నాగార్జునసాగర్–శ్రీశైలం, సోమశిల–శ్రీశైలం యాత్రలు ప్రారంభం
110 కిలోమీటర్ల మేర నదిలో ఆహ్లాదకర ప్రయాణం.. టికెట్ పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600
సాగర్ నుంచి ప్రారంభించిన నందికొండ మున్సిపల్ చైర్‌పర్సన్
నాగార్జునసాగర్/ కొల్లాపూర్ రూరల్: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంకు కృష్ణానదిలో ఒకేరోజు రెండు ప్రధాన కేంద్రాల నుంచి లాంచీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. నాగార్జున సాగర్ నుంచి ఒకటి, సోమశిల నుంచి మరొక లాంచీ సర్వీ స్‌ను శనివారం ప్రారంభించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో వీటిని నడుపుతున్నారు. కార్తీకమాసం తొలిరోజున శనివారం నాగార్జునసాగర్ నుంచి నందికొండ మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ జెండా ఊపి లాంచీని ప్రారంభించారు. నాగార్జున సాగర్ జలాశయంలో సరిపడా నీటి లభ్యత లేకపోవడం, కరోనా తదితర కారణాలతో ఐదు సంవత్సరాలుగా నాగా ర్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని నిలిపి వేశారు.
ఈ సంవత్సరం విస్తృతంగా వర్షాలు కురిసి నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో పర్యాటకశాఖ లాంచీ ప్రయాణాన్ని పునఃప్రారంభించింది. నదిలో సుమారు 110 కిలోమీటర్ల దూరం ఐదు గంటలపాటు ఈ లాంచీ ప్రయాణం కొనసాగుతుంది. లాంచీలో ప్రయాణి కులు నాగార్జునసాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ అందాలను వీక్షించేలా ప్రయాణం ఉంటుందని పర్యాటక శాఖ అధికా రులు తెలిపారు. మరోవైపు నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి కూడా శ్రీశైలం వరకు శనివారం లాంచీ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 110 మంది ప్రయాణికులు ప్రయాణించేలా ఏసీ లాంచీని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంవరకు లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ. 1,600 ధర నిర్ణయించారు. సోమశిల నుంచి శ్రీశైలంకు రాను పోను ప్రయాణ టికెట్ పెద్దలకు రూ.3 వేలు, పిల్లలకు 2,400గా నిర్ణయించారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఒక ట్రిప్పుకు మాత్రమే అయితే పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1,600గా టికెట్‌ను నిర్ణయించారు. తొలిరోజు సోమశిల నుంచి 50 మంది ప్రయాణించారు. నాగార్జునసాగర్ జలాశ యం నీటిమట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణి కుల రద్దీనిబట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నారు. కార్యక్రమంలో లాంచీ మేనేజర్ హరి, ఉద్యోగుల సంఘం నాయకులు నర్సింహ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment