tourisam
-
సోనూసూద్‌కు అరుదైన గౌరవాన్ని కల్పించిన 'థాయిలాండ్' ప్రభుత్వం
బాలీవుడ్ నుంచి తెలుగులో ఎంట్రీ ఇచ్చిన స్టార్ నటుడు సోనూసూద్.. తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు వేసినప్పటికీ రియల్ లైఫ్‌లో హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే నెటజన్ల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్న ఆయనకు తాజాగా థాయిలాండ్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. దీంతో సోనూసూద్ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.థాయ్‌ల్యాండ్ పేరు వింటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికి గుర్తుకొచ్చేది టూరిజం. సీజన్ ఏదైనా కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రేదేశాల నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో భారత్ నుంచి కూడా చాలామంది థాయిలాండ్‌కు వెల్లడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు థాయిలాండ్ ప్రభుత్వం సోనూసూద్‌కు అరుదైన గౌరవాన్ని కల్పించింది. తమ దేశ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన్ను నియమించింది. ఇదే సమయంలో ఆయనను టూరిజం అడ్వైజర్గాను ఆ దేశం ఎంపిక చేసింది. ఇదే విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా సోనూసూద్ తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.2000 సంవత్సరంలో హ్యాండ్సప్ అనే చిన్న సినిమా ద్వారా సోనూసూద్ తెలుగువారికి పరిచయం అయ్యారు. అయితే, సూపర్,అతడు,అరుంధతి చిత్రాలతో భారీగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా కరోనా వల్ల ఏర్పడిన లాక్డౌన్ సమయంలో వేలాది మందికి తన వంతుగా సాయం చేసి అండగా నిలిచారు. తన అమ్మగారి పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి చదువుకోవాలని తపించే పేద విద్యార్థులకు సాయం చేస్తున్నారు.Honoured and humbled at being appointed as the Brand Ambassador and Advisor for Tourism , Thailand 🇹🇭. My first international trip was to this beautiful country with my family and in my new role I am excited to advise and promote the country’s stunning landscapes & rich cultural… pic.twitter.com/0slsWp9efd— sonu sood (@SonuSood) November 10, 2024 -
మునుపటి కాలం కాదు ఇది, కానీ..
మునుపటి కాలం కాదు ఇది. సెలవులు, తీరిక దొరకగానే ఇంటి నాలుగు గోడలకు పరిమితం కావాలనుకోవడం లేదు మహిళలు. సోలో ట్రావెలర్స్‌గా అవుట్డోర్ థ్రిల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక కోణంలో చూస్తే....‘ఆహా... ఎంత మార్పు’ అనిపిస్తుంది. మరో కోణంలో చూస్తే అవుట్డోర్ అడ్వెంచర్లలో మహిళలకు సౌకర్యాలు, భద్రతాపరంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి..గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో మహిళా సాహస బృందాలు, సోలో ఉమెన్ ట్రావెలర్లు పెరిగారు. చాలామంది మహిళలు సెలవుల్లో ఇంటికి పరిమితం కావడానికి బదులు అవుట్డోర్ థ్రిల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మన దేశంలో పర్వతారోహణ, స్కీయింగ్, స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్... మొదలైన సాహస విభాగాల్లో శిక్షణను అందించే సంస్థల నుండి ప్రతి సంవత్సరం మహిళలు పెద్ద సంఖ్యలో శిక్షణ తీసుకుంటున్నారు. అయినప్పటికీ..మహిళల నేతృత్వంలోని అడ్వెంచర్ టూరిజం కంపెనీలు కొన్ని మాత్రమే ఉన్నాయి. టూరిజం ఇండస్ట్రీ ఉమెన్ ట్రావెలర్ల అవసరాలను పూర్తిగా తీర్చడం లేదు. మహిళా గైడ్లు, సహాయ సిబ్బంది కొరత గణనీయంగా ఉంది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే మహిళా గైడ్లను నియమించుకుంటున్నాయి. ‘గైడ్ అంటే పురుషులు మాత్రమే’ అనే భావనను పునర్నిర్వచించడమే కాకుండా మహిళా ప్రయాణికులకు భరోసాగా నిలుస్తున్నారు ఫిమేల్ గైడ్లు. మారుమూల ప్రాంతాలలో సౌకర్యవంతమైన వాతావరణానికి కృషి చేస్తున్నారు.మహిళా భద్రతా కోణంలో జెండర్ సెన్సివిటీ ట్రైనింగ్ అనేది కీలకంగా మారింది. ఈ శిక్షణ మేల్ గైడ్స్ ‘జెండర్ డైనిమిక్స్’ను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు లైంగిక వేధింపులను నివారించడానికి సహాయపడుతుంది. భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఉమెన్ ట్రావెలర్స్‌కు అవసరమయ్యే ఎక్విప్మెంట్ను రూపొందించాల్సిన బాధ్యత టూరిజం కంపెనీలపై ఉంది. శానిటరీ ప్రొడక్ట్స్, మెన్స్ట్రువల్ క్రాంప్స్ కోసం పెయిన్ రిలీఫ్ మందులు, ఆరోగ్యం, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్ మెడికల్ కిట్లు అందుబాటులోకి తేవాలి. ‘సోలో ట్రావెలర్, అవుట్ డోర్ ప్రొఫెషనల్‌గా ఎన్నోసార్లు అసౌకర్యానికి గురయ్యాను. మహిళల సాహస ప్రయాణాలలో మౌలిక సదుపాయాల తక్షణ అవసరం ఉంది’ అంటుంది మౌంటెనీర్, ఎంటర్ప్రెన్యూర్ అనూష సుబ్రమణ్యియన్.ఇలా అంటున్నారు.. ఇటీవల ఒక సంస్థ సోలో ఉమెన్ ట్రావెలర్స్ గురించి నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది భద్రత గురించి ఆందోళన చెందారు. మరో 29 శాతం మంది శారీరక సౌకర్యం (ఫిజికల్ కంఫర్ట్), 23 శాతం మంది వెహికిల్ బ్రేక్‌డౌన్స్, 13 శాతం మంది లైంగిక వేధింపుల గురించి ఆందోళన చెందారు. ఎవరి అభిప్రాయం మాట ఎలా ఉన్నా అడ్వెంచర్ టూరిజం ఇండస్ట్రీ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది అందరి నోటి నుంచి వినిపించిన మాట.ఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
థాయ్‌లాండ్ వీసా నిబంధనల్లో మార్పులు
పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం సందర్శకుల వీసా వ్యవధిని పొడిగించింది. పర్యాటకులు, విద్యార్థులు, రిమోట్ వర్కర్లకు సంబంధించి వీసా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది.ఈ సందర్భంగా థాయ్‌లాండ్ ప్రభుత్వ ప్రతినిధి చాయ్ వాచరోంకే మాట్లాడుతూ..‘పర్యాటక రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా టూరిస్ట్ వీసా గడువు పెంచాం. దాంతోపాటు ఇతర దేశాలనుంచి వచ్చే విద్యార్థులు, రిమోట్ వర్కర్లు, పదవీవిరమణ పొందిన వారికి సంబంధించి వీసాలో మార్పులు చేశాం. జూన్ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలవుతాయి. గతంలో థాయ్‌లాంట్ వచ్చే పర్యాటక దేశాల సంఖ్యను 57 నుంచి 93కు పెంచాం. ఈ అవకాశాన్ని ఆయా దేశాల పర్యాటకులు వినియోగించుకోవాలి. ఆన్-అరైవల్ వీసా పరిమితిని 30 రోజుల నుంచి 60 రోజులకు పొడిగించాం. దేశంలో ఉండాలనుకునే పదవీ విరమణ పొందిన వారికి బీమా అవసరాలను సడలించాం. గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఒక సంవత్సరం అదనంగా ఉండవచ్చు. రిమోట్ వర్కర్ల కోసం ప్రత్యేకవీసాలు ఐదేళ్లపాటు చెల్లుబాటు అవుతాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదుఈ సంవత్సరం జనవరి నుంచి మే 26 వరకు 14.3 మిలియన్ల మంది పర్యాటకులు థాయ్‌లాండ్‌ను సందర్శించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024 పూర్తి ఏడాదికిగాను రికార్డు స్థాయిలో 40 మిలియన్ల విదేశీ రాకపోకలను లక్ష్యంగా చేసుకుంది. దాంతో 3.5 ట్రిలియన్ భాట్లు (రూ.7.9లక్షల కోట్లు) దేశఖజానాకు చేరుతుందని అంచనా. 2019లో కరోనాకు ముందు రికార్డు స్థాయిలో థాయ్‌లాండ్‌కు 39.9 మిలియన్ల మంది రాకపోకలు సాగించారు. -
రూ.45 వేలకోట్లతో రివర్‌క్రూజ్ టూరిజం.. ఏం చేస్తారో తెలుసా..
కొవిడ్ వల్ల కుదేలైన భారత పర్యాటకం తిరిగి పుంజుకొంటోంది. ప్రపంచ గమనానికి అనుగుణంగా పర్యాటక రంగంలో మార్పులు వస్తున్నాయి. అందుకు అనువుగా కొత్త వ్యాపార నమూనాలను చేపడుతున్నారు. సామాన్య ప్రజలు పర్యాటకం నుంచి గరిష్ఠ లబ్ధి పొందగలిగేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకొని పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) గతంలోనే పిలుపిచ్చింది. సుందర ప్రదేశాలు, పుణ్య స్థలాలకు భారత్‌లో కొదవలేదు. ఆధునిక కాలంలో మెడికల్ టూరిజం, సాహస పర్యాటకం, సముద్ర విహారం, పర్యావరణ పర్యాటకం ఊపందుకొంటున్నాయి. దాంతోపాటు తాజాగా రివర్ టూరిజంను అభివృద్ధి చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. రివర్ క్రూజ్ టూరిజంను అభివృద్ధి చేయడానికి రూ.45 వేల కోట్లు కేటాయించనున్నట్లు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోల్‌కతాలో జరిగిన ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఐడబ్ల్యూడీసీ) సమావేశంలో ఈ మేరకు ప్రకటన విడుదుల చేశారు. రూ.45 వేలకోట్లలో 2047 నాటికి క్రూజ్ వెసెల్స్ కోసం రూ.35వేల కోట్లు, క్రూజ్ టెర్మినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి మరో రూ.10వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇదీ చదవండి: హౌతీ అటాక్స్.. ఆఫ్రికా చుట్టూ తిరుగుతున్న నౌకలు! షిప్పింగ్ ఓడరేవుల మంత్రి సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పరిశ్రమల ప్రముఖులను కలిసి అంతర్గత జలమార్గాల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రివర్ క్రూజ్ టూరిజంను ఎనిమిది నుంచి 26 జలమార్గాలకు విస్తరించనున్నారు. రాత్రి బసలతో కూడిన క్రూజ్ సర్క్యూట్లను 17 నుంచి 80కి పెంచనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
సముద్రగర్భంలో ద్వారక దర్శనం
-
ఈ 'వెడ్డూరం' చూశారా? పెళ్లిని సొమ్ము చేసుకునే ట్రెండ్! ఏకంగా..
కొంతమంది ఎంతోఘనంగా జరుపుకునే తమ పెళ్లి వేడుకల వీడియోలను అమ్ముకుంటూ డబ్బులు సంపాదించడం ఇప్పటి ట్రెండ్‌గా మారింది. ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు తమ పెళ్లి వీడియోలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరిలానే సెలబ్రెటీ హోదాలేని వారు సైతం విదేశీయులకు పెళ్లి టికెట్లు అమ్మి వెడ్డింగ్ పర్యాటకానికి తలుపులు తెరుస్తున్నారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే చాలా మంది విదేశీయులు ఇక్కడి సంస్కృతిని తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. విదేశాలతో పోలిస్తే ఇండియాలో ఎంతో శాస్త్రోక్తంగా పెళ్లిళ్లు జరుగుతాయి. ఈ పెళ్లిళ్లను చూసేందుకు విదేశీయులు చాలా ఉత్సాహం చూపుతారు. పెళ్లి సంప్రదాయాలు, రకరకాల రుచికరమైన వంటకాలను టేస్ట్ చేసేందుకు తహ తహలాడుతుంటారు. అందుకే ఏ మాత్రం అవకాశం చిక్కినా వెంటనే వచ్చి ఇండియాలో వాలిపోతుంటారు. ఇందుకు ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. ఈ అభిరుచినే మన భారతీయ జంటలు, వెడ్డింగ్ ప్లానర్స్ సొమ్ము చేసుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా వెబ్సైట్లూ నడుపుతున్నారు. వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను టికెట్‌గా చూపిస్తూ నిశ్చితార్థం నుంచి, మెహందీ, సంగీత్, హల్దీ ఇలా ఒక్కో వేడుకకి ఒక్కో రేటుని చెబుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు. జాయిన్ మై వెడ్డింగ్... పెళ్లి చేసుకునే జంట సొంతంగా జాయిన్ మై వెడ్డింగ్ పేరుతో అకౌంట్‌ను క్రియేట్ చేస్తారు. ఈ వెబ్సైట్లో పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరి ఫోటోలు, పెళ్లి తేదీ, ఎన్నిరోజులు వేడుకలు జరుగుతాయి.. ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు... వంటి వివరాలను అప్లోడ్ చేస్తారు. పెళ్లిలో పెట్టే భోజనం వెజ్, నాన్‌వెజ్, మందు, చిందు ఉంటే అదీ చెబుతారు. ఇవేగాక డ్రెస్ కోడ్, అక్కడ మాట్లాడే భాష, వేడుక జరిగే ప్రదేశం అడ్రెస్‌తోపాటు ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఇస్తారు. విదేశీ పర్యటనలో ఉన్న వారికి ఈ పెళ్లి తేదీలు జత కుదిరితే టికెట్స్ బుక్ చేసుకుని వచ్చేసి మరీ పెళ్లి బ్యాండ్ బాజా, బారాత్‌లను ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కరోజుకి పన్నెండు వేలపైనే... ఎంతో ఆడంబరంగా జరిగే మన వివాహ వేడుకలను చూడడానికి పర్యాటకులు రోజు కోసం 150 డాలర్ల టికెట్‌ను సంతోషంగా కొనేస్తున్నారు. మన రూపాయలలో పన్నెండు వేలకు పైనే. ఇక పెళ్లి పూర్తి తతంగం మొత్తం అంటే రెండు రోజులు చూడాలంటే 250 డాలర్లు చెల్లించాలి (రూ.20 వేలకుపైన). ఒకటీ, రెండూ కాదు ఐదు రోజుల పెళ్లి చూడాలంటే ప్రత్యేక వెడ్డింగ్ ప్యాకేజీ టికెట్ కొనాల్సిందే. ఇలా పదిమంది విదేశీ అతిథులు పెళ్లికి వచ్చారంటే పెళ్లిలో కొన్ని ఖర్చులకు సరిపడా డబ్బు సమకూడినట్లే! అందుకే ఎక్కువ మంది వెడ్డింగ్ టూరిజంపైన ఆసక్తి కనబరుస్తున్నారు. తొలిసారి... హంగేరియన్– ఆస్ట్రేలియన్ సంతతికి చెందిన ఒర్సి పర్కాణి తొలిసారి 2016లో ‘జాయిన్ మై వెడ్డింగ్’ పేరిట వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసింది. అప్పుడు ఇది ఒక చిన్న స్టార్టప్. కానీ ఇప్పుడు ఇది ట్రెండ్‌గా మారింది. ఈ ఏడాది ఆగస్టు 19న పర్యాటక మంత్రిత్వ శాఖ వెడ్డింగ్ టూరిజంను ప్రారంభించింది. వెడ్డింగ్ టూరిజం ద్వారా భారతీయులేగాక, విదేశీయులు సైతం ఇక్కడికి వచ్చి ఇక్కడి సంప్రదాయాలకు తగ్గట్టుగా పెళ్లి వేడుకలు జరుపుకోవచ్చని చెబుతూ వెడ్డింగ్ టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది. బీచ్ వెడ్డింగ్, నేచర్ వెడ్డింగ్, రాయల్ వెడ్డింగ్, హిమాలయన్ వెడ్డింగ్ థీమ్‌ల పేరిట ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ట్రెండ్‌కు మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం బూస్టర్‌గా పనిచేసి ఇండియాలో వెడ్డింగ్ వ్యాపారం వృద్ధిలోకి రాబోతుంది. ఇంకెందుకాలస్యం... మీ ఇంట్లో జరిగే పెళ్లివేడుకలకు వెడ్డింగ్ టూరిజంను జోడించి మరింత కలర్పుల్గా జరుపుకోండి. సెర్మనీ గైడ్... విదేశీయులను పెళ్లికి పిలవడమేగాక, వారికి అతిథి మర్యాదల్లో లోటు లేకుండా చూసుకోవడం ఈ వెడ్డింగ్ టూరిజం ప్రత్యేకత. వేడుక లో జరిగే ప్రతి విషయం, పర్యాటకులకు వచ్చే సందేహాలు నివృత్తి చేసేందుకు సెర్మనీ గైడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.‘‘ప్రస్తుతం రాజస్థాన్, ఢిల్లీ, ముంబైలలో ఈ వెడ్డింగ్ టూరిజం పెరుగుతోంది. రాజస్థాన్‌లోని చిన్నటౌన్లలో జరిగే వేడుకలకు విదేశీయులు ఆసక్తి చూపుతున్నారు. జో«ద్‌పూర్, జైపూర్, జైసల్మేర్, ఉదయ్పూర్లలో జరిగే రాయల్ ఇండియన్ వెడ్డింగ్స్‌కు డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది’’ అని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు. (చదవండి: ఉద్దానంలోని మరణాలకు గల కారణాన్ని కనిపెట్టిన పరిశోధకులు! చాలా మరణాలు..) -
టూర్స్ కోసం ఇండియన్స్ చేసే ఖర్చు ఇంతా..!
గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు విపరీతంగా పెరిగాయి. కొవిడ్‌కారణంగా కుంటుపడిన టూరిజం నుంచి వచ్చే రాబడులు ఊపందుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న భయాలు తొలగి భారత్ నుంచి విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఈమధ్య భారతీయుల్లో టూర్స్ పట్ల ఉత్సాహం పెరుగుతోంది. ముఖ్యంగా నేటి యువతరం నాలుగు గోడల మధ్య బతకడానికి ఇష్టపడటం లేదు. ఖాళీ దొరికినప్పుడల్లా ట్రెక్కింగ్, విహారయాత్రలు, విదేశాలకు టూర్స్ ప్రణాళికలు వేస్తూ బిజీగా గడుపుతున్నారు. దాంతో దేశీయ పర్యాటక పరిశ్రమ వేగంగా దూసుకుపోతోంది. కొవిడ్ ముందు కంటే కూడా టూరిజం రంగంలో వస్తున్న ఆదాయం పెరుగుతుంది. కొవిడ్ మునుపుకంటే ప్రస్తుతం 173శాతం అధికంగా టూరిజం కోసం ఖర్చు చేస్తున్నారు. 2030 నాటికి భారత ట్రావెలర్స్ దాదాపు 410 బిలియన్ డాలర్లు(సుమారు రూ.32లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారని అంచనా. దాంతో ప్రపంచంలో పర్యాటకం కోసం అధికంగా వెచ్చించే నాలుగో దేశంగా ఇండియా నిలవనుందని గణాంకాలు చెబుతున్నాయి. 150 బిలియన్ డాలర్లు వెచ్చిస్తూ ఇండియా ప్రస్తుతం ప్రపంచంలో ఆరో స్థానంలో కొనసాగుతోందని హౌ ఇండియా ట్రావెల్స్ పేరిట బుకింగ్స్ డాట్ కామ్, మెకిన్సే & కంపెనీ సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్లు సగటున 63 రోజులు, జపాన్ ప్రజలు 57 రోజులతో పోలిస్తే భారతీయులు టూర్స్ కోసం 29 రోజులు వెచ్చిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. భారతీయ పర్యాటకుల్లో 80 శాతం మంది బస చేసేందుకు రెస్టారెంట్లు, రూమ్ సర్వీస్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదిక పేర్కొంది. సంప్రదాయ మనాలీ, సిమ్లా వంటి ప్రాంతాలతో పాటు వారణాసి, గురుగ్రాం, కోయంబత్తూరు తరహా నగరాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్లు వెల్లడించింది. గతేడాదికిగాను యూట్యూబ్ వీడియోలు చూసి తాము ట్రావెలింగ్ చేస్తున్నట్లు 91 శాతం మంది పర్యాటకులు చెప్పినట్లు బుకింగ్స్ డాట్ కామ్ నివేదిక పేర్కొంది. 85 శాతం మందిని ఇన్స్టాగ్రామ్ ప్రభావితం చేసినట్లు వెల్లడయింది. స్పోర్ట్స్, సమావేశాలు, మ్యూజికల్స్ వంటి ఇతర ఈవెంట్స్ పర్యాటకాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నట్లు సమాచారం. -
దేశీయ పర్యాటకుల ఆకర్షణలో మూడో స్థానంలో ఏపీ
-
అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే..
అమర్నాథ్ యాత్ర జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రకు బయలుదేరే భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రయాణానికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాంజ్ అసోసియేషన్ అమర్నాథ్ యాత్రికులకు ఒక శుభవార్త తెలిపింది. అమర్నాథ్ యాత్రికులకు ప్రయాణ సమయాన ఇబ్బందులను దూరం చేస్తే వార్త ఇది. ఇది వారికి ఎంతో ఆనందాన్ని కలిగించనుంది. అమర్నాథ్ యాత్ర చేసేవారు ముందుగా హోటల్ బుక్ చేసుకుంటే వారికి భారీ రాయితీ లభించనుంది. ఈ విషయాన్ని ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాంజ్ అసోసియేషన్(ఏజేహెచ్ఎల్ఏ) ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్ములో బసచేసే అమర్నాథ్ యాత్రికులు ఇక్కడి హోటల్స్‌ను ముందుగానే బుక్ చేసుకుంటే 30 శాతం రాయితీ అందించనున్నట్లు ఏజేహెచ్ఎల్ఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పవన్‌గుప్తా మాట్లాడుతూ తాము సదుద్దేశంతో అమర్నాథ్ యాత్రికులలో ఇక్కడి హోటల్స్‌లో బసచేసేవారికి 30 శాతం రాయితీ అందజేస్తున్నట్లు తెలిపారు. తద్వారా అమర్నాథ్ యాత్రికులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందన్నారు. జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రంగా భావించే అమర్నాథ్ గుహ దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల నడుమ, సమద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ 62 రోజుల తీర్థయాత్ర రెండు మార్గాల గుండా సాగుతుంది. వాటిలో ఒకటి అనంత్‌నాగ్ జిల్లాలో 48 కిలోమీటర్ల పొడవున సాగుతుంది. మరొకటి బందర్బల్ జిల్లాలో 14 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుంది. ఈ యాత్రలో పాల్గొనేవారు జూన్ 30 నాటికి జమ్మునకు చేరుకోవాల్సి ఉంటుంది. కాగా ఈసారి అమర్నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తుల వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. చదవండి: ‘ఆది పురుష్’పై విమర్శల బాణం ఎక్కుపెట్టిన అఖిల భారత హిందూ మహాసభ! -
సోమశిల బ్యాక్ వాటర్‌లో ఎన్ని అందాలో.. డోంట్ మిస్.. ఎప్పటికీ గుర్తుంచుకుంటారు
ఆహ్లాదకర తీరం..పాపికొండలను తలపించే విధంగా వాతవరణం..కనుచూపు మేర జలసోయగం..రెండుకొండల నడుమ ఒయ్యారాలు ఒలికించే పెన్నా నది.. నీటిలో ఎగిరే చేపలు.. దేశ విదేశాల నుంచి వచ్చే విహంగాలు అరుదైన పక్షిజాతుల ఇక్కడి సందడి చేస్తుంటాయి. అదే సోమిశిల వెనుకజలాలు. ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. జంపేట : వైఎస్సార్, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ పెనుశిల అభయారణ్యం ఏర్పాటుచేయాలని పాతికేళ్ల కిందట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1997 డిసెంబరు 15 జీవో నంబరు 106ను జారీ చేశారు. కడప డివిజన్ పరిధిలోని ఒంటిమిట్ట, సిద్ధవటం రేంజ్ పరిధిలో 43,491,608 హెక్టార్లు , నెల్లూరు జిల్లాలోని 40,443,265 హెక్టార్లను అభయారణ్యంలోకి చేర్చారు. ఇక్కడ ఎన్నో రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. అరుదైన వన్యప్రాణులు, జలచరాలకు అవాసంగా మారింది. కోటపాడు నుంచి.. ఒంటిమిట్ట(రాజంపేటనియోజకవర్గం)మండలంలోని కోటపాడు శివారులో సోమశిల వెనుకజలాల్లో ఎకో టూరిజం ఏర్పాటు చేయాలని 2010లో నిర్ణయం తీసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబరు 26న ఈ దిశగా అడుగులు పడ్డాయి. తర్వాత రాష్ట్ర విభజన, టీడీపీపాలనలో ఎకో టూరిజం పడకేసింది.ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఎకోటూరిజంతో పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని స్ధానిక శాసనసభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి దృష్టి సారించారు. సోమశిల జలాశయం నిల్వసామర్ధ్యం 77.988 టీఎంసీలు. ప్రస్తుతం 52.3 టీఎంసీలు నిల్వ ఉంది. కోటపాడు, కుడమలూరు, బెస్తపల్లె, ఉప్పరపల్లె, మాధవరం, బోయనపల్లె, చిన్నపురెడ్డిపల్లె, కురుగుంటపల్లె, పొన్నాపల్లి, కొండమాచుపల్లె, మదిలేగడ్డ, గుండ్లమాడ, దొంగలసాని, నెమళ్లగొంది, నర్సనాయనిపేట, వాకమాడ, ఒగూరు, వట్రపురాయి, కొత్తూరు తదితర గ్రామాలు సోమశిల అంతర్భాగంలో ఉండిపోయాయి. బోటు షికారు ఎప్పుడో.. ఒంటిమిట్ట, నందలూరు, మండలాల్లోని బ్యాక్‌వాటర్‌లో బోటుషికారుకు అనుకూలంగా ఉంటుందని పర్యాటకులు భావిస్తున్నారు. ఒంటిమిట్ట రామాలయం ఇప్పుడు రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు, యాత్రికులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. అటువంటప్పుడు సోమశిల బ్యాక్‌వాటర్‌లో షికారు చేయడానికి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. నిధులు కేటాయింపులిలా.. 2020 ఆగస్టు 30న వనవిహారి కోసం రూ.50లక్షలు అనుమతిచ్చారు. 2021 జూలైలో రూ.120 లక్షలతో చేపట్టాలని పరిపాలన ఆమోదం ఇచ్చారు. కోటపాడు శ్రీరామఎత్తిపోతల పంపుహౌస్ సమీపంలో అనువైన స్ధలాన్ని ఎంపిక చేశారు. తొలి విడతలో ఆరుపనులను అటవీశాఖ ఉన్నతాధికారులు రూ.42,84,795లతో చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు. ఆన్లైన్లో ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లను ఆహ్వానించారు. గిట్టుబాటుకాదని పనులు చేయడానికి ఎవరు ముందుకురాకపోవడం గమనార్హం. మళ్లీ టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. నాటుపడవలో ఎమ్మెల్యే పరిశీలన.. కొడమలూరులో జరిగిన జాతర సందర్భంగా అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే సోమశిల వెనుకజాలలను పరిశీలించారు. అక్కడ ఆయనకు అందుబాటులో నాటుపడవ కనిపించింది. ప్రమాదకరమని తెలిసినా ధైర్యంగా బ్యాక్‌వాటర్‌లో పర్యటించారు. ఒంటిమిట్ట రేంజ్‌కి ఇచ్చిన బోటు పనిచేయక మూలనచేరింది. అయిదేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోని సంగతి తెలిసిందే. ఎకో టూరిజం అభివృద్ధికి కృషి సోమశిల బ్యాక్‌వాటర్‌లో బోటుషికారు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం సెంటర్ అభివృద్ధి చేసుకోవాలి. గతంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హయాంలో ఎకో టూరిజం ఏర్పాటుచేశారు.దీనిని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒంటిమిట్ట, నందలూరులో కూడా సోమశిల బ్యాక్‌వాటర్ ఉంది. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తాం – మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట -
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్
-
కూర్గ్ అందాలు.. అక్కడ తప్పక చూడాల్సిన ప్రాంతాలివే
వేసవి కాలం వచ్చేసంది. ఈ ఎండలో చల్ల చల్లగా ఉపశమనం కోసం పర్యటక ప్రియులంతా సమ్మర్ వెకేషన్ కోసం ప్లాన్ చేస్తుంటారు. సమ్మర్ వెకేషన్ అనగానే అందరి టక్కున గుర్తొచ్చేది నార్త్ టూర్. కునుమానాలి, సిమ్లా ఇలా నార్త్‌లోని పలు పర్యాటక ప్రాంతాలు గుర్తొస్తాయి. కానీ మన సౌత్‌లో కూడా వేసవి విడిదికి ఉత్తమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందులో కూర్గ్ ఒకటి. సౌత్ టూర్ అనగానే అందరికి అరకులోయ, ఊటీ, కన్యాకుమారి ఇలా గుర్తొస్తాయి. కానీ దక్షిణ కర్ణాటకలోని ఈ కూర్గ్ ప్రాంతం చాలా తక్కువ మందికి తెలుసు. భారతదేశంలోనే అత్యంత ఆకట్టుకునే హిల్ స్టేషన్ ఇక్కడి ప్రత్యేకం. దీనిని ఇండియన్ స్కాట్లాండ్ అని కూడా పిలుస్తారు. అత్యంతక సుందరమైన, ఆకర్షనీయమైన పర్వతపాంతం ఇది. ఇక్కడి పచ్చని వాతావరణం, కాఫీ తోటలు ప్రత్యేకంగా ఆకర్షించే ప్రదేశాలు. ఇవి మాత్రమే ఇక్కడ ఇంకా కూర్గ్‌లో చూడాల్సిన అందమైన ప్రాంతాలేన్నో ఉన్నాయి. అక్కడ ముఖ్యంగా చూడాల్సిన ప్రాంతాలేవో ఓ సారి చూద్దాం. అబ్బే జలపాతం కూర్గ్ ముఖ్యంగా చూడాల్సిన పర్యాటక ప్రాంతం ఇది. కాఫీ తోటల మధ్య ఉండే ఈ జలపాతం చూడగానే అత్యంత అనుభూతిని ఇస్తుంది. స్వర్గాన్ని తలపించే ఈ అందమైన జలపాతాలను సందర్శించడానికి పర్యాటక ప్రియులు క్యూ కడుతుంటారు . కూర్గ్‌లో అబ్బే లేదా అబ్బి అంటే జలపాతం అని అర్ధం. ఈ జలపాతం ప్రాంతానికి దగ్గరలో ఉండడంతో తరచూ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. నాగర్హొళె జాతీయ పార్క్ ఈ ఉద్యానవనంలో అనేక జాతి రకాలకు చెందిన వృక్షాలు, జంతువులు దర్శనం ఇస్తుంటాయి. ఆ కారణంగా నాగర్హొళె జాతీయ ఉద్యానవనం దేశంలోని అత్యుత్తమ వైల్డ్ లైఫ్ రిజర్వులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన మనకు అనేక జాతుల వృక్షాలతో పాటు 270 జాతుల పక్షులు దర్శనమిస్తాయి. కూర్గ్ వెళ్ళినప్పుడు తప్పక సందర్శించవలసిన ప్రాంతాలలో ఇది ఒకటి. హనీ వాలి హనీ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన నీలకండి జలపాతం ఇది. దట్టమైన ఉష్ణమండల అడవుల మధ్య ఉన్న ఒక అందమైన జలపాతం. ఇది మంచి రిఫ్రెషింగ్ స్పాట్. ఇక్కడ ముఖ్యంగా ట్రెక్కింగ్, అత్యుత్తమ సాహస క్రీడలు ప్రసిద్ధి. హొన్నమన కెరె లెక్ కూర్గ్ సహజ అందాలలో ఒకటి. పచ్చని కొండలు, కాఫీ తోటల, గుహల మధ్య అద్భుతంగా కనిపిస్తుంది. సరస్సు సమీపంలోని ఆలయంలో జరుపుకునే గౌరీ పండుగ సమయంలో సరస్సును ప్రత్యేకంగా సందర్శిస్తారు. సోమవారపేట్ సోమవారపేట్ కాఫీ తొటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన పంటలు కాఫీ, అల్లం, యాలకులు, మిరియాలు. ఇక్కడి పచ్చని తోటలు పర్యాటక ప్రియులకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇది తప్పక సందర్శించవలసిన ప్రాంతం. నామ్‌డ్రోలింగ్ ఆరామం ఇక్కడ చూడాల్సిన మరో ప్రదేశం నామ్‌డ్రోలింగ్ ఆరామం గోల్డెన్ టెంపుల్ ఒకటి. ఈ ప్రసిద్ధి గాంచిన మఠం గోడలు బంగారు వర్ణంతో నిండిన చిత్రాలతో అలంకరించబడి ఆకర్షణీయంగా ఉంటుంది. విభిన్న శైలిలో కట్టడంగా ప్రసిద్ధి గాంచిన నామ్‌డ్రోలింగ్ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది. ఓంకారేశ్వర ఆలయం ఈ ఆలయాన్ని 1820లో లింగ రాజేంద్ర అనే రాజు నిర్మించారు. ఈ ఆలయం గురించి అనేక కథనాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని శివ భగవానుడికి అంకితం చేస్తూ లింగ రాజేంద్ర నిర్మించారని కథనం. ఈ ఆలయంలో ఒక చిన్న నీటి కొలను ఉంది. ఇందులోని చేపలు ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. మడికెరి కోట బురద ఉపయోగించి ముద్దు రాజుచే నిర్మించబడిన ఈ కోట 17వ శతాబ్దానికి చెందినది. 1812-1814ల మధ్య కాలంలో ఇటుక, మోర్టార్లలో దీన్ని తిరిగి నిర్మించారని చెబుతారు. ఈ కోట ప్రవేశద్వారం చుట్టుపక్కల ఉన్న ఏనుగులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. -
ఇది మోదీ ఆలోచన కాదు! ఫ్రెంచ్ నటి కీలక వ్యాఖ్యలు
ఫ్రెంచ్ నటి ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు 75 ఏళ్ల మరియన్ బోర్గ్ ఆస్తి వివాదం కారణంగా గోవాలోని తన ఇంట్లోనే తాను బంధీగా ఉన్నాని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రెండ్లీ టూరిజం కోసం పర్యాటకాన్ని ఎంతగానో అభివృద్ధి చేసనప్పటికీ తాను చాలా నిరాశ చెందానని చెప్పుకొచ్చారు. గోవాలోని బీచ్ టౌన్లో కలాంగుట్లో ఉన్న తన బంగ్లాను వదలి వెళ్లిపోయినట్లు చెప్పారు. తన ఆస్తిని లాక్కుకుని కొందరూ వ్యక్తులు.. ఆ ఇంటికి విద్యుత్, నీళ్లు రాకుండా చేసి వేధించారని చెప్పారు. తాను స్నానం చేయకుండా ఉండలేని కారణంగా ఆ ఇంటిన ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. అదీగాక ప్రస్తుత పరిస్థితులు కారణంగా తన ఆరోగ్యం క్షీణిస్తోందని బోర్గో అన్నారు. మోదీ సానుకూల స్నేహపూర్వక పర్యాటక ఇమేజ్ కోసం చాలా శ్రమిస్తున్నారు. బహుశా ఇది మోదీ ఆలోచన కాకపోవచ్చు కానీ ఇటీవల జరిగిన సంఘటనలు నన్ను ఎంతగానో నిరాశపరిచాయి. ఆయన సాధించిన విజయాలు గోవా రాష్ట్ర స్థాయికి చేరుకోక పోవడం బాధకరం అన్నారు. వాస్తవానికి ఫ్రెంచ్ నటి బోర్గో ఫ్రాన్సిస్కో సౌసా అనే న్యాయవాది నుంచి 2008లో ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఐతే కోవిడ్ మహమ్మారి సమయంలో అతడు మరణించడం పరిస్థితులన్ని ఒక్కసారిగా తలకిందులు అయిపోయాయని ఆవేదనగా చెప్పుకొచ్చారు. గోవా స్థానిక పోలీసుల ఈ కేసు కోర్టులో నడుస్తున్నందున తాము జోక్యం చేసుకోలేమని చెబుతున్నారు. నేషనల్ డి'ఆర్టే డ్రామాటిక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్)లో శిక్షణ పొందిన బోర్గో యూరప్, భారతదేశ అంతటా చలనచిత్రాలు, టెలివిజన్, థియేటర్లలో విస్తృతంగా పనిచేశారు. ఆమె ఫ్రెంచ్ థ్రిల్లర్ సిరీస్ “ప్రొఫైలేజ్”లో ప్రముఖ పాత్రను పోషించారు. అలాగే ఇటీవల భారతీయ నిర్మాణంలో “డానీ గోస్ ఓమ్”కి కూడా దర్శకత్వం వహించింది బోర్గ్. (చదవండి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం..ఏకంగా 18 వందల మంది అరెస్టు!) -
Bapatla District: పారిశ్రామికాభివృద్ధికి అడుగులు
సాక్షి, బాపట్ల: జిల్లాలో తీర ప్రాంతం విస్తరించి ఉండడంతో అటు పర్యాటకం, ఇటు పారిశ్రామికంగా అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సరికొత్త అవకాశాలు కల్పిస్తూ, ప్రోత్సహిస్తుంది. నూతనంగా ఏర్పడ్డ బాపట్ల జిల్లాలో 74 కిలోమీటర్ల తీర ప్రాంతం విస్తరించి ఉంది. సూర్యలంక, పాండురంగాపురం, రామచంద్రాపురం, ఓడరేవు, కృపానగర్, అడవిపల్లెపాలెం బీచ్‌లు పర్యాటకానికి అనువుగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు వచ్చి సంతోషంగా గడిపి వెళ్తున్నారు. తీరంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తుండడంతో స్టార్ హోటళ్లను తలదన్నేలా రిసార్ట్స్ వెలుస్తున్నాయి. అతిథ్య రంగం కూడా పుంజుకుంటుంది. తీర ప్రాంతం వెంబడి రొయ్యలు, చేపల సాగు విస్తృతంగా చేస్తుండడంతో ఆక్వా పరంగా రొయ్యల హేచరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు ఐదు ప్రాసెసింగ్ యూనిట్లతోపాటు మరో 18 హేచరీలు ఉన్నాయి. ఆయా యూనిట్లలో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్, చీరాల పరిధిలోని ఓడరేవు హార్బర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో పనులు చేస్తున్న ఆ ప్రాజెక్టులు పూర్తయితే అనుబంధంగా మరెన్నో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ► తాజాగా కేరళకు చెందిన టెడ్ఎక్స్ ఛాయిస్ గ్రూప్ విద్యారంగంలో ఎన్నో విజయాలు సాధించిన ఆ సంస్థ జిల్లాలోని తీర ప్రాంతంలో ఆక్వా రంగంలోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. తీరం వెంబడి ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దాదాపు రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఆ ప్రాజెక్టు డీపీఆర్ కూడా పూర్తిచేసి అనుమతులు కోసం పంపారు. త్వరలోనే ఆ ప్రాజెక్టు రూపకల్పన జరగనుంది. ► క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. 80 శాతం కేంద్రం, 15 శాతం రాష్ట్రం, 5 శాతం లబ్ధిదారులు వాటాగా ఇస్తూ పరిశ్రమల స్థాపనకు అవకాశాలు కల్పిస్తోంది. దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధానం అమలులో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంండడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. బాపట్లలో భావపురి రైస్ క్లస్టర్ పౌండేషన్ ద్వారా రూ.10 కోట్ల వ్యయంతో ధాన్యం ఆరబెట్టే మిషనరీతోపాటు ఫోర్టిఫైడ్ బియ్యం తయారీ మిషనరీ ఏర్పాటు చేశారు. ► ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా కూడా జిల్లాకు 104 ప్రాజెక్టులకుగాను రూ.30.60 కోట్లు మంజూరయ్యాయి. ఆ పథకానికి ఇప్పటికే 80 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 32 మందికి రూ.94.50 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో 15 గ్రౌండింగ్ అయ్యాయి ► చీరాల పరిధిలోనే ఈపూరుపాలెం వద్ద ఏపీఐఐసీ ద్వారా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 44.57 ఎకరాల్లో లే–అవుట్ వేసి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. స్మాల్ ఇండస్ట్రీయల్తో ఎంతో మందికి ఉపాధి లభించనున్నది. ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహమిస్తుంది. ఇప్పటికే జిల్లాలో పారిశ్రామికంగా అడుగులు పడుతున్నాయి. తీరంలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన పథకాలు పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడనున్నాయి. – ఎన్ మదన్మెహన్, పరిశ్రమల శాఖ జీఎం, బాపట్ల -
పర్యాటకుల స్వర్గధామం.. ‘కాస్ పీఠభూమి’
పింప్రి: వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక మంది ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. మహారాష్ట్రలోనూ వర్షాకాలంలో అందమైన ప్రకృతి రమణీయమైన జలపాతాలు, పచ్చని కొండలు, లోయలు ఇలా అనేకం ఉన్నాయి. అయితే వీటిలో సాతారా జిల్లాలోని ఓ అందమైన ప్రాంతం.. జిల్లాకు 22 కి.మీ. దూరంలో ఉన్న ‘కాస్ పీఠభూమి’. ఒక అసాధారణమైన బయోస్పియర్, స్థానికులతోపాటు పర్యాటకులను ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ కేవలం ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో దాదాపు 300 రకాలకుపైగా వివిధ రకాలకు చెందిన రంగురంగుల పూలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కేవలం ఈ రెండు నెలల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు తండోపతండాలుగా దేశ, విదేశాల నుంచి తరలి వస్తారు. అదేవిధంగా మరెక్కడా చూడలేని రకరకాల పక్షులను ఈ ప్రాంతంలో చూసేందుకు ఇదే మంచి అవకాశం. పర్వత శిఖరాలపైన కనిపించే ఈ పీఠ భూములు హెలిప్యాడ్లను పోలి ఉంటాయి. రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు మొదలయ్యేసరికి వివిధ రకాల గడ్డి పెరిగి, కొండలన్నీ పచ్చటి తివాచీ పరిచినట్లు కనిపిస్తాయి. దీంతో ఆ ప్రదేశానికి రంగులు వేసినట్లుగా పచ్చిక బయళ్లు.. వాటిపై రంగురంగుల బొట్లు పెట్టినట్లుగా వివిధ రకాల పూలు చూడముచ్చటగా కనిపిస్తాయి. పసుపు రంగు, ఇత ర రంగుల పుష్పాలతో రంగురంగు తివాచీలు పర చి మనకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రకృతి దృశ్యాలను తిలకించేందుకు, పలు రకాల పుష్పాలను, పక్షులను అధ్యయనం చేసేందుకు వృక్ష, జంతు శాస్త్ర నిపుణులు, ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రఫీ ప్రియులు, పర్యాటకులు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ ప్రదేశానికి తరలివస్తుంటారు. పర్వత ప్రాంతం ఈ రెండు నెలల్లో పర్యాటకుల వాహనాలతో కిక్కిరిసిపోతుంది. అయితే ఈ పీఠభూమికి కాలినడకన మాత్రమే చేరాల్సి ఉంటుంది. ఈ ప్రకృతిని ఆస్వా దించిన పర్యాటకులకు ఈ ప్రదేశం తమ జీవితంలో ఒక మధురానుభూతిగా నిలిచిపోతుంది. ప్రయాణం.. అత్యంత అద్భుతం.. సతారా నుంచి కాస్‌కు వెళ్లే మార్గం కొంత ఇరుకుగా ఉన్నప్పటికి పర్వతాలపైకి వెళ్తున్నంతసేపు పర్యాటకులను తాకే చల్లటి గాలులు మొత్తం శ్రమను దూరం చేస్తాయి. ముందుకు సాగుతున్నంతసేపూ ఎన్నో అద్భుతాలను, మనోహరమైన ప్రకృతి దృశ్యాలను కెమరాలలో బంధించవచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్‌కు సంబంధించిన ఎలాంటి వ్యర్థ పదార్థాలు ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. దీంతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన సందర్శకులు పూలను, మొక్కలను తెంచకపోవడం మరో విశేషం. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ వింత లోకాన్ని చూడడానికి పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. చూడాల్సిన ప్రదేశాలు.. కాస్లేక్.. కాస్ పీఠభూమి సముద్ర మట్టానికి 3,725 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ పీఠభూమి సహ్యాద్రి కొండల మధ్య గిన్నె ఆకారంలో కనిపిస్తుంది. కొయనా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా కాస్ లేక్ ఏర్పడింది. సతారా పట్టణానికి తాగునీటిని ఈ లేక్ నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ సరస్సు ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. స్వచ్ఛతలో ఈ లేక్ దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పవచ్చు. ఇక్కడ బోటింగ్ ఓ అద్భుత, చిరస్మరణీయ అనుభూతిని కల్గిస్తుంది. ఈ ప్రాంతం మొక్కలకు, వన్యజీవులకు అనుకూలంగా నిలుస్తుంది. భూలోకంలో స్వర్గాన్ని అనుభవించాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించి.. ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాల్సిందే. చల్కేవాడి.. వందలాది గాలి మరలు ఇక్కడ పర్వతాలపై మనకు టాటా చెబుతూ వీడ్కోలు పలుకుతుంటాయి. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు పలు సినిమా షూటింగ్‌లు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ గాలి మరల ద్వారా ఇక్కడ విద్యుచ్ఛక్తిని తయారు చేస్తున్నారు. అందుకే సతారా జిల్లాను ‘డిస్ట్రిక్ట్ ఆఫ్ పవర్’గా పిలుస్తున్నారు. చల్కేవాడి పవన నిలయంగా చెప్పవచ్చు. నైసర్గ్ ఆర్గానిక్ ఫార్మ్.. సతారాకు చెందిన శిందే ఈ ఆర్గానిక్ ఫామ్‌ను నడుపుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన సర్పగంధ, ఇన్సులిన్, తులసి లాంటి వివిధ మొక్కలను ఇక్కడ పెంచుతున్నారు. ఇక్కడ సజ్జన్ఘడ్ కోటను కూడా చూడవచ్చు. (క్లిక్: ఆ భార్యాభర్తలు దేశం మొత్తం నడిచేశారు) తోసేఘర్ వాటర్ ఫాల్స్... సతారా నుంచి 20 కి.మీ. దూరాన తోసేఘర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ వెయ్యి అడుగుల పైనుంచి కిందున్న లోయలోకి పడుతుంటాయి. పర్యాటకులకు ఈ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. వేలాది మంది పర్యాటకులు ఈ జలపాతాలను చూడడానికి దేశ నలుమూలల నుంచి వస్తుంటారు. వాటర్ ఫాల్స్‌కు ఎదురుగా ఉన్న లోయపైన ఒక ప్లాట్‌ఫాంను నిర్మించడం వల్ల ఈ జలపాతాలను దగ్గరగా చూసేందుకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎటువంటి సాహస కృత్యాలు చేయకూడదు. గతంలో చాలామంది పర్యాటకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇక్కడి ప్రకృతి అందా లు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. (క్లిక్: అదిరే..అదిరే.. అతిరాపల్లి వాటర్ ఫాల్స్) -
పాపికొండల టూర్.. నదీ అందాలు తిలకిస్తూ విహారం
రంపచోడవరం: పాపికొండలు అందాలు చూసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రెండేళ్ల విరామం తరువాత నవంబరు 7 నుంచి పర్యాటక బోటులు పాపికొండల విహారానికి బయలుదేరానున్నాయి. దీంతో పర్యాటకుల్లో ఆసక్తి.. ఆనందం నెలకొన్నాయి. శీతాకాలం గోదావరిపై మంచు తెమ్మరల మధ్య పాపికొండల పర్యటన మధురానుభూతినిస్తుందనడంలో సందేహం లేదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు మధ్య సుమారు 40 కిలో మీటర్ల పొడవుల గోదావరికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి. టూరిజమ్ బోట్లపై ప్రయాణించే పర్యాటకులు పాపికొండలు, గోవావరి వెంబడి ఎత్తున కొండలు, పచ్చని వృక్షాలు ప్రాంతాన్ని వీక్షించేందుకు ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి సందర్శిస్తున్నారు. వీఆర్‌పురం మండలం పోచవరం బోట్ పాయింట్ నుంచి రోజు సుమారు 300 మంది ,సెలవు రోజుల్లో వెయ్యి మందికి పైగా పర్యాటకులు పాపికొండల సందర్శనకు వచ్చేవారు. ఎలా వెళ్తారంటే.. ► భద్రాచలం రామాలయాన్ని దర్శించుకున్నాక 75 కిలో మీటర్ల దూరంలోని పోచవరం బోట్ పాయింట్‌కు రోడ్డు మార్గం గుండా చేరుకుంటారు. అక్కడి నుంచి గోదావరి నదిలో బోట్లో ప్రయాణిస్తారు. ► తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం పోశమ్మ గండి ఆలయం వద్ద బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహార యాత్రకు బయలుదేరతారు. ► రాజమమహేంద్రవరం నుంచి కూడా వాహనంలో పురుషోత్తపట్నం మీదుగా పోశమ్మగండికి చేరుకుంటారు. భద్రతకు పెద్దపీట 2019లో జరిగిన కచ్చులూరు సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంది.. గోదావరి నీటి మట్టం ఆధారంగా బోటులు గోదావరిపై నడిపేందుకు అనుమతి ఇస్తోందిరు. పోలవరం ప్రాజెక్టు ఎర్త్‌డ్యామ్ వద్ద నీటి మట్టం 27 మీటర్లు ఉంటే బోట్లు తిరిగేందుకు అనుమతి లభిస్తుంది. అంతకు మించి నీటి మట్టం పెరిగే బోటులను నిలిపివేస్తారు. 23 పర్యాటక బోట్లుకు అనుమతి పాపికొండలు అందాలను చూపించేందుకు ప్రైవేట్ బోట్లుతో పాటు, ఏపీ టూరిజం బోట్లు కూడా నడుస్తాయి. కొద్ది రోజులు పాపికొండలు పర్యాటకం నిలిచిపోయిన తరువాత టూరిజం బోట్లు నడిపేందుకు అనుమతి ఇచ్చారు. తాజా నిర్ణయంతో బోట్ల ఫిట్నేస్ పరిశీలించి టెక్నికల్ అధికారులు తొలివిడతగా నిబంధనలకు అనుగుణంగా సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇలా ఇప్పటికే 23 బోట్లకు అనుమతి లభించింది. పోచమ్మగండి బోట్పాయింట్ నుంచి 11 బోట్లకు, పోచవరం బోట్ పాయింట్ నుంచి 12 బోట్లకు అనుమతులు లభించించాయి. (చదవండి: రాజమండ్రి నుంచి టికెట్ ధర రూ.1,250) అనేక మందికి ఉపాధి ► పాపికొండల పర్యాటకంతో అనేక మంది ఉపాధి లభిస్తుంది. టికెట్ కౌంటర్లలో పనిచేసే వర్కర్లు,లాడ్జీల నిర్వహకులు,మార్గం మధ్యలోని కూనవరం ,వీఆర్‌పురం మండలాల్లోని హోటళ్లు, ఇతర వ్యాపారాలతో ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు. ► పోచవరం బోట్ పాయింట్ వద్ద వ్యాపారస్తులతో పాటు బోట్ల యజమానులు, గుమస్తాలు, బోట్ల వర్కర్లు, క్యాటరింగ్ సిబ్బంది, ఫొటో గ్రాఫర్లు, నృత్యకళాకారులకూ ఈ టూర్ ఉపాధిగా నిలుస్తోంది. ► పేరంటాలపల్లిలో వెదురు కళాకృతులు విక్రయించే కొండరెడ్డి గిరిజనులు,కొల్లూరు ఇసుక తెన్నెల్లో బొంగు చికెన్ విక్రయించే గిరిజనులతో పాటు ఐస్‌లు విక్రయించే వారు ఇలా సుమారులు ఐదు వేలమందికి పైగా దీనిపై ఆధారపడుతుంటారు. పోశమ్మ గండి బోట్ పాయింట్ పోశమ్మ గండి బోట్ పాయింట్ నుంచి టూరిజమ్ బోట్లు పాపికొండలు పర్యాటానికి బయలుదేరతాయి. బోట్లుల్లో అన్ని సురక్షిత ఏర్పాట్లు మధ్య పాపికొండకు బోటులను పంపండం జరుగుతుంది. బోట్ పాయింట్ వద్ద పర్యాటక సిబ్బంది ఉంటారు. –వీరనారాయణ, టూరిజం అధికారి, రాజమహేంద్రవరం -
దాదాపు నెలరోజలు సముద్రంలోనే!
మనం విదేశాల్లోనో లేక మరేదైనా రాష్ట్రంలోనూ దారితప్పిపోతే భాష రాకపోయిన ఏదో రకంగా మనం బయటపడగలం కానీ సముద్రంలో అనుకోకుండా బోటు మునిగిపోవడం లేదా మరే ఇతర కారణాల వల్లనో సముద్రంలో చిక్కుకుంటే ఇక అంతే సంగతులు. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఇద్దరు వ్యక్తులకు. సోలమన్ దీవుల్లోని సమద్రంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు దాదాపు నెల రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. అసలు వారు ఎవరు ? ఎందుకు అలా జరిగిందనే వివరాలు.. (చదవండి: కదిలే టాటుల అద్భుతమైన వీడియో) విషయంలోకి వెళ్లితే సోల్మన్ దీవులకు చెందిన లివే నంజికానా, జూనియర్ కోలోని అనే ఇద్దరూ వ్యక్తులు సోలమన్ దీవులలోని పశ్చిమ ప్రావిన్స్‌కి సెప్టెంబర్ 3న చిన్న మోటారు బోట్‌పై బయలుదేరారు. పశ్చిమ తీరంలోని వెల్ల లావెల్లా ద్వీపం, గిజో ద్వీపాలను ఆధారంగా చేసుకుని ప్రయాణిచారు. కొంత దూరం ప్రయాణించేటప్పటికే జీపీఎస్ పనిచేయడం మానేసింది. దీంతో వారు దాదాపు 29 రోజులు సముద్రంలో చిక్కుకు పోయారు. ఈ సోలామాన్ సమద్రంలో ప్రయాణించటం ఎంత క్లిష్టతరమైనదో ఈ పర్యటనలోనే వారికి అర్థమైంది. ఈ పర్యటన కోసం తెచ్చుకున్న నారింజపళ్లు, కొబ్బరికాయలు, వర్షపు నీటితో ఆ 29 రోజులు గడిపారు. ఆఖరికి న్యూ బ్రిటన్, పాపువా న్యూ గినియా తీరంలోని ఒక మత్స్యకారుడి సాయంతో బయటపడ్డారు. ఇలాంటివి సినిమాల్లో చూస్తేనే ఏదోలా అనిపిస్తోంది అలాంటిది నిజ జీవితంలో ఎదురైతే ఇక అంతే సంగతులు. కానీ నిజంగా ఇది చాలా ఒళ్లు గగుర్పోడిచేలాంటి పర్యటన కదా!. (చదవండి: ‘ఇలా అయితే ఢిల్లీ అంధకారంలోకే’) -
Manjarabad Fort: మంజారాబాద్.. స్టార్ఫోర్ట్
ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాన్ని చూడాలంటే తలెత్తి చూస్తే చాలు. నేల మీద ఉన్న ఈ నక్షత్రాన్ని చూడాలంటే మాత్రం ఆకాశంలో విహరించాల్సిందే. ఈ టూర్లో ఈ నక్షత్రకోటతోపాటు పశ్చిమ కనుమల ప్రకృతి విన్యాసాలన్నీ ఆస్వాదించవచ్చు. కర్ణాటక ఊటీ... నక్షత్రం ఆకారంలో ఉన్న ఈ కోట కర్ణాటక, హసన్ జిల్లాలో ఉంది. ఈ కోట సందర్శన పెద్ద సాహసం అనే చెప్పాలి. నాచు మధ్య జాగ్రత్తగా అడుగులు వేస్తూ దిగుడుబావి ఒడ్డుకు చేరడం యువతకే సాధ్యం. ఏడాది మొత్తం ఇక్కడ చల్లగానే ఉంటుంది. ఈ చల్లదనానికి పశ్చిమ కనుమల పచ్చదనం కూడా కారణమే. సక్లేశ్‌పురా నుంచి ఈ కోటకు ప్రయాణం మొదలైనప్పటి నుంచి కాఫీ గింజల పరిమళం ఉత్సాహాన్నిస్తుంది. ఆకాశాన్నంటుతున్న పోక చెట్లు మీ ప్రయాణం కూడా ఆకాశం వైపేనని గుర్తు చేస్తాయి. యాలకుల చెట్లు వాతావరణాన్ని సుగంధభరితం చేస్తుంటే మిరియాల గుత్తులు ఒకింత ఘాటు వాసనతో ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్నిస్తుంటాయి. చల్లటి వాతావరణంలో గొంతు గరగర అనిపిస్తే రెండు మిరియాలను నమిలితే పర్యటన ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది. మధ్యలో చిన్న చిన్న నీటి కాలువలు పాదాలను కడుగుతుంటాయి. కొండల్లో ప్రవహించే స్వచ్ఛమైన నీరు చల్లగా పాదాలను స్పృశిస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఈ హిల్స్టేషన్ను ఊటీతో పోలుస్తారు. ఊటీ సంపన్నుల పర్యాటక క్షేత్రం అయితే ఇది పేదవారి పర్యాటక ప్రదేశమని చెబుతారు. మంచులో మెరిసిన నక్షత్రం... హసన్ జిల్లా కేంద్రానికి 45 కి.మీల దూరంలో మల్నాడు రీజియన్, సక్లేశ్‌పురా పట్టణానికి దగ్గరలో ఉన్న స్టార్ఫోర్ట్ అసలు పేరు మంజారాబాద్ కోట. మంజు అంటే కన్నడలో మంచు అని అర్థం. ఎప్పుడూ మంచు తెర కమ్మినట్లే ఉంటుంది ఇక్కడి వాతావరణం. ఇది మైసూరు పాలకుల వేసవి విడిదిగా ఉండేది. ఈ కోటలో పెద్ద ఆయుధాగారం ఉండేదని ఇప్పుడున్న ఆనవాళ్లు చెబుతుంటాయి. మైసూర్ కోట నుంచి ఈ కోటకు రహస్య మార్గం ఉండేదని స్థానిక కథనం. ఎనిమిది కోణాల నిర్మాణం ఇది. నిజానికి దీనిని ఎనిమిది రెక్కల పద్మం ఆకారం అనే చెప్పాలి. అయితే మూలలు కోసుగా కోణాకారంలో ఉండడంతో నక్షత్రకోటగా వాడుకలోకి వచ్చింది. -
పర్యాటకులకు గుడ్‌న్యూస్; సాగర్‌లో లాంచీ ప్రయాణం షురూ
నాగార్జునసాగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయడంతో పర్యాటక శాఖ నాగార్జునసాగర్ జలాశయంలో లాంచీలను నడుపుతోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ జలాశయంలో జాలీ ట్రిప్పులు మాత్రమే తిప్పుతోంది. నాగార్జునకొండ (ఆర్కియాలజీ మ్యూజియం) ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటంతో తెలంగాణ ఏర్పాటైన దగ్గరినుంచి ఫారెస్ట్ అధికారులు తెలంగాణ లాంచీలను నాగార్జునకొండకు అనుమతించలేదు. ఇటీవల ఫారెస్ట్ అధికారులు తెలంగాణ లాంచీలు నాగార్జునకొండకు వెళ్లేందుకు అనుమతిచ్చినట్లు పర్యాటక అభివృద్ధిశాఖ ఎండీ మనోహర్‌రావు సోమవారం తెలిపారు. మ్యూజియం తెరుచుకుంటే లాంచీలను నాగార్జునకొండకు నడపనున్నట్లు వెల్లడించారు. నాగార్జునకొండకు వెళ్లడానికి పెద్దలకు టికెట్ ధర రూ.150, పిల్లలకు రూ.120లుగా ఉంది. చదవండి: మొహమాటం ఖరీదు రూ.3 లక్షలు.. కొండగట్టులో వింత ఆచారం సింగరేణిలో అప్రెంటిస్ ఖాళీలు.. త్వరపడండి -
Elephanta Caves: ఎలిఫెంట్ లేదు! కేవ్స్ ఉన్నాయి!!
ఎలిఫెంటా కేవ్స్ దీవికి చేరాలంటే ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర టికెట్ తీసుకోవాలి. ఫెర్రీలో ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ వెళ్తుంటే పది కిలోమీటర్లు చాలా త్వరగా వచ్చేసినట్లనిపిస్తుంది. ఫెర్రీ ప్రయాణంలో ఎలిఫెంటా కేవ్స్ను చేరేలోపు హార్బర్‌కు వచ్చిన పెద్ద పెద్ద షిప్పులను చూడవచ్చు. పోర్టులో బెర్త్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తూ తీరానికి రెండు కిలోమీటర్ల వరకు పెద్ద షిప్పులు లంగరు వేసుకుని ఉంటాయి. వాటిలో క్రూ డెక్ మీదకు వచ్చి సముద్రాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. మామూలుగా అయితే అంతపెద్ద ఇంటర్నేషనల్ కార్గోలను అంత దగ్గరగా చూడడం కుదరని పని. సోమవారం సెలవు ఎలిఫెంటా కేవ్స్ పర్యటనకు సోమవారం సెలవు. ఫెర్రీలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే గుహల దగ్గరకు తీసుకెళ్తాయి. శీతాకాలం ఫెర్రీ పై అంతస్తులో ప్రయాణించడం బాగుంటుంది. అరబిక్ కడలి చిరు అలలతో నిశ్శబ్దంగా పలకరిస్తుంది. ఎలిఫెంటా కేవ్స్ ఉన్న దీవి ఎత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయితే అది పర్యాటకుల తప్పు కాదు. అమావాస్య, పౌర్ణముల్లో సముద్రం ఆటుపోట్లను బట్టి నీటి ఉపరితలం పైకి ఉబికినప్పుడు ఐలాండ్ ఎత్తు తక్కువగా కనిపిస్తుంది. ఫెర్రీ దిగిన తర్వాత దాదాపు కిలోమీటరు దూరం నడవాలి. ఆ దారిలో టాయ్‌ట్రైన్ ఎప్పుడో ఒక ట్రిప్పు తిరుగుతుంది. అంతదూరం నుంచి మనం వదిలి వచ్చిన తీరాన్ని చూడడం, సముద్రపు అలలు, మరోవైపు కొండలను చూస్తూ సాగే ఆ నడక కూడా ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఆ దారిలో ఉండే టూరిస్టు మార్కెట్లో చిరు వ్యాపారులను, వారు చెప్పే ధరలను చూస్తే దేశంలో వర్తకవాణిజ్య మేధావులంతా ఇక్కడే ఉన్నారా అని నోరెళ్లబెట్టాల్సిందే. పర్యాటక ప్రదేశాల్లో ధరలు ఎక్కువగానే ఉంటాయి. ఐదు నుంచి పదిశాతం ధర ఎక్కువ ఉండడాన్ని ఆక్షేపించకూడదు. కానీ మన దగ్గర శిల్పారామంలో రెండు వందలకు అమ్మే హ్యాండ్‌బ్యాగ్‌కు అక్కడ పదిహేను వందలు చెప్పారు. గాయపడిన శిల్పాలు ఇంతటి వైవిధ్యతను ఆస్వాదిస్తూ గుహల్లోకి అడుగుపెట్టిన తర్వాత అది మరో ప్రపంచం. తప్పిపోయేటన్ని గుహల్లేవు, మొత్తం ఏడు గుహలే. రెండు బౌద్ధగుహలు, ఐదు హిందూ గుహలు. గైడ్ లేకపోతే మనం ఏం చూస్తున్నామో అర్థం కాదు. ఏ శిల్పమూ దాని పూర్తి స్వరూపంతో లేదు. విధ్వంసానికి గురి కాని శిల్పం ఒక్కటీ కనిపించదు. ప్రతి శిల్పానికి ఏదో ఒక చోట గాయం, ఆ గాయాల వెనుక అధికార దాహమూ ఉన్నాయి. ఈ గుహలు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటివి. అప్పుడు హీనయాన బౌద్ధులు ఈ కొండలను తొలిచి ఆవాసాలుగా మలుచుకున్నారు. బౌద్ధ శిల్పాలను కూడా చెక్కారు. బౌద్ధం సన్నగిల్లిన తర్వాత ఈ ప్రదేశం హిందువుల అధీనంలోకి వచ్చింది. సమానత్వం కోసం ఓ ప్రయత్నం శైవం పతాకస్థాయిలో ఉన్న కాలంలో కాలచూరులు, రాష్ట్రకూటులు ఈ గుహల్లో శిల్పాలను చెక్కించారు. శివపురాణం ఆధారంగా చెక్కిన ఘట్టాలు ఎక్కువగా కనిపిస్తాయి. క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలోనే సమాజంలో స్త్రీపురుష సమానత్వం కోసం ఒక ప్రయత్నం జరిగిందిక్కడ. అర్ధనారీశ్వరుడిని రూపొందించడంలో ఉద్దేశం... సమాజంలో స్త్రీ పురుష సమానత్వ భావనను పాదుకొల్పడమే. అయితే ఆ ఉద్దేశాన్ని రూపుమాపడానికి అత్యంత లౌక్యంగా అది పార్వతికి మాత్రమే దక్కిన వరంగా మలిచేయడమూ అనతికాలంలోనే జరిగిపోయింది. ఏనుగు ఎక్కడ? గుహలన్నీ తిరిగి చూడడం పూర్తయినా సరే ఎక్కడా ఏనుగు ఆనవాలు కనిపించదు. ఈ గుహలకు ఆ పేరు ఎందుకు వచ్చిందని అడిగినప్పుడు గైడ్ చాలా సిన్సియర్‌గా గుహల వెలుపలకు తీసుకువచ్చి ఒక ఖాళీ ప్రదేశాన్ని చూపించి, ‘ఇక్కడ ఒక పెద్ద ఏనుగు శిల్పం ఉండేది. ఆ శిల్పం కారణంగానే పోర్చుగీసు, బ్రిటిష్ పాలనకాలంలో ఈ గుహలకు ఎలిఫెంటా కేవ్స్ అనే పేరు వచ్చిందని చెబుతూ ఆ ఏనుగును చూడాలంటే ముంబయి నగరంలోని జిజియామాత ఉద్యానవనానికి వెళ్లా’ లని చెప్పాడు. ఇక్కడ ఉండాల్సిన ఏనుగు అక్కడికి ఎందుకు వెళ్లిందటే... బ్రిటిషర్లు మన కోహినూర్ వజ్రాన్ని, నెమలి సింహాసనాన్ని తరలించుకుపోయినట్లే ఏనుగు శిల్పాన్ని కూడా పెకలించుకుపోవాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో అది విరిగిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనవాళ్లు ఏనుగుకు మరమ్మతులు చేసి జిజియా మాత ఉద్యానవనంలో నిలబెట్టారు. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ బయటకు వచ్చేటప్పటికి ఫెర్రీలు నడిపేవాళ్లు ఎదురు చూస్తుంటారు. తిరుగు ప్రయాణానికి టైమ్ అయింది, ఫెర్రీ కదలడానికి సిద్ధంగా ఉంది ఇది వెళ్లిపోతే ఇక ఇప్పట్లో మరొకటి ఉండదని పిల్లల్ని భయపెట్టినట్లు చెప్పి బయల్దేరదీస్తారు. – వాకా మంజులారెడ్డి -
ఢిల్లీ ఐరన్‌పిల్లర్... తుప్పుపట్టని చరిత్ర
ఇది ఢిల్లీ ఐరన్‌పిల్లర్... ఎత్తు 23 అడుగుల ఎనిమిది అంగుళాలు. వ్యాసం పదహారు అంగుళాలు. బరువు మూడు టన్నులకు పైమాటే. తుప్పుపట్టని భారత చరిత్రకు ప్రతీక. భారతీయ శాస్త్రనైపుణ్యానికి ప్రతిబింబం. దేశ రాజధానిలో ఇనుప స్తంభం... ఎక్కడ ఉంది? ఢిల్లీ నగరంలో మెహ్రౌలీలో ఉంది. అర్థమయ్యేలా చెప్పాలంటే కుతుబ్‌మినార్ ఆవరణలో ఉంది. ఎవరు నిలబెట్టారిక్కడ? తోమార్ రాజు అనంగ పాలుడు కావచ్చు, బానిస పాలకుడు ఇల్టుట్మిష్ కావచ్చు. ఈ కావచ్చుల వెనుక ఇంకా మరెన్నో కావచ్చులున్నాయి. దీనిని ఎవరు నిర్మించారనే ప్రశ్నకు సమాధానం ఈ స్తంభం మీదున్న శాసనాలే. సంస్కృత భాషలో బ్రాహ్మి లిపిలో ఉన్న ఈ శాసనాలను చదవడానికి అక్బర్ చేయని ప్రయత్నం లేదు. అయితే ఈ ప్రయత్నంలో సఫలమైంది బ్రిటిష్ పాలకులే. లండన్ ఆర్కియాలజిస్టుల మేధోతవ్వకం తర్వాత బయటపడిన వాస్తవం ఏమిటంటే... ఇది పదహారు వందల ఏళ్ల నాటి స్తంభం. గుప్తుల కాలం నాటిది. రెండవ చంద్రగుప్తుడు క్రీ.శ నాలుగవ శతాబ్దంలో మధ్యప్రదేశ్‌లోని విష్ణుపాద కొండల మీద స్థాపించాడని వెల్లడైంది. ఈ పిల్లర్ మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు భారతదేశంలో గుప్తుల కాలం నాటికే లోహశాస్త్రం అత్యున్నత దశకు చేరి ఉండేదని సూత్రబద్ధంగా నిర్ధారించారు. అంత పెద్ద పుస్తకాలు చదివి అంత గొప్ప సైన్స్‌ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అయినా ఏం ఫర్వాలేదు. ఈ పిల్లర్‌ని చూసి ఆ మేధోఘనులకు ఒక సెల్యూట్ చేసి, పిల్లర్ ముందు నిలండి ఫొటో తీసుకుంటే ఎప్పటికీ తుప్పు పట్టని ఓ మంచి జ్ఞాపకం మన ఆల్బమ్‌లో నిక్షిప్తమై ఉంటుంది. నిజమో! కాదో!! కానీ... ఈ పిల్లర్ చూడడానికి సన్నగా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ పిల్లర్ మన వీపుకి తగిలేటట్లు నిలబడి రెండు చేతుల్ని వెనక్కి చాచి పిల్లర్‌ని చుట్టడానికి ప్రయత్నిస్తే చేతులు అందవు. ఈ ప్రయత్నంలో రెండు అరచేతుల్ని పట్టుకోగలిగిన వాళ్లు గొప్ప వ్యక్తులవుతారని అక్కడ ఒక సరదా నమ్మకం ఉండేది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి చేతులు అందాయని కూడా చెప్పేవారు. పర్యాటకులందరూ ప్రయత్నించి విఫలమయ్యేవాళ్లు. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయడానికి కూడా వీల్లేదు. పిల్లర్ చుట్టూ కంచె కట్టేశారు. దూరంగా నిలబడి చూసి ఆనందించాల్సిందే. మధ్యప్రదేశ్‌లోనే ఎందుకు? కర్కాటక రేఖ మన దేశంలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరామ్.. మొత్తం ఎనిమిది రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఎక్యునాక్స్‌డే (పగలు– రాత్రి సమంగా ఉండేరోజు) సూర్యుడి గమనం సాగే రేఖామార్గంలో మధ్యప్రదేశ్‌లో ఉన్న విష్ణుపాద కొండల మీద ఈ ఇనుపస్తంభాన్ని స్థాపించారు. ఇది ఈ ఇనుపస్తంభ స్థాపన వెనుక ఉన్న ఖగోళ విజ్ఞానం. అంతకు మించిన లోహశాస్త్ర విజ్ఞానం కూడా ఈ పిల్లర్‌లో నిక్షిప్తమై ఉంది. బ్రిటిష్ కాలంలో ఆర్కియాలజిస్ట్ జేమ్స్ ప్రిన్సెప్ 1817లో ఈ పిల్లర్ మీద అధ్యయనం చేసి ప్రపంచానికి తెలియచేశాడు. మెటలర్జరిస్ట్ సర్ రాబర్ట్ హోడ్‌ఫీల్డ్ 1912లో రీసెర్చ్ మొదలు పెట్టాడు. అనేకమంది శాస్త్రవేత్తలు ఇందులోని శాస్త్రీయత మీద పరిశోధనలు చేసి రెండు వందల యాభైకి పైగా పేపర్లు, పుస్తకాలు వెలువరించారు. ఇది ఒక మెటలర్జికల్ వండర్ అని తేల్చేశారంతా. ఈ ఐరన్ పిల్లర్‌ని తుప్పపట్టనివ్వని లోహపు పూత మందం మిల్లీమీటరులో ఇరవయ్యో వంతు. ఈ టెక్నాలజీ మీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. – వాకా మంజులా రెడ్డి -
Jodeghat Museum: జోడెన్‌ఘాట్ వీరభూమి
‘కుమ్రుం భీము గిరిజన సంగ్రహాలయం’ ఇది ట్రైబల్ మ్యూజియం. ఆదివాసీల జీవనశైలితోపాటు కుమ్రుం భీము జీవితాన్ని బొమ్మల్లో చూపించే ప్రయత్నం. కొండ అద్దంలో ఇముడుతుందేమో కానీ కుమ్రుం భీము పోరాటం, జీవితాశయ సాధనలను ప్రతిబింబించడానికి ఒక మ్యూజియం సరిపోదు, ఇలాంటి పది మ్యూజియాలు కావాలి. ఈ మ్యూజియం కుమ్రుంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కెరిమెర మండలం, జోడెన్‌ఘాట్ గ్రామంలో ఉంది. జోడెన్‌ఘాట్‌లో కుమ్రుం భీము సమాధి, సమాధి పక్కనే భీము చేత్తో తుపాకీ పట్టుకున్న విగ్రహం ఉన్నాయి. విగ్రహం ఎదురుగా మ్యూజియం ఉంది. ఇందులో ఆదివాసీలు ఉపయోగించే వస్తువులు, పాత్రలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, ఆభరణాల అలంకరణ, పెళ్లి వేడుక చిత్రాలు, వేడుకలు, దేవతాపూజ సన్నివేశాలను కళ్లకు కట్టారు. వీటన్నింటిలో మేటిగా కుమ్రుం భీము జీవితావిష్కరణ కనిపిస్తుంది. మ్యూజియంలోకి ప్రవేశించగానే ఎడమ వైపు ఒక నాయకుడు, పది మంది అనుచరుల శిల్పాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. మధ్యలో ఉన్నది భీము. ద్వారానికి కుడివైపు భీము ఫొటో, విగ్రహంతోపాటు భీము భార్య సోమ్బాయి ఫొటో ఉంది. ఆ పక్కనే భీముతో కలిసి పని చేసిన కుమ్రుం సూరు ఫొటో, వేడమ రాము ఫొటో కూడా. భీము ఆచూకీ కోసం నిజాం మనుషులు గాలిస్తున్న సమయంలో ప్రమాదం ముంచుకు వస్తోందని హెచ్చరించడానికి రాము కాలికొం అనే వాద్యాన్ని ఊది భీమును, భీము బృందాన్ని అప్రమత్తం చేసేవాడు. ఈ మ్యూజియానికి పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాలలో భీము మనుమరాలు సోమ్బాయి ఉంది. ఆ స్కూల్లో చదువుకుంటూ కాదు, పాఠాలు చెప్తూ కూడా కాదు. స్కూలు పిల్లలకు భోజనం వండి పెట్టే ఉద్యోగంలో ఉందామె. భీము గౌరవార్థం సభలకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. జిల్లాకు పేరు కూడా పెట్టింది. కానీ అతడి వారసుల ఉపాధి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. అంతేకాదు... భీముకు ఇస్తున్న గౌరవం అతడి పోరాటానికి ఇవ్వడం లేదని తెలిసినప్పుడు కూడా ఆశ్చర్యమేస్తుంది. భూమి కోసం పోరాటం కుమ్రుం భీము పుట్టింది ఆసిఫాబాద్ జిల్లా సంకేపల్లిలో. నిజాం పాలన కాలంలో రెవెన్యూ శాఖ వేధింపులు ఎక్కువగా ఉండేవి. పంటను ఐదు వంతులుగా విభజించి మూడు వంతులు ప్రభుత్వానికి కట్టాల్సి వచ్చేది. పండించిన వాళ్లకు రెండు వంతులు మాత్రమే మిగిలేది. ‘ఇదేం న్యాయం’ అని ప్రశ్నించిన భీము కుటుంబాన్ని స్థానిక పటేదారు వేధించడం మొదలుపెట్టాడు. భీము కుటుంబం ఊరు వదిలి సుర్దాపూర్కి పారిపోయింది. పటేదారు మనుషులు అక్కడికీ వచ్చారు. భీము ఆవేశం పట్టలేక పటేదారును కొట్టడంతో అతడు చనిపోతాడు. అప్పుడు భీము అడవుల్లోకి పారిపోతాడు. అడవుల నుంచి అస్సాంకు వెళ్లి ఆరేడేళ్ల పాటు అక్కడే ఉండి చదవడం, రాయడం నేర్చుకుని తిరిగి సుర్దాపూర్కొస్తాడు. అప్పటి నుంచి ఆదివాసీలకు సాగు చేసుకుంటున్న భూమి మీద సంపూర్ణ హక్కుల కోసం మరింత పటిష్టంగా పోరాడడం మొదలు పెట్టాడు. అనేక దరఖాస్తులు పెట్టాడు. నిజాంను స్వయంగా కలిసి విన్నవించుకోవడానికి పదిహేను మంది ఆదివాసీలతో హైదరాబాద్‌కు వెళ్లాడు. నిజామ్ అనుమతి ఇవ్వకపోవడంతో తన స్వస్థలంలోనే పోరాడాలని నిర్ణయించుకుని వెనక్కి వచ్చేశాడు భీము. అప్పటి నుంచి శిస్తు కట్టమని అడిగిన పటేదార్లను, రెవెన్యూ అధికారులను ధిక్కరించడమే ధ్యేయంగా పోరాటం తీవ్రతరం చేశాడు. వీరి స్థావరం కొండ మీద జోడెన్‌ఘాట్‌కు సమీపంలో ఉన్న భాభేఝరి. ఇక్కడి నుంచి ఉద్యమాన్ని నడిపాడు భీము. చుట్టు పక్కల 14 గ్రామాలను ప్రభావితం చేశాడు. భీము పోరాటాన్ని అణచివేయడానికి నిజాం సైన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. రెండు వందల మందితో కూడిన భీము సైన్యం రెండు నెలల పాటు నిజాం సైన్యాన్ని విజయవంతంగా నిలువరించగలిగింది. భీము అనుచరుల్లో ‘కొద్దు’ అనే వ్యక్తి రోజూ కొండ కిందకు వెళ్లి భీము బృందానికి అవసరమైన ఆయుధాలు, ఆహారాన్ని కొండమీదకు తెచ్చేవాడు. అతడిని వేధించి, ప్రలోభ పెట్టిన నిజాం సేనలు ఎట్టకేలకు భీము కదలికలను పసిగట్టాయి. భీము ఉన్న కొండకు వెనుక వైపు మోవాడ్ ప్రాంతం నుంచి నిజాం సేనలు వచ్చి జోడెన్‌ఘాట్‌లో ఉన్న భీమును తుపాకీతో కాల్చి చంపేశాయి. భీము అక్కడికక్కడే తుది శ్వాస వదిలాడు. ఇది జరిగింది 1940, ఆశ్వయుజ పౌర్ణమి రోజున. అప్పటికి అతడి వయసు 39. నిజాం పాలకులు తుపాకీ తూటాతో భీము ఆశయానికి గండికొట్టారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా నిశ్శబ్దంగా అదే పంథాను కొనసాగిస్తున్నాయి. భీము ఏ ఆశయం కోసం పోరాడాడో ఆ ఆశయం ఇప్పటికీ నెరవేరనే లేదు. స్థానిక ఆదివాసీలు ఇప్పటికీ పోడు భూముల మీద హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆదివాసీలు భీము జీవిత కథను వివరిస్తూ... మా చేతిలో తుపాకీ లేదు, కానీ తుపాకీ పట్టిన భీము స్ఫూర్తి మాలో ఉందని చెబుతున్నారు. ఈ పర్యటనలో తరాలకు కూడా తరగని స్ఫూర్తినిచ్చిన కుమ్రుం భీము జీవితం కళ్ల ముందు మెదలుతుంది. చదవండి: కురువపురం దీవి; కృష్ణమ్మ సిగలో చేమంతి అండర్‌వాటర్‌లో మ్యూజియం.. అదెక్కడంటే? -
కొలనుపాక జైన మందిరాలు
జైన మందిరాలు శాంతికి చిహ్నాలుగా కనిపిస్తాయి. నిర్మాణంలో సునిశితత్వంతోపాటు ప్రశాంతమైన వాతావరణం వీటి ప్రత్యేకత. కొలనుపాకలో ఉన్న జైన మందిరం లేత గులాబీరంగు అద్దిన మైనపు బొమ్మలాగ ఉంటుంది. రెండు వేల ఏళ్ల నాటి నిర్మాణం ఇది. రాష్ట్రకూటుల కాలంలో ఇక్కడ జైనం విలసిల్లింది. ప్రపంచ కాలమానం క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకంలోకి ప్రయాణించిన సంధికాలంలో ఇక్కడ జైనం వికసించింది. ఆ వికసిత జైనానకి ప్రతీకలుగా జైన మందిరాల్లో పై కప్పులకు రెక్కలు విచ్చిన పద్మం ఉంటుంది. కొలనుపాక జైన మందిరం శ్వేతాంబర జైనసాధకుల ఆలయం. కొలనుపాకలో జైన మందిరాన్ని ఒక ఎకరా విస్తీర్ణంలో నిర్మించారు. చుట్టూ ఉన్న ధర్మశాలలు ఇతర కట్టడాలన్నీ కలిపి ఈ మందిరం ఇరవై ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ మందిరాన్ని భరతుడు కట్టించాడని స్థానిక కథనం ఒకటి వ్యవహారంలో ఉంది. శకుంతల– దుష్యంతుల కుమారుడు భరతుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ‘భరతుడు కట్టించాడనే అనుకోవడానికి... మరి భారతదేశం రెండు వేల ఏళ్లకంటే ముందే ఉండేది కదా. ఈ మందిరం ఆవరణలో ఉన్న దాదాపు ఇరవై శాసనాలను బట్టి చూస్తే రాష్ట్రకూటుల చారిత్రక కాలానికి వర్తిస్తోంది. పురాతన మందిరాన్ని రాష్ట్రకూటులు అభివృద్ధి చేసినట్లు చెబుతారు. ఇక్కడ బౌద్ధం కూడా బాగానే విస్తరించింది. కానీ పర్యాటక ప్రదేశంగా జైనమందిరమే ప్రాచుర్యంలోకి వచ్చింది. వర్ధమానుడి విగ్రహం జైన తీర్థంకరులు రిషభనాధుడు, నేమినాథుడు, మహావీరుల విగ్రహాలతోపాటు ఆదినాధుడు, వర్ధమాన మహావీరుడి శిష్యుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ మందిరంలో తెల్లటి పాలరాతి విగ్రహాలతోపాటు ఆకుపచ్చ పాలరాతి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. గడచిన శతాబ్దంలో ఈ మందిరానికి మరమ్మత్తులు చేశారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి పాలరాతి నిర్మాణాల్లో నిపుణులు వచ్చి మెరుగులుదిద్దారు. మహావీర సూత్రాలు ఈ మందిరంలో గోడల మీద మహావీరుడు బోధించిన నీతిసూత్రాలు కూడా ఉంటాయి. వాటిలో సమాజంలో మనుషులంతా సమానమే అని ఉంటుంది. కానీ పర్యాటకులను ప్రధాన ఆలయంలోకి అనుమతించరు. అందులోకి ప్రవేశం శ్వేతాంబర జైనులకు మాత్రమే. ఈ జైనమందిరం హైదరాబాద్‌కి ఎనభై కిలోమీటర్ల దూరాన యాదాద్రి జిల్లాలో ఉంది. రైల్లే వెళ్లాలంటే ఆలేరు రైల్వేస్టేషన్లో దిగాలి. ఆలేరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరాన ఉంటుంది. వారాంతపు సెలవుకు ఇది మంచి ప్రదేశం. రోజంతా ఆహ్లాదంగా గడపవచ్చు. చదవండి: మానా గ్రామం.. ఇది మన ఊరే! రంగులు మార్చే సూర్యుడు -
మానా గ్రామం.. ఇది మన ఊరే!
ఓ కప్పు కాఫీ కోసం పదివేల అడుగుల ఎత్తుకు వెళ్లాలా? హిమాలయాలను చూస్తూ సిప్పు చేయాలంటే తప్పదు. సరిహద్దుకు ఈవల ఉండి ఆవలి టిబెట్‌ను చూస్తూ... టీ తాగాలంటే ఆ మాత్రం శ్రమ తప్పదు. పాండవులు స్వర్గారోహణకు వెళ్లిన దారిలో... తాపీగా ఓ టీ తాగాలంటే అంతదూరం వెళ్లాల్సిందే. టీ తాగడమే కాదు... టీ తాగుతూ చాలా చూడవచ్చు. సరస్వతి నది మీద ద్రౌపది కోసం... భీముడు కట్టిన రాతి వంతెనను చూడవచ్చు. ఇంకా... ఇంకా... చూడాలంటే... ‘మానా’ గ్రామానికి ప్రయాణం కట్టవచ్చు. మానా అనేది చాలా చిన్న గ్రామం. ఓ వంద ఇళ్లుంటాయేమో! కొండవాలులో ఉన్న ఈ గ్రామంలో ఏది నివాస ప్రదేశమో, ఏది వ్యవసాయ క్షేత్రమో అర్థం కాదు. అంతా కలగలిసి ఉంటుంది. ఇంటి ముందు క్యాబేజీ పంటలు కనిపిస్తాయి. దుకాణం వెనుక ఒక కుటుంబం నివసిస్తుంటుంది. ఓ వైపు ధీరగంభీరంగా హిమాలయాలు, మరో దిక్కున కిందకు చూస్తే నేల ఎక్కడుందో తెలియనంత లోతులో మంద్రంగా ప్రవహించే నదులు. నింగికీ నేలకూ మధ్యలో విహరిస్తున్నామనే భావన ఊహల్లో తేలుస్తుంది. నేనూ ఉన్నానంటూ సూర్యుడు తన ఉనికిని ప్రకటించే ప్రయత్నంలో ఉంటాడు. దారి చూపే బ్యాంకు ఇక్కడ రోడ్లు తీరుగా ఉండవు. భారతీయ స్టేట్ బ్యాంకు పెట్టిన బోర్డుల ఆధారంగా వెళ్లాలి. వ్యాసగుహ 150 మీటర్లు, గణేశ గుహ 30 మీటర్లు, భీమ్‌పూల్– సరస్వతి దర్శన్ 100మీటర్లు, కేశవ్ ప్రయాగ 600 మీటర్లు, వసుధారా జలపాతం ఐదు కిలోమీటర్లు అని బోర్డులుంటాయి. వసుధారా జలపాతం పాండవుల స్వర్గారోహణ ప్రస్థానంలో మానా తర్వాత మజిలీ. చాయ్ ప్రమోషన్ ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేసుకోవడం వస్తే చాలు... సముద్ర తీరాన ఇసుకని అమ్మవచ్చు, నడి సముద్రంలో ఉప్పు నీటిని అమ్మనూవచ్చు. మానా గ్రామస్థులు టీ, కాఫీలు అమ్మడం చూస్తే అలాగే అనిపిస్తుంది. ‘దేశం చివరి గ్రామం ఇది. ఇక్కడ టీ తాగిన అనుభూతిని మీ ఊరికి తీసుకెళ్లండి’ అని కొత్త ఆలోచనను రేకెత్తించడంతో ప్రతి ఒక్కరికీ టీ కానీ కాఫీ కాని తాగి తీరాలనిపిస్తుంది. ప్రతి పది మీటర్లకు ఒక చాయ్ దుకాణం ఉంటుంది. ప్రతి దుకాణం మీద ‘హిందూస్థాన్ కీ అంతిమ దుకాన్’ అనే బోర్డు ఉంటుంది. వ్యాపార నైపుణ్యం అంటే అదే. అసలైన చివరి దుకాణం ఏదనే ప్రశ్నార్థకానికి సమాధానం కూడా స్టేట్ బ్యాంకు బోర్టే. స్టేట్ బ్యాంకు జోషిమఠ్ శాఖ చివరి దుకాణం దగ్గర ‘ఇదే చివరి చాయ్ దుకాణం అనే బోర్డు ఉంటుంది. మానా గ్రామం పొలిమేర అది. ఆ తర్వాత వచ్చే దారి మానా పాస్. ఆ దారిలో ముందుకు వెళ్తే సరిహద్దు సెక్యూరిటీ వాళ్లు వెనక్కి పంపేస్తారు. మానా గ్రామం... దేశం చివరిలో సరిహద్దు వెంబడి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. భారతదేశం ఉత్తర ఎల్లలో హిమాచల్ ప్రదేశ్‌లోని చిత్కుల్ కూడా సరిహద్దు గ్రామమే. అయితే అది పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందలేదు. మానా గ్రామం భారతీయులకు సొంతూరిలాగ అనిపించడానికి కారణం ఇక్కడ మన పురాణేతిహాసాల మూలాలు కనిపించడమే. చదవండి: రంగులు మార్చే సూర్యుడు భార్య ప్రేమకు నిదర్శనం.. హుమయూన్ సమాధి -
ఇక్కడ ఒక్క రాత్రికి రూ. 58 లక్షలు
పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకునే ప్రాంతం మాల్దీవులు. 26 ద్వీపాల సముహమైన మాల్దీవ్స్‌లో సహజమైన బీచ్‌లు, చల్లటి వాతావరణంతో స్వర్గాన్ని తలపిస్తుంది. అంతేగాక ఇక్కడ ప్రతి ఐలాండ్‌లోని రిసార్టులు స్వీమ్మింగ్ ఫూల్స్‌తో, బెడ్రూం విల్లాలు మాల్దీవులకు మరింత ఆకర్షణ. అయితే ఇక్కడ విడిది చేయాలంటే పర్యాటకులు ఒక్కరోజుకు వేల రూపాయల నుంచి లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. అందుకే సాధారణ ప్రజలతో పోలిస్తే సెలబ్రెటీలే ఎక్కువగా ఇక్కడకు వెళుతుంటారు. లాక్డౌన్లో దాదాపు 8 నెలల పాటు సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. అనంతరం లాక్డౌన్ ఎత్తివేయడంతో సెలబ్రెటీలంతా రిఫ్రెష్మెంట్ కోసం మాల్దీవులకు క్యూ కడుతున్నారు. దీంతో పర్యటకులను మరింత ఆకట్టుకునేందుకు వాల్డోర్ఫ్ ఆస్టోరియా మాల్దీవులు ఇథాఫుషిలో కొత్తగా ఓ ప్రైవేటు లగ్జరీ రిసార్టును నిర్మించారు. ప్రస్తుతం ఈ రిసార్టు పర్యాటకులు తెగ ఆకట్టుకుంటోంది. అయితే దీని ఖరీదు విని మాత్రం చాలా మంది నోళ్లు వెల్లబెడుతున్నారు. 32,000 చదరపు మీటర్ల అభయారణ్య ద్వీపమైన మాల్దీవులలోనే ఇది అతిపెద్ద ప్రైవేట్ ద్వీపం. లగ్జరీ రూమ్‌లతో అన్ని రకాల హంగు ఆర్భాటాలతో నిర్మించిన ఈ రిసార్టులో విడిది చేయాలంటే ఒక్క రాత్రికి సుమారు 58 లక్షల రూపాయలు చెల్లించాలంట. (చదవండి: చైనా దూకుడు: మరో అద్భుతానికి శ్రీకారం) అంత ఖరీదైన ఈ ద్వీపంలో మూడు బీచ్ విల్లాలతో కూడిన లగ్జరీ బెడ్రూమ్లు, రెండు ఓవర్ వాటర్ బెడ్రూమ్లు, రెసిడెన్సీ బెడ్రూంలతో పాటు స్వీమ్మింగ్ ఫూల్స్ ఉన్నాయి. వినోదం కోసం ఒక ప్రైవేట్ క్లబ్‌హౌస్ కూడా ఉంది. అదే విధంగా స్వంత ప్రత్యేక పాక బృందం, వాటర్‌స్పోర్ట్స్, డైవింగ్, యాచ్ ట్రిప్స్, ధ్యానం, యోగా సెంటర్లు, పిల్లలకు ప్రత్యేకంగా స్వీమ్మింగ్ పూల్, గేమింగ్ ఏరియాతో పాటు పూర్తిస్థాయి జిమ్ కూడా ఉంది. ఇథాఫుషి - ప్రైవేట్ ద్వీపంలో నిర్మించిన లగ్జరీ కొత్త రిసార్టును ఈ వారంలోనే ప్రారంభించారు. ఇక్కడ ఒకేసారి దాదాపు 24 మంది పర్యటకులు విడిది చేయవచ్చు. ఈ ద్వీపానికి వెళ్లాలంటే పడవలో 40 నిమిషాల్లో లేదా విమానంలో 15 నిమిషాల్లో ద్వీపానికి చేరుకోవచ్చు. అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఈ ద్వీపానికి మీరు కూడా వెళ్లాలనుకుంటున్నారా. మరి అక్కడ ఉండాలంటే ఒక్క రాత్రికి 58,49,600 రూపాయలు (80,000 అమెరికా డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఆలోచించుకోండి. (చదవండి: చెత్త రికార్డు సృష్టించనున్న ట్రంప్) -
పర్యాటక ప్రాంతాల్లో బోట్ల ఆపరేషన్: మంత్రి
సాక్షి, విజయవాడ: అన్ని పర్యాటక ప్రాంతాల్లో బొట్ల ఆపరేషన్ ప్రారంభిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం సిద్దంగా 196 బొట్లు ఉన్నాయని, వాటి ప్రారంభానికి అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. వరద పరిస్థితులను బట్టి బొట్లను అందుబాటులోకి తెస్తామని, పర్యాటక ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెఇపారు. విశాఖలో బంగ్లాదేశ్ షిప్ వచ్చిందని, అందులో రెస్టారెంట్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. విశాఖ, విజయవాడ, హుస్సేన్ సాగర్ కలిపి కొత్త బొట్లను పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. కోవిడ్ వల్ల జరిగిన నష్టాన్ని మళ్ళీ భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామని, ఆన్లైన్లో యోగా, ఇంగ్లీష్ శిక్షణ ఇస్తున్నామన్నారు. అంతేగాక రూ. 2 కోట్ల 20 లక్షలతో ఒంగోలులో స్టేడియం నిర్మించామని ఆయన తెలిపారు. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్‌ను రూ. 3 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేస్తామని అవంతి పేర్కొన్నారు. విశాఖ బీచ్‌రోడ్‌లో కోడి రామ్మూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, విశాఖఆర్కే బీచ్‌ను మరింత అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రివర్ టూరిజంకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఎటిఎంలా వాడారని, ప్రధానమంత్రి కూడా చంద్రబాబు అవినీతిని విమర్శించారన్నారు. బాబు పోలవరం ప్రాజెక్టుపై రాజకీయం చేయడం తగదని, వరదల సమయంలో కూడా సీఎం జగన్ సమర్థవంతంగా పని చేశారన్నారు. వరదలు వస్తే ఇంత వేగంగా రైతులకు పరిహారం ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా అని మంత్రి వ్యాఖ్యానించారు. -
టూరిజానికి కేరాఫ్ తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల క్రితం 29వ రాష్ట్రంగా ఉద్భవించిన తెలంగాణ పర్యాటక రంగంలో క్రమక్రమంగా పుంజుకుంటోంది. ప్రసిద్ధ దేవాలయంగా, పర్యాటక కేంద్రంగా యాదాద్రి టెంపుల్ రూపుదిద్దుకుంటున్న క్రమంలో రాబోయే రోజుల్లో దేశ, విదేశాల నుంచి వచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరగబోతోంది. దీంతో పాటు నాగార్జునసాగర్‌లో అతిపెద్ద బౌద్ధ కేంద్రం అన్ని హంగులు సంతరించుకుని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విలసిల్లడానికి సంసిద్ధమవుతోంది. ఇటు రాష్ట్రం నలుమూలాల ఉన్న గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు వివిధ టూరిస్ట్ సర్క్యూట్లు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ హెరిటేజ్ సర్క్యూట్ పేరిట ప్రతిష్టాత్మకంగా టూరిజం ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీంతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ట్రైబల్ టూరిజం సర్క్యూట్, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎకో టూరిజం, ఆదిలాబాద్ నిర్మల్, కొమురంభీం–ఆసిఫాబాద్ జిల్లాల్లో ట్రైబల్ అండ్ ఎకో టూరిజం సర్క్యూట్ల ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 2019లోని పర్యాటకరంగ పరిస్థితిని ఒకసారి అవలోకిద్దాం... నిజామాబాద్ జిల్లాకు ఒకే విదేశీ టూరిస్ట్ తెలంగాణలో మూడోవంతు జనాభా పట్టణాలు, నగరాల్లోనే జీవిస్తుండగా అందులో సింహభాగం రాజధాని హైదరాబాద్‌లోనే నివసిస్తున్న విషయం తెలిసిందే. అయితే పర్యాటక పరంగా చూస్తే.. 2019లో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను 8.33 కోట్ల 59 వేల మంది సందర్శించినట్లు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. వారిలో అత్యధిక శాతం అంటే 99.6 శాతం దేశీయ టూరిస్ట్‌లు కాగా, 0.4 శాతం అంటే 3,23,326 మంది మాత్రమే విదేశీ పర్యాటకులున్నారు. విదేశీ టూరిస్ట్‌లు ఎక్కువగా అంటే 3.19 లక్షల మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోనే పర్యటించారు. ప్రధానమైన ఈ నాలుగు జిల్లాల తర్వాత వరంగల్ అర్బన్ జిల్లాకు 2,450 మంది విదేశీ పర్యాటకులు విచ్చేశారు. ఆ తర్వాత ములుగు, మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వందల సంఖ్యలో, జయశంకర్ జిల్లాలో 45 మంది, మంచిర్యాలలో 10 మంది, ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు, నారాయణపేట జిల్లాలో ఐదుగురు, నిజామాబాద్‌లో ఒకే ఒక విదేశీ టూరిస్ట్ పర్యటించడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల టాప్! జిల్లాల్లో పర్యాటక కేంద్రాల విషయానికొస్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా అత్యధికంగా స్థానిక, దేశీయ పర్యాటకులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలోనే టాప్ ప్లేస్‌లో నిలుస్తోంది. మొత్తం దేశీయ పర్యాటకులు 8.30 కోట్లకు గానూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా 1.68 కోట్ల మంది పర్యటించారు. ఆ తర్వాతి స్థానంలో రాష్ట్ర రాజధానికి చుట్టుపక్కలున్న నాలుగు (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ ) జిల్లాల్లో 1.38 కోట్ల మంది పర్యాటకులు, ఆ తర్వాతి స్థానంలో 1.28 కోట్ల మంది టూరిస్ట్‌లతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిలిచింది. ఇక 55 లక్షల నుంచి 15 లక్షల లోపు మంది పర్యాటకులు పర్యటించిన జిల్లాల్లో మెదక్, సంగారెడ్డి, యాదాద్రి, నిర్మల్, జగిత్యాల, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ, ములుగు, వరంగల్ అర్బన్, ఖమ్మం జిల్లాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 7.76 లక్షల మంది పర్యాటకులు, జయశంకర్ జిల్లాలో 6.62 లక్షలు, ఇక నారాయణపేట జిల్లాలో 3.89 లక్షల మంది, వరంగల్ రూరల్ జిల్లాలో 3.53 లక్షల మంది, జనగామ, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, నల్లగొండ జిల్లాలకు 3.28 లక్షలు మొదలుకుని 1.41 లక్షల మధ్యలో పర్యటించారు. కరీంనగర్, నిజామాబాద్, కొమురం భీం, పెద్దపల్లి జిల్లాల్లో 77,491 మొదలుకుని 16,581 మంది మధ్యలో పర్యటించారు. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 534 మంది పర్యాటకులు విచ్చేశారు. అయితే ఒక్కసూర్యాపేట జిల్లా పర్యాటకుల గణాంకాలను నివేదికలో చూపలేదు. -
తగ్గిన భారతీయ పర్యాటకుల ప్రయాణ దూరం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ భయంతో భారతీయ పర్యాటకుల సగటు ప్రయాణ దూరం తగ్గింది. ఈ ఏడాది జూన్–ఆగస్ట్ మధ్యకాలంలో దేశీయ పర్యాటకుల సగటు ప్రయాణ దూరం 780 కిలో మీటర్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వారు ప్రయాణించిన 1,786 కిలో మీట్లరతో పోలిస్తే ఇది 56శాతం తక్కువ. ఈ విషయాన్ని డిజిటల్ సర్వే కంపెనీ బుకింగ్‌డామ్ సర్వే తెలిపింది. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లో నిర్భందం కావడం ఇందుకు కారణమని పేర్కొంది. ప్రపంచ పర్యాటకుల సగటు ప్రయాణ దూరం 63 శాతంతో పోలిస్తే ఇది స్వల్పమని సర్వే చెప్పుకొచ్చింది. ఇదివరకులా తాము కోరుకున్న సుదూర ప్రాంతాల సందర్శన చేయలేకపోయినప్పటికీ తమ పరిసర ప్రాంతాల్లోనే ఉండే అద్భుతమైన స్థలాలను కనుగొనే చక్కటి అవకాశం లభించినట్లుగా పర్యాటకులు భావిస్తున్నారని సర్వేలో వెలుగు చూసింది. వసతి విషయానికొస్తే భారతీయ పర్యాటకుల ఎంపికలో మోటళ్లు, విల్లాలు హోటళ్లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని సర్వే వివరించింది. హైదరాబాద్, జైపూర్ లాంటి ప్రాచీన నాగరికత కలిగిన నగరాల సందర్శనకు పర్యాటకులు ఇప్పటికీ ఆసక్తి చూపుతున్నారని, అయితే ఇంటికి దగ్గరలో ఉన్న ప్రాంతాల సందర్శనకే వారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వే తెలిపింది. కోవిడ్–19 పరిస్థితుల నేపథ్యంలో మా ప్రణాళికలు, ప్రాధాన్యతలు మారినప్పటికీ.., పర్యాటకుల ఆసక్తి మాకు భరోసాను ఇస్తుందని బుకింగ్‌డాట్ కంట్రీ మేనేజర్ రితు మల్హోత్ర తెలిపారు. -
‘జూన్ 8 నుంచి హరిత హోటల్స్ ప్రారంభం’
సాక్షి, విశాఖపట్నం: లాక్డౌన్ సడలింపులతో జూన్ 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హరిత హైటల్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే హోటల్స్ తిరిగి ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. హరిత హోటల్స్‌కు ఆన్లైన్ బుకింగ్ వెసులుబాటు కూడా కల్పిస్తున్నామన్నారు. ఇది ఆతిథ్య రంగానికి శుభవార్త అన్నారు. అంర్జాతీయ స్ధాయిలో పర్యాటకులను అవినీతి రహితంగా ఆకట్టుకోవడానికి రాష్డ్ర వ్యాప్తంగా 12 పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గడిచిన ఏడాది పాలనలో పర్యాటక అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. (నిరూపిస్తే రాజీనామా చేస్తా: అవంతి సవాల్) ఏడాది పాలనలో పర్యాటకుల సంఖ్య 21 శాతం పెరిగిందన్నారు. బోటింగ్ కార్యకలాపాల నియంత్రణ, భధ్రతకు రాష్ట్రంలో 9 ప్రాంతాలలో కంట్రోల్ రూమ్‌లు నిర్మించామన్నారు. రాష్ట్రంలో ఆదాయ మార్గాలు పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఇందుకోసం ఫెస్టివల్స్, ఎగ్జిబిషన్‌ను కూడా నిర్వహిస్తుమని తెలిపారు. గండికోట వద్ద ఉన్న ఎడ్వేంజర్ స్టోర్స్‌కు కూడా ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారని, ఏపి పర్యాటక శాఖ జాతీయ స్ధాయి అవార్డులు కూడా అందుకుందన్నారు. అంతేగాక శిల్పారామాల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళిక నిర్వచిస్తున్నామని, యువతలో దేశభక్తి పెంపొందించేందుకు యూత్ ఎక్చేంజ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
ట్రావెల్ ఫ్రం హోం!
సాక్షి, హైదరాబాద్: వర్క్ ఫ్రం హోం అంటే తెలుసు కానీ ఈ ట్రావెల్ ఫ్రం హోం ఏమిటి అనుకుంటున్నారా? విదేశాల్లోని ప్రముఖ పర్యాటక, ప్రసిద్ధ కేంద్రాలకు మనం స్వయంగా వెళ్లకుండానే అక్కడకు వెళ్లినట్లుగా, వ్యక్తిగతంగా అన్నింటినీ సొంతంగా వీక్షిస్తున్నట్లుగా అనుభూతి పొందేలా చేసేవే ‘వర్చువల్ ట్రావెల్’, ‘ట్రావెల్ ఫ్రం హోం’. ఇది ఇప్పటికే ‘నెట్టింట’అందుబాటులో ఉన్నప్పటికీ మన దగ్గర మాత్రం దీనికి ఇప్పటిదాకా అంత ప్రాచుర్యం లభించలేదు. అయితే ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కమ్మేసిన నేపథ్యంలో వర్చువల్ ట్రావెల్‌పై దేశంలోని పర్యాటక ప్రేమికులు సైతం అధిక ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ సమేతంగా చేపట్టే విదేశీ టూర్లకు అయ్యే ఖర్చు, శ్రమతో పోలిస్తే ‘ట్రావెల్ ఫ్రం హోం’ఖర్చు చాలా తక్కువే కావడంతో వాటిపట్ల మక్కువ ప్రదర్శిస్తున్నారు. దీంతో వారిని ఆకర్షించేందుకు వర్చువల్ టూర్లు ఆఫర్ చేసే సంస్థలు కొత్త ప్లాన్లతో ముందుకొస్తున్నాయి. 360 డిగ్రీల కోణంలో... విదేశీ పర్యాటకం అధికంగా సాగే వేసవిలో కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని చుట్టేయడం, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశాలన్నీ సరిహద్దులను మూసేసి లాక్డౌన్ ప్రకటించడంతో జనజీవనం స్తంభించింది. ఫలితంగా విదేశాల్లోనే కాకుండా దేశీయంగానూ పర్యాటక, రవాణా, ఆతిథ్య తదితర అనుబంధ రంగాలపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఈ తరుణంలో దేశ, విదేశాల్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు, మ్యూజియాలు, ముఖ్య కట్టడాలను ఇల్లు కదలకుండానే వీక్షించేందుకు లోకల్ ఎక్స్పర్ట్ భాగస్వాములతో కలిసి ఎక్స్పీడియా అనే అంతర్జాతీయ ట్రావెల్స్ సంస్థ వర్చువల్ టూర్లను ఆఫర్ చేస్తోంది. ట్రావెల్ ఫ్రం హోం సిరీస్‌లో భాగంగా వర్చువల్ ట్రావెల్‌తోపాటు సాంస్కృతిక, విద్య, వినోద అనుబంధ రంగాల్లోని విశేషాలను, వాటికి సంబంధించిన టూర్లను ఇళ్లలో తీరికగా కూర్చొని ఆయా ప్రదేశాల్లో పర్యటించిన అనుభూతి పొందేలా ప్రణాళికకు రూపకల్పన చేసింది. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి ఆన్లైన్లో వర్చువల్ రియాలిటీ (వీఆర్), వెబ్‌కామ్‌లు, కంప్యూటర్ల ద్వారా 360 డిగ్రీల కోణంలో లైవ్ స్ట్రీమ్‌ల ద్వారా ఆయా పర్యాటక కేంద్రాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తోంది. మరికొన్ని సంస్థలు సైతం ఇదే తరహా టూర్ ప్యాకేజీలు అందిస్తున్నాయి. టూర్ గైడ్లతో లైవ్ వీడియో టూర్... కొత్త ప్రదేశాలకు వెళ్లాలని, విదేశాల్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలను చూడాలని పర్యాటక ప్రేమికులు కోరుకోవడం, దాని కోసం పెద్దమొత్తం ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడరు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ టూర్లకు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక, సాంస్కృతిక, ఇతర కేంద్రాల్లోని టూర్ గైడ్లతో లైవ్, ఇంటరాక్టివ్ వీడియో సెషన్ల ద్వారా ‘రిమోట్ ట్రావెల్స్’నిర్వహిస్తున్నారు. ఆత్మీయులతోనో, స్నేహితులతోనో కలసి కొత్త ప్రదేశాన్ని చూస్తున్న అనుభూతిని కలిగించేలా మనకు నచ్చిన, చూడాలని కోరుకున్న పర్యాటక కేంద్రాలు, వాటి గురించిన ఆసక్తికర వివరాలను టూర్ గైడ్లు వివరించేలా ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాలను చూడాలని అనుకోవడానికి ముందే వాటికి సంబంధించిన ‘ప్రివ్యూ’లను కూడా గైడ్లు ఏర్పాటు చేస్తున్నారు. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రపంచ ప్రసిద్ధి చెందిన మ్యూజియాలను డిజిటల్ టూర్ల మాదిరిగా చూసే అవకాశం లభిస్తోంది. గూగుల్ స్ట్రీట్ ద్వారా ఆధునిక, సమకాలీన చిత్రకళ ప్రదర్శనలను వీక్షించే వీలు కల్పిస్తున్నారు. అయితే బ్రిటిష్ మ్యూజియం పర్యటనకు విషయానికొస్తే మాత్రం ఇది గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్‌లో లేకపోవడంతో బ్రిటిష్ మ్యూజియం వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి వస్తోంది. -
బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ రేసులో రుషికొండ బీచ్
సాక్షి, విశాఖపట్నం: అందాల విశాఖ సాగరతీరం పర్యావరణహిత బీచ్‌గా సందర్శకులను అలరించేందుకు ముస్తాబవుతోంది. మూడు దశాబ్దాల తర్వాత దేశంలో బ్లూఫ్లాగ్ ప్రాజెక్టుకు ఎంపికైన 13 బీచ్‌ల్లో రుషికొండ తీరం చోటు సాధించింది. (చదవండి: త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్) బ్లూఫ్లాగ్ బీచ్ అంటే...? బ్లూఫ్లాగ్ బీచ్‌లు అంటే కాలుష్యం దరిచేరని పూర్తిగా పర్యావరణ అనుకూల సాగర తీరాలు. డెన్మార్క్‌కి చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) 1987 నుంచి బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ అందిస్తోంది. ఇప్పటివరకు 46 దేశాల్లో 4,500 బీచ్‌లు ఈ సర్టిఫికెట్ పొందాయి. తొలిసారిగా భారత్‌కు చెందిన 13 బీచ్‌లు ఇందుకు అర్హత సాధించాయి. బ్లూఫ్లాగ్ గుర్తింపు ఉన్న బీచ్‌లకు విశేష ఆదరణతోపాటు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సర్టిఫికెట్ దక్కాలంటే బీచ్ పరిసరాలు పరిశుభ్రంగా, నీరు కలుషితం కాకుండా, రసాయనాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సర్టిఫికెట్ ఇస్తారిలా.. బ్లూఫ్లాగ్ ధ్రువపత్రం పొందాలంటే నాలుగు విభాగాల్లోని 33 అంశాల్లో బీచ్‌ని అభివృద్ధి చేయాలి. మలినాలు, వ్యర్థాలు ఉండకూడదు. ప్రాజెక్టు పనులు పూర్తయిన అనంతరం ఎఫ్ఈఈ ప్రతినిధులు ఎక్కడైనా ఒకచోట ఒక చదరపు అడుగులో ఇసుకని తవ్వి నాణ్యత పరిశీలిస్తారు. నీటి నాణ్యతని కూడా పరిశీలించి సంతృప్తి చెందితే సర్టిఫికెట్ ఇస్తారు. బీచ్‌లో బ్లూఫ్లాగ్ (నీలం రంగు జెండా) ఎగురవేస్తారు. 80% పనులు పూర్తి బ్లూఫ్లాగ్ ప్రాజెక్టు కింద రుషికొండ బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.7.35 కోట్లు కేటాయించింది. వీటితో పనులు ప్రారంభించారు.ఇటీవల విశాఖలో బ్లూఫ్లాగ్ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న పనుల్ని నిపుణుల బృందం పరిశీలించింది. 80 శాతం పనులు పూర్తైనట్లు ధృవీకరించారు. 600 చదరపు మీటర్ల మేర బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. (బాబాయ్ ఇలా మాట్లాడతారా; సంచయిత భావోద్వేగం..) బ్లూఫ్లాగ్ ఎగరేస్తాం.. ‘రుషికొండ బీచ్‌ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. బ్లూఫ్లాగ్ బీచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించాం. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుతూ సముద్ర జలాల్లో ఎలాంటి రసాయనాలు కలవకుండా చర్యలు తీసుకుంటున్నాం. తీరంలో ఇసుకని ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం. రెండు ఆధునిక యంత్రాల ద్వారా పనులు నిర్వహిస్తున్నాం. జూన్‌లో బ్లూఫ్లాగ్ బృందం బీచ్‌ను పరిశీలించే అవకాశం ఉంది. రుషికొండ బీచ్‌లో కచ్చితంగా బ్లూఫ్లాగ్ ఎగరేసేందుకు యంత్రాంగమంతా కలిసికట్టుగా పని చేస్తున్నాం’ – పూర్ణిమాదేవి, బ్లూఫ్లాగ్ నోడల్ అధికారి పర్యావరణహితంగా నిర్మితమైన టాయిలెట్లు సదుపాయాలివీ.. ► బీచ్‌లో మౌలిక సదుపాయాలన్నీ పర్యావరణ హితంగా వెదురుతో నిర్మిస్తున్నారు. త్రిపుర నుంచి తెచ్చిన వెదురు 10 ఏళ్ల పాటు పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖపర్యాటకులు ఇసుక తిన్నెల్లో కూర్చొని సేదతీరేలా బెంచ్‌లతో పాటు గడ్డి, వెదురు పుల్లలతో గొడుగులు ఏర్పాటు చేశారు. వీటి కింద కూర్చోవడం వల్ల చల్లటి వాతావరణంలో పర్యాటకులు ఆహ్లాదంగా గడుపుతారు. ► ఎక్కడా మలినాలు, చెత్త లేకుండా 25 మంది సిబ్బందితో బీచ్ మొత్తం ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. ► విద్యుత్ కోసం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. 40 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ నుంచి 35 కేవీ విద్యుత్‌ని ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్నారు. బీచ్‌లో ఏర్పాటు చేసిన 70 ఎల్ఈడీ విద్యుత్ బల్బులకు సోలార్ పవర్‌నే వాడుతున్నారు. ► బీచ్ పరిరక్షణ కోసం 10 మంది రక్షణ సిబ్బందిని నియమించారు. బీచ్‌లో ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ముగ్గురు పర్యవేక్షకుల్ని ఏర్పాటు చేశారు. 55 సీసీ కెమేరాలతో నిరంతరం నిఘా పెట్టారు. ► బీచ్‌లో చెత్త నుంచి ఎరువు తయారు చేసేందుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తి చేసే ఎరువుల్ని మొక్కల పెంపకానికి వినియోగించనున్నారు. ► మరుగుదొడ్లకి వినియోగించే నీటిని పునర్వినియోగించేలా గ్రేవాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. రుషికొండ బీచ్‌లో ఏర్పాటయ్యేవి ⇒ రెండు వైపులా పార్కింగ్ ⇒ 2 చోట్ల లైఫ్‌గార్డులు, వాచ్‌టవర్ ⇒ 8 ఓపెన్ షవర్లు, 6 దుస్తులు మార్చుకునే గదులు ⇒ పిల్లల పార్క్ ⇒ వ్యాయామ పరికరాలు ⇒ కూర్చునేందుకు 11 బెంచీలు ⇒ జాగింగ్ ట్రాక్ ⇒ బీచ్ సమగ్ర సమాచారం తెలిపే బోర్డు ⇒ 8 మరుగుదొడ్లు ⇒ మురుగు నీటి నిర్వహణ, గ్రేవాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ⇒ సౌర విద్యుత్తు ప్లాంట్ ⇒ సేఫ్ స్విమ్మింగ్ జోన్ ⇒ రాకీ ప్యాచ్ ⇒ 16 చోట్ల సిట్‌అవుట్ అంబ్రెల్లా విత్ రిక్లైనర్ ⇒ వాటర్ శాంప్లింగ్ పాయింట్ ⇒ ఏపీటీడీసీ ఫుడ్ కోర్టులు ⇒ ఏపీటీడీసీ బోటింగ్ కార్యాలయం ⇒ యాంఫిబియాస్ వీల్ చెయిర్లు ⇒ దేవాలయం ⇒ కమాండ్ కంట్రోల్ రూమ్ -
ఈ రోడ్డు చాలా ‘హైట్’ గురూ...
గ్యాంగ్‌టక్ : సిక్కింలోని కెరంగ్-జొడాంగ్ల మధ్య 18,600 అడుగుల ఎత్తులో 19 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెండో రహదారిగా నిలుస్తుంది. 2021కల్లా రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సరిహద్దు రోడ్ల సంస్థ (బీఆర్ఓ) అధికారి తెలిపారు. 2015లో మంజూరైన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం కొండలను తవ్వే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రోడ్డు 3.75 మీటర్ల వెడల్పు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతం టూరిజం పరంగా అభివృద్ధి చెందుతున్నందున సాధారణ పౌరులు తిరిగేందుకు కూడా ఆర్మీ అనుమతించే అవకాశం ఉందని తెలిపారు. -
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి
సాక్షి, పాల్వంచ(ఖమ్మం) : కిన్నెరసానిలో పర్యాటకులు సందడి చేశారు. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో సెలవు రోజు కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కిన్నెరసానికి ఒక్కరోజు రూ40,360 ఆదాయం లభించింది. పర్యాటకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కిన్నెరసాని పరిసరాల్లో ఆనందోత్సహాల నడుమ గడిపారు. డీర్ పార్కులోని దుప్పులను, నెమళ్లను, బాతులను, డ్యాం పైనుంచి జలశయాన్ని వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 808 మంది కిన్నెరసానిలోకి ప్రవేశించిడం ద్వారా వైల్డ్‌లైఫ్ చెక్‌పోస్టుకు రూ.22,240 ఆదాయం, 220 మంది పర్యాటకులు బోటు షికారు చేయడం ద్వారా రూ.18,120 ఆదాయం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థకు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
తాజ్ మహల్ ఒకప్పటి శివాలయమా!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రేమకు చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆగ్రాలోని తాజ్ మహల్‌ను ఉత్తరప్రదేశ్ పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తొలగించడం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజ్ మహల్‌ను తొలగించి ఆ స్థానంలో యోగి ఆదిత్యనాథ్ అధిపతిగా ఉన్న గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయాన్ని చేర్చిన విషయం తెల్సిందే. 2007లో నిర్వహించిన ఓ పోల్‌లో ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్ మహల్‌ను యోగి ఆదిత్యనాథ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే. మొఘల్ చక్రవరి షా జహాన్ దీన్ని నిర్మించడమే అందుకు కారణం. తాజ్ మహల్ భారతీయ సంస్కతిని ప్రతిబింబించడం లేదని, అనవసరంగా భారత ప్రభుత్వం దాన్ని పరిరక్షణకు, కొత్త గేట్ల ఏర్పాటుకు 22 లక్షల డాలర్లను తగిలేసిందని గత జూన్ నెలలో ఆదిత్యనాథ్ విమర్శించారు. గతంలో రాష్ట్రాన్ని సందర్శించే విదేశీ ప్రముఖలకు తాజ్ మహల్ చిహ్నాన్ని బహూకరించేవారని, తానొచ్చాక ఆ స్థానంలో రామాయణం, మహాభారతం పుస్తకాలను బహూకరించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టానని ఆయన చెప్పారు. ఇదే సంప్రదాయాన్ని పాటించాలని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తాజ్ మహల్‌ను తొలగించడాన్ని రాష్ట్ర బీజేపీ పార్టీ కూడా తీవ్రంగా సమర్థించింది. ‘హిందువులు ఏమి కోరుకుంటున్నారో మేము అదే చేస్తున్నాం’ అని బీజేపీ అధికార ప్రతినిధి అనిలా సింగ్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాజ్ మహల్‌కు విదేశీ సందర్శకుల రాక తగ్గుతూ వస్తోంది. ఒక్క 2012 సంవత్సరంలోనే తాజ్‌మహల్‌ను 7,43,000 విదేశీ పర్యాటకులు సందర్శించగా, అది 2015 సంవత్సరం నాటికి 4,80,000 విదేశీ పర్యాటకులకు పడిపోయింది. అంటే దీని ద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఏటా వస్తున్న కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయం పడిపోయిందన్నమాట. తాజ్ మహల్ సందర్శనకు విదేశీ పర్యాటకుల నుంచి ఒక్కరికి వెయ్యి రూపాయల చొప్పున, సార్క్ దేశాల ప్రజలకు 530 రూపాయలు, భారతీయులకు 40 రూపాయలు వసూలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు రాష్ట్ర పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తొలగించడం వల్ల మరింత ఆదాయం పడిపోయే ప్రమాదం ఉంది. మధ్య యుగాల చరిత్ర బీజేపీకిగానీ, దాని అనుబంధ హిందూ సంస్థలకుగానీ మింగుడు పడదు. అధికారంలోకి వస్తే తమకు అనుకూలంగా చరిత్రను పునర్ రచించడం దాని లక్ష్యం. రాజస్థాన్‌లో ఎక్కువకాలం అధికారంలో వున్న బీజేపీ ప్రభత్వుం అదే చేసింది. హల్దిఘటీ యుద్ధంలో అక్బర్ ఓడిపోయారని పిల్లల చరిత్ర పుస్తకాల్లో మార్పులు చేసింది. వాస్తవానికి ఆ యుద్ధంలో మహారాణా ప్రతాప్ ప్రాణ రక్షణ కోసం రణరంగం నుంచి పారిపోయారు. ప్రముఖ చరిత్రకారులు రాసిన పుస్తకాలను తిరిగేస్తే వాస్తవం ఏదో తెలసుకోవడం పెద్ద కష్టం కాదు. అన్ని మతాలు, అన్ని సిద్ధాంతాలు, అన్ని భావాలు, అన్ని తత్వాలు ఒక్కటేనని నమ్మిన అక్బర్‌ను 2016లో బీజేపీ హిట్లతో కూడా పోల్చింది. గ్రహాంతర వాసులుంటే మానవులు ఉనికిని చాటేందుకు భూమిపై ప్రసిద్ది చెందిన 115 కట్టడాల చిత్రాలతో 1977లో నాసా శాస్త్రజ్ఞులు వోయగర్ అంతరిక్ష నౌకను రోదసిలోకి పంపించారు. ఆ 115 చిత్రాల్లో తాజ్ మహల్‌కు కూడా చోటు లభించింది. గ్రహాంతరవాసులకు ఆ ఫొటోలు అంది తాజ్ మహల్ చూడడానికి వస్తే మాత్రం అది ఉండక పోవచ్చు. 17 శతాబ్దంలో నిర్మించిన తాజ్ మహల్‌ను ఒకప్పుడు ‘తేజో మహాలయ’ అని పిలిచే శివాలయమని కొన్ని హిందూత్వ సంస్థలు ఎప్పటి నుంచో వాదిస్తున్నాయి. రాముడి జన్మస్థలం అంటూ అయోధ్యలోని బాబ్రీమసీదును కూల్చివేసినట్లే శివాలయం అంటూ తాజ్ మహల్‌ను కూల్చివేసే ప్రమాదం లేకపోలేదని హేతువాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధికి ప్రణాళిక
రాజమహేంద్రవరం సిటీ : రాష్ట్రంలో రెలిజియస్ టూరిజం (ఆధ్యాత్మిక పర్యాటకం)ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అన్ని కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు రెలిజియస్ టూరిజం (దేవాదాయశాఖ) డైరెక్టర్ రత్నకుమార్ తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం దేవాదాయశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలకు ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం చేశామన్నారు. 400 ఏళ్ళ చరిత్ర కలిగిన దేవాలయాల సందర్శన, పూజలు సహా అన్ని ఏర్పాట్లతో ఆర్టీసీ బస్సులను సమకూరుస్తున్నామని, పంచారామ యాత్రకు దేశవ్యాపంగా ప్రాచుర్యం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ కనకదుర్గమ్మ, కొల్లేరుకోట పెద్దింట్లమ్మ, భీమవరం మావుళ్లమ్మ, పెద్దాపురం మరిడమ్మ, అనకాపల్లి నూకాంబిక, విశాఖపట్నం కనకమహాలక్ష్మి, విజయనగరం పైడితల్లి అమ్మవార్ల దేవస్థానాలకు కలుపుతూ ప్యాకేజీ, చేశామన్నారు. త్రిలింగ యాత్రగా శ్రీ«శైలం, శ్రీకాళహస్తి, దాక్షారామం, పిఠాపురం, ఒంటిమిట్ట, అమరావతి, మహానంది, అహోబిలం, తిరుపతి, మొదలగు ప్రాంతాలను సందర్శి«ంచేలా మరో ప్యాకేజీ సిద్దం చేశామన్నారు. విశాఖపట్నం నుంచి పూరి కళింగ కారిడార్ ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ పాల్గొన్నారు. -
అవినీతి బీటలు
పర్యాటక శాఖ పనుల్లో కానరాని నాణ్యత పగుళ్లు తీస్తున్న వసతిగృహ సముదాయం గోడలు రూ.కోటికి పైగా పక్కదారి పట్టినట్లు ఆరోపణలు పిఠాపురం : పర్యాటక శాఖ పనుల్లో అవినీతి బీటలు బయటపడుతున్నాయి. నిధులు మంజూరు చేసేది పర్యాటక శాఖ. పనులు జరిగేది దేవాదాయ శాఖ పరిధిలో. కానీ ఎవరికి వారే తమది కాదంటే తమది కాదంటూ తప్పించుకోవడం.. క్వాలిటీ కంట్రోల్ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో.. రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన నిర్మాణాలు నెలలు తిరగకుండానే నాణ్యత లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. టెంపుల్ టూరిజంలో భాగంగా పర్యాటక శాఖ పిఠాపురం పాదగయ క్షేత్రంలో భక్తులకు మౌలిక వసతులు మెరుగుపరచే పనులు చేపట్టింది. ఆలయాన్ని ఆనుకుని ఉన్న స్థలంలో రూ.1.77 కోట్లతో రిసెప్షన్, సమాచార కేంద్రం, భక్తులు వేచి ఉండే గదులు, హోటల్ తదితర సౌకర్యాలతో వసతిగృహ సముదాయం నిర్మించింది. ఇందులో 8 గదులు ఒక డార్మిటరీ ఉన్నాయి. 2013లో ప్రారంభించిన ఈ పనులు 2014లో పూర్తి కావాలి. కానీ 2015లో పూర్తి చేశారు. దీని నిర్మాణం జరిగిన స్థలం చెరువు గర్భం కావడంతో ఇక్కడ ఏ నిర్మాణం చేపట్టినా పునాది నుంచీ అత్యంత పటిష్టంగా చర్యలు తీసుకోవాలి. కానీ అలా జరగకపోవడంతో ఏడాది తిరగకుండానే గోడలు బీటలు వారుతున్నాయి. వసతిగృహ సముదాయంలో అన్ని సౌకర్యాలూ కల్పించాల్సి ఉండగా.. కేవలం గదులు మాత్రం నిర్మించి ఆలయ అధికారులకు పర్యాటక శాఖ అప్పగించింది. కరెంటు, మంచాలు, ఏసీలు, మంచినీరు, మోటార్లు తదితర సౌకర్యాలన్నింటినీ ఆలయ సొమ్ముతోనే ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఈ భవన నిర్మాణ వ్యయంలో సుమారు రూ.కోటి వరకూ నిధులు పక్కదారి పట్టాయని, అందువల్లనే నాణ్యత లోపించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. నిర్మించి ఏడాది కాకుండానే ఈ వసతిగృహ సముదాయంలో గదుల గోడలు బీటలు వారాయి. ఏ ఒక్క అధికారీ నాణ్యతను పరిశీలించకుండానే బిల్లులు చెల్లించడం పర్యాటక శాఖ పనుల్లో సర్వసాధారణం అయిపోయిందని, అందువల్లే ప్రతి నిర్మాణం ఇలా నాణ్యాతా లోపాలతో కొద్ది రోజుల్లోనే శిథిదిలావస్థకు చేరుకుంటోందని భక్తులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లోపంపై చర్యలు తీసుకుంటాం వసతిగృహ సముదాయం పనుల్లో నాణ్యత లోపాలపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. నాణ్యాత లోపాలుంటే చర్యలు తీసుకుంటాం. గోడలు బీటలు వారుతూంటే ఎటువంటి ప్రమాదాలూ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. – జి.శ్రీనివాస్, ఈఈ, పర్యాటక శాఖ -
వన టూరిజానికి ప్రభుత్వం సిద్ధం
కడియం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం స్థానికుల సహకారం కూడా అవసరం అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రత్యేకాధికారి భీమశంకరం నర్సరీ రైతులతో అవగాహన సమావేశం కడియం : కడియం ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే స్థానికుల సహకారం అవసరమని అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఎన్.భీమశంకరం అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధిపై కడియపులంక పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ నర్సరీలు విస్తరించి ఉన్న కడియం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందులో భాగంగా ఈ మండలంలోని పలు గ్రామాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చే స్తామని, పర్యాటకులను ఆకట్టుకునేలా వసతి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. నర్సరీల్లో వ్యూ పాయింట్స్, ధవళేశ్వరం నుంచి కడియపులంక వరకు బోట్ షికార్ వంటì వి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. పర్యాటకులు ఒకటì ,æరెండు రోజులు ఇక్కడే ఉండేలా వసతికి కూడా తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా అన్ని రోడ్లనూ ఆధునికీకరిస్తామని తెలిపారు. రోడ్ల వెంబడి ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని తహసీల్దార్ కె. రాజ్యలక్ష్మిని కోరారు. కడియపులంకలోని పర్యాటన అతిథి గృహానికి తక్షణం మరమ్మతులు చేయిస్తామన్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. కొంచెం ఎత్తులో వ్యూ∙పాయింట్లను నిర్మించాలని కలెక్టర్ చెప్పారన్నారు. వీలైనంత త్వరగా పది కాటేజీలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి హడావుడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేకంటే సమగ్ర ప్రణాళికతో ముందుకెళితే మంచిదని నర్సరీ రైతు మార్గాని గోవింద్ సూచించారు. ఆర్అండ్బీ, పంచాయతీ, విద్యుత్ తదితర శాఖల సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. కడియపులంక గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వారా రాము, కడియం నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా ఆంజనేయులు, పాటంశెట్టి సూర్యప్రకాశరావు, మార్గాని సత్యనారాయణ పలు సూచనలు చేశారు. ఎంపీడీవో ఎన్వీవీఎస్ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీఎంఐపీ పీడీ వై. సుబ్బారావు, నర్సరీ రైతు పల్లవెంకన్న పాల్గొన్నారు. అనంతరం స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి టూరిజం గెస్ట్‌హౌస్, చెరువులను భీమశంకరం పరిశీలించారు. -
విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీగా తీర్చిదిద్దుతాం: గంటా
విశాఖ : విశాఖను 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా తీర్చిదిద్దుతామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన సోమవారం ఉదయం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ పునరుద్ధరణ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉడా పార్క్ వద్ద మారథాన్ రన్‌ను మంత్రి గంటా ప్రారంభించారు. టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తోందని ఆయన తెలిపారు. విశాఖను ప్రపంచ స్థాయి పర్యాటక నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.