
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో శనివారం భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు సాగింది. కృష్ణా, గోదావరి జలాల అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, జాతీయ హోదా గుర్తింపుపై షెకావత్‌కు కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
చదవండి: Civils Topper Sreeja సివిల్స్‌లో మెరిసిన వరంగల్ యువతి శ్రీజ