Gajendra Singh Shekhawat
-
పీవీ సింధు పెళ్లి.. తొలి ఫొటో వైరల్
PV Sindhu Marries Venkatta Datta Sai: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. వ్యాపారవేత్త వెంకట దత్త సాయి(Venkatta Datta Sai)ని ఆదివారం ఆమె వివాహమాడింది. ఈ వేడుకకు సంబంధించిన తొలి ఫొటో సోమవారం బయటకు వచ్చింది.ఫొటో షేర్ చేసిన కేంద్ర మంత్రికేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పీవీ సింధు- వెంకట దత్త సాయి పెళ్లి ఫొటోను షేర్ చేశారు. ‘ఉదయర్పూర్లో నిన్న సాయంత్రం.. మన బ్యాడ్మింటన్ చాంపియన్, ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు- వెంకట దత్త సాయి వివాహానికి హాజరుకావడం సంతోషంగా ఉంది.నూతన దంపతులకు శుభాకాంక్షల వెల్లువజీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలతో పాటు ఆశీర్వాదాలూ అందజేశాను’’ అని గజేంద్ర సింగ్ షెకావత్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.కాగా జీవితంలోని ప్రత్యేకమైన ఘట్టంలో సింధు- వెంకట దత్త సాయి వెండి రంగు దుస్తుల్లో తళుక్కుమన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరైనట్లు సమాచారం.రాజస్తాన్‌లో పెళ్లిరాజస్తాన్లోని ఉదయ్‌పూర్‌లోని రాజకోట వంటి వేదికపై సింధు- వెంకట దత్త సాయి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా వరుడు మరెవరో కాదు.. సింధుకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఇరు కుటుంబాల పెద్దల నిర్ణయం మేరకు వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక మంగళవారం(డిసెంబరు 24) సింధు- వెంకట దత్త సాయి వివాహ రిసెప్షన్ జరుగనుంది.రెండు ఒలింపిక్ పతకాలుకాగా రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన తెలుగు తేజం సింధు.. టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. తద్వారా భారత్ తరఫున వరుసగా రెండు ఎడిషన్లలో ఒలింపిక్ పతకాలు గెలిచిన ప్లేయర్‌గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. అయితే, ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది.ఈ వార్త చదవండి: IPL 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!.. ఇకపై.. Pleased to have attended the wedding ceremony of our Badminton Champion Olympian PV Sindhu with Venkatta Datta Sai in Udaipur last evening and conveyed my wishes & blessings to the couple for their new life ahead.@Pvsindhu1 pic.twitter.com/hjMwr5m76y— Gajendra Singh Shekhawat (@gssjodhpur) December 23, 2024 -
సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: దేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం, ప్రోత్సహించడం అందరి సమష్టి బాధ్యతని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యం, సంగీతం, కళలు, సంప్రదాయ వస్త్రధారణను దేశ వారసత్వంగా అభివరి్ణంచారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల సంప్రదాయాలు, జాతుల గురించి దేశ ప్రజలందరికీ తెలియజేసేందుకే ‘భారతీయ కళా మహోత్సవ్’ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారతీయ కళా మహోత్సవ్ తొలి ఎడిషన్‌ను సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదీ ముర్ము శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల మధ్య వార ధిగా ఈ ఉత్సవం నిలుస్తుందన్నారు.కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ మాట్లాడుతూ దేశంలోని విభిన్న సంస్కృతుల ప్రదర్శన దేశ ఐక్యతను చాటుతుందన్నారు. మంత్రి సీతక్క తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ కె. త్రివిక్రమ్ పటా్నయక్, మణిపూర్, అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, మేఘాలయ గవర్నర్ సీ.హెచ్. విజయశంకర్, సిక్కిం గవర్నర్ ఓం ప్రకాశ్ మాథుర్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆయా రాష్ట్రా ల కళాకారులు, అధికారులు పాల్గొ న్నారు.ఈ ఉత్సవంలో ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు. అక్టోబర్ 6 వరకు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల మధ్య సందర్శకులను అనుమతి https://visit.rasht rapatibhavan.gov.in ద్వారా స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ముగిసిన రాష్ట్రపతి రాష్ట్ర పర్యటన: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒక రోజు రాష్ట్ర పర్యటన ముగిసింది. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ, సీఎం రేవంత్, మంత్రులు పొన్నం, సీత క్క, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేంద్ర, సీపీ సీవీ ఆనంద్ స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి శామీర్‌పేటలోని నల్సార్ లా వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తరువాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘కళామహోత్సవ్’ను ప్రారంభించారు. రాత్రి తిరిగి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. -
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనే విమోచన ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా హైదరాబాద్ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. రెండేళ్లక్రితం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో తొలిసారిగా ఈ ఉత్సవాలను కేంద్రం అధికారికంగా నిర్వహించినపుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ వేడుకలకు అమిత్‌షా హాజరవుతారని రాష్ట్ర పార్టీ నేతలు గట్టిగా విశ్వసించారు. అయితే ఈ నెల 17న పరేడ్‌గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన విమోచన వేడుకలు నిర్వహించనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. గతేడాది కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా చారిత్రక గోల్కొండ కోటలో సైనికదళాల పరేడ్‌తో పాటు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన విషయం విదితమే.ఈ ఏడాది కూడా కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఆయనతో పాటు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం... పారా మిలటరీ దళాలు, సైనిక దళాలు పరేడ్‌ను నిర్వహించనున్నాయి. హైదరాబాద్ సంస్థానం విముక్తి కోసం జరిగిన పోరాటానికి సంబంధించిన చారిత్రక అంశాలతో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలను కళాకారులు ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే...17న హైదరాబాద్ విమోచన సందర్భాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడాన్ని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 17న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడాన్ని కేంద్రమంత్రి సంజయ్, బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. 17న రాష్ట్ర ప్రభుత్వమే విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు బీజేపీ శాసనసభాపక్షం సిద్ధమవుతోంది. -
తెలంగాణను మొదటిస్థానంలో నిలుపుతాం..
-
స్కై డైవింగ్ చేసిన కేంద్ర మంత్రి.. వీడియో వైరల్
ఢిల్లీ: 56 ఏళ్ల వయసులో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అరుదైన సాహసం చేశారు. వరల్డ్ స్కై డైవింగ్ రోజున.. ఆయన కూడా ఆ ఫీట్ చేసి ఆకట్టకున్నారు. భారత దేశంలో ప్రైవేటు రంగంలో మొట్టమొదటి స్కై డైవింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నారాయన.‘‘భారత్‌తో పాటు ఈ ప్రపంచానికి ఈ రోజు అతిముఖ్యమైనది. హరియాణాలోని నార్నౌల్‌లో ఈ కేంద్రం ఏర్పాటైంది. దేశ పర్యటక శాఖ మంత్రిగా ప్రజలకు ఈ తరహా సదుపాయాలు అందుబాటులో ఉంచడం నా బాధ్యత’’ అని మీడియాతో మాట్లాడారు.అలాగే తాను స్కై డైవింగ్ చేసిన చిత్రాలను, వీడియోలను ఎక్స్(ట్విటర్) వేదికగా షేర్ చేశారు. ‘‘ఆ థ్రిల్‌ను నేనూ ఎంజాయ్ చేశాను. భారత పర్యటక రంగం అంతర్జాతీయ వసతులను పొందుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అంటూ పోస్టు పెట్టారు. दिन विशेष: स्काई डाइविंग का रोमांच। pic.twitter.com/iGoaQLDeyL— Gajendra Singh Shekhawat (@gssjodhpur) July 13, 2024 -
జాతీయ హోదా చాన్స్ లేదు
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ప్రాజెక్టుకు మరో రకంగా సాయం అందిస్తామని పేర్కొంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో కూడిన రాష్ట్ర బృందానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఏఐసీసీ నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్, ఉత్తమ్.. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. షెకావత్‌తో సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీఎస్ శాంతికుమారి, సాగునీటి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్, సీఈ హమీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ హోదా పరిశీలనే లేదు.. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదాతో పాటు వివిధ అనుమతులకు సంబంధించిన రెండు వినతిపత్రాలను రాష్ట్ర బృందం షెకావత్‌కు అందజేసింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. ‘‘ప్రస్తుతం దేశంలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విషయాన్ని కేంద్రం పరిశీలించడంగానీ, పరిగణనలోకి తీసుకోవడంగానీ లేదు. జాతీయ హోదా అంశాన్ని కేంద్రం పక్కనపెట్టింది. పోలవరం తర్వాత కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ఇచ్చిన జాతీయ హోదానే వెనక్కి తీసుకోవాలనే యోచన ఉంది. అయితే జాతీయ హోదాకు బదులు పాలమూరు ప్రాజెక్టుకు మరో రకంగా సాయం చేస్తాం. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 నిష్పత్తిన నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తాం. ఈ పథకం ద్వారా గరిష్ట సాయం అందేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. అనుమతులు ఇప్పించండి పాలమూరు ప్రాజెక్టును మిగులు జలాల ఆధారంగా చేపట్టినా.. తర్వాత ప్రభుత్వం 75శాతం డిపెండబులిటీ ఆధారంగా ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటిని కేటాయించిందని కేంద్ర మంత్రికి రాష్ట్ర బృందం తెలిపింది. ఇందులో మైనర్ ఇరిగేషన్ కింద వినియోగించుకోలేని 45 టీఎంసీలు, గోదావరి మళ్లింపు జలాల ఆధారంగా రాష్ట్రానికి దక్కే వాటా 45 టీఎంసీలు ఉన్నాయని వివరించింది. రూ.55,086 కోట్ల వ్యయఅంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంంఘం పరిశీలనకు పంపామని వెల్లడించింది. ప్రాజెక్టుకు ఇప్పటివరకు అటవీ, పర్యావరణ, వైల్డ్‌లైఫ్ వంటి అనుమతులు వచ్చాయని.. హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, కాస్ట్ ఎస్టిమేట్, అంతర్రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన అనుమతులు రావాల్సి ఉందని తెలిపింది. ఈ అనుమతులు వీలైనంత త్వరగా ఇప్పించేలా చొరవ చూపాలని కోరింది. సానుకూలంగా స్పందించారు: ఉత్తమ్ ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా విధానం లేదని కేంద్ర‡ మంత్రి షెకావత్ చెప్పారని భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాకు తెలిపారు. ఇతర పథకాల కింద పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ప్రాజెక్టుకు ఇంకా రావాల్సిన అనుమతులు ఇప్పించే అంశంపై సానుకూలంగా స్పందించారని వివరించారు. కేంద్రం వేరే విధంగా సాయం చేస్తామన్న కేంద్ర మంత్రి హామీకి రాష్ట్రం ఓకే చెప్పిందా? అని ప్రశ్నించగా.. దీనిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ‘విభజన’ను పూర్తి చేయండి తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్‌లనే కేటాయించారని తెలిపారు. జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు ఇవ్వాలని కోరారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అధికారులను అదనంగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రేవంత్ తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఢిల్లీ నార్త్‌బ్లాక్‌లోని అమిత్ షా కార్యాలయంలో గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. ‘‘రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలి. పదో షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలి. ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను సాఫీగా పూర్తి చేయాలి. చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్న విషయంపై దృష్టి సారించాలి. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి రూ.90 కోట్లు అదనంగా కేటాయించాలి. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, ఎస్హెచ్ఆర్సీ వంటి భవనాలను వినియోగించుకున్నందున.. ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాలి..’’ అని వినతిపత్రంలో కోరారు. ‘మెట్రో’ సవరణలను ఆమోదించండి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ అయిన సీఎం రేవంత్ బృందం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించింది. ‘‘హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించండి. సవరించిన ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే విషయాన్ని పరిశీలించండి. హైదరాబాద్‌లోని మూసీ రివర్ ఫ్రంట్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్, బిజినెస్ ఏరియా, దుకాణ సముదాయాలతో బహుళ విధాలా ఉపయోగపడేలా చేయాలని నిర్ణయించాం. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అవసరమైన మద్దతు ఇవ్వాలి. రాష్ట్రంలో పేదలకు నిర్మించి ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేసేలా అనుమతి ఇవ్వాలి. తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయడంతోపాటు పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి..’’ అని రాష్ట్ర బృందం కోరింది. నేడు యూపీఎస్సీ చైర్మన్‌తో భేటీ సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ శుక్రవారం ఉదయం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో భేటీ కానున్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని రూపొందించాలన్న ఉద్దేశంతో ఈ భేటీ జరగనుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత ప్రభుత్వం పేపర్ లీక్‌లతో టీఎస్పీఎస్సీని భ్రష్టు పట్టించిందని.. దానిని ప్రక్షాళన చేసే దిశగా అవసరమైన చర్యలపై యూపీఎస్సీ చైర్మన్‌తో చర్చిస్తామని వెల్లడించారు. -
జాదూగర్ కా జాదూ ఖతం: భారీ మెజార్టీ మాదే!
రాజస్థాన్‌లో బీజేపీ విజయం దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న కమలం పార్టీ దాదాపు 106 సీట్లలో ఎక్కువ ఓట్లను సాధిస్తోంది. అటు అధికార పార్టీ 2018 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఆధిక్యంలో వెనుకబడి ఉంది. అధికారమార్పుకోసం రాజస్థాన్ ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రకటించిన బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ భారీ మెజారీటీతో గెలుస్తుంది. మాంత్రికుడి మాయాజాలం ముగిసింది . రాజస్థాన్ ప్రజలు వాస్తవికతపై ఓటు వేశారని కేంద్ర మంత్రి చెప్పారు.అంతేకాదు ఛత్తీస్‌గఢ్‌లో కూడా విజయం తమదేనని పేర్కొన్నారు. అటు రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్‌లో బీజేపీ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టేశారు. #WATCH | Rajasthan BJP cadre celebrate party's lead in state elections, in Jaipur pic.twitter.com/WzqB4lVrZe — ANI (@ANI) December 3, 2023 VIDEO | "BJP will win with a thumping majority. The magician's magic is over and Rajasthan's public has voted on reality," says Union minister @gssjodhpur as trends suggest comfortable lead for BJP in the Assembly polls. #RajasthanElections2023 #AssemblyElectionsWithPTI… pic.twitter.com/ET8V9IpAtJ — Press Trust of India (@PTI_News) December 3, 2023 మరోవైపు ప్రస్తుత ట్రెండ్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి సంతోషం వ్యక్తం చేశారు. ఇపుడున్న ఆధిక్యం తుదివరకూ కొనసాగుతుందన్నారు. 199 సీట్లలో 135 సీట్లు తమకు దక్కుతాయని ధీమి వ్యక్తం చేశారు. అంతేకాదు విజయం తమదేననీ, ఇప్పటికే స్వీట్లను కూడా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. తుది ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీఎస్పీ 3, సీపీఎం 1, స్వతంత్ర అభ్యర్థులు 8 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. -
నీటి పొదుపుతోనే భవితకు భరోసా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పెరుగుతున్న నీటి అవసరాల నేపథ్యంలో భూగర్భ జల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్ తరాలకు అందించగలమన్నారు. మురుగు నీటిని శుద్ధి చేయడం ద్వారా తిరిగి సాగునీటికి, పరిశ్రమలకు అందించేలా రీ సైక్లింగ్ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. చెరువులు, కుంటలను సంరక్షిస్తూ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో డ్యామ్‌ల పరిరక్షణకు ప్రధాని మోదీ సూచనల మేరకు ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. గురువారం విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ (ఐసీఐడీ) సదస్సును సీఎం జగన్‌తో కలసి ఆయన ప్రారంభించారు. అతి సుందరమైన విశాఖ నగరం దీనికి వేదిక కావడం ఎంతో సంతోషకరమన్నారు. ఐసీఐడీ కాంగ్రెస్‌కు ఆతిథ్యమిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్ ఏమన్నారంటే.. 140 బిలియన్ డాలర్ల వ్యయం వ్యవసాయ రంగంలో నీటి కొరతను అధిగమించేందుకు బహుళ విధానాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సాగునీటి రంగంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. అయితే సరైన ప్రణాళిక లేకుంటే వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతినడంతో పాటు కరువు పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో సాగునీటికి అనుబంధంగా ఉన్న అన్ని విభాగాలను 2019లో ప్రధాని మోదీ జలశక్తి శాఖ ఆదీనంలోకి తెచ్చారు. 2024 నాటికి సాగునీరు, పారిశుధ్య రంగాలపై 140 బిలియన్ డాలర్లను వెచ్చించాలని నిర్ణయించాం. దేశంలో సాగు విస్తీర్ణం గత 75 ఏళ్లలో మూడింతలు పెరిగి 140 మిలియన్ హెక్టార్లకు చేరింది. దిగుమతి చేసుకునే దశ నుంచి ఈ రోజు తిండిగింజల్లో మిగులు దేశంగా మారడంలో సాగునీటి రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 54 ప్రాజెక్టులు.. నీటి వనరులను అవసరాల మేరకు వినియోగించుకునేందుకు నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దేశంలో 1971లో 111 బిలియన్ క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉండగా నేడు 250 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరింది. 2023 మార్చిలో ప్రధాని మోదీ 54 ప్రాజెక్టులను ప్రారంభించి అదనంగా 25 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించడం ద్వారా రెండు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చారు. గత రెండు దశాబ్దాల్లో పట్టణీకరణ, జనాభా పెరుగుదల నేపథ్యంలో దేశంలో తలసరి నీటి లభ్యత 20 శాతం తగ్గింది. 2050 నాటికి మరో 20 శాతం తగ్గనుందని అంచనాలున్నాయి. నీటి వినియోగాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు 2022లో బ్యూరో ఆఫ్ వాటర్ ఎఫిషియన్సీని నియమించాం. 48,500 కి.మీ. మేర మంచినీటి పైపులైన్ ఏర్పాటు చేశాం. తద్వారా 28,000 హెక్టార్ల భూ సేకరణను తగ్గించాం. నీటి శుద్ధిపై దృష్టి నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంలో భాగంగా మురుగు నీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నీటిని సాగునీటికి, పరిశ్రమలకు ఉపయోగించుకోవడంపై దృష్టి సారించాం. ఇందుకోసం దేశవ్యాప్తంగా వాటర్ రీ–సైక్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నాం. అమెరికా, చైనా కలిపి వినియోగిస్తున్న భూగర్భ నీటి వనరుల కంటే మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. ప్రపంచంలోనే భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తున్న దేశాల్లో మనం ముందు వరుసలో ఉన్నాం. భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా మొత్తం 2.4 మిలియన్ చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని గుర్తించాం. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచేందుకు మ్యాపింగ్ పూర్తి చేశాం. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు 2019లో జలశక్తి అభియాన్ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. పూడిక తొలగించి వర్షపు నీటిని ఒడిసిపట్టుకునేందుకు 10 వేల మిలియన్ పనులను పూర్తి చేశాం. నదుల అనుసంధానం.. జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షాలు కురిసే సమయంలో సాధ్యమైనంత నీటిని ఒడిసి పట్టుకునేందుకు నదుల అనుసంధానాన్ని ప్రారంభించాం. నీటి లభ్యత ఎక్కువ ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ ఉన్న చోట్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నాం. సాగునీటి రంగం రాష్ట్ర పరిధిలోది కావడం వల్ల వాటి సహకారం ఎంతో అవసరం. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయు) చేసుకున్నాయి. కెన్, బెత్వా నదుల అనుసంధానంతో మిలియన్ హెక్టార్లకు సాగునీటితోపాటు వెనుకబడిన బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని 6.2 మిలియన్ జనాభాకు తాగునీరు లభించనుంది. డ్యామ్‌ల రక్షణకు ప్రత్యేక చర్యలు దేశంలో జలాశయాల నిర్మాణం ఎప్పటి నుంచో ఉంది. కావేరి నదిపై చోళుల కాలంలో 2 వేల ఏళ్ల క్రితం నిరి్మంచిన కళ్లాని డ్యామ్ ఇప్పటికీ ఉంది. దేశంలో మొత్తం 6,000 భారీ డ్యామ్‌లున్నాయి. 2020లో డ్యాం సేఫ్టీ చట్టాన్ని తీసుకొచ్చాం. ప్రపంచబ్యాంకు సహకారంతో 1.2 బిలియన్ డాలర్లతో దేశవ్యాప్తంగా 736 డ్యాంల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. మొదటి దశలో ఏడు రాష్ట్రాల్లో 223 డ్యామ్‌ల హైడ్రలాజికల్, స్ట్రక్చరల్, ఆపరేషనల్ రక్షణ చర్యలను పరిశీలించాం. డ్యామ్‌ల రక్షణతో పాటు నీటి వనరుల వినియోగంపై ఐసీఐడీ చర్చించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే సూచనలు చేస్తుందని భావిస్తున్నా. నదీ జలాలతో ‘జల్ భరో’ విశాఖ ఐసీఐడీ సదస్సు సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ నదుల నుంచి సేకరించిన జలాలను మట్టి కుండల్లో నింపి ‘జల్ భరో’ పేరుతో ఒకే చోట చేర్చారు. కేంద్ర మంత్రి షెకావత్, ముఖ్యమంత్రి జగన్, మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్, విడదల రజని మట్టి కుండల్లో ఉన్న నీటిని తరలించి ఒక చోట చేర్చారు. 25 ఐసీఐడీ అంతర్జాతీయ కాంగ్రెస్ యాబ్‌స్ట్రాక్ట్ వాల్యూమ్‌తో పాటు హిస్టారికల్ వాటర్ సస్టైనబులిటీ, వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ వాల్యూమ్‌ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సదస్సులో తొలి రోజు సంప్రదాయేతర నీటి వనరులు, రైతు సాధికారత, సుస్థిర లక్ష్యాలు, వ్యవసాయ రంగంలో నీటి వనరుల వినియోగం తదితర అంశాలపై వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. 56 దేశాలు... 147 పరిశోధన పత్రాలు 1950లో ఏర్పడిన ఐసీఐడీ పరిశోధనలను మనం వినియోగించుకుంటున్నాం. 74 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోంది. 2025 నాటికి పెరగనున్న 9.8 బిలియన్ జనాభాకు అనుగుణంగా నీటి వనరులను వాడుకోవడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంపై సదస్సులో చర్చించాలి. నీటి వినియోగంపై 56 దేశాలకు చెందిన ప్రతినిధులు 147 పరిశోధన పత్రాలను సమర్పిస్తారు. సమస్యను పరిష్కరించేందుకు ఇవి ఎంతో దోహదం చేస్తాయని విశ్వసిస్తున్నాం. ఈ సదస్సుకు సుందర నగరం విశాఖ కేంద్రం కావడం ఎంతో సంతోషంగా ఉంది. –ప్రొఫెసర్ డాక్టర్ రగబ్, ఐసీఐడీ ప్రెసిడెంట్ పర్యావరణ సమతుల్యతపై దృష్టి నీటి వనరులను పొదుపుగా వాడుకునేందుకు ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తిండి గింజల ఉత్పత్తిని పెంచడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. –కుశ్వందర్ వోహ్రా, ఐసీఐడీ వైస్ ప్రెసిడెంట్ -
నీటి పారుదల రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు !
-
సాగు నీటిలో నవచరిత్ర
ర్యాడిసన్ బ్లూ రిసార్ట్స్ వేదికగా దేశంలో 57 ఏళ్ల తరువాత ప్రతిష్టాత్మక సదస్సు.. దేశ విదేశాల నుంచి నగరానికి చేరుకున్న ప్రతినిధులు 5న తాటిపూడి రిజర్వాయర్, ఆయకట్టు నీటి సరఫరా పరిశీలన నీటి ఎద్దడిని అధిగమించడం, అధిక దిగుబడులే సదస్సు ప్రధాన అజెండా ఏటా కోటి ఎకరాలకుపైగా నీటిని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సుస్థిర సాగు, ఆహార భద్రతే లక్ష్యంగా అన్నదాతకు దన్నుగా అడుగులు సాక్షి, అమరావతి: సాగునీటి ఎద్దడిని అధిగమించి మానవాళికి ఆహార భద్రత చేకూర్చడమే అజెండాగా విశాఖ వేదికగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఐసీఐడీ (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) 25వ సదస్సును జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. ఐసీఐడీ ఛైర్మన్ డాక్టర్ రగబ్ అధ్యక్షతన ఈ నెల 8వతేదీ వరకు జరిగే ఈ సదస్సులో సాగునీటి కోసం ప్రత్యామ్నాయ జలవనరుల వినియోగం, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగు, అధిక దిగుబడులను అందించే వ్యవసాయ సాంకేతిక విధానాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 82 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు దీనికి హాజరు కానుండగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. సాగునీటి కోసం ప్రత్యామ్నాయ జలవనరుల వినియోగం (సముద్రపు నీటిని డీశాలినేషన్ చేయడం, మురుగు నీటిని శుద్ధి చేయడం తదితరాలు), తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగు, అధిక ఉత్పాదకత విధానాలపై పరిశోధన నివేదికలను సదస్సులో సమర్పించి చర్చించనున్నారు. ఈ అంశాలపై రెండు అంతర్జాతీయ సెమినార్లు, అంతర్భాగంగా పది కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 4న అవార్డుల ప్రదానోత్సవం ప్రపంచవ్యాప్తంగా జల సంరక్షణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సంస్థలకు, ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఎంపికైన ప్రాజెక్టులకు ఈనెల 4న అవార్డులు ప్రదానం చేయనున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో గోస్తని నదిపై 1963–68 మధ్య 3.175 టీఎంసీల సామర్థంతో నిర్మించిన తాటిపూడి రిజర్వాయర్‌ను ఈనెల 5న ఐసీఐడీ ప్రతినిధుల బృందం పరిశీలించి నీటి పారుదల వ్యవస్థను అధ్యయనం చేయనుంది. సదస్సు ముగింపు సందర్భంగా ఈనెల 8న ఐఈసీ (ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ) 74వ సమావేశాన్ని నిర్వహిస్తారు. అదే రోజు ఐఈసీ ఆఫీస్ బేరర్స్ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. 9న ఐసీఐడీ ప్రతినిధులు అరకు వ్యాలీని సందర్శించడంతో సిల్వర్ జూబ్లీ (25వ వేడుక) కాంగ్రెస్ పూర్తవుతుంది. 57 ఏళ్ల తర్వాత విశాఖ వేదికగా అంతర్జాతీయంగా సుస్థిర సాగునీటి నిర్వహణ లక్ష్యంగా 1950 జూన్ 24న సిమ్లా వేదికగా ఐసీఐడీ ఆవిర్భవించింది. ఐసీఐడీ తొలి కాంగ్రెస్ 1951 జనవరి 11–16 వరకు ఢిల్లీలో జరిగింది. మన దేశంలో చివరిగా ఐసీఐడీ ఆరో కాంగ్రెస్ 1966 జనవరి 4–13 వరకూ జరిగింది. సంస్థ ఆవిర్భవించిన 57 ఏళ్ల తరువాత సిల్వర్ జూబ్లీ వేడుకలు విశాఖలో జరగనుండటం గమనార్హం. ఈ ప్రతిష్టాత్మక సదస్సును కేంద్ర జలసంఘం, కేంద్ర జల్ శక్తి శాఖ, ఇన్సిడ్(ఇండియన్ నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఐసీఐడీ సిల్వర్ జూబ్లీ కాంగ్రెస్‌కు విశాఖ అందంగా ముస్తాబైంది. సదస్సును ర్యాడిసన్ బ్లూ రిసార్ట్స్ వేదికగా నిర్వహించనున్నారు. సర్కారు చిత్తశుద్ధికి దక్కిన గౌరవం నదీ జలాలను ఒడిసి పట్టి భూగర్భ జలాలను సంరక్షిస్తూ మెరుగైన యాజమాన్య పద్ధతులలో అధిక ఆయకట్టుకు నీళ్లందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2019లో రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లందించి రికార్డు నెలకొల్పారు. అదే ఒరవడితో 2020, 2021, 2022లోనూ కోటి ఎకరాలకు నీళ్లందించి అన్నదాతలకు దన్నుగా నిలిచారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఏడాది కూడా ఆయకట్టుకు సమర్థంగా నీళ్లందిస్తున్నారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరంతోపాటు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారు. సూక్ష్మ నీటిపారుదల (డ్రిప్, స్పింక్లర్లు) విధానాలకు పెద్దపీట వేస్తున్నారు. సాగునీటికి సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఐసీఐడీ సిల్వర్ జూబ్లీ సదస్సును ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. ఇది సుస్థిర సాగునీటి నిర్వహణ దిశగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వానికి దక్కిన గౌరవంగా సాగునీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఆహార భద్రతకు ప్రాధాన్యం అధిక ఆయకట్టుకు సుస్థిరంగా సాగునీటిని అందించి ఆహార భద్రత చేకూర్చడమే లక్ష్యంగా సీఎం జగన్ నీటిపారుదల రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ ఐసీఐడీ సిల్వర్ జూబ్లీ కాంగ్రెస్ నిర్వహణకు విశాఖను వేదికగా ఎంపిక చేసింది. ఈ సదస్సు ద్వారా రాష్ట్ర నీటిపారుదల రంగంలో నవ చరిత్రను లిఖిస్తాం. సీఎం జగన్ నేతృత్వంలో ప్రపంచంలో అత్యత్తుమ నీటిపారుదల విధానాలను ఈ సదస్సు ద్వారా అందిపుచ్చుకుని రైతులకు బాసటగా నిలుస్తాం. – శశిభూషణ్‌కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అత్యుత్తమ నీటి విధానాలే లక్ష్యం సుస్థిర సాగునీటి నిర్వహణతో రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. అందులో భాగంగానే వరద నీటిని ఒడిసి పట్టి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే ప్రాజెక్టులు చేపట్టాం. పోలవరం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మెరుగైన యాజమాన్య పద్ధతుల ద్వారా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆయకట్టుకు నీళ్లందిస్తున్నాం. ప్రపంచంలో అత్యుత్తమ నీటిపారుదల విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ నేడు విశాఖ సదస్సుకు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో మొదలయ్యే 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ ప్లీనరీ (ఐసీఐడీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం ఉదయం 7.35 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. సదస్సుకు హాజరైన అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. -
వాళ్ల నాలుక చీరేయాలి.. కళ్లు పెరికేయాలి: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
జైపూర్: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుక చీరేయాలి, కనుగుడ్లు పెరికివేయాలంటూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గత వారం రాజస్తాన్‌లోని బర్మేర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మంత్రి మాట్లాడారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. ‘ఇటువంటి సవాళ్లను మనం ఎదుర్కోవాలి. సనాతన్‌కు వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుక చీరేయాలి. వారి కళ్లు పెరికివేయాలి. సనాతనధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మన చరిత్ర, సంస్కృతులపై దాడికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి వారికి అధికారం, పదవులు దక్కనివ్వరాదు’అని పేర్కొన్నారు. హిందూయిజంతో ప్రపంచానికే ప్రమాదం: రాజా చెన్నై: హిందూమతంపై తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. ఇటీవల సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి స్టాలిన్, ఆ పార్టీకే చెందిన ఎంపీ ఎ.రాజా హిందూమతాన్ని హెచ్ఐవీ, కుష్టు వ్యాధితో పోల్చారు. తాజాగా ఎంపీ రాజా మరోసారి హిందూమతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న వీడియోను తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తాజాగా విడుదల చేశారు. ‘కులమనే ప్రపంచ వ్యాధికి హిందూమతానిదే బాధ్యత. భారత్ కులం ఆధారంగా ప్రజలను విడదీస్తోంది. సామాజిక అస్థిరత, ఆర్థిక అసమానతలను సృష్టించేందుకు కులాన్ని వాడుకున్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు హిందూయిజం పేరుతో కులాన్ని వ్యాప్తి చేస్తున్నారు. భారత్‌కే కాదు, ప్రపంచానికే హిందూమతం ప్రమాదకరం’అని ఆయన అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. చదవండి: ప్రధాని మోదీకి ఖలిస్తానీ నేత హెచ్చరిక -
నీటిపారుదల రంగంలో 19 లక్షల కోట్ల పెట్టుబడి
రాయదుర్గం: కేంద్ర ప్రభుత్వం నీటిపారుదల రంగంలో రూ. 19 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడుతోందని కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు. హైదరాబాద్ నాలెడ్జిసిటీలోని టీ హబ్‌లో జిటో ఇంక్యుబేసన్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (జేఐఐఎఫ్) రెండు రోజులుగా నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సమ్మేళనం, వ్యవ స్థాపక దినోత్సవాల్లో ఆదివారం ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట పునరుద్ధరణ కార్యక్రమా న్ని, భూగర్భజల స్థాయిని పునరుద్ధరించడానికి కార్యాచ రణ, నదుల అనుసంధానం చేప ట్టామని తెలిపారు. పారిశ్రామిక రంగాల కంటే వ్యవసాయం రంగమే ఎక్కువ నీటిని వినియోగి స్తోందన్నారు. వ్యవసాయ రంగంలో తలసరి నీటి వినియోగం ఏడాదికి 4,913 నుంచి 5,800 కిలోలీటర్ల వరకు ఉంటుందని, ఇది ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువన్నారు. వ్యవసాయరంగంలో నీటిసంరక్షణకు స్టార్టప్‌ల అవసరం వ్యవసాయరంగంలో నీటి సంరక్షణపై ఎవరూ పెద్దగా శ్రద్ధ చూపడం లేదని, ఇక్కడే ప్రైవేట్ రంగ సహాయం, స్టార్టప్‌ల అవసరం ఏర్పడుతోందని కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యానించారు. మురుగునీటిని తిరిగి ఉపయోగించుకునే వ్యాపార నమూనాలను అభివృద్ధి చేసేందుకు స్టార్టప్‌ల కోసం మంత్రిత్వశాఖ కూడా ఎదురుచూస్తోందన్నారు. దేశంలో దాదాపు 2వేల ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన నీటి పరీక్ష ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక పరీక్ష సౌకర్యం ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. కాఠిన్యం, పీహెచ్, కాపర్, ఐరన్, ఫాస్పేట్, క్లోరిన్, ఆమ్మోనియా, క్రోమియం వంటి 12 పారామీటర్లపై(ప్రామాణికాలపై) నీటి నాణ్యత పరీక్షలు జరుగుతాయన్నారు. టెస్టింగ్ కిట్ల అభివృద్ధిలోనూ స్టార్టప్‌ల సాయం టెస్టింగ్ కిట్లను అభివృద్ధి చేయడంలో స్టార్టప్‌లు తమకు ఎంతో సహాయ పడ్డాయని కేంద్రమంత్రి తెలిపారు. ఇందులో 19 లక్షల మంది మహిళలకు శిక్షణ ఇచ్చామని, 1.5 కోట్ల నమూనాలను సేకరించి పరీక్షించడం జరిగిందన్నారు. సెన్సార్ ఆధారిత తాగునీటి పరీక్ష కోసం పరిష్కారాలను రూపొందించడానికి స్టార్టప్‌ల కోసం తాము హ్యకథాన్ కూడా నిర్వహించామన్నారు. ఇందులో 250 స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకోగా అందులో 20 స్టార్టప్‌లను షార్ట్ లిస్ట్ చేశామని కేంద్రమంత్రి షెకావత్ వెల్లడించారు. ప్రభుత్వం ఒక్కటే అన్ని పనులూ చేయలేదని, జేఐఐఎఫ్ వంటి సంస్థల నుంచి సహాయం కావాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఐఐఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొత్త ట్రిబ్యునల్‌పై మాట నిలబెట్టుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య పునఃపంపకాలకు సంబంధించి గత అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇచ్చిన హామీ మేరకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. కృష్ణా జలాల్లో ప్రస్తుతం ఉన్న వాటాలను సవరించి రెండు తెలుగు రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిన తాత్కాలిక కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన మంత్రి హరీశ్‌రావు మంగళవారం రాత్రి కేంద్రమంత్రి షెకావత్‌ను కలిశారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ కూడా పాల్గొన్నారు. కేంద్రమంత్రికి విన్నవించిన అంశాలు ఇలా.... 1) తెలంగాణలో గోదావరి బేసిన్‌లోని సీతారామ ఎత్తిపోతల పథకం, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, కాళేశ్వరం అదనపు టీఎంసీ, డా.బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్‌లకు ఆమోదముద్ర వేయాలి. 2) 2021 గెజిట్ నోటిఫికేషన్ అనంతరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి 2022లో తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌ను అందించింది. సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌ను వేగవంతం చేయాలని వినతి. 3) గోదావరి వరద జలాలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా పోలవరం ప్రాజెక్టులో భాగమైన కుడి, ఎడమ మెయిన్ కాలువలను అనుమతించిన దాని కంటే ఎక్కవగా విస్తరిస్తోంది. కుడి, ఎడమ మెయిన్ కెనాల్ విస్తరణ ద్వారా 493 టీఎంసీల కేటాయింపులకు వ్యతిరేకంగా ఏపీ దాదాపు 1500 టీఎంసీల సామర్థ్యాన్ని సృష్టిస్తోంది. ఇది గోదావరి మిగులు జలాల్లో తెలంగాణ వాటాపై ప్రభావం చూపుతుంది. అంతేగాక ఆమోదం లేని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెంకటనగరం ప్రాజెక్టులను ఎడమ కాలువపై, చింతలపూడి ఎత్తిపోతల పథకం (మొదటి దశ – రెండవ దశ), గోదావరి–పెన్నార్ లింక్ వంటి అనేక ప్రాజెక్టులను కుడి కాలువపై నిర్మిస్తోంది. కుడి, ఎడమ కాలువ అక్రమ విస్తరణను, ఈ అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో జోక్యం చేసుకొని నిర్మాణం చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలి. 4) కృష్ణా జలాల్లో సమానమైన కేటాయింపుల కోసం కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ అనేకసార్లు అభ్యర్థించింది. ట్రిబ్యునల్ నిర్ణయం పెండింగ్‌లో ఉన్నందున తెలంగాణ, ఏపీ మధ్య ప్రస్తుత నీటి సంవత్సరం నుంచి ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకునే వరకు నీటి భాగస్వామ్య నిష్పత్తిని 50:50కి సవరించాలి. ట్రిబ్యునల్‌పై త్వరలోనే నిర్ణయం చేస్తామన్నారు : మంత్రి హరీశ్‌రావు కేంద్రమంత్రి షెకావత్‌తో భేటీ అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఇచ్చిన మాట వాస్తవమేనని కేంద్రమంత్రి వెల్లడించారన్నారు. ఈ అంశంపై అధికారులతో సంప్రదించి నిర్ణయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వీటితో పాటు ఏపీ చేపట్టిన పోలవరం కుడి, ఎడమ కాలువల అక్రమ విస్తరణ, డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తీసుకొనేలా చేపట్టిన పనులతో గోదావరి జలాల్లో రాష్ట్రానికి ఉన్న హక్కులను తెలంగాణ కోల్పోతున్న అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. -
Polavaram Project: కొత్త డయాఫ్రమ్ వాల్!
సాక్షి, అమరావతి: పోలవరం ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ గ్యాప్–2లో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఆవశ్యకతపై నివేదిక సమర్పించడమే అజెండాగా కేంద్ర జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి పంకజ్‌కుమార్ సోమవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ నివేదిక ఆధారంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. పోలవరం నిర్మాణ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితుల కారణంగా వరద ప్రవాహాన్ని దిగువకు పంపే స్పిల్ వేను గోదావరి కుడి గట్టుకు అవతల రాతి నేలపై.. 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా 2,454 మీటర్ల పొడవున ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌ను మూడు భాగాలుగా (గ్యాప్–1లో 564, గ్యాప్–2లో 1,750, గ్యాప్–3లో 140 మీటర్లు) గోదావరి గర్భంలో ఇసుక తిన్నెలపై నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను రూపొందించింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్‌ను నిర్మించారు. గ్యాప్–1, గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలని సీడబ్ల్యూసీ పేర్కొంది. కమీషన్ల కోసం చంద్రబాబు ఘోర తప్పిదం.. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను తొలుత పూర్తి చేసి ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు కట్టాలి. వాటి మధ్యన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2లలో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి. కానీ చంద్రబాబు కమీషన్ల దాహంతో స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 2018 జూన్ 11 నాటికి పూర్తి చేసి ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఇరువైపులా 800 మీటర్ల పొడవున ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో గోదావరికి 2019 అక్టోబర్‌లో భారీ వరద వచ్చింది. 2,454 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారడంతో 800 మీటర్లకు కుచించుకుపోయింది. దీంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు నిర్వాకాల కారణంగా పోలవరం నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఆ తప్పిదాలను సరిదిద్దేందుకు రూ.2,020 కోట్లకుపైగా వ్యయం అవుతుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేశారు. గోదావరి వరదను మళ్లించాక ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1లో 393 మీటర్ల పొడవుతో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారు. వరద ఉద్ధృతికి గ్యాప్–1లో డయాఫ్రమ్ వాల్‌కు ఏమాత్రం నష్టం వాటిల్లలేదు. ► వరదల ఉద్ధృతికి గ్యాప్–2లో జి.కొండ కుడివైపున 89 మీటర్ల నుంచి 1,485 మీటర్ల వరకూ 1,396 మీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్ వాల్ గత సర్కారు నిర్వాకాలతో దెబ్బతింది. ► దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పటిష్టతపై ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణులు పలు రకాల పరీక్షలు నిర్వహించి 175 మీటర్ల నుంచి 360 మీటర్ల వరకూ 185 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైనట్లు తేల్చారు. ► 480 నుంచి 510 మీటర్ల మధ్య 30 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. 950 – 1,020 మధ్య 70 మీటర్ల మేర దెబ్బతినగా 1,170 నుంచి 1,370 మీటర్ల వరకూ 200 మీటర్ల మేర పూర్తిగా దెబ్బతిన్నట్లు తేల్చారు. అంటే 1,396 మీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్ వాల్లో 485 మీటర్ల మేర పూర్తిగా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. ► 363 మీటర్ల నుంచి 1,035 మీటర్ల వరకూ 672 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ పైభాగంలో ఐదు మీటర్ల మేర దెబ్బతిన్నట్లు ఎన్‌హెచ్‌పీసీ స్పష్టం చేసింది. డ్యామ్ భద్రత దృష్ట్యా.. దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి పాత దానితో అనుసంధానం చేస్తే సరిపోతుందని తొలుత సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, ఎన్‌హెచ్‌పీసీ నిపుణులు ప్రతిపాదించారు. అయితే ఈ పనులు చేసేందుకు చాలా సమయం పడుతుంది. ఒకవేళ అలా చేసినా కూడా డయాఫ్రమ్ వాల్ పూర్తి సామర్థ్యం మేరకు ఊట నీటికి అడ్డుకట్ట వేయలేదు. అంతిమంగా ఇది డ్యామ్ భద్రతకే ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈనెల 3న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పాత డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించడం కంటే డ్యామ్ భద్రత దృష్ట్యా 1,396 మీటర్ల పొడవునా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మొగ్గు చూపారు. దీనిపై సమగ్రంగా చర్చించి నివేదిక ఇవ్వాలని జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించడంతో నేడు ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పోలవరం వద్ద 498.07 టీఎంసీల లభ్యత పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరిలో 75 శాతం (నికర జలాలు) లభ్యత ఆధారంగా ఏటా సగటున 498.07 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం తాజాగా తేల్చింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 484.7 టీఎంసీలను వినియోగించుకోవడానికి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) మన రాష్ట్రానికి అనుమతి ఇచ్చింది. అంటే ట్రిబ్యునల్ అనుమతించిన దాని కంటే పోలవరం వద్ద గోదావరిలో నికర జలాల లభ్యత 13.37 టీఎంసీలు అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలో సబ్ బేసిన్ల వారీగా గోదావరిలో నీటి లభ్యతను తేల్చాకే రెండు రాష్ట్రాలు కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని గోదావరి బోర్డును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోరాయి. దీంతో గోదావరి బోర్డు ఆ బాధ్యతను సీడబ్ల్యూసీకి అప్పగించింది. పోలవరానికి సగటున 1,198.35 టీఎంసీలు తెలుగు రాష్ట్రాల పరిధిలో పెన్‌గంగా (జీ–7), ప్రాణహిత (జీ–9), దిగువ గోదావరి (జీ–10), ఇంద్రావతి(జీ–11), శబరి (జీ–12) పరీవాహక ప్రాంతాలలో 1971–72 నుంచి 2011–12 మధ్య 41 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరిలో ఏటా 1,435 టీఎంసీల నికర జలాల లభ్యత ఉంటుందని తేల్చింది. పోలవరం వద్దకు ఏటా సగటున 1,198.35 టీఎంసీల ప్రవాహం వస్తుందని అంచనా వేసింది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 498.07 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీల మధ్య ఏటా సగటున 778.39 టీఎంసీల ప్రవాహం ఉంటుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఇందులో 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 45.83 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. -
పోలవరానికి రూ.17,148 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తికి అవసరమైన రూ.17,148 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర కేబినెట్‌కు పంపాల్సిన ప్రతిపాదన (మెమొరాండం)ను ఈనెల 31లోగా సిద్ధంచేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ, పీపీఏ అధికారులకు ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో ప్రాజెక్టు పనుల పురోగతిని సోమవారం ఆయన సమీక్షించారు. రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, పీపీఏ సీఈఓ శివ్‌నందన్‌కుమార్‌లు ఆ వివరాలను తెలిపారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో వరదల ఉధృతికి ఏర్పడిన అగాథాలలో ఇసుక పూడ్చివేత పనులు పూర్తయ్యాయని.. వైబ్రో కాంపాక్షన్ ద్వారా యథాస్థితికి తెచ్చే పనులు చేస్తున్నామని అధికారులు చెప్పారు. షెడ్యూలు ప్రకారమే పనులు చేస్తుండటంతో మంత్రి షెకావత్ సంతృప్తి వ్యక్తంచేశారు. 36 గ్రామాలకు పునరావాసం కల్పించడానికి ఓకే.. ప్రాజెక్టు తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లను మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని.. కానీ, 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోకి మరో 36 గ్రామాలు వస్తాయని.. అక్కడి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని శశిభూషణ్‌కుమార్ చెప్పారు. ఈ వ్యయాన్ని కలుపుకుంటే.. తొలిదశ పూర్తికి రూ.17,148 కోట్లు అవసరమని వివరించారు. ఇందుకు మంత్రి షెకావత్ అంగీకరించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఈనెల 15లోగా సీడబ్ల్యూసీకి పీపీఏ పంపాలని.. అనంతరం ఈనెల 31లోగా కేంద్ర జల్‌శక్తి శాఖకు పంపాలని ఆదేశించారు. ఆ మెమొరాండాన్ని కేంద్ర కేబినెట్లో ప్రవేశపెట్టి, ఆమోదం తీసుకుని, ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తామని షెకావత్ చెప్పారు. డయాఫ్రమ్‌వాల్‌పై మేధోమథనం.. మరోవైపు.. ఈసీఆర్ఎఫ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల.. దానికి సమాంతరంగా ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేసే పనులపై నిర్మాణ సంస్థ మేఘా అనుమానాలు వ్యక్తంచేస్తోందని మంత్రి షెకావత్‌కు కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం చెప్పారు. మంత్రి స్పందిస్తూ.. పాత డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న 30 శాతం చోట్ల కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఎంత వ్యయమవుతుంది? గ్యాప్–2లో మొత్తం 1,396 మీటర్ల పొడవునా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించారు. దీనిపై సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా స్పందిస్తూ.. పాత దానిలో దెబ్బతిన్న 30 శాతం చోట్ల కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ.400 కోట్లు.. మొత్తం 1,396 మీటర్ల పొడవున కొత్తగా డయాఫ్రమ్ వాల్ వేయడానికి రూ.600 కోట్లు వ్యయం అవుతుందని చెప్పారు. దీనిపై షెకావత్ స్పందిస్తూ.. ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ అంశాలపై సోమవారంలోగా తుది నిర్ణయాన్ని తనకు వెల్లడించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ వోరాకు మంత్రి షెకావత్ కోరారు. పోలవరం పనులకు లైన్ క్లియర్ స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను మరో ఏడాదిపాటు నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు 2024 జులై లేదా సుప్రీంకోర్టులో కేంద్ర జల్‌శక్తి అఫిడవిట్ దాఖలు చేసేదాకా ఈ ఉత్తర్వులు అమలులోనే.. పోలవరం ప్రాజెక్టు పనులను నిర్విఘ్నంగా కొనసాగించడానికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపేయాలంటూ జారీచేసిన ‘స్టాప్‌వర్క్ ఆర్డర్’ అమలును మరో ఏడాదిపాటు నిలుపుదల చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ శాస్త్రవేత్త యోగేంద్రపాల్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు ఈనెల నుంచి 2024, జులై వరకూ లేదా సుప్రీంకోర్టులో కేంద్ర జల్‌శక్తి శాఖ అఫిడవిట్ దాఖలు చేసేవరకూ అమల్లో ఉంటాయని అందులో పేర్కొన్నారు. తద్వారా పోలవరం పనులకు కేంద్ర లైన్‌క్లియర్ చేసింది. బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ సహా అన్ని అనుమతులను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చాకే ఆ ప్రాజెక్టు పనులను జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించారు. వీటివల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతోందంటూ ఒడిశా సర్కార్ 2007లో సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేయాలంటూ 2011, ఫిబ్రవరి 8న కేంద్రాన్ని ఆదేశించింది. దాంతో ప్రాజెక్టు పనులను ఆపేయాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను జారీచేసింది. ప్రాజెక్టు పనులను చేపట్టాలంటే.. స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను నిలుపుదల చేయడం లేదా ఎత్తేయడం తప్పినిసరి. ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను ఎత్తేయడం న్యాయ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీంతో ప్రాజెక్టు పనులు చేసుకోవడానికి వీలుగా స్టాప్‌వర్క్ ఆర్డర్ అమలును నిలుపుదల (అబయన్స్‌లో పెట్టాలని) చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2012 నుంచి కేంద్రానికి ప్రతిపాదన పంపుతోంది. నిజానికి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా చేయడానికి వీలుగా రెండేళ్లపాటు స్టాప్‌వర్క్ ఆర్డర్ అమలును నిలిపేయాలని కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్రం 2019 నుంచి స్టాప్‌వర్క్ ఆర్డర్ నుంచి రెండేళ్లపాటు నిలుపుదల చేస్తూ వస్తోంది. ఈ గడువు ఈ నెలతో పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మరో రెండేళ్లపాటు నిలుపుదల చేయాలని కోరగా జులై 2024 వరకు లేదా సుప్రీంకోర్టులో కేంద్ర జలశక్తి శాఖ అఫిడవిట్ దాఖలుచేసే వరకూ స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను నిలుపుదల చేసింది. -
నేడు పోలవరంపై కీలక భేటీ..
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రూ.12,911.15 కోట్ల విడుదలకు సంబంధించి కేంద్ర మంత్రిమండలికి పంపాల్సిన ప్రతిపాదనను ఖరారు చేయడమే అజెండాగా సోమవారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొననున్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయడానికి రూ.పదివేల కోట్లను అడ్‌హక్ (ముందస్తు)గా విడుదల చేయాలని ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు కోరారు. దీనికి స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేకుండా చూడాలని కేంద్ర ఆర్థికశాఖను ఆదేశించారు. దీంతో ప్రాజెక్టు తొలిదశను సత్వరమే పూర్తిచేయడానికి వీలుగా రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అంగీకరించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరలతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తామని 2016లో నాటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం కంటే ఇప్పటికే అధికంగా ఖర్చుచేసిన నేపథ్యంలో అదనంగా నిధుల విడుదలకు అడ్డంకిగా మారింది. అదనంగా నిధులు మంజూరు చేయాలంటే కేంద్ర మంత్రిమండలి ఆమోదం తప్పినిసరి. ఆ క్రమంలోనే రూ.12,911.15 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిమండలికి ప్రతిపాదన పంపాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మిలాసీతారామన్ కేంద్ర జల్‌శక్తి శాఖకు సూచించారు. మంత్రిమండలి ఆమోదముద్ర వేసిన వెంటనే నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు నిధులు విడుదలకు సంబంధించిన ప్రతిపాదనను పీపీఏ ద్వారా కేంద్ర జల్‌శక్తి శాఖకు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పంపారు. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమీక్షించి.. కేంద్ర మంత్రిమండలికి పంపాల్సిన ప్రతిపాదనను ఖరారు చేయనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించి, సత్వరమే పూర్తిచేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. -
2025 జూన్‌కు పోలవరం పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని, 2025 జూన్‌కు ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించి, రైతులకు ఫలాలను అందించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై గురువారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, సలహాదారు వెదిరె శ్రీరాంలతో కలిసి మంత్రి షెకావత్ సమీక్షించారు. రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి (ఇన్చార్జి) శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, పీపీఏ సీఈవో శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రి షెకావత్‌కు ఈఎన్సీ నారాయణరెడ్డి వివరించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించామని చెప్పారు. ప్రధాన డ్యామ్ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఇసుకతో పూడ్చి, వైబ్రో కాంపాక్షన్ ద్వారా యధాస్థితికి తెస్తున్నామన్నారు. మళ్లీ వరదలు వచ్చేలోగా ఈ పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేస్తామన్నారు. ఈలోగా గ్యాప్–1లో ప్రధాన డ్యామ్ పనులు చేపడతామన్నారు. గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేశాక ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఆలోగా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తామన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల కొత్తగా నిర్మించే వాల్ డిజైన్‌ను తక్షణమే ఖరారు చేయాలని సీడబ్ల్యూసీని కేంద్ర మంత్రి ఆదేశించారు. ప్రధాన డ్యామ్ ప్రాంతంలో రోజుకు 50 వేల క్యూబిక్ మీటర్ల స్థానంలో లక్ష క్యూబిక్ మీటర్ల మేర ఇసుకను పూడ్చి, వైబ్రోకాంపాక్షన్ చేసేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. దశలవారీగా నీటి నిల్వ ప్రాజెక్టులో మూడు దశల్లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తామని ఈఎన్సీ చెప్పారు. తొలి ఏడాది 41.15 మీటర్ల స్థాయిలో నిల్వ చేస్తామన్నారు. ఈ స్థాయిలో తొలుత 123 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలిందని.. ఆ గ్రామాల్లోని 20,946 కుటుంబాల్లో ఇప్పటికే 12,060 కుటుంబాలకు పునరావాసం కల్పించామని వివరించారు. గతేడాది నిర్వహించిన లైడార్ సర్వేలో మరో 36 గ్రామాలు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వస్తాయని తేలిందని.. ఆ గ్రామాల్లోని 16,642 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందన్నారు. ఈ గ్రామాలు 45.72 మీటర్ల పరిధిలోకే వస్తాయని వివరించారు. ప్రాజెక్టు పూర్తయ్యాక రెండో, మూడో ఏడాది 45.72 మీటర్ల పరిధిలోని మొత్తం 1,00,006 కుటుంబాలకు పునవాసం కల్పించి.. గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తామన్నారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్ స్పందిస్తూ.. ముంపు గ్రామాల నిర్వాసితులకు పునవాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఆ మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు. తొలి దశ పూర్తికి రూ.17,144 కోట్లు ప్రాజెక్టును 45.72 మీటర్ల వరకు పూర్తి చేసి, తొలి దశలో 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసి.. ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు పూర్తి చేయాలంటే రూ.17,144 కోట్లు అవసరమని జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి వివరించారు. సమగ్రంగా 45.72 మీటర్ల స్థాయికి పూర్తి చేయడానికి 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లు వ్యయం అవుతుందని సీడబ్ల్యూసీ తేల్చిందని, ఆ మేరకు నిధులివ్వాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్ స్పందిస్తూ.. తొలి దశ పూర్తికి రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనను పరిశీలించి, నిధులు ఎంత అవసరమో నివేదిక ఇవ్వాలని పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులను ఆదేశించారు. ఆ నివేదికను కేంద్ర మంత్రి మండలి ఆమోదం తీసుకోవడం ద్వారా పోలవరానికి నిధుల సమస్య లేకుండా చేస్తామని, తద్వారా షెడ్యూలులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరిస్తామని చెప్పారు. బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల ముంపు సమస్యపై సంయుక్త అధ్యయనానికి ఒడిశా సహాయ నిరాకరణ చేయడంపై తాము చర్చిస్తామని మంత్రి షెకావత్ చెప్పారు. అనుమతి లేని ప్రాజెక్టులపై గోదావరి బోర్డులో చర్చ పట్టిసీమ, పురుషోత్తపట్నం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు అనుమతి లేకుండా చేపట్టారని, వాటి డీపీఆర్‌లు పంపి, ఆమోదం తీసుకోవాలని రాష్ట అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. దీనిపై రాష్ట్ర అధికారులు స్పందిస్తూ... తెలంగాణ కూడా అనుమతి లేకుండా కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతమ్మసాగర్ తదితర ప్రాజెక్టులను చేపట్టిందని, ఈ విషయాన్ని గోదావరి బోర్డు, కేంద్రం దృష్టికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం తాత్కాలికమైనవేనని, పోలవరం పూర్తయితే ఆ రెండు ఎత్తిపోతలను మూసేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టామన్నారు. అప్పట్లోనే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. దాంతో.. అనుమతి లేని ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్లో చర్చిస్తామని కేంద్ర మంత్రి షెకావత్ స్పష్టం చేశారు. -
పోలవరం ప్రాజెక్ట్: అడ్‌హక్ నిధుల విడుదలకు కేంద్రం సానుకూలత
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై గురువారం సమావేశం జరిగింది. ఆరు అంశాలపై నిర్వహించిన ఈ సమావేశంలో సవరించిన అంచనాలు, పునరావాసం, నష్టపరిహారం చెల్లింపుపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, సలహాదారు వేదిరే శ్రీరామ్ , ఏపీ ఇంజినీర్ చీఫ్ నారాయణరెడ్డి, సీడబ్ల్యూసీ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు హాజరయ్యారు. పోలవరం పనుల పురోగతి, సమస్యలపై సమీక్షించామని, పోలవరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తవ్వాలన్నదే సంకల్పమని కేంద్రమంత్రి షెకావత్ అన్నారు. నిధుల విడుదలకు కేంద్రం సానుకూలం: ఏపీ ఇంజినీర్ చీఫ్ నారాయణరెడ్డి పోలవరానికి రూ.17,414 కోట్ల అడ్‌హక్ నిధులు విడుదల చేయాలని కోరామని, నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు ఏపీ ఇంజినీర్ చీఫ్ నారాయణరెడ్డి తెలిపారు. తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, తొలిదశలోనే 100 శాతం డ్యాం పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. జూన్ 2024 కల్లా పోలవరం పూర్తి చేయాలని కేంద్రం సూచించిందని నారాయణరెడ్డి అన్నారు. చదవండి: చంద్రబాబుది ఓ కాపీ పేస్ట్ బతుకు: సీఎం జగన్ -
కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం జగన్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం నిధులు సహా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సీఎం కోరారు. సుమారు అరగంటపాటు సమావేశం కొనసాగగా.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ సానుకూలంగా స్పందించారు. అంతకుముందు నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్నారు. సమావేశానుద్దేశించి ప్రసంగించిన సీఎం.. ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతంచేయాలని తద్వారా ఆర్థికవ్యవస్థ శ్రీఘ్రగతిన పురోగమిస్తుందన్నారు. అలాగే నీతి ఆయోగ్ చర్చించే వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించేలా నోట్‌ను సమావేశానికి సమర్పించారు. కాగా, మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం శుక్రవారం నాడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు. నాడు–నేడు పథకం ద్వారా విద్య, ఆరోగ్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (మూలధన పెట్టుబడి)గా భావించి ప్రత్యేక సాయం వర్తింప చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. చదవండి: ఎన్టీఆర్ పెట్టిన ఒక్క పథకమైనా చంద్రబాబు కొనసాగించారా? -
కెనరా బ్యాంక్‌కు ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్ అవార్డు
హైదరాబాద్: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ను ‘ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డు 2022’ వరించింది. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ప్రోత్సహించే దిశగా బ్యాంక్ అందించిన సేవలకుగానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఢిల్లీలోని చాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ అవార్డు అందించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ భవేంద్ర కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. -
పోలవరంపై ఎంపీ వంగా గీత ప్రశ్న.. కేంద్రమంత్రి సమాధానమిదే
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరంపై లోక్‌సభలో వంగా గీత ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానమిచ్చారు. ‘‘భూసేకరణ పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాలో వేయాలని రాష్ట్రం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపలేదు’’ అని గజేంద్రసింగ్ తెలిపారు. ‘‘భూసేకరణ కింద 3,779 కోట్ల రూపాయల బిల్లులు రీయింబర్స్మెంట్ కోసం రాష్ట్రం సబ్మిట్ చేసింది. అందులో 3,431.59 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేసింది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 2,267 కోట్ల రూపాయల బిల్లులను రీయింబర్స్మెంట్ కోసం పంపారు. అందులో 2,110 కోట్ల రూపాయల బిల్లులకు చేశాం. పిఐఏ, సీడబ్ల్యూ సిఫారసుల ఆధారంగా ఎప్పటికప్పుడు బిల్లులను వెరిఫై చేసి చెల్లిస్తున్నాం’’ అని లోక్‌సభలో గజేంద్రసింగ్ వెల్లడించారు. చదవండి: కోతలు.. కొత్త పథకాలు -
గోదావరి–కావేరి లింక్‌కు సై!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. తొలిదశలో 141 టీఎంసీలు, రెండోదశలో మరో 236 టీఎంసీలు కలిపి మొత్తం 377 టీఎంసీలను తరలిస్తామని వెల్లడించారు. గోదావరి జలాల్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వాడుకోని వాటానే తొలిదశలో తరలిస్తామని, మహానది–కావేరి అనుసంధానం పూర్తైన తర్వాత దాని ద్వారా వచ్చే జలాలను రెండోదశలో తరలిస్తామని వెల్లడించారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో నదుల అనుసంధానంపై ఆయన మాట్లాడారు. తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్‌కుమార్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యప్రసాద్ పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో నదుల అనుసంధాన ప్రక్రియ ప్రారంభమైందని, దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. అందులో భాగంగానే కెన్–బెట్వా అనుసంధానాన్ని చేపట్టామని గజేంద్రసింగ్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నదుల అనుసంధానంపై రాష్ట్రాల అనుమానాలు తొలిగిపోతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 30 నదుల అనుసంధానం ప్రతిపాదనలున్నాయని తెలిపారు. గోదావరి–కావేరి అనుసంధానంపై రాష్ట్రాల సమ్మతి కోసం ఇప్పటివరకు నాలుగు సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిధులు సైతం కేటాయించినట్టు గుర్తుచేశారు. మహానది–గోదావరి అనుసంధానం జరపాలి ముందుగా మహానది–గోదావరి ఆ తర్వాత గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని తెలంగాణ స్పష్టం చేసింది. గోదావరిలో మిగులు జలాల లభ్యతలేదని నిర్ధారించిన తర్వాత ఛత్తీస్‌గఢ్ అనుమతి లేకుండా ఆ రాష్ట్రం వాడుకోని వాటాను ఏ విధంగా తరలిస్తారని ప్రశ్నించింది. తెలంగాణ నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడుతున్నందున రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్లలో నీరందని ఆయకట్టుకు నీటిని కేటాయించాలని కోరింది. కృష్ణాలో 18 టీఎంసీలతో బెడ్తి–వారాదా అనుసంధానం ప్రాజెక్టును కర్ణాటకలో చేపడుతున్నందున ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆ నీటిలో భాగస్వామ్య రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇందులో తెలంగాణకు 9 టీఎంసీలు కేటాయించాలని కోరింది. గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టును పోలవరం నుంచే చేపట్టాలని ఏపీ సూచించింది. పోలవరం నుంచి పులిచింతల, నాగార్జునసాగర్, రాయలసీమ మీదుగా అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. -
ఎన్జీ రంగా వర్సిటీ సేవలు దేశానికి అవసరం
తిరుపతి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్‌లో సాగయ్యే వివిధ పంటలకు నూతన వంగడాలు రూపొందించడం, కొత్త సాంకేతికతను అందించడం, దేశ ఆహార భద్రతను సాధించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సేవలు దేశానికి ఎంతో అవసరమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. తిరుపతిలోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో బుధవారం వీసీ డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన అధ్యాపకులు, విద్యార్థులతో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ 11వ స్థానంలో నిలవడంలో అధికారులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకుల పాత్ర కీలకమని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా దేశం ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడమేగాక ఆహారధాన్యాలు, వివిధ పంట ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతోందన్నారు. వరిసాగు విస్తీర్ణంలో సగం సాగు ఈ వర్సిటీ రూపొందించిన విత్తనాలే.. వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన వరి విత్తనాలు బి.పి.టి–5204 (సాంబమసూరి), స్వర్ణ, విజేత, వేరుసెనగ విత్తనాలు కె–6, ధరణి వంటి రకాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు. దేశంలో వరిసాగులో దాదాపు సగం విస్తీర్ణంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తన రకాలే సాగవుతున్నట్లు తెలిపారు. దేశంలో మొదటిసారిగా వ్యవసాయ విద్యలో గ్రామీణ అనుభవ పథకాన్ని ప్రవేశపెట్టడం, వ్యవసాయరంగంలో డ్రోన్ల వినియోగం వంటి ఆవిష్కరణలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో 14.5 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. ఇటీవల కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించిన గౌరవ డాక్టరేట్‌ను మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు, వర్సిటీ వీసీ డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు పి.వి.మిథున్‌రెడ్డి, డాక్టర్ ఎం.గురుమూర్తి, ఎన్.రెడ్డప్ప, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలవరానికి నిధులు!
సాక్షి, అమరావతి: పోలవరాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు వీలుగా రూ.పది వేల కోట్లను ముందస్తు (అడ్‌హక్)గా ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ వినతిపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి రిచా శర్మ చెప్పారు. ఈ అంశంపై జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఈ నెల 21న సమావేశాన్ని నిర్వహిస్తున్నారని, సమావేశం తర్వాత పోలవరానికి అడ్‌హక్ నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో 15 అంశాల అజెండాతో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. పీపీఏ సభ్యులైన రిచా శర్మ ఇందులో పాల్గొన్నారు. పోలవరాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు వీలుగా సీఎం జగన్ ప్రతిపాదించిన మేరకు అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లను విడుదల చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కోరారు. దీనిపై రిచా శర్మ, చంద్రశేఖర్ అయ్యర్ స్పందిస్తూ అడ్‌హక్‌గా నిధులు ఇచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రీయింబర్స్ నిధులివ్వండి.. ఈ సీజన్లో మార్చి వరకూ పనులకు, 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని భూసేకరణకు, నిర్వాసితుల పునరావాసానికి రూ.7,300 కోట్లు విడుదల చేయాలని సమావేశంలో రాష్ట్ర అధికారులు కోరారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్రం ఖర్చు చేసిన రూ. 2,807 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాలని కోరారు. ఈ నెల 21న జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ అంశాలను వివరించి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని పీపీఏ సీఈవో చెప్పారు. ప్రణాళికాయుతంగా పూర్తి.. గోదావరికి జూన్‌లో వచ్చిన ఆకస్మిక వరదల వల్ల గతేడాది ఆమోదించిన వర్కింగ్ షెడ్యూల్‌కు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం, ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించేందుకు ఐదుగురు సభ్యులతో పీపీఏ కమిటీని నియమించింది. ప్రాజెక్టు పనులను కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇచ్చిన నివేదికపై సర్వ సభ్య సమావేశంలో చర్చించి ఆమోదించారు. గోదావరిలో వరద ప్రవాహం 24 వేల క్యూసెక్కులకు తగ్గిన నేపథ్యంలో పనులు ప్రారంభించామని, జనవరి ఆఖరుకు దిగువ కాఫర్ డ్యామ్‌ను డిజైన్ మేరకు 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేస్తామని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఉన్న నీటిని తోడివేసి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్–1లో పనులు ప్రారంభించి డిసెంబర్ 2023 నాటికి 52 మీటర్ల ఎత్తుకు పూర్తి చేయాలని పీపీఏ ఆదేశించింది. ఈసీఆర్ఎఫ్ గ్యాప్–2లో కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత పనుల పరీక్షలను నిర్వహించి సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు ఫిబ్రవరికి భూ ఉపరితలం స్థాయికి పూర్తి చేయాలని నిర్దేశించింది. డయాఫ్రమ్ వాల్ భవితవ్యం తేలాక సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళికను ఆమోదించారు. తొలిదశలో కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలు, రెండో దశలో మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయాలని పీపీఏ సూచించింది. డిసెంబర్లో పీపీఏ సమావేశాన్ని పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్వహించి ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులపై సమగ్రంగా చర్చిద్దామని రాష్ట్ర అధికారులు చేసిన ప్రతిపాదనకు పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అంగీకరించారు. రాజమహేంద్రవరానికి పీపీఏ కార్యాలయం తరలింపుపై కూడా సానుకూలంగా స్పందించారు. బ్యాక్ వాటర్‌పై రీ సర్వేకు నిరాకరణ గోదావరికి జూలైలో వచ్చిన వరదలకు పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల భద్రాచలంతోపాటు తమ భూభాగంలో 827 ఎకరాల పంట పొలాలు ముంపునకు గురయ్యాయని తెలంగాణ ఈఎన్సీ సి.మురళీధర్ పేర్కొన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం (ఎఫ్ఆర్ఎల్) రేఖ తమ భూభాగంలో లేదని, ఎఫ్ఆర్ఎల్కు మించి జలాలు వెనక్కి ఎగదన్నడం వల్ల తమ భూభాగం ముంపునకు గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల బ్యాక్ వాటర్ ప్రభావంపై మళ్లీ సర్వే చేయాలని కోరారు. దీనిపై రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్ఎల్ రేఖ ఏపీ భూభాగంలోనే ఉంటుందని, కావాలంటే క్షేత్రస్థాయిలో చూపించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఎఫ్ఆర్ఎల్కు, బ్యాక్ వాటర్ ప్రభావానికి సంబంధమే ఉండదన్న విషయంపై సంపూర్ణ అవగాహన ఉండి కూడా అందుకు విరుద్ధంగా మాట్లాడటం తగదని సూచించారు. ఈ దశలో పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ జోక్యం చేసుకుంటూ బ్యాక్ వాటర్ ప్రభావంపై ఇప్పటికే అధ్యయనం చేశామని గుర్తు చేశారు. బ్యాక్ వాటర్ ప్రభావమే ఉండదని అందులో తేలిందని, మళ్లీ అధ్యయనం చేసే ప్రశ్నే లేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలవరం ముంపు ప్రాంతాల రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయడానికి జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ రెండు దఫాలు సమావేశాలు నిర్వహించాయని గుర్తు చేశారు. జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ త్వరలో ముంపు ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించి సుప్రీం కోర్టుకు నివేదిక ఇస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాక్ వాటర్ ప్రభావంపై చర్చకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. -
గడువు ముగిసినా గొడవలే..!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలకు చరమగీతం పాడటానికి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గతేడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టుల అప్పగింత, పరిధిపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో నోటిఫికేషన్ అమలును కేంద్రం పొడిగించిన ఆరు నెలల గడువు కూడా జూలై 15కే పూర్తయింది. అయినా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో బోర్డులు విఫలమయ్యాయి. దీనిపై బోర్డులు, కేంద్ర జల్ శక్తి శాఖ స్పందించడం లేదు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు సద్దుమణగడం లేదు. రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ కోరారు. గతేడాది శ్రీశైలంలోకి వరద ప్రవాహం లేకున్నా, నీటి నిల్వ కనిష్ట స్థాయిలో ఉన్నా.. దిగువన సాగు, తాగునీటి అవసరాలు లేకున్నప్పటికీ, బోర్డు అనుమతి తీసుకోకుండానే తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేసింది. దీనివల్ల కృష్ణా జలాలు వృథాగా కడలిపాలయ్యాయి. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కారు హరిస్తుండటంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దాంతో కేంద్రంలో కదలిక వచ్చింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గతేడాది జూలై 15న నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను ఆర్నెల్లలో కృష్ణా, గోదావరి బోర్డులకు రెండు రాష్ట్రాలు అప్పగించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆర్నెల్లలో అనుమతి తెచ్చుకోవాలి. లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి అనుమతించరు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. ఏపీ భూభాగంలోని శ్రీశైలం, సాగర్ విభాగాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా, తెలంగాణ సర్కారు దాని పరిధిలోని విభాగాలను అప్పగించబోమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ అమలు గడువు జనవరి 15తో పూర్తయినా, ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. దీంతో కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ గడువును జూలై 15 వరకు పొడిగించింది. ఈ క్రమంలోనే విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీ–నీవా, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కల్వకుర్తి (పాతది), నెట్టెంపాడు (పాతది) ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోవాలని ఆదేశించింది. కేంద్రం పొడిగించిన గడువు కూడా పూర్తయి మూడు నెలలు దాటింది. అయినా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి, భక్త రామదాస, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోలేదు. గోదావరి బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు డీపీఆర్‌లు సమర్పించాయి. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు రిజర్వాయర్ల మేనేజ్మెంట్ కమిటీ రూపొందించిన విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఆమోదించగా, తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఇదే అదనుగా తెలంగాణ ఇటీవల వరద తగ్గాక కూడా శ్రీశైలంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. దీనివల్ల పది రోజుల్లోనే సుమారు 32 టీఎంసీల జలాలు ప్రకాశం బ్యారేజి మీదుగా సముద్రంలో కలిసిపోయాయి. అయినా కేంద్ర జల్‌శక్తి శాఖ గానీ, బోర్డులు గానీ పట్టించుకోవడంలేదు. -
కేంద్రమంత్రిపై కస్సుమన్న హరీష్‌రావు.. స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రోజుకో మాట మాట్లాడుతున్నారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. గురువారం ఆయన టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాళేశ్వరంపై కేంద్రమంత్రి షెకావత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతిచ్చింది మీరు కాదా అని ప్రశ్నించారు. బీజేపీవి బురద చల్లే రాజకీయాలంటూ దుయ్యబట్టారు. చదవండి: కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు కాళేశ్వరం ప్రాజెక్టును గతంలో షెకావత్ మెచ్చుకోలేదా?. కేంద్రానికి నచ్చితే నీతి, నచ్చకుంటే అవినీతా?. మెచ్చుకున్న నోటితోనే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణపై బురద చల్లేందుకు కేంద్రమంత్రులు ప్రయత్నిస్తున్నారు. కాళేశ్వరం ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అని కేంద్రమే చెప్పింది. కేంద్రాన్ని కేసీఆర్ ప్రశ్నిస్తున్నందునే మాపై ఆరోపణలు’’అంటూ హరీష్‌రావు నిప్పులు చెరిగారు. చదవండి: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్రమంత్రి షెకావత్ షాకింగ్ కామెంట్స్ -
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్రమంత్రి షెకావత్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరంలో అవినీతి హద్దులు దాటిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సరైన అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్ట్ నిర్మించారన్నారు. చదవండి: కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు భారీ వర్షాలకు 3 పంప్‌హౌజ్‌లు మునిగిపోయాయన్నారు. పంప్‌లను టెక్నికల్‌గా సరైన పద్దతిలో అమర్చలేదని, ప్రాజెక్టు నిర్మించినప్పుడే వేలకోట్ల అవినీతి జరిగిందని గజేంద్ర సింగ్ షెకావత్ దుయ్యబట్టారు. పంప్‌ల రిపేర్లలోనూ అవినీతికి ఆస్కారం ఉందన్నారు. మోటార్లు బిగించిన సంస్థకు టెక్నికల్ సామర్థ్యం లేదని కేంద్రమంత్రి అన్నారు. -
‘వరికెపూడిశెల’కు పర్యావరణ అనుమతులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పల్నాడు ప్రాంతానికి నీరందించే వరికెపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపిందర్ యాదవ్‌ను ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో మంత్రిని కలసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే సంబంధిత డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని తెలిపారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి గంగలగుంట సమీపంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ ముందు ఉన్న నది ప్రాంతాన్ని.. అనేక అధ్యయనాల తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి అనువుగా ప్రతిపాదించినట్లు తెలిపారు. సాగర్ రిజర్వాయర్ ఒడ్డున ఉన్న స్థలం, ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన ప్రతిపాదిత జాక్వెల్ పంప్ హౌస్‌కు నది నీటి ప్రవాహం 10 మీటర్ల వద్ద ఉందని తెలిపారు. ఇది పంట కాలం అంతటా తగినంత నీరు అందుబాటులో ఉండేందుకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్టు కింద 24,900 ఎకరాల ఆయకట్టు ఉందని వివరించారు. పల్నాడు ప్రాంతంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులిచ్చి సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. జలశక్తి మంత్రితో భేటీ.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో మంత్రి అంబటి భేటీ అయ్యారు. బుధవారం లోక్‌సభలో వైఎస్సార్సీపీ పక్షనేత మిథున్‌రెడ్డితో కలిసి షెకావత్‌ను కలిశారు. మంత్రిగా తొలిసారి ఢిల్లీ వచ్చిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కేంద్ర జలశక్తి మంత్రిని కలిసినట్లు అంబటి చెప్పారు. -
పోలవరంపై కీలక వివరణ ఇచ్చిన షెకావత్
-
ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌చేసి ముర్ముని బలపరచాలని కోరారు: పేర్నినాని
-
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై అధిష్టానం ఆగ్రహం
-
ఏపీ: సత్యకుమార్ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం సీరియస్
విజయవాడ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని తాము వైఎస్సార్సీపీని కోరలేదంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్టానం ఖండించింది. అదే సమయంలో ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అధిష్టానం.. ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ మద్దతు విషయంలో క్లారిటీ ఇచ్చింది. ‘రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతు కోరలేదని సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవం. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్మోహన్రెడ్డిని బీజేపీ అధిష్టానం కోరింది. ఈ విషయంలో సీఎం జగన్‌తో వ్యక్తిగత సంప్రదింపులు కూడా జరిపింది. నామినేషన్ దాఖలు సమయంలో ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కూడా హాజరై మద్దతు తెలిపారు’ అని కేంద్ర మంత్రి షెకావత్ పేర్కొన్నారు. ఈ మేరకు సత్యకుమార్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని షెకావత్ స్పష్టం చేశారు. -
బాబు కమీషన్లతోనే ‘డయాఫ్రమ్’ ఢమాల్
సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో అవరోధాలు, జాప్యానికి ముమ్మాటికీ చంద్రబాబు నిర్వాకాలే కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. బాబు కమీషన్ల దాహం, అవగాహనరాహిత్యం వల్లే డయాఫ్రమ్‌వాల్ కొట్టుకుపోయిందని స్పష్టం చేశారు. దీనిపై చర్చకు సిద్ధమని ప్రకటిస్తూ, మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ‘శాసనసభలో చర్చిద్దామా? లేదంటే మరో ప్రదేశం చెబుతావా? మంత్రి హోదాలో మీ ఇంటికి వచ్చేందుకు కూడా సిద్ధమే’ అని స్పష్టం చేశారు. ‘మీరు చేసిన తప్పులు, పాపాలు మాపై నెడుతూ దస్తావేజులు మాదిరిగా లేఖలు రాయడం సమంజసమేనా?’ అని నిలదీశారు. మంత్రి అంబటి గురువారం రాత్రి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆ లేఖ కుట్ర పూరితం.. సీఎం జగన్‌పై బురద చల్లుతూ పోలవరంపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు దురుద్దేశపూరితంగా రాసిన లేఖను చెత్తబుట్టలో పారేయటం ఖాయం. రాజకీయ దురుద్దేశాలే మినహా పోలవరం పూర్తి కావాలనే చిత్తశుద్ధి బాబుకు లేదు. చంద్రబాబు ట్రాన్స్‌ట్రాయ్‌ని తప్పించి నవయుగకు పనులు అప్పగించడానికి అంగీకరించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ).. మేం నవయుగను తప్పించి మేఘాకు అప్పగిస్తే ఒప్పుకోదా? కాంట్రాక్టర్‌ను మార్చవద్దని 2018లో పీపీఏ సూచించిన సంగతి చంద్రబాబుకు తెలియదా? వైఎస్సార్ ప్రారంభించిన పోలవరాన్ని పూర్తి చేయడానికి సీఎం జగన్ శ్రమిస్తుంటే అవరోధాలు సృష్టిస్తున్నారంటూ లేఖలో చంద్రబాబు విషం కక్కారు. ఆ లేఖ షెకావత్‌కు చేరకముందే ఎల్లో పత్రికల్లో ప్రచురించారు. పునరావాసం కల్పించకుండా.. గోదావరి ప్రవాహాన్ని మళ్లించే స్పిల్‌వేను పునాది దశలోనే వదిలేసిన చంద్రబాబు కమీషన్ల దాహంతో ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టారు. అంతకుముందే రూ.400 కోట్ల వ్యయమయ్యే డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఎగువ కాఫర్ డ్యామ్‌లో కుడి వైపు, ఎడమ వైపు రెండు చోట్ల ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. ఆ ఖాళీ ప్రదేశాల ద్వారా గోదావరి వరద ఉద్ధృతికి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఎగువ కాఫర్ డ్యామ్ కట్టకపోయినా.. పూర్తి చేసి ఉన్నా డయాఫ్రమ్‌వాల్ కొట్టుకుపోయే అవకాశమే ఉండేది కాదు. పోలవరాన్ని 2018 నాటికే పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా నాడు చంద్రబాబు, దేవినేని ఉమా సవాల్ విసిరారు. జల్ శక్తి శాఖ మంత్రికి రాసిన లేఖలో తమ హయాంలో 71 శాతం పూర్తి చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. స్పిల్ వేను పునాది దశలోనే చంద్రబాబు వదిలేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను మధ్యలో వదిలేశారు. నేడు చిత్తశుద్ధితో పనులు.. సీఎం జగన్ అధికారం చేపట్టగానే నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. స్పిల్‌వే, ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసి గోదావరి ప్రవాహాన్ని మళ్లించాం. దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేస్తున్నాం. కొట్టుకుపోయిన డయాఫ్రమ్‌వాల్ పరిస్థితిని అంచనా వేయడానికి, సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా నిపుణులను సంప్రదిస్తున్నాం. ఎన్‌హెచ్‌పీసీ బృందం కూడా ఇటీవల పోలవరాన్ని సందర్శించింది. ఈసీఆర్‌ఎఫ్‌ను పూర్తి చేసి పోలవరం ఆయకట్టుకు నీళ్లందిస్తాం. శాసనసభ దేవాలయం అనలేదా? చంద్రబాబు దుర్మార్గాల ఫలితంగానే పోలవరం డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది. దీనిపై అర్థవంతమైన చర్చకు మేం సిద్ధం. శాసనసభకు రండి చర్చిద్దాం. చంద్రబాబు సతీమణిని ఎవరూ ఏమీ అనకపోయినా అన్నట్లుగా ఊహించుకుని శాసనసభ నుంచి నిష్క్రమించారు. నాడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తుంటే దేవాలయం లాంటి శాసనసభకు ఎందుకు హాజరు కారని చంద్రబాబు ప్రశ్నించలేదా? మరిప్పుడు చంద్రబాబు ఎందుకు రావడం లేదు? పోనీ ఆయన ఇంటి దగ్గరైనా చర్చకు మేం సిద్ధమే. -
జీవనాడికి జీవం
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఖరారు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.32,625 కోట్ల మేర రెవెన్యూ లోటు భర్తీ నిధులు రావాల్సి ఉందని వివరించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్ సాయంత్రం ప్రధాని మోదీతో 45 నిమిషాలకు పైగా సమావేశమై పలు పెండింగ్ అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలు, రుణ పరిమితిలో కోత, 12 వైద్య కళాశాలలకు అనుమతులు, జాతీయ ఆహార భద్రతా చట్టం రేషన్‌కార్డు లబ్ధిదారుల ఎంపికలో అసమానతల తొలగింపు, భోగాపురం విమానాశ్రయానికి అనుమతులు, కడప స్టీలు ప్లాంటు కోసం ఏపీఎండీసీకి గనుల కేటాయింపు, ఇంటిగ్రేటెడ్ బీచ్ శాండ్ మినరల్స్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానితో విస్తృతంగా చర్చించారు. ఆయా అంశాలపై వినతిపత్రాలను అందజేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కూడా కలుసుకుని పోలవరం పనులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. మొత్తం వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో జాతీయ హోదా కల్పించిన ప్రాజెక్టులకు అనుసరించిన విధానాన్నే పాటించాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. డ్రింకింగ్ వాటర్ కాంపొనెంట్‌ను ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా చూడాలన్నారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం అంచనాలను రూ.55,548.87 కోట్లకు ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాంకేతిక సలహా మండలి దీనికి ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. పోలవరం నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్ వారీగా విడివిడిగా కాకుండా మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని రీయింబర్స్ చేయాలని కోరారు. ఈ ఆంక్షల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన సొంత నిధులు రూ.905.51 కోట్లను తిరిగి చెల్లించలేదని ప్రధాని దృష్టికి తెచ్చారు. ప్రాజెక్టు నిమిత్తం చేసిన ఈ ఖర్చును 15 రోజుల్లోగా చెల్లించేలా చూడాలని అభ్యర్థించారు. నిర్వాసిత కుటుంబాలకు ప్యాకేజీని నేరుగా నగదు బదిలీ పద్ధతిలో అందించడం వల్ల జాప్యాన్ని చాలావరకు నివారించవచ్చన్నారు. పోలవరం నిర్మాణం శరవేగంగా, సజావుగా సాగేందుకు వీలుగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే నిధులు అడ్వాన్సుగా ఇవ్వాలని కోరారు. వీటికి సంబంధించి 80 శాతం పనులు పూర్తైన తర్వాత రెండో దశలో మిగిలిన నిధులు ఇవ్వాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. వినతిపత్రంలో ముఖ్యాంశాలు ఇలా.. ► 2014–15 పెండింగ్ బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, డిస్కమ్‌ల ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ ప్యాకేజీ, వృద్ధుల పింఛన్లు, రైతుల రుణమాఫీకి సంబంధించి మొత్తం రూ.32,625 కోట్లు రెవెన్యూ లోటు కింద ఏపీకి కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఈ అంశంపై వెంటనే దృష్టిసారించి నిధులు విడుదల చేయాలి. ► తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.6,627.86 కోట్ల మేర విద్యుత్తు బకాయిలు ఏపీకి రావాల్సి ఉంది. రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ, ఉత్పాదక సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున ఈ అంశాన్ని త్వరగా పరిష్కరించాలి. ► గత సర్కారు హయాంలో రాష్ట్రంలో 2016–17 నుంచి 2018–19 వరకూ నిర్దేశిత పరిమితికి మించి చేసిన అప్పులను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు. మూడేళ్లలో రూ.17,923 కోట్ల మేర రుణ పరిమితిలో కోత విధించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నవి రుణాలే కానీ గ్రాంట్లు కావు. కోవిడ్ విపత్తు నేపథ్యంలో రుణ పరిమితి విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ► జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ లబ్ధిదారుల ఎంపికలో అసమానతలను తొలగించాలి. ఆహార భద్రతా చట్టం కింద ఏపీకి బియ్యం తక్కువగా ఇస్తున్నట్లు గుర్తించిన నీతిఆయోగ్ దీన్ని వెంటనే పునఃసమీక్షించాలని సూచించింది. ఆహారభద్రతా చట్టం బియ్యం దేశంలో నెలకు 3 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ ఉందని, ఇందులో నుంచి ఏపీకి కేటాయించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. నెలకు 0.77 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా రాష్ట్రానికి ఇవ్వాలని సూచించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద రాష్ట్రానికి తక్కువ కేటాయింపులు జరుగుతున్నాయి. దాదాపు 56 లక్షల కుటుంబాలు ఈ పథకంలో పరిధిలోకి రావడం లేదు. వీరికిచ్చే బియ్యం సబ్సిడీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ► రాష్ట్రంలో 13 నూతన జిల్లాలు ఏర్పాటైనప్పటికీ ప్రస్తుతం 11 వైద్య కళాశాలలే ఉన్నాయి. కేంద్రం ఇటీవల అనుమతించిన మూడు మెడికల్ కాలేజీల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటితో కలిపి చూసినా 14 వైద్య కళాశాలలే అవుతాయి. మిగిలిన 12 వైద్య కళాశాలలకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలి. ► భోగాపురం విమానాశ్రయం క్లియరెన్స్ అనుమతుల గడువు ముగిసినందున తాజాగా అనుమతులు ఇవ్వాలి. ఈ మేరకు పౌర విమానయాన శాఖకు తగిన ఆదేశాలివ్వాలి. ► కడపలో స్టీలు ప్లాంట్ నిర్మిస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారు. వాణిజ్యపరంగా ప్లాంట్ నడిచేందుకు నిరంతరాయంగా ఐరన్ ఓర్ సరఫరాకు వీలుగా ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి. రాయలసీమ ప్రజల జీవనోపాధికి, ఈ ప్రాంతంలో ఆర్థిక ప్రగతికి స్టీల్‌ప్లాంట్ ఎంతో అవసరం. ► ఇంటిగ్రేటెడ్ బీచ్ శాండ్ మినరల్స్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ రంగంలో సుమారు రూ.20 వేల కోట్లు పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయి. 16 చోట్ల బీచ్‌శాండ్ మినరల్స్ ప్రతిపాదనలను అందచేయగా 14 చోట్ల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీఎండీసీకి వీటిని కేటాయించాలని కోరుతున్నాం. బకాయిలు విడుదల చేయండి – నిర్మలా సీతారామన్‌కు సీఎం విజ్ఞప్తి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ సందర్భంగా పోలవరం సవరించిన అంచనాలు, బకాయిల విడుదల తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. వివిధ పద్దుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. రుణ పరిమితిలో కోతలు విధించడం సరికాదని నివేదించారు. ఆర్థికమంత్రితో సమావేశం అనంతరం ఢిల్లీలోని అధికారిక నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ రాత్రి అక్కడే బస చేశారు. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ నిమిత్తం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ నేత మిథున్‌రెడ్డి సీఎంతో పాటు ఢిల్లీ చేరుకున్నారు. ఎంపీలు మార్గాని భరత్‌రామ్, మద్దిళ్ల గురుమూర్తి, నందిగం సురేశ్, బి.వి.సత్యవతి, అయోధ్యరామిరెడ్డి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. పోలవరం సకాలంలో పూర్తికి సహకరించండి దేశ రాజధాని పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో గురువారం రాత్రి సమావేశమైన ముఖ్యమంత్రి జగన్ పోలవరం నిర్మాణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలోని పలు అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం, నిధులు ఎప్పటికప్పుడు విడుదల తదితరాలను ప్రస్తావించారు. సకాలంలో ప్రాజెక్టు పూర్తయ్యేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి షెకావత్‌కు ఆంధ్రా స్పెషల్ బంగినపల్లి మామిడి పండ్లు అందిస్తున్న సీఎం -
రుణ పరిమితుల్లో కోతలు సవరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర రుణపరిమితుల్లో కోతలు విధించడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం జగన్ నివేదించారు. మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన విడివిడిగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ నిమిత్తం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని నిర్మలా సీతారామన్ దృష్టికి తెచ్చారు. విభజన నాటికి పెండింగ్ బిల్లులు, 10వ వేతన సవరణ సంఘం సిఫార్సుల అమలు కోసం రాష్ట్రం వెచ్చించిన రూ.32,625.25 కోట్లను భర్తీ చేయాలని కోరారు. గత సర్కారు హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చి ఇప్పుడు ఆ అదనపు రుణాలకు సరిపడా రాష్ట్ర రుణపరిమితుల్లో కోతలు విధించడం సరికాదన్నారు. దీన్ని వెంటనే సవరించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. పోలవరానికి సకాలంలో నిధులు, సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపైనా ఆర్థికమంత్రితో సీఎం జగన్ చర్చించారు. పోలవరం అంచనాలకు ఆమోదం తెలపాలి ఏపీకి జీవనాడి లాంటి పోలవరం పనులు త్వరగా పూర్తయ్యేలా సహకరించాలని జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను సీఎం జగన్ కోరారు. సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించిన పోలవరం అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాంపొనెంట్ వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టు పనులు పరిగణలోకి తీసుకుని బిల్లులు చెల్లించాలన్నారు. గోదావరి వరదల కారణంగా దెబ్బతిన్న ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం పునాదులకు సంబంధించి కూడా చర్చించారు. దిగువ కాఫర్ డ్యామ్‌కు సంబంధించి ఇప్పటికే డిజైన్లు ఖరారయ్యాయని కేంద్రమంత్రి తెలిపారు. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌కు సంబంధించి డయాఫ్రం వాల్‌ను ఎలా పటిష్టం చేయాలి? కొత్తగా నిర్మించాలా? అనే అంశాలపై నిపుణులతో చర్చలు జరుపుతున్నామని, వారం పదిరోజుల్లోగా ఇవి ఖరారు అవుతాయని ముఖ్యమంత్రికి తెలియచేశారు. పోలవరం నిర్వాసిత కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి అమిత్‌షాకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం జగన్ అమిత్ షా దృష్టికి పెండింగ్ అంశాలు విభజన హామీల అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, నూతన జిల్లాల ఏర్పాటు, రాష్ట్రానికి ఆర్థిక సహకారం సహా పలు పెండింగ్ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. బుధవారం ఉదయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. విమానాశ్రయంలో ఘన స్వాగతం ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి, చీఫ్‌విప్ మార్గాని భరత్‌రామ్, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోటగిరి శ్రీధర్, వంగా గీత, బి.వి.సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. -
పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్లపై భిన్నాభిప్రాయాలు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరదల ఉధృతికి ఏర్పడిన గుంతలు పూడ్చే విధానం, ప్రధాన డ్యామ్ డిజైన్లపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో ఏప్రిల్ 1న ఢిల్లీలో సమావేశమై వాటిని కొలిక్కి తెద్దామని కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నిపుణులకు సూచించారు. ఈ సమావేశానికి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా హాజరవుతారని చెప్పారు. పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్లపై వెదిరె శ్రీరాం అధ్యక్షతన శుక్రవారం వర్చువల్‌గా ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మట్టికట్టల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్, రిటైర్డు ప్రొఫెసర్ వీఎస్ రాజు, నిపుణులు గోపాలకృష్ణన్, దేవేందర్‌సింగ్, డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) చైర్మన్ ఏబీ పాండ్య, సీడబ్ల్యూసీ సభ్యులు, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, జల వనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం ఎస్ఈ సుధాకర్‌బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన డ్యామ్ వద్ద నదీ గర్భంలో ఏర్పడిన గుంతలను పూడ్చడంపై ప్రధానంగా చర్చించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడకుండానే గుంతలు ఉన్న ప్రదేశాల్లో పొరలు పొరలుగా ఇసుక వేస్తూ డెన్సిఫికేషన్ (అధిక ఒత్తిడితో కూరడం) చేయాలని వీఎస్ రాజు ప్రతిపాదించారు. దాంతో కోతకు గురైన ఇసుక పొరలు మునుపటిలా తయారవుతాయని చెప్పారు. దీనిపై ఏబీ పాండ్య, దేవేందర్‌సింగ్‌లు విభేదించారు. కాఫర్ డ్యామ్‌ల మధ్య ఉన్న నీటిని పూర్తిగా తోడేసి పొరలు పొరలుగా ఇసుక వేస్తూ డెన్సిఫికేషన్, వైబ్రో కాంపక్షన్ చేయాలని ప్రతిపాదించారు. దీనిపై నిపుణుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. గ్యాప్–2లో 550 మీటర్లు, గ్యాప్–1లో 1,750 మీటర్ల పొడవున ప్రధాన డ్యామ్ డిజైన్ల పైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఏప్రిల్ 1న మరోసారి సమావేశమవ్వాలని వెదిరె శ్రీరాం నిర్ణయించారు. శుక్రవారంనాటి సమావేశంలో వెల్లడైన అంశాలపై మరోసారి అధ్యయనం చేసి తుది ప్రతిపాదనతో ఆ సమావేశానికి హాజరుకావాలని నిపుణులకు, అధికారులకు సూచించారు. -
చకచకా దిగువ కాఫర్ డ్యాం పనులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు డిజైన్లు కొలిక్కివస్తున్నాయి. దీంతో పనులు ఊపందుకుంటున్నాయి. గత ప్రభుత్వ చర్యల కారణంగా పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్‌డ్యామ్, ప్రధాన డ్యామ్‌లో కొంత భాగం వరదలకు కోతకు గురయ్యాయి. వీటిని పూడ్చడానికి రూపొందించిన డిజైన్లు పోలవరం పీపీఏ, సీడబ్ల్యూసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వెంటనే ఆమోదించాలని ఇటీవల పోలవరం పరిశీలనకు వచ్చిన కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి తదనుగుణంగా చర్యలు చేపట్టారు. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చేందుకు ఇక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మించి, దానికి ఇరువైపులా ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లతో పూడ్చే విధానానికి సీడబ్ల్యూసీ ఆమోదించింది. రెండ్రోజుల్లోగా జియోమెంబ్రేన్ బ్యాగ్‌లను తెప్పించి, కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చనున్నారు. మేలోగా ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైన సమయంలోనే ప్రధాన డ్యామ్ కూడా గ్యాప్–2 ప్రాంతంలో కూడా 12 మీటర్ల లోతుకు కోతకు గురయింది. ఈ ప్రాంతం పూడ్చివేత విధానాన్ని రూపొందించేందుకు ఢిల్లీ ఐఐటీ రిటైర్డు డైరెక్టర్ ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలో కేంద్రం నిపుణుల కమిటీని నియమించింది. ఈనెల 25లోగా ఈ కమిటీ విధానాన్ని రూపొందిస్తే.. దానిపై 28 లేదా 29న కేంద్ర మంత్రి షెకావత్ నేతృత్వంలో సీడబ్ల్యూసీ, పీపీఏ, డీడీఆర్పీలు సమావేశమై కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానంతోపాటు ప్రధాన డ్యామ్ డిజైన్లను కొలిక్కి తేనున్నాయి. -
పోలవరం డిజైన్లలో ముందడుగు
సాక్షి, అమరావతి: పోలవరం డిజైన్ల ఆమోద ప్రక్రియలో ముందడుగు పడింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చివేసి నిర్మాణ పనులు చేపట్టేందుకు సంబంధించిన డిజైన్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఆమోదించింది. పోలవరం పెండింగ్ డిజైన్లపై బుధవారం ఢిల్లీలో షెకావత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) గ్యాప్–1, గ్యాప్–2 డిజైన్లతోపాటు గ్యాప్–2లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడం, స్పిల్ చానల్ ఎడమ గట్టును పటిష్టం చేయడంపై ఢిల్లీ ఐఐటీ రిటైర్డ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలో నిపుణులతో చర్చించి ఈనెల 25లోగా డిజైన్లను కొలిక్కి తేవాలని షెకావత్ ఆదేశించారు. ఈనెల 28న లేదా 29న మళ్లీ సమావేశం నిర్వహించి ఆ డిజైన్లను ఆమోదించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి వరద ఉధృతితో కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత అదనపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. దిగువ కాఫర్ డ్యామ్ పనులకు మార్గం సుగమం.. దిగువ కాఫర్ డ్యామ్‌లో 440 నుంచి 660 మీటర్ల వరకూ 220 మీటర్ల పొడవున గోదావరి వరద ఉధృతికి 36 మీటర్ల లోతున కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లు వేసి పూడ్చేలా రూపొందించిన డిజైన్‌పై కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం ఇటీవల నిర్వహించిన సమావేశంలో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్, పీపీఏ, సీడబ్ల్యూసీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. వెదిరె శ్రీరాం ఇదే అంశాన్ని షెకావత్‌కు వివరించడంతో డిజైన్‌ను ఆమోదించాలని సీడబ్ల్యూసీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డిజైన్‌ను సీడబ్ల్యూసీ అధికారులు అక్కడికక్కడే ఆమోదించారు. దీంతో దిగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. ఈసీఆర్ఎఫ్ డిజైన్లు కొలిక్కి.. పోలవరంలో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా గోదావరికి అడ్డంగా ఈసీఆర్‌ఎఫ్‌ను మూడు భాగాలుగా నిర్మించాలి. గ్యాప్–3లో 153.5 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్‌ను ఇప్పటికే నిర్మించారు. గ్యాప్–1లో 5505 మీటర్లు, గ్యాప్–2లో 1750 మీటర్ల పొడవుతో ఈసీఆర్ఎఫ్ నిర్మించాలి. గోదావరి వరద ఉధృతితో గ్యాప్–2 నిర్మాణ ప్రాంతంలో ఇసుక పొరలు కోతకు గురయ్యాయి. గ్యాప్–1, గ్యాప్–2 ఈసీఆర్ఎఫ్ డిజైన్లతోపాటు కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడంపై షెకావత్ సమీక్షించారు. స్పిల్ వే ఎడమ గట్టును పటిష్టం చేసే డిజైన్‌ను కొలిక్కి తేవాలని ఆదేశించారు. సీఎం జగన్ విజ్ఞప్తిపై స్పందించిన షెకావత్ జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ ఈనెల 4న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్ష నిర్వహించారు. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడం, ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1, గ్యాప్–2 తదితర డిజైన్ల ఆమోదంలో పీపీఏ, సీడబ్ల్యూసీ జాప్యం వల్ల పనులకు అంతరాయం కలుగుతోందని షెకావత్ దృష్టికి సీఎం తెచ్చారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున మూడు నెలల పాటు సమీక్షలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తే ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు దోహదం చేస్తుందని సీఎం వైఎస్ జగన్ చేసిన సూచనకు షెకావత్ అంగీకరించారు. ఈ క్రమంలో పెండింగ్ డిజైన్లపై ఈనెల 10న వెదిరె శ్రీరాం సమీక్ష నిర్వహించి షెకావత్‌కు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగానే షెకావత్ తాజాగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. -
నిర్వాసితులకు సీఎం జగన్ భరోసా..
-
‘ఏపీ అభివృద్ధికి అన్నివిధాలా కేంద్రం సహకారం’
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాల సహకారం అందిస్తుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. శుక్రవారం పోలవరంలో పర్యటించిన అనంతరం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ పేరిట ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. దేశంలో బీజేపీ ఒకటి నుంచి మొదలు పెట్టి ఈ రోజు ఈ స్థాయికి చేరుకుందని, ఈ విజయ పయనం వెనుక ఎంతోమంది కృషి ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. దేశంలో మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పార్టీ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో షెకావత్ సమావేశమయ్యారు. ఏపీకి మోదీ అందిస్తున్న వరం పోలవరం అని అన్నారు. -
Andhra Pradesh: సంపూర్ణ సహకారం
పోలవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియపై 15 రోజులకు ఒకసారి చొప్పున మూడు నెలల పాటు సమీక్షించి.. ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరిస్తే, ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సూచనలపై ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో 15 రోజులకు ఒకసారి పెండింగ్ డిజైన్లు, ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పనలో ప్రగతి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేయడం వరకు అన్ని అంశాలపై సమీక్షించి, సమస్యలను పరిష్కరించి, నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంను షెకావత్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై ప్రత్యేక డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. దాని ద్వారా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుని, పనుల్లో వేగం పెంచడానికి చర్యలు చేపట్టవచ్చని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం ఆయన విజయవాడ నుంచి హెలికాప్టర్లో సీఎం జగన్‌తో కలిసి తూర్పుగోదావరి జిల్లా ఇందుకూరు, పశ్చిమ గోదావరి జిల్లా తాడ్వాయి వద్ద నిర్మించిన పునరావాస కాలనీలను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సీఎం జగన్ తదితరులు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన నిర్వాసితుల కాలనీలు, గృహాలు, కనీస మౌలిక సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. జీవన ప్రమాణాలు మెరుగుపడేలా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామన్నారు. ఆ తర్వాత హెలికాప్టర్లో పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ ఏరియల్ సర్వే ద్వారా పనుల ప్రగతిని పరిశీలించారు. అనంతరం వ్యూపాయింట్ నుంచి పనులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే, స్పిల్ చానల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్), డయా ఫ్రమ్ వాల్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం సీఎం జగన్‌తో కలిసి కేంద్ర జల్ శక్తి, పీపీఏ, రాష్ట్ర జల వనరుల శాఖ, పునరావాస విభాగం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల ప్రగతి, నిర్వాసితులకు పునరావాసంపై రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 15 రోజుల్లోగా పెండింగ్ డిజైన్లు కొలిక్కి.. గోదావరికి 2019, 2020లలో వచ్చిన వరదల ఉధృతికి దిగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్, ఈసీఆర్ఎఫ్ డయాఫ్రమ్ వాల్లో కొంత భాగం కోతకు గురైందని.. కోతకు గురైన ప్రాంతాన్ని ఎలా పూడ్చాలనే అంశంపై డిజైన్లను ఇచ్చామని.. వాటిని ఇప్పటిదాకా పీపీఏ, సీడబ్ల్యూసీ ఖరారు చేయలేదని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. దీని వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ఈ వ్యవహారంలో పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ తీరుపై మంత్రి షెకావత్ అసహనం వ్యక్తం చేశారు. అనవసర జాప్యాన్ని సహించే ప్రశ్నే లేదని హెచ్చరించారు. దేశీయ, విదేశీ సాంకేతిక నిపుణుల సహకారంతో డిజైన్లు ఖరారు చేయాలని ఆదేశించారు. పెండింగ్ డిజైన్లపై వారంలోగా పీపీఏ, సీడబ్ల్యూసీ, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు, డీడీఆర్పీ(డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) అధికారులతో సమావేశం నిర్వహించాలని చెప్పారు. 15 రోజుల్లోగా డిజైన్లను ఖరారు చేసి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డిజైన్ల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంటే పీపీఏ అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రాజెక్టు వ్యయాన్ని ఒక్కటిగా పరిగణించాలి పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేసేందుకు పీపీఏ నియంత్రణ పెడుతోందని.. విభాగాల (కాంపొంనెంట్లు) వారీగా రీయింబర్స్ చేస్తోందని.. దీని వల్ల కుడి, ఎడమ కాలువల పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొందని కేంద్ర మంత్రి షెకావత్‌కు సీఎం వైఎస్ జగన్ వివరించారు. విభాగాల వారీగా వ్యయాన్ని రీయింబర్స్ చేస్తామనే షరతులు చూపి.. రూ.859.59 కోట్ల బిల్లులను పీపీఏ నిరాకరించిందని ఎత్తిచూపారు. ప్రాజెక్టు వ్యయాన్ని ఒక్కటిగానే పరిగణించి.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి చెల్లిస్తే నిధుల కొరత ఉత్పన్నం కాదన్నారు. ఇది ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రూ.2,616 కోట్లను త్వరగా రీయింబర్స్ చేయాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. మిగతా 15 జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరం ప్రాజెక్టులో నీటి సరఫరా, తాగునీటి వ్యయాన్ని ఒక్కటిగా పరిగణించాలని సీఎం కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారు చేసి, ఆమోదించిందని.. దానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలన్నారు. ఆ మేరకు నిధులు విడుదల చేస్తే ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న సీఎం ప్రతిపాదనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తున్న కేంద్ర మంత్రి షెకావత్, సీఎం జగన్. చిత్రంలో మంత్రులు నిర్వాసితులకు నగదు బదిలీ రూపంలో పరిహారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ కింద చెల్లించాల్సిన నగదు పరిహారాన్ని డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) విధానంలో వారి ఖాతాల్లో జమ చేయాలని సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనపై వెంటనే చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి జల్ శక్తి శాఖ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులను ముంపు గ్రామాల నుంచి కాలనీలకు తరలించడంపై నిర్దిష్ట కార్యాచరణ ఉండాలని అధికారులకు సూచించారు. నెలవారీ కార్యాచరణ తయారు చేసి, ఆ మేరకు పునరావాసం కల్పించాలన్నారు. పునరావాస కల్పనపై పీపీఏ స్థాయిలో, కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ స్థాయిలో వారాల వారీగా ప్రగతి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. రాజమండ్రికి పీపీఏ కార్యాలయం పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌కు సీఎం వైఎస్ జగన్ సూచించారు. దీని వల్ల పనులను ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చని చెప్పారు. తద్వారా సమన్వయ లోపం తలెత్తదని.. çపనులు వేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. దీనిపై షెకావత్ సానుకూలంగా స్పందించారు. తక్షణమే పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశం అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. పునరావాసం కల్పనపై నిర్వాసితులతో మాట్లాడామని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వారికి మెరుగైన రీతిలో వసతులు కల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రాజెక్టు పనులకు అడ్డంకిగా మారిన అంశాలపై సమీక్షించామని, ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పి.అనిల్ కుమార్, పేర్ని నాని, కురసాల కన్నబాబు, తానేటి వనిత, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, పినిపే విశ్వరూప్, శ్రీరంగనాథరాజు, పీపీఏ సీఈఓ జె చంద్రశేఖర్ అయ్యర్, జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్ పర్యటన సాగిందిలా..
సాక్షి, పోలవరం (పశ్చిమగోదావరి): పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శుక్రవారం పరిశీలించారు. పునరావాస కాలనీలను పరిశీలించిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ముందుగా వ్యూ పాయింట్ వద్ద పరిశీలన చేసిన సీఎం, కేంద్రమంత్రి.. తర్వాత స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. అనంతరం పూర్తైన ఎగువ కాఫర్ డ్యాంను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్లు. వివరించారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం, కేంద్రమంత్రి.. పోలవరం ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. చదవండి: సీఎం జగన్ అండగా నిలిచారు.. వారి ఆనందానికి అవధుల్లేవ్.. ►పోలవరం ప్రాజెక్టు పురోగతి, భవిష్యత్తులో చేయాల్సిన పనులు తదితర అంశాలపై పీపీఏ అధికారులు, ఇరిగేషన్ అధికారులు.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ►కేంద్రమంత్రి ముందు నిర్దిష్ట అంశాలను ఉంచిన ముఖ్మమంత్రి, రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు ►2017–18 ధరల సూచీని అనుసరించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా రూ.55,548.87 కోట్ల రూపాయలకు ఖరారు చేయాలని రాష్ట్ర అధికారులు కేంద్ర మంత్రిని కోరారు ►తాగునీటి కాంపొనెంట్‌ను ప్రాజెక్టులో భాగంగా పరిగణించాలని విజ్ఞప్తిచేశారు ►ఇదే సందర్భంలో కొన్ని కీలక అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముందు ఉంచారు ►ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం కాంపొనెంట్ వారీగా రీయింబర్స్ చేస్తోందని, కాంపొనెంట్ వారీగా నియంత్రణల వల్ల కొన్ని పనులు ముందుకు సాగని పరిస్థితి ఉందని కేంద్రమంత్రి మందు ముఖ్యమంత్రి ఉంచారు ►దీనివల్ల పోలవరం, కుడి-ఎడమ కాల్వలకు సంబంధించిన పనులు ముందుకు సాగని పరిస్థితి ఉందని, ఏకంగా చేసిన పనులకు బిల్లులు కూడా పీపీఏ అప్లోడ్ చేయడంలేదన్న విషయాన్ని కేంద్రమంత్రికి సీఎం తెలిపారు ►దీనివల్ల రాష్ట ప్రభుత్వం చేసిన ఖర్చుకు, కేంద్ర ప్రభుత్వం చేసిన రీయింబర్స్‌మెంట్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందన్న సీఎం ►వివిధ పనుల కోసం ఖర్చుచేసిన రూ.859.59 కోట్ల రూపాయల బిల్లులను పీపీఏ నిరాకరించిన విషయాన్ని సీఎం, రాష్ట్ర అధికారులు.. కేంద్రమంత్రికి వివరించారు. ►మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఒకే కాంపొనెంట్‌గా తీసుకుని, ప్రతి 15 రోజుల కొకసారి బిల్లులను చెల్లించాలని, దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి క్యాష్ ఫ్లో ఉంటుందని తెలిపిన సీఎం ►దిగువ కాఫర్ డ్యాం మరియు ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో వరదల కారణంగా ఏర్పడ్డ కోతకు గురైన ప్రాంతాన్ని ఏ విధంగా పూడ్చాలన్న దానిపై ఇప్పటివరకూ విధానాలను, డిజైన్లను ఖరారు చేయలేదని కేంద్రమంత్రికి రాష్ట్ర అధికారులు తెలిపారు ►ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యాన్ని నివారించడానికి డిజైన్లను త్వరగా ఖరారు చేయాలని కోరిన సీఎం. ►పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలన్న సీఎం.. దీనివల్ల పనుల నిర్మాణ పరిశీలన ఎప్పటికప్పుడు జరుగుతుందని, అలాగే సమన్వయ లోపం లేకుండా, పరిపాలన సులభంగా జరిగేందుకు వీలు ఉంటుందని తెలిపారు. ►పోలవరం ప్రాజెక్టు కారణంగా మంపునకు గురవుతున్న వారికి నష్టపరిహారాన్ని డీబీటీ పద్ధతిలో చెల్లించాలని కేంద్రమంత్రిని కోరిన సీఎం ►ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో సమస్యలను ఎప్పటికప్పుడు తొలగించడానికి, ప్రతి 15 రోజులకు ఒకసారి నేరుగా కేంద్రమంత్రే సమీక్షలు చేసి వాటి పరిష్కారాలను సాధించాలని, తద్వారా పోలవరం ప్రాజెక్టును శీఘ్రగతిని పూర్తి చేయడానికి దోహదపడుతుందని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు. ►కనీసం 3 నెలల పాటు ఇలా చేయడం వల్ల సమస్యలు తొలగిపోతాయన్న సీఎం సీఎం విజ్ఞాపనలపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి: ♦ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞాపనలపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. అక్కడికక్కడే పీపీఏ సహా, తన శాఖకు చెందిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ♦పోలవరం ముంపు బాధితులను పునరావాస కాలనీలకు తరలించడంపై నిర్ధిష్ట కార్యాచరణ ఉండాలని అధికారులను ఆదేశించారు. నెలవారీ కార్యాచరణ తయారు చేయాలన్నారు. ♦పీపీఏ స్థాయిలో, మంత్రిత్వ శాఖ స్థాయిలో వారం వారీగా ప్రగతి నివేదికలు ఇవ్వాలన్నారు. ♦ప్రాజెక్టు ముంపు బాధితులు ప్రత్యక్ష నగదుబదిలీ పథకం ద్వారా పరిహారాన్ని ఇవ్వాలంటూ సీఎం చేసిన ప్రతిపాదనను అంగీకరించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ♦ముఖ్యమంత్రి కోరినట్టుగా పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలని, వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ♦దిగువ కాఫర్‌డ్యాం, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం వద్ద కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడంపై, నిర్మాణాలు పటిష్టంగా చేయడంపై వెంటనే డిజైన్లు ఖరారు చేయాలని, ఈ విషయంలో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. దేశంలో, లేదా దేశం వెలుపల నిపుణులైన సంస్థల సేవలను వినియోగించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. 15 రోజుల్లోగా దీన్ని కొలిక్కి తీసుకు రావాలని పీపీఏ సహా అధికారులను ఆదేశించారు ♦ముఖ్యమంత్రి కోరినట్టుగా పోలవరం ప్రాజెక్టుపై ప్రతి 15 రోజులకోసారి వచ్చే మూడు నెలలపాటు సమీక్ష చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు, సంబంధిత అధికారులు దీనికి హాజరుకావాలన్నారు. ♦పోలవరం పనుల ప్రగతిపై ఒక డ్యాష్ బోర్డ్‌ని ఏర్పాటు చేయాలని, దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రగతి తెలుస్తుందన్నారు. ♦ముఖ్యమంత్రి, రాష్ట్ర అధికారులు నివేదించిన మిగిలిన అంశాలను పరిగణలోకి తీసుకుని వాటిపై ముందుకుసాగుతామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్, రవాణా, ఐఅండ్‌పీఆర్ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పీపీఏ సీఈఓ జె చంద్రశేఖర్ అయ్యర్, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్ పోలవరం పర్యటన (ఫొటోలు)
-
మాట నిలబెట్టుకుంటాం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పునరావాస పనులపై అధికారులు మరింత దృష్టి పెట్టాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు పునరావాస కాలనీలను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. అనంతరం ఇందుకూరు నిర్వాసితులతో సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్ ముఖాముఖి నిర్వహించారు. చదవండి: Andhra Pradesh: వడివడిగా వరదాయని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పోలవరం పూర్తయితేనే ఏపీ సస్యశ్యామలం అవుతుందన్నారు. నిర్వాసితులకు కేంద్ర సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని, వారి జీవనోపాధిపై కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో రూ.6.8 లక్షల నుంచి 10 లక్షలు ఇస్తామన్న మాట బెట్టుకుంటామన్నారు. వైఎస్ హయాంలో భూసేకరణలో ఎకరం లక్షన్నరకే ఇచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. -
నిర్వాసితులకు జీవనోపాధిపై ప్రత్యేక కార్యాచరణ
-
తాడువాయిలో సీఎం వైఎస్ జగన్...
-
పోలవరానికి మళ్లీ వస్తా
-
పునరావాస పనులపై అధికారులు మరింత శ్రద్ధపెట్టాలి: సీఎం జగన్
-
LIVE: పోలవరంకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, సీఎం జగన్
-
పోలవరం పనులపై కేంద్ర జలశక్తి మంత్రి కీలక ఆదేశాలు
లైవ్ అప్డేట్స్ ►పోలవరం పనులపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కీలక ఆదేశాలిచ్చారు. సమస్యల పరిష్కారానికి 15రోజులకు ఒకసారి సమీక్ష చేస్తానని తెలిపారు. పెండింగ్ డిజైన్లను ఆమోదించాలన్న ప్రతిపాదనపై స్పందించిన కేంద్ర మంత్రి ఈ నెల 15వ తేదీలోగా డిజైన్లపై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. నిర్వాసితులకు డీబీటీ విధానంలో చెల్లింపుల ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. త్వరలో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పునరావాస కాలనీల నిర్మాణాన్ని కేంద్రమంత్రి ప్రశంసించారు. ►పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమీక్ష చేపట్టారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఇరిగేషన్ అధికారులు, ఆర్అండ్ఆర్ అధికారులు హాజరయ్యారు. ►పోలవరం పురోగతి పనులను సీఎం జగన్, కేంద్ర మంత్రి షెకావత్‌లకు వివరిస్తున్న అధికారులు ►పోలవరం ప్రాజెక్ట్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన అనంతరం.. పోలవరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న సీఎం జగన్, కేంద్ర మంత్రి షెకావత్ ►పోలవరం ప్రాజెక్ట్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్న సీఎం, కేంద్ర మంత్రి ►నిర్వాసితుల జీవనోపాధిపై కార్యాచరణ:సీఎం జగన్ ►నిర్వాసితులకు కేంద్ర ప్యాకేజీతో పాటు రాష్ట్రం కూడా సాయం చేస్తుంది: సీఎం జగన్ ►పోలవరాన్ని వైఎస్ఆర్ ముందుకు తెచ్చారు: షెకావత్ ►పోలవరాన్ని పూర్తి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు: షెకావత్ ► తాడువాయి పునరావాస నిర్వాసితులతో సీఎం, కేంద్ర మంత్రి ముఖాముఖి ►తాడువాయి చేరుకున్న సీఎం జగన్-కేంద్ర మంత్రి షెకావత్ తాడువాయి పునరావాస కాలనీని పరిశీలించిన సీఎం, కేంద్రమంత్రి ►పునరావాస పనులపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలన్నారు సీఎం వైఎస్ జగన్. పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి అని, పోలవరం పూర్తయితే ఏపీ మరింత సస్య శ్యామలం అవుతుందని సీఎం జగన్ తెలిపారు. నిర్వాసితులకు ఇచ్చే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో 6.8 లక్షల నుండి 10 లక్షలు ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటామన్నారు. వైఎస్సార్ హయాంలో భూసేకరణలో ఎకరానికి లక్షన్నరే ఇచ్చినవారికి రూ. 5లక్షలు ఇచ్చి న్యాయం చేస్తామని అన్నారు. ► పునరావాస కాలనీ అద్భుతంగా ఉంది. కాలనీలో మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఇచ్చిన మాట ప్రకారం.. మోదీ సర్కార్ కట్టుబడి ఉంది. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తా: కేంద్ర మంత్రి షెకావత్. ► ఇందుకూరు నిర్వాసితులతో సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్ ముఖాముఖి ► ఇందుకూరు పేట చేరుకున్న సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి షెకావత్. స్వాగతం పలికిన అధికారులు. నిర్వాసితుల పునరావాస కాలనీ పరిశీలన. ► దేవీపట్నం మండలం ఇందుకురూ-1 లో నిర్వాసితులతో సీఎం జగన్, కేంద్ర జలశక్తి వనరుల మంత్రి షెకావత్ మాటామంతి. తాడువాయి పునరావాస కాలనీలో నిర్వాసితులతో మాట్లాడనున్న సీఎం జగన్, కేంద్రమంత్రి షెకాత్. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారులతో భేటీ. ► దేవీపట్నం మండలం ఏనుగుల పల్లి, మంటూరు, అగ్రహారం గ్రామాలకు సంబంధించిన నిర్వాసితుల కోసం ఇందుకూరు -1 కాలనీ ని ఏర్పాటు చేశారు. కాలనీ కి ఇప్పటికే 306 నిర్వాసిత కుటుంబాలు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరం బయల్దేరారు. పోలవరం పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి సీఎం జగన్ పోలవరం పర్యటనకు బయల్దేరారు. సీఎంవెంట కేంద్ర మంత్రి షెకావత్‌తో పాటు, రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Andhra Pradesh: వడివడిగా వరదాయని -
Andhra Pradesh: వడివడిగా వరదాయని
సాక్షి, అమరావతి: ఉత్తుంగ గోదావరిపై ఎనిమిది దశాబ్దాల స్వప్నం శరవేగంగా ఆవిష్కృతమవుతోంది. స్పిల్ వేను పూర్తి చేసి గోదావరి ప్రవాహానికి ఎగువ కాఫర్ డ్యామ్‌తో అడ్డుకట్ట వేయడంతో పోలవరం జలాశయం ఇప్పటికే సుందర రూపం సంతరించుకుంది. జలాశయం, అనుసంధానాల పనులు 80.6 శాతం, కుడి కాలువ పనులు 92.57 శాతం, ఎడమ కాలువ పనులు 71.11 శాతం పూర్త య్యాయి. నిర్వాసితులకు పునరావాస కల్పన పను లు 20.19 శాతం పూర్తయ్యాయి. పునరావాసం, భూసేకరణ, జలాశయం, కుడి, ఎడమ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు మొత్తంగా చూస్తే 42.68 శాతం పనులు పూర్తయ్యాయి. గోదావరి సహజ ప్రవాహాలు, సీలేరు నుంచి వచ్చే జలాలకు తోడు పోలవరం లో నిల్వ చేసిన నీటితో రబీలో గోదావరి డెల్టాకు సమృద్ధిగా నీటి సరఫరా జరుగుతోంది. గత సర్కారు అవగాహన రాహిత్యం, ప్రణాళిక లోపం, చిత్త శుద్ధి లేమితో చేపట్టిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) డయాఫ్రమ్ వాల్, దిగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ 2019, 2020లో గోదావరి వరద ఉధృతికి కొంత భాగం దెబ్బతింది. కోతకు గురైన డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌటింగ్‌లను డ్యా మ్ డిజైన్ రివ్యూ ప్యానల్, సీడబ్ల్యూసీ మార్గదర్శ కా ల మేరకు బాగుచేసి జలాశయాన్ని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీడ బ్ల్యూసీ, ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) ఆమోదించిన మేరకు 2017–18 ధరల ప్రకారం పోలవరానికి కేంద్రం నిధులిస్తే ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. జీవనాడికి జవసత్వాలు.. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా 2019 జూన్ 20న పోల వరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలు త వరద మళ్లించే స్పిల్ వేను పూర్తి చేసి తర్వాత కాఫర్ డ్యామ్‌లు, సమాంతరంగా పునరావాస పను లు, కాఫర్ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ను చేపట్టి వరద సమయంలోనూ పనులు కొనసాగించడం ద్వారా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు. టీడీపీ సర్కార్ నామినేషన్ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన ప నులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రచారార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షించారు. తాజాగా శుక్రవారం రోజు ఐదోసారి పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం పనుల పరిశీలనకు తొలిసారిగా రానుండటం గమనార్హం. ప్రణాళికాయుతంగా పనులు.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలవరం పనులను ప్రభుత్వం పరుగులు తీయించింది. స్పిల్‌వేలో మిగతా ఆరు గేట్ల బిగింపు పనులకు శ్రీకారం చుట్టింది. గతేడాదే ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. గతేడాది జూన్ 11న గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్ చానల్, స్పిల్‌వే, స్పిల్ చానల్, పైలట్ చానల్ మీదుగా 6.6 కి.మీ. పొడవున మళ్లించింది. జలవిద్యుత్కేంద్రంలో అత్యంత కీలకమైన 12 ప్రెజర్ టన్నెళ్ల తవ్వకం పనులను రికార్డు సమయంలో పూర్తి చేసింది. డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించడమే ఆలస్యం.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌ను పూర్తి చేసి సమాంతరంగా జలవిద్యుత్కేంద్రం పనుల పూర్తి దిశగా అడుగులు వేస్తోంది. పునరావాసంపై ప్రత్యేక దృష్టి.. పోలవరంలో పునరావాసం, భూసేకరణకు రూ.35,669.08 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం లెక్కించగా.. అది రూ.33,163.28 కోట్లుగా సీడబ్ల్యూసీ తేల్చింది. టీడీపీ సర్కార్ ఐదేళ్లలో అతి కష్టమ్మీద 1,846 ఇళ్ల నిర్మాణం చేపట్టి కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటిదాకా 4,505 కుటుంబాలకు పునరావాసం కల్పించి రూ.6,654.39 కోట్లను ఖర్చు చేసింది. పోలవరం పూర్తయితే 38.41 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమవుతుంది. తక్కువ ధరకే 960 మెగావాట్ల జలవిద్యుత్ అందుబాటులోకి వస్తుంది. విశాఖ పారిశ్రామిక అవసరాలను తీర్చడంతోపాటు ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ, ఉత్తరాంధ్ర తాగునీటి కష్టాలు తీర్చవచ్చు. -
తూ. గో జిల్లా గోకవరంలో రేపు సీఎం జగన్ పర్యటన
-
పోలవరంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన వివరాలిలా..
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఈనెల 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పరిశీలించనున్నారు. వీరి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతంలో స్పిల్‌వే, ఫిష్ ల్యాడర్, కాఫర్‌డ్యామ్, ఈసీఆర్ఎఫ్ ప్రాంతాలను పరిశీలించి పనులను వివరాలను సీఈ సుధాకర్‌బాబు నుంచి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు ప్రాంతంలోని మేఘ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, మేఘ ప్రతినిధులతో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. క్వాలిటీ కంట్రోల్ సీఈ ఆర్.సతీష్‌కుమార్, ఎస్ఈ శ్రీనివాసయాదవ్, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. సీఎం పర్యటన వివరాలు ఇలా.. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు 1 పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. ఆ తర్వాత 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి 12.30 గంటలకు పోలవరం డ్యామ్ సైట్ చేరుకుని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు పోలవరం డ్యామ్ సైట్ నుంచి తిరిగి బయలుదేరి 5.30 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకుంటారు. సీఎం సెక్యూరిటీ పరిశీలన సీఎం సెక్యూరిటీ బృందం సభ్యులు, జాయింట్ కలెక్టర్ అంబేడ్కర్ ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ కె.లతాకుమారి, తహసీల్దార్ బి.సుమతి, ఎస్సై ఆర్.శ్రీను, ఈఈ పి.ఆదిరెడ్డి ఉన్నారు. చల్లవారిగూడెం పునరావాస కాలనీలో.. జంగారెడ్డిగూడెం రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈనెల 4న చల్లవారిగూడెం పునరావాస కాలనీ సందర్శనలో భాగంగా ఏర్పాట్లను బుధవారం చింతలపూడి, పోలవరం ఎమ్మెల్యేలు వీఆర్ ఎలీజా, తెల్లం బాలరాజు, ఏఎస్పీ కృష్ణంరాజు పరిశీలించా రు. ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యేలు సూచించారు. ఎంపీపీ కొదమ జ్యోతి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, పట్టణ అధ్యక్షుడు పీపీఎన్ చంద్రరావు ఉన్నారు. -
4న పోలవరానికి సీఎం జగన్
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులను ఈనెల 4న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అక్కడి అంశాల ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి షెకావత్, సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని షెకావత్‌కు సీఎం జగన్ విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2017–18 ధరల ప్రకారం ఆమోదం తెలిపిన సవరించిన అంచనా వ్యయం రూ. 55,548.87 కోట్లకు పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) ఇచ్చి, నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. పెండింగ్‌లో ఉన్న డిజైన్లను యుద్ధప్రాతిపదికన ఆమోదించేలా సీడబ్ల్యూసీని ఆదేశించాలని విజ్ఞప్తి చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి కేంద్ర మంత్రి షెకావత్ ఈనెల 3న ఢిల్లీ నుంచి విమానంలో విజయవాడకు చేరుకోనున్నారు. విజయవాడ నుంచి 4న ఉదయం హెలీకాప్టర్‌లో సీఎం జగన్‌తో కలిసి షెకావత్ పోలవరానికి చేరుకుని.. ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. -
AP: 4న పోలవరానికి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి
సాక్షి, అమరావతి: కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మార్చి 4న పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. స్పిల్ వే, స్పిల్ చానల్, ఎర్త్‌కమ్ రాక్ ఫిల్ డ్యామ్ డయా ఫ్రమ్ వాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పరిశీలించనున్నారు. చదవండి: కొత్త జిల్లాల ప్రక్రియ వేగవంతం తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి.. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వచ్చే నెల 4న ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. -
వైఎస్సార్ జిల్లాకు ‘జల’ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ జల అవార్డుల్లో ఉత్తమ జిల్లాగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా నిలిచింది. సౌత్ జోన్ పరిధిలో ఉత్తమ జిల్లా కేటగిరీలో రెండో స్థానం సాధించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ జాతీయ జల అవార్డులు–2020ను ప్రకటించారు. ఇందులో ఉత్తమ రాష్ట్ర విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు ప్రథమ బహుమతి లభించగా, ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. ఈ సందర్భంగా షెకావత్ మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 18 శాతం కంటే ఎక్కువగా ఉండగా, పునరుత్పాదక నీటి వనరుల్లో మాత్రం కేవలం నాలుగు శాతమే ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ‘జల్ సమృద్ధ్ భారత్’ సాధనలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన ఆదర్శప్రాయమైన పనులు, ప్రయత్నాలను గుర్తించి ప్రోత్సహించేందుకు జాతీయ జల అవార్డులను ప్రధానం చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఉపరితల జలాలు, భూగర్భ జలాలు జల చక్రంలో అంతర్భాగంగా ఉన్నాయన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటూ నీటి వనరుల నిర్వహణలో సమగ్ర విధానాన్ని అవలంబించేలా ఏకీకృత జాతీయ జల అవార్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. -
ఎట్టకేలకు అపెక్స్ కౌన్సిల్ భేటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదం పరిష్కారానికి ఎట్టకేలకు అపెక్స్ కౌన్సిల్ భేటీ కానుంది. ఈ సమావేశం నిర్వహించా లని తెలంగాణ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. కాగా త్వరలో అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ప్రకటించారు. సమావేశం అజెండాను పంపాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఆదేశించారు. ఆయా అంశాలను పరిశీలించి తుది అజెండాను ఖరారు చేస్తామని, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించి సమావేశం తేదీని నిర్ణయిస్తారని వెల్లడించారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై పంకజ్‌కుమార్ మంగళవారం ఢిల్లీ నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. సీడ్ మనీ మొత్తంపై పునరాలోచన కృష్ణా, గోదావరి బోర్డుల నిర్వహణకు గెజిట్‌లో పేర్కొన్న మేరకు ఒక్కో బోర్డు ఖాతాలో ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీగా తక్షణమే డిపాజిట్ చేయాలని రెండు రాష్ట్రాలను పంకజ్‌కుమార్ కోరారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకేసారి రూ.200 కోట్లను డిపాజిట్ చేయలేమని తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ఒకేసారి ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు డిపాజిట్ చేస్తే ఆ నిధులను ఏం చేస్తారో చెప్పాలని సోమేశ్‌కుమార్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సీడ్ మనీ తగ్గింపుపై పునరాలోచన చేస్తామని పంకజ్‌కుమార్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు అప్పగించం: తెలంగాణ కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు షెడ్యూల్–3 పరిధిలోని ప్రాజెక్టులను తక్షణమే ఆయా బోర్డులకు అప్పగించాలని పంకజ్‌కుమార్ ఆదేశించారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేసేలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, కొత్త ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎస్ కోరారు. అప్పటిదాకా ప్రాజెక్టులను కూడా అప్పగించబోమని స్పష్టం చేశారు. గోదావరి బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు మాత్రమేనని, ఈ నేపథ్యంలో గోదావరి బోర్డు అవసరమే లేదని చెప్పారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని ఏపీ పేర్కొంది. గోదావరి బోర్డు అత్యంత ఆవశ్యకమని.. తక్షణమే శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకోవాలని కోరింది. శ్రీశైలం, సాగర్లను అప్పగించాల్సిందే: కేంద్రం రెండు రాష్ట్రాల అధికారుల వాదనల అనంతరం పంకజ్‌కుమార్ స్పందించారు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను తక్షమే కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఆదేశించారు. కృష్ణా బోర్డు నేతృత్వంలో రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమై.. ఏకాభిప్రాయంతో వాటిని బోర్డుకు అప్పగించాలని తేల్చిచెప్పారు. గెజిట్ నోటిఫికేషన్‌ను మార్చే ప్రసక్తే లేదని.. గోదావరి బోర్డు అత్యంతావశ్యకమని స్పష్టం చేశారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై న్యాయశాఖతో కేంద్రం చురుగ్గా సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ఇలావుండగా గెజిట్ నోటిఫికేషన్లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న వాటికి ఆమోదం పొందడం కోసం తక్షణమే వాటి డీపీఆర్‌లను కృష్ణా, గోదావరి బోర్డులకు, కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) పంపాలని రెండు రాష్ట్రాలను పంకజ్‌కుమార్ ఆదేశించారు. విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులపై ఒక నివేదిక ఇస్తే.. కొత్తగా అనుమతి తీసుకోవాలా? వద్దా? అనే అంశాన్ని తేల్చుతామని చెప్పారు. -
జల ప్రళయాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలా!
సాక్షి, అమరావతి: జల ప్రళయాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ హితవు పలికారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వ్యాఖ్యలను ఖండిస్తూ అనిల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టు గేట్ల సామర్థ్యానికి మించి హఠాత్తుగా వచ్చిన వరదతోనే అన్నమయ్య ప్రాజెక్టు వద్ద అనూహ్యంగా వరద కట్టలు తెంచుకుందన్నారు. ఇటువంటి ఘటనే ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగితే, అక్కడ 150 మంది జల సమాధి అయ్యారన్న విషయం అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి నిజాల్ని దాచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆ వాదన సరికాదు అన్నమయ్య ప్రాజెక్టులో ఐదో గేటు తెరుచుకున్నా, అందులో నుంచి బయటకు వెళ్లే నీటి సామర్థ్యం 40 వేల క్యూసెక్కులేనని మంత్రి పేర్కొన్నారు. విరుచుకుపడిన వరద 3 లక్షల క్యూసెక్కులకు పైనే ఉండటంతో ఒక గేటు తెరుచుకోలేదన్న వాదనకు విలువ లేదన్నారు. ఈ అంశం స్పష్టంగా తెలిసినప్పటికీ షెకావత్ ఈ విషయంలో నిజాలు విస్మరించారన్నారు. షెకావత్ వెనుక కూర్చున్న సీఎం రమేష్, సుజనాచౌదరి బహుశా కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ తరఫున ఈ పిట్ట కథ వినిపించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఏం జరిగిందన్న విషయంపై జిల్లా కలెక్టర్ లేదా ప్రాజెక్టు అధికారులతో సంప్రదించకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిరాధారమైన ప్రకటనలు చేయడం సరికాదన్నారు. అత్యంత సున్నితమైన అంశాలను సాక్షాత్తు పార్లమెంటులో మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నది ఆలోచించాలన్నారు. నిరాధారమైన ఈ వ్యాఖ్యలను పట్టుకుని టీడీపీ చేస్తున్న యాగీ చూస్తుంటే జల ప్రళయంలో కూడా ఇంత దిగజారి రాజకీయం చేస్తారా? అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. -
నదుల అనుసంధానంతో దేశం సస్యశ్యామలం
సాక్షి, అమరావతి: నదుల అనుసంధానం ద్వారా దుర్భిక్ష పరిస్థితులకు అడ్డుకట్ట వేసి, దేశాన్ని సస్యశ్యామలం చేయవచ్చునని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. ఎక్కువ నీటి లభ్యత ఉన్న నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) నుంచి తక్కువ నీటి లభ్యత ఉన్న నది బేసిన్‌కు నీటి మళ్లించడానికి బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలు సహకరించాలని కోరారు. బేసిన్లు, ట్రిబ్యునళ్ల అవార్డులకు అతీతంగా నదుల అనుసంధానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సాధారణ సమావేశం, నదుల అనుసంధానంపై జరిగిన ప్రత్యేక కమిటీ సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రాలు సహకరిస్తే ప్రాధాన్యత క్రమంలో నదుల అనుసంధానం పనులు చేపడతామని మంత్రి వివరించారు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానాన్ని ప్రాధాన్యతగా చేపడతామని చెప్పారు. నీటి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేశాక.. గోదావరిలో మిగులు జలాలను దిగువ రాష్ట్రమైన ఏపీ అవసరాలు తీర్చాకనే కావేరికి తరలించాలని ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ప్రతిపాదించారు. కావేరికి తరలించే గోదావరి జలాల్లో సింహభాగం వాటా తమకు కేటాయించాలని తెలంగాణ సర్కార్ కోరింది. అలాగే, కావేరి బేసిన్‌కు తరలించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలని కర్ణాటక, మహారాష్ట్ర.. కావేరి జలాల్లో అదనపు వాటా కావాలని కర్ణాటక, కేరళ కోరాయి. తొలి దశలో 84 టీఎంసీల గోదావరి జలాలనే కావేరికి తరలిస్తున్నారని.. రెండో దశలో కనీసం 126 టీఎంసీలు కేటాయించాలని తమిళనాడు సర్కార్ కోరింది. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్ స్పందిస్తూ.. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని స్పష్టంచేశారు. -
ఏడేళ్లుగా కేంద్రం పట్టించుకోలేదు: హరీశ్ రావు
సాక్షి, సిద్దిపేట: కృష్ణా జలాల్లో రాజ్యాంగబద్ధమైన, న్యాయమైన వాటానే తెలంగాణకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని, గొంతెమ్మ కోరికలేవీ కోరట్లేదని మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 42వ రోజే అంటే.. 2014 జూలై 14నే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదంపై సెక్షన్ 3 కింద అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అభ్యంతరం తెలపడాన్ని, తెలంగాణ చేసిన జాప్యం వల్లే ఈ అంశం పెండింగ్‌లో ఉందని పేర్కొనడాన్ని హరీశ్‌రావు తప్పుబట్టారు. ఇది 4 నెలల నుంచి కాదు.. ఏడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్య అని గుర్తుచేశారు. షెకావత్ వ్యాఖ్యలు సరికాదని, సీఎం వ్యాఖ్యలను కేంద్ర మంత్రి వ్యక్తిగతంగా తీసుకున్నట్లుందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ఫిర్యాదు చేసిన ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలని చట్టంలో ఉందని, సమస్య పరిష్కారం కాకపోతే ట్రిబ్యునల్‌కు సిఫార్సు చేయాల్సి ఉంటుందన్నారు. కానీ కేంద్రం 13 నెలలపాటు ఎలాంటి నిర్ణయం తీసుకోనందున 2015 ఆగస్టులో సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు. ఈ విషయంలో ఏడేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందలేదన్నారు. కృష్ణా జలాల వివాద పరిష్కారం కోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని హరీశ్ విమర్శించారు. ఏడాదిగా స్పందించలేదేం? ‘సీఎం కేసీఆర్‌తోపాటు నీళ్ల మంత్రిగా నేను, అధికారులు ఢిల్లీకి ఏడాది తిరిగినా మీరు (షెకావత్) స్పందించలేదు. సరైన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకొని ఉంటే సుప్రీంను ఆశ్రయించాల్సిన అవసరం రాష్ట్రానికి ఎందుకు వస్తుంది? రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా మొదటి ప్రాధాన్యం నీళ్లకు ఇచ్చాం. ఇది సీఎం కేసీఆర్‌కు నీళ్ల మీద, రాష్ట్రం మీద ఉన్న తపన. వారి కృషికి, పట్టుదలకు ఒక నిదర్శనం. దీన్ని షెకావత్ అర్థం చేసుకోవాలి. మీ (షెకావత్) మీద ఉన్న గౌరవంతో అందరినీ సంప్రదించి సుప్రీంకోర్టులో కేసును విత్‌డ్రా చేసుకున్నాం’అని హరీశ్ గుర్తుచేశారు. కేంద్రం ఏడేళ్లుగా ఈ వ్యవహారాన్ని నాన్చడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఈ అంశాన్ని ప్రస్తుతమున్న బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు అనుసంధానించడమో లేదా కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడమో చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో మాకు న్యాయమైన వాటా కావాలన్నదే మా ఆవేదన. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్నదే మా తపన, వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, శివ కుమార్, యాదవరెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు. చదవండి: (కేసీఆర్ ఆరోపణలు పెద్ద డ్రామా: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్) -
ఏమిటీ డ్రామాలు?
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం కోర్టు పరిధిలో ఉండగా జరిగిన ఆలస్యానికి కేంద్రం ఎలా బాధ్యత వహిస్తుందని జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రశ్నించారు. దీనిపై 2015లో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు గత నెల 6న అనుమతి ఇచ్చిన తర్వాతే ట్రిబ్యునల్ విషయంలో కేంద్రం పాత్ర ప్రారంభమైందని షెకావత్ స్పష్టత ఇచ్చారు. ఈ జాప్యానికి తెలంగాణ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కారణమని, అలాంటప్పుడు కేంద్రాన్ని ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంతో కలసి షెకావత్ మీడియాతో మాట్లాడారు. 2 రోజులని చెప్పి 8 నెలలకు.. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత చొరవ తీసుకుని గతేడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించినట్లు షెకావత్ తెలిపారు. ఆ సందర్భంగా కేసీఆర్ కొత్త ట్రిబ్యునల్ ప్రస్తావన తీసుకురాగా ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేయడంతో 2 రోజుల్లో పిటిషన్ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అయితే 7–8 నెలల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వెనక్కి తీసుకుంటామని సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసుకుందని చెప్పారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించిన తర్వాతే ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నిర్వర్తించాల్సిన కార్యక్రమం మొదలైందని తెలిపారు. చర్చించాకే బోర్డుల పరిధిపై నిర్ణయం... విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పడినప్పటికీ పరిధి నోటిఫై చేయని కారణంగా ఇన్నాళ్లూ అధికారంలేని సంస్థలుగానే ఉండిపోయాయని షెకావత్ పేర్కొన్నారు. గతేడాది అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు బోర్డుల పరిధి నోటిఫై ప్రక్రియ ప్రారంభించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని తెలిపారు. ఆ తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో సుదీర్ఘ చర్చల తర్వాతే బోర్డుల పరిధిని నిర్ణయించామని వివరించారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా వ్యాఖ్యానించడం పెద్ద డ్రామాలా కనిపిస్తోందని షెకావత్ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సీఎం హోదాలో రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం తగదన్నారు. ఇరు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే బోర్డులను నోటిఫై చేసినప్పటికీ ఇదంతా ఒక డ్రామా అని కేసీఆర్ మాట్లాడటం ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థపై విధ్వంసకరమైన దాడి చేయడమేనని చెప్పారు. నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా? లేక ఉన్న ట్రిబ్యునల్‌కే బాధ్యత అప్పగించాలా? అనే అంశంపై న్యాయశాఖ తన అభిప్రాయాన్ని వెల్లడించాక ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏవో కొన్ని కాగితాలు పంపుతున్నారు.. బోర్డులు సమర్థంగా పనిచేసేలా రెండు రాష్ట్రాలు తమ బాధ్యతలను నిర్వర్తించాలని షెకావత్ కోరారు. విద్యుత్ ప్రాజెక్ట్‌ల నిర్వహణ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, నోటిఫికేషన్లో పూర్తి స్పష్టత ఉందన్నారు. నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం, అనుమతులు లేని ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లను వెంటనే బోర్డుల ద్వారా సీడబ్ల్యూసీకి అందించాలని, మూలనిధి డిపాజిట్ చేయాలని, మానవ వనరులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాలని సూచించారు. నోటిఫికేషన్ కటాఫ్ తేదీని వాయిదా వేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే డీపీఆర్‌ల పేరుతో ప్రాజెక్టులకు సంబంధించి ఏవో కొన్ని కాగితాలను పంపడం సరికాదని, నిర్దిష్ట ఫార్మాట్లో ఇవ్వాలని సూచించారు. నోటిఫికేషన్లో వెలిగొండ ప్రాజెక్టు పేరులో వచ్చిన తప్పుని సవరించాలంటే ప్రక్రియ పార్లమెంట్లో జరగాలని, ఇది ఇప్పటికీ అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలోనే ఉందని షెకావత్ పేర్కొన్నారు. -
కేసీఆర్ ఆరోపణలు పెద్ద డ్రామా: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్
-
కేసీఆర్ ఆరోపణలు పెద్ద డ్రామా: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల విషయంలో ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు జరిగిన ఆలస్యానికి కేంద్రం కానీ, మంత్రిగా తాను కానీ ఎలా బాధ్యత వహిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశ్నించారు. 2015లో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకునేందుకు సుప్రీం కోర్టు గత నెల 6న అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ తర్వాతే ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో కేంద్రం పాత్ర ప్రారంభమైందని చెప్పారు. ఈ ఆలస్యానికి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వమే కారణమని, అలాంటప్పుడు కేంద్రాన్ని ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలోని జలశక్తి కార్యాలయంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంతో కలసి షెకావత్ మాట్లాడారు. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రంపై చేసిన వ్యాఖ్యలపై షెకావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ 2015లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కేంద్రం ఇన్నేళ్లుగా చర్యలు తీసుకోలేని స్థితిలో ఉందని తెలిపారు. అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ కొత్త ట్రిబ్యునల్ ప్రస్తావన తీసుకొచ్చారని పేర్కొన్నారు. అయితే ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేయగా, రెండు రోజుల్లో పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు దరఖాస్తు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే 8 నెలల వరకు ఈ విషయంలో ఎలాంటి దరఖాస్తు చేయలేదని చెప్పారు. రెండు రాష్ట్రాలు ఒప్పుకొన్నాకే నోటిఫై చేశాం నీటి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయని, పరిస్థితి ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిన కారణంగా ఏర్పడిన సమస్యను పరిష్కరించాలని ప్రధాని సూచన మేరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఏర్పడినప్పటికీ, పరిధి నోటిఫై చేయని కారణంగా ఆ రెండు బోర్డులు అధికారంలేని సంస్థలుగానే ఉండిపోయాయని షెకావత్ అన్నారు. ఈ బోర్డుల పరిధిని నోటిఫై చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు గతేడాది జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో జరిగిన చర్చల తర్వాతే రెండు బోర్డుల పరిధిని నిర్ణయించామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సీఎం కేసీఆర్ ఇలా వ్యాఖ్యానించడం పెద్ద డ్రామాలా కనిపిస్తోందని షెకావత్ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం తగదన్నారు. బోర్డులను నోటిఫై చేసే విషయంలో ఇరు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నోటిఫై చేసినా.. ఇదంతా డ్రామా అని కేసీఆర్ మాట్లాడటం ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థపై విధ్వంసకరమైన దాడి చేయడమేనని విమర్శించారు. అదే సమయలో నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా లేక ఉన్న ట్రిబ్యునల్‌కే టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌ను ఇవ్వాలనే విషయంలో న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరామని తెలిపారు. రెండు బోర్డులను మరింత శక్తిమంతంగా చేసేందుకు ఇరు రాష్ట్రాలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని షెకావత్ సూచించారు. కాగా, విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, నోటిఫికేషన్లో పూర్తి స్పష్టత ఉందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం, అనుమతులు లేని ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు, నిర్వహణ కోసం డీపీఆర్‌లను వెంటనే బోర్డుల ద్వారా సీడబ్ల్యూసీకి అందించాలని సూచించారు. నోటిఫికేషన్ కటాఫ్ తేదీని వాయిదా వేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదని, ఈ విషయంలో రాష్ట్రాలను తాము ఎలాంటి ఒత్తిడి చేయబోమన్నారు. చదవండి: దూరదర్శన్ కేంద్రం: మహిళల బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా ఏవో పేపర్లు పంపడం కాదు.. డీపీఆర్‌ల పేరుతో ప్రాజెక్టులకు సంబంధించిన ఏదో ఒక పేపర్లను రాష్ట్రాలు పంపడం ఎలా సరైనదో చెప్పాలని షెకావత్ ప్రశ్నించారు. డీపీఆర్‌లు తప్పనిసరిగా ఉండాల్సిన ఫార్మాట్లోనే పంపాలని సూచించారు. నోటిఫికేషన్లో వెలిగొండ ప్రాజెక్టు పేరులో వచ్చిన తప్పును సవరించే ప్రక్రియ పార్లమెంటులో జరగాలని, ఇది ఇప్పటికే అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలోనే ఉందని తెలిపారు. ఈ విషయంలో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. -
కృష్ణా జలాల పునఃపంపిణీ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య సెక్షన్ –3 ప్రకారం కృష్ణా జలాల పునఃపంపిణీకి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలంటూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నూతన ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశం సందర్భంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సూచనల మేరకు పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరించడం తెలిసిందే. న్యాయస్థానం వెలుపల సమస్యను పరిష్కరించుకునేందుకు వీలుగా వీలైనంత త్వరగా నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని గతంలో కేసీఆర్ కోరారు. కేంద్రానికి ఎలాంటి ఆదేశాలూ ఇవ్వం కాగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు చాంబర్లో పలుసార్లు విచారణ జరిగినప్పటికీ షరతులు లేని ఉపసంహరణకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఎదుట బుధవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. రిట్ పిటిషన్ ఉపసంహరణకు అంగీకరిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే పిటిషన్‌లోని తమ అభ్యర్థనను పరిశీలించాలని తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాదులు సీఎస్ వైద్యనాధన్, వి.గిరి, ముకుల్ రోహత్గిలు ధర్మాసనాన్ని కోరగా మహారాష్ట్ర తరఫు సీనియర్ న్యాయవాది నార్‌గోల్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా ఆ పిటిషన్ ఉపసంహరణకు అభ్యంతరం లేదని ఏపీ తరఫు అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ మెహ్‌ఫజ్ నజ్కీ నివేదించారు. దీంతో దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని ధర్మాసనం ప్రకటించింది. నదీ జలాల అంశం చాలా సున్నితమైనదని, ఇప్పటికే కృష్ణా జలాలపై మూడు అవార్డులు ఇవ్వగా నాలుగు రాష్ట్రాలు వేర్వేరు పిటిషన్లతో సుప్రీంకోర్టును ఆశ్రయించాయని ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే నివేదించారు. పరిశీలిస్తామని మాత్రమే చెప్పాం.. తమ అభ్యర్థన పిటిషన్లో స్పష్టంగా ఉందని, దీనిపై ధర్మాసనానిదే నిర్ణయమని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాధన్ తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినిట్స్‌లో పొందుపరిచిన అంశాలను సీనియర్ న్యాయవాది వి.గిరి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే నూతన ట్రిబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని మినిట్స్‌లో ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తాము కేవలం పరిశీలిస్తామని మాత్రమే చెప్పామని కేంద్ర జలశక్తి శాఖ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. అనంతరం ఎలాంటి షరతులు లేని ఉపసంహరణకు అనుమతిస్తామని, ఏవైనా అంశాలు ఉంటే కేంద్రాన్ని కోరాలని సూచిస్తూ ధర్మాసనం విచారణను ముగించింది. -
‘పాలమూరు’పై నీళ్లు చల్లొద్దు: సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వెనకబడిన ప్రాంతాలకు ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం జీవధార అని.. ఆ ప్రాజెక్టును కొనసాగనివ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. కరువు తీర్చే ఈ ప్రాజెక్టు పనులను ఆపి.. ఈ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లొద్దని విన్నవించారు. సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్‌రెడ్డి (నారాయణపేట), సి.లక్ష్మారెడ్డి (జడ్చర్ల), ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి (దేవరకద్ర)లతో కలిసి కేంద్రమంత్రితో ఆయన అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా పాలమూరు ఎత్తిపోతల పథకంపైనే చర్చించినట్టు తెలిసింది. వాస్తవానికి సీఎం కేసీఆర్ ఈ నెల 6వ తేదీనే కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి చర్చించారు. 20 రోజుల వ్యవధిలోనే రెండోసారి భేటీ కావడం గమనార్హం. కరువు పీడిత ప్రాంతానికి నీళ్లిచ్చేందుకు.. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేం ద్రం గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుంది. పాలమూరు ఎత్తిపోతల పథకం అనుమతి పొందని ప్రాజెక్టుల జాబితాలో ఉండటంతో పనులు నిలిపేయాల్సి రానుంది. ఏపీ కూడా ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. పాలమూరు పనులు కొనసాగించేందుకు అనుమతివ్వాలని సీఎం, ఎమ్మెల్యేలు కేంద్రమంత్రిని కోరారు. ‘‘పాలమూరు పూర్తిగా కరువు పీడిత ప్రాంతం. తాగు, సాగునీటి కొరతతో అల్లా డుతున్న ప్రాంతం. మాకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అత్యంత అవసరమైన ప్రాజెక్టు. అది పూర్తయితే మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఈ ప్రాజెక్టును కొనసాగించేందుకు అనుమతులు ఇవ్వండి. పర్యావరణ అనుమతుల ప్రక్రియలో భాగంగా ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణను కూడా పూర్తిచేశాం. ప్రస్తుతం మాకు అనుమతి ఉన్న 299 టీఎంసీల వాటాలో నుంచే నీటిని వాడుకుంటాం. అంతకుమించి వాడుకోం. ట్రిబ్యునల్ తుది అవార్డుకు కట్టుబడి ఉంటాం. ట్రిబ్యునల్ కేటాయిం పులకు లోబడి నీటిని వాడుకుంటాం. దీనికి సంబంధించి ఏదైనా అండర్ టేకింగ్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేస్తాం..’’ అని కేంద్ర మంత్రికి వివరించారు. గెజిట్ అమలు, ఇతర అంశాలపైనా.. ఈ నెల 6న కలిసినప్పుడు చేసిన విన్నపాలను సీఎం కేసీఆర్ మరోసారి కేంద్ర మంత్రికి వివరించారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ ఇచ్చిన గెజిట్ అమలును కొంతకాలం వాయిదా వేయాలని కోరారు. కృష్ణా జలాల పునః పంపిణీకి వీలుగా అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల పరిష్కార చట్టంలోని సెక్షన్ 3ని అనుసరించి కొత్త ట్రిబ్యునల్ వేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తున్నందున.. కృష్ణాలో తెలంగాణకు అదనంగా 45 టీఎంసీల నీటి వాటా వస్తుందని, దీనిని ఈ ఏడాదే కేటాయించాలని కోరారు. డీపీఆర్‌లను ఓకే చేయండి: గోదావరి నదిపై చేపట్టిన ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. సీతారామ, తుపాకులగూడెం, చనాకా–కొరట, ముక్తేశ్వరం, చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్టు తదితర ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇప్పటికే సమర్పించామని వివరించారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే ఆమోదించిన నీటి కేటాయింపుల మేరకే ఈ ప్రాజెక్టులను చేపట్టామని, త్వరితగతిన డీపీఆర్‌లను ఆమోదించాలని కోరారు. కేసీఆర్‌తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ను.. టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, బి.వెంకటేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జల్‌జీవన్ మిషన్‌పై చర్చించాం: షెకావత్ తెలంగాణ సీఎం కేసీఆర్ తనను మర్యాదపూర్వకంగా కలిశారని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శనివారం ట్వీట్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో జల్‌జీవన్ మిషన్ ప్రభావవంతంగా అమలు కావాలని ఆకాంక్షిస్తున్నామని.. తెలంగాణకు సంబంధించి పలు అంశాలతోపాటు ఈ మిషన్‌పైనా చర్చించామని పేర్కొన్నారు. -
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన: కేంద్ర మంత్రి షెకావత్‌తో భేటీ
-
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన: కేంద్ర మంత్రి షెకావత్‌తో భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో శనివారం భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు సాగింది. కృష్ణా, గోదావరి జలాల అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, జాతీయ హోదా గుర్తింపుపై షెకావత్‌కు కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. చదవండి: Civils Topper Sreeja సివిల్స్‌లో మెరిసిన వరంగల్ యువతి శ్రీజ -
గెజిట్ అమలుపై ముందుకే!
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) పరిధిని నిర్దేశిస్తూ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా కేంద్ర జలశక్తి మరో అడుగు ముందుకేసింది. ఈనెల మొదటి వారంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలసి నోటిఫికే షన్ను అక్టోబర్ 14 నుంచి కాకుండా కొంతకాలం వాయిదా వేయాలని కోరిన సంగతి తెలిసిందే. కాగా, గెజిట్ అమలు సాఫీగా సాగేలా ఆయా బోర్డు లకు జలశక్తి శాఖ చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో ఇద్దరేసి ఉన్నతాధికారులను నియమించింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలో మానవ వనరుల బలోపేతానికి, పరిధి విస్తృతమైన నేపథ్యంలో మెరుగైన రీతిలో బోర్డులు పనిచేసేందుకు సెంట్రల్ వాటర్ ఇంజ నీరింగ్ గ్రూప్ ‘ఎ’సర్వీసుకు చెందిన సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ ఆఫీసర్లను నలుగురిని నియ మిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. సీడబ్ల్యూసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న డాక్టర్ ఎం.కె.సిన్హాను, సీడబ్ల్యూసీ యమునా బేసిన్ ఆర్గనైజేషన్‌లో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న జి.కె.అగ ర్వాల్‌ను గోదావరి నదీ యాజమాన్య బోర్డులో నియమించింది. అలాగే సీడబ్ల్యూసీ కావేరీ అండ్ సదరన్ రీజియన్ ఆర్గనైజేషన్ (కోయంబత్తూరు)లో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న టి.కె.శివరాజన్‌ను, సీడ బ్ల్యూసీ అప్పర్ గంగా బేసిన్ ఆర్గనైజేషన్(లక్నో)లో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న అనుపమ్ ప్రసాద్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో నియామకం చేపట్టింది. ఈ నలుగురు అధికారులు ఆయా బోర్డుల చైర్మన్‌కు తక్షణం రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచిన ప్రాజెక్టుల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలని సూచిం చింది. ఈ నియామకాలు మూడు నెలల కాలానికి, లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు వర్తిస్తాయని పేర్కొంది. ఈ అధికారులు చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో పూర్తి అధికారాలతో ఫుల్ టైమ్ పనిచేస్తారని తెలిపింది. బోర్డుల చైర్మన్లతో జలశక్తి అదనపు కార్యదర్శి భేటీ కేఆర్ఎంబీ చైర్మన్ ఎం.పి.సింగ్, జీఆర్ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీ సోమవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. గత శుక్రవారం జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. దానికి కొనసాగింపుగా సోమ వారం అదనపు కార్యదర్శి ఈ సమావేశం నిర్వహిం చారు. బోర్డుల పరిపాలన సంబంధిత అంశాలు, నోటిఫికేషన్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాలు తెలిపిన అభ్యంతరాలు, గెజిట్ అమలులో ఉన్న ఇబ్బందులు, కావాలసిన మానవ వనరులు తదితర అంశాలపై చర్చించారు. సీడబ్ల్యూసీ చైర్మన్ ఎస్.కె.హల్దర్, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
చిత్తూరు జిల్లాలో బయోగ్యాస్ ప్లాంట్లు
సాక్షి, అమరావతి: పశువుల పేడ, ఇతర వ్యవసాయ వ్యర్థాల ద్వారా పెద్ద తరహా (కస్టర్ బేస్డ్) బయోగ్యాస్ తయారీ యూనిట్లను పైలెట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో పశు, వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారీతోపాటు సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గోబర్–ధన్ పథకంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బుధవారం వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మన రాష్ట్రం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్ , మరో 12 రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ గోబర్–ధన్ పథకంలో రాష్ట్రంలో ఈ తరహా ప్లాంట్ల ఏర్పాటుకు కృష్ణా, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అవకాశం ఉందని గుర్తించినట్టు తెలిపారు. ఆయా జిల్లాల్లో కనీసం 50 కంటే ఎక్కువగా పశువులున్న 54 గోశాలలు, 55 భారీ డెయిరీ ఫాంలను గోబర్ గ్యాస్ ఉత్పత్తి కోసం గుర్తించినట్టు చెప్పారు. వాటిలో మొదట పైలెట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాలో అమలు చేసి, తర్వాత మిగిలిన మూడు జిల్లాల్లో అమలు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్రస్థాయిలో అపెక్స్, అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో వ్యవసాయ, పశుసంవర్ధక, పాల ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో గోబర్–ధన్ పథకం కింద పశువ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను కూడా సరైన పద్ధతుల్లో వినియోగించుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ పథకం అమలు కోసం డీపీఆర్‌లను సిద్ధం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించామని, వారి ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ పథకం కింద ఏర్పాటుచేసే ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్, కంపోస్ట్‌లను మార్కెట్ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాకు రూ.50 లక్షలు.. గోబర్–ధన్ పథకం కోసం ప్రతి జిల్లాకు రూ.50 లక్షలు కేటాయిస్తున్నామని, ఇంకా అవసరమైతే 15వ ఆర్థికసంఘం నిధులను కూడా వినియోగిస్తామని తెలిపారు. వ్యక్తిగత గృహాల మోడల్, క్లస్టర్ మోడల్, కమ్యూనిటీ మోడల్, కమర్షియల్ మోడళ్లలో ఈ పథకాన్ని విస్తరిస్తామని చెప్పారు. ఇవికాకుండా రాష్ట్రమంతటా ఘన వ్యర్థాలను శుద్ధిచేసేందుకు, సేంద్రియ ఎరువులుగా మార్చేందుకు ఉపాధిహామీ పథకం కింద 10,645 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 1,042 కేంద్రాల్లో ఈ ప్రక్రియ మొదలైందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
గోబర్ గ్యాస్, సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి ప్లాంట్ల ఏర్పాటు: పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో పశు, వ్యవసాయ వ్యర్థాల నుంచి సంప్రదాయేతర ఇంధన వనరులు, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి కోసం కేంద్రప్రభుత్వం నిర్ధేశించిన గోబర్-ధన్ పథకంను పైలెట్ ప్రాజెక్ట్ గా నాలుగు జిల్లాల్లో అమలు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్స్ (గోబర్) ధన్ పథకంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అధికారులతో కలిసి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో గోబర్ ధన్ పథకం కింద పశు వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను కూడా సరైన పద్దతుల్లో వినియోగించుకునేందుకు ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఒక కార్యచరణను రూపొందించినట్లు వెల్లడించారు. కృష్ణ, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా ఈ పథకంను అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. గోబర్ ధన్ పథకం అమలులో భాగంగా రాష్ట్ర స్థాయిలో అపెక్స్, అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో వ్యవసాయ, పశుసంవర్థక, పాల ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ఈ పథకంను ముందుకు తీసుకువెళ్ళేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కమిటీలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యుఎస్ విభాగాలు సమన్వయం చేస్తాయని వివరించారు. గోబర్ ధన్ కోసం ప్రతి జిల్లాకు రూ.50 లక్షలు కేటాయించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
పార్లమెంటు ముగిశాక ‘పోలవరం’ వస్తా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనులు పరిశీలించనున్నట్టు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఒడిశా ఎంపీ ప్రసన్న ఆచార్య అడిగిన ప్రశ్నలకూ ఆయన సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైన దళితులు, ఆదివాసీలకు పునరావాసం, పునర్నిర్మాణం ప్యాకేజీలో ప్రత్యేకంగా కేటాయిస్తున్న అదనపు ప్యాకేజీ ఏదైనా ఉందా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా అధికారి పునరావాస ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారా? అంటూ కనకమేడల ప్రశ్నించారు. దీనికి షెకావత్ సమాధానమిస్తూ.. అర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోందని.. దళితులు, ఆదివాసీలకు అదనపు ప్యాకేజీ అందిస్తోందని వివరించారు. అదనంగా రూ.50 వేల చొప్పున గ్రాంటు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.10 లక్షల సాయం అన్ని నిర్వాసిత కుటుంబాలకు ఇస్తున్నట్లు తెలిపారు. పునరావాస ప్రక్రియ పరిశీలనకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైందన్నారు. పునరావాస ప్రక్రియలో దళితులకు, ఆదివాసీలకు తగినంత ఉపశమనం ఇవ్వలేదని కనకమేడల అనుబంధ ప్రశ్న వేస్తూ ఈ ప్రక్రియ కోసం కేంద్రం ఎంత సాయం చేసిందని ప్రశ్నించారు. మంత్రి సమాధానమిస్తూ.. పునరావాస ప్రక్రియలో సమకూర్చే వసతుల విషయంలో పెద్ద జాబితా ఉందని, వాటన్నింటినీ ప్రస్తావించారు. ఈ సమయంలో.. ఒడిశా నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారా? అని ఒడిశా ఎంపీ ప్రసన్న ఆచార్య ప్రశ్నించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. సుప్రీంలో ఈ అంశం విచారణలో ఉన్నందున దీనిపై ప్రకటన చేయడం సముచితం కాదన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ ఇదే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కొన్ని నివేదనలు ఉన్నాయి.. కేంద్రమంత్రి పోలవరం ప్రాజెక్టును సందర్శించాలి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలి. దీనివల్ల నిర్వాసితులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని సంప్రదించేందుకు వీలవుతుంది..’ అని ప్రస్తావించారు. మంత్రి బదులిస్తూ.. ‘కార్యాలయ తరలింపు పరిశీలనలో ఉంది. పార్లమెంటు సమావేశాలు పూర్తయిన వెంటనే పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనులను పరిశీలిస్తాం..’ అని సమాధానమిచ్చారు. -
‘జలశక్తి శాఖలో పోలవరం ప్రాజెక్టు డీపీఆర్ ఏదీ పెండింగ్‌లో లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను అడ్వైజరీ కమిటీ 2011లో ఒకసారి, ఆ తర్వాత ఫిబ్రవరి 2019లో ఆమోదించిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సోమవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి షేకావత్ సమాధానం ఇస్తూ.. జలశక్తి శాఖలో పోలవరం ప్రాజెక్టు డీపీఆర్ ఏదీ పెండింగ్‌లో లేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 2005-06 లెక్కల ప్రకారం రూ.10,151.04 కోట్ల అచనాలతో డీపీఆర్‌ను ఆమోదించామని తెలిపారు. 2009 జనవరి 20న ఈ డీపీఆర్‌ను జలశక్తి శాఖలోని ఫ్లడ్ కంట్రోల్ అండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ 95వ మీటింగ్‌లో ఆమోదించిందని తెలిపారు. -
పోలవరానికి రూ.47,725 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు రెండోసారి సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లకు ఆమోదం తెలిపేందుకు కేంద్ర జలశక్తిశాఖ అంగీకారం తెలిపింది. వెంటనే ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖకు, కేంద్ర మంత్రిమండలికి పంపి ఆమోదింపజేస్తామని జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించి పెట్టుబడి క్లియరెన్స్ ఇవ్వాలని కోరుతూ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు బుధవారం కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో గంటపాటు సమావేశమయ్యారు. ఎంపీలంతా సంతకాలు చేసిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. అనంతరం ఎంపీలతో కలిసి విజయసాయిరెడ్డి సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘జలశక్తి మంత్రితో సమావేశమై 5 అంశాలను ప్రధానంగా చర్చించాం. మొదటిది పోలవరం ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం గురించి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జలశక్తిశాఖ పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) 2017–18 ధరల సూచీని అనుసరించి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,656 కోట్లుగా ఆమోదం తెలిపి కేంద్ర జలశక్తిశాఖకు సిఫారసు చేశాయి. దీన్ని సీడబ్ల్యూసీ పరిధిలోని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ) పరిశీలించి సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లుగా ఆమోదించి జలశక్తిశాఖకు సిఫారసు చేసింది. సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,656 కోట్లుగా సిఫారసు చేసి ఆమోదించాలని కోరాం. కానీ మంత్రి ఆర్సీసీ సిఫారసు చేసిన మేరకు రూ.47,725 కోట్లను ఆమోదిస్తామన్నారు. ఇక రెండో అంశం.. ఒక ఎస్క్రో ఖాతా పెట్టి అందులో డబ్బు జమచేయాలని కోరగా.. అది సాధ్యం కాదని, ఎప్పుడైనా వారం, 15 రోజుల్లో రీయింబర్స్ చేసేలా చూస్తామని చెప్పారు. ఇప్పటివరకు చేయాల్సిన రూ.1,907 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ను చేస్తామని చెప్పారు’ అని విజయసాయిరెడ్డి వివరించారు. పద్దుల వారీగా చూడొద్దని కోరాం.. ‘అంచనా వ్యయాన్ని విభిన్న పద్దుల కింద టీఏసీ ఆమోదించింది. కాంపొనెంట్ వారీగా పద్దును పరిగణనలోకి తీసుకోవద్దని కోరాం. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తరువాత ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి చెప్పారు. మరోఅంశం.. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరాం. తప్పకుండా వర్తింపజేస్తామని, దాని ప్రకారమే అంచనా వ్యయాన్ని ఆమోదిస్తున్నామని స్పష్టత ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం తరలించడానికి మంత్రి అంగీకరించారు.’ అని తెలిపారు. టీఏసీ ఆమోదించిన ప్రతిపాదనలకు, జలశక్తి ఆమోదిస్తున్న ప్రతిపాదనలకు అంతరం ఉందని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ‘ప్రాజెక్టు అంచనా వేసినప్పుడు 51 వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా పరిగణించారు. కానీ సర్వే, భూరికార్డుల పరిశీలనల్లో అవి ప్రయివేటు, అసైన్డ్ భూములుగా తేలింది. తొలుత ప్రభుత్వ భూములని చెప్పినందువల్ల కేంద్రం ఇప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. నిర్వాసితులకు న్యాయం చేసేందుకు వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. తరువాత పరిశీలిస్తామని చెప్పారు’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. సమావేశం సానుకూలంగా ముగిసింది సమావేశం అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మీడియాతో మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్ ఎంపీలు లేవనెత్తిన అనేక అంశాలపై సమగ్రంగా చర్చించాం. సమావేశం చాలాచాలా సానుకూలంగా ముగిసింది..’ అని పేర్కొన్నారు. -
ఫలించిన వైఎస్సార్సీపీ ఎంపీల పోరాటం
-
కేంద్ర జలశక్తి మంత్రితో వైఎస్సార్ సీపీ ఎంపీల భేటీ విజయవంతం
-
పోలవరం: ఫలించిన వైఎస్సార్సీపీ ఎంపీల పోరాటం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో వైఎస్సార్సీపీ ఎంపీల సమావేశం విజయవంతమైంది. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. సవరించిన అంచనాలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచించిన రూ.47,725 కోట్ల మేరకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ అంగీకరించారు. ఈ క్రమంలో గురువారం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనున్నారు. వచ్చేవారం కేంద్ర కేబినెట్ ముందుకు పోలవరం సవరించిన అంచనాల అంశం రానుంది. కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా... నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. భేటీ అనంతరం వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని, ఎటువంటి షరతులు లేకుండా నిధులు రీయింబర్స్మెంట్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ‘‘ఐదు అంశాలపై కేంద్రమంత్రి షెకావత్‌తో చర్చించాం. మొదటిది పోలవరం ప్రాజెక్టుకు పెట్టుబడులను క్లియర్ చేయడం.. సవరించిన అంచనాలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించింది. రూ.55,656 కోట్ల అంచనాలను ఆమోదించాలని కోరాం. కమిటీ సూచించిన మేరకు రూ.47,725 కోట్లు ఆమోదిస్తామన్నారు. ఇక బిల్లుల విషయంలో కాలయాపన లేకుండా ఎస్క్రో ఖాతా తెరవాలని అడిగాం. అది సాధ్యం కాదు.. వారం పదిరోజుల్లో రీయింబర్స్ చేస్తామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రం ఖర్చు చేసిన రూ.1920 కోట్లు రీయింబర్స్ చేస్తామన్నారు. రూ.47,725 కోట్లు కేబినెట్ ద్వారా ఆమోదించేందుకు సిద్ధమని తెలిపారు. రానున్న కేబినెట్ సమావేశంలో అంచనాలను ఆమోదించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీని రాజమండ్రికి తరలించాలని కోరాం. ఇందుకు కేంద్రమంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. -
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి జవాబు
సాక్షి, ఢిల్లీ: పోలవరం హెడ్ వర్క్స్ డిజైన్లలో జరిగిన మార్పుల వలన హెడ్ వర్క్స్ వ్యయం 5,535 కోట్ల నుంచి 7,192 కోట్లకు పెరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా జవాబిస్తూ పోలవరం హెడ్ వర్క్స్‌లో డిజైన్ల మార్పు కారణంగా పెరిగిన అదనపు వ్యయాన్ని కేంద్రం భరించేది, లేనిది సూటిగా చెప్పకుండా జవాబును దాట వేశారు. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ పనులకు అంచనా వేసిన వ్యయాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే. నిర్మాణ ప్రణాళికతో పాటు ప్రాజెక్ట్‌లోని వివిధ విభాగాలకు సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. ప్రాజెక్ట్ డిజైన్లు గోదావరి జలాల ట్రైబ్యునల్ నియమ, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవో లేదో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలించి ఆమోదించిన మీదటే వాటిని ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని మంత్రి షెకావత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ప్రాజెక్ట్‌లోని కొన్ని అంశాలకు సంబంధించిన డిజైన్లను సీడబ్ల్యూసీ మార్పులు చేసింది. మార్పుల కారణంగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల ఎత్తు పెంచడం, పునాదుల లోతు పెంచడం, స్పిల్‌వేలోని అత్యంత లోతైన బ్లాకులలో కాంక్రీట్ గ్రేడ్ల పెంపు, ఎగువ కాఫర్ డామ్‌లో ఎడమ వైపు డయాఫ్రం వాల్‌తో కటాఫ్ నిర్మాణం, గేట్ గ్రూవ్స్‌లో చిప్పింగ్ పనులు, స్పిల్‌వేలో రెండో దశ కాంక్రీట్ పనుల నిర్వహణ పనులను అదనంగా చేపట్టవలసి వస్తోందని మంత్రి చెప్పారు. -
కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించాలి: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదిపై ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిని స్పష్టంగా నిర్దేశించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయా ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించి చట్టప్రకారం వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన కేంద్రమంత్రి షెకావత్‌తో భేటీ అయ్యారు. కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న చట్టవ్యతిరేక విధానాలను వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను తెలియజేసి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్రజలశక్తి మంత్రితో భేటీ అయినట్లు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల విస్తరణ, శ్రీశైలం ఎడమ కాలువ విస్తరణ ఏవిధంగా చట్ట విరుద్ధమో కేంద్రమంత్రికి వివరించినట్లు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేశ్వరం నుంచి విశాఖ జిల్లాలోని నరవ వరకు పైపులైను ద్వారా తాగునీరు తరలించే ప్రాజెక్టుకు అయ్యే రూ.3,573 కోట్లలో సగం కేంద్రం భరించాలన్న విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. పార్లమెంట్‌ను స్తంభింపజేస్తాం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అనర్హుడిగా ప్రకటించాలని ఏడాది కిందట దాఖలు చేసిన పిటిషన్‌పై మరోసారి సహచర ఎంపీలతో కలిసి సభాపతి ఓం బిర్లాతో చర్చించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా రఘురామ చేసిన అసంబద్ధమైన, చట్టవ్యతిరేక వ్యాఖ్యలకు సంబంధించి అదనపు సాక్ష్యాధారాలను సభాపతికి సమర్పించామన్నారు. అనర్హత పిటిషన్ దాఖలు చేస్తే 6 నెలల్లో సభాపతి నిర్ణయం ప్రకటించాలని గతంలో సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లామన్నారు. తగిన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తే రాబోయే సమావేశాల్లో పార్లమెంటును స్తంభింపజేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టంగా చెప్పినట్లు ఆయన తెలిపారు. -
కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించండి
నరసరావుపేట: కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించి ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఇబ్బందులను తొలగించాలని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. కృష్ణా బోర్డు ఆదేశాలకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తుండటంతో నీరు వృధాగా సముద్రంలో కలిసి ఏపీ రైతులకు తాగు, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. కృష్ణా జలాలపై ఆధారపడిన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతులు తెలంగాణ వైఖరికి ఆందోళన చెందుతున్నారన్నారు. పల్నాడు ప్రాంతానికి నాగార్జున సాగర్ నీరే శరణ్యమని, దానిపై ఆధారపడి వరి, మిర్చి, పత్తి, పసుపు పంటలు పండిస్తున్నారన్నారు. నీరందకపోతే ఈ రైతులకు భారీ నష్టం కలుగుతుందన్నారు. -
అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోరేం?
సాక్షి, అమరావతి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. ప్రాజెక్టుల నిర్వహణ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కుతూ.. కృష్ణా బోర్డు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల విలువైన జలాలు వృథాగా కడలి పాలవుతుండటాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దృష్టికి తెచ్చారు. తెలంగాణ సర్కారు దుందుడుకు చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు హక్కుగా దక్కిన వాటా జలాలను కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని అక్రమంగా నీటిని తోడి విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించడంలో వివక్ష చూపుతున్న కృష్ణా బోర్డుకు తటస్థంగా వ్యవహరించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించటానికంటే ముందే తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను తనిఖీ చేసేలా కృష్ణా బోర్డుకు నిర్దేశించాలని కోరారు. కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టుల్లో సాగునీటి పథకాలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, తాగునీటి పథకాలను బోర్డు పరిధిలోకి తెచ్చి వాటికి సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించి సమర్థంగా పథకాలను నిర్వహించడం ద్వారా రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలని విన్నవించారు. ఈ మేరకు షెకావత్‌కు సీఎం వైఎస్ జగన్ సోమవారం లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. విలువైన జలాలు కడలి పాలు.. విభజన చట్టం ద్వారా ఏర్పాటైన కృష్ణా బోర్డు..అపెక్స్ కౌన్సిల్ ఆదేశాలను బుట్టదాఖలు చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన తాత్కాలిక నీటి ఒప్పందాలకు తిలోదకాలు ఇస్తూ తెలంగాణ సర్కారు అక్రమంగా నీటిని వాడుకోవటాన్ని ఈ నెల 1వతేదీన లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చాం. తెలంగాణ దుందుడుగా వ్యవహరిస్తూ విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల విలువైన జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. దీనివల్ల మాకు హక్కుగా దక్కిన వాటా జలాలను కోల్పోవాల్సి వస్తుండటాన్ని మరోసారి మీ దృష్టికి తెస్తున్నాం. శ్రీశైలంలో వచ్చిన నీరు వచ్చినట్లుగా తోడకం.. సాగునీటి అవసరాలు ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు తరలించాలన్న నిబంధనను నీటి సంవత్సరం తొలిరోజే అంటే జూన్ 1 నుంచే తెలంగాణ తుంగలో తొక్కింది. శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 834 అడుగుల కంటే దిగువనే ఉన్నా నీటి కేటాయింపులకు సంబంధించి కృష్ణా బోర్డుకు ఎలాంటి ప్రతిపాదన పంపకుండానే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలు లేన్నప్పటికీ తెలంగాణ విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు జలవిద్యుదుత్పత్తిని చేయాలని జూన్ 28న జీవో ఆర్టీ నెంబర్ 34 జారీ చేసింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ శ్రీశైలంలోకి 26 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి ద్వారా 19 టీఎంసీలను దిగువకు తరలించింది. తెలంగాణ మొండి వైఖరితో విద్యుదుత్పత్తి చేయడం వల్ల శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరుకోవడం కష్టంగా మారింది. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల్లో ఉంటేనే గ్రావిటీతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలకు నీటిని తరలించవచ్చు. చెన్నైకి తాగునీటిని సరఫరా చేయవచ్చు. తెలంగాణ దుందుడుకు వైఖరి దుర్భిక్ష ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడికి దారి తీస్తుంది. తెలంగాణ కోటాలోనే లెక్కించాలి.. నీటిని కేటాయించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండానే ఆపరేషనల్ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కుతూ నాగార్జునసాగర్‌లో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని తోడేస్తోంది. కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లా ఉపయోగపడే పులిచింతల నుంచి కూడా విజయవాడ సర్కిల్ ఎస్ఈ నుంచి ప్రతిపాదనలు రాకుండానే ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. ఈ నీళ్లన్నీ వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. వాటా జలాలను ఆంధ్రప్రదేశ్ వాడుకోకుండా వృథాగా సముద్రం పాలు చేయాలన్న ఉద్దేశంతో అక్రమంగా తోడేస్తున్న నీటిని తెలంగాణ తన కోటాగా అంగీకరించిన 299 టీఎంసీల వాటా కింద లెక్కించాలి. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోరేం? వాటా జలాలను వాడుకోనివ్వకుండా అడ్డుకుని ఆంధ్రప్రదేశ్‌ను నీటి సంక్షోభంలోకి నెట్టాలన్న ప్రధానోద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టడాన్ని అనేకసార్లు కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తెచ్చాం. శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 90 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను తెలంగాణ అక్రమంగా చేపట్టింది. కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచి శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు 0.4 టీఎంసీలను తరలిస్తోంది. ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచి శ్రీశైలంలో 825 అడుగుల నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున తోడేస్తోంది. వీటి ద్వారా అక్రమంగా 200 టీఎంసీలను శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ తరలిస్తోంది. ఇవికాకుండా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలంలో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తెలంగాణ తరలిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన కొత్త ప్రాజెక్టులు, అక్రమంగా సామర్థ్యం పెంచిన ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలని అనేకసార్లు కేంద్ర జల్ శక్తి శాఖను, కృష్ణా బోర్డును కోరాం. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ డీపీఆర్‌లను పరిశీలించకుండా, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేసేలా తెలంగాణపై ఇప్పటిదాకా ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌పై బోర్డు వివక్ష తెలంగాణ ప్రభుత్వం చేసే తప్పుడు ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తున్న కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ సహేతుకమైన ఫిర్యాదులను మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కృష్ణా బోర్డుకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. వీటిని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పరిరక్షించడంలో కృష్ణా బోర్డు వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. చుక్క నీరూ మిగలదు.. ఆంధ్రప్రదేశ్‌కు వాటా జలాలను దక్కనివ్వకుండా చేసేందుకు తెలంగాణ కొత్తగా వరుసగా అక్రమ ప్రాజెక్టులను చేపట్టింది. బోర్డు ఆదేశాలను లెక్క చేయకుండా విద్యుదుత్పత్తిపై మార్గదర్శకాలను బుట్టదాఖలు చేస్తూ శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తరలిస్తోంది. తెలంగాణ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీపై దుర్భిక్ష ప్రాంతాలకు చుక్క నీటిని కూడా తరలించటానికి ఆంధ్రప్రదేశ్‌కు ఆస్కారం ఉండదు. రాయలసీమ ఎత్తిపోతలే శరణ్యం.. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే తెలంగాణ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా నీటిని తోడేస్తుండటం, 796 అడుగుల నుంచే విద్యుదుత్పత్తి చేస్తూ అక్రమంగా నీటిని వాడుకుంటుండటం వల్ల 854 అడుగులకు నీటి మట్టం చేరే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీరు, చెన్నెకి తాగునీటిని సరఫరా చేయడానికి తెలంగాణ తరహాలోనే 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీలను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టడం మినహా మరో మార్గం లేదు. ఈ ప్రాజెక్టులకు కేడబ్ల్యూడీటీ–1, విభజన చట్టం 11వ షెడ్యూలు ద్వారా నీటి కేటాయింపులు ఉన్నాయి. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా కొత్తగా ఆయకట్టుకు నీళ్లందించడం లేదు. కొత్తగా కాలువలు తవ్వడం లేదు. నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు నిర్మించడం లేదు. మాకు దక్కిన వాటా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు, చెన్నై తాగునీటి అవసరాలు తీర్చడానికే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం. తెలంగాణకు కృష్ణా బోర్డు వంతపాట.. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను తనిఖీ చేయాలని అనేక సార్లు కృష్ణా బోర్డుకు వి/æ్ఞప్తి చేశాం. నీటి కేటాయింపులు లేకుండా, ఎలాంటి అనుమతి తీసుకోకుండా తెలంగాణ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులన్నీ పురోగతిలో ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల తాజా పరిస్థితిని అంచనా వేయడానికి తెలంగాణలో క్షేత్రస్థాయిలో తనిఖీ చేయకుండా ఎన్జీటీ ఉత్తర్వులను బూచిగా చూపి రాయలసీమ ఎత్తిపోతలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తామని కృష్ణా బోర్డు పదేపదే ప్రతిపాదిస్తోంది. కృష్ణా బోర్డు సమావేశాన్ని నిర్వహించి రెండు రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే రాయలసీమ ఎత్తిపోతలను క్షేత్ర స్థాయిలో పరిశీలించడంపై నిర్ణయం తీసుకోవాలని జూన్ 22న కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసిన అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. తటస్థంగా వ్యవహరిస్తూ రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన కృష్ణా బోర్డు రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించాలంటున్న తెలంగాణకు వంత పాడుతోంది. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను తనిఖీ చేయాలని ఆంధ్రప్రదేశ్ పదేపదే చేస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకుండా వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది. -
కేఆర్ఎంబీ అధికార పరిధి నోటిఫై చేయండి
సాక్షి,హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన హక్కు, వాటాలు, ప్రయోజనాల పరిరక్షణకు కృష్ణా నదీ యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) అధికార పరిధిని ప్రకటించాలని (నోటిఫై) కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ శనివారం రాసిన ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం జగన్‌తో కలసిపోయి తెలంగాణ నీటిహక్కులు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని, అందువల్ల వీలైనంత తొందరగా కేఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయడం ద్వారా తెలంగాణ న్యాయబద్ధ నీటి వాటాను బోర్డు పరిరక్షించే వీలుంటుందన్నారు. ఏదైనా కొత్త ట్రిబ్యునల్ లేదా కేడబ్ల్యూడీటీ–2 కొత్త అవార్డు ప్రకటించినపుడు కేఆర్ఎంబీ కొత్త కేటాయింపుల ప్రకారం నీటిని క్రమబద్ధీకరిస్తుందని, ఆ విధంగా తెలంగాణ హక్కులకు రక్షణ ఉంటుందని తాము అర్థం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. -
సవరించిన అంచనాకు ఓకే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) ఇచ్చేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ సోమవారం సానుకూలంగా స్పందించింది. సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి కొన్ని అంశాలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) స్పష్టత ఇచ్చాక.. వాటిని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దృష్టికి తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. నీటిపారుదల, నీటి సరఫరా వ్యయం వేర్వేరు కాదని, ఆ రెండూ ఒకటేనన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కేంద్ర జల్‌శక్తి శాఖ.. ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని విభాగాల (కాంపొనెంట్) వారీగా చూడకుండా.. రీయింబర్స్ చేయడంపైనా సానుకూలంగా స్పందించింది. గురువారం తమ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేవనెత్తిన అంశాలను పరిష్కరించాలని మంత్రి షెకావత్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో సోమవారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) చైర్మన్ హెచ్‌కే హల్దార్, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, సలహాదారు వెదిరె శ్రీరాం, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో కూడిన బృందంతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నిధులు ఇస్తే గడువు నాటికే పోలవరం పూర్తి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా కమిటీ) ఆమోదించిందని.. ఈ మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేస్తే నిర్దేశించుకున్న గడువు 2022 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని ఆదిత్యనాథ్ దాస్ కోరారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ఈ వ్యయానికి సంబంధించి కొన్ని అంశాలపై పీపీఏ స్పష్టత కోరామని, ఆ వివరణ వచ్చాక మంత్రి షెకావత్ దృష్టికి తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తామని చెప్పారు. కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టత కోరిన అంశాలపై వివరణ తక్షణమే పంపుతామని చంద్రశేఖర్ అయ్యర్ చెప్పారు. పీపీఏ నుంచి వివరణ వచ్చిన వెంటనే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్‌పై నిర్ణయం తీసుకుంటామని ముఖర్జీ స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరానికి నిధులు విడుదల చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను బలపర్చిన సీడబ్ల్యూసీ జాతీయ ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం.. నీటిపారుదల వ్యయం, నీటి సరఫరా వ్యయం వేర్వేరు కాదని.. రెండూ ఒకటేనని.. ఆ మేరకే పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వాదనను సీడబ్ల్యూసీ చైర్మన్ హెచ్‌కే హల్దార్ బలపర్చారు. దాంతో.. ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల, సరఫరా విభాగాన్ని ఒకటిగానే పరిగణించి నిధులు విడుదల చేస్తామని దేబశ్రీ ముఖర్జీ స్పష్టం చేశారు. విభాగాలతో సంబంధం లేకుండా ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని వేగంగా రీయింబర్స్ చేయాలన్న జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు చేసిన సూచనపై ఆమె సానుకూలంగా స్పందించారు. మిగులు జలాలే లేనప్పుడు తరలింపు ఎలా సాధ్యం? గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని.. తుది సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పంపామని.. దాన్ని ఆమోదిస్తే కెన్–బెట్వా అనుసంధానం తరహాలో పనులు చేపడతామని ఎన్‌బ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ ప్రతిపాదించారు. దీనిపై రాష్ట్ర అధికారులు స్పందిస్తూ.. గోదావరిలో మిగులు జలాలే లేవని.. అలాంటప్పుడు 247 టీఎంసీలను తరలించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఈ వాదనతో హెచ్‌కే హల్దార్ కూడా ఏకీభవించారు. గోదావరిలో మిగులు జలాలు లేవని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సలహాదారు వెదిరె శ్రీరాం స్పందిస్తూ.. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 176 టీఎంసీలు (5 వేల మిలియన్ క్యూబిక్ మీటర్లు), ఇచ్చంపల్లి వద్ద 71 టీఎంసీల మిగులు జలాలు (రెండు వేల మిలియన్ క్యూబిక్ మీటర్లు)ను కలిపి ఈ అనుసంధానానికి తరలించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిందన్నారు. ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి రాష్ట్ర అవసరాలు తీర్చాక గోదావరి మిగులు జలాలను కావేరీకి తరలిస్తే అభ్యంతరం లేదని రాష్ట్ర అధికారులు చెప్పారు. పోలవరం నుంచి నీటిని తరలించాలంటే ఎక్కువ ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలని.. ఇచ్చంపల్లి నుంచి తక్కువ ఎత్తుకు నీటిని ఎత్తిపోయవచ్చని, దీనికి తక్కువ వ్యయం అవుతుందని.. వీటిపై అధ్యయనం చేసి అభిప్రాయం చెబుతామని భోపాల్‌సింగ్ తెలిపారు. -
పోలవరం మరింత వేగం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనతో కేంద్రంలో కదలిక వచ్చింది. తమ భేటీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించిన అంశాలను పరిష్కరించాలంటూ కేంద్ర జల్‌శక్తి శాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించారు. ఆ అంశాలపై చర్చించి, పరిష్కరించేందుకు ఢిల్లీలో సోమవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో కూడిన అధికారుల బృందం ఆదివారం ఢిల్లీకి వెళ్తోంది. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడం, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళిక, ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు, వైద్య కళాశాలలకు అనుమతులు తదితర అంశాలపై గురు, శుక్రవారాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవ్దేకర్.. రైల్వే, పరిశ్రమలు, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్.. ఉక్కు, పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. సీఎం ప్రస్తావించిన అంశాల పరిష్కారంపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే పోలవరంతోపాటు ఇతర నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృత అంశాలను కూడా పరిష్కరించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ను ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆదేశించారు. సత్వరమే పోలవరం పూర్తి దిశగా.. ► రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసే దిశగా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై గురువారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌తో చర్చించారు. ► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపిందనే అంశాన్ని గుర్తు చేశారు. ఆ వ్యయానికి సంబంధించి పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) జారీ చేసి, నిధులు విడుదల చేస్తే సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ► ఇరిగేషన్ (నీటి పారుదల) విభాగం.. నీటి సరఫరా (వాటర్ సప్లయ్) విభాగం వేర్వేరు కాదని, ఆ రెండు ఒకటేనని సీడబ్ల్యూసీ స్పష్టం చేసిందనే అంశాన్ని ప్రస్తావించిన సీఎం.. ఆ మేరకు నిధులు ఇవ్వాలని విన్నవించారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వ్యయం చేసిన నిధులను రీయింబర్స్ చేయడంలో జాప్యం లేకుండా చూడాలని.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని ప్రతిపాదించారు. ► వీటన్నింటికీ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలపై చర్చించి, పరిష్కరించేందుకు సోమవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్ హెచ్‌కే హల్దార్ తదితర ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎస్ నేతృత్వంలో అధికారుల బృందాన్ని పుంపుతామని కేంద్ర మంత్రికి సీఎం చెప్పారు. అపరిష్కృత అంశాల పరిష్కారమే అజెండా ► కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ ఆదేశాల మేరకు పోలవరంతోపాటు రాష్ట్రానికి చెందిన నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృత అంశాల పరిష్కారమే అజెండాగా సోమవారం ఢిల్లీలో ఆ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2017–18 ధరల ప్రకారం రూ.55,656.87 కోట్లగా సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేసిన సీడబ్ల్యూసీ, టీఏసీ.. ఆ మేరకు నిధులు ఇస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుందని స్పష్టం చేసిన అంశాన్ని సమావేశంలో ప్రస్తావించాలని రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ► ఆ వ్యయానికి సంబంధించి తక్షణమే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి చేయనున్నారు. హెడ్ వర్క్స్(జలాశయం), కుడి కాలువ, ఎడమ కాలువ, భూ సేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ వంటి విభాగాలతో నిమిత్తం లేకుండా ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. ► జాతీయ ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం నీటి పారుదల, నీటి సరఫరా వ్యయం వేర్వేరు కాదని రెండు ఒకటేనని.. ఇదే అంశంపై సీడబ్ల్యూసీ చైర్మన్ హెచ్‌కే హల్దార్ ఇచ్చిన నివేదికను సమావేశంలో ప్రస్తావించి, ఆ మేరకు నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. ► రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులకు ఖర్చు చేసిన నిధుల రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోందని, దీన్ని నివారించాలని సూచించనున్నారు. ప్రాజెక్టు పనులకు సమీపంలోనే పీపీఏ కార్యాలయం ఉంటే.. ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని, తక్షణమే ఈ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని కోరనున్నారు. ► ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న డిజైన్లను యుద్ధ ప్రాతిపదికన ఆమోదించాలని సూచించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలతోపాటు రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కూడా సమావేశంలో చర్చిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. -
YS Jagan: రాష్ట్రాభివృద్ధి సాకారానికి.. కావాలి.. మీ సహకారం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు, అభివృద్ధి వికేంద్రీకరణ, విభజన హామీలు తదితర అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలువురు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన రాత్రి వరకు సమావేశాలతో బిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవ్‌దేకర్‌లతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణం, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళిక, ప్రత్యేక హోదా సహా పలు విభజన హామీలు, వైద్య కళాశాలలకు అనుమతులు తదితర అంశాలపై మంత్రులతో వేర్వేరు సమావేశాల్లో చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఆయన నివాసంలో రాత్రి 9 గంటల నుంచి 10.35 వరకు సమావేశమై, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సుహృద్భావ వాతావరణంలో సాగిన ఈ సమావేశంలో సీఎం జగన్.. అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లిన వినతుల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలులో హైకోర్టుకు రీ నోటిఫికేషన్ ఇవ్వండి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య సమతుల్యంతో కూడిన అభివృద్ధికి, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగానే రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరిస్తూ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదిస్తూ ప్రణాళిక రూపొందించాం. ఆగస్టు 2020న దీనికి సంబంధించి చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. కర్నూలులో హైకోర్టు స్థాపనకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలి. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అంశాన్ని బీజేపీ కూడా పొందు పరిచింది. ప్రత్యేక హోదాతోనే అధిక గ్రాంట్లు రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల కారణంగా రాష్ట్రం సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ దశలో రాష్ట్రాన్ని బలోపేతం చేయాలి. అనేక రంగాల్లో స్వయం సమృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి కేంద్ర గ్రాంట్లు అధికంగా వస్తాయి. అప్పుడు ఆర్థిక భారం తగ్గుతుంది. భారీగా పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాల కల్పన జరగాలన్నా ప్రత్యేక హోదా చాలా అవసరం. అందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోమారు విన్నవిస్తున్నాం. వైద్య కళాశాలల ఏర్పాటుకు సహకరించాలి రాష్ట్రంలో ప్రజలందరికీ అందుబాటులో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర విభజన తర్వాత, ఏపీలో మహానగరాలు లేవు. అందుకే కొత్తగా 13 వైద్య కళాశాలల నిర్మాణాన్ని మొదలు పెడుతున్నాం. దీంతోపాటు ఇప్పుడున్న వైద్య కళాశాలలను అభివృద్ధి చేస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వ రంగంలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. గ్రామీణ, సబ్ అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 3 కళాశాలలకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మిగిలిన కాలేజీలకూ అనుమతులు ఇవ్వాలని కోరాం. మెడికల్ కాలేజీలతోపాటు నర్సింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చి, తగిన ఆర్థిక సహాయం చేయాలి. విద్యుత్ రంగం రుణాలు రీస్ట్రక్చర్ చేయాలి విద్యుత్ సంస్కరణల్లో రాష్ట్రం ముందంజలో ఉంది. అలాగే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో కూడా మెరుగైన స్థితిలో ఉంది. అయితే రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి బాగోలేనందున ఏపీకి తగిన సహాయం చేస్తానని కేంద్ర విద్యుత్ శాఖ చెప్పింది. కుడిగి, వల్లూరు థర్మల్ ప్లాంట్ల నుంచి అధిక ధరకు కొనుగోలు చేస్తున్న విద్యుత్‌ను సరెండర్ చేసే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి. ఈ విద్యుత్ ప్లాంట్ల నుంచి కరెంటు కొనుగోలు ధర చాలా అధికంగా ఉంది. 300 మెగావాట్ల కరెంటు కొనుగోలుపై ఏటా రూ.325 కోట్ల ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌లకు ఢిల్లీలో జ్ఞాపికను అందజేస్తున్న సీఎం జగన్ ఇప్పటికే ఆర్థిక భారంతో నడుస్తున్న డిస్కంలకు ఇది చాలా భారం. ఏపీ డిస్కంలు ఈ రెండు ప్లాంట్ల నుంచి 40 ఏళ్ల పాటు కరెంటు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో సరెండర్ కోసం తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ డిస్కంల నుంచి రూ.5,541.78 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా వాటికి తగిన రుణ సదుపాయాలను కల్పించి, తద్వారా ఏపీ జెన్కోకు కేంద్ర పన్నుల వాటా నుంచి ఆ డబ్బు వచ్చేలా చూడాలి. రాష్ట్ర విద్యుత్ రంగం దాదాపు రూ.50 వేల కోట్ల అప్పుల్లో ఉంది. ఈ రుణాలను రీ స్ట్రక్చర్ చేయాలి. విశాఖ జిల్లా అప్పర్ సీలేరులో రివర్స్ పంప్ స్టోరేజీ విద్యుత్ పాజెక్టుకు ఆర్థిక సహాయం చేయాలి. 1,350 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టుకు రూ.10,445 కోట్లు ఖర్చు అవుతుంది. కేంద్రం 30 శాతం నిధులను సమకూర్చాలి. త్వరతిగతిన పర్యావరణ అనుమతులు వచ్చేలా చూడాలి. ‘ఉపాధి’ నిధులు ఇవ్వండి ► గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.4,652.70 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. వెంటనే ఈ డబ్బును చెల్లించేలా చూడాలి. సంవత్సరంలో పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలి. ► ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం సబ్సిడీ కింద రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఈ మేరకు సంబంధిత శాఖకు సూచించాలి. ► స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ. 529.95 కోట్ల బకాయిలు ఉన్నాయి. అలాగే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి మరో రూ.497 కోట్లు కూడా పెండింగులో ఉన్నాయి. ఇవి వెంటనే విడుదలయ్యేలా చూడాలి. ► దిశ బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపేలా చూడాలి. ► ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు–2020కి ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూముల రీ సర్వే ప్రారంభించాం. అన్ని రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నాం. వెంటనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపేలా చూడాలి. ► విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో 250 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ దృష్ట్యా వెంటనే యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. పోలవరం సత్వర నిర్మాణానికి సహకరించండి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరారు. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అంశంపై విస్తృతంగా చర్చించారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల మండలి సిఫార్సులతోపాటు, కేంద్ర జల శాఖకు చెందిన సాంకేతిక సలహా మండలి (టెక్నికల్ అడ్వైజరీ కమిటీ – టీఏసీ) అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం రూ.55,656.87 కోట్ల మేర పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని కోరారు. 2022 జూన్ నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ, పునరావాస పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఈ లక్ష్యం నెరవేరేలా అంచనాలకు సత్వర ఆమోదం తెలపాలని నివేదించారు. జాతీయ ప్రాజెక్టుల విషయంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం నీటి సరఫరాను కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా చూడాలని కోరారు. ఇంకా నివేదించిన అంశాలు ఇలా.. ► రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచి పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నాం. జాప్యం లేకుండా ఆ నిధులను రీయింబర్స్ చేయాలి. రీయింబర్స్‌మెంట్‌ను కాంపోనెంట్ వారీ అర్హతకు పరిమితం చేయరాదు. ► భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణంలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం–2013 ప్రకారం పునరావాస పనులకు రీయింబర్స్ చేయాలి. ► పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం తరలించాలి. హైదరాబాద్‌లో ఇప్పుడు సచివాలయ కార్యకలాపాలు లేవు. ప్రాజెక్టు పర్యవేక్షణ, పరిశీలన కోసం సుదూరంలో ఉన్న హైదరాబాద్ నుంచి రావడం కష్టం అవుతోంది. అందుకే పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్‌కు ఢిల్లీలో జ్ఞాపికను అందజేస్తున్న సీఎం జగన్. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కారులో వెళుతున్న సీఎం జగన్ మంత్రి షెకావత్ సానుకూల స్పందన అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి షెకావత్.. సమావేశం అనంతరం ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి తనతో సమావేశమయ్యారని, జలశక్తి సంబంధిత ప్రాజెక్టుల అమలుపై చర్చించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వంద శాతం ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ఏర్పాటు లక్ష్య సాధనలో సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. వచ్చే వారం కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో భేటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సుమారు అరగంట పాటు సాగింది. పోలవరం ప్రాజెక్టులో స్టాకింగ్ పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల్లో చిన్న చిన్న అంశాలు మిగిలిపోయాయని, వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇళ్ల నిర్మాణంలో మౌలిక సదుపాయాల ఖర్చు భరించాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్‌తో నీతి ఆయోగ్ కార్యాలయంలో గురువారం సాయంత్రం 5.30 నుంచి సుమారు గంటపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చర్చించారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.76 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ఇందుకోసం 68,381 ఎకరాలను సేకరించామని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ వల్ల 17,005 కొత్త కాలనీలు ఏర్పడ్డాయన్నారు. ఈ ఏడాది కొత్తగా 15 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నామని, మొత్తంగా 28.30 లక్షల ఇళ్లు పేదల కోసం నిర్మిస్తున్నామని వివరించారు. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం సజావుగా సాగడానికి ప్రతి జిల్లాకు జాయింట్ కలెక్టర్‌ను నియమించామని చెప్పారు. 17,005 కొత్త కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రూ.34,109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని చెబుతూ, ఇంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయడం కష్టసాధ్యమని నివేదించారు. ఇళ్లు కట్టి, కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుంటే లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడతారని, ఇళ్లపట్టాల కోసం, నిర్మాణం కోసం పెట్టిన ఖర్చు ప్రయోజనం ఇవ్వదని తెలిపారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో మాట్లాడి ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలకయ్యే ఖర్చును పీఎంఏవైలో భాగంగా చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైనా చర్చించారు. 2017–18 ధరల సూచీ ప్రకారం రూ.55,656.87 కోట్ల మేర ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని కోరారు. 2022 జూన్ నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ–పునరావాస పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నందున వెంటనే ఈ అంచనాలకు ఆమోదం తెలపాల్సిన అవసరం ఉందని వివరించారు. రాష్ట్ర పనితీరును ప్రశంసిస్తూ రాజీవ్ కుమార్ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ బహుళ రంగాల్లో అద్భుతమైన పనితీరు కనబరుస్తూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో మూడో స్థానాన్ని సాధించిందని సమావేశం ముగిసిన అనంతరం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ట్వీట్ చేశారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రగతి, అభివృద్ధిని అర్థం చేసుకునేందుకు ముఖ్యమంత్రితో సమావేశం ఉపయోగపడిందని పేర్కొన్నారు. ► సీఎం వైఎస్ జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అవినాశ్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బాలశౌరి, మార్గాని భరత్, గురుమూర్తి, రెడ్డెప్ప, ఎంవీవీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. కాగా, శుక్రవారం ఉదయం కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్లతో ముఖ్యమంత్రితో సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచి నిధులు ఖర్చు చేస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని ఆయనకు వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయం..రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్, పునరావాస పనులను.. 2022 జూన్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. జాతీయ ప్రాజెక్ట్‌ల విషయంలో వాటర్ సప్లయ్‌ని...ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా చూడాలని, పోలవరం ప్రాజెక్ట్ కోసం రాష్ట్రప్రభుత్వ వనరుల నుంచి ఖర్చు చేస్తున్నామని.. జాప్యం లేకుండా ఆ నిధులను రీయింబర్స్ చేయాలని కోరారు. రీయింబర్స్‌మెంట్‌ను కాంపోనెంట్‌వైజ్ ఎలిజిబిలిటీకి పరిమితం చేయొద్దన్నారు. పునరావాస పనులకు కూడా రీయింబర్స్ చేయాలని, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయాన్ని...హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఈ మధ్యాహ్నం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌లతో భేటీ అయ్యారు. అనంతరం నీతి ఆయోగ్ వైస్‌ఛైర్మన్ రాజీవ్‌కుమార్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా కొనసాగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్, పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర నిధులు, సహకారంపై రాజీవ్ కుమార్‌తో సీఎం జగన్ చర్చించారు. ఈ రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. ఆ తర్వాత నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌ను ముఖ్యమంత్రి కలవనున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకొని తిరిగి శుక్రవారం తాడేపల్లి చేరుకుంటారు. -
ఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం జగన్ భేటీ
-
కరోనాతో వ్యక్తి మృతి.. షెకావత్ విచిత్ర వ్యాఖ్యలు!
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు మద్దతుగా అనేక కార్యక్రమాలు జరిగాయి. ఆ సమయంలో కరోనా నివారణ, అవగాహన కోసం కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే ‘గో కరోనా గో కరోనా’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో ఆ స్లోగన్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. తాజాగా బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఒకింత విచిత్రమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కరోనాతో కుటుంబ సభ్యురాలిని కోల్పోయిన బాధితులకు ధైర్య చెప్పే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. లార్డ్ బాలాజీకి కొబ్బరి కాయ కొట్టండి అంతా ఆయనే చూసుకుంటారని షెకావత్ చెప్పడం పట్ల నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరి కారణంగానే కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో విజృంభిస్తోందని విమర్శిస్తున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేక లక్షలాది మంది జనం ప్రాణాలు కోల్పోతుంటే ఉచిత సలహాలు ఏంటని చురకలు వేస్తున్నారు. ఇంతకూ విషమేంటంటే.. రాజస్తాన్ జోధ్‌పూర్‌లో కేంద్రమంత్రి షెకావత్ సోమవారం పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధురాదాస్ మాథుర్ ఆస్పత్రిని సందర్శించిన ఆయన్ను ఓ యువకుడు కలుసుకుని తన తల్లిని కాపాడాలని ప్రాధేయపడ్డాడు. యువకుని విజ్ఞప్తి మేరకు షెకావత్ డాక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. కేంద్రమంత్రి ఆదేశాలతో బాధితురాలికి చికిత్స చేసేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తూ బాధితురాలు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో.. మృతురాలి కుమారుడు గుండెలవిసేలా రోదించాడు. తనకు ఏ కష్టం రాకుండా చూసుకున్న తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని కొడుకు రోధించిన తీరు చూపురులను కంటతడి పెట్టించింది. అయితే, మృతురాలి బంధువులను ఓదార్చే క్రమంలో షెకావత్.. ‘బాలాజీ మహరాజ్ మంత్రాన్ని జపించి కొబ్బరికాయ కొట్టండి. అంతా ఆయనే చూసుకుంటారు’ అని షెకావత్ వ్యాఖ్యానించాడు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారినపడ్డారు. సరైన సదుపాయాలు కల్పించకుండా దేవుడిని ఎందుకు మధ్యలోకి లాగుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షెకావత్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దేవుడిపై నమ్మకంతో కొబ్బరికాయ కొట్టమని చెప్పాను అందులో తప్పేముంది. ఆందోళనలో మృతురాలి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలనుకున్నాను. నేను అదే చేశాను’ అని ఆయన పేర్కొన్నారు. చదవండి: కరోనా రెండో దశ : స్వల్పంగా తగ్గిన పాజిటివ్ కేసులు -
వాన నీటిని ఒడిసి పట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జల సంక్షోభం సవాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాన నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. రాబోయే తరాల పట్ల బాధ్యతను ప్రస్తుత తరం నిర్వర్తించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో జల పాలన ప్రాధాన్య అంశంగా తీసుకుందన్నారు. ‘కెన్–బెత్వా’నదుల అనుసంధానం ప్రాజెక్టు కార్యరూపం తీసుకురావడానికి సోమవారం ఒప్పంద పత్రాలపై ప్రధాని మోదీ సమక్షంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లు సంతకం చేశారు. ఈ సందర్భంగా జలశక్తి అభియాన్–‘క్యాచ్ ద రెయిన్’ప్రచార ఉద్యమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ పలు రాష్ట్రాలకు చెందిన సర్పంచులు, వార్డు సభ్యులనుద్దేశించి మాట్లాడారు. జల భద్రత, తగిన జలనిర్వహణ లేకపోతే సత్వర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. వర్షాకాలం సమీపించే లోగా చెరువులు, బావుల సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీసి, శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలనీ, ఈ పనులకు ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు. రానున్న 100 రోజుల్లో ఈ పనులను పూర్తి చేయాలన్నారు. దేశాభివృద్ధి, దేశ స్వావలంబన, దార్శనికత జల వనరులు, నదుల అనుసంధానంపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఆరేళ్లుగా జలాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి కృషి సింఛాయి యోజన, హర్ ఖేత్ కో పానీ , ఒక్కొక్క నీటి చుక్కకు మరింత అధిక పంట ప్రచార ఉద్యమాల గురించి, నమామీ గంగే మిషన్, జలజీవన్ మిషన్, అటల్ భుజల్ యోజనల గురించి మాట్లాడుతూ.. పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకోగలిగితే భూగర్భ జలాలపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం మార్చి 22 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు అమలు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జలశపథం కార్యక్రమంలో అందరూ శపథం చేయాలన్నారు. దేశంలో జలసంక్షోభం రాకుండా ఉండడానికి సత్వర కృషి చేపట్టాల్సి ఉందని,అందులో భాగంగా కెన్–బెత్వా అనుసంధానం ఉందన్నారు. నీటి నాణ్యత పరీక్షల్లో గ్రామీణ ప్రాంతలోని మహిళల్ని భాగస్వాములను చేశామన్నారు. కరోనా కాలంలో 4.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, ప్రస్తుతం గ్రామంలో కనీసం ఐదుగురు నీటి నాణ్యత పరీక్ష చేయగలిగే మహిళలు ఉన్నారని ప్రధాని తెలిపారు. జల పాలనలో మహిళలు భాగస్వామ్యం అవుతున్న కొద్దీ ఉత్తమ ఫలితాలు సాధించగలమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కెన్–బెత్వా నదుల అనుసంధానానికి యూపీ, ఎంపీల ఒప్పందంతో దేశంలో నదుల అనుసంధాన కార్యక్రమం ప్రారంభమైందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఓ అంగీకారానికి రావాలన్నారు. రాష్ట్రాల అంగీకారం తర్వాతే కేంద్రం ముందుకెళ్తుందని షెకావత్ స్పష్టం చేశారు. రాష్ట్రాలపై చర్చిస్తాం: శ్రీరాం వెదిరె నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ చైర్మన్ శ్రీరాం వెదిరె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 256 జల సంక్షోభం జిల్లాలోని 1529 బ్లాకుల్లో జలశక్తి అభియాన్ తొలిదశ 2019లో ప్రారంభించామన్నారు. రెండోదశలో పట్టణ,గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించామన్నారు. శాస్త్రీయ నీటి సంరక్షణ ప్రణాళిక నిమిత్తం జిల్లాకు రూ.2లక్షల చొప్పున గ్రాంటు ఇచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 30 నదుల అనుసంధానం ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. కెన్–బెత్వా తర్వాత గోదావరి–కావేరి అనుసంధానంపై దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రాజెక్టు సమగ్ర వివరణాత్మక నివేదిక (డీపీఆర్) తయారీ దశలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ప్రాజెక్టుపై ముందుకెళ్తామని శ్రీరాం వెదిరె తెలిపారు. -
పరుగుల రాణి ‘కీర్తన’కు ప్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్: అథ్లెటిక్స్‌లో మరింతగా రాణించేందుకు పరుగుల రాణి కీర్తనకు ప్రభుత్వం తరఫున ప్రోత్సహం అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కీర్తనకు ప్రోత్సాహం లభిస్తే, పీటీ ఉషలా దేశానికి కీర్తిని తెచ్చిపేట్టే కీర్తన అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కీర్తన.. కేరళలో జరిగిన సౌత్ ఇండియా జూనియర్ అథ్లెటిక్స్‌లో అండర్–16 విభాగంలో 2 వేల మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించింది. గూడూరుకు చెందిన చెరిపెల్లి నాగమణి– కుమార స్వామిల కుమార్తె కీర్తనను ఈ సందర్భంగా మంగళవారం మంత్రి తమ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అసమాన ప్రతిభను కనబరుస్తూ అండర్–16 జూనియర్ అథ్లెటిక్ విభాగంలో స్వర్ణ పతకం గెలవడం సంతోషించదగ్గ విషయమన్నారు. గ్రామీణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కీర్తన ప్రతిభకు గురుకుల పాఠశాల పదను పెట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్థాపించిన గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారం, వసతి, చదువు, క్రీడా ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో గూడూరు సర్పంచ్ మంద కుమరయ్య, మాజీ సర్పంచ్ పుల్లయ్య, పూజరి రమాకాంత్ తదితరులున్నారు. ప్రశంసలతోపాటు పైసలివ్వాలి: ఎర్రబెల్లి సాక్షి, హైదరాబాద్: జలమంత్రిత్వశాఖ పనితీరుపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో తెలంగాణను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసించడంపై రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వంద శాతం ఆవాసాలకు, నల్లాల ద్వారా ఇంటింటికీ, అన్ని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు మంచినీరు సరఫరా చేస్తున్నందుకు రాష్ట్రాన్ని గతంలోనూ కేంద్రం అభినందించిందని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ రహిత, శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నందుకు కేంద్రం మెచ్చుకుందని తెలిపారు. అయితే రాష్ట్రానికి కేవలం ప్రశంసలే కాకుండా నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన విధంగా నిధులు కూడా ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. -
‘పోలవరం నిధుల విషయంలో ఎలాంటి సమస్య లేదు’
సాక్షి, ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయంలో ఎలాంటి సమస్య లేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. ఆర్థిక శాఖ క్యాబినెట్ నోట్లో 2013-14 ధరల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలనే నిర్ణయం జరిగిందన్నారు. పోలవరం నిధులపై రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. 2022 కల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. నిధుల విడుదలలో ఆలస్యం వల్ల ప్రాజెక్టు పనులపై ప్రభావం పడుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరారు. నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2017 లెక్కల ప్రకారం అంచనాలను తయారు చేసిందన్నారు. దీనిని పరిశీలించి క్యాబినెట్ నిర్ణయానికి పంపుతామని తెలియజేశారు. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం సవరించిన అంచనాలపై ముందుకు వెళ్తామని, నిధులు విడుదల విషయంలో ఎలాంటి సమస్య లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు రియింబర్స్‌మెంట్ పద్దతిలో పూర్తి చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఆర్అండ్ఆర్ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగం పెంచాలని పేర్కొన్న మంత్రి దీనిని బట్టి ప్రాజెక్టు పూర్తి చేయడం అనేది ఆధారపడి ఉంటుందన్నారు. మరో మూడు నెలల్లో స్పిల్‌వే పనులు పూర్తవుతాయని, కాపర్ డ్యాం తయారైన తర్వాత 41 మీటర్ లెవల్లో నీళ్లను నిల్వ చేస్తామని అన్నారు. లక్ష ఎకరాల భూమి పోలవరం ప్రాజెక్టులో మునిగిపోతుందని, 41 మీటర్ల లెవల్లో నీళ్ళు నిల్వ చేసినప్పుడు నిర్వాసితులు అయ్యే వారికి తొలి విడతలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తున్నామన్నారు. 35 శాతం మంది ప్రజలను అక్కడి నుంచి వేరేచోటికి తరలించామని, మిగిలిన వారికి సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.పోలవరం ప్రాజెక్టుకు 10848 కోట్లు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతో ఎంత భూమి మునిగిపోతుందని తెలపాలని కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అడిగారు. ఎంతమంది మంది నిర్వాసితులయ్యారో, ఎంతమందికి సెటిల్మెంట్ చేశారో చెప్పాలన్నారు. -
వెంటనే డీపీఆర్‌లు సమర్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు వెంటనే సమర్పించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇరు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. నిర్మాణంలోని ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. గతేడాది అక్టోబర్ 6న ఇరు రాష్ట్రాల సీఎంలతో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని షెకావత్ లేఖల్లో పేర్కొన్నారు. తెలంగాణలో కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టేందుకు లేదా కొనసాగించేందుకు కేంద్ర జలశక్తి శాఖ అనుమతి తప్పనిసరని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. గతేడాది డిసెంబర్ 11న సీఎం కేసీఆర్‌తో భేటీ అయి న సందర్భంగా డీపీఆర్‌లు సమర్పించాలని కోరినప్పటికీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఒక్క డీపీఆర్ కూడా సమర్పించలేదని తెలిసిందని లేఖలో షెకావత్ పేర్కొన్నారు. కృష్ణా నదిపై 8, గోదావరిపై 7 ప్రాజెక్టుల డీపీఆర్‌లు తెలంగాణ ప్రభుత్వం వెంటనే సమర్పించాలని సూచించారు. -
సత్వరమే పోలవరం ఫలాలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ప్రాజెక్టు పోలవరానికి సవరించిన వ్యయ అంచనాల మేరకు సత్వరమే నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో రెండో రోజు బుధవారం ఉదయం షెకావత్‌ను కలుసుకుని సీఎం అరగంటపాటు సమావేశమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. షెకావత్‌తో సీఎం చర్చించిన అంశాలు ఇవీ.. భారీగా పునరావాసం, భూసేకరణ వ్యయం.. పోలవరాన్ని గడువులోగా పూర్తి చేసి సత్వరమే ప్రజలకు ఫలాలను అందించేందుకు తగిన సహాయం అందించాలని సీఎం జగన్ కోరారు. 2017–18 ధరల ప్రకారం సవరించిన వ్యయ అంచనాలు –2 (ఆర్సీఈ) మేరకు పోలవరానికి రూ.55,656 కోట్ల మేర వ్యయం అవుతుందన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ, పునరావాస పనులకు గణనీయమైన మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోందని, 2021 డిసెంబర్‌కు వీటిని పూర్తి చేయాలని వివరించారు. 2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కి పెరిగిందని తెలిపారు. ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా భారీగా పెరిగిందని చెప్పారు. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ. 1,779 కోట్ల మేర రీయింబర్స్ చేయాల్సి ఉందని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరిగితే అంచనా వ్యయం పెరిగిపోతుందని, ఏపీకి ప్రాణాధారమైన ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాల్సిన అవసరం ఉందని షెకావత్‌కు నివేదించారు. అపెక్స్ కౌన్సిల్ అంశాలపై.. అక్టోబర్‌లో జరిగిన ‘అపెక్స్’ సమావేశంలో చర్చకు వచ్చిన పలు అంశాలను సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించిందని వివరించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. అనుసంధానానికి సహకరించండి: షెకావత్ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నదుల అనుసంధానం ప్రాజెక్టుకు సహకరించాలని జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు. గోదావరి–కావేరీ అనుసంధానంపై జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్ వెదిరె త్వరలో ఏపీకి వస్తారని తెలిపారు. -
న్యూఢిల్లీ: జలశక్తి మంత్రితో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
జలశక్తి మంత్రితో ముగిసిన సీఎం జగన్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి , కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ల భేటీ ముగిసింది. పోలవరం ప్రాజెక్ట్‌ను సత్వరం పూర్తి చేయడానికి తగిన సాయం చేయాల్సిందిగా భేటీలో మంత్రిని కోరారు. బుధవారం జల శక్తి మంత్రితో భేటీ అయిన సీఎం జగన్.. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను ఆమోదించాలని విన్నవించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం, 55,656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ, పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్ చేయాల్సిందిగా కోరారు. 2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. 44,574 కుటుంబాల నుంచి 1,06,006కు పెరిగిందని, అలాగే ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్న సీఎం.. దీనివల్ల ఆర్ అండ్ ఆర్‌కోసం పెట్టాల్సిన ఖర్చు భారీగా పెరిగిందన్నారు. (చదవండి: వడివడిగా.. అన్నీ పరిశీలిస్తూ) పోలవరం నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా 1779 కోట్ల రూపాయలను రియింబర్స్ చేయాల్సి ఉందని సీఎం జగన్ భేటీలో వెల్లడించారు. 2018 డిసెంబర్‌కు సంబంధించిన ఈబిల్లులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఖర్చు ఇంకా పెరిగిపోతుందని, ఏపీకి ప్రాణాధారమైన ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీఎం జగన్ అభ్యర్థనలపై షెకావత్ సానుకూలంగా స్పందించారు. అలానే నదుల అనుసంధానంపై ఏపీతో చర్చించాలని.. జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్‌ను షెకావత్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో గోదావరి - కావేరి నదుల అనుసంధానంపై చర్చించేందుకు.. ఏపీకి రావాలని జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్‌ను సీఎం జగన్ ఆహ్వానించారు. -
అదనపు టీఎంసీ... ఆగినట్లే!
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించేలా చేపట్టిన పనులకు బ్రేక్ పడనుంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నుంచి రాష్ట్రానికి అందిన ఆదేశాలు, ఇప్పటికే జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వెలువరించిన ఉత్తర్వుల నేపథ్యంలో.. నెలరోజుల కిందటే రూ.21 వేల కోట్లతో చేపట్టిన పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. మూడో టీఎంసీ ఎత్తిపోత పనులను కొత్త ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నందున... ఆ ప్రాజెక్టుకు కేంద్ర సంస్థల నుంచి పూర్తిస్థాయి అనుమతులు వచ్చే వరకు పనులు కొనసాగించే అవకాశాలు లేవని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఆదిలోనే హంసపాదు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు 2 టీఎంసీలు, మిడ్‌మానేరు దిగువన ఒక టీఎంసీ నీటిని తరలించేలా పనులు పూర్తయిన విషయం తెలిసిందే. ఇక అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే పనులు ఆరంభించి కొనసాగిస్తోంది. ఎల్లంపల్లి దిగువన పనులకు ఈ ఏడాది మార్చిలో టెండర్లు పిలిచింది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు 1.10 టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా నాలుగు ప్యాకేజీలకు రూ.9,747.30 కోట్లతో, మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు మరో నాలుగు ప్యాకేజీలకు రూ.11,710.70 కోట్లతో టెండర్లు పిలిచారు. టెండర్ల ప్రక్రియ మే నెలలో ముగిసింది. ఇదే సమయంలో ఈ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. డీపీఆర్‌లు సమర్పించాలని, కేంద్ర అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించరాదని తెలిపింది. ఫలితంగా రాష్ట్రం ముందడుగు వేయలేదు. ఎన్జీటీ ఉత్తర్వులు అడ్డంకే దీంతో పాటే అదనపు టీఎంసీ పనులపై కొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై అక్టోబర్‌లో తుదితీర్పును వెలువరించిన ఎన్టీటీ, కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ‘గోదావరి బోర్డుకు డీపీఆర్ ఇవ్వకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులపై ముందుకెళ్లొద్దని ఆగస్టులోనే కేంద్రమంత్రి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విస్తరణ పనులకు ఎలాంటి ప్రతిపాదన తమవద్దకు రాలేదని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది. దీనికి కొత్తగా అనుమతులు అవసరమని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 2న తెలంగాణ సీఎం కేంద్రానికి రాసిన లేఖను జల్‌శక్తి శాఖ పరిశీలించాల్సి ఉంది. అనంతరం కేంద్ర జల్‌శక్తి శాఖ తీసుకునే నిర్ణయానికి తెలంగాణ కట్టుబడి ఉండాలి’అని తన తుదితీర్పులో ఎన్జీటీ పేర్కొంది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో గతనెలలో ఎనిమిది ప్యాకేజీల పరిధిలో అదనపు టీఎంసీ పనులను రాష్ట్రం ఆరంభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి లేఖపై ఈనెల 11న స్పందించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, అదనపు టీఎంసీ పనులను పూర్తిగా కొత్త డిజైన్‌గానే చూస్తామని, మార్పు ఏదైనా జరిగినప్పుడు కేంద్ర హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, పెట్టుబడులు, పర్యావరణ తదితర అనుమతులను పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ నుంచి మదింపు తప్పనిసరని, అది జరిగే వరకు ప్రాజెక్టుపై ముందుకెళ్లరాదని స్పష్టం చేశారు. ఇప్పటికే వెలువడిన ఎన్జీటీ ఉత్తర్వులు, కేంద్రం తాజా ఆదేశాల నేపథ్యంలో పనులను కొనసాగించే అవకాశం ఇరిగేషన్ శాఖకు లేకుండా పోయింది. కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి. పనులను ఏమాత్రం కొనసాగించినా పిటిషనర్లు తిరిగి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్న నేపథ్యంలో ఈ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని ఇరిగేషన్ వర్గాలు తెలిపాయి. మిగతా ప్రాజెక్టుల డీపీఆర్‌లకు ఓకే కాళేశ్వరంతో పాటు సీతారామ ఎత్తిపోతల, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు, లోయర్ పెన్ గంగపై బ్యారేజి, రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని, బోర్డుల మదింపు జరగనంతవరకు ముందుకు వెళ్లరాదని సైతం కేంద్రమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇరిగేషన్ శాఖ సిధ్దం చేస్తోంది. అయితే మిగతా చోట్ల పనులను పూర్తిగా నిలిపివేసే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులపై కోర్టులను ఆశ్రయించే అవకాశాలను సైతం రాష్ట్రం పరిశీలిస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో న్యాయనిపుణులతో ప్రభుత్వ పెద్దలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆ ఏడు ప్రాజెక్టులు ఆపండి..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర జల్‌శక్తి శాఖ తాజాగా తెలంగాణకు ఓ లేఖ రాసింది. అదిప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ లేఖలో ఏం ఉందంటే? కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ ప్రతిపాదిత ప్రాజెక్టుసహా ఏడు ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టుల నిర్వచనం పరిధిలోకి వస్తున్నందున వాటిపై ముందుకు వెళ్లొద్దని పేర్కొంది. కాళేశ్వరం మూడో టీఎంసీ, సీతారామ ఎత్తిపోతల, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు, లోయర్ పెన్‌గంగపై బ్యారేజీ, రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు తదితర ఏడు ప్రాజెక్టులకు గోదావరి నదీజలాల యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) నుంచి మదింపు కానంత వరకు ముందుకు వెళ్లరాదని తెలంగాణకు స్పష్టం చేసింది. నీటి వివాదాలపై అక్టోబర్ 2న పలు అభ్యంతరాలను లేవనెత్తుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాసిన లేఖకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బదులిస్తూ నాలుగు పేజీల సమాధానం పంపారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో శుక్రవారం(డిసెంబర్ 11) జల్‌శక్తి మంత్రిని కలిసిన రోజే ఈ లేఖను పంపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి. 1. ‘‘కృష్ణా, గోదావరి నదులలో నీటి వాటా, వినియోగానికి సంబంధించి మీరు అక్టోబర్ 2, 2020న రాసిన లేఖలోని అనేక అంశాలు అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో చర్చకు వచ్చాయి. అయితే మీరు లేవనెత్తిన అన్ని అంశాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రిగా స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఇంకా లేఖలో ఏ ఏ అంశాలున్నాయంటే..కృష్ణా, గోదావరి జలాల పునఃపంపిణీపై..‘కృష్ణా నదీజలాల వాటా, నీటి వినియోగంలో ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి మీరు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా కోసం మీరు చేసిన ప్రయత్నాలను వివరించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956 పరిధిలోని సెక్షన్ 3 ద్వారా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 2014, 2018లో కోరినప్పటికీ కేంద్రం ఏడేళ్లుగా నిష్క్రియాత్మకంగా వ్యవహరించిందని మీరు ఆరోపించారు. ఈ సెక్షన్ పరిధిలో కాకుండా ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ఆధారంగా పరిష్కరించాలని ట్రిబ్యునల్‌కు సూచించారని మీరు నివేదించారు. దీనివల్ల తెలంగాణ ఉపశమనం పొందలేదని మీరు చెప్పారు. అయితే ఈ విషయంలో మీరు 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అది ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇది అక్కడ పరిష్కారమైతేనే కేంద్రం చర్య తీసుకోగలదు. అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మీరు ఈ పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అంగీకరించారు. మీరు ఉపసంహరించుకుంటే న్యాయ సలహా తీసుకుని నదీజలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3 పరిధిలో కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అభ్యర్థనను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించింది. గోదావరి జలాల విషయంలో కూడా రెండు రాష్ట్రాలు ఈ సెక్షన్ పరిధిలో అభ్యర్థన ఇచ్చేందుకు సమ్మతించాయి. అభ్యర్థన రాగానే సానుకూల నిర్ణయం తీసుకుంటామని నాటి సమావేశంలో జల్‌శక్తి శాఖ అంగీకరించింది’ 2. పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణపై .. ‘మీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్, దాని విస్తరణ గురించి ప్రస్తావించారు. ఇది అనధికార విస్తరణ అని, దీని వల్ల తెలంగాణ హక్కులు కోలుకోలేని విధంగా దెబ్బతింటాయని మీరు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2014(ఏపీఆర్ఏ) ప్రకారం కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను మూల్యాంకనం కోసం కేఆర్ఎంబీకి సమర్పించడానికి ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి. తదుపరి అపెక్స్ కౌన్సిల్ వాటిని అనుమతిస్తుంది. కృష్ణా నదీజలాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1)లో గానీ, ఏపీఆర్‌ఏలో గానీ ప్రస్తావించినవీ లేదా ప్రస్తావన లేనివీ అయినప్పటికీ.. సీడబ్ల్యూసీ ద్వారా సాంకేతిక, ఆర్థిక మదింపు జరగని పక్షంలో, జల వనరుల విభాగం సలహా కమిటీ ఆమోదం పొందని పక్షంలో అవి కొత్త ప్రాజెక్టుగా పరిగణించాల్సి ఉంటుంది. అది ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించినా, తరువాత ప్రతిపాదించినా ఈ షరతు మాత్రం సంతృప్తి పరచాల్సి ఉంటుంది. అలాగే ప్రాజెక్టు స్వభావంలో మార్పు చోటుచేసుకున్నా కొత్త ప్రాజెక్టుగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ మేరకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణకు సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీల సాంకేతిక మదింపు లభించనంతవరకు ముందుకు వెళ్లరాదని కేఆర్ఎంబీ, జల్‌శక్తి శాఖ ఆంధ్రప్రదేశ్‌కు పలుమార్లు లేఖ రాశాయి. ఈమేరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు రాగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్‌లు పంపేందుకు అంగీకరించారు’ 3. కేఆర్ఎంబీ స్పందించలేదన్న ఆరోపణలపై.. ‘పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆపడంలో కేఆర్ఎంబీ విఫలమైందని మీరు పేర్కొన్నారు. అలాగే ఏపీ కృష్ణా బేసిన్ నుంచి ఇతర బేసిన్లకు నీటి తరలించడాన్ని కూడా కేఆర్ఎంబీ ఆపలేకపోయిందని రాశారు. టెండర్ ప్రక్రియను ఆపడంలో కూడా విఫలమైందన్నారు. ఏపీ అక్రమంగా జలాలు వినియోగించడాన్ని పర్యవేక్షించడానికి టెలిమెట్రీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని 2016లో జల్‌శక్తి శాఖ చేసిన సూచనలు అమలు చేయడంలో కేఆర్ఎంబీ విఫలమైందని రాశారు. అలాగే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ నుంచి విద్యుదుత్పత్తిని ఆపాలని తెలంగాణను కేఆర్ఎంబీ కోరడం తప్పని మీరు రాశారు. కేడబ్ల్యూడీటీ–1 ఆదేశాల మేరకు శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తికి, నీటిని దిగువకు విడుదల చేయడానికి, తాగునీరు మాత్రమే కాకుండా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ఆపరేషన్, నియంత్రణను ఇవ్వమని మీరు అభ్యర్థించారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ డీపీఆర్‌లను మదింపు చేసే వరకు ముందుకు వెళ్లవద్దని కేఆర్‌ఎంబీతోపాటు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఏపీని నిరంతరం కోరుతూ వచ్చింది. దీనికి ఏపీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చకు వచ్చింది. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల సహా రెండు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు పంపాలని మేం నిర్ణయించిన సంగతి మీకు తెలిసిందే. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని నిర్ణయించాం. నోటిఫై చేయడం పూర్తయితే విద్యుదుత్పత్తి సహా శ్రీశైలం నుండి దిగువకు నీటిని విడుదల చేయడం, నియంత్రించడం వంటి అంశాలను కేఆర్ఎంబీ నిర్దేశిస్తుంది. ఇక టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు వ్యయం భరించాలని 2016లో జరిగిన 1వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించారు. దీనిపై పదేపదే అభ్యర్థన చేసినప్పటికీ రెండు రాష్ట్రాలు స్పందించలేదు. రెండు రాష్ట్రాలు ఈ దిశగా వ్యయం భరిస్తే టెలిమెట్రీ వ్యవస్థ స్థాపించడం పూర్తవుతుంది’ 4. సెక్షన్ 89 అంశంపై.. ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89కు సంబంధించిన సమస్యల గురించి మీరు రాశారు. అంతర్రాష్ట్ర నదీజలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3 పరిధిలో కేంద్రం రెఫర్ చేయనందున కృష్ణా నదీజలాలను పునఃపంపిణీ చేసే అంశం పరిశీలించలేమని, సెక్షన్ 89 పరిధిలో మాత్రమే పరిశీలన జరుగుతుందని కేడబ్ల్యూడీటీ–2 అభిప్రాయపడ్డట్టు మీరు రాశారు. సెక్షన్ 3 పరిధిలో కొత్త ట్రిబ్యునల్ గానీ, ఉనికిలో ఉన్న ట్రిబ్యునల్‌గానీ కృష్ణా నదీజలాల పునఃపంపిణీ జరిపేలా రెఫర్ చేయాలని మీరు కోరారు. కేంద్రం స్పందించలేదని మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే మేం మీ అభ్యర్థనను పరిశీలించేందుకు సిద్ధమని చెప్పగా అపెక్స్ కౌన్సిల్లో మీరు కూడా అంగీకరించారు’ 5. ఆ ఏడు ప్రాజెక్టుల్లో ముందుకు వెళ్లొద్దు.. ‘తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలను మీరు మీ లేఖలో ప్రస్తావించారు. మీరు గోదావరిపై చేపట్టిన ఏడు ప్రాజెక్టులు కొత్తవి కావని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించినవని మీరు ప్రస్తావించారు. భారీ ముంపు నష్టం లేకుండా కొన్ని ప్రాజెక్టుల స్థలాన్ని మార్చినట్టు, మెరుగైన సామర్థ్యం కనబరిచేలా కొన్ని ప్రాజెక్టులను రీడిజైన్ చేసినట్టు మీరు చెప్పారు. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కూడా కాళేశ్వరం (2 టీఎంసీ) ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినట్టు, ఆ స్థలంలో నీటి లభ్యత కారణంగా 3వ టీఎంసీ విస్తరణకు ముందుకు వెళ్లినట్టు మీరు మీ లేఖలో తెలిపారు. అయితే, ఆగస్టు 7న మీకు నేను రాసిన లేఖను గుర్తు చేయాలనుకుంటున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు 2 టీఎంసీల ప్రతిపాదనకు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ 2018 జూన్‌లో అంగీకరించింది. కానీ, ·ఈ ప్రాజెక్ట్ పరిధిని 3 టీఎంసీలకు పెంచుతూ మీరు మార్చారు. అలాంటి మార్పు ఏదైనా ఉన్నప్పుడు కేంద్రం నుంచి హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, పెట్టుబడులు, పర్యావరణ తదితర అనుమతులను పొందాల్సి ఉంటుందని మీకు రాశాను. ఈ మార్పు కారణంగా ఏపీఆర్ఏ–2014ను అనుసరించి జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ నుంచి మదింపు తప్పనిసరి. ఏపీ అభ్యంతరం చెప్పినట్టుగా ఈ ఏడు ప్రాజెక్టుల డీపీఆర్‌ల మదింపు జరగకుండా ముందుకు వెళ్లరాదని కూడా ఆ లేఖలో చెప్పాం. దీనిపై అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కూడా చర్చించాం. జీఆర్ఎంబీకి డీపీఆర్‌లు పంపేందుకు మీరు సమ్మతించారు. అందువల్ల మీరు కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ ప్రతిపాదన, సీతారామ ఎత్తిపోతల, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు, లోయర్ పెన్‌గంగపై బ్యారేజి, రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు ప్రాజెక్టులకు జీఆర్ఎంబీ మదింపు జరగనంతవరకు ముందుకు వెళ్లరాదని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను’ 6. గోదావరి జలాల పంపిణీపై.. ‘గోదావరి నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు 967.94 టీఎంసీలు, ఏపీకి 518.2 టీఎంసీలు కేటాయించారని మీరు ప్రస్తావించారు. తెలంగాణకు 1950 టీఎంసీల వాటా దక్కాలని మీరు రాశారు. ఏపీ, తెలంగాణల మధ్య గోదావరి జలాలను పంచుకునే విషయంలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు తక్షణం అభ్యర్థన పంపుతామని ఇరు రాష్ట్రాలు అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించాయి. అభ్యర్థన రాగానే ఈ దిశగా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుంది’అని మంత్రి పేర్కొన్నారు. ‘రెండు రాష్ట్రాల మధ్య నీటి భాగస్వామ్యం, నీటి వినియోగ సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న అన్ని నిర్ణయాలపై వేగంగా ముందుకు సాగుతున్నామని ఆశిస్తున్నాను. తద్వారా రెండు రాష్ట్రాల చట్టబద్ధమైన నీటి హక్కులు త్వరితగతిన సాకారం అయ్యేలా చూసుకోవచ్చు’అని జల్‌శక్తి మంత్రి షెకావత్ పేర్కొన్నారు. ఆ ఏడు ప్రాజెక్టులు ఇవే.. కాళేశ్వరం మూడో టీఎంసీ సీతారామ ఎత్తిపోతలు జీఎల్ఐఎస్ ఫేజ్–3 తుపాకులగూడెం ప్రాజెక్టు తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు లోయర్ పెన్‌గంగపై బ్యారేజీ రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు -
గజేంద్ర సింగ్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు గంటకుపైగా కొనసాగింది. కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి మూడురోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. శనివారం పౌరవిమానయాన, హౌసింగ్‌శాఖల మంత్రి హర్దీప్సింగ్ పురితో భేటీ అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. -
'చంద్రబాబు చిక్కుముడులు విప్పుతున్నాం'
సాక్షి, ఢిల్లీ : ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పోలవరం ప్రాజెక్టకు సంబంధించి పలు కీలక అంశాలను ఆయన వద్ద ప్రస్తావించినట్లు మీడియా సమావేశంలో తెలిపారు. పోలవరంపై 2017లో చంద్రబాబు వేసిన చిక్కుముడులను విప్పుతున్నామన్నారు. ఈ సందర్భంగా పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రమంత్రికి మెమెరాండం ఇచ్చామని పేర్కొన్నారు. పోలవరం అంశంపై మంత్రి షెకావత్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని.. పోలవరాన్ని సందర్శించాలని కోరగా.. 15 రోజులలోపే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..మూడు రోజులుగా వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులు, అధికారులతో సమావేశమయ్యాం.నేడు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి సీఎం వైయస్ జగన్ ఇచ్చిన రిప్రజెంటేషన్ అందజేశాం. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రమంత్రికి తెలిపాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో 2017లో(చంద్రబాబు హయాంలో) జరిగిన పొరపాటును, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇబ్బందులను కేంద్ర మంత్రికి వివరించాం. పోలవరం ప్రాజెక్టులో డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి ఏదైతే కాంపోనెంట్ తీసేశారో, దానిని కూడా చట్టంలోని 14-యాక్ట్ ప్రకారం మనకున్న హక్కు ప్రకారం ఇవ్వాలని కోరినట్లు 'అనిల్ తెలిపారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ గారితో డిటైల్డ్ గా చర్చించడం జరిగింది. ఏపీ విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని పూర్తి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు హయాంలో స్పెషల్ ప్యాకేజీ పేరుతో సెప్టెంబర్8, 2016న ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవడం వల్ల, ఒరిజనల్ గా ఉన్న ఫెసిలిటీస్ అన్నీ మార్చడం జరిగింది. చంద్రబాబు హయాంలో క్రియేట్ చేసిన సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా చిక్కుముడిని విడదీస్తున్నామని' బుగ్గన పేర్కొన్నారు. -
ఢిల్లీ: కేంద్రమంత్రి షెకావత్‌తో మంత్రులు బుగ్గన, అనిల్ భేటీ
-
‘సవరించిన అంచనాలను ఆమోదించండి’
సాక్షి, న్యూ ఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్ర మంత్రికి విన్నపించారు. 2017-18 సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ వద్ద అంచనాల పెంపు వ్యవహారం పెండింగ్‌లోఉందని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రి నిర్మలా సీతారామన్‌ను పలుమార్లు కలిసి అంచనాల పెంపుపై చర్చించినట్లు ఏపీ మంత్రులు పేర్కొన్నారు. చదవండి: పోలవరం ఓ చిరకాల స్వప్నం -
‘బీజేపీ మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంది’
జైపూర్: లవ్ జీహాద్ అనే పదాన్ని సృష్టించి భారతీయ జనతా పార్టీ మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు. దేశ ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తుందని బీజేపీపై మండిపడ్డారు. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకొస్తామని బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు. చట్టంలో ‘లవ్ జీహాద్’ కు ఎలాంటి నిర్వచనం లేదని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమకు ఇష్టం ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం పౌరులకు రాజ్యాంగం కల్సించిన స్వేచ్ఛ అని.. అలాంటి స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తూ బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. లవ్‌లో జీహాద్‌కు స్థానం లేదని, దీనిసై చట్టాలు తీసుకురావడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని గెహ్లట్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇలాంటి చట్టాలు ఏ న్యాయస్థానంలోనూ నిలబడే పరిస్థితి లేదన్నారు. ప్రజలు తమ దయతోనే జీవించాలనే వాతావారణం సృష్టించేందుకు జీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఆ స్వేచ్ఛ స్త్రీలకు ఉంటుంది : షెకావత్ అశోక్ గహ్లోత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్విటర్ వేదికగా స్పందించారు. దేశంలో వేలాదిమంది యువతులు లవ్ జీహాద్ వలలో చిక్కుకుంటున్నారని షెకావత్ అన్నారు. ఎవరిని వివాహం చేసుకోవాలనేది వ్యక్తిగత స్వేచ్చ అయితే తమ మతంలో కొనసాగే హక్కు, స్వేచ్చ సైతం స్త్రీలకు ఉంటుందిని పేర్కొన్నారు. లవ్ జీహాద్ ట్రాప్‌లో పడుతున్న యువతులు పెళ్లి తర్వాత వారు నయవంచనకు గురైనట్లు గ్రహిస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో లవ్ జీహాద్ వంటి అనధికార నయా నయవంచన చట్టానికి కాంగ్రెస్ మద్దతిస్తుందంటూ దుయ్యబట్టారు. కొత్త పదాలను సృష్టించడం, అల్లర్లకు పాల్పడటం, విద్వేషాలను రగిల్చడం వంటి వాటిపై కాంగ్రెస్ పార్టీ సర్వ హక్కులను కలిగి ఉంటుందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మహిళలకు అన్యాయం జరగకుండా ఉన్నప్పుడే సమాజం బాగుంటుందనే విషయాన్ని బీజేపీ నమ్ముతుందని మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. గత కొంత కాలంగా లవ్ జీహాద్ అంశంపై దేశంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక వర్గం వారు ప్రేమ పేరుతో మత మార్సిడికి పాల్పడుతున్నారని, అలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలుకుతుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రజల వ్యక్తిగత స్వేచ్చను హరించే ప్రయత్నం బీజేపీ చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తుంది. -
జాతీయ స్థాయిలో ఏపీకి అవార్డులు
సాక్షి, విజయవాడ: జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అవార్డులు దక్కించుకుంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అవార్డులను ప్రకటించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఏపీలో చేపట్టిన కార్యక్రమాలకు ఈ అవార్డులు వరించాయి. (చదవండి: పెట్టుబడి.. గిట్టుబాటు కావాలి: సీఎం జగన్) ఓడిఎఫ్, జీరో వేస్ట్ మేనేజ్మెంట్, నూతన టెక్నాలజీలకు అవార్డులు దక్కాయి. తూర్పు, పశ్చిమ గోదావరి కలెక్టర్లకు అవార్డులను కేంద్ర మంత్రి షెకావత్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారానే ఇది సాధ్యమైందని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో నిర్వహణ సులభతరమైందని పేర్కొన్నారు. (చదవండి: ‘అప్పుడాయన ఎక్కడున్నారు..?’) విశాఖ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ.. విశాఖ: అంతర్జాతీయ పోటీల్లో విశాఖ నగరం మూడో స్థానంలో నిలవడం శుభపరిణామం అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ చర్యలతో పాటు.. ప్రజలు సహకరించటంతోనే విశాఖ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అన్ని పార్టీల ప్రజలు ఉన్నారని తెలిపారు. చంద్రబాబునాయుడు ఉద్దేశపూర్వకంగా ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకున్నా.. సీఎం వైఎస్ జగన్ మాత్రం పేదల విషయంలో రాజీ పడలేదన్నారు. ఇళ్ల పట్టాలు తీసుకోబోతున్న వ్యక్తుల్లో టీడీపీ సానుభూతి పరులు కూడా ఉన్నారని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
పోలవరం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరానికి 2017–18 ధరల ప్రకారం కేంద్రం నుంచి నిధులను రాబట్టి 2021 డిసెంబర్‌లోగా ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ కొర్రీల నేపథ్యంలో నవంబర్ 2న సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించేందుకు పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) అంగీకరించింది. పీపీఏ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ), ఆర్సీసీ (సవరించిన అంచనా కమిటీ), కేంద్ర జల్ శక్తి శాఖ ఆమోదించిన మేరకు 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, ఆర్ఆర్(రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్) ప్యాకేజీ కింద నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.28,172.207 కోట్లు అవసరమని పీపీఏ సర్వ సభ్య సమావేశంలో గుర్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించి అమలులోకి తెచ్చిన భూ సేకరణ చట్టం–2013 ప్రకారం భూ సేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందనే అంశాన్ని గుర్తు చేయనుంది. భూ సేకరణ, ఆర్ఆర్ ప్యాకేజీ వ్యయం కంటే తక్కువగా 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లుగా పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని నిర్ధారించి, ఆమోదించాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించడం సమంజసం కాదని తేల్చి చెప్పనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టుపై చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు కాగా ఆ తర్వాత కేంద్రం రీయింబర్స్ చేసిన రూ.8,614.16 కోట్లు పోనూ మిగిలిన నిధులు రూ.7,053.74 కోట్లతో ప్రాజెక్టును ఎలా పూర్తి చేయాలని ప్రశ్నించాలని నిర్ణయించింది. విభజన చట్టం ప్రకారం వంద శాతం ఖర్చుతో పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరనుంది. కేంద్ర కేబినెట్లో సవరణ తీర్మానం.. పోలవరం అంచనా వ్యయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ ఇప్పటికే 2017–18 ధరల ప్రకారం ఆమోదించిన నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లభిస్తుందని పీపీఏ వర్గాలు వెల్లడించాయి. జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చాక ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.47,725.74 కోట్లు విడుదల చేయాలని సూచిస్తూ కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతుంది. ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ కేంద్ర కేబినెట్‌కు పంపుతుందని పీపీఏ వర్గాలు వివరించాయి. 2013 – 14 ధరల ప్రకారం పోలవరం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేయడాన్ని ఆమోదిస్తూ 2017 మార్చి 15న చేసిన తీర్మానాన్ని సవరిస్తూ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపుతారని, దీనికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. విభజన చట్టం సెక్షన్–90లో పేర్కొన్న మేరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులను కేంద్రమే విడుదల చేయాల్సి ఉంటుందని పీపీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. క్లియరెన్స్ కోరుతూ ప్రతిపాదనలు.. పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ, పీపీఏ ఆమోదిస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చాయి. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆర్థిక సలహాదారు, పీపీఏ సభ్యుడైన జగ్మోహన్ గుప్తా నేతృత్వంలోని ఆర్సీసీకి ఆ నివేదికను పంపింది. సీడబ్ల్యూసీ టీఏసీ, పీపీఏ ఎకరం భూమికి రూ.11.52 లక్షలను పరిహారంగా నిర్ణయిస్తే, ఆర్సీసీ దాన్ని రూ.10.91 లక్షలకు తగ్గించింది. దీంతో భూసేకరణ వ్యయం రూ.13,077.15 కోట్ల నుంచి రూ.10,199.67 కోట్లకు తగ్గింది. ఇక ఆర్ఆర్ ప్యాకేజీ వ్యయాన్ని సీడబ్ల్యూసీ రూ.20,091.09 కోట్లకు ఆమోదిస్తే, ఆర్సీసీ రూ.17,972.54 కోట్లకు తగ్గించింది. హెడ్ వర్క్స్, కుడి కాలువ, ఎడమ కాలువ, జల విద్యుదుత్పత్తి కేంద్రం వ్యయాన్ని సీడబ్ల్యూసీ రూ.22,470.64 కోట్లకు ఆమోదిస్తే దాన్ని ఆర్సీసీ రూ.19,445.53 కోట్లకు తగ్గించింది. పీపీఏ నిర్వహణ ఖర్చులు రూ.108 కోట్లతో కలిపి ప్రాజెక్టుకు రూ.47,725.74 కోట్లు అవసరమని కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ యథాతథంగా ఆమోదించారు. గతంలో ఏదైనా ప్రాజెక్టుకు ప్రణాళికా సంఘం ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్(పెట్టుబడి అనుమతి) ఇచ్చేది. కేంద్రం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశాక ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అధికారాన్ని ఆయా శాఖలకే కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో 2017–18 ధరల ప్రకారం పోలవరానికి రూ.47,725.74 కోట్లకు ‘ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్’ ఇవ్వాలని పీపీఏ ద్వారా కేంద్ర జల్ శక్తి శాఖకు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
మూడు అంశాలే ప్రామాణికం!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 అమల్లోకి వచ్చిన తేదీ నాటికి ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ప్రాతిపదికన గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నీటి లభ్యత 75 శాతం కంటే అధికంగా ఉన్న మిగులు జలాలపై పూర్తి అధికారాన్ని దిగువ రాష్ట్రానికే బచావత్ ట్రిబ్యునల్ కట్టబెట్టడాన్ని ప్రస్తావించనుంది. విభజన నేపథ్యంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కే మిగులు జలాలపై పూర్తి హక్కులు కల్పించడాన్ని కూడా గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటుకు ప్రాతిపదికగా తీసుకోవాలని కోరాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగంలో తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు ఈనెల 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశాన్ని నిర్వహించిన విషయం విదితమే. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం(ఐఆర్డబ్ల్యూడీఏ)–1956 ప్రకారం ప్రతిపాదనలు పంపితే గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని షెకావత్ పేర్కొన్నారు. ఇందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖరరావు అంగీకరించారు. సీఎంల ఒప్పందాలే ప్రాతిపదికగా.. దేశవ్యాప్తంగా నదీ జలాల వివాదాలను పరిష్కరించి పరీవాహక ప్రాంతాలకు నీటిని కేటాయించేందుకు 1969 ఏప్రిల్ 10న ఆర్ఎస్ బచావత్ నేతృత్వంలో డీఎం బండారీ, డీఎం సేన్ సభ్యులుగా ట్రిబ్యునల్ ఏర్పాటైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసుకున్న ఒప్పందాలు ప్రాతిపదికగా బచావత్ ట్రిబ్యునల్ గోదావరి జలాలను పంపిణీ చేసింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 1,430 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ 1980లో ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పర్ గోదావరి(జీ–1) నుంచి శబరి(జీ–12) వరకు నదీ పరీవాహక ప్రాంతాన్ని 12 ఉప పరీవాహక ప్రాంతాలుగా ట్రిబ్యునల్ విభజించింది. ప్రతి ఉప పరీవాహక ప్రాంతంలో రాష్ట్రాలకు కేటాయించగా మిగులుగా ఉన్న నికర జలాలను వినియోగించుకునే వెసులుబాటును దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టింది. 75 శాతం కంటే అధికంగా నీటి లభ్యత ఉన్న మిగులు జలాలపై పూర్తి హక్కును ఆంధ్రప్రదేశ్‌కే కలి్పంచింది. 25 ఏళ్ల పాటు ఈ తీర్పు అమల్లో ఉంటుందని, ఆ తర్వాత సమీక్షించుకోవచ్చని సూచించింది. రెండో జీడబ్ల్యూడీటీ తెరపైకి.. అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో తీసుకున్న నిర్ణయంతో జీడబ్ల్యూడీటీ–2 తెరపైకి వచ్చింది. జీడబ్ల్యూడీటీ–2 ఏర్పాటుకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలపై కేంద్రానికి మూడు ప్రతిపాదనలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రతిపాదనలు ఇవీ.. ► ఉమ్మడి రాష్ట్రం విడిపోయే నాటికి అంటే 2014 జూన్ 2 నాటికి గోదావరి జలాల్లో 660 టీఎంసీలను వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, 472 టీఎంసీలు వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేశాయి. మరో 116 టీఎంసీలను వాడుకునే సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్, 178 టీఎంసీలు ఉపయోగించుకునేలా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అంటే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు 776, తెలంగాణకు 650 వెరసి 1,426 టీఎంసీలను కేటాయించాలి. ► బచావత్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు జీ–1 నుంచి జీ–12 వరకు పరీవాహక రాష్ట్రాలకు కేటాయించగా మిగులుగా ఉన్న నికర జలాలను దిగువ రాష్ట్రమైన ఏపీకే కేటాయించాలి. ► 75 శాతం కంటే నీటి లభ్యత అధికంగా ఉండే మిగులు జలాలపై పూర్తి అధికారాన్ని బచావత్ ట్రిబ్యునల్ దిగువ రాష్ట్రమైన ఏపీకే ఇచ్చింది. ఆ మేరకు నీటి కేటాయింపులు చేస్తే, జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన మేరకు నదుల అనుసంధానం ప్రాజెక్టు పనులు చేపడతాం. -
దిగువ కృష్ణా ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకే!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల పరిధిలో దిగువ కృష్ణా పరీవాహక ప్రాంతం (బేసిన్)లోని ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు స్పష్టం చేసింది. ప్రాజెక్టుల పరిధిలోని జలవిద్యుదుత్పత్తి కేంద్రాలు, కాలువల హెడ్ రెగ్యులేటర్లు, ఎత్తిపోతలను బోర్డు అధీనంలోకి తీసుకోవాలని సూచించింది. వీటికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. జలాల కేటాయింపు.. వినియోగాన్ని టెలీమీటర్ల ద్వారా లెక్కించి ఎప్పటికప్పుడు రెండు రాష్ట్రాలకు తెలియజేయడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టవచ్చని పేర్కొంది. ఈ మేరకు బోర్డు పరిధి, విధివిధానాలను ఖరారు చేయాలని కృష్ణా బోర్డుకు శుక్రవారం ప్రతిపాదనలు పంపింది. ఈనెల 6న కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బోర్డు పరిధిని ఖరారు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా.. తెలంగాణ సర్కార్ వ్యతిరేకించింది. కేంద్రానికి ఉన్న విచక్షణాధికారాలను ఉపయోగించి కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. పరిధిపై ప్రతిపాదనలు పంపాలని రెండు రాష్ట్రాలను కోరిన బోర్డు బోర్డు పరిధి, వర్కింగ్ మాన్యువల్‌పై ప్రతిపాదనలను శుక్రవారంలోగా పంపాలని రెండు రాష్ట్రాలను కృష్ణా బోర్డు చైర్మన్ ఎ.పరమేశం కోరారు. ఆ మేరకు బోర్డు పరిధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పంపింది. ఆ ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు ఇవీ.. ► ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తోపాటు తెలంగాణలోని జూరాల, ఏపీలోని పులిచింతల, ప్రకాశం బ్యారేజీసహా రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలి. ► ప్రాజెక్టుల స్పిల్ వేలతోపాటు జలవిద్యుదుత్పత్తి కేంద్రాలు, కాలువలకు నీరు విడుదల చేసే రెగ్యులేటర్లు, ఎత్తిపోతల పథకాల పంప్ హౌస్‌లు, తాగునీటి పథకాలు, చిన్న నీటివనరుల విభాగంలోని చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలి. ► ప్రాజెక్టుల పరిధిలో నీటి విడుదల, నియంత్రణ అధికారులు బోర్డు పర్యవేక్షణలోనే పని చేయాలి. ► ఆరునెలలకు ఒకసారి బోర్డు సమావేశం నిర్వహించాలి. నీటి సంవత్సరం ప్రారంభం నుంచి ముగిసేవరకు నీటి అవసరాలు, కేటాయింపులు, వినియోగంపై ఎప్పటికప్పుడు త్రిసభ్య కమిటీ భేటీలు నిర్వహించాలి. ► బోర్డు పరిధిలోని ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో పహరా ఏర్పాటు చేయాలి. ► బోర్డు నిర్వహణ, సీఐఎస్ఎఫ్ బలగాల పహరాకు అయ్యే వ్యయాన్ని రెండు రాష్ట్రాలు దామాషా పద్ధతిలో భరించాలి. -
వారికి సేద్యం గురించి ఏమీ తెలియదు!
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఆందోళనను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తప్పుపట్టారు. రైతాంగాన్ని వారు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆకులను చూసి పంట ఏదో వారు చెప్పగలిగితే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని ఆయన సవాల్ విసిరారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్‌లో మూడు రోజుల పాటు జరిగిన ట్రాక్టర్ ర్యాలీలు, రైతుల ఆందోళనల నేపథ్యంలో రాహుల్, ప్రియాంక గాంధీలపై షెకావత్ విరుచుకుపడ్డారు. విపక్షాల వ్యతిరేకత మధ్య వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలకు కాంగ్రెస్ సారథ్యం వహిస్తోంది. రాహుల్‌కు ఉల్లిగడ్డలు ఎలా పెరుగుతాయో తెలియదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు. ఉల్లిగడ్డలు భూమిలోపల పెరుగుతాయా వెలుపల పెరుగుతాయా అనేది ఆయనకు తెలియదని వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లులు రైతు ప్రయోజనాలకు విఘాతమని, ఇవి కార్పొరేట్లకు మేలు చేస్తాయని మద్దతు ధర వ్యవస్ధ కనుమరుగవుతుందని విపక్షాలు, రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు వ్యవసాయ బిల్లులు రైతులకు మేలు చేస్తాయని, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఇక వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ బీజేపీ చిరకాల మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి వైదొలగింది. పంజాబ్, హరియాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనల బాటపట్టారు. చదవండి : మోదీకి చెప్పలేకపోవడమే అసలు సమస్య -
అపెక్స్ కౌన్సిల్ సమావేశం
-
వాటా నీటినే వాడుకుంటాం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన వాటా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుని, దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలను మెరుగు పరచడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ ఏపీ, తెలంగాణా రాష్ట్రాల సీఎంలతో మంగళవారం సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. న్యాయబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా గురించి స్పష్టంగా వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ► రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అధిక శాతం ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది. అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన ఈ జిల్లాలు తాగు, సాగు, పారిశ్రామిక నీటి అవసరాలకు శ్రీశైలం ప్రాజెక్టుపైనే ఆధారపడ్డాయి. ► దేశంలో థార్ ఎడారి తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో అనంతపురం జిల్లా రెండో స్థానంలో ఉంది. అనంతపురం జిల్లా డీడీపీ (ఎడారి నివారణ పథకం) పరిధిలో, కర్నూలు, వైఎస్సార్ కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు డీపీఏపీ (కరవు ప్రాంత అభివృద్ధి పథకం) పరిధిలో ఉండటాన్ని బట్టి చూస్తే ఆ జిల్లాలు ఎంతగా వెనుకబడ్డాయో.. నీళ్లు లేక ఎంతగా ఇబ్బందులు పడుతున్నాయో విశదం చేసుకోవచ్చు. ► వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజల కనీస అవసరాలు తీర్చడం, సమగ్రాభివృద్ధి చేయడం ద్వారా ప్రజల్లో స్థైర్యం నింపాల్సిన నైతిక బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాలదే అన్న అంశాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి, తెలంగాణ సీఎంలకు వినయపూర్వకంగా గుర్తు చేస్తున్నా. మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిస్థితి వేరు ► తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు ఈ కోవలోకే వచ్చినా, ఆ జిల్లాల్లో 30 శాతం కంటే ఎక్కువ భూమికి సాగునీరు అందుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాకు 142 టీఎంసీలు, నల్గొండ జిల్లాకు 104 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఈ మూడు జిల్లాలు డీపీఏపీ పరిధి నుంచి బయటపడి.. సమగ్రాభివృద్ధి దిశగా సాగుతున్నాయి. ► కానీ ఇదే రాయలసీమ, ప్రకాశం జిల్లాలు నిత్యం కరవుతో తల్లడిల్లుతున్నాయి. ఒక్కో జిల్లాకు కనీసం 50 టీఎంసీల నీరు కూడా అందుబాటులో లేదు. సాధారణంగా ఒక జిల్లా స్వయం సమృద్ధి సాధించాలంటే కనీసం వంద టీఎంసీలు అవసరమన్నది అందరికీ తెలిసిందే. ► ఈ లెక్కన శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు మొత్తం ఆరు జిల్లాలు అభివృద్ధి సాధించాలంటే 600 టీఎంసీలు అవసరం. ఇదే అంశంపై 2019 జూన్ 28న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ సీఎం మాట్లాడుతూ ఒక జిల్లా అభివృద్ధి సాధించాలంటే వంద టీఎంసీలు అవసరమని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకించి రాయలసీమ ప్రజలకు కూడా వర్తిస్తుంది. వాటా నీటినే వినియోగించుకోలేకపోతున్నాం ► వాస్తవం ఏమిటంటే.. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్(పీహెచ్ఆర్) ద్వారా కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులే వస్తాయి. 881 నుంచి 885 అడుగుల మధ్య నీటి మట్టం ఉన్నప్పుడే పీహెచ్ఆర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు చేరుతాయి. కానీ.. గత పదేళ్ల రికార్డులను పరిశీలిస్తే శ్రీశైలంలో ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. ► చెన్నైకి తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, కేసీ కెనాల్ సప్లిమెంటేషన్‌కు పది టీఎంసీలు కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. విభజన చట్టంలో 11వ షెడ్యూలులోని గాలేరు–నగరికి 38 టీఎంసీలు, తెలుగుగంగకు 29, వెలిగొండకు 43.5, హంద్రీ–నీవాకు 40 టీఎంసీలు.. వాటితోపాటు సీబీఆర్‌కు పది, పైడిపాళెంకు ఆరు, మైలవరానికి ఏడు, సర్వారాయసాగర్‌కు మూడు, గోరకల్లుకు 12.4, అవుకుకు 4.14, సోమశిలకు 78, కండలేరుకు 68 టీఎంసీలు అవసరం. ఈ ప్రాజెక్టులన్నీ శ్రీశైలంపైనే ఆధారపడ్డాయి. సీబీఆర్, మైలవరం, సోమశిల, కండలేరు ప్రాజెక్టులు దశాబ్దాలుగా శ్రీశైలంపైనే ఆధారపడ్డాయి. ► 1983లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు చెన్నై తాగునీటికి కేటాయించిన 15 టీఎంసీల్లో ఎనిమిది టీఎంసీలను జూలై నుంచి అక్టోబర్ మధ్య, నాలుగు టీఎంసీలను జనవరి నుంచి ఏప్రిల్ «మధ్య సరఫరా చేయాలి. కానీ.. జనవరి నాటికి శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల పీహెచ్ఆర్ ద్వారా చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడం సాధ్యం కావడం లేదు. ► విభజన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 90 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, రోజూ 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీలు తీసుకెళ్లేలా డిండి ఎత్తిపోతలను తెలంగాణ కొత్తగా చేపట్టింది. కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచింది. ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచింది. ప్రాజెక్టులో 796 అడుగుల నుంచి రోజుకు నాలుగు టీఎంసీలను ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా తరలించే సామర్థ్యం ఉంది. ► ఆంధ్రప్రదేశ్‌లో 2.45 కోట్ల జనాభాతో 98,001 చ.కి.మీల విస్తీర్ణంలో విస్తరించిన ఆరు జిల్లాలు నీటి అవసరాల కోసం శ్రీశైలంపై ఆధారపడితే.. తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొంత భాగం మాత్రమే శ్రీశైలంపై ఆధారపడ్డాయి. వాటా జలాలను వినియోగించుకోవడానికే.. ► కృష్ణా జలాల్లో 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ 512, తెలంగాణ 299 టీఎంసీలను వినియోగించుకునేలా రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. శ్రీశైలం నుంచి రోజుకు సాగునీటి అవసరాల కోసం మూడు టీఎంసీలు.. విద్యుదుత్పత్తి ద్వారా నాలుగు టీఎంసీలు వెరసి ఏడు టీఎంసీలను 800 అడుగుల నీటి మట్టం కంటే దిగువ నుంచే తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. దీని వల్ల పీహెచ్ఆర్ ద్వారా కాలువలకు నీటిని సరఫరా చేయలేని పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగులకు దిగువన ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 512 టీఎంసీల వాటా జలాలను వినియోగించుకోవడం కష్టమవుతోంది. ► వాటా జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పీహెచ్ఆర్ కింద తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లందించడం కోసమే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలను తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం. దిగువ ప్రాంతాలకు ముంపు ముప్పును తప్పించేలా వరదను మళ్లించడానికి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ల కాలువ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. ► కేటాయించిన నీటి కంటే చుక్క నీటిని రాయలసీమ ఎత్తిపోతల ద్వారా అదనంగా వినియోగించుకోం. ఈ ఎత్తిపోతల ద్వారా పాత ఆయకట్టుకే నీళ్లందిస్తాం. నీటిని నిల్వ చేయడానికి కొత్తగా ఎలాంటి రిజర్వాయర్లు నిర్మించడం లేదు. ఒక బేసిన్ నుంచి మరొక బేసిన్‌కు నీటి మళ్లింపు న్యాయమే ► కేడబ్ల్యూడీటీ–1 తీర్పులో 128వ పేజీ ప్రకారం అంతర్రాష్ట్ర నది అయిన కృష్ణా నుంచి ఇతర నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్)కు నీటిని మళ్లించడం న్యాయమే. ఈ క్రమంలోనే కృష్ణా డెల్టాకు 181.2, కేసీ కెనాల్‌కు 39.9, నాగార్జునసాగర్ కుడి కాలువకు 132, తుంగభద్ర హెచ్చెల్సీకి 32.5, గుంటూరు చానల్‌కు నాలుగు టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. ఆ తర్వాత కేడబ్ల్యూడీటీ–2 తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించింది. ► దీన్ని బట్టి చూస్తే ఒక నది నుంచి మరొక నదికి నీటిని మళ్లించడం న్యాయమేనన్నది స్పష్టమవుతోంది. దేశంలో రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్, కృష్ణా, మూలమట్ట, ఇంద్రాయణి, పెరియార్, చెలకుడి నదుల నుంచి ఇతర నదులకు నీటిని మళ్లించారు. ► కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య 1978 ఆగస్టు 4న కుదిరిన ఒప్పందం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు నీటిని అందించేందుకు ప్రకాశం బ్యారేజీకి మళ్లిస్తున్న 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో 45 టీఎంసీలను అదనంగా కేటాయించాలని తెలంగాణ పదే పదే కోరుతోంది. ► అదే తెలంగాణ హైదరాబాద్ తాగునీటి సరఫరా (6.43 టీఎంసీలు), ఎస్సారెస్పీ (68.48), కాళేశ్వరం (83.19), జీఎల్ఐఎస్ (24.65), సీతారామ (21.75), ఎస్సారెస్పీ వరద కాలువ (6.65), రామప్ప లేక్ నుంచి పాకాల లేక్‌కు మూడు టీఎంసీలు, వెరసి 214 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో అదనంగా వాటా ఇవ్వాలి. తక్షణమే బోర్డు పరిధిని ఖరారు చేయాలి ► ఉమ్మడి ప్రాజెక్టులు అయిన శ్రీశైలం పర్యవేక్షణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌కు.. నాగార్జునసాగర్ బాధ్యతను తెలంగాణకు అప్పగించారు. కానీ.. తమ భూభాగంలో ఉందనే నెపంతో శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ తన అధీనంలో ఉంచుకుంది. అదే నాగార్జునసాగర్‌లో కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ఏపీ భూభాగంలో ఉన్నా, తెలంగాణ తన అధీనంలోకి తీసుకుంది. ► శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో 796 అడుగుల నుంచే యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని తరలించడం వల్ల నీటి మట్టం తగ్గిపోయి రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి నీళ్లందించలేని దుస్థితి. సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందడం లేదు. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డు అధీనంలోకి తేవాలి. ► విభజన చట్టంలో సెక్షన్ 85(2) ప్రకారం కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని 2019లో హోం శాఖ నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాన్ని తక్షణమే అమలు చేయాలి. గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి ► వ్యాప్కోస్ నివేదిక ప్రకారం గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 1430 టీఎంసీల జలాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరిపై చేపట్టి పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాటికి 776, తెలంగాణలో ఉన్న వాటికి 650 టీఎంసీలు అవసరం. ► కానీ.. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 225 నుంచి 450 టీఎంసీలకు, జీఎల్ఐఎస్ సామర్థ్యాన్ని 22 టీఎంసీలకు పెంచింది. తుపాకులగూడెంను వంద టీఎంసీలు, సీతారామ ఎత్తిపోతలను వంద టీఎంసీలు, వాటర్ గ్రిడ్‌ను 23.76 టీఎంసీలు, రాజపేట(0.35), చనాకా–కొరటా(5), పింపిరాడ్–పర్సోడా(1.2), రామప్ప లేక్ నుంచి పాకాల లేక్‌కు మూడు టీఎంసీలను తరలించే పనులు కొత్తగా చేపట్టింది. వెరసి 1,355 టీఎంసీలను వినియోగించుకోవడానికి ప్రాజెక్టులు చేపట్టింది. ► దీని వల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి. తక్షణమే అపెక్స్ కౌన్సిల్ జోక్యం చేసుకుని.. వాటి డీపీఆర్‌లను తెప్పించుకుని పరిశీలించాలి. గోదావరి జలాలను పంపిణీ చేయడానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి.. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలి. ► మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లు వాటా నీటిని వినియోగించుకోకపోవడం వల్లే గోదావరి 1,400 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు తేలింది. గోదావరిలో గరిష్టంగా 1990–91లో 6,472 టీఎంసీలు.. 2009–10లో కనిష్టంగా 1,025 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు రికార్డుల్లో తేలింది. ఈ లెక్కన ఏటా సగటున మూడు వేల టీఎంసీల మిగులు జలాలు ఉంటాయి. మిగులు జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీకి ఉంటంది. ఈ నీటిని కొత్త ప్రాజెక్టులకు కేటాయించాలి. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు సహకరించాలి ► తెలంగాణ నిర్వహిస్తోన్న నాగార్జునసాగర్, కాలువలకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.3,500 కోట్ల రుణం తెచ్చి ఆ«ధునికీకరించారు. ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తోన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 2009లో రికార్డు స్థాయిలో 26 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. దీని వల్ల ప్రాజెక్టు దెబ్బతింది. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని డ్యామ్ సేఫ్ట్ కమిటీ తనిఖీ చేసి.. శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడానికి రూ.900 కోట్లు అవసరమని తేల్చింది. ► ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఇది భారమవుతుంది. కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు వాటాలు వేసుకుని ఆ నిధులను సమకూర్చి.. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడానికి సహకరించాలి. ► జల వనరులను జాతీయ సంపదగా గుర్తించాలి. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు.. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నీటిని సమంగా సరఫరా చేసేలా చూడాలి. నదికి వరద వచ్చినప్పుడు.. ప్రతి 15 రోజులకు ఒక సారి సమీక్షించి.. వరదను దిగువకు విడుదల చేసేలా చూసి.. పరీవాహక ప్రాంతంలో ఉన్న అందరికీ వాటా మేరకు జలాలు దక్కేలా చూడాలి’ అని సీఎం జగన్ వివరించారు. అనంతరం ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ అందజేశారు. అప్పుడలా.. ఇప్పుడిలా.. 2016 సెప్టెంబరు 9న జరిగిన అపెక్స్ కౌన్సిల్లో కొత్తగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ద్వారా తమకు కేటాయించిన వాటా నీటిని వినియోగించుకోవడానికి పరిమితమవుతామని.. అదనంగా నీటిని వినియోగించుకోబోమని తెలంగాణ పేర్కొంది. ఇప్పుడు శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలను పీహెచ్‌ఆర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోసి.. పాత ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకించడాన్ని తెలంగాణ ఎలా సమర్థించుకుంటుంది? -
బోర్డుల పరిధి నోటిఫై చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి రెండు నదుల మేనేజ్మెంట్ బోర్డుల అధికార పరిధిని నోటిఫై చేసేందుకు నిర్ణయించామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. రెండు నదులపై చేపట్టే కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఎవాల్యుయేషన్ కోసం పంపడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని ఆయన చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి షెకావత్ అధ్యక్షతన ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశం మంగళవారం ఇక్కడి శ్రమశక్తి భవన్లో జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటలపాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ నుంచే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హైదరాబాద్ నుంచి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. సమావేశానంతరం జలశక్తి మంత్రిత్వశాఖ సలహాదారు శ్రీరామ్ వెదిరె, కార్యదర్శి యూపీ సింగ్, అదనపు కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీ, సంయుక్త కార్యదర్శి సంజీవ్ అవస్తీతో కలిసి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మీడియాతో మాట్లాడారు. ‘ఇరు రాష్ట్రాలను ఒకే వేదికపైకి తెచ్చి జల వివాదాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు వీలు కలిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ఇచ్చిన ఆజ్ఞను పాటించడంలో సఫలీకృతులమయ్యాం..’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక.. ‘గోదావరి, కృష్ణా నదుల అధికార పరిధిని కేంద్రం నోటిఫై చేయడానికి తెలంగాణ సీఎం వ్యతిరేకించారు. కానీ, చట్టప్రకారం దీనిపై ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేనందువల్ల రెండు నదుల మేనేజ్మెంట్ బోర్డుల అధికార పరిధిని నోటిఫై చేయాలని నిర్ణయించాం. ఇందుకు తెలంగాణ సీఎం కూడా సుముఖత వ్యక్తంచేశారు’.. అని షెకావత్ తెలిపారు. అలాగే.. ‘కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని సెక్షన్–3 కింద ట్రిబ్యునల్‌కు సూచించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అపెక్స్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్ కేసును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తీసుకెళ్లినందువల్ల ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉన్న అంశాన్ని ట్రిబ్యునల్‌కు సూచించడం వీలుకాదని తెలియచేయడంతో కేసీఆర్ ఆ కేసును వెంటనే ఉపసంహరించుకుంటామని చెప్పారు. అంతేకాక, లిఖితపూర్వక హామీ ఇచ్చిన తరువాత దానిని కొత్త ట్రిబ్యునల్‌కు పంపాలా లేక ప్రస్తుత ట్రిబ్యునల్‌కు పంపాలా అన్నదానిపై చట్టపరమైన సలహాలను తీసుకుని నిర్ణయిస్తాం. గోదావరి నది జలాల పంపిణీ వివాదాల పరిష్కారానికి మరో ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని రెండు రాష్ట్రాలు కోరాయి. ఇందుకు సంబంధించిన విజ్ఞప్తిని మరుసటి రోజే కేంద్రానికి పంపుతానని తెలంగాణ సీఎం తెలిపారు. కృష్ణానది మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించడానికి రెండు రాష్ట్రాలు కూడా ఆమోదం తెలిపాయి..’ అని షెకావత్ వివరించారు. ఏపీ సీఎంతో ఏకీభవించిన షెకావత్ అంతకుముందు అపెక్స్ సమావేశంలో.. కొత్త ట్రిబ్యునల్ ఇచ్చేంతవరకు ఏం మాట్లాడినా లాభంలేదని, తాను పంపించిన అంశాలు అజెండాలో లేవని కేసీఆర్ ప్రస్తావించారు. అయితే, ఆలస్యంగా వచ్చినందున ఆ అంశాలు రాలేదని, మరోసారి సమావేశమవ్వొచ్చని మంత్రి షెకావత్ సూచించారు. ఈ నేపథ్యంలో.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తాను పంపిన అభ్యంతరాలను కేసీఆర్ ప్రస్తావించారు. వీటిని ఏపీ సీఎం వైఎస్ జగన్ తిప్పికొట్టారు. గోదావరి నదిపై చేపడుతున్న కాళేశ్వరం, సీతారామసాగర్ తదితర ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విస్తరణ పేరుతో కొత్తగా ప్రాజెక్టులు చేపడుతోందని, ఏపీలో అదే రీతిలో తాము ప్రాజెక్టులు విస్తరిస్తే అభ్యంతరం ఎందుకని తన వాదన వినిపించారు. రెండు రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలనేది తన అభిప్రాయం అని చెప్పారు. కేంద్రమంత్రి ఈ వాదనలతో ఏకీభవించారు. ‘రెండూ ఒకేరీతిలో ఉండాలి. ఒకచోట ఒక విధానం మరొకచోట మరో విధానం ఉండరాదు..’ అని సూచించారు. అలాగే, పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌కు ఏపీ తరలిస్తోంది... ఇది అక్రమమని కేసీఆర్ చేసిన మరో వాదనను కూడా వైఎస్ జగన్ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా.. కేడబ్ల్యూడీటీ–1 తీర్పులోని 128వ పేజీని చదువుతూ.. ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్‌కు నీటిని తరలించడం న్యాయమేనని ఆ తీర్పు చెప్పిందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తుంగభద్ర హెచ్ఎల్సీ ద్వారా, కేసీ కెనాల్ ద్వారా ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు తరలించారని జగన్ గుర్తుచేశారు. సీబీఆర్, మైలవరం, సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు దశాబ్దాలుగా శ్రీశైలం నుంచి తరలిస్తున్నారని తెలిపారు. దేశంలో రావి, చినాబ్, సట్లెజ్ తదితర నదుల నుంచి కూడా నీటిని మళ్లీస్తున్న అంశాన్ని వైఎస్ జగన్ గుర్తుచేశారు. అనంతరం.. ‘డీపీఆర్‌లు సమర్పిస్తే ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల అభ్యంతరాలు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది..’ అని మంత్రి చెప్పగా.. ఇందుకు ఇద్దరు సీఎంలూ సమ్మతించారు. ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేసీఆర్ పట్టు అజెండా అంశాలపై జరిగిన చర్చలో.. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీకి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్–3ని అనుసరించి కొత్త ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలని తాము చేసిన అభ్యర్థనను పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే పట్టుపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదన సరిగ్గా వినలేదని, రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీపై లోతుగా అధ్యయనం జరగాలని కోరారు. దీనిపై షెకావత్ స్పందిస్తూ.. ‘వీటన్నింటినీ ట్రిబ్యునల్ ఒక్కటే పరిష్కరించలేదు.. మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుంది..’ అని సమాధానమిచ్చారు. అజెండాలో లేని అంశాలపై కేంద్రం అభిప్రాయం.. అజెండాలో లేని కొన్ని అంశాలపై కేంద్రం తన అభిప్రాయాన్ని సమావేశంలో పంచుకుంది. అవి.. ► కృష్ణా బేసిన్లో చాలా ప్రాజెక్టులున్నాయని, కానీ.. నదీ జలాలు మాత్రం పరిమితంగా ఉన్నాయని వివరించింది. ► ఉనికిలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని, తద్వారా మరిన్ని కొత్త ప్రాజెక్టులు పనిచేసేలా తిరిగి కేటాయింపులు జరపడం సాధ్యపడుతుందని అభిప్రాయపడింది. ► గోదావరి బేసిన్లో కొత్త ప్రాజెక్టులకు ప్రణాళిక చేసే ముందు.. అనుమతులున్న ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేయడం ద్వారా లభ్యత ఉన్న మొత్తం జలాలను సరిగ్గా వినియోగించుకోవాలని సూచించింది. ► గోదావరి–కృష్ణా–కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదన ఉన్నందున.. నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలపై శ్రద్ధ చూపాలి. ► ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌తోపాటు సాగునీటి శాఖ మంత్రి అనిల్‌కుమార్, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, సాగునీటి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. అజెండాలోని అంశాల వారీగా కేంద్రం ప్రతిపాదనలు.. 1 మొదటి అంశంపై కేంద్రమంత్రి వివరిస్తూ.. ‘బోర్డులు ఏర్పడి ఆరేళ్లయినప్పటికీ వీటి పరిధి నోటిఫై కాకపోవడానికి కారణం రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడమే. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీని నియంత్రించడం, కొత్త ప్రాజెక్టుల సాంకేతిక అనుమతులివ్వడం ఈ బోర్డుల విధి. అయితే వీటిని నోటిఫై చేయకపోవడం కారణంగా వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో నిర్ణయాధికారం కేంద్రానిదే అయినందున ప్రస్తుతం నోటిఫై చేసేందుకు నిర్ణయించాం. దీని ద్వారా రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు రక్షణ ఉంటుంది..’ అని వివరించారు. 2 అజెండాలోని రెండో అంశం కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించడం. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఆయా ప్రాజెక్టులను సాంకేతికంగా మదింపు చేసి ఆమోదించాల్సి ఉంటుంది. పునర్వ్యవస్థీకరణ చట్టం ఇచ్చిన ఆదేశాలతో సంబంధం ఉన్న ప్రాజెక్టులు.. అలాగే, అనుమతుల్లేని పాత ప్రాజెక్టుల డీపీఆర్‌లు కూడా సమర్పించాలి. తొలుత బోర్డులు సాంకేతిక మదింపు జరిపి సమ్మతించిన తరువాత అపెక్స్ కౌన్సిల్ వాటికి అనుమతిస్తుంది. కేడబ్ల్యూడీటీ–1 ద్వారా కేటాయింపులున్న ప్రాజెక్టులన్నింటినీ పాత ప్రాజెక్టులుగా పరిగణించాలి. ట్రిబ్యునల్స్ ద్వారా వాటికి కేటాయింపులు లేనిపక్షంలో.. కేడబ్ల్యూడీటీ–2 ద్వారా కేటాయింపులు తెచ్చుకోవాలి. ఈ రెండు కేటగిరీల్లో లేని ప్రాజెక్టులన్నీ కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలి. వీటి డీపీఆర్‌లు సమర్పించాలి. 3 రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల వాటా నిర్ధారించేందుకు యంత్రాంగం ఏర్పాటుచేయడం. రెండు రాష్ట్రాలు పరస్పరం వీటిపై ఫిర్యాదు చేసినందున అపెక్స్ కౌన్సిల్ సామరస్యంగా పరిష్కరించేందుకు ఒక మెకానిజం ప్రతిపాదించింది. గోదావరి జలాల విషయంలో రెండు ఆప్షన్లు ఇచ్చింది. రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారం ద్వారా లేదా కొత్త ట్రిబ్యునల్ నిర్ణయించడం ద్వారా గోదావరి జలాలు పంపిణీ చేసుకోవచ్చు. అలాగే, గోదావరి జలాలను కృష్ణా నదికి (పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి) మళ్లించినప్పుడు దాని నుంచి వాటా పంచేందుకు మెకానిజం ఏర్పాటుచేయాలి. 4 కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించేందుకు అంగీకారం కుదిరింది. -
ఆ అధికారం అపెక్స్ కౌన్సిల్‌దే: షెకావత్
సాక్షి, న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పూర్తిగా చర్చించామని, చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఒక పరిష్కారానికి వచ్చామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదులపై ఏ ప్రాజెక్ట్‌లు కట్టాలన్నా.. వాటికి అనుమతులు ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌దేనని షెకావత్ స్పష్టం చేశారు. (చదవండి: ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం) ‘‘కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల పరిధిని నోటిఫై చేయడంపై చర్చ జరిగింది. ఆరేళ్లుగా వివాదాల కారణంగా వీటిని నోటిఫై చేయలేదు. ఈ రోజు రెండు రాష్ట్రాల సీఎంల ఏకాభిప్రాయంతో వీటిని నోటిఫై చేస్తున్నాం. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట్‌లపై డీపీఆర్‌లను సమర్పించడానికి ఇరురాష్ట్రాల సీఎంలు ఒప్పుకున్నారని’’ షెకావత్ వెల్లడించారు. కృష్ణా, గోదావరి రివర్ బోర్డులకు ముందుగా డీపీఆర్‌లను సమర్పించిన తర్వాతనే కొత్త ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనలు తేవాలని చర్చించామని ఆయన పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీకి సంబంధించి సమగ్రమైన ప్రణాళికపై చర్చ జరిగిందని, కృష్ణా రివర్ బోర్డ్‌ను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించేందుకు ఇరురాష్ట్రాలు ఒప్పుకున్నాయని చెప్పారు. జల పంపిణీ వివాదంపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ ఒప్పుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ఈ అంశంపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పామని షెకావత్ తెలిపారు. త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం (రాష్ట్ర విభజన చట్టం) ప్రకారం “అపెక్స్ కౌన్సిల్” ఏర్పడిందని, నాలుగు సంవత్సరాల అనంతరం ఈ సమావేశం జరిగిందని షెకావత్ అన్నారు. 2016 లో తొలిసారి అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి నేతృత్వంలో “అపెక్స్ కౌన్సిల్” సమావేశం జరిగిందన్నారు. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకం, వివాదాల పరిష్కారం ఈ కౌన్సిల్ బాధ్యత అని పేర్కొన్నారు. సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, అన్ని సమస్యల పరుష్కర కోసం చాలా విపులంగా చర్చించామని ఆయన తెలిపారు. ఇద్దరు ముఖ్య మంత్రులూ సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నారని షెకావత్ వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు.. ►కేఆర్ఎంబీ,జీఆర్ఎంబీ బోర్డుల పరిధి నోటిఫై చేస్తున్నాం ►కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు పంపడానికి అంగీకారం ►న్యాయ సలహా తర్వాత కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీకి నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు పై నిర్ణయం ►సుప్రీం కోర్టు నుంచి కేసు ఉపసంహరణ చేస్తే నది జలాల పంపిణీ పై ట్రిబ్యునల్ ఏర్పాటు. కేసు ఉపసంహరణకు సీఎం కేసీఆర్ అంగీకారం ►కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయం ఆంధ్రాకు తరలింపు -
ఢిల్లీ: అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
-
ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ నుంచి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. సీఎం జగన్‌తోపాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్, కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం.. న్యాయబద్ధంగా నీటిని వాడుకోనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తన వాదన వినిపించినట్టు తెలిసింది. రాయలసీమ, ప్రకాశం దుర్భిక్ష ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడం.. రాయలసీమ, ఎత్తిపోతల పథకం ద్వారా పాత ఆయకట్టుకు నీటి తరలింపు విషయాలను ఆయన అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. (చదవండి: బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి సహకారం) ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం సీఎం జగన్ విమానాశ్రయానికి బయల్దేరారు. ఆయన వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బాలశౌరీ ఉన్నారు. -
బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి సహకారం
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తులకు నీటి అవసరాల కోసం బాలాజీ రిజర్వాయర్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమల ఆలయం వద్దకు చేసుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం షెకావత్ తిరుమలలోని పాపవినాశనం డ్యామ్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ బాలాజీ రిజర్వాయర్ నిర్మాణంపై ప్రభుత్వం నివేదిక పంపితే పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. -
ప్రాజెక్టు వివరాలు పంపితే సహకారం అందిస్తాం
సాక్షి, తిరుమల: తిరుమలలోని శ్రీవారిని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాపవినాశనం డ్యామ్‌ని రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి పరిశీలించారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనార్థం ప్రతి నిత్యం లక్షమంది భక్తులు తరలివస్తారని తెలిపారు. తిరుమలలో శాశ్వత ప్రాతిపదికన త్రాగునీటి సమస్యని పరిష్కరించేందుకు కళ్యాణి డ్యామ్ నుంచి నీటి తరలింపు ప్రకియ ప్రారంభించాలని టీటీడీ భావిస్తోందని పేర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వం నుంచి ప్రాజెక్టు వివరాలు పంపితే కేంద్రం నుంచి సహకారం అందించే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి త్రాగునీటిని అందించే ప్రాజెక్టు కింద నిధులు కేటాయించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. చదవండి: (శిల్పారామాలకు పరిపాలనా అనుమతులు జారీ) ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తిరుమలలో శాశ్వత ప్రాతిపాదికన త్రాగునీటి సమస్యని పరిష్కరించేందుకు రాష్ర్ట ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం చేపడుతోందని తెలిపారు. టీటీడీ వాటాకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం నుంచి నివేదిక పంపితే కేంద్రం సహకారం అందిస్తామని పేర్కోందని చెప్పారు. అదే విధంగా బీజేపీ అధికారిక ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో త్రాగునీటి సమస్యని శాశ్వత పరిష్కారం అందించేందుకు కేంద్రం సహకరించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. రాష్ట్రం నుంచి నివేదిక అందితే పరిశీలిస్తామని మంత్రి షేకావత్ హామి ఇచ్చారని చెప్పారు. -
పెండింగ్ నిధులు విడుదల చేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనతో పాటు కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేయాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని అభ్యర్థించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ రెండో రోజు బుధవారం కూడా ఉదయం 10 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి అందాల్సిన సాయంపై పూర్తి వివరాలతో ఓ వినతి పత్రం అందజేశారు. అందులోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయండి – కరోనా కారణంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడినందున స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రూ.2,253.52 కోట్లును వెంటనే విడుదల చేయాలి. – రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం కింద మొత్తం రూ.3,622.07 కోట్లను త్వరగా విడుదల చేయాలి. పోలవరం నిధులు విడుదల చేయాలి – 2020 ఏప్రిల్ వరకు పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12,016.07 కోట్లు ఖర్చు చేసింది. ఈ జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటి వరకు రూ.8,507.26 కోట్లు మాత్రమే రీయింబర్స్ చేసింది. మిగిలిన రూ.4,006.43 కోట్లను వెంటనే విడుదల చేయాలి. – పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్న రూ.15 వేల కోట్లకుగాను పోలవరం ప్రాజెక్టు అథారిటీ పేరున నాబార్డ్ నేరుగా రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేసేలా అనుమతించాలి. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు ఇవ్వాలి – వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఏడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.24,350 కోట్లతో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక(డీపీఆర్)ను ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. – ఏడు జిల్లాలకు ఆరేళ్లపాటు ఏటా రూ.50 కోట్లు చొప్పున మొత్తం రూ.2,100 కోట్లు ఇస్తామని చెప్పింది. అయితే ఇప్పటి వరకు రూ.1,400 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన రూ.700 కోట్లు వెంటనే ఇవ్వాలి. ద్రవ్యలోటు భర్తీ చేయాలి – 2014–15కు గాను రూ.22,948.76 కోట్లు ద్రవ్య లోటుగా లెక్కించి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం కేవలం రూ.4,117.89 కోట్లు మాత్రమే ద్రవ్య లోటుగా గుర్తించి, రూ.3,979.50 కోట్లు విడుదల చేసింది. – మిగిలిన రూ.138.39 కోట్లు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన మిగిలిన రూ.18,830.87 కోట్లను కూడా సానుకూల దృక్పథంతో పరిశీలించి విడుదల చేయాలి. – ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీకి 2013–14 నుంచి 2016–17 వరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సబ్సిడీ రూ.1,600 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖను ఆదేశించాలి. – కొత్త రాజధాని కోసం రూ.49,924 కోట్లకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు మాత్రమే ప్రకటించి, రూ.1,500 కోట్లు విడుదల చేసింది. మిగిలిన రూ.వెయ్యి కోట్లను వెంటనే విడుదల చేయాలి. ఉపాధి హామీ నిధుల బకాయిలు చెల్లించాలి – రాష్ట్ర ప్రభుత్వానికి బకాయి ఉన్న “ఉపాధి’ నిధులు రూ.3,740.53 కోట్లు వెంటనే విడుదల చేయాలి. అగ్రి క్లినిక్స్, ఏఎన్ఎం సబ్ సెంటర్ల నిర్మాణాన్ని ఈ పథకం పరిధిలో చేర్చాలి. – పేదలకు ఇళ్ల కోసం కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన 174.91 ఎకరాల ఉప్పు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అందుకు కనీస ధర చెల్లిస్తుంది. – డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునికీకరణ ప్రాజెక్టు కింద సమగ్ర భూసర్వే ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖ ఇస్తామన్న రూ.202.09 కోట్లు వెంటనే విడుదల చేయాలి. త్వరితగతిన పోలవరం చెల్లింపులు – పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధుల్లో తిరిగి చెల్లించాల్సిన వాటిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతిపాదించిన రూ.2,234.87 కోట్లకు ఆమోదం తెలిపి, ఆర్థిక శాఖకు సదరు ప్రతిపాదనలు పంపినందుకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. మరో రూ.1,771.39 కోట్ల రీయింబర్స్మెంట్ త్వరితగతిన విడుదలయ్యేలా చూడాలని కోరారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. – పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. మార్చిలోగా రూ.18 వేల కోట్లను విడుదల చేయాలని వి/æ్ఞప్తి చేశారు. నిర్వాసితులకు భూసేకరణ, పునరావాస చెల్లింపులను కూడా వేగవంతం చేయాలన్నారు. – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదిత గోదావరి–కృష్ణా–పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టును సందర్శించేందుకు కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్‌ను వచ్చే వారం పంపాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. గోదావరి–పెన్నా–కావేరి ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ వ్యయాన్ని భరించాలని కోరారు. – ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కమిటీ సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్టు అధికార వర్గాలు తెలిపాయి. సీఎం వెంట ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు ఉన్నారు. -
అమిత్ షాతో రెండోసారి సీఎం జగన్ భేటీ
-
రాష్ట్ర అభివృద్ధి అంశాలపై అమిత్ షాతో చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి సమావేశం అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం సాయంత్రం గంటపాటు అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. కాగా అంతకు ముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు వెచ్చించిన రూ.4 వేల కోట్ల మేర రీయింబర్స్ చేయాలని, పునరావాస సాయం త్వరితగతిన అందించాలని ఈ సందర్భంగా సీఎం జగన్ కోరారు. (కేంద్రమంత్రి షెకావత్‌తో సీఎం జగన్ భేటీ) -
కేంద్రమంత్రి షెకావత్‌తో సీఎం జగన్ భేటీ
-
త్వరలో జలశక్తి మంత్రి పోలవరం పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు అందించాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పర్యటకు రావాలని జలశక్తి మంత్రిని సీఎం జగన్ కోరగా, త్వరలోనే పోలవరం పర్యటనకు వస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే గోదావరి-కావేరి నధుల అనుసంధానంపైన కూడా చర్చ జరిగింది. నదుల అనుసంధానం అంశంపై రాష్ట్ర పర్యటనకు వెళ్లాలని టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వేదిరే శ్రీరామ్‌కు జలశక్తి మంత్రి షెకావత్ సూచించారు. సీఎం జగన్ వెంట వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా 2021 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. (ఏపీకి నిధులు ఇవ్వండి) కాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం హోం మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు దిశ చట్టం, శాసన మండలి రద్దు.. చట్ట రూపు దాల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి. -
పోలవరానికి వారంలో రూ.2,300 కోట్లు!
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో రూ.2,300 కోట్లను రీయింబర్స్మెంట్ చేసేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సోమవారం ఆయన సంబంధిత ఫైలుపై సంతకం చేసి ఆర్థిక శాఖకు పంపారు. బహిరంగ మార్కెట్లో బాండ్లద్వారా రుణాలను సేకరించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలని నాబార్డును కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించనుంది. వారంలోగా రూ.2,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశముందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ► పోలవరం కోసం 2014 ఏప్రిల్ 1వ తేదీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,177.62 కోట్లకు సంబంధించి లెక్కలు పక్కాగా ఉన్నట్లు నిర్ధారిస్తూ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఇచ్చిన ఆడిటెడ్ నివేదికను కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు ఇప్పటికే అందచేశారు. కోరిన వివరాలన్నీ అందచేసిన నేపథ్యంలో పోలవరాన్ని 2021 నాటికి పూర్తి చేసేలా నిధులు విడుదల చేసి సహకరించాలని కోరుతూ గత నెల 25న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. ► సీఎం జగన్ ఆదేశాల మేరకు సోమవారం ఢిల్లీలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, గోరంట్ల మాధవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌లతో కలిసి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌తో భేటీ అయ్యారు. పీపీఏ ప్రతిపాదించిన మేరకు రూ.2,300 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని, మిగతా రూ.1,758.02 కోట్లను మలిదఫాలో ఇస్తామని షెకావత్ హామీ ఇచ్చారు. వేగంగా రీయింబర్స్: మంత్రి అనిల్‌కుమార్ కేంద్ర మంత్రితో సమావేశానంతరం అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రూ.4 వేల కోట్ల రీయింబర్స్మెంట్ నిధులను త్వరితగతిన విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆర్థిక శాఖతో మాట్లాడి నిధులు త్వరగా విడుదలయ్యేలా చూస్తామని, రాష్ట్రానికి అన్నివిధాలా సహకారమందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని షెకావత్‌ను కోరామన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని త్వరలోనే నిర్వహిస్తామని షెకావత్ చెప్పారన్నారు. పునరావాసానికి సంబంధించి త్వరితగతిన నిధులిస్తే డిసెంబర్ 2021 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. -
పోలవరం అంచనా వ్యయం సవరణ రూ.47,725.74 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లకు సవరించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సోమవారం ఆయన సంతకం చేసి కేంద్ర ఆర్థికశాఖకు పంపారు. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ), కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ(ఆర్ఈసీ) ఇప్పటికే అంచనా వ్యయాన్ని సవరించేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ఫైలుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సంతకం చేయడం ఇక లాంఛనమే! వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం పనులపై నిపుణుల కమిటీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో దర్యాప్తు జరిపించి టీడీపీ సర్కార్ అవినీతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రక్షాళన చేశారు. ‘రివర్స్ టెండరింగ్’ ద్వారా ఇప్పటికే రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ధృఢ సంకల్పం, చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న నేపథ్యంలో అంచనా వ్యయం సవరించటాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సవరించిన అంచనా ఇలా... ► కేంద్ర జల్‌శక్తి శాఖ ఆమోదించిన సవరించిన అంచనాల ప్రకారం పోలవరం హెడ్‌వర్క్స్ వ్యయం రూ.9,734.34 కోట్లు. కుడి కాలువ వ్యయం రూ.2,865.75 కోట్లు, ఎడమ కాలువ వ్యయం రూ.2,720.8 కోట్లు, భూసేకరణ, సహాయ పునరావాస(ఆర్ఆర్) ప్యాకేజీ వ్యయం రూ.28,172.21 కోట్లు, 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) వ్యయం రూ.108 కోట్లుగా ఉంది. ► 2010–11 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ వ్యయం పెరగడం.. నిర్వాసితులకు పునరావాసంకోసం ఆర్ అండ్ ఆర్ వ్యయం పెరగడంతో 2017–18 ధరల ప్రకారం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకు చేరుకుంది. కేంద్రం నుంచి ఇంకా రావాల్సింది రూ.29,521.70 కోట్లు. గత సర్కారు నిర్వాకాలతో... ► విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నాటి కేంద్ర మంత్రి మండలి బడ్జెట్ ద్వారా నిధులను కేటాయించి విడుదల చేయాలని 2014 మే 28న నిర్ణయం తీసుకుంది. పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ను ఏర్పాటు చేసినా కమీషన్లకు కక్కుర్తిపడి, ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2016లో నాటి సీఎం చంద్రబాబు కోరారు. ఈ క్రమంలో 2017 సెప్టెంబరు 7న పోలవరం బాధ్యతను గత సర్కారుకు కేంద్రం అప్పగించింది. అయితే 2014 ఏప్రిల్ 1 తర్వాత పోలవరంలో నీటిపారుదల పనికి వ్యయం చేయాల్సిన నిధులను మాత్రమే ఇస్తామని మెలిక పెట్టింది. ఫలితంగా ఏప్రిల్ 1, 2014కు ముందు ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,135.87 కోట్లను కోల్పోవాల్సి వచ్చింది. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టుకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం స్పష్టం చేసింది. పారదర్శకత, చిత్తశుద్ధికి తార్కాణం.. ► రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును సాకారం చేసేందుకు 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. 2009 నాటికే కుడి, ఎడమ కాలువల పనుల్లో సింహభాగం పూర్తి చేశారు. హెడ్ వర్క్స్‌కు అవసరమైన భూసేకరణను కొలిక్కి తెచ్చారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడం ద్వారా శరవేగంగా పూర్తి చేసే క్రమంలో మహానేత హఠాన్మరణం చెందారు. ► విభజన నేపథ్యంలో జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించిన కేంద్రం వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేసి అప్పగిస్తామని చట్టంలో హామీ ఇచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును అక్రమార్జనకు ఏటీఎంలా మార్చుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇదే అంశాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించి చంద్రబాబు నైజాన్ని చాటారు. ► మార్చి 12, 2015న మొదటిసారిగా పీపీఏ సర్వసభ్య సమావేశంలో తాజా ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు తక్షణమే అందజేయాలని గత సర్కారును నాటి పీపీఏ సీఈవో దినేష్‌కుమార్ ఆదేశించారు. ► 2017–18 ధరల ప్రకారం రూ.57,940.86 కోట్లతో టీడీపీ సర్కారు పంపిన వ్యయ ప్రతిపాదనల్లో అక్రమాలను గుర్తించిన పీపీఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ► వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే పోలవరం పనులను ప్రక్షాళన చేసి శరవేగంగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. రివర్స్ టెండరింగ్‌తో అక్రమాలకు చెక్ పెట్టారు. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టడంతో జగ్మోహన్ గుప్తా నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఆర్ఈసీ పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా ఖరారు చేసి కేంద్ర జల్ శక్తి శాఖకు పంపింది. -
కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి అనిల్ కుమార్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, లావు కృష్ణ దేవరాయలు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ను సోమవారం కలిశారు. పోలవరం బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం వైఎస్ జగన్ ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారని తెలిపారు. 2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి అనిల్ కుమార్ వెల్లడించారు. పునరావాసం ప్యాకేజీని త్వరితగతిన సెటిల్ చేయాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని అనిల్ కుమార్ తెలిపారు. 4 వేల కోట్ల రూపాయల పోలవరం బకాయిలు త్వరితగతిన విడుదల చేస్తామని మంత్రి గజేంద్ర సింగ్ హామినిచ్చారని పేర్కొన్నారు. జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీని కేంద్రం నిర్ణయిస్తే మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అనిల్‌కుమార్ స్పష్టం చేశారు. (చదవండి: ఎందుకు.. ఏమిటి.. ఎలా?) -
ఎందుకు.. ఏమిటి.. ఎలా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రెండు టీఎంసీలకు అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రభుత్వం చేపడుతున్న పనులపై కేంద్రం లేఖాస్త్రం సంధించింది. ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించి ఒక్కో అంశాన్ని ఆరా తీస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్, పర్యావరణ అనుమతులు, వ్యయా లపై వరుసగా లేఖలు సంధిస్తున్న కేంద్రం, రెండ్రోజుల కిందట ఆయకట్టు వివరాలు కోరగా, తాజాగా గురువారం అదనపు టీఎంసీ పనులను గత పనులకు భిన్నంగా చేపట్టడంపై వివరణ కోరుతూ లేఖ రాసింది. ఒక్కొక్కటిగా వివరాల సేకరణ... కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా పనులు పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొండపోచమ్మసాగర్ వరకు బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులు పూర్తవగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్, గంధమల్ల, బస్వాపూర్, వాటి కాల్వల పనులు పూర్తి కావాల్సి ఉంది. రెండు టీఎంసీల తరలింపు పనులకు కేంద్రం రూ.80,190 కోట్లకు అనుమతులు ఇవ్వగా, ఇందులో ఇప్పటికే రూ.55 వేల కోట్ల మేర ఖర్చు చేసింది. ఈ పనులు కొనసాగుతుండగానే, కృష్ణా బేసిన్లో నీరందని ప్రాంతాలకు సైతం కాళేశ్వరం ద్వారానే గోదావరి జలాలు అందించేలా అదనపు టీఎంసీ పనులు చేపడుతోంది. ఈ పనులపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు సైతం దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. డీపీఆర్‌లపై బోర్డు, కేంద్రం రాసినా స్పందన లేకపోవడంతో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేరుగా లేఖలు రాశారు. ఇందులో రెండు టీఎంసీల నీటిని తరలింపునకే కేంద్రం అనుమతి ఇచ్చిందని, అదనపు టీఎంసీ పనులకు అనుమతి లేదన్న అంశాన్ని లేవనెత్తారు. దీనికి కొత్తగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. అనంతరం పర్యావరణ అనుమతులపై కేంద్ర జలశక్తి శాఖ మరో లేఖ రాయగా, అనంతరం ప్రాజెక్టుకు తొలుత నిర్ధారించిన అంచనా వ్యయం, సవరించిన అంచనా వ్యయాలు, ఇప్పటివరకు చేసిన ఖర్చుల వివరాలను సమర్పించాలని కోరింది. ఈ లేఖ రాసిన వారం రోజుల వ్యవధిలో మూడు రోజుల కిందటే తాము 98 రోజులపాటు రోజుకు రెండు టీఎంసీల చొప్పున 195 టీఎంసీల ఎత్తిపోతలకు అనుమతిచ్చామని, దీనికి అదనంగా రోజుకు మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రతిపాదన చేశారో, లేదో తెలపాలని కోరుతూ లేఖ రాసింది. అదనపు టీఎంసీతో అదనంగా సాగులోకి వచ్చే ఆయకట్టు లేక స్థిరీకరణ ఆయకట్టు, జిల్లాల వారీగా ఆ ఆయకట్టు వివరాలు చెప్పాలని ఆదేశించింది. దీంతో పాటే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, వరద కాల్వ, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలను కోరింది. ఇది రాసిన రెండ్రోజులకే గురువారం మరో లేఖ రాసింది. ఇప్పటికే చేపట్టిన రెండు టీఎంసీల నీటి తరలింపునకు గ్రావిటీ కెనాల్, టన్నెళ్ల వ్యవస్థల ద్వారా నీటి తరలింపు చేపట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం అదనంగా టీఎంసీ నీటిని తీసుకునేందుకు చేపట్టిన పనులను మాత్రం పాత విధానంలో కాదని, పైప్‌లైన్ ద్వారా ప్రెషర్‌మెయిన్ వ్యవస్థ ఏర్పాటు చేసి తరలించడానికి కారణాలు ఏంటని ప్రశ్నించింది. ప్రెషర్ మెయిన్ వ్యవస్థను ఎంచుకునేందుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర వరుస లేఖల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్ని వివరాలను సేకరించి పెట్టుకుంటోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేక జాతీయ సత్వర సాగునీటి ప్రాయోజిక కార్యక్రమం (ఏఐబీపీ)లో చేర్చి ఆర్థికసాయం చేయాలని పదేపదే కోరుతున్నా స్పందించని కేంద్రం, అదనపు టీఎంసీ పనుల వివరాలపై లేఖలు రాయడం మాత్రం విస్మయానికి గురి చేస్తోందని జల వనరుల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
అపెక్స్ కౌన్సిల్ భేటీ మరోసారి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం మరోసారి వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల కమిటీ భేటీ వాయిదా పడిందని సమావేశం తేదీని త్వరలో వెల్లడిస్తామని కేంద్ర జలశక్తి శాఖ ఆదివారం ఓ ప్రకటన చేసింది. కాగా కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం కావాల్సి ఉంది. అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు కరోనా పాజిటివ్ రావడంతో మంగళవారం జరగాల్సిన భేటీ వాయిదా పడింది. -
కరోనా బారిన పడ్డ మరో కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. సెలబ్రిటీలు, సామాన్యుల అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరోకరు చేరారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన స్వయంగా వెల్లడించారు. ‘కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లాను. కరోనా టెస్ట్ చేయించాను. రిపోర్టులో పాజిటివ్ అని వచ్చింది. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో జాయిన్ అయ్యాను. గత వారం రోజుల నుంచి నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి. హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ గజేంద్ర సింగ్ షేకావత్ హిందీలో ట్వీట్ చేశారు. अस्वस्थता के कुछ लक्षण दिखने पर मैंने कोरोना टेस्ट करवाया और मेरी रिपोर्ट पॉजिटिव आई है। डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि गत दिनों में मेरे संपर्क में जो लोग आये हैं वह स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं। आप सभी स्वस्थ रहें और अपना ध्यान रखें। — Gajendra Singh Shekhawat (@gssjodhpur) August 20, 2020 ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 69,652 కేసులు నమోదు కాగా.. 977 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28,36,926గా ఉండగా 53,866 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 6,86,395 యాక్టీవ్ కేసులు ఉండగా.. 20,96,664 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 58,794 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 73.91 శాతం ఉండగా.. మరణాల రేటు 1.9 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలపింది. -
సీమ ఎత్తిపోతల.. మా వాటా వాడుకోడానికే
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చాలంటే శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించడం మినహా ఏపీకి వేరే దారి లేదు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా నీటిని వినియోగించుకుని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకే ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ చేపట్టామని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 7న షెకావత్ రాసిన లేఖకు వైఎస్ జగన్ ప్రత్యుత్తరమిచ్చారు. రాయలసీమ ఎత్తిపోతలతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులు కొత్తవి కావని తేల్చిచెప్పారు. కేడబ్ల్యూడీటీ(కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్)1 చేసిన కేటాయింపులు, 2015లో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల ప్రకారం మా వాటా నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి చేపట్టిన ప్రాజెక్టులేనని స్పష్టం చేశారు. ఈ పథకం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కొత్తగా కాలువలు తవ్వడం, నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలుగానీ, అదనపు ఆయకట్టుగానీ చేర్చడం లేదన్నారు. ఇప్పటికే ఉన్న కాలువల ద్వారా పాత ప్రాజెక్టు కింద ఆయకట్టును స్థిరీకరించడం కోసమే దీన్ని చేపట్టామన్నారు. ఎన్జీటీ(చెన్నై బెంచ్) నియమించిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ, కేంద్ర ప్రభుత్వం కూడా రాయలసీమ ఎత్తిపోతల ద్వారా పాత ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లందించడానికే చేపట్టారని నిర్ధారించాయని గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కానే కాదన్నారు. తెలంగాణ సర్కార్ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులను ఆపేలా నియంత్రించకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకుని రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టడానికి అవకాశం కల్పించాలని వి/æ్ఞప్తి చేస్తూ అపెక్స్ కౌన్సిల్ ఛైర్మన్, జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సీఎం వైఎస్ జగన్ మంగళవారం లేఖ రాశారు . సీఎం జగన్ లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ఈనెల 4న మీకు లేఖ పంపాం.. ► అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆగస్టు 5న నిర్వహించాలనిచైర్మన్ నిర్ణయించినట్లు అజెండాను పంపుతూ జూలై 28న Æరాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. ఈ సమాశానికి నేను హాజరవుతానని తెలియచేస్తూ అజెండా అంశాల మేరకు కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక పంపాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించాం. ఆ మేరకు ఈ నెల 4న కేంద్ర జల్ శక్తి శాఖకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. అయితే ఈనెల 7న మీరు రాసిన లేఖలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై ఏపీ ప్రభుత్వం స్పందించలేదని పేర్కొనడంలో వాస్తవం లేదన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నా. ► రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం నుంచి రోజుకు ఎనిమిది టీఎంసీలు తరలించేవి కొత్త ప్రాజెక్టులని మీరు రాసిన లేఖలో పేర్కొన్నారు. కానీ.. ఆ ప్రాజెక్టులు కొత్తవి కావు. కేడబ్ల్యూడీటీ1 కేటాయింపులు, 2015లో ఇరు రాష్ట్రాలకు చేసిన పంపకాల ప్రకారం వాటా నీటిని సమర్థంగా వినియోగించుకోవటానికే వీటిని చేపట్టాం. అనుమతులు లేకుండానే పలు ప్రాజెక్టులు.. ► విభజన చట్టం సెక్షన్ 85(8)డీ ప్రకారం ట్రిబ్యునల్ కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టు, విభజన నాటికి పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టుపై ప్రతికూల ప్రభావం చూపదని కృష్ణా, గోదావరి బోర్డులు నిర్థారించాక, సాంకేతిక అనుమతి తీసుకున్న తరువాతే కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి. ► కానీ తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పాలమూరురంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు చేపట్టింది. ఈ పథకాల కింద కొత్తగా కాలువలు తవ్వుతోంది. నీటి నిల్వ సామర్థ్యం ఉండే రిజర్వాయర్లు నిర్మిస్తోంది. కొత్త ఆయకట్టును సృష్టిస్తోంది. ఈ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా వివాదాన్ని అపెక్స్ కౌన్సిల్ పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆ మేరకు సెప్టెంబరు 21, 2016లో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. తీర్పు నోటిఫై కాకున్నా పనులు.. ► కేడబ్ల్యూడీటీ2లో కేటాయించిన నీటిని వాడుకోవడానికే పాలమూరురంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు చేపట్టామంటూ తెలంగాణ సర్కార్ సమర్థించుకుని పనులను కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా కేడబ్ల్యూడీటీ 2 తీర్పు నోటిఫై కాకున్నా పనులు కొనసాగిస్తోంది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి మరో సారి అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలని నిర్ణయించినా ఆ ప్రాజెక్టుల పనులను నిలిపేయాలని కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశాన్ని నిర్వహించాలని.. తెలంగాణ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివాదాన్ని పరిష్కరించాలని పలుమార్లు కోరినా ఇప్పటిదాకా నిర్వహించలేదు. ► శ్రీశైలానికి కృష్ణా ప్రవాహం చేరడానికి ముందే జూరాల ప్రాజెక్టు నుంచి బీమా, కోయిల్‌సాగర్, నెట్టంపాడు ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కారు నీటిని తరలిస్తోంది. శ్రీశైలం నుంచి 800 అడుగుల్లోనే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని వినియోగించుకుంటోంది. ► శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీలను తలించడానికి తెలంగాణసర్కార్ కొత్తగా నాలుగు ప్రాజెక్టులను చేపట్టింది. 796 అడుగుల నుంచే ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 42 వేల క్యూసెక్కులను తరలించే అవకాశం తెలంగాణకు ఉంది. కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కి ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం నుంచి దిగువకు తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తోంది. దీని వల్ల కేడబ్ల్యూడీటీ1 చట్టబద్ధంగా ఏపీకి ఇచ్చిన వాటా నీటిని కూడా వాడుకోలేని పరిస్థితి నెలకొంది. పోతిరెడ్డిపాడు ప్రత్యేకమైన ప్రాజెక్టు కాదు.. ► పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది ప్రత్యేకమైన ప్రాజెక్టు కాదు. శ్రీశైలం నుంచి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, గాలేరునగరి ప్రాజెక్టుల ఆయకట్టుతోపాటు చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడానికి చేసిన ఏర్పాటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. శ్రీశైలంలో 881 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించే వీలుంది. కానీ.. ప్రాజెక్టులో ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి పది నుంచి 15 రోజులు కూడా ఉండటం లేదు. నీటి మట్టం 854 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కేవలం ఏడు వేల క్యూసెక్కులను మాత్రమే తరలించడానికి సాధ్యమవుతుంది. నీటి మట్టం అంతకంటే తగ్గితే కృష్ణా బోర్డు కేటాయింపులు ఉన్నా సరే.. నీటిని వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. బోర్డు ఆదేశాలకు భిన్నంగా తెలంగాణ పనులు.. ► శ్రీశైలంలో 800 అడుగుల నుంచి నీటిని తరలించడానికి తెలంగాణ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు మే 14న మేం లేఖ రాశాం. ఆ ప్రాజెక్టుల పనుల్లో ముందుకెళ్లొద్దని మే 30న తెలంగాణ సర్కార్నుబోర్డు ఆదేశించినా Ðవాటిని కొనసాగిస్తోంది. ఆ ప్రాజెక్టుల ద్వారా కేవలం వాటా నీటిని మాత్రమే వినియోగించుకుంటామని.. అంతకు మించి వాడుకోబోమని తెలంగాణ సర్కార్ ఎక్కడా చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 854 అడుగులకుపైనే నీటిని తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెప్పడం ఎంతవరకూ న్యాయం? గోదావరి బేసిన్లో కూడా.. ► గోదావరి బేసిన్లో కూడా తెలంగాణ సర్కార్ కొత్త ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే పనులు చేపట్టాలని గోదావరి బోర్డు సమావేశంలో చర్చించాం. మా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం.. ► రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌ను నియంత్రిస్తున్నట్లుగా తెలంగాణకు మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నాం. ► రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కానేకాదని ఎన్జీటీ(చెన్నై బెంచ్) నియమించిన కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ, కేంద్ర ప్రభుత్వం నివేదిక తమ అభిప్రాయాలు చెప్పాయి. గత నెల 29న ఈ పథకానికి అనుమతి ఇస్తూ కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతి పత్రాలను మీకు పంపుతున్నాం. -
రాయలసీమ ఎత్తిపోతల పాతదే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం షెకావత్ రాసిన లేఖకు జగన్ నేడు సమాధానమిచ్చారు. ఏపీ స్పందన లేదంటూ ఈనెల 7న షెకావత్ రాసిన లేఖ కరెక్ట్ కాదని సీఎం అభిప్రాయపడ్డారు. కృష్ణానదీ జలాల ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నట్లు జగన్ చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతవాటికి కొనసాగింపు మాత్రమే అన్నారు. అదనంగా నీటి మళ్లింపు, నీటి నిల్వ, అదనపు ఆయకట్టు లేదని సీఎం స్పష్టం చేశారు. పునర్వ్యవస్థీకరణ చట్టంప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. (కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దు) కేఆర్ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌లు చేపడుతోందని సీఎం జగన్ ఆరోపించారు. కృష్ణానదిపై తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లకు సంబంధించి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు ఆయన లేఖలో తెలిపారు. ఆ రెండు ప్రాజెక్ట్‌లు తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థను, ఆయకట్టును సృష్టిస్తున్నాయన్నారు. మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన నీటి వాటాకు బద్దులై ఉంటామని తెలంగాణ చెప్పిందన్నారు. కానీ తర్వాత మాట మార్చి పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు. ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్ కౌన్సిల్ తెలంగాణను ఆదేశించలేదన్నారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనైనా ఈ అంశాలు పరిష్కారమవుతాయని భావించాను అన్నారు. కానీ రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగకుండా ఆగిపోయిందని లేఖలో సీఎం జగన్ తెలిపారు. -
కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో బోర్డులు, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద ప్రాజెక్టులపై ఈ నెలలో నిర్వహించే రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి వివాదాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి శుక్రవారం ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. కాళేశ్వరం మూడో టీఎంసీ పనులకూ అనుమతులు తీసుకోవాలని లేఖలో తెలంగాణకు తేల్చిచెప్పిన కేంద్ర మంత్రి... రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేయాలని ఏపీకి సూచించారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని కోరినా స్పందించలేదని ఇరు రాష్ట్రాలకు రాసిన లేఖల్లో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఎజెండాను పంపలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం సహా ఏడు ప్రాజెక్టులు ఆపేయండి గోదావరిపై అపెక్స్ కౌన్సిల్, గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా కాళేశ్వరం సహా ఏడు ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేయాలని ఆదేశించారు. ‘అపెక్స్ కౌన్సిల్, గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై కాళ్వేరం, గోదావరి ఎత్తిపోతల పథకం మూడో దశ, సీతారామ ఎత్తిపోతల, తుపాకులగూడెం, లోయర్ పెన్‌గంగపై బ్యారేజీలు, రామప్ప లేక్ నుంచి పాకాల లేక్‌కు మళ్లింపు పథకాలు చేపట్టిందని, వాటి వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని మే 14న గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీడబ్ల్యూసీ సలహా కమిటీ జూన్ 2018లో 2 టీఎంసీల తరలింపునకే అనుమతి ఇచ్చింది. కానీ ఆ పథకాన్ని విస్తరించి 3 టీఎంసీలు తరలిస్తున్నారని, వాటికి ఆమోదం లేదనే అంశాన్ని తెలంగాణ సర్కార్ గుర్తుపెట్టుకోవాలి. కొత్త పనులకు కేంద్ర అనుమతులు తీసుకోవాలి’అని షెకావత్ సూచించారు. ‘విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేపట్టిన ఏడు ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ మే 30న గోదావరి బోర్డు లేఖ రాసింది. జూన్ 5న నిర్వహించిన గోదావరి బోర్డు 9వ సమావేశంలో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను వారంలోగా అందజేయాలని.. వాటిని సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్‌కు పంపుతామని స్పష్టం చేసింది. డీపీఆర్‌లు పంపాలని జూన్ 10న మరోసారి గోదావరి బోర్డు గుర్తుచేసింది. కానీ ఇప్పటిదాకా డీపీఆర్‌లు ఇవ్వలేదు’అని షెకావత్ పేర్కొన్నారు. ఏపీ అభ్యంతరాల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోకుండా, గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఆ ప్రాజెక్టుల పనులను చేపట్టవద్దంటూ తెలంగాణ సర్కార్‌ను షెకావత్ ఆదేశించారు. ‘రాయలసీమ’టెండర్లు ఆపండి.. అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా శ్రీశైలం ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి రోజుకు 6–8 టీఎంసీలను తరలించేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, వాటి టెండర్లను ఆపాలని కేంద్ర మంత్రి షెకావత్ ఏపీ సీఎం జగన్‌కు రాసిన లేఖలో ఆదేశించారు. ‘రాయలసీమ ఎత్తిపోతల పనులు పూర్తయితే తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ మే 12న కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో కృష్ణా బోర్డు... రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఇతర పనుల విషయంలో ముందుకెళ్లొద్దంటూ ఏపీ ప్రభుత్వానికి మే 20న లేఖ రాసింది. జూన్ 4న నిర్వహించిన బోర్డు సమావేశంలో కృష్ణా నదిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను వారంలోగా ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. వాటిని సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్‌కు పంపుతామని సూచించింది. కానీ ఇరు రాష్ట్రాలు ఇప్పటిదాకా డీపీఆర్‌లు ఇవ్వలేదు’అని షెకావత్ పేర్కొన్నారు. ఇదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ టెండర్‌పై తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోకుండా ప్రాజెక్టుల పనులు చేపట్టొద్దన్నారు. ఇతర పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం, వాటిని అప్పగించడం చేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
ఎమ్మెల్యేల కొనుగోలులో కేంద్రమంత్రికి నోటీసులు
జైపూర్: రాజస్తాన్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు పన్నుతున్నారని, ఈ విషయంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సంబంధం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయంలో ఆయనను ప్రశ్నించనున్నారు. దీనికి సంబంధించిన ఆయనకు నోటీసులు పంపించారు. ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలతో షకావత్ బేరసారాలు ఆడిన ఒక ఆడియో బయటకు వచ్చి సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. (తీర్పుపై ఉత్కంఠ: అర్థరాత్రి హైడ్రామా) దీనిపై షకావత్ స్పందిస్తూ ‘నేను ఈ విషయంలో ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ఆడియోలో ఉన్నది నా గొంతు కాదు. నన్ను ప్రశ్నించడానికి రమ్మంటే తప్పకుండా వెళతాను’ అని షెకావత్ తెలిపారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు సచిన్ పైలట్ క్యాంప్‌లోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి కుట్ర చేస్తున్నారని గత వారం కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేయగానే పోలీసులు ఇద్దరిపై ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. అందులో ఒకరు గజేంద్రసింగ్ షకావత్. దీనిపై స్పందించిన బీజేపీ తమ పార్టీలోని వివాదాలను కప్పి పుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తోందని మండిపడింది. ఫోన్ కాల్స్‌ను ట్రాప్ చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ ఆడియో టేపులకు సంబంధించి విచారణ జరిపాలని సీఎం ఆశోక్ గ్లెహాట్ పోలీసులను ఆదేశించారు. (రాజస్తాన్ రాజకీయ రచ్చ.. రంగంలోకి అమిత్ షా) -
రసవత్తరంగా రాజస్తాన్ డ్రామా
జైపూర్: రాజస్తాన్‌లో రాజకీయ డ్రామా రోజుకో మలుపుతో ఆసక్తికరంగా సాగుతోంది. గహ్లోత్ సర్కారుకు ముప్పు తొలగిన నేపథ్యంలో.. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తాజాగా, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు సంబంధించినవిగా పేర్కొంటూ రెండు ఆడియో టేప్‌లను సాక్ష్యాలుగా చూపింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ టేప్‌ల ఆధారంగా ఎమ్మెల్యేలను ప్రలోభపర్చి, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నేత, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, తిరుగుబాటు వర్గ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, వ్యాపారవేత్త సంజయ్ జైన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జైన్‌ను బీజేపీ నేతగా పేర్కొంది. షెకావత్, భన్వర్‌లాల్, సంజయ్ జైన్లను తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మహేశ్ జోషి చేసిన ఫిర్యాదు మేరకు.. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) వారిపై భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని దేశద్రోహం, కుట్రకు సంబంధించిన 124–ఏ, 120–బీ సెక్షన్ల కింద రెండు కేసులను నమోదు చేసింది. అయితే, ఎఫ్ఐఆర్లో కేంద్ర మంత్రి అనే ప్రస్తావన లేకుండా గజేంద్ర సింగ్ అని మాత్రమే పేర్కొంది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర మంత్రి షెకావత్ స్పందించారు. ఆ ఆడియో టేప్‌ల్లో వినిపించిన స్వరం తనది కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. మరోవైపు, తనతో పాటు తన వర్గం ఎమ్మెల్యేలు 18 మందిపై స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసుల విషయంలో తిరుగుబాటు వర్గం నేత సచిన్ పైలట్‌కు కాస్త ఊరట లభించింది. ఆ నోటీసులను సవాలు చేస్తూ పైలట్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఆ అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పీకర్ హైకోర్టుకు విన్నవించారు. మరోవైపు, తిరుగుబాటు ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌లను పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. వారికి షోకాజ్ నోటీసులను జారీ చేసింది. ఈ ఆడియో టేప్‌లే సాక్ష్యం అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందనేందుకు కీలక ఆధారాలు లభించాయని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ప్రకటించారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, బీజేపీ నేత సంజయ్సింగ్లకు సంబంధించిన రెండు ఆడియో టేప్‌లను సాక్ష్యాలుగా చూపారు. ఆ టేప్ల్లోని సంభాషణ పూర్తి వివరాలను మీడియాకు చదివి వినిపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు పాల్పడిన ఈ ముగ్గురిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ‘బీజేపీకి ఎమ్మెల్యేల జాబితా ఇవ్వాలి’ అని ఆ టేప్‌ల్లో పేర్కొనడంపై తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గహ్లోత్‌కు వసుంధర సాయం! గహ్లోత్ ప్రభుత్వం కూలిపోకుండా బీజేపీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సాయం చేశారా? గహ్లోత్‌ను వీడి వెళ్లవద్దని ఎమ్మెల్యేలను ఆమె కోరారా?.. ఈ ప్రశ్నలకు అనూహ్యంగా అవుననే సమాధానమిస్తోంది బీజేపీ మిత్రపక్షం ఒకటి. సీఎం అశోక్ గహ్లోత్, వసుంధర రాజేల మధ్య అంతర్గత అవగాహన ఉందని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ చీఫ్, లోక్‌సభ సభ్యుడు హనుమాన్ బెణివాల్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్వయంగా రాజేనే ఫోన్ చేసి గహ్లోత్‌కు మద్దతివ్వాలని కోరుతున్నారని బెణివాల్ పేర్కొన్నారు. హైకోర్టులో పైలట్‌కు ఊరట తిరుగుబాటు నేత సచిన్ పైలట్, ఆయన వర్గ ఎమ్మెల్యేలు 18 మందికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఎమ్మెల్యేలుగా వారి అనర్హతపై మంగళవారం సాయంత్రం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పీకర్ సీపీ జోషి శుక్రవారం హైకోర్టుకు తెలిపారు. పార్టీ విప్‌ను ధిక్కరించి, సీఎల్పీ భేటీకి గైర్హాజరు కావడంతో పాటు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడిన ఆరోపణలపై శుక్రవారం లోగా వివరణ ఇవ్వాలని పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ జోషి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటీసులను సవాలు చేస్తూ పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు విచారణను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మొహంతి, జస్టిస్ ప్రకాశ్ గుప్తాల ధర్మాసనం విచారించింది. ౖò అనర్హతకు సంబంధించి షోకాజ్ నోటీసులను జారీ చేసే అధికారం స్పీకర్‌కు ఉంటుందని, ఈ విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదని సింఘ్వీ వాదించారు. అనర్హత నోటీసులపై మంగళవారం సాయంత్రం వరకు ఏ చర్య తీసుకోబోమని స్పీకర్ జోషి ధర్మాసనానికి తెలిపారు. అనంతరం కేసు విచారణ సోమవారం ఉదయానికి వాయిదా పడింది. హరియాణాలో హై డ్రామా ఆడియో టేప్‌ల వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో.. బహిష్కృత ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మను ప్రశ్నించడంతో పాటు, ఆయన స్వర నమూనాలను సేకరించేందుకు హరియాణాలోని గురుగ్రామ్‌లోని మానెసర్‌లో ఉన్న ఒక హోటల్‌కు రాజస్తాన్ పోలీసులు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. అయితే, వారిని లోపలికి వెళ్లకుండా, హరియాణా పోలీసులు గంటపాటు అడ్డుకున్నారు. -
రాజస్తాన్‌లో టేపుల పర్వం
రాజస్తాన్‌లో నాలుగురోజులనాడు రాజుకున్న రాజకీయ సంక్షోభంలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర జరిగిందని, అందులో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ప్రధాన పాత్ర పోషించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ రెండు ఆడియో టేపులు విడుదల చేసింది. ఈ విషయంలో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) పోలీస్ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు ప్రస్తుతం హర్యానాలోని గుర్గావ్లో సచిన్ పైలట్ శిబిరంలో వున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మను ప్రశ్నించడానికి శుక్రవారం అధికారులను పంపింది. అక్కడ రెండు రాష్ట్రాల పోలీసుల మధ్యా కాసేపు కొనసాగిన తమాషా దేశమంతా గమనించింది. సరిగ్గా రాజస్తాన్ సంక్షోభం మొదలైన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆదాయం పన్ను విభాగం అధికారులు ఐటీ దాడులు నిర్వహిస్తే... ఇప్పుడు రాజస్తాన్ పోలీస్ విభాగం కూడా ఆ మాదిరి ‘కర్తవ్యాన్నే’ నిర్వర్తించడానికి హరియాణా తరలివెళ్లింది. పైలట్ వర్గీ యులు కొలువుదీరిన అయిదు నక్షత్రాల హోటల్‌కి వెళ్లబోయిన నలుగురు ఎస్ఓజీ అధికారులను అడ్డగించడానికి 200మంది హరియాణా పోలీసులు అక్కడ పహారా కాశారు. ఈ పరిణామాలన్నీ చూశాక సాధారణ పౌరులకు ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరుపై ఏవగింపు కలిగితే ఆశ్చర్యం లేదు. ఆడియో టేపులపై దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే భన్వర్‌లాల్ శర్మ, సంజయ్ లతోపాటు కేంద్రమంత్రి షెఖావత్‌ను కూడా అరెస్టు చేయాలన్నది కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా డిమాండు. అలాగని ఎస్ఓజీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఎవరి పేర్లూ లేవు. ‘కొందరు వ్యక్తుల’ ఫోన్ సంభాషణలుగానే అందులో ప్రస్తావించారు. సంక్షోభం ముదిరి, ఆడియో టేపులు బయటి కొచ్చి ఇంత వివాదం రేగుతున్నా సచిన్ పైలట్ ఇంకా కాంగ్రెస్ నేతగానే వున్నారు. కాంగ్రెస్‌ను విడనాడలేదని ఆయన చెబుతున్నారు. ఇంతవరకూ పార్టీ ఆయన్నుగానీ, ఆయన అనుచరులను గానీ బహిష్కరించలేదు. కనుకనే మీ అంతర్గత కలహాలను చక్కదిద్దుకోలేక మాపై బురదజల్లుతారేమని బీజేపీ ప్రశ్నిస్తోంది. చూసేవారికి ఇది సహేతుకమన్న అభిప్రాయం కలుగుతుంది. ఈ వివాదానికంతకూ మూలకారణం ఎక్కడుందో, ఏ పరిణామాలు దానికి దారితీశాయో అందరికీ తెలుసు. కాంగ్రెస్ తన ఇంటిని సకాలంలో చక్కదిద్దుకుంటే సమస్య ఇంతవరకూ వచ్చేది కాదన్నది వాస్తవం. ఆ వివాదాన్ని బీజేపీ చాకచక్యంగా ఉపయోగించుకుంటున్నదన్న అభిప్రాయం ఏర్పడటానికి కారణం పైలట్ వర్గం వెళ్లి ఆ రాష్ట్రంలో తలదాచుకోవడమే. ఇందులో తమకేమీ సంబంధం లేకపోతే హరియాణా ప్రభుత్వం అయిదు నక్షత్రాల హోటల్ ముందు అంత హడావుడి చేసేది కాదని అందరికీ తెలుసు. రాజస్తాన్‌లో విపక్షంగా వుంటున్న బీజేపీ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలపై ప్రశ్నిస్తే, వాటిపై ఉద్యమిస్తే అది ఆ పార్టీకి మేలు చేస్తుంది. పాలక పక్షంలోని అంతః కలహాలను సాకుగా తీసుకుని ఏం చేయడానికి ప్రయత్నించినా దాని ప్రతిష్టను మసకబారుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వెల్లడించిన రెండు ఆడియో టేపులు అసలా, నకిలీయా అన్నది ఫోరెన్సిక్ నిపు ణులు ఎటూ తేలుస్తారు. సంక్షోభాలు తలెత్తినప్పుడు, బలాబలాల సమస్య ఎదురైనప్పుడు రాజ కీయాల్లో డబ్బు ప్రమేయం లేకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా గోడదూకుళ్లకు సిద్ధపడతారని ఇప్పుడెవరూ నమ్మే పరిస్థితి లేదు. రాజకీయ బేరసారాలకు సంబంధించిన టేపులు బయటపడటం కొత్తేమీ కాదు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎంపీలు పార్టీ ఫిరాయించినప్పటినుంచి ఇలా సాక్ష్యాధారాలు అడపా దడపా బయటికొస్తూనే వున్నాయి. కానీ ఇంతవరకూ ఆ కేసుతోసహా ఏ కేసులోనూ నిందితులకు శిక్ష పడలేదు. ఎక్కడివరకో అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 2015లో కీలకపాత్ర పోషించిన ‘ఓటుకు కోట్లు’ కేసుకు ఏ గతి పట్టిందో అందరికీ తెలుసు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వద్దకు లక్షల రూపాయల కరెన్సీ కట్టలు పట్టుకొచ్చిన రేవంత్ రెడ్డి అప్పట్లో బాబుకు అత్యంత సన్నిహితుడు. ఫోన్లో చంద్రబాబు ఏమేం మాట్లాడారో చెప్పే సంభాషణల టేపుంది. రేవంత్ రెడ్డి స్వయంగా పట్టుకొచ్చిన నోట్లకట్టలు, ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వీడియోలో రికార్డయ్యాయి. అయినా ఆ కేసు ఇంకా ఎటూ తేలలేదు. ఇప్పుడు రాజస్తాన్ టేపులకు కూడా అదే గతి పట్టొచ్చు. ఈ తీరు మన చట్టబద్ధ పాలనను నవ్వులపాలు చేస్తుంది. కేసుల్లో ప్రముఖ నేతల ప్రమేయం వుంటే చట్టాలు కళ్లూ చెవులు మూసుకుంటాయన్న అభిప్రాయం స్థిరపడిపోతుంది. రాజస్తాన్ సంక్షోభానికి ఎవరినో నిందించడానికి బదులు కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసు కోవాల్సివుంది. ఆ పార్టీని చాకచక్యంగా నడపడంలో, పార్టీ శ్రేణులకు స్ఫూర్తినిచ్చి వారిని ముందుకు ఉరికించడంలో విఫలమైన అధినాయకత్వం కారణంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీలో అంతర్గత కలహాలు ముదిరాయి. అధికారం వున్నచోట సహజంగానే అవి మరింత ఎక్కువగా వున్నాయి. వీటిని సకాలంలో గమనించి సరిచేయడంలో విఫలమైనందుకే రాజస్తాన్‌లో సచిన్ పైలట్ వర్గం తిరుగుబాటును ఎంచుకుంది. నాలుగు నెలలక్రితం మధ్యప్రదేశ్‌లో బీజేపీ పావులు కదిపిన పర్యవసానంగా అధికారాన్ని చేజార్చుకున్న కాంగ్రెస్, ఇప్పుడు రాజస్తాన్‌లో దాన్ని పునరావృతం కానీయరాదన్న పట్టుదలతో పనిచేస్తున్నట్టు కనబడుతోంది. ఆ రాష్ట్రంలో ముఠా కలహాల నివారణకు సకాలంలో మేల్కొనని అధినాయకత్వం ఇప్పుడు మాత్రం అధికారాన్ని నిలుపుకోవడంపై సర్వ శక్తులూ ఒడ్డుతోంది. అన్ని రాష్ట్రాల్లాగే రాజస్తాన్‌లో కూడా కరోనా తీవ్రత ఎక్కువే వుంది. దాన్ని ఎదుర్కొనడానికి సర్వశక్తులూ ఒడ్డి పోరాడాల్సిన సమయంలో రాష్ట్రంలో రాజకీయ రగడ రేగడం ఆశ్చర్యకరం. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న ప్రయత్నాలవల్ల వ్యవస్థల పరువు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగిస్తున్నది ఇదే. -
రాజస్ధాన్ హైడ్రామా: ఎక్కడి నుంచి తెచ్చారు?
జైపూర్: రాజస్ధాన్‌లో రాజకీయ హైడ్రామా కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్, కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేతో కలిసి కుట్ర పన్నారని ఆడియో టేప్‌లను బయటపెట్టిన కాంగ్రెస్‌పై కాషాయ నేతలు విరుచుకుపడ్డారు. తమ పార్టీ సీనియర్ నేతలపై రాజస్దాన్ పోలీస్ ఎస్ఓజీకి పాలక పార్టీ ఫిర్యాదు చేయడంపై దీటుగా స్పందించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌తో పాటు తమ సొంత పార్టీ వారిపై కాంగ్రెస్ ప్రతినిధి ఆరోపణలు చేయడం అర్థరహితమని రాజస్ధాన్ బీజేపీ రాష్ట్ర చీఫ్, అంబర్ ఎమ్మెల్యే డాక్టర్ సతీష్ పునియా వ్యాఖ్యానించారు. ఈ ఆడియో టేపులను కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి రాబట్టిందని ప్రశ్నించారు. సీఎం కార్యాలయం నుంచే లోకేష్ శర్మ అనే వ్యక్తి ఈ టేప్ లీక్ చేశారనే సమాచారం ఉందని పునియా ఆరోపించారు. కాంగ్రెస్ చర్యలు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో ప్రస్తావించిన సంజయ్ జైన్ బీజేపీ నేత కాదని, ఆయన కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ వ్యాధితో రాష్ట్రంలో 500 మందికి పైగా మరణించారని అన్నారు. మరోవైపు అంతర్గత కుమ్ములాటల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ రొంపిలోకి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను లాగేందుకు ప్రయత్నిస్తోందని రాజస్ధాన్ అసెంబ్లీలో విపక్ష నేత, బీజేపీ నాయకుడు గులాబ్ చంద్ కటారియా ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు ప్రభుత్వ యంత్రాంగాన్ని కాంగ్రెస్ నేతలు వాడుకున్నారని దుయ్యబట్టారు. ఈ టేపులు రాజస్ధాన్‌లో వాటర్‌గేట్ కుంభకోణం జరిగిందని చాటుతోందని బీజేపీ నేత, ఎమ్మెల్యే రాజేంద్ర రాథోడ్ ఆరోపించారు. టేపులు రికార్డు చేసిన లోకేష్ శర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వెల్లడించిన ఆడియో టేప్‌ల్లో వాయిస్ తనది కాదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇప్పటికే తోసిపుచ్చారు. చదవండి : అది నకిలీ ఆడియో