delhi tour
-
TG: కాంగ్రెస్ ముఖ్యనేతలకు అధిష్టానం పిలుపు.. ఎందుకంటే..?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ రోజు(సోమవారం) మధ్యాహ్న సమయంలో సీఎం రేవంత్ తో పాటు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీకి పయనమయ్యారు.. తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ విస్తరణ, భారత్ సంవిధాన్ కార్యక్రమాలకు సంబంధించి సీఎం రేవంత్, పలువురు మంత్రులను ఢిల్లీకి బయల్దేరి రమ్మని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈరోజు(సోమవారం) సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో వీరు సమావేశం కానున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తోంది.వచ్చే నెలలో సీఎం రేవంత్ విదేశీ పర్యటనఏప్రిల్ లో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 23 వరకూ జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. అయితే ఈ లోపే డీ లిమిటేషన్ పై హైదరాబాద్ లో మీటింగ్ నిర్వహించే యోచనలో ఉన్నారు రేవంత్. -
ఢిల్లీ వెళ్లనున్న CM రేవంత్ రెడ్డి
-
కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ
ఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ చర్చించారు. సీఎం వెంట తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ స్టేజి -2కు సంబంధించి భూసేకరణ, వివాదాలు 18,189 కోట్ల రూపాయల పెండింగ్ పనులు గురించి రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది.ప్రధానంగా కృష్ణా జలాల అంశంపై కేంద్ర జలశక్తి మంత్రికి వివరించారు. దీనిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాలను ఏపీ అన్యాయంగా తరలించుకుపోతోందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశం అనంతరం పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏమన్నారంటే..కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందినాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి ఏపీ తీసుకెళుతున్న అధిక జలాలను ఆపాలని కోరాంకేంద్రం అత్యవసర జోక్యం చేసుకుని అన్యాయాన్ని ఆపాలిఏపీ తీసుకెళుతున్న పదివేల క్యూసెక్కుల నీటిని అయిదువేలకు తగ్గిస్తామని కేంద్రమంత్రి చెప్పారుఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు మేము అభ్యంతరం చెప్పాంఏపీ నుంచి ఎటువంటి నివేదిక రాలేదని, ఈ అంశంలో తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటాంకృష్ణా ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణకు ఎక్కువ నీరు ఇచ్చేలా సహకరించాలని కేంద్రాన్ని కోరాంపాలమూరు రంగారెడ్డి, సమ్మక్క సారక్క, సీతారామ సాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, నిధులు ఇవ్వాలని అడిగాంకృష్ణా నదిలో శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా ఇతర ప్రాజెక్టులలో టెలీ మెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలిటెలీమెట్రీల కోసం తెలంగాణ, ఆంధ్రా వాటా ఖర్చు కూడా మేమే భరిస్తామని చెప్పాముఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారుఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు 50 ఏళ్ల పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరాంమేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులపై NDSA - నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ నుంచి నివేదిక త్వరగా ఇవ్వాలని కోరాంతెలంగాణ జల వనరుల విషయంలో సీఎం రేవంత్, నేను కేంద్రం వద్ద మా వాదన బలంగా వినిపించాంకృష్ణా జలాల వివాదంలో రోజువారీగా కేంద్రం జోక్యం చేసుకుంటామని హామీ ఇచ్చిందిదీర్ఘకాలికంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ త్వరితగతిన విచారణ పూర్తిచేయాలని కోరాంతుమ్మడిహట్టి దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రతిపాదించి పనులు మొదలు పెట్టనున్నాంప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రంతో చర్చించాంకేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భూసేకరణ విషయంలో సహకరించాలని కోరాము -
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో శనివారం భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలతో సహా పలు కీలకాంశాలపై రాహుల్‌తో సుమారు 45 నిమిషాలపాటు చర్చించారు. పీసీసీ నూతన కార్యవర్గం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలు.. తదితర అంశాలతో వీళ్ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే.. కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన నేపథ్యంలో వాటి గురించి రాహుల్‌కు సీఎం రేవంత్ వివరించినట్లు సమాచారం. తెలంగాణలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దానికి ముఖ్యఅతిథిగా రావాలని రాహుల్‌ను రేవంత్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏఐసీసీ(AICC) అగ్రనేతలతో భారీ బహిరంగ సభలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. పొలిటికల్ మైలేజ్ వచ్చేలా.. సూర్యాపేటలో బీసీ కులగణన, మెదక్‌లో ఎస్సీ వర్గీకరణ భారీ సభలు నిర్వహించాలనుకుంటోంది. ఇదిలా ఉంటే.. రేవంత్ విషయంలో అధిష్టానం అసంతృప్తిగా ఉందని, ఈ కారణం చేతనే రాహుల్ గాంధీతో ఆయనకు గ్యాప్ నెలకొందనే ప్రచారం నడిచింది. అయితే.. అదంతా ఉత్త ప్రచారమేనని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కొట్టిపారేయగా, తాజాగా రాహుల్‌తో భేటీ అనంతరం సీఎం రేవంత్ కూడా స్వయంగా ఖండించారు. -
రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక పరిణామాలు
-
ఢిల్లీకి సీఎం రేవంత్..మంత్రివర్గ విస్తరణపై ఫోకస్..!
సాక్షి,హైదరాబాద్: ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ(ఏఐసీసీ) నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం(జనవరి14) సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం,పీసీసీ అధ్యక్షుడు ఏఐసీసీ నేతలను రేవంత్‌రెడ్డి కలిసే అవకాశముంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై రేవంత్‌రెడ్డి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.కాగా,ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ అధికారులు 16న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు. ఈనెల 19 వరకు సింగపూర్‌లో పర్యటించనున్న వీరు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు చేసుకుంటారు. వీటితో పాటు కొత్త పెట్టుబడులపై సీఎం బృందం సింగపూర్‌లో పారిశ్రామిక వేత్తలతో చర్చించనుంది. సింగపూర్ పర్యటన తర్వాత ఈనెల 20 నుంచి 22 వరకు రేవంత్‌రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు.గతేడాది కొత్తగా సీఎం అయిన తర్వాత రేవంత్‌రెడ్డి తొలిసారిగా దావోస్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా మంతత్రివర్గ విస్తరణపై చర్చ జరగడం సాధారణమైపోయింది. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినప్పటికీ ఇప్పటికీ మంతత్రి వర్గ విస్తరణ జరగలేదు. మంత్రి వర్గ విస్తరణ కోసం ఇటు కాంగగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు, అటు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో కొందరు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. -
చల్లపుచ్చుకుని ముంత దాచుకుంటున్న పవన్!
చల్లకొచ్చి ముంత దాచుకోవడం అనే సామెత ఒకటుంది. ఆ సామెత వెనుక ఓ బుల్లి కథ కూడా ఉంది. ఓ ఊళ్లో ఆదెమ్మ, సోదెమ్మ అనే ఇద్దరున్నారు. ఇద్దరూ ఇరుగు పొరుగువారే. ఆదెమ్మకు ఏదైనా అవసరం వస్తే మొహమాటమూ సిగ్గు లేకుండా సోదెమ్మను అడిగి పుచ్చుకుంటుంది. కానీ సోదెమ్మకు కాస్త సిగ్గు ఎక్కువ. ఓసారి సోదెమ్మకు చల్ల (మజ్జిగ) కావాల్సి వచ్చింది. ఇంట్లో నిండుకున్నాయి. మొగుడికేమో మజ్జిగ చుక్క లేకపోతే ముద్ద దిగదు. అందుకని వేరే గత్యంతరం లేక చేతిలో ఓ ముంత పట్టుకుని ఆదెమ్మ దగ్గరకు వెళ్లింది. ‘రా రా సోదెమ్మక్కా.. ఏంటి సంగతులు’ అని అడిగింది ఆదెమ్మ. సోదెమ్మకు చల్ల అడగాలంటే సిగ్గేసింది. ముంతను కొంగు చాటున దాచుకుంది. కాసేపు కబుర్లు చెప్పి ఖాళీ ముంతతోనే తిరిగి ఇంటికి వెళ్లింది. భోజనంలోకి మజ్జిగ లేనందుకు మొగుడితో తిట్లు కూడా తినింది. ..ఇదీ కథ!ఏదైనా పనిమీద ఒకరి వద్దకు వెళ్లినప్పుడు, ఏ పనిగా వచ్చామో చెప్పకుండా దాచుకుంటే, మొహమాటపడితే పని జరిగేదెలాగ? కాబట్టి కార్యార్థవై ఉన్నప్పుడు మొహమాటం తగదని ఈ సామెత చెబుతుంది. ఈ సామెత నీతి డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ కు కూడా తెలుసు!కానీ పవన్ కల్యాణ్ రూటే సెపరేటు. ఆయన చల్లకోసం వస్తారు. మొగమాటలం లేకుండా అడిగి పుచ్చుకుంటారు. కానీ.. తాను పొరుగింట్లో చల్ల అరువు పుచ్చుకున్న సంగతి మరెవ్వరికీ తెలియకూడదని మాత్రం అనుకుంటారు. చల్ల పుచ్చుకున్న తర్వాత ఆ ముంతను.. దాచిపెట్టుకుని, గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోవాలని అనుకుంటారు. తమ మధ్య కేవలం కబుర్లు మాత్రమే సాగాయని వాడలోని ఇతరుల్ని మభ్య పెట్టాలని అనుకుంటారు. ఆయన అటు ఢిల్లీ, ఇటు ఉండవిల్లీ నేతలతో సాగిస్తున్న భేటీల మర్మం అలాగే కనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మూడు రాజ్యసభ ఎంపీ సీట్లకు ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో తన వ్యవహారాలన్నీ చూసుకున్న అన్నయ్య నాగబాబును ఎంపీగా రాజ్యసభకు పంపాలని పవన్ కోరిక. అడిగితే కాదనేంత సీన్ చంద్రబాబుకు లేదుగానీ.. ఈసారే ఇస్తారా.. నెక్ట్స్ టైం అంటారా అనేది అనుమానం. అందుకే ముందుగా ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షాలతో చర్చలు జరిపి.. తన మనోవాంఛను వారి ఎదుట చెప్పుకున్నారు. మూడింటిలో ఒక ఎంపీ సీటు కోసం బిజెపి పట్టుపట్టకుండా ఉంటే.. తాను దక్కించుకోవచ్చునని ముందుగా అక్కడ చక్రం తిప్పారు. తీరా ఇవాళ చంద్రబాబు ఉండవిల్లి నివాసానికి వెళ్లి మాట తీసుకునే ప్రయత్నం చేశారు.బాబు వద్దకెళ్లడమూ మాట పుచ్చుకోవడమూ అయింది. అయితే తాను ఎంపీ సీటు కోసం వీరందరి ఇళ్లకూ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నానని ప్రజలకు తెలియరాదు– అనేది ఆయన కోరిక. అంటే చల్ల పుచ్చుకోవాలి గానీ.. ఆ సంగతి ఇతరులకు మాత్రం తెలియద్దన్నమాట.పైకి మాత్రం.. కాకినాడ బియ్యం స్మగ్లింగ్ గురించి బాబుతో చర్చించినట్లుగా, రాష్ట్ర ప్రయోజనాలు సాధించడం గురించి ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేసినట్టుగా.. బాహ్య ప్రపంచానికి ఆయన డప్పు కొట్టుకుంటున్నారు. తాను అన్నయ్య నాగబాబు ఎంపీ సీటు కోసమే తిరుగుతున్నట్టుగా జనం గుర్తిస్తే పలుచన అవుతానని భయపడుతున్నారో ఏమో పాపం!.. ఎం. రాజేశ్వరి -
పవన్ చేష్ట.. ఓవరాక్షనా? కక్ష సాధింపా? అనుభవ రాహిత్యమా?
సినిమాల్లో హీరో ఎన్ని విన్యాసాలైనా చేయవచ్చు కానీ.. నిజజీవితంలో మాత్రం అలా చేయడం సాధ్యం కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సినిమా, నిజజీవితాల మధ్య తేడా పెద్దగా తెలిసినట్లు కనిపించడం లేదు. లేదంటే అతడిది ఓవర్‌యాక్షన్ అయినా అయిఉండాలి. కాదంటే అనుభవ రాహిత్యమా? కక్ష సాధింపా? ఈ మాటలన్నీ అనాల్సి వచ్చేందుకు కారణం.. పవన్‌కళ్యాణ్ ఇటీవలి ఢిల్లీ పర్యటన! ఇందులో ఆయన ప్రధాని నరేంద్రమోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. మర్యాదపూర్వకంగానో.. తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధించిన వారితోనో కలిస్తే సమస్య లేదు. కానీ రాజకీయ విశ్లేషకులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యేలా ఆయన ఎవరెవరినో కలిసివచ్చారు. పవన్ తన ఢిల్లీ పర్యటన ద్వారా తానూ చంద్రబాబు ఒకటేనని చెప్పదలచినట్టుగా కనిపిస్తోంది. ఢిల్లో బాబు కంటే తనమాటకే ఎక్కువ విలువ, పలుకుబడి ఉన్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నమూ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కాకినాడ పోర్టును సందర్శించిన వైనం, అక్కడ ఆయన చేసిన షో కూడా అందులో ఒక భాగం కావచ్చు. బీజేపీ పెద్దలు చేసిన సూచనల మేరకే పవన్ కళ్యాణ్ తనకు పవర్ ఉందని ప్రజలను నమ్మించేందుకు పోర్టు వద్దకు వెళ్లారని, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, తనకంటే సీనియర్ అయిన టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును కూడా కొంత కించపరిచేలా వ్యవహరించారని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలోనే ఆయన ఏపీలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఆయన చెప్పకనే చెప్పేశారు కూడా. ఆ రకంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని గబ్బు పట్టిస్తూనే, మరో వైపు ఆ గబ్బుతో తనకు సంబంధం లేదన్నట్లుగా పవన్ నటిస్తున్నారా అన్న సందేహం వస్తోంది. చంద్రబాబు సమక్షంలో అతి వినయం, అతి విధేయత చూపుతూ, అవసరానికి మించి ఆయనను పొగిడే పవన్ కళ్యాణ్ బయట మాత్రం తానే సూపర్ సీఎం అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారా అన్న సంశయం వస్తోంది. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ప్రభుత్వంలో మొత్తం పెత్తనం చేస్తున్నారని అంతా అనుకుంటున్న సమయంలో తనకు కూడా పవర్ ఉందని చెప్పుకోవడానికి పవన్ తంటాలు పడ్డారా అన్న ప్రశ్న వస్తుది. మరో సంగతి కూడా చెబుతున్నారు. పోర్టు యాజమన్యంపై ఉన్న కక్ష తీర్చుకోవడానికి అక్కడకు వెళ్లి ఉండవచ్చని అంటున్నారు. మరుసటి రోజు పోర్టును నిర్వహిస్తున్న అరబిందో సంస్థపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేయడమే ఇందుకు నిదర్శనం. కాకినాడ పోర్టు వద్ద సుమారు 640 టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతోందని జిల్లా కలెక్టర్ గుర్తించి స్వాధీనం చేసుకుంటే, వపన్ కళ్యాణ్ వెళ్లాక మళ్లీ సీజ్ చేసినట్లు చూపే యత్నం చేశారట. జనసేనకే చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడ పవన్ కళ్యాణ్ నటన చూసి బిత్తరపోవడం మినహా ఏమీ చేయలేక పోయారు. నిజానికి పవన్ కన్నా రాజకీయాలలో మనోహర్‌కు చాలా అనుభవం ఉంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మనోహర్ 2004లోనే ఎమ్మెల్యే. ఆ తర్వాత ఉప సభాపతిగా, సభాపతిగా బాధ్యతలు నిర్వహించారు. అనూహ్య పరిణామాలలో జనసేనలో చేరారు. ఇప్పుడు మంత్రి అయ్యారు. కానీ పవన్ తీరుతో ఆయన బిక్కచచ్చినట్లు నిలబడిపోయారా అన్న భావన కలుగుతోంది. మనోహర్ ఇప్పటికి పలుమార్లు కాకినాడ వెళ్లి పోర్టు ద్వారా అక్రమంగా ఎగుమతి అయ్యే రేషన్ బియ్యం గురించి పలుమార్లు మాట్లాడారు. అధికారులను అప్రమత్తం చేశారు. ఎంత మంత్రి ఆదేశాలు ఇచ్చినా, ఇలాంటివి కొన్ని జరుగుతూనే ఉంటాయి. వాటిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటూనే ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ.పవన్ పౌరసరఫరాల శాఖలో వేలుపెట్టి ఇలా కెలకడం అంటే నాదెండ్లను ఒకరకంగా అవమానించినట్లే అవుతుందేమో! వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై ఉన్న ద్వేషంతో కూడా పవన్ కళ్యాణ్ ఇదంతా చేస్తున్నారని అందరికి తెలుసు. పవన్ ఈగోని సంతృప్తిపరచడానికి మంత్రి మనోహర్ తన వంతు ప్రయత్నం చేశారు.కాని ద్వారంపూడి అసలు బియ్యం ఎగుమతి వ్యాపారం నుంచే తప్పుకోవడంతో వీరికి దొరకడం లేదని అంటారు. ఆ ఫ్రస్టేషన్ లో నేరుగా ఆ విషయం చెప్పలేక పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లు అనిపిస్తుంది. కాకినాడ పోర్టులో కొన్ని దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగుతున్నాయి. అక్కడ ఎప్పుడూ తీవ్రమైన నేరాలు జరిగిన ఫిర్యాదులు లేవు. ఆ మాటకు వస్తే విశాఖ ఓడరేవుకు శాసనసభ ఎన్నికలకు ముందు పాతిక వేల క్వింటాళ్ల మేర మాదకద్రవ్యాలు వచ్చాయన్న వార్త పెద్ద కలకలం రేపింది. ఆ కేసును సీబీఐ టేకప్ చేస్తుందని అన్నారు. ఆ కేసు ఏమైందో తెలియదు. దీనిపై పవన్ ఎన్నడూ నోరు విప్పలేదు. అక్కడకు వెళ్లలేదు.ప్రశాంతంగా ఉండే కాకినాడ వెళ్లి రచ్చ చేసి వచ్చారు. తత్ఫలితంగా కాకినాడ పవన్ ఓడరేవు విశ్వసనీయతను దెబ్బతీశారు. తిరుమల లడ్డూపై చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పిచ్చి ఆరోపణలు చేసి ఆ దేవాలయం పవిత్రతను దెబ్బతీశారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి.ఇప్పుడు కాకినాడ ఓడరేవు వంతు వచ్చింది. పవన్.. కాకినాడ పోర్టు స్మగ్లర్ల అడ్డాగా ఉందని, బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా? అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి, ప్రధాని కార్యాలయ దృష్టికి తీసుకెళతానని చెప్పారు ఆయన. కీలకమైన సమాచారం ఏదైనా ఉంటే నేరుగా కేంద్రానికి తెలియచేసి చర్యలు తీసుకోవాలి తప్ప, ఇలా బాధ్యత లేకుండా మాట్లాడడం ఏమిటో? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పోర్టుల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ దళాలు సముద్రంలో నిరంతరం కాపలా కాస్తుంటాయి. ఈ విషయం పవన్‌కు తెలియదా? బియ్యం లేదా మరో సామగ్రి అక్రమంగా ఎగుమతి అవడం వేరు.. ఏకంగా ఆయుధాలు రావడం, ఉగ్రవాదులు చొరబడడం వేరు. ఈ సంగతులు ఏమీ కేంద్రానికి తెలియవన్నట్లుగా పవన్ మాట్లాడి, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల పరువు తీసినట్లు అనిపిస్తుంది. ఓడరేవులలో కొన్ని అక్రమ కార్యకలాపాలు జరుగుతుండవచ్చు.నిర్దిష్ట సమాచారంతో సంబంధిత నేరగాళ్లను పట్టుకుంటారు. ఉదాహరణకు గుజరాత్ లోని ముంద్రా రేవులో పలుమార్లు డ్రగ్స్ పట్టుబడ్డాయి. కస్టమ్స్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ మాటకు వస్తే దేశంలోని పలు విమానాశ్రయాలలో కూడా బంగారం, ఇతర వస్తువులు కొన్ని అక్రమంగా దిగుమతి అవుతుంటే అధికారులు పట్టుకుంటుంటారు. అయినా జాగ్రత్తలు చెప్పడం వేరు. మన ప్రతిష్టను మనమే దెబ్బ తీసుకోవడం వేరు. పవన్ చెప్పింది ఎలా ఉందంటే కాకినాడ వద్ద అంతా ఫ్రీ గా ఉనట్లు, రక్షణే లేనట్లు ,ఉగ్రవాదులు ఎవరైనా చొరబడే అవకాశం ఉందన్న సమాచారం ఇచ్చినట్లు ఉంది. ఇలా మాట్లాడడం అంత తెలివైన చర్య కాదని చెప్పాలి. ఆర్డీఎక్స్ వంటివి కూడా దిగుమతి కావచ్చని చెప్పడం అంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వ శాఖల సమర్థతను డైరెక్టుగా అనుమానించడమే.ఎన్నికల ముందు ఏపీలో 31వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ అబద్దపు ఆరోపణ చేసి, ఆ తర్వాత దాని గురించే మాట్లాడకుండా పవన్ తన నిజస్వరూపం తెలియచేశారు. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారా? లారీల ద్వారా అక్రమ బియ్యం కాకినాడ పోర్టుకు చేరుతున్నదంటే ఏమిటి దాని అర్థం? రాష్ట్రంలోని ఆయా రహదారులలో ఉండే సివిల్ సప్లై చెక్ పోస్టులు లేదా వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టులు సరిగా పనిచేయడం లేదనే కదా! అధికారులు నిద్రపోతున్నట్లో, లేక కుమ్మక్కు అయినట్లు చెప్పడమే కదా! కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు బియ్యం స్మగ్లింగ్ జరగబోదని చెప్పినా, ఇలా ఎందుకు జరుగుతోంది.అంటే చంద్రబాబు ప్రభుత్వం, మంత్రి నాదెండ్ల మనోహర్, పోలీసు శాఖ విఫలం అయిందని పవన్ ఒప్పుకున్నట్లేనా? జిల్లా మంత్రిగా ఉన్న ఆయన కూడా విఫలమైనట్లేనా? తను వస్తున్నానని తెలిసి ఎస్పీ సెలవు పెట్టి వెళ్లారని పవన్ అన్నారట. ఆయన ఎందుకు అలా చేశారో తెలుసుకోవాలి. ఏదైనా సొంత పని ఉండి వెళ్లారా? లేక తెలిసి, తెలియక పవన్ మాట్లాడే వాటికి సమాధానం ఇవ్వడం కష్టం అని వెళ్లారో చూడాలి. ఏపీలో సాగుతున్న విధ్వంసకాండ, హత్యలు, అత్యాచారాలపై స్పందించలేని పవన్ కళ్యాణ్, పోర్టులో ఏదో జరిగిపోతుందని మాట్లాడడం విడ్డూరమే. తాడిపత్రి, జమ్మలమడుగు కూటమి నేతలు చేస్తున్న బూడిద దందా గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది కదా! కొద్ది కాలం క్రితం ప్రజలు ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారని, హోం మంత్రి అనిత ఏమి చేస్తున్నారని అడుగుతూ, తానే ఆ శాఖ తీసుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఎలా మాట మార్చేసింది చూశాం. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును అధికారుల సమక్షంలోనే మందలించినట్లు మాట్లాడి చిన్నబుచ్చారు. వీటన్నిటి ద్వారా తాను చంద్రబాబు సమానమే అన్నట్లుగా పవన్ ప్రవర్తిస్తున్నారు. నిజంగా ఆ ధైర్యం ఉంటే మంచిదే. తప్పు లేదు. కానీ ఆ వెంటనే చంద్రబాబు దగ్గకు వెళ్లగానే జారిపోతున్నారు. అది అసలు సమస్య. ప్రభుత్వ వైఫల్యాలతో తనకు నిమిత్తం లేనట్లుగా, సూపర్ సిక్స్ హామీల ఊసే ఎత్తకుండా కథ నడుపుతూ ప్రజలను మభ్య పెట్టడానికి ఇలాంటి వేషాలన్నీ వేస్తే సరిపోతుందా? అక్రమాలు ఎక్కడా జరిగినా నిరోధించాల్సిందే. కానీ పవన్ ఒక్క కాకినాడ పోర్టులోనే అంతా జరిగిపోతున్నట్లు మాట్లాడి రాష్ట్రం పరువును, ముఖ్యంగా కాకినాడ ప్రతిష్టను దెబ్బతీయడం అభ్యంతరకరం.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆ ప్రశ్న అడగాల్సింది చంద్రబాబును: పవన్ కల్యాణ్
న్యూఢిల్లీ: కూటమి ప్రభుత్వంపై, రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనకు రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పవన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.దానికి ఆయన స్పందిస్తూ..నేనేం లా అండ్ ఆర్డర్, హోం శాఖ చూడడం లేదు. నా శాఖ గురించి ఏదైనా అడిగితే చెప్పగలను. అయినా మీరు ఈ ప్రశ్న అడగాల్సింది.. సీఎం చంద్రబాబును, హోం మంత్రి అనితను. అయినప్పటికీ మీరు చెప్పినవన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తా అని అన్నారు.అలాగే.. దర్శకుడు రాం గోపాల్ వర్మ తప్పించుకుని తిరుగుతున్నారని, చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఇప్పుడు ఎందుకు తటపటాయిస్తున్నారు? అని పవన్ వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో ఏం జరిగినా.. కూటమి ప్రభుత్వం తరఫున సమిష్టిగా బాధ్యత వహిస్తాం అని చెప్పారు.గతంలో పవన్ కల్యాణ్.. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో హోం మంత్రి అనితను నిందిస్తూ.. తాను హోం మంత్రి పదవి చేపడితే పరిస్థితి మరోలా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇదీ చదవండి: వర్చువల్ విచారణకు వర్మ సిద్దపడ్డారు కదా! -
‘పెండ్లికి పోతున్నావో.. పేరంటానికే పోతున్నావో..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు సంధించారు. తాజా ప్రెస్మీట్లో ఢిల్లీ పర్యటనలపై రేవంత్ మాట్లాడుతూ.. కేటీఆర్‌ను, బీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎక్స్ ద్వారా కేటీఆర్ స్పందించారు.పదే పదే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో తెలియదని.. కనీసం ఒక్క రూపాయి కూడా తేలేకపోయారని, దీనిపై నిలదీయాల్సిన అవసరం తెలంగాణ పౌరులుగా తమకు ఉందని అన్నారాయన. అలాగే.. బడేభాయ్, చోటామియాలు ఈడీ దాడులు బయటపడకుండా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలే చేశారు కేటీఆర్. పెండ్లికి పోతున్నవో పేరంటానికి పోతున్నావోసావుకు పోతున్నావో తెలంగాణ పౌరులుగా 28 సార్లు పోయినవ్28 రూపాయలు తీస్కరాలేదు అని అడగడం మా బాధ్యతరాజ్యాంగబద్ధంగా మినహాఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుండి ఒక్క రూపాయి తెచ్చింది లేదుఈడీ దాడుల నుండి తప్పించుకోవడానికి ఫైవ్ స్టార్ హోటల్లో…— KTR (@KTRBRS) November 25, 2024తామేం రేవంత్‌లా ఢిల్లీ గులాములం కాదని.. పోరాటం తమ రక్తంలోనే ఉందని, మా జెండా మా ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధే అంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. ఇదీ చదవండి: ‘ఢిల్లీకి వెళ్లేది వాళ్లలా కాళ్లు పట్టుకోవడానికి కాదు’ -
ఒంటరిగా ఢిల్లీకి ఎందుకో?
సాక్షి బెంగళూరు: అనేక పరిణామాల మధ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తినకు పయనమయ్యారు. చాలా రోజుల తర్వాత సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ టూర్‌కు వెళుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వక్ఫ్ చట్టం గొడవ, ముడా స్థలాల కేసులు, ఉప ఎన్నికలు ఇలా వరుస పరిణామాల తర్వాత సీఎం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలుస్తుండడం గుసగుసలకు కారణమైంది. మంత్రి పదవులకు ఒత్తిడి మంత్రివర్గ విస్తరణ చేయాలని ఎమ్మెల్యేలలో రోజురోజుకి డిమాండ్లు పెరుగుతున్నాయి. సీనియారిటీని చూసి మంత్రి పదవి ఇవ్వాలని డిమండ్ చేస్తున్నారు. డిసెంబర్లో కేబినెట్లో కొంతమందికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇస్తారనే వార్తలున్నాయి. బీజేపీ, జేడీఎస్ ఆపరేషన్ కమల చేస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మంత్రిమండలి విస్తరణ వల్ల అసమ్మతి పుట్టి పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడితే పుట్టి మునుగుతుందనే భయం కాంగ్రెస్‌లో ఉంది. యాత్ర వెనుక మంత్రివర్గ విస్తరణ అంశం తప్పకుండా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. సీఎం మార్పు ఉంటుందా? సిద్ధరామయ్య వెంట డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేకపోవడం గమనార్హం. ముడా గొడవ, వక్ఫ్ భూముల చట్టంతో ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో సీఎం మార్పు గురించి మాట్లాడడానికే ఆయనను ఒంటరిగా పిలిచారా? అనేది కూడా తెరమీదకు వచ్చింది. అధిష్టానం పెద్దలకు నచ్చజెప్పడానికి సీఎం వెళ్తున్నారా అనే సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయి. బుధ, గురువారం ఆయన పార్టీ పెద్దలను కలవనున్నారు. అలాగే నాబార్డు నిధులు, సహా పన్నుల కోతపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చిస్తానని సీఎం తెలిపారు. -
ఢిల్లీకి బయల్దేరిన సీఎం - రేవంత్ రెడ్డి
-
‘పాగల్ పాలనలో తిరగబడ్డ తెలంగాణ’.. కేటీఆర్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్, సాక్షి: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన విమర్శలు చేశారు. ఇందుకోసం.. వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఫార్మా కంపెనీ అభిప్రాయసేకరణ సందర్భంగా అధికారులపై గ్రామస్తులు జరిపిన దాడి సంగతిని కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు.‘‘తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది. కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుంది. ‘మా భూములు మాకేనని’.. కొడంగల్ కొట్లాడుతుంది. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపం తో నా తెలంగాణ గరమైతుంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఎలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అసంతృప్తులివి.... ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్నలు, హైడ్రా’ దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు, మూసీలో ఇండ్ల కూల్చివేతలపై దుమ్మెత్తిపోస్తున్న బాధితులు, పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్ల నిరసన, ఉపాధి దూరంచేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నల ధిక్కారం, ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల మహా ధర్నా, గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై భగ్గుమన్న విద్యార్థి లోకం, ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతల కన్నెర్ర, కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి, గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు’’.. అంటూ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోందికుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుందిమా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుందిపసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుందికుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపం తో నా తెలంగాణ… pic.twitter.com/liaE7n0Jvb— KTR (@KTRBRS) November 12, 2024ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్.. అమృత్ పథకంలో అవినీతి జరిగిందంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ పై ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి కేటీఆర్ కోరారు.ఇదీ చదవండి: తెలంగాణలో కులగణన... లక్ష్యం స్పష్టమేనా? -
లా అండ్ ఆర్డర్ లో బాబు ఫెయిల్.. అమిత్ షాతో చెప్పే దమ్ముందా పవన్
-
పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పై చంద్రబాబు ఆరా!
-
పైసా పనిలేదు.. రూపాయి లాభం లేదు: రేవంత్ ఢిల్లీ టూర్లపై కేటీఆర్
సా క్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు సంధించారు. పది నెలల్లో 25 సార్లు, 50 రోజులు ఢిల్లీకి పోయివస్తివి అంటూ ధ్వజమెత్తారు. పోను 25 సార్లు, రాను 25 సార్లు.. నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్‌జూబ్లీ కూడా చేస్తివని ఎద్దేవా చేశారు. తట్టా మట్టి తీసింది లేదు, కొత్తగా చేసింది అసలే లేదంటూ విమర్శించారు. అన్నదాతలు అరిగోసలు పడుతున్నారని, గురుకులాలు గాల్లో దీపాల్లా మారాయని, వైద్యం కుంటుపడిందని, విద్యావ్యవస్థ గాడి తప్పిందన్నారు.మూసి, హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టారని, 420 హామీలను మడతపెట్టి మూలకు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగలు పండగళ్లా లేవని, ఆడబిడ్డలకు చీరలు అందనేలేవని, అవ్వాతాతలు అనుకున్న పింఛను, తులం బంగారం జాడే లేదని ఫైరయ్యారు. స్కూటీలు, కుట్టు మిషిన్లు లేనేలేవని, అయినా ఢిల్లీకి పోయిరావాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు.✳️ పైసా పనిలేదు - రాష్ట్రానికి రూపాయి లాభం లేదు10 నెలలు - 25 సార్లు - 50రోజులుపోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు ❌ అయినను పోయి రావాలె హస్తినకు✳️…— KTR (@KTRBRS) October 17, 2024 -
బాబు ఢిల్లీ పర్యటనపై భూమన సంచలన వ్యాఖ్యలు
-
అమిత్ షాతో బాబు భేటీ.. "ప్యాకేజీ విన్నపాలు"
-
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు
-
మోదీ ముందు చంద్రబాబు విన్నపాలు ఇవే
-
ఢిల్లీ వెళ్ళింది అందుకా..! ప్రత్యేక హోదా కోసం కాదా ?
-
నేడు ఢిల్లీకి చంద్రబాబు.. రేపు మోదీతో భేటీ
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం గురించి చర్చించే అవకాశం ఉంది.కాగా, ఈరోజు(బుధవారం) సాయంత్రం 5:10 గంటలకు విజయవాడ నుంచి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు(గురువారం) ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. మోదీతో సమావేశం అనంతరం హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాలను కలిసే అవకాశం ఉంది.ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం.. పారిశ్రామిక రాయితీలు, మౌలిక వస్తువుల కల్పన ప్రాజెక్ట్ వంటి అంశాల అమలుపై సహాయం అందించాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బాబు నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. -
టీడీపీపై బీజేపీ ప్రతీకారం చంద్రబాబుకు ఢిల్లీలో చుక్కలు
-
ముష్టి 30 సీట్లు ఇవ్వడంపై బీజేపీ హై కమాండ్ తీవ్ర అసంతృప్తి
-
అయితే ఇక పొత్తు పెటాకులేనా
-
చంద్రబాబుతో పొత్తుపై బీజేపీ ఆచుతూచి అడుగులు
-
చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్ చేశారు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు, లోకేష్ భారీ అవినీతికి పాల్పడ్డారన్న కేశినేని.. 2019లో మోదీ అధికారంలోకి రారని చంద్రబాబు అనుకున్నాడని, కాంగ్రెస్ కూటమిని కలుపుకుని ప్రధానమంత్రి అయిపోవచ్చని బాబు దురాశకు పోయాడంటూ వ్యాఖ్యానించారు. ‘‘అప్పట్లో నాతో మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టించాడు. మోదీని వ్యక్తిగతంగా నానా తిట్లు తిట్టాడు. 2019లో వైఎస్ జగన్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డాడు. ఓడిపోయిన మరుక్షణం నుంచే చంద్రబాబుకు భయం పట్టుకుంది. కేంద్రం నుంచి కేసుల్లో ఇరికిస్తారనే భయంతో మోదీ, అమిత్ షాను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. ఎన్డీఏ నుంచి ఎందుకు బయటికి వచ్చాడో. తిరిగి ఎన్డీఏతో ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబుకే తెలియాలి’’ అంటూ కేశినేని చురకలు అంటించారు. ‘‘అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏం మార్పులొచ్చాయి?. ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారా?. రైల్వే జోన్ ఇస్తానని హామీ ఇచ్చారా?. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చారా? అభివృద్ధికి డబ్బులిస్తామని చెప్పారా? చంద్రబాబు వద్ద చాలా ప్రశ్నలకు సమాధానం లేదు?.తాను, తన కొడుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే చంద్రబాబు భయం. టీడీపీ పార్టీని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడు. టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి రాజ్యసభలో ఖాళీ అయ్యింది. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యింది. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ మూతపడుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం కలే. ఎన్నికలయ్యాక తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోతాడు’’ అంటూ కేశినేని నాని సెటైర్లు వేశారు. ఇదీ చదవండి: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై విజయసాయిరెడ్డి ట్వీట్ -
రాష్ట్రం కోసం కట్ చేసాం, మా కోసం కలుపుకున్నాం
-
మాటలని మొహం చూపించటానికి సిగ్గు లేని బాబు
-
పార్లమెంట్‌లోకి స్లిప్పులు పంపిన చరిత్ర బాబుది: కేశినేని నాని
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్ని అడ్డదారులు తొక్కటానికైనా చంద్రబాబు సిద్ధంగా ఉంటాడని మండిపడ్డారు ఎంపీ కేశినేని నాని. అయినా బాబును రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని తెలిపారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. ఎన్డీయే కూటమి నుంచి చంద్రబాబు ఎందుకు బయటకు వచ్చాడో.. మళ్లీ ఎందుకు వెళ్తున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీ కేశినేని నాని గురువారం మాట్లాడుతూ.. 2018 సంవత్సరంలో చంద్రబాబు ఆదేశాల మేరకు తానే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టానని చెప్పారు. పార్లమెంటులో సభ్యులు ఏం మాట్లాడాలనేది చంద్రబాబు స్లిప్పులు రాసి పంపించేవాడని ప్రస్తావించారు. ముందు స్పెషల్ ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు మళ్ళీ ప్యాకేజీ వద్దంటూ స్పెషల్ కేటగిరి కావాలంటూ రివర్స్ అయ్యాడని విమర్శించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే ఆలోచనతో కాంగ్రెస్‌తో బాబు కలిశాడని దుయ్యబట్టారు. పనికిరాని కొడుకు లోకేష్‌ను ముఖ్యమంత్రి చేసి తాను ప్రధాని కావాలనేది చంద్రబాబు దురాలోచన అని ఆరోపించారు. అందుకే అప్పట్లో ఆత్మ పోరాట దీక్షల పేరుతో ప్రధానమంత్రి మోదీపై వ్యక్తిగత విమర్శలు చేశాడని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల డబ్బులతో ప్రత్యేక విమానంలో మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రాలు తిరిగాడని గుర్తుచేశారు. ఇతర పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలనుకుని బొక్క బోర్లా పడినట్లు తెలిపారు. ఇప్పుడు మోదీ, అమిత్ షా కరుణాకటాక్షాల కోసం ఎన్డీయే కూటమిలో చేరటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు. చదవండి: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి మాజీ సీఎం కుమార్తె! -
మరోసారి తెరపైకి పవన్ ఢిల్లీ పర్యటన
-
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
-
రేపు పార్టీ హైకమాండ్ ను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం
-
కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్.. ఆ జాబితాపై హైకమాండ్‌తో భేటీ
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ టూర్లో ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ అవనున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ తదితర అంశాలపై హైకమాండ్‌తో రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్ఎస్ నుంచి కొత్తగా పార్టీలోకి వస్తున్నవారితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లివ్వకపోయినా సర్దుకుపోయిన సొంత పార్టీ నేతల నుంచి ఎంపీ టికెట్ల విషయంలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఎంపీ టికెట్లివ్వలేని వారికి కార్పొరేషన్ పదవులిచ్చి బుజ్జగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై అధిష్టానంతో చర్చించడానికి సీఎం ఢిల్లీకి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. అందరి దృష్టి ఆ సీటుపైనే -
చంద్రబాబు ఢిల్లీ టూర్..పొత్తులకోసమా..కేసులుకోసమా..
-
జన..దేశం..శానా కష్టం
-
బీజేపీతో పొత్తుకోసం వెంపర్లాడుతున్న టీడీపీ
-
చంద్రబాబు ఢిల్లీ టూర్ పై ఎల్లో మీడియా అసత్యాలు
-
చంద్రబాబుకు మోదీ అపాయింట్మెంట్ అందుకే ఇవ్వలేదు: కేవీపీ
సాక్షి, విజయవాడ: పొత్తులతో ఎన్నికలకు వెళ్లిన పార్టీల్లో నితీష్ కుమార్ తర్వాత ఆ రికార్డ్ చంద్రబాబుకే దక్కుతుందంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు సభకు వెళ్తుంటే రాహుల్ కాన్వాయ్‌పై చంద్రబాబు రాళ్లు, కోడిగుడ్లు విసిరించాడని, తిరుపతిలో అమిత్ షా పై రాళ్లేయించాడని కేవీపీ గుర్తు చేశారు. ‘‘రాజకీయ చతురుడని చంద్రబాబు తనకి తానే అనుకుంటాడు. అపవిత్ర రాజకీయంలో చంద్రబాబు రికార్డు ఎవరూ బద్ధలు కొట్టలేరు. 2019లో చంద్రబాబు దేనికోసం పోరాడారు. ఏపీ భవన్లో ధర్మపోరాట దీక్ష ఏయే ప్రయోజనాలను ఆశించి చేశారు. ప్రత్యేకహోదా ఎందుకు వద్దన్నారు.. ప్యాకేజీ ఎందుకు ముద్దన్నారు. స్వీట్లు పంచి.. పండుగ చేసుకుని ఏం సాధించారు’’ అంటూ కేవీపీ ప్రశ్నించారు. ‘‘మోదీ కుటుంబ విషయాల గురించి ప్రస్తావించిన వ్యక్తి చంద్రబాబు. అందుకే చంద్రబాబుకు మోదీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తాను కలవకుండా అమిత్ షా.. నడ్డా వద్దకు పంపించారు. అభద్రతాభావం కలగగానే చంద్రబాబుకు జాతి ప్రయోజనాలు గుర్తొస్తాయి. ఢిల్లీకి ఎందుకెళ్లారో ఏపీ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. ఇదీ చదవండి: రామోజీ మానసిక ఉన్మాదం ఏ స్థాయిలో ఉందంటే.. -
‘అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా తింటాడు’
-
రెండు ఎకరాలున్న చంద్రబాబు వేలాది కోట్లకు అధిపతి ఎలా అయ్యారు ?
-
పొత్తు కోసం కాళ్ళు, గడ్డం పట్టుకుంటున్నావా ?
-
CM YS Jagan: ముగిసిన ఢిల్లీ పర్యటన
Updates 03: 44PM, Feb 9, 2024 ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ సమావేశం పార్లమెంట్ భవనంలోనే భేటీ అయిన ఏపీ సీఎం ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలు, ఇతరత్రా కేంద్ర హామీలపై చర్చలు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం బయల్దేరిన సీఎం జగన్ 02: 25PM, Feb 9, 2024 నిధులు, పెండింగ్ బకాయిలపై సీఎం జగన్ చర్చ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ పార్లమెంట్‌లోని ఆర్థికశాఖ కార్యాలయంలో అరగంట పాటు కొనసాగిన సమావేశం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చ 01: 50PM, Feb 9, 2024 కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో ముగిసిన సీఎం జగన్ భేటి 01:21PM, Feb 9, 2024 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం జగన్ భేటీ పార్లమెంట్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో కొనసాగుతున్న సమావేశం 12:50PM, Feb 9, 2024 ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ ప్రధానితో సుమారు గంటన్నరపాటు కొనసాగిన సీఎం జగన్ సమావేశం రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చ ప్రధాని మోదీతో భేటీలో ఈ అంశాలపై ముఖ్యమంత్రి జగన్ చర్చించినట్లు తెలుస్తోంది... 1. పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపొనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని, దీంతోపాటు ప్రాజెక్టు తొలివిడతను సత్వరమే పూర్తిచేయడానికి రూ.12,911కోట్ల నిధుల విడుదలకూ అంగీకరించిందని, ఈరెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదరుచూస్తున్నాయని, దీనిపై తక్షణమే దృష్టిపెట్టాలని కోరిన ముఖ్యమంత్రి. 2.అయితే పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తిశాఖ పెండింగ్‌లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరిన ముఖ్యమంత్రి. 3. 2014 జూన్ నుంచి మూడేళ్లపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని కోరిన సీఎం. 4. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని కోరిన సీఎం. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాథి అవకాశాలు ఏర్పాడతాయన్న సీఎం. 5. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం. కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలన్న సీఎం. 6. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరిన సీఎం. 7. విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం – కర్నూలు హైస్పీడ్ కారిడార్‌ను వయా కడప మీదుగా బెంగుళూరు వరకూ పొడిగించాలని, దీనిపై తగిన పరిశీలనలు పూర్తిచేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని కోరిన సీఎం. కడప– పులివెందుల– ముదిగుబ్బ – సత్యసాయి ప్రశాంతి నిలయం– హిందూపూర్ కొత్త రైల్వేలైన్‌ను దీంట్లో భాగంగా చేపట్టాలని కోరిన సీఎం. ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందన్న సీఎం. 8. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధానిని కోరిన ముఖ్యమంత్రి. ఇవిగాక.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు జాతీయ ఆహార భద్రతాచట్టం కింద ఆంధ్రప్రదేశ్‌కు మరింత ఎక్కువ కవరేజీ ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు సమానంగా వాటా ఈ వాటా లభిస్తే.. రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కే అవకాశం విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం APMDC కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్ 12:10PM, Feb9, 2024 ప్రధాని నరేంద్ర మోదీతో గంట నుంచి కొనసాగుతున్న సీఎం వైఎస్ జగన్ సమావేశం 11:10AM, Feb 9, 2024 ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో సమావేశం రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చ 11:03AM, Feb 9, 2024 పార్లమెంట్‌కు చేరుకున్న సీఎం జగన్ కాసేపట్లో ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ 8:00AM, Feb 9, 2024 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ గురువారం రాత్రి ఢిల్లీ వచ్చారు. శుక్రవారం ఉదయం 11గంటల ప్రాంతంలో ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సీఎం జగన్ సమావేశం అవుతారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందించాలని, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలు, విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్రంతో చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. గురువారం సాయంత్రమే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. -
నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్
-
CM YS Jagan: ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు సీఎం జగన్. ఈ రాత్రి 1, జన్‌పథ్ నివాసంలో ముఖ్యమంత్రి జగన్ బస చేస్తారు. అపాయింట్మెంట్ షెడ్యూల్ ప్రకారం రేపు(శుక్రవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు సీఎం జగన్. ప్రధాని మోదీతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల పోలవరం నిధులు త్వరితగతిన విడుదలకు ఆదేశాలు పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంకు సంబంధించిన ఆమోదం కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉన్న అంశాలతో పాటు పెండింగ్ అంశాల పరిశీలన 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరాచేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్ కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు జాతీయ ఆహార భద్రతాచట్టం కింద ఆంధ్రప్రదేశ్‌కు మరింత ఎక్కువ కవరేజీ ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు సమానంగా వాటా ఈ వాటా లభిస్తే.. రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కే అవకాశం విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం APMDC కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్ -
సీఎం జగన్ ను ఎదుర్కొవడానికి బాబు నానా తంటాలు
-
రాళ్ళూ వేయించటం రాజీకి వెళ్ళటం..చంద్రబాబు డర్టీ పాలిటిక్స్
-
రండి బాబు రండి..ఢిల్లీలో బాబు ముష్టి
-
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మంత్రి అంబటి కామెంట్స్
-
రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం పర్యటన ముగిసింది. ఏఐసీసీ నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్, ఉత్తమ్.. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ రోజు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. రక్షణ శాఖ భూములు, కంటోన్మెంట్ సమస్యలపై చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు సమావేశం కొనసాగింది. కేంద్ర నుంచి బీఆర్జీఎఫ్ కింద రావలసిన రూ.1800 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలని వినతించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువచ్చిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.. రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ! -
CM Revanth: అమిత్‌షాతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. విభజన సమస్యలపై ప్రధానంగా భేటీ సాగింది. విభజన సమస్యలపై త్వరలోనే ఇద్దరు సీఎస్‌లను పిలిచి మాట్లాడతానని అమిత్‌షా హామీ ఇచ్చారు. నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరోల కోసం పెరిగిన జిల్లాలకు అనుగుణంగా ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి ఉన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ, సాంకేతిక అనుమతులు ఇవ్వాలని వినతించారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్.. ఈ పర్యటనలో భాగంగా ఫైనాన్స్, హెల్త్, ఇరిగేషన్, పరిశ్రమలతో పాటు పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. -
‘సీడబ్ల్యూసీ’కి వెళ్లని సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి వెళ్లాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టుండి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది. షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 3 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. గురువారం అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీ వెళ్లేలా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కారణంగానే ఇదే రోజు జరగాల్సిన కలెక్టర్ల సదస్సు కూడా వాయిదా వేశారు. అందుకు అనుగుణంగా ఉదయం తన నివాసంలోనే సాగునీటి శాఖపై రివ్యూ చేశారు. కానీ, అసెంబ్లీకి వచ్చిన తర్వాత రేవంత్ షెడ్యూల్ మారిపోయింది. విద్యుత్‌పై చర్చ సందర్భంగా వాడీవేడిగా సభ సాగడంతో ఆయన అసెంబ్లీలోనే ఉండిపోయారు. ఒక దశలో సీఎం జోక్యం చేసుకొని విద్యుత్ ఒప్పందాలపై న్యాయ విచారణ చేస్తామని ప్రకటన కూడా చేశారు. ఈ ప్రకటన పూర్తయిన తర్వాత రేవంత్ ఢిల్లీ వెళతారనే చర్చ అసెంబ్లీ లాబీల్లో జరిగినా, సీఎం ఢిల్లీకి బయలుదేరలేదు. అసెంబ్లీ సమావేశాల కారణంగా తాను సీడబ్ల్యూసీకి రాలేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్‌కు చెప్పి ఢిల్లీ పర్యటన విరమించుకున్నారని సమాచారం. అయితే సీడబ్ల్యూసీ సమావేశానికి ఎందుకు వెళ్లలేదన్న అంశం అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. కారణమేంటి? సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లకపోవడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడమే కారణమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధ, గురువారాల్లో రెండు కీలక అంశాలపై ప్రభు త్వం శ్వేతపత్రాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం సభలో లేకుండా పార్టీ సమావేశానికి వెళితే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగానే సీఎం సభలో లేకుండా వెళ్లిపోయారని ప్రతిపక్షాలు ఎత్తిపొడిచే అవకాశం వచ్చి ఉండేదని, దీనికి తోడు కీలక రంగాలపై చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం సభలో లేకపోతే అధికార పక్షానికి కూడా సమాధానం చెప్పుకునే అవకాశం లేకుండా పోతుందనే కారణంతోనే రేవంత్ ఢిల్లీ వెళ్లలేదని ప్రభుత్వ, పార్టీ వర్గాలంటున్నాయి. అయితే, కేవలం అసెంబ్లీ సమావేశాలే కాదని, మరో ముఖ్యమైన పనిలో ఉన్న కారణంగానే సీఎం ఢిల్లీ వెళ్లలేదనే చర్చ కూడా జరిగింది. గురువారం మధ్యాహ్నం సమయంలో మంత్రి ఉత్తమ్ కూడా రేవంత్‌రెడ్డితో చాలా సేపు అసెంబ్లీ లాబీల్లోని సీఎం చాంబర్లో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ తర్వాతే రేవంత్ తన టూర్ రద్దు చేసుకున్నారనే చర్చ కూడా జరిగింది. -
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన.. అప్డేట్స్
-
రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన.. ఆరుగురు మంత్రులపై క్లారిటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. మంగళవారం సీఎం రేవంత్.. ఢిల్లీ వెళ్లనున్నట్లు సీఎంవో కార్యాలయం పేర్కొంది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మిగితా ఆరుగురు మంత్రుల జాబితాకు సంబంధించి సీఎం రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించన్నుట్లు సమాచారం. దీంతో కొత్త మంత్రుల కేటాయింపు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: సెటైర్లు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు -
CM Jagan: ముగిసిన ఢిల్లీ పర్యటన
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. ఈ ఉదయం ఢిల్లీ నుంచి ఏపీకి తిరుగుపయనం అయ్యారు. శుక్రవారం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో హాజరు కావడంతో పాటు.. పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి ఏపీకి సంబంధించిన వ్యవహారాలపై చర్చలు జరిపారాయన. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలతో పాటు పొలవరం.. వివిధ అంశాలను సీఎం జగన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తొలుత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో, ఆపై కేంద్రం విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో భేటీ అయ్యారాయన. ఈ సందర్భంలో.. ఏపీ విద్యుత్ రంగ అభివృద్ధిపై మంత్రి ఆర్కే సింగ్ ప్రశంసలు గుప్పించారు. ఆపై నిన్న(శుక్రవారం) ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సులో.. ఏపీ నుంచి సీఎం జగన్, సీఎస్, డీజీపీ పాల్గొన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై రాష్ట్రాల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న కేంద్రం.. అక్కడ అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టేందుకు రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఈ సదస్సులో సీఎం జగన్ సైతం ప్రసంగించారు.ఈ సదస్సు తర్వాత నిన్న సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో దాదాపు దాదాపు గంటపాటు సమావేశం అయ్యారు సీఎం జగన్. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలతో పాటు వివిధ అంశాలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. -
ప్రభుత్వ వ్యూహంతో మావోయిస్టు కార్యాకలాపాలు పరిమితం: సీఎం జగన్
Updates: ►వామపక్ష తీవ్రవాద నిర్మూలనపై ముగిసిన సమావేశం ►కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ సహా ముఖ్యమంత్రిల గ్రూప్ ఫోటో ►అనంతరం హోం మంత్రితో కలిసి ఏపీ సీఎం జగన్ లంచ్ వామపక్ష తీవ్రవాద నిర్మూలనపై సమీక్ష సమావేశంలో పాల్గొని ప్రసంగించిన సీఎం జగన్ ►ఏపీ నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద ముప్పుతో పోరాడుతోంది ►మా ప్రభుత్వ వ్యూహాల వల్ల రాష్ట్రంలో LWE హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి ►మొదట్లో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ►ప్రభుత్వ చర్యల కారణంగా, LWE కేడర్ బలం 2019, 2023 మధ్య 150 నుండి 50కి తగ్గింది. ► పొరుగు రాష్ట్రాల మధ్య పటిష్టమైన సమన్వయాన్ని నిర్ధారించడానికి, నాలుగు రాష్ట్రాల అధికారులతో కూడిన జాయింట్ టాస్క్ ఫోర్స్‌లు ఏర్పాటు చేశాం. ►తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి స్థిరమైన అభివృద్ధి, సామాజిక-ఆర్థిక పురోగతి కీలక పరిష్కారాలు . ►2020-2021 నుంచి ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా, AP పోలీసులు 9,371 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. 224 కేసులు నమోదు చేశారు, 3.24 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, తగులబెట్టారు 141 మంది నిందితులను అరెస్టు చేశారు. ► ఏఓబీ ప్రాంతంలో గంజాయి పంటను ధ్వంసం చేయడంతో మావోయిస్టులకు నిధులు భారీగా నిలిచిపోయాయి. ►ఈ నిరంతర ప్రయత్నాల వల్ల 2022లో గంజాయి సాగు 1500 ఎకరాలకు తగ్గిందని, ప్రస్తుత సంవత్సరం అంటే 2023లో అది కేవలం 45 ఎకరాలకు తగ్గింది. ►గంజాయి సాగు చేసే గిరిజనుల ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి, పోలీసులు, జిల్లా యంత్రాంగం కాఫీ, నిమ్మ, జీడి, తీపి నారింజ, కొబ్బరి, చింతపండు, సిల్వర్ ఓక్ వంటి గిరిజనులను సంప్రదించి ప్రత్యామ్నాయ పంటల మొక్కలను పంపిణీ చేస్తున్నాం. ► అటవీ ప్రాంతాలలో అర్హులైన 1.54 లక్షల మంది గిరిజన రైతులకు 3.23 లక్షల ఎకరాల మేరకు ROFR పట్టాలు జారీ చేశాం ►వారి భూములను సాగు చేయడం కోసం వారిని ఆదుకోవడానికి, వారి ఉత్పత్తి ఖర్చుకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతు భరోసాగా రూ.13,500/- ఆర్థిక సహాయం అందజేస్తుంది. ►రహదారి కనెక్టివిటీ యొక్క ప్రాముఖ్యతను అతిగా చెప్పలేము. ఇప్పటి వరకు, మేము లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల (RCPLWEA) పథకం కోసం రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కింద LWE ప్రాంతాల్లో 1087 కిలోమీటర్ల రహదారిని పూర్తి చేసాం. ►ప్రభుత్వ సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా, పారదర్శకంగా, త్వరితగతిన అందజేయడం కోసం మేము 897 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశాం. ఒక్కొక్కరికి 10 మంది ఉద్యోగులు మరియు ప్రతి 50 గృహాలకు ఒక వాలంటీర్ ఉన్నారు. న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో ప్రారంభమైన వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సులో సీఎంజగన్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఝార్ఖండ్, ఛత్తీస్గడ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు/హోంశాఖ మంత్రులు /అధికారులు హాజరయ్యారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలైన ఏపీ, ఒడిశా, తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌లలో చేపట్టాల్సిన జాయింట్ ఆపరేషన్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టనున్నారు. రోడ్ల నిర్మాణం, రెసిడెన్షియల్ పాఠశాలలు, బ్యాంకులు, టెలిఫోన్ టవర్లు ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించనున్నారు. నక్సల్ అణిచివేత కోసం కోసం పోలీసు బలగాల ఆధునీకరణ, మెరుగైన మౌలిక వసతులు, రిజర్వ్ బెటాలియన్ ఏర్పాటు, హెలికాప్టర్లు, యూఏవీలు తదితర అంశాలను చర్చించనున్నారు. అదే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో రాత్రి 8.30 గంటలకు సీఎం జగన్ భేటీ కానున్నారు. -
AP CM YS Jagan Delhi Tour: కేంద్ర మంత్రులతో సీఎం జగన్ (ఫొటోలు)
-
ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్.. స్వాగతం పలికిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఇక, ఢిల్లీలో సీఎం జగన్‌కు ఎయిర్‌పోర్టులో వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భరత్, రెడ్డప్పా, అయోధ్య రామిరెడ్డి, బాలశౌరి, గోరంట్ల మాధవ్, రంగయ్యలు ఘన స్వాగతం పలికారు. కాగా, సీఎం జగన్ ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బాకాయిలపై చర్చించనున్నారు. అలాగే, రేపు వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరుగుతున్న సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. శుక్రవారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇది కూడా చదవండి: ఎన్డీయే నుంచి బయటకు కాదు.. పవన్నే బీజేపీనే వద్దనుకుందా? -
ఢిల్లీ: కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీ
Updates ► ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను సీఎం జగన్ కలిశారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు. శుక్రవారం(రేపు) ఉదయం విజ్ఞాన్ భవన్లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరిగే సదస్సులో సీఎం పాల్గొననున్నారు. రేపు రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ►ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ ►రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చ ►పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని వినతి ►సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి ►కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ కానున్న సీఎం జగన్ ►రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చ ►ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ►సాయంత్రం 6:30కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సీఎం జగన్ సమావేశం ►రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించనున్న సీఎం ►రేపు వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరుగుతున్న సదస్సులో పాల్గొననున్న సీఎం ►రేపు రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్న సీఎం జగన్ ► సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరారు న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు (గురువారం, శుక్రవారం) దేశ రాజధానిలో సీఎం పర్యటించనున్నారు. నేటి సాయంత్రం 6:30 కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు. అదే విధంగా శుక్రవారం ఉదయం విజ్ఞాన్ భవన్లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరుగుతున్న సదస్సులో సీఎం పాల్గొననున్నారు. రేపు రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. చదవండి: నిధులు అడగొద్దని మాకేం చెప్పలేదు -
రేపు ఢిల్లీకి సీఎం జగన్.. రెండు రోజుల పర్యటన
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రేపు(గురువారం), ఎల్లుండి(శుక్రవారం) సీఎం జగన్ ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు. శుక్రవారం వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. -
లోకేష్ ఢిల్లీ టూర్ పై ఆర్జీవీ కామెంట్స్
-
లోకేష్ విన్నపాలు.. పట్టించుకోని జాతీయ మీడియా
ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, ఇప్పుడు ఆయన తనయుడు నారా లోకేష్ ఢిల్లీలో సానుభూతి కోసం చక్కర్లు కొడుతున్నారు. కేంద్ర పెద్దలు కలిసేందుకే ఢిల్లీకి వెళ్లారా అనే దానిపై పూర్తి స్పష్టత లేకపోయినా అక్కడ జాతీయ మీడియాను ఆకర్షించే యత్నం చేసి విఫలమయ్యాడు లోకేష్. ఢిల్లీకి వెళ్లిందే తడువుగా జాతీయ మీడియాను ఇంటర్వ్యూల కోసం రమ్మని ఫోన్లు చేయిస్తున్నాడు. కానీ జాతీయ మీడియా మాత్రం చంద్రబాబు అంశంపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అందులోనూ నారా లోకేష్ అంటే పూర్తి అయిష్టతనే కనబరుస్తోంది నేషనల్ మీడియా. తనకు ప్రైమ్ టైం లైవ్ ఇంటర్వ్యూలు కావాలని విన్నవించినా, రికార్డింగ్ ఇంటర్వ్యూలతో మాత్రమే సరిపెట్టేసింది. లైవ్ ఇంటర్వ్యూలు లోకేష్‌తో నిర్వహించడానికి ఆసక్తే కనబరచడం లేదు జాతీయ మీడియా. అదే సమయంలో చంద్రబాబు కేసులపై పలువురు సీనియర్ లాయర్లతోనూ లోకేష్ చర్చలు జరిపారు. ప్రధానంగా సుప్రీంకోర్టు లాయర్ల దగ్గరకు ప్రదక్షిణలు చేసినా ఫలితం కనిపించడం లేదు. ఈ కేసు నుంచి, జైలు నుంచి తండ్రిని ఎలాగైనా బయటపడేయాలని చూస్తున్న లోకేష్‌కు ఇప్పుడు అది సవాల్‌గా మారింది. -
‘చంద్రబాబూ.. ఒక్క ఎకరాకైనా నీరిచ్చావా?’
ఢిల్లీ: ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. పులివెందుల మీటింగ్‌లో తనపై చేసిన విమర్శలకు ఢిల్లీ వేదికగా ఘాటుగా స్పందించారాయన. తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నాడని.. ఆ మాటకొస్తే పొలవరాన్ని అనుకున్న టైంకి ఎందుకు పూర్తి చేయలేకపోయారని చంద్రబాబును నిలదీశారాయన. ‘‘చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. అంబోతులకు ఆవులు సప్లయి చేసి రాజకీయాలలో పైకి వచ్చిన చరిత్ర చంద్రబాబుది. పోలవరం 2018కల్లా చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదు ?. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు?. కాఫర్ డ్యాం పూర్తి కాకుండా డయా ఫ్రం వాల్ ఎందుకు కట్టారు ?. రాయల సీమలో ఒక్క ప్రాజెక్టు కు అయినా బాబు శంకుస్థాపన చేశారా ? అని నిలదీశారాయన. బ్రో సినిమాలో నన్ను గిల్లారు బ్రో చచ్చిన సినిమా. అయినా బ్రో సినిమా గురించి నేను మాట్లాడితే చంద్రబాబుకి ఏం నొప్పి?. బ్రో సినిమాలో నన్ను పొలి ఉన్న క్యారెక్టర్ చూపించి నన్ను గిల్లారు. నా పేరు తో సినిమా క్యారక్టర్ వేసి శునాకనందం పొందుతున్నారు అందుకే నేనీ సినిమా గురించి మాట్లాడుతున్నా. బ్రో సినిమాకి పవన్ నువ్వు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు?. నిర్మాత ఎంత ఇచ్చాడో చెప్పాలి అని డిమాండ్ చేశారు. వాళ్ల చలవవల్లే.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ఎకరాకు అయినా నీరిచ్చావా?.. ఇవ్వలేదు అంటూ చంద్రబాబుపై అంబటి ఫైర్ అయ్యారు. ఆ 14 ఏళ్లు ఏం చేయలేనివాళ్లు.. ఇప్పుడేం చేస్తారు. రాయలసీమ ప్రాజెక్టులు దివంగత ఎన్టీఆర్, వైఎస్సార్ చలవ వల్లే పూర్తయ్యాయి. ఢిల్లీ పర్యటన సారాంశం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ ను కలిశా. పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని కోరాను. డయాఫ్రం వాల్ కొత్తది కట్టాలని ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బ తింది. కొత్తది కట్టడానికి, రిపేర్లకు దాదాపు రూ. 2,500 కోట్లు ఖర్చు అవుతుంది. గైడ్ బండ్ కుంగడానికి కారణాలు తెలుసుకోవడానికి నిజ నిర్ధరణ కమిటీ వేశాం అని అంబటి మీడియాకు వివరించారు. -
దిల్లీ టూర్లో మధుమిత- శివబాలాజీ కపుల్స్ (ఫొటోలు)
-
సీఎం జగన్ ఢిల్లీ టూర్ అంటేనే తడుపుకుంటున్న ఎల్లో గ్యాంగ్
-
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫొటోలు)
-
‘ఏపీ అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టండి’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరోజు ఢిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న ఆయన.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన వాటాలు, పెండింగ్ బకాయిలతో పాటు న్యాయంగా దక్కాల్సిన సాయం గురించి ఆయన వాళ్ల దృష్టికి తీసుకెళ్లారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దాదాపు 1 గంటా, 20 నిమిషాలసేపు సీఎం జగన్ భేటీ కొనసాగింది. అంతకు ముందు దాదాపు 45 నిమిషాలసేపు హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. చివరగా.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానితో భేటీ సందర్భంగా.. రాష్ట్ర విభజన సహా అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారాయన. పోలవరం ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపండి. సుదీర్ఘకాలంగా ఇది పెండింగ్‌లో ఉంది. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా తీసుకెళ్లేందుకు, తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు అవసరం అవుతుంది. ఈ అంశం కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో కూడా ఉంది. పోలవరం తొలిదశ నిర్మాణానికి, కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే రూ.12911.15 కోట్ల మంజూరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తొలిదశలో భాగంగా మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ పునరావాసం ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. ఇది ఇస్తేనే తొలిదశ పూర్తైనట్లు. మొత్తంగా పోలవరం తొలిదశ నిర్మాణానికి రూ.17144 కోట్లు ఇవ్వాలని, ఈమేరకు జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తిచేశారు సీఎం జగన్. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సొంత నిధుల ఖర్చు రూ.1310.15 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాలని కోరారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికి పై రెండు అంశాలపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తిచేసిన సీఎం. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరాచేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిలు అలాగే పెండింగులో ఉన్నాయి. ఏపీకి రావాల్సిన రూ.7,230.14 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగులో ఉంది. ఏపీ జెన్కో ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా ఈ బకాయిలు వచ్చేలా దృష్టిపెట్టండి. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత లోపించిన విషయాన్ని మరోసారి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్. ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు జాతీయ ఆహార భద్రతాచట్టం కింద అధిక శాతం కవరేజీ ఉంది. కానీ, పథకం అమలుకు ఎంచుకున్న ప్రమాణాల్లో హేతుబద్ధత లేదు. నీతిఆయోగ్ కూడా దీన్ని నిర్ధారించింది. రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కకుండా పోతోంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.5,527 కోట్ల భారం పడుతోంది. అందుకే సత్వరమే జోక్యం చేసుకోండి. ప్రతినెలా వినియోగించకుండా దాదాపు లక్ష టన్నుల బియ్యం కేంద్రం వద్ద ఉంటోంది. ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి ఇస్తే సరిపోతుంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు పెండింగులో ఉన్నాయి. ప్రత్యేక హోదా సహా… పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టండి. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రత్యేక హోదా దోహదపడుతుంది. రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. ఈమేరకు సానుకూల నిర్ణయం తీసుకోండి. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ప్రతి జిల్లాకు కనీసంగా 18 లక్షల జనాభా ఉంది. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు గతంలో ఉన్న 11 కాలేజీలకు తోడు అదనంగా మరో 17 కాలేజీల నిర్మాణాలను చేపట్టాం. ఈ కాలేజీలకు తగిన ఆర్ధిక సహాయం చేయండి. వైయస్సార్ కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్ర హామీ ఇచ్చింది. వెనకబడ్డ రాయలసీమ ప్రాంతంలో జీవనోపాధి మెరుగుపడ్డానికి, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరం. స్టీల్‌ప్లాంట్‌కు అత్యంత అవసరమైన ముడి ఖనిజంకోసం మూడు గనులను ఏపీ ఎండీసీకి కేటాయించేలా కేంద్ర గనులశాఖకు ఆదేశాలు ఇవ్వండి. ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిలు రూ.1,702.90 కోట్లను మంజూరుచేయండి. 2012-13 నుంచి రూ. 2017-18 వరకూ ఇవి పెండిగులో ఉన్నాయి అని ప్రధాని మోదీకి ఏపీకి సంబంధించిన పలు అంశాలను వివరించారు సీఎం జగన్. చదవండి: మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ గైర్హాజరు -
ఢిల్లీలో కేటీఆర్.. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌తో భేటీ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమవుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీలు శనివారం కలిశారు. రాత్రి 10:15కి అమిత్‌షాను కేటీఆర్ కలవనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమంపైన హర్దీప్ సింగ్ పూరి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో కూడిన శానిటేషన్ హబ్‌తో పురపాలక అభివృద్ధిలో అనేక సవాళ్లకు సమాధానం దొరుకుతుందన్నారు. ఈ అంశంపైన తెలంగాణ రాష్ట్రం తన నమూనాను, ఆలోచనలను పంచుకోవాలని హర్దీప్ సింగ్ పూరీ కోరారు. త్వరలోనే తన మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎస్ ఆర్ డి పి, లింకు రోడ్లు, పారిశుద్ధ్యరంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అర్బన్ డెవలప్మెంట్ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్ రావాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలకు సంబంధించిన విజ్ఞప్తులను హర్దీప్ సింగ్ పూరికి అందించారు. చదవండి: వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు -
ఢిల్లీ పర్యటన అనంతరం మౌనంగ ఉన్న చంద్రబాబు
-
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు(బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. అత్యాధునిక హంగులతో వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన రేపు(గురువారం) ప్రారంభించనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఇప్పటికే పార్టీ ఆఫీస్ కార్యాలయ ప్రారంభ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రారంభానికి ముందు శాస్త్రోక్తంగా యాగం, హోమం, ఇతర పూజ కార్యాక్రమాలను నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనం అవుతారని తెలుస్తోంది. రేపు పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని.. గురువారం ఆయన ఢిల్లీలో ఉంటారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు వస్తారని సమాచారం. ఈ మధ్యలో ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో, మరికొందరు జాతీయ నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇదీ చదవండి: తడిసినా కొంటాం.. రైతన్నకు సీఎం కేసీఆర్ భరోసా -
అమిత్ షాతో పళణి భేటీ ఖరారు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో ఢిల్లీ పర్యటనకు పళణి స్వామి సిద్ధమయ్యారు. ఈనెల 26వ తేదీన కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా పళణి స్వామిని కేంద్ర ఎన్నికల కమిషన్ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా అంగీకరించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం పన్నీరు సెల్వం అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా గత నెల పళని స్వామి ఏకగ్రీవంగా ఎంపికై న విషయం తెలిసిందే. ఆయన ఎన్నిక, ఆయన నేతృత్వంలో గత ఏడాది జరిగిన సర్వ సభ్య సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రోజుల క్రితం ఆమోద ముద్ర వేసింది. దీంతో పార్టీ పై పట్టు సాధించడమే లక్ష్యంగా పళని వ్యూహాలకు పదును పెట్టారు. అలాగే కర్ణాటకలోని పులికేశినగర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఉనికి చాటాలని నిర్ణయించారు. అలాగే ఇక్కడ పన్నీరు సెల్వం తరపున అన్నాడీఎంకే అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిని తిరస్కరించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్కుల లేఖ రాశారు. నిజమైన అన్నాడీఎంకేకు చెందిన అభ్యర్థి అన్భరసు పులికేశి నగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారనని, ఆయనకే రెండాకు గుర్తు సైతం కేటాయించాలని కోరారు. పన్నీరుసెల్వం అభ్యర్థులతో అన్నాడీఎంకేకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో కేంద్రం పెద్దల ఆశీస్సు అందుకునేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో బుధవారం తొలిసారిగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 26వ తేదీని ఢిల్లీ వెళ్లనున్న పళణి స్వామి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో తొలుత భేటీ కానున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీకి తగ్గ కార్యాచరణతో పళణి స్వామి ఉన్నారు. పన్నీరు అప్పీలు పళణి స్వామిని ప్రధాన కార్యదర్శిగా కేంద్ర ఎన్నికల కమిషన్ అంగీకరించడాన్ని వ్యతిరేకిస్తూ పన్నీరు సెల్వం అప్పీల్‌కు వెళ్లారు. శనివారం ఆయన తరపు ప్రతినిధులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్నాడీఎంకే కు సంబంధించిన కేసులు హైకోర్టులో విచారణలో ఉన్నాయని, ఈ సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అందులో వివరించారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా పన్నీరు సెల్వం నేతృత్వంలో ఈనెల 24వ తేదీన తిరుచ్చి వేదికగా మహానాడు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో అన్నాడీఎంకే పేరు, పార్టీ జెండా, గుర్తును ఉపయోగించకుండా పన్నీరు మద్దతుదారులపై పళణి మద్దతు దారులు కొరడా ఝుళిపించే పనిలో పడ్డారు. తిరుచ్చితో పాటు పలు చోట్ల పన్నీరు మద్దతుదారులకు వ్యతిరేకంగా పళణి శిబిరం పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నాం: సీఎస్ జవహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశం కోర్టు పరిధిలో ఉందని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. సమస్యను పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం జగన్ అనేకసార్లు కోరారని పేర్కొన్నారు. ఇప్పటికే పలు అంశాలపై కేంద్రంతో చర్చలు జరిపామని చెప్పారు. మరోసారి కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు వెల్లడించారు. రెవెన్యూలోటుతోపాటు పలు అంశాలను చర్చిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎస్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పర్యటనకు రావాలని సీఎంను కూడా కోరినట్లు జవహర్ రెడ్డి తెలిపారు. వ్యక్తిగత పర్యటనల వాయిదాకు సీఎం అంగీకరించారని పేర్కొన్నారు. తామంతా రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నామని.. అవసరమైతే సీఎం జగన్ కూడా ఢిల్లీకి వస్తారని తెలిపారు. -
తిక్కతో లెక్కతప్పిన పవన్ !
-
ఢిల్లీలో పవన్ పనులు హాస్యాస్పదం: ఎంపీ భరత్
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్పీసీ ఎంపీ మార్గాని భరత్ రామ్ సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ చేసే పనులన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరిలో విశ్వసనీయత అనేది లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంపీ భరత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అజెండాను పవన్ మోసుకుని ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్లాడా? లేక వాళ్లే పిలిచారా అన్న విషయం తెలియాలి. ఢిల్లీ పెద్దలు పవన్‌కు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ప్రజలు అనుకుంటున్నారు. తెలుగు ప్రజల గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టొదు అంటూ హితవు పలికారు. పవన్ ఢిల్లీలో చేసే పనులన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి. మిత్రధర్మం పాటించని మిమ్మల్ని ఢిల్లీ పెద్దలు ఎందుకు గౌరవిస్తారు. చంద్రబాబు, పవన్ ఇద్దరిలో విశ్వసనీయత అనేది లేదు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్‌ను మిత్రపక్షంగా గెలిపించే ప్రయత్నం కూడా జనసేన చేయకపోవడం విచిత్రంగా ఉంది. గతంలో పవన్.. పాచిపోయిన లడ్డులు అని చెప్పి బీజేపీ పెద్దలతో మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళ్లాడో చెప్పాలి. పవన్ రెండు కనిపిస్తే.. మళ్లీ మూడు రోజులు కనిపించడు. చంద్రబాబుపై ప్రజలకు ఏ మాత్రం నమ్మకం లేదు. రాష్ట్రంలో ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ నమ్మకం, తమ భవిష్యత్తు అని అనుకుంటున్నారు. ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లబోతున్నాము. రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. డీబీటీ ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. రాష్ట్రంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ మాత్రమే. చంద్రబాబు హయాంలో ఏ రకమైన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు కూడా అమలు జరగలేదు. 2024లో కూడా సీఎం జగనే ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్ర ముఖచిత్రం కూడా మారుతుంది’ అని అన్నారు. -
పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన సీక్రెట్ ఇదే.. అక్కడ ఏం జరిగింది?
పవన్ కల్యాణ్ ప్రకటన చాలా ఆశ్చర్యంగా, విచిత్రంగా ఉంది.. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లింది.. బీజేపీ బలపడాలని వారికే చెప్పడానికా..? అసలు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఎవరి కోసం..? ఎందుకోసం..? ఆయన సాధించిందేంటీ..?. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ పార్టీ బీజేపీ. ఏపీలో బలహీనంగా ఉండొచ్చు.. కానీ పవన్ కల్యాణ్ లాంటి బలహీనుడి దగ్గర సలహాలు అయితే తీసుకోదు కదా..! జనసేన స్థాపించి పదేళ్లైనా.. టీడీపీ జెండాలు మోయడానికి, చంద్రబాబు మౌత్ పీస్‌గానే పని చేస్తుందని ప్రజలకు తెలియనిది కాదు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జెండా ఉన్నా.. అద్దెకివ్వడానికే.. అజెండాలేని.. సిద్దాంతాలు ఏమాత్రం లేని పార్టీ జనసేన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చంద్రబాబు లైన్‌ను వినిపించడానికి బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం పవన్ కల్యాణ్ 48 గంటలు వేచి చూడాల్సి వచ్చింది. నడ్డాతో భేటీ తరువాత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ బాడీ లాంగ్వేజ్ చూస్తే విశాఖపట్నంలో ప్రధాని మోదీ క్లాస్ పీకినట్లు కనిపించిన లాంగ్వేజ్‌నే కనిపించింది. నడ్డా కూడా పవన్ కల్యాణ్‌కు క్లాస్ పీకి ఉంటాడని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ బాడీ లాంగ్వేజ్‌నే చెబుతోంది. ఏపీలో ఏమాత్రం బలంలేని జనసేన. బలపడాలని బీజేపీకి సూచించానని.. పవన్ చెప్పడం నమ్మశక్యంగా లేదు. చదవండి: యెల్లో బ్యాచ్ డ్రామాకు సీఎం జగన్ చెక్ టీడీపీతో పొత్తు ప్రసక్తేలేదని నడ్డా.. పవన్ ముఖం మీద చెప్పడం వల్లనే.. పొత్తుల గురించి చర్చించలేదని.. పవన్ కల్యాణ్ మీడియా ముందు అబద్ధం చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు. పవన్ కల్యాణ్ అజెండా క్లియర్.. టీడీపీ - జనసేన పొత్తులోకి బీజేపీని లాగి.. 2014లా 2024లో పోటీ చేయాలనేది పవన్ ఉబలాటం. కానీ...చంద్రబాబును బీజేపీ అధిష్టానం నమ్మే పరిస్థితి లేదు. అందుకే.. హెచ్చరికలతోపాటు.. హితోపదేశం బీజేపీ పెద్దలు చేస్తున్నా.. పవర్ లెస్ స్టార్ చెవికెక్కడం లేదు. చంద్రబాబు లైన్లో ఢిల్లీ వెళ్లిన పవన్.. చివరకు మీడియాతో అబద్ధాలు చెప్పి.. బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
పోలవరం తాజా అంచనాలు ఆమోదించాలి
సాక్షి, న్యూఢిల్లీ: టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) నిర్ధారించిన పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలు రూ.55,548 కోట్లకు వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు బుధవారం ఢిల్లీకి వచ్చిన ఆయన గురువారం ఉదయం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి అందాల్సిన నిధులు, బకాయిల అంశాలతో పాటు ప్రత్యేక హోదా అంశాలపై సుమారు అర గంట పాటు చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రం వాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2,020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, ఈ నిధులనూ వెంటనే విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేసిన రూ.2600.74 కోట్లను సత్వరమే రీయింబర్స్ చేయాలన్నారు. సీఎం జగన్ ఇంకా ప్రస్తావించిన అంశాలు ఇలా ఉన్నాయి. ► రుణాల విషయంలో రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు సరికాదు. వీటి విషయంలో పునరాలోచన చేయాలి. ప్రస్తుత ప్రభుత్వ తప్పు లేకున్నా, రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించింది. నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణ పరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లకు కుదించారు. ఈ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ► ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు వెంటనే మంజూరు చేయాలి. ► 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. ఈ డబ్బును వెంటనే ఇప్పించాలి. ► 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్లు పెండింగులో ఉన్నాయి. వీటిని విడుదల చేయాలి. ► రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. ఈ దృష్ట్యా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్ సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని గురువారం తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసేందుకు ఈ నెల 29న మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. బుధవారం రాత్రి అమిత్‌షాను కలిశారు. గురువారం ఉదయం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. -
కేంద్ర మంత్రులతో సీఎం జగన్ చర్చించిన కీలకాంశాలివే
సాక్షి, ఢిల్లీ/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. తన పర్యటనలో భాగంగా ఏపీకి సంబంధించిన పలు కీలకాంశాలను కేంద్రానికి నివేదించారు సీఎం జగన్. కేంద్రం మంత్రులతో.. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలతో పాటు ఏపీకీ రావాల్సిన నిధులు, బకాయిలపైనా ఆయన చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ఇవాళ ఉదయం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఆర్థిక మంత్రితో సీఎం జగన్ చర్చించిన అంశాలివే.. ► ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే ఈ డబ్బు మంజూరుచేయాలి. ► రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకున్నా... రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదు. నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లుకు కుదించారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ► తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. బకాయిలను వెంటనే ఇప్పించండి. ► 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. వాటిని విడుదల చేసేలా చూడండి. ► పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్ గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలి. ► పోలవరం డయాఫ్రమ్‌వాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2, 020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంంది. వెంటనే ఈ నిధులు విడుదల చేయాలి. ► పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చుచేసిన రూ.2, 600.74 కోట్ల రూపాయలను సత్వరమే రీయింబర్స్ అయ్యేలా చూడాలి. ► పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. దీనికి వెంటనే ఆమోదం తెలపాలి. దీంతోపాటు ప్రాజెక్టుకు సంబంధించి ఇతరత్రా అంశాలను చర్చించారు సీఎం జగన్. ► రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారాయన. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. బుధవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ అరగంట భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారాయన. హోం మంత్రి అమిత్ షాకి సీఎం జగన్ నివేదించిన కీలక అంశాలు.. ► విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగానష్టపోయింది. అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా, అభివృద్ధి పరంగా, వివిధ సంస్థల రూపేణా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాలనుంచి కాపాడేందుకు, రక్షణగా విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. పార్లమెంటు సాక్షిగా కూడా ఈ హామీలు ఇచ్చింది. విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తున్నా రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. వీటిపై వెంటనే దృష్టిసారించమని కోరుతున్నాను. ► పోలవరం ప్రాజెక్టును మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరుతున్నాను. ► అనూహ్య వరదల కారణంగా డయాఫ్రంవాల్ దెబ్బతింది. డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.202౦ కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీడీఆర్‌ఎంపీ అంచనావేసింది. ఈ డబ్బును వెంటనే విడుదలచేయాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ► రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానానుంచి రూ.2,600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను. ► పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. ఈ మొత్తానికి వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నాను. ► తాగునీటి సరఫరా అంశాన్నికూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌వారీ నిబంధనలను సడలించాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ► పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అదిస్తే జాప్యాన్ని నివారించవచ్చు. ► 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. ఈ నిధులను వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరుతున్నారు. ► రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కన్నా ముందున్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడుకుందన్న కారణంతో ఇప్పుడు ఆంక్షలు విధించారు. నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను. ► తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ► జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, రూ.56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇవ్వడంవల్ల దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలోఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్రం ప్రభుత్వం నెలకు వినియోగించని రేషన్ దాదాపు 3లక్షల టన్నులు ఉంటుంది. ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే సరిపోతుంది. దీనిపై దృష్టిపెట్టాలని కోరుతున్నాను. ► రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి.ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ► కొత్తగా కేంద్రం మంజూరుచేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా రాష్ట్రంలో 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేయాలని కోరుతున్నాను. ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయపడాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ఇదీ చదవండి: ఏపీ తీర ప్రాంతాల.. అభివృద్ధి బాటలు -
జీవనాడికి సహకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అడ్‌హక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని విభజన హామీల నోడల్ ఏజెన్సీ అయిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లయినా ప్రధాన సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిపై దృష్టిసారించాలని కోరారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివరించారు. బుధవారం ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆయన రాత్రి సుమారు 40 నిమిషాల పాటు అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు పెండింగ్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ‘అశాస్త్రీయ విభజన వల్ల ఏపీకి ఆర్థికంగా, ఆదాయాల పరంగా, అభివృద్ధి పరంగా, వివిధ సంస్థల రూపేణా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాల నుంచి కాపాడేందుకు పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. అది జరిగి తొమ్మిదేళ్లు కావొస్తున్నా రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిపై వెంటనే దృష్టి సారించాలి’ అని సీఎం కోరారు. ఇంకా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన అంశాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అనంతరం అధికారిక నివాసానికి వెళ్తున్న సీఎం జగన్ వేగం పెరగాలంటే నిధులివ్వాలి ► అనూహ్య వరదల కారణంగా పోలవరం డయా ఫ్రం వాల్ దెబ్బతింది. ఆ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు రూ.2,020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీడీఆర్‌ఎంపీ అంచనా వేసింది. ఈ సొమ్ములు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సొంత ఖజానా నుంచి రూ.2,600.74 కోట్లు ఖర్చు చేసింది. రెండేళ్లుగా ఈ సొమ్ము పెండింగ్‌లో ఉంది. వెంటనే చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ.55,548 కోట్లుగా నిర్ధారించింది. ఈ మొత్తానికి వెంటనే ఆమోదం తెలపాలి. తాగునీటి సరఫరా అంశాన్ని కూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలి. ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌వారీ నిబంధనలను సడలించాలి. ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలి. డీబీటీ పద్ధతిలో ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని నివారించవచ్చు. ఈ నేపథ్యంలో పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలి. ► 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద పెండింగ్‌లో ఉన్న రూ.36,625 కోట్లు వెంటనే విడుదలయ్యేలా చూడాలి. ► రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కన్నా ముందున్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడుకుందన్న కారణంతో ఇప్పుడు ఆంక్షలు విధించారు. నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణ పరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ► తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాలి. ► జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించక పోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇవ్వడం వల్ల దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్ కూడా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నెలకు వినియోగించని రేషన్ దాదాపు 3 లక్షల టన్నులు ఉంటుంది. ఇందులో 77 వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే సరిపోతుంది. దీనిపై దృష్టి సారించాలి. ► రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీని వల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడమే కాకుండా, సేవా రంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. అందువల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నాం. ► కొత్తగా కేంద్రం మంజూరు చేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా రాష్ట్రంలో 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలి. (జిల్లాకు ఒక కాలేజీ చొప్పున మాత్రమే కేంద్రం సాయం చేస్తుంది.. రాష్ట్రంలో మరో రెండు కాలేజీలు అదనం) ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయ పడాలి. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌కు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీలు మిథున్‌రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వంగా గీత, తలారి రంగయ్య, శ్రీకృష్ణదేవరాయలు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, అనూరాధ, మాధవి, బీవీ సత్యవతి, ఆర్.కృష్ణయ్య, కోటగిరి శ్రీధర్, బీద మస్తానరావులు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. రాత్రి అధికారిక నివాసంలో బస చేశారు. గురువారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. -
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ
► కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. పోలవరం నిధులు విడుదలతో పాటు విభజన హామీలు అమలు చేయాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారు. ►ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో సీఎంకు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంగా గీత, రెడ్డప్ప, తలారి రంగయ్య, గురుమూర్తి, అదాల ప్రభాకర్ రెడ్డి, మాధవి, అనురాధ, సత్యవతి, అయోధ్య రామిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, లావు శ్రీకృష్ణదేవరాయలు, బీద మస్తాన్ రావు, కోటగిరి శ్రీధర్ ఘన స్వాగతం పలికారు. ►రాత్రి 9:30కు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. ►గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. రాత్రి 9:30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. -
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ (ఫోటోలు)
-
ప్రధాని మోదీతో సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలు ఇవే..
3:30PM ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ చర్చించారు. 3:00PM కేంద్ర మంత్రి అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం(శుక్రవారం) అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అమిత్ షాతో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ప్రధానితో సీఎం జగన్ భేటీ ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాన మంత్రి కార్యాలయంలో సమావేశమైన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. ఈ మేరకు సీఎం విజ్ఞాపన పత్రం అందించారు. ప్రధానితో సీఎం ప్రస్తావించిన అంశాలు: ♦రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. వీటిపై వెంటనే దృష్టిసారించమని కోరుతున్నాను. ♦గతంలో నేను ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి కొంత పురోగతి సాధించింది. కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ♦2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ చేస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రభుత్వం చెప్పింది. ఈ నిధులను వెంటనే విడుదలచేయాల్సిందిగా, సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ♦గతంలో ఉన్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడిందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారు. ఈ ప్రభుత్వం తప్పు లేకపోయినప్పటికీ నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ♦పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేదిశగా ప్రాజెక్టు నిర్మాణాన్ని సాగిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయలో కేంద్రం ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే కొద్దికాలంలోనే ఇది వాస్తవ రూపంలోకి వస్తుంది. ఫలితాలు ప్రజలకు అందుతాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాను సొంతంగా సొంత ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను. ♦పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. వెంటనే దీనికి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నారు. ♦తాగునీటి సరఫరా అంశాన్నికూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వారీగా నిబంధనలను సడలించాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ♦పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని నివారించవచ్చు. ♦పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10వేల కోట్లు మంజూరుచేయాలని కోరుతున్నాను. ♦తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన బకాయిలు అలానే ఉన్నాయి. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ♦జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనివల్ల పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, 56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇస్తోంది. దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలోఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వినియోగించని రేషన్ కోటాను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. ♦రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ♦రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ప్రతిజిల్లాకు సుమారుగా 18లక్షలమంది జనాభా ఉన్నారు. కొత్తగా కేంద్రం మంజూరుచేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేయాలని కోరుతున్నాను. ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయపడాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ♦వైఎస్సార్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజనచట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఈ ప్లాంట్ నిలదొక్కుకోవాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీ ఎండీసీకి గనులు కేటాయించాలని విజ్ఞప్తిచేస్తున్నాను. -
CM YS Jagan: ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు(గురువారం) సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీకి పయనమయ్యారు సీఎం జగన్. తొలుత తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్.. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. రాత్రి 7.30 గంటల సమయలో సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి 1 జన్‌పథ్ నివాసంలో బస చేస్తారు సీఎం జగన్. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం జగన్ భేటీ కానున్నట్టు సమాచారం. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. -
ఈడీ విచారణ: చెల్లి కోసం ఢిల్లీకి మంత్రి కేటీఆర్..
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఢిల్లీకి బయలు దేరారు. రేపు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతున్న క్రమంలో తన చెల్లికి నైతిక మద్దతు ఇవ్వడానికి కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే కేటీఆర్ ఉండనున్నారు. ఢిల్లీలో న్యాయ నిపుణులతో భేటీ కానున్నట్లు తెలిసింది. కవిత ఈడీ విచారణ జరుగుతున్న సమయంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, కవిత విచారణ నేపథ్యంలో మరో ఏడుగురికి ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు కవిత విచారణకు ముందే సిసోడియా రిమాండ్ రిపోర్ట్‌తో ఈడీ సంచలనం సృష్టించింది. సిసోడియా రిమాండ్ రిపోర్ట్‌లో కవిత పేరు ప్రస్తావించింది. ఇదిలా ఉండగా, కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ స్పందించారు. కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని కేసీఆర్ అన్నారు. ‘‘రేపు విచారణ పేరుతో కవితను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టొచ్చు. చేసుకుంటే చేసుకోనీ అందర్నీ వేధిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. న్యాయపోరాటం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం’’ అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారు. కవితను కూడా చేరమన్నారు. మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు’’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు. చదవండి: రేపు కవితను అరెస్ట్ చేయొచ్చు: సీఎం కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ -
Delhi: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
పారిశ్రామికవేత్తల ఫీడ్‌బ్యాక్ వల్లే నెంబర్ వన్‌గా ఉన్నాము: సీఎం జగన్
UPDATES.. ► విశాఖ వేదికగా మార్చిలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ఇవాళ ఢిల్లీలో జరిగిన సన్నాహక సమావేశం ముగిసింది. ► ఏపీలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ కృతజ్ఞతలు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా వంతు సహకారం అందిస్తాము. ప్రపంచవేదికపై ఏపీని నెలబెట్టడానికి మీ సహకారం మాకు అవసరం. ఈ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్‌గా ఉంది. పరిశ్రమల స్థాపనకు మేము చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోనే మేము నంబర్ వన్‌గా ఉన్నాము. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చేస్తున్న రాష్ట్రం ఏపీ. 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో మూడు ఏపీకే రావడం శుభపరిణామం. - సీఎం వైఎస్ జగన్. ► కోవిడ్ సమయంలో ఫ్యాక్టరీ ప్రారంభించాము. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రోత్సాహం అమోఘం. ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసింది. మంచి నైపుణ్యం ఉన్న నిపుణులకు ఏపీలో కొదవలేదు. పరిశ్రమల స్థాపనకు సీఎం జగన్, మంత్రులు, అధికారుల కృషి అద్బుతం. పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. - బి. సంతానం, సీఈవో ఇండియా సెయింట్ గోబైన్ ►స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం మా ప్రాధాన్యత. కంపెనీకి ఆపరేషన్‌పై స్థానిక అధికారుల సహకారం బాగుంది. - ఎవర్టన్ టీ ఇండియా డైరెక్టర్ రోషన్ గుణవర్దన ►15వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాము. ఏపీ కేంద్రంగా అధునాతన ఉత్పత్తుల ఎగుమతి జరుగుతోంది. - అపాచీ అండ్ హిల్‌టాప్ గ్రూప్ డైరెక్టర్ సెర్జియా లీ ►ఏపీలో రూ.వెయ్యి కోట్లతో 2 బిజినెస్ యూనిట్లు ప్రారంభించాము. 2030 నాటికి ఉత్పత్తిని రెండింతలు చేస్తాము. -టోరే ఇండస్ట్రీస్ ఎండీ యమగూచి. ►ఏపీ ప్రభుత్వం మాకు ఎంతో మద్దతు ఇస్తోంది. రూ. 650 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాము. ఎంతో మందికి ఉపాధి కల్పించాము. రాబోయే రోజుల్లో మరిన్ని యూనిట్లు నెలకొల్పుతాము. శ్రీ సిటీ ఫ్యాక్టరీ ఏర్పాటులో ప్రభుత్వ సహకారం మరువలేనిది. మా కంపెనీ ద్వారా 600 ఉద్యోగాలు కల్పించాము. మా కంపెనీలో 50 శాతం మంది మహిళలే. కంపెనీలో ఉద్యోగలంతా స్థానికులే. మొత్తం ఆరు ఆపరేటింగ్ లైన్స్‌తో ప్రొడక్షన్ జరుగుతోంది. అదనంగా మరొక లైన్ ద్వారా ఉత్పత్తి చేయబోతున్నాము. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీనే పెట్టుబడులకు అనుకూలం. - క్యాడ్బరీ ఇండియా ప్రెసిడెంట్ దీపక్ ► ఏపీ బిజినెస్ పాలసీ, మౌలిక వసతులు పరిశ్రమల పెట్టుబడులకు అనుకూలం. పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు బాగున్నాయి. - తాయి జిన్ పార్క్ కియా మోటర్స్ ఎండీ, సీఈవో ► ఏపీలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలు ఉన్నాయి. బల్క్ డ్రగ్స్, స్పైస్ పరిశ్రమల నెలకొల్పేందుకు మంచి అనుకూల వాతావరణం ఉంది. నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. నిరంతర విద్యుత్, ల్యాండ్ బ్యాంక్, సమృద్దిగా ఉంది. -బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి. సాక్షి, ఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతో పాటు పలువురు అధికారుల బృందం ఉన్నారు. అనంతరం, వివిధ దేశాల దౌత్యవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో పాల్గొననున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి/గన్నవరం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో మంగళవారం జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతో పాటు పలువురు అధికారుల బృందం సోమవారం ఢిల్లీకి వెళ్లింది. కాగా, ఈ సమావేశానికి వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అంబాసిడర్లతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఏపీ అడ్వాంటేజ్.. ఈ ఏడాది మార్చి 3,4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుంది. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో, బిజినెస్-టు-బిజినెస్ (B2B), బిజినెస్-టు-గవర్నమెంట్ (B2G) సమావేశాలు, కీలక ప్రసంగాలు, సెక్టార్-నిర్దిష్ట దేశ-నిర్దిష్ట ప్లీనరీ సెషన్లను నిర్వహించనున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసిన 13 కేంద్రీకృత రంగాలపై సెక్టోరల్ సెషన్లను ప్లాన్ నిర్వహించనున్నారు. ఇందులో వివిధ రంగాల పారిశ్రామిక నిపుణులు తమ అనుభవాలను పంచుకొనున్నారు. ఈ అంతర్జాతీయ పెట్టుబడుదారుల సదస్సును విజయవంతం చేసేందుకు దేశంలోని ముఖ్య నగరాలలో వివిధ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా తొలుత న్యూఢిల్లీలో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు 28 మంది విదేశీ పెట్టుబడిదారులు, 44 దేశాలకు చెందిన రాయబారులను ఆహ్వానించారు. ఏపీ అడ్వాంటేజ్ అనే థీమ్‌తో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరించనున్నారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణం, బలమైన పారిశ్రామిక, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు తదితర అంశాలను వివరిస్తారు. అలాగే ప్రభుత్వం తరఫున అందించే ప్రోత్సాహకాలు, ప్రత్యేక రాయితీలు తదితర అంశాలను వివరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నాయి. అలాగే వివిధ దేశాల రాయబారులతో ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలను సీఎం జగన్ వివరిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తమ తమ దేశాల వ్యాపారవేత్తలను ప్రోత్సహించాల్సిందిగా డిప్లమాట్స్ను కోరుతారు. ఈ కర్టెన్ రైజర్ ఈవెంట్‌తో పాటు ఫిబ్రవరిలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా,ముంబై నగరాల్లో రోడ్డు షోలను కూడా ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. -
CM YS Jagan: ఢిల్లీ బయల్దేరిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. సీఎం వెంట సీఎస్ జవహర్‌రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, సీఎస్‌వో చిదానందరెడ్డి ఉన్నారు. ఇవాళ రాత్రికి 1- జన్‌పథ్ నివాసంలో సీఎం జగన్ బస చేస్తారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్ కార్యక్రమాలకు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 10.30గంటల నుంచి 5-30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్ హెటల్లో దౌత్యవేత్తలతో సీఎం జగన్ సమావేశమవుతారు. సాయంత్రానికి పర్యటన ముగించుకుని తాడేపల్లికి తిరుగుపయనం అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సమావేశానికి వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అంబాసిడర్లతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఏపీ అడ్వాంటేజ్ ఈ ఏడాది మార్చి 3,4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుంది. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో, బిజినెస్-టు-బిజినెస్ (B2B), బిజినెస్-టు-గవర్నమెంట్ (B2G) సమావేశాలు, కీలక ప్రసంగాలు, సెక్టార్-నిర్దిష్ట దేశ-నిర్దిష్ట ప్లీనరీ సెషన్లను నిర్వహించనున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసిన 13 కేంద్రీకృత రంగాలపై సెక్టోరల్ సెషన్లను ప్లాన్ నిర్వహించనున్నారు. ఇందులో వివిధ రంగాల పారిశ్రామిక నిపుణులు తమ అనుభవాలను పంచుకొనున్నారు. ఈ అంతర్జాతీయ పెట్టుబడుదారుల సదస్సును విజయవంతం చేసేందుకు దేశంలోని ముఖ్య నగరాలలో వివిధ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా తొలుత న్యూఢిల్లీలో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు 28 మంది విదేశీ పెట్టుబడిదారులు, 44 దేశాల కు చెందిన రాయబారులను ఆహ్వానించారు. ఏపీ అడ్వాంటేజ్ అనే థీమ్ తో రాష్ట్రంలో లో పెట్టుబడుల అవకాశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరించనున్నారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణం, బలమైన పారిశ్రామిక, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు తదితర అంశాలను వివరిస్తారు. అలాగే ప్రభుత్వం తరఫున అందించే ప్రోత్సాహకాలు, ప్రత్యేక రాయితీలు తదితర అంశాలను వివరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నాయి. అలాగే వివిధ దేశాల రాయబారులతో ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలను సీఎం జగన్ వివరిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తమ తమ దేశాల వ్యాపారవేత్తలను ప్రోత్సహించాల్సిందిగా డిప్లమాట్స్ ను కోరుతారు. ఈ కర్టెన్ రైజర్ ఈవెంట్ తో పాటు ఫిబ్రవరిలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా,ముంబై నగరాల్లో రోడ్డు షోలను కూడా ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. -
ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
Updates: 02:39PM ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్ Time: 11:23 AM అమిత్‌షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం వినతించారు. ఏపీ విభజన అంశాలు, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. Time: 10:43 AM కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. విభజన హామీలు, పెండింగ్ బకాయిల సహా తదితర అంశాలపై చర్చిస్తున్నారు. Time: 10:16 AM ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ కానున్నారు. ఏపీకి చెందిన పలు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. సాక్షి, అమరావతి: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఉదయం 10.30 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. -
కన్నీళ్లను తుడిచేది సీమ ఎత్తిపోతలే
సాక్షి, న్యూఢిల్లీ: తరతరాలుగా కరువుతో తల్లడిల్లుతున్న సీమ కడగండ్లు తీర్చేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌కు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. కరువుతో అల్లాడే సీమ ప్రాంతానికి తాగునీరు అందించేలా రాయలసీమ ఎత్తిపోతల ఎంతో ఉపకరిస్తుందని పథకం ఆవశ్యకతను వివరించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు సంబంధించిన అంశాలను కూడా కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. మచిలీపట్నం, భావనపాడు పోర్టులు, పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వేగంగా మంజూరు చేసి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలని కోరారు. బుధవారం ఢిల్లీలో భూపేంద్రయాదవ్‌తో 40 నిమిషాల పాటు సమావేశం సందర్భంగా పర్యావరణ అనుమతులతోపాటు రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు. ఏకపక్షంగా నీటి విడుదల.. కృష్ణా నదిపై ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆపరేషనల్ ప్రొటోకాల్స్, ఒప్పందాలు, ఆదేశాలను ఉల్లంఘించడంతో కృష్ణాపై వాటా హక్కుల్ని ఏపీ కోల్పోవాల్సి వస్తోందన్నారు. 2021–22, 2022–23లో సీజన్ ప్రారంభమైన తొలిరోజు నుంచి అంటే జూన్ 1వ తేదీ నుంచే విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను వినియోగించడం ప్రారంభించిందన్నారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 834 అడుగులు కంటే తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేయడంతో పాటు బోర్డుకు ఎలాంటి ఇండెంట్ లేకుండా... నాగార్జునసాగర్, కృష్ణాడెల్టాకు అవసరం లేనప్పటికీ ఏకపక్షంగా నీటిని విడుదల చేసిందన్నారు. నీటి పారుదల అవసరాల్లో విద్యుదుత్పత్తి అన్నది కేవలం యాదృచ్ఛికంగా ఉంటుందని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 796 అడుగుల దిగువ వరకు నీటిని విడుదల చేస్తూ శ్రీశైలంలో కనీస నీటి మట్టం నిర్వహణకు సహకరించడం లేదని సీఎం జగన్ తెలిపారు. దీనివల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందిని గతంలోనే కేంద్రం దృష్టికి తెచ్చామని గుర్తు చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 881 అడుగులకు చేరుకుంటే కానీ పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిస్థాయిలో నీటి విడుదల సాధ్యం కాదని కేంద్రమంత్రికి వివరించారు. లేదంటే పోతిరెడ్డిపాడు నుంచి కరువు పీడిత రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలతో పాటు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, చెన్నైకి తాగునీరు అందించడం సాధ్యం కాదన్నారు. ఎత్తిపోతల మినహా మరో ప్రత్యామ్నాయం లేదు.. తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా, ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (3 టీఎంసీలు), దిండి పథకాల గురించి గతంలోనే కేంద్రం దృష్టికి తెచ్చామని సీఎం జగన్ గుర్తు చేశారు. దీనివల్ల శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల కంటే పైన నిర్వహించడం సాధ్యం కాదని, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని వినియోగించుకోవడం కూడా సాధ్యపడదన్నారు. ఈ పరిస్థితుల నేప«థ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్ఎల్ఎస్) అమలు చేయడం మినహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని, దీనిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తెలుగు గంగ ప్రాజెక్టు, ఎస్ఆర్బీసీ, గాలేరునగరి సుజల స్రవంతికి సరఫరా చేయగలుగుతామన్నారు. నిబంధనలు, ప్రొటోకాల్స్‌ను పూర్తిగా విస్మరించి తెలంగాణ ప్రభుత్వం నీటిని విడుదల చేయటాన్ని దృష్టిలో పెట్టుకుని రాయలసీమ ఎత్తిపోతలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడం ద్వారా ఏపీ ప్రయోజనాలు ప్రమాదంలో పడకుండా కాపాడాలన్నారు. ప్రధాన కాలువకు నీటిని అందించేందుకే.. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర అటవీ పర్యావరణశాఖకు దరఖాస్తు చేశామని, దీనికి సంబంధించి రాష్ట్ర అధికారులతో సమగ్ర చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి సమాచారాన్ని ఇప్పటికే అందించామన్నారు. ఇందుకోసం భూ సేకరణ చేయడం లేదని, అటవీ ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యాల ప్రమేయం లేదని, ఎకో సెన్సిటివ్ జోన్ నుంచి 10 కి.మీ దూరంలో ఉండడంతో పాటు కేవలం ప్రధాన కాలువకు పూర్తిస్థాయిలో నీటిని అందించడం కోసమే ఎత్తిపోతలను చేపడుతున్నట్లు సీఎం వివరించారు. వీలైనంత త్వరలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తి.. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టిందని సీఎంజగన్ వివరించారు. పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తికి అనువైన స్థలాలను గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, వీటిని ప్రోత్సహించేందుకు పాలసీ కూడా రూపొందించినట్లు తెలిపారు. ఆ తరహా ప్రాజెక్టులకు ఎర్రవరం, కురికుట్టి, సోమశిల, అవుకు లాంటి చోట్ల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో వాటికి అనుమతులు ఇవ్వాలని కోరారు. వైఎస్సార్ జిల్లా గండికోట వద్ద 1,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కోసం ఇప్పటికే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు గుర్తు చేశారు. వీటితో పాటు లోయర్ సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్టు (230 మెగావాట్లు), అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టుల (1,350 మెగావాట్లు) పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ఉజ్వల ప్రగతికోసం చేపట్టిన ఆయా ప్రాజెక్టులన్నింటికీ అవసరమైన పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్రమంత్రికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. 3 పోర్టులు.. 9 ఫిషింగ్ హార్బర్లు ‘‘ఏపీ 974 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతంతో అపారమైన ఆర్థిక కార్యకలాపాలకు అనువుగా ఉందని సీఎం జగన్ కేంద్రమంత్రికి తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు తీరప్రాంతంలో 10 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు 9 వ్యూహాత్మక ప్రదేశాలలో ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రామాయపట్నం ఓడరేవు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2024 మార్చి నాటికి పోర్టు కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయన్నారు. మచిలీపట్నం, భావనపాడు పోర్టులకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుని అవసరమైన సమాచారాన్ని కూడా అందజేశామన్నారు. ఈ పనులను వేగంగా ప్రారంభించేందుకు వీలుగా అనుమతులిచ్చి సహకారం అందించాలని కోరారు. -
ప్రధాని సానుకూలంగా స్పందించారు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రితో చర్చించా. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు, పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరాను. వీటిపై ప్రధాని గారు సానుకూలంగా స్పందించారు’’ అని సీఎం వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్న సమయంలో సుమారు గంట పాటు ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. విభజన చట్టంలో హామీలలో కీలకాంశాలు ఇంకా నెరవేరలేదని, త్వరగతిన వాటి విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారితో చర్చించడం జరిగింది. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు, పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరిన నేపథ్యంలో ప్రధాని గారు సానుకూలంగా స్పందించారు. pic.twitter.com/20WiwfSlXQ — YS Jagan Mohan Reddy (@ysjagan) December 28, 2022 ఏపీకి ప్రత్యేక హోదా అంశం, కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంతో పాటు పెండింగ్ బకాయిల విడుదలలో జాప్యం, జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు, తెలంగాణ డిస్కం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు, ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు మెట్రో రైల్వే లైన్, కడప స్టీల్ ప్లాంట్ అంశాలను సైతం ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వీటికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. -
ప్రధానితో భేటీలో కీలకాంశాలను ప్రస్తావించిన సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా.. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మధ్యాహ్నాం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకాంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు సీఎం జగన్. ముందుగా.. కోవిడ్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రధానికి వివరించారు. ఆపై రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్ల సుదీర్ఘకాలం గడిచినప్పటికీ.. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, పైగా రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని సీఎం జగన్, ప్రధానికి వివరించారు. గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు, పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర హామీలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశం అయ్యిందని, అయినప్పటికీ కొంత పురోగతే కనిపిస్తోందని, కీలకాంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రధానికి వివరించారు సీఎం జగన్. ► 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉన్నాయని, 2014–15 సంవత్సరానికి సంబంధించిన రూ.18,330.45కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని ప్రధాని మోదీని కోరారు. ► గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను, ఈ ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ, రుణాలపై పరిమితి విధిస్తోంది. కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోంది. ఈ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయనప్పటికీ గత ప్రభుత్వం చేసిన దానికి ఆంక్షలు విధిస్తోంది. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సీఎం జగన్, ప్రధానిని కోరారు. ► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదు. ఈ డబ్బును వెంటనే చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఖరారు అంశం కూడా ఇంకా పెండింగులోనే ఉంది. మొత్తం ప్రాజెక్టుకోసం రూ.55,548 కోట్ల రూపాయలు అవుతుందని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇప్పటికే ఆమోదించిన విషయాన్ని ప్రధానమంత్రికి గుర్తుచేశారు సీఎం జగన్. డ్రింకింగ్ వాటర్ సఫ్లైని ప్రాజెక్టు నుంచి వేరుచేసి చూస్తున్నారని, దీన్ని ప్రాజెక్టులో భాగంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో జాతీయ హోదా పొందిన ఏ ప్రాజెక్టులోనైనా డ్రింకింగ్ వాటర్‌ను ప్రాజెక్టులో భాగంగా చూశారని ప్రస్తావించారు. ► పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్ వైజ్‌గా చూస్తున్నారని, బిల్లుల రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడమే కాకుండా, వ్యయం కూడా పెరుగుతోందని ప్రధానికి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యవయాన్ని కాంపొనెంట్ వైజ్‌గా చూడొద్దని, ఆ నిబంధనలను పూర్తిగా తొలగించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. ► పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీని డీబీటీ ద్వారా చెల్లించాలని, దీనివల్ల చాలావరకు సమయం ఆదా అవుతుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని, ఆలస్యం అవుతున్నకొద్దీ ప్రాజెక్టు ఖర్చు పెరిగిపోతుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టునుంచి తక్షణమే ప్రయోజనాలను అందించడానికి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని సీఎం వైఎస్ జగన్, ప్రధాని మోదీకి వివరించారు. ఇందులో భాగంగా 41.15 మీటర్ల ఎత్తు వరకూ ఆయా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని, ఈమేరకు పనులు చేయడానికి దాదాపు రూ.10,485.38 కోట్లు అవసరం అవుతుందని, ఈ డబ్బును అడహాక్‌గా మంజూరు చేసినట్టైతే పనులు వేగంగా ముందుకు సాగుతాయని పీఎంకు వివరించారు. ఈ డబ్బు మంజూరు చేసినట్టైతే భూసేకరణ, ఆర్అండ్ఆర్ పనులు సకాలంలో పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందని సీఎం జగన్, ప్రధానికి తెలిపారు. ► తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగా ప్రధానిని కోరిన సీఎం జగన్, తద్వారా తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీజెన్కోకు ఈ బకాయిలు చాలా అవసరమని తెలిపారు. ► అలాగే.. జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తంచేసిన అంశాలతో నీతి ఆయోగ్ కూడా ఏకీభవించి కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సునూ ప్రస్తావించారు సీఎం జగన్. ► రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని, వీరికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అందిస్తోందని, రూ.5,527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసిందని ప్రధానికి వివరించిన సీఎం. నెలకు సుమారు 3 లక్షల టన్నులు రేషన్ బియ్యం కేంద్రం వద్ద మిగిలిపోతున్నాయని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపు చేసినట్టువుతుందని.. ఈమేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ► రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరిన ముఖ్యమంత్రి. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవశ్యమని, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని పునరుద్ఘాటించిన సీఎం. ► రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 26కు చేరిందని, కేంద్రం కొత్తగా మంజూరుచేసిన 3 కాలేజీలతో కలిపి ఇప్పటికి 14 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పునర్విభజన తర్వాత ప్రతి జిల్లాలో సుమారుగా 18 లక్షల మంది జనాభా ఉన్నారని, మిగిలిన 12 జిల్లాలకు వెంటనే మెడికల్ కాలేజీలు మంజూరుచేయాలని పీఎంను కోరారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. ► కడపలో నిర్మించనున్న సీల్‌ప్లాంటుకు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని కోరారు. ► విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని ప్రధాని మోదీని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. -
సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన హైలైట్స్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇరువురి మధ్య దాదాపు గంటపాటు సమావేశం కొనసాగింది. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించారు. ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఢిల్లీకి వచ్చారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు అనుమతులే ప్రధానాంశంగా సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. పర్యటనలో భాగంగానే ఒడిశా మంత్రి అశోక చంద్ర సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. హాకీ ప్రపంచకప్-2023ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తరపున ఈ మ్యాచ్‌లకు సీఎం జగన్‌ను ఆహ్వానించారు. చదవండి: (Prem Sagar Reddy: అగ్రరాజ్యంలో ఆస్పత్రి కట్టిన రైతు బిడ్డ) -
సతీసమేతంగా ఢిల్లీకి సీఎం కేసీఆర్.. నాలుగు రోజులు అక్కడే మకాం!
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని ఈ నెల 14న ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ పార్టీ తాత్కాలిక కేంద్ర కార్యాలయ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారమే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్ ఢిల్లీకి చేరుకున్నారు. కార్యాలయ ప్రారంభోత్సవంలో భాగంగా యాగం నిర్వహిస్తుండటంతో ఆయా ఏర్పాట్లు పరిశీలించి పలు సూచనలు చేశారు. యాగశాల నిర్మాణం, కార్యాలయంలో చేపట్టాల్సిన మరమ్మతులు, ఇతరత్రా పనులపై ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్‌తేజతో చర్చించారు. పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా నిర్వహించే హోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. నాలుగు రోజుల పాటు సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ బాట పట్టిన బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 14న జరిగే పార్టీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు. విమానాల్లో రద్దీని దృష్టిని పెట్టుకుని పలువురు నేతలు సోమవారం సాయంత్రానికే ఢిల్లీకి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. శీతాకాలం నేపథ్యంలో ఢిల్లీకి వెళ్తున్న నేతలకు బస, ఇతర వసతుల కల్పన బాధ్యత పార్టీ ఎంపీలకు అప్పగించారు. ఈ నెల 14న కార్యాలయం ప్రారంభం అనంతరం వసంత్ విహార్‌లో నిర్మాణంలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం శాశ్వత భవన నిర్మాణ పనులు కూడా కేసీఆర్ పరిశీలిస్తారు. -
మునుగోడుపై ఢిల్లీకి చేరిన నివేదికలు.. సంజయ్‌జీ హస్తినకు రండి అంటూ కాల్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ నాయకత్వం పిలుపుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గురు, శుక్రవారాల్లో ఆయన పలువురు పార్టీ నేతలను కలుసుకోనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ ప్రచారం, తదుపరి కార్యాచరణ తదితర అంశాలపై మాట్లాడనున్నట్టు తెలిసింది. పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నిక సందర్భంగా ముఖ్యనేతల మధ్య సమన్వయ లోపాలు, ఇతర లోటుపాట్లపై అధినాయకత్వం దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై మునుగోడు ఫలితాలు ప్రభావం చూపనున్నందున, ఈ మేరకు కచ్చితమైన చర్యలు సూచించనున్నట్టు సమాచారం. నివేదికల ఆధారంగా కార్యాచరణ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ పనితీరుపై బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించున్నట్టు తెలుస్తోంది. పార్టీతో సంబంధం లేని స్వతంత్ర సంస్థలు, బృందాల ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఈ నివేదికలు తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ నివేదికల ఆధారంగా తెలంగాణలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణను అధినాయకత్వం రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వివిధ స్థాయిల నాయకుల పనితీరు, కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలు ఏ మేరకు అమలౌతున్నాయి, పార్టీ ప్రచారం ప్రజలపై ప్రభావం చూపించేలా జరుగుతోందా అన్న అంశాలపై నాయకత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సంజయ్‌ను ఢిల్లీకి రమ్మనమంటూ వర్తమానం పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
‘ప్రధాని’ ఆసక్తి లేదు: నితీశ్
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్ మంగళవారం ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాంలతో భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన సోమవారం దేశ రాజధానికి చేరుకోవడం తెలిసిందే. విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగానే వారితో సమావేశమైనట్టు అనంతరం నితీశ్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకమై విపక్షాల సమష్టి శక్తిని చాటాల్సిన సమయం వచ్చిందన్నారు. అనంతరం సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్ యాదవ్, పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఐఎన్ఎల్డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా తదితరులను కూడా నితీశ్ కలిశారు. తనకు ప్రధాని కావాలని ఉందన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ‘‘ఆ పదవికి నేను పోటీదారు కాను. దానిపై నాకు ఆసక్తీ లేదు’’ అని చెప్పుకొచ్చారు. విపక్షాలన్నింటినీ ఏకం చేయడమే తమ తొలి అజెండా తప్ప ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడం కాదని ఏచూరి చెప్పారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది సమయం వచ్చినప్పుడు తేలుతుందన్నారు. బీజేపీపై పోరులో నితీశ్ కలిసి రావడం దేశ రాజకీయాలకు గొప్ప శుభ సంకేతమని అభిప్రాయపడ్డారు. నితీశ్, కేజ్రీవాల్ భేటీ గంటన్నర పాటు సాగింది. విద్య, వైద్యం తదితర అంశాలతో పాటు ఆపరేషన్ లోటస్, విపక్షాల ఎమ్మెల్యేల కొనుగోలు తదితరాలపై చర్చించినట్టు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం బీజేపీపై పోరాటానికి వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందని రాజా అన్నారు. సోమవారం రాహుల్‌గాంధీతోనూ నితీశ్ భేటీ కావడం తెలిసిందే. 25న ‘బల ప్రదర్శన’ ర్యాలీ నితీశ్, కేసీఆర్, మమత హాజరు! సెప్టెంబర్ 25న హరియాణాలో ఐఎన్ఎల్డీ తలపెట్టిన ర్యాలీని విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మార్చాలని నితీశ్ భావిస్తున్నారు. దానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, అఖిలేశ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, అకాలీదళ్ నేత ప్రకాశ్‌సింగ్ బాదల్ తదితరులను ఐఎన్ఎల్డీ ఆహ్వానించింది. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తదితరులకు కూడా ఆహ్వానాలు పంపుతామని పేర్కొంది. ఈ ర్యాలీలో విపక్ష నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి పలు అంశాలపై లోతుగా చర్చిస్తారని చెప్పుకొచ్చింది. బీజేపీతో జనం విసిగిపోయారని చౌతాలా అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక వాతావరణం స్పష్టంగా కన్పిస్తోందని చెప్పారు. -
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన (ఫొటోలు)
-
ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
14:52PM ►ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. 13:53PM ► కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో భేటీ అయిన సీఎం వైఎస్ జగన్. ►సుమారు అరగంట పాటు కొనసాగిన భేటీ ►విద్యుత్ బకాయిలపై చర్చ 12:30PM ► రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీఎం జగన్ భేటీ ► మర్యాదపూర్వకంగా రాష్ట్రపతిని కలిసిన సీఎం జగన్ 11:19AM ► మధ్యాహ్నం 12:30 గంటలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతొ సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. 11:17AM ► మధ్యాహ్నం కేంద్ర మంత్రి ఆర్.కే. సింగ్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ. 6వేల కోట్ల విద్యుత్ బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. 11:04AM ► ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ఈ భేటీ సందర్బంగా పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని త్వరితగతిన ఇవ్వాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే, ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. ► పోలవరం, రీసోర్స్ గ్యాప్ కింద నిధులు, విభజన హామీలు, ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై ప్రధానికి సీఎం జగన్ వినతి పత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని సీఎం కోరారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.2900 కోట్లు ఖర్చు చేశాము. వీటిని రీయింబర్స్ చేయాలని మోదీని సీఎం జగన్ కోరారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. ► టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్ట్ వ్యయం రూ. 55,548.87 కోట్లకు ఆమోదం తెలిపాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. ఇప్పటి వరకు చేసిన పనులకు 15 రోజుల్లోగా రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రీసోర్స్ గ్యాప్ కింద ఏపీకి రావాల్సిన రూ. 32,625.25 కోట్లు మంజూరు చేయాలని సీఎం జగన్ కోరారు. ► తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని కూడా ప్రధాని వద్ద సీఎం జగన్ ప్రస్తావించారు. రూ. 6,756 కోట్ల బకాయిలు ఉన్నాయని, 8 ఏళ్లుగా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఈ క్రమంలోనే విభజన హామీలు అమలు చేయాలని కోరారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని ప్రధాని మోదీని సీఎం వైఎస్ జగన్ కోరారు. ప్రత్యేక హోదాతోపాటు హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరో 12 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్ వినతి పత్రం అందజేశారు. 10:30AM ►ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ప్రధానితో భేటీలో సీఎం జగన్‌తో పాటు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. కాగా, ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల మేరకు నిధుల విడుదల, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, నిధుల విడుదల తదితర విషయాల గురించి మాట్లాడనున్నారు. అలాగే, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌కర్‌లను కూడా సీఎం వైఎస్ జగన్ కలువనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రధానితో కీలక భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం రాత్రి 9:30 ప్రాంతంలో ఢిల్లీ చేరుకున్నారు. జన్‌పథ్-1లోని నివాసంలో బస చేస్తారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రధానితో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధనే ప్రధాన లక్ష్యంగా భేటీలో చర్చకు రానుంది. అలాగే, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కోరనున్నారు సీఎం జగన్. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను అమలు చేయాలని సీఎం కోరనున్నారు. -
CM Jagan: ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనకు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. 6వ తేదీ సాయంత్రం విశాఖపట్నం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రికి వన్ జన్‌పథ్‌లో బస చేసి, 7వ తేదీ (ఆదివారం) ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. ఆ తర్వాత నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అక్కడ జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఏడవ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. కాగా.. సీఎం వైఎస్ జగన్ శనివారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస జూనియర్ కాలేజీ మైదానంలో జరగనున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇదీ చదవండి: ఏపీ మెగా ప్రాజెక్టు ఒక గేమ్ చేంజర్ -
ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యాటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, రాష్ట్ర మాజీ మంత్రి పార్థ చటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మోదీతో భేటీ అవటంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు నాలుగు రోజుల ఢిల్లీ పర్యాటనకు వెళ్లారు మమతా బెనర్జీ. శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మూతో సైతం సమావేశం కానున్నారు. మమతా బెనర్జీ ఢిల్లీ టూర్లో ప్రధాని, రాష్ట్రపతితో భేటీ.. బెంగాల్ బీజేపీ, టీఎంసీల మధ్య కీలక అంశంగా మారింది. మమతా బెనర్జీ, ఆమె కుటుంబంపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది టీఎంసీ. ఆగస్టు 7న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవనున్నారు మమతా బెనర్జీ. నీతి ఆయోగ్ కౌన్సిల్ మీటింగ్‌కు ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయం, ఆరోగ్యం, ఆర్థిక అంశాలపై చర్చించనున్నారని సమాచారం. ఇదీ చదవండి: హస్తినలో తీవ్ర ఉద్రిక్తతలు.. పోలీసుల అదుపులో ప్రియాంక, రాహుల్ -
మునుగోడులో ఎవరు గెలుస్తారో నాకు తెలుసు
న్యూ ఢిల్లీ: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై.. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి మండిపడ్డారు. మునుగోడులో గెలవబోయేది ఎవరో తనకు తెలుసని.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం.. ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ తాను అందుబాటులో ఉండనని తెలిసే చండూరులో రేవంత్ సభ పెట్టారని ఆక్షేపించారు వెంకటరెడ్డి. పీసీపీ ప్రెసిడెంట్ అందరినీ ఇబ్బందిపెడుతున్నారు. నన్ను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకున్నారు. నా లోక్‌సభ పరిధిలో నన్ను అడగకుండానే రేవంత్ ఎలా మీటింగ్ పెడతారు? లోకల్ ఎంపీకి చెప్పకుండా సభ పెట్టడం తప్పు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తిని నేను. పదవుల కోసం వెంటపడే వ్యక్తి కాదు. నేను ఎవరికీ భయపడను. పాత కాంగ్రెస్ నేతలందరినీ పార్టీ నుంచి వెళ్లగొడుతున్నావు. కాంగ్రెస్ వాళ్లంతా పోతే టీడీపీ వాళ్లని చేర్చుకుంటారా?. మునుగోడులో ఎవరు గెలుస్తారో నాకు తెలుసు. నేను పార్టీ మారితే అందరికీ చెప్పే వెళ్తాను. కాంగ్రెస్‌ను రేవంత్ ఏం చేయాలనుకుంటున్నాడో.. సోనియా, రాహుల్ దగ్గర తేల్చుకుంటాం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ఈ రోజు మూడు ముఖ్యమైన సమావేశాలు జరిపినట్లు తెలిపారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి.. తెలంగాణకు రూ. వెయ్యి కోట్ల వరద సహాయం చేయమని అడిగినట్లు చెప్పారు. అంతేకాదు ప్రజా సమస్యల పరిష్కారానికే హోం మంత్రిని కలిసినట్లు స్పష్టత ఇచ్చారు. మునుగోడు సభ కంటే అభివృద్ధి ముఖ్యం కాదా అని ప్రశ్నించారు. అమిత్‌షాను తెలంగాణలో ఏరియల్ సర్వే చేయమని కోరానని, రూల్ 377 కింద ఫ్లడ్స్ విషయాన్ని లేవనెత్తానని. ఆర్థిక శాఖ సంప్రదింపుల సమావేశానికి హాజరయ్యానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హోం మంత్రి అమిత్ షాను విడివిడిగా కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్ -
టీ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు
-
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఐదురోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో పాటు పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. గత శుక్రవారం ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా.. దేశంలో ప్రాంతీయ పార్టీలను, ఆ ప్రభుత్వాల మనుగడనే ప్రశ్నార్థకం చేసే ధోరణితో కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీన్ని సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్థిక ఆంక్షలు విధించి, వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించడాన్ని, ప్రభుత్వంలో చిచ్చుపెట్టి చీలికలు తేవడం ద్వారా ప్రాంతీయ పార్టీల ఉనికిని గందరగోళంలో పడేసే విధానాలను.. పార్లమెంట్ లోపలా, బయటా ఎండగట్టాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదీ చదవండి: CM KCR: ఏకమై ఎండగడదాం! -
ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్.. 3 రోజులు ఢిల్లీలోనే..!
సాక్షి, హైదరాబాద్: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట పార్లమెంట్ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, జి.రంజిత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, సీఎస్ సోమేశ్ కుమార్, తదితరులున్నారు. కాగా సీఎం కేసీఆర్ ఢిల్లీలో మూడు రోజులపాటు ఉండే అవకాశం ఉంది. భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మును కలిసి శుభాకాంక్షలు తెలపనున్నారు. ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోసం సీఎం కార్యాలయ వర్గాలు ఇప్పటికే రాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించినట్లు సమాచారం. వచ్చేనెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుకుండగా, పోటీలో ఉన్న మార్గరెట్ ఆల్వాకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక అంశమై తమ పార్టీ ఎంపీలతో పాటు భావ సారూప్య పార్టీల ఎంపీలతోనూ సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. వివిధ జాతీయ అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో జాతీయ మీడియాతోను సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. కాగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న కేసీఆర్, వాటిని దేశవ్యాప్తంగా సదస్సులు, సభల ద్వారా వివరించాలని భావిస్తున్నారు. అందుకోసం దేశవ్యాప్తంగా రైతు సదస్సులు నిర్వహించేందుకు సీఎం రోడ్‌మ్యాప్‌నూ ఇటీవల రూపొందించారు. రైతు సంఘాల నాయకుడు రాకేష్ తికాయత్‌తో పాటు పలువురు రైతు సంఘాల నేతలతోనూ ఈ సభల నిర్వహణపై చర్చించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతు సదస్సుల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను సైతం ఈ పర్యటనలో ప్రకటించే అవకాశం ఉంది. కాగా, సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆదివారం ఉదయమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. -
తెలంగాణపై బీజేపీ వ్యూహం ఏంటి?
-
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ముగిసిన సీఎం వైఎస్ జగన్ భేటీ
-
ఢిల్లీలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన
-
హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ.. ముగిసిన ఢిల్లీ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. సౌత్ జోనల్ కమిటీ సమావేశంలో భాగంగా ప్రస్తావించిన విభజన సమస్యలు-వాటి పరిష్కార ప్రక్రియపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అధికారుల సమావేశాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆస్తుల పంపకం సహా విభజన సమస్యలన్నీ కూడా పెండింగులో ఉన్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని సీఎం మరోమారు హోంమంత్రికి విజ్ఞప్తిచేశారు. దీంతో పాటు రాష్ట్రానికి చెందిన పలు అంశాలపైనకూడా సీఎం, హోంమంత్రితో చర్చించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం జగన్ తిరిగి తాడేపల్లి చేరుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా కొనసాగిన ముఖ్యమంత్రి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్ , గజేంద్ర సింగ్ షెకావత్ తో సీఎం జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. చదవండి: విభజన హామీలను నెరవేర్చాలి.. ప్రధానితో సీఎం జగన్ -
ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ
-
ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్
-
ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్
-
ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్!
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు. అనంతరం పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు సీఎం జగన్. -
హైదరాబాద్‌కు తిరిగొచ్చిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 20న ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన నాలుగు రోజుల పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. పర్యటనలో భాగంగా రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన పలువురితో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ నెల 21న ఢిల్లీలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌తో రెండున్నర గంటల పాటు సమావేశమయ్యారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలతో పాటు మొహల్లా క్లినిక్‌లను సందర్శించారు. సీనియర్ పాత్రికేయులు ప్రణయ్‌రాయ్‌తో జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలపై భేటీ అయ్యారు. 22న ఉదయం కేజ్రీవాల్ నివాసంలో ప్రత్యేక భేటీ అనంతరం ఆయనతో కలిసి చండీగఢ్‌కు వెళ్లారు. అక్కడ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కూడా కలిసి రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం కింద రూ.3 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. అనంతరం గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను పరామర్శించారు. ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ సోమవారం వ్యవసాయ ఆర్థిక నిపుణులు అశోక్ గులాటీతో భేటీ అయ్యారు. రాత్రి 7.30కి ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సీఎం వెంట పార్టీ ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు. -
కేసీఆర్ ఢిల్లీ రూట్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, ఆ దిశగా తాము కీలకపాత్ర పోషిస్తామని పలుమార్లు ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యక్ష కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇన్నాళ్లు తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని ఆరోపణలు గుప్పిస్తూ వచ్చిన ఆయన.. శుక్రవారం నుంచి వివిధ రాష్ట్రాల పర్యటనలతో పోరుకు సిద్ధమవుతున్నారు. దాదాపు పక్షం రోజులుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న సీఎం కేసీఆర్.. ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటన ద్వారా జాతీయ రాజకీయాల్లో రోడ్ మ్యాప్‌కు అవసరమైన కసరత్తు చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, సినీనటుడు ప్రకాశ్‌రాజ్, పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో చర్చించి.. మే 20వ తేదీ నుంచి అనుసరించాల్సిన షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ మేరకు విస్తృత పర్యటనలు చేపట్టాలని.. జాతీయ స్థాయిలో రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించారు. అంతేగాకుండా గల్వాన్‌లో వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను, కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చనిపోయిన రైతుల కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు. వ్యూహాత్మకంగానే.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి)గా మార్చాలనే డిమాండ్ వస్తోందని గత నెల 27న జరిగిన పార్టీ ప్లీనరీ వేదికగా కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ ఉత్తరాది రాష్ట్రాల పర్యటన చేపడుతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. నెలాఖరు వరకు వివిధ రాష్ట్రాల పర్యటనలు పూర్తి చేసి.. తద్వారా వచ్చే స్పందన మేరకు కేసీఆర్ తదుపరి కార్యాచరణ వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టి.. సీఎం కేసీఆర్ శుక్రవారం ఢిల్లీకి వెళుతున్నారు. అక్కడ వివిధ రాజకీయ పార్టీల నేతలతోపాటు ప్రముఖ ఆర్థిక వేత్తలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులు, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్ష, కక్షపూరిత వైఖరి, దేశంలో పెచ్చుమీరుతున్న మతోన్మాదం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టులు, ప్రతినిధులతో కూడా కేసీఆర్ భేటీ కానున్నారు. – 22న మధ్యాహ్నం కేసీఆర్ చండీగఢ్‌కు వెళతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా అందించేందుకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌లతో కలిసి కేసీఆర్ ఈ చెక్కుల పంపిణీని చేపట్టనున్నారు. ఇందులో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతు కుటుంబాలు ఆర్థికసాయం అందుకోనున్నాయి. – 26న ఉదయం సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలతో సమావేశమై జాతీయ, ప్రాంతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. – కేసీఆర్ 27న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దికి వెళ్లి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీకానున్నారు. అక్కడి నుంచి షిర్డీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకుని.. హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. – ఈ నెల 29, 30 తేదీల్లో బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. గల్వాన్ లోయలో వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను పరామర్శించి.. గతంలో ప్రకటించిన మేరకు ఆర్ధికసాయం అందించనున్నారు. -
కేంద్రమంత్రి మాండవియాను కలిసిన సీఎం జగన్
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాను కలిశారు. దాదాపు అరగంటపాటు సాగిన భేటీలో ఏపీకి 13 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో నూతనంగా 13 జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు. చదవండి: (CJs-CMs conference: సీఎం-న్యాయమూర్తుల సదస్సు) -
CM Jagan Delhi Tour: ఢిల్లీలో సీఎం జగన్‌ను కలిసిన సివిల్స్ అభ్యర్థులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిధున్‌రెడ్డి, ఎంపీలు అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గురుమూర్తి తదితరులు స్వాగతం పలికారు. శనివారం ఇక్కడి విజ్ఞాన్ భవన్లో జరిగే అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. సదస్సును ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభిస్తారు. కాగా, తెలంగాణ తరఫున సీఎం కేసీఆర్‌కు బదులుగా న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రాలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. చదవండి: (కేటీఆర్‌ను ఏపీకి ఆహ్వానించిన మంత్రి గుడివాడ అమరనాథ్) -
ప్రత్యామ్నాయ ఫ్రంట్ దిశగా..!
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోరుకుంటున్న ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఈ నెలాఖరులో బీజేపీయేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల ముఖ్యులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. సుమారు వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ ఈ సమావేశం నిర్వహణ తీరుతెన్నులపై కసరత్తు చేసి కార్యాచరణ సిద్ధం చేశారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనాలనే డిమాండ్‌తో 11న ఢిల్లీలో టీఆర్ఎస్ చేపట్టే ధర్నాలో కేసీఆర్ పాల్గొనేదీ లేనిదీ ఇంకా తెలియనప్పటికీ 12న సీఎం రాష్ట్రానికి చేరుకుంటారు. ఆ తర్వాత బీజేపీయేతర ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల నేతలతో భేటీ తేదీ, ఇతర వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో జరిగే జాతీయ స్థాయి సమావేశానికి సంబంధించిన ఎజెండాను కూడా బీజేపీయేతర సీఎంలు, ఇతరులతో కేసీఆర్ చర్చించి రూపొందిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ లేదా హైదరాబాద్ వేదికగా జరిగే ఈ సమావేశానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్ మాట్లాడినట్లు తెలిసింది. ఇప్పటికే మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌తో సమావేశమైన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించడం తెలిసిందే. అఖిలేశ్‌తో చర్చల బాధ్యత కవితకు.. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బిహార్ విపక్ష నేత తేజస్వీ యాదవ్ జనవరిలోనే హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అవగా యూపీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాద్ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో కేసీఆర్ భేటీ సాధ్యం కాలేదు. దీంతో అఖిలేశ్‌తో సంప్రదింపుల బాధ్యతను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేసీఆర్ తాజాగా అప్పగించారు. ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాలు, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్‌తోపాటు వెళ్తున్న కవిత గతంలో ఎంపీగా చేసిన అనుభవంతో జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలను సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగిన కేసీఆర్ ముంబై, ఢిల్లీ, జార్ఖండ్ పర్యటనల్లోనూ కవిత సీఎం వెంటే ఉన్నారు. మరోవైపు కేసీఆర్‌తోపాటు వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కవిత తన బృందంతో కలిసి జాతీయస్థాయి మీడియా సంస్థల అధినేతలు, ఎడిటర్లతో వరుస భేటీలు జరుపుతున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో జాతీయ మీడియాలో తమ గొంతు వినిపించేందుకు సీనియర్ జర్నలిస్టు సంజయ్ కుమార్ ఝాను రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా పనిచేసేలా ప్రజాసంబంధాల అధికారిగా నియమించింది. సంజయ్ నియామకం, ఎంపికలో కవిత క్రియాశీలంగా వ్యవహరించినట్లు సమాచారం. ఢిల్లీ దీక్ష తర్వాత వరి పోరు కార్యాచరణ యాసంగి ధాన్యం కొనుగోలుపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరసన గళం వినిపిస్తున్న టీఆర్ఎస్ ఈ నెల 11 తర్వాత అనుసరించాల్సిన కార్యాచరణపైనా కేసీఆర్ దృష్టి సారించారు. 12న మంత్రివర్గ సమావేశంలో ధాన్యం కొనుగోలుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచేలా నిరసనలు కొనసాగించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. యాసంగి వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఇప్పటికే సీఎం స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. ఢిల్లీ టూర్ తర్వాత మళ్లీ టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు అంశంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. -
గడ్కరీతో భేటీలో సీఎం జగన్ చర్చించిన అంశాలివే
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు హాజరయ్యారు. బుధవారం ఉదయం జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగియడంతో.. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఏపీకి తిరుగుపయనం అయ్యారు సీఎం జగన్. గడ్కరీతో చర్చించిన అంశాలు.. ► విశాఖ- భోగాపురం బీచ్ కారిడర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని మేలైన ఆలోచనలు చేయాలంటూ గత రాష్ట్ర పర్యటనలో గడ్కరీ ఇచ్చిన సలహామేరకు.. అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని సీఎం జగన్ వివరించారు. ► విశాఖ నుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతోపాటు, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని మంత్రిని కోరారు. ► విజయవాడ వెస్ట్రన్ బైసాస్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, దీనికి సీఆర్డీయే గ్రిడ్ రోడ్డును అనుసంధానం చేసి పనులు ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలని గడ్కరీని కోరారు. ► విజయవాడ వెస్ట్రన్ బైపాస్కు సంబంధించి మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ఈ భూములను కూడా గుర్తించిందని వెంటనే డీపీఆర్ సిద్ధంచేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ► విజయవాడ ఈస్ట్రన్ బైపాస్కు సంబంధించి కూడా డీపీఆర్ సిద్ధంచేసి పనులు వేగవంతంగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ► రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరుచేసిందని, మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు. ► రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్ ఎకనమిక్ జోన్లను కలుపుతూ 1,723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ► రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్ వే ల నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే 2 చోట్ల నిర్మాణానికి అంగీకరించింది. మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతి మంజూరుచేయాలని కేంద్రమంత్రి గడ్కరీని కోరారు సీఎం జగన్. -
సీఎం కాన్వాయ్‌లో 108 రయ్ రయ్..
గన్నవరం: తన పర్యటన సందర్భంగా ప్రజలకు, అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకూడదన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. మంగళవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం జగన్ తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. సరిగ్గా సీఎం కాన్వాయ్ గన్నవరం వద్ద జాతీయ రహదారి నుంచి విమానాశ్రయంలోకి ప్రవేశించే సమయానికి విజయవాడ వైపు వెళ్తున్న 108 అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై సీఎం కాన్వాయ్ మధ్యలో నుంచి అంబులెన్స్‌ను ముందుకు పంపించారు. అనంతరం సీఎం కాన్వాయ్ ఎయిర్‌పోర్టులోకి చేరుకుంది. అక్కడ సీఎంను కలిసిన వారిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, విజయవాడ పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తదితరులు ఉన్నారు. -
ఢిల్లీలో గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో బుధవారం ఆమె సమావేశమయ్యే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. వాస్తవానికి సోమవారం రాత్రే గవర్నర్ ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా అనివార్య కారణాలతో వా యిదా పడింది. అమిత్‌షా పిలుపు మేరకే తమిళిసై ఢిల్లీ వెళ్లారని సమాచారం. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండగా గవర్నర్ కూడా ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్ వర్సెస్ సీఎం కేసీఆర్ గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య ఇటీవల విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. బీజేపీ రాజకీయాలకు రాజ్‌భవన్ అడ్డాగా మారిందని, ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో గవర్నర్ మోకాలడ్డుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. పలు సందర్భాల్లో గవర్నర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని తప్పబట్టింది. మరోవైపు గవర్నర్‌గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనను ప్రభుత్వం గౌరవించడం లేదని, పలు సందర్భాల్లో అవమానాలు భరించాల్సి వచ్చిందని తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమక్క–సారక్క జాతరలో పాల్గొనడానికి ములుగు జిల్లాకు వెళ్లిన గవర్నర్‌ను ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆహ్వానించడానికి రాకపోవడంపై ఫిర్యాదులు అందడంతో ఇప్పటికే కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సందర్శన కోసం వెళ్లిన గవర్నర్‌ను ఆహ్వానించడానికి జిల్లా కలెక్టర్, ఎస్పీలు, చివరకు ఆలయ ఈవో కూడా రాకపోవడాన్ని గవర్నర్ అవమానంగా భావించినట్టు తెలిసింది. బడ్జెట్ సమావేశాల నుంచి ఉగాది వేడుక దాక.. గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించడాన్ని తమిళిసై బహిరంగంగా తప్పుబట్టారు. గణతంద్ర దినోత్సవ వేడుకలను రాజ్‌భవన్‌కు పరిమితం చేసి సాదాసీదా నిర్వహించడం సైతం గవర్నర్‌కు రుచించలేదు. తాజాగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులను ఆహ్వానించినా ఎవరూ హాజరవలేదు. రాజ్‌భవన్ వ్యవహారాలతో ప్రభుత్వ యంత్రాంగం అంటిముట్టనట్టు వ్యవహరిస్తోందని గవర్నర్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్ షాతో భేటీలో ఆమె ఈ అంశాలను ప్రస్తావించడంతో పాటు వీటిపై నివేదికలనూ సమర్పించనున్నట్టు తెలిసింది. -
సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రధాన అజెండా ఇదే
-
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. చర్చకు వచ్చిన కీలక అంశాలివే..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానితో గంటకు పైగా సీఎం భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈమేరకు సీఎం జగన్ ప్రధానికి వినతి పత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలను ప్రధాన మంత్రికి సీఎం నివేదించారు. ముఖ్యమంత్రి నివేదించిన అంశాలపట్ల ప్రధాని సానుకూలంగా స్పందించారు. ప్రధానికి సీఎం నివేదించిన అంశాలు: ♦పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరుతున్నాను. 2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55, 548.87 కోట్లుగా నిర్ధారించింది. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ♦ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఇందులో నిర్మాణ పనులకోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ ♦పునరావాసంకోసం రూ.22,598 కోట్లు ఖర్చవుతుంది. ♦పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వైజ్‌గా బిల్లుల చెల్లింపును సవరించాలని కోరుతున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు, కేంద్ర చెల్లిస్తున్న బిల్లులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. ఈ ఆంక్షల వల్ల రూ.905 కోట్ల బిల్లులను కూడా పోలవరం ప్రాజెక్ట్‌అథారిటీ తిరస్కరించింది. కాంపొనెంట్‌వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టులో జరిగే పనులను ³రిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాను. అంతేకాకుండా నిధులను సకాలానికే విడుదలచేయాలని కోరుతున్నాను. ♦పోలవరం ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీచేయాలని కోరుతున్నాను. ♦జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపుకోసం అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. దీనివల్ల ఏపీకి అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలో 1.45 కోట్ల కుటుంబాలకు రేషన్ అందిస్తుంటే, ఇందులో కేంద్రం నుంచి కేవలం 0.89 కోట్ల కుటుంబాలకు మాత్రమే అందుతోంది. మిగిలిన 0.56 కోట్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులు ఖర్చుచేస్తూ రేషన్ ఇస్తోంది. ఆర్థికంగా బాగున్న మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని 75శాతం, పట్టణ–నగర ప్రాంతాల్లోని 50శాతం ప్రజలకు రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, ఏపీలో మాత్రం 61శాతం రూరల్, 41శాతం అర్బన్ ప్రజలకు మాత్రమే రేషన్‌ను ఇస్తున్నారు. దీన్ని వెంటనే సరిదిద్దాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ♦భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్ గడువు ముగిసింది. తాజాగా క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈమేరకు పౌరవిమానయాన శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ♦రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో సమగ్ర స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మెకాన్ ఇప్పటికీ తన నివేదికను ఇవ్వలేదు. రాయలసీమ, కడప జిల్లా ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నడుంబిగించింది. దీనికోసం వైయస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఈమేరకు కేంద్రం తోడ్పాటు అందించాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ♦అలాగే ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బీచ్‌శాండ్ మినరల్స్ ప్రాంతాలను కేటాయించాలని విజ్ఞప్తిచేస్తున్నాను. 16 చోట్ల బీచ్‌శాండ్ ఉన్న ప్రాంతాలను ఏపీఎండీసీకి కేటాయించాలని కోరుతున్నాను. అటమిక్ ఎనర్జీ విభాగం ఇప్పటికే 2 ప్రాంతాలను ఏపీఎండీసీకి కేటాయించింది. దీనికి సంబంధించిన అనుమతులు కూడా పెండింగులో ఉన్నాయి. మిగిలిన 14 ప్రాంతాలకు సంబంధించి కేటాయింపులు, అనుమతులకు ఆదేశాలివ్వాలని కోరుతున్నాను. ♦మహమ్మారులు సోకినప్పుడు ప్రజారోగ్య వ్యవస్థ ఎంత కీలకమో ఇటీవల కోవిడ్ పరిస్థితుల్లో వెల్లడైంది. ప్రజారోగ్య వ్యవస్థలో మౌలిక వసతులను గణనీయంగా పెంచడానికి ఏపీ ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో 11 బోధనాసుపత్రులు ఉన్నాయి. కొత్తగా మరో మూడింటికి కేంద్రం అనుమతులు మంజూరుచేసింది. వీటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరో 12 బోధనాసుపత్రులకు కూడా వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాం. ♦విభజన కారణంగా రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లింది. ♦రెవిన్యూ గ్యాప్‌ను భర్తీకోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉంది. ఆమేరకు ఆర్థికంగా ఏపీకి నష్టం వాటిల్లింది. ♦విభజన నాటికి పెండింగ్ బిల్లుల బకాయిల రూపంలో, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలులో భాగంగా ఇవ్వాల్సి బకాయిల రూపంలో తదితర కార్యక్రమాల వల్ల దాదాపు రూ.32,625.25 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తన సొంతంగా ఖర్చు చేసింది. ఈ నిధులను రెవిన్యూ లోటు కింద భర్తీచేయాలి. ♦రాష్ట్ర విభజన వల్ల 58.32శాతం జనాభా విభజిత ఆంధ్రప్రదేశ్‌కురాగా, కేవలం 46శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 9శాతం జానాభా ఉన్న హైదరాబాద్ నగరంను కోల్పోవడంద్వారా ఆ నగరం నుంచి అందే 38శాతం రెవిన్యూను కోల్పోయాం. తర్వాత వచ్చిన కోవిడ్.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీసింది. దాదాపు రూ. 33,478 కోట్ల మేర ఆదాయం కోవిడ్ కారణంగా రాకుండాపోయింది. కోవిడ్ నివారణా, చికిత్సలకోసం మరో రూ.7,130 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయి. 15వ ఆర్థిక సంఘం కేటాయింపులు కూడా రాష్ట్రానికి తగ్గడం మరొక ప్రతికూల పరిణామం. ♦గత ప్రభుత్వం హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చారు. ఇప్పుడు ఆ అదనపు రుణాలకు సరిపడా... రాష్ట్ర రుణపరిమితుల్లో కోత విధిస్తామని అంటున్నారు. దీనివల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుంది. విధించిన రుణ పరిమితిని మించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ రుణాలు తీసుకురాలేదు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రుణాల పరిమితిని సవరించాల్సిందిగా కోరుతున్నాం. ♦తెలంగాణ డిస్కంలు రూ.6,455.76 కోట్ల రూపాయలను ఏపీ జెన్కోకు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రాన్ని విభజించిన నాటినుంచీ జూన్ 2017 వరకూ తెలంగాణ డిస్కంలకు చేసిన విద్యుత్ పంపిణీకి సంబంధించి ఈమొత్తాన్ని ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బును ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ఈమేరకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాం. తీవ్ర రుణభారాన్ని ఎదుర్కొంటున్న ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు తమ ఆర్థిక నిర్వహణకోసం ఈ డబ్బు చాలా అవసరం. అంతకు ముందు ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్‌కు ఎయిర్‌పోర్టులో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మార్గాని భరత్, వంగా గీత, మాధవి, అయోధ్య రామిరెడ్డి, గురుమూర్తి, మాధవ్, రంగయ్య, రెడ్డప్ప, సత్యవతి, కోటగిరి శ్రీధర్, మోపిదేవి వెంకటరమణ ఘన స్వాగతం పలికారు. -
ఢిల్లీకి సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. -
ఢిల్లీ వెళ్లింది పాదాభివందనం చేయడానికి కాదు..
సాక్షి, చెన్నై: ‘‘తమిళనాడు హక్కుల్ని సాధించుకోవడం కోసమే ఢిల్లీ వెళ్లాను గానీ.. ఎవరో ఒకరి కాళ్ల మీద పడి పాదాభివందనాలు చేయడం కోసం మాత్రం కాదు’’.. అని సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తన ఢిల్లీ, దుబాయ్ పర్యటనలకు దురుద్దేశా లను ఆపాదిస్తూ ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి చేసిన విమర్శలను తిప్పి కొట్టారు. ఆదివారం తిరువానీ్మయూరులో తమిళనాడు రైతులు, రైతు కూలీల పార్టీ నేత, భవన నిర్మాణ కారి్మక సంక్షేమ బోర్డు చైర్మన్ పొన్ కుమార్, మైదిలీ దంపతుల కుమారుడు వినోద్‌కుమార్, వేళచ్చేరికి చెందిన ఢిల్లీ, సుమతి దంపతుల కుమార్తె రేవతికి సీఎం స్టాలిన్ సమక్షంలో ఆదర్శ వివాహం జరిగింది. ఈ సందర్భంగా వధువరుల్ని ఆశీర్వదిస్తూ సీఎం స్టాలిన్ ప్రసంగించారు. నిరంతరం శ్రమిస్తూనే ఉంటా.. తమిళనాడులో ఆదర్శ వివాహాలు పెరుగుతుండటం అభినందనీయమని కొనియాడారు. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక, నగర ఎన్నికల్లో గెలుపుతో డీఎంకే కూటమిపై ప్రజలత్లోనమ్మకం పెరిగిందన్నారు. తన వద్ద ప్రజలు ఉంచే ప్రతి కోరికను ఆచరణలో పెడుతానని స్పష్టం చేశారు. కలైంజర్ కరుణానిధి మార్గంలో పయనం సాగిస్తానని, ఆయన కలల్ని సాకారం చేస్తానని తెలిపారు. తన దుబాయ్, ఢిల్లీ పర్యటన గురించి విమర్శలు చేసే వాళ్లకు ఒక్కటే చెబుతున్నానని, ఢిల్లీకి పాదాభివందనాలు చేయడానికి మాత్రం తాను వెళ్ల లేదన్నారు. తమిళనాడు హక్కుల్ని పరిరక్షించడం, సాధించుకోవడం కోసం మాత్రమే వెళ్లానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా మంత్రులందరూ తన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టడాన్ని చూసి ఓర్వలేక ఈ విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏదో సమస్యల వలయంలో చిక్కుకున్నట్టు, అందులో నుంచి బయట పడేందుకు ఢిల్లీకి పరుగులు తీసినట్టుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను సాధారణ స్టాలిన్ కాదు అని, ముత్తు వేల్ కరుణానిధి స్టాలిన్ అని, రాష్ట్రం కోసం, హక్కుల కోసం ఎంత వరకైనా పోరాడేందుకు రెడీ అంటూ ముగించారు. కేరళ మంత్రి భేటీ డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో సీఎం స్టాలిన్‌తో కేరళ రాష్ట్ర ఆదిద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కె. రాధాకృష్ణన్, తమిళనాడు సీపీఎం కార్యదర్శి బాలకృష్ణన్‌లు కలిశారు. ఈనెల ఆరో తేది నుంచి కేరళరాష్ట్రం కన్నూరు వేదికగా జరగనున్న సీపీఎం అఖిల భారత మహానాడుకు హాజరు కావాలని స్టాలిన్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా, ఆదివారం రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి పుట్టిన రోజు కావడంతో ఆయనకు ట్విట్టర్ ద్వారా సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఢిల్లీలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ తన సతీమణి శోభ, కుమార్తె, ఎమ్మెల్సీ కవితతో కలిసి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ సీఎం తో పాటు ఆయన సతీమణి వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్టు సమాచారం. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నాను తలపెట్టిన విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరాడిన ఉత్తరాదికి చెందిన రైతు సంఘాల ముఖ్య నాయకులను ఈ ధర్నాకు ఆహ్వానించాలని సీఎం యోచిస్తున్నారు. రాకేశ్ టికాయత్‌తో పాటు ఇతర ముఖ్య రైతు సంఘాల నాయకులతో ఆయన ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశముంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతు న్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీలందరూ ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌చేస్తూ సోమవారం నుంచి పార్లమెంట్లో నిరసనలు ఉధృతంగా చేపట్టాలని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. సోమవారం నుంచి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ పర్యటనకు నాకు ఆహ్వానం అందలేదు: వీహెచ్
-
ఆరోగ్యం గురించి ఢిల్లీకి వెళ్తున్న సీఎం కేసీఆర్
-
నెలాఖరులో కేసీఆర్ హస్తిన టూర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు త్వరలో దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెలాఖరులో జరిగే సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూలు ఒకటి రెండురోజుల్లో ఖరారు కానుంది. హైదరాబాద్ లేదా మరోచోట త్వరలో బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని ఈనెల 20న ముంబై పర్యటన సందర్భంగా కేసీఆర్ వెల్లడించారు. అయితే వచ్చే నెల రెండో వారంలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోగానే బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాలనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఆ భేటీలో చర్చించాల్సిన అంశాలపై వివిధ వర్గాలతో సమావేశమయ్యేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలు నిమగ్నమై ఉన్నా ఢిల్లీ పర్యటన సందర్భంగా కొన్ని ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యే అవకాశముంది. వివిధ రంగాల నిపుణులతో పాటు పాలన వ్యవహారాల్లో విశేష అనుభవమున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, విదేశాంగ వ్యవహారాల్లో అనుభవమున్న వారితోనూ భేటీ అవుతారు. దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్, బీజేపీయేతర రాజకీయ ప్రత్యామ్నాయానికి ఎలాంటి ఎజెండా అవసరమనే కోణంలో చర్చలు సాగనున్నాయి. అయితే సీఎం ఢిల్లీలో ఎన్నిరోజుల పాటు బస చేస్తారు, ఎవరెవరితో భేటీ అవుతారు వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని టీఆర్ఎస్ ఎంపీ ఒకరు చెప్పారు. మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు? రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 25 లేదా 28వ తేదీ నుంచి ప్రారంభించాలని తొలుత భావించినా, ఢిల్లీ పర్యటన తర్వాతే నిర్వహించాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసి మార్చి 3వ తేదీన ప్రారంభించే అవకాశముంది. కాగా మహిళా, గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్‌ను పరామర్శించేందుకు సీఎం శుక్రవారం మహబూబాబాద్‌కు వెళ్లనున్నారు. సత్యవతి రాథోడ్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. -
వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సక్సెస్
-
రెండోరోజు ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్
-
ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
ముగిసిన సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ అయ్యారు. కేంద్ర రవాణా మంత్రి గడ్కరీతో సమావేశమైన సీఎం జగన్.. విశాఖ నుంచి భోగాపురం వరకు జాతీయ రహదారి ఏర్పాటుపై చర్చించారు. అలాగే కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎం కలిశారు. కేంద్ర సమాచార, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో సీఎం జగన్ భేటీ అరగంట పాటు కొనసాగింది. సమావేశంలో ఏపీలో క్రీడా మైదానాల అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చించారు. చదవండి: పెండింగ్.. పరిష్కరించండి కేంద్రమంత్రి గడ్కరీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం సుమారు గంటపాటు సాగింది. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్ తయారీ అంశంపై చర్చించారు. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని సీఎం జగన్.. కేంద్ర మంత్రికి తెలిపారు. సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్కారిడర్ ప్రాజెక్టులకు సమీపం నుంచి ఈ రోడ్డు వెళ్తుందని సీఎం జగన్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందని కేంద్రమంత్రికి వివరించారు. విశాఖ నగరంలో వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని మంజూరు చేయాలని సీఎం జగన్ కోరారు. ► -
సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన దృశ్యాలు
-
ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలి.. ప్రధానితో సీఎం జగన్
-
ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలి.. ప్రధానితో సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో సమావేశం సుమారు గంటసేపు జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్ సమస్యలను ప్రధానికి సీఎం నివేదించారు. ఈ మేరకు విజ్ఞాపన పత్రం కూడా ముఖ్యమంత్రి అందించారు. ప్రధానికి సీఎం నివేదించిన అంశాలు: ♦రాష్ట్ర విభజన పర్యవసానాలు ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బ తీశాయి: ప్రధానితో సీఎం ♦రాష్ట్ర విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది ♦2015–16లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.15,454 కాగా, ఏపీ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే. ♦రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలియచేయడానికి ఈ ఒక్క గణాంకాలే నిదర్శనం. ♦భౌగోళికంగా చూస్తే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ పెద్దది, ఇక్కడుండే జనాభా కూడా ఎక్కువ. ♦ప్రజల అవసరాలను తీర్చాలంటే, వారికి సరైన సేవలు అందించాలంటే అంతే స్థాయిలో వ్యయం కూడా చేయాల్సి ఉంటుంది. ♦విభజన వల్ల రాజధానిని కూడా ఏపీ కోల్పోయింది. అక్కడ ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలను కోల్పోయాం. ♦అక్కడ వాటి కోసం భారీగా ఖర్చు చేశారు. ♦అందుకే రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీతోపాటు అనేక హామీలు ఇచ్చారు. వీటిని అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుంది. కాని, చాలా హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు. చదవండి: పక్కదోవ పట్టించడానికే ఆ రాతలు: మంత్రి కన్నబాబు ►2013 నాటి భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగింది. ఏప్రిల్ 1, 2014 అంచనాల మేరకే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో తెలియజేసింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదు. అంతే కాకుండా అప్పటివరకూ ఇరిగేషన్ కాంపొనెంట్ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీని వల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్–90లో పేర్కొన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో వ్యయం కూడా పెరుగుతుంది. ప్రాజెక్టు ఖర్చులో అధిక భాగం 2013 నాటి భూసేకరణ చట్టం అమలుకే వ్యయం చేయాల్సి ఉంటుంది. చట్టం ప్రకారం ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సిన కుటుంబాలకు ప్యాకేజీలను కూడా విస్తరించాల్సి ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర భారం. భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ రూపేణా సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు తిరస్కరించడం ప్రాజెక్టుకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టులో కేవలం ఇరిగేషన్ భాగానికి మాత్రమే మాత్రమే నిధులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఏ నీటి ప్రాజెక్టులోనైనా రెండు రకాల భాగాలు ఉంటాయి. ఒకటి ఇరిగేషన్ కాగా, రెండోది విద్యుత్ ఉత్పత్తి. తాగునీరు అనేది ఇరిగేషన్‌లోనే ఒక అంతర్భాగం. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలోనైనా ఇప్పటి వరకూ దీన్నే పాటిస్తున్నారు. ఈ విషయలలో మీరు జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలి. ప్రాజెక్టు పూర్తి ఆలస్యం అయితే ఖర్చు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. 2017–18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా నిర్ణయించాలి. అంతే కాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రూ.2100 కోట్ల పెండింగ్ బిల్లులను మంజూరు చేసేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను. ►అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రెవిన్యూ లోటును పూడుస్తామంటూ అప్పటి ప్రధానమంత్రి ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన జరిగే తేదీ నాటికి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు తేదీకి మధ్యనున్న రిసోర్స్ గ్యాప్‌ను 2014–15 కేంద్ర బడ్జెట్ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. 2014 జూన్ నుంచి మార్చి 31, 2015 వరకూ ఉన్న రీసోర్స్ గ్యాప్ మొత్తం రూ.16,078.76 కోట్లని కాగ్ నిర్ధారించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం (స్టాండరై్డజ్డ్ ఎక్స్పెండేచర్) పేరిట కొత్త పద్ధతిని తీసుకు వచ్చింది. రీసోర్స్ గ్యాప్‌ను కేవలం రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. దీంతో నిధుల కొరత వల్ల 2014–15 ఆర్థిక సంవత్సరంలో చాలా బిల్లులను, పీఆర్సీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేకపోయింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులను, ఇతర బకాయిలను పరిగణలోకి తీసుకుంటే రెవిన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది కేవలం రూ.4,117.89 కోట్లు మాత్రమే. చాలా కాలంగా పెండింగులో ఉన్న మిగిలిన రూ.18,830.87 కోట్లు చెల్లించి రాష్ట్రానికి అండగా నిలవాలని కోరుతున్నాను. ►రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్కో విద్యుత్‌ను సరఫరా చేసింది. జూన్ 2, 2014 నుంచి జూన్ 10, 2017 వరకు విద్యుత్‌ను అందించింది. కేంద్ర ప్రభుత్వ నిర్దిష్ట ఆదేశాల మేరకు ఆ విద్యుత్ పంపిణీ జరిగింది. దీని కోసం రూ.6,284 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు కూడా గుర్తించాయి. కాని ఇప్పటివరూ ఎలాంటి చెల్లింపులు చేయలేదు. ఇదే సమయంలో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఏపీ విద్యుత్ సంస్థలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ బిల్లులను చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. దీని వల్ల ఏపీ విద్యుత్ సంస్థలు బలపడతాయి. బిల్లుల చెల్లింపులకు ఆ డబ్బులు ఉపయోగపడతాయి. ►జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లేని విధానం వల్ల రాష్ట్రం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రాష్ట్రంలో లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 2.68 కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 61 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లోని జనాభాలో 41 శాతం మంది లబ్ధిదారులు ఉన్నారు. కాకపోతే దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) గణాంకాలను చూస్తే జాతీయ స్థాయిలో సగటు లబ్ధిదారుల్లో గ్రామీణ ప్రాంత జనాభాలో 75 శాతం మంది, పట్టణ ప్రాంత జనాభాలో 50 శాతం మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆర్థికంగా గణనీయ ప్రగతి సాధించిన మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పీడీఎస్ లబ్ధిదారులు ఏపీలో కన్నా కనీసం 10 శాతం ఎక్కువగా ఉన్నారు. అర్హత ఉన్న చాలా మంది జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కవర్ కావడం లేదు. అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా అందిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపుతోంది. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన జరిపి ఆ మేరకు ఎక్కువ మంది లబ్ధిదారులు కవర్ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయమై కేంద్ర ఆహారం, వినియోగదారుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే కొన్ని ప్రతిపాదనలు పంపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సేకరిస్తున్న ఆహార ధాన్యాల్లో కేవలం 90శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. ఉదాహరణకు 2021 ఆగస్టులో 21.54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేశారు. కాని ఆ మాసంలో సేకరించిన బియ్యం 24.4 లక్షల టన్నులు. నెలకు సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అవుతోంది. ఏపీలో లబ్ధిదారులను విస్తృత పరిస్తే అదనంగా చేయాల్సిన కేటాయింపులు కేవలం 0.77 లక్షల టన్నులు మాత్రమే. దీని వల్ల గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటుగా కేటాయింపులు ఉంటాయి. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని తగిన కేటాయింపులు చేయాలని కోరుతున్నాం. ►రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. 2019–20 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఆర్థిక ప్రగతి మందగించింది. దీని వల్ల కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల ఆదాయం తగ్గుతూ వస్తోంది. ఆ ఆదాయం దాదాపు 3.38 శాతం తగ్గింది. గత 2 దశాబ్దాల్లో కేంద్రం నుంచి వచ్చే పన్నుల ఆదాయంలో అతి తక్కువ నమోదైంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి కారణంగా పరిస్థితి మరింత∙దుర్లభంగా మారింది. అన్ని వర్గాల వారూ తీవ్రంగా నష్టపోయారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు విపరీతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు పెట్టబడులు, వారి పెట్టే ఖర్చులు తగ్గాయి. ప్రభుత్వాలే వ్యయం చేయాల్సి వచ్చింది. దీంతో ఆర్థిక ప్రగతి పరిమితమైంది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వాలు విపరీతంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీని కోసం భారత్‌తో పాటు వివిధ ప్రపంచ దేశాలన్నీ కూడా భారీగా అప్పులు చేయాల్సి వచ్చింది. 2020–2021లో దేశ జీడీపీలో 11 శాతం మేర కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి కేంద్రం ఈ డబ్బును వ్యయం చేసింది. ►2019–2020 ఆర్థిక మందగమనం కూడా ఏపీపై ప్రభావం చూపింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.34,833 కోట్లు అయితే వాస్తవంగా వచ్చింది రూ.28,242 కోట్లు మాత్రమే. 2020–21లో కోవిడ్ పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తీశాయి. కేంద్ర పన్నుల్లో రూ.7.780 కోట్ల మేర నష్టం వాటిల్లింది. రాష్ట్రం ఆదాయ వనరుల నుంచి రావాల్సిన రూ.7 వేల కోట్లు కూడా రాకుండా పోయాయి. దీంతోపాటు కోవిడ్ నివారణా చర్యల కోసం దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశాం. వీటితోపాటు రాష్ట్ర ప్రజలు నష్టపోయిన ఆదాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ నష్టం వేల కోట్లలో ఉంటుంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల (డీబీటీ) ద్వారానే జీవనోపాధి కోల్పోయిన ప్రజలను ఆదుకోగలమని రాష్ట్ర ప్రభుత్వం విశ్వసించింది. ఎంతటి కష్టనష్టాలు ఎదురైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధి నుంచి పక్కకు వెళ్లలేదు. అంకిత భావంతో ఆ పథకాలను అమలు చేసింది. ప్రజల చేతిలో నేరుగా డబ్బు పెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతం కావడమే కాదు, ఎలాంటి అవినీతి, పక్షపాతం లేకుండా పారదర్శక పద్ధతిలో అత్యంత సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకుంది. దీంతోపాటు రాష్ట్ర భవిష్యత్తును ఉజ్వలంగా మార్చగల వైద్యం, విద్య, వ్యవసాయం, గృహæనిర్మాణం తదితర రంగాల్లో వివిధ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టులు కుంటుపడకుండా గట్టిగా అమలు చేశాం. ►ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకునేందుకు తన శక్తిమేరా ప్రయత్నం చేసింది. ఎన్ని అడ్డంకులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా తన వంతు కృషి చేసింది. 2021–22 కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం గరిష్ట రుణ పరిమితి (నెట్ బారోయింగ్ సీలింగ్–ఎన్బీసీ) ని రూ. 42,472 కోట్లుగా నిర్ధారించారు. తదుపరి కేంద్ర ఆర్థిక శాఖ దీన్ని రూ.17,923.24 కోట్లకు తగ్గిస్తున్నట్టుగా సమాచారం ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అధిక అప్పులను పరిగణలోకి తీసుకుని ఆమేరకు నిర్దేశించిన రుణ పరిమితిని సర్దుబాటు చేసినట్టుగా పేర్కొంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మా తప్పు లేకుండానే ఈ విధంగా రుణ పరిమితిలో కోత విధంచడం సరి కాదు. రుణపరిమితిలో కోతను మూడేళ్లకు విస్తరించాలని చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. మేం తీసుకుంటున్నవి అప్పులే కాని, గ్రాంట్లు కాదన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాం. తీసుకుంటున్న రుణాలకు సకాలంలో చెల్లింపులు కూడా చేస్తున్నాం. గత ప్రభుత్వం తమ ఐదేళ్ల కాలంలో అధికంగా అప్పులు చేశారన్న కారణంగా ఇప్పుడు ఈ క్లిష్ట సమయంలో కోత విధించడం రాష్ట ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుంది. ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కించాల్సిన ప్రస్తుతం తరుణంలో విధిస్తున్న పరిమితులు ఇలాంటి అవకాశాలకు ఆస్కారం ఇవ్వదు. గత ఐదేళ్ల కంటే ముందు ఇచ్చిన రుణ పరిమితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పులు తీసుకోలేదనే అంశానికి సంబంధించి మీ ముందు వివరాలు సమర్పిస్తున్నాను. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని 2021–22 కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం ఎన్బీసీని రూ.42,472 కోట్లుగా నిర్ధారించిన మేరకు అప్పులు తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాను. ►భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్‌ను రెన్యువల్ చేయాలని కోరుతున్నాను. వైయస్సార్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి మెకాన్ సంస్థచే వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చూడాలని కోరుతున్నాను. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తీర్చే క్రమంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం వైయస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి చెందిన ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు గనులు కేటాయించాలని కేంద్ర గనుల శాఖకు విజ్ఞప్తి చేశాం. వేలం ప్రక్రియలో పాల్గొనాలని గనుల శాఖ చెబుతోంది. వేలం ప్రక్రియ వల్ల తక్కువ ఖర్చుకు గనులు దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వైయస్సార్ కడప జిల్లాలో ప్లాంట్æఏర్పాటుకు అత్యంత కీలకమైన గనుల కేటాయింపు అంశంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఎస్బీఐ క్యాప్స్‌ను నియమించాం. ఎస్బీఐ క్యాప్ ఎస్సార్ స్టీల్స్‌ను కాపంటేటివ్ బిడ్డర్‌గా ఎంపిక చేసింది. రుణం మంజూరుకు ఎస్బీఐ సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపింది. ఈ ప్రక్రియ వీలైనంత వేగంగా ముగిసేలా చేయగలగడం ద్వారా రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుంది. నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్ సమస్యలను సీఎం నివేదించారు. ఈ మేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించారు. ప్రత్యేక హోదా, సవరించిన పోలవరం అంచనాలకు ఆమోదం, రెవిన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, రుణపరిమితి, రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం తదితర అంశాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చర్చించారు. కేంద్ర విమానయాన మంత్రి సింథియాతో సీఎం జగన్ భేటీ కేంద్ర విమానయాన మంత్రి సింథియాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. రేపు (మంగళవారం) ఉదయం 9.30కు కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: AP: రైతన్నల ఖాతాల్లోకి రూ.1036 కోట్ల నగదు జమ -
ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్
-
చంద్రబాబు నిజంగా ఢిల్లీకి వచ్చారా.. బీజేపీ సెటైర్లు
న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు ఉనికిని సైతం గుర్తించడానికి బీజేపీ అధిష్టానం ఇష్టపడడం లేదు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారన్న సంగతి సైతం తమకు తెలియదని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రధానమంత్రి, హోంమంత్రి అపాయింట్మెంట్ కోసం బాబు హస్తినలో రెండు రోజుల పాటు పడిగాపులు పడిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఆయన ఢిల్లీకి వచ్చారా.. అని సెటైర్లు వేస్తున్నారు. దీన్‌దయాల్ రోడ్డులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ఏపీ ఇన్చార్జి సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటనపై మీడియా ప్రశ్నలడగ్గా, చంద్రబాబు నిజంగా ఢిల్లీకి వచ్చారా అని సునీల్ దేవధర్ ఎదురు ప్రశ్నలతో సెటైర్లు వేశారు. చంద్రబాబు ఉనికిని సైతం గుర్తించడానికి బీజేపీ ఇష్టపడడం లేదనడానికి ఇదే ఉదాహారణ అని పలువురు అంటున్నారు. అంతేకాక, భవిష్యత్‌లో జరిగే ఏ ఎన్నికల్లోనూ టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రశ్నలేదని స్పష్టంగా తేల్చిచెప్పారు. టీడీపీ.. రాష్ట్ర ఆరోగ్యానికి హానికరం అంటూ ముక్తాయింపు ఇవ్వడం కొసమెరుపు. (చదవండి: కష్టం.. కలవలేం: చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, అమిత్ షా) నిజానికి సునీల్ దేవధర్ ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలోనే, చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేశారని ఎల్లో మీడియా లీకులు ప్రసారం చేసింది. రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చంద్రబాబు వివరించినట్లు, ఆ విషయాలను పరిశీలిస్తానని షా చెప్పినట్లు ప్రచారం చేశారు. అమిత్ షా, బాబుకు ఫోన్ చేశారా లేదా అన్నదానిపై అమిత్ షా కార్యాలయవర్గాలేవీ స్పందించలేదు. (చదవండి: ‘రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో తెలుసా బాబు?!’) అమిత్ షా అపాయింట్మెంట్ దొరక్క అభాసుపాలైన బాబుకు ఫేస్ సేవింగ్ కోసం ఎల్లో మీడియా ఈ ప్రచారం చేపట్టిందనే గుసగుసలు వినిపించాయి. అదే సమయంలో చంద్రబాబు ఢిల్లీకి వచ్చారా అని ఏపి బిజెపి వ్యవహారాల ఇన్చార్జి అని ప్రశ్నించడంతో, ఎల్లో మీడియా ప్రచారం అంతా వట్టిదేనని తేలిపోయిందంటున్నారు. మోడీ, షాల పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరును బిజెపి పెద్దలు మరిచిపోలేదనడానికి ఇదొక తాజా నిదర్శనమని అంటున్నారు. చదవండి: ద్వంద్వనీతితో రుబాబు -
అధికారం ఊడిందనే అక్కసు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చడం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వారం క్రితం ప్రారంభించిన బూతు డ్రామాకు మంగళవారం ఢిల్లీ వేదికగా తెరదించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికారం ఊడిందనే అక్కసుతో.. తనకు ఓటు వేయని ప్రజలపై కక్ష తీర్చుకునేలా చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో చంద్రబాబు బూతు డ్రామాను ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఎల్లో మీడియా ద్వారా ఏదో జరుగుతోందని చూపించే ప్రయత్నం చేశారని ఎద్దేశా చేశారు. అందులో భాగంగానే ‘ఈనాడు’లో అశ్వత్థామ హతః కుంజరః అన్నట్లుగా ‘రాష్ట్రపతి పాలన పెట్టండి’ అనే డిమాండ్‌తో బ్యానర్ హెడ్డింగ్‌లు పెట్టించి తృప్తి పడ్డారని దెప్పిపొడిచారు. బూతులు తిట్టించిన చంద్రబాబేమో ఢిల్లీ నుంచి కిక్కురుమనకుండా హైదరాబాద్ చేరుకున్నారని, తిట్టినవాడేమో మాల్దీవులకు పోయాడని మండిపడ్డారు. ఈ సమావేశంలో సజ్జల ఇంకా ఏమన్నారంటే.. ఢిల్లీలో దివాలా తీసిన చంద్రబాబు ► తిమ్మిని బమ్మి చేయటమే కాదు.. శూన్యంలోంచి చంద్రబాబు ఏమైనా సృష్టించగలరు. ఒక ఛండాలమైన బూతు మాటను సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడితే.. దానిపై వచ్చిన ప్రతిస్పందన చూసి చంద్రబాబు పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలని ప్రయత్నించారు. ► ఒక రోజు బంద్‌కు పిలుపు ఇచ్చారు. 36 గంటల నిరాహార దీక్ష చేసిన డయాబెటిక్ పేషెంట్ ఊగిపోతూ గంటన్నర సేపు నినదించి ప్రసంగించారు. అంతశక్తి ఉందంటే అది దీక్షకాని దీక్ష అనుకోవాలి. దాన్ని వ్యూహాత్మకంగా ముగించాలని ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. అక్కడ చంద్రబాబు దివాలా తీశారని పసిగట్టిన జాతీయ మీడియా ఆయన పర్యటనను ఏమాత్రం పట్టించుకోలేదు. అమిత్ షా ఫోన్ చేశారని మరో డ్రామా ► ఢిల్లీలో రాష్ట్రపతిని చంద్రబాబు బృందం కలిసింది. రాష్ట్రపతి ఏమన్నారో తెలియదు. చంద్రబాబు అయితే చెప్పాల్సింది చెప్పి, కక్కాల్సింది కక్కారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రమ్మని పిలిచినట్లు.. శిఖరాగ్ర చర్చలు జరిపి.. సీఎం వైఎస్ జగన్ పాలనకు తెరదించేలా అమీతుమీ తేల్చుకోనున్నట్లు చంద్రబాబు కలరింగ్ ఇచ్చారు. కానీ అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో ఎల్లో మీడియా రాయలేదు. ► అదే సీఎం వైఎస్ జగన్ అమిత్ షాను కలిస్తే.. మొట్టికాయలు వేశారని ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాక అమిత్ షా ఫోన్ చేసినట్లు ఎల్లో మీడియాకు చంద్రబాబు లీకులు ఇచ్చి మరో డ్రామాకు తెరతీశారు. అమిత్ షా ఫోన్ చేశారో లేదో తెలియదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చక్రం కాదు కదా.. దీపావళి పండుగ పూట తిప్పే విష్ణు చక్రం కూడా తిప్పలేదు. ► చంద్రబాబుకు ఏనాడూ ప్రజలంటే ప్రేమ, అభిమానం లేదు. లెక్కలేనితనం ఉంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. గంజాయి సాగు, స్మగ్లింగ్‌కు రాష్ట్రం రాజధానిగా మారిందని చెప్పడం దారుణం. చంద్రబాబుకు ఏ సెక్షన్ కింద ఎంత కఠినాతి కఠినమైన శిక్ష వేసినా తప్పులేదు. ► చంద్రబాబు ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నారు. దారినపోయేవాడు అక్కసుతో తిడితే దానికో అర్థముంటుంది. ఈ రాష్ట్రంలో యువతకు బూతులు నేర్పాలని అనుకుంటున్నావా? టీడీపీ సర్కార్ హయాంలోనే గంజాయి స్మగ్లింగ్ ► 2016లో నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం ప్రాంతం కేంద్రంగా గంజాయి వెళ్తోందని ఏమాత్రం దాపరికం లేకుండా మాట్లాడారు. దీనిపై చంద్రబాబు, ఆయన్ను సపోర్ట్ చేసే పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. ► సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో గంజాయి సాగు, స్మగ్లింగ్‌ను తుదముట్టించడానికి ఎస్ఈబీని ఏర్పాటు చేశారు. ఏడాదిలోనే 3 లక్షల కిలోలకుపైగా గంజాయిని ఎస్ఈబీ స్వాధీనం చేసుకుంది. సాగు చేసిన గంజాయి పంటను ధ్వంసం చేస్తున్నారు. స్మగ్లర్లకు పెద్ద ఎత్తున శిక్షలు పడుతున్నాయి. ఇది వాస్తవం కదా? ► ఎయిడెడ్ స్కూళ్లపై చేస్తున్న ఆందోళన వెనుక టీడీపీ నేతల పాత్ర ఉంది. ఎవరి మెడ మీదా కత్తి పెట్టి బలవంతంగా స్కూళ్లను తీసుకోలేదు. ► దేశంలో ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా పార్టీ పెట్టుకోవచ్చు. కేసీఆర్ కూడా రాష్ట్రంలో పార్టీ పెట్టుకోవచ్చు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఉమ్మడి ఏపీ దేశంలో అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్సీపీ చెప్పింది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో అడ్డగోలుగా విద్యుదుత్పత్తి చేస్తుండటం, సింగరేణి బొగ్గు గనులు ఉండటం వల్లే తెలంగాణలో విద్యుత్ సమస్య ఉత్పన్నం కాలేదన్నది వాస్తవం కాదా? చదవండి: కాంగ్రెస్ ,బీజేపీ లకు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండి: అంబటి రాంబాబు -
కష్టం.. కలవలేం: చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, అమిత్ షా
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుకు చుక్కెదురైంది. ప్రధాని, హోం మంత్రి అపాయింట్మెంట్ కోసం రెండ్రోజులు పడిగాపులు కాసినా ప్రయోజనం లేకుండాపోయింది. డ్రగ్స్‌కు ఏపీ కేంద్రంగా మారిందని ప్రచారం చేయడానికి దేశ రాజధానికి వెళ్లిన చంద్రబాబుకు కేంద్ర పెద్దల నుంచి స్పందన కరువైంది. ప్రధాని, హోంమంత్రి అపాయింట్మెంట్ కోసం రెండ్రోజులపాటు పడిగాపులు కాసినా ఎవరూ పట్టించుకోలేదు. తనకు ఎలాగైనా అపాయింట్మెంట్ సంపాదించాలని బీజేపీలో ఉన్న టీడీపీ నేతలతోనూ లాబీయింగ్ చేయించారట. కానీ, హోంమంత్రి అమిత్ షా.. చంద్రబాబును కలిసేందుకు ఇష్టపడలేదని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు కోటరీ గత నాలుగు రోజుల నుంచి అమిత్ షా ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేసింది. జమ్మూకశ్మీర్ పర్యటన ముగిం చుకుని ఆయన మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నప్పటికీ, చంద్రబాబుని కలిసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించలేదని సమాచారం. దీంతో కేంద్ర మంత్రులెవరూ కూడా చంద్రబాబుకు అవకాశం ఇవ్వలేదంటున్నారు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అనే చందంగా వ్యవహరించే చంద్రబాబు వైఖరి తెలిసిన బీజేపీ పెద్దలు చంద్రబాబుకు చాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆర్టికల్–356 అంటూ హడావుడి చేద్దామనుకున్న బాబుకు ఢిల్లీ పెద్దల ట్రీట్మెంట్ దిమ్మతిరిగేలా చేసింది. చివరకు జాతీయ మీడియా సైతం మొహం చాటేయడం చర్చనీయాంశమైంది. నిజానికి.. అమిత్ షాను చంద్రబాబు కలుస్తారని లీకులిచ్చినప్పుడే.. ఎంపీ జీ వీఎల్ నరసింహరావు తమ పార్టీ మనోగతం స్పష్టం చేశారు. అమిత్ షా కుటుంబం తిరుమల పర్యటనకు వచ్చిన సమయంలో కాన్వాయ్‌పై రాళ్లు వేయించిన ఘటనను మరిచిపోలేదని గుర్తుచేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని నానా బూతులు తిట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అపాయింట్మెంట్ అడుగుతున్నారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జాతీయ మీడియా కూడా దూరం అయితే.. రెండున్నరేళ్ల కిందట జరిగిన ఘటనలన్నీ బీజేపీ పెద్దలు మరిచిపోయి ఉంటారని బాబు అంచనా. కానీ అవి తలకిందులయ్యా యి. అలాగే.. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు కోసం ప్రచారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ నేతలు సైతం ఆ ఛాయల వైపు తొంగిచూడలేదు. అటు జాతీయ మీడియా సైతం బాబును పట్టించుకోలేదు. 2019 నుంచి అన్ని ఎన్నికల్లో ఓడిపోవడంతో లైట్ తీసుకుం ది. ఎల్లో మీడియా మినహా మిగిలిన వారెవరూ పెద్దగా బాబు వైపు కన్నెత్తి చూడలేదు. జాతీయ మీడియా ప్రతినిధులకు పదే పదే ఫోన్లుచేసి బాబును కలవాలని కోరితే నలుగురైదుగురు తప్పితే పెద్దగా ఎవరూ రావడానికి ఇష్టపడలే దు. కానీ, ఒకరిద్దరితో మోదీ బాగా పనిచేస్తున్నారంటూ మళ్లీ జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు జాతీయ రాజకీయాలో చక్రం తిప్పానని చెప్పుకునే వ్యక్తికి ఎ లాంటి దుస్థితి వచ్చిందని పలువురు చర్చించుకోవడం హాట్ టాపిక్ అయింది. మరోవైపు.. కాశ్మీర్ పర్యటన ముగిసిన తర్వాత అమిత్ షా కార్యాలయం నుంచి పిలుపు వస్తుందని కేడర్‌కు టీడీపీ వర్గాలు సర్దిచెప్పుకుంటున్నాయి. అందుకే నో అపాయింట్మెంట్ అధికారంలో ఉన్న సమయంలో తిరుమలకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన అమిత్ షా కాన్వాయ్‌పై నాడు రాళ్లేయించిన చంద్రబాబు ఇప్పుడు అపాయింట్మెంట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఎలాగోలా అమిత్ షాను కలిస్తే కేడర్‌లో కొంత విశ్వాసం కలుగుతుందని, దానివల్ల రాజకీయ లబ్ధిచేకూరుతుందని టీడీపీ నేతలు భావించినా.. చంద్రబాబు గత చరిత్రను మర్చిపోవద్దని కాషాయ నేతలు కేంద్రంలోని పెద్దలకు చెప్పారట. అందుకే చంద్రబాబు అండ్ కో..కు ఎవరి అపాయింట్మెంట్ దొరకలేదని అంటున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనను అడ్డం పెట్టుకుని అయినా కలవాలనుకున్నా.. బీజేపీ నేతలు ఆ చాన్స్ ఇవ్వలేదని, చంద్రబాబును కేంద్ర పెద్దల దగ్గరకు రానివ్వబోరని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. చివరికి.. కష్టపడి ప్లాన్చేసిన పర్యటన ఫలితాన్నివ్వకపోవడంతో మంగళవారం సాయంత్రం చంద్రబాబు, ఆయన బృందం ఉసూరుమంటూ హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు. రాష్ట్రపతికి వినతిపత్రంతోనే పర్యటన ముగిసింది. -
ఢిల్లీలో చంద్రబాబుకు షాక్.. అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, షా
-
ఢిల్లీలో చంద్రబాబుకు షాక్.. అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, షా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో గత్తర లేపుతానంటూ వెళ్లిన చంద్రబాబు నాయుడుకి భారీ షాక్ తగిలింది. చంద్రబాబు ఢిల్లీ టూర్ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. టీడీపీ అధ్యక్షుడిని కేంద్ర పెద్దలు, జాతీయ మీడియా పట్టించుకోలేదని సమాచారం. రెండు రోజులుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం పడిగాపులుగాస్తున్నప్పటికి చంద్రబాబుకు చుక్కెదురైనట్లు తెలిసింది. కశ్మీర్ పర్యటన ముగించుకుని అమిత్ షా ఢిల్లీకి వచ్చినప్పటికి.. చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. పార్టీ పరిస్థితి దయనీయంగా మారడంతో బీజేపీ అండ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. కానీ గతంలో అమిత్ షా కుటుంబంతో తిరుమలకు వస్తే.. ఆయన కాన్వాయ్‌పై చంద్రబాబు రాళ్లు వేయించిన ఘటనను బీజేపీ మరచిపోలేదు. అంతేకాక నరేంద్ర మోదీని ఉగ్రవాది అని సంభోదించడాన్ని కూడా కాషాయ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. రెండున్నరేళ్లయినా చంద్రబాబు కుట్రను బీజేపీ పెద్దలు మర్చిపోలేదు. (చదవండి: ఎందుకు దాడిచేశారో చెప్పాల్సింది) ఇప్పుడు చంద్రబాబు కల్లబొల్లి కబుర్లను బీజేపీ, జాతీయ మీడియా పట్టించుకోవడం లేదని తెలిసింది. ఏపీ డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోందని రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఢిల్లీలో ఉన్న చంద్రబాబును కలవాలని టీడీపీ నేతలు జాతీయ మీడియాకు పదే పదే ఫోన్లు చేస్తున్నారట. అయినప్పటికి వారు బాబును పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం. (చదవండి: Twitter: చంద్రబాబుపై వల్లభనేని వంశీ వ్యంగ్యాస్త్రాలు ) ఇటు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ దొరక్క, అటు జాతీయ మీడియా పట్టించుకోకపోవడంతో చంద్రబాబు వెనుదిరిగారు. ఆర్టికల్ 356 అంటూ హడావిడి చేద్దామనుకున్న చంద్రబాబు వ్యూహం తుస్సుమనడమే కాక జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రతిష్ట ఎంతలా దిగజారిందో మరోసారి బహిర్గతం అయ్యింది. చదవండి: ఏపీ పరువు తీయడానికే బాబు ఢిల్లీ టూర్ -
దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలా..?
-
ఏపీ పరువు తీయడానికే బాబు ఢిల్లీ టూర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికే చంద్రబాబు తన బృందంతో ఢిల్లీ వెళ్లారని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. తనకు అధికారం దక్కలేదన్న అక్కసుతో చంద్రబాబు అబద్ధాలు, అవాస్తవాలు పోగేసుకుని ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిశారని.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు, ఇక్కడ యువత డ్రగ్స్‌కు బానిసలైపోయినట్టు నిస్సిగ్గుగా ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటువంటి కుట్ర రాజకీయాలు చంద్రబాబుకు కొత్తకాదని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనపై చెప్పులు వేయించిన ఘనుడని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసు వ్యవహారం మెడకు చుట్టుకున్నప్పుడు కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని, ఆ కేసు నుంచి బయట పడేందుకు చివరకు ఏపీకి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఎంపీ భరత్ ఇంకా ఏమన్నారంటే.. గంజాయి రవాణాపై అప్పటి మీ మంత్రులు ఏమన్నారో మర్చిపోయారా ‘ఏపీ నుంచే దేశం మొత్తానికి గంజాయి వెళుతున్న విషయం ఓపెన్ సీక్రెట్’ అని మీరు సీఎంగా ఉన్నప్పుడు కేబినెట్లో చర్చించలేదా? స్కూల్ బస్సుల్లో కూడా గంజాయి రవాణా చేస్తున్నారని మీ కేబినెట్ మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు చెప్పలేదా? గంజాయి అక్రమ రవాణాలో పెద్దల హస్తం ఉందని స్వయానా మీ కేబినెట్ మంత్రులే చెప్పింది నిజం కాదా. వాస్తవాలు ఇలా ఉంటే.. రాష్ట్ర యువతపై టీడీపీ డ్రగ్స్ నెపం మోపుతోంది. బూతుల్ని సమర్థించుకోవడానికే.. సాక్షాత్తు ప్రధాన మంత్రిని బూతులు తిట్టిన సీడీలను, అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు రాళ్లు రువ్వించిన వీడియోలను రాష్ట్రపతికి చూపించారా? బాబు అండ్ కో మాట్లాడిన బూతులను సమర్థించుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల్లో గెలవలేనని తెలిసిన బాబు ఆర్టికల్ 356 కోరుతున్నట్టున్నారు. దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతికి అబద్ధాలు, అవాస్తవాలు చెప్పినందుకు, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనే నెపాన్ని వేస్తున్న బాబు అండ్ కోను అరెస్ట్ చేసి అండమాన్ దీవుల్లాంటి చోటకు పంపిస్తే ప్రజలు హర్షిస్తారు. అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబు అసాంఘిక శక్తులకు రారాజు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిడితే, అందుకు ప్రజలు స్పందిస్తే, దాన్ని అల్లర్లుగా సృష్టించాలని బాబు చూస్తున్నారు. గతంలోనూ మత, కుల రాజకీయాలు చేసి రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని బాబు తీవ్ర ప్రయత్నం చేశారు. ఇప్పుడు డ్రగ్స్ రాజకీయాలు తీసుకొస్తూ అందులో బూతు రాజకీయాలు కలుపుతున్నారు. -
కాంగ్రెస్‌కు భారీ షాక్: బీజేపీలో చేరనున్న మాజీ సీఎం?
చండీగఢ్: పంజాబ్ రాజకీయ రగడ ఇంకా సద్దుమణగలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి అమరీందర్ సింగ్ అసహనంతో ఉన్నారు. పార్టీని పల్లెత్తు మాట అనని రాజకీయ దురంధరుడు హస్తం వీడి కమలం గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలోనే అమరీందర్ సింగ్ ఢిల్లీకి వెళ్లడం కలకలం రేపుతోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అనంతరం పార్టీలో చేరతారని సమాచారం. చదవండి: మహిళ పోలీస్ అధికారి బాత్రూమ్లో కెమెరా.. స్నానం చేస్తుండగా ఈ పరిణామంతో పంజాబ్ రాజకీయం మరింత వేడెక్కింది. అయితే అమరీందర్ సింగ్ బీజేపీలో చేరితే మాత్రం కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ తగలనుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో విబేధాలు తారస్థాయికి చేరాయి. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు, అమరీందర్ సింగ్‌కు అసలు పొసగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ విబేధాలు కొనసాగుతున్నాయి. అయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం మధ్యే మార్గంగా అమరీందర్‌సింగ్‌ను దింపేసి దళిత వర్గానికి చెందిన చన్నీని ముఖ్యమంత్రిగా నియమించింది. చదవండి: అంగన్వాడీ టీచర్‌పై అమానుషం.. దుస్తులు చింపి.. సెల్‌ఫోన్ లాగేసుకుని అయితే ఈ నిర్ణయం ఎవరికీ ఆమోదయోగ్యంగా లేదు. పార్టీ నిర్ణయం మేరకు సిద్ధూ అంగీకరించినా మాజీ ముఖ్యమంత్రిగా మారిన అమరీందర్ సింగ్ మాత్రం జీర్ణించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పిన అమరీందర్ సింగ్ పార్టీ అధిష్టానం పిలిచి సముదాయించలేదు. పిలిచి మాట్లాడకపోవడం.. అసలు పట్టించుకోకపోవడంతో ఆయన తన దారి చూసుకుంటున్నారని సమాచారం. కొన్ని గంటల్లో ఏం జరగనుందో తెలియనుంది. -
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన: కేంద్ర మంత్రి షెకావత్‌తో భేటీ
-
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన: కేంద్ర మంత్రి షెకావత్‌తో భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో శనివారం భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు సాగింది. కృష్ణా, గోదావరి జలాల అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, జాతీయ హోదా గుర్తింపుపై షెకావత్‌కు కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. చదవండి: Civils Topper Sreeja సివిల్స్‌లో మెరిసిన వరంగల్ యువతి శ్రీజ -
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నాటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్‌కు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం రేపటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. చదవండి: (వైద్య, ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్కు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్) -
మరో సారి ఢిల్లీకి సీఎం కేసీఆర్
-
రెండోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకే నెలలో రెండోసారి ఆయన ఢిల్లీ పర్యటనకు సిద్ధం కావడం వెనకున్న ఆంతర్యాలను ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం అధికారిక కార్యక్రమాలున్నా గత ఏడేళ్లలో ఎప్పుడూ.. ఒకే నెలలో రెండుసార్లు సీఎం ఢిల్లీలో పర్యటించలేదు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, జల వివాదాల నేపథ్యంలో కేసీఆర్ హస్తిన ప్రయాణం ప్రాధాన్యత సంతరించుకుంది. సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరుకానున్న సీఎం.. తర్వాత జరిగే బీఏసీ భేటీ అనంతరం ఢిల్లీ వెళ్లనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో జరగనున్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి సమీక్షకు హాజరు కానున్నారు. అదే రోజు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయి ధాన్యం కొను గోలు అంశాలపై చర్చించనున్నారు. అదివారం సాయంత్రం సీఎం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారని ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించాయి. తొలి వారంలో మొదటిసారి ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఢిల్లీలో ఉన్న ఎనిమిది రోజుల్లో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయడంతో పాటు ఇతర కార్య క్రమాలతో బిజీ బిజీగా గడిపారు. జాతీయ రాజకీ యాలపై, ఆర్థిక వ్యవస్థ గురించి తనను కలిసిన వారితో చర్చించారు. వారి అభిప్రాయాలు తీసుకు న్నారు. ఇలా సీఎం ఏకంగా ఎనిమిది రోజుల పాటు ఢిల్లీలో గడపడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా మూడు రోజుల పర్యటన చేపట్టడం కూడా చర్చకు దారితీసింది. తొలిసారి హోం శాఖ సమీక్షకు.. దేశ వ్యాప్తంగా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఏటా కేంద్ర హోంశాఖ మంత్రి నేతృత్వంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుంది. ఇదే క్రమంలో ఈనెల 26న ఈ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్, రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, ఇంటిలిజెన్స్ అదనపు డీజీపీ అనిల్‌కుమార్ హాజరుకానున్నారు. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కావడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో మావోయిస్టుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం ఉండగా, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు తక్కువ ప్రాబల్యం కల్గిన జిల్లాలుగా కేంద్ర హోంశాఖ గుర్తించింది. ఆయా జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ కింద ఏటా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, వివిధ పథకాల ద్వారా అక్కడి నిరుద్యోగ యువతకు ఆర్థిక తోడ్పాటు కల్పించడం ద్వారా వారు మావోయిజం వైపు ఆకర్షితులవ కుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా గడిచిన ఐదేళ్లలో కేంద్ర హోంశాఖ మూడు విధాలుగా నిధులు మంజూరు చేస్తూ వస్తోంది. మరిన్ని నిధులు కోరనున్న సీఎం భద్రత సంబంధిత వ్యయం (ఎస్ఆర్ఈ), ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పన పథకం (ఎస్ఐఎస్), ప్రత్యేక కేంద్ర సాయం (ఎస్సీఏ) కింద మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణం, మొబైల్ టవర్ల ఏర్పాటు, బ్యాంకులు, పోస్టాపీసుల ఏర్పాటు వంటివి కేంద్రం చేపడుతోంది. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వాటి ద్వారా ఉద్యోగాల కల్పనకు, విద్యాసంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తూ వస్తోంది. రాష్ట్రానికి ఎస్ఆర్ఈ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి 2021 వరకు రూ.42.06 కోట్ల నిధులును కేటాయించింది. అదే విధంగా ఎస్ఐఎస్ పథకం కింద రూ.13.12 కోట్లు, ఎస్సీఏ కింద రూ.85.92 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా జిల్లాలు ఏర్పాటు కావడాన్ని ప్రస్తావిస్తూ వాటి అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాల్సిందిగా అమిత్‌షాను సీఎం కోరనున్నట్టు తెలిసింది. ఈ మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో నిరుద్యోగ యువ తకు ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు సంబంధిత అంశాలపై సీఎం ప్రతిపాదనలు సమర్పించనున్నారు. -
ముగిసిన కేసీఆర్ ఢిల్లీ టూర్.. వివరాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 2న ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్‌కు శంకుస్థాపన చేసేందుకు వీలుగా మూడు రోజుల ఢిల్లీ పర్యటన కోసం ఈ నెల 1న హస్తిన వెళ్లిన సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 3న తన పర్యటన ముగించుకొని తిరిగి రాష్ట్రానికి రావాల్సి ఉంది. అయితే ఆయన మరో 6 రోజులపాటు ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌ను పొడిగించుకున్నారు. (చదవండి: కుటుంబాన్ని చిదిమేసిన లారీ) ఈ పర్యటనలో ప్రధాని సహా ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం లేదని సీఎం కార్యాలయ వర్గాలు తొలుత ప్రకటించగా షెడ్యూల్ పొడిగింపు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 3న ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఐపీఎస్ కేడర్‌పై సమీక్ష, సమీకృత టెక్స్టైల్ పార్కు ఏర్పాటు, హైదరాబాద్–నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాసంస్థల ఏర్పాటు వంటి అంశాలపై ప్రధానితో భేటీలో చర్చించారు. ఈ నెల 4న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 6న కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌లతో వేర్వేరుగా సమావేశమై రాష్ట్ర అంశాలపై లేఖలు అందజేశారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన అంశాలకు పరిష్కారం సాధించే దిశగా ప్రయత్నించాలని పార్టీ ఎంపీలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. నిపుణులతో సమావేశాలు.. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ అధికారిక సమావేశాల్లో పాల్గొనడంతోపాటు మిగతా సమయాల్లో వివిధ రంగాల నిపుణులతో పిచ్చాపాటిగా సమావేశమైనట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, తెలంగాణ అభివృద్ధి, ఇతర అంశాలపై రాజకీయ, ఆర్థిక రంగాల ప్రముఖులతో సీఎం చర్చించినట్లు సమాచారం. అలాగే గతంలో ఢిల్లీలో కంటి శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్... బుధవారం మరోసారి కంటి పరీక్షలు చేయించుకున్నట్లు తెలియవచ్చింది. (చదవండి: మిషన్ భగీరథ పైపులైన్‌ను ఢీకొట్టిన లారీ)