సోనూ సూద్‌ను సాయం కోరిన ఏపీ విద్యార్థి.. ఆయన ఏమన్నారంటే? | Andhra Pradesh Student Asks Sonu Sood To Help For Her Education | Sakshi
Sakshi News home page

Sonu Sood: సోనూ సూద్ హెల్ప్‌ అడిగిన ఏపీ విద్యార్థి.. ఆయన రిప్లై ఇదే!

Published Fri, Jul 19 2024 4:44 PM | Last Updated on Fri, Jul 19 2024 5:00 PM

Andhra Pradesh Student Asks Sonu Sood To Help For Her Education

బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.  అరుంధతి సినిమాతో టాలీవుడ్‌లో తనదైన ముద్రవేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్‌ నటించిన జులాయి మూవీతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా సినిమాల్లో విలన్‌ పాత్రల్లో మెప్పించారు. అయితే సోనూ సూద్‌ తెరపై మాత్రమే కాదు.. అభిమానుల గుండెల్లో రియల్‌ హీరోగా పేరు సంపాదించుకున్నారు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచారు.

అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఆయన.. సమాజ సేవలో ఎప్పుడు ముందుంటారు. గతంలో చాలామంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారు.  సొంతంగా సోనూ ఫౌండేషన్ స్థాపించి సేవలందిస్తున్నారు. చాలామంది పేద విద్యార్థులకు సాయం అందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయి సోనూ సూద్‌ను సోషల్ మీడియా ద్వారా సాయం కోరింది. నా చదువుకు హెల్ప్ చేయండి సార్‌ అని వేడుకుంటోన్న వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

ఇది చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు. అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో సోనూ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  కాగా.. అంతకుముందు వర్షంలో తడుస్తున్న ఫ్యాన్స్‌ను అప్యాయంగా పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement