Sonu Sood Buys New Luxury BMW 7 Series Car - Sakshi

Sonu Sood: కాస్ట్‌లీ కారు కొన్న సోనూసూద్‌.. ఎన్ని కోట్లంటే?

Dec 8 2022 6:20 PM | Updated on Dec 8 2022 8:26 PM

Sonu Sood Buys Luxury BMW 7 Series Car, Cost Details Inside - Sakshi

లగ్జరీకి, బ్రాండ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌ కారును సొంతం చేసుకున్నాడు. తన కొత్తకారు ముందు దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడీ

కరోనా సమయంలో అందరూ ఇంట్లో ఉండి తాళం వేసుకుంటే నటుడు సోనూసూద్‌ మాత్రం ఇంటికి వెళ్లలేక చిక్కుకుపోయిన వలస కార్మికులు తమ గూడు చేరుకునేందుకు ఓ మార్గం చూపించాడు. ఆక్సిజన్‌ లేక ప్రాణాలు కోల్పోతున్న అమాయక జనాలను చూసి ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశాడు. చికిత్సకు డబ్బుల్లేని నిస్సహాయతను చూసి చేతనైనంత మందికి తోచినంత సాయం చేశాడు. ఇలా ఒకటారెండా.. ఎన్నో మంచి పనులు చేసి రీల్‌ విలన్‌ కాస్తా రియల్‌ హీరో అయ్యాడు.

ప్రస్తుతం సినిమాలు, సహాయకార్యక్రమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న అతడు ఇటీవలే ఓ కొత్త కారు కొన్నాడు. లగ్జరీకి, బ్రాండ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌ కారును సొంతం చేసుకున్నాడు. తన కొత్తకారు ముందు దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడీ నటుడు. ఈ కారు ఖరీదు దాదాపు రూ.1.73 కోట్లని తెలుస్తోంది. కాగా సోనూసూద్‌ గ్యారేజీలో పోష్‌ పనమేరా, మెర్సిడిస్‌ బెంజ్, ఆడి క్యూ 7 కార్లు ఉన్నాయి.

చదవండి: ఆ హీరోకు హ్యాట్సాఫ్‌, తనతో ఏడాదికో సినిమా అయినా చేయాలి: లక్ష్మి మంచు
లక్ష రూపాయలు పోగిట్టిందని శ్రీసత్యపై మండిపడ్డ రేవంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement