Water dispute
-
తెలుగు రాష్ట్రాలమధ్య మరోసారి జల వివాదం.. నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత
సాక్షి,నల్లగొండజిల్లా: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం తలెత్తింది. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారుల మధ్య మళ్లీ ఘర్షణ చోటు చేసుకుంది. నాగార్జునసాగర్ మీటర్ రీడింగ్ కోసం వెళ్లిన తెలంగాణ అధికారుల బృందాన్ని ఏపీ ఇరిగేషన్ అధికారులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది.రైట్ కెనాల్ వద్ద మీకేం పనంటూ తెలంగాణ అధికారులను ఆంధ్రప్రదేశ్ అధికారులు అడ్డుకున్నారు.ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది. ఏపీ అధికారుల తీరుపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. కాగా, గత ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ, తెలంగాణ మధ్య జల ఘర్షణలు జరిగాయి. దీంతో ఏపీ, తెలంగాణల్లో రెండు వైపులా ఆయా ప్రభుత్వాలు భారీగా పోలీసులను మోహరించాయి. ఇదీ చదవండి: మరో విద్యుత్ ఉద్యమానికి సిద్ధం -
జలవివాదాల పరిష్కారానికి ఇదే మార్గం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య కృష్ణా, గోదావరి నదీజలాల వివాదాల సమస్య కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. గత అనుభవాల రీత్యా రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ సమస్య పరిష్కారం అంత సులువు కాదు కాబట్టి అంతర్జాతీయ జలవివాదాల పరిష్కారానికి ప్రపంచస్థాయిలో రూపొందించిన ‘హెల్సెంకీ’ జలసూత్రమే శరణ్యమనిపిస్తోంది. ఏ దేశంలోనైనా ఎగువన ఉన్న రాష్ట్రానికే నదీజలాలను ముందుగా వినియోగించుకునే సర్వహక్కు ఉంటుందని, దిగువన ఉన్న రాష్ట్రాలు ఆ తరువాతనే నదీజలాలను వినియోగించుకునే హక్కు ఉంటుందన్న వాదనను ‘హెల్సెంకీ’ ప్రపంచ మహాసభ తిరస్కరించింది. సమానస్థాయిలో నదీజలాలను ముందు తాగునీటికీ, సాగునీటి అవసరాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి, వాడుకోవాలని ‘హెల్సెంకీ’ మహాసభ 1966లో ఏకగ్రీవంగా తీర్మానించింది. రాజ్యాంగానికి, దేశ ఫెడరల్ స్వభావానికి పరమ విరుద్ధంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని, పరిశ్రమల్ని ‘చాప చుట్టేసి’ భారీ స్థాయిలో ప్రైవేట్ గుత్తాధిపతులకు, పాలకులు ధారా దత్తం చేయడానికి కేంద్రపాలకులు నిర్ణయించేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారం కూడా జటిలమవు తోంది! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అర్ధాంతరంగా చీలగొట్టి తమాషా చూస్తున్న నిన్నటి కాంగ్రెస్, నేటి బీజేపీ పాలకులు సరికొత్త విభజన నాటకం ఆడుతూ వస్తున్నారు. దీంట్లో భాగంగానే విభజిత రాష్ట్ర ప్రయోజనాలకు ఉద్దేశించిన కేంద్ర ఒప్పందాలకు విరుద్ధంగా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల మధ్య కృష్ణ, గోదావరి నదీజలాల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య కృష్ణా, గోదావరి నదీజలాల వివాదాల సమస్య కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. గత అనుభవాల రీత్యా రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ సమస్య పరిష్కారం అంత సులువు కాదు కాబట్టి అంతర్జాతీయ జలవివాదాల పరిష్కారానికి ప్రపంచస్థాయిలో రూపొందించిన ‘హెల్సెంకీ’ జల సూత్రమే శరణ్యమనిపిస్తోంది. పైగా ఇప్పటిదాకా జల వివాదాల పరి ష్కారానికి స్వతంత్ర శక్తులుగా వ్యవహరిస్తున్న ప్రత్యేక రివర్బోర్టులు కూడా కేంద్రం అధీనంలోనే జారుకునే ప్రమాదం ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచీ కృష్ణా, గోదావరి నదులపై ఉన్న మేజర్, మధ్య రకం సాగునీటి ప్రాజెక్టులన్నీ కేంద్రం అధీనంలోకి జారుకోనున్నా యంటూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కృష్ణానదిపైన ఆధా రపడిన వివిధ స్థాయి ప్రాజెక్టులు 36 కాగా, గోదావరి నదీ జలాలపై ఆధారపడిన రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఒడిశాలతో కలిపి 21 ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ప్రాజెక్టులతోపాటు వాటికి సంబం ధించిన అనుబంధ విభాగాలన్నీ కూడా (బ్యారేజ్‌లు, డ్యామ్‌లు, రిజ ర్వాయర్లు, తదితర నిర్మాణ భాగాలు సహా) ఇకపై కేంద్ర సంస్థల పరిధిలోనే జారుకుంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను నిష్పాక్షి కంగా ఉంచే పేరిట ఈ రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు రెండు రివర్బోర్డులలోనూ ప్రధాన పదవులలో ఉండరు! ఇక కృష్ణానదీ జల వ్యవస్థ కిందకు ఏపీ, తెలంగాణలు రెండింటి పరిధిలోకి వచ్చే ప్రాజె క్టులు శ్రీశైలం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం కుడికాల్వ, కాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు, టైల్‌పాండ్, తుంగభద్ర ప్రాజెక్టు, భైరవాని తిప్ప, రాజోలిబండ డైవర్షన్ పథకం, కె.సి. కెనాల్ ప్రాజెక్టు, గాజులదిన్నె. కాగా ఇంతవరకు కేంద్రం రెండు రాష్ట్రాలలోనూ ఇంకా అనుమతించని ప్రాజెక్టులు– తెలుగు గంగ, టి.జి.సి.హెడ్ వర్క్స్, వెలి గొండ ప్రాజెక్టు, దాని హెడ్ రెగ్యులేటర్ టన్నెల్, తదితర భాగాలు. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం, పంప్‌హౌస్, మచ్చుమర్రి లిఫ్ట్ ఇరి గేషన్ పథకం, గాలేరు–నగరి సుజల స్రవంతి, దాని హెడ్‌వర్క్స్, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం, మునిమేరు ప్రాజెక్టు పునర్నిర్మాణ పథకం. ఇక గోదావరి నదిపై తల పెట్టిన ఆంధ్ర–తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతించిన పథకాలు ఏవంటే... పెదవేగి (గుమ్మడిపల్లి) శ్రీ వై.వి. రామకృష్ణ (సూరెం పాలెం) రిజర్వాయర్ పథకం, ముసురుమిల్లి రిజర్వాయర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, కాటన్ బ్యారేజి, చాగల్నాడు ఎత్తి పోతల పథకం, భూపతి పాలెం రిజర్వాయర్, తదితరాలు, కాగా, గోదావరిపై కేంద్రం అనుమతించని ప్రాజెక్టులు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగే షన్ పథకం, పురుషోత్తపట్నం, ఎత్తిపోతల పథకం, (ఇదికూడా పోలవరం భారీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత నిలిచి పోతుంది.) చింతలపూడి ఎత్తి పోతల పథకం వెంకట నగరం. కృష్ణా– గోదావరి నదీ జలాల పంపిణీ వివాదంలో కేంద్రం విధానాలు మరిన్ని తగాదాలకు కారణమయ్యే అవకాశాలే ఎక్కువ కాబట్టి అంతర్జాతీయ జల వివాదాల పరిష్కారా నికి ప్రపంచ స్థాయిలో రూపొందించిన ‘హెల్సెంకీ’ జలసూత్రమే శరణ్యమనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆశపెట్టుకున్న బచావత్ ట్రిబ్యునల్ ప్రతిపాదనలు, తెలంగాణ ఆశపెట్టుకున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రతిపాదనలు గానీ ఆచరణలో అక్కరకు రానందున, హేతుబద్ధమైన అంతర్జాతీయ జలవివాదాల పరిష్కారాలకు మూలమైన వివాదరహితమైన ‘హెల్సెంకీ’ నదీజలాల పంపిణీ వ్యవస్థే భారతదేశానికి శరణ్యమని అనిపిస్తోంది. ఏ దేశంలోనైనా ఎగువన ఉన్న రాష్ట్రానికే నదీజలాలను ముందుగా వినియోగించుకునే సర్వహక్కు ఉంటుందని, దిగువన ఉన్న రాష్ట్రాలు ఆ తరువాతనే నదీజలాలను వినియోగించుకునే హక్కు ఉంటుందన్న వాదనను ‘హెల్సెంకీ’ ప్రపంచ మహాసభ తిర స్కరించింది. సమానస్థాయిలో నదీజలాలను ముందు తాగునీటికీ, సాగు నీటి అవసరాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి, వాడుకోవాలని ‘హెల్సెంకీ’ మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అందుకే బచావత్ ట్రిబ్యునల్ కాలపరిమితి 2000–2001 సంవత్సరంతో ముగియనుం డగా, నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి కృష్ణా జలాల్లో అదనపు నీటి సంపద సముద్రం పాలుకాకుండా వాడుకోవచ్చుగానీ ఆ నీటిపైన తన హక్కును మాత్రం చాటుకోకూడదని ఆదేశించి పోయింది. కానీ ఆ స్థితిలో ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన వెలగబెడుతూ వచ్చిన నాటి కాంగ్రెస్, టీడీపీ పాలకులు (ఎన్టీఆర్, వై.ఎస్. రాజ శేఖరరెడ్డి, నేటి వైఎస్సార్సీపీ సార«థి జగన్మోహన్రెడ్డి మినహా) బచావత్ సూచించినట్టు నదీ జలసంపద అనవసరంగా సముద్రం పాలు కాకుండా ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలన్న ప్రతిపాదనను పెడ చెవిన పెట్టిన ఫలితంగా, కనీసం చెక్‌డ్యామ్‌ను కూడా సకాలంలో నిర్మించుకోకుండా కాలక్షేపం చేస్తూ వచ్చారు. ముందస్తుగా నిర్దిష్టమైన ఒప్పందాలు రాష్ట్రాల మధ్య లేకుండా భవిష్యత్తులో వినియోగం పేరిట నదీ జలరాశిని దొంగచాటుగా రిజర్వు చేయడానికి ప్రయత్నిం చడం సాధ్యపడని విషయమని ప్రసిద్ధ ఇరిగేషన్ నిపుణుడు లిప్పర్ చెప్పాడు! కనుకనే ‘హెల్సెంకీ’ నిబంధనలు నదీ జలరాశి వాడకంలో హేతుబద్ధ వినియోగానికి మాత్రమే కట్టుబడి ఉండాలని రాష్ట్రాలను, దేశాలను శాసించవలసి వచ్చిందని గుర్తించాలి! జలరాశి ‘ముందస్తు దొంగవాడకం’ సూత్రాన్ని అనుమతించిన అమెరికా సైనికాధికారి హెర్మాన్ సూత్రం చెల్లనేరదని కూడా హెల్సెంకీ నిబంధనలు స్పష్టం చేశాయి. అమెరికా ‘హెర్మాన్’ దొంగవాడకం సూత్రాన్ని ఏనాడో ఒక కేసులో కలకత్తా హైకోర్టు (1906–07) కొట్టే సింది! ఉభయ రాష్ట్రాల వాడకానికి సరిపడా నీళ్లు నదిలో లేనప్పుడు నదీ జలరాశిని సమంగా సంబంధిత రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉంటుంది. చివరికి నైలునదీ జలాల వివాదంలో కూడా సూడాన్, ఈజిప్టులు, అమెరికాలోని రాష్ట్రాలూ, హెల్సెంకీ అంతర్జా తీయ నిబంధనలనే పాటించాల్సి వచ్చింది! కృష్ణా–గోదావరి జల నిధుల వాడక సమస్యలను పరిష్కరించడానికి రివర్ ర్యాలీ వ్యవస్థ ఉన్నా తాత్సారం జరగడానికి కారణం... ప్రజలకు దూరమైన పాల కులు, వారి స్వప్రయోజనాలేనని మరవరాదు. ఈ రకమైన వారస త్వానికి, ఎన్టీఆర్, వైఎస్సార్ ఉమ్మడి ఏపీ పగ్గాలు చేపట్టిన తరు వాతనే గండిపడింది. ఈ అనుభవాలన్నింటినీ గుణపాఠాలుగా భావించి ఏపీ సీఎం స్థానంలో ఉండి, వైఎస్సార్ అనుభవచ్ఛాయల నుంచి దూసుకువచ్చి నవరత్నాలు పేర్చడమే కాకుండా, అంతకుమించిన ప్రజాసంక్షేమ పథకాలతో, కేంద్ర నాయకత్వాలు సమగ్ర ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి తలపెడు తున్న ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్న చిరంజీవి, యువనేత వైఎస్ జగన్. అతను మానవ, మానవేతర ప్రకృ తులు కల్పించిన సవాళ్లను ఎదుర్కొంటూ మాట తప్పకుండా, మడమ తిప్పకుండానే’ దూసుకుపోతున్నాడు. గనుకనే 6 కోట్లమంది ప్రజలు ‘కోలాహల నాయకా శెభాషురే’ అని తనని దీవిస్తున్నారు! -ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఏపీ అధికారుల వాదనలు సమర్థించిన కేఆర్ఎంబీ
సాక్షి, హైదరాబాద్: ఏపీ అధికారులు విద్యుత్ ఉత్పత్తిపై వ్యక్తం చేసిన అభ్యంతరాలను కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ పరిగణలోకి తీసుకున్నారు. ఏపీ అధికారుల వాదనలు కేఆర్ఎంబీ సమర్థించింది. సాగర్, కృష్ణా డెల్టాలకు అవసరాలకు అనుగుణంగానే.. విద్యుత్ ఉత్పత్తి ఉండాలని కేఆర్ఎంబీ చైర్మన్ తెలిపారు. దీంతో జలవిద్యుత్ ఉత్పత్తిలో చైర్మన్ నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన సమాధానంతో సంతృప్తి చెందని తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన బుధవారం జలసౌధలో జరిగిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. ఏపీ నుంచి జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్యామలరావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలవనరుల అంతర్ రాష్ట్ర జల విభాగం సీఈ శ్రీనివాస్ రెడ్డి హాజరుకాగా, తెలంగాణ నుంచి జల వనరుల శాఖ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధరరావు, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్ కుమార్ హాజరయ్యారు. చదవండి: రైతు రథం.. టీడీపీ నాయకుల అవినీతి పథం -
కొనసాగుతున్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం
సాక్షి, హైదరాబాద్: జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం కొనసాగుతోంది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. ఏపీ నుంచి జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్యామలరావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలవనరుల అంతర్ రాష్ట్ర జల విభాగం సీఈ శ్రీనివాస్ రెడ్డి హాజరుకాగా, తెలంగాణ నుంచి జల వనరుల శాఖ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధరరావు, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్ కుమార్ హాజరయ్యారు. -
కృష్ణా రివర్ బోర్డ్ సమావేశానికి హాజరు కానున్న ఏపీ అధికారులు
అమరావతి: విజయవాడలో రేపు (బుధవారం) కృష్ణా రివర్ బోర్డ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ నుంచి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఈఎన్సి నారాయణ రెడ్డి, ఇంటర్ స్టేట్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి హజరు కానున్నారు. తెలంగాణ అక్రమ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని ఈ సమావేశంలో ఏపీ అధికారులు కోరనున్నారు. ఈ ఏడాది ఏపీకి 80 శాతం, తెలంగాణకు 20 శాతం కృష్ణాజలాలు కేటాయించాలని బోర్డును ఏపీ అధికారులు కోరే అవకాశం ఉంది. అదే విధంగా, మిగులు జలాల వినియోగాన్ని లెక్కించాలన్న తెలంగాణ వాదనను ఏపీ అధికారులు తోసిపుచ్చనున్నారు. మొత్తం పది అంశాలపై తమ వాదనను వినిపిస్తామని ఏపీ అధికారులు తెలిపారు. చదవండి: వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో ఏపీ మరో రికార్డు -
కృష్ణా జలాల పంపకాలపై కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ
విజయవాడ: కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తప్పు పట్టింది. ఈ విషయంపై కేఆర్ఎంబీకి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ లేఖ రాసింది. కృష్ణా ట్రిబ్యునల్ గతంలోనే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపిందని ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల పైన ఇంకా ట్రిబ్యునల్ దగ్గర విచారణ జరుగుతోందని తెలిపింది. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రతిపాదించిన 50:50 ఫార్ములా సమంజసం కాదని పేర్కొంది. వాస్తవానికి ఏపీకి 70 శాతం తెలంగాణకి 30శాతం కేటాయింపులు జరపాల్సి ఉందని, ఈ ఏడాది నీటి కేటాయింపులు ఈ ప్రాతిపదికనే చేపట్టాలని సూచించింది. అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నీటి వినియోగం చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది. చదవండి: అసభ్య వీడియోల కేసులో ముగ్గురి అరెస్టు -
శ్రీశైలం–సాగర్ మధ్యలో కృష్ణమ్మ మాయం!
సాక్షి, అమరావతి: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ మధ్య కృష్ణా నదిలో ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆగస్టు 11వతేదీ మధ్య ఏకంగా 55.36 టీఎంసీలు మాయమయ్యాయి! ఆ నీటిని ఏ ఇంద్రజాలికుడూ అదృశ్యం చేయలేదు. మరి అన్ని జలాలు హఠాత్తుగా ఏమయ్యాయి..? ఎగువ నుంచి నాగార్జునసాగర్‌కు చేరిన నీటిని సాగర్ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీల ద్వారా తెలంగాణ సర్కార్ దారి మళ్లించేసింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ సర్కారు తప్పుడు నీటి లెక్కలు చెబుతోందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రవాహాలు ఏమయ్యాయి..? శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం కనీస స్థాయికి దిగువన ఉన్నప్పటికీ ప్రాజెక్టు నిర్వహణ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కుతూ, కృష్ణా బోర్డు ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ గత జూన్ 1వతేదీన తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద ప్రవాహం రావడం వల్ల శ్రీశైలంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరడంతో గత నెల 28న గేట్లు ఎత్తివేసి దిగువకు ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. జూన్ 1 నుంచి ఆగస్టు 11 వరకు శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా 11,21,506 క్యూసెక్కులను తెలంగాణ సర్కార్ దిగువకు తరలించేసింది. మరోవైపు గత నెల 27 నుంచి బుధవారం వరకూ కుడి గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ ఏపీ ప్రభుత్వం 4,70,117 క్యూసెక్కులను దిగువకు వదిలేసింది. ఇక గత నెల 28 నుంచి బుధవారం వరకూ స్పిల్ వే గేట్ల ద్వారా 25,48,229 క్యూసెక్కులను దిగువకు వదిలేశారు. అంటే కుడి, ఎడమ గట్టు విద్యుత్కేంద్రాలు, స్పిల్ వే గేట్ల ద్వారా దిగువకు 41,39,852 క్యూసెక్కులు (357.70 టీఎంసీలు) శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేశారు. అయితే ఇందులో 34,99,204 క్యూసెక్కులు (302.34 టీఎంసీలు) మాత్రమే నాగార్జునసాగర్‌కు చేరాయని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. మరి శ్రీశైలం, సాగర్ మధ్యన కృష్ణా నదిలో 6,40,648 క్యూసెక్కులు (55.36 టీఎంసీలు) ఏమయ్యాయన్న అంశంపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు నోరుమెదపడం లేదు. వాటిని లెక్కలోకి తీసుకున్నా... శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ మధ్య కృష్ణా నది పొడవు సుమారు 73 కి.మీ. ఉంటుంది. ప్రవాహం రూపంలో, నదీ గర్భంలో భూగర్భ జలాల రూపంలో రెండు మూడు టీఎంసీలకు మించి ఉండే అవకాశం లేదని నీటిపారుదల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన దాదాపు 52 టీఎంసీలు మాయమైనట్లు స్పష్టమవుతోంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు), ఇతర ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలను మళ్లించేసిన తెలంగాణ సర్కార్ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు శ్రీశైలం నుంచి సాగర్‌కు విడుదల చేసిన నీటిపై తప్పుడు లెక్కలు చెబుతోందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తెచ్చి ఆ నీటిని తెలంగాణ సర్కార్ కోటా కింద లెక్కించాల్సిందిగా కోరాలని ఏపీ జలవనరుల శాఖ వర్గాలు నిర్ణయించాయి. -
దాదాగిరీ ఎవరు చేస్తున్నారో.. ప్రజలు గమనిస్తున్నారు: సజ్జల
-
సోము వీర్రాజు వ్యాఖ్యలు సరికావు: బాలినేని
సాక్షి, ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి గురించి తెలిసి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు మాట్లాడటం సరికాదు అని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కోవిడ్ ప్రభావంతో అన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులు క్షీణించాయని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పులు చేస్తే.. సోము వీర్రాజు ఎందుకు మాట్లాడలేదని బాలినేని ప్రశ్నించారు. జలాల విషయంలో చంద్రబాబు చేస్తున్న రాజకీయలు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా ఉన్నాయని ఆయన మండి పడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి వుంటే... జలవివాదంపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలి అని మంత్రి బాలినేని డిమాండ్ చేశారు. -
ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం ఆపాలి : సీ.రామచంద్రయ్య
-
‘గెజిట్’పై ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్న విషయమై ఇరిగేషన్ శాఖ తీవ్ర మంతనాలు జరుపుతోంది. రాష్ట్ర ప్రాజెక్టులపై పడే ప్రభావం, బోర్డుకు కొత్తగా సంక్రమించే హక్కులు తదితరాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో సోమవారం ఈ అంశంపై ప్రత్యేక సమావేశం జరపనుంది. ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రతజ్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ఈఎన్సీలతోపాటు అంతర్రాష్ట్ర జల విభాగ ఇంజనీర్లు, ఇతర న్యాయ నిపుణులు హాజరయ్యే అవకాశం ఉంది. గెజిట్‌తో రాష్ట్రానికి జరిగిన న్యాయాన్యాయాలు, తెలంగాణ భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరుతెన్నులు, న్యాయ పోరాటం, కొత్త ట్రిబ్యునల్ కోసం తేవాల్సిన ఒత్తిడి వంటి అంశాల గురించి ఈ భేటీలో చర్చించనున్నారు. న్యాయ పోరాటమా.. కొత్త ట్రిబ్యునలా? కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలో ఉంచడాన్ని తెలంగాణ తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు లేకుండా బోర్డుల పరిధిని నిర్ణయించరాదని కోరినా కేంద్రం మాత్రం వాటి పరిధిని నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాలు బోర్డుల పరిధిని నోటిఫై చేసేందుకు సమ్మతించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో గెజిట్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లే విషయమై రాష్ట్రం తర్జనభర్జన పడుతోంది. సుప్రీంకు వెళ్లినా రాష్ట్రానికి పెద్దగా ఉపశమనం ఉండదనే భావన ప్రభుత్వ పెద్దల నుంచి వస్తోంది. గెజిట్‌పై కొట్లాడటంకన్నా కొత్త ట్రిబ్యునల్ చేత విచారణ జరిపించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే రాష్ట్రానికి నదీ జలాల్లో వాటాలు పెరుగుతాయని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని కేంద్ర మంత్రి స్వయంగా అపెక్స్ భేటీలో చెప్పిన నేపథ్యంలో కేంద్రం తన మాటకు కట్టుబడి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ఉండాలనే సూచనలు వస్తున్నాయి. కొత్త ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో విచారణ జరిగితే పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల్లో తెలంగాణ కనీసం 500 టీఎంసీల వరకు నీటి వాటా దక్కించుకునే అవకాశం ఉంటుందని, వరద జలాల ఆధారంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు నికర జలాల లభ్యత పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై సోమవారం భేటీలో ఇంజనీర్ల సలహాలు తీసుకొని న్యాయపోరాటం చేయాలా లేక రాష్ట్ర వాటాలు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంతో ముందుకెళ్లాలా అనే విషయమై ఓ నిర్ణయానికి రానుంది. ప్రాజెక్టుల పనుల నిలుపుదలపై తర్జనభర్జన కేంద్రం తన నోటిఫికేషన్లో అనుమతులు లేని ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించడంతోపాటు నోటిఫికేషన్ వెలువడిన ఆరు నెలల్లోగా ఆయా ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను బోర్డులకు సమర్పించి, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం గెజిట్‌లో ప్రచురించిన తెలంగాణ ప్రాజెక్టుల పనులు నిలిపివేయడం, అనుమతుల ప్రక్రియ వేగిరం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. అనుమతుల్లేవని కేంద్రం చెబుతున్న తెలంగాణ ప్రాజెక్టుల్లో కృష్ణా బేసిన్ పరిధిలో పాలమూరు–రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, ఎస్ఎల్బీసీకి అదనంగా 10 టీఎంసీల తరలింపు, కల్వకుర్తి, కల్వకుర్తికి అదనంగా 10 టీఎంసీల తరలింపు, డిండి, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల, భక్త రామదాస, తుమ్మిళ్ల, నెట్టెంపాడు, నెట్టెంపాడు ద్వారా అదనంగా 3.40 టీఎంసీ తరలింపు, దుబ్బవాగు, సీతారామ మూడో పంప్‌హౌస్, మున్నేరులు ఉండగా గోదావరి బేసిన్లోవి కంతనపల్లి బ్యారేజీ, కాళేశ్వరం ద్వారా అదనపు టీఎంసీ మళ్లింపు, రామప్ప–పాకాల, ప్రాణహిత, గూడెం ఎత్తిపోతల, చిన్న కాళేశ్వరం, చౌట్పల్లి హమ్మంత్రెడ్డి ఎత్తిపోతల, కందుకుర్తి ఎత్తిపోతల, సీతారామ, మోదికుంటవాగు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిపై ఎలా నడుచుకోవాలన్న విషయమై ఇంజనీర్ల నుంచి స్పష్టత తీసుకోనుంది. అలాగే ప్రాజెక్టుల పర్యావరణ, అటవీ అనుమతుల ప్రక్రియను వేగిరం చేసే అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నాయి. -
దీపనిర్వాణ గంధం
‘‘పోగాలము దాపురించినవారు దీపనిర్వాణ గంధమును ఆఘ్రాణించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని కనలేరు. మిత్ర వాక్యమును వినలేరు’’ అని పెద్దలు చెబుతారు. ఒక వ్యక్తి కాల ధర్మం చెందడానికి కొంతకాలం ముందునుంచే చూపు మంద గిస్తుంది కనుక అరుంధతీ నక్షత్రాన్ని చూడలేడు. వినికిడి శక్తిని కోల్పోతారు కనుక మిత్ర వాక్యమును వినలేడు. నాసికా పటిమ కూడా తగ్గుతుంది కాబట్టి దీపం ఆరిపోయేటప్పటి వాసనను పసిగట్టలేడు. ప్రతి మనిషీ జీవిత చరమాంకంలో ఈ పరిణా మాలకు లోనుకావడం సహజం. కానీ ఆ వయసు రాకముందే ఉద్దేశపూర్వకంగా నిజానిజాలను కనడానికి, హితోక్తులను విన డానికి నిరాకరించే వారికి సైతం పోగాలము దాపురిస్తుందని కూడా అర్థం తీసుకోవాలి. ఈ హితవచనం వ్యక్తులకే కాదు వ్యవస్థలక్కూడా వర్తిస్తుంది. చిన్నయసూరి ‘పంచతంత్రం’లోని పైవాక్య సారాంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నిద్ర పట్టనీయడం లేదు. వారి నాసికలకు దీప నిర్వాణ గంధం సోకుతున్నది. పార్టీ ఎక్కువకాలం బతికే అవకాశం లేదన్న అభిప్రాయం కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల స్థాయి వరకు బలపడుతున్నది. ఆమధ్య తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సందర్భంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వీడియో వైరల్ అయింది. ‘పార్టీ లేదు... బొక్కా లేద’ంటూ నిస్పృహతో ఆయన మాట్లాడారు. ఇప్పుడయితే ఆ పార్టీలో అడుగుకో అచ్చెన్న. ఈమధ్యనే ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్రెడ్డి గారి పార్టీయే గెలుస్తుందని జోస్యం చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన ఓ గుంటూరు నాయకుడు తన సన్నిహితులతో ఈమధ్య తన ఆవేదన పంచుకున్నారట. ‘ఈ పార్టీ పని అయిపోయినట్టే. కరోనా కాలం ముగిసేంతవరకు విశ్రాంతి తీసుకుందాం. ఆ తరువాత ఎంట్రీ దొరికితే వైసీపీ, లేకపోతే బీజేపీ. ఇదే మన తక్షణ కర్తవ్యమ’న్నట్టుగా చెప్పుకొచ్చారట. తాజాగా ఉత్తరాంధ్ర పార్టీ నాయకురాలు శోభా హైమవతి పార్టీకి రాజీనామా చేశారు. ఆమె తెలుగు మహిళ ఉమ్మడి రాష్ట్రం అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ బాటలో ఇంకా చాలామందే ఉన్నారు గానీ ఫిరాయింపులకు వైసీపీ గేట్లు తెరవకపోవడం వల్లనే ఆగిపోయారనే అభిప్రాయం వుంది. ఈమధ్య కృష్ణా నదీ జలాల వినియోగంపై తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ నేతల మధ్య వాగ్వివాదం మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పొరుగు రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య వివాదాలుండేవి. ఇప్పుడు కృష్ణానదే సరిహద్దుగా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాలంలో ‘తలాపునే పారుతోంది గోదావరి’ అని పాడే వారు... అయినా ఆ నీళ్లు తమ గొంతు తడపడం లేదనే అర్థంలో. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు గోదావరి జలాలు తెలంగాణ అంతటా గలగలా పారుతున్నాయి. కృష్ణా బేసిన్‌ను సైతం చీల్చుకుంటూ వెళ్లి బీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. చీలిక తర్వాత కొత్త రాష్ట్రంలోని అత్యధిక భౌగోళిక ప్రాంతానికి ‘తలాపునే పారుతోంది కృష్ణానది’. ఆ నీళ్లు తమ గొంతు తడపాలనీ, పెన్నా బేసిన్‌ను సైతం చీల్చుకుంటూ వెళ్లి బీడు భూముల్ని సస్యశ్యామలం చేయాలనే సెంటిమెంట్ రేకెత్తడం సహజం. హేతుబద్ధమైన పరిష్కారంతో రెండు రాష్ట్రాల వివాదాలకు చెక్ పెట్టడం అసాధ్యమేమీ కాదు. ఇక్కడ ఆలోచించవలసినది తెలుగుదేశం పార్టీకి దాపురించిన పోగాలం గురించే. నదీజలాల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడినప్పుడు ఒక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలూ ఒక్క తాటిపైకి రావడాన్ని మనం ఇంతకాలంగా చూస్తూ వచ్చాము. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకిస్తున్న ‘రాయలసీమ ఎత్తిపోతల పథకా’న్ని తామూ వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు శాసనసభ్యులు లేఖ రాయడం కలకలం సృష్టించింది. దీనిపై సదరు ఎమ్మెల్యేల సన్నిహితులు, పార్టీ నాయకులూ వారిని నిలదీశారట. ‘మాకే పాపం తెలియదు, రాయించి పంపిన లేఖపై మాచేత బల వంతంగా సంతకాలు పెట్టించా’రని ఎమ్మెల్యేలు వాపోయారట. ఆత్మహత్యా సదృశ్యమైన ఈ ‘బ్రిలియంట్ ఐడియా’ ఎవరిదని ఆరా తీసినప్పుడు వినిపించిన పేరు చినబాబు. ఇప్పుడా చినబాబే తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్యగా మారి కూర్చున్నారు. ఆ పార్టీ సీనియర్ నాయక శ్రేణుల్లో దాదాపుగా అందరూ లోకేశ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో రెండు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించడమే గాక, అపరిమితమైన అధికారాన్ని చలాయించి, అధికార యంత్రాంగాన్ని కనుసైగలతో శాసించి, రాజధాని ప్రాంతంలో ఏరికోరి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని కూడా ఓటమిపాలు కావడాన్ని నాయకులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఇంతటి అసమర్థ నాయకుడిని నెత్తిన పెట్టుకొని వైసీపీతో ఎట్లా పోరాడగలమని వారు సరాసరి అధినేతనే ప్రశ్నిస్తున్నారట. అధినేత మాత్రం తన వారసుడికే పార్టీ పగ్గాలను సైతం అప్పగించే ఆలోచనలో ఉన్నారు. ఆయన కలలు ఫలించి మొన్నటి ఎన్నికల్లో గెలిచి వుంటే ఈపాటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని లోకేశ్‌బాబు చేతిలో పెట్టి ఉండేవారట. ఓటమి వల్ల పెద్ద గండం నుంచి గట్టెక్కామన్న భావన సీనియర్ నేతల మాటల్లో ధ్వనిస్తున్నది. సీనియర్లకు బాబు మనసు తెలుసు గనుకనే ఇటీవల జరుగుతున్న సభల్లో కొంతమంది చేత జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారు. లోకేశ్ నాయకత్వంపై తమ నిరసనను కొందరు నేతలు ఆరకంగా వ్యక్తం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. ఈ పరిణామాలన్నీ ముదరక ముందే లోకేశ్‌కు మరింత క్రియాశీలక పాత్రను అప్పగించాలని బాబుపై ఒత్తిడి పెరుగుతున్నది. చంద్రబాబు తెరచాటుకే పరిమితమై లోకేశ్‌ను తెరముందు నిలబెట్టాలని ఆయన తరఫు లాబీయిస్టుల ప్రతి పాదన. ఇటువంటి ఆలోచనల్ని సీనియర్ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వారిని సంతృప్తిపరచడానికి కీలక నిర్ణయాలన్నీ ఇకమీదట తానే తీసుకుంటానని బాబు వారికి మాటిచ్చారట. దాదాపు ఇదే సమయంలో లోకేశ్‌బాబు తన సతీమణితో కలిసి వేరే ఇంట్లోకి మారిపోయారట. జూబ్లీహిల్స్‌లోని తమ పాత నివాసగృహం స్థానంలో కొత్తది మరింత విస్తరించి, చినబాబు అభిరుచి మేరకు ఐదారేళ్ల కిందనే విలాసవంతంగా నిర్మించారు. తల్లిదండ్రులతో కలిసి లోకేశ్ దంపతులు అక్కడే ఉండేవారు. ఇప్పుడాయన కొండాపూర్‌లో ఆరేడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఫామ్‌హౌస్‌లోకి మారిపోయారట. ఐటీ హబ్‌కు కేంద్రస్థానంగా ఉన్న కొండాపూర్ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఈ స్థలాన్ని లోకేశ్‌కు ఆయన నాయనమ్మ కీర్తిశేషులు అమ్మణ్ణమ్మ గారు బహూకరించారట. తన రెండెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆర్జించిన ఆదాయంతోనే అమ్మణ్ణమ్మ గారు మనవడికి ఇంత పెద్ద బహుమతిని ఇవ్వడం విశేషమే. ఇప్పుడు లోకేశ్ దంపతులు అక్కడే ఉంటున్నారని టీడీపీ శ్రేణుల ద్వారా తెలుస్తున్న సమాచారం. కొడుకూ - కోడలూ తల్లిదండ్రుల దగ్గరే ఉండాలనీ, వేరే కాపురం పెట్టగూడదనీ రూలేమీ లేదు. అది తప్పుపట్ట వలసిన విషయం కూడా కాదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఇది కూడా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీనియర్ల మాటకు చంద్రబాబు కొంత మేరకైనా చెవి ఒగ్గడం చినబాబుకు నచ్చలేదని ప్రచారం జరుగు తున్నది. కొత్త ఇంట్లో కొంతకాలంపాటు ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించినట్టు కనిపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క బర్త్‌డే సందర్భంగా ట్విట్టర్ వేదికపై లోకేశ్ ఆమెను అభినందించారు. ‘‘నిరంతరం ప్రజాసమస్యలపై గొంతెత్తుతూ, ఆపదలో ఉన్నవారికి నేనున్నా అంటూ సాయం అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న సీతక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ఇంకా మరికొన్ని ప్రశంసలను ఆయన కురిపించారు. ఎవరికైనా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కాకపోతే గతంలో టీడీపీ ఎమ్మెల్యేలకు ఎవరికైనా ఇన్ని ప్రశంసలతో కూడిన ట్వీట్‌ను లోకేశ్ చేశారా లేదా అన్నదే సందేహం. నాయకత్వ సమస్యతోపాటు మనుగడ సమస్య కూడా తెలుగుదేశం పార్టీకి సవాల్ విసురుతున్నది. ఇప్పుడు ఆ పార్టీ రంగు, రుచి, వాసన కోల్పోయింది. అంటే పార్టీని మృత్యుకళ ఆవహించింది. తెలుగుదేశం పార్టీ ఆశయాలేమిటి? లక్ష్యాలే మిటి? ఐడియాలజీ ఏమిటి? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సహస్రాబ్ది ఆరంభం నుంచీ సంక్షేమ ఎజెండాకు ప్రాధాన్యత పెరిగింది. దేశంలో, రాష్ట్రాల్లో అధికారం లోకి వచ్చిన ప్రతి పార్టీ తరతమ భేదాలతో సంక్షేమ కార్య క్రమాలను అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఐడియాలజీ అనేది కొంత సంక్లిష్టంగా మారినప్ప టికీ, ఆయా పార్టీల దీర్ఘకాలిక వ్యూహాలు, లక్ష్యాలను బట్టి, వివిధ అంశాలపై వాటి విధానాలను బట్టి ఆయా పార్టీల సైద్ధాంతికతను అంచనా వేయవచ్చు. కాంగ్రెస్ పార్టీది పద మూడు దశాబ్దాల చరిత్ర. చారిత్రక సందర్భాలను బట్టి దాని లక్ష్యాలు మారుతూ వచ్చాయి. లాహోర్ కాంగ్రెస్‌లో ‘పూర్ణ స్వరాజ్’, ఆవడి సభలో సోషలిస్టు తరహా సమాజం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంస్కరణలు... ఇలా ఎన్ని మార్పులకు లోనైనా ఆ పార్టీ ప్రవాహంలో అంతర్వాహినిగా దాని లౌకిక స్వభావం కొనసాగుతూనే వచ్చింది. భారతీయ జనతా పార్టీ తెరిచిన పుస్తకం. హిందూ సమాజ ఔన్నత్యమే లక్ష్యమైన పునా దులపై నిర్మితమైన కన్జర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీ అది. సోషలిస్టు సమాజ స్థాపనే కమ్యూనిస్టు పార్టీల ఆశయం. ద్రవిడ సంస్కృతీ సమాజ ఔన్నత్యాలే డీఎంకేల సిద్ధాంతం. ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్కు సమగ్రాభివృద్ధితో కూడిన బంగారు తెలంగాణ లక్ష్యం. అన్నివర్గాల సంక్షేమం, బలహీనవర్గాలు - మహిళల సాధికారత, హ్యూమన్ డెవలప్మెంట్ అనే అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ కనిపిస్తున్నది. మరి తెలుగుదేశం పార్టీ గురించి ఏమని చెప్పాలి? ఏమీ చెప్పలేని స్థితికి చంద్ర బాబు నాయకత్వంలో ఆ పార్టీ దిగజారింది. ఒక రాజకీయ పార్టీ స్వభావాన్ని ఆ పార్టీ కోల్పోయింది. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు దాని జెండా తెలుగుజాతి ఆత్మగౌరవం. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఎజెండా జన సంక్షేమం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధానం తలకిందులైంది. అదే సమయంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల ఫలితంగా బలపడుతున్న కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, క్రోనీ క్యాపిటలిజానికి విత్తనాలు చల్లుతూ ఆయన కాలం గడిపారు. సంక్షేమం అటకెక్కింది. రాజకీయాల్లోకి ధన ప్రభావాన్ని జొప్పించి, నీతిమంతులను దూరం పెట్టారు. ఒకరకమైన దళారీ రాజకీయ వ్యవస్థను సృష్టించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు మరింత సంకుచితంగా ఆయన మారిపోయారు. తానూ, తన కుటుంబం, తాను పోషించిన బినామీ కోటరి ప్రయోజనాలే పరమావధిగా ఐదేళ్లూ పాలించారు. ‘కోటరీకి కరెన్సీ - ప్రజలకు గ్రాఫిక్స్’గా గడిచాయా రోజులు. ఇందులో ఆశయాలనూ, సిద్ధాంతాలను ఎక్కడ వెదకాలి! మేనిఫెస్టోను అమలుచేయలేదు కనుక దానిని విశ్లేషించలేము. చివరి రోజుల్లో ఓట్ల కొను గోలుకు అధికారికంగా డబ్బులు పంచారు కనుక సంక్షేమంగా చెప్పలేము. అందుకే ఆ పార్టీ రంగూ, రుచీ, వాసన కోల్పోయింది. రాజకీయ పార్టీ లక్షణాలు మరుగునపడి ఒక సమూహంగా మాత్రమే మిగిలిపోయింది. ఇప్పుడది దీప నిర్వాణ గంధమును ఆఘ్రాణించే స్థితిలో లేదు. అరుంధతీ నక్షత్రాన్ని చూడలేకపోతున్నది. మిత్ర వాక్యమును వినలేకున్నది. మన పూర్వీకులు చెప్పినట్టు పోగాలము దాపురించిన లక్షణాలు గోచరించుచున్నవి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఒక్క నీటి బొట్టునూ వదులుకోం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి ఒక్క నీటి బొట్టును కూడా వదులుకోబోమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అలాగని ఇతర ప్రాంతాలవి ఆపబోమని చెప్పారు. నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడంలో సీఎం కేసీఆర్ తప్పులేదా అని ప్రశ్నించారు. బోర్డు సమావేశాలకు వెళ్లే బాధ్యత ఆయనకు లేదా అని నిలదీశారు. ఏడేళ్ల పాలనలో నీటి సమస్యల పరిష్కారంలో కేసీఆర్ విఫలమయ్యారని, రాజకీయం చేసేందుకే ఆయన నీటి సమస్యను ఎత్తుకుంటారని విమర్శించారు. శుక్రవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో నేతలు కొండా రాఘవరెడ్డి తదితరులతో కలిసి షర్మిల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు ‘తెలంగాణ నా గడ్డ. ఇక్కడ ప్రజలు సంతోషంగా లేరు. వారికి జరుగుతున్న అన్యాయాలపై పోరాడేందుకు, ప్రజలకు మేలు చేసేందుకే పార్టీ పెట్టాం. అంతేకానీ ఎవరిమీదనో అలిగి పార్టీ పెట్టలేదు. ఉద్యమకారుడిగా కేసీఆర్ అంటే అభిమానం ఉండేది. కానీ ఆయనలోని దొరతనం బయటపడుతోంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కష్టాలు చెప్పుకోవడానికి సామాన్యులకు సైతం అనుమతి ఉండేది. ఆడవాళ్లంటే వంటింటికే పరిమితం అవ్వాలనేది కేటీఆర్ ఉద్దేశమా? ఒక మహిళగా నేను పార్టీ పెట్టకూడదా? 3 లక్షల ఉద్యోగాలు ఇస్తే నా వ్రతం విజయవంతమైందని అనుకుంటా. పెద్ద మొగోడు కదా ఆ పనిచేసి చూపించమనండి..’అని షర్మిల అన్నారు. వైఎస్‌కు కాంగ్రెస్ వెన్నుపోటు ‘వైఎస్సార్ వల్లే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. కానీ టీడీపీలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌కు వెన్నుపోటు పొడిచారు. చనిపోయిన తర్వాత అయన పేరును ఎఫ్ఐఆర్లో పెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు అమ్ముడుపోయింది. బీజేపీ కూడా టీఆర్ఎస్తో కుమ్మక్కయ్కింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నిక మాత్రమే. ఈ ఎన్నికలో మేము పోటీ చేయబోము..’ అని తెలిపారు. తెలంగాణ కోసం వైఎస్ కృషి ‘దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ వ్యతిరేకి ఎంత మాత్రమూ కాదు. తెలంగాణ అంశంపై 2000 సంవత్సరంలోనే 41 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించారు. అలాగే 2004, 2009 యూపీఏ మేనిఫెస్టోల్లో సైతం పెట్టించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ వెనుకబాటుతనం తగ్గించేందుకు కృషి చేశారు..’ అని షర్మిల వివరించారు. ఏపీలో రాజన్న రాజ్య స్థాపన జరుగుతున్నట్టే ఉంది ఏపీలో రాక్షస పాలన వద్దనుకుని ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని షర్మిల చెప్పారు. అక్కడ రాజన్న రాజ్య స్థాపన జరుగుతున్నట్లే అనిపిస్తోందని అన్నారు. ఐతే ప్రజలే అంతిమ నిర్ణేతలని, పాలన నచ్చకపోతే వారే జవాబు చెబుతారని స్పష్టం చేశారు. -
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను ఆహ్వానిస్తున్నాం: సజ్జల
-
నోటిఫికేషన్ ఏపీ హక్కులను కాపాడుతుంది: శ్యామలరావు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడుతుందన్నారు ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు. అయితే నోటిఫికేషన్లో కొన్ని తప్పిదాలున్నాయని.. వాటిని సరిచేయమని కేంద్రాన్ని కోరతామన్నారు. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని ఏపీలోనే ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని శ్యామలరావు గుర్తు చేశారు. ఏపీలోని కొన్ని ప్రాజెక్ట్‌లను బోర్డు పరిధిలోకి తీసుకురావడం అనవసరం అన్నారు శ్యామలరావు. ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని విడుదల చేశాక.. ఎలా వినియోగించుకోవాలనేది దిగువ రాష్ట్రంగా ఏపీకున్న హక్కన్నారు శ్యామలరావు. దిగువనున్న ఏపీలో ప్రాజెక్ట్‌లు, కాల్వలు బోర్డు పర్యవేక్షణలో ఉంటే పంటలు దెబ్బతింటాయని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల అంశం చాలా సున్నితమైనదని.. దాన్ని నోటిఫై చేస్తే ఒక లాభం.. చేయకుంటే మరో లాభం అన్నారు శ్యామలరావు. -
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను ఆహ్వానిస్తున్నాం: సజ్జల
సాక్షి, అమరావతి: కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, న్యాయం తమ పక్కనే ఉందని.. విభజన సమయంలోనే బోర్డుల పరిధిని నిర్ణయించి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయ్యేది కాదన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను అడ్డగోలుగా వదిలేశారని.. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలకు గండి కొట్టిందని మండిపడ్డారు. తెలంగాణ దూకుడుగా ఉన్నా సంయమనం పాటించామన్నారు. సీఎం జగన్ రాజ్యాంగబద్ధంగా ఒత్తిడితెచ్చి విజయం సాధించారని అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ గెజిట్ నోటిఫికేషన్లో కొన్ని మార్చాల్సిన విషయాలున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై టీడీపీ అపోహలు సృష్టిస్తోంది. రాయలసీమకు సంబంధించి చంద్రబాబు వైఖరేంటి?. నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సి ఉంది. మహిళలకు 50శాతం ఇస్తున్నాం.. కసరత్తులో కొంత ఆలస్యం అయ్యింది. రేపు ఉదయం ప్రకటిస్తాం. విశాఖ స్టీల్స్ విషయంలో నిజాయితీతో పోరాటం చేస్తున్నాం’’ అని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇక జల వివాదాలు ఉండవు.. గెజిట్‌తో చాలా సమస్యలకు పరిష్కారం లభించిందని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇక జల వివాదాలు ఉండవన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు ఉండకూడదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులెవరూ ఇబ్బంది పడకూడదని.. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవడమే తమ కర్తవ్యమని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. -
నీళ్లపై న్యాయపోరాటం!
-
కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించాలి: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదిపై ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిని స్పష్టంగా నిర్దేశించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయా ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించి చట్టప్రకారం వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన కేంద్రమంత్రి షెకావత్‌తో భేటీ అయ్యారు. కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న చట్టవ్యతిరేక విధానాలను వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను తెలియజేసి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్రజలశక్తి మంత్రితో భేటీ అయినట్లు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల విస్తరణ, శ్రీశైలం ఎడమ కాలువ విస్తరణ ఏవిధంగా చట్ట విరుద్ధమో కేంద్రమంత్రికి వివరించినట్లు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేశ్వరం నుంచి విశాఖ జిల్లాలోని నరవ వరకు పైపులైను ద్వారా తాగునీరు తరలించే ప్రాజెక్టుకు అయ్యే రూ.3,573 కోట్లలో సగం కేంద్రం భరించాలన్న విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. పార్లమెంట్‌ను స్తంభింపజేస్తాం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అనర్హుడిగా ప్రకటించాలని ఏడాది కిందట దాఖలు చేసిన పిటిషన్‌పై మరోసారి సహచర ఎంపీలతో కలిసి సభాపతి ఓం బిర్లాతో చర్చించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా రఘురామ చేసిన అసంబద్ధమైన, చట్టవ్యతిరేక వ్యాఖ్యలకు సంబంధించి అదనపు సాక్ష్యాధారాలను సభాపతికి సమర్పించామన్నారు. అనర్హత పిటిషన్ దాఖలు చేస్తే 6 నెలల్లో సభాపతి నిర్ణయం ప్రకటించాలని గతంలో సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లామన్నారు. తగిన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తే రాబోయే సమావేశాల్లో పార్లమెంటును స్తంభింపజేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టంగా చెప్పినట్లు ఆయన తెలిపారు. -
ఆంధ్ర విలన్ అంటేనే కేసీఆర్ తనకు మంచిదని నమ్ముతున్నారు : ఉండవల్లి
-
ఇరువురికీ న్యాయమైన వాటా దక్కాలి
చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఏదో ఒక తగాదా నడిచేది. జగన్ ఎన్నికల్లో గెలిచాక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు. అయితే, కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులలో నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా కొత్త వివాదం సృష్టించారు కేసీఆర్. కృష్ణా నీటిని సగం సగం పంచాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు రెండున్నర ఏళ్లలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ, కాంగ్రెస్‌లను ఇరుకున పెట్టడానికి, కేసీఆర్ జల రాజకీయం ఆరంభించారని విశ్లేషణలు వచ్చాయి. కేవలం సెంటిమెంటు కోసం ఆంధ్ర ప్రభుత్వంతో తగాదా పెట్టుకుంటున్నారన్న భావన కలిగితే కేసీఆర్‌కు అది లాభం చేయకపోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుభవ జ్ఞుడు. తెలంగాణ సాధించిన నేతగా, తెలంగా ణను ఏలుతున్న అధినేతగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. కానీ ఇప్పుడు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులలో నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఏడేళ్లుగా లేని కొత్త వివాదం సృష్టించారు. కృష్ణా నీరు ఏపీ, తెలంగాణ మధ్య ఫిఫ్టీ, ఫిఫ్టీ ఉండాలని డిమాండ్ చేశారు. కొన్నేళ్ల క్రితం ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల వాటాలకు అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఈ వివాదం తేవడం ఎంతవరకు కరెక్టు? సుదీర్ఘకాలంగా రాజకీయాలలో ఉన్న కేసీఆర్ కేవలం తన రాజకీయ అవసరాలకు ఈ డిమాండ్ పెట్టారా? తెలంగాణ ప్రయోజనాల కోసమా అన్న చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన కేటాయిం పులు జరిగాయి. ఏపీ జనాభా ఎక్కువ, విస్తీర్ణం అధికం. విద్యుత్ విషయంలో మాత్రం హైదరాబాద్, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు ఎక్కువ కేటాయించారు. నీటి ప్రాజెక్టులలో విద్యుత్ ఉత్పత్తికి నిర్దిష్ట ప్రోటోకాల్స్ ఉన్నాయి. వాటిని పట్టించు కోకుండా, కృష్ణా యాజమాన్య బోర్డు వద్దన్నా వినకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. కృష్ణా, గోదావరి నదులకు వరదలు వస్తే ఎక్కువ గ్రామాలు మునిగిపోయేది ఏపీలో అన్న సంగతి కేసీఆర్‌కు తెలియనిది కాదు. దిగువ ప్రాంత ప్రజలకు, లేదా రాష్ట్రాలకు ముందుగా నదీ జలాలను వాడుకునే హక్కు ఉంటుందన్న సంగతీ తెలియదని అనుకోలేం. అలాంటప్పుడు యాభై శాతం సిద్ధాంతాన్ని ఎలా ముందుకు తెచ్చారో తెలీదు. వరదలు వచ్చినప్పుడు ఎన్ని వాడు కున్నా అభ్యంతరం లేదు. ఈసారి వరద కాదు కదా, శ్రీశైలంలో కనీస మట్టం కూడా లేదు. అయినా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి వివాదం సృష్టించింది. అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే రాయలసీమలోని కోట్ల మంది ప్రజల దాహార్తిని పట్టించు కోకపోవడమే. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలుంటే చెప్పడం తప్పు కాదు. ఆ ప్రాజెక్టు ఒక రూపానికే రాకముందు, తెలం గాణలో కొత్త ప్రాజెక్టులు కడతామనీ, విద్యుత్ కోసం ఉన్న కాస్త నీటిని వాడేస్తామనీ చెప్పడం ఇరు రాష్ట్రాలకు మంచిది కాదు. కేసీఆర్ తాత్కాలిక అవసరాల కోసం శాశ్వత ప్రయోజనాలను పణంగా పెడు తున్నారా అన్న సందేహం వస్తుంది. నిజానికి జగన్, కేసీఆర్ మధ్య తగాదా రావాలని కొంతమంది కోరుకుంటున్నారు. ఇందులో ఒక వర్గం మీడియా సహజంగానే తన వంతు పాత్ర పోషిస్తోంది. ఏపీ మంత్రులుగానీ, ముఖ్యమంత్రిగానీ సంయమనం పాటిస్తున్నారు. భవిష్యత్తులో అటువైపు నుంచి మాటలు మీరితే అది రెండు రాష్ట్రా లకు ప్రయోజనకరం కాదు. ఇప్పటికే జగన్ ప్రధానికి, కేంద్రమంత్రికి ఫిర్యాదు చేస్తే, తెలంగాణ కూడా ఏపీ స్కీములపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఒకప్పుడు ఇద్దరం చర్చించుకుని చేద్దాం అని చెప్పిన కేసీఆర్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. టీడీపీ మీడియా తెలంగాణ నేతల విమర్శలపై సంబరపడుతుండవచ్చు. కానీ వారికి తెలియకుండానే జగన్‌కు మేలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజోలి బండ వద్ద కాల్వ తవ్వకంపై జగన్ ఎంత సీరియస్‌గా ఉన్నారన్నది అర్థం అవుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసులో పట్టుబడే వరకు కేసీఆర్‌ను ఎద్దేవా చేసేలా మాట్లాడేవారు. అది రెండు రాష్ట్రాల మధ్య తగవుగా మారుతుండేది. కేసు తర్వాత చంద్రబాబు విజయవాడకు జారుకోవడంతో ఆ గొడవ తగ్గింది. జగన్ గెలిచాక ఇరు ముఖ్యమంత్రులూ సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు. నీటి పథకాలపై వివాదాలు వేరు, వ్యక్తిగత గొడవలు వేరు. తండ్రి రాజశేఖరరెడ్డిని మించి తెలంగాణకు అన్యాయం చేసే విధంగా జగన్ ముందుకు వెళుతున్నారని కేసీఆర్ అన్నారట. వైఎస్ రూ. 35 వేల కోట్ల వ్యయంతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడమే కాకుండా, పలు చోట్ల కాల్వలు తవ్వించారు. ఇంత వ్యయంతో అంత భారీ ప్రాజెక్టు సాధ్యమేనా అన్న సందేహం కలిగేది. ఎవరో ఒకరు ప్రారంభిస్తే, తర్వాత ఎవరో పూర్తి చేస్తారని వైఎస్ అనేవారు. ఎల్లంపల్లి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్ సాగర్, బీమా– ఇలా పలు ప్రాజెక్టులను చేపట్టిన ఘనత ఆయనది. ప్రాణహిత–చేవెళ్ల సాధ్యం కాదేమోననుకున్నవారిని మరింత ఆశ్చర్యపరిచే విధంగా కేసీఆర్ ఏకంగా లక్ష కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. దీనివల్ల ఎంత ఆయకట్టు పెరిగింది అన్నదానిపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, తెలంగాణలో నీటి సమస్య ఎప్పటికి తీరేనో అనుకునే కొన్ని ప్రాంతాలకు కేసీఆర్ సాగునీరు ఇచ్చేదశకు తెచ్చారు. రాయలసీమ కరువు సీమకు నీటిని ఇచ్చేందుకు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కెపాసిటీని 12 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసె క్కులకు వైఎస్ పెంచారు. దానిపై తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్పారు. ఆ మాటకొస్తే టీడీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు, ప్రత్యేకించి దేవినేని ఉమామహేశ్వరరావు వంటివారు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసన చేశారు. తర్వాతి రోజుల్లో ఉమానే నీటిపారుదల శాఖ మంత్రి అయ్యారు. అప్పటినుంచి ఎప్పుడూ ఆ ప్రాజెక్టును తప్పు పట్టలేదు. ఎన్టీఆర్ ఆరంభించిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లడంతో పాటు, కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ఘనత వైఎస్‌ది. దీనిపై కూడా తెలంగాణ నేతలకు కొంత అభ్యంతరం ఉంది. చెప్పాలంటే వైఎస్ తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు మూడింటినీ సమానంగా చూశారు. ఇప్పుడు ఆయన కుమారుడు తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన నీటిని మాత్రమే శ్రీశైలం డ్యామ్ నుంచి వేగంగా తీసుకోవడానికి వీలుగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకం చేపట్టారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఈ క్రమంలో ఒకదానిపై ఒకటి ఫిర్యాదు చేసు కున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సమా వేశంలో ఈ వివాదాలు ప్రస్తావనకు వచ్చాయి. కేసీఆర్ గోదావరి జలాలను కృష్ణానదిలో కలిపే స్కీమును ప్రతిపాదించి, ఏపీని కూడా అందులో భాగస్వామి కావాలని కోరారు. మొదట ఉత్సుకత చూపిన జగన్ ప్రభుత్వం, అందులోని ఇబ్బం దులను గమనంలోకి తీసుకుని వెనక్కి తగ్గింది. కేసీఆర్‌కు అది సంతృప్తిని కలిగించి ఉండకపోవచ్చు. ఆయనకు తెలంగాణ ప్రయోజ నాలతో పాటు తెలంగాణ రాజకీయం ఎంత ముఖ్యమో, జగన్‌కు ఏపీ ప్రయోజనాలతో పాటు, ఏపీ రాజకీయం అంత ముఖ్యమన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు వచ్చే రెండున్నర ఏళ్లలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ, కాంగ్రెస్‌లను ఇరుకున పెట్టడానికి, షర్మిల కొత్త పార్టీని పరిగణనలోకి తీసుకుని– కేసీఆర్ నీటి రాజకీయం ఆరంభించా రని విశ్లేషణలు వచ్చాయి. ఇదే సమయంలో ఏపీపై కోపంతో కృష్ణా నదిపై పలు ప్రాజెక్టులను ప్రతిపాదిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడం ఒకింత ఆశ్చర్యంగానే ఉంటుంది. అలంపూర్ వద్ద జోగుళాంబ బ్యారేజీ పెట్టి లిఫ్ట్ ద్వారా అరవై, డెబ్భై టీఎంసీల నీటిని తరలించా లని ఒక స్కీము, పులిచింతల ప్రాజెక్టు కింద ఎడమకాల్వ తవ్వాలని మరో స్కీమ్, సుంకేసులవద్ద మరో ఎత్తిపోతల పథకం.. నీరు అందు బాటులో ఉన్నంతవరకు స్కీములు చేపట్టవచ్చు. హడావిడిగా చేప డితే తెలంగాణకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీ ప్రజల అవ సరాలను కూడా పరిగణనలోకి తీసుకుని, తెలంగాణ వాటాను సద్వి నియోగం చేసుకుంటే కేసీఆర్‌ను ఎవరూ తప్పుబట్టరు. కేవలం సెంటి మెంట్ కోసం ఆంధ్ర ప్రభుత్వంతో తగాదా పెట్టుకుంటున్నారన్న భావన కలిగితే కేసీఆర్‌కు అది లాభం చేయకపోవచ్చు. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా.. న్యాయం మావైపే..
-
కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా.. న్యాయం మావైపే..
అమరావతి: తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లపై కేంద్రం, కేఆర్ఎంబీ వద్ద వాదనలు వినిపిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేఆర్ఎంబీ మీటింగ్ వదిలి కేసీఆర్ ఢిల్లీ వెళ్తే ఏమవుతుంది? అని సజ్జల ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా... న్యాయం మావైపే ఉందని ఆయన అన్నారు. కేఆర్ఎంబీ మీటింగ్‌కు వచ్చి తెలంగాణ తమ వాదన వినిపిస్తే బాగుంటుందని ఆయన కోరారు. సమస్య ఇక్కడే పరిష్కారం అయ్యేది.. ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని అన్నారు. న్యాయబద్ధ హక్కు కోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని సజ్జల తెలిపారు. కేఆర్ఎంబీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్షించారు. తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లు కేఆర్ఎంబీకి కనిపించడం లేదా? అని నిలదీశారు. విద్యుత్ పేరుతో అక్రమంగా నీటిని వృథా చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ సగం వాటా అడగడం అసంబద్ధం అని ఆయన విమర్శించారు. విభజన జరిగినప్పుడే ఎవరి వాటా ఏంటనేది నిర్ణయించారని సజ్జల గుర్తు చేశారు. ఇక ఈ సమస్యంతా చంద్రబాబు వల్లే వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఆరోజు తెలంగాణ ప్రాజెక్ట్‌లపై మాట్లాడి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని అన్నారు. నాడు పారిపోయిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి సీఎంని విమర్శించడం అర్ధరహితమిని, కృష్ణా జలాల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. -
‘హుజూరాబాద్ ఎన్నికల కోసమే కేసీఆర్ నీటి గొడవలు’
సాక్షి, కర్నూలు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత టీజీ వెంకటేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘హుజూరాబాద్ ఎన్నికల కోసమే కేసీఆర్ నీటి గొడవలు మొదలుపెట్టారు.. మాకు హైదరాబాద్ వచ్చే హక్కు ఉందని’’ తెలిపారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. కరోనా బాధితులను చెక్‌పోస్ట్‌ల వద్ద ఆపేశారు. విభజన హామీలను మరిచిపోతే ఎలా. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో ఇష్టమొచ్చినట్లు విద్యుదుత్పత్తి చేస్తామనడం సిగ్గుచేటు అంటూ విమర్శించారు. ‘‘పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉండాలి. పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ తెలంగాణ ప్రాజెక్టుల కంటే ముందే కట్టారు..మాకు నీళ్లిచ్చిన తర్వాతే తెలంగాణకు నీళ్లివ్వాలి. పోలీసులతో ప్రాజెక్ట్‌ను మోహరించడం కరెక్ట్ కాదని’’ బీజేపీ నేత టీజీ వెంకటేష్ మండిపడ్డారు. -
కేంద్రమంత్రులు షెకావత్, ప్రకాష్ జవదేకర్‌కు సీఎం జగన్ లేఖ
సాక్షి, అమరావతి: కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్, ప్రకాష్ జవదేకర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ మరోసారి సీఎం వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించాకే.. రాయలసీమ లిఫ్ట్ సందర్శించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ని ఆదేశించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు సీఎం జగన్ లేఖ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని.. కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తోందని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ‘‘శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోంది. ఈనెల 1 నుంచి ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. 796 అడుగుల నీటిమట్టం నుంచి తెలంగాణ నీటిని తోడేస్తోందని’’ సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా రాయలసీమ లిఫ్ట్‌ను పరిశీలిస్తామని పదేపదే కేఆర్ఎంబీ కోరుతోంది. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించాకే రాయలసీమ లిఫ్ట్ సందర్శించేలా కేఆర్ఎంబీని ఆదేశించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని, కేంద్ర జలశక్తి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అనేక ఫిర్యాదులు చేసినా సరైన చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఏపీ పట్ల కేఆర్ఎంబీ వివక్షతో వ్యవహరిస్తోందని, తెలంగాణ తప్పుడు ఫిర్యాదుల పట్ల మాత్రం కేఆర్ఎంబీ వేగంగా స్పందిస్తోందన్నారు. ఏపీ ఇచ్చిన ధర్మబద్ధమైన ఫిర్యాదులను కేఆర్ఎంబీ పట్టించుకోవడంలేదని సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. ‘‘శ్రీశైలంలో 854 అడుగుల నీరు లేకుంటే కరువు ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించే అవకాశం లేదు. పాలమూరు రంగారెడ్డి, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 800 అడుగుల వద్ద పర్యావరణ అనుమతి లేకుండా తెలంగాణ నిర్మిస్తోంది. ఈ అక్రమ ప్రాజెక్టు వల్ల శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉండే అవకాశాలు లేవని’’ సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌కు సీఎం వైఎస్ జగన్ లేఖ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌కు రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ‘‘జూన్ 1 నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా పరిధిలో ఇరిగేషన్ అవసరాలు లేకుండా తెలంగాణ నీటిని వినియోగిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసమే ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించింది. 854 అడుగులకు చేరితే గానీ పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకునే అవకాశం లేదని’’ లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి ఇప్పటికే కేంద్ర జలవనరుల కమిషనర్‌కు పూర్తి డీపీఆర్‌ను అందజేశామని.. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. -
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద టెన్షన్..టెన్షన్
నాగార్జునసాగర్/దోమలపెంట(అచ్చంపేట)/ధరూరు/అమరచింత/హుజూర్నగర్: కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద అదే టెన్షన్ కొనసాగుతోంది. తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి కొనసాగిస్తూనే ఉండటం, ఆపాలంటూ ఏపీ సర్కారు, రాజకీయ నేతలు డిమాండ్ చేస్తుండటం నేపథ్యంలో.. ప్రాజెక్టుల వద్ద ఇరువైపులా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎగువన జూరాల నుంచి దిగువన పులిచింతల దాకా ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. నాగార్జునసాగర్ కొత్త వంతెన, ప్రధాన విద్యుత్ కేంద్రం వద్ద, మెయిన్ డ్యామ్, ఎర్త్ డ్యామ్‌కు ఇరువైపులా రెండు రాష్ట్రాల పోలీసు బలగాలు మోహరించాయి. ప్రధాన విద్యుత్ కేంద్రం వైపువెళ్లే దారిని మూసివేశారు. తెలంగాణ పోలీసులు ఏపీ నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు. సాగర్‌లోని 8 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 31,723 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 30,525 క్యూసెక్కులు దిగువకు వెళ్లిపోతున్నాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు పవర్‌హౌజ్‌లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ ఇక్కడికి సమీపంలోని ఈగలపెంట వద్ద క్యాంపు వేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. వంద మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఎగువన జూరాల ప్రాజెక్టు వద్ద, దిగువన పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. రెండో చోట్లా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పులిచింతల ప్రాజెక్టు వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. సరిహద్దులో వాహనాలను తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. చదవండి : అక్రమ ప్రాజెక్టులు ఆపండి, మాపైనే నిందలా -
జల జగడంపై కదిలిన కృష్ణా బోర్డు
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించేందుకు కృష్ణా బోర్డు కదిలింది. ఎలాంటి అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేయడంపై చర్చించేందుకు ఈ నెల 9న త్రిసభ్య కమిటీ భేటీని ఏర్పాటు చేస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం కనీస నీటిమట్టం స్థాయికి నీటి నిల్వ దాటకుండానే.. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేస్తుండటంపై గత నెల 10న, 23న కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. వాటిపై స్పందించిన కృష్ణా బోర్డు తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. కానీ.. ఆ ఆదేశాలను తెలంగాణ బేఖాతరు చేస్తూ విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. దీనిపై గత నెల 29న మరోసారి కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణా డెల్టా ఎస్ఈ నీటిని విడుదల చేయాలని ఎలాంటి ప్రతిపాదనలు పంపకున్నప్పటికీ.. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా పులిచింతల ప్రాజెక్టులోనూ తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని ప్రారంభించడంపై గత నెల 30న బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. మూడు ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టులను ఖాళీ చేయడం వల్ల తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని.. వాటిని పరిరక్షించాలని కృష్ణా బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై చర్చించేందుకు 9న త్రిసభ్య కమిటీ భేటీని ఏర్పాటు చేసినట్లు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తెలిపారు. -
ఏపీకి ఏకపక్ష ధోరణి సరి కాదు: మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, ఒప్పందాలు కుదిరాకే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని.. కానీ ఏపీ మాత్రం ఎవరితోనూ సంప్రదించకుండా ఏకపక్షంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టును విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించారని.. కానీ తాగునీటి కోసమనే పేరిట ఈ ప్రాజెక్టు నుంచి రాయలసీమ, నెల్లూరుకు సాగునీరు తరలిస్తున్నారని విమర్శించారు. కృష్ణా నదిలో తెలంగాణ కంటే తక్కువ పరీవాహక ప్రాంతం ఉన్న ఏపీకి 512 టీఎంసీలు కేటాయించడం అన్యాయమన్నారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 300 మీటర్ల వెడల్పుతో కాల్వలు తవ్వుతోందని.. మొత్తం నదినే మళ్లించి, రిజర్వాయర్‌ను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదిలో తెలంగాణకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని వాడుకునేందుకే జోగుళాంబ బ్యారేజీ, భీమా ఇరిగేషన్ కాల్వను ప్రతిపాదించామని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను కేంద్రం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసులు వేయరేం.. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. మరి ఏపీ అక్రమ ప్రాజెక్టుల మీద ఎందుకు కేసులు వేయడం లేదని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తయి కేసీఆర్‌కు మంచి పేరు వస్తే ఎలాగనే దురుద్దేశంతోనే కాంగ్రెస్, బీజేపీ స్పందించడం లేదని ఆరోపించారు. నదీ జలాలు, ఉద్యోగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలకు కాంగ్రెస్‌దే బాధ్యత అని విమర్శించారు. -
మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంటే, అవమానిస్తారా
సాక్షి, హైదరాబాద్: సహజ న్యాయసూత్రాల ప్రకారం కృష్ణా పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న తెలంగాణకే నదీ జలాల్లో ఎక్కువ వాటా దక్కాల్సి ఉందని.. కానీ అన్యాయం జరిగిందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై న్యాయ పోరాటం చేస్తామని.. అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని చెప్పారు. కేంద్రం కూడా ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకుని న్యాయం చేయాలన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ‘‘ఆంధ్రా ప్రాంత నాయకులు మమ్మల్ని అవమానపరుస్తూ, బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నా కూడా కడుపులో పెట్టుకుని నిశ్శబ్దంగా ఉంటున్నాం. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజలు సెటిలర్స్ కాదు. ఈ గడ్డ మీద ఉన్న వాళ్లందరూ మా వాళ్లే. అభివృద్ధిలో పోటీపడుతూ దేశానికే ఆదర్శంగా ఉండాలన్నది మా అభిమతం. ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నది ఏపీ నేతలే’ అని ఆరోపించారు. కొత్త కేటాయింపులు జరిగాకే ప్రాజెక్టులు కడతామని చెప్పిన ఏపీ.. ఇప్పుడు మాట మార్చడం పై తమకు అభ్యం తరాలు ఉన్నాయన్నారు. ట్రిబ్యునల్ తీర్పులకు అనుగుణంగా ప్రాజెక్టుల పనులు చేపట్టాలని పేర్కొన్నారు. అక్రమ ప్రాజెక్టుల నుంచి దృష్టి మరల్చేందుకే.. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల నుంచి దృష్టి మరల్చేందుకే కేంద్ర బలగాల మోహరింపు, కేంద్రం చేతికి అధికారాలు వంటి అంశాలను తెర మీదకు తెస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కొత్తగా నీటి కేటాయింపులు జరగకున్నా ఏపీ ప్రాజెక్టులు కడుతోందని పేర్కొన్నారు. ఏపీ అనుమతులు తీసుకుని నిర్మించే ప్రాజెక్టులకు అవసరమైతే నిధులతోపాటు తమ ఇంజినీర్ల ద్వారా సాంకేతిక సాయం అందిస్తామన్నారు. ఏపీ ప్రాజెక్టుల విషయంగా తెలంగాణలోని ఇతర పార్టీల చేసే వ్యాఖ్యలపై స్పందించబోమని చెప్పారు. చదవండి: ఏపీకి ఏకపక్ష ధోరణి సరి కాదు: మంత్రి నిరంజన్ రెడ్డి -
సామరస్య పరిష్కారానికి సీఎం జగన్ యత్నం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కేఆర్ఎంబీ చెప్పినా తెలంగాణ వినడం లేదని, అందుకే ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాయాల్సి వచ్చిందన్నారు. వివాదం పరిష్కారం కావాలని, సానుకూలంగా ఉండాలనే ఉద్దేశంతోనే కేంద్రానికి లేఖ రాయడం జరిగిందన్నారు. తాడేపల్లిలో శుక్రవారం తనను కలిసిన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సజ్జల సమాధానమిస్తూ.. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అనుమానంగా ఉందన్నారు. అవసరమైతే ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత, కేంద్రమే తీసుకోవాలని కోరతామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారన్నారు. జల వివాదం పరిష్కారం కావాలని, సానుకూల నిర్ణయం రావాలనే సీఎం జగన్ ప్రధాన మంత్రి, కేంద్ర జల శక్తి మంత్రికి లేఖలు రాశారని వివరించారు. కేసీఆర్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో!: రాయలసీమ నీటి విషయంలో పెద్దన్నగా తానే ముందుండి అన్యాయం జరగకుండా చూస్తానని గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రోత్సహించారని సజ్జల గుర్తు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకోవడమే రాయలసీమ ఎత్తిపోతల లక్ష్యం అని తెలిపారు. సీఎం జగన్ ఇప్పుడు చేస్తోన్న ప్రయత్నాన్ని గతంలో కేసీఆర్ అంగీకరించి ప్రోత్సహించారన్నారు. రాయలసీమ కష్టాలు తనకు తెలుసని సీఎం కేసీఆర్ అన్నారని చెప్పారు. పరస్పరం ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలన్న కేసీఆర్ ఈ రోజున ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదని సజ్జల వ్యాఖ్యానించారు. చట్టసభలు హుందాగా నడవాలన్నది సీఎం ఆకాంక్ష చట్టసభలు సమతుల్యత పాటిస్తూ, సభ హుందాతనాన్ని కాపాడుతూ నడవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటినుంచీ కోరుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున అధ్యక్షతన శుక్రవారం తాడేపల్లిలో శాసనమండలి ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యంకు ఆత్మీయ అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. శాసనమండలిని, రాజకీయాలను వేర్వేరుగా చూడాలన్నది సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. అందుకే రాజకీయాలకు అతీతంగా విఠపు బాలసుబ్రహ్మణ్యంను శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా సీఎం ఎంపిక చేశారని చెప్పారు. విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి విద్యాపరమైన ఆలోచనలు, విద్యారంగంలో సంస్కరణలు మొదలవడం సంతోషించదగిన పరిణామమని పేర్కొన్నారు. శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, డొక్కా మాణిక్యవరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, కత్తి నరసింహారెడ్డి, వెన్నపూస గోపాల్‌రెడ్డి, పోతుల సునీత, షేక్ సాబ్జి, మోషేన్‌రాజు, కరీమున్నీసా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కిలారి వెంకట రోశయ్య, మహ్మద్ ముస్తఫా, మద్దాళి గిరి మాట్లాడారు. -
తెలంగాణ సర్కార్‌కు పట్టని కేఆర్ఎంబీ ఆదేశాలు
సాక్షి, గుంటూరు: నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ తెలంగాణకు కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసిందని సాగర్ ఈఈ శ్రీహరి తెలిపారు. కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. ‘‘విద్యుత్ ఉత్పత్తి కోసం నాగార్జునసాగర్‌లో రోజుకు 30 వేల క్యూసెక్కులను టీఎస్ సర్కార్ వాడుకుంటోంది. ప్రాజెక్టులో నీరు నిండుగా ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. కానీ ఇప్పుడు ప్రాజెక్టులో తక్కువగా నీరు ఉన్నా తెలంగాణ అధికారులు విద్యుత్ పంపిణీ చేపట్టారని’’ ఆయన పేర్కొన్నారు. దీని వల్ల ప్రకాశం, గుంటూరు జిల్లాలో రైతులు ఇబ్బందులు పడతారని శ్రీహరి తెలిపారు. -
ఏపీ అభ్యంతరాలకు వివరణ ఇవ్వండి
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కేటాయింపులకు మించి తెలంగాణ నీటి వినియోగంపై కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) అభ్యంతరం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మే 31వ తేదీ వరకు 13.4 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ఏకపక్షంగా వినియోగించుకుందన్న ఏపీ అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటి వరకు సాగర్ నుంచి విడుదల చేసిన 9.9 టీఎంసీల నీటిని మొత్తం కేటాయింపుల నుంచి మినహాయించుకోవాలని తెలంగాణకు సూచించింది. వచ్చే సమావేశం నాటికి దీనికి సంబంధించిన వివరాలను సమర్పించాలని పేర్కొంది. ఈ నెల ఏడో తేదీలోగా కేఆర్ఎంబీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీకి కృష్ణా బోర్డు లేఖ రాసింది. ఏపీ కోటా నుంచి ఆ నీటిని మినహాయించాలి గత నీటి సంవత్సరంలో నాగార్జునసాగర్ కుడికాలువకు నీటిని విడుదల చేయవద్దని కోరినా ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మే 31 వరకు 13.4716 టీఎంసీలను అనవసరంగా విడుదల చేశారని, వాటిని ఏపీ కోటా నుంచి మినహాయించాలని కృష్ణాబోర్డుకు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. దీనిపై స్పందించిన బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే.. ఏపీ ఈఎన్సీ రాసిన లేఖలో పేర్కొన్న అంశాలపై అభిప్రాయం చెప్పాలంటూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయనకు లేఖ రాశారు. -
Revanth Reddy : జల దోపిడీకి కారణం కేసీఆరే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న జల దోపిడీకి కారణం సీఎం కేసీఆర్ అని మాత్రమేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాదిగా మారి, కాసుల కోసం తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఓట్లకోసం నీటిని ఏటీఎంలా మార్చుకున్నారని, కాంగ్రెస్ శ్రేణులను తప్పుదోవ పట్టించేందుకే జల వివాదాల డ్రామా నడుపుతున్నారని దుయ్యబట్టారు. నీటి తరలింపుపై కేసీఆర్‌కు అన్ని విషయాలు చెప్పాకే ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు. నీటి తరలింపుపై అన్ని విషయాలు తెలిసిన కేసీఆర్, కృష్ణా జలాల విషయంలో కృత్రిమ పంచాయతీ పెడుతున్నరని మండిపడ్డారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు సురేశ్ షెట్కార్ ఇంట్లో పీసీసీ అనుబంధ సంఘాల చైర్మన్లతో జరిగిన సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ జల వివాదాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ప్రస్తుతం రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారని, అలాంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. వైఎస్, ఎన్టీఆర్‌లది ఓ శకం.. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలది ఒక శకం అని, వారిద్దరూ సంక్షేమం ద్వారా ప్రజలకు చేయాల్సినంత సేవ చేశారని రేవంత్ కొనియాడారు. వైఎస్సార్, ఎన్టీఆర్ రాజకీయాలకు అతీతులని, వారిని విమర్శించే వాళ్లు నికృష్టులని అన్నారు. ఈ రోజు జరుగుతున్న నీళ్ల దోపిడీలో రాజశేఖర రెడ్డి పాత్ర లేదన్నారు. కాంగ్రెస్ అభిమానులను తప్పు దారి పట్టించేందుకు కేసీఆర్ డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులను షర్మిల వైపు నడిపించేందుకు కేసీఆర్ ఇదంతా చేస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రులు రాజశేఖరరెడ్డిని తిట్టడం ద్వారా రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారన్నారు. -
ఏపీ ఫిర్యాదుపై తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కేటాయింపులకు మించి నీటి వినియోగంపై కేఆర్ఎంబీ అభ్యంతరం తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖలో.. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మే 31వ తేదీ వరకు 13.4 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ఏకపక్షంగా వినియోగించుకుందని ఏపీ అభ్యంతరం తెలపింది. కాగా దీనికి వివరణ ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ ఆదేశించింది. అదే క్రమంలో తెలంగాణ కేటాయింపుల నుంచి విడుదల చేసిన నీటిని తగ్గించుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకు సాగర్ నుంచి విడుదల చేసిన 9.9 టీఎంసీల నీటిని మొత్తం కేటాయింపుల నుంచి మినహాయించుకోవాలని తెలంగాణకు కేఆర్ఎంబీ సూచించింది. ఈ నెల 7లోగా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. ఈ లోగా దీనికి సంబంధించిన వివరాలను సమర్పించాలని తెలంగాణను ఆదేశించింది. -
జల వివాదంపై ప్రధాని మోదీ, జలశక్తి మంత్రికి సీఎం జగన్ లేఖలు
-
జల వివాదంపై ప్రధాని మోదీ, జలశక్తి మంత్రికి సీఎం జగన్ లేఖలు
సాక్షి, అమరావతి: జల వివాదంపై ప్రధాని మోదీ, జలశక్తి మంత్రి షెకావత్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. జల వివాదంపై తక్షణం కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ కోరారు. విద్యుత్ ఉత్పత్తి కోసం అక్రమంగా తెలంగాణ వాడుకుంటున్న నీటిని నిలుపుదల చేయాలంటూ లేఖలో సీఎం పేర్కొన్నారు. కృష్ణా నదిపై రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. ‘‘విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేయొద్దన్న ఆదేశాలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నీటిని విడుదల చేస్తోంది. ఈ చర్యలు అంతర్రాష్ట్ర సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. కింది ప్రాంతాల హక్కులను కాలరాసేలా తెలంగాణ చర్యలున్నాయి. తెలంగాణ చర్యల వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగునీరుకు కూడా సమస్యలు తలెత్తుతాయి. ఎలాంటి వ్యవసాయ అవసరాలు లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నీళ్లను వాడుకుంటోందని’’ సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి వద్దన్న కృష్ణా రివర్ బోర్దు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. తెలంగాణ అక్రమ వాడకంపై జూన్ 10న ఫిర్యాదు చేశాం. దీనిపై కృష్ణా రివర్ బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. తక్షణం విద్యుదుత్పత్తి నిలిపివేయాలని బోర్డు తెలంగాణకు సూచించింది. బోర్డు ఆదేశాలను తెలంగాణ పూర్తిగా బేఖాతరు చేసింది. జూన్ 23న, 29న మరోసారి కృష్ణా బోర్డు ఆదేశాలిచ్చింది. అక్రమంగా చేస్తున్న నీళ్ల వాడకం ఆపాలని తెలంగాణకు సూచించింది. కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలిచ్చినా తెలంగాణ పట్టించుకోవడం లేదని’’ సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ‘‘శ్రీశైలం ప్రాజెక్టులో 834 ఫీట్ల వరకు నీళ్లు ఉంటేనే విద్యుదుత్పత్తికి నీళ్లు వాడుకోవాలి. ప్రస్తుతం శ్రీశైలంలో కేవలం 808 ఫీట్ల వరకే నీళ్లున్నాయి. 33 టీఎంసీలు తక్కువగా ఉన్నా.. తెలంగాణ నీళ్లు వాడేస్తోంది. వాళ్ల ప్రాంతంలో పవర్ హౌజ్ ఉంది కాబట్టి ఇష్టానుసారంగా విద్యుదుత్పత్తి పేరిట నీళ్లు వాడుతున్నారు. ప్రతీ రోజు తెలంగాణ 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తోంది. కేఆర్ఎంబీ పరిధిని స్పష్టంగా నిర్వహించాలి. కేఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని’’ లేఖలో సీఎం జగన్ కోరారు. -
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో వివాదం
సాక్షి, గుంటూరు: పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో వివాదం నెలకొంది. బ్యారేజ్ 10వ గేట్ వద్ద మకాం వేసి టీఎస్ పోలీసులు బారికేడ్లు పెట్టారు. టీఎస్ పోలీసుల తీరును బ్యారేజ్ అధికారులు తప్పుపడుతున్నారు. బ్యారేజ్‌పై టీఎస్ పోలీసులకు ఎలాంటి హక్కు లేదని.. బ్యారేజ్ నిర్వహణ పూర్తి బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనని ఈఈ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ‘‘ఎటువంటి హక్కు లేకుండా బ్యారేజ్ పైకి రావడం నిర్వహణకు ఇబ్బంది కలిగించడమే. వద్దన్నా వినకుండా బ్యారేజ్‌పై సీసీ కెమెరాలను టీఎస్ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి టీఎస్ పోలీసులను వెనక్కి పిలవాలని తెలంగాణ అధికారులను కోరాం. కృష్ణా డెల్టా అధికారులు కోరితేనే పులిచింతల నుంచి నీటిని విడుదల చేస్తాం. ఆ సమయంలోనే జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి. జల విద్యుత్‌కు నీరు విడుదల చేయాలంటే 9.54 టీఎమ్సీల మినిమం డ్రా డౌన్ లెవల్ ఉండాలి. ప్రస్తుతం బ్యారేజ్‌లో 21.1 టీఎమ్సీల నీరు నిల్వ ఉంది. ప్రొటోకాల్ పాటించకుండా జలవిద్యుత్‌కు నీరు విడుదల చేసుకుంటున్నారు. తెలంగాణ అధికారుల చర్యలతో ఖరీఫ్‌లో కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి సమస్య వస్తుందని’’ ఈఈ శ్యామ్ ప్రసాద్ అన్నారు. -
ఊహించి రాయడం మీకు అలవాటే కదా: మంత్రి అనిల్
సాక్షి, అమరావతి: ఎల్లో మీడియా తీరుపై నీటి పారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టారీతిన రాతలు రాయడం వారికి అలవాటు అని, ఊహాజనిత కథనాలు రాయడం సరికాదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సమాచార శాఖా మంత్రి పేర్ని నానితో కలిసి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ వైఖరిని తప్పుబట్టిన ఆయన.. నిబంధనలకు లోబడే తాము ప్రాజెక్టులు కడుతున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. కొంతమంది ఎల్లో మీడియా ప్రతినిధులు వ్యవహరించిన తీరుపై మంత్రి అనిల్ సీరియస్ అయ్యారు. ఇరు రాష్ట్రాల జలవివాదం నేపథ్యంలో వారు సంధించిన ప్రశ్నలకు బదులుగా.. ‘‘చూస్తారు కదా అంటున్నా. తెలంగాణ వైఖరిపై కంప్లెంట్ రాశాం. మీకు అర్థం కావడం లేదు. 6.9 టీఎంసీలు తీసుకున్నారని నేను చెప్తున్నా. నువ్వు చెప్పినది రోజుకు 2 టీఎంసీలే. గత నాలుగు రోజుల గురించి తీసుకున్నది నేను చెబుతున్నా’’ అంటూ సమాధానమిచ్చారు. ‘‘మేం చెప్పింది రాయడం ఎలాగో చేయరు.. కాబట్టి మీ ఇష్టం వచ్చింది రాసుకోండి. ఎందుకంటే ఊహించింది రాయడంలో మీరు సిద్ధహస్తులు. రాసుకోండబ్బా’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు కడుతున్నారు: మంత్రి అనిల్
-
‘‘మేం చెప్పింది రాయడం ఎలాగో చేయరు.. కాబట్టి మీ ఇష్టం వచ్చింది రాసుకోండి’’
-
ప్రధాని మోదీ, జలశక్తి మంత్రికి లేఖలు రాస్తున్నాం: అనిల్
సాక్షి, అమరావతి: నిబంధనలకు లోబడే నీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ వ్యవహరిస్తున్న తీరును ఆయన విమర్శించారు. అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు కడుతున్నారు ‘‘848 అడుగులపైన ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోగలం.. తెలంగాణకు 800 అడుగులపైనే నీళ్లు తీసుకునే అవకాశం ఉంది.. కృష్ణా బేసిన్లో 15 రోజులు మాత్రమే 880 అడుగులపైన నీటి లభ్యత ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ అపెక్స్ కౌన్సిల్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాం. ఇరిగేషన్ అవసరాల తర్వాతే విద్యుత్ ఉత్పత్తి చేయాలి. శ్రీశైలం డ్యామ్ నిండకూడదనే దుర్మార్గమైన చర్య జరుగుతుంది. కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’ అని మంత్రి అనిల్ కుమార్ ధ్వజమెత్తారు. ఇక తెలంగాణ వ్యవహారశైలిపై నేడే ప్రధాని మోదీకి, జలశక్తి మంత్రికి లేఖలు రాస్తున్నామన్న మంత్రి... రాష్ట్రప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తామని పునరుద్ఘాటించారు. ‘‘తెలంగాణ చర్యలను అడ్డుకుని తీరుతాం. అవసరమైతే ప్రాజెక్ట్‌లను కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేందుకు కూడా సిద్ధమే’’ అని స్పష్టం చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్- తెలంగాణ జలవివాదంపై దృష్టి సారించిన ఏపీ కేబినెట్.. రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేదిలేదని స్పష్టం చేస్తూ తీర్మానం చేసింది. -
అలాగైతే పంజాబ్ అగ్నిగుండమే..
సాక్షి, న్యూఢిల్లీ : సట్లెజ్-యుమునా లింక్ కెనాల్ పూర్తయితే పంజాబ్ అగ్నిగుండమవుతుందని, హరియాణాతో నీటి పంపక వివాదం జాతీయ భద్రతకు సమస్యగా పరిణమిస్తుందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌లు కూడా హాజరైన ఈ భేటీలో సట్లెజ్-యమునా లింక్ కెనాల్‌పై ముందుకెళితే జాతీయ భద్రతకు పెను సవాల్ ఎదురవుతుందని అమరీందర్ సింగ్ కేంద్రాన్ని హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పంజాబ్ అగ్నిగుండమవుతుందని, హరియాణా, రాజస్తాన్‌లపై కూడా ఇది ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. పంజాబ్, హరియాణ రాష్ట్రాల ఏర్పాటు అనంతరం 1966లో ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకంపై వివాదం నెలకొంది. నదీ జలాల్లో హరియాణా అధిక వాటా కోరుతుండగా, మిగులు జలాలు లేవని వాదిస్తూ పంజాబ్ ఇందుకు నిరాకరిస్తోంది. 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేస్తూ దీనికోసం కాలువను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దశాబ్ధాలుగా కొనసాగుతున్న ఈ కాలువ పనులను పూర్తిచేసేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు చొరవ చూపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన మీదట ఈ భేటీ జరిగింది. మిగులు జలాలు ఉంటే పొరుగు రాష్ట్రానికి నీరు ఇచ్చేందుకు తమకు ఎలాంటి సమస్య లేదని సమావేశం అనంతరం సింగ్ పేర్కొన్నారు. నీటి లభ్యతపై అంచనా కోసం తాజా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హరియాణా సీఎంతో ఈ అంశంపై మాట్లాడేందుకు తాను సిద్ధమని చెప్పారు. జల వివాదాన్ని పరిష్కరించేందుకు చర్చలు కొనసాగిస్తూనే కాలువ నిర్మాణం పూర్తిచేయాలని కేంద్ర మంత్రి షెకావత్ పేర్కొన్నారు. కాగా, ఈ అంశంపై తదుపరి చర్చల కోసం రెండు రాష్ట్రాలు చండీగఢ్‌లో సంప్రదింపులు జరుపుతాయని హరియాణ ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ తెలిపారు. చదవండి : విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు -
ఆ రాష్ట్రాల ఊసు లేదు
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసులో కర్ణాటక, మహారాష్ట్ర ప్రస్తావన ఎక్కడా లేదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రాయలసీమ ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణ కు అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలసి శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీనివాస్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచినప్పుడు గతంలో కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తూ, ఇదే అంశంపై ఉమ్మడి ఏపీలో తాము సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. న్యాయ నిపుణుల సలహాతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై న్యాయ నిపుణుల సలహాతోనే ముందుకు వెళ్తున్నామని, తెలంగాణ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ మాత్రమే కొట్లాడుతుందని శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు. కేంద్రం సూచనలను కూడా ఏపీ ప్రభుత్వం పట్టించు కోనందునే సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు. అపెక్స్ కమిటీ సమావేశంలోపే 2, 3 రోజుల్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు తెచ్చేందుకు యత్నిస్తున్నామని వెల్లడించారు. కేంద్రం జోక్యం చేసుకోవాల్సి ఉన్నా స్పందించడం లేదని, ఏపీ వినని పక్షంలో ఏం చేయాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను పూర్తిగా చదవకుండానే కాంగ్రెస్ నేతలు అనవసర ఆందోళన చెందుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. -
తెలంగాణ ద్రోహిగా మిగలనున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నీళ్లను ఏపీ తరలించుకుపోతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. శనివారం ఆన్లైన్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు కేం ద్రానికి సీఎం, సీఎస్‌లు ఒక్క లేఖ కూడా రాయలేదని, కింది స్థాయి అధికారులతో రాయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వైఖరిని గమనించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను స్పందించానని, కేంద్రమంత్రిని కలిశానని తెలిపారు. గంటల తరబడి సెక్రటేరియట్ నిర్మాణంపై మీటింగ్‌లు పెట్టిన సీఎం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ భేటీకి ఎందుకు హాజరు కావడం లేదని, ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏముందని సంజయ్ ప్రశ్నించారు. సీఎంకి చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 11లోపు అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని చెప్పాలని, లేదంటే తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోతారన్నారు. -
నేడు తెలుగు రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి శాఖ భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షతన శ్రమశక్తి భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి రెండు బోర్డుల అధికారులతో పాటు ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ నరసింహారావు తదితరులు హాజరు కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రెండు బేసిన్ల ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, ప్రాజెక్టుల కింద నీటి వినియోగం, కృష్ణాబోర్డు విజయవాడకు తరలింపు వంటి అంశాలతో పాటు పట్టిసీమ నుంచి ఏపీ తరలిస్తున్న నీటిలోంచి తెలంగాణకు 45 టీఎంసీల వాటా కేటాయింపు, తాగునీటికి కేటాయించిన నీటిలో కేవలం 20 శాతం మాత్రమే వినియోగం కింద లెక్కింపు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. దీంతోపాటు తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా లేదా కేంద్ర సాయం అందించాలని తెలంగాణ కోరనుంది. -
‘తెలంగాణకు నీటిని నిలిపేయండి’
సాక్షి, హైదరాబాద్: నీటి వినియోగంపై తెలంగాణ–ఏపీ రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం తలెత్తేలా ఉంది. తెలంగాణకు నీటి సరఫరా నిలిపివేయాలంటూ కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తాజాగా ఏపీ లేఖ రాయడమే ఇందుకు కారణం. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను ఏపీకి 63.13 శాతం, తెలంగాణకు 36.87 శాతంగా నిర్ణయించారు. ఈ ఏడాది ఏపీ మొత్తం 75.74 శాతం నీటిని వినియోగించుకుంది. అంటే పది శాతం నీటిని అధికంగా వాడుకుంది. తెలంగాణ విషయానికి వస్తే... 24.26 శాతం నీటిని మాత్రమే వినియోగించుకుంది. తెలంగాణ కేవలం 34.10 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోగా.. ఇంకా 48.4 టీఎంసీలను వాడుకోవాల్సి ఉంది. అయితే దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం పవర్ హౌస్ ద్వారా నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్ఎస్పీ)కు పంపకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ఇప్పటికే 110 టీఎంసీలు తీసుకెళ్లింది. తాగునీటి అవసరాల కోసం నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నందున, తెలంగాణ శ్రీశైలం పవర్ హౌస్ ద్వారా నీటిని ఎన్ఎస్పీకి విడుదల చేస్తే నీటి మట్టం తగ్గి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఏపీ బోర్డుకు లేఖ రాసింది. -
జల జంజాటం!
పట్టించుకోనట్టు నటిస్తే... భారాన్ని న్యాయస్థానాలపైకి నెట్టేస్తే గండం గట్టెక్కుతా మని భావించే పాలకులకు కావేరీ నదీజలాల విషయంలో సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన ఆదేశాలు చెంపపెట్టు. కావేరీ వివాదంపై ఫిబ్రవరి 16న వెలువరించిన తీర్పులో ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీల నీరు అందవలసి ఉంటుందో సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించింది. ఈ తీర్పు అమలుకు అవసరమైన విధివిధానాలను ఆరు వారాల్లో రూపొందించాలని, ఈ నదీజలాలను వినియోగించుకునే నాలుగు రాష్ట్రాల్లోని సాంకేతిక నిపుణులతో కావేరీ యాజమాన్య బోర్డు(సీఎంబీ) ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దాని ప్రకారం ఏప్రిల్ మొదటి వారానికల్లా ఇవి అమలు కావాలి. కానీ అది జరగకపోవడంతో కేంద్రం కోర్టు ధిక్కారానికి పాల్ప డిందని తమిళనాడు ప్రభుత్వం ఫిర్యాదుచేస్తే... గడువును మార్చాలంటూ కేంద్రం కోరింది. మార్చి 31న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటాన్ని అందుకు కారణంగా చూపింది. నదీ జలాల వివాదం భావోద్వేగాలతో కూడుకున్న అంశం గనుక శాంతిభద్రతల సమస్య తలెత్తి ఎన్నికలకు ఆటంకం కలిగే ప్రమా దమున్నదని చెప్పింది. కానీ ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. విధివిధా నాల ఖరారుపై శ్రద్ధ చూపకపోవడాన్ని తప్పుబట్టి ‘అసలు జల వివాదాల పరిష్కా రంపై మీకు ఆసక్తి ఉందా లేదా’ అని నిలదీసింది. వచ్చే నెల 3 లోపు ఆ ఆదేశాన్ని అమలు చేసి తీరాలని హెచ్చరించింది. ఈ విషయంలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వాన్ని మాత్రమే తప్పుబట్టి ప్రయోజనం లేదు. కేంద్రంలో ఎవరున్నా నదీ జలాల విషయంలో ఇలాగే వ్యవహరిస్తున్నారు. రుతుపవనాలు కరుణించి పుష్కలంగా వర్షాలు పడితే కావేరీ నది విషయంలో మాత్రమే కాదు... ఏ నది విషయంలోనూ వివాదాలుండవు. కానీ రుతుపవనాలు ముఖం చాటేసినప్పుడు నదీ పరీవాహ ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోతుంది. అప్పు డిక ఉద్రేకాలు పెరుగుతాయి. ఆందోళనలు మొదలవుతాయి. మా గొంతు తడవటం లేదని ఒకరంటే, మా పొలాలు ఎండిపోతున్నాయని మరొకరంటారు. దశాబ్దాలుగా ఇదే సాగుతోంది. కేంద్రంలో ఉండే పాలకులు రాజకీయ ప్రయోజనాలనాశించి ఆలో చించడం వల్ల సమస్య ఎప్పటికీ సమస్యగానే మిగులుతోంది. ‘ఎంతకాలం దీన్ని సాగ దీస్తారు... తక్షణం కావేరీ నదీజలాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండ’ని సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప 1990లో అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం చొరవ ప్రదర్శించలేదు. ఏడాది తర్వాత ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలతో కర్ణాటక రణక్షేత్రంగా మారింది. ఆ రాష్ట్రంలోని తమిళులు ప్రాణ భయంతో స్వరాష్ట్రానికెళ్లి పోవాల్సివచ్చింది. దానికి పోటీగా తమిళనాడులోనూ నిరసనలు మిన్నంటాయి. ఆ తర్వాత వర్షాలు సక్రమంగా పడటంతో మరో అయిదేళ్ల వరకూ అంతా బాగానే ఉంది. కానీ 1995లో మరోసారి కరువు పరిస్థితులు ఏర్పడటంతో పోటాపోటీ ఆందోళనలు మొదలయ్యాయి. ఆ తర్వాత మరో అయి దారేళ్లకు మళ్లీ ఇదే పునరావృతం అయింది. అంతా బాగున్న సమయంలో అన్ని రాష్ట్రాలనూ సమావేశపరిచి, నిపుణుల సాయం తీసుకుని ఒక పరి ష్కార మార్గం కనుగొనడానికి కావలసినంత వ్యవధి ఉంటుంది. భావోద్వేగాలు లేన ప్పుడు అన్ని పక్షాలనూ ఒప్పించడం సులభం. కానీ సమస్య పీకల మీదికొచ్చిప్పుడు ప్రభుత్వాలు ఏదో చేసినట్టు నటిస్తున్నాయి. ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని వ్యవ హరిస్తున్నాయి. ఫలితంగా ఇరు రాష్ట్రాల ప్రజల మధ్యా లేనిపోని వైషమ్యాలు పెరుగు తున్నాయి. వారం రోజులుగా తమిళనాడు అట్టుడుకుతోంది. సుప్రీంకోర్టు తీర్పునకు అను గుణంగా చర్యలు తీసుకోవాలని దాదాపు అన్ని ప్రాంతాల్లో ధర్నాలు జరుగు తున్నాయి. చెన్నైలో మంగళవారం ప్రారంభమైన ఐపీఎల్ మ్యాచ్‌ను అడ్డుకునేం దుకు జనం వీధుల్లోకొచ్చారు. పోలీసులు అనేకచోట్ల లాఠీచార్జి చేశారు. నిరసనలో పాలుపంచుకుంటున్న సినీ రంగ ప్రముఖులతోసహా 3,500మందిని అరెస్టు చేశారు. నిజానికి ఈ సమస్య కేవలం కర్ణాటక, తమిళనాడులది మాత్రమే కాదు... ఇందులో కేరళ, పుదుచ్చేరి కూడా ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలూ ఎవరెంత నీటిని వాడుకోవాలో 2007లో కావేరీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) తీర్పు చెప్పింది. అయితే తమకు అన్యాయం జరిగిందంటూ అన్ని పక్షాలూ సుప్రీం కోర్టు తలుపు తట్టాయి. పర్యవసానంగా సుప్రీంకోర్టు ఆ ట్రిబ్యునల్ కేటాయింపుల్లో ఫిబ్రవరి 16న స్వల్పంగా మార్పులు చేసింది. తుది తీర్పు ప్రకారం తమిళనాడుకు 404.25 టీఎంసీలు(ట్రిబ్యునల్ కేటాయింపుల్లో 14.75 టీఎంసీల కోత), కర్ణాటకకు 284.75 టీఎంసీలు (అంతక్రితంకంటే 14.75 టీఎంసీలు అధికం) కేటాయించింది. కేరళకు కేటాయించిన 30 టీఎంసీలు, పుదుచ్చేరికిచ్చిన 7 టీఎంసీల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ కేటాయింపులు 15 ఏళ్ల వరకూ కొనసాగుతాయని చెప్పింది. ప్రస్తుతం కర్ణాటకలో కావేరీ పరీవాహ ప్రాంతంలో కృష్ణరాజసాగర్, హరంగి, హేమవతి, కబిని జలాశయాలున్నాయి. వీటి పరిధిలో వ్యవసాయాన్ని కర్ణాటక విస్తరిస్తున్నకొద్దీ ఆ మేరకు తమిళనాడులోని రైతులకు నీటి లభ్యత తగ్గిపోతోంది. ఇక వర్షాభావ పరిస్థితులుంటే వారి సమస్య మరింత పెరుగుతుంది. ఒక్క కావేరీ విషయంలో మాత్రమే కాదు... దాదాపు అన్ని నదీ పరివాహ ప్రాంతాల్లోనూ ఎగువ రాష్ట్రాల దయాదాక్షిణ్యాలపై దిగువ రాష్ట్రాలు ఆధారపడాల్సి వస్తోంది. వరదలొ చ్చిప్పుడు ఎనలేని నష్టం చవిచూడటం... వానలు పడనప్పుడు ఎగువ రాష్ట్రాలను ప్రాధేయపడటం, గొడవపడటం దిగువ రాష్ట్రాలకు తప్పడం లేదు. సుప్రీంకోర్టు చెప్పినట్టు నదుల్ని జాతీయ ఆస్తులుగా పరిగణించి పరీవాహ ప్రాంతాల్లోని రాష్ట్రా లన్నీ తమ అవసరాలతోపాటు వేరే రాష్ట్రం సమస్యల్ని కూడా దృష్టిలో పెట్టుకుని హేతుబద్ధంగా వ్యవహరిస్తే జల వివాదాలుండవు. మౌలికంగా జల వివాదాలు రాజకీయపరమైనవి. వాటిని పరిష్కరించే బాధ్యతను రాజకీయ నాయకత్వమే తీసుకోవాలి. అన్ని పక్షాలకూ నచ్చజెప్పాలి. న్యాయస్థానాలకొదిలి, ఏళ్ల తరబడి నాన్చితే అవి ఉన్నకొద్దీ జటిలంగా మారి కొరకరాని కొయ్యలవుతాయి. ప్రజల మధ్య çసుహృద్భావ వాతావరణం దెబ్బతింటుంది. కేంద్రం వీటిని దృష్టిలో ఉంచు కుని జాగ్రత్తగా అడుగులేయాలి. -
నీళ్ల లెక్క తేలింది
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన తొలగింది. మంగళవారం రాత్రి వరకు ఇరు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన కృష్ణా బోర్డు శ్రీశైలం, సాగర్‌లో లభ్యతగా ఉన్న 33 టీఎంసీల నీటిని తెలంగాణ, ఏపీలకు పంచింది. తెలంగాణకు 17, ఏపీకి 16 టీఎంసీల నీటిని కేటాయించింది. తెలంగాణకు కేటాయించిన నీటిలో హైదరాబాద్, నల్లగొండ తాగునీటికి 6 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వకు 10 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు ఒక టీఎంసీ కేటాయించింది. ఇక ఏపీకి కేటాయించిన నీటిలో హంద్రీనీవాకు 1 టీఎంసీ, సాగర్ కుడి కాల్వకు 7, ఎడమ కాల్వకు 4, కృష్ణా డెల్టాకు 4 టీఎంసీలు కేటాయించింది. రాత్రి వరకు చర్చలు శ్రీశైలం, సాగర్‌లో లభ్యతగా ఉన్న జలాలు, ఇరు రాష్ట్రాల అవసరాలు, నీటి పంపిణీపై చర్చించేందుకు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ మంగళవారం ఇక్కడి జలసౌధలో భేటీ అయింది. దీనికి బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంతోపాటు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ తరఫున ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా లభ్యత జలాలపై ముందుగా చర్చించారు. శ్రీశైలంలో ప్రస్తుతం 816.9 అడుగుల మట్టంలో 36.52 టీఎంసీల నీటి లభ్యత ఉండగా ఇందులో 810 అడుగులకు ఎగువన కేవలం 9.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని ఇరు రాష్ట్రాలు బోర్డుకు తెలిపాయి. ప్రస్తుతం 13,600 క్యూసెక్కుల మేర నీటి వినియోగం జరుగుతున్నందున మరొక వారం రోజుల్లో ప్రాజెక్టు ఖాళీ అవుతుందని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సాగర్ నీటిపై ఆధారపడాల్సి ఉంటుందని ఏపీ తెలిపింది. అయితే దీనిపై తెలంగాణ స్పందిస్తూ.. సాగర్‌లో ప్రస్తుతం 522.2 అడుగులకు ఎగువన 153.32 టీఎంసీల లభ్యత ఉండగా, 15వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉందని, కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన 24 టీఎంసీల నీటి లభ్యత ఉందని తెలిపింది. మే చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లేది లేదని, లభ్యతగా ఉన్న నీటిని సర్దుబాటు చేయాలని కోరింది. గతంలో కేటాయించిన 9.4 టీఎంసీల కన్నా 1.6 టీఎంసీల మేర ఏపీ అధికంగా వాడిందని తెలంగాణ పేర్కొంది. ఇక తమకు కేటాయించిన 24 టీఎంసీల్లో 7.26 తక్కువగా వాడినట్లు కమిటీ దృష్టికి తెచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లభ్యత జలాల్ని పంచాలని కోరింది. దీనికి ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాత వినియోగాన్ని పక్కనపెట్టి లభ్యతగా ఉన్న నీటినే పంచాలని కోరింది. చివరికి రాత్రి 9 గంటల సమయంలో కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకు నీటిని పంచింది. -
జల వివాదాలపై కదిలిన ‘ఢిల్లీ’!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కదలింది. ఏడాదిన్నర కిందట అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించిన అనంతరం తొలిసారి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నీటి పారుదల శాఖ కార్యదర్శుల స్థాయి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే భేటీపై ఇప్పటికే కేంద్ర జల వనరుల శాఖ సమాచారం పంపింది. ఏయే అంశాలపై చర్చించాలన్న దానిపై ఈ నెల 7లోగా ఎజెండా తయారు చేయాలని కేంద్ర జల వనరుల శాఖ కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లను ఆదేశించింది. ప్రస్తుతం రెండు బోర్డులు ఎజెండా తయారీలో నిమగ్నమయ్యాయి. గొడవంతా కొత్త ప్రాజెక్టులపైనే.. కృష్ణా, గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య మూడున్నరేళ్లుగా అనేక వివాదాలు ముసురుకున్నాయి. వీటిపై 2016 సెప్టెంబర్‌లో కేంద్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించింది. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి సమావేశం జరగలేదు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నియంత్రణ, నీటి కేటాయింపుల్లో వాటాలు, కొత్తగా తెలంగాణ చేపడుతున్న తుమ్మిళ్లతో పాటే ఏపీ చేపడుతున్న పట్టిసీమ, గురు రాఘవేంద్ర, శివభాష్యంసాగర్, ముచ్చుమర్రి తదితర ప్రాజెక్టులపై వివాదం కొనసాగుతోంది. తెలంగాణ రీడిజైన్ చేస్తున్న ప్రాణహిత, కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టులతో పాటు వాటర్‌గ్రిడ్‌పైనా అనేక అనుమానాలు లేవనెత్తుతూ ఏపీ కేంద్రం, బోర్డులకు ఫిర్యాదు చేసింది. గోదావరిపై ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నంపై తెలంగాణ అడ్డుచెబుతోంది. ఇక వర్కింగ్ మ్యాన్యువల్‌పై చర్చ జరిగిన సమయంలో.. కృష్ణాలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులే లేనప్పుడు, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం ఎందుకని తెలంగాణ ప్రశ్నిస్తోంది. నిర్ణీత కేటాయింపుల్లోంచే వాటా నీటిని వాడుకుంటున్నామని చెబుతోంది. ఏపీ మాత్రం వాటాకు తూట్లు పొడిచి పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తోందని అంటోంది. పోతిరెడ్డిపాడు వినియోగంపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీనికి తోడు టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు ఇంతవరకు జరగలేదు. ఆవిరి, సరఫరా నష్టాలపై తేలలేదు. 90 టీఎంసీల అదనపు వాటాకై రాష్ట్రం కొట్లాట బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏపీ చేపట్టిన పోలవరం ద్వారా తెలంగాణకు 45 టీఎంసీలు, ఇదే అవార్డు ప్రకారం పోలవరం కాకుండా ఇంకా ఏదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతూ మొత్తంగా 90 టీఎంసీలు తమకు దక్కుతాయని తెలంగాణ అంటోంది. ఈ నీటిని కృష్ణాలో ప్రస్తుతం ఉన్న 299 టీఎంసీల వాటాకు జోడించాలని కోరుతోంది. దీనిపై బోర్డుల వద్ద చర్చ జరిగినా ఎలాంటి ప్రయోజనం లేదు. వివాదాలకు తాత్కాలిక ఉపశమనం లభించినా, శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని తెలంగాణ కోరినా సాధ్యపడలేదు. అయితే ఇటీవల కృష్ణా బోర్డుపై ఫిర్యాదు చేస్తూ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు నేరుగా కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తొలి దశలో కార్యదర్శుల భేటీ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షతన 15న ఢిల్లీలోని శ్రమశక్తిభవన్లో ఈ భేటీ జరిగనుంది. ఈ భేటీకి సీఎస్ ఎస్కే జోషితో పాటు, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు, ఏపీ అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. -
నేడు కర్ణాటక బంద్
సాక్షి, బెంగళూరు: కళసా బండూరి, మహదాయి నదీ జలాల వివాదంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారాన్ని చూపాలంటూ పలు కన్నడ పోరాట సంఘాలు నేడు (గురువారం) రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో అంతటా ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. వాటాళ్ చళువళి పార్టీ అధ్యక్షుడు వాటాళ్ నాగరాజు, కన్నడ పోరాట సంఘాల సమాఖ్య ముఖ్య నేత సా.రా.గోవిందులు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడువేల కన్నడ పోరాట సంఘాలు మద్దతు తెలిపినట్లు వాటాళ్ నాగరాజు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక బంద్ ఎట్టిపరిస్థితుల్లోనూ జరిగి తీరుతుందని బీదర్ నుంచి చామరాజనగర వరకు మైసూరు నుంచి కోలారు వరకు బంద్‌ను సంపూర్ణం చేయడానికి సకల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉత్తర కర్ణాటక రైతుల సాగు, తాగునీటి అవసరాల కోసం అతిముఖ్యమైన కళసా బండూరీ, మహదాయి నదీ జలాల పంపిణీలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు కూడా మహదాయి,కళసా బండూరీపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంతో రాష్ట్ర రైతుల కోసం తామే ఉద్యమాల బాట పట్టినట్లు చెప్పారు. కర్ణాటక బంద్ సందర్భంగా నేడు ఉదయం పది గంటలకు బెంగళూరు టౌన్‌హాల్ నుంచి ఫ్రీడంపార్క్ వరకు కన్నడ పోరాట సంఘాల నేతలు, వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీ జరుపుతామని చెప్పారు. డిగ్రీ పరీక్షల వాయిదా బంద్ సందర్భంగా విద్యార్థులు, తమ ఆస్తుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర‡వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కర్ణాటక ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రధాన కార్యదర్శి శశికుమార్ తెలిపారు. నేడు జరగాల్సిన మొదటి,మూడవ సంవత్సరం బీ.ఏ, బీఎస్సీ, బీబీఎం తదితర అన్ని పరీక్షలను బెంగళూరు యూనివర్శిటీ అధికారులు వాయిదా వేశారు. ఫిబ్రవరి 8వ తేదీన మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనుండగా, ఫిబ్రవరి 5వ తేదీన బీఎస్సీ,బీ.ఏ. మూడవ సంవత్సరం పరీక్షలు జరుపుతారు. ఆసుపత్రులు తెరిచే ఉంటాయి బంద్‌కు కేవలం నైతిక మద్దతు మాత్రమే తెలుపుతామని ఆసుపత్రులు, మెడికల్ దుకాణాలు రోజువారీలానే తెరచే ఉంటాయంటూ ఐఎంఏ నాయకుడు డా.రవీంద్రనాథ్ తెలిపారు. నైతిక మద్దతుగా నల్లటి రిబ్బన్లతో విధులకు హాజరవుతామంటూ తెలిపారు. బీఎంటీసీ, ఆర్టీసీ సేవలు యథాతథం రాష్ట్ర బంద్ సందర్భంగా బీఎంటీసీ సేవలు యథావిధిగా ఉంటాయని సంస్థ ఎండీ పొన్నురాజ్ తెలిపారు. అయితే బంద్ తీవ్రరూపం దాలిస్తే పరిస్థితిని బట్టి బస్సులను నిలిపివేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కేఎస్ఆర్టీసీ సేవలకు కూడా ఢోకా ఉండదని చెప్పారు. షూటింగ్‌లు, సినిమా థియేటర్లు బంద్ గురువారం సినిమా షూటింగ్‌లను నిలిపివేయనున్నట్లు కన్నడ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. అయితే పెట్రోలు బంకులు యథావిధిగా పనిచేస్తాయని ఆ యజమానుల సంఘం తెలిపింది. కన్నడ పోరాట సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు ఆటో సంఘాలు,లారీ యజమాన్య సంఘాలు మద్దతు తెలుపగా ప్రైవేటు టాక్సీలు, మెట్రోరైళ్లు మాత్రం ఎప్పటిలానే సంచరించనున్నాయి.. సంయమనం పాటించండి: సీఎం నేడు (గురువారం)రాష్ట్ర బంద్ సందర్భంగా ప్రజలు,విద్యార్థులు సంయమనం పాటించాలంటూ సీఎం సిద్ధరామయ్య కోరారు. చట్ట అతిక్రమణ చర్యలకు పాల్పడరాదని కోరారు. ఈ బంద్‌తో తమకు సంబంధం లేదని ఆయన చెప్పారు. బంద్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బెంగళూరులో 15వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్ తెలిపారు. -
మళ్లింపు జల వివాదం మరింత జఠిలం
గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న నీటి వాటాలపై అయోమయం సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించేందుకు ఏపీ సర్కారు పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతలను చేపట్టిన నేపథ్యంలో ఆ మేరకు ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలపై తెలంగాణ, ఏపీల మధ్య నెలకొన్న వివాదం ఎటూ తేలడంలేదు. గతేడాది ఏపీ ఏకంగా 53 టీఎంసీల మేర గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలించుకున్నా రాష్ట్రానికి చుక్క వాటా ఇవ్వకపోవడం వివాదాన్ని జఠిలం చేస్తోంది. ఇది గత ట్రిబ్యునల్ తీర్పును ధిక్క రించడమేనని తెలంగాణ చెబుతున్నా.. ఏపీ నుంచి స్పందన లేకపోవడం, కృష్ణాబోర్డు, ఏకే బజాజ్ కమిటీలు ఈ అంశంపై చేతులెత్తే యడంతో వివాదం మరింత ముదిరింది. గోదావరి ట్రిబ్యునలే తేల్చాలి... అయితే పోలవరం, పట్టిసీమల ద్వారా ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలపై ఏపీ మరోమారు తెలంగాణను ఇరకాటంలో పెట్టే యత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలను తేల్చే అధి కారం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు లేదని ఏపీ కొత్త వాదనను తెరపైకి తెస్తోంది. ఆ అధికా రం గోదావరి వివాద పరిష్కార ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందంటోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ జలాలపై గోదావరి ట్రిబ్యున ల్ మాత్రమే పునఃసమీక్ష చేయగలదని, బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు ఆ అధికారం లేదని తేల్చిచెప్పిం ది. కాగా, గత ఏడాది జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పట్టిసీమ నీటి తరలింపు అంశం కేడబ్ల్యూడీటీ–2 తేల్చాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తమైనం దున ఈ అంశంలో జోక్యం చేసుకోబోమని కృష్ణా బోర్డు చెబుతోంది. దీనిపై నియమిం చిన ఏకే బజాజ్ కమిటీ కూడా చేతులెల్తేసింది. వాటా దక్కాల్సిందే.. 1978 గోదావరి అవార్డు ప్రకారం..పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి.80 టీఎంసీల కేటాయింపు ల్లో 21టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయి నందున ఈ నీటి వాటా హక్కు తమదే అని తెలంగాణ అంటోంది. పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదా వరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంలో పైరాష్ట్రాలకు వాటా ఉం టుందని తెలంగాణ వాదిస్తోంది. గోదావరి అవార్డు తీర్పుల ప్రకారమే పట్టిసీమ కింద దక్కే 45 టీఎంసీలలో ఎస్ఎల్బీసీకి 30 టీఎంసీలు, మరో 15 టీఎంసీలు ఉదయ సముద్రానికి కేటాయించాలని రాష్ట్రం ఇటీవలే కేంద్రాన్ని కోరింది. -
సమైక్యతను ముంచుతున్న ‘నీరు’
ఈ జలవివాదం చాలా చిన్నది, పరిష్కారానికి అనువైనదని నేను చిరకాలంగా వాదిస్తున్నాను. ఆ రెండు రాష్ట్రాలలోను సజావుగా ఆలోచించే ప్రజలు, మేధావులు, రైతు సంఘాలు ఇప్పుడు తమ తమ ప్రభుత్వాలను చర్చలకు ప్రోత్సహించాలి. అది జాతీయ సమైక్యతకు వేసే సరైన అడుగు అవుతుంది. ఒక విచిత్రమైన కాలంలో మనమంతా జీవి స్తున్నాం. ప్రస్తుతం యావద్దేశం ఒక నాదంతో ఊగిపోతోంది. అదే జాతీయవాదం. మన జాతీయవాదానికి కీలకం ఏమిటంటే– జాతీయ సమైక్యత. అయితే ఆ విషయంలో మాత్రం ఎవరికీ పెద్దగా పట్టింపు ఉన్నట్టు కనిపించడం లేదు. ఒకటి కాదు, పలు తీవ్ర వివాదాలతో ఈ దేశం సతమతమవుతోంది. వాటి గురించి ఏ జాతీయవాది అయినా తల మునకలై యోచించాలి. అది కూడా అత్యవసరమే అయినప్పటికీ ప్రస్తుతం నేను హిందూ–ముస్లిం ఘర్షణల గురించి, మైనారిటీ మతస్తుల స్థితిగతుల గురించి మాట్లాడడం లేదు. జాతీయ సమైక్యతకు గొడ్డలిపెట్టుగా పరిణమించిన తీవ్ర స్థాయి ప్రాంతీయ సంఘర్షణల గురించి నేను చెబుతున్నాను. ఒకవైపున తమిళ నాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య మండుతున్న నదీజలాల వివాదాన్ని మనం చూస్తున్నాం. ఇంకోపక్కన పంజాబ్, హరియాణా రాష్ట్రాల నడుమ సాగుతున్న నదీజలాల రగడను కూడా గమనిస్తున్నాం. ఇక విశాల నాగాలాండ్ నినాదం మణిపూర్, నాగాలాండ్ మధ్య చిచ్చు రేగడానికి కారణమైంది. కానీ జాతీయవాదం గురించి గొంతెత్తి మాట్లాడేవారు ఎవరూ కూడా ఈ వివాదాలను పట్టించుకోవడం లేదు. పైగా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ వాటికి ఆజ్యం పోస్తున్నది. పంజాబ్, హరియాణాల మధ్య రగులుతున్న నదీజలాల వివా దాన్నే తీసుకోండి! సుదీర్ఘంగా సాగుతున్న ఈ వివాదాన్ని పరిష్కరిం చేందుకు ఈమధ్య ఒక అవకాశం అందివచ్చింది. రావీ–బియాస్ నదుల నీళ్ల పంపకానికీ, హరియాణా వాటాను పంపిణీ చేయడానికి వీలుగా సట్లెజ్–యమున అనుసంధాన కాలువ నిర్మాణానికీ అనుకూలంగా వచ్చిన సదవకాశమది. సట్లెజ్–యమున అనుసంధాన కాలువ నిర్మాణం వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పంజాబ్ ఆశిస్తున్నదని కొత్త ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మే 12వ తేదీన ప్రకటించారు. ఉత్తర ప్రాంత మండలి సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. అంటే దశాబ్దకాలంగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి రాజకీయ పార్టీలు ఈ అంశం మీద అనుసరిస్తున్న ధోరణి నుంచి ఒక మెట్టు దిగివచ్చినట్టే. ఒక చుక్క నీటిని కూడా ఇతరులతో పంచుకునే అవకాశం పంజాబ్‌కు లేదని ఇంతకాలం ఆ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పక్షాలు పేర్కొంటూ వచ్చాయి. హరియాణా, రాజస్తాన్‌లకు నీటిని పంచే వీలు లేదని చెప్పడమే దీని అంతరార్థం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కావచ్చు, ఇంతకాలానికైనా కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి పాత వైఖ రిని సడలించడం ఆహ్వానించదగినది. హరియాణా ప్రభుత్వం ఈ అవ కాశాన్ని అందుకుని, వెంటనే చర్చల ప్రక్రియను ప్రారంభించి ఉండ వలసింది. దురదృష్టవశాత్తు అదేమీ జరగలేదు. ఎందుకంటే, న్యాయ పోరాటంలో పరిస్థితి తనకు అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ అంశంపై చర్చలు అవసరం లేదని హరియాణా భావించింది. చర్చల అవకాశాన్ని జారవిడుచుకుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్చలకు వచ్చిన సదవకాశాన్ని వదులుకుని మళ్లీ పాత ధోరణిని ఆశ్రయించాయి. ఇక రాజకీయ పార్టీలు కూడా యథాప్రకారం తమ తమ రాష్ట్రాల ప్రభుత్వాల వైఖరినే సమర్థించాయి. పరిస్థితి మళ్లీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయింది. ఇదంతా దూరదృష్టి లేమితో వచ్చిన సమస్య. అవాంఛనీయం కూడా. సట్లెజ్–యమున అనుసంధాన కాలువ నిర్మాణం వివాదం మీద వచ్చే నెల సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అందులో హరియా ణాకు అనుకూలమైన ఫలితం రావచ్చు. అయినా రాష్ట్రంలోని రాజ కీయ పార్టీల మద్దతుతో పంజాబ్ ప్రభుత్వం ఆ కాలువ నిర్మాణానికీ, హరియాణాకు నీటి పంపిణీ అడ్డుకోవడానికీ కనిపించే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. ఇదో ఆరని రాజకీయ వివాదంగా అవతరిం చవచ్చు. నిజానికి నదీజలాల వాటాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నలభై ఏళ్ల క్రితం ఇచ్చిన తొలి అవార్డు ఇదే. ఇప్పుడు హరియాణా ప్రభుత్వం అనుసరించిన వైఖరి కారణంగా తలెత్తే రాజకీయ ఘర్షణ ఇంకొన్నేళ్లు సమస్య సాగేందుకే ఉపయోగపడుతుంది. పంజాబ్, హరియాణాల మధ్య ఉన్న ఈ జలవివాదం చాలా చిన్నది, పరిష్కారానికి అనువైనదని నేను చిరకాలంగా వాదిస్తున్నాను. ఈ సందర్భంలో ఒక ప్రతిపాదన చేస్తూ, రెండు రాష్ట్రాల ప్రజలు దానిని పరిగణనలోనికి తీసుకోవాలని కోరుతున్నాను. ఈ ప్రతిపాదన సారాంశం ఏమిటంటే–హరియాణా ప్రభుత్వం పూర్వం నుంచీ కోరు తున్నట్టు కాకుండా, కొంత తక్కువ వాటాను స్వీకరించడానికి అంగీ కరించాలి. కాలువ నిర్మాణంతో సహా హరియాణా ప్రతిపాదనను అమలు చేయడానికి పంజాబ్ ప్రభుత్వం వెనువెంటనే ఆమోదించాలి. ఇదొక సాంకేతికపరమైన వివాదం. ప్రస్తుతం రావి–బియాస్ నదీజలాల పంపిణీ వ్యవహారాల మీద పనిచేస్తున్న ట్రిబ్యునల్ ఎందుకు పరిష్కరించలేకపోతున్నదో అంతుపట్టదు. అయితే ఒకటి. ఈ ట్రిబ్యు నల్ పదవులను భర్తీ చేయకపోవడం వల్ల దశాబ్దకాలంగా పనిచేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీ చేసి ఈ వివాదం మీద తన అభిప్రాయాన్ని ప్రకటించే అవకాశాన్ని కల్పించాలి. ఇక రెండో వివాదం– లభ్యమవుతున్న జలాలలో పంజాబ్ వాటా. 1976లో ఇచ్చిన ఇందిరా గాంధీ అవార్డ్ ప్రకారం పంజాబ్‌కు 22 శాతం జలాలను కేటాయించారు. ఇది అన్యాయమని ఇంతవరకు ఆ రాష్ట్రాన్ని ఏలిన ప్రభుత్వాలు వాదిం చాయి. 1981లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసుకున్న ఒప్పందం మేరకు పంజాబ్ వాటాను 22 శాతం నుంచి 25 శాతానికి పెంచారు. మళ్లీ 1987లో ఎరాది ట్రిబ్యునల్ తన తొలి నివేదికలో ఈ వాటాను 28 శాతానికి పెంచింది. దీనిని రాజకీయ పార్టీలు నిరాకరించాయి. మాల్వా ప్రాంత రైతులు మిగులు జలాల మీద ఆధారపడుతున్నారు. ఈ జలాల మీద హరియాణాకు చట్టబద్ధమైన హక్కు ఉంది. కానీ పరిస్థితిని బట్టి ఐదు శాతం వాటాను పంజాబ్‌కు ఇవ్వడానికి హరియాణా అంగీకరిం చాలి. ఇందుకు ప్రతిగా సట్లెజ్–యమున అనుసంధాన కాలువ నిర్మాణా నికి పంజాబ్ అడ్డంకులు లేకుండా చూడాలి. ఈ విషయాన్ని పంజాబ్ సుప్రీంకోర్టులో అంగీకరించాలి. ఆ రెండు రాష్ట్రాలలోను సజావుగా ఆలో చించే ప్రజలు, మేధావులు, రైతు సంఘాలు ఇప్పుడు తమ తమ ప్రభు త్వాలను చర్చలకు ప్రోత్సహించాలి. అది జాతీయ సమైక్యతకు వేసే సరైన అడుగు అవుతుంది. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 ‘ Twitter : @_YogendraYadav -
ప్రారంభమైన అపెక్స్ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అధ్యక్షతన అపెక్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. శ్రమశక్తి భవన్‌లోని ఉమాభారతి చాంబర్లో ఈ భేటీ జరుగుతోంది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల కింద తమకు దక్కే వాటాలపై గళమెత్తేందుకు ఇటు తెలంగాణ.. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై నిలదీసేందుకు అటు ఏపీ సిద్ధమయ్యాయి. ఇది ఎజెండా: అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో కేంద్రం ఐదు ప్రధాన అంశాలను చేర్చింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ నరేశ్‌కుమార్ ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపారు. 21వ తేదీ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు శ్రమశక్తి భవన్‌లోని కేంద్రమంత్రి ఉమాభారతి చాంబర్లో సమావేశం జరుగుతుందని వివరించారు. ఎజెండాలోని అంశాలను నోటీస్‌లో వివరించారు. సుప్రీంకోర్టు పరిష్కరించాలని సూచించిన పాలమూరు, డిండి ప్రాజెక్టులను తొలి అంశంగా చేర్చారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి తాత్కాలిక విధానం, రిజర్వాయర్ల పరిధిలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లెక్కలు పారదర్శకంగా ఉండేందుకు టెలీమెట్రీ విధానం, ఒక వాటర్ ఇయర్లో నీటి వాటాల్లో హెచ్చుతగ్గులుంటే వాటి సర్దుబాటు, గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి తరలిస్తూ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను ఎజెండాలో చేర్చారు. వీటితో పాటు ఏవైనా ఇతర అంశాలుంటే కేంద్రమంత్రి సమ్మతితో చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఒక్కో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇంజనీర్ ఇన్ చీఫ్‌తో కూడిన ఐదుగురు ప్రతినిధుల బృందం హాజరు కావాలని సూచించారు. -
21న ముఖ్యమంత్రుల భేటీ?
అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్, చంద్రబాబు ఓకే భేటీ తేదీపైనే భిన్నాభిప్రాయాలు 19కి ఓకే చెప్పిన చంద్రబాబు.. 21న కుదురుతుందన్న కేసీఆర్ 21 తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లనున్న ఉమాభారతి ఆలోగా జరగకుంటే.. అక్టోబర్‌లోనే సీఎంల సమావేశం కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయం మేరకు నిర్వహణ నీటి లెక్కలపై ముఖ్యమంత్రితో హరీశ్‌రావు చర్చలు కృష్ణా, గోదావరి నీటి వాడకంపై అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు ఈ నెల 21న భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ఢిల్లీలో జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీకి ఇరువురు సీఎంలు ఇప్పటికే సమ్మతి తెలిపారు. అయితే ఏ రోజున సమావేశమవుతారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 19న భేటీకి చంద్రబాబు ఓకే చెప్పగా.. 21న నిర్వహించాలని కేసీఆర్ కోరనున్నారు. ఇక 21వ తేదీ తర్వాత కేంద్ర మంత్రి ఉమాభారతి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు అపెక్స్ కౌన్సిల్ భేటీ ఉండనుంది. ఈ నెలలో జరిగేనా..? రాష్ట్ర విభజన నాటి నుంచి కొనసాగుతున్న జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్రం అపెక్స్ కౌన్సిల్ భేటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకావాల్సి ఉంది. చర్చలు జరిపేందుకు ఇరువురు ముఖ్యమంత్రులు ఇప్పటికే తమ సమ్మతి తెలియజేశారు. దాంతో భేటీ కోసం ఈనెల 11, 18, 19 తేదీల్లో ఏదో ఒక తేదీని సూచించాలని కేంద్రం కోరగా.. 19వ తేదీకి ఓకే చెబుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే లేఖ రాశారు. కానీ 19న తమకు వీలు కాదని.. 21వ తేదీన భేటీ ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని కేసీఆర్ నిర్ణయించారు. వినాయక ఉత్సవాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు, సమీక్షల దృష్ట్యా 19వ తేదీకి ముందు భేటీ కుదరదని... 20వ తేదీ నుంచి పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయనే ఆ లేఖలో పేర్కొననున్నారు. దాంతో 21న భేటీ నిర్వహిస్తే సహేతుకంగా ఉంటుందని సూచించనున్నారు. గురువారం ఈ లేఖ రాసే అవకాశముంది. మరోవైపు అపెక్స్ కౌన్సిల్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఉమాభారతి 21వ తేదీ తర్వాత అందుబాటులో ఉండటం లేదని.. ఆమె విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. అంటే ఈలోగానే ఇద్దరు సీఎంలు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. లేకపోతే అపెక్స్ కమిటీ భేటీ వచ్చే నెలకు వాయిదా పడనుంది. సీఎంతో మంత్రి హరీశ్‌రావు చర్చలు అపెక్స్ భేటీ తేదీలు, అందులో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేసేందుకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో రెండు విడతలుగా భేటీ అయ్యారు. ఉదయం జరిగిన సమావేశంలో అపెక్స్ భేటీ అంశంతో పాటు, కేంద్రం-నాబార్డ్‌ల మధ్య కుదిరిన ఒప్పందం, ఏపీ జలచౌర్యంపై ఫిర్యాదు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలిసింది. అయితే ప్రస్తుత వాటర్ ఇయర్లో కృష్ణా జలాల లభ్యత, వినియోగం, బోర్డు కేటాయింపులు, పట్టిసీమ ద్వారా ఏపీ చేసిన నీటి వినియోగం, పోతిరెడ్డిపాడు, హంద్రీ నీవా, కేసీ కెనాల్ ద్వారా తరలించిన నీటి లెక్కలతో రావాలని సీఎం సూచించడంతో... హరీశ్‌రావు అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఇప్పటివరకు సాగర్, శ్రీశైలం, జూరాల కింద ఇరు రాష్ట్రాలు చేసిన నీటి వినియోగంపై చర్చించారు. ఇటీవల ఖరీఫ్ సాగు అవసరాలకు బోర్డు చేసిన కేటాయింపులు, అందులో తెలంగాణకు తగ్గిన కేటాయింపులు, పట్టిసీమ, శ్రీశైలం కుడి కాల్వ నుంచి ఏపీ తరలించిన నీటి లెక్కలు తెలుసుకున్నారు. అనంతరం సీఎంతో మళ్లీ భేటీ అయి ఈ వివరాలను వెల్లడించారు. -
నీటికోసం సరిహద్దులో గొడవ
♦ కృష్ణానది నిల్వనీటి విడుదలకు కర్ణాటక రైతుల యత్నం ♦ అడ్డుకున్న మహబూబ్‌నగర్ రైతులు.. స్వల్ప ఉద్రిక్తత మాగనూర్: రాష్ట్ర సరిహద్దులో నీటి వివాదం చెలరేగింది.. ఆదివారం కృష్ణానదిలో నిల్వ ఉన్న నీటిని రివిట్మెంట్ తొలగించి కర్ణాటక రైతులు మళ్లించుకునేందుకు యత్నించగా.. మహబూబ్‌నగర్ జిల్లా రైతులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తమకు తాగునీటి ఇబ్బందులు ఎదురవడంతోనే నీటికి అడ్డంగా ఉన్న రాళ్లను తొలగిస్తున్నామని కర్ణాటక రైతులు చెప్పారు. తమకూ ఇబ్బందులు ఉన్నాయని, ఈ సమయంలో నిలిచిన నీటిని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇదిలాఉండగా, కర్ణాటకలోని శక్తినగర్ పవర్‌ప్లాంట్‌కు నీళ్లు అవసరం ఉండడంతో వారం క్రితం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి దిగువకు 1,551 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీటిని నది మధ్యలో వారి ప్రాంతం లో కొంతవరకు ఇసుకబస్తాలను అడ్డుగా వేసి నిల్వ చేసుకున్నారు. ఆ నీళ్లు మహబూబ్‌నగర్ సరిహద్దులోకి కూడా వచ్చి చేరాయి. వాటిని కర్ణాటక రైతులు దిగువకు విడుదల చేసుకోవడంతో వివాదం మొదలైంది. -
రాష్ట్రాల మధ్య జలజగడం
- ‘పాలమూరు’కు అడ్డొస్తే పట్టిసీమను ఎత్తిచూపాలని తెలంగాణ నిర్ణయం - మహారాష్ట్ర, కర్ణాటకలతో కలసి ఏపీపై ఒత్తిడిపెంచే వ్యూహం - తమ వాటా నీటితోనే ప్రాజెక్టులు చేపడుతున్నట్లు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్యా జల వివాదాలు మరింత ముదురుతున్నాయి. గత ఏడాది ప్రాజెక్టుల్లో నీటి పంపకాలపై తగవులాడుకున్న రెండు రాష్ట్రాలు ఈ ఏడాది రెండు నదుల బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి నిల్వలు చేరకముందే జల జగడానికి దిగాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల(కురుమూర్తి), డిండి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం, ట్రిబ్యూనల్, బోర్డుల అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతుండగా.. పట్టిసీమకు ఎలాంటి ముందస్తు అనుమతులున్నాయో తెలపాలంటూ టీ-సర్కారు అదేస్థాయిలో ప్రతిస్పందిస్తోంది. ఎగువ రాష్ట్రాలతో కలసి పోరాటం.. కృష్ణా నదిలో 90 టీఎంసీల వరద జలాలను వినియోగించుకునే ప్రణాళికతో చేపడుతున్న పాలమూరు ఎత్తిపోతలకు ఏపీ అడ్డుపడితే పట్టిసీమ ప్రాజెక్టులో నీటి వాటాలపై పట్టుబట్టాలని టీ-సర్కారు భావిస్తోంది. పట్టిసీమ వద్ద 80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకానికి గోదావరి బోర్డు అనుమతి లేకుండా, కనీససమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులివ్వడంపై తెలంగాణ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే అయితే 80 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలకున్న 35 టీఎంసీల వాటాను కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణా జలాల్లో మినహాయించుకునే అవకాశం ఉంది. మిగతా 45 టీఎంసీల వాటా ఉమ్మడి ఏపీకి సంబంధించినది. 45 టీఎంసీల్లో ఏపీ, తెలంగాణ 58:42 నిష్పత్తిలో పంచాల్సి వస్తే.. తెలంగాణకు 19 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుందనేది తెలంగాణ నీటిపారుదల శాఖ వాదన. ఒకవేళ పాలమూరుపై ఏపీ కొర్రీలు పెడితే పట్టిసీమలో తమకు దక్కాల్సిన వాటాతో పాటు ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలపై ఆ రాష్ట్రాలతో కలసి ఉమ్మడిగా పోరాడాలని టీ-సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది. వాటాలను ఎక్కడ వాడుకుంటే ఏంటీ? కృష్ణా జలాల వినియోగం విషయంలో బచావత్ అవార్డు మేరకు కృష్ణాలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఈ నీటి వినియోగంలో ప్రాజెక్టువారీ కేటాయింపులున్నా, అవేవీ ప్రస్తుతం పూర్తికాకకపోవడంతో, తనకున్న నీటి వాటాను రాష్ర్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకుంటానని చెబుతూ టీ-సర్కారు ఆ మేరకు నీటిని వాడుకుంటోంది. ఉమ్మడి ఏపీకి క్యారీఓవర్ కింద ఇచ్చిన 150 టీఎంసీలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పూడిక కారణంగా వాడుకోలేకపోతున్న 170 టీఎంసీలు, పట్టిసీమలో భాగంగా ఉమ్మడి ఏపీకిచ్చిన 45 టీఎంసీల్లో తమకు దక్కే వాటాల నీటితోనే పాలమూరు, డిండి ప్రాజెక్టులను చేపట్టామని బలంగా చెబుతోంది. దీనిపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ’ట్రిబ్యూనల్ కేవలం ఎవరి వాటాలు ఎంత అని మాత్రమే నిర్దేశిస్తుంది. రాష్ట్రానికి జరిపిన వాటా మేరకు నీటిని వాడుకోవాలంటే ముందుగా దాన్ని నిల్వ చేయాలి. అది చేయాలంటే ప్రాజెక్టు కట్టాలి. అందులో భాగంగానే పాలమూరు, డిండి కడుతున్నాం. ట్రిబ్యునల్ సైతం వాటాలు నిర్ణయిస్తుంది కానీ, ప్రాజెక్టులు కట్టాలా? వద్దా? అన్నది నిర్ణయించదు కదా‘ అని వ్యాఖ్యానించారు. -
రబీకి నీళ్లు ఇచ్చేందుకు టీ-సర్కారు ఓకే
-
రబీకి నీళ్లు ఇచ్చేందుకు టీ-సర్కారు ఓకే
నాగార్జున సాగర్ నీటి సమస్య సమసిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రబీ సీజన్‌కు గాను నీళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. వచ్చే సీజన్లో ఆ మేరకు తాము నీళ్లు వాడుకుంటామని టీ సర్కారు తెలిపింది. రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు సమావేశమయ్యారు. అక్కడే ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా పవర్‌హౌజ్ ద్యారా 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం హెడ్ రెగ్యులేటర్ ద్యారా మరో 5వేల క్యూసెక్కుల నీటిని నాలుగో గేటు నుంచి అధికారులు విడుదల చేశారు. రెండు రాష్ట్రాల్లో రైతులు నష్టపోకుండా చూస్తామని మంత్రులు హరీశ్‌రావు, దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. పంటలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. నీటి విడుదలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయంతో ముందుకు వెళ్తారని చెప్పారు. డ్యాం పైకి రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నీటి విడుదల వ్యవహారాన్ని రెండు రాష్ట్రాలకు చెందిన ఈఎన్సీలు పర్యవేక్షిస్తారని దేవినేని ఉమా మహేశ్వరరావు, హరీశ్‌రావు తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించామన్నారు. భవిష్యత్తులో వరదలు వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా అంతా కలిసి పరిష్కరించుకుంటామని చెప్పారు. -
ఏపీ, తెలంగాణల మధ్య 'నీళ్ళ' కొట్లాట!
-
సాయంత్రం ఢిల్లీ వెళ్ళనున్న హరీష్ రావు
-
తెలంగాణకు 3 టీఎంసీలు: కృష్ణాబోర్డు
విద్యుత్ ఉత్పత్తి కోసం నవంబర్ రెండో తేదీ వరకు 3 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ కృష్ణా వాటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై నవంబర్ 15 తర్వాత పునస్సమీక్షించాలని నిర్ణయించారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య పలు విడతలుగా చర్చలు జరిగినా, ఓ నిర్ణయానికి రావడంలో విఫలమయ్యారు. దాంతో కృష్ణాబోర్డు స్వయంగా తానే ఓ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించలేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తదితరులు చర్చిస్తున్నట్లు సమాచారం. కృష్ణాబోర్డు నిర్ణయంపై తెలంగాణ సర్కారు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. -
డైలీ సీరియల్లా టీ-మంత్రుల అబద్ధాలు: పరకాల
-
డైలీ సీరియల్లా టీ-మంత్రుల అబద్ధాలు: పరకాల
తెలంగాణ మంత్రులు అబద్ధాలను సీరియల్లా చెబుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ విమర్శించారు. 233 జీవోలో ఎక్కడా 834 అడుగుల వరకు నీరు వాడుకోవచ్చనే పదమే లేదని ఆయన అన్నారు. చెప్పిన అబద్ధాలనే వాళ్లు మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. 107 జీవోకు, 170 జీవోకు మధ్య తేడా ఏంటో హరీష్‌రావుకు తెలియదా అని ప్రశ్నించారు. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని, అబద్ధాల డైలీ సీరియల్‌ను ఇకనైనా ఆపాలని పరకాల ప్రభాకర్ అన్నారు. మీ నీటిని మీరు వాడుకుంటే తమకు అభ్యంతరం లేదని, అంతేతప్ప.. తమకు రావల్సిన న్యాయబద్ధమైన వాటాలో కూడా వేలు పెడితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఇక విద్యుత్తు విషయంలో కూడా.. తమకు వెయ్యి మెగావాట్లు రావాలని అడుగుతున్నారని, అవి ఎక్కడినుంచి రావాలని ప్రశ్నించారు. దానికి ఏమైనా లెక్క ఉందా.. ఎక్కడెక్కడ రావల్సిన దానికన్నా అదనంగా తీసుకుంటున్నారో కూడా లెక్కలు చెబుతానని అన్నారు. థర్మల్ విద్యుత్తులో ఏపీ ఉత్పత్తి చేసిన దాంట్లోంచి 769 మిలియన్ యూనిట్లు తెలంగాణకే ఇచ్చామని ఆయన చెప్పారు. జల విద్యుత్తులో కూడా ఆంధ్రా డిస్కంలు 1621, తెలంగాణ డిస్కంలు 2224 మిలియన్ యూనిట్ల చొప్పున వాడుకున్నాయన్నారు. ఇలా అన్నిచోట్లా ఎక్కువ వాడుకుంటూ.. తమ మీద తప్పునెట్టడం తెలంగాణ మంత్రులకు తగదని పరకాల ప్రభాకర్ చెప్పారు. -
'తెలంగాణ ప్రజలే కేసీఆర్‌ను ఛీకొడుతున్నారు'
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మండిపడ్డారు. నీటి హక్కులకు సంబంధించిన జీవోలపై కేసీఆర్‌కు ఏమాత్రం అవగాహన లేదని, అందుకే ఆయనలా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలే కేసీఆర్‌ను ఛీకొడుతున్నారని, ఇప్పటికైనా కేసీఆర్ తన పద్ధతి ఆమర్చుకోవాలని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సూచించారు. రాయలసీమకు నీటి విడుదల విషయంలో కేసీఆర్ తీరును ఆయన విమర్శించారు. -
శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంచండి: వైఎస్ఆర్సీపీ
శ్రీశైలంలో నీటిమట్టం కనీసం 854 అడుగులు కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వెళ్లి కలిశారు. శ్రీశైలంలో నీటిమట్టం 850 అడుగుల కన్నా తగ్గితే.. చెన్నైతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని ఆయనకు చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో పంటలు ఎండిపోకుండా ఉండాలంటే కనీసం జనవరి 15వ తేదీ వరకైనా 850 అడుగుల నీటి మట్టాన్ని కొనసాగించాలని నేతలు కోరారు. కృష్ణా బోర్డులో రాయలసీమ నీటి సమస్యపై చర్చించాలని తెలిపారు. కర్నూలులో కృష్ణా వాటర్ బోర్డు ఏర్పాటుచేస్తే.. అందరికీ అనువుగా ఉంటుందని చెప్పారు. -
జల వివాదంపై సుప్రీం కోర్టుకు టీ సర్కార్
-
చివరి దశకు జల జగడం!
భామిని: అంతర్ రాష్ట్ర జల వివాదం త్వరలో పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన వంశధార ప్రాజెక్టు పనుల అనుమతుల సాధనపై కదలిక వచ్చింది. ఒడిశా లేవనెత్తిన ఆభ్యంతరాల చిక్కుముడులు విప్పేందుకు చేపట్టిన చర్యలు ముగింపు దశకు వచ్చాయి. ఈ దశలో వంశధార ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం లేవనెత్తుతున్న అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన నివేదికను ఇంజి నీరింగ్ అధికారుల బృందం శుక్రవారం (ఈ నెల 8 తేదీ) సంబంధిత ట్రిబ్యునల్‌కు అందజేయనుంది. ఇందుకోసం అధికారుల బృందం ఢిల్లీలో మకాం వేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ద్వారా సంపాదించిన 18 రకాల అభ్యంతరాలకు కావాల్సిన వివరాలను ట్రిబ్యునల్‌కు సమర్పించనున్నా రు. ఇప్పటికే రాష్ట్ర సమన్వయాధికారి సతీష్‌చంద్ర ఆధ్వర్యంలో వంశధార ఈఈ బి.రాంబాబు ఢిల్లీలో మకాం వేసి సీడబ్ల్యూసీ అధికారుల ద్వారా ట్రిబ్యునల్‌కు సమర్పించడానికి కావాల్సిన చర్యలు పూర్తి చేశారు. ఇటీవల కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ భామిని మండలంలోని వంశధార ప్రా జెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో నివేదికలు సేకరించి ట్రిబ్యునల్‌కు సమర్పించాలని ఆదేశించారు. గతం ఇలా.. వంశధార ప్రాజెక్టు విషయంలో ఒడిశా ప్రభుత్వం అనేక అభ్యంతరాలను లేవనెత్తింది. దీం తో విషయం కోర్టుకు వెళ్లింది. ఈ పరిస్థితిలో గత ఏడాది ఏప్రిల్ 22 నుంచి 25వ తేదీ వరకు వంశధార ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందకం శర్మ ఆధ్వర్యంలోని బృందం ఇరు రాష్ట్రాల్లోని వంశధార ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం డిసెంబర్ 17న ట్రిబ్యునల్ తీర్పునిచ్చి వంశధార నదిపై సైడ్వియ్యర్ నిర్మించి ఓపెన్‌హెడ్ చానల్ ద్వారా సాగునీరు తరలించుకోవడానికి ఆంధ్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. అనంతరం రెండు రాష్ట్రాల్లోను ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేశాయి. దీంతో ఈ ఏడాది మార్చి 22న మరోసారి ట్రిబ్యునల్ బృందం వంశధార ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని పునః పరిశీలించింది. ట్రిబ్యునల్ ముం దు లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తిస్థాయి నివేదికలను కూడా ఇప్పుడు వంశధార అధికారులు సిద్ధం చేసి ట్రిబ్యునల్‌కు అందజేయనున్నారు. అటవీశాఖ, పర్యావరణ అనుమతుల సాధనకు ప్రయత్నాలు చేస్తున్నారు. పూనే లో జరిపిన మోడల్ సర్వేలోనూ గుర్తించిన నివేదికలను సైతం అందించనున్నారు. దీంతో వంశధారకు ట్రిబ్యునల్ నుంచి పూర్తిస్థాయి అనుమతులు రావచ్చునని జిల్లా వాసులు భావిస్తున్నారు. -
మూడు రాష్ట్రాల మధ్య తెగని పంచాయితీ
కర్నూలు(రూరల్): ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) వివాదం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఆధునికీకరణ పనుల సాకుతో ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక నీటిపారుదల శాఖ అధికారులు యత్నించడం వివాదానికి కారణమైంది. ఈ వివాదం ముగియక మునుపే మహబూబ్‌నగర్ జిల్లాలో చివరి ఆయకట్టుకి నీరందడం లేదని, ఆనకట్ట ఎత్తు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకుపోయింది. దిగువకు నష్టం వచ్చేంత స్థాయిలో ఎత్తు పెంచడం లేదని, మహబూబ్‌నగర్ రైతులను అదుకునేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమకు ఇటీవల తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు. ఆ లేఖకు సమాధానం ఇవ్వాలని మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించింది. ఆర్డీయస్ ఆనకట్ట ఎత్తు పెంచితే సీమ ప్రాంత ఆయకట్టు రైతులకు మిగిలేది కన్నీళ్లేనని, హైడ్రలాజికల్ క్లియరెన్స్ లేకుండా పనులు చేయకూడదని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు నీటిపారుదల శాఖ అధికారులు నివేదిక అందజేశారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం మూడు రాష్ట్రాలకు చేరింది. హరీష్‌రావు లేఖలోని అంశాలు ఇవి.. ఆర్డీఎస్ ఆనకట్ట మధ్యలో అక్కడక్కడ స్తంభాలు ఏర్పాటు చేసుకొని నీటి నిల్వ సామర్థ్యం పెంచుకుంటాం. హెడ్ రెగ్యులేటర్‌కు ప్రస్తుతం ఉన్న గేట్లను తొలగించి పవర్ క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు అనుమతివ్వాలి. బురద తొలగించే గేట్ల స్థానంలో పవర్ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేస్తాం. ఆనకట్ట కింద ఉన్న పైపులను తీసేసి పూర్తి స్థాయి మరమ్మతులు చేస్తాం. {పస్తుతం దిగువకు నీరు వస్తున్న స్లూయిజ్‌ను మూసి వేస్తాం. ఆనకట్టను అడుగు ఎత్తు పెంచుకొని, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాం. అధికారుల నివేదిక ఇదీ.. కర్నూలు జిల్లాలో 4 గ్రామాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 15 గ్రామాలకు సాగు, తాగునీరు అందించేందుకు ఆర్డీఎస్ను నిర్మించారు. 42.60 కి.మీ నుంచి 143 కి.మీ వరకు ఆర్డీఎస్ కాల్వ ఏపీ పరిధిలోకి వచ్చింది. మిగిలిన 0 కి.మీ నుంచి 42.60 కి.మీ వరకు రాయచూరు జిల్లాలోకి వెళ్లింది. 42 కి.మీ వరకు 5,879 ఎకరాలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆర్డీఎస్ ఆయకట్టు దిగువకు పోయే నీటిపైనే కేసీ ఆయకట్టు ఆధారపడి ఉంది. ఆనకట్ట మద్యలో స్తంభాలు, హెడ్ రెగ్యులేటర్ గేట్లను, బురద తొలగించే గేట్ల స్థానంలో పవర్ క్రస్ట్ గేట్లు ఏర్పాటుతో దిగువకు చుక్క నీరందదు. ఆధునికీకరణ సాకుతో ఎత్తు పెంచేందుకు తెలంగాణ పాలకులు, అధికారులు కుట్ర చేస్తున్నారు. ఇప్పటీకే ఆనకట్టకు ఉన్న 19 పైపులు మూతపడ్డాయి. ప్రస్తుతం ఒక వెంట్ ద్వారానే దిగువకు నీరు వస్తోంది. దీన్ని కూడా మూసి వేస్తే నీరంతా హెడ్ వర్క్స్ వైపు పోతుంది. నీటి నిల్వ పెంచితే కేసీ ఆయకట్టుకు సాగు నీరు అందక 2.65 లక్షల ఎకరాలు బీళ్లుగా మారుతాయి. హైడ్రలాజికల్ క్లియరెన్స్ లేకుండా, కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా పనులు చేయడం చట్ట విరుద్ధం. -
కృష్ణాడెల్టాకు నీరిస్తే తెలంగాణకే లబ్ధి
కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికే లబ్ధి చేకూరిందని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇలా డెల్టాకు నీరు విడుదల చేయడం వల్ల తెలంగాణ ప్రాంతానికి 237 కోట్ల రూపాయల విలువైన విద్యుత్ ఉత్పత్తి అయ్యిందని ఆయన అన్నారు. దీని వల్ల తెలంగాణలో విద్యుత్ కొరత బాగా తగ్గిందని ఉమామహేశ్వరరావు చెప్పారు. అయితే.. సాగర్ నుంచి 7 టీఎంసీల నీరు విడుదలైతే, ప్రకాశం బ్యారేజికి వచ్చింది మాత్రం 3 టీఎంసీలేనని, అందువల్ల డెల్టా ప్రాంత తాగునీటి అవసరాలు తీరేందుకు మిగిలిన నీరు కూడా విడుదల చేయాలని మంత్రి ఉమా మహేశ్వరరావు కోరారు. -
అటకెక్కిన కామినేని విస్తరణ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటూ... పూర్తి సామర్థ్యంలో కనీసం 10-20 శాతం కూడా ఉత్పత్తిని సాధించలేని దశలో కామినేని గ్రూపు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. నీటి విడుదల కోసం ఇప్పటికే ప్రభుత్వాన్ని అభ్యర్థించటంతో పాటు కేంద్రం యాజమాన్యంలోని మానిటరింగ్ గ్రూపు ప్రభుత్వానికి మెమోలు జారీ చేసినా ఫలితం లేకపోవటంతో కంపెనీ ప్రత్యామ్నాయాలపై పడింది. నేరుగా కేంద్రానికి లేఖ రాయటంతో పాటు అవసరమైతే ప్లాంటును ఉత్తరాదికో, మరో చోటికో తరలించే మార్గాన్ని కూడా కంపెనీ పరిశీలిస్తోంది. ప్రస్తుతం కామినేని గ్రూపు ఆధ్వర్యంలో ఆసుపత్రితో పాటు (కేఎస్పీఎల్), యునెటైడ్ సీమ్‌లెస్ ట్యూబ్యులర్(యూఎస్‌టీపీఎల్), ఆయిల్ కంట్రీ ట్యూబ్యులర్ వంటి సంస్థలు కొనసాగుతున్నాయి. ఈ సంస్థలన్నీ నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్దే కేంద్రీకృతమయ్యాయి. వీటిలో ఆయిల్ కంట్రీ ట్యూబ్యులర్ సంస్థ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది కూడా. బిల్లెట్ల తయారీలో ఉన్న కేఎస్పీఎల్ 2011 జూన్‌లో కార్యకలాపాలు ఆరంభించింది. అయితే వాణిజ్య కార్యకలాపాలు మాత్రం ఈ నెల్లోనే మొదలయ్యాయి. ఇక్కడ తయారయ్యే బిల్లెట్లను యూఎస్టీపీఎల్కు సరఫరా చేస్తారు. అది ముడి పైపుల్ని ఉత్పత్తి చేస్తుంది. అనంతరం వాటిని ఆయిల్ కంట్రీ ట్యూబ్యులర్ కొనుగోలు చేసి.. తుది మెరుగులు దిద్దుతుంది. ఈ 3 ప్లాంట్లూ దాదాపు నార్కట్ పల్లిలోని 250 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటికితోడు కేఎస్పీఎల్ ఇక్కడే 220 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ‘‘18 నెలల్లో ఉత్పత్తి మొదలవుతుంది. దీనిని 500 మెగావాట్ల వరకు విస్తరించే అవకాశం కూడా ఉంది. ఉత్పత్తయ్యే విద్యుత్‌లో సగం మా అవసరాలకు వాడుకుంటాం. మిగిలింది గ్రిడ్‌కు అనుసంధానం చేస్తాం’’ అని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే కేఎస్పీఎల్, యూఎస్టీపీఎల్పై గ్రూపు ఇప్పటిదాకా రూ.2,500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. నీటి కొరతతో తగ్గిన ఉత్పత్తి... నార్కట్ పల్లి ప్లాంట్లకు సరఫరా కావాల్సిన నీటి విషయంలో వివాదం రేగటంతో ఆ ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. యూఎస్‌టీపీఎల్ వార్షిక సామర్థ్యం 3 లక్షల టన్నులైనా ప్రస్తుతం 30వేల టన్నులే ఉత్పత్తవుతోంది. కేఎస్పీఎల్ వార్షిక సామర్థ్యం 3.5 లక్షల టన్నులు కాగా నెలకు 5 వేల టన్నులే ఉత్పత్తవుతోంది. నీరు లేక యూఎస్‌టీపీఎల్ ఉత్పత్తి ఏడాదిన్నర ఆలస్యం కాగా... ప్రస్తుతం భూగర్భ నీటితోపాటు వర్షపు నీటిని నిల్వ చేసి అరకొర ఉత్పత్తి సాగిస్తున్నారు. దీంతో నిర్వహణ వ్యయాలూ భారీగా పెరిగిపోయాయి. నిజానికి 2 ప్లాంట్లూ పూర్తి సామర్థ్యంతో నడిస్తే యూఎస్‌టీపీఎల్ నుంచి 60%, కేఎస్పీఎల్ నుంచి 80% మేర ఎగుమతులకు ఆస్కారం ఉంది. రూ.వెయ్యి కోట్ల పైబడిన ప్రాజెక్టుల అమలును కేబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సారథ్యంలోని మాని టరింగ్ గ్రూపు పర్యవేక్షిస్తోంది. కేఎస్పీఎల్, యూఎస్‌టీపీఎల్ కూడా దీని పర్యవేక్షణలో ఉన్నాయి. నార్కట్‌పల్లి ప్లాంట్లకు నీటి సరఫరాపై రాష్ట్ర సర్కారుకు ఈ గ్రూపు మెమోలూ జారీ చేసింది. అయి నా లాభం లేకపోవటంతో... రూ.3,000 కోట్లతో ప్రతిపాదించిన విస్తరణను కంపెనీ ప్రస్తుతానికి పక్కనబెట్టింది. విస్తరణ లేనట్టే. బ్యాంకర్లు వద్దన్నా... బిల్లెట్లు, పైపులు రెండూ తయారు చేసే గ్రూపు మాదొక్కటే. కర్ణాటక సర్కారు ఆహ్వానించినా, గుజరాత్ ను పరిశీలించినా... మన ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న మా చైర్మన్ ఆకాంక్ష మేరకు నార్కట్‌పల్లిలో నెలకొల్పాం. బ్యాంకర్లు వద్దన్నా, ప్రభుత్వ సబ్సిడీలు కూడా తీసుకోకుండా సొంత నిధులతో ఏర్పాటుచేశాం. 3,000 మంది ఉద్యోగులున్నారు. ఉదయసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఏటా 0.091 టీఎంసీల నీటిని ప్రభుత్వమే కేటాయించినా ప్రస్తుతం అందటం లేదు. ఈ వివాదాన్ని ఊహించి ఉంటే ఇంత పెట్టుబడి పెట్టేవాళ్లం కాదేమో!! నష్టాలతో ఎక్కువకాలం ప్లాంట్లను నడపలేం. - కామినేని శశిధర్, గ్రూప్ డెరైక్టర్ -
నిప్పులు కక్కిన నీళ్లు
నీళ్లు నిప్పును ఆర్పేస్తాయంటారు.. కానీ ఆ నీళ్లే ఇప్పుడు నిప్పులు కక్కాయి. పాతకక్షల జ్వాలను ఎగదోశాయి. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న సుమంతాపురం(పొడుగుపాడు) గ్రామాన్ని వణికించాయి. ఆదివారం నీళ్ల విషయంలో మహిళల మధ్య రేగిన గొడవ సర్దుబాటు అయినట్లు కనిపించినా.. అది నివురు గప్పిన నిప్పులా మారి.. సోమవారం ఉదయం రాజుకుంది. గ్రామం మొదటి నుంచీ కాంగ్రెస్, టీడీపీ సానుభూతిపరులుగా విడిపోయింది. ఉదయం టీడీపీ వర్గీయుడు పాలకేంద్రానికి వెళుతుండగా కాంగ్రెస్ మద్దతుదారులు అడ్డుకోవడం.. అది తెలిసి అక్కడికి వచ్చిన మరి కొందరు టీడీపీ సానుభూతిపరులు ప్రశ్నిం చడంతో గొడవ పెద్దదైంది. కాంగ్రెస్ వర్గీయులు తిరగబడటంతో ఇరువర్గాలు కొట్లాటకు సై అన్నాయి. అంతే.. గ్రామంలో రాళ్ల వర్షం కురిసింది. టీడీపీకి చెందిన 14మంది గాయపడ్డారు. వారి లో పిల్లా రమణయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అసువులు బాశాడు. మొదట దాడికి పాల్పడిన నిందితులు ఒక హత్య కేసులో శిక్ష అనుభవించి, ఇటీవలే సత్ప్రవర్తన కారణంగా విడుదలయ్యారు. దాంతో గ్రామం మళ్లీ ఉద్రిక్తత నీడలోకి వెళ్లిపోయింది. 14 ఏళ్లుగా కొనసాగుతున్న కక్షలు మళ్లీ విద్వేషాగ్నిని వెళ్లగక్కాయి. శ్రీకాకుళం: సుమంతాపురంలో సోమవారం జరిగిన కొట్లాటలో పిల్లా రమణయ్య(55) మృతి చెందగా, 14 మంది గాయాలపాలయ్యారు. పోలీసులు, బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒమ్మి అమ్మడమ్మ తాను పెంచుకున్న కోడి పోయిందంటూ.. ఆదివారం రాత్రి తిట్ల దండకం అందుకుంది. కొందరు కలగజేసుకుని, తిట్టవద్దని ఆమెను కోరారు. మరి కొందరు వచ్చి..తగువును ఆపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కూడా గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. సోమవారం ఉదయం కాంగ్రెస్ వర్గానికి చెందిన తూలుగు పాపమ్మ అనే వృద్ధురాలు తాగునీటికోసం గ్రామానికి శివారున ఉన్న బోరు వద్దకు వెళుతుండగా..ఇటువైపు రావద్దని టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఆమె వెనక్కి వెళ్లిపోయింది. 8 గంటల సమయంలో టీడీపీకి చెందిన కర్నం సోమేష్ ఆటోలో పాల కేంద్రానికి పాలు తీసుకుని వెళుతుండగా కాంగ్రెస్ వర్గీయులు అడ్డుకుని, ఆటో ఇటువైపు రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ వర్గీయులు పిల్లా రమణయ్య, ఆనందరావు, గజపతిరావు, గోపాల్‌తో పాటు మరికొందరు సామరస్యంగా అడిగేందుకు ఆటోవద్దకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన తూలుగు ప్రసాదరావు, చిన్నబాబు, వెంకటస్వామి, రామారావుతో పాటు పలువురు దాడికి తెగబడ్డారని పోలీసులు చెప్పారు. విషయం తెలుసుకున్న గాయపడిన వర్గానికి చెందిన వారు ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. రాళ్ల వర్షం కురవడంతో గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొంది. సుమారు గంట కాలంపాటు ఏమి జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు, బాధితులు వాపోయారు. గ్రామంలోని వీధులన్నీ రాళ్లమయమయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమనిగింది. గాయపడిన వారిని ఆటోలు, 108 అంబులెన్స్‌లలో ఆమదాలవలస ప్రభుత్వాస్పత్రికి, శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామని పోలీసులు చెప్పారు. ఆమదాలవలసలో చికిత్స పొందుతూ..రమణయ్య ప్రాణాలు కోల్పోయాడన్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గాయాలపాలైన వారిలో పిల్లా ఆనందరావు, గజపతిరావు, గోపాల్, నాగేశ్వరరావు, గోవిందమ్మ, కంటుమజ్జి సత్యనారాయణ, తూలుగు చిన్నబాబు, వెంకటస్వామి, రమణయ్య, అప్పలనర్సమ్మ, రామారావు, రజనీకాంత్, కర్నం ధనుంజయరావు, సూర్యనారాయణ, తదితరులు ఉన్నారు. వీరిలో రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆనందరావు, గోపాల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ నవీన్ గులాఠీ, శ్రీకాకుళం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, ఆమదాలవలస సీఐ విజయానంద్, ఎస్సై ఎన్.సునీల్, సరుబుజ్జిలి ఎస్సై ఎం.శ్రీనివాస్, ఎన్.లక్ష్మణ్‌లతో పాటు పలువురు పోలీసు సిబ్బంది గ్రామాన్ని సందర్శించి శాంతి భద్రతలు అదుపులోనికి తెచ్చారు. సత్ప్రవర్తనపై వచ్చినవారే దాడి చేశారు.. 2000 మే లో సుమంతాపురం పంచాయతీ గడేవానిపేట గ్రామానికి చెందిన రేషన్ డీలర్ లావేటి సూరన్నపై సుమంతాపురం గ్రామానికి చెందిన తూలుగు చిన్నబాబు, వెంకటస్వామి, రామారావు, సూర్యనారాయణలతో పాటు మరికొంతమంది దాడిచేసి హత్యచేశారు. ఈకేసులో 2006 నవంబర్‌లో కోర్టు తూలుగు చిన్నబాబు, వెంకటస్వామి, రామారావులకు జీవిత ఖైదు విధించింది. సూర్యనారాయణతోపాటు మరికొంతమందిపై నేరారోపణ కాలేదని కోర్టు విడిచి పెట్టింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించిన ఈ ముగ్గురిని ఈఏడాది జనవరిలో సత్పవర్తనపై విడుదల చేశారు. వీరు గ్రామానికి వచ్చిన నుంచి గ్రామంలో భయానక వాతావరణం నెలకొందని మాజీ సర్పంచ్ కంటుమజ్జి సత్యనారాయణ తెలిపారు. వీరే తన తండ్రిని చంపారని మృతుని కుమారుడు పిల్లా తిరుపతిరావు రోదిస్తూ చెప్పాడు. ముందుగానే స్పందించాల్సింది పోలీసులకు ఎస్పీ నవీన్ గులాఠీ చీవాట్లు సుమంతాపురం గ్రామంలో ఆదివారం రాత్రి మహిళల మధ్య చెలరేగిన ఘర్షణ సమాచారం తెలిసిన వెంటనే..అప్రమత్తం కావాల్సిందని ఎస్పీ నవీన్ గులాఠీ సిబ్బందిని మందలించారు. సోమవారం గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామస్తులతో మాట్లాడి, సంఘటనపై ఆరా తీశారు. డీఎస్పీ శ్రీనివాసరావు, ఆమదావలస సీఐ విజయానంద్‌లకు పలు సూచనలు ఇచ్చారు. అత్యంత సమస్యాత్మక గ్రామమైన సుమంతాపురంపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు చెప్పారు. జిల్లాలో 450 అత్యంత సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయని ఎన్నికల ముందు వీటిపై నిఘా పెంచుతామన్నారు. కొట్లాట కేసులో ఇప్పటికే 20 మందిని అదుపులో తీసుకున్నామన్నారు. 40 మందిపై కేసులు నమోదు సుమంతాపురం గ్రామంలో జరిగిన కొట్లాటలో రెండు వర్గాలకు చెందిన 40 మందిపై కేసులు నమోదు చేశామని ఆమదాలవలస సీఐ విజయానంద్ తెలిపారు. కొట్లాటలో గాయపడి న పిల్లా రమణయ్య(55) మరణించడంతో హత్య, దాడిచేసి గాయపర్చడం వంటి కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. 144 సెక్షన్ సుమంతాపురం గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని శ్రీకాకుళం డీఎస్పీ పి.శ్రీనివాసరావు చెప్పారు. గ్రామంలో రెండు వర్గాల మధ్య కొట్లాట తరువాత, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. చర్యలు చేపడుతున్నామన్నారు. ఎచ్చెర్ల ఏఆర్ సిబ్బందితో పహారా ఏర్పాటు చేశామని, గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగుతోందని చెప్పారు. -
సీమ కృష్ణా బేసిన్‌లోకి రాదట!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవాలని కర్ణాటక భావిస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయానంతర పరిస్థితుల్లో తాము చేసే వాదనను ఇతర ప్రాంతాలవారు పట్టించుకోరనేది ఆ రాష్ట్ర ఎత్తుగడ. అందులో భాగంగా రాయలసీమ కృష్ణా బేసిన్ పరిధిలోకి రాదంటూ ట్రిబ్యునల్ ముందు కొత్త వాదన విన్పిస్తోంది. రాష్ట్రానికి నీటి కోటాను తగ్గించేలా చేసి తాను అదనపు నీటిని పొందాలనే ప్రయత్నాలు మొదలు పెట్టింది. కృష్ణానది నీటిపై ఆధారపడిన మన రాష్ట్రంలోని తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపుల్ని చేసింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలతో పాటు మిగులు జలాల నుంచి మరో 190 టీఎంసీలు కేటాయించింది. మొత్తం 448 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించిన ట్రిబ్యునల్ కర్ణాటకకు 177, మహారాష్ట్రకు 81 టీఎంసీల చొప్పున కేటాయించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాబేసిన్‌లో తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులే ఉన్నాయని, వీటికి పాత కేటాయింపులైన 811 టీఎంసీలే ఎక్కువని ఇంతవరకు కర్ణాటక వాదిస్తోంది. తెలుగుగంగకు నీటి కేటాయింపులు చేయడం కృష్ణా బేసిన్‌లోని ప్రజలకు అన్యాయం చేయడమేనని అంటోంది. ఇదే క్రమంలో కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కరువు పీడిత ప్రాంతం ఎక్కువ అని, అందుకోసం ఎక్కువ నీటిని కేటాయించాలని కోరుతూ మన రాష్ర్టం గతంలో ట్రిబ్యునల్‌కు ఒక నివేదికను సమర్పించింది. రాష్ర్టంలోని కృష్ణాబేసిన్‌లో సుమారు 89 వేల చదరపు కిలోమీటర్ల మేర కరువు పీడిత ప్రాంతం ఉందని ఆ మేరకు నీటి కేటాంపులు కావాలని కోరింది. కర్ణాటకలో 52 వేల చదరపు కిలో మీటర్ల మేరకే కరువు పరిస్థితులున్నాయని తెలిపింది. కానీ కర్ణాటక.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను అదనుగా భావించి రాయలసీమ ప్రాంతం కృష్ణాబేసిన్ పరిధిలోకి రాదంటూ అడ్డగోలుగా వాదిస్తోంది. రాయలసీమను లక్ష్యంగా చేసుకున్నా మిగతా ప్రాంతాలవారు మాట్లాడే పరిస్థితి లేదని కర్ణాటక భావిస్తోంది. రాయలసీమ కృష్ణా బేసిన్ పరిధిలోకి రానందున ఆంధ్రప్రదేశ్‌లో కరువు పీడిత ప్రాంతం తమ రాష్ట్రంలో కంటే తక్కువే ఉందని వాదిస్తోంది. ఆ మేరకు మన రాష్ట్రానికి నీటి కేటాయింపులను కుదించాలని కోరుతోంది. ఈ దృష్ట్యా దిగువకు మిగులు జలాలను విడుదల చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నది. ఏపీలోని తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు అవసరాలకు 811 టీఎంసీల నీరు సరిపోతుంద ంటూ మిగులు జలాలపై మనకు హక్కు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మిగులు జలాల్లో 203 టీఎంసీలు తమకు కేటాయించాలని ఆ రాష్ర్టం డిమాండ్ చేస్తోంది. ఈ వాదనను ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంటే...కృష్ణా జలాలపై ఆధారపడ్డ హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలిగొండ వంటి ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. వాస్తవానికి కర్నూలు-కడప (కెసి) కెనాల్ ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీటి సరఫరా ఒప్పందం సుమారు 150 సంవత్సరాల క్రితమే ఉంది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసి నీటి కేటాయింపుల్ని చేశారు. అయితే ప్రస్తుతం కర్ణాటక వాదనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ అంశంపై రాష్ర్ట ప్రభుత్వం తన వాదన లను గురువారం వినిపించనుంది.