
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు పూర్తి స్థాయి భేటీ జరగనున్న సెప్టెంబర్ ఒకటినే కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్‌పై మరోమారు తెలుగు రాష్ట్రాలతో చర్చించాలని కృష్ణా, గోదావరి బోర్డులు నిర్ణయించాయి. ఈ మేరకు రెండు బోర్డులు విడివిడిగా తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాశాయి. కృష్ణా బోర్డు భేటీ 1వ తేదీ ఉదయం 11 గంటలకు జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తూ గోదావరి బోర్డు గురువారం ఉదయం తెలంగాణ, ఏపీలకు లేఖలు రాసింది.
గెజిట్‌లోని బోర్డులకు నిధుల విడుదల, ప్రాజెక్టుల వివరాల సమర్పణ, సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై చర్చించేలా ఎజెండా ఖరారు చేసింది. మరోవైపు గురువారం సాయంత్రం కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. గెజిట్‌పై చర్చించేందుకు గోదావరి బోర్డు భేటీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, అదే భేటీలో కృష్ణా బేసిన్‌కు నంబంధించిన అంశాలపైనా చర్చిద్దామని ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment