Nagarjuna Sagar dam
-
సాగర్‌కు ‘బొల్లపల్లి’ గండి!
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద జలాలను కుడికాల్వ ద్వారా తరలించి గుంటూరు జిల్లాలో నిర్మించబోయే బొల్లపల్లి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తామని తాజాగా ఏపీ ప్రతిపాదించింది. ఇందుకోసం కుడికాల్వ(జవహర్ కాల్వ)ను 96.5 కి.మీ.ల వరకు వెడల్పు పెంచి అక్కడి నుంచి వరద జలాలను లిఫ్ట్ చేస్తామని ఏపీ చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణమే తమ వ్యతిరేకతను తెలపడంతోపాటు ఈ ప్రాజెక్టు చేపట్టే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గోదావరి, కృష్ణా బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి లేఖలు రాయనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని గోదావరి బోర్డుకు ఇప్పటికే ప్రభుత్వం లేఖ రాసింది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలింపు నాగార్జునసాగర్ కుడికాల్వ కింద ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.18 లక్షల ఎకరాలు, ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 10.39 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్‌కు 9 స్లూయిస్ గేట్లు ఉండగా, గేట్లన్నింటినీ 520 అడుగుల మేర పైకి లేపితే గరిష్టంగా 33,147 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోవచ్చు. ప్రస్తుతం కుడి కాల్వ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే ఉంది. హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంచకుండానే కుడికాల్వ సామర్థ్యాన్ని 33 వేల క్యూసెక్కులకు పెంచుకున్నా, 11 వేల క్యూసెక్కులను యథాతథంగా ఆయకట్టుకు సరఫరా చేసి మిగిలిన 22 వేల క్యూసెక్కులను బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించవచ్చని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 2019 నుంచి 2024 వరకు గడిచిన ఆరేళ్లలో ఏకంగా ఐదేళ్లు కృష్ణానదిలో మిగులు జలాల లభ్యత ఉందని, ప్రకాశం బరాజ్ నుంచి సముద్రంలోకి నీరు వృథాగా పోయిందని కేంద్రానికి తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నుంచి బొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటి తరలింపుతో పోల్చితే నాగార్జునసాగర్ నుంచి తరలిస్తేనే తక్కువ వ్యయం అవుతుందని స్పష్టం చేసింది. నీటి లభ్యత బాగా ఉన్న సమయాల్లో సాగర్ నుంచి (తమ వాటా) జలాలను తరలించి బొల్లపల్లి రిజర్వాయర్‌లో నిల్వ చేసుకుంటే వర్షాభావ సీజన్లలో క్యారీ ఓవర్ జలాలుగా వాడుకోగలమని తెలిపింది. కృష్ణా, గోదావరి పరీవాహకంలో చిట్టచివరి రాష్ట్రం కావడంతో తమకు రెండింటి మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. రెండు నదుల మిగులు జలాలను నిల్వ చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంటుందని తెలియజేసింది. నికర జలాల తరలింపునకే ! వరదల సమయంలో నాగార్జునసాగర్ నుంచి మిగులు జలాలను బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్టు ఏపీ పేర్కొంటున్నా, నికర జలాలను సైతం తరలించుకుంటుందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్‌లో సాగర్ కుడికాల్వ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాగార్జునసాగర్ నిర్వహణ తెలంగాణ పరిధిలో ఉండగా, ఏడాది కింద ఏపీ సగం ప్రాజెక్టును తన అధీనంలోకి తీసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటామని కేంద్రం ప్రతిపాదించగా, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. మళ్లీ తాజాగా సాగర్‌ను బొల్లపల్లి రిజర్వాయర్‌తో అనుసంధానం చేయాలని ఏపీ ప్రతిపాదించడంతో భవిష్యత్‌లో సాగర్ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 8.1 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా, గోదావరి నుంచి ఏకకాలంలో తరలింపు గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును మూడు విభాగాల్లో (సెగ్మెంట్స్) వి భజించి ఏపీ ప్రతిపాదించింది. తొలి విభా గం కింద పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 17,500 నుంచి 38,000 క్యూసెక్కులకు, తాడిçపూడి ఎత్తిపోతల పథకం కాల్వ సామర్థ్యాన్ని 1,400 నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచనుంది. అనంతరం పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ రెండు కాల్వల ద్వారా నీటిని సమాంతరంగా తరలించి బుడమేరు డైవర్షన్ కెనాల్లోకి వేసి అక్కడి నుంచి కృష్ణా నదిలోకి విడుదల చేస్తామని ఏపీ తెలిపింది.రెండో సెగ్మెంట్ కింద కృష్ణాన ది నుంచి 28,000 క్యూసెక్కులను ఆరు దశల్లో మొత్తం 127 మీటర్లు లిప్ట్ చేసి బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించనుంది. ఇందుకోసం 150 టీఎంసీల భారీ సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ఏపీ ప్రతిపాదించింది. భవిష్యత్ అవసరాల ను తీర్చడానికి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 400 టీఎంసీలకు పెంచే వీలుందని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా నా గార్జునసాగర్ కుడికాల్వ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని మరో లింక్‌ను ప్రతిపాదించింది. ఇక మూడో సెగ్మెంట్ కింద బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 3 దశల్లో లిఫ్ట్ చేసి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని పేర్కొంది.ప్రాజెక్టు వ్యయం రూ.80 వేల కోట్లురోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలను తరలించడానికి ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 40,500 ఎకరాల భూసేకరణ, 17,000 ఎకరాల అటవీ భూములు కావాలి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,112 కోట్లు కాగా, లిఫ్టుల నిర్వహణకు 4,125 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. -
సీఆర్పీఎఫ్ బలగాలు వెళ్లాయి.. తిరిగి వచ్చాయి!
నాగార్జునసాగర్: గత సంవత్సర కాలంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతను పర్యవేక్షిస్తూ విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలు శనివారం ఉదయం విధుల నుంచి తప్పుకుని వెళ్లిపోయి.. తిరిగి సాయంత్రం విధుల్లో చేరాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2013 నవంబర్ 29న నాగార్జునసాగర్ డ్యాంపై ఆంధ్రా పోలీస్ బలగాలు సగం ప్రాజెక్టును స్వా«దీనంలోకి తీసుకున్నాయి. దీంతో కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశాల మేరకు అదే సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ నుంచి కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్ ప్రాజెక్టును తమ అ«దీనంలోకి తీసుకొని భద్రతా విధులు నిర్వహిస్తున్నాయి. సాగర్‌డ్యాంపై తెలంగాణ వైపు, ఆంధ్రా ప్రాంతంవైపు రెండు పక్కలా సీఆర్పీఎఫ్ దళాలు విధులు నిర్వహిస్తూ వచ్చాయి.అయితే, అకస్మాత్తుగా శనివారం తెల్లవారుజామున తెలంగాణ వైపు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు తమ విధులను ఉపసంహరించుకొని హిల్‌కాలనీలోని బాలవిహార్లోగల తమ క్యాంపులను ఖాళీ చేసి వెళ్లి పోయాయి. ఆంధ్రా వైపు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు యథావిధిగానే ఉన్నాయి. దీంతో తెలంగాణవైపు ప్రధాన డ్యాంపై స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) బలగాలు డ్యాంను తమ అ«దీనంలోకి తీసుకొని విధులు నిర్వహించాయి. శనివారం తెల్లవారుజామున వెళ్లిపోయిన సీఆర్పీఎఫ్ బలగాలు తిరిగి సాయంత్రానికి సాగర్‌లోని తమ క్యాంపులకు చేరుకొని నాగార్జునసాగర్ డ్యాం భద్రతా విధులలో చేరాయి.ఆంధ్రా వైపు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు అదేవిధంగా ఉండటంతో.. తెలంగాణ వైపు సీఆర్పీఎఫ్ బలగాలు తిరిగి సాగర్ ప్రాజెక్టు విధి నిర్వహణకు వచి్చనట్లుగా తెలుస్తోంది. సాగర్ ప్రాజెక్టు ఉన్నతాధికారులు ఎవరూ దీనిపై సమాధానం చెప్పడం లేదు. సాయంత్రం తిరిగి చార్జ్ తీసుకున్న సీఆర్పీఎఫ్ దళాల అసిస్టెంట్ కమాండర్ షహేర్ మాట్లాడుతూ శనివారం తెల్లవారుజామున విధులను ఉపసంహరించుకొని వెళ్లిపోయామని, తిరిగి ఉన్నతాధికారుల ఆదేశాలతో తెలంగాణ వైపు చార్జి తీసుకున్నట్లుగా తెలిపారు. సరైన ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందన్నారు. -
తెలుగువారి జీవధారకు 69 వసంతాలు
విజయపురిసౌత్: నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రేపటితో 69 ఏళ్లు నిండుతాయి. ఆనాడు నెహ్రూ కన్న కలలను నిజం చేస్తూ కోట్లాది మంది ప్రజలకు జీవనాధారంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అన్నపూర్ణగా ఆధునిక దేవాలయంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు విరాజిల్లుతోంది. 1955 డిసెంబర్ 10న ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ఈనాడు నాగార్జున సాగరానికి నేనిక్కడ జరిపే శంకుస్థాపనను పవిత్రకార్యంగా పరిగణిస్తున్నాను. ఇది భారత ప్రజాసౌభాగ్య మందిరానికి జరుగుతున్న శంకుస్థాపన. ఈనాడు మనం ఆసేతుహిమాచల పర్యంతం నిర్మించుకుంటున్న నవదేవాలయాలకు ఇది చిహ్నం’ అని అన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో మానవశక్తితో నిర్మితమైన ప్రాజెక్టు నాగార్జునసాగర్. సాగునీటి కోసం కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. కుడికాలువను జవహర్ కాలువగా, ఎడమకాలువను లాల్‌బహదూర్ కాలువగా పిలుస్తారు. జవహర్ కాలువ సాగర్ రిజర్వాయర్ నుంచి ఆనకట్టకు కుడివైపు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కాలువ పనులను అప్పటి ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1956 అక్టోబర్ 10న ప్రారంభించారు. దక్షిణ విజయపురి (రైట్‌బ్యాంకు) వద్ద ఈ కాలువ సొరంగ మార్గం ద్వారా ప్రారంభమై 392 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11లక్షల 74వేల 874 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. రిజర్వాయర్ ఎడమవైపు నుంచి ప్రారంభమయ్యే కాలువకే లాల్‌బహదూర్ కెనాల్ అని పేరు. ఈ కాలువ పొట్టిచెలమ నుంచి చలకుర్తి వరకు సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఈ కాలువ నిర్మాణాన్ని ఆనాటి గవర్నర్ భీమ్సేన్ సచార్ 1959లో ప్రారంభించారు. ఈ కాలువ పొడవు 349కిలోమీటర్లు. ఈ కాలువ కింద 10 లక్షల 37వేల 796 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. రిజర్వాయర్ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు కుడికాలువలాగే ఈ కాలువకు కూడా నీటిని విడుదల చేయవచ్చు. సాగర్ ప్రాజెక్టు ఒకసారి నిండితే ప్రభుత్వానికి 20 వేల కోట్ల రూపాయలకు పైచిలుకు ఆదాయం వస్తుందని అంచనా. 1967 ఆగస్టు 4న నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలకు నీటిని వదిలారు. సాగర్ జలాశయం విస్తీర్ణం,110 చదరపు మైళ్లుగరిష్ట నీటిమట్టం 590 అడుగులుడెడ్ స్టోరేజి లెవల్ 490 అడుగులునీటి నిల్వ 408.24 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 312.0. టీఎంసీలు)డెడ్స్టోరేజినీరు 179.16 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 168 టీఎంసీలు)నీటివిడుదలకు కనీస నీటిమట్టం 510 అడుగులు -
మాకు ‘సాగర్’ పగ్గాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ పగ్గాలను తమకే అప్పగించాలని తెలంగాణ చేస్తున్న డిమాండ్‌తోపాటు ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై చర్చించడానికి డిసెంబర్ 3న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనున్న 19వ సమావేశం ఎజెండాలో మొత్తం 24 కీలక అంశాలను కృష్ణాబోర్డు చేర్చడంతో వీటిపై వాడీవేడీ చర్చ జరగనుంది. బోర్డు చైర్మన్, కన్వీనర్‌తోపాటు ఏపీ, తెలంగాణ అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ డిమాండ్లు ‘ఆనకట్టల భద్రత చట్టం 2021లోని సెక్షన్ 16(1ఏ) ప్రకారం నాగార్జునసాగర్ భద్రతకి సంబంధించిన నిఘా, 16(1బీ) ప్రకారంతనిఖీలు, 16(1సీ) ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకే వస్తాయి. యావత్ జలాశయం కార్యకలాపాలన్నింటినీ తెలంగాణకే అప్పగించాలి. ఈ విషయంలో ఏపీ జోక్యానికి, తెలంగాణ విధుల ఆక్రమణకు తావులేదు. కృష్ణా బోర్డు సూచనల మేరకు రాష్ట్ర విభజన నాటి నుంచి సాగర్ డ్యామ్, కుడి, ఎడమ కాల్వల రెగ్యులేటర్ల నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ చేతిలో ఉండగా, గతేడాది నవంబర్ 28న ఏపీ అధీనంలోకి తీసుకుంది. కుడికాల్వ రెగ్యులేటర్ నుంచి నీళ్లను విడుదల చేసింది. ఈ ఘటనకు పూర్వ స్థితిగతులను పునరుద్ధరించాలని కేంద్ర హోంశాఖ 2023 డిసెంబర్ 1న ఏపీని ఆదేశించింది’అనే అంశాలను తెలంగాణ సూచనల మేరకు ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచింది. నో అన్న ‘అపెక్స్’.. మళ్లీ బోర్డుకు పంచాయతీ కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటా నుంచి ఏపీ, తెలంగాణకు పంపకాలు జరగలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2015లో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో 2015–16 అవసరాల కోసం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలికంగా కేటాయించారు. 2016–17లో సైతం ఇదే కేటాయింపులను కొనసాగించాలని 2016లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. దీని ఆధారంగానే 2017–18లో ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని 2017లో కృష్ణా బోర్డు నిర్ణయించింది. 2021–22 వరకూ దీన్నే కొనసాగించారు. 2022–23లో దీని కొనసాగింపును తెలంగాణ వ్యతిరేకించింది. 50:50 నిష్పత్తిలో పంపిణీ జరపాలని తెలంగాణ కోరగా, 66:34 నిష్పత్తిలోనే కొనసాగించాలని ఏపీ పట్టుబట్టింది. తాత్కాలిక కోటాపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని కోరుతూ వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖకు కృష్ణా బోర్డు రెఫర్ చేయగా, అపెక్స్ కౌన్సిల్ నీటి పంపకాల జోలికి వెళ్లదని జలశక్తి శాఖ చెప్పింది. దీంతో వివాదం మళ్లీ కృష్ణా బోర్డుకు చేరింది. ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచిన అంశాలివీ.. » కృష్ణా బోర్డు కార్యాలయం ఏపీకి తరలింపు. » గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించాలి. » ఇరు రాష్ట్రాల్లోని అనధికార ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలి. » రెండో విడతలో 9 టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధుల కేటాయింపు. తెలంగాణ ఇతర డిమాండ్లు » తాము వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో పొదుపు చేసిన తమ వాటా జలాలను తదుపరి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలి. » సాగర్ టెయిల్‌పాండ్ నుంచి విద్యుదుత్పత్తి ద్వారా ఏపీజెన్కో అనధికారికంగా 4 టీఎంసీలను విడుదల చేసింది. ఇప్పటికే కృష్ణా డెల్టాకు ఏపీ 117 టీఎంసీలను విడుదల చేసింది. ఇకపై టెయిల్‌పాండ్ విద్యుత్ కేంద్రం నుంచి వరదలున్నప్పుడే నీళ్లు విడుదల చేయాలి. సాగర్ టెయిల్‌పాండ్ డ్యామ్ గేట్ల నిర్వహణనూ తెలంగాణకే అప్పగించాలి. » ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణకు ఏపీ అడ్డుపడుతుండటంతో తమ వాటా జలాలను తీసుకోలేకపోతున్నాం. కృష్ణా ట్రిబ్యునల్–2 నీటి కేటా యింపులు జరిపే వరకు ఆర్డీఎస్ కుడికాల్వ పనులను కొనసాగించే అధికారం ఏపీకి లేదు. » ఏపీ నీటి వినియోగాన్ని లెక్కించడానికి శ్రీశైలం, సాగర్, ప్రకాశం, సుంకేశుల బరాజ్‌ల వద్ద టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. » రాయలసీమ ఎత్తిపోతలతో సహా అనుమతుల్లేకుండా కృష్ణా బేసిన్లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎంసీ కాల్వ లైనింగ్ పనులను నిలుపుదల చేయాలి. » శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, తెలుగు గంగ, హెచ్ఎన్ఎస్, నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ఇతర మార్గాల ద్వారా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏపీ చేపట్టరాదు. » శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్‌కి ఏపీ అత్యవసర మరమ్మతుల నిర్వహించాలి. -
తెలుగు రాష్ట్రాలమధ్య మరోసారి జల వివాదం.. నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత
సాక్షి,నల్లగొండజిల్లా: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం తలెత్తింది. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారుల మధ్య మళ్లీ ఘర్షణ చోటు చేసుకుంది. నాగార్జునసాగర్ మీటర్ రీడింగ్ కోసం వెళ్లిన తెలంగాణ అధికారుల బృందాన్ని ఏపీ ఇరిగేషన్ అధికారులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది.రైట్ కెనాల్ వద్ద మీకేం పనంటూ తెలంగాణ అధికారులను ఆంధ్రప్రదేశ్ అధికారులు అడ్డుకున్నారు.ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది. ఏపీ అధికారుల తీరుపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. కాగా, గత ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ, తెలంగాణ మధ్య జల ఘర్షణలు జరిగాయి. దీంతో ఏపీ, తెలంగాణల్లో రెండు వైపులా ఆయా ప్రభుత్వాలు భారీగా పోలీసులను మోహరించాయి. ఇదీ చదవండి: మరో విద్యుత్ ఉద్యమానికి సిద్ధం -
శ్రీశైలం, సాగర్‌ను ఖాళీ చేస్తారా?
సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో విద్యుదుత్పత్తిని నిలిపేసి, జలాలను సంరక్షించాలన్న తమ ఆదేశాలను ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఉల్లంఘించడంపై కృష్ణా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాలపై చర్యలకు ఉపక్రమించింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో పోటీ పడి విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయాలను ఖాళీ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల నీటి పారుదల అధికారులతో మళ్లీ రిజర్వాయర్ నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ద్వారా శుక్రవారం ఈ సమావేశం నిర్వహిస్తామని బోర్డు సభ్యులు ఆర్ఎన్ శంఖ్వా ఇరు రాష్ట్రాలకు లేఖ రాయగా.. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తితో వాయిదా వేశారు. ఈ నెల 25 తర్వాత సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.ఏడాది తర్వాత ఆర్ఎంసీ సమావేశంశ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలపై సరైన పర్యవేక్షణ, జల విద్యుత్ కేంద్రాల నిర్వహణకు మార్గదర్శకాలను ఖరారు చేయడం ఆర్ఎంసీ ప్రధాన ఉద్దేశం. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించిన ముసాయిదా నిబంధనలను పరిశీలించి, అవసరమైన సవరణలతో తుదిరూపు ఇవ్వడం, జలాశయాలన్నీ నిండిన తర్వాత రెండు రాష్ట్రాలు జరిపే మిగులు జలాల వినియోగాన్ని లెక్కిల్లోకి తీసుకోకుండా మినహాయింపు కల్పించడంపైనా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కూడా కృష్ణా బోర్డు ఆర్ఎంసీని కోరింది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆర్ఎంసీ పలు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు. మళ్లీ ఏడాదికి పైగా విరామం తర్వాత కృష్ణా బోర్డు ఆర్ఎంసీ సమావేశాన్ని తలపెట్టడం గమనార్హం.21న కృష్ణా బోర్డు సమావేశంకృష్ణా బోర్డు 19వ సర్వ సభ్య సమావేశం ఈ నెల 21న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వర రావు, తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ జి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య తాత్కాలిక కృష్ణా జలాల సర్దుబాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు. -
లాంచీ సర్వీసుల లాంచింగ్
నాగార్జునసాగర్/ కొల్లాపూర్ రూరల్: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంకు కృష్ణానదిలో ఒకేరోజు రెండు ప్రధాన కేంద్రాల నుంచి లాంచీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. నాగార్జున సాగర్ నుంచి ఒకటి, సోమశిల నుంచి మరొక లాంచీ సర్వీ స్ను శనివారం ప్రారంభించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో వీటిని నడుపుతున్నారు. కార్తీకమాసం తొలిరోజున శనివారం నాగార్జునసాగర్ నుంచి నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ జెండా ఊపి లాంచీని ప్రారంభించారు. నాగార్జున సాగర్ జలాశయంలో సరిపడా నీటి లభ్యత లేకపోవడం, కరోనా తదితర కారణాలతో ఐదు సంవత్సరాలుగా నాగా ర్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని నిలిపి వేశారు. ఈ సంవత్సరం విస్తృతంగా వర్షాలు కురిసి నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో పర్యాటకశాఖ లాంచీ ప్రయాణాన్ని పునఃప్రారంభించింది. నదిలో సుమారు 110 కిలోమీటర్ల దూరం ఐదు గంటలపాటు ఈ లాంచీ ప్రయాణం కొనసాగుతుంది. లాంచీలో ప్రయాణి కులు నాగార్జునసాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ అందాలను వీక్షించేలా ప్రయాణం ఉంటుందని పర్యాటక శాఖ అధికా రులు తెలిపారు. మరోవైపు నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి కూడా శ్రీశైలం వరకు శనివారం లాంచీ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 110 మంది ప్రయాణికులు ప్రయాణించేలా ఏసీ లాంచీని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంవరకు లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ. 1,600 ధర నిర్ణయించారు. సోమశిల నుంచి శ్రీశైలంకు రాను పోను ప్రయాణ టికెట్ పెద్దలకు రూ.3 వేలు, పిల్లలకు 2,400గా నిర్ణయించారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఒక ట్రిప్పుకు మాత్రమే అయితే పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1,600గా టికెట్‌ను నిర్ణయించారు. తొలిరోజు సోమశిల నుంచి 50 మంది ప్రయాణించారు. నాగార్జునసాగర్ జలాశ యం నీటిమట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణి కుల రద్దీనిబట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నారు. కార్యక్రమంలో లాంచీ మేనేజర్ హరి, ఉద్యోగుల సంఘం నాయకులు నర్సింహ పాల్గొన్నారు. -
శ్రీశైలం 4 క్రస్ట్ గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/తాడేపల్లిరూరల్: శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు పెరుగుతుండటంతో గురువారం 4 రేడియల్ క్రస్ట్‌గేట్లను తెరచి 1,12,300 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. గురువారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,89,328 క్యూసెక్కుల వరద శ్రీశైలంకు వచ్చి చేరుతోంది. బుధవారం నుండి గురువారం వరకు బుధవారం నుండి గురువారం వరకు ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి శ్రీశైలంకు 1,27,093 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. కుడిగట్టు కేంద్రంలో 15.213 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.744 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 215.8070 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం పూర్తిస్థాయి 885 అడుగులకు చేరుకుంది. సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగటంతో నాగార్జున సాగర్ జలాశయం నుంచి గురువారం 20 రేడియల్ క్రస్ట్‌గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 2,10,149 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌లో 20 క్రస్ట్‌గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 1,62,000 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 28,826 క్యూసెక్కులు మొత్తం 1,90,826 క్యూసెక్కులు దిగువకి విడుదల చేస్తున్నారు. కుడి,ఎడమ కాలువలు, ఎస్ఎల్బీసీ, వరద కాలువల ద్వారా 19,323క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో బ్యారేజి రిజర్వాయర్‌లో 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ 30 గేట్లను 1 అడుగు మేర ఎత్తి దిగువకు 21 వేల 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
నిండుకుండలా నాగార్జున సాగర్.. 18 గేట్లు ఎత్తివేత
-
శ్రీశైలంలో 4, సాగర్‌లో 16
నాగార్జునసాగర్, దోమలపెంట: వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో నాలుగు గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా 1,11,932 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో జూరాల నుంచి స్పిల్‌వే ద్వారా 82,940 క్యూసెక్కులు, విద్యుదు త్పత్తి చేస్తూ 35,524, సుంకేసుల నుంచి 72,114, హంద్రీ నుంచి 250 మొత్తం 1,90,828 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,900 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 31,139 మొత్తం 68,039 క్యూసెక్కుల నీరు అదనంగా సాగర్‌కు విడుదలవుతున్నాయి. ప్రస్తు తం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.7 అడుగుల వద్ద 213.8824 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా 8,000 క్యూసెక్కులు, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ ఎస్ఎస్కు 1,561, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో శనివారం అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 16 గేట్లను ఐదడుగులు పైకి ఎత్తి స్పిల్‌వే మీదుగా 1,29,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం 590 అడుగుల గరిష్ట నీటిమట్టంతో ఉంది. ప్రస్తుతం సాగర్ జలాశయానికి 1,74,120 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ప్రధాన విద్యుదుత్పా దన కేంద్రం ద్వారా 29,435 క్యూసెక్కులు, క్రస్ట్‌గేట్ల నుంచి 1,29,600 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వ లకు, ఏఎమ్మార్పీ, వరద కాల్వలకు 15,085 క్యూసె క్కుల నీరు వదులుతున్నారు. మొత్తం సాగర్ నుంచి 1,74,120 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. -
నాగార్జునసాగర్ విద్యుత్ కేంద్రాన్ని పరిశీలనుంచనున్న జపాన్ నిపుణులు
-
బయటపడ్డ నాగార్జునసాగర్ జెన్ కో అధికారుల నిర్లక్ష్యం
-
నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తికి భారీ అంతరాయం
సాక్షి, నల్లగొండ జిల్లా: జెన్కో అధికారుల తీరుతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి భారీ అంతరాయం ఏర్పడింది. ఎనిమిది యూనిట్లలో కేవలం ఏడింటిలోనే విద్యుదుత్పత్తి జరుగుతోంది. రెండో యూనిట్ పనిచేయడం లేదు. ఏడాది క్రితం రెండో యూనిట్ రోటర్ స్పైడర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. అయినా నేటికి మరమ్మతులు చేయించకపోవడంతో రెండున్నర నెలలుగా విద్యుదుత్పత్తికి అంతరాయం కలుగుతోంది. మొత్తం ఎనిమిది యూనిట్లలో ఒక్కో యూనిట్లో ప్రతి రోజూ 100 మెగా వాట్ల ఉత్పత్తి జరుగుతుంది. 75 రోజులుగా సాగర్‌లో ఉత్పత్తి కొనసాగుతుండగా.. ఒక్కో రోజు 100 మెగా వాట్ల చొప్పున 750 మెగా వాట్ల నష్టం వాటిల్లుతోంది. అయినా మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సాగర్ ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జపాన్ నుంచి సాంకేతిక పరికరాలు రావాలని అధికారులు సమాధానం చెప్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. -
కట్టుకున్నోడే కాలయముడయ్యాడు
మిర్యాలగూడ అర్బన్: నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో గల్లంతై మృతిచెందిన అంగన్వాడీ టీచర్‌ను ఆమె భర్తే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్యపై అనుమానంతోనే ఆమెను తన భర్త కాల్వలో తోసేసి ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మిర్యాలగూడ డీఎస్పీ కె. రాజశేఖరరాజు బుధవారం విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన పేరబోయిన సైదులు పదిహేనేళ్ల క్రితం మిర్యాలగూడ పట్టణానికి చెందిన అనూష(35)ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అనూష వేములపల్లి మండలం రావువారిగూడెంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు కామేపల్లి గ్రామంలో ఇన్చార్జి అంగన్వాడీ టీచర్‌గా బాధ్యతలు అప్పగించడంతో అక్కడ కూడా పనిచేస్తుంది. సైదులు కామన్ సర్వీస్ సెంటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొన్నేళ్లుగా అనూషపై అనుమానం పెంచుకున్న సైదులు ఆమెను వేధిస్తుండేవాడు. దీంతో అనూష కుటుంబ సభ్యులు పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ నిర్వహించి సైదులుకు నచ్చజెప్పినప్పటికీ అతడిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆమైపె మరింత అనుమానం పెంచుకున్నాడు. ఈ నెల 5వ తేదీన తనను కామేపల్లి గ్రామంలో దించి రావాలని అనూష సైదులును అడగగా.. ఆమెను సైదులు అక్కడ దించి తిరిగి ఇంటికి వచ్చాడు. అక్కడ స్కూల్ ముగిసిన తర్వాత తిరిగి తనను తీసుకెళ్లాలని సైదులుకు అనూష ఫోన్ చేసింది. ఎలాగైనా అనూషను హతమార్చాలని పథకం పన్నిన సైదులు తనకు లేటవుతుందని అక్కడే కొద్ది సమయం వేచి చూడమని భార్యకు చెప్పాడు. చీకటి పడిన తర్వాత కామేపల్లికి చేరుకున్న సైదులు అనూషను బైక్‌పై ఎక్కించుకుని రావులపెంట గ్రామ శివారులో గల నాగార్జునసాగర్ ఎడమ కాల్వ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లాడు. బైక్ ఆపి అనూషను తీవ్రంగా కొట్టి కాల్వలోకి తోసేశాడు. ఆ తర్వాత బైక్‌ను కాలువలోకి తోసి తాను కూడా కాలువలో దూకి ఈదుకుంటూ బయటకు వచ్చాడు. ప్రమాదవశాత్తు బైక్‌తో పాటు కాల్వలో పడిపోయామని, తన భార్య గల్లంతైందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. మృతురాలి తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి సైదులును అదుపులోకి తీసుకుని విచారించగా తానే కాల్వలోకి తోసేసినట్లు నిజం ఒప్పుకున్నాడు. కాల్వలో గల్లంతైన అనూష మృతదేహం మంగళవారం గరిడేపల్లి మండలం పొనుగోడు రిజర్వాయర్ పక్కనే చిన్న చెరువులో కనిపించడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సైదులును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ కాలువ గండిని పూడ్చడం చేతకాదా?: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండు తున్నా 22 రోజులుగా నాగార్జున సాగర్ కాలువకు పడిన గండిని పూడ్చ డం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావ డం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. కృష్ణా నది నిండుకుండలా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొలాలను ఎండ బెడుతోందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగే శ్వరరావు గండి పడిన కాలువ పక్క నుంచే వెళ్తున్నా మరమ్మతులు జరగడం లేదని ఎద్దేవా చేశారు.దీంతో ‘సీఎంను క్షమించు.. రైతులను రక్షించు’అంటూ భద్రాచలం సీతారామచంద్ర స్వామిని వేడుకుంటున్నామని హరీశ్‌రావు అన్నా రు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింత ప్రభా కర్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ తరఫున త్వరలో ఖమ్మం జిల్లాలో పర్యటించి రైతులకు మనోధైర్యం కల్పిస్తామన్నారు.రైతులతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు..‘పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియో జకవర్గాల్లో రైతులు పార్టీలకు అతీతంగా నాగా ర్జునసాగర్ ప్రాజెక్టు ఆఫీసులను ముట్టడిస్తూ ధర్నాలు చేస్తున్నారు. ఆకాశాన్ని దించుతాం, సూర్యుడిని వంచుతాం అనే డైలాగులు కొడు తున్న రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులకు కాలువ గండి పూడ్చటం చేతకావడం లేదా. 3 లక్షల ఎకరాలు ఎండుతున్నా కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చి వేతలు తప్ప పూడ్చివేత రాదా? వరదల్లో కొట్టు కుపోయిన పంటలకు నష్టం పరిహారం ఇవ్వకుండా రైతులతో కన్నీళ్లు పెట్టిస్తోంది’అని హరీశ్‌రావు మండిపడ్డారు.‘వరదల కారణంగా సాగర్ పరీవాహక ప్రాంతంలో 60 వేల ఎకరాలు, కాంగ్రెస్ నిర్వాకంతో లక్ష ఎకరాలు నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా. ఇప్పుడు కాంగ్రెస్ సర్కా రు నీళ్లిచ్చినా పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. పంటలను కాపాడుకునేందుకు రైతులు జనరే టర్లు, డిజిల్, ట్రాక్టర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వరదల్లో నష్టపోయిన వారికి ఇస్తున్న పరిహారం రూ.10 వేలు ఏ మూలకూ సరిపోవడం లేదు’అని అన్నారు. రాష్ట్రంలో గూండాయిజం పెరిగి, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రెండు వేల అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయని హరీశ్ పేర్కొన్నారు. -
నిలకడగా గోదావరి
పోలవరం రూరల్/ధవళేశ్వరం/విజయపురిసౌత్: గోదావరి నది ప్రవాహం శనివారం నిలకడగా సాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 31.790 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 8.15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజ్ నుంచి డెల్టా కాలువలకు 12,700 క్యూసెక్కులు విడుదల చేస్తూ, మిగిలిన 7,81,839 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి కృష్ణాజలాల విడుదలశ్రీశైలం నుంచి వచ్చే కృష్ణాజలాలు పెరగటంతో శనివారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి కృష్ణానదిలోకి 32,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 77,496 క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్ కుడికాలువ ద్వారా 10 వేల క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 3,667, ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 29,029, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు, వరదకాల్వకు 600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. -
ఎడమ కాలువకు ఎన్ని తూట్లో..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం చెరువు వద్ద దాదాపు 100 మీటర్ల పొడవున నాగార్జునసాగర్ ఎడమ కాలువ దెబ్బతింది. అందులో సగం వరకు కట్ట కోతకు గురైంది. భారీగా ప్రవాహం వస్తే ఎప్పుడు కట్ట తెగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని ముప్పారం 30/2వ కిలోమీటర్ వద్ద 50 మీటర్ల వరకు ఎడమ కాలువ లైనింగ్ పోయి ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు తెగిపోతుందో తెలియదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితారామచంద్రపురం వద్ద కుంగిపోయిన వెంపలబోడు తూము. అధిక ప్రవాహం వస్తే ఎప్పుడు తూము తెగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ దుస్థితికి ఇవి కేవలం మూడు ఉదాహరణలు మాత్రమే. నల్లగొండ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం జిల్లా వరకు 172 కిలోమీటర్ల పొడవున అనేక చోట్ల ఇలాంటి ప్రమాదకర పరిస్థితులే నెలకొన్నాయి. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంది. 2022లో నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం వద్ద ఎడమ కాలువకు గండిపడటంతో వందల ఎకరాల్లో పంటలు పాడైపోయి రైతులు నష్టాలపాలయ్యారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు 25 రోజులపాటు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పంటలకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. నిర్లక్ష్యం కారణంగానే మళ్లీ గండ్లు ఎడమ కాలువకు నిడమనూరు వద్ద గండి పడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం ఆ ప్రాంతంలో మాత్రమే గండిపూడ్చి వదిలేసింది. నీటిపారుదల శాఖ కాలువ పొడవునా లైనింగ్ దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలని రూ.44 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదు. 2009లో ప్రపంచ బ్యాంకు ని«ధులు రూ.4,444 కోట్లతో ఎడమ, కుడి కాలువల ఆధునీకరణ (లైనింగ్, మరమ్మతులు) పనులు చేపట్టారు. అందులో ఎడమ కాలువ పనులను చేపట్టినా చాలావరకు పూర్తి చేయకుండా వదిలేశారు. దీంతో అవి మరింతగా దెబ్బతిన్నాయి.ఈనెల 1వ తేదీన నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రంగులవంతెన వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పాలేరు వెనుక జలాల కారణంగా గండ్లు పడ్డాయి. రెండు చోట్ల 50 నుంచి 70 మీటర్ల పొడవునా కాలువ కట్ట కొట్టుకుపోయింది. పాలేరు వాగు నీటితోపాటు ఈ కాలువ నీరు కలిసి నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం, వల్లాపురం, అనంతగిరి మండలం చనుపల్లి, పాలారం, కిష్టాపురం, కొత్తగూడెం, గోండ్రియాల, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మందడి నర్సయ్యగూడెం, చీతిలితండా, రాజపేట, ఈశ్వరమాదారం గ్రామాలను నీరు ముంచెత్తింది. వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పొంచి ఉన్న ప్రమాదం ఎడమ కాలువ పొడవునా పలుచోట్ల లైనింగ్, కోతకు గురైన కాలువ కట్టలతో ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యాద్గార్పల్లి మేజర్ పరిధిలోని మిర్యాలగూడ మండలం ఐలాపురం, వేములపల్లి మండలంలోని అన్నపరెడ్డిగూడెం మధ్య దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవునా లైనింగ్ దెబ్బతింది. నడిగూడెం మండలం రామాపురం, చాకిరాల, సిరిపురం, కాగితరామచంద్రాపురం గ్రామాల సమీపాన కాలువ కట్టలు దెబ్బతిన్నాయి.నిడమనూరు మండలంలోని 32/2 వద్ద కాల్వ కరకట్ట లైనింగ్ పూర్తిగా తొలగిపోయి మట్టి పూర్తిగా కాల్వలోకి జారి ప్రమాదకరంగా మారింది. ముప్పారం బ్రిడ్జి వెంట లైనింగ్ పూర్తిగా ధ్వంసమై కట్ట బలహీనంగా మారింది. 30/4 కిలో మీటర్ వద్ద కాల్వ లైనింగ్ పూర్తిగా ధ్వంసమైంది. 29/6 కిలోమీటర్ వద్ద గుంటికగూడెం మేజర్ కాల్వ తూముకు ఇరువైపులా కాల్వ కట్ట లైనింగ్ పాడైపోయింది. ముకుందాపురం–దుగ్గెపల్లి బ్రిడ్జి వెంట లైనింగ్ పూర్తిగా దెబ్బతింది. గరిడేపల్లి మండలం వెలిదండ సమీపంలో ఎడమ కాలువ కట్ట దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో కాలువ నీటిని వాగులు, చెరువుల్లోకి మళ్లించే ఎస్కేప్ కెనాల్స్ (నీటిని మళ్లించేవి)ను పట్టించుకోకపోవడం, పైగా వాటిని ఓపెన్ చేయరాకుండా వెల్డింగ్ చేసి పెట్టడంతో గండ్లు పడుతున్నాయి. -
పోటెత్తిన కృష్ణమ్మ: సాగర్ డ్యామ్‌కు పర్యాటకుల క్యూ (ఫొటోలు)
-
పోటెత్తిన కృష్ణమ్మ
విజయపురి సౌత్/శ్రీశైలం ప్రాజెక్ట్/అచ్చంపేట/సత్రశాల (రెంటచింతల): కృష్ణా నది పోటెత్తి ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి వరద దిగువకు ఉధృతంగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదను బట్టి సాగర్ జలాశయం నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు.శ్రీశైలం జలాశయం నుంచి ఆదివారం సాయంత్రం 10 క్రస్ట్‌గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 4,06,242 క్యూసెక్కులు.. కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 68,063 క్యూసెక్కులు కలిపి 4,74,205 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 4,20,280 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. క్రస్ట్ గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 4,97,524 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 12,261 క్యూసెక్కులు కలిపి దిగువ కృష్ణాలోకి 5,09,785 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లాంచీలు నిలిపివేతఎగువ నుంచి వరద తీవ్రత ఎక్కువగా ఉండటం, ఈదురు గాలులకు అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటంతో నాగార్జున కొండకు వెళ్లే లాంచీలను శని, ఆదివారాలు నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నిరాశకు గురయ్యారు. వరద ఉధృతి తగ్గి, గాలులు తగ్గితే లాంచీలను నడుపుతామని, పర్యాటకుల భద్రత దృష్ట్యా లాంచీలను నిలిపి వేసినట్లు లాంచీ యూనిట్ అధికారులు తెలిపారు.పులిచింతలకు భారీగా వరద నీరుఎగువ నుంచి 6,36,945 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 6.75 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు మొత్తం 24 క్రస్ట్ గేట్లు ఉండగా 21 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 41.98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల వద్ద నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా 5,69,744 క్యూసెక్కులను దిగువ ఉన్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేసినట్టు ప్రాజెక్టు ఏడీఈ ఎన్.జయశంకర్, ఏఈ జయపాల్ ఆదివారం తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు టెయిల్ పాండ్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా ఆదివారం విడుదల చేసిన 5,69,744 క్యూసెక్కుల వరద నీరే అత్యధికం. నీటిమట్టం 73.55 మీటర్లకు చేరుకోవడంతో టెయిల్ పాండ్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.ప్రకాశం బ్యారేజీ గేట్లు పూర్తిగా ఎత్తివేతరెండో ప్రమాద హెచ్చరిక జారీతాడేపల్లి రూరల్/అమరావతి: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఆదివారం రాత్రి ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రి 11 గంటలకు 10,25,776 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. మొత్తం గేట్లు ఎత్తి అదేస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలోని గెస్ట్హౌస్లలోకి వరదనీరు చొచ్చుకువచ్చింది.ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి కొండవీటి వాగు ఎక్స్క్లూయిస్ వద్దకు వరద నీరు వచ్చి చేరడంతో మత్స్యకారులు తమ పడవలను రేవుపై వరద నీటిలోనే భద్రపర్చుకున్నారు. దిగువ ప్రాంతంలో పుష్కర ఘాట్ల వద్ద వరద ఉధృతి పెరగడంతో మత్స్యకారులు తమ పడవలను పుష్కరఘాట్లపైనే వదిలేశారు. మహానాడు మసీదు రోడ్డులో కొన్ని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ఎంటీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు తాడేపల్లి ఇన్చార్జి తహశీల్దార్ సతీష్‌కుమార్ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ.. గుండిమెడ నుంచి కృష్ణా నది కరకట్టవైపు ప్రయాణించడంతో పొలాల్లోకి నీరు చొచ్చుకు వచ్చింది. వరద ఉధృతి పెరిగితే ప్రాతూరు, గుండిమెడ పొలాలు నీట మునుగుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది లంక పొలాల్లో పశువుల కాపరులు తమ పశువులను బయటకు తీసుకువచ్చారు. మంగళగిరి మండలం రామచంద్రాపురం, దుగ్గిరాల మండల పరిధిలోని వీర్లపాలెం, పెదకొండూరు, గొడవర్రు తదితర ప్రాంతాల్లో కృష్ణా నది పొంగిపొర్లడంతో కరకట్ట లోపల వున్న పంట పొలాలు మునిగిపోయాయి. పుట్టలమ్మ తల్లి ఆలయం చుట్టూ వరద నీరు చేరడంతో లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. -
మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట/నాగార్జునసాగర్/కడెం: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ మళ్లీ పోటెత్తింది. ఎగువన ఆల్మట్టి నుంచి ప్రకాశం బరాజ్ వరకు పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకి భీకర వరద పోటెత్తింది. శనివారం సాయంత్రం 6 గంటలకు వరద ప్రవాహం 4,10,581 క్యూసెక్కులకు పెరగడంతో 212.38 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 8 గేట్లను 12 అడుగులు, మరో 2 గేట్లను 10 అడుగుల మేరకు పైకెత్తి 3,12,390 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు.కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,227 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 37,882 క్యూసెక్కులు కలిపి మొత్తం 68,109 క్యూసెక్కులను విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. ఇంకా పోతిరెడ్డిపాడు ద్వారా 25,000, హంద్రీ నీవా ద్వారా 1,688, కల్వకుర్తి లిఫ్టు ద్వారా 2,400 క్యూసెక్కులు కలిపి కాల్వకు మొత్తం 29,088 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం అవుట్‌ఫ్లోలు 4,09,587 క్యూసెక్కులకు పెరిగాయి. సాగర్ 26 గేట్లు ఎత్తివేత..దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 3,87,653 క్యూసె క్కుల వరద వచ్చి చేరుతుండగా, 308.76 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ వచ్చిన వరదను వచ్చినట్టు వదిలేస్తున్నారు. సాగ ర్ 20 గేట్లను 10 అడుగుల మేర, మరో 6 గేట్లను 5 అడుగు లమేర పైకెత్తి 3,43,810 క్యూసె క్కులను కిందికి విడుదల చేస్తున్నారు. ప్రధాన విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా మరో 29,313 క్యూసెక్కుల ను కిందికి విడుదల చేస్తున్నారు. కుడికాల్వకు 5,496, ఎడమ కాల్వకు 6,634, ఏఎంఆర్పీకి 1,800, ఎల్ఎల్సీకి 600 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో సాగర్ నుంచి మొత్తం అవుట్‌ఫ్లోలు 3,87,653 క్యూసెక్కు లకు పెరిగాయి.దీంతో దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 2,70,349 క్యూసెక్కుల వరద వస్తుండగా, 3,10,395 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. పులిచింతలకు దిగువన నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఈ ప్రవాహానికి తోడు కావడంతో ప్రకాశం బరాజ్‌కి వరద ఉధృతి పెరిగింది. బరాజ్‌కి 3,31,829 క్యూసెక్కులు వస్తుండగా, గేట్లు ఎత్తి 3,18,160 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 184 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. ఆల్మట్టికి భారీ వరద..పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువన కృష్ణా ప్రధాన పాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆల్మట్టిలోకి వస్తున్న 1.75 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది వచ్చినట్టే కిందికి విడుదల చేస్తున్నారు. దాని దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 1.85 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.78 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో జూరాల ప్రాజెక్టులోకి వరద భారీగా పెరిగింది. జూరాల ప్రాజెక్టులోకి 3.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ, గేట్లు ఎత్తి 3.27 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో నిలకడగా వరద కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 34,983 క్యూసెక్కులు చేరు తుండటంతో నీటి నిల్వ 94.55 టీఎంసీలకు చేరుకుంది.అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఉత్తమ్భారీ నుంచి అతిభారీ వర్షాలు కురు స్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలోని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎవరూ హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని, సెలవులు తీసుకోరాదని సూచించారు. జలాశయాలు, చెరువుల వద్ద వరద పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.కడెం ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేతఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు శనివారం 22,696 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఏడు వరద గేట్లు ఎత్తి 57,821 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. -
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు పెరుగుతున్న వరద
-
శ్రీశైలం, సాగర్ జలాశయాల గేట్లు మూసివేత
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: ఎగువ నుంచి వరద తగ్గిపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల గేట్లను సోమవారం సాయంత్రం మూసివేశారు. కృష్ణా బేసిన్లో వర్షం తగ్గడంతో జూరాలలో గేట్లను మూసివేయడంతోపాటు విద్యుత్ ఉత్పాదనను కూడా నిలిపివేశారు. తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో సుంకేసుల బ్యారేజీకి ఓవర్‌ఫ్లో ప్రవాహం పెరిగింది. సుంకేసుల నుంచి శ్రీశైలానికి 77,598 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ ప్రవాహంతోపాటు దిగువకు విడుదలవుతున్న నీరు, డ్యాం గరిష్టస్థాయి నీటిమట్టాన్ని బేరీజు వేసుకుని ఇంజనీర్లు శ్రీశైలం గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం సమయానికి డ్యాం నీటిమట్టం 881.20 అడుగులు కాగా, 194.3069 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. అదేవిధంగా నాగార్జునసాగర్ జలాశయంలో 588.80 అడుగులు నీటిమట్టంతో 308.4658 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 47,035 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి మళ్లీ సాగర్ రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తే అవకాశం ఉంటుంది.‘తుంగభద్ర గేటుకు వెంటనేమరమ్మతులు చేయాలి’ సాక్షి, అమరావతి: తుంగభద్ర ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాలు, సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేశాయి. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఏపీ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కే ప్రభాకరరెడ్డి, కౌలు రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు సోమవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి నీరంతా వృథాగా పోతుండడంతో ఈ రెండు జిల్లాల్లోని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. -
నాగార్జున సాగర్ వద్ద హీరోయిన్ లయ సందడి (ఫొటోలు)
-
1989 టీఎంసీలు కడలిపాలు
సాక్షి, హైదరాబాద్: గలగలా గోదారి.. బిరబిరా కృష్ణమ్మ కడలి వైపు కదిలిపోతున్నాయి. ఇప్పటికే 1,903 టీఎంసీల గోదావరి, 86 టీఎంసీల కృష్ణా జలాలు కలిపి మొత్తం 1989 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరి, కృష్ణాలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది.ఎగువ గోదావరి పరీవాహకంలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ వరద రాకపోవడంతో నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టులు సగం కూడా నిండలేదు. కృష్ణాలో ఆల్మట్టి నుంచి ప్రకాశం బరాజ్ వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో 10 రోజులుగా వచ్చిన వరదను వచ్చినట్టు సముద్రంలోకి వదిలివేస్తున్నారు. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం(తెలంగాణ) నుంచి అంతర్వేది(ఏపీ) వరకూ పరీవాహకంలోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండడంతో వస్తున్న వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వర్షాల్లేక వరద తగ్గుముఖం..గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి వంటి ఉప నదులు, వాగులు, వంకల్లో ప్రవాహం తగ్గింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 47.25 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 3,583 క్యూసెక్కుల వరద వచ్చింది వచ్చినట్టు కాల్వలకు విడుదల చేస్తున్నారు. గోదావరికి ప్రాణహిత వరద తోడుకావడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌కు 2,89,710 క్యూసెక్కులు, తుపాకులగూడెం(సమ్మక్క) బరాజ్ నుంచి 4,48,810 క్యూసెక్కులు, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్) బరాజ్ నుంచి 4,61,484 క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచ్చినట్టు దిగువన వదులుతున్నారు. ⇒ పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటినిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. కాళేశ్వరం లింక్–2లో భాగంగా నీటిని ఎత్తిపోయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.82 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 5,676 క్యూసె క్కులు ఉండగా, 3,602 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉంది. ఎగువ కృష్ణాలో తగ్గిన వరదకృష్ణా పరీవాహకంలో ఎగువన వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 15,000, నారాయణపూర్ నుంచి 6,000, జూరాల ప్రాజెక్టు నుంచి 82,339 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 2,84,791 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆ నీటిని దిగువన ఉన్న సాగర్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి దిగువకు 1,04,424 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.సాగర్ ఎనిమిది గేట్ల ద్వారా నీటి విడుదలనాగార్జునసాగర్/దోమలపెంట : శ్రీశైలం నుంచి వచ్చే వరద తగ్గడంతో నాగార్జునసాగర్ వద్ద కొన్ని గేట్లు మూసివేశారు. శనివారం సాయంత్రం 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా.. ఆదివారం ఉదయానికి 16 గేట్లకు తగ్గించారు. మధ్యాహ్నానికి 14, 10 గేట్లకు తగ్గిస్తూ సాయంత్రానికి ఎనిమిది గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. పర్యాటకులతో ఆదివారం నాగార్జునసాగర్ జనసంద్రంగా మారింది. సెలవు దినం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు.సొంతవాహనాల్లో తరలిరావడంతో డ్యాం దిగువన కృష్ణాతీరం వెంట గల రోడ్లన్నీ కిటకిటలాడాయి. శ్రీశైలం నుంచి వరద వస్తుందనే సాకుతో ఆదివారం కూడా తెలంగాణ వైపు లాంచీలను నిలిపివేశారు. దీంతో పర్యాటకులు చాలామంది నిరాశతో వెళ్లారు. కొంతమంది మాత్రం రైట్ బ్యాంకు వెళ్లి అక్కడి నుంచి లాంచీల్లో నాగార్జునకొండకు వెళ్లారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఆదివారం శ్రీశైలం ఆనకట్ట వద్ద ఆరు గేట్లు పైకెత్తి నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. -
సాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, నల్గొండ జిల్లా: నాగార్జున సాగర్‌కు పర్యాటకుల తాకిడి పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాజెక్ట్ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దీంతో సాగర్ పరిసర ప్రాంతాదలు కిటకిటలాడాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో రోగి, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. వారం రోజులుగా ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. మరోవైపు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్యామ్ వద్ద సీఆర్పీఎఫ్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ నాయకుల సిఫార్సు ఉన్నవారిని మాత్రమే డ్యామ్ పైకి పంపుతున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. -
నాగార్జునసాగర్ జల సవ్వడి.. సందడి చేస్తున్న సందర్శకులు (ఫొటోలు)
-
సుంకిశాలపై మాటల యుద్దం.. కేటీఆర్‌కు భట్టి కౌంటర్
సాక్షి, ఖమ్మం: సుంకిశాల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కేటీఆర్‌కు కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్ట్‌లు కూలిపోతే మా ప్రభుత్వానికి ఎలా బాధ్యత అవుతుందని భట్టి ప్రశ్నించారు.కాగా, తాజాగా భట్టి విక్రమార్క ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాళేశ్వరం, సుంకిశాల కట్టింది బీఆర్ఎస్ పార్టీనే. ప్రాజెక్ట్‌లు మీరే కట్టారు కాబట్టి.. అవి కూలితే మీదే బాధ్యత. మా ప్రభుత్వంలో కట్టడాలపై మాది బాధ్యత అవుతుంది. సాగర్‌లోకి నీళ్లు రాకుండా ఉంటాయా?. మేము ఎందుకు దాచిపెడతాము. మేడిగడ్డ కరెక్ట్ కాదిన మేము ముందే చెప్పాం. మీరు కట్టిన ప్రాజెక్ట్‌లు క్వాలిటీ లేకుండా అవినీతితో కట్టారు. రాష్ట్రంలో మిగతా ప్రాజెక్ట్‌లు కూడా చెక్ చేయాల్సి అవసరం ఉంది. ప్రాజెక్ట్‌ల విషయంలో జరిగిన తప్పులను కేటీఆర్, బీఆర్ఎస్ ఒప్పుకుని ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రాజెక్ట్‌లో ఇంజినీర్లు చేయాల్సిన పని మీరు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.ఇక, సుంకిశాల విషయంలో అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు గోడకూలిపోవడం హైదరాబాద్ నగర ప్రజలకు విషాద వార్త. ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు ఘటన జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా లేక విషయం కప్పిపెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ తెలియకపోతే ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. త్వరత్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. సుంకిశాలలో ప్రభుత్వ నిర్వహణ లోపంతో గోడ కూలింది. హైదరాబాద్‌కు తాగునీరు ఇవ్వాలని సుంకిశాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ప్రారంభించాం. గత దశాబ్దంగా హైదరాబాద్ విస్తరించింది. సాగు నీటికి ఇబ్బంది లేదని రైతుల్లో విశ్వాసం కల్పించిన తర్వాతే సుంకిశాల ప్రారంభించాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాం. రాబోయే 50 ఏళ్లలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా శరవేగంగా నిర్మాణం చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి విషయం లేదు. మున్సిపల్ శాఖలో పాలన పడకేసింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
‘సుంకిశాల’ ప్రాజెక్టు ఘటన ఎందుకు దాచారు?: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: నాగార్జునసాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు గోడకూలిపోవడం హైదరాబాద్ నగర ప్రజలకు విషాద వార్త అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కేటీఆర్ అన్నారు. శుక్రవారం(ఆగస్టు9) తెలంగాణభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు ఘటన జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా లేక విషయం కప్పిపెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ తెలియకపోతే ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. త్వరత్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. మునిసిపల్ శాఖ తనవద్దే పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. మేడిగడ్డలో ఏమైనా జరిగితే కేంద్రం స్పందిస్తుందని, ఇప్పుడు బీజేపీ ఏం చెబుతుందని కేటీఆర్ నిలదీశారు. మేడిగడ్డ ఘటను ఎన్నికలున్నప్పటికీ తాము దాచలేదని గుర్తు చేశారు. రాజధాని హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని విమర్శించారు. ఏ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానివి దివాళాకోరు విధానాలని, చిల్లర విమర్శలని ఫైర్ అయ్యారు. ‘రాష్ట్ర ప్రజల కోట్లాది రూపాయల సంపద నీట మునిగింది. సుంకిశాలలో ప్రభుత్వ నిర్వహణ లోపంతో గోడ కూలింది. హైదరాబాద్‌కు తాగునీరు ఇవ్వాలని సుంకిశాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ప్రారంభించాం. గత దశాబ్దంగా హైదరాబాద్ విస్తరించింది. సాగు నీటికి ఇబ్బంది లేదని రైతుల్లో విశ్వాసం కల్పించిన తర్వాతే సుంకిశాల ప్రారంభించాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాం. రాబోయే 50 ఏళ్లలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా శరవేగంగా నిర్మాణం చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి విషయం లేదు. మున్సిపల్ శాఖలో పాలన పడకేసింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేయాలని వేగంగా పనులు చేశాం. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభించలేదు. నెత్తిమీద నీళ్ళు జల్లుకొని భట్టి, తుమ్మల యాక్టింగ్ చేస్తుండవచ్చు’అని కేటీఆర్ చురకంటించారు. -
నాగార్జున సాగర్ 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు
-
సాగర్ 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళు
నాగార్జునసాగర్/దోమలపెంట: కృష్ణా ఎగువ నుంచి భారీస్థాయిలో నాగార్జునసాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది.దీంతో గురు వారం ప్రాజెక్టు మొత్తం 26 రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తారు. గేట్ల ద్వారా 2,67,906 క్యూసెక్కులు, ప్రధాన విద్యుదుతాμదన కేంద్రం ద్వారా 28,501 క్యూసెక్కులు.. మొత్తంగా 2,96,407 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.నాగార్జునసాగర్ గరిష్టస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు(312.5050 టీఎంసీలు). కాగా ప్రస్తుతం 586.00 అడుగుల( 300.3200 టీఎంసీల) నీటి నిల్వలున్నాయి. 15 ఏళ్లలో 11సార్లు తెరుచుకున్న మొత్తం గేట్లు ఈ పదిహేను సంవత్సరాల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్‌గేట్లు 11సార్లు తెరుచుకు న్నాయి. 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2019, 2020, 2021, 2022, 2024 సంవత్సరాల్లో 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత కూడా 2.5లక్షల క్యూసెక్కులు వరద వస్తే కచ్చితంగా 26 గేట్లు తెరవాల్సిందేనని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టును చూడటానికి వచిన సందర్శకులు● శ్రీశైలం జలాశయానికి వరద మళ్లీ కాస్త పెరిగింది. జూరాల ప్రాజెక్టుకు 3,15,000 ఇన్‌ఫ్లో ఉండగా.. 45 గేట్లు ఎత్తి సిμల్వే ద్వారా 3,13,065 క్యూసెక్కులు, విద్యుదుతμత్తి ద్వారా 19,774 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సుంకేశుల నుంచి మరో 58,227 క్యూసెక్కులతో మొత్తం 3,91,066 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తుంది. దీంతో పది గేట్లు ఎత్తి 3,08,480 క్యూసెక్కులు,విద్యుదుతμత్తి ద్వారా 65,410 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలగా, సాగర్‌కు చేరుతోంది. -
పరవళ్లు తొక్కుతున్న నాగార్జున సాగర్.. పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
కడలి వైపు కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: కడలి వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి బుధవారం సా.6 గంటలకు 1లక్షా 51వేల క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 13,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు.. మిగులుగా ఉన్న 1,37,450 క్యూసెక్కులను 50 గేట్లను మూడు అడుగులు, 20 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్‌లోకి గురువారం కూడా ఇదే రీతిలో వరద కొనసాగనుంది.మరోవైపు.. నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3.74 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ఇక్కడ 37.10 టీఎంసీలను నిల్వచేస్తూ దిగువకు 1.06 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.32 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 882.8 అడుగుల్లో 203.42 టీఎంసీలు నిల్వచేస్తూ పది గేట్లు ఎత్తి, విద్యుదుత్పత్తి చేస్తూ 4.03 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 3.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 584.6 అడుగుల్లో 296.28 టీఎంసీలు నిల్వచేస్తూ గేట్లు ఎత్తి, ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 2.70 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆ రెండింటి నుంచి దిగువకు రెండు లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 59 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 103.74 టీఎంసీలు నిల్వచేస్తూ 60 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ఈ నేపథ్యంలో.. గురువారం కూడా శ్రీశైలంలోకి వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగనుంది. మరోవైపు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పత్తి, పెసర, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. స్వల్పంగా పెరుగుతున్న గోదావరి..ఇదిలా ఉంటే.. గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాలతో ఉప నదుల నీరు, కొండవాగుల నీరు క్రమేపీ నదిలోకి చేరుతుండటంతో వరద ఉధృతి పెరుగుతోంది. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 30.800 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 6.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా గోదావరి వరద పెరుగుతూ 35.3 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వరద మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాగులు పొంగి ప్రవహిస్తున్నందున చింతూరు మండలంలో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీఆర్‌పురం మండలంలో అన్నవరం వాగు పొంగి వరదనీరు రహదారి పైనుండి ఉధృతంగా ప్రవహించింది. వరినాట్లు నిమిత్తం అవతలి పక్కకు వెళ్లిన వ్యవసాయ కూలీలు తిరుగుమార్గంలో ప్రాణాలకు తెగించి వాగును దాటారు. -
నాగార్జున సాగర్ అందాలు.. పర్యాటకుల సందడే సందడి (ఫొటోలు)
-
సాగర్ నుంచి 3.54 లక్షల క్యూసెక్కులు దిగువకు..
నాగార్జునసాగర్/దోమలపెంట/సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి భారీగా వరద నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం రాత్రి 20 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు మంగళవారం ఉదయం మరో రెండు గేట్లు తెరిచి మొత్తం 22 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు సాగర్ నీటిమట్టం 585.40 అడుగుల వద్ద నిల్వ సామర్థ్యం 298.5890కు చేరడంతో ఆరు గేట్లను ఐదు అడుగుల మేర, 16 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి దిగువకు 2,70,920 క్యూసెక్కుల నీరు వదిలారు.మధ్యాహ్నం 2 గంటలకు వరద మరింత పెరగడంతో 22 గేట్లను పది అడుగుల పైకెత్తి 3,09276 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాయంత్రం 6 గంటలకు ఇన్‌ఫ్లో 3,14,594 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 3,54,663కు పెంచారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుతం 585.10 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం జలాశయంలో 297.7235 టీఎంసీల నీరు ఉంది. మరోవైపు శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు నీటి విడుదల కొనసాగుతోంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 3,11,790 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.కుడి, ఎడమ కాల్వలకు నీటి పెంపు..సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని పెంచారు. కుడి కాల్వకు 8,144 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎడమ కాల్వకు 8,193 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఏఎమ్మార్పీకి 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. చెరువులు నింపేందుకు వరద కాల్వకు 400 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా అనుముల మండలం మారేపల్లి వద్ద కాల్వకు గండి పడటంతో మంగళవారం ఉదయం వరద కాల్వకు నీటిని నిలిపేశారు. మరోవైపు ఏఎమ్మారీ్పతో పరిధితోపాటు ఆయకట్టు ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులు, కుంటలు వాగులు ఎండిన నేపథ్యంలో ఏఎమ్మార్పీ కాల్వలకు నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని రైతులు కోరుతున్నారు.పులిచింతల నుంచి 1.08 లక్షల క్యూసెక్కులు విడుదలపులిచింతల ప్రాజెక్టు సగం నిండిపోవడం.. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పులిచింతలలోకి 3,71,605 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. ప్రాజెక్టులో 157.48 అడుగుల్లో 22.75 టీఎంసీలను నిల్వ చేస్తూ గేట్లు ఎత్తి దిగువకు 1,08,895 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. పులిచింతల నుంచి భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేస్తుండటంతో.. బుధవారం ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న జలాలను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేయనున్నారు. -
పులిచింతల గేట్ల ఎత్తివేత
సాక్షి, అమరావతి/అచ్చంపేట /విజయపురిసౌత్ /శ్రీశైలం ప్రాజెక్ట్ : నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలు పెద్ద మొత్తంలో వస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టు సగం నిండింది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పులిచింతల గేట్లు ఎత్తి, ప్రకాశం బ్యారేజికి నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పులిచింతలలోకి 3,71,605 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. ప్రాజెక్టులో 157.48 అడుగుల్లో 22.75 టీఎంసీలను నిల్వ చేస్తూ దిగువకు 1,08,895 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. ఇక్కడ మంగళవారం ఉదయం 6 గంటలకు 10.65 టీఎంసీలున్న నిల్వ సాయంత్రం 6 గంటలకు 22.74 టీంసీలకు చేరింది. అంటే 12 గంటల్లోనే 12 టీఎంసీలకు పైగా జలాలు ప్రాజెక్టులోకి వచ్చాయి. సాగర్ నుంచి వరద కొనసాగుతుండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజి గేట్లు కూడా బుధవారం ఎత్తివేయనున్నారు. బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న జలాలను సముద్రంలోకి వదిలేయనున్నారు. సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీటి పెంపు సాగర్ ఆయకట్టుకు నీరందించే కుడి ఎడమ కాల్వలకు నీటిని పెంచారు. కుడి కాల్వకు 8,144 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,193 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలోకి 3.71 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 3.71 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 883.2 అడుగుల్లో 205.66 టీఎంసీలను నిల్వ చేస్తూ.. పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి, కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 3.72 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, మల్యాల ఎత్తిపోతలకు 254 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2.400 క్యూసెక్కులు వదిలారు. సాగర్‌లోకి 3.14 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 585.10 అడుగుల్లో 297.72 టీఎంసీలను నిల్వ చేస్తూ 22 గేట్లను పది అడుగుల మేర ఎత్తి, ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 3.36 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. -
నిరసనల ధాటికి రాజీనామా చేసి.. బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు చేరిన ప్రధాని షేక్ హసీనా..
-
సాగర్ నుంచి కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్/శ్రీశైలం ప్రాజెక్ట్: పులిచింతల ప్రాజెక్టుదిశగా కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. నాగార్జున సాగర్‌లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒక్కో గేటు ఎత్తుతూ రాత్రి 9.30 సమయంలో మొత్తం 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,20,064 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 28,907 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మొత్తం 1,48,971 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సాగర్ నుంచి దిగువకు విడుదల చేసే నీటి పరిమాణం గంట గంటకూ పెంచుతుండటంతో పులిచింతలలోకి చేరుతున్న వరద క్రమేణా పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 30,388 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా అవసరాల కోసం 4 గేట్లు ఎత్తి 26,083 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీకి తరలిస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 6.72 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో మరో రెండ్రోజుల్లో పులిచింతల ప్రాజెక్టు కూడా నిండనుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,44,218 క్యూసెక్కులు చేరుతుండగా.. 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,10,840 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 26,481, కుడి విద్యుత్ కేంద్రం నుంచి 37,857 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఎగువన కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం కొంతమేర తగ్గింది. ఆ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాలను నింపుతూ దిగువకు 1,89,700 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో భీమాపై నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు నిండిపోవడంతో గేట్లు ఎత్తి దిగువకు 1,27,705 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక తుంగభద్రలో వరద ప్రవాహం కొంత తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 82 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. ఖాళీ ప్రదేశాన్ని నింపుతూ దిగువకు 50 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం కూడా ఇదే రీతిలో వరద కొనసాగనుంది.నిలకడగా గోదావరిపోలవరం రూరల్: గోదావరి వరద నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరు క్రమేపీ తగ్గుతుండటంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 31.320 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 7.26 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. భద్రాచలం వద్ద 35.80 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. టెయిల్ పాండ్ నుంచి 1,32,411 క్యూసెక్కులుసత్రశాల (రెంటచింతల): పల్నాడు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల వద్ద కృష్ణా నదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రెండు యూనిట్లు, ఆరు క్రస్ట్‌గేట్లు ద్వారా మొత్తం 1,32,411 క్యూసెక్కులను పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు ఏడీ ఎన్.జయశంకర్, ఏఈ జయపాల్ సోమవారం తెలిపారు. ఎగువనున్న నాగార్జున సాగర్ నుంచి టైల్‌పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్‌కు 1,32,794 క్యూసెక్కులు వరదనీరు వస్తోందన్నారు. -
కృష్ణమ్మ పరవళ్లతో జలసవ్వడి.. సాగర్‌కు పోటెత్తిన సందర్శకులు (ఫొటోలు)
-
6 గేట్లు ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు
-
నాగార్జునసాగర్ గేట్లు ఓపెన్
-
నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
సాక్షి, నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో సోమవారం అధికారులు ఆరు గేట్లు ఓపెన్ చేశారు. అంతకుముందు ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైరన్ వేశారు. ఆరు గేట్లను ఐదు ఫీట్ల ఎత్తువరకు ఇరిగేషన్ అధికారులు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఒక్కో గేటు నుంచి 5-10 వేల క్యూసెక్కుల నీటీని విడుదల అవుతోంది.Nagarjuna Sagar Project under the Krishna River, 6 flood Gates opened and Released Water. today in Nalgonda District, Telangana State pic.twitter.com/XhtZnMCrhL— K. N. Hari (@KNHari9) August 5, 2024 శ్రీశైలం నుంచి సారగ్లోకి వరద పోటెత్తుతోంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ఇప్పటికే 580 అడగుల వరకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు నాగార్జునసాగర్‌లోకి 3,22,817 క్యూసెక్కుల నీరు చేరుతుండగా. కుడి, ఎడమ కాలువల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ 37,873 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటినిల్వ 576.1 అడుగుల్లో 271.9 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 312.05 టీఎంసీలు కాగా మరో 41 టీఎంసీలు చేరితే సాగర్ పూర్తిగా నిండిపోతుంది. నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న భారీ వరద6 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదలఇన్ ఫ్లో: 323748 క్యూసెక్కులుఅవుట్ ఫ్లో: 83331 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం: 590.00 అడుగులుప్రస్తుత నీటి మట్టం: 582.60 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.5050 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 290.5140 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి -
కాసేపట్లో నాగార్జునసాగర్ గేట్లు తెరవనున్న అధికారులు
-
ఆంధ్రప్రదేశ్‌లో ముఠాల పాలన... రాష్ట్రం రాజకీయ హింసకు మారుపేరుగా మారింది...
-
నేడు సాగర్ గేట్లు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్/నాగార్జునసాగర్/దోమలపెంట: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు నాగార్జునసాగర్‌లోకి 3,22,817 క్యూసెక్కుల నీరు చేరుతుండగా. కుడి, ఎడమ కాలువల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ 37,873 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటినిల్వ 576.1 అడుగుల్లో 271.9 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు.. పూర్తి నీటినిల్వ 312.05 టీఎంసీలు. మరో 41 టీఎంసీలు చేరితే సాగర్ పూర్తిగా నిండిపోతుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో సోమవారం సాయంత్రానికి సాగర్‌లో నీటినిల్వ గరిష్టస్థాయికి చేరుకుంటుంది. ఆపరేషన్ ప్రొటోకాల్ ప్రకారం దానికంటే ముందే గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 8 గంటలకు నాగార్జునసాగర్ గేట్లు పైకి ఎత్తి సుమారు 2లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తామని డ్యాం ఎస్ఈ వీపీఎస్.నాగేశ్వర్రావు ఆదివారం మధ్యాహ్నం ప్రకటించారు. సాగర్‌కు దిగువన ఉన్న నల్లగొండ, సూర్యాపేట, గుంటూరు, నర్సారావుపేట జిల్లాల్లోని కృష్ణానది తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు హెచ్చరిక జారీ చేశారు. సుంకేశుల, అటు జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,87,451 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 882.9 అడుగుల్లో 203.89 టీఎంసీలను నిల్వ చేస్తూ.. పదిగేట్లు 15 అడుగుల మేర ఎత్తి 3,69,250 క్యూసెక్కులు, కుడి కేంద్రంలో 23,146, ఎడమ కేంద్రంలో 35,315 క్యూసెక్కులను వినియోగిస్తూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. వెరసి 4,27,711 క్యూసెక్కులు సాగర్ వైపు వెళుతున్నాయి. రెండో యూనిట్‌కు మరమ్మతులు ఎప్పుడు ? నాగార్జునసాగర్‌లోని ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రంలో 8 యూనిట్లు ఉన్నాయి. అన్నీ పూర్తిస్థాయిలో నడిస్తే 810 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. ప్రస్తుతం 7 యూనిట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. రెండవ యూనిట్ మరమ్మతులకు గురై ఏడాదిన్నర కావొస్తున్నా చేయించలేదు. ఇప్పుడు వరద భారీగా వస్తున్నా ఆ యూనిట్ నుంచి విద్యుదుత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై సాగర్ ఎస్ఈని వివరణ కోరగా మరమ్మతు చేసేందుకు ఇంజనీర్లు జపాన్ నుంచి రావాల్సి ఉందని.. అందువల్లే ఆలస్యమవుతోందని చెప్పారు. గోదావరిలో వరద తగ్గుముఖం సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరపి ఇవ్వడంతో గోదావరిలో వరద క్రమంతా తగ్గుముఖం పడుతోంది. ఎగువ గోదావరి ప్రధానపాయతోపాటు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని, వాగులు, వంకల్లో ఉధృతి తగ్గింది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా, ఎగువ నుంచి 19,645 క్యూసెక్కుల వరద వస్తుండటంతో నీటి నిల్వ 44.49 టీఎంసీలకు చేరింది. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద పూర్తిగా తగ్గింది. -
భారీగా వరద ఉధృతి.. రేపు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
సాక్షి, నల్గొండ జిల్లా: నాగార్జున సాగర్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. రేపు(సోమవారం) ఉదయం 8 గంటలకు క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రానికి 576.10 అడుగులకు చేరింది.పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలకు గానూ.. 268.8689 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ జలాశయానికి 3లక్షల 22 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. 37,873 క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు రావడంతో నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.సాగర్ దిగువన ఉన్న కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
నాగార్జునసాగర్ అధికారుల పొంతన లేని లెక్కలు
-
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్ దాకా నదిలో భారీ ప్రవాహం కొనసాగుతోంది. పైన ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీనితో నాగార్జున సాగర్‌లోకి శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో 3 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది.శ్రీశైలం నుంచి నీటి విడుదలను పెంచిన నేపథ్యంలో.. సాగర్‌కు వరద మరింత పెరిగిపోనుంది. సోమవారం సాయంత్రానికల్లా ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లు ఎత్తే అవకాశముంది. కృష్ణా ప్రధాన పాయలో వస్తున్న వరదకుతోడు తుంగభద్రలోనూ భారీ ప్రవాహం ఉండటంతో.. ఈ వరద మరికొన్ని రోజుల పాటు కొనసాగనుందని అధికారులు చెప్తున్నారు. -
సాగర్‌లోకి 3.99 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్: నాగార్జునసాగర్‌లోకి కృష్ణా వరద ఉద్ధృతి మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సాగర్‌లోకి 3,99,159 క్యూసెక్కులు చేరుతుండడంతో నీటినిల్వ 550.6 అడుగుల్లో 211.1 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీవరద వస్తున్న నేపథ్యంలో మరో మూడురోజుల్లో సాగర్ నిండుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర, అటు జూరాల నుంచి కృష్ణా వరద ఉద్ధృతి శ్రీశైలంలోకి మరింత పెరిగింది. ప్రాజెక్టులోకి 4,89,361 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. స్పిల్‌వే పదిగేట్లను 20 అడుగులు ఎత్తి 4,66,650 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడికేంద్రం నుంచి 23,904 క్యూసెక్కులు, ఎడమకేంద్రం నుంచి 37,857 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వెరసి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,28,411 క్యూసెక్కుల నీరు సాగర్ వైపు ఉరకలెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 వేలు, మల్యాల పంప్‌హౌస్ నుంచి హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 253 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులు తరలిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా ప్రధానపాయ, తుంగభద్ర నదుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి 3.27 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా ఖాళీ ప్రదేశాన్ని నింపుతూ దిగువకు 3 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 3 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా ఖాళీ ప్రదేశాన్ని భర్తీచేస్తూ దిగువకు 2.85 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 1.90 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.82 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర నీటిమట్టం 311.75 మీటర్లకు (సముద్రమట్టానికి) చేరుకుంది. తుంగభద్ర ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండటంతో తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఎగువ నుంచి వరద ప్రవాహం స్థిరంగా వస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలోకి వరద ఉద్ధృతి శనివారం కూడా ఇదే రీతిలో కొనసాగనుంది. తగ్గుతున్న గోదావరి వరద పోలవరం రూరల్: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. నదిలో కలుస్తున్న ఉపనదుల నీరు, కొండవాగుల నీరు క్రమేపీ తగ్గుతుండటంతో నదిలో ప్రవాహం తగ్గుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 31.750 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే నుంచి 8.06 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా వరద నీరు తగ్గుతూ 34.20 అడుగులకు చేరుకుంది. వరద ప్రవాహం తగ్గుతుండటంతో నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేయడంతో మళ్లీ వరద పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఐదేళ్లలో 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పనిచేస్తుంది. ఏటా 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించబోతున్నాం. ఈ ఐదేళ్లలో 35 లక్షల ఎకరాల్లో ఆయకట్టును సృష్టించి సాగునీరు అందించబోతున్నాం’అని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు, వరద కాలువకు శుక్రవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది సాగునీటికి బడ్జెట్ రూ.22500 కోట్లు పెట్టామని, దాంట్లో రూ.10,828 కోట్లు ఆన్ గోయింగ్ వర్క్స్ కింద, కొత్త ప్రాజెక్టులకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేటాయించామన్నారు.మిగతా రూ.11వేల కోట్లు ఎస్టాబ్లి‹Ùమెంట్, అప్పుల కోసమని చెప్పారు. తెలంగాణ చరిత్రలో ఏ ఒక్క ఆరŠిథ్ధక సంవత్సరంలో కూడా ఈ స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేటాయించలేదని, ఇప్పుడు కేటాయించిన డబ్బంతా ఈ ఏడాది ప్రాజెక్టులపైనే ఖర్చు పెట్టబోతున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఎప్పుడూ ఇవ్వనివిధంగా సాగర్ ఎడమ కాలువకు తాము ఈసారి ముందుగా నీళ్లు ఇచ్చామని చెప్పారు.గత ఏడాది నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారని, సాగర్‌తోపాటు ఏఎంఆర్పీ పరిధిలోనూ పంటలు వేసుకోలేకపోయామన్నారు. నల్లగొండ జిల్లాకు ఎంతో కీలకమైన ఎస్ఎల్బీసీ టన్నెల్‌పై 1981లో అంజయ్య సీఎంగా ఉన్నప్పుడే గ్రావిటీ ద్వారా నీటిని తీసుకొచ్చేలా ఆలోచించారని, అయినా అప్పుడు కాలేదన్నారు.వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక, ఆయన్ను ఒప్పించి ప్రాజెక్టు తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా పూర్తి చేయలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేట్ల ప్రకారం టన్నెల్ పనులను పూర్తి చేయడానికి నిధులు విడుదల చేసిందని చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లలో సొరంగం పూర్తి చేస్తామని, దీంతో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.సాగర్ ఎడమకాల్వకు నీటి విడుదల నాగార్జునసాగర్: సాగర్ ఎడమకాల్వకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి చేతులమీదుగా శుక్రవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు బాలునాయక్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నాగార్జునసాగర్‌కు వచ్చారు. ఎర్త్ డ్యాం అంతర్భాగంలో గల హెడ్‌రెగ్యులేటర్ ప్యానల్‌బోర్డు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం స్విచ్ ఆన్‌చేసి ఎడమ కాల్వకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గంటగంటకు నీటిని పెంచుతూ 11వేల క్యూసెక్కులు విడుదల చేయనున్నట్టు తెలిపారు.అనంతరం మంత్రులు వరదకాల్వ వద్దకు వెళ్లి అక్కడ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.రేపో మాపో సాగర్ గేట్లు ఎత్తివేతసాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్‌లోకి కృష్ణా వరద ఉధృతి మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సాగర్‌లోకి 3,99,159 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో నీటినిల్వ 550.6 అడుగుల వద్ద 211.1 టీఎంసీలకు చేరుకుంది. రోజుకు సగటున 30 టీఎంసీల రాకతో మరో రెండు రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం నుంచి రోజుకు ఇన్‌ఫ్లో 40 టీఎంసీలకు పెరుగుతుందని..దీంతో రేపోమాపో గేట్లు ఎత్తివేసే వరదను కిందకు విడుదల చేసే అవకాశముందని అధికారవర్గాలు పేర్కొంటున్నారు.ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర, అటు జూరాల నుంచి కృష్ణా వరద ఉధృతి శ్రీశైలంలోకి మరింత పెరిగింది. ప్రాజెక్టులోకి 4,89,361 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. స్పిల్‌వే పది గేట్లు 20 అడుగు మేర ఎత్తి 4,66,650 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం నుంచి 23,904, ఎడమ కేంద్రం నుంచి 37,857 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వెరసి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,28,411 క్యూసెక్కులు సాగర్ వైపు దూసుకెళ్తున్నాయి.మహారాష్ట్ర, కర్ణాటకలో పశి్చమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1.90 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.82 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం స్థిరంగా వస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలోకి వరద ఉధృతి శనివారం కూడా ఇదే రీతిలో కొనసాగుతుందని అధికారులు చెప్పారు. -
మూడు, నాలుగు రోజుల్లో నిండనున్న సాగర్
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కృష్ణా వరద ఉధృతి మరింత పెరిగింది. గురువారం సాయంత్రం 6 గంటలకు 3,69,866 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 537.4 అడుగుల వద్ద 182.95 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 130 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మరో మూడు, నాలుగు రోజుల్లో సాగర్ నిండుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి.శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,64,019 క్యూసెక్కుల నీరు చేరుతుండంతో పది గేట్లు 18 అడుగుల మేర ఎత్తి 4,31,370 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం నుంచి 24,917, ఎడమ కేంద్రం నుంచి 35,315 వెరసి 4,91,602 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్‌లోకి చేరుతున్న వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. తుంగభద్రలో కూడా వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,98,109 క్యూసెక్కుల నీరు చేరుతుండగా 1,79,973 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.మంత్రాలయం వద్ద తుంగభద్ర నీటిమట్టం 311 మీటర్ల(సముద్రమట్టానికి)కు చేరుకుంది. దీంతో మంత్రాలయం వద్ద అధికారులు ప్రమాదహెచ్చరికను జారీచేసి నదీతీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరగనుంది. గోదావరిలో తగ్గుతున్న వరదవర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద క్రమేణా తగ్గుతోంది దీంతో మేడిగడ్డ బరాజ్‌లోకి 3.62 లక్ష లు, తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్‌లోకి 6.26, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్) బరాజ్‌లోకి 8.07 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. వచి్చన వరదను వచి్చనట్టుగా వదిలేస్తున్నారు. భద్రా చలం వద్ద వరద 8.41 లక్షల క్యూసె క్కులకు తగ్గడంతో నీటిమట్టం 40 అడుగులకు తగ్గింది. -
సాగర్‌లో 182.95 టీఎంసీలు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/ధవళేశ్వరం/పోలవరం రూరల్/సాక్షి, అమలాపురం: నాగార్జునసాగర్‌లోకి కృష్ణా వరద ఉధృతి మరింత పెరిగింది. ప్రాజెక్టులో గురువారం .6 గంటలకు 3,69,866 క్యూసెక్కుల వరద చేరుతుండడంతో నీటినిల్వ 537.4 అడుగుల్లో 182.95 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా.. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 129.1 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ఉధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మరో మూడు, నాలుగు రోజుల్లో సాగర్ నిండుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అటు జూరాల.. ఇటు సుంకేశుల బ్యారేజ్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,64,019 క్యూసెక్కులు చేరుతుండంతో పదిగేట్లు 18 అడుగుల మేర ఎత్తి 4,31,370 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం నుంచి 24,917, ఎడమ కేంద్రం నుంచి 35,315 వెరసి 4,91,602 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్‌లోకి చేరుతున్న వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. మరోవైపు.. మహారాష్ట్ర, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టిలోకి వరద ఉధృతి మరింత పెరిగింది. » ఆల్మట్టిలోకి 3.41 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. » నారాయణపూర్ డ్యాంలోకి 3.35 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3.25 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. » అలాగే, జూరాల ప్రాజెక్టులోకి 3.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3.03 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. » తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. ఈ డ్యామ్‌లోకి 1,98,109 క్యూసెక్కులు చేరుతుండగా 1,79,973 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. » మంత్రాలయం వద్ద తుంగభద్ర నీటి మట్టం 311 మీటర్ల(సముద్ర మట్టానికి)కు చేరుకుంది. దీంతో మంత్రాలయం వద్ద అధికారులు ప్రమాద హెచ్చరికను జారీచేసి నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. » ఈ నేపథ్యంలో.. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరగనుంది. గోదావరిలో తగ్గుతున్న వరద..ఇక ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో వరద ప్రవాహం క్రమేణ తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి గురువారం రాత్రి 7 గంటలకు 10,39,697 క్యూసెక్కులు చేరుతుండగా గోదావరి డెల్టాకు అధికారులు 8,800 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 10,30,897 క్యూసెక్కులను 175 గేట్లను ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 12.10 అడుగులుగా ఉంది. ఎగువ నుంచి భద్రాచలం వద్దకు చేరుతున్న వరద 8.41 లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో అక్కడ నీటిమట్టం 40.30 అడుగులకు తగ్గింది. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. ఇక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గడిచిన 24 గంటలుగా వరద నిలకడగా ఉంది. గ్రామాల్లో ముంపు కొనసాగుతోంది. దీంతో అన్ని వరా>్గల వారు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
సాగర్‌కు పోటెత్తిన కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు నాగార్జునసాగర్‌లోకి 2,18,622 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 526.8 అడుగుల వద్ద 161.97 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నిండాలంటే ఇంకా 151 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో మరో ఐదారు రోజుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,62,411 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. ఎనిమిది గేట్లు పది అడుగుల మేర ఎత్తి.. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 2,83,360 క్యూసెక్కుల నీటి ని దిగువకు వదిలేస్తున్నారు.ఆ జలాలు నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా ప్రధాన పాయతోపాటు మలప్రభ, ఘటప్రభలు వరదెత్తుతున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 3.42 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 3.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 3.35 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 3.22 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 2.81 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగ, భద్ర, ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటం.. భద్ర డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో గురువారం ఉదయం 9 గంటల నుంచి తుంగభద్రలో ప్రవాహం రెండు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని డ్యామ్ అధికారులను సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) అప్రమత్తం చేసింది. ఆ మేరకు దిగువకు వరదను విడుదల చేస్తామని తుంగభద్ర బోర్డు అధికారులు ఏపీ, తెలంగాణ అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణా, తుంగభద్రల్లో వరద పెరిగిన నేపథ్యంలో గురువారం నుంచి శ్రీశైలానికి చేరే వరద మరింత పెరగనుంది. మిడ్‌మానేరుకు జలకళ బోయినపల్లి(చొప్పదండి): నిన్నటిదాకా వెలవెలబోయిన మిడ్‌మానేరు ప్రాజెక్టుకు ప్రస్తుతం జలకళ సంతరించుకుంది. సీజన్ ప్రారంభమై రెండు నెలలైనా శించిన మేర వర్షాలు కురవకపోవడంతో మిడ్‌మానేరుకు పెద్దగా వరద చేరలేదు. దీంతో పంటల సాగుపై రైతులు ఆందోళన చెందారు. ఈక్రమంలో కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరడంతో జూలై 27న గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరదకాల్వ ద్వారా మిడ్‌మానేరుకు నీటి విడుదల ప్రారంభించారు.మిడ్‌మానేరు ప్రాజెక్టులో ఐదు రోజుల క్రితం 5.90 టీఎంసీల నీటినిల్వ మాత్రమే ఉంది. రోజుకు15 వేల క్యూసెక్కుల చొప్పున ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జరగడంతో బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు ప్రాజెక్టులో 10.55 టీఎంసీల మేర నీటినిల్వ ఉంది. ప్రాజెక్టులోకి నీరు చేరడంతో సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలోని గంగాధర, రామడుగు, బోయినపల్లి మండలాలకు చెందిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సాగర సంబురం
సాక్షి,హైదరాబాద్/దోమలపెంట: శ్రీశైలం జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతుండగా,నాగార్జునసాగర్ ప్రాజెక్టు సైతం జలకళను సంతరించుకుంటోంది. బిరబిరా కృష్ణమ్మ తరలివస్తుండడంతో నాగార్జునసాగర్‌లో గంట గంటకూ నీటినిల్వ పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం రాత్రి 7 గంటలకు 4,13,178 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 883.5 అడుగుల వద్ద 207.41 టీఎంసీలకు చేరుకుంది.ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటం.. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది, దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 2,75,700 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 60,840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. శ్రీశైలం స్పిల్‌వే గేట్లు, విద్యు దుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తోంది.నాగార్జునసాగర్‌లోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1,55,716 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 517.2 అడుగుల వద్ద 144.22 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు.. పూర్తి నిల్వసామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 170 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో వారంరోజుల్లో నాగార్జునసాగర్ నిండే అవకాశముంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో పశి్చమ కనుమల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన కృష్ణా, దాని ఉపనదుల్లో వరద ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.కృష్ణా ప్రధానపాయ నుంచి ఆల్మట్టి డ్యామ్‌లోకి 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 2.85 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 2.77 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 70 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 32వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మళ్లీ గోదావరికి పెరిగిన వరదమహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా వర్షాలుసాక్షి, హైదరాబాద్: గోదావరినది పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో గోదావరిలో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది.భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకూ బుధవారం గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుందని కేంద్ర జలసంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులను హెచ్చరించింది. ప్రాణహితలో వరద పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌లోకి వరద ప్రవాహం 7.71 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దానికి ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం(సమ్మక్క సాగర్) బరాజ్‌లోకి 9.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు.సీతమ్మసాగర్(దుమ్ముగూడెం బరాజ్)లోకి చేరుతున్న 9.64 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. భద్రాచలం వద్దకు మంగళవారం సాయంత్రం 8.45 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. నీటి మట్టం 43.7 అడుగులుగా నమోదైంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 10.08 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు.ధవళేశ్వరం బరాజ్‌లోకి 11,26,625 క్యూసెక్కులు చేరుతుండగా.. 11,19,425 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బరాజ్ వద్ద నీటిమట్టం 12.6 అడుగులుగా నమోదవుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇక కూనవరం వద్ద శబరి ఉధృతితో నీటిమట్టం 39.25(సముద్రమట్టానికి) మీటర్ల వద్ద కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. -
సాగర్ వైపు కృష్ణమ్మ...
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ బిరబిరా కదలిపోతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి సోమవారం రాత్రి 7 గంటలకు 4,52,583 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 879.3 అడుగుల్లో 184.70 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటం.. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది, దీంతో సాయంత్రం 4.30 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తగా, 76,056 క్యూసెక్కుల వరద కిందకు వెళ్లిపోతోంది.కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 61,810 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 23 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. శ్రీశైలం స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తోంది. నాగార్జునసాగర్‌లోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 54,772 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 512.6 అడుగుల్లో 136.13 టీఎంసీలకు చేరుకుంది.సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు.. పూర్తి నిల్వసామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 176 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో ఆరేడు రోజుల్లో నాగార్జునసాగర్ నిండే అవకాశముంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో పశి్చమ కనుమల్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా, దాని ఉపనదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా ప్రధానపాయ నుంచి ఆల్మట్టి డ్యామ్‌లోకి 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 2.90 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 2.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 3.15 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 3.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1.31 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 1.06 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నీటిమట్టం 311 మీటర్లు(సముద్రమట్టానికి)గా కొనసాగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.సుంకేశుల బ్యారేజ్‌లోకి 1.51 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,504 క్యూసెక్కుల నీటిని వదులుతూ మిగులుగా ఉన్న 1.48 లక్షల క్యూసెక్కులను దిగువకు వది లేస్తున్నారు. ఇటు సుంకేశుల నుంచి.. అటు జూరాల నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలంలోకి చేరుతున్న ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది.సాగర్‌లో విద్యుదుత్పాదన ప్రారంభంనాగార్జునసాగర్ : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిరాక మొదలు కావడంతో నాగార్జునసాగర్‌లోని ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రంలో విద్యుదుత్పాదనను సోమవారం రాత్రి ప్రారంభించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న టెయిల్‌పాండ్ నీటిసామర్థ్యం 7 టీఎంసీలుకాగా.. ఒక టీఎంసీ నీటితో తెలంగాణ ప్రభుత్వం నిత్యం విద్యుదుత్పతి చేస్తున్నది. గత మే నెలలో ఆంధ్రా అధికారులు రాత్రికిరాత్రే టెయిల్‌పాండ్‌లో గల 7టీఎంసీలలో 4 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.దీంతో విద్యుదుత్పాదన నిలిచిపోయింది. మరోవైపు నాగార్జునసాగర్ జలాశయం అడుగంటడంతో దిగువన టెయిల్‌పాండ్‌కు నీటిని విడుదల చేసే పరిస్థితిలేక విద్యుదుత్పాదన చేయలేదు. సాగర్‌లో విద్యుదుత్పాదన ద్వారా 24 వేల క్యూసెక్కుల నీటిని టెయిల్‌పాండ్‌కు విడుదల చేస్తున్నారు. -
నీళ్లు లేక ఎండిపోయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు
-
నిండుగా కృష్ణమ్మ ప్రవాహం
సాక్షి,హైదరాబాద్/నాగర్‌కర్నూల్/ధరూర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది. గురు వారం జూరాల ప్రాజెక్టుతోపాటు తుంగ భద్ర నుంచి కలిపి 2.54 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులో వచ్చి చేరింది. జూరాల లో విద్యుదుత్పత్తితోపాటు ప్రాజెక్టు 46 క్రస్టుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఆల్మట్టి నుంచి 2,75,000 క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 2,50,120 క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది.శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 885 అడుగులు కాగా, వరదనీటితో 855.20 అడుగులకు చేరింది. కృష్ణానదిలో వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో వారంరోజుల్లో శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయిలో నిండుతుంది.2021లో జూలై నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయగా, రెండేళ్లుగా నీటి ప్రవాహం లేక ప్రాజెక్టు నిండలేదు. సాగర్ ఎడమకాల్వకు నీటి నిలిపివేత నాగార్జునసాగర్: సాగర్ ఎడమకాల్వకు గురువారం ఉదయం నీటిని నిలిపి వేశారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ పరిధిలోని గ్రామాలకు తాగునీటిని అందించడం కోసం వా రం రోజుల పాటు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు.మళ్లీ పెరుగుతున్న గోదావరి భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం 51.2 అడుగుల నీటిమట్టం ఉండగా, క్రమంగా తగ్గుతూ బుధవారం రాత్రి 45 అడుగులకు చేరుకుంది. అయితే మళ్లీ గురువారం ఉదయం నుంచి వరద పెరుగుతూ ఒంటిగంటకు 48 అడుగులకు చేరడంతో కలెక్టర్ జితే‹Ù.వి.పాటిల్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 96, 369 క్యూసెక్కుల నీరు రావడంతో నీటినిల్వ 822.5 అడు గుల్లో 42.73 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ లోకి ఎలాంటి వరద చేరకపోగా.. పులిచింతల ప్రాజెక్టు లోకి కేవలం 640 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కాగా పులిచింతలకు దిగువన నదిపరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా కురిసిన వర్షాలకు కట్టలేరు, మున్నేరు పరవళ్లు తొక్కగా, ఏపీలోని ప్రకాశం బ్యారేజీలోకి 13,634 క్యూసెక్కుల నీరు చేరింది.ఇందులో కృష్ణా డెల్టా కు 1,309 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 12,325 క్యూసెక్కులను 17 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి అధికారులు వదిలేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధానపాయలో ఎగువన వరద ప్రవాహం కొంత పెరిగింది. ఆల్మట్టిలోకి 1.24 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు.దాని దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1,45,750 క్యూసెక్కుల నీటికి వదలడంతో జూరాల ప్రాజెక్టులోకి చేరుతున్న వరద క్రమేపి పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి 1,29,000 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా.. విద్యుదుత్పత్తి చేస్తూ, గేట్లు ఎత్తి 1,34,161 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మూడు రోజుల్లో తుంగభద్ర గేట్లు ఎత్తేసే అవకాశంఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,17,647 క్యూసెక్కుల నీటిరాకతో నీటినిల్వ 78.67 టీఎంసీలకు చే రుకుంది. నిండుకుండను తలపిస్తున్న తుంగభద్ర డ్యామ్ లో ఆదివారం విద్యుదుత్పత్తిని ప్రారంభించిన అధికారు లు.. 4,754 క్యూసెక్కులను దిగువకు వదిలారు. తుంగభద్రలో మరో మూడు రోజులు ఇదే రీతిలో వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 27 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. మూడు రోజుల్లో తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశముంది. సాగర్ నీటిమట్టం 504.30 అడుగులునాగార్జునసాగర్/మునగాల: నాగార్జునసాగర్ నీటిమట్టం ప్రస్తుతం 504.30 అడుగులుగా ఉంది. తాగునీటికి అవసరాల కోసం కుడి కాల్వ ద్వారా 5,700 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 3,146 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీ ద్వారా 800 క్యూసెక్కులు ఇలా మొత్తం 9,646 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్‌కు ఇన్‌ఫ్లో ఏమాత్రం లేదు.ఎడమకాల్వ లాకుల వద్ద పహారా: సూర్యాపేట జిల్లా మునగాలలోని సాగర్ ఎడమకాల్వ ప్రధాన లాకుల వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేస్తుండగా, రైతులు ఈ నీటిని పంటల సాగుకు మళ్లించకుండా ఉండేందుకు పహారా ఏర్పాటు చేశారు. -
హైడల్ పవర్ డౌన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎగువ, దిగువ జూరాల వంటి నాలుగు ప్రధాన జల విద్యుత్ కేంద్రాలకు గత కొంతకాలంగా మరమ్మతులు నిర్వహించకపోవడంతో వాటి ఉత్పత్తి సామర్థ్యం క్షీణించిపోయింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు నిర్వహించాల్సి ఉండగా, టెండర్ల నిర్వహణలో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) తాత్సారం చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కృష్ణా నదికి ఎగువ నుంచి వరదలు ప్రారంభం కానుండగా, పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని చేసుకునే పరిస్థితి లేకుండా పోయినట్లు తెలిసింది. ఇదే జరిగితే రూ.కోట్లు విలువ చేసే జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిన్నచిన్న సమస్యలే అయినా.. రాష్ట్రంలో చిన్నాపెద్దా కలిపి మొత్తం 2441.76 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కేంద్రాలుండగా, ఎప్పటికప్పుడు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రస్తుతం 329.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన జలవిద్యుత్ కేంద్రాలన్నింటిలో ఒక్కో యూనిట్ పనిచేయడం లేదని అధికారవర్గాలు తెలిపాయి. గత ఆరు నెలలుగా టెండర్ల ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో మరమ్మతులు ప్రారంభం కాలేదు. చిన్న చిన్న సమస్యలే ఉండడంతో ఒక్కో కేంద్రం మరమ్మతులకు రూ.10 కోట్లలోపు వ్యయమే కానుండగా, టెండర్లు ఖరారు చేయకపోవడంతో వర్షాకాలంలో ఆయా యూనిట్లలో జల విద్యుదుత్పత్తి నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. సాగర్, శ్రీశైలం కేంద్రాలకూ మరమ్మతులు నో రాష్ట్రంలోని జల విద్యుత్ కేంద్రాలు సగటున ఏటా 3000 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. థర్మల్ విద్యుత్‌తో పోల్చితే అత్యంత చౌకగా కాలుష్యం లేకుండా జలవిద్యుత్ లభిస్తోంది. కృష్ణా నదిపై నిర్మించిన ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 234 (6్ఠ39) మెగావాట్లు కాగా ఇక్కడ మూడో యూనిట్ జనరేటర్ సమస్యతో పనిచేయడం లేదు. దిగువ జూరాల విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 240 (6్ఠ40) మెగావాట్లు కాగా, అందులోని అన్ని యూనిట్లలో సీల్ లీకు అవుతోంది. వీటిల్లో కనీసం ఒక యూనిట్ పనిచేయకపోవచ్చని, తద్వారా 40 మెగావాట్ల విద్యుదుత్పత్తికి నష్టం కలగనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రంలోనే అత్యంత పెద్ద జలవిద్యుత్ కేంద్రమైన ‘శ్రీశైలం’స్థాపిత సామర్థ్యం 900 (6్ఠ150) మెగావాట్లు కాగా, అందులో 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4వ యూనిట్ పనిచేయడం లేదు. జనరేటర్ స్టేటర్, రోటర్లు కాలిపోవడంతో వాటిని మార్చాల్సి ఉంది.మరో భారీ జలవిద్యుత్ కేంద్రం నాగార్జునసాగర్ స్థాపిత సామర్థ్యం 815.6(1్ఠ110 + 7్ఠ100.8) మెగావాట్లు కాగా, అందులో 100.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్ పనిచేయడం లేదు. రోటర్‌కు సపోరి్టంగ్గా ఉండే స్ట్రక్చర్‌కు పగుళ్లు రాగా మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. వీటికి సకాలంలో మరమ్మతులు నిర్వహిస్తే వరదల సమయంలో పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
సాగర్ కుడి కాలువకు మరో 3 టీఎంసీలు
సాక్షి, అమరావతి: ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువకు మరో 3 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న త్రిసభ్య కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కేటాయించిన నీటి కంటే 8.66 టీఎంసీలు అధికంగా వాడుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ హక్కులను కాలరాస్తోందని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై బోర్డుకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు ప్రస్తుతం విడుదల చేస్తున్న 5 టీఎంసీలకు అదనంగా మరో 3 టీఎంసీలు విడుదల చేయాలని ఈఎన్సీ నారాయణరెడ్డి చేసిన ప్రతిపాదనకు త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం రాయ్‌పురే అంగీకరించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 8.5 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ఈఎన్సీ చేసిన విజ్ఞప్తికి కూడా కమిటీ సానుకూలంగా స్పందించింది. త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా రెండు రాష్ట్రాలకు నీటిని విడుదల చేస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేయనుంది. -
కృష్ణా జలాలు తీసుకుంది చాలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీళ్లను తీసుకోవడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని కృష్ణా నదీయాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్యులు డాక్టర్ ఆర్ఎన్ శంఖువా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఈ నెల 2న లేఖ రాశారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ జరిపిన కేటాయింపులకు మించి 7.391 టీఎంసీ లను తెలంగాణ వాడుకుందని ఫిర్యాదు చేస్తూ ఈ నెల 1న ఏపీ రాసిన లేఖకు స్పందించి ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఉభయ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. కృష్ణాబోర్డుపై తెలంగాణ గరం.. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి కేటాయింపులకు మించి 7.391 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టు ఏపీ చేసిన ఆరోపణలతో ఏకీభవిస్తూ కృష్ణాబోర్డు తెలంగాణను కట్టడి చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ వ్యవహారంలో కృష్ణాబోర్డు తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. త్వరలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కృష్ణాబోర్డుకు తమ నిరసనను తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 అవార్డు ప్రకారం శ్రీశైలం, సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం వాడుకున్న జలాల్లో 20శాతాన్ని మాత్రమే లెక్కించాల్సి ఉండగా, 100 శాతం జలాలను కృష్ణాబోర్డు లెక్కించడాన్ని చాలాకాలంగా తెలంగాణ తప్పుబట్టుతోంది. ఈ వాదనలను ఇప్పటికే కృష్ణాబోర్డు తిరస్కరించింది. 2022–23లో తమ రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో 18.701 టీఎంసీలను వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకున్నామని, ఆ నీళ్లను ప్రస్తుత నీటి సంవత్సరం 2023–24లో సైతం తమ రాష్ట్రానికి పునః కేటాయింపులు(క్యారీ ఓవర్) జరపాలని తెలంగాణ చేసిన మరో డిమాండ్‌ను సైతం కృష్ణాబోర్డు తిరస్కరించింది. ఈ రెండు డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను పునఃసమీక్షిస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఇంకా మిగిలి ఉంటాయని, ఏపీ కేటాయింపులకు మించి వాడుకున్నట్టు తేలుతుందని తెలంగాణ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కనీసం 18.7 టీఎంసీల జలాలు ఇంకా తమకు రావాల్సి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్క తేలి్చనట్టు సమాచారం. 2022–23లో సైతం ఏపీ కేటాయింపులకు మించి 51.745 టీఎంసీలను వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తోంది. నేటి త్రిసభ్య కమిటీ భేటీకి రాలేం ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణాబోర్డు.. త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టగా, ఈ సమావేశానికి రాలేమని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తెలియజేశాయి. సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. త్రిసభ్య కమిటీ కనీ్వనర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు ఉంటారు. ఆ 8 టీఎంసీలు తెలంగాణకు కావాలి నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 512.5 అడుగులకు పడిపోగా నిల్వలు 136.95 టీఎంసీలకు తగ్గిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వమట్టం(డెడ్ స్టోరేజీ) 505 అడుగులు కాగా, బుధవారం నాటికి జలాశయంలో కనీస నిల్వమట్టానికి ఎగువన వాడుకోవడానికి వీలుగా 13.617 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయి. ఏపీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసినా, మిగిలిన 8.61 టీఎంసీలను హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కేటాయించడానికి వీలుంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం దృష్టికి కృష్ణా జలాల పంచాయితీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తాజాగా కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణను సూచించాలని విజ్ఞప్తి చేస్తూ జలశక్తి శాఖకు కృష్ణాబోర్డు లేఖ రాయనున్నట్టు తెలిసింది. ఈ నెల 1న ఏపీ రాసిన లేఖకు స్పందించి ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఉభయ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. కృష్ణాబోర్డుపై తెలంగాణ గరం.. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి కేటాయింపులకు మించి 7.391 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టు ఏపీ చేసిన ఆరోపణలతో ఏకీభవిస్తూ కృష్ణాబోర్డు తెలంగాణను కట్టడి చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ వ్యవహారంలో కృష్ణాబోర్డు తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. త్వరలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కృష్ణాబోర్డుకు తమ నిరసనను తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 అవార్డు ప్రకారం శ్రీశైలం, సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం వాడుకున్న జలాల్లో 20శాతాన్ని మాత్రమే లెక్కించాల్సి ఉండగా, 100 శాతం జలాలను కృష్ణాబోర్డు లెక్కించడాన్ని చాలాకాలంగా తెలంగాణ తప్పుబట్టుతోంది. ఈ వాదనలను ఇప్పటికే కృష్ణాబోర్డు తిరస్కరించింది. 2022–23లో తమ రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో 18.701 టీఎంసీలను వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకున్నామని, ఆ నీళ్లను ప్రస్తుత నీటి సంవత్సరం 2023–24లో సైతం తమ రాష్ట్రానికి పునః కేటాయింపులు(క్యారీ ఓవర్) జరపాలని తెలంగాణ చేసిన మరో డిమాండ్‌ను సైతం కృష్ణాబోర్డు తిరస్కరించింది. ఈ రెండు డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను పునఃసమీక్షిస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఇంకా మిగిలి ఉంటాయని, ఏపీ కేటాయింపులకు మించి వాడుకున్నట్టు తేలుతుందని తెలంగాణ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కనీసం 18.7 టీఎంసీల జలాలు ఇంకా తమకు రావాల్సి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్క తేలి్చనట్టు సమాచారం. 2022–23లో సైతం ఏపీ కేటాయింపులకు మించి 51.745 టీఎంసీలను వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తోంది. నేటి త్రిసభ్య కమిటీ భేటీకి రాలేం ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణాబోర్డు.. త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టగా, ఈ సమావేశానికి రాలేమని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తెలియజేశాయి. సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. త్రిసభ్య కమిటీ కనీ్వనర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు ఉంటారు. ఆ 8 టీఎంసీలు తెలంగాణకు కావాలి నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 512.5 అడుగులకు పడిపోగా నిల్వలు 136.95 టీఎంసీలకు తగ్గిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వమట్టం(డెడ్ స్టోరేజీ) 505 అడుగులు కాగా, బుధవారం నాటికి జలాశయంలో కనీస నిల్వమట్టానికి ఎగువన వాడుకోవడానికి వీలుగా 13.617 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయి. ఏపీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసినా, మిగిలిన 8.61 టీఎంసీలను హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కేటాయించడానికి వీలుంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం దృష్టికి కృష్ణా జలాల పంచాయితీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తాజాగా కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణను సూచించాలని విజ్ఞప్తి చేస్తూ జలశక్తి శాఖకు కృష్ణాబోర్డు లేఖ రాయనున్నట్టు తెలిసింది. -
డెడ్ స్టోరేజీ దిశగా నాగార్జున సాగర్
-
తాగునీటి తంటాలు లేకుండా..
సాక్షి, హైదరాబాద్: వేసవి దృష్ట్యా హైదరాబాద్ మహానగరంలో తాగునీటి ఎద్దడి నివారణకు జలమండలి ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణకు దిగింది. నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో డెడ్‌స్టోరేజీ వరకు నీటిని పంపింగ్ చేసేందుకు అత్యవసర మోటార్లు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు వేసవిలో తాగునీటి డిమాండ్ పెరగనున్న దృష్ట్యా ప్రస్తుతం సరఫరా చేస్తున్న 565 మిలియన్ గ్యాలన్స్ పర్ డే (ఎంజీడీ)లకు తోడు అదనంగా మరో 15 నుంచి 20 ఎంజీడీల నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లకు సిద్ధమైంది. మహానగరానికి మంచి నీరు అందిస్తున్న నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం రోజు రోజుకు పడిపోతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 516 అడుగులకు చేరింది. నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉండటంతో ముందస్తుగా మోటార్లను బిగించి అత్యవసర పంపింగ్‌కోసం ఏర్పాట్లు చేస్తోంది. సాగర్ జలాశయంలో మినహా అన్ని రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని జలమండలి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సగం వాటా కృష్ణా జలాలదే.. మహానగరంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అత్యధిక ప్రాంతాలకు సరఫరా అవుతున్న తాగునీటిలో సగం వాటా కృష్ణా జలాలదే. నాగార్జున సాగర్ నుంచి నిత్యం 270 ఎంజీడీల నీటిని నగరానికి తరలిస్తున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాగర్ సమీపంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి పంప్ హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. సాగర్ నీటి మట్టం 510 అడుగులకు పడిపోతే అక్కంపల్లి రిజర్వాయర్‌లోకి గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించే పరిస్థితి ఉండదు. దీంతో సాగర్ నుంచి కష్ణాజలాల అత్యవసర పంపింగ్ తప్పనిసరి. గత ఐదేళ్ల క్రితం కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తరలించారు. జలాల తరలింపు ఇలా.. హైదరాబాద్ మహా నగరానికి వివిధ జలాశయాల నుంచి ప్రతి నిత్యం సుమారు 565 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం నుంచి 270 ఎంజీడీలు, గోదావరి నుంచి 172 ఎంజీడీలు, సింగూరు, మంజీరాల నుంచి 103, ఉస్మా¯న్ సాగర్ నుంచి 14 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి ప్రస్తుతం నీటి సేకరణ జరగడం లేదు. డెడ్ స్టోరేజీగా హిమాయత్‌సాగర్‌ను ఉంచినప్పటికీ వేసవిలో అవసరాల మేరకు ఈ రిజర్వాయర్ నుంచి పాతనగరానికి నీటిని అందించి కృష్ణా జలాల ప్రాంతాలకు సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గోదావరి నుంచి తరలిస్తున్న 172 ఎంజీడీలో 40 ఎంజీడీలు మిషన్ భగీరథకు మళ్లిస్తున్నారు. దానిని సైతం నగరానికి తరలించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు.. వేసవిని దృష్ట్యా డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సిద్ధమైంది. నగరంలో ఇప్పటికే 72 ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. డిమాండ్‌ని బట్టి అదనపు ఫిల్లింగ్ స్టేషన్ కోసం జలమండలి చర్యలు చేపట్టింది. -
‘సాగర్’ను సందర్శించిన కేఆర్ఎంబీ బృందం
నాగార్జునసాగర్: కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) అధికారులు స్థానిక ఇంజనీర్లతో కలసి గురువారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. సాగర్ డ్యామ్‌పై బీటీరోడ్డు వేయడంతో పాటు సీజనల్‌గా చేయాల్సిన నిర్వహణ పనులైన డ్యామ్ రేడియల్ క్రస్ట్‌గేట్లకు రబ్బరు సీళ్లు, గ్యాలరీలలో సీపేజ్ నీరు రాకుండా మరమ్మతులు, గేట్లు ఎత్తి, దింపే స్టార్టర్లలో ప్యానల్ బోర్డులు, మోటార్ల మరమ్మతుల వంటి పనులు చేయాల్సి ఉంది. ఈ నెల 16వ తేదీన తెలంగాణ ఇంజనీర్లు నిర్వహణ పనులను ప్రారంభించారు. అయితే, ఈ పనులు చేయవద్దని ఏపీ వైపున ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. తెలంగాణ అధికారులు అలాగే పనులు చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయమై కేఆర్ఎంబీకి లేఖలు రాసింది. దీంతో స్పందించిన కేఆర్ఎంబీ అధికారులు గురువారం సాగర్‌డ్యామ్ మీదకు వచ్చి పరిశీలించారు. డ్యామ్ మెయింటెనెన్స్ పనులు చేసుకోవచ్చని చెప్పారు. శుక్రవారం కేఆర్ఎంబీ అధికారులు సాగర్డ్యామ్తో పాటు కుడి, ఎడమ కాల్వల హెడ్రెగ్యులేటర్లను సందర్శించనున్నట్లు సమాచారం. సాగర్‌డ్యామ్‌పై పర్యటించిన వారిలో కేఆర్ఎంబీ ఎస్ఈ వరలక్ష్మి, సాగర్‌డ్యామ్ ఎస్ఈ నాగేశ్వర్రావు, ఈఈ మల్లికార్జున్‌రావు, డీఈ శ్రీనివాసరావు, ఏఈ కృష్ణయ్య, సీఆరీ్పఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ పాల్గొన్నారు. -
లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ నీటి పోరు యాత్ర
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ మళ్లీ పోరు బాట పట్టనుంది. తర్వలో నీటి పోరు యాత్ర చేసేందుకు పార్టీ యోచిస్తోంది. దక్షిణ తెలంగాణలోని నాగార్జున సాగర్, ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం నుంచి నీటి పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పెద్దలు ప్లాన్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతోంది. ఇటీవలే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న బీఆర్ఎస్ ఇదే ఊపులో నీటి పోరుయాత్ర చేసి తమ పాలనకు, కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కారు పార్టీ డిసైడైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తుచేసేందుకే ఈ యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందని ఊహాగానాల నేపథ్యంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు దానిని ఖండిస్తున్నారు. కానీ ఎన్నికల వేళ కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పొత్తుపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు: కిషన్‌రెడ్డి -
‘సాగర్’ విద్యుత్ కేంద్రాలకు ఎన్డీఎస్ఏ
నాగార్జునసాగర్: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల బృందం బుధవారం నాగార్జునసాగర్ డ్యామ్ దిగువన గల ప్రధాన, కుడికాల్వ విద్యుదుత్పత్తి కేంద్రాలను సందర్శించింది. బృందం సభ్యులు ముందుగా విజయవిహా ర్ బోర్డురూమ్‌లో సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేశ్‌కు మార్ అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాగర్ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం, భద్రత, నీటి వినియోగం, విద్యుదుత్పత్తి, జలా శయంలో ఎంత నీరున్నపుడు కుడి కాల్వపై విద్యు త్ ఉత్పత్తి అవుతుంది, ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రంలో టర్బైన్ల సంఖ్య, ఏయే టర్బైన్ నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? దిగువ టెయిల్‌పాండ్‌లోకి నీటిని విడుదల చేస్తూ విద్యు దుత్పాదన అనంతరం తిరిగి నీటిని జలాశయంలోకి ఎత్తిపోసేందుకు టర్బైన్లను పంప్మోడ్కు ఎప్పుడు మార్చారు వంటి అంశాలపై చర్చించారు. జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేశ్‌కుమార్ సభ్యు ల సందేహాలకు సమాధానాలు చెప్పారు. అనంతరం రూట్‌మ్యాప్‌తో జల విద్యుదుత్పాదన కేంద్రాలను సందర్శించారు. సాయంత్రం వారు లాంచీలో నాగార్జునకొండకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మరో డైరెక్టర్ ఆశిశ్‌కుమార్, నేష నల్ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ డైరెక్టర్ మహేంద్రసింగ్, డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్జిషన్, సాంకేతిక నిపు ణులు రాకేశ్, స్టేట్డ్యామ్ సేఫ్టీ అథారిటీ చీఫ్ ఇంజనీర్ కుమార్, ఎస్ఈ మురళీకృష్ణ, ఆర్గనైజేషన్ సీఈ ప్రమీల, ఎస్ఈ శ్రీనివాసులు, ఈఈ విజ యలక్ష్మి, డీఈ సతీశ్, నాగార్జుసాగర్ ప్రాజెక్టు సీఈ అజయ్‌కుమార్, ఎస్ఈ నాగేశ్వర్రావు, ఈఈ మల్లికార్జున్‌రావు, ఆంధ్రప్రదేశ్ సీఈ మురళీ«ధర్ రెడ్డి, కృష్ణా రివర్‌బోర్డు ఎస్ఈ వరలక్ష్మీదేవి, ఈఈ హరి పాల్గొన్నారు. -
నాగార్జునసాగర్‌కు ఎన్డీఎస్ఏ బృందం
నాగార్జునసాగర్: ‘నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’ బృందం మంగళవారం నాగార్జున సాగర్ ప్రాజెక్టును సందర్శించింది. తొలుత విజ యవిహార్ అతిథిగృహంలో తెలంగాణ, ఆంధ్ర ఇంజనీర్లతోపాటు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణాబోర్డు (కేఆర్ఎంబీ) సభ్యులతో ఎన్డీఎస్ఏ అధికారులు సమావేశమయ్యారు. 2009లో వచ్చిన భారీ వరదల నుంచి డ్యామ్‌ను ఏవిధంగా కాపా డారు? వచ్చిన వరదను ఎలా విడుదల చేశారన్న అంశాలపై చర్చించారు. తర్వాత ప్రధాన డ్యామ్ ను, ప్రాజెక్టు లోపలి గ్యాలరీలను, అక్కడి సీపేజీ (జాలు నీరు)లను పరిశీలించారు. సీపేజీ నీటి మళ్లింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రా జెక్టు స్పిల్‌వేపై ఉన్న వాక్‌వే బ్రిడ్జి మీదుగా వెళ్లి స్పి ల్‌వేను పరిశీలించారు. ప్రాజెక్టు గేట్ల పరిస్థితి, స్పిల్ వేకు అవసరమైన మరమ్మతులు, నిర్వహణ వివ రాలను ఆరా తీశారు. స్పిల్‌వే దిగువన బకెట్ పో ర్షన్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎన్డీఎస్ఏ బృందంలో సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేశ్‌కుమార్, రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్వో) సీఈ ప్రమీల, ఇత ర ఇంజనీర్లు ఉన్నారు. ఈ పరిశీలనలో తెలంగాణ నుంచి చీఫ్ ఇంజనీర్ వి.అజయ్‌కుమార్, డ్యామ్ ఎస్ఈ పీవీఎస్ నాగేశ్వర్రావు, ఇతర ఇంజనీర్లు పాల్గొనగా.. ఏపీ నుంచి చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రెడ్డి, ఎస్ఈ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ కేంద్రం పరిశీలన ఎన్డీఎస్ఏ బృందం బుధవారం సాగర్ డ్యాం దిగు వన ఉన్న విద్యుత్ కేంద్రాన్ని సందర్శించనుంది. ఈ విద్యుత్ కేంద్రం ద్వారా విడుదలవుతున్న నీటి ని.. తిరిగి జలాశయంలోకి ఎత్తిపోసే సమయంలో నీరేమైనా వృథా అవుతుందా? సీజన్లో బయటికి ఎంతనీరు వెళుతుందనే అంశాలను పరిశీలించనున్నట్టు తెలిసింది. గురువారం కూడా సాగర్ ప్రాజెక్టు పరిధిలో పరిశీలన కొనసాగనుంది. -
TS: స్వరాష్ట్రంలోనే అన్యాయం!
కృష్ణా జలాల పంపిణీ, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్.. దానిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదంతో సోమవారం అసెంబ్లీ దద్దరిల్లింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కింది. కృష్ణా నీటిని ఏపీ సీఎం జగన్ ఆ రాష్ట్రానికి తరలించుకుపోతుంటే కేసీఆర్ సహకరించారని అంటూ అధికారపక్షం విమర్శలు గుప్పించగా.. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తోందని, ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు తమపై ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ దీటుగా ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ సర్కారు తీరును వివరించేందుకు తాము నల్లగొండలో బహిరంగ సభ చేపడితే.. దృష్టి మళ్లించేందుకు సభలో తీర్మానం పెట్టారని మండిపడింది. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పాపాల భైరవుడు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్రాన్ని మోసం చేసిన కేసీఆర్‌ను కొడతారంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం తెలపడంతో కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ ప్రకటించారు. సాక్షి, హైదరాబాద్: నదీ జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాకే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. జలాల్లో ఏపీకి ఎక్కువ వాటా ఇచ్చినా, ఆ రాష్ట్రం భారీగా తరలించుకుపోతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్ సర్కారు కుమ్మక్కైందని ఆరోపించారు. కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించినది గత ప్రభుత్వమేనని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత అంశంపై ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీపీ) ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నం చేసినా.. స్పీకర్ ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకొని మంత్రిని మాట్లాడనివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘2020లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 92,500 క్యూసెక్కుల నీటిని తరలించుకుపోవడానికి ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో నంబర్ 203 తెచ్చినా కేసీఆర్ సర్కార్ అడ్డుకోలేదు. ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. కృష్ణా నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించుకుపోయేందుకు ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టినా పట్టించుకోలేదు. పోతిరెడ్డిపాడు ద్వారా 1983లో 11,150 క్యూసెక్కుల నీరు తరలిస్తే.. 2005లో వైఎస్సార్ ప్రభుత్వం దానిని 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచింది. జగన్ వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఏకంగా 92,500 క్యూసెక్కులకు పెంచారు. పోతిరెడ్డిపాడు ద్వారా 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీలను తీసుకెళ్తే.. 2014 నుంచి 2024 వరకు ఏకంగా 1,201 టీఎంసీలను ఏపీ తరలించుకుపోయింది. ఏనాడూ అభ్యంతరం తెలపలేదు 2014లో కేంద్ర ప్రభుత్వం కృష్ణాజలాల్లో నీటి వాటాను తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలుగా నిర్ణయిస్తే.. అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి ఏమాత్రం అభ్యంతరం తెలపలేదు. సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లి 299 టీఎంసీలకు ఒప్పుకొని.. కృష్ణా జలాల్లో తెలంగాణకు శాశ్వత నష్టం చేకూర్చారు. 2015 నుంచి 2023 వరకు ఏటా ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న కేసీఆర్, హరీశ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అభ్యంతరాలేమీ తెలపలేదు. అప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల కోసం 299 టీఎంసీలకు ఒప్పుకొన్నవాళ్లు.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన 225 టీఎంసీల గురించి గానీ, కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమైన 206 టీఎంసీల గురించి గానీ ఏనాడూ అడగలేదు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు–రంగారెడ్డిలకు అవసరమైన నీటి గురించి కేంద్రాన్ని నిలదీయలేదు. అపెక్స్ కమిటీ సమావేశంలో కేసీఆర్ సైతం.. 2016 సెపె్టంబర్ 16న ఢిల్లీలో జరిగిన తొలి అపెక్స్ కమిటీ సమావేశానికి అధికారులతో పాటు అప్పటి సీఎం కేసీఆర్, హరీశ్‌రావు హాజరయ్యారు. అప్పుడు కూడా కృష్ణాలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాకు ఒప్పుకొని వచ్చారు. నీటి వాటాలపై ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా పాత ఒప్పందమే కొనసాగించాలంటూ రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కూడా కేసీఆర్ అంగీకరించడం రాష్ట్రానికి తీరని ద్రోహమే. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల హయాంలో నీటిపారుదల శాఖలో జరిగిన అవినీతి, అన్యాయం స్వతంత్ర భారత చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఇంతా చేసి తెలంగాణ ప్రజానీకంలో అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే వాస్తవాలతో ప్రజెంటేషన్ ఇస్తున్నాం. కృష్ణానీటి వాటాలో అన్యాయంపై మేం పోరాడుతాం. ఏపీ ప్రయోజనం కలిగేలా చేశారు ఏపీ సీఎం జగన్, అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ గంటల కొద్దీ ఏకాంత చర్చలు చేసుకున్నారు. రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు ముగిసేదాకా కేసీఆర్ అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరుకాకుండా ఏపీకి ప్రయోజనం కలిగేలా వ్యవహరించారు. కేసీఆర్ తెలంగాణ నీళ్లను ఏపీకి ఇస్తున్నారంటూ జగన్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో పొగడటం నిజం కాదా? అసెంబ్లీ ఎన్నికల చివరిరోజున నాగార్జునసాగర్‌ను ఏపీ ప్రభుత్వం అనధికారికంగా తమ చేతుల్లోకి తీసుకోవడం వెనుక రాజకీయం లేదా? కుడికాల్వ గేట్లు ఎత్తి నీటిని తరలించుకోవడం వాస్తవం కాదా? ఈ ఘటనపై కేసీఆర్ ఇప్పటివరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కృష్ణాబోర్డుకు నాగార్జునసాగర్‌ను అప్పగించేందుకు సిద్ధమన్న రీతిలో అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ కేంద్రానికి లేఖ రాయడం మరింత నష్టం కలిగించింది. మేం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకమని కేంద్రానికి స్పష్టం చేశాం. ఇందుకు సంబంధించిన సమావేశం మినిట్స్ మార్చాలని కోరాం. అయినా ప్రతిపక్షం రాద్ధాంతం చేయడం తగదు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. కేసీఆర్ సభకు వస్తే.. తేలుస్తాం: రేవంత్‌రెడ్డి పదేళ్లు తెలంగాణకు అన్యాయం చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ అని.. కృష్ణా నదిజలాలపై ముఖ్యమైన చర్చ జరుగుతుంటే ఆయన సభకు ఎందుకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ చర్చలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు, వారి మాటలకూ ఏమాత్రం విలువ లేదు. గత పదేళ్ల పాపాలకు కేసీఆరే బాధ్యుడు. ఆ పాపాల భైరవుడు సభలోకి వచ్చి చర్చ చేస్తే మేం సమాధానం చెప్తాం. బీఆర్ఎస్ అధినేత ఇక్కడికొచ్చి మాట్లాడాలి. ఆయనకు ఎంతసేపైనా మైక్ ఇచ్చేందుకు సిద్ధం. తెలంగాణకు ఎవరు అన్యాయం చేశారో తేలుస్తాం..’’ అని పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైతే సభను వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గత ఎన్నికల్లో కేసీఆర్‌కు నల్గొండ జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు చెప్పుతో కొట్టినట్టుగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దక్షిణ తెలంగాణను కనీసం మంచినీళ్లు కూడా అందని విధంగా నాశనం చేశారని ఆరోపించారు. ఇంత అన్యాయం చేసిన కేసీఆర్ నల్లగొండకు వచ్చే ముందు ముక్కు నేలకురాసి తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. కోవర్టులున్నారు.. సాగనంపుతాం: భట్టి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ.. కృష్ణా జలాలపై అప్పటి ఈఎన్సీ మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఈఎన్సీ బీఆర్ఎస్ వ్యక్తిగా పనిచేశారని, అందుకే సాగనంపామని పేర్కొన్నారు. ఇలాంటి కోవర్టులు ఇంకా ఉన్నారని, వారిని కూడా పంపేస్తామని చెప్పారు. -
నేటి నుంచి శ్రీశైలం, సాగర్‌లో ఎన్డీఎస్ఏ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నేతృత్వంలోని నిపుణుల బృందం తనిఖీ చేయనుంది. మంగళవారం నుంచి 8వ తేదీ వరకు శ్రీశైలం ప్రాజెక్టును, 13–15 తేదీల్లో నాగార్జునసాగర్‌ను ఎన్డీఎస్ఏ బృందం సందర్శించనుంది. గత నెల 9న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ, ఏపీతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టనుంది. ఎన్డీఎస్ఏ సభ్యుడు (డిజాస్టర్, రిసిలియన్స్) వివేక్ త్రిపాఠి నేతృత్వంలోని బృందం శ్రీశైలం ప్రాజెక్ట్‌ను, ఎన్డీఎస్ఏ సాంకేతిక సభ్యుడు రాకేశ్ కశ్యప్ నేతృత్వంలోని బృందం సాగర్ ప్రాజెక్టును తనిఖీ చేయనుంది. ఈ బృందంలో ఎన్డీఎస్ఏ నుంచి ముగ్గురు, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, ఏపీ, సీఎస్ఎంఆర్ఎస్, తెలంగాణ నుంచి చెరో అధికారి కలిపి మొత్తం ఎని మిది మంది సభ్యులు ఉండనున్నారు. శ్రీశైలం ప్రా జెక్టు నుంచి భారీగా వరద విడుదల చేస్తుండటంతో దిగువ భాగంలో 40 మీటర్లలోతు గుంత (ప్లజ్ పూల్) ఏర్పడింది. దిగువ భాగంలో రక్షణ చర్యలతోపాటు కాంక్రీట్ వాల్ నిర్మాణం, స్పిల్ వేకు అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుందని, దీనికి రూ. 800 కోట్లు అవసరమని కేఆర్ఎంబీ గతంలో అంచనా వేసింది. ఇక నాగార్జునసాగర్ స్పిల్‌వే ఓగీలో కాంక్రీట్ పనులు, సీపేజీ గుంతలకు మరమ్మతులు, కుడికాలువ హెడ్ రెగ్యూలేటరీ గేట్లకు మరమ్మతులు, పూడికను బయటకు పంపే గేటు మారి్పడి వంటి పనులు చేయాల్సి ఉందని కేఆర్ఎంబీ ఇప్పటికే గుర్తించింది. ఇందుకు రూ. 20 వేల కోట్లు అవసరం కానున్నాయి. ఎన్డీఎస్ఏ బృందం తనిఖీల అనంతరం రెండు ప్రాజెక్టుల మరమ్మతులపై కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
నీటి వాటాలపైనా అడ్డం తిరిగిన తెలంగాణ
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ ఈనెల 17న నిర్వహించిన సమావేశంలో అంగీకరించి ఆ తర్వాత అడ్డం తిరిగిన తరహాలోనే.. కృష్ణా జలాల వాటాపైనా తెలంగాణ తొండాటకు దిగింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీనిని అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటుపై కృష్ణా బోర్డులో చర్చించి.. దాని ప్రకారమే రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకుంటున్నాయి. మరోవైపు కృష్ణా జలాల్లో సగం వాటా కావాలని గతంలో తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసినా.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వెలువడే వరకూ పాత వాటాలే చెల్లుబాటు అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ నీటి వాటాలపైనా అడ్డం తిరిగింది. కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటును అంగీకరించబోమని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసింది. కానీ.. 1976 మే 31న బచావత్ ట్రిబ్యునల్ జారీ చేసిన అవార్డులో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో.. 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. వాటి ఆధారంగానే రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–6(2) ప్రకారం.. కేడబ్ల్యూడీటీ–1 అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. అందుకే కేడబ్ల్యూడీటీ–2 వాటి జోలికి వెళ్లలేదు. 65 శాతం లభ్యత కింద ఉన్న మిగులు జలాలు 194 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 అదనంగా కేటాయించింది. వీటిని పరిశీలిస్తే.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చినా.. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు మారబోవని జలవనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై.. మళ్లీ అడ్డం తిరిగిన తెలంగాణ
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగింతపై తెలంగాణ రాష్ట్రం మళ్లీ అడ్డం తిరిగింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈనెల 17న ఢిల్లీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో కృష్ణా బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించిన తెలంగాణ నీటిపారుదల శాఖాధికారులు.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే ప్లేటు ఫిరాయించి ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు తాము అంగీకరించలేదని బుకాయించారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని తెలంగాణ సర్కార్ చెబుతోంది. కానీ.. ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించినట్లు సమావేశపు మినిట్స్‌లో స్పష్టంగా ఉంది. ఈ మినిట్స్‌పై ఏపీ అధికారులతోపాటు తెలంగాణ అధికారులు కూడా సంతకాలు చేశారు. అప్పుడూ ఇలాగే ప్లేటు ఫిరాయింపు.. గతంలో కృష్ణా బోర్డు 16వ సర్వసభ్య సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించిన తెలంగాణ అధికారులు.. ఆ మరుసటి రోజే అడ్డం తిరిగారు. ఇప్పుడూ అదే రీతిలో అడ్డం తిరగడంతో కేంద్ర జల్‌శక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. మరోవైపు.. ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 24లోగా త్రిసభ్య కమిటీ సమావేశమై ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింత విధానాన్ని ఖరారు చేయాలి. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున హాజరయ్యే నీటిపారుదల శాఖ ఈఎన్సీ స్పందనను బట్టి చర్యలు తీసుకోవడానికి కేంద్ర జల్‌శక్తి శాఖ సిద్ధమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీలో ఆరు.. తెలంగాణలో తొమ్మిది ఔట్లెట్లు.. నిజానికి.. విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కేంద్రం కృష్ణాబోర్డును ఏర్పాటుచేసింది. ఈ బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన కేంద్రం.. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని నిర్దేశించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏపీ భూభాగంలోని ఆరు, తెలంగాణ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను స్వాధీనం చేయాలని 16వ సర్వసభ్య సమావేశంలో రెండు రాష్ట్రాలను బోర్డు కోరింది. ఇందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. తెలంగాణ భూభాగంలోని అవుట్లెట్లను స్వాధీనం చేసుకుంటే.. తమ భూభాగంలోని అవుట్లెట్లను అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కానీ.. తెలంగాణ సర్కార్ తన భూభాగంలోని అవుట్లెట్లను బోర్డుకు అప్పగించబోమని అడ్డం తిరిగింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి మన భూభాగంలోని సాగర్ స్పిల్ వే సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను జలవనరుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమ నిర్వహణలో ఉన్న సాగర్‌ను ఏపీ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించడమే అజెండాగా ఈనెల 17న ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. -
నగరానికి నీటి ముప్పు
సాక్షి, హైదరాబాద్: వేసవికి ముందే నగరానికి నీటిముప్పు పొంచి ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటినిల్వలు తగ్గుముఖం పట్టి తాగునీటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 520 అడుగులకు చేరింది. సాగర్ నీటిమట్టం మరింత తగ్గి పుట్టంగడి పంపింగ్ కేంద్రానికి నీరు అందకపోతే అత్యవసర పంపింగ్ తప్పనిసరి అవుతుంది. జలాశయంలో 510 అడుగుల నీటిమట్టం వరకు ఎలాంటి పంపింగ్ లేకుండా నగరానికి తాగునీటిని తరలించవచ్చు. వేసవినాటికి జలాశయంలో నీటిమట్టం మరింత అడుగుకు చేరే అవకాశం కనిపిస్తోంది. అత్యవసర పంపింగ్ చేపట్టినా డెడ్‌స్టోరేజీ వరకు మాత్రమే నీటిని పంపింగ్ చేసేందుకు వీలుంటుంది. ప్రస్తుతం కృష్ణాజలాల తర లింపుపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం నెలకొన్న దృష్ట్యా ఈ సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. సగంనీరు సాగర్ నుంచే... మహానగరవాసుల దాహార్తి తీర్చేందుకు సరఫరా చేస్తున్న తాగునీటిలో సగానికి పైగా నాగార్జునసాగర్ జలాశయం నుంచి తరలిస్తున్నారు. నగరంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు ప రిధిలోని అత్యధిక ప్రాంతాలకు కృష్ణా జలాలే ఆధారం. సాగర్ నుంచి నిత్యం 290 ఎంజీడీ నీటిని నగరానికి తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్టు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలోని పుట్టంగండి పంప్‌హౌస్ నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. సాగర్ నీటిమట్టం 510 అడుగులకు పడిపోతే అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే పరిస్థితి ఉండదు. దీంతో కృష్ణాజలా ల పంపింగ్ నిలిచిపోతుంది. గతంలో నీటి మట్టం కిందకు పడిపోతుండగానే అత్యవసర పంపింగ్‌కు ఏర్పాట్లు జరిగేవి. గత ఐదేళ్ల క్రితం నాటి పరిస్థితి తిరిగి పునరావృత్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ పరిస్థితి ఎగువన ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో కృష్ణాబేసిన్ వట్టిపోతోంది. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం గతేడాది ఇదే రోజు నాటికి 571.900 అడుగులు ఉండగా, ఈసారి మాత్రం 520 అడుగులకు పడిపోయింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామ ర్థ్యం పరిశీలిస్తే గతేడాది 261.300 టీఎంసీలు ఉంటే, ఈ సారి మాత్రం 149.820 టీఎంసీలకు చేరింది. వాస్తవంగా నాగార్జునసాగర్‌లో 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా నగరానికి తాగునీటిని అందించడానికి ఎత్తిపోతల సాధ్యమవుతుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే అక్కడ పంపులను నడపడం సాధ్యం కాదు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలకుగాను 505 అడు గుల వరకు నీటిని వినియోగించుకునేందుకు ఒప్పందం కూడా జరగడంతో అత్యవసర పంపింగ్‌తో కూడా నగరానికి నీటి తరలింపు సమస్యగా మారే ప్రమాదం కనిస్తోంది. జలాల తరలింపు ఇలా.. హైదరాబాద్ మహానగరానికి వివిధ జలాశయాల నుంచి ప్రతి నిత్యం సుమారు 560 నుంచి 590 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్ ఫర్ డే) నీటిని తరలిస్తున్నారు. కృష్ణా నుంచి 290 ఎంజీడీలు, గోదావరి నుంచి 160 ఎంజీడీలు, సింగూరు, మంజీరాల నుంచి 103 ఎంజీడీలు, ఉస్మాన్‌సాగర్ నుంచి 14 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి ప్రస్తుతం నీటి సేకరణ జరగడం లేదు. హిమాయత్‌సాగర్ నుంచి వచ్చే వేసవిలో అవసరాల మేరకు పాతనగరానికి నీటిని అందించి, కృష్ణా జలాల ప్రాంతాలకు సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక్క కృష్ణా జలాలు తప్ప అన్ని రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. -
తెలంగాణ గొంతుకోసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్, శ్రీశైలం నీటి ప్రాజెక్టులపై పూర్తి అధికారాన్ని కృష్ణా నదీ యాజ మాన్య మండలి(కేఆర్ఎంబీ)కి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గొంతు కోసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులపై అధికారాన్ని కేఆర్ ఎంబీకి అప్పగించడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేలే దాకా ఏ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఒప్పుకో మని నాటి కేసీఆర్ ప్రభుత్వం తేల్చిచెప్పిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ మినిట్స్ రాసినట్లయితే వెంటనే ఆ విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఆ డ్యాంల మీదికి అడుగు పెట్టే అవకాశం ఉండదన్నారు. తెలంగాణకు సాగునీళ్లు, తాగునీళ్లు ప్రశ్నార్థకం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఇక పూర్తిగా థర్మల్ విద్యుత్ కేంద్రంపైనే ఆధారపడేలా చేశారన్నారు. అలా అన్న వాళ్లే బొందలో కలిసిపోయారు తెలంగాణలో తన శిష్యుడు రాజ్యం ఏలుతున్నాడని చంద్రబాబు సంతోషపడుతున్నారని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు శిష్యుడు విదేశాల్లో తిరుగుతూ కేసీఆర్ పార్టీని బొందపెడతానని అంటున్నారని, అలా అన్నవాళ్లు అందరూ బొందలో కలిసిపోయారన్నారు. గోదావరి బేసిన్లో రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం మీద దుష్ప్రచా రం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
నీటి వాటాలు తేలకుండా కేఆర్‌ఎంబీలోకి ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంపై ప్రభుత్వం తక్షణం దృష్టి పెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నా రు. శుక్రవారం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమా వేశంలో మాట్లాడారు. ఎన్నికలప్పుడు రాజకీయా లు, ఆ తర్వాత అభివృద్ధిపై చర్చించాలన్నదే తమ విధాన మని హరీశ్‌రావు చెప్పారు. బీఆర్ ఎస్‌కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, వాటి కోసం ఎంతకైనా తెగిస్తుందని అన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులు వారం రోజుల్లోగా (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తాయని తెలుస్తోందని, అదే జరిగితే ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరు గుతుందన్నారు. కేంద్రం జూలై 2021లోనే ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధి లోకి తేవాలని ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాద నను కేసీఆర్ గట్టిగా వ్యతిరేకించారని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఇంకా తేలనప్పుడు ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారని ప్రశ్నించారు. కృష్ణా నీటిని ఏపీకి 50%, తెలంగాణకు 50% పంపిణీ చేయాల్సిందిగా తాము షరతు విధించామని వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేసి 264 టీఎంసీల నీటిని నాగార్జున సాగ ర్కు విడుదల చేయాలని మరో షరతు పెట్టినట్లు వెల్లడించారు. ఏక పక్షంగా నిర్ణయం తీసుకోకుండా అపెక్స్ కమిటీ వేయాలని కోరినట్లు తెలిపారు. ఆపరేషన్ మాన్యువల్ రూపొందించకుండా ప్రాజె క్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారని ప్రశ్నించారు. కేఆర్ఎంబీలో ఉమ్మడి ప్రాజెక్టులను చేరిస్తే రాష్ట్రానికి ఆత్మహత్యా సదృశ్యమేనన్నారు. జల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తెస్తే జల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని హరీశ్‌రావు చెప్పారు. నాగార్జున సాగర్ ఎడమ గట్టు కాలువ ఆయకట్టుపై కూడా దీని ప్రభావం ఉంటుందన్నారు. హైదరాబాద్ తాగునీళ్లకు కూడా కటకట ఏర్పడుతుందని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని, రాజకీయం మాని రాష్ట్రానికి జరిగే నష్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం స్పందించకుంటే బీఆర్ఎస్ పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు. ఎప్పటికైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది గులాబీ జెండానేనని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి నష్టం కలిగినా నీటిని ఎత్తిపోయడంలో ఇబ్బంది లేదని, ఇప్పటికీ అక్కడ 4 నుంచి 5 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని తెలిపారు. కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
నెలలోగా ప్రాజెక్టుల అప్పగింత
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను నెల రోజుల్లోగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సమ్మతి తెలిపా యి. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్ సీలు, కృష్ణా బోర్డు సమావేశమై.. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన 15 ప్రధాన కాంపోనెంట్లు/ఔట్ లెట్లను కృష్ణా బోర్డుకు అప్పగించడంలో అనుసరించాల్సిన విధివిధానాల(హ్యాండింగ్ ఓవర్ ప్రొటోకాల్స్)కు అంగీకారం తెలిపాయి. అదేవిధంగా పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణా ళికను వారం రోజుల్లోగా సిద్ధం చేస్తామని తెలిపా యి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ తాజాగా ప్రకటించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఈ నెల 17న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఈ మేరకు అంగీకరించినట్టు సమావేశపు మినట్స్‌లో ఆ శాఖ పొందుపరిచింది. తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ తర ఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణ రెడ్డితో పాటు కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్‌కుమార్, కేంద్ర జలసంఘం చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాగర్ వద్ద నో ఎంట్రీ నాగార్జునసాగర్ డ్యామ్ పరిసరాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు పటిష్ట బందోబస్తును కొనసాగించను న్నాయి. కృష్ణా బోర్డు నుంచి ముందస్తు అనుమతి లేకుంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్లు / అధికారులను సైతం ఇకపై డ్యామ్ పరిసరాల్లోకి అనుమతించరు. ఈ విషయంపై సైతం రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. నాగార్జునసాగర్ డ్యామ్ రెండు రాష్ట్రాల భూభాగాల పరిధిలో చెరి సగం వస్తుండగా, ఏదైనా మరమ్మతు పనులు చేపట్టేందుకు సంబంధిత భూభాగం పరిధిలోని రాష్ట్రం ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కృష్ణా బోర్డు పర్యవేక్షణలోనే ఈ పనులు చేయాల్సి ఉంటుంది. కేఆర్ఎంబీకి చెల్లించాల్సిన బకాయిలను సైతం తక్షణమే చెల్లిస్తామని రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో పురోగతిని సమీక్షించేందుకు 15 రోజుల తర్వాత మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీ వాదనలు ఇవే.. ఇతర అంశాలపై చర్చించి పరిష్కరించుకోవ డానికి ముందు నాగార్జునసాగర్ వద్ద 2023 డిసెంబర్ 28కి ముందు నెలకొని ఉన్న పరిస్థితులను పునరుద్ధరించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ సమావేశంలో కోరారు. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణకు 50:50 నిష్పత్తిలో కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. విద్యుదుత్పత్తి ద్వారా నీళ్లను తెలంగాణ కిందికి విడుదల చేస్తుండడంతో శ్రీశైలం జలాశ యంలో నిల్వలు అడుగంటిపోతున్నాయని ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్‌కుమార్ సమావేశం దృష్టికి తీసుకె ళ్లారు. సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కోసం కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చినా తెలంగాణ అధికారుల దయాదా క్షిణ్యాలపై ఆధారపడి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో తీసు కున్న నిర్ణయాలకు కట్టుబడి సాగర్ నుంచి నీటివిడుదలను నిలుపుదల చేశామని తెలిపారు. -
కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో.. ఫలించిన సీఎం జగన్ కృషి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగున్నరేళ్లుగా చేస్తున్న పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం నిర్ణయిం చింది. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వ అక్రమ నీటి వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది. దీనివల్ల మన రాష్ట్రానికే కాదు.. తెలంగాణకూ ప్రయోజనమే. రెండు రాష్ట్రాల హక్కులకు విఘాతం కలగదు. కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ చూపిన చొరవ, పట్టుదలను నీటి పారుదల రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఆనాడు ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టారని, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిరక్షించారని నిపుణులు కొనియాడుతున్నారు. హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చేసేందుకు విభజన చట్టం ద్వారా 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసేదాకా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని నిర్దేశించింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్‌ను 2014–15లో పూర్తిగా ఆదీనంలోకి తీసుకుంది. శ్రీశైలంలో మాత్రం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తెలంగాణలో ఉందనే సాకు చూపి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సాకు చూపి పులిచింతల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆధీనంలోకి తీసుకుంది. అయినా సరే.. ఆనాటి ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం కనీస ప్రయత్నం చేయలేదు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలన్న స్వార్ధంతో రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. ► శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే ఆరేడు వేల క్యూసెక్కులే తరలించడానికి సాధ్యమవుతుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే శ్రీశైలంలో నీటి కోటా ఉన్నా సరే సీమ అవసరాలకు నీటిని వినియోగించలేని దుస్థితి. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. తెలంగాణకు దిగువన నీటి అవసరాలు లేకపోయినా కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలంలో నీటిమట్టం తగ్గేలా ఆ ప్రభుత్వం చేస్తోంది. తద్వారా శ్రీశైలంలో ఏపీ వాటా జలాలు వినియోగించుకోకుండా చేస్తోంది. ► 2015లో ఇదే రీతిలో శ్రీశైలం నుంచి సాగర్‌కు తెలంగాణ తరలించిన నీటిని.. కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం విడుదల చేయాలని అప్పటి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ తోసిపుచ్చింది. దాంతో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని, రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి 2015, ఫిబ్రవరి 13న పోలీసులతో కలిసి ఆదిత్యనాథ్ దాస్ నాగార్జునసాగర్‌కు వచ్చారు. అయితే ఆనాటి సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయంగా లబ్ధి పొందాలనే లక్ష్యంతో.. వాటిని స్వాధీనం చేసుకోకుండా తక్షణమే వెనక్కి రావాలని ఆదిత్యనాథ్‌ను ఆదేశించారు. తద్వారా కృష్ణా జలాలపై రాష్ట్రం హక్కులు కోల్పోయేలా చేశారు. ► శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు, డిండి ఎత్తిపోతలతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచి.. సుంకేశుల బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల, భక్తరామదాస ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. వీటి ద్వారా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ హరించివేస్తున్నా ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చడానికి తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. దీన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపివేసేలా తెలంగాణను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ► 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలిస్తోంది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా, తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ► శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణా బోర్డు ఏపీకి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని రాష్ట్ర అధికారుల విజ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. ఇదే అంశాన్ని సీఎం జగన్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. దాంతో నవంబర్ 30 తెల్లవారుజామున సీఈ మురళీనాథ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. -
నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి
సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏపీ భూభాగంలోని 6, తెలంగాణ భూభాగంలోని 9 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానం (హ్యాండింగ్ ఓవర్ ప్రోటోకాల్)ను వారంలోగా ఖరారు చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీకి దేబశ్రీ ముఖర్జీ చెప్పారు. త్రిసభ్య కమిటీ ఖరారు చేసిన విధానంపై 15 రోజుల్లోగా రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షించి, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదేశాల మేరకు కృష్ణా జలాల వివాదానికి తెరదించేందుకు దేబశ్రీ ముఖర్జీ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్, కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్విందర్‌సింగ్ వోరా తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుంచి సీఆరీ్పఎఫ్ పహారాలో సాగర్‌ను నిర్వహిస్తున్నామని, ఈ నెలలో కుడి కాలువ ద్వారా ఏపీకి 5 టీఎంసీలు విడుదల చేశామని కృష్ణా బోర్డు ఛైర్మన్ శివన్నందన్కుమార్ వివరించారు. వెనకడుగు కాదు.. ముందడుగే కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం నిర్వహణను ఏపీకి, సాగర్ నిర్వహణను తమకు అప్పగించారని తెలంగాణ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను నవంబర్ 30న అక్రమంగా ఆ రాష్ట్ర అధికారులు స్వా«దీనం చేసుకున్నారని, సాగర్‌పై నవంబర్ 29 నాటికి ఉన్న యధాస్థితిని కొనసాగించాలని కోరారు. దీనిపై రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ నిర్వహణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని 2014లో అధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి నవంబర్ 30 వరకూ తొమ్మిదేళ్లపాటు తెలంగాణ సర్కారు తమ హక్కులను కాలరాసిందని, హక్కుల పరిరక్షణ కోసమే మా భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి హెడ్ రెగ్యులేటర్‌ను స్వా«దీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ వెనకడుగు కాదు ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. తొలుత సాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామని, ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామంటూ చేసిన ప్రతిపాదనను ఏపీ అధికారులు సున్నితంగా తోసిపుచ్చారు. సాగర్‌ను మాత్రమే బోర్డుకు అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. సాగర్, శ్రీశైలంను ఒకేసారి కృష్ణా బోర్డుకు అప్పగిస్తేనే రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించవచ్చునని సూచించారు. ఇందుకు తెలంగాణ అధికారులు కూడా అంగీకరించారు. దాంతో శ్రీశైలం, సాగర్‌ను కృష్ణా బోర్డుకు ఒకే సారి అప్పగించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అంగీకరించారు. అప్పగింత తర్వాత నిర్వహణ నియమావళి కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రెండున్నరేళ్లైనా అమల్లోకి రాకపోవడంపై దేబశ్రీ ముఖర్జీ అసహనం వ్యక్తంచేశారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి, రెండు రాష్ట్రాల ఈఎన్సీల నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వారంలోగా శ్రీశైలం, సాగర్‌లలోని 15 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనందున, ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి (ఆపరేషన్ ప్రోటోకాల్)ని ఖరారు చేయలేమని తెలంగాణ అధికారులు చెప్పారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చాక ఆపరేషన్ ప్రోటోకాల్‌ను ఖరారు చేయాలని వారు చేసిన సూచనను సీడబ్ల్యూసీ చైర్మన్ వ్యతిరేకించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేటాయింపుల ఆధారంగానే 2015లో రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ తాత్కాలిక సర్దుబాటు చేశామని, వాటికి అనుగుణంగానే శ్రీశైలం, సాగర్ ఆపరేషన్ ప్రోటోకాల్ ముసాయిదా రూపొందించామని వివరించారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ప్రాజెక్టుల అప్పగింత తర్వాత ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారుపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చిన రాష్ట్రం కృష్ణా బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నాయని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ వివరించారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ స్పందిస్తూ.. తెలంగాణకంటే తాము రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వాటా నిధులు ఇచ్చాకే తాము కూడా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తక్షణమే వాటా నిధులు విడుదల చేయాలని తెలంగాణ అధికారులను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. -
కృష్ణా జలాల వివాదంపై నేడు భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా నది దిగువ బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించడమే అజెండాగా బుధవారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించనున్నారు. నీటి వాటాలు, వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై చర్చించనున్నారు. సాగర్ నిర్వహణపై ఏపీ, తెలంగాణ మధ్య నవంబర్ 30న వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణ మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు పరిధిని నిర్దేశించేవరకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కర్నూలు సీఈ(ఆంధ్రప్రదేశ్), సాగర్ నిర్వహణను ఆ ప్రాజెక్టు సీఈ(తెలంగాణ)కి అప్పగించింది. కానీ తమ భూభాగంలో ఉందంటూ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని ఆధీనంలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నా అప్పటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. వరద ప్రవాహం ప్రారంభం కాకపోయినా దిగువకు నీటిని వదిలేస్తూ.. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. శ్రీశైలం పాజెక్టును ఖాళీ చేస్తూ రాయలసీమ హక్కులను తెలంగాణ హరిస్తూ వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తూ సాగర్‌కు తరలించిన జలాలను.. కుడి కాలువకు విడుదల చేయకుండా రాష్ట్ర హక్కులను కాలరాస్తూ వస్తోంది. బోర్డు పరిధి నిర్దేశించినప్పటికీ.. దీనిపై 2021లో వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి దిగింది. దాంతో 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలి. కృష్ణా బోర్డు సమావేశంలో ఆ ప్రాజెక్టులను అప్పగించడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ ఆ తర్వాత తెలంగాణ అడ్డం తిరగడంతో ఇప్పటివరకు గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రాలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్లో దిగువన నీటి అవసరాలు లేకపోయినా.. శ్రీశైలంలో ఏపీకి కేటాయించిన 17 టీఎంసీలను విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదిలేసి సాగర్‌కు తరలించిన తెలంగాణ.. వాటిని ఏపీకి విడుదల చేయకుండా మొండికేసింది. దాంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి నవంబర్ 30న ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను వైఎస్ జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సాగర్ వివాదంతో కదలిన కేంద్రం సాగర్ నిర్వహణపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం చెలరేగడంతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి డిసెంబర్లో రెండు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సాగర్‌పై యధాస్థితిని కొనసాగిస్తూ.. సీఆర్పీఎఫ్ బలగాల పహారాలో నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించారు. రెండు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి వివాదానికి తెరదించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుకు అప్పగించడంతోపాటు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 2015లో చేసిన సర్దుబాటు మేరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాలు కొనసాగించడం, వరద జలాల మళ్లింపుపై బుధవారం జరిగే సమావేశంలో చర్చించనున్నారు. -
కృష్ణా బోర్డు నియంత్రణలోకి నాగార్జునసాగర్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ డ్యామ్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తాత్కా లికంగా తన అధీనంలోకి తీసుకుంది. సోమవారం బోర్డు సభ్యుడు అజయ్‌కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్లు రఘునాథ్, శివశంకరయ్య కలిసి సాగర్‌లోని గేట్లు 5,7వ నంబర్ గేట్లను ఎత్తి.. ఏపీకి నీటిని విడుదల చేశారు. సోమవారం రాత్రంతా 1000 క్యూసెక్కులు, మంగళవారం ఉదయం నుంచి రోజుకు 4–5 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 3.03 టీఎంసీలను సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ తాగు నీటి అవసరాల కోసం విడుదల చేయనున్నారు. 3.03 టీఎంసీల నీళ్లు విడుదల పూర్తి కాగానే మళ్లీ గేట్లను కృష్ణా బోర్డు యంత్రాంగమే మూసి వేయనుంది. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో.. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం డ్యాం నిర్వ హణ ఏపీ, సాగర్ డ్యామ్ నిర్వహణను తెలంగాణ చూసింది. గత నవంబర్ 29వ తేదీన భారీ బలగా లతో సాగర్ డ్యామ్‌లో ఏపీ వైపు ఉన్న గేట్లను, డ్యామ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసు కున్న విషయం విదితమే. ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లాతో పాటు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పలు దఫాలుగా సమావేశమయ్యారు. నవంబర్ 29వ తేదీకి ముందున్న పరిస్థితిని నెలకొల్పాలని తెలంగాణ కోరుతూ వస్తోంది. అయితే ఏపీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు సాగర్ డ్యామ్ పర్యవేక్షణ బాధ్యతలను సీఆర్పీఎఫ్కు అప్పగించారు. సాగర్ కుడి కాలువ నుంచి 5 టీఎంసీల నీటిని ఏపీకి విడుదల చేయడానికి అనుమతిస్తూ ఈనెల 5న కృష్ణాబోర్డు వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే ఏపీ 1.07 టీఎంసీలను సొంతంగా తరలించుకుంది. మిగిలిన నీళ్లను సైతం ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ విడుదల చేసుకునేందుకు ప్రయత్నించగా, సాగర్ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకున్నట్టు సమాచారం. కృష్ణాబోర్డు చైర్మన్‌కు తెలంగాణ ఫిర్యాదు మరోవైపు ఏపీ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సోమవారం తెలంగాణ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్‌లిద్దరూ కృష్ణాబోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ కలిసి ఫిర్యాదు చేశారు. పునర్విభజన చట్ట ప్రకారం నీటిని విడుదల చేసే అధికారం తమకే ఉందని, ఒకవేళ కుదరకపోతే కృష్ణాబోర్డు మాత్రమే నీటిని విడుదల చేయాలని మురళీధర్ స్పష్టం చేశారు. ఏపీ నీటిని విడుదల చేస్తే... ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. దాంతో హుటాహుటిన కృష్ణాబోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్..బోర్డు సభ్యుడు అజయ్‌కుమార్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రఘునాథ్, శివశంకరయ్యలను సాగర్‌కు పంపించారు. ఇండెంట్ ప్రకారం ఏపీకి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. నేడు ప్రత్యేక సమావేశం నాగార్జునసాగర్ డ్యామ్ పరిస్థితిపై చర్చించడానికి వీలుగా ఈనెల 9వ (మంగళవారం) తేదీన కృష్ణాబోర్డు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. వివాదాల్లేకుండా బోర్డు చేతుల్లోకి సాగర్, శ్రీశైలం డ్యామ్‌లు అందించాలని బోర్డు కోరే అవకాశం ఉంది. నీటి వాటాలు తేలకుండా ఏ విధంగా ప్రాజెక్టులు అప్పగిస్తామని తెలంగాణ వాదించే వీలుంది. -
సాగర్ కింద సాగు వద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్లో నాగార్జునసాగర్‌తోపాటు కల్వకుర్తి, భీమా, పాలేరు, వైరా, మల్లూరు, లంకాసాగర్, గొల్లవాగు ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించాలని రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ (స్కివం) కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుత నీటి లభ్యత ఆధారంగా పెద్ద చిన్న ప్రాజెక్టులన్నింటి కింద కలిపి 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని సరఫరా చేయగలమని తేల్చింది. ఈ ఏడాది వర్షాభావంతో ఎగువ నుంచి ఆశించిన వరద రాక కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్, ఇతర ప్రాజెక్టుల్లో నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల కింద ఖరీఫ్ (వానాకాలం) పంటల సాగే కష్టంగా కొనసాగింది. కొంత మేర ఉన్న నీళ్లూ దీనికే సరిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదని స్కివం కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం, తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని యాసంగి సీజన్లో ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించాలనే అంశంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ నేతృత్వంలో బుధవారం జలసౌధలో స్కివం కమిటీ సమావేశమై ప్రతిపాదనలను సిద్ధం చేసింది. 2023–24 యాసంగిలో 28.95 లక్షల ఎకరాలకు 215 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గత ఏడాది యాసంగి లక్ష్యం 33.46 లక్షల ఎకరాలకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. సాగర్ ఎడమ కాల్వ పరిధిలో కరువు నాగార్జున సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 157.61 టీఎంసీలు ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజీకిపైన వినియోగించుకోగలిగిన నీరు చాలా తక్కువ. దీనితో సాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు నీరివ్వలేమని అధికార యంత్రాంగం తేల్చింది. ఎడమ కాల్వ కింద మొత్తంగా 6.40లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులోనూ 57 టీఎంసీలే నీళ్లు ఉండటంతో.. ఏఎమ్మార్పి, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీరివ్వలేని పరిస్థితి. కేవలం నెట్టెంపాడు కింద 5వేల ఎకరాలకు, మూసీ ప్రాజెక్టు కింద 30వేల ఎకరాలకే సాగునీరు ఇవ్వగలమని అధికారులు పేర్కొన్నారు. గోదావరి బేసిన్లో కాస్త మెరుగ్గా.. గోదావరి బేసిన్ పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 11.55లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఎస్సారెస్పీ నిల్వ సామర్థ్యం 90టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 78.66 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 6.50 టీఎంసీలను తాగునీటికి, మిగతా నీటిని యాసంగి పంటల కోసం కేటాయించారు. ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద మొత్తంగా 9,65,013 ఎకరాలు ఉన్నా.. 8,28,297 ఎకరాలకే సాగునీరివ్వాలని లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందులో 3.87 లక్షల ఎకరాలు ఆరుతడి పంటలకు, 4.41 లక్షల ఎకరాలు తరి పంటలకు నీళ్లు ఇవ్వనున్నారు. ఆన్ ఆఫ్ పద్ధతిలో సాగునీరు: స్కివం కమిటీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన వెంటనే ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల తేదీలను ఖరారు చేసేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో.. అంటే 8 రోజులు నీటి విడుదల చేస్తూ, 7 రోజులు ఆపుతూ ఇస్తారు. ఇప్పటికే ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
కృష్ణా బోర్డుకు సాగర్