సోనూసూద్‌కు అరుదైన గౌరవాన్ని కల్పించిన 'థాయిలాండ్' ప్రభుత్వం | Thailand Government Honour To Sonu Sood | Sakshi
Sakshi News home page

సోనూసూద్‌కు అరుదైన గౌరవాన్ని కల్పించిన 'థాయిలాండ్' ప్రభుత్వం

Published Sun, Nov 10 2024 4:04 PM | Last Updated on Sun, Nov 10 2024 4:38 PM

Thailand Government Honour To Sonu Sood

బాలీవుడ్ నుంచి తెలుగులో ఎంట్రీ ఇచ్చిన స్టార్‌ నటుడు సోనూసూద్.. తెలుగు సినిమాల్లో విలన్‌ పాత్రలు వేసినప్పటికీ రియల్‌ లైఫ్‌లో హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే నెటజన్ల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్న ఆయనకు తాజాగా థాయిలాండ్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. దీంతో సోనూసూద్‌ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

థాయ్‌ల్యాండ్‌ పేరు వింటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికి గుర్తుకొచ్చేది టూరిజం. సీజన్‌ ఏదైనా కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రేదేశాల నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో భారత్‌ నుంచి కూడా చాలామంది థాయిలాండ్‌కు వెల్లడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు థాయిలాండ్  ప్రభుత్వం సోనూసూద్‌కు అరుదైన గౌరవాన్ని కల్పించింది. తమ దేశ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా  ఆయన్ను నియమించింది. ఇదే సమయంలో ఆయనను టూరిజం అడ్వైజర్‌గాను ఆ దేశం ఎంపిక చేసింది. ఇదే విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా సోనూసూద్‌ తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

2000 సంవత్సరంలో హ్యాండ్సప్‌ అనే చిన్న సినిమా ద్వారా సోనూసూద్‌ తెలుగువారికి పరిచయం అయ్యారు. అయితే, సూపర్‌,అతడు,అరుంధతి చిత్రాలతో భారీగా పాపులర్‌ అయ్యారు. ముఖ్యంగా కరోనా వల్ల ఏర్పడిన లాక్‌డౌన్ సమయంలో వేలాది మందికి తన వంతుగా సాయం చేసి అండగా నిలిచారు. తన అమ్మగారి పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి చదువుకోవాలని తపించే పేద విద్యార్థులకు సాయం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement