PuneethRajkumar. When i did my first Kannada film always wanted to work with him… — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 29, 2021 Deeply shocked to know of the sudden demise of @PuneethRajkumar A powerful actor who won the hearts of people with his incredible body of work. Condolences to the family #RIP #Gonetoosoon #PuneethRajkumar pic.twitter.com/YuP08U2t8E — Boney Kapoor (@BoneyKapoor) October 29, 2021 GONE- one of our KINDEST, NICEST AND NOBLE soul. I don’ know what I am feeling . I am feeling so devastated. Brother you have left us very confused and heartbroken. The heavens are brighter today. I am still hoping this is not true . 🙏🙏🙏🙏🙏💔💔💔 pic.twitter.com/7wjXZzk0ND — Ranganathan Madhavan (@ActorMadhavan) October 29, 2021 Shocked and deeply heartbroken to hear this terrible news! We will all miss you dear Appu. You will live in our hearts forever! My condolences and prayers for the family to deal with this deep pain. #rip #PuneethRajkumar — Vivek Anand Oberoi (@vivekoberoi) October 29, 2021 I cannot process this. Cannot believe you've left us Puneeth. Kind, gifted, fearless...so much to give to the world. This is not fair brother. Heartbroken. — Siddharth (@Actor_Siddharth) October 29, 2021 💔💔💔 One of the kindest and warmest Actors/gentlemen. Praying to the almighty to give Puneeth Sirs family, friends and his ocean of fans the strength to cope with this irreplaceable loss. #RIP #PuneethRajKumar #Gentleman #actor #loss #cannotunderstand #soyoung pic.twitter.com/U8RyOJdFMu — dulquer salmaan (@dulQuer) October 29, 2021 Apart from the shocking tragedy that @PuneethRajkumar ‘s sudden death is, it is also a scary and terrifying eye opening truth that any of us can die anytime 😳😳😳 So it is best to live life on a fast forward mode , while we are still alive🙏🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2021 Ahh Noooo .. Gone too soon my dear Appu. I’m shattered .. Heart broken .. not fair #BlackFriday #PuneethRajkumar — Prakash Raj (@prakashraaj) October 29, 2021 One of the most humble and down to earth actors I’ve come across..Rest in Peace brother. #PuneethRajkumar — RAm POthineni (@ramsayz) October 29, 2021 Sometimes we don’t value the moment, till it’s gone 😭😭😭#Appu #Puneethrajkumar #kannadafilmindustry cannot comprehend this at all. pic.twitter.com/Zasg5px1Vl — Radikaa Sarathkumar (@realradikaa) October 29, 2021 Shocked and deeply saddened by the tragic news of Puneeth Rajkumar's demise. One of the most humble people I've met and interacted with. Heartfelt condolences to his family and loved ones 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) October 29, 2021 Heartbroken! Can’t believe you have gone so soon. pic.twitter.com/55lt4r62d1 — Jr NTR (@tarak9999) October 29, 2021 My heartfelt condolences to Puneeth’s family. Such a young and humble child. I don’t understand God’s way of things sometimes. Sad day for the entire film fraternity. Praying for strength to his family. — Mohan Babu M (@themohanbabu) October 29, 2021 -
ఆర్యన్ ఖాన్‌కు బెయిల్, ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించడంపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు పలువురు ఖాన్ ఫ్యాన్స్కూడా సోషల్‌మీడియా ద్వారా స్పందిస్తున్నారు. (Aryan Khan Drugs Case: ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్) ఆ దేవునికి ధన్యవాదాలు. ఒక తండ్రిగా చాలా రిలీఫ్ పొందుతున్నాను. అంతా మంచిగా, సానుకూలంగా జరగాలని ఆశిస్తున్నానంటూ నటుడు మాధవన్ ట్వీట్ చేశారు. అలాగే కాలమే తీర్పు చెబితే సాక్షులతో అవసరం లేదంటూ విలక్షణ నటుడు సోనూసూద్ కూడా ట్వీట్ చేశారు. వీరితోపాటు నటి స్వర భాస్కర్, తదితరులు ట్విటర్ ద్వారా సంతోషాన్ని ప్రకటించారు.(Aryan Khan drugs case: ఆయన ఉండి ఉంటే: సీఎంకు క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ) ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మెజారిటీ ప్రజలు ముకుల్ రోహత్గీ లాంటి ఖరీదైన లాయర్లను నియమించు కోలేరు. అంటే దీనర్థం అండర్ ట్రయల్ గా అమాయక ప్రజలు జైళ్లలో మగ్గుతున్నట్టేగా అని ప్రశ్నించారు. అంతేకాదు ఇన్నాళ్లు ఆర్యన్‌కు బెయిల్ రాలేదంటే.. మునుపటి లాయర్లు చాలా అసమర్థులా, అందుకే అనవసరంగా ఆర్యన్ ఇన్ని రోజులు జైలులో గడపవలసి వచ్చిందా? అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. కాగా ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అక్టోబరు 3వ తేదీన అరెస్టైన ఆర్యన్ ఖాన్‌కు గురువారం బెయిల్ లభించింది. దాదాపు మూడు వారాల తరువాత ఎట్టకేలకు ముంబై హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. So if It just took Mukul Rahtogi’s argument, to get bail for Aryan , does it mean his earlier lawyers were so incompetent that he had to spend so many days in jail needlessly? — Ram Gopal Varma (@RGVzoomin) October 28, 2021 Thank god . As a father I am So relieved .. … May all good and positive things happen. — Ranganathan Madhavan (@ActorMadhavan) October 28, 2021 FINALLY ! 👏🏽👏🏽👏🏽👏🏽 https://t.co/2zW4ldEqpW — Swara Bhasker (@ReallySwara) October 28, 2021 -
మరోసారి ఫిదా చేస్తున్న సోనూ సూద్
సాక్షి, ముంబై: రియల్ హీరో సోనూసూద్ మరోసారి ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ, తీవ్రమైన వర్కౌట్స్ చేస్తూ.. కండలు తిరిగిన చక్కటి బాడీతో ఆకట్టుకోవడం ఆయనకు అలవాటు. తాజాగా మరో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వావ్.. అంటూ ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. లక్షా 90వేలకు పైగా లైక్స్‌తో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సోనూ సూద్‌కు ఇష్టమైన ప్రదేశం జిమ్. జిమ్‌లో వర్కవుట్ చేసిన తరువాతే మరే పనైనా అన్నట్టు కసరత్తుకు ప్రాధాన్యత ఇస్తారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్‌మీడియాలో తరచూ షేర్ చేస్తూ ఉంటారు. ఆరోగ్యం ఫిట్నెస్ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వీడియోలు, కుమారుడు ఇషాన్ సూద్‌తో కలిసి చేసిన కసరత్తు తెగ హల్చల్ చేసిన సంగతితెలిసిందే. పుల్-అప్ అయినా, లెగ్ రైజ్ అయినా అలా అలవోకగా చేసి పారేయ్యగల శారీరక ధారుడ్యం అతనిది. (Manike Mage Hithe: యొహానీకి బాలీవుడ్ బంపర్ ఆఫర్) తాజాగా తన జిమ్ డైరీల నుండి మరొక స్నిప్పెట్‌ను అభిమానులతో పంచుకున్నారు. "డైలీ గ్రైండ్" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేసిన వీడియో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. రాడ్‌కు వేలాడుతూ పుల్ అప్ చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు. తను ఎక్కడ ఉన్నా ఆ ప్రదేశాన్ని వర్కవుట్ స్పేస్‌గా మార్చేయగల సత్తా సోనూ సూద్ సొంతం. గతంలో ఆయన షేర్ చేసిన ఎస్కలేటర్ వీడియోనే ఇందుకు సాక్ష్యం. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
సోనూసూద్ దాతృత్వం.. ఖమ్మం నుంచి ముంబై రప్పించుకుని..
కల్లూరు రూరల్(ఖమ్మం): మూడు నెలల పసికందు గుండెలో తీవ్ర సమస్య.. వైద్యం చేయించటానికి లక్షల రూపాయలు వెచ్చించలేని నిరుపేద కుటుంబం. ఈ విషయాన్ని సామజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నటుడు సోనూసూద్ స్పందించారు. ఆ చిన్నారికి ఆపరేషన్ చేయించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలొని చెన్నూరు గ్రామానికి చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు 2021 జులైలో బాబు పుట్టాడు. మూడు నెలల బాబుకు సాత్విక్ అనే పేరుపెట్టారు. బాబు పట్టుకతోనే గుండెలో సమస్య ఏర్పడింది. హైదరాబాద్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చిన్నారి సాత్విక్ కు గుండెలో తీవ్ర సమస్య ఉందని, ఆపరేషన్ చేయటానికి రూ.6లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. (చదవండి: చెరుకు రసం ఆశ చూపి యువకుడిపై అత్యాచారం) చిన్నారి తండ్రి కంచపోగు కృష్ణ హైదరాబాద్‌లోని ఒక ప్రవేటు కంపెనీలో చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు. చిన్నారి బాబు వైద్యం కొసం రూ.6లక్షలు లేక తల్లి తండ్రులు తల్లడిల్లి పోతున్నారు. ఈవిషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలుసుకుని సినీనటుడు సోనూసూద్‌కు తెలిపారు. ఆయన వెంటనే స్పందించి తల్లిదండ్రులు కంచెపోగు కృష్ణ, బిందు ప్రియ, చిన్నారి సాత్విక్ ప్రేమ్‌ను ముంబై పిలిపించుకొని ప్రఖ్యాత వాడియా ఆస్పత్రిలో సాత్విక్‌కు శనివారం అత్యంత కష్టమైన గుండె ఆపరేషన్ చేయించారు. చిన్నారి ఆరోగ్యం బాగుందని, తల్లిదండ్రులు కృష్ణ, బిందు తెలిపారు. నిరు పేద చిన్నారి ఆరోగ్య సమస్యను తెలుసుకొని చలించి పోయి, గుండె ఆపరేషన్ చేయించిన నటుడు సోనూసూద్‌కు కల్లూరు వాసులు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: బొగ్గు సరఫరా రైళ్లకు బ్రేక్.. కలకలం) -
సేవలకు సలాం.. సోనూసూద్‌కు అరుదైన గౌరవం
బోనకల్: కరోనా, లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతోమందికి సహాయం చేసిన సినీ నటుడు సోనూసూద్‌కు ఓ అభిమాని కుటుంబం విగ్రహం ఏర్పాటు చేసింది. ఎందరివో కష్టాలు తీర్చి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్‌పై అభిమానంతో అరుదైన గౌరవం ఇచ్చారు ఆ నిరుపేద కుటుంబానికి చెందిన దంపతులు. బోనకల్ మండలం గార్లపాడుకు చెందిన గుర్రం వెంకటేశ్వర్లు, మరియమ్మ దంపతులు కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. (చదవండి: Rain Alert: హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం) కోవిడ్ సమయంలో నిరుపేదలకు సేవలందించిన సోనూసూద్‌కు ఆ కుటుంబమంతా అభిమానులుగా మారారు. దీంతో కూలీ పనులు చేసి కూడగట్టుకున్న రూ.25 వేలతో విజయవాడలో విగ్రహాన్ని చేయించారు. దసరాలోగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. చదవండి: దిల్‌షుఖ్‌నగర్ థియేటర్లోకి భారీగా వరద నీరు, 40 వాహనాలు ధ్వంసం -
ప్రతి రూపాయి ప్రజల కోసమే: సోనూ సూద్
ముంబై: ‘సూద్ చారిటీ ఫౌండేషన్’లో ఉన్న ప్రతి రూపాయిని ప్రజల ప్రాణాలను కాపాడడానికి, ఆపన్నులను ఆదుకోవడానికే ఖర్చు చేస్తానని ప్రముఖ నటుడు సోనూసూద్ తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటనను పోస్టు చేశారు. ఓ వార్తా సంస్థతోనూ మాట్లాడారు. సోనూసూద్‌తోపాటు ఆయన అనుచరులు రూ.20 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సోనూసూద్ నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు గతవారం సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం ఆయన తొలిసారిగా ప్రకటన విడుదల చేశారు. ‘కొందరు అతిథుల’ సేవలో తీరిక లేకుండా ఉన్నానని, అందుకే గత నాలుగు రోజులుగా ప్రజలకు సేవ చేయలేకపోయానని వివరించారు. (చదవండి: Bheemla Nayak: డానియల్ శేఖర్‌గా రానా.. పంచెకట్టులో పవర్‌ఫుల్‌గా) నా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో ఇంకా చదవని మెసేజ్‌లు 54,000 ఉన్నాయి. సాయం కోసం ఎంతోమంది అర్థిస్తున్నారు. రూ.18 కోట్లు ఖర్చు చేయాలనుకుంటే 18 గంటలు కూడా పట్టదు. కానీ, ప్రతి పైసా సరైన విధంగా, అర్హులైన వారి కోసమే ఖర్చు పెట్టాలన్నదే నా ఆలోచన. రాజ్యసభ సభ్యత్వం కట్టబెడతామంటూ రెండు వేర్వేరు పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయి. రాజకీయాల్లో చేరేందుకు మానసికంగా సిద్ధం కాకపోవడంతో తిరస్కరించా. ఇప్పుడున్న హోదాతో సంతోషంగా ఉన్నా. మానసికంగా సిద్ధమైనప్పుడు చెబుతా. నా సేవా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి. ఆపడానికి కాదు ప్రారంభించింది. ఇది ఆరంభం మాత్రమే’’ అని సోనీ సూద్ స్పష్టం చేశారు. సోనూ సూద్ రూ.20 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు సోదాల్లో గుర్తించామని సీబీడీటీ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. చట్టానికి కట్టుబడి ఉంటా.. ‘అన్నివేళలా మన వాదనను మనం వినిపించలేకపోవచ్చు. కానీ, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి ప్రజల సేవ కోసం, వారి ప్రాణాలను రక్షించడం కోసం ఎదురు చూస్తోంది. సేవా కార్యక్రమాలకు అవసరమైన డబ్బు కోసం బ్రాండ్ల తరపున ప్రచారం చేశా. ఫౌండేషన్‌కు ఎవరైనా ఒక్క రూపాయి విరాళం ఇచ్చినా దానికి లెక్క చెబుతా. నేను సేకరించిన సొమ్ము కేవలం ప్రజల విరాళాలే కాదు అందులో బ్రాండ్లకు ప్రచారకర్తగా నేను సంపాదించిన డబ్బు కూడా ఉంది. (చదవండి: Bigg Boss Telugu 5: మూడో వారం నామినేట్ అయింది వీళ్లేనా?) -
Sonu Sood: చిక్కుల్లో సోనూసూద్!
సోనూ సూద్ నివాసాలు, కార్యాలయాల్లో జరుపుతున్న దాడులపై ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించారు. సోనూసూద్, అతని సహచరులు సుమారు రూ.20 కోట్లు పన్ను ఎగ్గోట్టారని ఐటీ శాఖ చెబుతోంది. అంతేకాదు Foreign Contribution (Regulation) Act నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఓ ఐటీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. సోనూసూద్ లెక్కలు చూపని ఆదాయాన్ని అనేక బోగస్ సంస్థల నుండి అసురక్షిత రుణాల రూపంలో తీసుకున్నట్లు చెప్పారు. I-T Dept conducted a search & seizure op at various premises of a prominent actor in Mumbai & also a Lucknow-based group of industries engaged in infrastructure development. 28 premises in Mumbai, Lucknow, Kanpur, Jaipur, Delhi, Gurugram covered: Central Board of Direct Taxes — ANI (@ANI) September 18, 2021 పన్నుల ఎగవేత ఆరోపణలకు సంబంధించి బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌పై శనివారం ఆదాయ పన్ను శాఖ దాడుల్ని మరింత ఉధృతం చేసింది. రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందంతో పాటు మరికొన్ని ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టిన అధికారులు సోనూసూద్ సంబంధం ఉన్న 28 ప్రాంతాల్లో మూడో రోజు సోదాల్ని కొనసాగిస్తున్నారు. ముంబై, లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) అధికారులు తెలిపారు. మండిపడ్డ ఆమ్ ఆద్మీ, శివ్ సేన గత బుధవారం నుంచి ఐటీ అధికారులు సోనూసూద్, అతని సహచరుల ఇళ్లల్లో జరుపుతున్న దాడులపై ఆమ్ ఆద్మీ, శివసేన పార్టీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలిచిన సోనూసూద్ టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఒకప్పుడు బీజేపీ సోనూ సూద్‌ని ప్రశంసించేది. కానీ ఢిల్లీ- పంజాబ్ ప్రభుత్వాలు అతనితో సత్సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో పన్ను ఎగవేతదారుడిగా ముద్రవేస్తుందని శివసేన వ్యాఖ్యానించింది. కాగా, మహమ్మారి సమయంలో వలస కార్మికుల్ని వారి స్వగ్రామాలకు చేర్చించిన విధానం జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సోనూని ఆప్ పార్టీ తరపున దేశ్ కా మెంటర్‌గా నియమించారు. అయితే ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్..,సోనూసూద్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. సత్య మార్గంలో లక్షలాది ఇబ్బందులు ఉన్నాయి, కానీ సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది. కష్టకాలంలో ఉన్న సోనుసూద్‌కి మద్దతుగా లక్షలాది కుటుంబాల ప్రార్థనలు ఉన్నాయని ట్వీట్ చేశారు. सच्चाई के रास्ते पर लाखों मुश्किलें आती हैं, लेकिन जीत हमेशा सच्चाई की ही होती है। @SonuSood जी के साथ भारत के उन लाखों परिवारों की दुआएं हैं जिन्हें मुश्किल घड़ी में सोनू जी का साथ मिला था। https://t.co/qsAyYvzkQP — Arvind Kejriwal (@ArvindKejriwal) September 15, 2021 Total 28 premises in Mumbai, Lucknow, Kanpur, Jaipur, Delhi and Gurugram were searched over two days. #SonuSood (HT) pic.twitter.com/9NXtnBQmVx — SaraSushant 🇮🇳 (@SaraSushant2021) September 18, 2021 IT 'survey' at Sonu Sood's premises. #SonuSood pic.twitter.com/Is1v6FHb05 — Satish Acharya (@satishacharya) September 16, 2021 -
సోనూసూద్ రూ. 20 కోట్ల కు పైగా పన్ను ఎగ్గొట్టారు
-
విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్
-
పెన్సిల్ మొనపై చిత్రకళా రూపాలు
-
పెన్సిల్ మొన పై చిత్రకళా రూపాలు
-
దేశ్ కా మెంటర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్
-
‘దేశ్ కా మెంటర్’ అంబాసిడర్‌గా సోనూసూద్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఎందరికో సాయం చేసి రియల్ హీరోగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు నటుడు సోనూసూద్. కోవిడ్ వేళ ఆయన చేసిన సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. ఇప్పటికే ఆయనకు అనేక అవార్డులు, రివార్డులు దక్కాయి. ఈ క్రమంలో తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యార్థుల కోసం తీసుకురానున్న మెంటర్షిప్ కార్యక్రమానికి సోనూసూద్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. సోనూసూద్ శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయిన తర్వాత ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ‘దేశ్ కా మెంటర్స్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. అయితే ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు సోనూసూద్ వ్యవహరించనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘చాలా మంది విద్యార్థులకు భవిష్యత్తు గురించి సరైన అవగాహన ఉండదు. ఏం చేయాలి.. ఎక్కడికి వెళ్లాలి అనే అంశాల గురించి తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ‘దేశ్ కా మెంటర్స్’ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. దీనికి సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ భేటీలో రాజకీయాల గురించి చర్చించలేదు’’ అని తెలిపారు. (చదవండి: వారి పనితీరు అద్భుతం.. అందుకే పదవీకాలం పొడిగింపు) లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తనకు శిక్షకుడి (మెంటర్) రూపంలో అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని సోనూసూద్ తెలిపారు. పిల్లలుకు దిశానిర్దేశం చేయడం కన్నా మరో గొప్ప సేవలేదన్నారు. ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తాను అని సోనూసూద్ తెలిపారు. చదవండి: మేయర్ అభ్యర్థిగా సోనూసూద్.. క్లారిటీ ఇచ్చిన ‘రియల్ హీరో’! -
వావ్! వాట్ ఏ బ్యాలెన్స్..సోనూ వీడియో వైరల్
సాక్షి ముంబై: రియల్ హీరో సోనూసూద్ ఒకవైపు మహారాష్ట్ర మేయర్ పదవి రేసులో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు ఈ వార్తలను కొట్టిపారేసిన సోనూసూద్ మాత్రం తనదైన శైలిలో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా విమానాశ్రయంలో ఎస్కెలేటర్ విన్యాసాలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆటవిడుపు వీడియోను స్వయంగా ఆయనే ట్విటర్లో షేర్ చేశారు. బ్రిలియన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అంటూ వీడియోన చూసి అభిమానులు తెగ ముచ్చటపడుతున్నారు. సోనూ సూద్ పర్ఫెక్ట్ బాడీతో ఫిట్నెస్ ఎంత బాగా మెయింటైన్ చేస్తారో అందరికీ తెలిసిందే. కాగా దేశంలో కరోనా మహమ్మారి మొదటి రెండు దశల్లో పంజా విసిరిన సమయంలో అనేకమంది బాధితుల పట్ల ఆపద్బాంధవుడిలా మారి రియల్ హీరో అవతరించాడు. అంతేకాదు ఇప్పటికీ నిరాటంకంగా తన సేవా కార్యక్రమాలతో గొప్ప మనసును చాటుకొంటూనే ఉన్నారు. ముఖ్యంగా వీధి వ్యాపారులకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్నారు. అటు భారీ సినిమా అవకాశాలతో వృత్తి జీవితంలో కూడా బిజీగా మారిపోయాడు సోనూ సూద్. Only if I could fly ❣️ pic.twitter.com/zNeQFLDpRP — sonu sood (@SonuSood) August 26, 2021 -
బీఎంసీ పీఠమే లక్ష్యం.. సినీ నటులపై దృష్టిపెట్టిన కాంగ్రెస్
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ తమ అస్త్రశ్రస్తాలను సిద్ధం చేసుకుంటోంది. ఈసారి బీఎంసీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. బీఎంసీలో గత 25 ఏళ్లుగా ఆధిపత్యం చలాయిస్తున్న శివసేనను ఎలాగైనా గద్దె దింపి తమ బలం పెంచుకోవాలని చూస్తోంది. దీనికోసం సినీనటుల సేవలను వినియోగించుకోవాలని అనుకుంటోంది. అవసరమైతే రితేశ్ దేశ్‌ముఖ్, సోనూసూద్, మిలింద్ సోమణ్లలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తోంది. ఈ మేరకు ముంబై కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే సూచించినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బీఎంసీ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు కచ్చితంగా ఓట్లు పడతాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బీఎంసీ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్‌ల మధ్య పోరు రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్య పారీ్టలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, బీఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అంశంపై ఈ మిత్ర పక్షాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని శివసేన అంటుంటే, తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తేనే పార్టీ బలపడుతుందని ముంబై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పలుమార్లు సంకేతాలిచ్చారు. అంతేగాక, దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లోకి వస్తారని చర్చ జరుగుతోంది. అది ఈ ఎన్నికల్లోనే జరగవచ్చని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఈ ఊహాగానాలను ఇప్పటికే సోనూ సూద్ తోసిపుచ్చారు. చదవండి : స్పెషల్ ఒలింపిక్స్ గేమ్స్: సోనూ సూద్‌కు అరుదైన గౌరవం బీఎంసీలో అధికారం చేజిక్కించుకోవాలంటే ఉత్తర భారతీయులు, మైనారిటీ ఓట్లు ముఖ్యం కానున్నాయి. ప్రజల్లో నటీనటులపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో రితేష్ దేశ్‌ముఖ్, సోనూసూద్, మిలింద్ సోమణ్లలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే గెలుపు ఖాయమని ముంబై కాంగ్రెస్ భావిస్తోంది. బీఎంసీలో గత 25 ఏళ్లుగా శివసేనదే ఆధిపత్యం. దీంతో ఈసారి ఎలాగైనా శివసేన ఆధిపత్యానికి చెక్ పెట్టి, తమ పట్టు నిలుపుకోవాలని ముంబై కాంగ్రెస్ నేతలు పట్టుదలతో ఉన్నారు.