గెజిట్‌ అమలుపై ముందుకే! | Ministry of Jal Shakti to Hold Meet With KRMB, GRMB Chiefs | Sakshi
Sakshi News home page

KRMB, GRMB: గెజిట్‌ అమలుపై ముందుకే!

Published Tue, Sep 14 2021 3:02 AM | Last Updated on Tue, Sep 14 2021 8:35 AM

Ministry of Jal Shakti to Hold Meet With KRMB, GRMB Chiefs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధిని నిర్దేశిస్తూ జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు దిశగా కేంద్ర జలశక్తి మరో అడుగు ముందుకేసింది. ఈనెల మొదటి వారంలో సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను కలసి నోటిఫికే షన్‌ను అక్టోబర్‌ 14 నుంచి కాకుండా కొంతకాలం వాయిదా వేయాలని కోరిన సంగతి తెలిసిందే. కాగా, గెజిట్‌ అమలు సాఫీగా సాగేలా ఆయా బోర్డు లకు జలశక్తి శాఖ చీఫ్‌ ఇంజనీర్ల స్థాయిలో ఇద్దరేసి ఉన్నతాధికారులను నియమించింది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలో మానవ వనరుల బలోపేతానికి, పరిధి విస్తృతమైన నేపథ్యంలో మెరుగైన రీతిలో బోర్డులు పనిచేసేందుకు సెంట్రల్‌ వాటర్‌ ఇంజ నీరింగ్‌ గ్రూప్‌ ‘ఎ’సర్వీసుకు చెందిన సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ ఆఫీసర్లను నలుగురిని నియ మిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.

సీడబ్ల్యూసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్‌ ఇంజనీర్‌గా ఉన్న డాక్టర్‌ ఎం.కె.సిన్హాను, సీడబ్ల్యూసీ యమునా బేసిన్‌ ఆర్గనైజేషన్‌లో చీఫ్‌ ఇంజనీర్‌గా ఉన్న జి.కె.అగ ర్వాల్‌ను గోదావరి నదీ యాజమాన్య బోర్డులో నియమించింది. అలాగే సీడబ్ల్యూసీ కావేరీ అండ్‌ సదరన్‌ రీజియన్‌ ఆర్గనైజేషన్‌ (కోయంబత్తూరు)లో చీఫ్‌ ఇంజనీర్‌గా ఉన్న టి.కె.శివరాజన్‌ను, సీడ బ్ల్యూసీ అప్పర్‌ గంగా బేసిన్‌ ఆర్గనైజేషన్‌(లక్నో)లో చీఫ్‌ ఇంజనీర్‌గా ఉన్న అనుపమ్‌ ప్రసాద్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో నియామకం చేపట్టింది. ఈ నలుగురు అధికారులు ఆయా బోర్డుల చైర్మన్‌కు తక్షణం రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గెజిట్‌ నోటిఫికేషన్‌లో పొందుపరిచిన ప్రాజెక్టుల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలని సూచిం చింది. ఈ నియామకాలు మూడు నెలల కాలానికి, లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు వర్తిస్తాయని పేర్కొంది. ఈ అధికారులు చీఫ్‌ ఇంజనీర్ల స్థాయిలో పూర్తి అధికారాలతో ఫుల్‌ టైమ్‌ పనిచేస్తారని తెలిపింది. 

బోర్డుల చైర్మన్లతో జలశక్తి అదనపు కార్యదర్శి భేటీ
కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎం.పి.సింగ్, జీఆర్‌ఎంబీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీ సోమవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. గత శుక్రవారం జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. దానికి కొనసాగింపుగా సోమ వారం అదనపు కార్యదర్శి ఈ సమావేశం నిర్వహిం చారు. బోర్డుల పరిపాలన సంబంధిత అంశాలు, నోటిఫికేషన్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వాలు తెలిపిన అభ్యంతరాలు, గెజిట్‌ అమలులో ఉన్న ఇబ్బందులు, కావాలసిన మానవ వనరులు తదితర అంశాలపై చర్చించారు. సీడబ్ల్యూసీ చైర్మన్‌ ఎస్‌.కె.హల్దర్, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement