
సాక్షి,నల్లగొండజిల్లా: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం తలెత్తింది. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారుల మధ్య మళ్లీ ఘర్షణ చోటు చేసుకుంది. నాగార్జునసాగర్ మీటర్ రీడింగ్ కోసం వెళ్లిన తెలంగాణ అధికారుల బృందాన్ని ఏపీ ఇరిగేషన్ అధికారులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది.
రైట్ కెనాల్ వద్ద మీకేం పనంటూ తెలంగాణ అధికారులను ఆంధ్రప్రదేశ్ అధికారులు అడ్డుకున్నారు.ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది. ఏపీ అధికారుల తీరుపై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ)కి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు.
కాగా, గత ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ, తెలంగాణ మధ్య జల ఘర్షణలు జరిగాయి. దీంతో ఏపీ, తెలంగాణల్లో రెండు వైపులా ఆయా ప్రభుత్వాలు భారీగా పోలీసులను మోహరించాయి.
ఇదీ చదవండి: మరో విద్యుత్ ఉద్యమానికి సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment