
షెకావత్‌కు స్వామివారి చిత్రపటాన్ని అందజేస్తున్న వైవీ సుబ్బారెడ్డి
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తులకు నీటి అవసరాల కోసం బాలాజీ రిజర్వాయర్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమల ఆలయం వద్దకు చేసుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం షెకావత్ తిరుమలలోని పాపవినాశనం డ్యామ్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ బాలాజీ రిజర్వాయర్ నిర్మాణంపై ప్రభుత్వం నివేదిక పంపితే పరిశీలించి చర్యలు చేపడతామన్నారు.