నాగార్జునసాగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేయడంతో పర్యాటక శాఖ నాగార్జునసాగర్ జలాశయంలో లాంచీలను నడుపుతోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ జలాశయంలో జాలీ ట్రిప్పులు మాత్రమే తిప్పుతోంది. నాగార్జునకొండ (ఆర్కియాలజీ మ్యూజియం) ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటంతో తెలంగాణ ఏర్పాటైన దగ్గరినుంచి ఫారెస్ట్ అధికారులు తెలంగాణ లాంచీలను నాగార్జునకొండకు అనుమతించలేదు.
ఇటీవల ఫారెస్ట్ అధికారులు తెలంగాణ లాంచీలు నాగార్జునకొండకు వెళ్లేందుకు అనుమతిచ్చినట్లు పర్యాటక అభివృద్ధిశాఖ ఎండీ మనోహర్‌రావు సోమవారం తెలిపారు. మ్యూజియం తెరుచుకుంటే లాంచీలను నాగార్జునకొండకు నడపనున్నట్లు వెల్లడించారు. నాగార్జునకొండకు వెళ్లడానికి పెద్దలకు టికెట్ ధర రూ.150, పిల్లలకు రూ.120లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment