సాక్షి, ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి గురించి తెలిసి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు మాట్లాడటం సరికాదు అని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కోవిడ్ ప్రభావంతో అన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులు క్షీణించాయని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పులు చేస్తే.. సోము వీర్రాజు ఎందుకు మాట్లాడలేదని బాలినేని ప్రశ్నించారు. జలాల విషయంలో చంద్రబాబు చేస్తున్న రాజకీయలు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా ఉన్నాయని ఆయన మండి పడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి వుంటే... జలవివాదంపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలి అని మంత్రి బాలినేని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment