కెనరా బ్యాంక్‌కు ఎంఎస్‌ఎంఈ ఎక్సలెన్స్‌ అవార్డు | Canara Bank honoured as Winner in MSME Banking Excellence Awards-2022 | Sakshi
Sakshi News home page

కెనరా బ్యాంక్‌కు ఎంఎస్‌ఎంఈ ఎక్సలెన్స్‌ అవార్డు

Published Thu, Mar 2 2023 1:06 AM | Last Updated on Thu, Mar 2 2023 1:06 AM

Canara Bank honoured as Winner in MSME Banking Excellence Awards-2022 - Sakshi

హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ను ‘ఎంఎస్‌ఎంఈ బ్యాంకింగ్‌ ఎక్సలెన్స్‌ అవార్డు 2022’ వరించింది. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ప్రోత్సహించే దిశగా బ్యాంక్‌ అందించిన సేవలకుగానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.

ఢిల్లీలోని చాంబర్‌ ఆఫ్‌ ఇండియన్‌ మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ ఈ అవార్డు అందించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ చేతుల మీదుగా బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ భవేంద్ర కుమార్‌ ఈ అవార్డును అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement