Central Water Resources Department
-
‘కృష్ణా’పై మళ్లీ కొట్లాట!
సాక్షి, హైదరాబాద్: నీటి పంపకాల జోలికి అపెక్స్ కౌన్సిల్ వెళ్లదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చిచెప్పడంతో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు అంశం మళ్లీ కృష్ణా బోర్డు ముందుకొచ్చిoది. దీంతో తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఇతర అంశాలపై చర్చించడానికి జనవరి 21న కృష్ణా బోర్డు భేటీ కానుంది. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలిక సర్దుబాటు పేరుతో జరిపిన కేటాయింపులు 2021–22 వరకు కొనసాగాయి. ఆ తర్వాతి నుంచి తెలంగాణ రాష్ట్రం ఆ కేటాయింపులను వ్యతిరేకిస్తోంది. 50:50 నిష్పత్తిలో తాత్కాలికంగా నీటి పంపిణీ జరపాలని కోరుతోంది. అయితే ఏపీ మాత్రం 66:34 నిష్పత్తిలోనే నీటి పంపిణీ కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది.ఎజెండాలో తెలంగాణ ప్రతిపాదనలివీ..» నాగార్జునసాగర్ నిర్వహణ, పర్యవేక్షణ, యాజమాన్యాన్ని అప్పగించాలి. ఆనకట్టల భద్రత చట్టం 2021 ప్రకారం సాగర్ నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకే వస్తాయి. రాష్ట్ర విభజన నాటి నుంచి సాగర్ డ్యామ్, కుడి, ఎడమ కాల్వల రెగ్యూలేటర్ల నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ చేతిలో ఉండగా 2023 నవంబర్ 28న ఏపీ అదీనంలోకి సగం డ్యామ్‌ను తీసుకోవడం సరికాదు. » తెలంగాణ వాడుకోకపోవడంతో సాగర్‌లో మిగిలిన తమ వాటా జలాలను తదుపరి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలి. » సాగర్ టెయిల్‌పాండ్ డ్యామ్ గేట్ల నిర్వహణను తెలంగాణకే అప్పగించాలి. ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణకు ఏపీ అడ్డుకోకుండా సహకరించాలి. » ఆర్డీఎస్ కుడికాల్వ పనులను ఏపీ చేపట్టరాదు. » ఏపీ నీటి వినియోగాన్ని కచ్చితంగా లెక్కించడానికి శ్రీశైలం, సాగర్, ప్రకాశం, సుంకేశుల బరాజ్‌ల వద్ద టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. » కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పు ప్రకారం తాగునీటికి తీసుకున్న జలాల్లో 20 శాతాన్నే లెక్కించాలి. » రాయలసీమ ఎత్తిపోతలు సహా అనుమతుల్లేకుండా కృష్ణా బేసిన్లో ఏపీ చేపడుతున్న ఇతర ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎంసీ కాల్వ లైనింగ్ పనులను నిలుపుదల చేయాలి. » శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, తెలుగు గంగ, హెచ్ఎన్ఎస్, నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ఇతర మార్గాల ద్వారా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏపీ తరలించకుండా నిలువరించాలి. » ఏపీ పరిధిలో శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్‌కు అత్యవసర మరమ్మతులు నిర్వహించాలి. ఏపీ ప్రతిపాదించిన అంశాలు..» శ్రీశైలం, సాగర్, ఇతర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే వరకు సాగర్ కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలి. » నీటి కేటాయింపుల్లేకుండా తెలంగాణ చేపట్టిన సుంకిశాల ఇన్‌టేక్ వెల్ నిర్మాణాన్ని అడ్డుకోవాలి. » పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను మాకు అందించాలి. » పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టా సిస్టమ్‌కు తరలించడానికి బదులుగా సాగర్ ఎగువన 80 టీఎంసీల కృష్ణా జలాలు వాడుకొనే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్ కల్పించింది. వాటిలో మిగిలిన ఉన్న 45 టీఎంసీలను తెలంగాణ పాలమూరు–రంగారెడ్డికి కేటాయించింది. ఆ జలాలపై తెలంగాణకు ఎలాంటి హక్కులు లేవు. » కల్వకుర్తి లిఫ్టు ద్వారా అదనంగా 15 టీఎంసీల తరలింపు పనులకు గెజిట్ నోటిఫికేషన్లో అనుమతుల నుంచి మినహాయింపు కల్పించడం సరికాదు.» అనుమతులు లేకుండా తెలంగాణ చేపట్టిన అచ్చంపేట, నారాయణపేట – కొడంగల్ లిఫ్టు పనులను అడ్డుకోవాలి. -
సురక్షిత మంచినీటి సరఫరాలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే టాప్‌లో నిలిచింది. గ్రామీణ ప్రజలు తాగే నీటికి ఏటా కనీసం రెండు విడతల పాటు నాణ్యత పరీక్షలు నిర్వహించడం.. కలుషితాలు గుర్తించినట్లయితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత నీటి సౌకర్యాల కల్పన–ప్రజల భాగస్వామ్యం తదితర కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 2 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సురక్షిత తాగునీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యల ఆధారంగా రాష్ట్రాలకు మార్కులు కేటాయించింది. మొత్తం 700కు గాను తమిళనాడు 699.93 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా, ఏపీ 657.10 మార్కులతో రెండో స్థానం సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మధ్యప్రదేశ్ ఉన్నాయి. అట్టడుగు స్థానాల్లో రాజస్థాన్, బిహార్, పశ్చిమ బెంగాల్ నిలిచాయి. ఏపీలో 99.7 శాతం గ్రామాల్లో.. ప్రజలు తాగునీటికి ఉపయోగించే బోర్లు, బావులు, ఇతర వనరులలో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 99.7 శాతం గ్రామాల్లోని నీటిలో బ్యాక్టీరియా, కెమికల్ సంబంధిత కలుషితాలను ప్రాథమికంగా గుర్తించడానికి కిట్లను అందుబాటులో ఉంచడంతో పాటు వాటి నిర్వహణపైనా గ్రామంలో ఒకరికి శిక్షణ ఇచ్చినట్టు కేంద్ర గణాంకాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 18,357 గ్రామాలకు గాను 18,302 గ్రామాల్లో ప్రభుత్వం వర్షాకాలం ముందు, ఆ తర్వాత రెండు సార్లు తాగునీటి నాణ్యత పరీక్షలు జరిపిందని కేంద్రం వివరించింది. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే తాగునీటి వనరుల్లో కూడా 97 శాతానికి పైగా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించినట్టు కేంద్రం పేర్కొంది. కలుషితాలను గుర్తించిన చోట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడే ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టిందని కేంద్రం పేర్కొంది. ఏపీలో 25,546 వనరుల్లో కలుషిత నీటిని గుర్తించగా.. 25,545 చోట్ల ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిందని వివరించింది. -
2017–18 ధరల ప్రకారమే పోలవరానికి నిధులివ్వాలి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లు కేంద్రం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్’ ఇవ్వాలని కోరుతూ కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదన పంపాలని మరోసారి కోరింది. గతేడాది జరిగిన సమావేశంలోనే ఈమేరకు కేంద్రానికి ప్రతిపాదన పంపడానికి పీపీఏ అంగీకరించిన విషయాన్ని గుర్తు చేసింది. తక్షణమే ఆ ప్రతిపాదన పంపి.. నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు నిధులిస్తేనే ప్రాజెక్టు పూర్తిచేయడం సాధ్యమవుతుందనే అంశాన్ని కేంద్రానికి గట్టిగా చెప్పాలని విజ్ఞప్తి చేసింది. ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరం ప్రాజెక్టుకూ నీటిపారుదల, సరఫరా వ్యయాలను ఒకటిగానే పరిగణించి, నిధులివ్వాలని కేంద్రానికి ప్రతిపాదన పంపాలని కోరింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇదే అంశంపై కేంద్రానికి ఇప్పటికే నివేదికలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో రూ.2,100 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయడం ద్వారా ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనలకు పీపీఏ సీఈవో జె.చంద్రశేఖర్ అయ్యర్ సానుకూలంగా స్పందించారు. గడువులోగా పూర్తికి ప్రణాళిక పీపీఏ బుధవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. పీపీఏ సీఈవోతో పాటు సభ్య కార్యదర్శి ఎస్కే శ్రీనివాస్, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. ప్రణాళిక మేరకు పనులు జరుగుతుండటంపై పీపీఏ సంతృప్తి వ్యక్తం చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఉన్న నీటిని తోడివేసి, డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్), సీడబ్ల్యూసీ సిఫార్సుల మేరకు డయాఫ్రమ్ వాల్‌ను మరింత పటిష్టం చేస్తామని, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పనులు 2022లోగా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. గడువులోగా పనులు పూర్తి చేయడానికి రోజుకు, నెలకు ఎంత పరిమాణంలో పనులు చేయాలన్నది తేల్చేందుకు ప్రత్యేక కమిటీ వేస్తామని, ఆ కమిటీ నివేదిక మేరకు పనులు చేపట్టాలని చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. నిర్వాసితుల పునరావాసం, భూసేకరణకే రూ.30 వేల కోట్లు అవసరమని, ఈ నేపథ్యంలో 2017–18 ధరల ప్రకారం నిధులిస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యమవుతుందని అధికారులు తేల్చిచెప్పారు. దీనిపై తాము వెలిబుచ్చిన సందేహాలను నెలాఖరులోగా నివృత్తి చేస్తే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామన్న పీపీఏ సీఈవో సూచనకు రాష్ట్ర అధికారులు అంగీకరించారు. పీపీఏ సీఈవో పదవీకాలం పొడిగింపు సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)గా అదనపు బాధ్యత నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్ అయ్యర్ పదవీకాలాన్ని కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. కేంద్ర జలవనరుల శాఖ ప్రతిపాదనను కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చంద్రశేఖర్ అయ్యర్ ప్రస్తుత పదవీ కాలపరిమితి ఈ నెల 27తో ముగియనుంది. నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూస్తే.. ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని సీఈవో ప్రశ్నించారు. డిస్ట్రిబ్యూటరీల పనులకు ఇప్పటికే సర్వే పూర్తి చేశామని, టెండర్లు పిలిచి పనులు చేపడతామని అధికారులు వివరించారు. నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూస్తే గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పీపీఏ ప్రధాన కార్యాలయాన్ని తక్షణమే రాజమహేంద్రవరానికి తరలించాలని, ఇక్కడ ఉంటే ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించవచ్చని, ఇది గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి దోహదం చేస్తుందని అధికారులు చెప్పారు. ఈ సూచనకు పీపీఏ సానుకూలంగా స్పందించింది. -
గెజిట్ అమలుపై ముందుకే!
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) పరిధిని నిర్దేశిస్తూ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా కేంద్ర జలశక్తి మరో అడుగు ముందుకేసింది. ఈనెల మొదటి వారంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలసి నోటిఫికే షన్ను అక్టోబర్ 14 నుంచి కాకుండా కొంతకాలం వాయిదా వేయాలని కోరిన సంగతి తెలిసిందే. కాగా, గెజిట్ అమలు సాఫీగా సాగేలా ఆయా బోర్డు లకు జలశక్తి శాఖ చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో ఇద్దరేసి ఉన్నతాధికారులను నియమించింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలో మానవ వనరుల బలోపేతానికి, పరిధి విస్తృతమైన నేపథ్యంలో మెరుగైన రీతిలో బోర్డులు పనిచేసేందుకు సెంట్రల్ వాటర్ ఇంజ నీరింగ్ గ్రూప్ ‘ఎ’సర్వీసుకు చెందిన సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ ఆఫీసర్లను నలుగురిని నియ మిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. సీడబ్ల్యూసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న డాక్టర్ ఎం.కె.సిన్హాను, సీడబ్ల్యూసీ యమునా బేసిన్ ఆర్గనైజేషన్‌లో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న జి.కె.అగ ర్వాల్‌ను గోదావరి నదీ యాజమాన్య బోర్డులో నియమించింది. అలాగే సీడబ్ల్యూసీ కావేరీ అండ్ సదరన్ రీజియన్ ఆర్గనైజేషన్ (కోయంబత్తూరు)లో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న టి.కె.శివరాజన్‌ను, సీడ బ్ల్యూసీ అప్పర్ గంగా బేసిన్ ఆర్గనైజేషన్(లక్నో)లో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న అనుపమ్ ప్రసాద్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో నియామకం చేపట్టింది. ఈ నలుగురు అధికారులు ఆయా బోర్డుల చైర్మన్‌కు తక్షణం రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచిన ప్రాజెక్టుల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలని సూచిం చింది. ఈ నియామకాలు మూడు నెలల కాలానికి, లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు వర్తిస్తాయని పేర్కొంది. ఈ అధికారులు చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో పూర్తి అధికారాలతో ఫుల్ టైమ్ పనిచేస్తారని తెలిపింది. బోర్డుల చైర్మన్లతో జలశక్తి అదనపు కార్యదర్శి భేటీ కేఆర్ఎంబీ చైర్మన్ ఎం.పి.సింగ్, జీఆర్ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీ సోమవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. గత శుక్రవారం జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. దానికి కొనసాగింపుగా సోమ వారం అదనపు కార్యదర్శి ఈ సమావేశం నిర్వహిం చారు. బోర్డుల పరిపాలన సంబంధిత అంశాలు, నోటిఫికేషన్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాలు తెలిపిన అభ్యంతరాలు, గెజిట్ అమలులో ఉన్న ఇబ్బందులు, కావాలసిన మానవ వనరులు తదితర అంశాలపై చర్చించారు. సీడబ్ల్యూసీ చైర్మన్ ఎస్.కె.హల్దర్, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
కృష్ణా బోర్డే సుప్రీం..
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ రూపొందించిన నివేదికను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆమోదించారు. దాంతో.. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి కేంద్ర జల్ శక్తి శాఖకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఈనెల 15న వెలువడే అవకాశం ఉంది. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉత్పన్నం కాకుండా చూసేందుకు విభజన చట్టం సెక్షన్–85 (1) ప్రకారం 2014లో బోర్డును ఏర్పాటు చేసిన కేంద్రం.. ఇప్పటిదాకా పరిధిని నోటిఫై చేయలేదు. బోర్డు పరిధిని ఖరారు చేస్తూ రూపొందించిన నివేదికను నాలుగు నెలల క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు కేంద్ర జల్ శక్తి శాఖ పంపింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజ్‌కుమార్ బళ్లా ఆదేశాల మేరకు గురువారం బోర్డు చైర్మన్ పరమేశం, సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి కేంద్ర హోం శాఖ, జల్ శక్తి శాఖల కార్యదర్శులు అజయ్‌కుమార్ బళ్లా, పంకజ్‌కుమార్ బోర్డు చైర్మన్, సభ్య కార్యదర్శి, సభ్యులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సమావేశమయ్యారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఇచ్చిన నివేదికను సమీక్షించిన అమిత్‌షా.. బోర్డు పరిధిని నోటిఫై చేసేందుకు ఆమోదం తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు పెత్తనమంతా బోర్డుదే..! కృష్ణా బోర్డు పరిధిని కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫై చేసిన వెంటనే దిగువ కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ దాని అజమాయిషీ కిందకు వస్తాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల స్పిల్ వేలతోపాటు జల విద్యుత్ కేంద్రాలు, కాలువలకు నీరు విడుదల చేసే ఇన్లెట్లు, ఎత్తిపోతల పథకాల పంప్ హౌస్‌లు, తాగు నీటి పథకాలు, జల విద్యుదుత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాజెక్టుల వద్ద పని చేస్తున్న ఇరు రాష్ట్రాల జల వనరుల శాఖ అధికారులు బోర్డు పర్యవేక్షణలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నీటి సంవత్సరం ప్రారంభంలో బోర్డు సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తారు. మరో ఆరు నెలల తర్వాత బోర్డు సభ్య సమావేశాన్ని నిర్వహిస్తారు. నీటి లభ్యత ఆధారంగా.. బోర్డు త్రిసభ్య కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై వాటా మేరకు ఇరు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తుంది. త్రిసభ్య కమిటీ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు బోర్డు రెండు రాష్ట్రాలకు నీటిని విడుదల చేస్తుంది. దీని వల్ల ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉత్పన్నమయ్యే అవకాశమే ఉండదని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు.. కృష్ణా పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మ్యాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడం వల్ల బోర్డుకు ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయి. దాంతో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచుగా ఉత్పన్నమవుతున్నాయి. నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు సరపడా ఉన్నప్పటికీ, కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ యథేచ్ఛగా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తుండటమే అందుకు నిదర్శనం. దీని వల్ల శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల బోర్డు కేటాయింపులు ఉన్నా సరే.. రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంటోంది. అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో ఇదే అంశాన్ని ఎత్తిచూపిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల పరిష్కార న్యాయస్థానం)–2 తీర్పును నోటిఫై చేసే వరకు బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వాదనను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ తోసిపుచ్చారు. అపెక్స్ కౌన్సిల్‌కు ఉన్న విచక్షణాధికారాలతో బోర్డు పరిధిని నోటిఫై చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు నివేదిక కూడా పంపారు. 512:299 టీఎంసీల నిష్పత్తిలో పంపిణీ ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 812 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డును కేంద్రం నోటిఫై చేసేదాకా ఇదే నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా మరోసారి స్పష్టం చేశారు. -
ఎండిన గొంతులు తడిపేందుకే..
సాక్షి, అమరావతి: దుర్భిక్ష రాయలసీమలో ఎండిన గొంతులు తడిపేందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని వివరిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మా వాటా నీళ్లను వాడుకోవడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని.. ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని మాత్రమే వినియోగించుకుంటామని స్పష్టంచేయాలని దిశానిర్దేశం చేశారు. కృష్ణా, గోదావరిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల మీద రెండు రాష్ట్రాలు ఆయా బోర్డులకు ఇటీవల పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో ఈనెల 4న కృష్ణా బోర్డు.. 5న గోదావరి బోర్డు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాలను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాల్సిన ఆవశ్యకతను సమగ్రంగా వివరిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రికి లేఖ రాయాలని సీఎం వారిని ఆదేశించారు. లేఖలో పొందుపర్చాలంటూ ముఖ్యమంత్రి సూచించిన ముఖ్యాంశాలు ఇవీ.. ► ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు కర్ణాటక పెంచుతుండటంవల్ల అదనంగా దాదాపు 100 టీఎంసీల మేర నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత జాప్యం జరుగుతుంది. ► విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కృష్ణాపై చేపట్టిన కొత్త ప్రాజెక్టులు. ► కృష్ణాకు వరద రోజులు తగ్గాయి. అలాగే, ఒకేసారి భారీగా వరద వస్తున్న అంశం. ► శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 881 అడుగుల్లో ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుత డిజైన్ ప్రకారం పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించే అవకాశం ఉంది. కానీ, ఆ స్థాయిలో నీటి మట్టం పది రోజులు కూడా ఉండదు. ► నీటి మట్టం 854 అడుగులు ఉంటే కేవలం ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా వాడుకునే అవకాశం ఉండదు. ► అందుకే 800 అడుగుల నుంచి నీటిని తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం. ► కానీ, శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తోంది. 796 అడుగుల నుంచి ఎడమగట్టు విద్యదుత్పత్తి కేంద్రం ద్వారా 42 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం తెలంగాణకు ఉంది. ► తెలంగాణ సర్కార్ శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి నీటిని తరలిస్తున్నప్పుడు.. అదే స్థాయి నీటి మట్టం నుంచి, రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన నీటిని తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల చేపడితే తప్పెలా అవుతుంది. ► ఈ ప్రాజెక్టువల్ల తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదు. ► అలాగే, రాయలసీమ ఎత్తిపోతలవల్ల పర్యావరణానికీ ఎలాంటి హాని కలగదు. మన వాటా నీటిని వినియోగించుకోవడానికే ఈ ప్రాజెక్టు చేపట్టాం. ► ఈ అంశాన్ని వివరిస్తూ ఎన్జీటీ (జాతీయ హరిత న్యాయస్థానం)లో పిటిషన్ దాఖలు చేయాలి. అంతేకాక.. కేంద్ర జల్‌శక్తి శాఖ, ఎన్జీటీలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని.. రాయలసీమ ఎత్తిపోతల పనులకు టెండర్లు పిలిచి శరవేగంగా రాయలసీమ ప్రజల తాగునీటి కష్టాలను కడతేర్చాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
నేడు పోలవరానికి కేంద్ర నిపుణుల కమిటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను హెచ్‌కే హల్దార్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ శనివారం నుంచి మూడు రోజులపాటు పరిశీలించనుంది. ఢిల్లీ నుంచి శుక్రవారం రాత్రి విశాఖపట్నం చేరుకోనున్న కమిటీ శనివారం ఎడమ కాలువ పనులను పరిశీలించి, రాజమహేంద్రవరానికి చేరుకుంటుంది. ఆదివారం పోలవరం హెడ్‌వర్క్స్‌ను(జలాశయం పనులు) పరిశీలించనుంది. సోమవారం(ఈ నెల 30న) కుడి కాలువ పనులను పరిశీలించి.. మధ్యాహ్నం విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలు, సమీక్షా సమావేశంలో వెల్లడైన విషయాల ఆధారంగా.. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు జనవరి 2న నివేదిక ఇవ్వనుంది. నిపుణుల కమిటీని పునర్వ్యవస్థీకరించిన కేంద్రం ప్రస్తుత సీజన్లో కాఫర్ డ్యామ్‌తోపాటు స్పిల్‌వే, స్పిల్ చానల్ పనులను పూర్తి చేయడం, 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను కేంద్ర నిపుణుల కమిటీకి వివరించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఏపీ సర్కారుకు అప్పగించాక.. మూడు నెలలకోసారి పనులను పరిశీలించి, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చేందుకు అప్పటి సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్ అధ్యక్షతన నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. మసూద్ హుస్సేన్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నిపుణుల కమిటీ చైర్మన్‌గా వైకే శర్మను నియమించింది. ఇటీవల ఆయన పదవీ విరమణ చేయడంతో నిపుణుల కమిటీని కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. సీడబ్ల్యూసీ సభ్యులు హెచ్‌కే హల్దార్ అధ్యక్షతన సీడబ్ల్యూసీ పీపీవో సీఈ ఆర్కే పచౌరీ కన్వీనర్‌గా నిపుణుల కమిటీలో సీఎస్‌ఆర్‌ఎంఎస్ డైరెక్టర్ ఎస్ఎల్ గుప్తా, కృష్ణా గోదావరి బేసిన్ విభాగం సీఈ డి.రంగారెడ్డి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యకార్యదర్శి బీపీ పాండే, ఎన్‌హెచ్‌పీసీ మాజీ డైరెక్టర్ డీపీ భార్గవ, జాతీయ ప్రాజెక్టుల విభాగం డైరెక్టర్ భూపేందర్‌సింగ్, డిప్యూటీ డైరెక్టర్ నాగేంద్రకుమార్, సీడబ్ల్యూసీ(హైదరాబాద్) డైరెక్టర్ దేవేంద్రకుమార్‌ను సభ్యులుగా నియమించింది. -
2021 నాటికి పోలవరం పూర్తిచేయడమే లక్ష్యం
-
పోలవరం.. ఇక శరవేగం!
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం పోలవరం హెడ్ వర్క్స్ (జలాశయం) చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌బాబుకు కుడి, ఎడమ కాలువల పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లో సభ్యునిగా కూడా సుధాకర్‌బాబును నియమించారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్–ఇన్–చీఫ్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నీటిపారుదల విభాగం ఇంజనీర్–ఇన్–చీఫ్ ఎం.వెంకటేశ్వరరావును అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. కాగా, పోలవరం.. నీటిపారుదల విభాగం ఈఎన్సీ పదవులను ఒకరే నిర్వహిస్తుండటంవల్ల పనిభారం పెరిగి ప్రాజెక్టు పనులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా ఇంజనీర్–ఇన్–చీఫ్‌ను నియమించాలంటూ జూలై 11, 2017న కేంద్ర జలవనరుల శాఖ అప్పటి కార్యదర్శి అమర్జీత్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై కేంద్రం, పీపీఏ కూడా లేఖలు రాసినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంట్రాక్టర్‌కు దాసోహం.. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లో ట్రాన్స్ట్రాయ్పై వేటువేసి మిగిలిన రూ.2,914 కోట్ల విలువైన పనులను ఫిబ్రవరి 27, 2018 నుంచి మూడు విడతల్లో నవయుగ సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పటి టీడీపీ సర్కార్ అప్పగించింది. కాంట్రాక్టు సంస్థ ఒత్తిడి మేరకు పోలవరం హెడ్ వర్క్స్ బాధ్యతల నుంచి మే 16, 2018న పోలవరం ఈఎన్సీని నాటి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ఆ సంస్థ సూచించిన వి. శ్రీధర్‌ను పోలవరం హెడ్ వర్క్స్ సీఈగా నియమించింది. ఆయనకే పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యత పరిశీలించే క్వాలిటీ కంట్రోల్ విభాగం సీఈ బాధ్యతలనూ అదనంగా అప్పగించింది. పనులు పర్యవేక్షిస్తున్న సీఈకే వాటి నాణ్యతను నిర్ధారించే బాధ్యత అప్పగించడమంటే దొంగకు ఇంటి తాళం ఇచ్చినట్లు అవుతుందని అప్పట్లో అధికార వర్గాలు గగ్గోలు పెట్టినా టీడీపీ సర్కార్ వెనక్కు తగ్గలేదు. ఫలితంగా పోలవరం హెడ్ వర్క్స్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. దిద్దుబాటు చేపట్టిన కొత్త సర్కార్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే రెండేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్య పరిష్కారానికి, జలవనరుల శాఖ ప్రక్షాళనకు నడుం బిగించారు. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు కొత్త ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీచేసింది. పోలవరం పనుల పర్యవేక్షణ, పీపీఏతో సమన్వయం, కేంద్ర జలవనరుల శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పోలవరం ఈఎన్సీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నీటిపారుదల విభాగం ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావును వాటి నుంచి తప్పించింది. పోలవరం ప్రాజెక్టు బాధ్యతలను ప్రస్తుతం హెడ్ వర్క్స్‌ను పర్యవేక్షిస్తున్న సీఈ సుధాకర్‌బాబుకే పూర్తిగా అప్పగించింది. దీంతో నీటిపారుదల విభాగం ఈఎన్సీకి అదనపు భారం లేకపోవడంవల్ల ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
పోలవరానికి రూ.3,000 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,000 కోట్లు విడుదల చేయడానికి కేంద్ర జల వనరుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘నాబార్డు’ ద్వారా ఈ నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. మరో రూ.1,810.04 కోట్ల మంజూరుపై కసరత్తు చేస్తోంది. నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను(యూసీలు) ఎప్పటికప్పుడు పంపిస్తే, ప్రాజెక్టుకు వ్యయం చేసిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. గత ఏడాది జూలై 26న పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల వనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. 2014 ఏప్రిల్ 1వ తేదీకి ముందు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులపై ఆడిట్ చేయించి, ఆడిటెడ్ స్టేట్మెంట్ పంపితే నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. కానీ, 2014 ఏప్రిల్ 1వ తేదీకి ముందు చేసిన వ్యయంపై ఆడిట్ చేయించడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. 2014 ఏప్రిల్ 1కి ముందు సేకరించిన భూములను, ఆ తర్వాత అంటే 2014 ఏప్రిల్ 1 తర్వాత సేకరించినట్లు చూపి భారీ ఎత్తున ప్రజాధనాన్ని కాజేయడం వల్లే ఆడిట్ చేయించడానికి అప్పటి ప్రభుత్వ పెద్దలు అంగీకరించలేదు. కేంద్ర జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) పదేపదే ఒత్తిడి తేవడంతో వ్యయానికి సంబంధించిన ఆడిట్ స్టేట్మెంట్ను మాత్రమే రాష్ట్ర జలవనరుల శాఖ కేంద్రానికి పంపింది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు 2014కు ముందు చేసిన వ్యయం రూ.1,397.19 కోట్లకు సంబంధించిన ఆడిట్ స్టేట్మెంట్ను పంపలేదు.. గత నెల 31న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఇదే అంశాన్ని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ లేవనెత్తారు. ఆడిట్ స్టేట్మెంట్ను పంపితేనే నిధులు విడుదల చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తేల్చిచెప్పారు. సీఎం వైఎస్ జగన్ సమీక్షతో కదలిక వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ నెల 3వ తేదీన సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై.. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. కేంద్రం గతేడాది జూలై 26 నుంచి నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని జలవనరుల శాఖ అధికారులను ప్రశ్నించారు. అధికారులు అసలు సంగతి బయటపెట్టడంతో కేంద్ర ప్రతిపాదన మేరకు తక్షణమే 2014 ఏప్రిల్ 1వ తేదీకి ముందు భూసేకరణ, సహాయ పునరావాస పనులకు చేసిన వ్యయంపై ఆడిట్ చేయించి, స్టేట్మెంట్ సిద్ధం చేసి పీపీఏ ద్వారా కేంద్ర జలవనరుల శాఖకు పంపాలని జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దాంతో భూసేకరణ లెక్కలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఇదే సమాచారాన్ని పీపీఏకు చేరవేశారు. దాంతో పోలవరానికి తక్షణం రూ.3,000 కోట్లు విడుదల చేయాలంటూ కేంద్ర జలవనరుల శాఖకు పీపీఏ ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ప్రతిపాదించారు. యూసీలు పంపితే నిధుల విడుదల - పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై రూ.5,135.87 కోట్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే సమయంలో.. 2014 ఏప్రిల్ 1 తర్వాత అంటే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని(జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం మినహాయించి) మాత్రమే రీయింబర్స్ చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. - పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటిదాకా రూ.16,673.17 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. 2014 ఏప్రిల్ 1కి ముందు రూ.5,135.87 కోట్లను వ్యయం చేసింది. 2014 ఏప్రిల్ 1 తర్వాత రూ.11,535.30 కోట్లు ఖర్చు చేసింది. - కేంద్రం పోలవరం ప్రాజెక్టు కోసం పీపీఏకు రూ.6,764.16 కోట్లు విడుదల చేసింది. (ఇందులో రూ.6,727.26 కోట్లను పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది) మిగతా రూ.4,810.04 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. - యూసీలు పంపితే నిధులు విడుదలకు ప్రతిపాదనలు పంపుతామని పీపీఏ పేర్కొంది. దాంతో ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్లకు సంబంధించిన యూసీలను పీపీఏ ద్వారా కేంద్రానికి పంపింది. - ఈ నెల 10న నిర్వహించిన డీడీఆర్పీ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు సంబంధించిన అంశంపై కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో చర్చించారు. యూసీలు పంపితే ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తామని కేంద్రం మరోసారి వెల్లడించింది. ఢిల్లీకి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను బుధవారం ఢిల్లీకి పంపారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జారీ చేసిన పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపివేత ఉత్తర్వుల సడలింపు గడువు జూలై 2తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పనుల నిలిపివేత ఉత్తర్వులను సడలించడం కాకుండా.. పూర్తిగా ఎత్తివేసేలా కేంద్ర అటవీ, పర్యావరణ, జలవనరుల శాఖ అధికారులతో చర్చించాలని ఆదిత్యనాథ్ దాస్‌కు సీఎం జగన్ సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేయాల్సిన నిధులతోపాటు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన(పీఎంకేఎస్‌వై) కింద రాష్ట్రానికి నిధులు విడుదల చేసే అంశంపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌తో గురువారం ఆదిత్యనాథ్ దాస్ చర్చించనున్నారు. -
బాబు నిర్లక్ష్యం..కర్ణాటకకు వరం
సాక్షి, అమరావతి: నదీ జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో టీడీపీ సర్కారు ఘోర వైఫల్యానికి ఇదో మచ్చుతునక. కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జలసంఘం ఆదేశాలను తుంగలో తొక్కుతూ చేపట్టిన మూడు ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి నీళ్లు వదిలేందుకు సిద్ధమైనా గుడ్లప్పగించి చూసిన చంద్రబాబు సర్కారు కనీసం అభ్యంతరం కూడా తెలపకపోవడంపై సాగునీటి రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు జలాల్లో వాటా ఆధారంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో అదనంగా 21 టీఎంసీలను వినియోగించుకునేలా తాము మూడు ప్రాజెక్టులు చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కు కర్ణాటక సర్కార్ ప్రతిపాదనలు పంపింది. వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను పరిశీలించిన సీడబ్ల్యూసీ 2016 నవంబర్ 30న అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ప్రాజెక్టుల పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది. కానీ సీడబ్ల్యూసీ మార్గదర్శకాలను బేఖాతర్ చేస్తూ ఆ మూడు ప్రాజెక్టులను చేపట్టిన కర్ణాటక సర్కార్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తోంది. ఈ సీజన్లోనే 2.85 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు కర్ణాటక సిద్ధమైంది. ప్రజాప్రయోజనాలా.. వ్యక్తిగత లబ్ధా? చంద్రబాబు సర్కారు తీరును అలుసుగా చేసుకున్న కర్ణాటక ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ తీర్పును సాకుగా చూపుతూ కృష్ణా జలాల్లో అదనంగా 21 టీఎంసీలను వినియోగించుకునేలా 2016లో షిగ్గాన్, సింగటలూరు, అప్పర్ భద్ర ప్రాజెక్టులను చేపట్టింది. అయితే ఆ మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించిన సీడబ్ల్యూసీ అందులో లోపాలను గుర్తించి అనుమతి నిరాకరించింది. కానీ కర్ణాటక సర్కార్ దీన్ని తుంగలో తొక్కుతూ మూడు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన చేపట్టి దాదాపుగా పనులను పూర్తి చేసింది. ఈ సీజన్లో 2.85 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా కర్ణాటక సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులు చేపడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం నోరు మెదపలేదు. 1996లో హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలో యూడీఎఫ్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలోనే కృష్ణా నదిపై కర్ణాటక ఆల్మట్టిని పూర్తి చేసింది. దేవెగౌడను తానే ప్రధానిగా చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అప్పట్లో ఆల్మట్టిని అడ్డుకోలేకపోయారు. తాజాగా ఆల్మట్టిని ఎత్తు పెంచుతున్నది దేవేగౌడ కుమారుడు కుమారస్వామి కావడం గమనార్హం. కుమారస్వామి సర్కార్‌కు చంద్రబాబు మద్దతు పలుకుతుండటం, దేవేగౌడతో కలసి ఎన్నికల ప్రచారం చేయటాన్ని బట్టి ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారన్నది స్పష్టమవుతోంది ఏపీలో కృష్ణా ఆయకట్టు ఎడారే.. షిగ్గాన్, సింగటలూరు, అప్పర్ భద్ర ప్రాజెక్టుల ద్వారా ఈ సీజన్ నుంచే కర్ణాటక ప్రభుత్వం కృష్ణా జలాలను ఆయకట్టుకు మళ్లించనుంది. ఆల్మట్టి ఎత్తు పెంచే పనులు శరవేగంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఎగువ నుంచి కృష్ణా వరద జలాలు రాష్ట్ర సరిహద్దుకు చేరడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోనుంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంలో నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. ఎగువ నుంచి రాష్ట్రానికి చుక్క కూడా నీరు చేరే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో కృష్ణా పరీవాహక ప్రాంతంలో సాగునీటి మాట దేవుడెరుగు తాగునీటికి కూడా ఇక్కట్లు తప్పవని సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాడూ, నేడూ చంద్రబాబు తీరు వల్లే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలిగిందని, ఈ పరిణామాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఆయకట్టు ఎడారిగా మారడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యానికి పరాకాష్ట.. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ 1980లో అనుమతి ఇచ్చింది. గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తున్న నేపథ్యంలో తమకు కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కర్ణాటక, మహారాష్ట్రలు అప్పట్లో కోరాయి. దీంతో కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్న 80 టీఎంసీల్లో 45 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 21 టీఎంసీలు కర్ణాటక, 14 టీఎంసీలు మహారాష్ట్ర కృష్ణా జలాలను అదనంగా వినియోగించుకునేలా గోదావరి ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించి ఇప్పటికి 39 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు తెలంగా>ణ సర్కార్ కూడా గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లించాయి. కర్ణాటక సర్కార్ కృష్ణా జలాలను కావేరి పరీవాహక ప్రాంతానికి మళ్లించింది. ఈ నేపథ్యంలో పోలవరం జలాలపై 1980లో గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చెల్లదని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఎగువ రాష్ట్రాలు ఒక నది నుంచి మరో నది పరీవాహక ప్రాంతానికి జలాలను మళ్లించిన నేపథ్యంలో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956 ప్రకారం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు తాజాగా గోదావరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి జలాలను పునఃపంపిణీ చేయాల్సిందిగా కోరాలని నాలుగేళ్లుగా సాగునీటి నిపుణులు, జలవనరుల శాఖ అధికారులు సూచిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. -
మళ్లింపు జలాలపై నిపుణుల కమిటీ?
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటా అంశాన్ని తేల్చేందుకు మళ్లీ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి కమిటీయే మార్గమని తేల్చింది. ఇదివరకే ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ కమిటీ ఏమీ తేల్చని నేపథ్యంలో కేంద్ర జల సంఘంలో పనిచేసిన రిటైర్డ్ ఇంజనీర్లు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన నిపుణులతో కమిటీని నియమించి దీనిపై నిర్దిష్ట సమయంలోనే నివేదిక ఇచ్చేలా చూడాలని నిర్ణయించినట్లు తెలిసింది. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు తరలిస్తున్న దృష్ట్యా, బచావత్ ట్రిబ్యునల్ అవార్డుల మేరకు కృష్ణాలో ఎగువన ఉన్న తెలంగాణ అదనపు నీటి వాటాను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. ఏకే బజాజ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ 2017 ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో పర్యటించిన కమిటీకి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరంల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 90 టీఎంసీల వాటాలో గరిష్టంగా తెలంగాణకు 73 టీఎంసీలు దక్కేలా చూడాలని రాష్ట్రం కోరింది. మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని కమిటీ చేతులెత్తేసింది. ఈ సమయంలోనే కమిటీ గడువు ముగియడంతో మరో ఆరు నెలలు పొడిగించారు. ఈ వ్యవధిలో రాష్ట్రంలో ఒక్క పర్యటన కూడా కమిటీ చేయలేదు. ఈ నేపథ్యంలో కమిటీ రద్దయిపోయింది. అప్పటి నుంచి ఈ అంశం మరుగునపడింది. అయితే ఇటీవల మళ్లీ ఈ అంశాన్ని తెలంగాణ తెరపైకి తేవడంతో కేంద్రం దీనిపై చర్చించేందుకు బుధవారం కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లను ఢిల్లీకి పిలిపించింది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమశక్తిభవన్లో జరిగిన ఈ భేటీకి కృష్ణాబోర్డు ఇన్చార్జి చైర్మన్, గోదావరి బోర్డు చైర్మన్ ఆర్కే జైన్, కృష్ణాబోర్డు సభ్యుడు హరికేశ్ మీనాలు హాజరయ్యారు. ఈ సమావేశంలో మళ్లింపు జలాలపై ఇరు రాష్ట్రాలు వెల్లడిస్తున్న అభిప్రాయాలపై చర్చించారు. దీనిపై తేల్చేందుకు నిపుణుల కమిటీని వేద్దామని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ప్రతిపాదించగా, బోర్డు చైర్మన్ అంగీకరించినట్లు తెలిసింది. దీంతో పాటే కృష్ణా, గోదావరి బోర్డుల వర్కింగ్ మాన్యువల్‌ను ఓకే చేసేలా రెండు రాష్ట్రాలను ఒప్పించాలని కేంద్రం బోర్డులకు సూచించినట్లుగా తెలిసింది. దీన్ని అంగీకరించాకే రెండు రాష్ట్రాల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చే అంశమై చర్చిద్దామని తెలిపినట్లుగా సమాచారం. ఇక కృష్ణా బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. -
మరో ‘గ్రేట్’ డ్రామా!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేలో 42, 43 పియర్ (కాంక్రీట్ స్తంభాలు) మధ్య 41వ గేటు స్కిన్ ప్లేట్ అమర్చే పనులను సోమవారం ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. కేవలం వీటిని అమర్చడంతోనే ప్రాజెక్టు పూర్తి చేసినట్లుగా, ఆయకట్టుకు నీళ్లిచ్చిన రీతిలో హోరెత్తించారు. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూలు వెలువడనున్న నేపథ్యంలో నాలుగున్నరేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంతోపాటు పోలవరంలో భారీ అక్రమాలు జరిగినట్లుగా కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఇటీవల రాజ్యసభలో అంగీకరించిన నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు తాజా డ్రామాకు తెరతీశారని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం! అక్రమాలను కప్పిపుచ్చేందుకు పలు కార్యక్రమాలు... విభజన చట్టం ప్రకారం పోలవరం ఖర్చు వంద శాతం భరించేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసేందుకు పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)తో ఎంవోయూ కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ పీపీఏతో ఒప్పందం కుదుర్చుకోకుండా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తమకే అప్పగించాలని సీఎం చంద్రబాబు పట్టుబట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను ఆయన తాకట్టు పెట్టడంతో.. 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. ఆ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాలకే చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ పోలవరాన్ని 2018 జూలై నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణ బాధ్యతలు దక్కించుకునేవరకూ పోలవరంలో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా మోకాలడ్డుతూ వచ్చిన ప్రభుత్వ పెద్దలు ఆ తర్వాత పనులన్నీ సబ్ కాంట్రాకర్లకు అప్పగించి కమీషన్ల వసూళ్లకు తెరతీశారు. ప్రాజెక్టులో అక్రమాలు, అంతులేని జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎప్పటికప్పుడు రియాలిటీ షోలకు తెరతీశారు. వాటిని ఒకసారి పరిశీలిస్తే... 2016 సెప్టెంబరు 12 ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్న తర్వాత ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని వర్చువల్ రివ్యూలు నిర్వహిస్తానని సీఎం ప్రకటించారు. మొదటి వర్చువల్ రివ్యూను ప్రారంభించడంతోనే ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నట్లు హడావుడి చేశారు. 2016 డిసెంబర్ 26 పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రూ.1,981.54 కోట్ల చెక్కును ఢిల్లీలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీ అందించారు. ఈ నిధులు అందడంతోనే ప్రాజెక్టు పూర్తయిందనే రీతిలో ఢిల్లీ వేదికగా చంద్రబాబు నాటకాన్ని రక్తి కట్టించారు. 2016 డిసెంబర్ 30 పోలవరం స్పిల్ వేలో కాంక్రీట్ పనులను ప్రారంభించారు. దీన్ని కాంక్రీట్ పండుగగా నామకరణం చేసిన చంద్రబాబు.. వీటితోనే పనులు పూర్తయ్యాయనే రీతిలో హంగామా చేశారు. 2017 ఫిబ్రవరి 1 ఏదైనా ప్రాజెక్టుకు ఒకసారి శంకుస్థాపన చేసి అంతా పూర్తయ్యాక జాతికి అంకితం చేయడం సాధారణం. కానీ సీఎం చంద్రబాబు పోలవరం గేట్ల తయారీ పనుల కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పునాది (డయాఫ్రమ్ వాల్) పనులకు పునాది రాయి వేశారు. 2017 జూన్ 8 పోలవరంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి గోదావరి ప్రవాహాన్ని మళ్లించడానికి వీలుగా చేపట్టే మట్టికట్ట(కాఫర్ డ్యామ్) పనులకు శంకుస్థాపన చేసి.. మట్టికట్టతోనే గ్రావిటీపై నీటిని అందిస్తానని సీఎం ప్రకటించారు. సాధారణంగా ప్రధాన ఆనకట్ట(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పనులు పూర్తయ్యాక కాఫర్ డ్యామ్‌ను కూల్చి వేస్తారు. 2018 జూన్ 11 ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పునాది (డయా ఫ్రమ్ వాల్)ని జాతికి అంకితం చేసి చంద్రబాబు నయా రికార్డు సృష్టించారు. పునాదిని జాతికి అంకితం చేయడంతోనే ప్రాజెక్టు పూర్తయిన రీతిలో ప్రచారం చేసుకున్నారు. 2018 సెప్టెంబరు 12 స్పిల్ వేలో గ్యాలరీ వాక్‌ను ప్రారంభించారు. ఇందుకోసం కుటుంబ సమేతంగా పోలవరానికి పిక్నిక్కు వెళ్లారు. గ్యాలరీ వాక్ ప్రారంభంతోనే ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయనే రీతిలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. 2018 డిసెంబర్ 24 స్పిల్ వేలో 41వ గేట్ స్కిన్ ప్లేట్ అమర్చే పనులను ప్రారంభించారు. దీన్ని ఓ రికార్డుగా అభివర్ణించుకుని ఇక పనులు మొత్తం పూర్తయ్యాయనే రీతిలో హంగామా చేశారు. సీఎం రివ్యూలు, పర్యటనలకు రూ.95 కోట్లకుపైగా ఖర్చు సీఎం చంద్రబాబు 2016 సెప్టెంబరు 12వతేదీ నుంచి ఇప్పటివరకూ 83 సార్లు పోలవరంపై వర్చువల్ రివ్యూలు నిర్వహించారు. 29 సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను సమీక్షించారు. ఈ రెండు కార్యక్రమాల కోసం రూ.95 కోట్లకు పైగా ఖర్చు కావడం గమనార్హం. -
అవినీతి లేని పోలవరమే లక్ష్యం
పోలవరం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పోలవరం ప్రాజెక్టు పనులను అవినీతి, అక్రమాలకు తావు లేకుండా.. సకాలంలో పూర్తి చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాదు.. భారతదేశానికే జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును రాజకీయం చేయడం తగదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరోక్షంగా చురకలంటించారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు సందేహాస్పదంగా ఉన్నాయని, వాటిని నివృత్తి చేస్తే నిధుల విడుదలకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పోలవరం జలాశయంలో ముంపునకు గురయ్యే భూమి విస్తీర్ణం 2013 నాటితో పోల్చితే ఇప్పుడు ఎందుకు రెట్టింపు అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనివల్లే భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయం రూ.30,000 కోట్లకు పైగా పెరిగిందని చెప్పారు. ముంపునకు గురయ్యే భూమి విస్తీర్ణం ఎందుకు పెరిగిందో వివరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పోలవరం.. ప్రతిష్టాత్మకం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నితిన్ గడ్కరీ బుధవారం రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి సాయంత్రం 4.45 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్లో చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న సీఎం చంద్రబాబుతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్పిల్ వే పనులను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని.. ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. బిల్లులు చెల్లించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. ఆ ప్రతిపాదనలు తప్పులతడక పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని గడ్కరీ ఏకిపారేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను తప్పులతడకగా అభివర్ణించారు. ‘‘ధరలు పెరిగిన నేపథ్యంలో పనుల అంచనా వ్యయం పెరగడంలో అర్థముంది. భూసేకరణ చట్టం–2013ను కేంద్రం అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో భూసేకరణ వ్యయం పెరగడం సహజమే. కానీ, ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే భూమి 2013తో పోల్చితే ఇప్పుడు రెట్టింపు అయ్యింది. ఎందుకు ఇలా చేశారని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. దీనివల్ల అంచనా వ్యయం రూ.30,000 కోట్లు పెరిగింది. దీనిపై కేంద్రానికి సందేహాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ఎనిమిది రోజుల్లోగా సందేహాలను నివృత్తి చేస్తే వాటిని ఆమోదించి.. కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించి నిధులు విడుదలయ్యేలా చూస్తానని తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి తదితర అధికారులను ఢిల్లీకి పంపితే.. మూడు రోజులపాటు సీడబ్ల్యూసీ అధికారులు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై చర్చిస్తారని.. సందేహాలు అక్కడికక్కడే నివృత్తి అవుతాయని సీఎం చంద్రబాబుకు సూచించారు. ద్విముఖ వ్యూహం పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నితిన్ గడ్కరీ ద్విముఖ వ్యూహాన్ని సూచించారు. తొలుత జలాశయం, కాలువల పనులు(సివిల్ వర్క్స్) పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనులకు అయ్యే వ్యయాన్ని కేంద్రం విడుదల చేస్తుందన్నారు. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీని రెండో భాగంగా చేపట్టాలన్నారు. గిరిజనులకు చెందిన భూములు సేకరించేటప్పుడు వారికే పరిహారం దక్కేలా చర్యలు తీసుకోవాలని.. సహాయ పునారావాస ప్యాకేజీలో భాగంగా గిరిజనులకు భూమికి బదులుగా అందించే భూమి సాగుకు యోగ్యమైనదిగా ఉండాలని పేర్కొన్నారు. గిరిజనులకు అన్ని సదుపాయాలతో కూడిన ఇళ్లు, ఉపాధి మార్గాలను చూపించాలన్నారు. నిర్వాసితులైన గిరిజనులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తేల్చిచెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోగా పూర్తి చేయండి పోలవరం ప్రాజెక్టు జలాశయం, కాలువ పనులను 2019 ఏప్రిల్‌లోగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిధులను సకాలంలో మంజూరు చేసేందుకు నితిన్ గడ్కరీ సహకరిస్తున్నారని, ఇకపై కూడా ఇదే రీతిలో సహకారం అందించాలని కోరారు. దీనిపై గడ్కరీ స్పందిస్తూ.. అప్పటికి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, దీనివల్ల ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు తాను రాలేనని చెప్పారు. 2019 ఫిబ్రవరి నాటికే పనులు పూర్తి చేయాలని సూచించారు. వచ్చే ఫిబ్రవరిలో మళ్లీ తాను పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వస్తానని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానిను ప్రథమ ప్రాధాన్యం ఇస్తానన్నారు. -
పెత్తనాన్ని సహించం!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణపై బోర్డుకే పెత్తనం ఇవ్వాలని కోరుతూ కృష్ణా బోర్డు కేంద్ర జల వనరుల శాఖకు పంపిన ముసాయిదా నోటిఫికేషన్‌పై తెలంగాణ గుర్రుగా ఉంది. ప్రాజెక్టులపై బోర్డు పెత్తనం అక్కర్లేదని ఇప్పటికే పలుమార్లు విన్నవించినా మళ్లీ పాత పాటే పాడటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత ముసాయిదాను కేంద్ర జలవనరుల శాఖ నోటిఫై చేస్తే ప్రాజెక్టులపై పెత్తనమంతా బోర్డు చేతిలోకి వెళ్లనున్న నేపథ్యంలో దీనిపై తీవ్రంగా స్పందించింది. బోర్డు లేఖ అంశమై శనివారం ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి సచివాలయంలో అధికారులతో చర్చించారు. ఈ భేటీకి ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, అంతర్రాష్ట్ర విభాగం అధికారులు కోటేశ్వర్రావు, అజయ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోర్డు పరిధిపై నోటిఫికేషన్ ఇవ్వడాన్ని భేటీలో ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఎలాంటి నోటిఫై చేయరాదంటూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్‌సింగ్‌కు లేఖ రాశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89(ఎ), (బి)ల ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేవని, నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలు బ్రజేశ్ ట్రిబ్యునల్ పరిశీలనలో ఉన్నందున బోర్డు నియంత్రణ అన్న ప్రశ్నే ఉదయించదని స్పష్టం చేశారు. ఇదే చట్టంలోని 85(8), 87(1) సెక్షన్ల ప్రకారం కృష్ణా బోర్డు కేవలం ట్రిబ్యునల్లు ఇచ్చిన నిర్ణయాన్ని మాత్రమే అమలుపరచాలి తప్ప నోటిఫికేషన్‌ను తయారు చేయలేదని ఆ లేఖలో వెల్లడించారు. బోర్డు వెలువరించిన నోటిఫికేషన్‌ను నోటిఫై చేయకుండా, రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్నాకే స్పందించాలని కేంద్రానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. బోర్డు అధికారాలపై ప్రధాన చర్చ.. ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునే విషయమై కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్ సిద్ధంచేసి, నోటిఫికేషన్ కోసం కేంద్రానికి పంపగా, దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి బ్రజేశ్ ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చేవరకు ఆమోదించరాదని కోరిన విషయాలని సీఎస్‌తో జరిగిన భేటీలో అధికారులు గుర్తు చేశారు. బ్రజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రానందున బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని, ఉమ్మడి ఏపీలో చేసుకున్న తాత్కాలిక ఏర్పాట్ల మేరకు ఆయా రాష్ట్రాలు తమ సరిహద్దుల్లో తమ అవసరాల మేరకు ఎక్కడైనా వాడుకునేలా మాత్రమే చూడాలని, ప్రాజెక్టుల వారీగా ప్రత్యేక కేటాయింపులు చేయని పక్షంలో బోర్డు కేవలం నీటి వినియోగ అమలును మాత్రమే చూడాల్సి ఉంటుందని తెలిపారు. అవే అంశాలపై కేంద్రానికి లేఖ రాశారు. -
దశలవారీగా బోర్డు అధీనంలోకి ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్‌లోని ప్రాజెక్టులపై పెత్తనాన్ని పూర్తిగా బోర్డుకే కట్టబెట్టేలా ప్రణాళికలు రచిస్తున్న కేంద్ర జల వనరుల శాఖ తాజాగా మరో కీలక సూచన చేసినట్లుగా తెలిసింది. ప్రాజెక్టులన్నింటినీ ఒకేమారు నియంత్రణలోకి తెచ్చుకోవడం కాకుండా, దశల వారీగా తెచ్చుకోవాలని కృష్ణాబోర్డుకు సూచించినట్లుగా తెలిసింది. ఈ సూచనల మేరకు తొలివిడతగా 6 ప్రాజెక్టులను తన అధీనంలోకి తీసుకునేలా బోర్డు కసరత్తులు ఆరంభించింది. కృష్ణాబేసిన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలోఉన్న అన్ని ప్రాజెక్టుల నిర్వహణను తమకు అప్పగించాలని తొలి నుంచీ బోర్డు పట్టుబడుతోంది. దీనికి అంగీకరించిన కేంద్రం, విడతల వారీగా ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకోవాలని సూచించింది. కేంద్రం సూచించిన వాటిలో జూరాల ప్రాజెక్టు, సుంకేశుల బ్యారేజీ, ఆర్డీఎస్, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్‌లు ఉన్నాయి. శ్రీశైలం పరిధిలోని పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ముచ్చుమర్రి, కల్వకుర్తి, కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలతోపాటు సాగర్ కింది కుడి, ఎడమ కాల్వల రెగ్యులేటర్లు, ఏఎంఆర్పీ, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మాత్రం తొలి విడతలో చేర్చలేదు. ప్రాజెక్టుల నియంత్రణకు అవసరమయ్యే సిబ్బందిపై స్పష్టత రాగా, బోర్డు నిర్వహణకు 328 మంది సిబ్బంది అవసరం ఉంటుందని తేల్చింది. తొలివిడతలో బోర్డు అధీనంలోకి తెచ్చే అంశంపై ఇరు రాష్ట్రాలకు సమాచారమిచ్చాక, బోర్డుకు సర్వాధికారాలు కట్టబెట్టే అంశంపై స్పష్టత రానుంది. -
ప్రాజెక్టులపై పెత్తనం బోర్డుకే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులపై పెత్తనాన్ని పూర్తిగా బోర్డుకే కట్టబెట్టేలా కేంద్ర జల వనరుల శాఖ మంత్రాంగం నడుపు తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఉద్యోగులంతా తమ అధీనంలోనే పనిచేసేలా కృష్ణా బోర్డు రూపొందించిన తుది వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఆమోదించే దిశగా కసరత్తు చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నివారణకు ఇది ఒక్కటే మార్గమని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం కేంద్ర జల వనరుల శాఖ జాయింట్ సెక్రెటరీ సంజయ్ కుందూతో ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో భేటీ అయిన బోర్డు చైర్మన్ వైకే శర్మ బోర్డు పరిధి, వర్కింగ్ మ్యాన్యువల్‌పై చర్చించారు. బోర్డుకు ఎలాంటి అధికారాలివ్వకుండా రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించమంటే సాధ్యమయ్యేది కాదని శర్మ స్పష్టం చేసినట్లు తెలిసింది. తమ నిర్ణయాన్ని ఇరు రాష్ట్రాలకు తెలియజేసి, వారి వివరణలు తెలుసుకున్నాకే, బోర్డుకు సర్వాధికారాలు అప్పజెప్పే అంశంపై నిర్ణయం తీసుకుంటామని సంజయ్ తెలిపినట్లు సమాచారం. బోర్డుకే అధికారాలిస్తే అవసరమయ్యే సిబ్బంది, నిర్వహణ వ్యయం, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. మార్గదర్శకాలివీ.. ♦ బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుల విషయం లో ఏ పనులు చేయాలన్నా అనుమతి తప్పనిసరి. వాటి అంచనాలను బోర్డుకు అందించాల్సి ఉంటుంది. ♦ కృష్ణా బేసిన్లో హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగు గంగ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఇరు రాష్ట్రాలు పూర్తి చేసుకోవచ్చు. ♦ కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి. బ్రిజేశ్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు తేల్చే వరకూ కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఒప్పందం అమల్లో ఉంటుంది. ♦ తెలంగాణ, ఏపీ పరిధిలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఉద్యోగులంతా తమ అధీనంలోనే పనిచేయాలి. ♦ మార్గదర్శకాలపై ఏపీ కొంత సానుకూలంగా ఉన్నా, తెలంగాణ వ్యతిరేకి స్తోంది. ప్రాజెక్టుల వారీ కేటాయింపులు లేకుం డా నియంత్రణ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తోంది. -
తాత్కాలిక సర్దుబాటే!
సాక్షి, హైదరాబాద్: బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ కృష్ణా జలాల్లో వాటాలను ఖరారు చేయలేమని తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తేల్చిచెప్పింది. 2015లో ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటే అప్పటివరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విధానం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున దక్కు తాయి. కృష్ణా నదీ జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ రాష్ట్రాలకు పునఃపంపిణీ చేస్తూ రెండేళ్ల క్రితం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇరు రాష్ట్రాలు దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారిస్తూనే ఉమ్మడి రాష్ట్రానికి కేటా యించిన జలాలను తెలంగాణ, ఏపీలకు పంపిణీ చేయడానికి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులు విచారణలో ఉండటంతో 2015లో జూన్ 21, 22న ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ ‘తాత్కాలిక ఏర్పాటు’ చేశారు. అప్పట్లో దీనికి అంగీకరించిన రెండు రాష్ట్రాలు 2016లో వ్యతిరేకించడంతో తాత్కా లిక సర్దుబాటునే అమలు చేశారు. 2017లో మళ్లీ రెండు రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించడంతో కృష్ణా జలాల్లో వాటాల లెక్కలు తేల్చాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతానికి తాత్కాలిక సర్దుబాటు ప్రకారం కృష్ణా జలాలను వినియోగించుకోవాలని రెండు రాష్ట్రాలకు ఇటీవల కేంద్రం తేల్చిచెప్పిందని అధికారవర్గాలు వెల్లడించాయి. -
రెండేళ్లలోనే తుది కేటాయింపులు!
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, అవి వెలువరించిన తీర్పులను పక్కాగా అమలు చేసే దిశగా కేంద్రం కీలక ముందడుగు వేస్తోంది. దేశంలో అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలను విచారించడానికి ఏర్పాటైన వివిధ ట్రిబ్యునళ్లను రద్దు చేసి.. దేశవ్యాప్తంగా ఒకే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు మార్చిలో జరుగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే.. బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని నిర్ణయించింది. అంతర్రాష్ట్ర జల వివాదాలపై రెండేళ్లలోనే తుది తీర్పు వెలువరించేలా గడువు నిర్దేశించాలన్న పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సులను కూడా బిల్లులో పొందుపరిచింది. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన అనంతరం మూడు నెలల వ్యవధిలోనే పాత ట్రిబ్యునళ్లన్నీ రద్దయి.. దేశవ్యాప్తంగా ఒకే ట్రిబ్యునల్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం కృష్ణా జలాల వివాదాన్ని చూస్తున్న బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో తెలంగాణకు న్యాయం జరిగే పరిస్థితులు లేకపోవడంతో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం గట్టిగా సమర్థిస్తోంది. ఆ తీర్పే అంతిమం..: దేశవ్యాప్తంగా కృష్ణా, కావేరీ, వంశధార, మహాదాయి, రావి తదితర నదీ జలాల వివాదాలకు సంబంధించి ఎనిమిది ట్రిబ్యునళ్లు పనిచేస్తున్నాయి. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 ప్రకారం.. నదీ జలాల పంపిణీపై ఏదైనా రాష్ట్రంలో తలెత్తిన అభ్యంతరాలను పరిశీలించి కేంద్రం ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తుంది. అలా ఏర్పాటు చేసిన కృష్ణా ట్రిబ్యునల్ విచారణ పదమూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ వివాదాలకు తగిన పరిష్కారం దొరకలేదు. ప్రస్తుతమున్న అంతర్రాష్ట్ర జల వివాద పరిష్కార చట్టం –1956లోని సెక్షన్ 5(2) ప్రకారం.. వివాదంపై నివేదిక అందించడానికి ట్రిబ్యునల్‌కు ప్రాథమికంగా మూడేళ్ల గడువు ఉంది. ఏదైనా కారణంతో తుది నిర్ణయం వెలువరించలేకపోతే గడువును మరో రెండేళ్లు పొడిగించే అధికారం కేంద్రానికి ఉం ది. ఇక ట్రిబ్యునల్ నిర్ణయంపై వాద, ప్రతివాదుల్లో ఎవరైనా విభేదిస్తూ సెక్షన్ 5 (3) కింద పునఃపరిశీలించాలని కోరితే.. దానిపై తీర్పు చెప్పడానికి మరో ఏడాది సమయం ఉంది. అప్పటికీ తుది నివేదిక ఇవ్వలేకపోతే కేంద్రం గడువు పొడిగించే వీ లుంది. ఇందుకు నిర్దిష్ట కాలపరిమితి లేదు. అంటే గడువును నిరవధికంగా పొడిగించే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం అలాగే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో త్వరగా జల వివాదాలను పరిష్కరించే దిశగా ఒకే ట్రిబ్యునల్ అంశం తెరపైకి వచ్చింది. పటిష్టంగా కొత్త ట్రిబ్యునల్ ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతమున్న చట్టాలను సవరించి కొత్త చట్టాన్ని తేస్తోంది. దీనిపై ఇప్పటికే బిల్లును కూడా రూపొందించింది. దాని ప్రకారం... - ప్రతిపాదిత శాశ్వత ట్రిబ్యునల్‌కు చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు గరిష్టంగా ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరిని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నుంచి నియమిస్తారు. - ఈ నియామకాల కోసం నలుగురు సభ్యులతో ప్రత్యేక ప్యానల్ లేదా కొలీజియం ఏర్పాటు చేయాలి. ఇందులో ప్రధానమంత్రి, లేదా ఆయన నియమించిన ప్రతినిధి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నియమించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సభ్యులుగా ఉండాలి. - సభ్యులను తొలగించే అధికారం కూడా కొలీజియానికి ఉండాలి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చైర్‌పర్సన్‌గా ఉండనున్నారు. - కొత్త ట్రిబ్యునల్ రెండేళ్లలో తన తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. - వివాదాలను పొడిగించడానికి వీలులేకుండా ‘ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పే అంతిమం’అని చెబుతూ బిల్లులో కొత్తగా 6వ సెక్షన్‌ను కూడా చేర్చారు. - ఈ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సమానం కాబట్టి అన్ని రాష్ట్రాలూ కట్టుబడి ఉండాల్సిందే. -
జల జగడంపై ఏమీ తేల్చలేదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్ల పరిధిలో తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలపై కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశం అసంపూర్ణంగా ముగిసింది. ఇరు రాష్ట్రాల పరిధిలోని వివాదాస్పద అంశాలపై అవగాహన తెచ్చుకునేందుకే కేంద్రం పరిమితమైంది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెస్తామంటూ కేంద్రం సూచన చేసినా దానిపై సఖ్యత కుదరకపోవడంతో నిర్ణయమేదీ తీసుకోలేదు. వీటిపై ఈ నెల 20న దక్షిణాది రాష్ట్రాల సాగునీటి మంత్రుల భేటీలో చర్చించాక నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. వాటా తేల్చాకే బోర్డుల పరిధి కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జరిగిన ఈ కీలక భేటీలో రాష్ట్రం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ నరసింహారావు, ఎస్ఈ కోటేశ్వరరావు, ఏపీ నుంచి జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ప్రాజెక్టులను బోర్డు పరిధిలో తేవాలని కేంద్రం, బోర్డు, ఏపీ ప్రతిపాదించాయి. దీనిపై సీఎస్ జోషి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘నీటి విషయంలో తెలంగాణ 70 ఏళ్లుగా అన్యాయానికి గురవుతోంది. రాష్ట్రంగా అవతరించాక నాలుగేళ్లుగా కూడా అదే అన్యాయం కొనసాగుతోంది. కృష్ణా బేసిన్లో 37.19 లక్షల హెక్టార్ల సాగుయోగ్యమైన భూమి ఉన్నా 6.39 లక్షల హెక్టార్లకు మించి సాగు చేసుకోలేకపోతున్నాం’’అని పేర్కొన్నారు. ‘‘పరీవాహకం, ఆయకట్టు, అవసరాల ప్రకారం చూస్తే 811 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీలు దక్కాలి. ఏపీకి 140 టీఎంసీలకు మించి కేటాయింపు అవసరం లేదు. ఈ దృష్ట్యా ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేదాకా తాత్కాలికంగా తెలంగాణకు 575 టీఎంసీలివ్వండి’’అని కోరారు. బచావత్ అవార్డు ప్రకారం సైతం పోలవరం, పట్టిసీమల ప్రాజెక్టుల కింద తెలంగాణకు 90 టీఎంసీలు కేటాయించాలన్నారు. దీనిపై నిపుణుల కమిటీ కూడా ఏమీ తేల్చలేదన్నారు. తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వకుండా, పోలవరం వాటాలపై తేల్చకుండా, ప్రాజెక్టులవారీ కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చేందుకు ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టులు తలపెట్టింది ఏపీనే భేటీలో ఏపీ మళ్లీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రస్తావించింది. అది కొత్త ప్రాజెక్టేనని, దానికి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరని వాదించగా తెలంగాణ తిప్పికొట్టింది. కాళేశ్వరం ఎత్తిపోతల, తమ్మిడిహెట్టి రెండూ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగమేనని, వీటిపై 2008లో ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవో 238 ప్రకారమే నడుచుకుంటున్నామంది. కాళేశ్వరం పాతదేనని కేంద్ర జల సంఘమూ తేల్చిందని గుర్తు చేసింది. నిజానికి ఏపీయే కొత్తగా వెలిగొండ, ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు చేపట్టిందని పేర్కొంది. పోలవరం ముంపు, ఆర్డీఎస్ వాటాపై గరంగరం పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచల సీతారామాలయంసహా పలు గ్రామాలు, గనులు, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ ముంపునకు గురయ్యే ప్రమాదముందని కేంద్రం దృష్టికి జోషి తీసుకెళ్లారు. ముంపు సమస్యలపై అధ్యయనం చేయాల్సిందిగా పోలవరం అథారిటీని ఆదేశించాలన్నారు. తుంగభద్ర జలాల అంశాన్ని కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని కోరారు. కృష్ణా పరిధిలో టెలిమెట్రీ విధానం తెచ్చినా ఇంకా అమల్లోకి రాలేదన్నారు. దీంతో పోతిరెడ్డిపాడు కింద ఏపీ ఇష్టానికి వాడుకుంటోందన్నారు. -
బోర్డులకే సర్వాధికారాలు?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్లలోని ప్రాజెక్టులపై పెత్తనాన్ని పూర్తిగా ఆయా బోర్డులకే కట్టబెట్టే అంశంపై కేంద్ర జల వనరుల శాఖ సానుకూల నిర్ణయం చేసినట్లుగా తెలిసింది. దశలవారీగా, ప్రాజెక్టుల పరిధిలోని డ్యామ్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, పవర్హౌజ్లను బోర్డు నియంత్రణలో ఉంచేలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా సమాచారం. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని అధికారులు కూడా బోర్డుల పరిధిలోనే ఉండేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి బేసిన్లలో ప్రాజెక్టుల పరిధి, నియంత్రణ అంశాలపై శుక్రవారం కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కీలక సమావేశంజరిగింది. సమావేశానికి గోదావరి బోర్డు చైర్మన్ హెచ్‌కే సాహూ, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నదీ బేసిన్ల పరిధిలోని సమస్యలను బోర్డు అధికారులు వివరించారు. కనీసం స్పందించరు.. కృష్ణా జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల వైఖరిపై కృష్ణా బోర్డు అధికారులు మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేటాయింపులకు సంబంధించి తాము వెలువరించిన ఆదేశాలకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉండట్లేదని, పైగా అధిక వినియోగంపై ఒక రాష్ట్రం మరో రాష్ట్రంపై ఫిర్యాదులు చేస్తోందని తప్పుబట్టారు. అధిక వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ఇరు రాష్ట్రాలను కోరినా ఆదేశాలను పట్టించుకోవట్లేదని వివరించారు. బేసిన్ల పరిధిలోని కొత్త ప్రాజెక్టుల వివరాలు కోరినా స్పందించడం లేదని దృష్టికి తెచ్చారు. ‘కృష్ణా బేసిన్లో హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగు గంగ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఇరురాష్ట్రాలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అయితే కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి అని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా తెలుగు రాష్ట్రాలు పెడచెవిన పెడుతున్నాయి. బోర్డుకు ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా చేతులు కట్టేసి రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారించమంటే సాధ్యమయ్యేది కాదు. ఈ దృష్ట్యా ప్రాజెక్టులపై పూర్తి అధికారాలు అప్పజెప్పండి’అని కోరారు. ఇప్పటికే కృష్ణా నది బేసిన్‌లోని ప్రాజెక్టులపై పెత్తనం ఉండేలా తయారు చేసిన తుది వర్కింగ్ మాన్యువల్‌ను ఆమోదించాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల పరిధిలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఉద్యోగులంతా తమ అధీనంలోనే పనిచేసేలా మార్గదర్శకాలు ఖరారు చేయాలని సూచించారు. బోర్డు అధికారుల వినతికి కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తమయిందని తెలిసింది. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చి, ఆ నిర్ణయాన్ని ఇరురాష్ట్రాలకు తెలియజేస్తామని, వారి వివరణలు తెలుసుకున్నాక, బోర్డుకు సర్వాధికారాలు అప్పజెప్పే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపినట్లుగా సమాచారం. -
575 టీఎంసీలు కావాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో నీటి కేటాయింపులు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా 575 టీఎంసీలు కేటాయించాల్సిందిగా కోరనుంది. ఈ మేరకు రెండేళ్ల తర్వాత తొలిసారి ఈ నెల 15న రాష్ట్రం తరఫున కేంద్ర జల వనరుల శాఖ ముందు తెలపాల్సిన అంశాలపై నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంతం 68.5, ఆయకట్టు 62.5 శాతం ఉంటే మొత్తం జలాల్లో 35 శాతమే తెలంగాణకు నీరు కేటాయించారు. ఏపీలో పరీవాహకం 31.5, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా 60 శాతానికి పైగా కేటాయింపులు జరిపారు. ఆ ప్రకారం మొత్తం 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీల నీరు కేటాయించారు. పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా కేటాయింపులు పెరగాలని రాష్ట్రం వాదించనుంది. ఇక 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. ఈ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలని, అలాగే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగా పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో మరో 45 టీఎంసీల వాటా ఇవ్వాలని కోరనుంది. మొత్తంగా 575 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగిలిన 236 టీఎంసీలను ఏపీకి కేటాయించాలని వివరించనుంది. మరోవైపు ఆర్డీఎస్ పథకం కింద రాష్ట్రానికి 15.9 టీఎంసీల కేటాయింపులున్నా 5–6 టీఎంసీలకు మించి నీరందడం లేదు. దీనిపైనా కేంద్రం వద్దే తేల్చకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపు ప్రాజెక్టుల నియంత్రణపై చర్చలు కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో ప్రాజెక్టుల నియంత్రణపై కేంద్రం ఈ నెల 9న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు భేటీకి హాజరుకానున్నారు. ప్రాజెక్టులను రాష్ట్రాల పరిధిలో ఉంచాలా? లేక బోర్డు పరిధిలోకి తేవాలా? అంశంపై ఇందులో చర్చించనున్నారు. -
ప్రాజెక్టులపై పెత్తనం బోర్డుకే..!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులపై పెత్తనం ఉండేలా కృష్ణా బోర్డు తుది వర్కింగ్ మాన్యువల్ సిద్ధం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల పరిధిలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఉద్యోగులంతా తమ అధీనంలోనే పనిచేసేలా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఇందుకోసం రూపొందించిన వర్కింగ్ మ్యాన్యువల్‌పై బోర్డు ఈ నెల 30న ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించనుంది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం గురువారం లేఖ రాశారు. ఇరు రాష్ట్రాలు ఆమోదిస్తే మ్యాన్యువల్‌ను కేంద్ర జలవనరులశాఖ ఆమోదానికి పంపుతామన్నారు. దానికి ఆమోదం లభిస్తే కృష్ణా బోర్డుకు సర్వాధికారాలు దక్కనున్నాయి. మ్యాన్యువల్‌లోని మార్గదర్శకాల ప్రకారం బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుల విషయంలో ఏ పనులు చేయాలన్నా అనుమతి తప్పనిసరి. వాటి అంచనాలను బోర్డుకు అందించాల్సి ఉంటుంది. కృష్ణా బేసిన్లో హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగు గంగ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఇరు రాష్ట్రాలు పూర్తి చేసుకోవచ్చు. కానీ కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాలంటే మాత్రం బోర్డు అనుమతి తప్పనిసరి. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు తేల్చే వరకూ కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఒప్పందం అమల్లో ఉంటుంది. వీటిని పరిశీలిస్తే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయన్నది స్పష్టమవుతోంది. పరిష్కారం లభించకుంటే అపెక్స్‌కు.. బోర్డు, కమిటీల స్వరూపం, అపెక్స్ కౌన్సిల్ భేటీలకు సంబంధించి బోర్డు మార్గదర్శకాలు ఖరారు చేసింది. దీని ప్రకారం చైర్మన్, సభ్య కార్యదర్శి, కేంద్రం నియమించే జల విద్యుత్ నిపుణుడు, ఇరు రాష్ట్రాల జలవనరులశాఖల కార్యదర్శులు, ఈఎన్సీలు బోర్డులో సభ్యులుగా ఉంటారు. ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండుసార్లు బోర్డు సమావేశం నిర్వహించాలి. ప్రత్యేక పరిస్థితులు ఉత్పన్నమైతే ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. సంప్రదింపుల ద్వారానే నీటి కేటాయింపులు చేయాలి. ఒకవేళ ఓటింగ్ అవసరమైతే బోర్డు సభ్యులకు ఒక్కో ఓటు ఉంటుంది. సరిసమానంగా ఓట్లు వచ్చినప్పుడు చైర్మన్ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పరిష్కరించలేని వివాదాలను అపెక్స్ కౌన్సిల్ పరిశీలనకు బోర్డు నేరుగా పంపవచ్చు. అపెక్స్ కౌన్సిల్‌ను ఆశ్రయించే స్వాతంత్య్రం ఇరు రాష్ట్రాలకూ ఉంటుంది. -
హస్తినలోనే తేల్చుకుందాం..!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై హస్తినలోనే తేల్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ‘అకినేపల్లి’బ్యారేజీ ద్వారా నీటి మళ్లింపు ప్రణాళికపై చర్చించేందుకు ఈ నెల 17న కేంద్ర జల వనరుల శాఖ ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసింది. తెలంగాణ నీటిపారుదల శాఖ అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు అభ్యంతరాలు, అనుమానాలు, ఇతర ప్రత్యామ్నాయాల నివేదికలను తయారు చేశారు. ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటకల్లోని కావేరి వరకు అనుసంధానం చేపట్టాలని కేంద్రం తొలుత నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు భిన్నంగా కొత్త ప్రత్యామ్నాయాన్ని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తెరపైకి తెచ్చింది. తెలంగాణలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందనీ, దీనికి ప్రత్యామ్నాయంగా గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని కేంద్రం సూచిస్తోంది. అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరీకి తరలించాలని ప్రతిపాదిస్తోంది. అయితే దీనిని తెలంగాణ తప్పుపడుతోంది. అకినేపల్లి వద్ద తెలంగాణ, ఒడిశా అవసరాలు పోనూ, 50 శాతం నీటి లభ్యత ఆధారంగా 8,194 మిలియన్ క్యూబిక్ మీటర్లు(289 టీఎంసీలు), 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 12,104 మిలియన్ క్యూబిక్ మీటర్లు (427 టీఎంసీలు) మిగులు ఉం టుందని అంచనా వేసింది. 75 శాతం నీటి లభ్యత ప్రకారం ఎక్కువ జలాలున్నట్లు చూపడాన్ని తెలంగాణ ప్రశ్నిస్తోంది. -
7న పోలవరంలో గడ్కరీ పర్యటన
సాక్షి, అమరావతి: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం పర్యటన ఖరారైంది. జనవరి 7న ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో ఆయన పరిశీలించి 2019 నాటికి పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమీక్షిస్తారు. ఈనెల 13న ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు.. నితిన్ గడ్కరీతో సమావేశమై ప్రాజెక్టు పనులపై చర్చించగా 22న పరిశీలనకు వస్తానని గడ్కరీ ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయి నివేదికలు తెప్పించుకుని, అధ్యయనం చేసిన తర్వాతే సందర్శనకు వెళ్లాలన్న ఉద్దేశంతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈలోగా పోలవరం ప్రాజెక్టు పనులను తనిఖీ చేసి నివేదిక ఇచ్చేందుకు వ్యాప్కోస్ కమిటీ, తన సలహాదారు సంజయ్ కోలా పుల్కర్ను పంపారు. జనవరి 2 లేదా 3న కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ను కూడా క్షేత్ర పరిశీలనకు పంపాలని గడ్కరీ నిర్ణయించారు. వారు ఇచ్చే నివేదికలు అధ్యయనం చేశాక.. వచ్చే నెల 7న పోలవరంలో పర్యటిస్తానని గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపారు. -
బోర్ల వినియోగం రాష్ట్రంలోనే అధికం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో భూగర్భ జలాలను తెలంగాణ లోనే అధికంగా వినియోగిస్తున్నారని కేంద్ర జల వనరుల శాఖ వెల్లడించింది. భూగర్భ జలాల వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, ఆ నీటిని తీసుకునేందుకు అధిక సంఖ్యలో బోర్లను వేస్తోందని తెలిపింది. రాష్ట్రంలో ఒక్కో బోరు ఏర్పాటు చేసేందుకు సగటున రూ.41,960 మేర ఖర్చు చేస్తున్నారని, ఏటా వాటి నిర్వహణకు రూ.4,193 ఖర్చు పెడుతున్నారని వెల్లడించింది. తమిళనాడు, రాజస్తాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువేనని తెలిపింది. దేశవ్యాప్తంగా చిన్న నీటి వనరుల ద్వారా నీటి వినియోగంపై కేంద్ర జల వనరుల శాఖ అధ్యయనం చేసింది. గతంతో పోలిస్తే వ్యవసా యానికి భూగర్భజలాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారని తెలిపింది. 2013–14 నాటికి తెలంగాణలో ఉన్న 14.56 లక్షల బోరు మోటార్ల పరిధిలో అధ్యయనం చేయగా.. ఇందులో 13.55 లక్షల బోర్లే పనిచేస్తున్నాయంది. వీటి కింద ఖరీఫ్‌లో గరిష్టంగా 10.12 లక్షల హెక్టార్లు, రబీలో 7.17 లక్షల హెక్టార్ల భూమి సాగవుతోందని తెలిపింది. -
‘పోలవరం’ అంచనా పెంపును అంగీకరించం
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం) పనుల్లో కాంక్రీట్ పనులకు 60సీ నిబంధన కింద ప్రస్తుత కాంట్రాక్టర్ నుంచి తప్పించి, ఆ పనులకు ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం వాస్తవ ధర ఎంత అవుతుందో లెక్కించి.. అదే ధరకు కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. ఒప్పందం ప్రకారం కొన్ని పనులను తొలగించి, వాటికి మళ్లీ టెండర్లు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ దానివల్ల అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని, ప్రస్తుత కాంట్రాక్టర్ న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అంచనా వ్యయం పెరిగే ఏ ప్రతిపాదననూ అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. సబ్ కాంట్రాక్టర్లకు ప్రధాన కాంట్రాక్టర్(ట్రాన్స్ట్రాయ్) ద్వారా కాకుండా నేరుగా బిల్లులు చెల్లించేందుకు పీపీఏ, సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో ‘ఎస్క్రో’ అకౌంట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2013 భూసేకరణ చట్టం ఆధారంగా భూసేకరణ, çపునరావాస ప్యాకేజీ నిధులను విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రతిపాదనను తోసిపుచ్చారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించాలని సూచించారు. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) డైరెక్టర్ జనరల్ మసూద్ హుస్సేన్ కమిటీ నివేదిక ఆధారంగా పోలవరం ప్రాజెక్టు పనులపై బుధవారం రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులతో గడ్కరీ సమీక్ష జరిపారు. కాగా కాంట్రాక్టు ఒప్పందం కంటే తాము అధికంగా పనులు చేస్తున్నామని.. ఆ మేరకు అదనపు బిల్లులు చెల్లించాలని ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ ప్రతినిధి చేసిన ప్రతిపాదనను గడ్కరీ తోసిపుచ్చారు. -
ఏకే బజాజ్ కమిటీ కథ కంచికి?
సాక్షి,హైదరాబాద్: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటా అంశమై అపరి ష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికై ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ కమిటీని కేంద్ర జల వనరుల శాఖ పక్కన బెట్టినట్లుగా తెలిసింది. కమిటీ ఏర్పాటై ఐదున్నర నెలలు కావ స్తున్న ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిం చలేదు. మళ్లింపు జలాల అంశమై బ్రిజేశ్ కుమా ర్ ట్రిబ్యునల్ ముందు వాదనల నేపథ్యంలో కమిటీని బాధ్యతల నుంచి తప్పిస్తూ కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించినట్లు కృష్ణా బోర్డు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మా పరిధిలో లేదు: ఏకే బజాజ్ దీనిపై ఏకే బజాజ్ స్పందిస్తూ.. మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని చేతులెత్తేసింది. దీనికి అభ్యంతరం తెలిపిన తెలంగాణ.. కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అనంతరం ఏకే బజాజ్ కమిటీతో కేంద్రం చర్చించి మళ్లింపు జలాలపై మధ్యేమార్గాన్ని సూచించాలని ఆదేశించింది. ఈలోగానే కమిటీకి ముందస్తుగా నిర్ణయించిన ఆరు నెలల గడువు ముగియడం, వివాదం తేలకపోవడంతో మరోమారు కమిటీ గడువును అక్టోబర్ 8 వరకు పొడిగించింది. గడువు పొడిగించిన నాటి నుంచి రాష్ట్రాల పరిధిలో కమిటీ ఎలాంటి పర్యటనలు జరపలేదు. బోర్డు సభ్యులే ఆగస్టులో ఢిల్లీకి వెళ్లి వివాదానికి సంబంధించిన వివరణలు ఇచ్చారు. అనంతరం కమిటీ పర్యటన ఉంటుందని భావించినా అది జరగలేదు. ఇటీవలే కేంద్ర జల సంఘం కమిటీని పిలిపించుకొని మళ్లింపు జలాలు, ప్రాజెక్టుల నిర్వహణపై ఎలాంటి నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్లుగా బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. దీంతో కమిటీని బాధ్యతల నుంచి తప్పించినట్లేనని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై అధికారిక ఉత్తర్వులు అందితే తప్ప ఎలా ముందుకు పోవాలన్న దానిపై కేంద్రాన్ని స్పష్టత కోరుతామని బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ కమిటీ తేల్చని పక్షంలో ట్రిబ్యునల్ మాత్రమే ఈ వివాదాన్ని పరిష్కరించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. గోదావరి జలాల వాటాలపై.. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలు తేల్చడం, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నియమావళి రూపొందించడం లక్ష్యంగా కేంద్ర జల వనరుల శాఖ గతేడాది అక్టోబర్‌లో ఏకే బజాజ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరంల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 90 టీఎంసీల వాటాలో గరిష్టంగా తెలంగాణకు 73 టీఎంసీలు దక్కేలా చూడాలని కోరింది. దీనికి తోడు క్యాచ్‌మెంటు, సాగు యోగ్య భూములు, పేదరికం, వెనుకబాటుతనం, జనాభా తదితర అంశాలలో ఏ ప్రాతిపదికన చూసినా ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణకు 450 టీఎంసీలు రావాల్సి ఉందని తెల్చింది. -
అక్రమ ప్రాజెక్టులపై ఎట్టకేలకు కదలిక
► ఏపీ చేపట్టిన 9 ప్రాజెక్టులపై తొలిసారి స్పందించిన కృష్ణా బోర్డు ► 22న జరిగే భేటీలో ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లపై చర్చ ► ఏపీ వినతితో మళ్లీ మైనర్ జలాల వినియోగం తెరపైకి సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు స్పందించింది. ఇన్నాళ్లుగా మౌనం వహి స్తూ వచ్చిన బోర్డు, తెలంగాణ ఏకంగా కేంద్ర జల వనరుల శాఖకే ఫిర్యాదు చేయడంతో తొలి సారి 9 ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టుల నివేదిక (డీపీఆర్)ల అంశాన్ని ఈ నెల 22న జరిగే సమావేశపు ఎజెండాలో చేర్చింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 85(సీ) నిబంధన మేరకు ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వినియోగం జరుగుతోందా? అన్న అంశాలపై చర్చిద్దామం టూ గురువారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. తెలంగాణ ఫిర్యాదుతో కదలిన బోర్డు.. పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్తరామదాస పథకాలు కొత్తవి కావని పదేపదే వివరణ ఇస్తున్నా, వీటిపై అపెక్స్ కౌన్సిల్లో చర్చించాలని ఏపీ పట్టుబట్టిన తీరుతో విసిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అక్రమ ప్రాజెక్టులపై గురిపెట్టింది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాలో చేపట్టిన 1.23 టీఎంసీలు ఎత్తిపోసే పులికనుమ, 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సిద్దాపురం, మరో 2 టీఎంసీలు తరలిస్తున్న గాజులదిన్నె అంశాలను తెరపైకి తెచ్చింది. ఏపీలోని గుండ్రేవుల రిజర్వాయర్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 2,371 హెక్టార్ల భూమి ప్రభావితం అవుతున్న అంశాన్నీ లేవనెత్తింది. అలాగే శివభాష్యంసాగర్ ప్రతిపాదన ఉమ్మడి ఏపీలో ఎక్కడా లేదని, మున్నేరు బ్యారేజీతో తెలంగాణలో ముంపు ఉంటున్నా పట్టించుకోకుండా నిర్మాణం చేపడుతున్న విషయాన్ని ఎత్తిచూపింది. వీటితో పాటే ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్ కుడికాల్వ ద్వారా ఏపీ అక్రమ వినియోగం చేస్తోందని గుర్తించి, ఈ 9 ప్రాజెక్టులపై నెల రోజుల కిందట నేరుగా కేంద్ర జల వనరుల శాఖకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 85(సీ) నిబంధన కింద ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి బోర్డు నుంచి కచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా, ఈ ప్రాజెక్టుల విషయంలో అలా జరగలేదని, ఎలాంటి అనుమతులు, కేటాయింపులు లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టులను కేంద్రం నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. తెలంగాణ రాసిన ఈ లేఖ కృష్ణా బోర్డులో చలనం తెచ్చింది. దీంతో ఈ నెల 22న అమరావతిలో జరిగే బోర్డు సమావేశంలో ఈ తొమ్మిది ప్రాజెక్టుల అంశాన్ని, వాటి డీపీఆర్‌లపై ఏపీ ప్రభుత్వ వివరణ తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–1లో లేని ఈ ప్రాజెక్టులను ఏ హక్కుతో నిర్మిస్తున్నారన్న అంశాలపై బోర్డు వివరణ తీసుకోనుంది. ఇక వీటితో పాటే ఇప్పటికే పలుమార్లు చర్చించిన తెలంగాణకు చెందిన పాలమూరు, డిండి, భక్తరామదాస, వాటర్‌గ్రిడ్, కల్వకుర్తి, తుమ్మిళ్ల ప్రాజెక్టులను ఎజెండాలో చేర్చింది. మళ్లీ తెరపైకి మైనర్ వినియోగం ఇక ఇదే ఎజెండాలో బోర్డు ప్రత్యేకంగా మైనర్ ఇరిగేషన్ కింద జరుగుతున్న నీటి వినియోగాన్ని చేర్చింది. కేవలం ఏపీ చేసిన ఫిర్యాదుతో ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చినట్లుగా తెలంగాణ అనుమానిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఏపీకి మైనర్ ఇరిగేషన్ కింద 111.26 టీఎంసీలు కేటాయించగా, ఇందులో తెలంగాణకు గరిష్టంగా 89.15 టీఎంసీలు, ఏపీకి 22.11 టీఎంసీలు కేటాయించారు. అయితే తెలంగాణ మైనర్ ఇరిగేషన్ కింద గత మూడేళ్లుగా పెద్దగా నీటిని వాడుకుంటున్న దాఖలాలే లేవు. మొత్తంగా చెరువుల కింద ఈ ఏడాది 20 నుంచి 25 టీఎంసీలకు మించి వినియోగం ఉండటం లేదు. అయితే ఇవేమీ పట్టని ఏపీ, చెరువుల్లోకి చేరుతున్న నీటిని నమోదు చేయకుండా, కృష్ణా జలాల్లో అధిక వాటా కొట్టేసేందుకు తెలంగాణ యత్నిస్తోందంటూ కొత్త వాదన తెరపైకి తెస్తోంది. ప్రస్తుతం మళ్లీఅదే వాదనను చర్చకు పెట్టింది. ఇక వీటితోపాటే తొలి విడత టెలిమెట్రీ పరికరాల అమరిక, రెండో విడత ప్రతిపాదనల అంశంపైనా చర్చిస్తామని బోర్డు తన లేఖలో పేర్కొంది. -
జోక్యం చేసుకోండి!
► గోదావరి ప్రాజెక్టులపై కేంద్ర జలవనరులశాఖకు బోర్డు మొర ► తెలుగు రాష్ట్రాలు ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వడం లేదని ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను వినియోగించుకుంటున్న కొత్త, పాత ప్రాజెక్టుల సమగ్ర నివేదిక(డీపీఆర్)లు తమకు సమర్పించాలని పదేపదే కోరుతు న్నా.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పందన కొరవడిందని గోదావరి బోర్డు కేంద్ర జలవనరులశాఖకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత చేపట్టిన ప్రాజెక్టుల నీటి వినియోగ వివరాలు చెబితేనే నీటి ప్రణాళిక ఖరారు సులువవుతుందని స్పష్టం చేస్తున్నా పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈ మేరకు కేంద్రం జోక్యం చేసుకోవాలని బుధవారం రాత్రి గోదావరి బోర్డు చైర్మన్ హెచ్‌కే సాహూ కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల సహా సీతారామ, తుపాకుల గూడెం, ప్రాణహితతో పాటు ఇప్పటికే చేపట్టిన దేవాదుల, ఎస్సారెస్పీ స్టేజ్–2, వరద కాల్వ తదితర ప్రాజెక్టుల వివరాలు కోరింది. ఇక ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నం, తాడిపూడి, పుష్కర, వెంకటనగరం, పట్టిసీమ, భూపతిపాలెం, ముసురుమల్లితో పాటు సీలేరు, శబరిపై చేపట్టిన హైడ్రో ప్రాజెక్టుల వివరాలు అందించాలని కోరింది. దీనిపై ఇరు రాష్ట్రాలు ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్రం తరఫున కాళేశ్వరం ఎత్తిపోతలపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బోర్డుకు వివరణ పంపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తది కాదని అందులో స్పష్టం చేశారు. ఇక తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతలపైనా తెలంగాణ ఇప్పటికే బోర్డు సమావేశాల్లోనూ, లేఖల ద్వారా వివరణ ఇచ్చింది. అయితే ఈ అంశాలను బోర్డు పరిగణనలోకి తీసుకోలేదు. తమకు ప్రాజెక్టుల పూర్తి డీపీఆర్‌లు అందించాల్సిందేనని స్పష్టం చేసింది. -
ఈఏపీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ సంస్థల రుణ సహకారం(ఈఏపీ)తో రాష్ట్రంలో చిన్న నీటి వనరులను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇందులో ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుని రూ.1600 కోట్లతో చేపట్టే ఆంధ్రప్రదేశ్ సామాజిక నీటి యాజమాన్య పథకం (ఏపీసీడబ్ల్యూఎంపీ) రెండో దశ పథకం ఒకటి. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల, జీవనోపాధుల అభివృద్ధి పథకం (ఏపీఐడబ్ల్యూఎంపీహెచ్‌ఐపీ – ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్, పోస్టు హార్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ప్రాజెక్ట్) కొనసాగింపులో భాగంగా జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ నుంచి రుణం తీసుకుని రూ.రెండు వేల కోట్లతో చేపట్టే పథకం మరొకటి. ఇటీవల నీతి అయోగ్ ఆమోదించడంతో జూలై 27న కేంద్ర జలవనరుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ పథకాలకోసం అప్పటిలోనే దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఎంతగానో కృషిచేశారు. -
పోలవరం అంచనా వ్యయం 60,431 కోట్లు
-
‘కృష్ణా’లో పాత వాటా ఒప్పుకోం
కేంద్ర జల వనరుల శాఖకు స్పష్టం చేసిన తెలంగాణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి గత సంవత్సరాల మాదిరే 512:299 నిష్ప త్తిలో నీటిని పంచుకోవాలన్న కేంద్ర జల వనరుల శాఖ సూచనను తెలంగాణ తిరస్క రించింది. పాత వాటా ప్రకారమే 2017–18 వాటర్ ఇయర్లో నీటి వినియోగం ఉండా లన్న సూచనను ఒప్పుకోమని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా జలాల్లో వాటా పెరగాల్సిందేనని, దీన్ని తేల్చేందుకు వీలైనంత త్వరగా తెలంగాణ, ఏపీలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషీ కేంద్ర జల వనరుల శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ కుందూకు మంగళవారం లేఖ రాశారు. కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలున్నా ఒక్కదానికీ పరిష్కారం దొరకలేదు. ఏటా తాత్కాలిక సయోధ్య కుదురుస్తోంది. అయితే, ఈ ఏడాది సమావేశాల ఊసే ఎత్తలేదు. పట్టిసీమ సహా దిగువ ప్రాజెక్టులకు నీటి విడుదల, ప్రాజె క్టుల నియంత్రణ అంశాలపై ఎటూ తేల్చ లేదు. నీటి వినియోగ అంశాల్లో కృష్ణా బోర్డు నేరుగా ఫిర్యాదు చేసినా పట్టనట్లు వ్యవహ రించిన కేంద్రం ఈ నెల రెండో వారంలో ఇరు రాష్ట్రాలకు లేఖ రాసింది. -
రిజర్వాయర్ల వరద లెక్క తేలాల్సిందే
► రాష్ట్రాలకు కేంద్ర జలవనరుల శాఖ లేఖ సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాలు, ప్రధాన డ్యామ్‌ల పరిధిలో వరద ప్రభావ లెక్కలను గణిస్తున్న కేంద్ర జల వనరుల శాఖ.. రిజర్వాయర్ల వరద లెక్కలపై దృష్టి సారించింది. జలాల విపత్తు నిర్వహణ ప్రణాళిక (సీఎంపీ)లో భాగంగా దేశ వ్యాప్తంగా సమగ్ర జలాశయ విధానం (ఇంటిగ్రేటెడ్ రిజర్వాయర్ ఆపరేషన్) చేపట్టాలని నిర్ణయించిన జల వనరుల శాఖ.. రిజర్వాయర్ల వరదల లెక్కలను ఎప్పటికప్పుడు తమ ముందుంచాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు గత నెలలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలుపుతూ అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. దేశంలోని గోదావరి, కృష్ణా, మహానది, గంగా, కావేరి, తాపీ, సువర్ణరేఖ వంటి ప్రధాన నదుల ఆధారంగా అనేక ప్రాజెక్టులు చేపట్టి, అనేక రిజర్వాయర్లు నిర్మించారు. వీటి వరద లెక్కలు పక్కాగా ఉండకపోవడంతో తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని 74 ప్రధాన రిజర్వాయర్ల పరిధిలో సమగ్ర జలాశాయ విధానం తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా గుర్తించిన రిజర్వాయర్లకు వచ్చే వరద నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేయాలని కోరగా, తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ 74 రిజర్వాయర్లలో తెలంగాణకు సంబంధించి కడెం, ఎల్లంపల్లి ఉన్నట్లు తెలుస్తోంది. -
‘కృష్ణా’పై సమన్వయ భేటీ లేనట్లే!
పాత వాటా ప్రకారమే నీటిని వాడుకోవాలని కేంద్రం సూచన ► ఇప్పటికే కేంద్ర జల వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి లేఖ ► ఇరురాష్ట్రాలూ అంగీకరించే అవకాశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విని యోగానికి సంబంధించి తెలంగాణ, ఏపీ మధ్య ఏటా నిర్వహించే సమన్వయ సమావే శాలకు ఈ ఏడాది కేంద్ర జల వనరుల శాఖ స్వస్తి చెప్పినట్లు కనిపిస్తోంది. కృష్ణా వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–1 కేటాయించిన వాటా ల మేరకే ఈ ఏడాది కూడా నీటిని వాడుకో వాలన్న దిశానిర్దేశంతోనే సరిపెట్టే అవకాశాలు న్నాయి. దీనిపై ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర జల వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుందు.. గతంలో మాదిరే 512ః299 నిష్పత్తిన నీటిని పంచుకునే అంశమై తమ అభిప్రాయాలు తెలిపాలని కోరారు. దీనికి ఇరు రాష్ట్రాలు ఓకే చెబితే సమన్వయ సమావేశం ఏదీ ఉండనట్లే. నిజానికి కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్నా ఒక్కదానికీ పరిష్కారం దొరకడం లేదు. ఏటా జూన్‌లో ఇరురాష్ట్రాలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న కేంద్రం.. చాలా అంశాలపై ఇరురాష్ట్రాల మధ్య తాత్కాలిక సయోధ్య కుదురుస్తూ వస్తోంది.అయితే ఈ ఏడాది ఇంతవరకు సమావేశాల ఊసే ఎత్తలేదు. మరోవైపు పట్టిసీమ సహా దిగువ ప్రాజెక్టులకు నీటి విడుదల, ప్రాజెక్టుల నియంత్రణ అంశాల మధ్య ఇరురాష్ట్రాల మధ్య లేఖల యుద్ధం జరుగుతూనే ఉంది. కొన్ని సంద ర్భాల్లో బోర్డులు సైతం తేల్చలేక కేంద్రానికి ఫిర్యాదు చేసి ఊరుకుంటున్నాయి. అంటీము ట్టనట్టుగానే వ్యవహరిస్తున్న కేంద్రం.. ఇటీవల ఇరు రాష్ట్రాలకు ఓ లేఖ రాసింది. గతంలో మాదిరే నీటిని వాడుకునే అంశంపై అభిప్రా యాలు కోరింది. దీనికి తెలంగాణ కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన వాటా 299 టీఎంసీల నీటిని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకునే అవకాశం ఇస్తే అందుకు అంగీకారం తెలిపే అవకాశం ఉంది. అయితే పట్టిసీమ నుంచి ఏపీ ఈ ఏడాది సైతం గరిష్ట నీటిని తీసుకునే యత్నాలకు దిగిన నేపథ్యం లో అందులో వాటా కోరుతుందా, అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఏపీ తన వాటా 512 టీఎంసీల మేర ఉన్నందున కేంద్ర ప్రతిపాదనకు ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువ. రెండు రాష్ట్రాలు ఓకే చెప్పిన పక్షంలో కేంద్రం దానికి అనుగుణంగా ఓ ఆర్డర్ వెలువరించి ఊరుకునే అవకాశం ఉంది. కృష్ణాలో తగ్గిన ప్రవాహాలు.. కృష్ణా బేసిన్‌లోని ఎగువ ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు తగ్గాయి. ప్రస్తుతం అక్కడ 129 టీఎంసీల నిల్వకుగానూ 44 టీఎంసీల లభ్యత ఉంది. ఇక తుంగభద్రకు స్ధిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. బుధవారం 8,200 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండటంతో అక్కడ 100 టీఎంసీలకు గానూ 13.46 టీఎంసీల లభ్యత ఉంది. నాగార్జున సాగర్‌లో ఏకంగా 501 అడుగుల కనిష్ట మట్టానికి నీటి నిల్వలు పడిపోయాయి. -
ఏపీ చేస్తే ఒప్పు.. మాది మాత్రం తప్పా!
- కృష్ణా జలాల విషయంలో బోర్డు ఏకపక్ష నిర్ణయాలపై రాష్ట్రం ఆగ్రహం - టెలిమెట్రీపై ఏపీ వైఖరిని ఎందుకు ప్రశ్నంచలేదని నిలదీత - బోర్డు సభ్యకార్యదర్శికి ఘాటు లేఖ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ, వినియోగం, నిర్వహణ విషయంలో బోర్డు ఏకపక్షంగా చేస్తున్న నిర్ణయాలపై తెలంగాణ తొలిసారి ఘాటుగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌కు వత్తాసు పలికేలా బోర్డు వ్యవహారం ఉందంటూ అభ్యంతరం తెలిపింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నుంచి తమ తాగునీటి అవసరాలకు చేసిన నీటి వినియోగాన్ని, అదనపు వాటా కింద చూపి కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేసిన కృష్ణాబోర్డు, టెలిమెట్రీ విషయంలో ఏపీ అడ్డుతగులుతున్నా ఎందుకు స్పందించలేదని నిలదీసింది. టెలిమెట్రీ మార్పుల విషయంలో సైతం రాష్ట్రానికి కనీస సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. ఈ మేరకు రాష్ట్రం సోమవారం బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాసింది. ఆదేశాలు మాకేనా..? రాష్ట్ర పరిధిలోని జూరాల, ఏఎంఆర్పీ, సాగర్ ఎడమ కాల్వ కింద టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు పనులు పూర్తయినా, ఏపీ పరిధిలోని సాగర్ కుడి కాల్వ కింద మాత్రం ఇంతవరకు పనులు పూర్తవలేదని రాష్ట్ర ప్రభుత్వం బోర్డు సభ్యకార్యదర్శి దృష్టికి తెచ్చింది. కుడి కాల్వ కింద ఏపీ టెలిమెట్రీ పనులను అడ్డుకున్నా, దీనిపై వర్క్ ఏజెన్సీ లేఖ రాసినా, బోర్డు మాత్రం పట్టించుకోలేదని, ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది. సాగర్కింద 3.26 టీఎంసీలు అదనంగా తెలంగాణ వాడిందంటూ కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేసిన బోర్డు, టెలిమెట్రీ విషయంలో ఏపీ వైఖరిని ఎందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదని ప్రశ్నించింది. ఆదేశాలు మాకే తప్ప, ఏపీకి ఉండవా అని ప్రశ్నించింది. ఇక పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ దిగువన 600 మీటర్ల వద్ద టెలిమెట్రీకి ప్రతిపాదించగా, దాన్ని శ్రీశైలం కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్ పాయింట్‌కు ఎవరిని అడిగి మార్చాలని సూటిగా ప్రశ్నించింది. ఎందుకు మార్చుతున్నారన్నది చెప్పకుండా, రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు చేశారని పేర్కొంది. కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్ వరకు మధ్యలో 4,500 ఎకరాలకు నీళ్లిచ్చే ఎత్తిపోతల పథకాలను ఏపీ నిర్వహిస్తోందని, బంకచర్ల వరకు తాగునీటి పథకాలు సైతం ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం పాయింట్‌మారిస్తే ఈ నీటి వినియోగమేదీ లెక్కలోకి రాదని తేల్చిచెప్పింది. ఈ సమయంలోనే సాగర్ ఎడమ గట్టు కాల్వలపై ఏపీ, తెలంగాణ సరిహద్దులో 101.36 కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, దాన్ని 102.63 కిలోమీటర్‌కు మార్చాలని నిర్ణయించడాన్ని రాష్ట్రం తప్పుపట్టింది. పాయింట్ మారిస్తే ఏపీ పరిధిలోని నూతిపాడు కింద రెండు ఎత్తిపోతల పథకాల కింద జరిగే నీటి వినియోగం లెక్కలోకి రాదని, ఈ దృష్ట్యా మార్పులకు అంగీకరించమని స్పష్టం చేసింది. వివక్షను సహించబోం.. రెండో విడత టెలిమెట్రీలో 29 చోట్ల ఏర్పాటుకు అంగీకరించగా, 15 చోట్ల ఏర్పాటుపై ఏపీ అనేక అభ్యంతరాలు చెబుతోందని తెలిపింది. ఏపీ అభ్యంతరం చెబుతున్న టెలిమెట్రీ ప్రాంతాలన్నీ కృష్ణాడెల్టా వ్యవస్థ, తుంగభద్ర, పోతిరెడ్డిపాడు ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలిపింది. గతంలో కుదిరిన అవగాహన మేరకు ఇరు ప్రాంతాల్లో సమాన స్థాయిలో టెలిమెట్రీ పరికరాలు అమర్చే ప్రక్రియ జరగాల్సి ఉన్నా, తెలంగాణలో మాత్రమే వేగంగా జరుగుతోందని తెలిపింది. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని అందరికీ సమన్యాయం జరిగేలా బోర్డు చర్యలు తీసుకోవాలని సూచించింది. వివక్షను ఒప్పుకోమని పేర్కొంది. కాగా ఇదే విషయాన్ని ఈ నెల 5న జరిగే త్రిసభ్య కమిటీ భేటీలోనూ ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
జూన్ నాటికి నాలుగు ప్రాజెక్టులు పూర్తి కావాలి
- దేవాదుల, రాజీవ్ భీమా, ఎస్సారెస్పీ–2,మత్తడివాగు ప్రాజెక్టులపై కేంద్రం - ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీరివ్వాలని ఆదేశం - పీఎంకేఎస్‌వై కింద ఈ ప్రాజెక్టులకు కేంద్ర నిధులు - ఇటీవలే కేంద్ర జల వనరుల శాఖతో సమీక్షించి టార్గెట్లు పెట్టిన ప్రధాని మోదీ సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై)కింద సాయం పొందుతున్న 4 రాష్ట్ర ప్రాజెక్టులను జూన్‌లోగా పూర్తి చేయాలని కేంద్రం డెడ్‌లైన్ పెట్టింది. దేవాదుల, రాజీవ్ భీమా, ఎస్సారెస్పీ–2, మత్తడివాగు ప్రాజెక్టులను పూర్తి చేసి కచ్చితంగా ఖరీఫ్‌లో నిర్ణీత ఆయకట్టుకు నీరిందించాలని ఆదేశించింది. పీఎంకేఎస్‌వై పథకం కింద దేశంలో 99 సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందిస్తోంది. అందులో ఈ ఏడాది జూన్ నాటికి 21 ప్రాజెక్టులు పూర్తి చేయాలని, 5.22లక్షల హెక్టార్లకు నీరందించాలని గత నెల 30న జరిగిన సమీక్ష సందర్భంగా ప్రధాని మోదీ కేంద్ర జల వనరుల శాఖను ఆదేశించారు. ఆ 21 ప్రాజెక్టుల్లో తెలంగాణకు చెందిన నాలుగు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి పనుల పూర్తికి నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది 4.. వచ్చే ఏడాది 6: పీఎంకేఎస్‌వై కింద రాష్ట్రంలోని కుమ్రం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను గుర్తించారు. వాటి నిర్మాణం కోసం మొత్తంగా రూ.25,027 కోట్లతో అంచనాలు రూపొందించగా.. రూ.17,357.35 కోట్లు ఖర్చు చేశారు. రూ.7,669.65 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధుల కోసం కేంద్రాన్ని సంప్రదించిన రాష్ట్రం ఏఐబీపీ కింద నిధులు సమకూ ర్చాలని కోరింది. సానుకూలంగా స్పందించిన జల వనరుల శాఖ రూ.1,196 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. 2016–17లో రూ.537.65 కోట్లు విడుదల చేసింది. మిగతా నిధులు అందాల్సి ఉంది. ఈ 11 ప్రాజెక్టుల్లో దేవాదుల, రాజీవ్ భీమా, ఎస్సారెస్పీ–2, మత్తడివాగు ప్రాజెక్టులు జూన్ నాటికి పూర్తవాల్సి ఉండగా.. గొల్లవాగు, జగన్నాథ్‌పూర్ పెద్దవాగు, పాలెంవాగు, కుమ్రం భీం, ర్యాలివాగు, నీల్వాయి ప్రాజెక్టులు వచ్చే ఏడాది పూర్తి కావాల్సిన జాబితాలో ఉన్నాయి. వరద కాల్వ పనులు 2019 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. 11 లక్షల ఎకరాలకు నీరు.. ఈ ఏడాది జూన్ నాటికి నిర్ణయించిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే గరిష్టంగా 11 లక్షల ఎకరాల మేర ఆయకట్టు సాగులోకి వస్తుంది. అయితే లక్ష్యం మేర ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయడం, పునరావా స కార్యక్రమాలను పూర్తి చేయడం వంటివి యుద్ధప్రాతిపదికన చేయాల్సి ఉంది. దేవాదుల ప్రాజెక్టుకు 14,965 హెక్టార్ల భూమి అవసరం ఉండగా.. 10,428 హెక్టార్లు సేకరించారు. మిగతా 4,267 హెక్టార్లను సేకరించాల్సి ఉంది. ఇక వరద కాల్వ పనులకు అడ్డంకిగా మారిన జాతీయ రహదారి క్రాసింగ్ పనులను, భీమా, కుమ్రం భీం ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన భూసేకరణను వేగిరం చేసి, పనులు సత్వరం పూర్తి చేయాల్సి ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం ఈ అంశాలపై దృష్టి సారించి పనుల వేగిరానికి నడుం బిగించింది. -
19న అపెక్స్ కౌన్సిల్ భేటీ?
- ఆ తేదీ తమకు ఓకే అని కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ - ఇంకా తేల్చని తెలంగాణ ప్రభుత్వం - 20 నుంచి అసెంబ్లీ నేపథ్యంలో 19వ తేదీపై తర్జనభర్జన - హరీశ్‌రావు ఢిల్లీ నుంచి వచ్చాక సీఎంతో చర్చించి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి వీలుగా ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండే అపెక్స్ కౌన్సిల్ తొలి భేటీ 19న ఢిల్లీలో జరిగే అవకాశం ఉంది. వివాదాల పరిష్కారంకోసం అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో సన్నాహాలు ఆరంభించిన కేంద్ర జల వనరుల శాఖ భేటీకి సంబంధించిన తేదీలపై అభిప్రాయాలు కోరగా, ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 19వ తేదీని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జిత్సింగ్కు లేఖ రాశారు. అయితే ఈ తేదీపై తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న దృష్ట్యా, చంద్రబాబు సూచించిన తేదీకి తెలంగాణ సమ్మతిస్తుందా? లేక మరో తేదీని సూచిస్తుందా? అన్నది తెలియరాలేదు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు తిరిగొచ్చాక, సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం చేస్తారని నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. గొడవంతా కొత్త ప్రాజెక్టులపైనే..: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెం డు రాష్ట్రాల మధ్య రెండేళ్లుగా అనేక వివాదాలు తలెత్తాయి. తెలంగాణ రీ డిజైన్ చేస్తు న్న ప్రాణహిత, కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టులతో పాటు వాటర్ గ్రిడ్‌పైనా అనేక అనుమానాలు లేవనెత్తుతూ ఏపీ ప్రభుత్వం కేంద్రం, నదీ బోర్డులకు ఫిర్యాదు చేసింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఉమ్మడి ఏపీలోనే అనుమతులిచ్చారని, రీ డిజైన్ ప్రాజెక్టులన్నింటికీ గతంలోనే అన్ని అనుమతులున్నాయని తెలంగాణ అంటోంది. కృష్ణాలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయిం పు లే లేనప్పుడు, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం ఎందుకని ప్రశ్నిస్తోంది. నిర్ణీత కేటాయింపుల్లోంచే తమ వాటా నీటిని వాడుకుంటున్నామని చెబుతోంది. ఏపీ మా త్రం పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తోందని తెలంగాణ వాదిస్తోంది. 90టీఎంసీల అదనపు వాటాకోసం కొట్లాట: ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టును చేపట్టినందున బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తమకు 45 టీఎంసీలు, ఇదే అవార్డు ప్రకారం ఇంకా ఏదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే పైరాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతూ మొత్తంగా 90 టీఎంసీలు తమకు దక్కుతాయని తెలంగాణ అంటోంది. వివాదాలపై బోర్డుల వద్ద చర్చ జరిగినా శాశ్వతంగా ఎలాంటి పరిష్కారం లభించడం లేదు. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని ఏపీ పదేపదే కోరుతున్నా, తెలంగాణ మాత్రం తిరస్కరిస్తోంది. అయితే తాజాగా పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులపై ఏపీకి చెందిన కొందరు రైతులు సుప్రీంను ఆశ్రయించడం, అపెక్స్ కౌన్సిల్ భేటీలో దీన్ని పరిష్కరించుకోవాలని కోర్టు సూచించడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీకి కేంద్రం సిద్ధమైంది. మంగళవారం ఈ అంశంపై తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్కే జోషి, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీతో భేటీ అయ్యారు. తేదీల ఖరారు, తెలంగాణ అభ్యంతరాలపై చర్చించారు. -
రూ. 3 వేల కోట్లు ఇవ్వండి
♦ వివిధ ప్రాజెక్టుల కోసం కేంద్ర ఆర్థిక సహకారం కోరిన రాష్ట్రం ♦ కేంద్ర జల వనరుల శాఖ అదనపు కార్యదర్శికి ప్రాథమ్యాల వివరణ ♦ మిషన్ కాకతీయకు ట్రిపుల్ ఆర్ కింద రూ. 400 కోట్లు కావాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రతీ నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో చేపడుతున్న ప్రాజెక్టులకు భారీగా సాయం అందించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మిషన్ కాకతీయ సహా పలు కీలక ప్రాజెక్టుల పనులకు వివిధ కేంద్ర పథకాల కింద రూ. 3 వేల కోట్లు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ అదనపు కార్యదర్శి నిఖిలేష్ ఝాతో మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, విజయప్రకాశ్ శుక్రవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పథకాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో రూ. 1.05 లక్షల కోట్లు వెచ్చించి 60 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చే ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, డిండి ఎత్తిపోతల పథకం లక్ష్యాలు, బడ్జెట్ అవసరాలను కేంద్ర అదనపు కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. కొత్త ప్రాజెక్టులకు రూ. 75 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 10 వేల కోట్లు వెచ్చిస్తామన్నారు. రెండో దశలో 650 చెరువులు, మూడో దశలో 1,210 చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నామని, వీటికి ట్రిపుల్ ఆర్ కింద అవసరమైన రూ. 412 కోట్లు, దేవాదులకు సంబంధించి పెండింగ్ నిధులు రూ.422 కోట్లు, నిజాంసాగర్ ఆధునీకరణకు ఏఐబీపీ కింద రూ. 978 కోట్లు, మోదికుంటవాగుకు రూ. 456 కోట్లు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు శ్రీరాంసాగర్ వరద కాల్వకు సంబంధించి తాజా అంచనా రూ. 5,887 కోట్లకు ఆమోదం తెలపాలని, అలాగైతేనే అందులో 20శాతం నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతాయని వివరించారు. రాష్ట్ర భూగర్భ శాఖ ప్రతిపాదించిన 42 మండలాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ రీచార్జ్ ప్రణాళికను వెంటనే ఆమోదించాలని కోరారు. కేంద్ర జల సంఘం సూచన మేరకు ప్రాణహిత-చేవెళ్ల పథకం డిజైన్‌లో మార్పులు చేసి.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపడుతున్నామని వివరించిన మంత్రి హరీశ్‌రావు.. దీనిపై త్వరలోనే కేంద్రానికి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అందజేస్తామని తెలిపారు. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వండి: నిఖిలేష్ ఝా రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర నీటి పారుదల ప్రణాళికను నిఖిలేష్ఝా ప్రశంసించారు. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్యశాఖ, భూగర్భ శాఖలతో కలసి రాష్ట్ర సాగునీటి ప్రణాళికను తయారు చేయాలన్నారు. సాగుకోసం వినియోగించే నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. అలాంటి వాటిని వినియోగించేవారికి కేన్సర్ల వంటి వ్యాధులు వస్తున్నాయన్నారు. దీనికి తెలంగాణలో మూసీ నది ఉదాహరణ అని, అందుకే నీటి నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మిషన్ కాకతీయ ప్రయోగాన్ని ప్రశంసిస్తూనే.. కేంద్రం తెచ్చిన ‘వన్ డ్రాప్-మోర్ క్రాప్’ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలన్నారు. రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధం చేసిన ఇరిగేషన్ ప్రణాళికలను అధ్యయనం చేసి అందులోని అంశాలను గ్రహించే యత్నం చేయాలని సూచించారు. -
‘మహా’ ఉత్కంఠ!
- మహానది-గోదావరిల అనుసంధానంపై రేపు ఢిల్లీలో కీలక భేటీ - అనుసంధాన ప్రక్రియను వ్యతిరేకిస్తున్న ఒడిశా - గోదావరిలో మిగులు జలాల లభ్యత పునఃపరిశీలించాలంటున్న తెలంగాణ - మహానదిలో 180 టీఎంసీల మిగులు జలాలున్నాయంటున్న ఎన్డీడబ్ల్యూఏ - కీలకంగా మారనున్న కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నదుల అనుసంధానంపై విధాన రూపకల్పన ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. నదీ జలాల లభ్యతపై కేంద్రం చెబుతున్న లెక్కలకు, రాష్ట్రాలు చెబుతున్న లెక్కలకు పొంతన కుదరట్లేదు. దీంతో ఈ అంశంపై మళ్లీ పూర్తిస్థాయి అధ్యయనం చేపట్టాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తుండటం అనుసంధాన ప్రక్రియకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా మహానది-గోదావరి నదుల అనుసంధానాన్ని ఒడిశా తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా గోదావరిలో మిగులు జలాల లభ్యతను పునఃపరిశీలించాకే ఏ కార్యాచరణకైనా పూనుకోవాలని తెలంగాణ రాష్ట్రం కోరడం కేంద్రాన్ని అయోమయంలోకి నెట్టేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలవనరులశాఖ నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ మహానది-గోదావరిల అనుసంధానంపై ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అనుసంధానానికి అనేక అభ్యంతరాలు... మహానదిలో ఒడిశా అవసరాలుపోనూ మరో 180 టీఎంసీల మిగులు జలాలున్నాయని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) చెబుతోంది. అయితే మహానదిలో మిగులు జలాలపై ఇప్పటికే కేంద్రం ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ శర్మతో కూడిన ఆరుగురు సభ్యుల టాస్క్‌ఫోర్స్ కమిటీ ముందు ఒడిశా తన అభ్యంతరాలను వివరించింది. ఎన్‌డబ్ల్యూడీఏ చెప్పినట్లుగా మహానదిలో 180 టీఎంసీల అదనపు జలాలు లేవని, ఉన్న కొద్దిపాటి జలాలు తమ భవిష్యత్తు అవసరాలకే సరిపోతాయని పేర్కొంది. ఎన్‌డబ్ల్యూడీఏ గతంలోనే మహానదిపై భారీ డ్యామ్‌ను ప్రతిపాదించగా ముంపు ఎక్కువగా ఉన్న దృష్ట్యా దాని బదులు ఐదారు చిన్న బ్యారేజీలు కట్టాలని ఒడిశా ప్రతిపాదించింది. దీన్ని ఎన్‌డబ్ల్యూడీఏ వ్యతిరేకిస్తోంది. బ్యారేజీల నిర్మాణంతో ఒడిశాలో ముంపు ప్రాంతాలు తగ్గినా ఆశించిన మేర నీరు దిగువ ప్రాంతాలకు రాదని చెబుతోంది. దీంతో సందిగ్ధంలో పడిన కేంద్రం నీటి లభ్యతపై పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని ఇరుపక్షాలను ఆదేశించింది. మంగళవారం ఢిల్లీలో జరిగే సమావేశంలో ఒడిశా, ఎన్డబ్ల్యూడీఏల నివేదికపై చ ర్చించనుంది. గోదావరికి సంబంధించిన అంశం కావడంతో గోదావరిలో అదనపు జలాల లభ్యత వివరాలతో తెలంగాణ సైతం హాజరుకావాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచించింది. దీంతో రాష్ట్రం నుంచి నీటిపారుదలశాఖ అధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. తమ ప్రయోజనాలు పూర్తయ్యాకే అదనపు జలాలను తరలించాలని ఇప్పటికే రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. గోదావరిలో లభ్యంగా ఉన్న 980 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతాయని, 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనం ఆధారంగా గోదావరిలో అదనపు జలాలున్నాయనడం సరికాదంటోంది. గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలాల్లో కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా నీటిని కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే అంగీకరించబోమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం కీలకంగా మారనుంది.