సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కేటాయింపులకు మించి నీటి వినియోగంపై కేఆర్ఎంబీ అభ్యంతరం తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖలో.. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మే 31వ తేదీ వరకు 13.4 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ఏకపక్షంగా వినియోగించుకుందని ఏపీ అభ్యంతరం తెలపింది. కాగా దీనికి వివరణ ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ ఆదేశించింది.
అదే క్రమంలో తెలంగాణ కేటాయింపుల నుంచి విడుదల చేసిన నీటిని తగ్గించుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకు సాగర్ నుంచి విడుదల చేసిన 9.9 టీఎంసీల నీటిని మొత్తం కేటాయింపుల నుంచి మినహాయించుకోవాలని తెలంగాణకు కేఆర్ఎంబీ సూచించింది. ఈ నెల 7లోగా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. ఈ లోగా దీనికి సంబంధించిన వివరాలను సమర్పించాలని తెలంగాణను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment