KRMB
-
మాకు ‘సాగర్’ పగ్గాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ పగ్గాలను తమకే అప్పగించాలని తెలంగాణ చేస్తున్న డిమాండ్‌తోపాటు ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై చర్చించడానికి డిసెంబర్ 3న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనున్న 19వ సమావేశం ఎజెండాలో మొత్తం 24 కీలక అంశాలను కృష్ణాబోర్డు చేర్చడంతో వీటిపై వాడీవేడీ చర్చ జరగనుంది. బోర్డు చైర్మన్, కన్వీనర్‌తోపాటు ఏపీ, తెలంగాణ అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ డిమాండ్లు ‘ఆనకట్టల భద్రత చట్టం 2021లోని సెక్షన్ 16(1ఏ) ప్రకారం నాగార్జునసాగర్ భద్రతకి సంబంధించిన నిఘా, 16(1బీ) ప్రకారంతనిఖీలు, 16(1సీ) ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకే వస్తాయి. యావత్ జలాశయం కార్యకలాపాలన్నింటినీ తెలంగాణకే అప్పగించాలి. ఈ విషయంలో ఏపీ జోక్యానికి, తెలంగాణ విధుల ఆక్రమణకు తావులేదు. కృష్ణా బోర్డు సూచనల మేరకు రాష్ట్ర విభజన నాటి నుంచి సాగర్ డ్యామ్, కుడి, ఎడమ కాల్వల రెగ్యులేటర్ల నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ చేతిలో ఉండగా, గతేడాది నవంబర్ 28న ఏపీ అధీనంలోకి తీసుకుంది. కుడికాల్వ రెగ్యులేటర్ నుంచి నీళ్లను విడుదల చేసింది. ఈ ఘటనకు పూర్వ స్థితిగతులను పునరుద్ధరించాలని కేంద్ర హోంశాఖ 2023 డిసెంబర్ 1న ఏపీని ఆదేశించింది’అనే అంశాలను తెలంగాణ సూచనల మేరకు ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచింది. నో అన్న ‘అపెక్స్’.. మళ్లీ బోర్డుకు పంచాయతీ కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటా నుంచి ఏపీ, తెలంగాణకు పంపకాలు జరగలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2015లో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో 2015–16 అవసరాల కోసం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలికంగా కేటాయించారు. 2016–17లో సైతం ఇదే కేటాయింపులను కొనసాగించాలని 2016లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. దీని ఆధారంగానే 2017–18లో ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని 2017లో కృష్ణా బోర్డు నిర్ణయించింది. 2021–22 వరకూ దీన్నే కొనసాగించారు. 2022–23లో దీని కొనసాగింపును తెలంగాణ వ్యతిరేకించింది. 50:50 నిష్పత్తిలో పంపిణీ జరపాలని తెలంగాణ కోరగా, 66:34 నిష్పత్తిలోనే కొనసాగించాలని ఏపీ పట్టుబట్టింది. తాత్కాలిక కోటాపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని కోరుతూ వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖకు కృష్ణా బోర్డు రెఫర్ చేయగా, అపెక్స్ కౌన్సిల్ నీటి పంపకాల జోలికి వెళ్లదని జలశక్తి శాఖ చెప్పింది. దీంతో వివాదం మళ్లీ కృష్ణా బోర్డుకు చేరింది. ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచిన అంశాలివీ.. » కృష్ణా బోర్డు కార్యాలయం ఏపీకి తరలింపు. » గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించాలి. » ఇరు రాష్ట్రాల్లోని అనధికార ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలి. » రెండో విడతలో 9 టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధుల కేటాయింపు. తెలంగాణ ఇతర డిమాండ్లు » తాము వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో పొదుపు చేసిన తమ వాటా జలాలను తదుపరి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలి. » సాగర్ టెయిల్‌పాండ్ నుంచి విద్యుదుత్పత్తి ద్వారా ఏపీజెన్కో అనధికారికంగా 4 టీఎంసీలను విడుదల చేసింది. ఇప్పటికే కృష్ణా డెల్టాకు ఏపీ 117 టీఎంసీలను విడుదల చేసింది. ఇకపై టెయిల్‌పాండ్ విద్యుత్ కేంద్రం నుంచి వరదలున్నప్పుడే నీళ్లు విడుదల చేయాలి. సాగర్ టెయిల్‌పాండ్ డ్యామ్ గేట్ల నిర్వహణనూ తెలంగాణకే అప్పగించాలి. » ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణకు ఏపీ అడ్డుపడుతుండటంతో తమ వాటా జలాలను తీసుకోలేకపోతున్నాం. కృష్ణా ట్రిబ్యునల్–2 నీటి కేటా యింపులు జరిపే వరకు ఆర్డీఎస్ కుడికాల్వ పనులను కొనసాగించే అధికారం ఏపీకి లేదు. » ఏపీ నీటి వినియోగాన్ని లెక్కించడానికి శ్రీశైలం, సాగర్, ప్రకాశం, సుంకేశుల బరాజ్‌ల వద్ద టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. » రాయలసీమ ఎత్తిపోతలతో సహా అనుమతుల్లేకుండా కృష్ణా బేసిన్లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎంసీ కాల్వ లైనింగ్ పనులను నిలుపుదల చేయాలి. » శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, తెలుగు గంగ, హెచ్ఎన్ఎస్, నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ఇతర మార్గాల ద్వారా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏపీ చేపట్టరాదు. » శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్‌కి ఏపీ అత్యవసర మరమ్మతుల నిర్వహించాలి. -
కృష్ణా జలాలు తీసుకుంది చాలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీళ్లను తీసుకోవడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని కృష్ణా నదీయాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్యులు డాక్టర్ ఆర్ఎన్ శంఖువా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఈ నెల 2న లేఖ రాశారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ జరిపిన కేటాయింపులకు మించి 7.391 టీఎంసీ లను తెలంగాణ వాడుకుందని ఫిర్యాదు చేస్తూ ఈ నెల 1న ఏపీ రాసిన లేఖకు స్పందించి ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఉభయ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. కృష్ణాబోర్డుపై తెలంగాణ గరం.. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి కేటాయింపులకు మించి 7.391 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టు ఏపీ చేసిన ఆరోపణలతో ఏకీభవిస్తూ కృష్ణాబోర్డు తెలంగాణను కట్టడి చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ వ్యవహారంలో కృష్ణాబోర్డు తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. త్వరలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కృష్ణాబోర్డుకు తమ నిరసనను తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 అవార్డు ప్రకారం శ్రీశైలం, సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం వాడుకున్న జలాల్లో 20శాతాన్ని మాత్రమే లెక్కించాల్సి ఉండగా, 100 శాతం జలాలను కృష్ణాబోర్డు లెక్కించడాన్ని చాలాకాలంగా తెలంగాణ తప్పుబట్టుతోంది. ఈ వాదనలను ఇప్పటికే కృష్ణాబోర్డు తిరస్కరించింది. 2022–23లో తమ రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో 18.701 టీఎంసీలను వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకున్నామని, ఆ నీళ్లను ప్రస్తుత నీటి సంవత్సరం 2023–24లో సైతం తమ రాష్ట్రానికి పునః కేటాయింపులు(క్యారీ ఓవర్) జరపాలని తెలంగాణ చేసిన మరో డిమాండ్‌ను సైతం కృష్ణాబోర్డు తిరస్కరించింది. ఈ రెండు డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను పునఃసమీక్షిస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఇంకా మిగిలి ఉంటాయని, ఏపీ కేటాయింపులకు మించి వాడుకున్నట్టు తేలుతుందని తెలంగాణ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కనీసం 18.7 టీఎంసీల జలాలు ఇంకా తమకు రావాల్సి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్క తేలి్చనట్టు సమాచారం. 2022–23లో సైతం ఏపీ కేటాయింపులకు మించి 51.745 టీఎంసీలను వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తోంది. నేటి త్రిసభ్య కమిటీ భేటీకి రాలేం ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణాబోర్డు.. త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టగా, ఈ సమావేశానికి రాలేమని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తెలియజేశాయి. సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. త్రిసభ్య కమిటీ కనీ్వనర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు ఉంటారు. ఆ 8 టీఎంసీలు తెలంగాణకు కావాలి నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 512.5 అడుగులకు పడిపోగా నిల్వలు 136.95 టీఎంసీలకు తగ్గిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వమట్టం(డెడ్ స్టోరేజీ) 505 అడుగులు కాగా, బుధవారం నాటికి జలాశయంలో కనీస నిల్వమట్టానికి ఎగువన వాడుకోవడానికి వీలుగా 13.617 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయి. ఏపీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసినా, మిగిలిన 8.61 టీఎంసీలను హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కేటాయించడానికి వీలుంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం దృష్టికి కృష్ణా జలాల పంచాయితీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తాజాగా కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణను సూచించాలని విజ్ఞప్తి చేస్తూ జలశక్తి శాఖకు కృష్ణాబోర్డు లేఖ రాయనున్నట్టు తెలిసింది. ఈ నెల 1న ఏపీ రాసిన లేఖకు స్పందించి ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఉభయ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. కృష్ణాబోర్డుపై తెలంగాణ గరం.. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి కేటాయింపులకు మించి 7.391 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టు ఏపీ చేసిన ఆరోపణలతో ఏకీభవిస్తూ కృష్ణాబోర్డు తెలంగాణను కట్టడి చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ వ్యవహారంలో కృష్ణాబోర్డు తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. త్వరలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కృష్ణాబోర్డుకు తమ నిరసనను తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 అవార్డు ప్రకారం శ్రీశైలం, సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం వాడుకున్న జలాల్లో 20శాతాన్ని మాత్రమే లెక్కించాల్సి ఉండగా, 100 శాతం జలాలను కృష్ణాబోర్డు లెక్కించడాన్ని చాలాకాలంగా తెలంగాణ తప్పుబట్టుతోంది. ఈ వాదనలను ఇప్పటికే కృష్ణాబోర్డు తిరస్కరించింది. 2022–23లో తమ రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో 18.701 టీఎంసీలను వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకున్నామని, ఆ నీళ్లను ప్రస్తుత నీటి సంవత్సరం 2023–24లో సైతం తమ రాష్ట్రానికి పునః కేటాయింపులు(క్యారీ ఓవర్) జరపాలని తెలంగాణ చేసిన మరో డిమాండ్‌ను సైతం కృష్ణాబోర్డు తిరస్కరించింది. ఈ రెండు డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను పునఃసమీక్షిస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఇంకా మిగిలి ఉంటాయని, ఏపీ కేటాయింపులకు మించి వాడుకున్నట్టు తేలుతుందని తెలంగాణ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కనీసం 18.7 టీఎంసీల జలాలు ఇంకా తమకు రావాల్సి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్క తేలి్చనట్టు సమాచారం. 2022–23లో సైతం ఏపీ కేటాయింపులకు మించి 51.745 టీఎంసీలను వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తోంది. నేటి త్రిసభ్య కమిటీ భేటీకి రాలేం ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణాబోర్డు.. త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టగా, ఈ సమావేశానికి రాలేమని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తెలియజేశాయి. సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. త్రిసభ్య కమిటీ కనీ్వనర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు ఉంటారు. ఆ 8 టీఎంసీలు తెలంగాణకు కావాలి నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 512.5 అడుగులకు పడిపోగా నిల్వలు 136.95 టీఎంసీలకు తగ్గిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వమట్టం(డెడ్ స్టోరేజీ) 505 అడుగులు కాగా, బుధవారం నాటికి జలాశయంలో కనీస నిల్వమట్టానికి ఎగువన వాడుకోవడానికి వీలుగా 13.617 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయి. ఏపీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసినా, మిగిలిన 8.61 టీఎంసీలను హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కేటాయించడానికి వీలుంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం దృష్టికి కృష్ణా జలాల పంచాయితీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తాజాగా కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణను సూచించాలని విజ్ఞప్తి చేస్తూ జలశక్తి శాఖకు కృష్ణాబోర్డు లేఖ రాయనున్నట్టు తెలిసింది. -
‘సాగర్’ను సందర్శించిన కేఆర్ఎంబీ బృందం
నాగార్జునసాగర్: కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) అధికారులు స్థానిక ఇంజనీర్లతో కలసి గురువారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. సాగర్ డ్యామ్‌పై బీటీరోడ్డు వేయడంతో పాటు సీజనల్‌గా చేయాల్సిన నిర్వహణ పనులైన డ్యామ్ రేడియల్ క్రస్ట్‌గేట్లకు రబ్బరు సీళ్లు, గ్యాలరీలలో సీపేజ్ నీరు రాకుండా మరమ్మతులు, గేట్లు ఎత్తి, దింపే స్టార్టర్లలో ప్యానల్ బోర్డులు, మోటార్ల మరమ్మతుల వంటి పనులు చేయాల్సి ఉంది. ఈ నెల 16వ తేదీన తెలంగాణ ఇంజనీర్లు నిర్వహణ పనులను ప్రారంభించారు. అయితే, ఈ పనులు చేయవద్దని ఏపీ వైపున ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. తెలంగాణ అధికారులు అలాగే పనులు చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయమై కేఆర్ఎంబీకి లేఖలు రాసింది. దీంతో స్పందించిన కేఆర్ఎంబీ అధికారులు గురువారం సాగర్‌డ్యామ్ మీదకు వచ్చి పరిశీలించారు. డ్యామ్ మెయింటెనెన్స్ పనులు చేసుకోవచ్చని చెప్పారు. శుక్రవారం కేఆర్ఎంబీ అధికారులు సాగర్డ్యామ్తో పాటు కుడి, ఎడమ కాల్వల హెడ్రెగ్యులేటర్లను సందర్శించనున్నట్లు సమాచారం. సాగర్‌డ్యామ్‌పై పర్యటించిన వారిలో కేఆర్ఎంబీ ఎస్ఈ వరలక్ష్మి, సాగర్‌డ్యామ్ ఎస్ఈ నాగేశ్వర్రావు, ఈఈ మల్లికార్జున్‌రావు, డీఈ శ్రీనివాసరావు, ఏఈ కృష్ణయ్య, సీఆరీ్పఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ పాల్గొన్నారు. -
కృష్ణా జలాలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సరికాదు: అంబటి
సాక్షి, విజయవాడ: కృష్ణా జలాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇది చాలా సున్నితమైన అంశం..పరస్పరం సహకరించుకోవాలని తెలిపారు. మంగళవారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతారు. ‘నాగార్జుసాగర్ ప్రాజెక్ట్ రెండు రాష్ట్రాలకి సగం సగంగా ఉంది. ప్రాజెక్టులు అప్పగించమని అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎంతవరకు ధర్మం. విభజన చట్టాన్ని అంగీకరించి.. ఒక సెక్షన్ మాత్రం అంగీకరించం అంటే ఎలా?. ఏపీ కూడా విభజన చట్టాన్ని అంగీకరించం అంటే కుదురుతుందా. విభజన సమయంలో నదీజలాల పంపిణీపై చట్టంలో పొందుపరిచారు. విభజన చట్టం అంగీకరించమని చెప్పడం మొండివాదన. తెలంగాణ వాటాలో ఒక్క నీటి బొట్డు కూడా మాకు అవసరం లేదు. ...ఆంధ్రా, రాయలసీమకి కేటాయించిన నీటి జలాలపైనే మా సీఎం వైఎస్ జగన్ చట్టబద్దంగా తీసుకెళ్లడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కేఆర్ఎంబీని విభజన చట్టంలో పొందుపరిచారు. టీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు వివాదాలు ఉండవచ్చు. కృష్ణా జలాల పంపకాలు ఇప్పటివి కాదు. బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించింది. ఒకసారి అవార్డు అయిన అంశాలని వివాదం ఎలా చేస్తారు.. చట్టాన్ని గౌరవించాలి. హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వాదనలపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి’ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. -
కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు.. మంత్రి ఉత్తమ్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్(కేఆర్ఎంబీ)కి అప్పగించలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఈ విషయమై శుక్రవారం ఉత్తమ్ అసెంబ్లీలో మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్లు ఎక్కడి నుంచో మినట్స్ తెచ్చి సమాధానం చెప్పాల్సిందిగా మమ్మల్ని అడిగితే ఎలా అని ప్రశ్నించారు. ‘కృష్ణా నదిలో వాటా వదులుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే.కృష్ణా నీటిని ఏపీకి తరలించే ఒప్పందం ప్రగతిభవన్లోనే జరిగిందా లేదా కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగింది’ అని ఉత్తమ్ మండిపడ్డారు. ఇదీ చదవండి.. గ్రూప్ 1 పై అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన -
సీఎం రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ హాట్ కామెంట్స్
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్కు పోరాటం కొత్త కాదని.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే అంతిమంగా మనకు ముఖ్యమని బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ అంశంపై మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన పార్టీ నేతలతో భేటీ జరిపారు. ఆ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డిపై హాట్ కామెంట్లే చేశారాయన. ‘‘నన్ను, నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు. నీ కన్నా హేమాహేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుంది’’ అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ‘‘కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. డ్యాంకు సున్నం వేయాలన్నా కూడా బోర్డు అనుమతి తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదు. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వారికి తెలియదు. కేంద్రం పెత్తనం వస్తే మనం అడుక్కు తినాల్సి వస్తుంది. అందుకే మన ప్రభుత్వం ఉండగా ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ అవగాహన లేకే అప్పగింతకు ఒప్పుకున్నారు. .. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకోవడం పైనే ఇక మన పోరాటం. నల్గొండలో భారీ బహిరంగ సభతో ఉద్యమం ఉధృతం చేద్దాం’’ అని పిలుపు ఇచ్చారు. 13వ తేదీన నల్గొండ లో కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించాలని ఈ సందర్భంగా కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు సూచించారు. ‘‘నల్లగొండ సభకు నల్లగొండతో పాటు మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలు తరలించాలి. .. ఇప్పుడున్న పాలకులకు ప్రాజెక్ట్ లు, నీళ్ళ గురించి అవగాహన లేకపోవడంతో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసింది. ప్రాజెక్ట్‌లు కేంద్రం ఆధీనంలోకి వెళితే తెలంగాణ నష్టపోతుంది. ప్రజలకు ఈ విషయాన్ని వివరించి చెప్పాలి. కాంగ్రెస్ నేతలకు అవగాహన లేక ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నల్లగొండ లో సభ జరిగి తీరుతుంది అని కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై హాట్ కామెంట్స్ ఇక ఈ భేటీలో కేఆర్ఎంబీ వివాదంతో పాటు కాంగ్రెస్ ఆరోపణలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్లు చేశారు. ‘‘కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చిన 10 ఏళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రాజెక్ట్ లు మాకు అప్పగించాలని లేదంటే మేమే నోటిఫై చేస్తామని నన్ను బెదిరించారు. కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకో.. నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా.. తెలంగాణకు అన్యాయం చేస్తా అంటే అస్సలే ఊరుకోను. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పా. .. నన్ను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీని కొత్త సీఎం ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను.. నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు. నీ కంటే హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకున్నది. రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నాం. దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ ఏనాడూ వెనక్కి పోడు.. ఉడుత బెదిరింపులకు భయపడను. ముందు ముందు ఏందో చూద్దాం...తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. -
నెల రోజుల్లో కేంద్రం ఆధీనంలోకి ప్రాజెక్టులు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ అంశంపై సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో జరిగిన కేఆర్ఎంబీ రెండో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కేఆర్ఎంబీ రెండో మీటింగ్ మినట్స్‌లోనే ఉన్నాయన్నారు. తాము నిలదీశాకే ప్రాజెక్టులపై ఢిల్లీకి లేఖ రాశారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కృష్ణాపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని, కేవలం రెండు నెలల పాలనలోనే రేవంత్ సర్కారు ఆ పని చేసిందని విమర్శించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకే సర్కారు పెద్దలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి అర్థ సత్యాలు, అసత్యాలు మితి మీరిన భాష కనిపించాయన్నారు. ఉదయం పద్మ అవార్డుల గ్రహీతల సభలో హుందాగా మాట్లాడాలని చెప్పిన రేవంత్‌రెడ్డి మధ్యాహ్నానికి మాట మార్చారని, నీచమైన భాషతో కేసిఆర్‌ను దూషించారన్నారు. ప్రాజెక్టులు అప్పగించేది లేదని సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఇక నుంచి ప్రాజెక్టులపైకి వెళ్లాలంటే సీఆర్పీఎఫ్ అనుమతి తప్పనిసరన్నారు. ప్రాజెక్టుల అప్పగింత వల్ల ఏపీ లాభం జరుగుతుందని పత్రికలో వచ్చినా ఈ ముఖ్యమంత్రి నుంచి ఉలుకు పలుకు లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదీచదవండి.. లిక్కర్ స్కాం కేసు.. కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా -
కృష్ణానది జలాలు చెరి సగం పంచాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను చెరిసగం పంచడంతో పాటు షరతులకు అంగీకరిస్తే ప్రాజెక్టులను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయగా బుధవారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు లేఖ రాసింది. బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) గంపగుత్తగా 811 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిందని, ఆ జలాలను రాష్ట్రాలకు పంచడానికి వీలుగా జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–2)కు బాధ్యతలు అప్పగించారని గుర్తు చేసింది. 811 టీఎంసీలను చెరిసగం అంటే 405.5 టీఎంసీల చొప్పున రెండు రాష్ట్రాలకు కేటాయించాలని స్పష్టం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు ఆపరేషన్ ప్రోటోకాల్‌లో కనీస నీటిమట్టాన్ని 830 అడుగులుగా పరిగణనలోకి తీసుకోవాలని, పోతిరెడ్డిపాడు నుంచి ఎస్ఆర్బీసీ ద్వా రా మొత్తం 34 (ఎస్ఆర్బీసీ కాల్వకు 19 టీఎంసీలు, మద్రాస్ తాగునీటికి 15 టీఎంసీలు) టీఎంసీలకు మించి తరలించకుండా కట్టడి చేయాలని, కృష్ణా జలాలను బేసిన్ లోపలి ప్రాంతాల అవసరాలకు మాత్రమే కేటాయించాలని, బేసిన్ వెలుపలికి తరలించకుండా నియంత్రించాలని కోరింది. ఒక నీటి సంవత్సరంలో వాడుకోని మిగులు కోటాను వచ్చే సంవత్సరానికి బదిలీ (క్యారీ ఓవర్) చేసేందుకు అనుమతించాలని, వాడుకోని నీటిని ఖాతాలో లెక్కించకుండా చూడాలని, తాగునీటి వినియోగాన్ని బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 20 శాతంగా మాత్రమే లెక్కించాలని స్పష్టం చేసింది. అలా ప్రకటిస్తే అభ్యంతరం లేదు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చేలోగా పై షరతులకు కట్టుబడి ఉంటామని, అమలు చేస్తామని ప్రకటిస్తే... శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను అప్పగించడానికి అభ్యంతరాలేవీ లేవని ప్రభుత్వం పేర్కొంది. జనవరి 17వ తేదీన నాగార్జునసాగర్‌పై జరిగిన సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను అప్పగించడానికి తెలంగాణ అంగీకారం తెలిపినట్టుగా సమావేశపు మినట్స్‌లో పేర్కొనడాన్ని తప్పుపట్టింది. ఆ సమావేశంలో నాగార్జునసాగర్ వద్ద నవంబర్ 28కి ముందు పరిస్థితిని పునరుద్ధరించాలని మాత్రమే కోరడం జరిగిందని తెలిపింది. తక్షణమే మినట్స్‌ను సవరించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈనెల 27వ తేదీన లేఖ రాశారు. కాగా కేంద్రానికి ఇదివరకే తమ అభిప్రాయాన్ని నివేదించడం జరిగిందని బుధవారం కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. 1న భేటీలో తేల్చి చెప్పండి శ్రీశైలం, నాగార్జునసాగర్ అప్పగింత లాంఛనాలపై చర్చించడానికి వీలుగా ఫిబ్రవరి 1వ తేదీన కేఆర్ఎంబీ నిర్వహించనున్న సమావేశానికి హాజరుకావాలని, లేఖ ద్వారా నివేదించిన అంశాలన్నీ సమావేశంలో తేల్చేసి, తదుపరి చర్చకు ఆస్కారం లేకుండా బయటికి రావాలంటూ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కీలక సమావేశానికి ఏపీ అధికారులు హాజరుకానున్నారు. -
నీటి వాటాలు తేలకుండా కేఆర్‌ఎంబీలోకి ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంపై ప్రభుత్వం తక్షణం దృష్టి పెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నా రు. శుక్రవారం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమా వేశంలో మాట్లాడారు. ఎన్నికలప్పుడు రాజకీయా లు, ఆ తర్వాత అభివృద్ధిపై చర్చించాలన్నదే తమ విధాన మని హరీశ్‌రావు చెప్పారు. బీఆర్ ఎస్‌కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, వాటి కోసం ఎంతకైనా తెగిస్తుందని అన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులు వారం రోజుల్లోగా (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తాయని తెలుస్తోందని, అదే జరిగితే ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరు గుతుందన్నారు. కేంద్రం జూలై 2021లోనే ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధి లోకి తేవాలని ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాద నను కేసీఆర్ గట్టిగా వ్యతిరేకించారని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఇంకా తేలనప్పుడు ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారని ప్రశ్నించారు. కృష్ణా నీటిని ఏపీకి 50%, తెలంగాణకు 50% పంపిణీ చేయాల్సిందిగా తాము షరతు విధించామని వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేసి 264 టీఎంసీల నీటిని నాగార్జున సాగ ర్కు విడుదల చేయాలని మరో షరతు పెట్టినట్లు వెల్లడించారు. ఏక పక్షంగా నిర్ణయం తీసుకోకుండా అపెక్స్ కమిటీ వేయాలని కోరినట్లు తెలిపారు. ఆపరేషన్ మాన్యువల్ రూపొందించకుండా ప్రాజె క్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారని ప్రశ్నించారు. కేఆర్ఎంబీలో ఉమ్మడి ప్రాజెక్టులను చేరిస్తే రాష్ట్రానికి ఆత్మహత్యా సదృశ్యమేనన్నారు. జల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తెస్తే జల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని హరీశ్‌రావు చెప్పారు. నాగార్జున సాగర్ ఎడమ గట్టు కాలువ ఆయకట్టుపై కూడా దీని ప్రభావం ఉంటుందన్నారు. హైదరాబాద్ తాగునీళ్లకు కూడా కటకట ఏర్పడుతుందని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని, రాజకీయం మాని రాష్ట్రానికి జరిగే నష్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం స్పందించకుంటే బీఆర్ఎస్ పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు. ఎప్పటికైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది గులాబీ జెండానేనని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి నష్టం కలిగినా నీటిని ఎత్తిపోయడంలో ఇబ్బంది లేదని, ఇప్పటికీ అక్కడ 4 నుంచి 5 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని తెలిపారు. కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
మళ్లీ 66:34 నిష్పత్తిలోనే.. కృష్ణా జలాల పంపిణీపై బోర్డు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తాత్కాలిక సర్దుబాటు ప్రకారం, 2023–24 నీటి సంవత్సరంలోనూ 66:34 నిష్పత్తిలోనే కృష్ణా జలాలు పంపిణీ చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయం తీసుకుంది. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు బట్వాడా చేస్తామని స్పష్టం చేసింది. గత తొమ్మిదేళ్లుగా కొనసాగిస్తున్న 66:34 నిష్పత్తిని ఇకపై అంగీకరించబోమని, రెండు రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలని తెలంగాణ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. అయితే దీనిపై తుది నిర్ణయం కోసం కేంద్ర జలశక్తి శాఖకు సిఫారసు చేయాలని నిర్ణయించింది. ‘ఏపీ, తెలంగాణలకు కృష్ణా జలాల పంపకాలు జరగలేదు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా 2015, జూన్ 19న కేంద్ర జల్‌శక్తి శాఖ రెండు రాష్ట్రాలకు 66:34 నిష్పత్తిలో తాత్కాలిక సర్దుబాటు మాత్రమే చేసింది. దీనినే 2023–24లో సైతం కొనసాగించాలి..’అంటూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను బోర్డు ఆమోదించింది. కేఆర్ఎంబీ చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ అధ్యక్షతన బోర్డు 17వ సర్వ సభ్య సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో వాడీవేడిగా జరిగింది. తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ సి.మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఏపీ తరఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. పాలమూరుపై మళ్లీ ఏపీ అభ్యంతరం నీటి కేటాయింపులు లేకున్నా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలను కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ జారీచేసిన జీవోను రద్దు చేయాలని బోర్డును ఏపీ అధికారులు డిమాండ్ చేశారు. ఈ అంశం సుప్రీంకోర్టు, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నందున సమావేశంలో చర్చించడం సరికాదని తెలంగాణ అధికారులు బదులిచ్చారు. సాగర్ జలవిస్తరణ ప్రాంతంలో సుంకిశాల ఇన్‌టేక్‌వెల్ ప్రాజెక్టును తెలంగాణ చేపట్టడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సాగర్‌లో నీటిమట్టం తగ్గిపోవడంతో హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నామని.. దానికి కేటాయించిన 16.5 టీఎంసీలను మాత్రమే సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ద్వారా వాడుకుంటామని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. 16.5 టీఎంసీలే వాడుకునే పక్షంలో ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తామని.. ఆ ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాలని ఏపీ అధికారులు డిమాండ్ చేశారు. ఆర్డీఎస్‌పై సీడబ్ల్యూపీఆర్ఎస్తో అధ్యయనం రాజోలిబండ డైవర్షన్‌స్కీం (ఆర్డీఎస్) చివరి ఆయకట్టు భూములకు నీళ్లందించడానికి వీలుగా దాన్ని ఆధునీకరించడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ అధికారులు కోరారు. కాగా సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)తో అధ్యయనం చేయించి.. ఆ నివేదిక ఆధారంగా ఆధునికీకరణపై నిర్ణయం తీసుకుందామని గత సమావేశంలో బోర్డు తీర్మానించిన అంశాన్ని ఏపీ అధికారులు గుర్తుచేయగా, అందుకు బోర్డు చైర్మన్ అంగీకరించారు. ఆర్డీఎస్ కుడి కాలువను ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిందని తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. మళ్లీ ఆర్ఎంసీ పునరుద్ధరణ.. శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగుల వద్ద నీటి నిల్వ లేకున్నా తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో శ్రీశైలం జలాశయంలో ఏపీకి 34 టీఎంసీల వాటా మాత్రమే ఉందని, దీనికి కట్టుబడితేనే జల విద్యుదుత్పత్తిపై చర్చకు అంగీకరిస్తామని తెలంగాణ అధికారులు బదులిచ్చారు. జలవిద్యుదుత్పత్తి కోసమే శ్రీశైలం జలాశయం ఉందని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదాల పరిష్కారానికి గతంలో ఏర్పాటుచేసిన రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ)ని మళ్లీ పునరుద్ధరించాలని బోర్డు చైర్మన్ నిర్ణయించారు. బోర్డు సభ్యులు అజయ్కుమార్గుప్తా అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్ సీలు, జెన్కో డైరెక్టర్లు సభ్యులుగా ఆర్ఎంసీని పునరుద్ధరించారు. నెలలోగా రూల్ కర్వ్స్, జల విద్యుదుత్పత్తి నిబంధనలు, వరద జలాల మళ్లింపుపై నివేదిక ఇవ్వాలని ఆర్ఎంసీని ఆదేశించారు. 50 శాతం వాటా ఇవ్వాల్సిందే కృష్ణా జలాల్లో తెలంగాణకు 50 శాతం వాటా ఇవ్వాలి. 2015లో కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటు 2015–16 నీటి సంవత్సరానికి మాత్రమే. పాత పద్ధతిలో పంపిణీ చేస్తే అంగీకరించం. తదుపరి నిర్ణయం కోసం మా అభ్యంతరాలను కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని కృష్ణా బోర్డు హామీనిచి్చంది. తద్వారా ఈ విషయంలో ఒక అడుగు ముందుకుపడింది. – రజత్‌కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ట్రిబ్యునలే నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకునే అధికారం కృష్ణా బోర్డుకు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదు. కేవలం ట్రిబ్యునల్ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీచేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ 2015లో తాత్కాలిక సర్దుబాటు చేసింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకు తాత్కాలిక సర్దుబాటు కొనసాగించక తప్పదు. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ -
ఏపీ,తెలంగాణ నీటి కేటాయింపులపై కేఆర్ఎంబీ కీలక సమావేశం
-
కృష్ణా బోర్డులో అంత జీతాలా?.. కేంద్రం ఆగ్రహం
కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూలవేతనంపై 25శాతం అధికంగా చెల్లిస్తుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అధిక వేతనం చెల్లింపులను నిలుపుదల చేయాలని, ఇప్పటిదాకా అదనంగా చెల్లించిన వేతనాలను తిరిగి వసూలు చేయాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవి కేంద్ర పాలన పరిధిలోనే.. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖలోని అంతర్రాష్ట విభాగం ఇంజనీర్లకు మూలవేతనంపై 25శాతం అధికంగా చెల్లిస్తుండగా, సమానంగా తమ ఉద్యోగులకు సైతం 25శాతం మూలవేతనాన్ని అధికంగా చెల్లించాలని 2020 అక్టోబర్ 20న కృష్ణా బోర్డు తీర్మానం చేసింది. దాదాపు రెండేళ్ల నుంచి అధిక వేతనాలు చెల్లిస్తూ వస్తోంది. గోదావరి బోర్డు సైతం తమ ఉద్యోగులకు ఇదే తరహాలో అధిక వేతనాలను చెల్లిస్తామని కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపగా, ఈ విషయం కేంద్రం దృష్టికి వచ్చింది. అధిక వేతనాలను నిలిపేయాలని 2021 జూలైలో కృష్ణా బోర్డుకు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. స్వయంప్రతిపత్తి కలిగి ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాలను అమలు చేయాల్సిన అవసరం లేదని కృష్ణా బోర్డు కేంద్రానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85(3)ను ప్రయోగిస్తూ తక్షణమే అధిక వేతనాల చెల్లింపులను నిలుపుదల చేయాలని తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా బోర్డును ఆదేశించింది. -
శ్రీశైలంపై ఉమ్మడి సమ్మతి!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విభేదాలు పక్కనపెట్టి ఏకాభిప్రాయానికి వచ్చాయి. జలాశయం నిర్వహణ విధివిధానాల (రూల్‌కర్వ్)కు స్వల్పమార్పులతో ఉమ్మడిగా సమ్మతి తెలిపాయి. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆధ్వర్యంలోని రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) శనివారమిక్కడ జలసౌధలో నిర్వహించిన చివరి సమావేశంలో ఈ మేరకు కీలక ముందడుగు పడింది. అయితే, నాగార్జునసాగర్ జలాశయం రూల్‌కర్వ్‌పై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. తదుపరి మార్పుల కోసం తమ అభ్యంతరాలను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) దృష్టికి తీసుకెళ్లాలని ఆర్ఎంసీ సూచించింది. పలు అంశాలపై ఏకాభిప్రాయం వచ్చినా చర్చలు సంపూర్ణం కాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం సమావేశం కొనసాగించాలని నిర్ణయించారు. సోమవారం తుది నిర్ణయం తీసుకుని రెండు రాష్ట్రాల సంతకాలతో సిఫార్సులను కృష్ణా బోర్డుకు సమర్పిస్తామని ఆర్ఎంసీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై విలేకరులకు తెలిపారు. జలాశయాలకు ఇక పర్మినెంట్ కమిటీ సోమవారం భేటీ తర్వాత ఆర్ఎంసీ తదుపరి సమావేశాలు ఉండవు. ఆపై ఈ కమిటీ ఉనికిలోనే ఉండదు. జలాశయాల నిర్వహణ, విద్యుదుత్పత్తిపై పర్యవేక్షణకు రెండు రాష్ట్రాల నీటిపారుదల, విద్యుత్ శాఖల అధికారులతో పర్మినెంట్ రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డుకు సిఫారసు చేయాలని ఆర్ఎంసీ నిర్ణయించింది. జల విద్యుత్‌పై తొలగిన పేచీ శ్రీశైలం జలాశయం నిల్వల వినియోగం విషయంలో తొలుత తాగు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ అవసరాలకు నష్టం కలగకుండా జలవిద్యుదుత్పత్తి జరపాలని రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. శ్రీశైలంలో నిల్వలు 854 అడుగులకు పడిపోయిన సందర్భంలో తాగు, సాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అవసరాలు తీరిన తర్వాతే విద్యుదుత్పత్తి జరపాలి. ఇక శ్రీశైలంలో 50:50 నిష్పత్తిలో సమంగా జలవిద్యుదుత్పత్తి జరపాలని రూల్‌కర్వ్‌లోని నిబంధనలకు రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. ఈ నిబంధనలను రెండు రాష్ట్రాలు అనుసరిస్తే భవిష్యత్తులో వివాదాలు, ఇబ్బందులు ఉండవని రవికుమార్ పిళ్లై పేర్కొన్నారు. శ్రీశైలంలో 200 టీఎంసీలు కావాలి శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేసేందుకు 512 టీఎంసీలు లభ్యతగా ఉండగా, 312 టీఎంసీలను నాగార్జునసాగర్‌లో నిల్వ చేసేందుకు వీలుంది. మిగిలిన 200 టీఎంసీలను శ్రీశైలం నుంచి కృష్ణా బేసిన్‌లోని తమ ప్రాజెక్టుల అవసరాలకు వాడుకోవడానికి అవకాశం కల్పించాలని తెలంగాణ కోరినట్టు తెలిసింది. 75శాతం డిపెండబిలిటీ ఆధారంగా రెండు రాష్ట్రాలకు గరిష్ట ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నట్టు రవికుమార్ పిళ్లై తెలిపారు. మిగుల జలాలను గుర్తించి లెక్కించే మెకానిజాన్ని ఆర్ఎంసీ రూపకల్పన చేసింది. తెలంగాణ సరిహద్దులోకి వచ్చే ప్రతి చుక్కనూ లెక్కించనున్నారు. వరదలు ఉన్నప్పుడు ఎంత జలాలు(మిగులు) వచ్చాయి? లేనప్పుడు(డిపెండబుల్) ఎంత జలాలు వచ్చాయి? అని గుర్తించి కచ్చిత లెక్కలను నమోదు చేయనున్నారు. వరద (మిగులు) జలాల వినియోగాన్ని కోటా కింద పరిగణించరు. ఎవరికైనా అవసరముంటే వాడుకుంటాం: సి.మురళీధర్, ఈఎన్సీ, తెలంగాణ నీటిపారుదల శాఖ శ్రీశైలంలో విద్యుదుత్పత్తి, సాగునీటి అవసరాల కోసం జలాశయంలో నిల్వల నిర్వహణ, శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్ విషయంలో ఏపీ, తెలంగాణ ఏకాభిప్రాయానికి వచ్చాయి. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ 34 టీఎంసీలను మాత్రమే తరలించుకోవాలన్న షరతుతో మేము సమ్మతి తెలిపాం. 50:50 నిష్పత్తిలో జలవిద్యుదుత్పత్తి చేయాలని గతంలోనే ఒప్పుకున్నాం. ఎవరికైనా ఎక్కువ అవసరాలుంటే వాడుకుంటాం. మిగులు జలాల వాడకం లెక్కలోకి రాదు: సి.నారాయణ రెడ్డి, ఈఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ శ్రీశైలం జలాల్లో తొలుత తాగునీరు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాతే విద్యుత్ ఉత్పత్తి జరపాలని నిర్ణయించాం. మిగులు జలాల వినియోగాన్ని లెక్కించాలి. కోటా కింద పరిగణించరాదు. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని జలాశయాలు నిండిన తర్వాత వృథాగా వెళ్లే జలాలనే మిగులు జలాలుగా పరిగణిస్తారు. వీటిని సాధ్యమైనంత ఎక్కువ వాడుకోవాలని నిర్ణయించాం. రూల్‌కర్వ్ అంటే...? రిజర్వాయర్ల నిర్వహణకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ప్రామాణిక పద్ధతి)గా రూపొందించిందే రూల్‌కర్వ్. జలాశయాల్లో లభ్యత మారుతూ అన్నిసార్లు మన అవసరాలు తీరడానికి అవకాశం ఉండదు. ఎంత వ్యత్యాసం ఉంటే అందుకు తగ్గట్లు మన అవసరాలను ఎంత మేరకు కుదించుకుని నీళ్లను వాడుకోవాలి అన్న విషయం రూల్‌కర్వ్‌లో ఉంటుందని రవికుమార్ పిళ్లై తెలిపారు. జలాశయాల నిర్వహణతోపాటు భద్రతకు ఇవి చాలా అవసరమన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల ముసాయిదా రూల్‌కర్వ్‌ను సీడబ్ల్యూసీ రూపొందించి రెండు రాష్ట్రాలకు పంపిందని తెలిపారు. వీటిపై రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలపగా, వాటిపై చర్చించి తుదిరూపం ఇవ్వడానికి ఆర్ఎంసీ ప్రయత్నిస్తోందన్నారు. -
ఏకాభిప్రాయానికి చివరి యత్నం
సాక్షి, హైదరాబాద్: రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) సిఫారసులపై ఏకాభిప్రాయానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తుది ప్రయత్నం చేయనుంది. ఈ నెల 24వ తేదీ ఉద యం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో ఆర్ఎంసీ చివరి సమావేశాన్ని నిర్వ హించనుంది. ఈ మేరకు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేఆర్ఎంబీ గురువారం లేఖ రాసింది. ఈ సమావే శానికి ఏ ఒక్క రాష్ట్రం ప్రతినిధులు గైర్హాజరైనా లేక కమిటీ సిఫారసులపై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరక పోయినా.. తన కార్యాచరణలో ఆర్ఎంసీ విఫలమైనట్టు నివేదిస్తామని స్పష్టం చేసింది. గతంలో కొన్ని ఆర్ఎంసీ సమావేశాలకు తెలంగాణ, ఏపీలు గైర్హాజరైన నేపథ్యంలో ఈ నిబంధనను పొందుపర్చింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల నిర్వ హణకు సంబంధించిన విధివిధానాలను (రూల్ కర్వ్) సిఫారసు చేసేందుకు గతంలో ఆర్ఎంసీని కృష్ణా బోర్డు ఏర్పాటు చేసింది. ఈ సిఫారసులకు తుది రూపమివ్వడంతో పాటు సంతకాల స్వీకరణ కోసం చివరిసారిగా 24న ఆర్ఎంసీ సమావేశాన్ని తలపెట్టింది. గత సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదిరిన పలు అంశాలపై సైతం ప్రస్తుత భేటీలో పునః సమీక్ష కోరవచ్చని తెలిపింది. ఏకాభిప్రాయం కష్టమేనా? శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఎంతమేర నీటి నిల్వలున్నప్పుడు, ఎంత మేర నీళ్లను సాగునీరు, జలవిద్యుదుత్పత్తి అవసరాలకు విని యోగించాలి అన్న అంశంపై ఆర్ఎంసీ సిఫారసు లు చేయాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో తాత్కాలికంగా కృష్ణాజలాల పంపిణీని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి 34 టీఎంసీలకు మించి నీళ్లను ఏపీ తరలించరాదని.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో పంచేలా రూల్ కర్వ్‌లో పొందుపర్చాలని డిమాండ్ చేస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లను తరలించుకోవడానికి ఉండాల్సిన కనీస నిల్వ మట్టం 834 అడుగులు మాత్రమేనని తెలంగాణ అంటుండగా, 854 అడుగులుండాలని ఏపీ వాదిస్తోంది. శ్రీశైలం జలాలు పూర్తిగా జలవిద్యుదుత్పత్తి కోసమేనని తెలంగాణ అంటుండగా, సాగు, తాగునీటి అవస రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ పేర్కొంటోంది. వరద జలాల వినియోగాన్ని సైతం లెక్కించి సంబంధిత రాష్ట్రం ఖాతాలో జమ చేయాలని తెలంగాణ కోరుతుండగా, ఏపీ వ్యతిరేకిస్తోంది. ఆయా అంశాలపై రెండు రాష్ట్రాల సమ్మతితో రూల్‌కర్వ్‌కు తుది రూపు ఇవ్వడం సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే చివరి సమావేశంలోనూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకభిప్రాయం కుదిరే అవకాశాలు లేవని, లక్ష్య సాధనలో ఆర్ఎంసీ విఫలమయ్యే సూచనలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అనుమతిలేని ప్రాజెక్టులకు ఏపీ టెండర్లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా పలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ టెండర్లను ఆహ్వానించిందని, తక్షణమే వాటిని నిలుపుదల చేయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. కృష్ణా జలాలను బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు చేపట్టిన ఈ పనులు బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. గండికోట రిజర్వాయర్ నుంచి నీటిని మంగపట్నం, గంగదేవిపల్లి చెరువులకు తరలించడానికి లిఫ్ట్‌లు, పైపులైన్ల నిర్మాణం, సూళ్లూరుపేట మున్సిపాలిటీకి తాగునీటిని తరలించడానికి సత్యసాయి గంగ కాల్వ వద్ద ఓటీ స్లూయిస్ నిర్మాణానికి ఏపీ టెండర్లు ఆహ్వానించినట్లు ఫిర్యాదు చేసింది. అలాగే ముడిగుబ్బ వద్ద జిల్లెడుబండ రిజర్వాయర్, హంద్రీనీవా ప్రధాన కాల్వ 377.1 కి.మీ. వద్ద సరప్లస్ వేర్, క్రాస్ రెగ్యులేటర్, హంద్రీనీవా–2 ప్యాకేజీ 25 లిఫ్ట్ నిర్మాణ పనులకు కూడా టెండర్లు పిలిచిందని ఫిర్యాదులో పేర్కొంది. గాలేరు నగరి (జీఎన్ఎస్ఎస్) పథకం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను పెన్నానదిపై ఉన్న గండికోట జలాశయానికి తరలించడం బచావత్ అవార్డు ఉల్లంఘన అవుతుందని వివరించింది. హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్, వెలిగొండ, తెలుగు గంగ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాలను బేసిన్ వెలుపలి ప్రాజెక్టులకు తరలించడాన్ని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట తాము వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ పనులను తక్షణమే నిలుపుదల చేయించాలని, ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. -
రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్ర పెత్తనం చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ) పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. తెలంగాణ ప్రజల ప్రాథమిక హక్కులను, సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ.. 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) చీఫ్ అడ్వైజర్ డి. పాండురంగారెడ్డితో పాటు ఇద్దరు పిల్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర జల శక్తి కార్యదర్శి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి, గోదావరి రివర్ మేనేజిమెంట్ బోర్డు సభ్య కార్యదర్శి, కేంద్ర జలవనరుల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. నంబర్ కేటాయించండి... తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదంపై తాము పిల్ దాఖలు చేయలేదని, పిల్‌కు నంబర్ కేటాయించేలా హైకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం చేసేలా నోటిఫికేషన్ ఉందని వెల్లడించారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులపై నియంత్రణ, నిర్వహణ చేసేలా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రాజెక్టులపై రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రం లాక్కోవడమేనని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తన పరిధిలోకి తీసుకుంటోందని చెప్పారు. ‘తెలంగాణకు జలవనరుల వాటాను పెంచకుండా కేంద్రం దగా చేస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళతాయి. ఇది తెలంగాణ పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. రాజ్యాంగంలోని సమాఖ్య పాలన స్ఫూర్తికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం ఏర్పాటయ్యే నదీ జలాల యాజమాన్య బోర్డులకు తెలుగు రాష్ట్రాలు.. సిబ్బంది, అధికారులు, ఫైళ్లు, వాహనాలను అందించాలి. అంతేకాకుండా రివర్ బోర్డులకు తెలంగాణ, ఏపీ రూ.200 కోట్లు చొప్పున రూ.400 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయించిందీ కేంద్రం చెప్పలేదు. నిధులు ఇచ్చేందుకు, నోటిఫికేషన్‌ను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవు. హైకోర్టు జోక్యం చేసుకుని.. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి సమాఖ్య పాలన స్ఫూర్తిని కాపాడాలి’అని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. విచారణార్హత ఉంది.. పిల్లోని అంశాలు అంతర్రాష్ట్ర జల వివాద అంశం కాదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వెలువరించిన నోటిఫికేషన్‌ను సవాలు చేసిన పిల్‌కు విచారణార్హత ఉందన్నారు. పిల్ దవిచారణార్హతపై పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించే నిమిత్తం విచారణ సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా పడింది. -
హంద్రీనీవా, గాలేరునగరి విస్తరణను అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణాజలాలను పరీవాహక ప్రాంతం బయటకు తరలించేలా హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల విస్తరణను ఏపీ ప్రభుత్వం చేపడుతోందని తెలంగాణ ఆక్షేపించింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం కృష్ణాజలాలపై ఎలాంటి ప్రాజెక్టు చేపట్టాలన్నా కృష్ణానదీ యాజమాన్యబోర్డు(కేఆర్ఎంబీ), అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు కేఆర్ఎంబీ చైర్మన్ మహేంద్రప్రతాప్ సింగ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఆయా ప్రాజెక్టుల విస్తరణను అడ్డుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. కేంద్ర అటవీ, పర్యావరణ మార్పుల మంత్రిత్వశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పర్యావరణ మదింç³# అథారిటీలకు కూడా విడివిడిగా రాసిన లేఖలో్లనూ విస్తరణ ప్రాజెక్టులకు ఇచ్చిన పర్యావరణ అనుమతి(ఈసీ) అమలు కాకుండా నిలిపివేయాలని కోరారు. ఈ విస్తరణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని పలుమార్లు కృష్ణాబోర్డుకు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 ఆగస్టు 26న గాలేరునగరి నుంచి హంద్రీనీవాకు నీటితరలింపు నిమిత్తం రూ.5,036 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపాదించిందని వివరించారు. గాలేరునగరి కాలువ 56 కిలోమీటర్ల దూరం మధ్యలో ఉన్న చెరువులకు 15.53 టీఎంసీల కృష్ణాజలాలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ వివరాలివ్వండి ప్లీజ్ శ్రీశైలం–నాగార్జునసాగర్ రూల్‌కర్వ్ ముసాయిదా రూపొందించడానికి ప్రమాణాలేంటీ, ఏ ప్రాతిపదికన రూల్‌కర్వ్ సిద్ధం చేశారో ఆధారాల్విండంటూ మరో లేఖను ఈఎన్సీ మురళీధర్‌రావు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాశారు. దీనిపై కేఆర్ఎంబీ స్పందిస్తూ ‘కేఆర్ఎంబీకి సహకరించండి. తెలుగు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న వి వాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించడానికే సమావేశం ఏర్పాటు చేశాం’అంటూ ప్రత్యుత్తరం ఇచ్చింది. ఆ లేఖపై స్పందిస్తూ శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ స్టేక్ హోల్డర్ కావడం వల్ల, ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా ప్రభావితం అవుతున్నదని జల వనరుల సంఘం, ప్రణాళిక సంఘం శ్రీశైలం ప్రాజెక్టును ఆమోదించిన పత్రాలు ఇవ్వాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నట్లు మురళీధర్‌రావు కోరారు. 1977లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం, శ్రీశైలం కుడి కాల్వతోపాటు పోతిరెడ్డిపాడుకు కేంద్రం అను మ తి జారీచేసిన పత్రాలు ఇవ్వాలని కోరు తున్నా మ న్నారు. రూల్‌కర్వ్ ఎలానిర్ణయించారో తెలుసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. -
రూల్ కర్వ్ ఓకే అయితే.. శ్రీశైలం, సాగర్ అప్పగిస్తాం!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నిర్వహణకు సంబంధించిన రూల్ కర్వ్‌లపై అంగీకారానికి వచ్చాక.. రెండు జలాశయాలను కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. జలాశయాల అప్పగింత పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదని.. రూల్వ్ కర్వ్‌లకు తుది రూపునిచ్చే ప్రక్రియను వేగిరం చేయాలని కోరింది. ఈ నెల 6న జరిగిన కృష్ణాబోర్డు 16వ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఆ సమావేశానికి సంబంధించి ఇరు రాష్ట్రాల వాదనలు, అభిప్రాయాల మినిట్స్‌ను కృష్ణా బోర్డు తాజాగా ఈ మేరకు రెండు రాష్ట్రాలకు పంపింది. ట్రిబ్యునల్ తీర్పునకు అనుగుణంగా.. ఆ మినిట్స్ ప్రకారం.. రూల్వ్ కర్వ్ ఖరారైన తర్వాత ప్రాజెక్టుల అప్పగింతకు అవసరమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ సైతం కృష్ణాబోర్డుకు హామీ ఇచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పునకు అనుగుణంగా రూల్ కర్వ్ ఉండాలనే రాష్ట్ర ప్రభుత్వం సవరణలను కోరిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుల అప్పగింతలో అనుసరించాల్సిన రోడ్ మ్యాప్ తయారీపై సబ్ కమిటీకి పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ జెన్కో డైరెక్టర్ (హైడల్) వెంకటరాజం కృష్ణాబోర్డుకు హామీ ఇచ్చారు. మరోవైపు రూల్వ్ కర్వ్‌లతో ప్రాజెక్టుల అప్పగింతకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, ఈఎన్సీ అభ్యంతరం తెలిపారు. ప్రాజెక్టుల అప్పగింతను తెలంగాణ వేగిరం చేయాలని ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ ఆదేశించారు. ఆధునీకరణ తర్వాత తుమ్మిళ్లను వాడం ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణ పూర్తయిన తర్వాత తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని వినియోగించబోమని రజత్‌కుమార్ కృష్ణా బోర్డుకు హామీ ఇచ్చారు. తుంగభద్ర రిజర్వాయర్ నుంచి 15.9 టీఎంసీల కోటా నీరు ఆర్డీఎస్ ఎడమ కాల్వకు రాకపోవడంతోనే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. ఆర్డీఎస్ ఆధునీకరణ తర్వాత గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని, తుమ్మిళ్ల ఎత్తిపోతల అవసరం ఉండదని, భారీ విద్యుత్ బిల్లులు సైతం మిగులుతాయని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆర్డీఎస్ కుడి ప్రధాన కాల్వ నిర్మాణానికి సంబంధించిన పేరాను ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణ రోడ్‌మ్యాప్ నుంచి తొలగించాలని ఏపీ చేసిన విజ్ఞప్తి పట్ల సమ్మతి తెలిపారు. ఇక కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు అమల్లోకి వచ్చేవరకు మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణాన్ని నిలిపేసేందుకు తెలంగాణ అంగీకరించినట్టు సమావేశం మినిట్స్‌లో కృష్ణాబోర్డు పేర్కొంది. ఏమిటీ రూల్ కర్వ్? జలాశయాలకు సంవత్సరం పొడవునా ఎప్పుడెప్పుడు, ఏయే పరిమాణాల్లో నీళ్లు వస్తే.. అందులో నుంచి ఎప్పుడెప్పుడు, ఎంతెంత నీటిని తీసుకోవచ్చనే నిబంధనలను రూల్ కరŠవ్స్ అంటారు. జలాశయం గేట్లను ఎప్పుడెప్పుడు ఎత్తాలి?, ఏయే నెలల్లో ఎంతెంత కనీస నీటి మట్టాన్ని ఉంచాలన్న అంశాలను కూడా అందులో పేర్కొంటారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి.. తెలంగాణ, ఏపీలకు ఎంతెంత నీటిని కేటాయించాలన్న దానిపై గతంలో సీడబ్ల్యూసీ రూల్ కరŠవ్స్‌ను రూపొందించింది. అందులో పలు అంశాలను సవరించి తుది నిబంధనలను ఖరారు చేయాలని తెలంగాణ కోరింది. -
తెలంగాణ లేకుండానే ఆర్ఎంసీ తొలి భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీయాజమాన్య బోర్డు(కేఈఆర్ఎంబీ) తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులతో కలసి ఏర్పాటు చేసిన ‘రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ)’తొలి సమావేశం శుక్రవారం ఇక్కడి జలసౌధలో జరిగింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో జలవిద్యుత్, రూల్ కర్వ్, కృష్ణాలో మిగులుజలాల అంశాలను తేల్చడానికి ఈ భేటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశాన్ని వాయిదా వేయాలన్న తెలంగాణ విజ్ఞప్తిని బోర్డు తోసిపుచ్చింది. కేఆర్ఎంబీ మెంబర్ కన్వీనర్ రవికుమార్ పిళ్లై అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేఆర్ఎంబీ మెంబర్(పవర్) ఎల్.బి.ముత్తంగ్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ సుజయకుమార్ హాజరయ్యారు. శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తికి సాగు, నీటి అవసరాలే ప్రామాణికం కావాలని నారాయణరెడ్డి సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన జీవోలు, బచావత్ ట్రిబ్యునల్ తీర్పులను పరిగణనలోకి తీసుకొని జలవిద్యుత్‌పై నిర్ణయం తీసుకోవాలన్నారు. నీటి కేటాయింపులు, నిబంధనలు పాటిస్తూ ఎవరికీ ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలని సూచించారు. తుంగభద్ర జలాశయంలోంచి నీటివిడుదలపై తుంగభద్ర బోర్డు అనుసరిస్తున్న ఆపరేషన్ ప్రొటోకాల్‌ను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోనూ అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ విడుదల చేసిన రూల్ కర్వ్ ముసాయిదాపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తదుపరి సమావేశానికి సీడబ్ల్యూసీ అధికారులను పిలిపించి రూల్ కర్వ్‌పై చర్చించాలని ఏపీ విజ్ఞప్తి చేసింది. కృష్ణాలో మిగులు జలాలను లెక్కించరాదని కోరింది. కాగా, తదుపరి సమావేశంలో జలవిద్యుత్ ఉత్పాదనపై స్పష్టత వస్తుందని కేఆర్ఎంబీ మెంబర్ కన్వీనర్ రవికుమార్ పిళ్లై స్పష్టం తెలిపారు. -
మళ్లీ అవే పంపకాలు..ఏపీకి 66..తెలంగాణకు 34 శాతం
సాక్షి, హైదరాబాద్: ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం కృష్ణా జలాలను తాత్కాలికంగా కేటా యిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని, 2022– 23లో సైతం అమలు చేయాలని కృష్ణా నది యాజ మాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయించింది. శుక్రవా రం జలసౌధలో సుదీర్ఘంగా సమావే శమైన కృష్ణా బోర్డు దీనితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ సి.మురళీధర్ రావు, ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్‌పాండే పాల్గొని తమ వాదనలు వినిపించారు. 8 ఏళ్లుగా అన్యాయం: తెలంగాణ 2013 నాటి వినియోగం ఆధారంగా 2015లో ఖరా రు చేసిన తాత్కాలిక వాటాలను 8 ఏళ్లుగా కొసాగిం చడం తీవ్ర అన్యాయమని, దీనికి సమ్మతి తెలిపేది లేదని తెలంగాణ గట్టిగా వాదనలు వినిపించింది. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించగా, ప్రస్తుతం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలికంగా కేటాయిస్తున్నారు. అలాకాకుండా 50:50 నిష్పత్తిలో తాత్కాలిక కోటాను ఖరారు చేయాలని, తమకు 405.5 టీఎంసీలను కేటాయించాలని తెలంగాణ పట్టుబట్టింది. 34 శాతంతో మా అవసరాలు తీరవు కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణలో నిర్మించిన/ నిర్మిస్తున్న ఏఎమ్మార్పీ, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రా జెక్టుల కింద ఉన్న 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు 120 టీఎంసీలు, పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల కింద ఉన్న 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు మరో 225 టీఎంసీల అదనపు అవసరాలున్నాయని, 34 శాతం కోటాతో తమ రాష్ట్ర అవసరాలు తీరవని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. 34 శాతం తాత్కాలిక కోటాను 2021–22లో మాత్రమే అమలు చేయాలన్న షరతుతో గతేడాది ఆమోదించామని, ఇంకా కొనసాగిస్తే అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. నదీ జలాల చట్టం కింద నీటి కేటాయింపులను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని డిమాండ్ చేసింది. అయితే నీటి కేటాయింపులు జరిపే అధికారం బోర్డుకు లేకపోవడంతో ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కోటానే కొనసాగించాలని చైర్మన్ ఎంపీ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ తరఫున ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి వాదనలు వినిపించారు. తెలంగాణను కట్టడి చేయండి: ఏపీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏడాదిగా తీవ్ర వివాదాస్పదంగా మారిన జల విద్యుదుత్పత్తిపై బోర్డు సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. తాగు, సాగునీటి అవసరాలను ఫణంగా పెట్టి శ్రీశైలం, నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని ఏపీ కోరింది. విద్యుదుత్పత్తి ద్వారా వృధాగా నీళ్లను సముద్రం పాలు చేయడంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో కేవలం 5 టీఎంసీలే మిగిలి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకే.. తెలంగాణలో బోరుబావుల కింద వరిసాగుకు విద్యుత్ అవసరాలు భారీగా పెరిగాయని, రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 14,200 మెగావాట్లకు చేరిందని తెలంగాణ తెలిపింది. విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేశామని, జల విద్యుత్ కోసమే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారని వాదించింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తికి అనుసరించాల్సిన విధానంపై అధ్యయనం జరిపి 15 రోజుల్లో నివేదికను సమర్పించడానికి ఆరుగురు సభ్యులతో సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. కాగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 34 టీఎంసీలకు మించి వినియోగించకుండా ఏపీని కట్టడి చేయాలని తెలంగాణ కోరింది. అయితే జలాశయాలన్నీ పూర్తిగా నిండాక వచ్చే మిగుల జలాలను వినియోగిస్తే వాటిని కోటా కింద పరిగణనలోకి తీసుకోరాదని ఏపీ వాదించింది. దీంతో ఈ అంశంపై అధ్యయనం జరిపే బాధ్యతను ఆరుగురు సభ్యుల ఉప కమిటీకి బోర్డు అప్పగించింది. డ్యాంల భద్రతపై ఏకాభిప్రాయం ఉమ్మడి జలాశయాల భద్రత, మరమ్మతులపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. శ్రీశైలం డ్యాం మరమ్మతులకు రూ.800 కోట్ల వ్యయం అంచనా వేయగా, రెండు రాష్ట్రాలు కలిసి మరమ్మతులు చేపట్టేందుకు అంగీకరించాయి. నాగార్జునసాగర్ మరమ్మతులకు తెలంగాణ ఇప్పటికే రూ.20 కోట్లను విడుదల చేసింది. పులిచింతల డ్యాం రేడియల్ గేటు మరమ్మతుకు ఏపీ సమ్మతి తెలిపింది. ఆర్డీఎస్ ఆధునికీకరణ కోసం అధ్యయనం జరపడానికి రెండు రాష్ట్రాలు సమ్మతించాయి. సీడబ్ల్యూసీ రూల్‌కర్వ్‌పై చర్చ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు ఏ పరిమాణంలో నీళ్లు వస్తే.. అందులో ఏ రాష్ట్రం, ఏ ప్రాజెక్టుకు ఎంత నీళ్లు కేటాయించాలన్న అంశంపై సీడబ్ల్యూసీ రూపొందించిన ముసాయిదా నిబంధనలపై (రూల్ కర్వ్) బోర్డు సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు రూల్ కర్వ్ ఉండాలని రెండు రాష్ట్రాలు బోర్డును కోరాయి. కాగా కృష్ణా బోర్డుకు ఏపీ 10, తెలంగాణ 13 ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాల్సి ఉండగా, 20 రోజుల్లో వీటిని సమర్పించాలని, లేని పక్షంలో ఆయా ప్రాజెక్టుల పురోగతిని తెలుపుతూ నివేదికలు సమర్పించాలని బోర్డు ఆదేశించింది. కాగా కృష్ణా జలాల కేటాయింపులను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని రజత్‌కుమార్ మీడియాకు చెప్పారు. -
కేసీ కాల్వకు ‘కృష్ణా’లో వాటా లేదు
సాక్షి, హైదరాబాద్: కేసీ కాల్వకు కృష్ణా నదీజలాల్లో వాటా లేదని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పు ప్రకారం కేసీ కాల్వకు తుంగభద్ర జలాశయం, తుంగభద్ర నది నుంచి మాత్రమే నిర్దేశిత పరిమాణంలో నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం కేసీ కాల్వకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌తోపాటు మల్యాల వద్ద ఉన్న హంద్రి–నీవా ఎత్తిపోతల, ముచ్చుమర్రి వద్ద ఉన్న కేసీ కాల్వ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని విడుదల చేస్తోందని ఆరోపించింది. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా కృష్ణా జలాలను కేసీ కాల్వకు మళ్లించకుండా ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ ఈ నెల 15న కృష్ణాబోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. లేఖలోని వివరాలు కింది విధంగా ఉన్నాయి. ►కేసీ కాల్వ ప్రాజెక్టు ఆధునీకరణను కారణంగా చూపి ఆ ప్రాజెక్టుకు కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయించిన 39.9 టీఎంసీల్లో 8 టీఎంసీలను ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇతర ప్రాజెక్టులకు కేటాయించింది. కేసీ కాల్వకు 31.9 టీఎంసీల కోటా మాత్రమే మిగిలి ఉంది. ఇదే దామాషాలో తుంగభద్ర డ్యాం నుంచి కేసీ కాల్వలకు విడుదల చేయాల్సిన 10 టీఎంసీలను సైతం 8 టీఎంసీలకు తగ్గించి మిగిలిన 2 టీఎంసీలను కృష్ణాలో విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దిగువ పేర్కొన్న అంశాలపై అధ్యయనం జరిపి కేసీ కాల్వకు 31.9 టీఎంసీలు మాత్రమే డ్రా చేసుకునేలా ఏపీ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని సూచించింది. ►కేసీ కాల్వకు తుంగభద్ర నదీ ప్రవాహంలో ఉన్న కోటా నుంచి కొంతభాగాన్ని తుంగభద్ర దిగువ కాల్వ(ఎల్ఎల్సీ)కు ఏపీ కేటాయించింది. ఆ మేరకు కేసీ కాల్వ కోటాను తగ్గించాలి. ఈ ఏడాది కేసీ కాల్వ కోటా నుంచి 4 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం ఎల్ఎల్సీకి మళ్లించింది. ►గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) ఆనకట్ట నుంచి సుంకేశుల జలాశయం వరకు తుంగభద్ర నదిపై 12 పంప్‌హౌస్‌లను నిర్మించి 5.373 టీఎంసీలను అనధికారంగా మళ్లించుకోవడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులను తక్షణమే నిలుపుదల చేయించాలి. ►శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలించుకునే అన్ని పాయింట్ల వద్ద రియల్ టైం సెన్సర్లను ఏర్పాటు చేయాలి. -
కృష్ణా జలాలు.. ఫిఫ్టీ ఫిఫ్టీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ట్రిబ్యునల్–1 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను తాత్కాలికంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలో వాడుకుంటున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నిర్వహణకు కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) రూపకల్పన చేసే నిబంధనల్లో ఇదే దామాషాను కొనసాగించడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల వినియోగం జరిగేలా కేఆర్ఎంబీ నిబంధనలను సవరించాలని స్పష్టం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు అమల్లోకి వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో రెండు రాష్ట్రాల మధ్య జల పంపకాలు జరగాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ ఈ నెల 18న కేఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణకు కేఆర్ఎంబీ రూపొందించిన పలు నిబంధనలను కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పుకు అనుగుణంగా సవరించాలని ఈ లేఖలో తెలంగాణ కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి సాగునీటిని తీసుకోవడానికి 830 అడుగుల కనీస నీటి మట్టం ఉండాలని కృష్ణా ట్రిబ్యునల్–1 స్పష్టం చేసిందని, కేఆర్ఎంబీ నిబంధనల్లో సైతం 854 అడుగుల నుంచి 830 అడుగులకు మార్చాలని సూచించింది. లేఖలో పేర్కొన్న అంశాలివీ.. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి 80 టీఎంసీలను.. నాగార్జునసాగర్ ఎగువన కృష్ణా నదిలోకి తరలిస్తామని, అందులో 35 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటక అవసరాలకు, మిగిలిన 45 టీఎంసీలను నాగార్జునసాగర్ ఎగువ ప్రాంత అవసరాలకు వాడుకుంటామని అప్పట్లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ ముందు అంగీకారం తెలిపింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలకు ఈ 45 టీఎంసీలు అదనం. గోదా వరి జలాల మళ్లింపు ఆధారంగా ఉమ్మడి ఏపీ గతంలోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టింది. అందువల్ల ఈ 45 టీంఎసీలను క్యారీ ఓవర్‌గా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసేందుకు అనుమతించరాదు. దీంతో తెలంగాణ 45 టీఎంసీలను కోల్పోతుంది. కృష్ణా నదిలోని ఫ్రీ సప్లైయిస్ నుంచి 72.2 టీఎంసీల కృష్ణా డెల్టా ఆయకట్టు డిమాండ్‌ను తీర్చా లని కృష్ణా ట్రిబ్యునల్–1 పేర్కొనగా, నాగార్జునసాగర్ నుంచి కేటాయించడం సరికాదు. ఈ కేటాయింపులను సవరించాలి. కృష్ణా డెల్టాకు 152.2 టీఎంసీల అవసరాలు ఉండగా, 181.2 టీఎంసీల లభ్యత ఉంది. నాగార్జునసాగర్ దిగువన ఉన్న క్యాచ్మెంట్ ఏరియా నుంచి 101.2 టీఎంసీలు, గోదావరి జలాల మళ్లింపు ద్వారా 80 టీఎంసీల లభ్యత ఉంది. కృష్ణా డెల్టాలో అదనంగా ఉన్న 29 టీఎంసీల లభ్యతను నాగార్జునసాగర్ కుడి కాల్వకు కేటాయించాలి. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని క్లాజ్–7 ఆధారంగా నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్‌కు 5.7 టీఎంసీల తాగునీటి కేటాయింపులు చేయాలి. శ్రీశైలం జలాశయంలో 582.5 టీఎంసీల జలాల లభ్యత ఉందని కేఆర్ఎంబీ రూల్స్‌లో పేర్కొంది. నాగార్జునసాగర్, హైదరాబాద్ తాగునీరు, చెన్నైకి సరఫరా, ఎస్‌ఆర్‌బీసీలకు కలిపి మొత్తం 300 టీఎంసీలు పోగా, మిగి లే 282.5 టీఎంసీల నుంచి తెలంగాణలోని ఎస్ఎల్బీకు 40 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోత లకు 40 టీఎంసీలు, నెట్టేంపాడు ఎత్తిపోతలకు 25.4 టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డికు 90 టీఎం సీలు, డిండికి 30 టీఎంసీలు కేటాయించాలి. -
తుంగభద్రపై ఐదు టెలిమెట్రీ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆయకట్టుకు రావాల్సిన జలాలకు మార్గంమధ్యలోనే గండి పడుతోంది. 19.5 టీఎంసీలు రావాల్సి ఉండగా, ఏటా 5 టీఎంసీలకు మించి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ కాల్వకు వస్తున్న జలాలను శాస్త్రీయ పద్ధతిలో లెక్కించడానికి ఐదు చోట్లలో టెలీమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న అభిప్రాయానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సబ్ కమిటీ వచి్చంది. కృష్ణా బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై మెంబర్ కన్వీనర్‌గా, ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కో ఇంజనీర్ సభ్యులుగా ఉన్న బోర్డు సబ్ కమిటీ ఇటీవల సుంకేశుల, ఆర్డీఎస్, జూరాల ప్రాజెక్టులను సందర్శించింది. ఈ నేపథ్యంలో తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ కాల్వకు నీళ్లు విడుదల చేసే రెగ్యులేటర్ వద్ద, కర్ణాటకలో 43 కి.మీ ప్రయాణించి తెలంగాణ సరిహద్దులకు ఆర్డీఎస్ కాల్వ చేరుకునే పాయింట్ వద్ద, తుమ్మిళ్ల ఎత్తిపోతల దగ్గర, సుంకేశుల జలాశయంతో పాటు ఈ జలాశయం నుంచి కేసీ కాల్వకు నీటి సరఫరా చేసే రెగ్యులేటర్ వద్ద టెలిమెట్రీ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా సూచిస్తూ సబ్ కమిటీ త్వరలో కృష్ణా బోర్డుకు నివేదిక సమర్పించనుంది. దీంతో తుంగభద్ర డ్యాం నుంచి ఎన్ని నీళ్లు ఆర్డీఎస్ కాల్వకు విడుదల చేస్తున్నారు? అందులో ఎన్ని నీళ్లు రాష్ట్ర సరిహద్దులకు చేరుతున్నాయి? తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా తుంగభద్ర నది నుంచి ఏ మేరకు నీళ్లను ఆర్డీఎస్ కాల్వకు మళ్లిస్తున్నారు? సుంకేశుల జలాశయానికి ఎన్ని నీళ్లు వస్తున్నాయి ? సుంకేశుల నుంచి ఏ మేరకు నీటిని కేసీ కాల్వకు తరలిస్తున్నారు ? అన్న విషయాలపై స్పష్టత రానుంది. త్వరలో జరగనున్న తుంగభద్ర బోర్డు సమావేశంలో ఈ సబ్ కమిటీ సిఫారసుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
చారిత్రక అన్యాయాలను సరిదిద్దాలి
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కేంద్రం రెండు విభాగాలుగా గెజిట్ నోటిఫికేషన్లో పొందుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు జరిగిన చారిత్రక అన్యాయాలను సరి చేయాలని, గెజిట్ నోటిఫికేషన్ నుంచి కల్వకుర్తి రెండో భాగాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. ఒకే విభాగంగా పొందుపర్చాలంటూ నీటిపారుదల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.మురళీధర్ ఆదివారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు మరోసారి లేఖ రాశారు. 2.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు 25 టీఎంసీల నీటి తరలింపు సామర్థ్యంతో ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కాంపోనెంట్–1గా, నీటి తరలింపును 40 టీఎంసీలకు పెంచడంద్వారా ఆయకట్టును 3.65 లక్షల ఎకరాలకు పెంచేందుకు తెలంగాణ ఏర్పడ్డాక చేపట్టిన ప్రాజెక్టు విస్తరణ పనులను కాంపోనెంట్–2గా గెజిట్ నోటిఫికేషన్లోకేంద్రం పేర్కొంది. ఒకే ప్రాజెక్టును రెండు విభాగాలుగా చూపడం సరికాదని లేఖలో తప్పుబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టును 2.5 లక్షల ఎకరాల నుంచి 3.65 లక్షల ఎకరాలకు పెంచారని, నీటి కేటాయింపులను ఇందుకు అనుగుణంగా పెంచలేదని స్పష్టం చేశారు. ఆయకట్టు పెంచుతూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవోలు సైతం జారీ చేసిందని గుర్తుచేశారు. అప్పట్లో పెంచిన ఆయకట్టుకే తెలంగాణ ప్రభుత్వం సరిపడా నీటి కేటాయింపులు చేసిందని, కొత్తగా ఆయకట్టు పెంచలేదన్నారు. కొత్త వనరుల నుంచి నీటిని తీసుకోవడం లేదన్నారు. మా ప్రాజెక్టులు కృష్ణా బేసిన్లోవే.. ఏపీవి కావు! శ్రీశైలం జలాశయంలో 800కుపైగా అడుగుల వద్ద నుంచి నీటిని తోడేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల నిర్మిస్తామని 2006లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం డీపీఆర్ సమర్పించిందని తెలంగాణ గుర్తుచేసింది. 885 అడుగులపైన నీటిమట్టం నుంచి నీటిని తోడుకొనేలా గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రినీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను డిజైన్ చేసినట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సమర్పించిందని పేర్కొంది. కల్వకుర్తి ఎత్తిపోతల కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టే కావడంతో అప్పట్లో శ్రీశైలం జలాశయంలోని 800 అడుగుల నీటిమట్టం వద్ద నుంచి నీటిని తోడేలా డిజైన్ చేశారని తెలిపింది. పరీవాహక ప్రాంతం వెలుపలి ప్రాజెక్టులు కావడంతో గాలేరు–నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ వంటి ఆంధ్ర ప్రాజెక్టులను శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగుల నుంచి నీటిని తీసుకొనేలా డిజైన్ చేశారని స్పష్టం చేసింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను సైతం ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఇదే కారణంగా 800కుపైగా అడుగుల నుంచి నీటిని తోడుకొనే విధంగా డిజైన్ చేసినట్లు వివరించింది. 75 శాతం నిల్వ ఆధారిత నికర జలాలను కల్వకుర్తికి కేటాయించాలని కృష్ణా ట్రిబ్యునల్–2 ముందు వాదించామని తెలిపింది. గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రీనీవా తదితర ప్రాజెక్టులకు మిగులు జలాలనే ఏపీ కోరిందని, 75 శాతం నిల్వ ఆధారిత నికర జలాలు కేటాయించాలని కోరలేదని తెలిపింది. -
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపండి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం కుడి, ఎడమగట్టు కేంద్రాల నుంచి విద్యుదుత్పత్తి తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో జలాశయంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిం ది. ఈ మేరకు బోర్డు సభ్యులు (విద్యుత్) ఎల్బీ ముంతంగ్ ఈ నెల 18న లేఖ రాశారు. విద్యుదుత్పత్తి ఆపకుంటే రిజర్వాయర్ పరిధిలో తాగు, సాగునీటికి కష్టాలు తప్పవని హెచ్చరించారు. అక్టోబర్ 15న జలాశయంలో 885 అడుగుల నీటి మట్టం వద్ద 216.8 టీఎంసీల నిల్వ ఉండగా, నవంబర్ 18 నాటికి 856.10 అడుగుల వద్ద 94.91 టీఎంసీలకు తగ్గిపోయాయని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో నిల్వలు గరిష్ట మట్టానికి చేరుకోవడంతో, ఎగువ నుంచి వస్తున్న నీళ్లు వృథాగా సముద్రం పాలు అవుతున్నాయని తెలిపారు. -
‘హంద్రీ నీవా’ను అడ్డుకోండి.. ! కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ట్రిబ్యునల్–1 జల కేటాయింపులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ఎత్తిపోతల పథకంతో పాటు దాని విస్తరణ పనులను తక్షణమే అడ్డుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)ను తెలంగాణ ప్రభుత్వం మరోసారి కోరింది. కృష్ణా జలాల ఆధారంగా చేపట్టిన ప్రస్తుత హంద్రీ నీవా ఎత్తిపోతల పథకాలకే కేఆర్ఎంబీ అనుమతి, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేదని తెలిపింది. అలాంటిది మరో కొత్త పథకాన్ని చేపట్టడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ ఇటీవల కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. అభ్యంతరాలు పట్టించుకోకుండా.. హంద్రీ నీవా విస్తరణలో భాగంగా మల్యాల నుంచి (–)4.8 – 216.3 కి.మీల(1–8 పంపింగ్ స్టేషన్లు) పరిధిలోని ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచేందుకు రూ.4,652 కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించిందని లేఖలో ఫిర్యాదు చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి నీళ్లను తీసుకోకుండా నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం పదేపదే కోరుతున్నా.. ఇలా టెండర్లను ఆహ్వానించిందని పేర్కొన్నారు. శ్రీశైలంనుంచి ఏపీ ప్రభుత్వం విని యోగించుకోవాల్సిన 34 టీఎంసీల వరద జలాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ప్రణాళికా సంఘం అనుమతుల్లో హంద్రీ నీవా పథకం ప్రస్తావనే లేదని గుర్తు చేశారు. కేంద్ర జలసంఘం/కేంద్ర జల వనరుల శాఖ అనుమతుల ప్రకారం వరద ప్రవాహ సమయాల్లోనే శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 34 టీఎంసీలను తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే కృష్ణా పరీవాహక ప్రాంతం వెలుపలి ప్రాంతాలకు ఏపీ ప్రయోజనం కలిగిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయింపులకు విరుద్ధంగా తుంగభద్ర ఉప పరీవాహక ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు నీటిని తరలిస్తోందని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకే భవిష్యత్తు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కృష్ణా ట్రిబ్యునల్–1 స్పష్టం చేసిందని తెలిపారు. అందువల్ల తక్షణమే హంద్రీ నీవా విస్తరణ పనులను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను అప్పగించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను తమకు అప్పగించాల్సిందేనని కృష్ణా బోర్డు మరోమారు తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న అంశాలను అమల్లో పెట్టాల్సిన బాధ్యత తమపై ఉందని, దీనికి రెండు రాష్ట్రాలు సహకరించాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్‌సింగ్ తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. కృష్ణా బేసిన్‌కు సంబంధించి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని 15 ఔట్లెట్లను తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరినా తెలంగాణ నుంచి స్పందన లేకపోవడంతో ఈ లేఖలను సీఎస్‌లకు రాసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పవర్‌హౌస్‌లను అప్పగించేందుకు రాష్ట్రం అయిష్టత చూపుతుండటంతో గెజిట్ అమలు అంశం సందిగ్ధంలో పడింది. గెజిట్ అమలు చేసేలా ఆదేశాలివ్వండి తాజా లేఖల్లో బోర్డు చైర్మన్ గెజిట్ అంశాలను మరోమారు ప్రస్తావించారు. నోటిఫికేషన్‌లోని అంశాల అమలు దిశగా రెండు రాష్ట్రాలతో విస్తృతంగా చర్చించామని, అయితే పలు అంశాలపై వివరాలు అందజేయడంతో పాటు, తదుపరి చర్యలు తీసుకోవడంలో రెండు రాష్ట్రాలు జాప్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ 14 నుంచే గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రావాల్సి ఉందని తెలిపారు. అందులో పేర్కొన్న ప్రాజెక్టులు, వాటి పరిధిలోని బ్యారేజీలు, డ్యామ్‌లు, రిజర్వాయర్లు, రెగ్యులేటరీ నిర్మాణాలు, కెనాల్ నెట్వర్క్, ట్రాన్స్మిషన్ లైన్లు బోర్డు స్వాధీనంలోకి రావాల్సి ఉందని గుర్తు చేశారు. అలాగే అక్టోబర్ 14 నాటికి రెండు రాష్ట్రాలు తమ ప్రాజెక్టులను, వాటి పరిపాలన, నిర్వహణ, నియంత్రణను బోర్డుకు అప్పగించాల్సి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగర్, శ్రీశైలం పరిధిలోని పలు ఔట్లెట్లను కొన్ని ఆంక్షలతో బోర్డుకు అప్పగిస్తూ జీవో 54, జీవో 17లను విడుదల చేసిందని గుర్తు చేశారు. దీంతో పాటే గెజిట్ ప్రకారం రెండు రాష్ట్రాలు వన్‌టైమ్ సీడ్‌మనీ కింద చెరో రూ.200 కోట్లు బోర్డు బ్యాంకు అకౌంట్లో జమ చేయాల్సి ఉందని, అయితే ఇప్పటికీ రెండు రాష్ట్రాలు ఈ మేరకు చర్యలు చేపట్టలేదని తెలిపారు. నగదు జమ చేయని పక్షంలో బోర్డు తన విధులను ప్రభావవంతంగా కొనసాగించడం కష్టసాధ్యమని పేర్కొన్నారు. గెజిట్ అంశాల అమలుకు సహకరించేలా ఆయా ప్రభుత్వ శాఖలకు సరైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సీఎస్‌లను బోర్డు చైర్మన్ కోరారు. -
కర్నూలు జిల్లాలో నేడు, రేపు కేఆర్ఎంబీ బృందం పర్యటన
-
ప్రాజెక్టుల పరిశీలనకు కృష్ణా, గోదావరి బోర్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల స్వాధీనంపై కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు కృష్ణా, గోదావరి బోర్డులు స్వయంగా రంగంలోకి దిగుతున్నాయి. ప్రాజెక్టుల స్వాధీనం దిశలో ఉన్న అవాంతరాలు, వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రాజెక్టుల పరిధిలో పర్యటించనున్నాయి. సోమవారం నుంచి గోదావరి బోర్డు సబ్‌కమిటీ దేవాదుల, ఎస్సారెస్పీ పరిధిలో పర్యటించనుండగా, కృష్ణా బోర్డు సబ్‌కమిటీ శ్రీశైలంలో పర్యటించనుంది. నిజానికి అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలు కావాల్సి ఉన్నా ఇంతవరకు ప్రాజెక్టుల స్వాధీనంపై స్పష్టత లేక అనిశ్చితి కొనసాగుతోంది. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల పరిధిలో 15 ఔట్లెట్ల స్వాధీనానికి బోర్డులు తీర్మానించినా, తెలంగాణ నుంచి అంగీకారం కుదరక అడుగు ముందుకు పడటం లేదు. ఈ అనిశ్చితి కొనసాగుతుండగానే రవికుమార్ పిళ్లై, డీఎం రాయ్పురేల నేతృత్వంలోని కృష్ణా బోర్డు సబ్‌కమిటీ శ్రీశైలం పరిధిలో పర్యటించాలని నిర్ణయించింది. శ్రీశైలంలో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలు, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిధిలో ఉన్న సిబ్బంది, ఆపరేషన్ ప్రొటోకాల్, వరద నియంత్రణ పద్ధతులు, ఇతర పథకాలకు నీటి అవసరాలు, వినియోగం తదితర అంశాలపై స్థానిక ఇంజనీర్లతో చర్చించనుంది. ఇక కేంద్ర జల సంఘం సీఈ అతుల్‌కుమార్ నాయక్ నేతృత్వంలోని గోదావరి బోర్డు సబ్ కమిటీ దేవాదులలోని గంగారం పంప్‌హౌస్, ఎస్సారెస్పీ పరిధిలోని కాకతీయ కెనాల్ పరిధిలోని క్రాస్ రెగ్యులేటర్‌ను పరిశీలించనుంది. షెడ్యూల్–2లో పేర్కొన్న ఈ ప్రాజెక్టులను బోర్డులు స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా, స్వాధీనం అనంతరం ఉండే పరిస్థితులు, వాటి నిర్వహణపై కమిటీలు అధ్యయనం చేయనున్నాయి. చదవండి: Hyderabad RTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సిటీ బస్సు ఇక చిటికలో -
అప్పగింతపై చెరోదారి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పర భిన్న వైఖరులను అవలంబిస్తున్నాయి. గత బోర్డు సమావేశంలో తీర్మానించిన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జున సాగర్‌లపై ఉన్న 6 ఔట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేయగా.. తెలంగాణ మాత్రం తన వైఖరిని వెల్లడించలేదు. శ్రీశైలం, సాగర్‌లపై ఉన్న తమ పవర్ హౌస్‌లను మినహాయించి మిగతా ఔట్లెట్లను అప్పగించేందుకు ప్రభుత్వ స్థాయిలో కొంత సానుకూలత కనిపిస్తున్నా...ఇదివరకే నియమించిన ఏడుగురు సభ్యుల సబ్‌కమిటీ నివేదిక ఆధారంగానే ప్రాజెక్టుల అప్పగింతపై తుది నిర్ణయం చేయనుంది. ఈ నేపథ్యంలో గెజిట్ అమలుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దసరా తర్వాత ప్రస్తుత పరిస్థితిని కేంద్ర జల శక్తి శాఖకు నివేదించి దాని అభిప్రాయం మేరకు కృష్ణా బోర్డు ముందుకెళ్లనుంది. తెలంగాణ అప్పగించాకే.. గోదావరిలో పెద్దవాగు, కృష్ణాలో 15 ఔట్లెట్లను తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని బోర్డులు ఇదివరకే రెండు రాష్ట్రాలను కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల అప్పగింతకు ముందునుంచి సంసిద్ధంగానే ఉన్న ఏపీ.. తీర్మానం మేరకు శ్రీశైలం స్పిల్‌వే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా (మల్యాల), ముచ్చిమర్రి ఎత్తిపోతలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే శ్రీశైలం కుడి విద్యుత్ కేంద్రం, సాగర్ కుడికాల్వ విద్యుత్ కేంద్రాలను సైతం అప్పగిస్తూ ఆ రాష్ట్ర జల వనరులు, ఇంధన శాఖ కార్యదర్శులు శ్యామలరావు, నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి పరిధిలో పనిచేసే 181 మంది సిబ్బందిని బోర్డు పరిధిలోకి తెస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ కృష్ణా బోర్డు సమావేశంలో చేసిన తీర్మానం మేరకు తెలంగాణలోని శ్రీశైలం, సాగర్‌లపై ఉన్న 9 అవుట్లెట్లను స్వాధీనం చేసుకున్నప్పుడే..తమ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలనే షరతు విధించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువున ఉన్న జూరాల ప్రాజెక్టుతో పాటు దాన్నుంచి నేరుగా నీటిని తీసుకునేలా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సైతం అవి పూర్తయిన వెంటనే స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. వాటిని స్వాధీనం చేసుకోకపోతే దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్లకు వచ్చే ప్రవాహాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే వాటిని సైతం స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. గోదావరికి సంబంధించిన పెద్దవాగుపై మాత్రం ఇంకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. పవర్‌హౌస్‌లపై తెలంగాణ ససేమిరా పెద్దవాగును బోర్డుకు అప్పగించేందుకు సిధ్దంగా ఉన్న తెలంగాణ.. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై మాత్రం తర్జనభర్జనలు పడుతోంది. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌పై ఉన్న 3 పవర్‌హౌస్‌లను అప్పగించేందుకు ఏమాత్రం అంగీకరించేది లేదని స్పష్టం చేస్తోంది. ఇవి మినహాయిస్తే మిగతా 6 ఔట్లెట్ల విషయంలో మాత్రం కొంత సానుకూలంగా ఉంది. ఈ మేరకు ఇంజనీర్ ఇన్ చీఫ్ నుంచి ప్రభుత్వ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ సైతం వెళ్లింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తెలుపని రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత పరిణామాలను అధ్యయనం చేసి జూరాల, శ్రీశైలం, సాగర్ల అపరేషన్ ప్రోటోకాల్ ముసాయిదాను నిర్దేశించేందుకు ఇప్పటికే ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సబ్ కమిటీని నియమించింది. సబ్ కమిటీలో సీనియర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయవాదులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 15 రోజల్లో తన నివేదికను అందించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో దసరా సెలవుల అనంతరం కమిటీ భేటీ కానుంది. అనంతరం తన పరిశీనలను ప్రభుత్వానికి అందజేస్తే దానిపై ప్రభుత్వ స్థాయిలో మరోమారు చర్చించాక ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం చేయనుంది. ఒకవేళ కమిటీ ఏవైనా అభ్యంతరాలు లేవనెత్తితే.. వాటిపై స్పష్టత కోరుతూ బోర్డులు, కేంద్రానికి లేఖలు రాయనుంది. తమ అభ్యంతరాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చూపితేనే అప్పగింతపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మళ్లిస్తున్న వరద నీటిని లెక్కలోకి తీసుకోవద్దు
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల్లో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడం వల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి వరద జలాలు సముద్రంలో కలుస్తుండటాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. సముద్రంలో కలవడం వల్ల జలాలు వృథా అవుతాయని.. సద్వినియోగం చేసుకోవడానికి వరద నీటిని మళ్లిస్తున్నామని పేర్కొంది. మళ్లిస్తున్న వరద నీటిని రాష్ట్ర వాటా కింద లెక్కించకూడదని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకి రాష్ట్ర జలవనరులశాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి శుక్రవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు.. ► కృష్ణా వరద ప్రవాహం వల్ల జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆ నీరు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలో కలుస్తోంది. ► విభజన చట్టం 11వ షెడ్యూలులో సెక్షన్–85(7)(ఈ) ప్రకారం ప్రకృతి విపత్తులను నియంత్రించాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాలపై ఉంటుంది. వరదలను నియంత్రించడంలోను, కరవు నివారణ చర్యలు చేపట్టడంలోను రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సలహాలు ఇవ్వాలి. ఈ నిబంధన ప్రకారం వరద ముప్పును తప్పించాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలోనే వరద నీటిని మళ్లిస్తున్నాం. వృథాగా సముద్రంలో కలిసే వరద నీటిని మళ్లించడం వల్ల ఎవరి ప్రయోజనాలకు విఘాతం కలగదు. ఈ నేపథ్యంలో మళ్లిస్తున్న వరద నీటిని రాష్ట్ర వాటా కింద పరిగణించకూడదు. ► విలువైన జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో విద్యుదుత్పత్తి చేయకపోతే జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే కోరాం. ఆ మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నాం. -
కేఆర్ఎంబీకి ఏపీ ఈఎన్సీ లేఖ
-
కేఆర్ఎంబీకి ఏపీ ఈఎన్సీ లేఖ
సాక్షి, విజయవాడ: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం కుడిగట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని కేఆర్ఎంబీకి ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి లేఖ రాశారు. మూడు, నాలుగు రోజుల్లో శ్రీశైలం జలాశయానికి మిగులు జలాలు రానున్నందున ఏపీ ప్రభుత్వం అనుమతి కోరింది. -
గెజిట్ అమలుపై ముందుకే!
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) పరిధిని నిర్దేశిస్తూ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా కేంద్ర జలశక్తి మరో అడుగు ముందుకేసింది. ఈనెల మొదటి వారంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలసి నోటిఫికే షన్ను అక్టోబర్ 14 నుంచి కాకుండా కొంతకాలం వాయిదా వేయాలని కోరిన సంగతి తెలిసిందే. కాగా, గెజిట్ అమలు సాఫీగా సాగేలా ఆయా బోర్డు లకు జలశక్తి శాఖ చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో ఇద్దరేసి ఉన్నతాధికారులను నియమించింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలో మానవ వనరుల బలోపేతానికి, పరిధి విస్తృతమైన నేపథ్యంలో మెరుగైన రీతిలో బోర్డులు పనిచేసేందుకు సెంట్రల్ వాటర్ ఇంజ నీరింగ్ గ్రూప్ ‘ఎ’సర్వీసుకు చెందిన సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ ఆఫీసర్లను నలుగురిని నియ మిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. సీడబ్ల్యూసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న డాక్టర్ ఎం.కె.సిన్హాను, సీడబ్ల్యూసీ యమునా బేసిన్ ఆర్గనైజేషన్‌లో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న జి.కె.అగ ర్వాల్‌ను గోదావరి నదీ యాజమాన్య బోర్డులో నియమించింది. అలాగే సీడబ్ల్యూసీ కావేరీ అండ్ సదరన్ రీజియన్ ఆర్గనైజేషన్ (కోయంబత్తూరు)లో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న టి.కె.శివరాజన్‌ను, సీడ బ్ల్యూసీ అప్పర్ గంగా బేసిన్ ఆర్గనైజేషన్(లక్నో)లో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న అనుపమ్ ప్రసాద్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో నియామకం చేపట్టింది. ఈ నలుగురు అధికారులు ఆయా బోర్డుల చైర్మన్‌కు తక్షణం రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచిన ప్రాజెక్టుల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలని సూచిం చింది. ఈ నియామకాలు మూడు నెలల కాలానికి, లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు వర్తిస్తాయని పేర్కొంది. ఈ అధికారులు చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో పూర్తి అధికారాలతో ఫుల్ టైమ్ పనిచేస్తారని తెలిపింది. బోర్డుల చైర్మన్లతో జలశక్తి అదనపు కార్యదర్శి భేటీ కేఆర్ఎంబీ చైర్మన్ ఎం.పి.సింగ్, జీఆర్ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీ సోమవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. గత శుక్రవారం జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. దానికి కొనసాగింపుగా సోమ వారం అదనపు కార్యదర్శి ఈ సమావేశం నిర్వహిం చారు. బోర్డుల పరిపాలన సంబంధిత అంశాలు, నోటిఫికేషన్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాలు తెలిపిన అభ్యంతరాలు, గెజిట్ అమలులో ఉన్న ఇబ్బందులు, కావాలసిన మానవ వనరులు తదితర అంశాలపై చర్చించారు. సీడబ్ల్యూసీ చైర్మన్ ఎస్.కె.హల్దర్, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను అక్రమంగా తరలించడాన్ని తక్షణమే ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు గురువారం మరో లేఖ రాసింది. నీటి తరలింపు కేడబ్లు్యడీటీ–1 (కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్) తీర్పునకు వ్యతిరేకమని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్‌చీఫ్ మురళీధర్, కేఆర్ఎంబీ చైర్మన్‌కు రాసిన లేఖలో వివరించారు. 1976–77 అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం కేవలం 15 టీఎంసీల నీటిని మాత్రమే జూలై నుంచి అక్టోబర్ వరకు మద్రాసు (చెన్నై)కు తాగునీటి కోసం మళ్లించాలని పేర్కొన్నారు. 15 వేల క్యూసెక్కుల సామర్థ్యం మించకుండా చెన్నైకి నీటిని తరలించాలని ఒప్పందంలో పేర్కొన్న విషయాన్ని లేఖలో స్పష్టం చేశారు. ఈఎన్సీ రాసిన లేఖలోని ముఖ్యాంశాలు.. ►సెంట్రల్ వాటర్ కమిషన్ 1981లో బనకచెర్ల వద్ద కేవలం ఒక్క క్రాస్ రెగ్యులేటర్‌కు మాత్రమే అనుమతించింది. ►ఎస్కేప్ రెగ్యులేటర్‌ను తరువాతి కాలంలో అనుమతి లేకుండా నిర్మించారు. ►అనుమతి లేకుండా శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 20,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచారు. ►పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 34 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని విడుదల చేయడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేదు. ఈ నేపథ్యంలో నీటి తరలింపు ఆపేయాలి. ►గెజిట్ నోటిఫికేషన్‌లోని షెడ్యూల్ 2లో అనుమతించిన ప్రాజెక్టులుగా పేర్కొన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ కాలువ, ఎస్కేప్ రెగ్యులేటర్, తెలుగు గంగా ప్రాజెక్టు రెగ్యులేటర్లను అనుమతిలేని ప్రాజెక్టులుగా పేర్కొనాలి. ►శ్రీశైలం ప్రాజెక్టును జలవిద్యుత్ ప్రాజెక్టుగానే కృష్ణా ట్రిబ్యునల్ పరిగణించింది. ►19 టీఎంసీలను శ్రీశైలం కుడి కాలువకు, 15 టీఎంసీలు చెన్నై తాగునీటికి మొత్తం 34 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నుం చి మళ్లించడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతించింది. అంతకు మించి నీటి తరలింపును అనుమతించరాదని ఆ లేఖలో పేర్కొన్నారు. -
Telangana: కృష్ణా వినియోగం తక్కువే
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత నీటి సంవత్సరంలో రాష్ట్రంలో కృష్ణా నదీజలాల వినియోగం తక్కువగా ఉంది. మూడు నెలల వ్యవధిలో మొత్తంగా 58 టీఎంసీ ల నీటిని మాత్రమే వినియోగించుకోగలిగింది. ప్రస్తుత సీజన్‌కు సైతం ప్రధాన ఎత్తిపోతల పథకాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద మాత్రమే ఇప్పటివరకు గరిష్ట జలాల వినియోగం జరిగినట్లు రికార్దులు చెబుతున్నాయి. వరద జలాలు ఒడిసి పట్టలేక.. కృష్ణా బేసిన్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల మేర నికర జలాల కేటాయింపులున్న విషయం తెలిసిందే. ఈ వాటాలకు అనుగుణంగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఉండగా, వరద జలాలపై ఆధారపడి తెలంగాణ నెట్టెంపాడు(20 టీఎంసీలు), కల్వకుర్తి (40 టీఎంసీలు), ఏఎంఆర్పీ (30 టీఎంసీలు), పాలమూరు–రంగారెడ్డి (90 టీఎంసీ లు), డిండి (30 టీఎంసీలు) ప్రాజెక్టులు చేపట్టింది. అయితే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులకు సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు కాకపోవడంతో కృష్ణా బేసిన్లో ఎంత నీరొచ్చినా, దానిని రెండు రాష్ట్రాలు 66ః34 నిష్పత్తిలో వాడు కోవాలని నిర్ణయించుకున్నాయి. తమకు వచ్చే వాటా లకు అనుగుణంగా నీటిని రాష్ట్రాలు తమ పరీవా హకంలో ఎక్కడైనా వినియోగించుకునేలా ఒప్పందం చేసుకుని ఆ మేరకు వాడుకుంటున్నాయి. ఈ విధంగా గత మూడు నెలల్లో కృష్ణా బేసిన్లో ఏపీ 113 టీఎంసీలు వినియోగించుకోగా తెలంగాణ 58 టీఎంసీ లు మాత్రమే వినియోగించుకుందని కృష్ణా బోర్డుకు సమర్పించిన లెక్కల్లో తెలంగాణ పేర్కొంది. సాగర్ ఎడమ కాల్వ కింద 14.68 టీఎంసీల వినియోగం జరగ్గా, జూరాల కింద 8, నెట్టెంపాడు కింద 4, బీమా కింద 4.60, కోయిల్‌సాగర్ కింద 2, కల్వ కుర్తి కింద 5 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించింది. వీటితోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలు, ఏఎంఆర్పీ కింది అవసరాలకు కలిపి మరో 11 టీఎంసీల మేర నీటిని వాడగా, మధ్యతరహా ప్రాజెక్టుల కింద వినియోగం మరో 3 టీఎంసీల మేర ఉంది. కల్వకుర్తి కింది మూడు దశల్లో పూర్తి స్థాయిలో జరగని ఎత్తిపోతలకు తోడు, నిల్వలు చేసేందుకు రిజర్వాయర్లు లేక పోవడం, పాలమూరు, డిండి ప్రాజెక్టుల నిర్మాణం పాక్షికంగా అయినా పూర్తి కాకపోవడంతో నీటినిల్వకు అవకాశం లేకుండా పోయింది. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీ గా వరదలు వస్తున్నా ఒడిసి పట్టలేక పోయింది. దీంతో ఈ ఏడాది 205 టీఎంసీల నీరు వృ«థాగా సముద్రం లోకి వెళ్లింది. గతేడాది కృష్ణా జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు రికార్డులు సృష్టించాయి. గత ఏడాది సీజన్ ఏపీ 647.559, తెలంగాణ 272.846 టీఎంసీలు ఉపయోగించుకున్నాయి. -
Krishna River Water Dispute: ఈ ఏడాది పాత వాటాలే
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఈ ఏడాది కూడా పాత పద్ధతి ప్రకారమే పంచుకోవాలని ఇరు తెలుగు రాష్ట్రాలు నిర్ణయానికి వచ్చాయి. ఈసారి ప్రాజెక్టుల్లో చేరే నీటిని 34ః66 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీ పంచుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఒప్పందానికి వచ్చాయి. కృష్ణా జలాల్లో వాటా పెంపు అంశాన్ని ట్రిబ్యునళ్లు మాత్రమే తేల్చగలవని.. తాము నిర్ణయం తీసుకోలేమన్న బోర్డు సూచన మేరకు దీనికి తెలంగాణ అంగీకరించింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి విషయంలో మాత్రం ఏకాభిప్రాయం రాలేదు. విద్యుత్ ఉత్పత్తి చేస్తామని తెలంగాణ స్పష్టం చేయగా.. సాగు, తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ వాదించింది. కాగా ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు రజత్‌కుమార్‌కు ఫోన్ చేసి.. కృష్ణాబోర్డు సమావేశంలో జరుగుతున్న వాదనలపై ఆరా తీశారు. ఏపీ ఏయే అంశాలను లేవనెత్తుతోందన్నది తెలుసుకుని, పలు సూచనలు చేశారు. వాడివేడిగా వాదనలు కృష్ణాజలాల్లో వాటాలు, వినియోగం, విద్యుదుత్పత్తి సహా పలు కీలక అంశాలపై హైదరాబాద్‌లోని జలసౌధలో బుధవారం కృష్ణాబోర్డు సమావేశాలు జరిగాయి. మొదటి సమావేశం బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మొదలైంది. తెలంగాణ, ఏపీ జలవనరుల శాఖల కార్యదర్శులు రజత్‌కుమార్, శ్యామలారావు, ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డితోపాటు తెలంగాణ అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు తదితరులు హాజరయ్యారు. సుమారు 7 గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. తర్వాత బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అంశాల అమలుపై మరో నాలుగు గంటల పాటు సమావేశం జరిగింది. మొత్తంగా 11 గంటల పాటు సమావేశాలు జరిగాయి. వాటాలపై తెలంగాణ పట్టు సమావేశంలో వాటాల పెంపు అంశాన్ని తెలంగాణ ప్రధానంగా ప్రస్తావించింది. ‘‘కృష్ణాబోర్డు 12వ భేటీలో తెలంగాణ, ఏపీ మధ్య 34ః66 నిష్పత్తిలో ఒక ఏడాదికి నీటి పంపకాలు చేయడానికి అంగీకరించాం. మైనర్ ఇరిగేషన్ వినియోగం, పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టాకు మళ్లించే గోదావరి నీళ్లు, ఆవిరి నష్టాలను ఈ నిష్పత్తిలో లెక్కించకూడదని నిర్ణయం తీసుకున్నాం. పరీవాహకం, సాగుయోగ్య భూమి, కరువు పీడిత ప్రాంతాలు, జనాభా ఆధారంగా చూస్తే కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీల వాటా 70.8ః 29.2 శాతంగా ఉండాలి. కనీసం బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకు కృష్ణా జలాల్లో లభ్యత నీటిని 50ః50 నిష్పత్తిన పంచాలి’’ అని తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ వాదించారు. పోలవరం మళ్లింపు వాటాల ప్రకారం సైతం తమకు 45 టీఎంసీలు అదనంగా దక్కుతాయని, వాటిని ఈ ఏడాది నుంచి వినియోగిస్తామని తెలిపారు. అయితే దీనిని ఏపీ వ్యతిరేకించింది. కృష్ణాడెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకు సంబంధించి.. నాగార్జునసాగర్ ఎగువన నీటిని పంపిణీ చేసే అధికారం బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే ఉందని ఏపీ సెక్రటరీ శ్యామలారావు వాదించారు. నిజానికి ప్రస్తుత వాటాలను సవరిస్తే ఏపీకే 70 శాతం నీటిని ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై కల్పించుకున్న బోర్డు.. నీటి వాటాల అంశం బోర్డులు తేల్చే పనికాదని, ట్రిబ్యునల్‌లో విషయం తేలేవరకు పాత పద్ధతి ప్రకారమే నీటిని వాడుకోవాలని కోరింది. దీనికి తెలంగాణ అంగీకరించింది. విద్యుదుత్పత్తిపై గరంగరం శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. శ్రీశైలంలో ఇష్టారీతిగా విద్యుదుత్పత్తి చేస్తున్నారని, దానిని తక్షణమే నిలిపేయాలని ఏపీ డిమాండ్ చేయగా.. అనుమతుల్లేని ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణాజలాలను తరలించడం ఆపాలని తెలంగాణ వాదించింది. ‘‘కృష్ణా బేసిన్ అవతల ఎలాంటి అనుమతుల్లేని ఆయకట్టుకు పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటిని తరలిస్తోంది. 1976, 1977లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందాలు, 1981లో ప్రణాళికా సంఘం అనుమతుల మేరకు ఏపీ కేవలం 15 టీఎంసీల నీటిని చెన్నై తాగునీటి అవసరాలకు, మరో 19 టీఎంసీల నీటిని ఎస్ఆర్బీసీకి జూలై–అక్టోబర్ నెలల మధ్య తరలించుకోవచ్చు. కానీ ఏపీ అధికంగా నీటిని వాడుతోంది. ఇలా ఓవైపు అక్రమంగా నీటిని తరలిస్తూ.. మరోవైపు శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఆపాలని కోరడం సరికాదు. నిజానికి శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టు..’’ అని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. అయితే ప్రాజెక్టు ప్రొటోకాల్ ప్రకారం తాగు, సాగు అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ అవసరాలు లేనప్పుడే శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేయాలని ఏపీ వాదించింది. కేవలం విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయడం ఏమిటని ప్రశ్నించింది. ఈ ఏడాది ఏకంగా 100 టీఎంసీలను వృధాగా సముద్రంలోకి వదిలేశారని పేర్కొంది. ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ స్పందిస్తూ.. తాగు, సాగు అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరం ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. అయినా తమ సూచనలు పాటించాలని బోర్డు కోరడంతో.. తెలంగాణ అధికారులు రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ తదితరులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. క్యారీ ఓవర్ కుదరదు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఒక ఏడాది వాడుకోలేకపోయిన నీటిని తర్వాతి ఏడాదిలో వాడుకునేలా (క్యారీఓవర్) తమకు అనుమతి ఇవ్వాలన్న తెలంగాణ ప్రతిపాదనను కృష్ణాబోర్డు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఏపీ వాదనలతో ఏకీభవించింది. బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్–8 ప్రకారం ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే పూర్తవుతాయని పేర్కొంది. ‘వరద’ లెక్కలు వద్దు బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండి నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు వరద జలాలను ఎవరు వాడుకున్నా వాటాల్లో పరిగణించకూడదని ఏపీ కోరగా.. బోర్డు అంగీకరించింది. అయితే తెలంగాణ విజ్ఞప్తి మేరకు.. ఎవరెవరు ఎంతమేర వరద జలాలను వాడుతున్నారో లెక్కలు చెప్పాలని సూచించింది. బోర్డుకు మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లు గెజిట్ అంశాల అమలుపై జరిగిన చర్చ సందర్భంగా.. కాళేశ్వరం అదనపు టీఎంసీ, సీతారామ, తుపాకులగూడెం ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను తెలంగాణ గోదావరి బోర్డుకు సమర్పించింది. చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు, చనాఖా–కొరట డీపీఆర్‌లను మరో వారంలో సమర్పిస్తామని తెలిపింది. గెజిట్‌లో కొన్ని అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉందని.. ఏవైనా ప్రాజెక్టులకు సంబంధించి ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులుగానీ, వినతులుగానీ వస్తే ఎవరు పరిష్కరిస్తారని తెలంగాణ సందేహం వ్యక్తం చేసింది. ఏపీ మాత్రం గెజిట్ అమలుకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపింది. ఇక గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశాల పరిశీలన కోసం రెండు బోర్డులకు సంబంధించి ఉప కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపం బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు. దీనిద్వారా విద్యుదుత్పత్తి ఆపం. తాగు, సాగు అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న సూత్రం శ్రీశైలానికి వర్తించదు. తెలంగాణకు విద్యుత్ వినియోగం ఎక్కువ. కాబట్టి ఉత్పత్తి కొనసాగిస్తాం. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్నా కృష్ణాబోర్డు నిలువరించడం లేదు. ఎన్ని లేఖలు రాసినా అడ్డుకోలేకపోయింది. టెలీమెట్రీ వ్యవస్థలోనే విఫలమైంది’’ రజత్‌కుమార్, తెలంగాణ స్పెషల్ సీఎస్ -
ఏపీ అధికారుల వాదనలు సమర్థించిన కేఆర్ఎంబీ
-
ఏపీ అధికారుల వాదనలు సమర్థించిన కేఆర్ఎంబీ
సాక్షి, హైదరాబాద్: ఏపీ అధికారులు విద్యుత్ ఉత్పత్తిపై వ్యక్తం చేసిన అభ్యంతరాలను కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ పరిగణలోకి తీసుకున్నారు. ఏపీ అధికారుల వాదనలు కేఆర్ఎంబీ సమర్థించింది. సాగర్, కృష్ణా డెల్టాలకు అవసరాలకు అనుగుణంగానే.. విద్యుత్ ఉత్పత్తి ఉండాలని కేఆర్ఎంబీ చైర్మన్ తెలిపారు. దీంతో జలవిద్యుత్ ఉత్పత్తిలో చైర్మన్ నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన సమాధానంతో సంతృప్తి చెందని తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన బుధవారం జలసౌధలో జరిగిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. ఏపీ నుంచి జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్యామలరావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలవనరుల అంతర్ రాష్ట్ర జల విభాగం సీఈ శ్రీనివాస్ రెడ్డి హాజరుకాగా, తెలంగాణ నుంచి జల వనరుల శాఖ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధరరావు, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్ కుమార్ హాజరయ్యారు. చదవండి: రైతు రథం.. టీడీపీ నాయకుల అవినీతి పథం -
Krishna River Water Dispute: ఎవరి వాదన వారిదే
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విషయంలో నలుగుతున్న వివాదాలపై వాదనలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు ఒకరిపై మరొకరు ఫిర్యాదులతో లేఖలు సంధించిన తెలం గాణ, ఏపీలు.. తొలిసారి బోర్డు సమక్షంలో ముఖా ముఖిగా భేటీ కానున్నాయి. బుధవారం జరగనున్న కృష్ణా బోర్డు పూర్తిస్థాయి సమావేశంలో నీటి వాటాలు, పంపకాలు, ఇప్పటివరకు చేసిన నీటి వినియోగం, అనుమతుల్లేని ప్రాజెక్టుల నిలుపుదల అంశాలపై ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు తమ తమ వాదనలు వినిపించనున్నారు. దీనితో పాటు కేం ద్రం వెలువరించిన గెజిట్ అంశాల అమలుపై జరిగే కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త భేటీలోనూ తమ అభిప్రాయాలు వెల్లడించ నున్నారు. ఈ భేటీ లకు రెండు బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్ర శేఖర్ అయ్యర్, బోర్డు సభ్య కార్యదర్శులతో తెలంగాణ, ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శులు రజత్ కుమార్, శ్యామలరావు, ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి, రెండు రాష్ట్రాలకు చెందిన అంత ర్రాష్ట్ర జల వనరుల విభాగపు ఇంజనీర్లు పాల్గొన నున్నారు. కృష్ణా జలాల్లో లభ్యతగా ఉండే నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటివరకు 34ః66 నిష్పత్తిలో వాడుకుంటూ రాగా, ఈ ఏడాది నుంచి 50ః50 నిష్పత్తిలో పంచాలని తెలంగాణ కోరుతోంది. ఏపీ మాత్రం 79.88:20.12 నిష్పత్తిలో పంపిణీ చేయాలని అంటోంది. దీనిపై బుధవారం వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇతర అంశాలతో పాటు శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై కూడా గట్టి వాదనలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ అంటుంటే.. శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి కేంద్రమేనని, ఏపీనే అక్రమంగా వివిధ ప్రాజెక్టుల ద్వారా నీటిని అవతలి బేసిన్‌కు తరలిస్తోందని తెలంగాణ చెబుతోంది. మరోవైపు కృష్ణా, గోదావరి గెజిట్ నోటిఫికేషన్లపై సాయంత్రం జరగనున్న సంయుక్త భేటీకి తెలంగాణ తొలిసారిగా హాజరవుతోంది. గెజిట్‌పై ఇంతవరకు ఎక్కడా నోరువిప్పని రాష్ట్రం ఎలాంటి వాదన చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
Telangana : ‘హంద్రీనీవా’ నీటి మళ్లింపును అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీటి మళ్లింపును తక్షణం నిలుపుదల చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే వరకు ఏపీ ఎలాంటి నిర్మాణ పనులు జరపకుండా అడ్డుకోవాలని విన్నవించింది. ఈ మేరకు శనివారం తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. కృష్ణా జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ తీర్పులు, వాటిని ఉల్లంఘిస్తూ ఏపీ చేపట్టిన ప్రాజెక్టులు, ముఖ్యంగా హంద్రీనీవా ద్వారా జరుగుతున్న అక్రమ వినియోగం, పలు సందర్భాల్లో ఏపీ జారీ చేసిన ఉత్తర్వులను లేఖతో జతపరిచారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం మాత్రమేనని, దాని నుంచి కృష్ణా బేసిన్ ఆవలకు నీటి మళ్లింపును ట్రిబ్యునల్ అనుమతించలేదని పేర్కొన్నారు. హంద్రీనీవా నుంచి బేసిన్ ఆవలకు నీటి తరలింపు వల్ల బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతాయని వివరించారు. నది ఒడ్డున ఉన్న తెలంగాణ ప్రాంతాలను కాదని.. బేసిన్ ఆవల 700 కి.మీ. దూరానికి నీటి తరలింపు అన్యాయమన్నారు. తుంగభద్ర హై లెవెల్ కెనాల్ సహా ఇతర ప్రాజెక్టులు నీటిని బేసిన్ ఆవలికు మళ్లిస్తాయి కాబట్టే వాటికి నీటి కేటాయింపులు చేయట్లేదని బ్రిజేష్ ట్రిబ్యునల్ పేర్కొందని గుర్తుచేశారు. ప్రస్తుతం హంద్రీనీవా ద్వారా తుంగభద్ర హై లెవల్ కెనాల్ ఆవలకు నీటిని తీసుకెళ్లడం ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమన్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలించడం తప్పని అంటుంటే, ప్రస్తుతం కొత్తగా హంద్రీనీవా సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచడం అక్రమమమని, దీన్ని అడ్డుకోవాలని కోరారు. -
సెప్టెంబర్ 1నే ‘గెజిట్’పై చర్చ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు పూర్తి స్థాయి భేటీ జరగనున్న సెప్టెంబర్ ఒకటినే కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్‌పై మరోమారు తెలుగు రాష్ట్రాలతో చర్చించాలని కృష్ణా, గోదావరి బోర్డులు నిర్ణయించాయి. ఈ మేరకు రెండు బోర్డులు విడివిడిగా తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాశాయి. కృష్ణా బోర్డు భేటీ 1వ తేదీ ఉదయం 11 గంటలకు జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తూ గోదావరి బోర్డు గురువారం ఉదయం తెలంగాణ, ఏపీలకు లేఖలు రాసింది. గెజిట్‌లోని బోర్డులకు నిధుల విడుదల, ప్రాజెక్టుల వివరాల సమర్పణ, సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై చర్చించేలా ఎజెండా ఖరారు చేసింది. మరోవైపు గురువారం సాయంత్రం కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. గెజిట్‌పై చర్చించేందుకు గోదావరి బోర్డు భేటీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, అదే భేటీలో కృష్ణా బేసిన్‌కు నంబంధించిన అంశాలపైనా చర్చిద్దామని ప్రతిపాదించింది. -
బలమైన వాదనలు వినిపించండి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై సెప్టెంబర్ 1న జరగనున్న పూర్తిస్థాయి కృష్ణా బోర్డు సమావేశంలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బోర్డు భేటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. బోర్డు సమావేశంలో చర్చకు రాబోయే ఎజెండాలోని అంశాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన నీటి వాటా కోసం కృష్ణా బోర్డు, ట్రిబ్యునళ్లు సహా అన్ని రకాల వేదికలపై బలమైన వాదనలు వినిపించాలన్నారు. బోర్డు సమావేశంలో సాధికారిక సమాచారంతో సమర్థంగా వాదనలు వినిపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, మాజీ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో సీనియర్ న్యాయవాది రవీందర్రావు, ఇంటర్ స్టేట్ విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కోటేశ్వర్రావు పాల్గొన్నారు. -
కృష్ణా జలాల పంపకాలపై కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ
-
కృష్ణా జలాల పంపకాలపై కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ
విజయవాడ: కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తప్పు పట్టింది. ఈ విషయంపై కేఆర్ఎంబీకి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ లేఖ రాసింది. కృష్ణా ట్రిబ్యునల్ గతంలోనే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపిందని ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల పైన ఇంకా ట్రిబ్యునల్ దగ్గర విచారణ జరుగుతోందని తెలిపింది. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రతిపాదించిన 50:50 ఫార్ములా సమంజసం కాదని పేర్కొంది. వాస్తవానికి ఏపీకి 70 శాతం తెలంగాణకి 30శాతం కేటాయింపులు జరపాల్సి ఉందని, ఈ ఏడాది నీటి కేటాయింపులు ఈ ప్రాతిపదికనే చేపట్టాలని సూచించింది. అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నీటి వినియోగం చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది. చదవండి: అసభ్య వీడియోల కేసులో ముగ్గురి అరెస్టు -
కేఆర్ఎంబీ కి ఏ పీఈఎన్ సి మరోసారి లేఖ
-
కేంద్ర గెజిట్ నోటిఫికేషన్‌పైనే ప్రధాన చర్చ
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గత నెల 15వ తేదీన జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపైనే బోర్డు సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 27న కృష్ణా బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సోమవారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే లేఖ రాశారు. సమావేశంలో కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడం, క్యారీ ఓవర్, వరద జలాల వినియోగం, కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు తదితర పది అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీ చేస్తూ జూన్ 19, 2015న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీని ప్రకారమే నాటి నుంచి 2020–21 వరకూ రెండు రాష్ట్రాలకు బోర్డు కృష్ణా జలాలను పంపిణీ చేస్తోంది. అయితే ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలని ఇటీవల తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. నాడు కేంద్రం నిర్ణయానికి ఒప్పుకుని ఇప్పుడు ఇలా చేయడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుపడుతోంది. అంతర్రాష్ట్ర నదీ జలవివాదాల చట్టం–1956లో సెక్షన్–6(2) ప్రకారం.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని పేర్కొంటోంది. ఈ అంశంపై బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించింది. బోర్డు సంస్థాగత నిర్మాణంపై కసరత్తు కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గత నెల 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు నిర్వహించిన సమావేశాలకు తెలంగాణ సర్కార్ డుమ్మా కొట్టింది. ఏపీ ప్రభుత్వం తన ప్రతినిధులను పంపి.. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు సహకరిస్తామని పేర్కొంది. తెలంగాణ గైర్హాజరైన నేపథ్యంలో బోర్డు పరిధి, స్వరూపం ఖరారు ప్రక్రియ అసంపూర్తిగా ఉంది. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ అమలుపై బోర్డు సమావేశంలో ప్రధానంగా చర్చించాలని కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ నిర్ణయించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈలోగా బోర్డు సంస్థాగత నిర్మాణాన్ని ఖరారు చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు షెడ్యూల్–2లోని ప్రాజెక్టులను బోర్డు తన అధీనంలోకి తీసుకుని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల్లోని 12 ప్రాజెక్టులు, వాటిలోని 66 విభాగాలను బోర్డు తన అధీనంలోకి తీసుకుని, నిర్వహించడంపై దృష్టి పెట్టింది. గెజిట్ నోటిఫికేషన్ వెలువడే నాటికి ఈ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అవుట్‌సోరి్సంగ్ ఉద్యోగుల వివరాలను తక్షణమే అందజేయాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సోమవారం లేఖ రాసింది. ఈ ప్రాజెక్టులను నిర్వహిస్తోన్న సంస్థల వివరాలను అందజేయాలని కోరింది. రెండు రాష్ట్రాలు ఇచ్చే వివరాల ఆధారంగా సంస్థాగత నిర్మాణాన్ని బోర్డు ఖరారు చేయనుంది. ఏపీ వాదనకే సీడబ్ల్యూసీ మద్దతు ఒక నీటి సంవత్సరంలో వాడుకోని కోటా జలాలను ఆ తర్వాత నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ చేస్తున్న వాదనను ఏపీ సర్కార్ కొట్టిపారేస్తోంది. వాటిని క్యారీ ఓవర్ జలాలుగానే పరిగణించాలని.. వాటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సైతం ఏపీ వాదననే బలపరిచింది. బోర్డు సమావేశంలో చర్చించి.. ఏకాభిప్రాయంతో క్యారీ ఓవర్ జలాలను రెండు రాష్ట్రాలు పంచుకోవాలని సూచించింది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద జలాలు సముద్రంలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు ఎవరు ఎన్ని నీళ్లు మళ్లించుకున్నా.. వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని ఏపీ సర్కార్ కోరుతోంది. కానీ.. దీన్ని తెలంగాణ సర్కార్ వ్యతిరేకిస్తోంది. ఈ అంశాన్ని కూడా బోర్డు అజెండాలో చేర్చింది. అలాగే కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో అదనంగా వాటా కేటాయింపు అంశం కూడా అజెండాలో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా విద్యుదుత్పత్తి చేయడం, బోర్డుకు నిధులు మంజూరు, ఖాళీలను భర్తీ చేయడంపై కూడా సమావేశంలో చర్చించనుంది. -
‘గెజిట్ నోటిఫికేషన్‌తో కేఆర్ఎంబీ సమర్థవంతంగా పనిచేసే అవకాశం’
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లలో జల విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పలు దఫాలుగా జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిందని జల శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కేఆర్ఎంబీకి ఇండెంట్ పెట్టకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లలో తెలంగాణ ఏకపక్షంగా జల విద్యుత్ ఉత్పాదన చేస్తున్నట్లుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ గత జూలై 5న జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలంటూ గత జూన్ 17న లేఖ ద్వారా తెలంగాణ జన్‌కోను ఆదేశించింది. జల విద్యుత్ ఉత్ప్తత్తి కోసం నీటి వినియోగంపై కేఆర్ఎంబీ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు విద్యుత్ ఉత్పాదన చేయవద్దని ఆ లేఖలో సూచించినట్లు తెలిపారు. అయినప్పటికీ శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్‌తోపాటు నాగార్జున సాగర్ డామ్, పులిచింతల ప్రాజెక్ట్‌ల నుంచి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పాదనను కొనసాగిస్తూనే ఉన్నందున దీనిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ జూలై 15న కేఆర్ఎంబీ తెలంగాణ జెన్కో అధికారులను ఆదేశించిందని చెప్పారు. జల విద్యుత్ ఉత్పాదన కోసం వినియోగించే నీరు సాగు, తాగు నీటి అవసరాలకు మాత్రమే వినియోగించడానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించినందున కేవలం జల విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగించడం తగదని కూడా కేఆర్ఎంబీ స్పష్టం చేసినట్లు మంత్రి చెప్పారు. కేఆర్ఎంబీ రాసిన లేఖలపై తెలంగాణ జెన్కో (హైడల్) డైరెక్టర్ జూలై 16న ప్రత్యుత్తరమిస్తూ జల విద్యుత్ ఉత్పాదన చేయాలని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే తాము విద్యుత్ ఉత్పాదన చేస్తున్నట్లు కేఆర్ఎంబీకి తెలిపారని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పాదన కోసం నీటిని వినియోగించేందుకు కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసే వరకు శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్, నాగార్జున సాగర్ డామ్, పులిచింతల ప్రాజెక్ట్‌లలో విద్యుత్ ఉత్పాదన కోసం నీటి విడుదలను నిలిపివేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా కేఆర్ఎంబీ జూలై 16న రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. అయినప్పటికీ కేఆర్ఎంబీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేఆర్ఎంబీకి కల్పించిన అధికారాలను సద్వినియోగం చేసే దిశగా కేఆర్ఎంబీ పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. దీని వలన బోర్డు మరింత సమర్ధవంతంగా పని చేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలుకు సహకరిస్తాం: శ్యామలరావు
సాక్షి, హైదరాబాద్: జలసౌధలో సోమవారం కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం జరిగింది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలుపై చర్చించారు. ఈ సమావేశానికి ఏపీ ఇరిగేషన్ అధికారులు హాజరు కాగా.. తెలంగాణ అధికారులు మరోసారి గైర్హాజరయ్యారు. జలసౌధలో నిర్వహించిన సమావేశంలో ఏపీ అధికారులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామలరావు మాట్లాడుతూ.. ‘‘నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నాం. కేఆర్ఎమ్బీ, జీఆర్ఎమ్బీ బోర్డు సమావేశంలో అధికారుల నియామకం.. సదుపాయాల కల్పనపై చర్చించాం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గెజిట్‌లో మార్పులు కోరుతున్నాం. షెడ్యూల్ 1,2,3లో మార్పులు చేయాలని కోరుతున్నాం..అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలుకు సహకరిస్తాం’’ అన్నారు. -
9న భేటీకి హాజరుకాలేం.. కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ లేఖ
సాక్షి, హైదరాబాద్: కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 9న ఏర్పాటు చేసిన కృష్ణా, గోదావరి పూర్తి స్థాయి బోర్డుల భేటీకి తాము హాజరుకాలేమని తెలంగాణ తెలిపింది. ఈ మేరకు రెండు బోర్డులకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ గురువారం లేఖ రాశారు. 9న సుప్రీంకోర్టులో, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో కేసుల విచారణ ఉన్న దృ ష్ట్యా బోర్డుల అత్యవసర భేటీలకు తాము రాలేమని పేర్కొన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీని సంప్రదించి మరో తేదీని నిర్ణయించాలని కోరారు. 9న అత్యవసర భేటీపై గోదావరి బోర్డు బుధవారమే లేఖ రాయగా, ఇదే తేదీన తామూ అత్యవసర భేటీని నిర్వహిస్తామంటూ గురువారం కృష్ణా బోర్డు లేఖ రాసింది. ఈ లేఖలపై స్పందిస్తూ ఈఎన్సీ రెండు బోర్డులకు ప్రత్యుత్తరం రాశారు. ఆ ఇంజనీర్‌ను వద్దనడం అనైతికం తెలంగాణకు చెందిన సీడబ్ల్యూసీ ఇంజనీర్ దేవేంద్రరావును రాయలసీమ ప్రా జెక్టు సందర్శన కమిటీలో ఉండొద్దనడాన్ని తెలంగాణ తప్పుపట్టింది. ఏపీ అభ్యంతరం అనైతికం, దురదృష్టకరమని పేర్కొంది. అదేమీ ఏకసభ్య కమిటీ కాదని, బోర్డు.. సీడబ్ల్యూసీ ఇంజనీర్లు ఉన్న కమిటీలోని అందరి సభ్యుల అభిప్రాయాల మేరకే నివేదిక ఉంటుందని తెలిపింది. సీడబ్ల్యూసీ అధికారికి ఉద్దేశాలను ఆపాదించడం సరికాదని పేర్కొంది. గతంలో పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల పరిశీలనకు కమిటీలు నియమించినప్పుడు, అందులో సభ్యుడిగా ఉన్న కేజీబీఓ సీఈ శ్రీనివాస్‌పై తెలంగాణ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని గుర్తు చేసింది. దీని దృష్ట్యా ఆ అధికారి పర్యటనను కొన సాగించేలా, ఎన్జీటీకి నివేదించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎన్టీటీ కార్యకలాపాలను వాయిదా వేసేలా ఏపీ చేస్తున్న పన్నాగాలపై తెలంగాణ తీవ్ర నిరసన తెలియజేస్తున్నట్టు లేఖలో పేర్కొంది. -
ఆ 37 ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాలను వినియోగిస్తూ నిర్మిస్తున్న, నిర్మించ తలపెట్టిన మొత్తం 37 ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ స్పెషల్ సీఎస్‌కు లేఖ రాసింది. డీపీఆర్‌లు సమర్పించాలని ఇప్పటికే కోరినా రాష్ట్రం ఇంతవరకు స్పందించలేదని గుర్తు చేసింది. బోర్డు, కేంద్ర జల సంఘం అనుమతి ఇవ్వకుండా, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టరాదని గతంలో లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేసింది. ఏపీ ఫిర్యాదు నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రెండు వేర్వేరు లేఖ ల్లో బోర్డును కోరింది. ఇప్పటికే ఆరింటిని పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తోందని ఫిర్యాదు చేసింది. ఏపీ ఫిర్యాదు చేసిన ప్రాజెక్టుల్లో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల వంటి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అలాగే కొత్తగా చేపడతామని ప్రకటించిన జోగుళాంబ బ్యారేజీ, భీమాపై వరద కాల్వ, కల్వకుర్తి పరిధిలో రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, పులిచింతల పరిధిలో ఎత్తిపోతలు, సాగర్ టెయిల్‌పాండ్‌లో ఎత్తిపోతల పథకాలు కూడా ఉన్నాయి. కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాల పరిధిలో 13 ఎత్తిపోతల పథకాలను చేపట్టేలా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు కూడా ఏపీ తెలిపింది. ఏపీ లేఖల నేపథ్యంలో స్పందించిన బోర్డు తాజాగా తెలంగాణకు లేఖ రాసింది. కాగా, శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామంటూ ఏపీ చేసిన విజ్ఞప్తిపై అభిప్రాయం తెలియజేయాలని, మరో లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు కోరింది. రేపటి నుంచి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ఢిల్లీ వెళ్లిన అంతర్రాష్ట్ర జలవిభాగపు ఇంజనీర్లు సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీజలాల పంపకాల కోసం ఏర్పాటైన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ బుధవారం తిరిగి మొదలు కానుంది. ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఘన్‌శ్యామ్ ఝాకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది పలు ప్రశ్నలు సంధించనున్నారు. గత మార్చిలో జరిగిన విచారణ సందర్భంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు, కేసీ కెనాల్‌కు సంబంధించిన పలు అంశాలపై ఏపీ తరపు సీనియర్ న్యాయవాది వెంకటరమణి ప్రశ్నలు లేవనెత్తగా తెలంగాణ తరఫు సాక్షి సమాధానమిచ్చారు. ప్రస్తుత విచారణలో ఇవే అంశాలపై క్రాస్ ఎగ్జామిన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవిభాగపు ఇంజనీర్లు సోమవారమే ఢిల్లీ వెళ్లారు. వాదనలపై తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్‌తో వారు చర్చించనున్నారు. -
విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వండి
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు నిండటానికి మరో 99 టీఎంసీలే అవసరమని, ఎగువ నుంచి 150 టీఎంసీల వరద జలాలు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయడానికి అనుమతి ఇవ్వాలని కృష్ణాబోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గేట్లు ఎత్తేసి వరదను దిగువకు విడుదల చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని పేర్కొంది. విభజన చట్టం ప్రకారం వరద ముప్పును ఎదుర్కోవాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయడం వల్ల వరద ముప్పును తప్పించవచ్చని తెలిపింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఆదివారం లేఖ రాశారు. ఆ లేఖలోని ప్రధానాంశాలు.. ► ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి శ్రీశైలం ప్రాజెక్టులో 4,05,724 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 36,059 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 863.4 అడుగుల్లో 116.92 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ► కృష్ణా వరద ఉద్ధృతి వల్ల ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాల గేట్లు ఎత్తేశారు. ఎగువ నుంచి 3, 4 రోజులపాటు రోజుకు 4 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద శ్రీశైలానికి వస్తుందని సీడబ్ల్యూసీ సమాచారం ఇచ్చింది. ► మూడు నాలుగు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు 150 టీఎంసీల ప్రవాహం చేరుతుందని ఆ ప్రాజెక్టు సీఈ లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండటానికి మరో 99 టీఎంసీలే అవసరం. ప్రాజెక్టు ఆపరేషనల్ ప్రొటోకాల్స్ ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎక్కువ వరద వచ్చినప్పుడు మిగులు జలాలను విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేయాలి. విభజన చట్టం 11వ షెడ్యూల్లో సెక్షన్–85(7) ఈ ప్రకారం వరద ముప్పును తప్పించాల్సిన బాధ్యత 2 రాష్ట్రాలపై ఉంటుంది. కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయడానికి అనుమతివ్వండి. -
నోటిఫికేషన్ ఏపీ హక్కులను కాపాడుతుంది: శ్యామలరావు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడుతుందన్నారు ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు. అయితే నోటిఫికేషన్లో కొన్ని తప్పిదాలున్నాయని.. వాటిని సరిచేయమని కేంద్రాన్ని కోరతామన్నారు. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని ఏపీలోనే ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని శ్యామలరావు గుర్తు చేశారు. ఏపీలోని కొన్ని ప్రాజెక్ట్‌లను బోర్డు పరిధిలోకి తీసుకురావడం అనవసరం అన్నారు శ్యామలరావు. ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని విడుదల చేశాక.. ఎలా వినియోగించుకోవాలనేది దిగువ రాష్ట్రంగా ఏపీకున్న హక్కన్నారు శ్యామలరావు. దిగువనున్న ఏపీలో ప్రాజెక్ట్‌లు, కాల్వలు బోర్డు పర్యవేక్షణలో ఉంటే పంటలు దెబ్బతింటాయని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల అంశం చాలా సున్నితమైనదని.. దాన్ని నోటిఫై చేస్తే ఒక లాభం.. చేయకుంటే మరో లాభం అన్నారు శ్యామలరావు. -
జల వివాదాలకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో తరచూ రేగుతున్న జల వివాదాలకు చెక్‌పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లుగా ఎటూ తేలకుండా వాయిదా పడుతూ వస్తున్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం అర్ధరాత్రి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా బోర్డు సమర్ధవంతంగా పనిచేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బ్యాంక్ అకౌంట్లోకి 60 రోజుల్లోగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు చెరో రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలని సూచించింది. నోటిఫికేషన్ విడుదలతో కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సిబ్బంది అంతా బోర్డుల పరిధిలోకి వచ్చాయి. ప్రాజెక్టుల నీటి నిర్వహణతో పాటు భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షించనున్నాయి. ఈ నోటిఫికేషన్ జారీ చేసే నాటికి కేంద్రం ఆమోదించని ప్రాజెక్టుల పనులన్నింటిని ఇరు రాష్టాలు నిలిపివేయాలని పేర్కొంది. రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో నిర్ణయించిన మేరకు అనుమతులు లేని ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్‌కు పంపి 6 నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని సూచించింది. ఆరు నెలల్లో అనుమతి పొందకపోతే ఆ ప్రాజెక్టులను రద్దు చేసుకోవాలని, వాటి ద్వారా ఎలాంటి నీటిని తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం వివరించింది. బోర్డుల పరిధిపై కుదరని అభిప్రాయం.. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం.. బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే బోర్డులకు.. వాటి పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడంతో వీటికి ఎలాంటి అధికారాలు లేవు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నా బోర్డులు ఏమీ చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలో తమ పరిధిని ఖరారు చేసి ప్రాజెక్టులపై పెత్తనం ఇవ్వాలని బోర్డులు కోరాయి. దీనిపై తెలంగాణ, ఏపీ మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లో ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదని, ఈ అంశంపై ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోందని పేర్కొంది. విభజన చట్టం సెక్షన్–87 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేశాకనే బోర్డు పరిధిని నోటిఫై చేయాలని.. 2016, సెప్టెంబర్ 21న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ, 2020, అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. అయితే ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటి నుంచో కోరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమని చెబుతూ వచ్చింది. ఈ వైరుధ్యాలు ఉన్నా.. రెండో అపెక్స్ భేటీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బోర్డుల పరిధిని ఖరారు చేసే అధికారం తమకుందని స్పష్టం చేశారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిపై చర్చించి నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. గోదావరి.. బోర్డు పరిధిలోకి ఎందుకు... ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకోవడాన్ని తెలంగాణ తప్పుపడుతోంది. గోదావరి బేసిన్లో తెలంగాణ, ఏపీల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు లేవని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు లేక ఇరురాష్ట్రాల మధ్య సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్టులు లేనందున దీని పరిధిని ఖరారు చేయ రాదని గతంలో కేంద్రానికి లేఖలు రాసింది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 87 ప్రకారం గతంలో ఉన్న అవార్డులు, అంతర్రాష్ట్ర నదీ వివా దాల చట్టం–1956 మేరకు ఏర్పడ్డ ట్రిబ్యునల్ల తీర్పులకు లోబడి కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో ప్రాజెక్టులను బోర్డుల పరిధికి తీసుకోవడానికి సంబంధించి ఎలాంటి అంశాలు లేవని దృష్టికి తెచ్చింది. కొత్త మార్గదర్శకాలను తెలంగాణ, ఏపీలోని గోదావరి ప్రాజెక్టులపై రుద్దరాదని స్పష్టం చేసింది. అయినా దీని పరిధిపైనా గెజిట్ ఇచ్చేందుకే కేంద్రం మొగ్గు చూపింది. కృష్ణా బోర్డు పరిధిలో.. కృష్ణా బోర్డు పరిధి నోటిఫై కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ దాని పరిధిలోకి వెళ్లాయి. అందులో తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉన్న హెచ్ఎల్సీ(హైలెవల్ కెనాల్), ఎల్ఎల్సీ(లోలెవల్ కెనాల్), కేసీ కెనాల్, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాలపై ఆధారపడి ఉన్న విద్యుత్ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీశైలంపై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి, హంద్రీనీవా, ముచ్చు మర్రి, వెలిగొండ, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, శ్రీలైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలు, సాగర్‌పై ఆధారపడిన కుడి, ఎడమ కాల్వలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్పీ, హెచ్ఎండబ్ల్యూఎస్, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వచ్చాయి. అలాగే కాళేశ్వరం, దేవాదుల, నిజాంసాగర్, సింగూరు, ఎస్సారెస్పీ, లోయర్‌మానేరు, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీ, చింతలపూడి, పురుషోత్తపట్నం గోదావరి బోర్డు పరిధిలోకి వెళ్లాయి. ప్రధానికి రెండు దఫాలు సీఎం జగన్ లేఖలు బోర్డు పరిధి ఖరారైనందున కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం కనీస స్థాయి కంటే దిగువన ఉన్నప్పటికీ తెలంగాణ సర్కార్ అక్రమంగా ఎడమ గట్టు కేంద్రంలో జూన్ 1నే విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అయితే తెలంగాణ సర్కారు కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తిని చేపట్టింది. కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితిని సృష్టించి రాష్ట్ర హక్కులను కాలరాస్తున్న తెలంగాణ సర్కార్ తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండుదఫాలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌సింగ్ షెకావత్‌లకు లేఖలు రాశారు. గతేడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు అధీనంలోకి తేవాలని, వాటికి సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు ఇరు రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాలని కోరారు. కానీ.. తెలంగాణ సర్కార్ తీరులో మార్పు రాకపోవడంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసేలా కేంద్రానికి నిర్దేశం చేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రెండు బోర్డుల పరిధిని కేంద్రం ఖరారు చేసింది. -
ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి ఆపండి.. తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల నుంచి తక్షణమే విద్యుదుత్పత్తి నిలిపివేయాలని తెలంగాణను కృష్ణా బోర్డు ఆదేశించింది. తెలంగాణ విద్యుదుత్పత్తితో తమ రాష్ట్ర తాగు, సాగు ప్రయోజ నాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఏపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్పందించిన బోర్డు గురువారం తెలంగాణకు లేఖ రాసింది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, నాగార్జునసాగర్ డ్యామ్, పులిచింతల ప్రాజెక్టుల్లో తదుపరి విద్యుదుత్పత్తి నిలిపివేయాలని తెలంగాణ జెన్కో అధికారులకు సూచించింది. ఆయా ప్రాజెక్టుల నుంచి సాగు, తాగు అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తామని ఇరు రాష్ట్రాలు అంగీకరించినందువల్ల బోర్డు ఆదేశాలను పాటించాలని తెలిపింది. అపెక్స్ ఆమోదం లేకుండా ముందుకెళ్లొద్దు.. అలాగే అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ఆర్డీఎస్ కుడికాల్వ పనులను కొనసాగించరాదని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన డీపీఆర్‌లు అందజేయాలని.. బోర్డు, కేంద్ర జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ముందుకెళ్లరాదని ఆదేశించిన విషయాన్ని దృష్టికి తెచ్చింది. ఈ మేరకు గురువారం బోర్డు ఏపీకి లేఖ రాసింది. ఇప్పటికే ఆర్డీఎస్ కుడి కాల్వ పనులపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు లేఖను దీంతో జత పరిచింది. ‘తెలంగాణ ప్రాజెక్టులను ఆపివేయించండి’ కేంద్ర సంస్థల నుంచి అనుమతులు తీసుకోకుండా తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులను ఆపివేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య కృష్ణా బోర్డుకు విన్నవించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌ను సంఘం అధ్యక్షుడు ఏవీ గోపాలకృష్ణరావు, ప్రధాన కార్యదర్శి పి.రామాంజనేయరాజు వినతిపత్రం అందజేశారు. -
కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా.. న్యాయం మావైపే..
-
కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా.. న్యాయం మావైపే..
అమరావతి: తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లపై కేంద్రం, కేఆర్ఎంబీ వద్ద వాదనలు వినిపిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేఆర్ఎంబీ మీటింగ్ వదిలి కేసీఆర్ ఢిల్లీ వెళ్తే ఏమవుతుంది? అని సజ్జల ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా... న్యాయం మావైపే ఉందని ఆయన అన్నారు. కేఆర్ఎంబీ మీటింగ్‌కు వచ్చి తెలంగాణ తమ వాదన వినిపిస్తే బాగుంటుందని ఆయన కోరారు. సమస్య ఇక్కడే పరిష్కారం అయ్యేది.. ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని అన్నారు. న్యాయబద్ధ హక్కు కోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని సజ్జల తెలిపారు. కేఆర్ఎంబీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్షించారు. తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లు కేఆర్ఎంబీకి కనిపించడం లేదా? అని నిలదీశారు. విద్యుత్ పేరుతో అక్రమంగా నీటిని వృథా చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ సగం వాటా అడగడం అసంబద్ధం అని ఆయన విమర్శించారు. విభజన జరిగినప్పుడే ఎవరి వాటా ఏంటనేది నిర్ణయించారని సజ్జల గుర్తు చేశారు. ఇక ఈ సమస్యంతా చంద్రబాబు వల్లే వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఆరోజు తెలంగాణ ప్రాజెక్ట్‌లపై మాట్లాడి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని అన్నారు. నాడు పారిపోయిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి సీఎంని విమర్శించడం అర్ధరహితమిని, కృష్ణా జలాల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. -
9న కేఆర్ఎంబీ భేటీ వద్దు
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహించబోయే త్రిసభ్య కమిటీ సమావేశాన్ని రద్దు చేయాలని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు. జూలై 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ఎజెండాలో తెలంగాణ రాష్ట్ర అంశాలను కూడా చేర్చాలని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ పథకం, సాగునీటి ప్రాజెక్టులలో నీటి ఎత్తిపోతలు, జల విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. విద్యుత్ ఉత్పత్తి ఆపాలని చెప్పే హక్కు కృష్ణా బోర్డుకు లేదని, జల విద్యుత్‌కు సంబంధించి ఇరు రాష్ట్రాల నడుమ ఎలాంటి ఒప్పందాల నిబంధనలు లేవని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి అంశంలో బోర్డు జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నదని, ఈ నేపథ్యంలో 51 శాతం ‘క్లీన్ ఎనర్జీ’ ఉత్పత్తి చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్న కేంద్రం మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇకపై కూడా వీటిని కొనసాగించాలని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో అయినా కొట్లాడుతామన్నారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏళ్లు కావస్తున్నా, తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటి వాటాను నిర్ధారించకపోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు 66ః34 నిష్పత్తిలో కొనసాగుతూ వస్తున్న కృష్ణా జలాల వినియోగం ఈ ఏడాది నుంచి 50ః50 నిష్పత్తిలో కొనసాగాలన్నారు. -
సామరస్య పరిష్కారానికి సీఎం జగన్ యత్నం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కేఆర్ఎంబీ చెప్పినా తెలంగాణ వినడం లేదని, అందుకే ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాయాల్సి వచ్చిందన్నారు. వివాదం పరిష్కారం కావాలని, సానుకూలంగా ఉండాలనే ఉద్దేశంతోనే కేంద్రానికి లేఖ రాయడం జరిగిందన్నారు. తాడేపల్లిలో శుక్రవారం తనను కలిసిన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సజ్జల సమాధానమిస్తూ.. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అనుమానంగా ఉందన్నారు. అవసరమైతే ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత, కేంద్రమే తీసుకోవాలని కోరతామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారన్నారు. జల వివాదం పరిష్కారం కావాలని, సానుకూల నిర్ణయం రావాలనే సీఎం జగన్ ప్రధాన మంత్రి, కేంద్ర జల శక్తి మంత్రికి లేఖలు రాశారని వివరించారు. కేసీఆర్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో!: రాయలసీమ నీటి విషయంలో పెద్దన్నగా తానే ముందుండి అన్యాయం జరగకుండా చూస్తానని గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రోత్సహించారని సజ్జల గుర్తు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకోవడమే రాయలసీమ ఎత్తిపోతల లక్ష్యం అని తెలిపారు. సీఎం జగన్ ఇప్పుడు చేస్తోన్న ప్రయత్నాన్ని గతంలో కేసీఆర్ అంగీకరించి ప్రోత్సహించారన్నారు. రాయలసీమ కష్టాలు తనకు తెలుసని సీఎం కేసీఆర్ అన్నారని చెప్పారు. పరస్పరం ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలన్న కేసీఆర్ ఈ రోజున ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదని సజ్జల వ్యాఖ్యానించారు. చట్టసభలు హుందాగా నడవాలన్నది సీఎం ఆకాంక్ష చట్టసభలు సమతుల్యత పాటిస్తూ, సభ హుందాతనాన్ని కాపాడుతూ నడవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటినుంచీ కోరుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున అధ్యక్షతన శుక్రవారం తాడేపల్లిలో శాసనమండలి ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యంకు ఆత్మీయ అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. శాసనమండలిని, రాజకీయాలను వేర్వేరుగా చూడాలన్నది సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. అందుకే రాజకీయాలకు అతీతంగా విఠపు బాలసుబ్రహ్మణ్యంను శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా సీఎం ఎంపిక చేశారని చెప్పారు. విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి విద్యాపరమైన ఆలోచనలు, విద్యారంగంలో సంస్కరణలు మొదలవడం సంతోషించదగిన పరిణామమని పేర్కొన్నారు. శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, డొక్కా మాణిక్యవరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, కత్తి నరసింహారెడ్డి, వెన్నపూస గోపాల్‌రెడ్డి, పోతుల సునీత, షేక్ సాబ్జి, మోషేన్‌రాజు, కరీమున్నీసా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కిలారి వెంకట రోశయ్య, మహ్మద్ ముస్తఫా, మద్దాళి గిరి మాట్లాడారు. -
తెలంగాణ సర్కార్‌కు పట్టని కేఆర్ఎంబీ ఆదేశాలు
-
తెలంగాణ సర్కార్‌కు పట్టని కేఆర్ఎంబీ ఆదేశాలు
సాక్షి, గుంటూరు: నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ తెలంగాణకు కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసిందని సాగర్ ఈఈ శ్రీహరి తెలిపారు. కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. ‘‘విద్యుత్ ఉత్పత్తి కోసం నాగార్జునసాగర్‌లో రోజుకు 30 వేల క్యూసెక్కులను టీఎస్ సర్కార్ వాడుకుంటోంది. ప్రాజెక్టులో నీరు నిండుగా ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. కానీ ఇప్పుడు ప్రాజెక్టులో తక్కువగా నీరు ఉన్నా తెలంగాణ అధికారులు విద్యుత్ పంపిణీ చేపట్టారని’’ ఆయన పేర్కొన్నారు. దీని వల్ల ప్రకాశం, గుంటూరు జిల్లాలో రైతులు ఇబ్బందులు పడతారని శ్రీహరి తెలిపారు. -
ఏపీ అభ్యంతరాలకు వివరణ ఇవ్వండి
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కేటాయింపులకు మించి తెలంగాణ నీటి వినియోగంపై కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) అభ్యంతరం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మే 31వ తేదీ వరకు 13.4 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ఏకపక్షంగా వినియోగించుకుందన్న ఏపీ అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటి వరకు సాగర్ నుంచి విడుదల చేసిన 9.9 టీఎంసీల నీటిని మొత్తం కేటాయింపుల నుంచి మినహాయించుకోవాలని తెలంగాణకు సూచించింది. వచ్చే సమావేశం నాటికి దీనికి సంబంధించిన వివరాలను సమర్పించాలని పేర్కొంది. ఈ నెల ఏడో తేదీలోగా కేఆర్ఎంబీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీకి కృష్ణా బోర్డు లేఖ రాసింది. ఏపీ కోటా నుంచి ఆ నీటిని మినహాయించాలి గత నీటి సంవత్సరంలో నాగార్జునసాగర్ కుడికాలువకు నీటిని విడుదల చేయవద్దని కోరినా ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మే 31 వరకు 13.4716 టీఎంసీలను అనవసరంగా విడుదల చేశారని, వాటిని ఏపీ కోటా నుంచి మినహాయించాలని కృష్ణాబోర్డుకు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. దీనిపై స్పందించిన బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే.. ఏపీ ఈఎన్సీ రాసిన లేఖలో పేర్కొన్న అంశాలపై అభిప్రాయం చెప్పాలంటూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయనకు లేఖ రాశారు. -
ఏపీ ఫిర్యాదుపై తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కేటాయింపులకు మించి నీటి వినియోగంపై కేఆర్ఎంబీ అభ్యంతరం తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖలో.. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మే 31వ తేదీ వరకు 13.4 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ఏకపక్షంగా వినియోగించుకుందని ఏపీ అభ్యంతరం తెలపింది. కాగా దీనికి వివరణ ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ ఆదేశించింది. అదే క్రమంలో తెలంగాణ కేటాయింపుల నుంచి విడుదల చేసిన నీటిని తగ్గించుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకు సాగర్ నుంచి విడుదల చేసిన 9.9 టీఎంసీల నీటిని మొత్తం కేటాయింపుల నుంచి మినహాయించుకోవాలని తెలంగాణకు కేఆర్ఎంబీ సూచించింది. ఈ నెల 7లోగా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. ఈ లోగా దీనికి సంబంధించిన వివరాలను సమర్పించాలని తెలంగాణను ఆదేశించింది. -
కేఆర్ఎంబీకి ఏపీ ఇరిగేషన్ శాఖ లేఖ.. తెలంగాణపై ఫిర్యాదు
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో కృష్ణా నదీ జలాలను వృధా చేయడంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ ఇరిగేషన్ శాఖ.. కృష్ణానది యాజమాన్య బోర్డుకు(కేఆర్ఎంబీ) లేఖ రాసింది. అనుమతులు లేకుండా పులిచింతల ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. ఏపీ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే, విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీరుతో కృష్ణా జలాలు సముద్రంలోకి పోతున్నాయని, ప్రస్తుతం పులిచింతలలో 18 టీఎంసీల నీరు మాత్రమే ఉందని పేర్కొంది. పులిచింతలలో 152 అడుగుల నీరు దాటినప్పుడే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) నారాయణరెడ్డి లేఖలో ప్రస్తావించారు. -
కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే నోటిఫై చేయండి
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిని తక్షణమే నోటిఫై చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చవద్దని స్పష్టం చేసింది. పరిధిని నోటిఫై చేయకపోతే కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడంలోనూ.. నియంత్రించడంలోనూ బోర్డు సాధికారికంగా విధులు నిర్వర్తించలేదని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు శుక్రవారం లేఖ రాశారు. ‘బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేయాలని గతేడాది అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరారు. బోర్డు పరిధిని నోటిఫై చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. అనుమతులు లేకుండానే తెలంగాణ సర్కార్ అక్రమంగా 5 ప్రాజెక్టులు చేపట్టింది. 3 ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచింది. దీనిపై కృష్ణా బోర్డుకు, కేంద్ర జల్ శక్తి శాఖకు ఫిర్యాదు చేశాం. ఆ ప్రాజెక్టులను నిలిపివేయాలని తెలంగాణను కేంద్రం ఆదేశించింది. వాటి పనులు ఆపేలా చూడాలని కృష్ణా బోర్డును ఆదేశించింది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లతో కేంద్ర ఉన్నతాధికారుల సమావేశం కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను నిర్ణయించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ శుక్రవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. రెండు బోర్డుల చైర్మన్లు, కేంద్ర జల్ శక్తి శాఖ ఉన్నతాధికారులు వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. బోర్డుల పరిధి ఖరారుపై చర్చించారు. అయితే, ఈ సమావేశం వివరాలను ఉన్నతాధికారులు బయటకు వెల్లడించలేదు. -
రాయలసీమ లిఫ్ట్ టెండర్లను ఆపండి
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న రాయలసీమ లిఫ్ట్ స్కీం టెండర్ ప్రక్రియను అడ్డుకోవాలంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ని తెలంగాణ కోరింది. సోమవారం ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ హరికేశ్ మీనాకు లెటర్ రాశారు. ఏపీ ప్రభుత్వం మే 5న జారీ చేసిన జీవో 203పై కేఆర్ఎంబీకి అదే నెల 12న కంప్లైంట్ చేశామని, ఈ ప్రాజెక్టు టెండర్లుసహా ఎలాంటి ప్రక్రియ చేపట్టకుండా నిలుపుదల చేయాలని కోరామని గుర్తు చేశారు. సంగమేశ్వరం లిఫ్టుతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులను అడ్డుకోవాలని కోరామని తెలిపారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ముందుకే వెళ్తుందని, ఇప్పుడే నిలువరించాలని కోరింది. తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ అనుమతి వచ్చే వరకు సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు విషయంలో ముందుకెళ్లొద్దని కేఆర్ఎంబీ మే 20న ఏపీని ఆదేశించిందని గుర్తు చేశారు. జూలై ఒకటిన ఏపీ తలపెట్టిన ప్రాజెక్టుల డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు (డీపీఆర్‌లు) ఇవ్వాలని కోరారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి వివరాలు ఇవ్వకుండానే ఈ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను చేపట్టిందన్నారు. ఎస్సార్బీసీ నంద్యాల సర్కిల్ ఎస్ఈ ఈనెల 15న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తే ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టుల పనులు మొదలు పెడుతుందని పేర్కొన్నారు. అదే జరిగితే కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. టెండర్ల ప్రక్రియను ఏపీ సర్కారు పూర్తి చేస్తే పనులు దక్కించుకున్న వర్క్ ఏజెన్సీల నుంచి లీగల్ ఇష్యూస్ తలెత్తుతాయని ఏపీ వాదించే అవకాశముందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన టెండర్ల ప్రక్రియను ఆపుతూ వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు వచ్చే వరకూ ప్రాజెక్టులు చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలని కోరారు. -
అవి ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులే..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తాము చేపట్టిన ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే పూర్తి చేశామని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలిపింది. శనివారం ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీకి లెటర్ రాశారు. గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్డీఎస్ రైట్ కెనాల్, వేదవతి రివర్ లిఫ్టు స్కీములు మాత్రమే రాష్ట్ర విభజన తర్వాత చేపట్టామని, వాటి డీపీఆర్‌లు ఇంకా సిద్ధం కాలేదని తెలిపింది. ఆ డీపీఆర్‌లు రెడీ అయ్యాక బోర్డుకు సమర్పిస్తామని పేర్కొంది. గురురాఘవేంద్ర, సిద్ధాపురం, శివభాష్యం లిఫ్ట్ స్కీములు, మున్నేరు స్కీం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్మాణం పూర్తయ్యాయని తెలిపారు. ముచ్చుమర్రి లిఫ్ట్ స్కీం సైతం రాష్ట్ర విభజనకు ముందే కంప్లీట్ చేశామని, అవేవీ కొత్త ప్రాజెక్టులు కానేకావని పేర్కొన్నారు. కేఆర్ఎంబీ 12వ మీటింగ్‌లో ఏపీ స్పెషల్ సీఎస్ ఆ ప్రాజెక్టులన్నీ విభజనకు ముందు చేపట్టినవేనని వివరించారన్నారు. వీటి డీపీఆర్‌ల విషయంలో ఇంకా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు ఆస్కారం లేదని, వాటిని కొత్త ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాలని తేల్చి చెప్పారు. డీపీఆర్‌లు రెడీ కాలేదు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తమ ప్రభుత్వం కొత్తగా గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్డీఎస్ రైట్ కెనాల్, వేదవతి (హగరి) నది లిఫ్ట్ స్కీములను మాత్రమే చేపట్టిందని తెలిపారు. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇంకా సిద్ధం కాలేదని, డీపీఆర్‌లు రెడీ అయ్యాక కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం కోసం బోర్డుకు సమర్పిస్తామని తెలిపారు. -
తెలంగాణకు 15..ఏపీకి 36 టీఎంసీలు
► ఇరు రాష్ట్రాలకు సెప్టెంబర్‌లో నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డు నిర్ణయం ► 12 టీఎంసీలను ఎడమ కాల్వ కింద ఖరీఫ్ అవసరాలకు వాడనున్న రాష్ట్రం ► మరో 3 టీఎంసీలు నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు... ► అక్టోబర్‌లో ఖరీఫ్‌కు 15, నవంబర్‌కు మరో 7 టీఎంసీలు కోరిన తెలంగాణ ► తర్వాతి సమావేశంలో ఈ కేటాయింపులపై నిర్ణయం హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో లభ్యతగా ఉన్న జలాలను ఇరు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేటాయించింది. సెప్టెంబర్ అవసరాలకుగాను తెలంగాణకు 15 టీఎంసీలు, ఏపీకి 36 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్రిసభ్య కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేస్తూ శనివారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. శుక్రవారం జరిగిన కృష్ణా బోర్డు పూర్తిస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శనివారం బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావులతో కూడిన త్రిసభ్య కమిటీ ఇక్కడి జలసౌధ కార్యాలయంలో సమావేశమైంది. ఈ భేటీలో మారోమారు ఇరు రాష్ట్రాలు తమ అవసరాలను బోర్డు ముందుంచాయి. వచ్చే మూడు నెలల వరకు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఖరీఫ్ కోసం 31 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 6 టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.1 టీఎంసీలు అవసరమవుతాయని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఇందులో తక్షణమే ఖరీఫ్ అవసరాలకు 12 టీఎంసీలు అవసరం కానుండగా అక్టోబర్‌లో 15 టీఎంసీల మేర అవసరం ఉంటుందని తెలిపింది. అలాగే నల్లగొండ, హైదరాబాద్ తాగునీటికి సెప్టెంబర్‌లో 3 టీఎంసీలు అవసరమవుతాయని విన్నవించింది. తెలంగాణ వినతులపై సానుకూలంగా స్పందించిన బోర్డు సెప్టెంబర్ అవసరాలకు 15 టీఎంసీలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అక్టోబర్‌లో అవసరమయ్యే 15 టీఎంసీలు, నవంబర్‌కు అవసరమయ్యే 7 టీఎంసీలపై తర్వాతి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొనగా ఇందుకు తెలంగాణ అంగీకరించింది. మరోవైపు సెప్టెంబర్ వరకే మొత్తంగా 47 టీఎంసీలు కేటాయించాలని ఏపీ కోరింది. ఇందులోసాగర్ కుడి కాల్వకు 10 టీఎంసీలు, ఎడమ కాల్వకు 4, కృష్ణా డెల్టాకు 12, గాలేరి-నగరికి 6, హంద్రీనీవాకు 5, తెలుగుగంగకు 5, చెన్నై తాగునీటి సరఫరాకు 5 టీఎంసీలు అవసరమవుతాయని బోర్డు దృష్టికి తెచ్చింది. అయితే ఒకే నెలలో ఆ స్థాయిలో నీటి కేటాయింపు చేయాలేమన్న బోర్డు... మొత్తంగా 36 టీఎంసీలు కేటాయించేందుకు అంగీకరించింది. ఈ నీటిలో కృష్ణా డెల్టాకు 10 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వకు 10, ఎడమ కాల్వకు 2, హంద్రీనీవాకు 4, శ్రీశైలం కుడి కాల్వ, తెలుగుగంగ, చెన్నై తాగునీటికి కలిపి 10 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. -
కుదరని ఏకాభిప్రాయం!
హైదరాబాద్: కృష్ణా నదీజలాలు, విద్యుత్ ఉత్పత్తి అంశాలపై తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సుదీర్ఘంగా మూడు గంటలపాటు జరిగిన కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి(కెఆర్ఎంబి-కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం ముగిసింది. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టంపై ఇరు ప్రాంతాల అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలని ఏపీ అధికారులు పట్టుబట్టారు.834 అడుగులే ఉండాలని తెలంగాణ అధికారుల వాదన. విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తామని తెలంగాణ అధికారులు చెప్పారు. ఆపాల్సిందేనని ఏపీ అధికారులు వాదించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై కూడా వాదోపవాదాలు జరిగాయి. విద్యుత్ ఉత్పత్తి కోసం 3వ తేదీ వరకు 3 టీఎంసీల నీటిని వాడుకోవాలని బోర్డు సూచించింది. అందుకు తెలంగాణ అధికారులు అంగీకరించారు. పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ అధికారులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కెఆర్ఎంబి చైర్మన్ ఎస్కేజీ పండిత్, గోదావరి నదీజలాల నిర్వహణ మండలి చైర్మన్ అగర్వాల్, తెలంగాణ, ఏపి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, సానుకూల వాతావరణంలో సమావేశం జరిగినట్లు కెఆర్ఎంబి సభ్య కార్యదర్శి ఆర్కే గుప్త చెప్పారు. నదీజలాల వివాదాలకు సంబంధించి సాంకేతిక అంశాలపై క్షుణ్ణంగా చర్చించినట్లు తెలిపారు. సమావేశం వివరాలతో పూర్తి ప్రకటన రేపు విడుదల చేస్తామని చెప్పారు. ** -
నీటి యుద్ధం మొదలు!
హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం మొదలైంది. కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి(కెఆర్ఎంబి-కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం వాడివేడిగా జరుగుతోంది. శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని ఏపి అధికారులు పట్టుబడుతున్నారు. 834 అడుగులే ఉండాలని తెలంగాణ అధికారులు వాదిస్తున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీటి విడుదల ఆపాలని కూడా తెలంగాణ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశానికి కెఆర్ఎంబి చైర్మన్ ఎస్కేజీ పండిత్, గోదావరి నదీజలాల నిర్వహణ మండలి చైర్మన్ అగర్వాల్, తెలంగాణ, ఏపి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో అజెండాలోని 9 అంశాలపై చర్చిస్తున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తిపైన, బోర్డు అధికారులకు కార్యాలయాల కేటాయింపు, పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలపై కూడా చర్చిస్తారు. ** -
కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి సమావేశం
హైదరాబాద్: కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి(కెఆర్ఎంబి-కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కెఆర్ఎంబి చైర్మన్ ఎస్కేజీ పండిత్, గోదావరి నదీజలాల నిర్వహణ మండలి చైర్మన్ అగర్వాల్, తెలంగాణ, ఏపి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో అజెండాలోని 9 అంశాలపై చర్చిస్తారు. కృష్ణా జలాల వినియోగం, శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తిపై ప్రధానంగా చర్చిస్తారు. బోర్డు అధికారులకు కార్యాలయాల కేటాయింపు, పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలపై కూడా చర్చిస్తారు. **