IPL 2025: బోణీ కొట్టిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌.. | IPL 2025: Chennai super kings vs Rajasthan royals live updates and highlights | Sakshi
Sakshi News home page

IPL 2025: బోణీ కొట్టిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌..

Published Sun, Mar 30 2025 7:06 PM | Last Updated on Sun, Mar 30 2025 11:32 PM

IPL 2025: Chennai super kings vs Rajasthan royals live updates and highlights

CSK vs RR live updates and highlights: ఐపీఎల్‌-2025లో భాగంగా గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి.

బోణీ కొట్టిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌..
ఐపీఎల్‌-2025లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ బోణీ కొట్టింది. గౌహ‌తి వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 ప‌రుగుల తేడాతో రాజ‌స్తాన్ విజ‌యం సాధించింది. 183 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 176 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌(63) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ర‌వీంద్ర జ‌డేజా(32) ప‌ర్వాలేద‌న్పించాడు.

రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో వ‌నిందు హ‌స‌రంగా నాలుగు వికెట్ల‌తో చెల‌రేగ‌గా.. ఆర్చ‌ర్, సందీప్ శ‌ర్మ‌ ఓ వికెట్ సాధించారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన‌ రాజ‌స్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది. రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 81) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అత‌డితో పాటు కెప్టెన్ రియాన్ ప‌రాగ్‌(37), శాంస‌న్‌(20) ప‌రుగుల‌తో రాణించారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ఖాలీల్ అహ్మ‌ద్‌, ప‌తిరాన, నూర్ ఆహ్మ‌ద్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. జ‌డేజా, అశ్విన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

సీఎస్‌కే ఐదో వికెట్ డౌన్‌.. గైక్వాడ్ ఔట్‌
రుతురాజ్‌ గైక్వాడ్‌(63) రూపంలో సీఎస్‌కే ఐదో వికెట్‌ కోల్పోయింది. హసరంగా బౌలింగ్‌లో గైక్వాడ్‌ ఔటయ్యాడు. 16 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 129/5

సీఎస్‌కే నాలుగో వికెట్ డౌన్.. శంక‌ర్ ఔట్‌
92 ప‌రుగుల వ‌ద్ద సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 9 ప‌రుగులు చేసిన విజ‌య్ శంక‌ర్.. హ‌స‌రంగా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే నాలుగు వికెట్లు కోల్పోయి 111 ప‌రుగులు చేసింది. క్రీజులో జ‌డేజా(8), గైక్వాడ్(55) ఉన్నారు.

సీఎస్‌కే మూడో వికెట్ డౌన్‌..
ఇంపాక్ట్ ప్లేయ‌ర్ శివ‌మ్ దూబే రూపంలో సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది.18 ప‌రుగులు చేసిన దూబే.. హ‌స‌రంగా బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

సీఎస్‌కే  రెండో వికెట్ డౌన్‌..
రాహుల్ త్రిపాఠి రూపంలో సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 23 ప‌రుగులు చేసిన త్రిపాఠి.. హ‌స‌రంగా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే రెండు వికెట్లు కోల్పోయి 62 ప‌రుగులు చేసింది. క్రీజులో దూబే(8), గైక్వాడ్ ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న రుతురాజ్‌..
6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే వికెట్ న‌ష్టానికి 40 ప‌రుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌(20), రాహుల్ త్రిపాఠి(21) ఉన్నారు.

సీఎస్‌కే తొలి వికెట్ డౌన్‌.. ర‌వీంద్ర ఔట్‌
183 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ర‌చిన్ ర‌వీంద్ర‌.. ఆర్చ‌ర్ బౌలింగ్‌లో ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. క్రీజులోకి రుతురాజ్ గైక్వాడ్ వ‌చ్చాడు.
నితీష్ రాణా సూప‌ర్ హాఫ్ సెంచ‌రీ.. సీఎస్‌కే టార్గెట్ ఎంతంటే?
గౌహ‌తి వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజ‌స్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది. రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 81) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అత‌డితో పాటు కెప్టెన్ రియాన్ ప‌రాగ్‌(37), శాంస‌న్‌(20) ప‌రుగుల‌తో రాణించారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ఖాలీల్ అహ్మ‌ద్‌, ప‌తిరాన, నూర్ ఆహ్మ‌ద్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. జ‌డేజా, అశ్విన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

రాజ‌స్తాన్ ఆరో వికెట్ డౌన్‌..
రియాన్ ప‌రాగ్ రూపంలో రాజ‌స్తాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 37 ప‌రుగులు చేసిన ప‌రాగ్‌.. ప‌తిరాన బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 18 ఓవ‌ర్ల‌కు రాజ‌స్తాన్ 6 వికెట్లు కోల్పోయి 166 ప‌రుగులు చేసింది.

రాజ‌స్తాన్ నాలుగో వికెట్ డౌన్‌.. జురెల్ ఔట్‌
ధ్రువ్ జురెల్ రూపంలో రాజ‌స్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 ప‌రుగులు చేసిన జురెల్‌.. నూర్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.
రాజ‌స్తాన్ మూడో వికెట్ డౌన్‌..
నితీష్ రాణా రూపంలో రాజ‌స్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడిన రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 81).. అశ్విన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 12 ఓవ‌ర్ల‌కు రాజ‌స్తాన్ స్కోర్‌: 129/3

రాజ‌స్తాన్ రెండో వికెట్ డౌన్‌.. శాంస‌న్ ఔట్‌
సంజూ శాంస‌న్ రూపంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 20 ప‌రుగులు చేసిన శాంస‌న్‌.. నూర్ ఆహ్మ‌ద్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి కెప్టెన్ ప‌రాగ్ వ‌చ్చాడు. 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్‌.. రెండు వికెట్ల న‌ష్టానికి 87 ప‌రుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(61), రియాన్ ప‌రాగ్‌(1) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న రాణా..
5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వికెట్ న‌ష్టానికి 64 ప‌రుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(44),  సంజూ శాంస‌న్‌(15) ఉన్నారు.

రాయ‌ల్స్ తొలి వికెట్ డౌన్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 4 ప‌రుగులు చేసిన య‌శ‌స్వి జైశ్వాల్‌.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. 

ఐపీఎల్‌-2025లో భాగంగా గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో  టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. సామ్ కుర్రాన్‌, దీప‌క్ హుడా స్ధానాల్లో ఓవ‌ర్ట‌న్‌, విజ‌య్ శంక‌ర్ వ‌చ్చారు. రాయ‌ల్స్ మాత్రం త‌మ తుది జ‌ట్టులో ఎటువంటి మార్పు చేయ‌లేదు.
తుది జ‌ట్లు
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), విజయ్ శంకర్, జామీ ఓవర్‌టన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్‌), నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్‌), ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement