Telangana Minister KTR Second Day Visit To Delhi - Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కేటీఆర్‌.. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌తో భేటీ

Published Sat, Jun 24 2023 4:45 PM | Last Updated on Sat, Jun 24 2023 6:10 PM

Telangana Minister Ktr Second Day Visit To Delhi - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమవుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని మంత్రి కేటీఆర్,  బీఆర్‌ఎస్‌ ఎంపీలు శనివారం కలిశారు. రాత్రి 10:15కి అమిత్‌షాను కేటీఆర్‌ కలవనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమంపైన హర్దీప్ సింగ్ పూరి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో కూడిన శానిటేషన్ హబ్‌తో పురపాలక అభివృద్ధిలో అనేక సవాళ్లకు సమాధానం దొరుకుతుందన్నారు. ఈ అంశంపైన తెలంగాణ రాష్ట్రం తన నమూనాను, ఆలోచనలను పంచుకోవాలని హర్దీప్ సింగ్ పూరీ కోరారు. త్వరలోనే తన మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎస్ ఆర్ డి పి, లింకు రోడ్లు, పారిశుద్ధ్యరంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అర్బన్ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్ రావాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలకు సంబంధించిన విజ్ఞప్తులను హర్దీప్ సింగ్ పూరికి అందించారు.
చదవండి: వేధింపుల ఎపిసోడ్‌.. సర్పంచ్‌ నవ్యకు నోటీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement