Hardeep Singh Puri
-
హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రగామిగా భారత్!.. కేంద్రమంత్రి
చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి కేంద్రం తగిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, సీఎన్జీ వాహనాల ఆవశ్యకతను గురించి వెల్లడించడం వంటివి చేస్తోంది. వాహన తయారీ సంస్థలకు కూడా ఫ్యూయెల్ వాహనాలకు ప్రత్యామ్నాయ వాహనాలను తయారు చేయాలనీ సూచిస్తోంది. రాబోయే రోజుల్లో మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. హైడ్రోజన్ ఉత్పత్తిలో కూడా భారత్ అగ్రగామిగా మారుతుందని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' అన్నారు.6వ సౌత్ ఏషియన్ జియోసైన్స్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్లో మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' మాట్లాడుతూ.. నేచురల్ గ్యాస్ పైప్లైన్లలో హైడ్రోజన్ కలపడం, ఎలక్ట్రోలైజర్ బేస్డ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయో-పాత్‌వేలను ప్రోత్సహించడం వంటి ప్రాజెక్టులలో భారత్ అభివృద్ధి చెందుతోందని అన్నారు. భవిష్యత్‌కు ఇంధనంగా భావించే గ్రీన్ హైడ్రోజన్‌కు మనదేశం కేంద్రంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.భారతదేశంలో రోజుకు 5.4 మిలియన్ బ్యారెల్స్ ఇంధన వినియోగం జరుగుతోంది. ఇది 2030నాటికి 7 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుందని అంచనా. ప్రతి రోజూ 67 మిలియన్ల మంది ప్రజలు పెట్రోల్ పంపులను సందర్శిస్తున్నట్లు హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఈ సంఖ్య యూకే, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల జనాభాకు సమానమని ఆయన అన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్‌లో 25 శాతం భారత్ నుంచి వస్తుందని అంచనా. -
2047 నాటికి ఇంధన డిమాండ్ రెట్టింపు
దేశ ఇంధన డిమాండ్ 2047 నాటికి రెట్టింపు అవుతుందని పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా దేశీయ డిమాండ్ 25 శాతం పెరుగుతుందన్నారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్టీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) సంయుక్తంగా బెంగళూరులో నిర్వహించిన ఎనర్జీ టెక్నాలజీ మీట్ (ఈటీఎం)2024ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.‘ఎనర్జీ సెక్యూరిటీ, సుస్థిరత, సాంకేతిక ఆవిష్కరణలకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) గణాంకాల ప్రకారం 2047 నాటికి భారత ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుంది. రాబోయే రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా దేశీయ ఇంధన డిమాండ్ గణనీయంగా 25 శాతం పెరుగుతుంది. నికర-సున్నా ఉద్గారాల లక్ష్యాలను సాధించడంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) మెరుగైన విధానాలు పాటించాలి. ఇథనాల్, హైడ్రోజన్, జీవ ఇంధనాలలో పురోగతి ద్వారా వికసిత్ భారత్ సాధనలో భాగం కావాలి. ఫాజిల్ ప్యూయెల్లో కలిపే జీవ ఇంధనం మిశ్రమం రేటు ప్రస్తుతం 16.9%కి చేరుకుంది. 2030 నాటికి ఇది 20% లక్ష్యాన్ని చేరాలనే లక్ష్యం ఉంది. కానీ షెడ్యూల్ కంటే ఐదేళ్ల ముందే ఈ లక్ష్యాన్ని అధిగమించే దిశగా ముందుకు సాగుతున్నాం’ అని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓ‘భారతదేశం 250 రూపాల్లోని ముడి చమురును ప్రాసెస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశీయ ప్రస్తుత ముడి చమురు శుద్ధి సామర్థ్యం 258 మిలియన్ మెట్రిక్టన్స్ పర్ యానమ్(ఎంఎంటీపీఏ)గా ఉంది. రానున్న రోజుల్లో ఇది 310 ఎంఎంటీపీఏకి పెరుగుతుందని అంచనా’ అన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్‌పై స్పందిస్తూ 2027 నాటికి దేశీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ 70 బిలియన్ డాలర్లు(రూ.5.81 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ అండ్ డైరెక్టర్ (మార్కెటింగ్) వి.సతీష్ కుమార్ పాల్గొన్నారు. -
‘ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం’
పశ్చిమాసియాలో పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో అంతర్జాతీయంగా అధికమవుతున్న చమురు ధరలను భారత్ గమనిస్తోందని చమురు వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. చమురు ధరలకు సంబంధించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామన్నారు. ‘ఎగ్జిన్మొబిల్ గ్లోబల్ ఔట్లుక్ 2024’ సమావేశంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. మంత్రి ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయితే, ఆ ప్రభావం దేశంలో ఇంధన లభ్యతపై ఉంటుంది.దేశానికి చమురు సరఫరాల్లో ఎటువంటి అవాంతరాలూ ఉండబోవని భావిస్తున్నాం.ప్రపంచంలోని మూడో అతిపెద్ద చమురు వినియోగ, దిగుమతి దేశమైన భారత్ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలదనే విశ్వాసంతో ఉన్నాం.దేశంలో చమురు కొరత లేదు. భారతదేశ అవసరాలకు తగిన నిల్వలు, వనరులు ఉన్నాయి. ఇదీ చదవండి: హర్ష్ గోయెంకా ఓలా స్కూటర్‌ను ఎలా వాడుతారో తెలుసా..?మార్చిలో సగటున భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ బ్యారల్‌కు 83 నుంచి 84 డాలర్లు ఉంటే, సెప్టెంబర్‌లో 73.69 డాలర్లకు తగ్గింది. అయితే తాజా పరిస్థితులు మళ్లీ ధరల పెరుగుదలపై ఆందోళనలను లేవనెత్తుతున్నాయి. దేశంలో పెట్రోల్–డీజిల్ ధరలు లీటర్‌కు 2 నుంచి 3 వరకూ తగ్గే వీలుందని గత వారం రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొన్న నేపథ్యంలోనే పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం గమనార్హం. -
చౌకగా లభిస్తోన్న ముడి చమురు
రష్యా ముడిచమురు ఇప్పటికీ తక్కువ ధరకే లభిస్తుందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. దాంతో రష్యన్ కంపెనీల నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా ముడిచమురు దిగుమతులపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాంతో రష్యా తక్కువ ధరకు క్రూడాయిల్ విక్రయిస్తోంది.భారత్ తన చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన వినియోగదారుల్లో భారత్ ఒకటిగా ఉంది. దేశీయంగా వార్షిక ముడిచమురు శుద్ధి సామర్థ్యం సుమారు 252 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. అంటే రోజుకు 50.04 లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసే కెపాసిటీ కలిగి ఉంది. భవిష్యత్తులో ఇంధన వినియోగం పెరగనుందని మంత్రి అన్నారు. అందుకు అనుగుణంగా సంవత్సరానికి 300 మిలియన్ మెట్రిక్ టన్నుల (రోజూ 60 లక్షల బ్యారెల్స్) వరకు చమురు శుద్ధి చేసేలా కర్మాగారాల సామర్థ్యాన్ని పెంచే ప్రాజెక్ట్‌లు అమలులో ఉన్నాయని తెలిపారు.ఇదీ చదవండి: ఏటా 2.5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా సరఫరాఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న భౌగోళిక అనిశ్చితుల వల్ల యూరప్ దేశాలు రష్యా క్రూడ్ దిగుమతిపై ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా చమురు ధరను తగ్గించడంతోపాటు రూపాయిల్లో ట్రేడ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇతర దేశాల నుంచి పోలిస్తే రష్యా చమురు దిగుమతి భారత్‌కు కలిసివచ్చింది. చైనా కూడా రష్యా చమురు వాడకాన్ని పెంచింది. ఈ పరిణామాల వల్ల ప్రస్తుతం భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉద్భవించింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు భారత్‌కు చమురు దిగుమతిలో రష్యా వాటా 1 శాతం కంటే తక్కువే ఉండేది. క్రమంగా అది పెరుగుతూ దాదాపు 40 శాతం వాటాకు చేరింది. -
సిక్కుల విషయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్)ను టార్గెట్ చూస్తూ తనదైన రీతిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే డల్లాస్‌లో విమర్శలు గుప్పించిన రాహుల్. తాజాగా వర్జినాలోనూ అదే తరహాలో మాట్లాడారు. కొన్ని రాష్ట్రాలు, మతాలు, భాషలు, వర్గ ప్రజలను.. ఆర్ఎస్ఎస్ తక్కువ అన్న అభిప్రాయంతో చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు. అలాగే భారత్‌లో సిక్కు మతస్థుడు తలపాగాను పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తారో లేదో, సిక్కులను గురుద్వారా వెళ్లనిస్తారో లేదో అంటూ వ్యాఖ్యానించారు. భారత్‌లో జరుగుతున్న పోరాటం ఇదే అని, రాజకీయ పోరాటం కాదు అని ఆయన తెలిపారు. అయితే యూఎస్‌లో రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ.. విదేశాల వేదికగా ప్రవాసుల భారతీయుల మధ్య దేశంపై ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ భారత్‌కు తిరిగి వచ్చి ఈ వ్యాఖ్యలు చేయగలరా? అంటూ ప్రశ్నించారు.‘రాహుల్ వ్యాఖ్యలు దుర్మార్గం. అతని ముందు ఉన్న వారు నా కమ్యూనిటీకి చెందినవారు. వారు యూఎస్‌లో జీవిస్తున్నారు. దేశంతో బలమైన సంబంధం లేదు. అలాంటి వారికి రాహుల్ తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నారు. తన అమెరికా పర్యటనలో భారత న్యాయ వ్యవస్థపై, ఎన్నికల ఫలితాలపై, కాంగ్రెస్ ఖాతాల స్తంభణపై మాట్లాడుతున్నారు. కానీ గత దశాబ్ద కాలంలో భారత్‌లో జరిగిన అభివృద్ధి గురించి ప్రాస్తావించడం విస్మరించారు.నేను ఆరు దశాబ్దాలుగా ఓ సిక్కుగా టర్బన్ (తలపాగా) ధరిస్తున్నాను. కడెం కూడా వేసుకుంటున్నాను. దీన్ని ధరించడంలో ఎప్పుడూ సమస్య రాలేదు. అసలు రాహుల్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే సిక్కులు భయాందోళనతో జీవించారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత1984లో సిక్కులపై హత్యాకాండ జరిగింది. మూడు వేల మంది అమాయక ప్రజలను చంపారు. వారిని ఇళ్ల నుంచి బయటకు లాగి సజీవ దహనం చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ హయాంలో సిక్కు సమాజం చాలా సురక్షితంగా, గౌరవంగా జీవిస్తోందన్నారు. తమ ప్రభుత్వం సిక్కుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది’ అని తెలిపారు. -
‘ఇంటి పేరు’తో పనిలేదు దీపిందర్ గోయల్.. ప్రధాని మోదీ ట్వీట్ వైరల్
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్టార్టప్ జర్నీపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నేటి భారతంలో ఇంటిపేరుకు ఎలాంటి ప్రాధాన్యం లేదంటూనే.. గోయల్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ‘విశేష్ సంపర్క్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఈవెంట్లో దీపిందర్ గోయల్ స్టార్టప్‌ను ప్రారంభించే విషయంలో తనకు తన తండ్రికి మధ్య జరిగిన చర్చ గురించి గుర్తు చేశారు.నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా?‘16 ఏళ్ల క్రితం నా తండ్రికి నా స్టార్టప్ ఆలోచన గురించి వివరించా. అప్పుడాయన.. నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా? పంజాబ్‌లోని ఇంత చిన్న ఊరిలో నువ్వేం చేయలేవు అని అన్నారు. కానీ నేను సుసాధ్యం చేశాను. జొమాటో అనే సామ్రజ్యాన్ని నిర్మించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయం ఇంటిపేర్లతో కట్టుబడి ఉండదనివిశేష్ సంపర్క్ కార్యక్రమంలో దీపిందర్ గోయల్ ప్రసంగంపై ప్రధాని మోదీ స్పందించారు. విజయం ఇంటిపేర్లతో కట్టుబడి ఉండదని, గోయల్ సాధించిన విజయాలు ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలుస్తోందన్నారు.మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం‘నేటి భారతంలో ఒకరి ఇంటిపేరు పట్టింపు లేదు. కష్టపడి పనిచేయడమే ముఖ్యం. మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం దీపిందర్ గోయల్! ఇది అసంఖ్యాక యువకులను వారి వ్యవస్థాపక కలలను కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి సరైన వాతావరణాన్ని అందించడానికి మేం కట్టుబడి ఉన్నాము’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.In today’s India, one’s surname doesn’t matter. What matters is hardwork. Your journey is truly inspiring, @deepigoyal! It motivates countless youngsters to pursue their entrepreneurial dreams. We are committed to providing the right environment for the startups to flourish. https://t.co/E9ccqYyVzv— Narendra Modi (@narendramodi) May 22, 2024 -
‘కేజ్రీవాల్‌ది సిగ్గులేనితనం’.. సీఎంగా రాజీనామా చేయాలి
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండ్‌రింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ పట్టుపడుతోంది. అరెస్ట్ అయిన మొదటి నుంచి కేజ్రీవాల్ సీఎంగా కొనసాగడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ రాజీనామా వ్యవహారంపై మంగళవారం కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి కూడా స్పందించారు. ‘నేను రాజ్యాంగ నిబంధనలు అధికంగా తెలిసిన నిష్ణాతున్ని కాదు. అయితే, కేజ్రీవాల్ సీఎంగా కొనసాగాలా? వద్దా? అనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ, 50 ఏళ్ల ప్రజా జీవితంలో ఉన్న నేను.. కేజ్రీవాల్ ఇంకా సీఎం కోనసాగటం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నా. అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్నాక కూడా సీఎం పదవికీ రాజీనామా చేయకపోవటం సిగ్గులేనితనం. రాజకీయ విలువలు తెలిసిన వారు.. జైలులో వెళ్లిన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేస్తారు. పార్టీలో ఒకరికీ ఢిల్లీ సీఎం బాధ్యతలు అప్పగిస్తారు. జైలులో ఉండి ప్రభుత్వాన్ని నడపటం సరికాదు’ అని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. మరోవైపు.. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా వెంటనే రాజీనామా చేయాలని మరో బీజేపీ నేత బాన్సూరి స్వరాజ్ డిమాండ్ చేశారు. ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ చాలా కీలకమైన వ్యక్తి అని హైకోర్టు తేల్చిచెప్పింది. కేజ్రీవాల్ సీఎంగా ఉంటూ మనీలాండరింగ్ చేశారు. ఈడీ చెప్పిన విషయాలను హైకోర్టు నిజాలుగా చెప్పింది. కేజ్రీవాల్ అరెస్ట్ సైతం చట్టవ్యతిరేకం కాదని హైకోర్టు వెల్లడించింది. నైతిక బాధ్యత వహిస్తూ.. కేజీవాల్ సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలి. లిక్కర్ స్కామ్‌లో సుమారు రూ. 100 కోట్లను పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. ఈడీ పేర్కొన్న దర్యాప్తు విషయాలను హైకోర్టు పరిశీలించింది’ అని బాన్సూరి స్వరాజ్ తెలిపారు. ఇక.. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్‌కు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నయని, హవావలా ద్వారా డబ్బు తరలింపుకు సంబంధించి ఈడీ ఆధారాలు చూపించిందని పేర్కొంది. గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని కోర్టు తెలిపింది. కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్ చట్ట విరుద్ధం కాని కోర్టు పేర్కొంది. -
సునీతా కేజ్రీవాల్ ‘నియంతృత్వం’ విమర్శలపై బీజేపీ కౌంటర్
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అలాగే తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘సీఎం కేజ్రీవాల్‌ను జైలుకు ఎందుకు పంపారు?. వారికి( బీజేపీ) ఒక్కటే లక్ష్యం ఉంది..లోక్‌సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్లో జైలులోనే ఉంచటం. దేశ ప్రజలు ఇలాంటి నియంతృత్వానికి గట్టి సమాధానం చెబుతారు’ అని సునీతా కేజ్రీవాల్ అన్నారు. సునీతా కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజీపీ కౌంటర్ ఇచ్చింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సునీతా కేజ్రీవాల్‌ను రబ్రీదేవీతో పోల్చారు. ‘రబ్రీదేవి సిద్ధమవుతోంది. గత వారం, పది రోజుల్లో ఇప్పటికే మూడు, నాలుగు సార్లు చెప్పాను. రబ్రీ త్వరలో మనముందుకు వస్తుంది. అంటే నేను అనేది..సునీతా కేజ్రీవాల్ సీఎంగా రాబోతుంది. అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఇద్దరు నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌తో కేబినెట్ చర్చలు జరుపుతున్నారు. ఏ ప్రభుత్వమైనా జైలు నుంచి నడపుతారా? ఇక్కడి ప్రభుత్వంలో మాత్రం ముగ్గురు మంత్రులు జైలులో ఉన్నారు. వారు అక్కడే కేబినెట్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు’ అని హర్దీప్ సింగ్ పూరి ఎద్దేవా చేశారు. ఇక.. అవినీతి కేసులో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ జైలు వెళ్లినప్పుడు ఆయన భార్య రబ్రీదేవి సీఎం అయిన విషయం తెలిసిందే. -
ప్రపంచంలోనే పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించిన ఏకైక దేశం భారత్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. గడిచిన రెండేళ్లలో ప్రపంచంలోనే ఫ్యూయల్ ధరలు తగ్గిన దేశం ఏదైనా ఉందంటే అది మన దేశమేనని సూచించారు. ఇదంతా ప్రధాని మోదీ ఘనతేనని తెలిపారు. సీఎన్ఎన్-ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ల కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. ధరల కట్టడిలో ప్రధాని మోదీ పరిపాలన అద్భుతంగా ఉందన్నారు. దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు రోజుకు మూడు పూటల రేషన్ బియ్యం అందిస్తూనే మోదీ ఇంధన ధరల్ని తగ్గించగలిగారని పునరుద్ఘాటించారు. మోదీ నిర్ణయం..తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు అంతేకాదు రెండు ఏళ్లే కాలంలో ప్రపంచంలో ఇంధన ధరలు తగ్గిన దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉందని తెలిపారు. గత కొన్నేళ్లుగా డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ కొరత ఏర్పడిన సందర్భం ఒక్కటి కూడా లేదని గుర్తు చేశారు. ప్రధాని మోదీ నవంబర్ 2021, మే 2022 సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. ఆ నిర్ణయం వల్ల పెట్రోల్ ధర 13 రూపాయలు, డీజిల్ ధర రూ.16 రూపాయలకు తగ్గింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను సైతం తగ్గించాయని అన్నారు. భారత్‌లో ధరలు స్థిరంగా వరల్డ్ వైడ్‌గా ధరలు పెరిగిపోతుంటే భారత్‌లో ధరలు నియంత్రణలో ఉన్నాయి. శ్రీలంక ధరలు 60-70 శాతం పెరిగాయి. పాకిస్తాన్లో ధరలు అదుపు లేకుండా పెరిగాయి. అమెరికా, పశ్చిమ యూరప్, కెనడాలలో 25 శాతం నుంచి 40 శాతం మధ్య పెరిగాయి. కానీ భారత్‌లో మాత్రం ధరలు తగ్గాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఇంధన ధరలు తగ్గుతాయా? రానున్న రోజుల్లో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు కేంద్ర మంత్రి లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గుర్తు చేశారు. తాను ఏ ప్రకటన చేసినా అది ఎన్నికల ఉల్లంఘనే అవుతుందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తన ప్రసంగాన్ని ముగించారు. -
Ram Mandir: ‘కాంగ్రెస్ పశ్చాత్తాపడటం తప్పదు’
అయోధ్యలో జనవరి 22న జగిగే రామ మందిర ప్రారంభోత్సవానికి తాము హాజరు కావొద్దని నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గొప్పగా మాట్లాడటంలో కూరుకుపోయిందని అన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని వాళ్లు ఎందుకు సీరియస్‌కు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. మందిర ప్రారంభోత్సవానికి వెళ్లకపోతే కాంగ్రెస్ పార్టీవాళ్లే తీవ్రంగా పశ్చాత్తాపపడతారని అన్నారు. రామ మందిర ప్రారంభ కార్యక్రమం విషయంలో కాంగ్రెస్ తీరుపై మరో బీజేపీ నేత నలిన్ కోహ్లి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఊహించిందేనని అన్నారు. ఇందులో ఆశ్చర్యం ఏం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాముడి ఉనికిని కూడా తిరస్కరిస్తోందని మండిపడ్డారు. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ అయోధ్య ఆలయం కోసం ఎటువంటి సానుకూలమైన అడుగులు వేయలేదని అన్నారు. రాముడి ఉనికిని కూడా తిరస్కరిస్తూ.. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసును సైతం జాప్యం చేసిందని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అధికారికంగా హాజరుకామని ప్రకటించటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని అన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మజీందర్ సింగ్ సిర్సా కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాకపోతే తమకు ఏ ఇబ్బంది లేదని అన్నారు. కానీ, రామ మందిర ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమం అనడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాని అన్నారు. ఇక.. అయోధ్య రామ మందిర కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎంపీ సోనియా గాంధీ,లోక్‌సభ ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరికి ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం తమ నిర్ణయంపై ఆలోచిస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. బుధవారం హాజరు కావటంలేదని ప్రకటించింది. ఆయోధ్య మందిర ప్రారంభ కార్యక్రమం ఆర్ఎస్ఎస్, బీజేపీ చెందిన కార్యక్రమమని మండిపడింది. ఈ కార్యక్రమాన్నిమోదీ ప్రభుత్వం రాజకీయ ప్రాజెక్టుగా మలుచుకుంటోందని కాంగ్రెస్ విమర్శలు చేసింది. చదవండి: భారీ స్థాయిలో కమలం ఆపరేషన్.. 1984 తర్వాత సాధించని ఫీట్ కోసం..! -
కేజీ బేసీన్లో చమురు ఉత్పత్తి ప్రారంభం
న్యూఢిల్లీ: రాష్ట్రాల ఆధీనంలో ఉండే ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) డీప్ వాటర్ ప్రాజెక్టులో భాగంగా ఆదివారం చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. తూర్పు తీరంలోని కృష్ణా గోదావరి బేసిన్లో ప్రధానమైన డీప్‌వాటర్ ప్రాజెక్ట్ నుంచి చమురు ఉత్పత్తిని ఓఎన్జీసీ మొదలుపెట్టింది. అయితే మొదటిసారి బంగాళాఖాతం సముద్ర తీరంలో కష్టతమరైన డీప్ వాటర్ KG-DWN-98/2 బ్లాక్ నుంచి చమురు ఉత్పత్తిని ప్రారంభించినట్లు కేంద్ర కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి మంత్రి హర్దీప్ సింగ్ పూరి ‘ఎక్స్’ ట్విటర్లో తెలిపారు. దీంతో దేశంలోని ఇంధన ఉత్పత్తి కృష్ణా గోదావరి బేసిన్ (KGB)లోని లోతైన సరిహద్దుల నుంచి పెరగటం ప్రారంభమైందని కేంద్ర మంత్రి తెలిపారు. बधाई भारत! #ONGCJeetegaToBharatJeetega! As India powers ahead as the fastest growing economy under leadership of PM @NarendraModi Ji, our energy production is also set to rise from the deepest frontiers of #KrishnaGodavari “First Oil” production commences from the complex &… pic.twitter.com/gN2iPSs0YZ — Hardeep Singh Puri (@HardeepSPuri) January 7, 2024 ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని తెలిపారు. చమురు ఉత్పత్తి కృష్ణగోదావరి బేసిన్లో లోతైన సరిహద్దుల నుంచి పెరగడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఉత్పత్తి రోజుకు 45,000 బ్యారెల్స్, 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత జాతీయ చమురు ఉత్పత్తికి 7 శాతం, జాతీయ సహజ వాయువు ఉత్పత్తికి 7 శాతం అదనంగా ఉత్పత్తిని సమకూర్చుతుందని తెలిపారు. చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు -
ఓఎన్జీసీ చేతికి 7 బ్లాకులు.. చమురు నిక్షేపాల తవ్వకాల్లో రిలయన్స్
న్యూఢిల్లీ: ఓపెన్ ఏకరేజ్ లైసెన్స్ పాలసీ(ఓఏఎల్‌పీ)లో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) 7 బ్లాకులను గెలుచుకుంది. ప్రయివేట్ రంగ కన్సార్షియం రిలయన్స్–బీపీ, ఇంధన రంగ పీఎస్‌యూ ఆయిల్ ఇండియా, సన్పెట్రోకెమికల్స్ ఒక్కో క్షేత్రం చొప్పున సాధించాయి. చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి 8వ రౌండ్లో భాగంగా 10 బ్లాకులను ఆఫర్ చేసినట్లు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వెరసి ఓఏఎల్‌పీ–8లో తాజాగా 10 బ్లాకులకు సంతకాలు జరిగినట్లు వెల్లడించారు. ఇదేసమయంలో మూడు కోల్బెడ్ మిథేన్(సీబీఎం) బ్లాకులను సైతం కేటాయించినట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఓఏఎల్‌పీ–9వ రౌండ్ బిడ్డింగ్‌కు తెరతీసినట్లు తెలియజేశారు. తాజాగా ఆఫర్ చేసిన బ్లాకుల అన్వేషణ కార్యకలాపాలకు 23.3 కోట్ల డాలర్ల పెట్టుబడులు వెచ్చించవచ్చని భావిస్తున్నట్లు అధికారిక నోట్లో చమురు శాఖ పేర్కొంది. 2022 జులైలో ఓఎల్‌ఏపీ–8వ రౌండ్‌కు బిడ్డింగ్‌ను తెరిచిన సంగతి తెలిసిందే. చమురు శాఖ మొత్తం 10 బ్లాకులను ఆఫర్ చేసింది. పలు దఫాలు గడువు తేదీని సవరించాక 2023 జులైలో బిడ్డింగ్‌ను ముగించింది. హైడ్రోకార్బన్స్ డైరెక్టరేట్ జనరల్(డీజీహెచ్) వివరాల ప్రకారం ఓఎన్జీసీసహా వేదాంతా లిమిటెడ్, ఆయిల్ ఇండియా, సన్ పెట్రోకెమికల్స్, రిలయన్స్–బీపీ ఎక్స్‌ప్లొరేషన్(అల్ఫా) ఉమ్మడిగా 13 బిడ్స్ దాఖలు చేశాయి. బిడ్స్ తీరిలా కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసిన 10 బ్లాకులలో ఏడింటికి ఒక్కొక్క బిడ్ దాఖలుకాగా.. మిగిలిన మూడు క్షేత్రాలకు రెండేసి బిడ్స్ లభించాయి. గ్లోబల్ ఇంధన దిగ్గజాలు ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్, టోటల్ఎనర్జీస్ బిడ్ చేయలేదు. మొత్తం 9 బ్లాకులకు బిడ్ చేసినఓఎన్జీసీ 6 బ్లాకులకు ఒంటరిగా రేసులో నిలిచింది. రిలయన్స్–బీపీ కేజీ బేసిన్‌లోని లోతైన సముద్రగర్భ బ్లాక్‌కు బిడ్ వేసింది. దశాబ్ద కాలంగా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న రిలయన్స్–బీపీ గత ఓఏఎల్‌పీ రౌండ్లలోనూ ఒక బ్లాకును గెలుచుకున్నాయి. చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకునే లక్ష్యంతో ప్రభుత్వం 2016లో ఓఏఎల్పీకి తెరతీసింది. తద్వారా చమురు సంస్థలు ఇంధన అన్వేషణకు గుర్తించిన ప్రాంత పరిధిని దాటి ఏ ఇతర ప్రాంతాన్నయినా ఎంపిక చేసుకునేందుకు వీలు కల్పించింది. ప్రత్యేక సీబీఎం బిడ్ రౌండ్–2022లో భాగంగా 3 బ్లాకుల కేటాయింపునకు సంతకాలు పూర్తయినట్లు మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. -
తీవ్ర ఒడిదుడుకుల్లో చమురు మార్కెట్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అవి స్థిరపడ్డాకే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఈ విషయం గురించి ఎటువంటి చర్చలూ జరపలేదని చెప్పారు. ముడి చమురు రేట్లు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించే అవకాశాలపై స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అంతర్జాతీయంగా రెండు ప్రాంతాల్లో (రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–పాలస్తీనా) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని సవాళ్లేమైనా తలెత్తినా .. లేదా ఆటంకాలేమైనా ఎదురైనా దాని ప్రభావాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. కానీ అలాంటిదేమీ జరగకూడదని కోరుకుందాం. తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్న పరిస్థితుల్లో ఇంధన లభ్యత, అందుబాటు ధరలో అది అందేలా చూడటం ప్రాథమిక బాధ్యత. జాగ్రత్తగా దీన్నుంచి బైటపడే ప్రయత్నం చేస్తున్నాం‘ అని పురి వివరించారు. మరోవైపు, చమురు దిగుమతులకు సంబంధించి రష్యాకు చెల్లింపుల విషయంలో ఎలాంటి సమస్యా లేదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. -
గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమిలో భాగం కండి
న్యూఢిల్లీ: ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌లో భాగం కావాలని గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ పిలుపునిచి్చంది. జీవఇంధనాల అభివృద్ధికి సంబంధించిన నైపుణ్యాలను వర్ధమాన దేశాలు, అంతగా అభివృద్ధి చెందని దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సులో పాల్గొన్న కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ మేరకు పిలుపునిచ్చారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ని కలిపి వినియోగంలోకి తేవాలన్న లక్ష్యాన్ని అయిదు నెలల ముందుగా 2022 మేలో భారత్ సాధించిందని, దీన్ని 20 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యాన్ని అయిదేళ్లు ముందుకు జరిపి 2025కి మార్చుకుందని ఆయన చెప్పారు. బయోమాస్‌ను ఇంధనంగా మార్చడం ద్వారా ఇటు రైతులకు అదనపు ఆదాయ వనరును అందుబాటులోకి తేవడంతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపునకు కూడా భారత్ కృషి చేస్తోందని పురి వివరించారు. ఇందుకు సంబంధించి టెక్నాలజీ బదలాయింపు, సంయుక్త పరిశోధన .. అభివృద్ధి కార్యకలాపాలు, మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో ఇతర గ్లోబల్ సౌత్ దేశాలతో కలిసి పని చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. బయోమాస్ నుంచి తయారు చేసే జీవ ఇంధనాలను ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి తెచ్చే లక్ష్యంతో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయెన్స్ ఏర్పడింది. ఇందులో అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు భాగంగా ఉన్నాయి. కొన్ని దేశాలు మినహా ఉత్తరార్ధగోళంలో ఉన్న మెజారిటీ దేశాలను గ్లోబల్ నార్త్గాను, దక్షిణార్ధగోళంలో ఉన్న దేశాలను గ్లోబల్ సౌత్గాను వ్యవహరిస్తున్నారు. -
భారత్‌లో ‘రిఫరెన్స్’ ఇంధనం ఉత్పత్తి షురూ..
న్యూఢిల్లీ: దేశీయంగా ‘రిఫరెన్స్’ పెట్రోల్, డీజిల్ ఇంధనాల తయారీ ప్రారంభమైంది. తద్వారా ఆటోమొబైల్స్ టెస్టింగ్ కోసం ఉపయోగించే ప్రత్యేక ఇంధనాలను తయారు చేసే దేశాల సరసన భారత్ కూడా చేరింది. చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ ఇంధనాలను ఆవిష్కరించారు. దిగుమతులను తగ్గించుకుని భారత్ స్వావలంబన సాధించే దిశగా రిఫరెన్స్ ఇంధనాల ఉత్పత్తి మరో కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడు సంస్థలే ఈ ఇంధనాలను తయారు చేస్తున్నాయని, ఇకపై దేశీయంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా వీటిని ఉత్పత్తి చేస్తుందని మంత్రి చెప్పారు. ఐవోసీ తమ పారదీప్ రిఫైనరీలో రిఫరెన్స్ గ్రేడ్ పెట్రోల్‌ను, హర్యానాలోని పానిపట్ యూనిట్లో డీజిల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమొబైల్ కంపెనీలు తాము తయారు చేసే వాహనాలను పరీక్షించేందుకు ప్రత్యేక గ్రేడ్ ఇంధనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్నే రిఫరెన్స్ ఫ్యూయల్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటి అవసరాల కోసం సాధారణ గ్రేడ్ ఇంధనాలు పనికిరావు. సాధారణంగా వీటి అమ్మకాలు పెద్దగా లేనందున దేశీయంగా రిఫైనరీలు ఇప్పటివరకు ఈ ఇంధనాలను ఉత్పత్తి చేయడం లేదు. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే, తాజాగా ఐవోసీ వీటిని తయారు చేయడం వల్ల రిఫరెన్స్ ఫ్యూయల్ రేట్లు తగ్గగలవు. సాధారణ పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు రూ. 90–96 (ఢిల్లీలో) స్థాయిలో ఉండగా.. దిగుమతైన రిఫరెన్స్ ఇంధనం రేటు రూ. 800–850 శ్రేణిలో ఉంటుంది. దేశీయంగానే దీన్ని ఉత్పత్తి చేస్తే లీటరు ధర సుమారు రూ. 450కి తగ్గుతుంది. దేశీయంగా డిమాండ్‌ను తీర్చిన తర్వాత ఐవోసీ ఎగుమతులపైనా దృష్టి పెట్టనుంది. -
The Reverse Swing: Colonialism to Cooperation: పీవీ నుంచి వాజ్‌పేయీకి రహస్య చీటీ!
న్యూఢిల్లీ: దిగ్గజ నేత అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత పీవీ నరసింహా రావు ఆయనకు ఓ చీటీ అందించారని తాజాగా విడుదలైన ఒక పుస్తకం ద్వారా వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. వాజ్‌పేయీ ప్రధానిగా కొనసాగిన కాలంలో అంటే 1998–2004 కాలంలో అశోక్ టాండన్ అనే అధికారి ప్రధానమంత్రి కార్యాలయంలో మీడియా వ్యవహారాల ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రాసిన ‘ది రివర్స్ స్వింగ్: కలోనియలిజం టు కోఆపరేషన్’ అనే పుస్తకంలో ఇటీవల విడుదలైంది. దానిని పెట్రోలియం, సహజవాయు, గృహ, పట్టణవ్యవహారాల కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను టాండన్ పంచుకున్నారు. రాష్ట్రపతిభవన్‌లో ప్రమాణస్వీకారం వేళ వాజ్‌పేయీ ప్రధానమంత్రి పదవి చేపట్టినపుడు అదే సమయంలో అక్కడే ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు ఒక చీటీని వాజ్‌పేయీకి రహస్యంగా అందించారు. ‘అంసంపూర్తిగా మిగిలిపోయిన ఒక పనిని మీరు పూర్తిచేయాలి’ అని ఆ చీటిలో రాసి ఉందట. 1996 సంవత్సరంలో ఈ ఘటన జరిగిందని పుస్తకంలో పేర్కొన్నారు. ‘ పీవీ తాను ప్రధానిగా కొనసాగిన కాలంలో అమెరికా నుంచి తీవ్ర ఒత్తిళ్ల కారణంగా అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించలేకపోయారు. ఆ బాధ్యతలను పీవీనే స్వయంగా వాజ్‌పేయీకి అప్పగించి ఉంటారు’ అని ఆ పుస్తకంలో టాండర్ రాసుకొచ్చారు. 1996లో వాజ్‌పేయీ ప్రధాని పదవి చేపట్టడం 13 రోజులకే ప్రభుత్వం కూలడం, 1998లో ప్రధాని పగ్గాలు చేపట్టి విజయవంతంగా ఐదేళ్ల పాలన వాజ్‌పేయీ పూర్తిచేసుకోవడం తెల్సిందే. 1996లో అణుపరీక్షలకు ప్రయతి్నంచి విఫలమైన ప్రభుత్వం 1998లో పోఖ్రాన్లో విజయవంతంగా పూర్తిచేసి అమెరికాను సైతం విస్మయానికి గురిచేసిన సంగతి తెల్సిందే. రాష్ట్రపతి పదవి తిరస్కరణ! 2002 సంవత్సరంలో ప్రధాన మంత్రిగా దిగిపోయి రాష్ట్రపతి పదవి చేపట్టాలని వాజ్‌పేయీకి సూచనలు వచ్చాయని, కానీ వాజ్‌పేయీ అందుకు ససేమిరా అన్నారని పుస్తకంలో ఉంది. ప్రధానిగా వాజ్‌పేయీ దిగిపోతే ఆ బాధ్యతలు అద్వానీకి అప్పగించాలని చూశారని పేర్కొన్నారు. ‘ ప్రధానిగా ఉన్న వ్యక్తి వెంటనే రాష్ట్రపతి పదవి చేపడితే అది ప్రజాస్వామ్య దేశానికి ఎంతమాత్రం మంచిదికాదు. పరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని తన తోటి మంత్రులతో వాజ్‌పేయీ అన్నారట. 1996 తర్వాత మెజారిటీ ప్రభుత్వం అమెరికాకు నచ్చలేదట పుస్తకంలో పీవీ ఆలోచనలనూ పొందుపరిచారు. ‘ 1996 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియాలో పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడటం అమెరికాకు ఇష్టంలేదట. వాజ్‌పేయీ ప్రధాని కావడం అమెరికాకు ఇష్టం లేదనుకుంటా. వాజ్‌పేయీ ముక్కుసూటి తనం, ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఆయన అణుపరీక్షలకు పచ్చజెండా ఊపేలా ఉన్నారని అమెరికా ప్రభుత్వానికి ఢిల్లీలోని ఆ దేశ రాయబారి సమాచారం చేరవేశారు’ అని పీవీ అప్పట్లో అన్నట్లు పుస్తకంలో పేర్కొన్నారు. -
‘చమురు’ ధరలు ముంచేస్తాయి.. భారత్ హెచ్చరిక!
న్యూఢిల్లీ: అధిక చమురు ధరలు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణపై ప్రభావం చూపుతాయని భారత్ హెచ్చరించింది. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ సంక్షోభం పరిస్థితుల నుంచి ప్రపంచం బయటపడగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. భారత్ ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న సంగతి తెలిసిందే. తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. ఆర్థిక సేవల సంస్థ– కేపీఎంజీ ఫ్లాగ్షిప్ ఇన్నోవేషన్ అండ్ ఎనర్జీ 14వ ఎడిషన్– ఎన్రిచ్ 2023 కార్యక్రమంలో చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ, ఇజ్రాయెల్–హమాస్ సైనిక సంఘర్షణను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ‘సప్లై చైన్’పై ఈ ‘ఘర్షణ’ ప్రభావం పడలేదని అన్నారు. ఇజ్రాయెల్– పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ మధ్య సైనిక ఘర్షణల తరువాత చమురు ధరలు సోమవారం బ్యారెల్‌కు దాదాపు 3 డాలర్లు పెరిగాయి. అయితే సరఫరా అంతరాయాలపై ఆందోళనలు అక్కర్లేదన్న వార్తలతో కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రి ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు. ముడి చమురు ధరలు పెరిగితే అది ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ ప్రయత్నాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. గ్లోబల్ మార్కెట్లు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయని నేను భావిస్తున్నాను. సరఫరా మార్గాలకు అంతరాయం కలగకపోతే, భారత్ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తుందని భావిస్తున్నాను. పెరుగుతున్న జనాభా, క్షీణిస్తున్న వనరులు, పర్యావరణ క్షీణత, పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరల వంటి అన్ని అంశాలు ప్రస్తుత ప్రపంచం ముందు సవాళ్లుగా ఉన్నాయి. భారత్ ఇంధన డిమాండ్ విపరీతంగా వృద్ధి చెందుతోంది. భవిష్యత్ ఆర్థిక వృద్ధిలో ఇంధనం కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటంటే.. భారత్ చమురు వినియోగంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశం. మూడవ అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారు. నాల్గవ అతిపెద్ద ఎన్ఎన్జీ దిగుమతిదారు, నాల్గవ అతిపెద్ద రిఫైనర్. నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ కలిగి ఉన్న దేశం. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ వృద్ధిలో భారత్ 25 శాతం వాటాను కలిగి ఉంటుంది. 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్! భారత్ 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతనూ చక్రవర్తి తెలిపారు. బలమైన వినియోగం, ఎగుమతులు ఇందుకు దోహదపడతాయని ఆయన విశ్లేషించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి దాదాపు 6.3 శాతంగా, ద్రవ్యోల్బణం 6 శాతంగా అంచనా వేస్తున్నట్లు పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయకుండా చూస్తే, జీడీపీ వృద్ధి రేటు దాదాపు 12 శాతం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘ఈ తరహా వృద్ధి వేగం కొన్నాళ్లు కొనసాగితే, 2045–50 నాటికి 21,000 డాలర్ల తలసరి ఆదాయంతో భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది’’ అని కేపీఎంజీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అన్నారు. -
త్వరలోనే కొత్త హౌసింగ్ స్కీమ్.. ధ్రువీకరించిన కేంద్ర మంత్రి
గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) తాజాగా ధ్రువీకరించారు. “మేము కొత్త హోమ్ సబ్వెన్షన్ స్కీమ్ వివరాలను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నాం. ప్రధాన మంత్రి చెప్పినట్లుగా లబ్ధిదారులకు వడ్డీ రాయితీని అందించే ఇది ఒక పెద్ద పథకం. త్వరలోనే ఈ పథకం తుది వివరాలు వెల్లడిస్తాం ” అని హర్దీప్ సింగ్ పూరి మీడియా సమావేశంలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తొలుత ఈ పథకాన్ని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చే కొత్త హౌసింగ్ లోన్ స్కీమ్‌ను తమ ప్రభుత్వం తీసుకువస్తోందని ఆయన ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ప్రధాని మోదీ, నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని అద్దె ఇళ్లు, మురికివాడలు, అనధికార కాలనీలలో నివసించే కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే కొత్త పథకాన్ని తమ ప్రభుత్వం తీసుకువస్తుందని చెప్పారు. ‘సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్న పేదలకు వడ్డీ రేట్లు, బ్యాంకుల నుంచి రుణాల ఉపశమనంతో సహాయం చేస్తాం. అది వారికి లక్షల రూపాయలు ఆదా చేయడంలో సహాయపడుతుంది’ అని ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.9 లక్షలు రుణం అందిస్తారు. దీనిపై కేవలం 3 నుంచి 6.5 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. ఒక వేళ ఇంతకు ముందే హోమ్‌లోన్ తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల టెన్యూర్‌తో రూ.50 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్నవారు మాత్రమే ఈ వడ్డీ సబ్సిడీకి అర్హులు. -
చేయూతనివ్వండి: కేంద్ర మంత్రులకు కేటీఆర్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరింత ఆర్ధిక చేయూతనిచ్చి తనవంతు అండగా నిలవాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, రహదారులు, మెట్రో రైలు విస్తరణ వంటి రంగాల్లో కేంద్రం సహకారం ఇవ్వాలని, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రగతికి తోడ్పడాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన మంత్రి కేటీఆర్.. శనివారం కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అదనపు ధాన్యం సేకరణ, హైదరాబాద్‌లో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్ఆర్డీపీ, లింకు రోడ్లు, పారిశుధ్యరంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి కార్యక్రమాలపై వారితో చర్చించారు. అయితే శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కేటీఆర్ భేటీ జరగాల్సి ఉన్నా చివరి నిమిషంలో రద్దయింది. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. ఆదివారం ఉదయం కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నట్టు తెలిసింది. రోడ్లు, రైల్వే విస్తరణ, పారిశుధ్యానికి నిధులపై హర్దీప్పూరీకి విజ్ఞప్తి ► హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల మెట్రోకు ఆమోదంతోపాటు ఆర్థిక సాయం చేయాలి. ► రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో చేపట్టిన మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయి. 22 మిస్సింగ్ లింక్ రోడ్లను పూర్తి చేయగా.. మరో 17 రోడ్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇదే రీతిలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు రూ.2,400 కోట్ల మేర ఖర్చవుతుంది. కేంద్రం రూ.800 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించాలి. ► హైదరాబాద్‌లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద రూ.400 కోట్ల ఆర్థిక సాయం అందించాలి. ► రూ.3,050 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి 15శాతం నిధులు అంటే రూ.450 కోట్లను ఆర్థిక సాయంగా అందించాలి. ► హైదరాబాద్ నగర పరిధిలో చేపడుతున్న ఎస్టీపీల నిర్మాణ ఖర్చు దాదాపు రూ.3,722 కోట్లలో.. కేంద్రం కనీసం రూ.744 కోట్లు భరించాలి. ► రాష్ట్రంలో కేంద్రం నిర్దేశించిన సిటిజన్ సెంట్రిక్ రీఫారŠమ్స్ కింద చేపట్టిన బయో మైనింగ్, మానవ వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు రూ.750 కోట్లను సాయంగా ఇవ్వాలి. ► గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తేవాలి. ► కాగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమాన్ని ప్రశంసించిన హర్దీప్ సింగ్ పూరీ.. ఈ అంశంపై త్వరలో తమ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వాలని కేటీఆర్‌ను కోరారు. అదనపు బియ్యం సేకరణపై పీయూష్ గోయల్‌కు.. ► ఇటీవలికాలంలో çఅధిక ఉష్ణోగ్రతల కారణంగా ముడిబియ్యాన్ని అందించే పరిస్థితులు లేవు. మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైతం గత రబీ సీజన్లో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి.. ఈ సీజన్లో అధికంగా పండించే ఎంటీయూ 1010 రకంలో 48.20శాతం విరుగుడు ఉందని నివేదిక ఇచ్చింది. ► ప్రస్తుత సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 66.11 లక్షల టన్నుల వరిని సేకరించింది. కానీ కేంద్రం 10.20 లక్షల టన్నుల పారా బాయిల్డ్ రైస్ తీసుకుంటామన్నది. అంటే 15 లక్షల టన్నుల ధాన్యానికి మాత్రమే అనుమతించింది. మిగతా 51.11 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి ముడి బియ్యంగా ఇవ్వాల్సిన పరిస్థితి. అలా ఇచ్చేందుకు ప్రతి లక్ష టన్నులకు రూ.42.08 కోట్లు చొప్పున.. 34.24 లక్షల టన్నుల బియ్యానికి రాష్ట్రంపై రూ.1,441 కోట్ల ఆర్ధిక భారం పడుతుంది. అందువల్ల ఈ రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 20 లక్షల టన్నుల పారా బాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్ తీసుకోవాలని కోరుతున్నాం. -
ఢిల్లీలో కేటీఆర్.. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌తో భేటీ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమవుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీలు శనివారం కలిశారు. రాత్రి 10:15కి అమిత్‌షాను కేటీఆర్ కలవనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమంపైన హర్దీప్ సింగ్ పూరి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో కూడిన శానిటేషన్ హబ్‌తో పురపాలక అభివృద్ధిలో అనేక సవాళ్లకు సమాధానం దొరుకుతుందన్నారు. ఈ అంశంపైన తెలంగాణ రాష్ట్రం తన నమూనాను, ఆలోచనలను పంచుకోవాలని హర్దీప్ సింగ్ పూరీ కోరారు. త్వరలోనే తన మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎస్ ఆర్ డి పి, లింకు రోడ్లు, పారిశుద్ధ్యరంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అర్బన్ డెవలప్మెంట్ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్ రావాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలకు సంబంధించిన విజ్ఞప్తులను హర్దీప్ సింగ్ పూరికి అందించారు. చదవండి: వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు -
2025 నాటికే 20 శాతం ఇథనాల్
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని 2025 నాటికే సాధిస్తామని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్‌పురి తెలిపారు. ముందుగా నిర్దేశించుకున్న 2030తో పోలిస్తే ఐదేళ్లు ముందుగానే చేరుకుంటామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయాలను ఈ ఫిబ్రవరిలో ప్రయోగాత్మకంగా ఆరంభించడం గమనార్హం. కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, పెట్రోల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవాలన్న రెండు లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం 10 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. వచ్చే ఏడాదికే 20 శాతం పెట్రోల్‌ను సరఫరా చేయగలమన్న నమ్మకంతో ఉన్నట్టు పురి చెప్పారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ మిశ్రమంతో రూ.41,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఒక ఏడాదిలో ఆదా అవుతుండగా, దేశీయ రైతులకు, పరిశ్రమలకు ఈ మేరకు ప్రయోజనం లభించనుంది. చెరకు, విరిగిన, తినడానికి అనుకూలం కాని బియ్యంతో ఇథనాల్‌ను ప్రస్తుతం మన దేశంలో తయారు చేస్తున్నారు. 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల ద్విచక్ర వాహనాల నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలను 50 శాతం, నాలుగు చక్రాల వాహనాల నుంచి 30 శాతం మేర తగ్గించొచ్చని అంచనా. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. 2021–22లో ముడి చమురు దిగుమతుల కోసం మన దేశం 120.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. -
సావర్కర్ ఏం చేశారో తెలుసా? రాహుల్‌పై కేంద్రమంత్రి ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభకు అనర్హత వేటుని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనను కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి ఎగతాళి చేశారు. వారు చేసిన ఆమోదయోగ్యం కానీ రాజకీయ ప్రసంగంపై కొంత ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్‌కు సలహా ఇచ్చారు. రాహాల్ గాంధీ సావర్కర్ వంటి వ్యక్తుల గురించి ప్రస్తావించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అసలు సావర్కర్ వంటి వ్యక్తుల కృషి గురించి మీకు తెలుసా? అని ప్రశ్నించారు. మీరు గుర్రపు పందెంలో పరిగెత్తించేందుకు గాడిదను ఉపయోగిస్తున్నారంటూ రాహుల్‌ని దుయ్యబట్టారు. భారతదేశ ప్రజలు వారికి తగిన సమాధానం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ దీని గురించి కోర్టులో పోరాడాలి గానీ ఇలా కాదన్నారు. మీరు మహాభారతం, సావర్కర్ల గురించి ఎందుకు చెప్పడం అంటూ ఎద్దేవా చేశారు. అయినా కోర్టు గాంధీని దోషిగా నిర్థారించింది. ఆ తర్వాత వారు చేయాల్సిన ప్రక్రియలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిపై దృష్టి సారించక ఎందుకు ఇవన్నీ అంటూ మండిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా విపక్షాలన్ని అరుదైన విధంగా ఐక్యతను ప్రదర్శిస్తూ.. రాహుల్ గాంధీపై కేంద్రం తీసుకున్న చర్యను తప్పుపట్టడమే గాక నిరసనలు చేపట్టాయి. తృణమాల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర గ్రాండ్ ఓల్డ్ పార్టీ ప్రత్యర్థులు, మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి ఈ నిరసనలో పాల్లొన్నాయి కూడా. అదానీ హిండెన్ బర్గ్ సమస్యపై వస్తున్న ప్రశ్నలు ప్రధాని మోదీని, బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని, ఆ క్రమంలోనే రాహుల్‌ని సైలెంట్ చేసేందుకు ఇలా అనర్హత కుట్రకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. #WATCH | On Opposition's protest over disqualification of Rahul Gandhi, Union Minister Hardeep Singh Puri says, "...You are getting an ass to run a horse's race...They really deserve to do some serious introspection...People of India would judge them for what they are...Fight… pic.twitter.com/2Yjq3ybcWG — ANI (@ANI) March 27, 2023 (చదవండి: సత్యం, ధైర్యం, త్యాగం మా వారసత్వం! ప్రియాంక ఉద్వేగభరిత ప్రసంగం) -
రష్యా క్రూడాయిల్‌పై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ముడి చమురు ఎక్కడ చౌకగా లభిస్తే అక్కడే కొనుగోలు చేసేందుకు ఒక సార్వభౌమ దేశంగా భారత్‌కు పూర్తి హక్కులు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. అందుకే రష్యా నుంచి చౌక క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. అదే గల్ఫ్ దేశాల నుంచి మరింతగా కొనుగోలు చేసి ఉంటే ధరలు భారీగా పెరిగిపోయి ఉండేవని మంత్రి చెప్పారు. రష్యా నుంచి భారత్ భారీగా ముడిచమురును కొనుగోలు చేయడంపై పాశ్చాత్య దేశాల్లో ’అసంతృప్తి’ ఏమీ లేదని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. (ఇదీ చదవండి: Techlayoffs: దేశీయ ఐటీ నిపుణులకు భారడిమాండ్) పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లను పక్కనపెట్టి రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘భారీ వినియోగదారుగా భారత్ అన్ని అవకాశాలనూ వినియోగించు కుంటోంది. సమీప భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగిస్తుంది. మనం రష్యా చమురును కొనుగోలు చేస్తుండటం వల్ల పాశ్చాత్య దేశాలేమీ అసంతృప్తిగా లేవు. ఎందుకంటే మనం రష్యా ఆయిల్‌ను కొనకపోతే గల్ఫ్ దేశాల నుంచి మరింతగా దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అప్పుడు క్రూడాయిల్ రేట్లు మరింతగా పెరిగిపోయేవి‘ అని ఆయన తెలిపారు. గతంలో 27 దేశాల నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయగా, ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో 39 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. (ఫ్లాగ్‌స్టార్ చేతికి సిగ్నేచర్ బ్యాంక్ డీల్ విలువ రూ. 22,300 కోట్లు ) గతేడాది మార్చి వరకూ భారత్‌కు రష్యా నుంచి చమురు దిగుమతులు 0.2 శాతంగానే ఉండేవి. పొరుగునే ఉన్న గల్ఫ్ దేశాలతో పోలిస్తే రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడమే ఇందుకు కారణం. అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో పరిస్థితులు మారి పోయాయి. రష్యా తమ క్రూడాయిల్‌ను మార్కెట్ రేటుకన్నా తక్కువకే భారత్‌కు విక్రయిస్తోంది. దీంతో ఇతర దేశాల ఒత్తిళ్లను పక్కన పెట్టి భారత్.. రష్యన్ ముడిచమురు వైపు మొగ్గు చూపుతోంది. -
ఎన్నాళ్ల కెన్నాళ్లకు..వాహనదారులకు శుభవార్త!
వారణాసి: త్వరలో పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వ్యక్తం చేశారు. గతంలో పెట్రోల్ విక్రయంపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను చూడగా, అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో అవి ఇప్పుడు లాభాలను చూస్తున్నాయి. అదే సమయంలో డీజిల్‌పై అవి ఇప్పటికీ నష్టపోతున్నాయి. గడిచిన ఏడాదికి పైగా పెట్రోలియం కంపెనీలు రేట్లను సవరించడం లేదు. ఈ నష్టాలు ముగింపునకు రాగానే పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలు తగ్గుతాయని పురి అన్నారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయ వినియోగదారులపై ఆ భారాన్ని మోపకుండా ఆయిల్ కంపెనీలు బాధ్యతాయుత కార్పొరేట్ సంస్థలుగా వ్యవహరించాయని పేర్కొన్నారు. -
వారణాసిలో సీఎన్జీ బోట్లు
వారణాసి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో గంగా నదిలో తిరిగే అన్ని బోట్లకు పర్యావరణ హిత సీఎన్జీ ఇంజిన్లను అమరుస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. 500 బోట్లను డీజిల్‌కు బదులు సీఎన్జీ ఇంజిన్లను అమర్చడం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 583 బోట్లను మార్చామన్నారు. మరో 2వేల బోట్లను సీఎన్జీకి మార్చే పనిలో ఉన్నామని చెప్పారు. ఇకపై పెద్ద శబ్దాలతో కాలుష్యాన్ని వెదజల్లే డీజిల్ బోట్లకు బదులుగా గంగానదిలో శబ్దంలేని, తక్కువ కలుషితాలను మాత్రమే వదిలే సీఎన్జీ బోట్లు పూర్తి స్థాయిలో రానున్నాయని చెప్పారు. సీఎన్జీ వల్ల పడవల నిర్వాహకులకు ఏటా రూ.30 వేల దాకా ఆదా అవుతుందన్నారు. -
రెండు రోజుల్లో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని నిర్ణీత గడువు కంటే ముందే కేంద్ర సర్కారు అమల్లో పెట్టనుంది. రెండు రోజుల్లోనే 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20 పెట్రోల్) విక్రయాలను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇండియా ఎనర్జీ వీక్ 2023లో భాగంగా ‘డ్యాన్స్ టు డీకార్బనైజ్’ అనే అంశంపై మంత్రి మాట్లాడారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యానికి 2022 నవంబర్ వరకు గడువు ఉన్నప్పటికీ జూన్ నాటికే సాధించినట్టు మంత్రి తెలిపారు. మరో ఒకటి రెండు రోజుల్లో 20 శాతం కలిసిన పెట్రోల్ అమ్మకాలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మొదలవుతాయన్నారు. 2023 ఏప్రిల్ 1 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 20 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యం విధించుకోవడం గమనార్హం. కానీ, దీన్ని తాము మరింత ముందుగానే సాధిస్తామని పురి చెప్పారు. దేశవ్యాప్తంగా దీన్ని దశలవారీగా 2025 ఏప్రిల్ నాటికి అమలు చేయనున్నట్టు మంత్రి చెప్పారు. దీనివల్ల ఇంధన భద్రత పెరగడంతోపాటు, రూ.41,500 కోట్ల మేర విదేశీ మారకం ఆదా అవుతుందన్నారు. అలాగే, గ్రీన్హౌస్ గ్యాస్‌ల విడుదల 27 లక్షల టన్నుల మేర తగ్గుతుందని.. రైతులకు రూ.40,600 కోట్ల మేర ప్రయోజనం చేకూరుందని వివరించారు. -
బయో ఇంధన కూటమికి డిమాండ్ చేస్తాం: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సోలార్ కూటమి విజయం సాధించిన మాదిరే.. అంతర్జాతీయంగా బయో ఇంధన కూటమి కోసం ప్రయత్నిస్తామని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇందుకు జీ20 నాయకత్వాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. కేపీఎంజీ ఎన్రిచ్ 2022 సదస్సులో భాగంగా మంత్రి మాట్లాడారు. బయో ఇంధనాలను వినియోగిస్తున్న బ్రెజిల్ నుంచి అమెరికా తదితర దేశాలతో కూడిన కూటమి.. బయో ఇంధనాలకు సంబంధించి ప్రమాణాలను రూపొందించడం, ఇంజన్లు, టెక్నాలజీ సహకారం దిశగా కృషి చేస్తుందన్నారు. భారత్ ఇప్పటికే పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ లక్ష్యాన్ని 2030కు బదులు 2024–25 నాటికే సాధించాలని నిర్ణయించినట్టు తెలిపారు. జీ20లో భాగంగా ఉన్న అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా, చైనా తదిత దేశాలు బయో ఇంధనాలను తయారు చేస్తుండడం గమనార్హం. (అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..!) -
కేంద్రం సంచలన నిర్ణయం, గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త. సిలిండర్ వెయిటేజీ నుంచి డెలివరీ వరకు ఇలా అన్నీ రకాల విభాగాల సమాచారం వినియోగదారులకు అందనుంది. ఇందుకోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్ వ్యవస్థను అమలు చేయనుంది. ఇటీవల కాలంలో గ్యాస్ కంపెనీలపై వినియోగదారులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. గ్యాస్ సంస్థలు ప్రకటించినట్లుగా కాకుండా తమకు 1 నుంచి 2 కేజీల గ్యాస్ తగ్గుతుందని, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ డెలివరీ టైంకు రావడం లేదనే’ ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. అయితే ఈ ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇకపై ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లను క్యూఆర్‌కోడ్‌తో మెటల్ స్టిక్కర్‌ను అందించనున్నట్లు తెలిపారు. తద్వారా స్మార్ట్‌ఫోన్‌తో గ్యాస్ సిలిండర్‌కున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మీ గ్యాస్ ఏ ఏజెన్సీ నుండి డెలివరీ అవుతుంది. సిలిండర్‌లో గ్యాస్‌ను ఎక్కడ ఫిల్ చేశారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్‌కు భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదా?. సిలిండర్‌లో ఎన్ని కేజీల గ్యాస్ ఉంది. ఎప్పుడు, ఏ తేదీన డెలివరీ అవుతుందనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇలా క్యూఆర్‌కోడ్‌ను సిలిండర్లకు అమర్చడం ద్వారా..దొంగిలిస్తున్న గ్యాస్‌తో పాటు సిలిండర్ భద్రత, ఇతర గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ వంటి విషయాల సమాచారం వినియోగదారులకు అందించ వచ్చని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ ప్రాజెక్టు మూడు నెలల్లో పూర్తి కానుంది. క్యూఆర్ కోడ్ ప్రస్తుతం ఉన్న సిలిండర్లతో పాటు కొత్త సిలిండర్లకు క్యూఆర్ కోడ్ మెటల్ స్టిక్కర్‌ను అమర్చనున్నట్లు వెల్లడించారు. Fueling Traceability! A remarkable innovation - this QR Code will be pasted on existing cylinders & welded on new ones - when activated it has the potential to resolve several existing issues of pilferage, tracking & tracing & better inventory management of gas cylinders. pic.twitter.com/7y4Ymsk39K — Hardeep Singh Puri (@HardeepSPuri) November 16, 2022 -
హైదరాబాద్ నడిబొడ్డున రేసింగ్.. గంటకు 280 కి.మీ వేగంతో..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న ‘ఫార్ములా-ఈ’ రేసింగ్ మొదటిసారిగా మన దేశంలో ట్రాక్ ఎక్కనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. ఇందుకోసం 100 రోజుల కౌంట్ డౌన్ దేశ రాజధాని ఢిల్లీలో లాంఛనంగా అభిమానుల కోలాహలం మధ్య శుక్రవారం ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ను కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురీ, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, టీఆర్ఎస్ ఎంపీలు సురేశ్‌రెడ్డి, దామోదర్ రావు, వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, గ్రీన్ కో సంస్థ ప్రతినిధి సునీల్ చలిమిశెట్టి, మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో 2.7 కి.మీ మార్గంలో రేసింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ గార్డెన్‌లోకి వెళ్లే విధంగా ట్రాక్‌ను రూపొందిస్తున్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు మీదుగా మొత్తం 17 టర్నింగ్‌లు వచ్చేలా ట్రాక్ ప్లాన్ ఉంటుందన్నారు. 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ద్ అంతర్జాతీయ సర్క్యూట్లో ఫార్ములా వన్ రేసు జరిగిన తర్వాత దేశంలో జరగబోగే రెండో అతి పెద్ద రేసింగ్ ఈవెంట్‌గా ఫార్ములా–ఈ నిలవనుంది. 12 దేశాల్లోనే.. ఫార్ములా-ఈ ప్రిక్స్ ఈవెంట్‌ను ప్రపంచంలో 12 దేశాలు మాత్రమే నిర్వహిస్తున్నాయని, అందులో భారత్ కూడా ఒకటని కేంద్రమంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్‌లో జరగబోయేది 9వ సీజన్ అని వివరించారు. గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు లండన్, బెర్లిన్, రోమ్, సౌ పాలో, మెక్సికో, జకార్తా, కేప్ టౌన్, మొనాకో, దిరియా (సౌదీ అరేబియా) సరసన నిలివనుంది. రానున్న నాలుగు సంవత్సరాల వరకు ఈ ఈవెంట్‌ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. 2014లో ప్రారంభమైన ఫార్ములా-ఈ రేసింగ్ ఇప్పటివరకు 100 రేసులను పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగే ఈ ఈవెంట్‌ను హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) బాధ్యులైన రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆర్గనైజ్ చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున సచివాలయం ముందు జరిగే ఈ రేసింగ్‌లో గంటకు 280 కిలోమీటర్ల వేగంతో బ్యాటరీ కార్లు దూసుకుపోనున్నాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల కంపెనీల్లో ఒకటైన గ్రీన్ కో ఈ ఈవెంట్‌ను ప్రమోట్ చేస్తుంది. కేటీఆర్ సందేశం.. ’ఫార్ములా ఈ-ప్రిక్స్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌తో అనేక గ్లోబల్ సిటీల స్థాయికి హైదరాబాద్ చేరుకున్నట్లయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు తన సందేశంలో పేర్కొన్నారు. విశ్వనగరంలో హైదరాబాద్‌కు గుర్తింపు రావడానికి అనేక అంశాల్లో ఇప్పుడు ఇది కూడా చేరిందన్నారు. ఈ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో సమర్ధవంతంగా నిర్వహిస్తామని, 'ఈ-మొబిలిటీ సమ్మిట్’ పేరుతో ఆ రంగానికి చెందిన అనేక కంపెనీల ప్రతినిధులు, ఇన్వెస్టర్లు వస్తారని, ఆ సందర్భంగా హైదరాబాద్ నగరానికి 'ఈ-వెహికల్' రంగంలో ఉన్న ప్రత్యేకతలను, ప్రాధాన్యతను వివరిస్తామని మంత్రి అన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న ’ఫార్ములా-ఈ ప్రిక్స్’ ఈవెంట్ ఒక్కసారితో అయిపోదని , ఇకపైన ప్రతి ఏటా ఇలాంటివి జరుగుతూ ఉంటాయని, ’ఈ-మొబిలిటీ’లో హైదరాబాద్ నగరం గ్లోబల్ లీడర్‌గా ఆవిష్కృతమవుతుందని పేర్కొన్నారు. ఫార్ములా వన్ తరహాలోనే ఇప్పుడు జరగనున్న ఫార్ములా-ఈ కూడా ఉంటుందని, అయితే ఈ రేస్‌లో పాల్గొనే వాహనాలు పూర్తిగా బ్యాటరీ సాయంతో నడిచే ఈ-వెహికల్స్ అని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తు ఆటోమొబైల్ రంగం మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంటుందని, గంటకు 300 కి.మీ. వేగంతో నడిచే జెనరేషన్-3 కార్లు మొదటిసారిగా ఈ ఈవెంట్ సందర్భంగా ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. ఆధునిక పరిజ్ఞానంతో తయారైన బ్యాటరీ, వేగంగా రీచార్జ్ అయ్యే టెక్నాలజీ వీటి ప్రత్యేకత అని అన్నారు. ఫార్ములా వన్ రేసింగ్ ప్రత్యేకంగా తయారుచేసిన ట్రాక్ రోడ్లపై జరుగుతాయని, కానీ ఫార్ములా-ఈ ఈవెంట్ మాత్రం నగరంలోని సాధారణ రోడ్లపైనే జరగనున్నట్లు తెలిపారు. స్ట్రీట్ సర్క్యూట్ తరహాలో వీధులపైనే జరుగుతుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ఆసక్తిగా, ఉత్కంఠగా వీక్షించే క్రీడ కార్ రేసింగ్ అని, 1990వ దశకం నుంచే ఎఫ్-3 రేసులు జరుగుతున్నట్లు గుర్తుచేశారు. ఫార్ములా వన్ రేసింగ్ మాత్రం 2011లో మొదలైందని, ఇప్పుడు ఫార్ములా-ఈ పేరుతో తొలిసారి హైదరాబాద్‌లో జరుగుతుందన్నారు. రానున్న మూడు నెలల్లో అనేక ఈవెంట్లు జరుగుతాయని, సుమారు 40 వేల మందికి పైగా దీన్ని ప్రత్యక్షంగా వీక్షించబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. త్వరలోనే టికెట్ల విక్రయంపై నిర్ణయం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చదవండి: పీసీఎస్ హెడ్– క్వార్టర్స్‌గా ఐసీసీసీ -
డీజిల్‌పై ఇప్పటికీ రూ.4 నష్టమే!: చమురు వ్యవహారాల మంత్రి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) డీజిల్‌పై లీటరుకు ఇప్పటికీ రూ.4 చొప్పున నష్టపోతున్నాయని కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం పేర్కొన్నారు. అయితే పెట్రోల్ విషయంలో కంపెనీల మార్జిన్లు సానుకూలంగానే ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలో కూడా చమురు ధరలు తగ్గించాలన్న డిమాండ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయడంసహా దేశంలో ద్రవ్యోల్బణం పెరక్కుండా ప్రభుత్వ పోరాటానికి సహాయం చేయడానికి చమురు మంత్రిత్వశాఖ తగిన ప్రయత్నాలన్నింటినీ చేస్తుంది. ఈ విషయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)లతో కలిసి పనిచేస్తుంది. అవసరమైతే చమురు కంపెనీలకు వచ్చే నష్టాలకు ప్రభుత్వ నుంచి ఆర్థికపరమైన సహాయాన్నీ కోరుతుంది. ► జూన్ 2020 నుండి ప్రారంభమైన రెండేళ్ల కాలంలో దేశీయ వంట గ్యాస్ (ఎల్పీజీ) అమ్మకంపై వచ్చిన నష్టాలను పూడ్చేందుకు ప్రభుత్వం గత నెలలో మూడు సంస్థలకు రూ.22,000 కోట్లను ఒకేసారి గ్రాంట్‌గా అందించింది. అయితే రూ.28,000 కోట్లు ఇవ్వాలని చమురు మంత్రిత్వశాఖ కోరింది. ► అండర్ రికవరీ (రిటైల్ అమ్మకపు ధర– అంతర్జాతీయ ధర మధ్య వ్యత్యాసం) ప్రస్తుతం డీజిల్‌పై లీటరుకు రూ. 27 ఉంది. అయితే వాస్తవిక నగదు నష్టం (ముడి చమురు సేకరణ–ఇంధనంగా మార్చడం వల్ల కలిగే వాస్తవ వ్యయ ఆధారిత నష్టం) లీటరుకు ఇప్పటికీ దాదాపు రూ. 3–4గా ఉంది. ► మూడు ఇంధన రిటైల్ కంపెనీలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ. 19,000 కోట్లకు పైగా నికర నష్టాన్ని చవిచూశాయి. తదుపరి త్రైమాసికంలో కూడా నష్టాలను ఎదుర్కొంటాయన్న అంచనా ఉంది. ► భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు బాస్కెట్ ధర జూన్‌లో బ్యారెల్‌కు 116 డాలర్ల వరకు పెరిగింది, అయితే నవంబర్ నెలలో 92.25 డాలర్లకు తగ్గింది. తగ్గిస్తే... మే తర్వాత మొదటిసారి ద్రవ్యోల్బణం నియంత్రించడం, వినియోగదారులపై ధరల భారం తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం డీజిల్, పెట్రోల్‌పై ఈ ఏడాది మే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీనితో వ్యవస్థలో ఆ నెల్లో పెట్రోల్, డీజిల్ ధరలూ తగ్గాయి. మళ్లీ ధరలు తగ్గిస్తే అది మే తర్వాత మొదటిసారి అవుతుంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ సవరించాలి. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు మే తర్వాత ఈ సరవణలు చేయడం లేదు. అంతర్జాతీయ ధరల తీవ్రత నేపథ్యంలో మే నెల్లో ధరలు తగ్గింపునకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 వరకూ పెరిగాయి. -
ఇథనాల్ ధర పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ధరల్ని కేంద్రం పెంచింది. వచ్చే ఏడాది నుంచి పెట్రోల్‌లో 12 శాతం ఇథనాల్ కలిపేలా చర్యలు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) పలు నిర్ణయాలు తీసుకుంది. వివరాలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మీడియాకు తెలిపారు. ‘‘మూడు రకాల ఇథనాల్ ధరల్ని పెంచాం. చెరుకు రసం నుంచి తీసే ఇథనాల్ లీటర్‌కు రూ.63.45 నుంచి రూ.65.61కి సి–హెవీ మోలాసెస్ నుంచి తీసే ఇథనాల్ రూ.46.66 నుంచి రూ.49.41కు, బి–హెవీ రూట్ నుంచి వచ్చే ఇథనాల్ లీటర్ రూ.59.08 నుంచి రూ.60.73కు పెరుగుతాయి’’ అన్నారు. ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో రబీ సీజన్‌కు ఫాస్మాఫాటిక్ పొటాసిక్ (పీ అండ్ కే) ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నైట్రోజన్‌పై కేజీకి రూ.98.02, ఫాస్ఫరస్పై కేజీకి రూ.66.93, పొటాష్పై కేజీకి రూ.23.65, సల్ఫర్పై కేజీకి రూ.6.12 సబ్సిడీని ఇస్తూ నిర్ణయం తీసుకుంది. డెన్మార్క్‌తో నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు అవగాహనా ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
ఆదర్శ రాష్ట్రంగా ఏపీ
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించిన అవార్డును ఏపీ తరఫున కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ అందుకున్నారు. గృహాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రమంత్రి అభినందించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మూడ్రోజుల పాటు జరిగే జాతీయ పట్టణ గృహ నిర్మాణ సమ్మేళనం శుక్రవారం ప్రారంభమైంది. ఏపీలో జగనన్న కాలనీల పేరిట నిర్మిస్తున్న ఇళ్లలో విద్యుత్ ఆదాకు చేపడుతున్న చర్యలను ఈ సమ్మేళనంలో అజయ్‌జైన్ వివరించారు. అత్యాధునిక సాంకేతికత.. తొలిదశలో 15.6 లక్షల ఇళ్లకు ఏపీ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్కో), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సాయంతో ఒక్కో ఇంటికీ నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లను అందజేయనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా ఒక్కో ఇంటికి ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ చొప్పున మొత్తం 1,145 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అవుతుందని చెప్పారు. నిర్మాణంలో ఇండో–స్విస్ బిల్డింగ్ టెక్నాలజీతో పాటు రీఇన్ఫోర్డ్స్ కాంక్రీట్ (ఆర్సీసీ) ప్రీకాస్ట్ టెక్నాలజీ, షియర్‌వాల్ టెక్నాలజీ, ఈపీఎస్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ టెక్నాలజీవల్ల ఇంటి లోపల కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడంతోపాటు 20 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అజయ్‌జైన్ వివరించారు. కాలనీలు కాదు.. అధునాతన గ్రామాలు ఇక అల్పాదాయ వర్గాలు, పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో తయారవుతున్న ఇళ్లలో వారు సగౌరవంగా జీవించేలా చూడడమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ లక్ష్యమని అజయ్‌జైన్ స్పష్టంచేశారు. అందుకు అనుగుణంగానే కాలనీలకు బదులు అధునాతన గ్రామాలను సృష్టిస్తున్నామని, 17,005 లే అవుట్లలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనన్నారు. రూ.56 వేల కోట్ల విలువైన 71,811 ఎకరాల స్థలాన్ని పేదలకు పంపిణీ చేసినట్లు వివరించారు. లేఅవుట్ అభివృద్ధికి రూ.3,525 కోట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలకు రూ.32,909 కోట్లు వెచ్చించినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 6.20 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, మరో 18.9 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, నిర్వహణ అంశాలను మొబైల్ యాప్‌లు, జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. హౌసింగ్ జేఎండీ ఎం. శివప్రసాద్, చీఫ్ ఇంజనీర్ జీవీ ప్రసాద్ ఈ సదస్సులో పాల్గొన్నారు. -
హరిత హైడ్రోజన్ దిగ్గజంగా భారత్
హ్యూస్టన్: త్వరలోనే భారత్ హరిత హైడ్రోజన్ విభాగంలో లీడరుగా ఎదుగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇంధనాల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని 2030 నుంచి 2025 నాటికి కుదించుకున్నామని పేర్కొన్నారు. జీవ ఇంధనా లు, హరిత హైడ్రోజన్, పెట్రోకెమికల్స్, ప్రత్యా మ్నాయ వనరుల నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి మొదలైన విభాగాల్లో అమెరికా–భారత్ కలిసి పని చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. దీనికి సంబంధించి నాలుగు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు అమెరికాలోని హ్యూస్టన్‌లో భారత కాన్సల్ జనరల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. అమెరికన్ ఇంధ న కంపెనీలు, అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం యూఎస్ఐఎస్పీఎఫ్ ప్రెసిడెంట్ ముకేశ్ అఘి తదితరులు ఇందులో పాల్గొన్నారు. కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) క్షేత్రాల వేలానికి సంబంధించి అంతర్జాతీయ బిడ్డింగ్‌ను మంత్రి ప్రారంభించారు. అలాగే 26 ఆఫ్‌షోర్ బ్లాకులకు కూడా బిడ్డింగ్‌ను ఆవిష్కరించారు. అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్లలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ హరిత ఇంధనానికి మళ్లాలన్న లక్ష్యం నుంచి అమె రికా, భారత్ పక్కకు తప్పుకోలేదని పురి చెప్పారు. ఇరు దేశాల మధ్య గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రభుత్వా లు ఇందుకు అవసరమైన విధానాలు, వాతావరణా న్ని మాత్రమే కల్పించగలవని ప్రైవేట్ రంగమే దీన్ని సాకారం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
రష్యా ఆయిల్ కొనొద్దని ఎవరూ కోరలేదు
వాషింగ్టన్: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్ తనకు అనువైన దేశం నుంచి చమురును దిగుమతి చేసుకుంటుందని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయొద్దని భారత్‌ను ఏ దేశం కోరలేదని స్పష్టంచేశారు. శుద్ధ ఇంధనంకు సంబంధించి వాషింగ్టన్లో అమెరికా ఇంధన మంత్రి జెన్నీఫర్ గ్రహోల్మ్తో భేటీ సందర్భంగా హర్దీప్ మీడియాతో మాట్లాడారు. ‘ పెట్రోల్, డీజిల్ వినియోగం అత్యంత ఎక్కువగా ఉండే భారత్ విషయంలో ఇలాంటి చర్చ అనవసరం. తనకు అనువైన దేశం నుంచే భారత్ చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇండియా–అమెరికా గ్రీన్ కారిడార్ ఆలోచనపై జెన్నీఫర్ సానుకూలంగా స్పందించారు’ అని హర్దీప్ చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా రష్యాపై గుర్రుగా ఉన్న పశ్చిమదేశాలు ఆంక్షల కొరడా ఝులిపించాయి. దీంతో తక్కువ ధరకే అందివచ్చిన రష్యా చమురును భారత్ భారీస్థాయిలో దిగుమతిచేసుకున్న విషయం విదితమే. -
బీపీసీఎల్ అమ్మకం ఇప్పుడే కాదు: హర్దీప్ సింగ్ పురి
ముంబై: ఇంధన రంగ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రయివేటైజేషన్ ప్రతిపాదనేదీ ప్రస్తుతం తమ వద్ద లేదని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఇప్పటికే ఎంతో ఆలస్యమైన కంపెనీ విక్రయం సమీప భవిష్యత్‌లో జరగకపోవచ్చని సంకేతాలిచ్చారు. ఆస్తుల మానిటైజేషన్ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం 2019 నవంబర్‌లో బీపీసీఎల్‌లో పూర్తి వాటాను విక్రయించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కంపెనీలో ప్రభుత్వానికున్న 52.98 శాతం వాటాను అమ్మివేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ కొనుగోలుకి మూడు సూచనప్రాయ బిడ్స్ సైతం లభించాయి. అయితే వేదాంతా గ్రూప్ నుంచి మాత్రమే ఫైనాన్షియల్ బిడ్ దాఖలైంది. దీంతో 2022 మే నెలలో విక్రయ ప్రణాళికను రద్దు చేసిన ప్రభుత్వం పూర్తిస్థాయి సమీక్షకు ప్రతిపాదించింది. పోటీ బిడ్డింగ్‌కు తెరతీసినప్పటికీ రేసులో ఒకే సంస్థ నిలిస్తే విక్రయ ప్రక్రియ ముందుకెలా సాగుతుందంటూ మంత్రి ప్రశ్నించారు. చమురు శాఖ ఇక్కడ నిర్వహించిన 25వ ఇంధన సాంకేతిక సదస్సును ప్రారంభించిన మంత్రి ఈ సందర్భంగా విలేకరులకు బీపీసీఎల్ విక్రయ అంశాలను వివరించారు. -
రోహింగ్యాలకు ఢిల్లీలో ఫ్లాట్లు..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: రోహింగ్యా శరణార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామన్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటనపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆయన ప్రకటనను తోసిపుచ్చింది. రోహింగ్యాలకు అటువంటి హామీలేమీ లేవని తేల్చి చెప్పింది. రోహింగ్యా శరణార్థుల విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని తెలిపింది. న్యూఢిల్లీలోని బక్కర్‌వాలాలో రోహింగ్యా శరణార్థులకు ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లను అందించడానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది. అక్రమ విదేశీ శరణార్థులైన వారికి ఎలాంటి సౌకర్యాలు ప్రకటించలేదని స్పష్టం చేసింది. India has always welcomed those who have sought refuge in the country. In a landmark decision all #Rohingya #Refugees will be shifted to EWS flats in Bakkarwala area of Delhi. They will be provided basic amenities, UNHCR IDs & round-the-clock @DelhiPolice protection. @PMOIndia pic.twitter.com/E5ShkHOxqE — Hardeep Singh Puri (@HardeepSPuri) August 17, 2022 కాగా, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా శరణార్థులకు పక్కా ఇళ్లు, భద్రత కల్పిస్తామని గృహ, పట్టణ వ్యవహరాలశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. వారిని ఔటర్ ఢిల్లీలోని బక్కర్‌వాలాలోని ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) అర్ట్‌మెంట్‌లకు తరలిస్తామని పేర్కొన్నారు. అలాగే వారికి ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అయితే, ఆయన ప్రకటనపై స్పందించిన కేంద్రం, అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని తెలిపింది. చదవండి: Freebies: ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు With respect to news reports in certain sections of media regarding Rohingya illegal foreigners, it is clarified that Ministry of Home Affairs (MHA) has not given any directions to provide EWS flats to Rohingya illegal migrants at Bakkarwala in New Delhi. — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) August 17, 2022 ‘రోహింగ్యాలను కొత్త ప్రదేశానికి తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇప్పటికే విదేశాంగ శాఖ ద్వారా సంబంధిత దేశంతో వారి బహిష్కరణ విషయాన్ని చర్చిస్తున్నందున.. రోహింగ్యాలు ప్రస్తుతం ఉన్న మదన్‌పూర్ ఖాదర్, కాళింది కుంజ్ ప్రదేశాల్లో కొనసాగేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. చట్టప్రకారం రోహింగ్యా శరణార్థులను బహిష్కరించే వరకు డిటెన్షన్ సెంటర్లో( నిర్బంధ కేంద్రం) ఉంచుతాం. ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం శరణార్థులు ఉన్న ప్రదేశాన్ని డిటెన్షన్ సెంటర్‌గా ప్రకటించలేదు.. వెంటనే ఆ పనిచేయాలని ఆదేశించాం.’ అని హోం మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. Rohingya Illegal Foreigners Press release-https://t.co/eDjb9JK1u1 pic.twitter.com/uKduPd1hRR — Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) August 17, 2022 -
హైదరాబాద్‌కు పాడ్ కార్స్, రోప్‌వేస్
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో సరికొత్త ప్రజారవాణా వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో రాష్ట్ర సర్కారు ముందడుగు వేసింది. ఇప్పటికే విజయవంతంగా సాగుతున్న మెట్రోరైలు, సబర్బన్ రైలు, ఎంఎంటీఎస్‌లకు తోడు పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (పీఆర్టీ ఎస్)ను ప్రవేశపెట్టే విషయంలో హైదరాబాద్‌కు ప్రాధాన్యమివ్వా లని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీతో భేటీ అయి.. ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పీఆర్టీఎస్, రోప్‌వేల ఆవశ్యకత ఉంది పెరుగుతున్న జనాభా, ఉపాధి అవకాశాలతో మహానగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ప్రయాణికుల రవాణా డిమాండ్‌ను తీర్చేందుకు పీఆర్‌టీఎస్‌తో పాటు రోప్‌వే సిస్టం వంటి అధునాతన రవాణా సౌకర్యాల (స్మార్ట్ అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్) కల్పన ఆవశ్యకతను మంత్రి వివరించారు. ఇప్పటికే 69 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్వర్క్, 46 కి.మీ సబర్బన్ సర్వీస్, ఎంఎంటీఎస్ ఉన్నాయని, వాటికి అనుసంధానంగా 10కి.మీ మేర పీఆర్‌టీఎస్‌ను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. పీఆర్టీఎస్ అలాట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలన్నీ (స్టాండర్డ్స్, స్పెసిఫికేషన్స్, లీగల్, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్) తమకు అందించాలని కోరారు. కారిడార్ కోసం ఉన్నతస్థాయి కమిటీ రాష్ట్ర అసెంబ్లీ మెట్రో స్టేషన్ నుంచి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు.. 10 కి.మీ పొడవున పీఆర్టీఎస్ కారిడార్‌ను ప్రతిపాదిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రతిపాదిత కారిడార్ మెట్రో స్టేషన్లు అయిన అసెంబ్లీ, ప్యారడైజ్, ఖైరతాబాద్ స్టేషన్లతో పాటు ఎంఎంటీఎస్ స్టేషన్లు అయిన జేమ్స్ స్ట్రీట్, ఖైరతా బాద్ స్టేషన్లను అనుసంధానం చేస్తుందని వివ రించారు. ఈ కారిడార్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు, డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) కోసం ఇప్పటికే ఇండియన్ పోర్ట్ రైల్, రోప్‌వే కార్పొ రేషన్ లిమిటెడ్ (ఐపీఆర్‌ఆర్‌సీఎల్)లకు కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కేంద్ర రో డ్లు, హైవేల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాల కు అనుగుణంగా ఈ కారిడార్‌ను రూపొందించేం దుకు ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పీఆర్టీఎస్ పట్ల తెలంగాణ ప్రభుత్వ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ మేరకు అలైన్మెంట్ కాపీని కేంద్రమంత్రికి అందజేశారు. మురుగు నీటి శుద్ధికి రూ.2,850 కోట్లు ఇవ్వండి పట్టణ సముదాయాల్లో మురుగు నీటి శుద్ధికి సహకరించాలని హర్దీప్ సింగ్ పురీకి కేటీఆర్ వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ నగర సమీపంలోని ప్రాంతాలు మొదలుకుని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్ ) వరకూ వంద శాతం మురుగు నీటి శుద్ధి కోసం ‘హైదరాబాద్ పట్టణ సముదాయం’ (హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్) ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్ (సీఎస్ఎంపీ) సిద్ధం చేశామని, ఇందుకోసం అమృత్–2లో భాగంగా రూ.2,850 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో 100% మురుగునీటి శుద్ధితో పాటు మూసీ నది, హైదరాబాద్‌లోని ఇతర నీటి వనరుల్లో మురుగునీటి కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని తెలిపారు. చిన్న వాహనంలో చకచకా పీఆర్‌టీఎస్‌లో రోప్‌వేలలో వినియోగించే కారు తరహాలో ఓ చిన్న వాహనాన్ని వినియోగిస్తారు. ఇందులో ముగ్గురు నుంచి ఆరుగురు వ్యక్తులు ప్రయాణించవచ్చు. అంటే తక్కువ సంఖ్యలో ప్రయాణికులు వేగంగా వెళ్లేందుకు ఇది దోహదపడుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ‘పాడ్ కార్స్’, ‘రైల్డ్ టాక్సీస్’గా ఇవి వినియోగంలో ఉన్నాయి. మన దేశంలో ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టం పేరిట 10 నుంచి 15 కిలో మీటర్ల మేర వసంత్‌కుంజ్ ఏరియాలో పీఆర్‌టీఎస్‌ను తీసుకొచ్చేందుకు సాధ్యాసా ధ్యాల అధ్యయనం జరుగుతోంది. గతంలో బెంగళూరు, అమృత్సర్ (పాడ్ కార్స్)లో పీఆర్టీఎస్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు వచ్చినా ఆచరణకు నోచుకో లేదు. కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఢిల్లీ తరువాత ప్రాజెక్టు ప్రారంభ య్యేందుకు అవకాశం ఉన్న రెండో నగరం హైదరాబాద్ కానుంది. చదవండి: మేమేం తక్కువ?.. అధికార టీఆర్ఎస్లో తారాస్థాయికి విభేదాలు -
పేదలకు ఇళ్ల కల్పనలో ఏపీ టాప్.. కేంద్రమంత్రి ప్రశంస
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): పేదలందరికీ ఇళ్ల కల్పనలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రశంసించారు. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. ఆదివారం విశాఖలో పీఎంఏవై, ఉజ్వల పథకాల లబ్ధిదారులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. హర్దీప్ సింగ్ మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఉండాలనేది ప్రధాని మోదీ లక్ష్యమని చెప్పారు. దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు ఇళ్లు నిర్మించాలని నిర్ణయించగా.. అంచనాలకు మించి ఇప్పటివరకు కోటి 22 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. చదవండి: ఏది నిజం?: బాబు కోసమే ఆ ‘మత్తు’!! ఇందులో ఏపీకి 20 లక్షల ఇళ్లు కేటాయించినట్లు చెప్పారు. ఏపీకి మరో 5 లక్షల ఇళ్లు మంజూరు చేయాల్సిన అవసరముందని మంత్రి జోగి రమేష్ తన దృష్టికి తీసుకొచ్చారని.. త్వరలో వాటిని కూడా మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఉజ్వల పథకం ద్వారా దేశవ్యాప్తంగా 8 కోట్ల కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా.. అంచనాకు మించి ఇప్పటివరకు 9 కోట్ల కనెక్షన్లు ఇచ్చామన్నారు. ముఖాముఖిలో లబ్ధిదారుల మనోభావాలు తనకెంతో ఆనందాన్ని ఇచ్చాయని చెప్పారు. పలువురు లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు కేంద్రమంత్రి అందజేశారు. అలాగే రూ.203.56 కోట్లను 42,343 మంది పీఎంఏవై లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా 17 వేలకు పైగా జగనన్న కాలనీలను నిర్మిస్తున్నారని వివరించారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఎమ్మెల్సీ మాధవ్, కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ గతంలో ప్రభుత్వమిచ్చిన ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రూ.లక్షలు చెల్లించేవారని.. కానీ సీఎం వైఎస్ జగన్ కేవలం ఒక్క రూపాయికే నా పేరున ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించారు. మా కుటుంబం మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతింట్లో ఉంటున్నాం. – తులసి త్రివేణి, లబ్ధిదారు -
'మమ్మల్ని ఆదుకోండి సార్',కేంద్రం తలుపు తట్టిన చమురు కంపెనీలు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ, పెట్రోల్ ఉత్పత్తుల ధరలు వరుసగా రెండు నెలల పాటు ఎటువంటి మార్పు ల్లేకుండా కొనసాగించడం వల్ల నష్టాలను ఎదుర్కొంటున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు (బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ) చెబుతున్నాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ విషయంలో తమకు ఉపశమనం కావాలంటూ అవి ప్రభుత్వం తలుపు తట్టినట్టు చెప్పారు. లీటర్ పెట్రోల్‌పై రూ.17.10, డీజిల్‌పై రూ.20.40 చొప్పున నష్టాలను ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ప్రైవేటు చమురు రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసి, రిఫైన్డ్ చేసిన తర్వాత అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తున్నాయన్న వార్తలపై స్పందించారు. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల చమురు, గ్యాస్ కంపెనీలు ఆర్జించే అసాధారణ లాభాలపై విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించడం అన్నది ఆర్థిక శాఖ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. మన కార్పొరేట్ సంస్థలు అన్నీ బాధ్యతగానే పనిచేస్తాయన్నారు. గత నెలలో పెట్రోల్ లీటర్‌పై రూ.8, డీజిల్ లీటర్‌పై రూ.6 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించడం తెలిసిందే. చమురు కంపెనీలు దీన్ని తమ నష్టాల భర్తీకి సర్దుబాటు చేసుకోకుండా.. వినియోగదారులకు బదిలీ చేయడం గమనార్హం. ప్రైవేటులో రిలయన్స్ బీపీ, నయాయా ఎనర్జీ (షెల్)కి మాత్రమే రిఫైనరీలు, దేశవ్యాప్తంగా పెట్రోల్ విక్రయ కేంద్రాలు ఉండడం గమనార్హం. ధరలు పెరగడంతో ఇవి స్థానికంగా విక్రయాలు తగ్గించుకుని.. ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. -
పెట్రోల్ ధరలు చాలా తక్కువ పెంచాం: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు అతి తక్కువగా పెరిగాయని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రాలతో కేంద్రం సంబంధాలు సాగిస్తోందని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో చమురు ధరలు 30 శాతం మాత్రమే పెరిగాయని, 80 శాతం కాదని తెలిపారు. ‘దశాబ్దాలుగా బేసిక్ శాలరీలు పెరిగాయి. వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఉచిత పథకాలను అందిస్తోంది. కరోనా సంక్షోభం నుంచి మనం ఇంకా కోలుకోలేదు. దేశంలో 80 కోట్ల మందికి ఇప్పటికీ ఆహారం అందిస్తున్నాం. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య కారణంగా చమురు ధరలు బ్యారెల్‌కు 19.56 నుంచి 130 డాలర్లకు పెరిగాయి. కేంద్రం పెట్రోల్-డీజిల్‌పై రూ.32 ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తోంది. దీపావళికి ముందు ఎక్సైజ్ సుంకం తగ్గించాం. దీంతో చమురు ధరలు తగ్గాయి. (క్లిక్: ప్యాసింజర్ రైళ్ల రద్దు.. ఆలస్యం! కారణం ఏంటంటే..) ఇంధన ధరల తగ్గింపు విషయంలో కేంద్రం తన బాధ్యతను స్వీకరించింది. రాష్ట్రాలు కూడా తమ బాధ్యతను నిర్వర్తించాలి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు 0.2 శాతానికి మించిలేవు. నిబంధనలు ఒప్పుకుంటే ఎక్కువ శాతం ముడి చమురు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేశ ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడబోమ’ని హర్దీప్ సింగ్ పూరి అన్నారు. (క్లిక్: ఢిల్లీకి సర్కార్‌కు బొగ్గు కష్టాలు.. 24 గంటల విద్యుత్ డౌటే!) -
ట్విట్టర్లో పెట్రో వార్ !
సాక్షి, హైదరాబాద్: పెట్రో ధరలపై ట్విట్టర్ వేదికగా కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణతో సహా విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని బుధవారం ప్రధాని మోదీ కోరగా.. కేంద్రం అడ్డగోలుగా విధించిన సెస్‌లు, సుంకాలతోనే ధరలు పెరిగాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆయన్ను విమర్శించారు. అయితే దీనికి కౌంటర్‌గా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘దేశంలోనే అత్యధికంగా పెట్రోల్‌పై 35.20%, డీజిల్‌పై 27% వ్యాట్‌ను తెలంగాణ విధిస్తోంది. వ్యాట్ ద్వారా 2014–21 మధ్య రాష్ట్రం రూ.56,020 కోట్లను ఆర్జించింది. 2021–22లో రానున్న రూ.13,315 కోట్లు కలిపితే రూ.69,334 కోట్ల భారీ మొత్తం కానుంది. ఈ డబ్బంతా ఎక్కడకు పోయింది?’ అని హర్దీప్ సింగ్ ట్వీట్ చేయగా, కేటీఆర్ గట్టిగానే బదులిచ్చారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ సుంకాలు, సెస్లే ధరల పెరుగుదలకు కారణం కాదా? దేశవ్యా ప్తంగా పెట్రోల్‌ను రూ.70, డీజిల్‌ను రూ.60కి ఇచ్చేలా సెస్‌లను రద్దు చేయాలని ప్రధానికి మీరు ఎందుకు సలహా ఇవ్వరు? కేంద్రం రూ.26.5లక్షల కోట్ల సెస్‌లను వసూలు చేయడం వాస్తవం కాదా.. మీ సెస్‌ల వల్ల హక్కుగా మాకు రావాల్సిన పన్నుల ఆదాయంలో 41% వాటాలను మేము పొందలేకపోతున్నాం. సెస్‌ల రూపంలో మీరు 11.4% రాష్ట్ర వాటాలను లూటీ చేస్తున్నారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంధన ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..!
రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. కానీ భారత్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఉండడంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. కాగా గత 13 రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇంధన ధరల పెంపుతో సామాన్యులపై భారీ ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పార్లమెంట్లో కూడా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. కాగా పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. భారత్‌లోనే తక్కువ..! పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల చాలా తక్కువని అన్నారు. లోక్‌సభలో మంగళవారం హర్దీప్ సింగ్ పూరి ఇంధన ధరలపై మాట్లాడారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో పెరిగిన ఇంధన ధరలు కేవలం 1/10 వంతుగా ఉన్నాయని వెల్లడించారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి మధ్య కాలంలో పెట్రోల్ ధరలు.. అమెరికాలో 51 శాతం, కెనడాలో 52 శాతం, జర్మనీలో 55 శాతం, యుకేలో 55 శాతం, ఫ్రాన్స్‌లో 50 శాతం, స్పెయిన్‌లో 58 శాతం పెరిగాయని పేర్కొనారు.కాగా భారత్‌లో కేవలం 5 శాతం మాత్రమే ఇంధన ధరలు పెరిగాయని వెల్లడించారు. చదవండి: గత 4 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఇళ్ల విక్రయాలు..! హైదరాబాద్‌లో ఎలా ఉందంటే..? -
పెట్రోల్, డిజీల్ ధరలు రూ. 12 పెరిగే ఛాన్స్..! బంకులకు క్యూ కట్టిన జనాలు..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిన్ ధరలు సరికొత్త రికార్డులు నమోదుచేసింది. దీంతో అంతర్జాతీయంగా పెట్రోల్, డిజీల్ ధరలు గణనీయంగా పెరిగాయి. భారత్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇంధన ధరల పెంపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పెట్రోల్, డిజీల్ ధరలు స్థిరంగానే కొనసాగాయి. కాగా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరు క్షణమే ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే వార్తలు రావడంతో ప్రజలు తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకున్నారు. మార్చి నెల తొలి పదేహేను రోజుల్లో రికార్డు స్థాయిలో పెట్రోల్, డిజీల్ను ప్రజలు తమ వాహనాల్లో నింపుకున్నారు. కొత్త రికార్డులు..! ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరల పెంపు ఉంటుందనే భయం ప్రజల్లో కన్పించింది. దీంతో మార్చి మొదటి రెండు వారాల్లో జనాలు భారీగా ఇంధనాన్నినిల్వ చేసుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ లెక్కల ప్రకారం..మార్చి 1 నుంచి 15 మధ్యకాలంలో భారత్‌కు చెందిన మూడు అతిపెద్ద రిటైలర్ల డీజిల్ విక్రయాలు ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువగా 3.53 మిలియన్ టన్నులుగా ఉన్నాయని పేర్కొంది. ఇక పెట్రోల్ మార్చి 1 నుంచి 15 మధ్య కాలంలో 1.23 మిలియన్ టన్నులతో పెట్రోలు విక్రయాలు జరిగాయి. ఈ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 18 శాతం ఎక్కువ. 2019 కాలంతో పోలిస్తే 24.4 శాతం అధికం. ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలు సుమారు 132 రోజుల పాటు స్థిరంగా ఉన్నాయి. ఇక ఎల్పీజీ గ్యాస్ అమ్మకాలు అమ్మకాలు 17 శాతం పెరిగాయి. రూ. 12 కు పెరిగే ఛాన్స్..! రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు సుమారు 80 డాలర్ల నుంచి 130 డాలర్లకు చేరకుంది.ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన రిటైలర్లు ధరలను సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు ఊహగానాలు వచ్చాయి. ఫలితాల తరువాత ఇంధన ధరలు ఏకంగా రూ. 12 పెరిగే ఛాన్స్ ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్, డిజీల్ రేట్లు మారలేదు.కాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ఆఫర్ త్వరలోనే ముగియనుంది వెంటనే మీ వాహనాల ట్యాంకులను ఫుల్ చేసుకోండి అంటూ ప్రజలకు హితవు పలికారు. నష్టాల్ని పూడ్చుకోవాల్సిందే పెట్రోల్, డిజీల్ అమ్మకాలు పెరగడానికి ఇంధన హోర్డింగ్ దోహదపడిందని హర్దీప్ సింగ్ పురి పార్లమెంట్లో తెలియజేశారు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రకారం, అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగిన తర్వాత నష్టాలను పూడ్చుకోవడానికి, అతిపెద్ద ఇంధన రిటైలర్ సంస్థలు భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంధన ధరలు పెంపుకు రిటైలర్లు తగిన చర్యలు తీసుకుంటారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ చెప్పారు. చదవండి: భారీ షాక్..! రూ. 17 వేలకు పైగా పెంచేసిన చమురు సంస్థలు..! టికెట్ ధరలకు రెక్కలే..! -
మన దేశంలోనే పెట్రోల్ ధరలు తక్కువ.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి కాలంలో చాలా దేశాలలో ఇంధన ధరలు 50 శాతానికి పైగా పెరిగితే భారతదేశంలో కేవలం ధరలు 5 శాతం పెరిగాయని సభకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నేడు రాజ్యసభలో తెలిపారు. గత ఏడాది నవంబర్ 4న ఇంధన ధరలపై కేంద్రం పన్నులు తగ్గిస్తే మహారాష్ట్ర, కేరళతో సహా తొమ్మిది రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించలేదని అని అన్నారు. "మేము గత ఏడాది సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాము. కానీ, మహారాష్ట్ర & కేరళతో సహా తొమ్మిది రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించలేదు. చమరు ధరలను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము" మంత్రి తెలిపారు. "కరోనా మహమ్మారి సమయంలో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యుకె, స్పెయిన్ దేశాలలో పెట్రోల్ ధరలు 50, 55 & 58 శాతం పెరిగితే.. భారతదేశంలో చమరు ధరలు 5 శాతం మాత్రమే పెరిగాయి. ఇందుకు మనం సంతోషించాలి" అని అన్నారు. ముడి చమురుపై రష్యా అందిస్తున్న డిస్కౌంట్లను కూడా పరిశీలిస్తున్నట్లు సింగ్ రాజ్యసభలో తెలిపారు. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గత మూడు సంవత్సరాలు, ప్రస్తుత సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం(సెస్‌లతో సహా) విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించిన మొత్తం వివరాలను మంత్రి రాజ్యసభకు తెలియజేశారు. 2018-29లో సేకరించిన మొత్తం సుంకం రూ.2.14 లక్షల కోట్లు అయితే, 2019-20లో ఇది రూ.2.23 లక్షల కోట్లుగా ఉంది. ఇక 2020-21లో ఈ మొత్తం రూ.3.73 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు పెట్రోలియం ఉత్పత్తుల నుంచి సేకరించిన మొత్తం సుంకం రూ.1.71 లక్షల కోట్లు వసూలు అయినట్లు హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. (చదవండి: రష్యాతో బిజినెస్ చేస్తాం.. లాభం ఉక్రెయిన్‌కు ఇస్తాం!) -
రెట్టింపు స్థాయికి చమురు, గ్యాస్ అన్వేషణ
న్యూఢిల్లీ: ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గ్యాస్, చమురు అన్వేషణ, ఉత్పత్తి చేసే ప్రాంత విస్తీర్ణాన్ని 2025 నాటికల్లా రెట్టింపు స్థాయికి (5 లక్షల చ.కి.మీ.లకు) పెంచుకోవాలని భావిస్తోంది. 2030 నాటికి దీన్ని 10 లక్షల చ.కి.మీ.కు పెంచనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రస్తుతం 2,07,692 చ.కి.మీ. విస్తీర్ణంలో చమురు, గ్యాస్ అన్వేషణ జరుగుతోంది. సమీప భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాల కోసం చమురు, గ్యాస్‌పై ఆధారపడటం కొనసాగుతుందని వరల్డ్ ఎనర్జీ పాలసీ సదస్సు 2022లో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రస్తుతం 3 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఎకానమీ 2025 నాటికల్లా 5 లక్షల కోట్ల డాలర్లకు, 2030 నాటికి 10 లక్షల కోట్ల డాలర్లకు చేరనుందని పురి వివరించారు. ఈ నేపథ్యంలో ఇంధనానికి భారీగా డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు. బ్రిటీష్ ఇంధన సంస్థ బీపీ ఎనర్జీ అంచనాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ ఇంధన డిమాండ్‌లో భారత్ వాటా ప్రస్తుత 6 శాతం స్థాయి నుంచి రెట్టింపై 12 శాతానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. నికరంగా సున్నా స్థాయి కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. భారత్ 80 శాతం పైగా ఇంధనావసరాల కోసం బొగ్గు, చమురు, బయోమాస్పైనే ఆధారపడుతోంది. మొత్తం ఇంధన వినియోగంలో 44 శాతం వాటా బొగ్గుది ఉంటుండగా, చమురుది పావు శాతం, సహజ వాయువుది 6 శాతం వాటా ఉంటోంది. చమురు అవసరాల్లో 85 శాతాన్ని, గ్యాస్‌లో 50 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. గ్యాస్ వినియోగం పెంపు.. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో గ్యాస్ ఇంధన వినియోగాన్ని పెంచుకుంటున్నట్లు పురి తెలిపారు. ప్రస్తుతం 6 శాతంగా ఉన్న గ్యాస్ వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచుకోనున్నట్లు వివరించారు. అలాగే చెరకు, మిగులు ఆహారధాన్యాల నుంచి వెలికితీసే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా కూడా చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్లెండింగ్ (పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే స్థాయి) 8 శాతంగా ఉండగా 2025 నాటికి ఇది 20 శాతానికి పెంచుకోనున్నట్లు హర్దీప్ సింగ్ పురి చెప్పారు. మరోవైపు, కాలుష్య రహితమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కూడా తగు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ‘పర్యావరణ హైడ్రోజన్‌ను వేగవంతంగా వినియోగంలోకి తేవడంపైనా, భారత్‌ను హరిత హైడ్రోజన్ హబ్‌గా తీర్చిదిద్దడంపైనా ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. హైడ్రోజన్‌ను ఇంధనంగాను, గ్యాస్ పైప్లైన్లలోను ఉపయోగించగలిగే ప్రాజెక్టులను మా చమురు, గ్యాస్ కంపెనీలు రూపొందిస్తున్నాయి ‘ అని పురి చెప్పారు. దేశీయంగా చమురు, గ్యాస్ రంగంలో తలపెట్టిన సంస్కరణలు ఏదో స్వల్పకాలికమైనవి కాదని.. అపార వనరులను సమర్ధంగా వినియోగించుకునేందుకు రూపొందించుకున్న దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమేనని ఆయన పేర్కొన్నారు. పరిశుభ్రమైన, పర్యావరణ అనుకూలమైన ఇంధనానికి మళ్లడంలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించగలదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. -
మీరే మాకు గర్వ కారణం!... ఆ సమయంలో కూడా సేవలందించారు!!
Hardeep Singh Puri Praises Working On Oil Rigs: దేశంలోని చమురు, గ్యాస్ ఇన్స్టాలేషన్లలో పనిచేసే మహిళల సహకారాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్లో ఆరెంజ్ కలర్ యూనిఫామ్ ధరించి పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ కరోనా మహమ్మారి సమయంలో కూడా ఈ మహిళలు సుమారు 60 నుండి 70 రోజుల పాటు డ్రిల్లింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై ఉండి సేవలందించారని పూరి చెప్పారు. (చదవండి: మృత్యుంజయురాలు! ...ఐదు రోజులుగా గడ్డకట్టే మంచులో కారులోనే ...) అంతేకాదు వారి తమ కార్పోరేషన్లో కఠినమైన నిబద్ధత, దృఢత్వంతో పనిచేసే సూపర్ ఉమెన్ మాత్రమే కాదు దేశ ప్రగతిలో "సమాన భాగస్వామ్యులు"గా అభివర్ణించారు. పైగా మీరే మాకు గర్వకారణం అంటూ ప్రశంసించారు. ఈ మేరకు నెట్టింట్లో ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా మహిళలను ప్రోత్సహించే నిమిత్తం మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. అంతేకాదు లడఖ్‌లోని ఫే గ్రామంలో 11,800 అడుగుల ఎత్తైన ఎల్పిజి బాట్లింగ్ ప్లాంట్‌ను ఇండియన్ ఆయిల్‌కు చెందిన మహిళా ఉద్యోగుల బృందమే నిర్వహించారన్న సంగతి తెలిసిందే. (చదవండి: పోలీస్ కమిషనర్ పేరుతో పోలీసులనే బురిడి కొట్టించాడు!!) View this post on Instagram A post shared by Hardeep Singh Puri (@hardeepspuri) -
గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. మహిళలకు ఊరట!
Govt Reduced to LPG Cylinder Weight: గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ విషయంలో ఓ కీలక ప్రతిపాదన తమ దగ్గర ఉన్నట్లు కేంద్రం తెలిపింది. అయితే, ఇది గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు అంశం కాదండోయ్. ప్రస్తుతం 14.2 కిలోల బరువు ఉన్న గ్యాస్ సిలిండర్లను రవాణా చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దాని బరువును తగ్గించడంతో పాటు వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఎల్పీజీ సిలిండర్ బరువుగా ఉండటంతో వాటిని ఒక స్థానం నుంచి మరొక స్థానానికి జరపాలని అనుకున్నప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బరువు తగ్గింపు విషయంలో ఆలోచన చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ విధంగా అన్నారు. ఇంతకు ముందు, భారీ సిలిండర్ బరువు కారణంగా మహిళలకు కలిగే అసౌకర్యం గురించి ఒక సభ్యుడు ప్రస్తావించారు. "మహిళలు గ్యాస్ సిలిండర్ బరువును మోయలేక ఇబ్బందిపడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని.. దాని బరువును తగ్గించే ఆలోచనలో ఉన్నామని" కేంద్రమంత్రి తెలిపారు. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ బరువును ఐదు కిలోలకు తగ్గించడం లేదా మరేదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తున్నాము అని అన్నారు. (చదవండి: దేశంలో భారీగా పెరిగిన ఆదాయ అసమానతలు!) -
వీజీఎఫ్ సర్దుబాటు చేస్తేనే కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్
సాక్షి, న్యూఢిల్లీ: వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీ ఎఫ్) సర్దుబాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వస్తేనే కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి స్పష్టం చేశారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కాకినాడలో రూ.32,901 కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం 2017 జనవరి 27న ఏపీ ప్రభుత్వం గెయిల్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లతో ఎంవోయూ కుదుర్చుకు న్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చాలంటే వీజీఎఫ్‌ను ఏపీ ప్రభుత్వమే భరించాలని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కాచ్ ద రైన్ క్యాంపెయిన్ కింద ఏపీలో 7.97 లక్షల పనులు కాచ్ ద రైన్ క్యాంపెయిన్ కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 7,97,502 పనులు నిర్వహించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు చెప్పారు. ఖరగపూర్–విజయవాడ మధ్య డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఖరగపూర్–విజయవాడ (1,115 కిలోమీటర్లు), విజయవాడ–నాగపూర్ (975 కిలోమీటర్లు) మధ్య డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణానికి రైల్వేశాఖ డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. నేషనల్ మినరల్ పాలసీ కింద డెడికేటెడ్ మినరల్ కారిడార్లు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా భారీ సరుకులతో పొడవాటి ట్రైన్ల ద్వారా రవాణా చేసేలా రూపుదిద్దుకుంటాయని తెలిపారు. స్మార్ట్ నగరాల్లో 776 స్మార్ట్ రోడ్ ప్రాజెక్టులు 2015లో ప్రారంభమైన స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్సీఎం) కార్యక్రమంలో భాగంగా 2016 నుంచి 2018 వరకు 100 స్మార్ట్ నగరాలను ఎంపిక చేసినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి తెలిపారు. స్మార్ట్ సిటీల్లో నడకను మెరుగుపరచడానికి, మోటారు లేని, ప్రజారవాణా వినియోగాన్ని పెంచడానికి రూ.26,205 కోట్ల విలువైన 776 స్మార్ట్ రోడ్ ప్రాజెక్టులు అమలవుతున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఖనిజాల రాయల్టీ రేట్ల సమీక్షకు కమిటీ ఖనిజాలపై టన్ను ప్రాతిపదికన రాయల్టీ రేట్ల సమీక్ష కోసం ఒక కమిటీని గత అక్టోబర్‌లో ఏర్పాటు చేసినట్లు కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మైన్స్ అండ్ మినరల్స్ చట్టం (ఎంఎండీఆర్) సవరణ తర్వాత వేలంలో క్యాప్టివ్ ప్రయోజనం కోసం ఎటువంటి గనిని రిజర్వ్ చేయరాదని, క్యాప్టివ్ మరియు నాన్ క్యాప్టివ్ గనుల మధ్య వ్యత్యాసం తొలగించామని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు జవాబుగా చెప్పారు. 8 రాష్ట్రాల్లో 8 నగరాలకు నిధులు 15వ ఆర్థిక సంఘం 8 కొత్త నగరాల ఇంక్యుబేషన్ కోసం పనితీరు ఆధారిత చాలెంజ్ ఫండ్ కోసం రూ.8 వేల కోట్లు కేటాయించిందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. బిడ్ పారామితులను పేర్కొనడానికి వచ్చే జనవరి 31 నాటికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు జవాబుగా చెప్పారు. అమృత్ నగరాల్లో క్రెడిట్ రేటింగ్స్ పనులు పూర్తి దేశంలోని 470 అమృత్ నగరాల్లో క్రెడిట్ రేటింగ్ పనులు పూర్తయ్యాయని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి కౌశల్‌కిశోర్ తెలిపారు. ఈ క్రెడిట్ రేటింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 32 నగరాలున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు. -
18 నెలల్లోనే పెట్రోల్‌పై రూ.35.98 పెంపు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశంలోకి దూసుకెళ్తూనే ఉన్నాయి. గత ఏడాది మే నుంచి ఇప్పటిదాకా.. కేవలం 18 నెలల్లోనే లీటర్ పెట్రోల్ రూ.35.98, డీజిల్ చొప్పున రూ.26.58 ధరలు పెరిగాయి. చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటేసింది. డీజిల్ సైతం రూ.100 మార్కును అధిగవిుంచింది. అంతర్జాతీయంగా చమురు ధరలను బట్టి భారత్‌లోనూ పెంచకం తప్పడం లేదని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. కానీ, అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడల్లా కేంద్రంం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ పెంచేస్తుండడంతో ఆ ప్రయోజనం వినియోగదారులకు దక్కడం లేదు. ప్రభుత్వం ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ.32.90, డీజిల్‌పై 31.80 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తోంది. పెట్రో ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం అంటే మన కాళ్లను మనం నరుక్కున్నట్లే అని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి వ్యాఖ్యానించారు. ఈ సొమ్ముతోనే ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్, సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మరో 35 పైసలు పెంపు దేశంలో శనివారం సైతం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 35 పైసల చొప్పున పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.24కు, డీజిల్ రూ.95.97కు ఎగబాకింది. -
ప్రపంచ రికవరీకి చమురు మంట
న్యూఢిల్లీ: ముడి చమురు ధరల తీవ్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రపంచ ఎకానమీ రికవరీపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగ దేశమేకాకుండా, దిగుమతుల విషయంలోనూ ఇదే స్థానాన్ని ఆక్రమిస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్ బేరల్ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయిలో 80 డాలర్లపైన స్థిరంగా కదలాడుతుండడం, దేశీయంగా పెట్రో ధరలు మండిపోతుండడం, దీనితో ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాల నేపథ్యంలో సీఈఆర్ఏవీక్ నిర్వహించిన ఇండియా ఎనర్జీ ఫోరమ్‌లో భారత్ చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► కోవిడ్–19 వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. క్రూడ్ ధరల తీవ్రతతో అసలే అంతంతమాత్రంగా ఉన్న రికవరీకి తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. ► క్రూడ్ ధరల ఒడిదుడుకుల పరిస్థితిని అధిగమించాల్సి ఉంది. ఇందుకు దీర్ఘకాలిక సరఫరా కాంట్రాక్టులు అవసరం. స్థిర ధరల వ్యవస్థకు ఇది దోహదపడుతుంది. ► చమురు డిమాండ్, ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం) వంటి ఉత్పత్తిదారుల సరఫరాలకు మధ్య పొంతన లేదు. ఉత్పత్తిని భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. ► క్రూడ్ ధరల పెరుగుదల వల్ల వర్థమాన దేశాలకే కాకుండా, పారిశ్రామిక దిగ్గజ దేశాలకూ కష్టాలు తప్పవు. ప్రపంచ ఆరి్థక వ్యవస్థ స్థిరంగా వృద్ధి బాటన పయనించేలా చూడ్డం అందరి బాధ్యత. ఇతర దేశాల మంత్రులతో సమావేశాల సందర్భంగా నేను ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ► 2020 జూన్‌లో 8.8 బిలియన్ డాలర్లు ఉన్న భారత్ చమురు దిగమతుల బిల్లు, 2021లో సగటున 24 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాంట్రాక్ట్ విధానం మారాలి: తరుణ్ కపూర్ ఇదే సమావేశంలో పెట్రోలియం వ్యవహారాల కార్యదర్శి తరుణ్ కపూర్ మాట్లాడుతూ, సౌదీ అరేబియా, ఇరాక్ వంటి ఒపెక్ దేశాల నుండి చమురు కొనుగోలు చేయడానికి భారతదేశం వంటి దిగుమతి చేసుకునే దేశాలు ప్రస్తుతం ‘వన్–టర్మ్ కాంట్రాక్ట్’ను కుదుర్చుకున్నాయని చెప్పారు. ఈ తరహా ఒప్పందాలు సరఫరాలకు సంబంధించి పరిమాణం స్థిరత్వాన్ని మాత్రమే అందిస్తాయని తెలిపారు. డెలివరీ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి ధరల విధానం ఉంటోందన్నారు. ఈ సమస్య తొలగాలంటే ఒక బెంచ్‌మార్క్‌గా ధరలకు అనుసంధానమయ్యే దీర్ఘకాలిక కాంట్రాక్ట్ అవసరమని సూచించారు. భారత్ తన మొత్తం క్రూడ్ అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. గ్యాస్ విషయంలో ఇది 55 శాతంగా ఉంది. భారత్‌లో చమురు డిమాండ్ కూడా అధికంగా ఉంది. భారత్ ఎకానమీ రికవరీకి దెబ్బతగిలితే, అది చమురు ఉత్పత్తిదారులకూ నష్ట మేనని భారత్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
హ్యాట్సాఫ్ ఆర్య: ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న తండ్రికూతుళ్లు
తిరువనంతపురం: రైతు బిడ్డ రైతే అవుతాడు.. రాజు బిడ్డ రాజు అవుతాడు.. ఇది జమానా మాట. కానీ ఇప్పుడు రోజులు మారాయి. సినిమా డైలాగ్ ప్రకారం విజయం ఎవడబ్బ సొత్తు కాదు. కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే చాలు.. విజయం మన సొంతం అవుతుంది. ఈ మాటలు నిజం చేసి చూపారు ఆర్య రాజగోపాల్ అనే యువతి. పెట్రోల్ బంక్‌లో పని చేసే ఓ ఉద్యోగి కుమార్తె అయిన ఆర్య.. ఇప్పుడు ఐఐటీ కాన్పూర్‌లో పీజీ అడ్మిషన్ సాధించారు. ఇక్కడో ఆసక్తికర అంశం ఉంది. ఏంటంటే ఆర్య తండ్రి పెట్రోల్ బంక్‌లో సాధారణ ఉద్యోగి అని చెప్పుకున్నాం కాదా. ఇప్పుడు ఆర్య పీజీ అడ్మిషన్ పొందిన కోర్సు పెట్రోలియమ్ ఇంజనీరింగ్ కావడం విశేషం. ఆర్య కథ కేవలం ఆమె చదవులో చూపిన ప్రతిభ గురించి మాత్రమే కాదు.. ఆమె పట్టుదల, సంకల్పం గురించి కూడా. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోన్న ఈ స్ఫూర్తిదాయక కథనం వివరాలు ఇలా ఉన్నాయి.. (చదవండి: Sarah: అదంతా సరే.. మరి.. ‘కోర్టులో వాదనలు ఎలా వినిపిస్తారు?’) కేరళ పయ్యనూర్‌కు చెందిన ఆర్య తండ్రి రాజగోపాల్ గత 20 ఏళ్లుగా పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు. భార్య ఓ ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్ట్. కూతురు భవిష్యత్తు గురించి చాలా గొప్పగా ఊహించుకునేవాడు రాజగోపాల్. కూతురుకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎంతో కష్టపడ్డాడు. తాము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే.. ఆర్య చదువుకు మాత్రం అడ్డంకులు ఎదురు కానీవ్వలేదు. తల్లిదండ్రుల కష్టాన్ని, కలలను అర్థం చేసుకున్న ఆర్య చదువులో ముందుండేది. మంచి మార్కులు తెచ్చుకుని పేరున్న విద్యాసంస్థల్లో సీటు సంపాదించుకుంది. దానిలో భాగంగానే ఆర్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుంచి తన బ్యాచిలర్ పూర్తి చేసింది. ఇప్పుడు పీజీ చేయడం కోసం ఐఐటీ కాన్పుర్‌లో సీటు సాధించి.. తండ్రి కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చింది. (చదవండి: వయసు 78.. బరిలో దిగిందో.. ప్రత్యర్థి మట్టి కరవాల్సిందే) ఆర్య కుటుంబ నేపథ్యం... ఆమె ప్రయాణం.. ఇప్పుడు సాధించిన విజయం తదితర అంశాల గురించి అశ్విన్ నందకుమార్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేయడంతో తెగ వైరలయ్యింది. ఆర్య కథ చదివిన వారు తండ్రికూతుళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్య విజయం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి తెలిసింది. ఈ క్రమంలో ఆయన ఆర్యను ప్రశంసిస్తూ.. ట్వీట్ చేశారు. ‘‘ఆర్య విజయం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆర్య రాజగోపాల్, ఆమె తండ్రి రాజగోపాల్ల విజయం పట్ల దేశ ఇంధన రంగంతో సంబంధం ఉన్న మనమందరం నిజంగా ఎంతో గర్వపడుతున్నాము. ఈ ఆదర్శవంతమైన తండ్రి-కుమార్తెల ద్వయం ఎందరికో స్ఫూర్తి.. కొత్త భారతదేశానికి స్ఫూర్తి, మార్గదర్శకులు. వారిరువురికి నా శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్ Heartwarming indeed. Arya Rajagopal has done her father Sh Rajagopal Ji & indeed all of us associated with the country’s energy sector immensely proud. This exemplary father-daughter duo are an inspiration & role models for Aspirational New India. My best wishes.@IndianOilcl https://t.co/eiU3U5q5Mj pic.twitter.com/eDTGFhFTcS — Hardeep Singh Puri (@HardeepSPuri) October 6, 2021 చదవండి: ఆటో డ్రైవర్‌ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.12 కోట్లు -
ఇంధన ధరల పెంపుపై 9 నెలల్లో కేంద్రం చెప్పిన 9 కారణాలు..!
ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి పెను భారంగా మారుతున్నాయి. కొన్ని రోజులపాటు నిలకడగా ఉన్న ఇంధన ధరలు వరుసగా మూడో రోజు శనివారం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరగడంతో చమురు కంపెనీలు డీజిల్ ధరల్ని ఊహించని విధంగా పదిరోజుల వ్యవధిలో ఆరుసార్లు పెంచాయి. ఇంధన ధరలు పెరగడానికి కేంద్రం పలు కారణాలను చెప్తూ వస్తోంది. చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..! తొమ్మిది నెలల్లో కేంద్రం చెప్పిన కారణాలు ఇవే...! 1. ఈ పాపమంతా గత కాంగ్రెస్ ప్రభుత్వానిదే (2021 ఫిబ్రవరి 18) ప్రధానమంతి నరేంద్ర మోదీ ఇంధన ధరల పెంపుపై‘ గత ప్రభుత్వాలు ఇంధన దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడంపై దృష్టి పెడితే, మధ్యతరగతి వారికి ఇంధన ధరలు అంత భారం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. 2. ఇంధన ధరలు పెరుగుదల ‘ధర్మ సంకటమే’..: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(2021 ఫిబ్రవరి 20) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంధన ధరల పెరుగుదల' ధర్మసంకట్ ' పరిస్థితి అన్నారు. తుది ధర లేదా ఇంధన రిటైల్ ధర సహేతుకమైన స్థాయిలో ఉండేలా కేంద్రం, రాష్ట్రాలు ఒక మార్గాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. 3. ధర్మేంద్ర ప్రధాన్ ఇంధన ధరల పెంపు వెనుక అంతర్జాతీయ మార్కెట్ల వాదన (2021 ఫిబ్రవరి 22) మాజీ కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, "అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా, రిటైల్ ఇంధన ధరలు పెరిగాయన్నారు. కోవిడ్-19 కారణంగా ముడిచమురు ఉత్పత్తి నెమ్మదించడంతో సరఫరా తగ్గిందన్నారు. 4. ఇంధన ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుపై వెనుకడుగు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (2021 మార్చి 5) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పన్నులను తగ్గిస్తే ఇంధన ధరలు అదుపులోకి వస్తాయన్నారు. అప్పుడు సామాన్యులపై భారం తగ్గుతుందని మీడియా సమావేశంలో వెల్లడించారు. 5. సంక్షేమ పథకాలు, టీకాల కోసం ధరల పెంపు: మాజీ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (జూన్ 14, 2021) అధిక ఇంధన ధరలు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని అంగీకరిస్తూ, మాజీ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, "ఇంధన ధరలు వినియోగదారులను చిదిమేస్తున్నాయని నేను అంగీకరిస్తున్నాను. అయితే కోవిడ్ టీకాల కోసం ఒక ఏడాదిలో రూ. 35,000 కోట్లు ఖర్చు అవుతోంది.ఇటీవల, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించడానికి ప్రధాన మంత్రి లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. 6.కాంగ్రెసే కారణం..!: ధర్మేంద్ర ప్రధాన్(2021 జూలై 3) అప్పటి కేంద్ర పెట్రోలియం , సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలి ఇంధన ధరల పెంపును కాంగ్రెస్ పాలనతో ముడిపెట్టారు. ఆర్థికవేత్తలను ఉటంకిస్తూనే...అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల విలువైన చమురు బాండ్లను వదిలిపెట్టిందని, అందుకే ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం వాటికి వడ్డీ , ప్రధాన ధరలను రెండింటినీ చెల్లిస్తోందని పేర్కొన్నారు. 7. మౌలిక సదుపాయాలను నిర్మించడం కోసం ఎక్సైజ్ డ్యూటీ పెంపు అనివార్యం: ఆర్థికమంత్రిత్వ శాఖ(2021 జూలై 20) రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఆర్థికమంత్రిత్వ శాఖ సహయమంత్రి పకజ్ చౌదరీ సమాధానమిస్తూ...దేశంలో మౌలిక సదుపాయాలను నిర్మించడం కోసం ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీ పెంపు అనివార్యమైందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పన్నులు పెంచాల్సి వస్తుందన్నారు. 8.పెట్రోల్, డీజిల్‌పై అధిక పన్నులను కేంద్రం సమర్థిస్తోంది: పెట్రోలియం , సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి(2021 జూలై 26) ప్రతిపక్షాలు లోక్ సభలో అడిగిన ప్రశ్నకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి సమాధానమిస్తూ.. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని (పెట్రోలియం ఉత్పత్తులపై) వివిధ అభివృద్ధి పథకాలలో ఉపయోగించబడుతుందని, మహమ్మారి సమయంలో పేదలకు ఉపశమనం అందించడానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన వంటి పథకాల కింద 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్ అందిస్తున్నామని తెలిపారు. 9. యూపీఎ ప్రభుత్వం చేసిన తప్పులకు మోదీ 2.0 చెల్లిస్తోంది: నిర్మలా సీతారామన్(2021 ఆగస్టు 16) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ.."గత యూపీఎ ప్రభుత్వం చేసిన ఆయిల్ బాండ్లకు పన్నులను చెల్లించే భారం లేకపోతే, పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించే పరిస్థితి ఉండేదని అభిప్రాయపడ్డారు. చదవండి: అతి తక్కువ ధరలోనే..భారత మార్కెట్లలోకి అమెరికన్ బ్రాండ్ టీవీలు.. -
పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి..!
ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామన్యుడికి చుక్కలు కన్పిస్తున్నాయి. గత పదిహేను రోజుల నుంచి ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.దీంతో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది. కాగా తాజాగా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి ఇంధన ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు దిగిరావడంలేదంటే... పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు ఒప్పుకోవని వెల్లడించారు. పెట్రోలు, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై రాష్ట్రాలు సిద్దంగా లేవని మీడియాతో తెలిపారు. చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..! పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న హర్దీప్ సింగ్‌పురి టీఎమ్సీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టీఎమ్సీ ప్రభుత్వం భారీగా పన్నులను మోపడంతో పశ్చిమబెంగాల్లో పెట్రోల్ రూ. 100 మార్క్‌ను దాటిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎమ్‌సీ) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చదవండి: పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మార్కెట్లలోకి నయా డుకాటీ మాన్స్టర్...! -
వోస్తోక్ ప్రాజెక్ట్‌పై ఓవీఎల్ దృష్టి
న్యూఢిల్లీ/ మాస్కో: విదేశీ అనుబంధ సంస్థ ద్వారా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ.. రష్యాకు చెందిన భారీ ప్రాజెక్ట్ వోస్తోక్ ఆయిల్లో మైనారిటీ వాటా కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇందుకు ఇప్పటికే ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్(ఓవీఎల్) చర్చలు నిర్వహిస్తున్నట్లు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. మరోపక్క లిక్విఫైడ్ గ్యాస్ ప్రాజెక్ట్ ఆర్కిటిక్ ఎల్ఎన్జీ–2లో మైనారిటీ వాటాను సొంతం చేసుకునే ప్రణాళికల్లో పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్కిటిక్‌లో 9.9 శాతం వాటాను నోవాటెక్ నుంచి కొనుగోలు చేసేందుకు పెట్రోనెట్ చర్చలు చేపట్టినట్లు వెల్లడించారు. వోస్తోక్ ఆయిల్ ప్రాజెక్టు 6 బిలియన్ టన్నులు లేదా 44 బిలియన్బ్యారళ్ల ప్రీమియం చమురు నిక్షేపాలు(రీసోర్సెస్) కలిగి ఉంది. ఇక ఎల్ఎన్జీ ఉత్పత్తికి రష్యాలో అతిపెద్ద సంస్థగా నిలుస్తున్న నోవాటెక్ 11 బిలియన్ డాలర్ల విలువైన ఆర్కిటిక్ ప్రాజెక్టులో 60 శాతం వాటాను కలిగి ఉంది. ఫ్రాన్స్ దిగ్గజం టోటల్, జపనీస్ కన్సార్షియం విడిగా 10 శాతం చొప్పున వాటాలను పొందాయి. చైనా కంపెనీ సీఎన్పీసీ, సీనూక్ లిమిటెడ్ మిగిలిన 20 శాతం వాటాను సమానంగా పంచుకున్నాయి. 2023కల్లా ఆర్కిటిక్ తొలి కన్సైన్మెంట్ను ప్రారంభించగలదని అంచనా. ఈ బాటలో 2025కల్లా 19.8 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని అందిపుచ్చుకోగలదని భావిస్తున్నారు. కొత్త పెట్టుబడులు..: రష్యాలో జరుగుతున్న తూర్పుప్రాంత ఆరి్థక వేదిక సమావేశాలకు హాజరైన హర్దీప్ సింగ్ ఢిల్లీకి తిరిగి వచ్చేముందు మాస్కోలో విలేకరులతో పలు అంశాలను ప్రస్తావించారు. వోస్తోక్ ఆయిల్, ఆర్కిటిక్ ఎల్ఎన్జీ–2లో పెట్టుబడి అవకాశాలపై చర్చించినట్లు తెలియజేశారు. ఈ వివరాలను తాజాగా వెల్లడించారు. వోస్తోక్, ఆర్కిటిక్ పెట్టుబడులు భారత్, రష్యాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసేందుకు దారిచూపనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
అఫ్గాన్ నుంచి భారత్‌లోకి ఎంట్రీ.. తెరపైకి పౌరసత్వ సవరణ చట్టం
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ సంక్షోభంతో వివాదాస్పద సీఏఏ బిల్లు మరోసారి చర్చకు వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం ఎంత అవసరమో అఫ్గాన్‌లో తలెత్తిన పరిస్థితులు తెలియస్తున్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వ్యాఖ్యానించారు. అల్లకల్లోల అఫ్గాన్‌లో సిక్కులు, హిందువులు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. చదవండి: Elon Musk Tweet On Taliban: తాలిబన్లను ప్రశ్నించిన ఎలన్ మస్క్, వైరల్ కాగా, అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులను కాపాడాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏసీ-17 విమానం ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో 168 మందితో ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరింది. వీరిలో 107 మంది భారతీయులు.. 20 మంది అఫ్గాన్ హిందువులు, సిక్కులు ఉన్నారు. ఇక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విమానం లోపల 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది ప్రస్తుతం తెగ వైరలవుతోంది. కాగా పౌరసత్వ సవరణ చట్టం అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించినది. కాగా 2019 డిసెంబర్లో భారత్‌లో కొత్త పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే భారత పొరుగు దేశాలకు చెందిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన చట్టమని సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ దేశంలో తీవ్ర ఆందోళనలు కొనసాగాయి. Recent developments in our volatile neighbourhood & the way Sikhs & Hindus are going through a harrowing time are precisely why it was necessary to enact the Citizenship Amendment Act.#CAA#Sikhs https://t.co/5Lyrst3nqc via @IndianExpress — Hardeep Singh Puri (@HardeepSPuri) August 22, 2021 Jubilant evacuees on their journey home ! pic.twitter.com/3sfvSaEVK7 — Arindam Bagchi (@MEAIndia) August 21, 2021 చదవండి: Afghanistan: 20 ఏళ్ల కష్టం పోయింది.. మిగిలింది సున్నా.. అఫ్గాన్ ఎంపీ కన్నీటి పర్యంతం -
రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్ డాలర్లు దాటిన భారత్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్, రష్యా ద్వైపాక్షిక ఇంధన సహకార బలోపేతంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి, రష్యా ఇంధన మంత్రి నికోలయ్ షుల్గినోవ్‌తో శుక్రవారం వీడియో సమావేశం నిర్వహించారు. రష్యాలోని ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులపై భారత్ పెట్టుబడులు 15 బిలియన్ డాలర్లను మించడం గమనార్హం. అలాగే రష్యాకు చెందిన రోజ్‌నెఫ్ట్ భారత్‌కు చెందిన ఎస్సార్ ఆయిల్‌ను 2017లో 12.9 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయడం తెలిసిందే. ఇంధన సహకార విస్తృతిపై నికోలయ్‌తో చర్చలు నిర్వహించినట్టు కేంద్ర మంత్రి పురి ట్వీట్ చేశారు. రష్యాలోని ప్రాజెక్టులపై భారత చమురు సంస్థల పెట్టుబడులను, ఎల్ఎన్జీ, ముడి చమురు సరఫరాను సమీక్షించినట్టు ప్రకటించారు. భారత ఇంధన రంగంలో రష్యా అతిపెద్ద పెట్టుబడిగా ఉన్నట్టు పేర్కొన్నారు. చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు -
రండి.. ఆయిల్, గ్యాస్ ఉత్పత్తిపై పెట్టుబడులు పెట్టండి
న్యూఢిల్లీ: భారత్‌లో చమురు, సహజ వాయువు ఉత్పత్తి పెంపుపై పెట్టుబడులు పెట్టాలంటూ దేశ, విదేశీ కంపెనీలను పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్‌పురి ఆహ్వానించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న ఏ సమస్యను అయినా పరిష్కరించేందుకు స్వేచ్ఛాయుత విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. ఇన్వెస్టర్లతో నిర్వహించిన సంప్రదింపుల కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పిలుపునిచ్చారు. ‘‘ఈ రంగానికి సంబంధించి తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యల గుర్తింపు విషయంలో, సవాళ్లను అధిగమించే విషయంలో మీతో కలసి ప్రభుత్వం పనిచేస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని సాధించే దిశగా నడుస్తోంది. దీంతో ఇంధనానికి డిమాండ్ కూడా పెరగనుంది. దీన్ని చేరుకునేందుకు దేశీయంగా అన్వేషణ, ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో దేశ, విదేశీ కంపెనీలు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ప్రపంచంలో ఇంధనంపై పెట్టుబడులకు మంచి అవకాశం ఎక్కడ ఉందా? అని ఎవరైనా ఆలోచిస్తుంటే.. అందుకు భారత్ అనుకూలమైనది’’ అని మంత్రి ప్రకటించారు. గతంతో పోలిస్తే భారత్‌లో వ్యాపార నిర్వహణ సులభతరం అయినట్టు చెప్పారు. మూడో దశలో భాగంగా 32 చమురు, గ్యాస్ బ్లాక్‌లను వేలం వేసినట్టు పేర్కొన్నారు. -
Petrol & Diesel: ఆ రెండు రాష్ట్రాల్లో అత్యధిక వ్యాట్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధికంగా పెట్రోల్‌పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తుండగా, రాజస్తాన్ డీజిల్‌పై అత్యధికంగా వ్యాట్ విధిస్తోందని చమురు శాఖ మంత్రి హర్దీప్ పూరి సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. దేశంలో ఈ నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయికి పెరిగాయని తెలిపారు. పెట్రోల్ ధరలో 55%, డీజిల్ ధరలో 50% మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధిస్తున్న పన్నులే ఉంటున్నాయని ఆయన వివరించారు. కేంద్రం లీటర్ పెట్రోల్‌పై రూ.32.90 చొప్పున, లీటర్ డీజిల్‌పై రూ.31.80 చొప్పున ఎక్జైజ్ డ్యూటీ విధిస్తుండగా, మిగతాది రాష్ట్రాలు వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్నాయన్నారు. 2020–21 ఆర్థికంలో కేంద్రం ఎక్సైజ్డ్యూటీ రూపంలో రూ.1,01,598 కోట్లను పెట్రోల్ నుంచి, రూ.2,33,296 కోట్లను డీజిల్ నుంచి వసూలు చేసిందన్నారు. పెట్రోల్, డీజిల్ మూల ధర, కేంద్ర పన్నులపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తున్నాయని తెలిపారు. దేశంమొత్తమ్మీద అండమాన్ నికోబార్ దీవుల్లో వ్యాట్ అతి తక్కువగా లీటరు పెట్రోల్ పై రూ.4.82, డీజిల్‌పై 4.74 ఉందన్నారు. అదేవిధంగా, దేశంలోనే అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో లీటరు పెట్రోల్‌పై వ్యాట్ రూ.31.55, రాజస్తాన్‌లో డీజిల్‌పై రూ.21.82గా ఉంది. -
పెట్రో ఆదాయం 3.35 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రానికి రూ.3,35,746 కోట్లు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వచ్చిందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ లోక్‌సభకు తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ లీటరుపై రూ.19.98 నుంచి రూ.32.90, డీజిల్‌పై రూ.15.83 నుంచి రూ.31.80కి పెంచడంతో ఒక్క ఏడాదిలోనే 88 శాతం ఆదాయం పెరిగినట్లు పేర్కొన్నారు. సోమవారం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఈమేరకుసమాధానం ఇచ్చారు. తెలంగాణలో 2019 ఏప్రిల్ 1వ తేదీన పెట్రోల్ రూ.77.26, డీజిల్ రూ.71.81, ఎల్పీజీ రూ.762 ఉండగా, ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి పెట్రోల్ రూ.102.69, డీజిల్ రూ.97.20, ఎల్పీజీ రూ.887కు చేరుకున్నాయని తెలిపారు. -
కేంద్ర మంత్రి భార్యపై ట్వీట్లు.. హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి భార్య లక్ష్మి మురుదేశ్వరి పూరిపై సామాజిక కార్యకర్త సాకేత్ గోఖేల్ చేసిన ట్వీట్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్త చేసింది. తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించింది. సామాజిక కార్యకర్త గోఖలే ఇటీవల హర్దీప్ సింగ్ పూరి భార్యపై కొన్ని వివాదాస్పద ట్వీట్స్ చేశారు. ఆ ట్వీట్ల విషయంలో లక్ష్మి పూరి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కార్యకర్త గోఖలే జూన్ 13, జూన్ 26 న, చేసిన ట్వీట్లలో స్విట్జర్లాండ్‌లో లక్ష్మి పూరి కొంత ఆస్తి కొనుగోలు చేశారని ఆరోపించడమే కాక, ఆమె భర్త మీద కూడా పలు ఆరోపణలు చేశారు. ఇలా తప్పుడు ట్వీట్లు చేసిన గోఖలే తనకు 5 కోట్లు చెల్లించాలంటూ అతడిపై లక్ష్మి పూరి పరువునష్టం దావా వేశారు. ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఈ కేసును విచారించింది. ఈ నేపథ్యంలో కార్యకర్త సాకేత్ గోఖలేకు ఢిల్లీ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. లక్ష్మి పూరిపై చేసిన ట్వీట్లను 24 గంటల్లో తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జస్టిస్ సీ హరిశంకర్ తన తీర్పులో తెలిపారు. ఒకవేళ గోఖలే తను చేసిన ట్వీట్లను తొలగించకుంటే.. ట్విట్టర్ సంస్థే వాటిని డిలీట్ చేస్తుందన్నారు. అంతేకాక కోర్టు గోఖలేకు సమన్లు జారీ చేయడమే కాక సెప్టెంబర్ 10 న జాయింట్ రిజిస్ట్రార్ ముందు కేసును జాబితా చేసేలోగా నాలుగు వారాల్లో తన లిఖితపూర్వక ప్రకటనను దాఖలు చేయాలని ఆదేశించింది.. -
'ఇదీ కాంగ్రెస్ సంస్కృతి'.. రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర విమానయానా శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వ్యాక్సిన్ కొరత, వ్యాక్సినేషన్ మందకొడిగా సాగడంపై రాహుల్ విమర్శలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై హర్దీప్ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘దేశంలోని చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ఎప్పుడు అని రాహుల్ అడుగుతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో వ్యాక్సిన్లను చెత్తబుట్టల్లో పాడేస్తున్నారు. ఇది కాంగ్రెస్ సంస్కృతి’’ అంటూ హర్దీప్ సింగ్ పూరీ తీవ్రంగా ఆక్షేపించారు. అంతకముందు పంజాబ్ ప్రభుత్వం అధిక ధరలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను అమ్ముకుంటోందని హర్దీప్ ఆరోపించారు. ప్రైవేట్ దవాఖానలకు లాభానికి పంజాబ్ ప్రభుత్వం వ్యాక్సిన్లను విక్రయిస్తోందని వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పంజాబ్ ప్రభుత్వం కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను రూ 309కి కొనుగోలు చేసి దాన్ని ప్రైవేట్ దవాఖానలకు రూ 1560కి విక్రయిస్తోందని పూరి ఆరోపించారు. ప్రజలకు ఉచితంగా అందించాల్సిన వ్యాక్సిన్ డోసులను పంజాబ్ సర్కార్ లాభానికి విక్రయించడం అనైతికమన్నారు. చదవండి: వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అంటే ఏమిటి?, భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? లాక్డౌన్ పొడిగింపు.. కానీ భారీ సడలింపులు -
ఎయిరిండియాకు... త్వరలోనే ఫైనాన్షియల్ బిడ్లు!
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు సంబంధించిన నూతన కాల వ్యవధిని పరిశీలిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి తెలిపారు. రానున్న రోజుల్లో ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాల విక్రయానికి ఆర్థిక బిడ్లకు ఆహ్వానం పలకనున్నట్టు చెప్పారు. బిడ్డర్లు పరిశీలించేందుకు వీలుగా డేటా రూమ్‌ను అందుబాటులో ఉంచామని.. ఆర్థిక బిడ్లకు 64 రోజల వ్యవధి ఉందని చెప్పారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుని ఎయిరిండియాను ప్రైవేటు సంస్థకు అప్పగించడమేనన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పురి ఈ అంశంపై మాట్లాడారు. కాగా, తీవ్ర నష్టాల్లో ఉన్న ఎయిరిండియాలో నూరు శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎయిర్ఇండియాను ప్రైవేటీకరించడం లేదంటే మూసివేయడం మినహా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపే అవకాశం లేదన్నారు. అజయ్‌సింగ్ దూకుడు... స్పైస్‌జెట్ ప్రమోటర్ అయిన అజయ్‌సింగ్ ఎలాగైనా ఎయిరిండియాను సొంతం చేసుకోవాలన్న సంకల్పంతో ఉన్నట్టున్నారు. ఎయిరిండియా లో నూరు శాతం వాటాను సొంతం చేసుకునేందుకు రస్‌అల్‌ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీతోపాటు ఢిల్లీకి చెందిన బర్డ్ గ్రూపు ప్రమోటర్ అంకుర్ భాటియాతో జతకట్టారు. సింగ్, భాటియా ఇరువురూ తమ వ్యక్తిగత హోదాలో ఎయిరిండియా కోసం బిడ్లు దాఖలు చేశారని సంబంధిత ఉన్న వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టాటా గ్రూపు సైతం ఎయిరిండియా కోసం పోటీపడుతోంది. చదవండి: రూ.999 కే విమాన టికెట్: ఏయే రూట్లలో? -
బెంగళూరులో సులభతర జీవనం
సాక్షి, న్యూఢిల్లీ: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ (సులభతర జీవన సూచీ) –2020 ర్యాంకుల్లో పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో బెంగళూరు నంబర్ 1గా నిలిచింది. విశాఖపట్నం 15వ స్థానంలో, హైదరాబాద్ 24వ స్థానంలో నిలిచాయి. పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల్లో కాకినాడ నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే, మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ (పురపాలిక పనితీరు సూచీ) ర్యాంకుల్లో పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో విశాఖపట్నం 9వ స్థానంలో నిలవగా, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల కేటగిరీలో తిరుపతి నగరం రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ర్యాంకులను విడుదల చేశారు. జీవన నాణ్యత, పట్టణాభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేసే సూచీ ఈ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. విభిన్న అంశాల ప్రాతిపదికన పౌరుల జీవన ప్రమాణాలను ఈ ఇండెక్స్ అంచనా వేస్తుంది. పౌరుల అవగాహన సర్వేకు ఈ ఇండెక్స్‌లో 30 శాతం వెయిటేజీ ఉంటుంది. జీవన నాణ్యత, ఆర్థిక సామర్థ్యం, సుస్థిరత, 13 రంగాల (విద్య, తదితర) అభివృద్ధి అంశాలకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి ఈ ఇండెక్స్ రూపొందించారు. ఈ ర్యాంకులను రెండు కేటగిరీలుగా విభజించారు. పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాలను ఒక కేటగిరీలో, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాలను మరో కేటగిరీలో విభజించి ఈ ర్యాంకులను ప్రకటించారు. మొత్తం 110 నగరాలు ఈ ఇండెక్స్ ర్యాంకులకు పోటీ పడ్డాయి. మిలియన్ ప్లస్ కేటగిరీలో టాప్–10 ఇవే.. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ పది లక్షలకు పైబడిన జనాభా గల నగరాల కేటగిరీలో బెంగళూరు మొదటి ర్యాంకు సాధించగా తరువాతి స్థానాల్లో వరుసగా పుణే, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై టాప్–10లో నిలిచాయి. ఏపీ నుంచి విజయవాడ 41వ స్థానంలో నిలిచింది. నాలుగో ర్యాంకు సాధించిన కాకినాడ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ పది లక్షల లోపు జనాభా గల నగరాల కేటగిరీలో మొదటి స్థానంలో సిమ్లా నిలవగా, తరువాతి స్థానాల్లో వరుసగా భువనేశ్వర్, సిల్వాస, కాకినాడ, సేలం, వెల్లూర్, గాంధీనగర్, గురుగ్రామ్, దావన్‌గెరె, తిరుచిరాపల్లి టాప్–10 స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ నుంచి వరంగల్ 19వ స్థానంలో, కరీంనగర్ 22వ స్థానాల్లో నిలిచాయి. ఏపీ నుంచి తిరుపతి 46వ స్థానంలో నిలిచింది. మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఇలా.. దేశంలో తొలిసారిగా మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ రూపొందించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఒక సూచిక యొక్క ఫలితాన్ని నిర్దేశిస్తుండగా.. మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఆ ఫలితానికి గల కారణాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. సేవల డెలివరీ, ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థ, పరిపాలన ప్రక్రియల్లో సమర్థవంతమైన స్థానిక పాలనను నిరోధించే అంశాలను గుర్తించేందుకు ఈ ఇండెక్స్ దోహదపడుతుంది. సేవలు, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, ప్రణాళిక, పరిపాలన అన్న ఐదు అంశాల ప్రాతిపదికన 20 రంగాల్లోని 100 సూచికలను ర్యాంకులకు ప్రాతిపదికగా తీసుకున్నారు. విశాఖ –9.. తిరుపతి–2..! మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్‌లో 10 లక్షలకు పైబడిన జనాభా కేటగిరీలో ఇండోర్ మొదటి స్థానం దక్కించుకుంది. తరువాత వరుసగా సూరత్, భోపాల్, పింప్రీ చించ్వాడ్, పుణే, అహ్మదాబాద్, రాయ్‌పూర్, గ్రేటర్ ముంబై, విశాఖపట్నం, వడోదర టాప్–10లో నిలిచాయి. ఇక, తెలంగాణ నుంచి హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచింది. ఏపీ నుంచి విజయవాడ 27వ స్థానంలో నిలిచింది. 10 లక్షల లోపు కేటగిరీలో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలిచింది. తిరుపతి రెండోస్థానంలో నిలిచింది. తరువాత వరసగా గాంధీనగర్, కర్నాల్, సేలం, తిరుప్పూర్, బిలాస్పూర్, ఉదయ్‌పూర్, ఝాన్సీ, తిరునల్వేలి నిలిచాయి. ఏపీ నుంచి కాకినాడ 11వ స్థానంలో నిలిచింది. -
56.5 లక్షల టీకా డోసుల తరలింపు
న్యూఢిల్లీ/పుణే: ఈనెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త కోవిడ్–19 వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చకచకా జరిగి పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం కోవిషీల్డ్ , కోవాగ్జిన్ టీకాల 6 కోట్ల డోసుల కొనుగోలుకు ఆర్డర్లు జారీ చేయగా మంగళవారం ఉదయం నుంచి మొదటి విడత టీకా తరలింపు ప్రారంభమైంది. వ్యాక్సిన్ డ్రైవ్‌కు నాలుగు రోజులు ముందుగానే సీరం ఇన్స్టిట్యూట్ ప్రధాన కేంద్రం పుణే నుంచి దేశ రాజధాని ఢిల్లీ సహా 13 నగరాలకు 56.5 లక్షల డోసులకు పైగా కోవిషీల్డ్ టీకాను తరలించారు. మొదటి రోజున నాలుగు విమాన సంస్థలకు చెందిన 9 విమానాలు 11 టన్నుల బరువున్న టీకాను తరలించాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విట్టర్లో ప్రకటించారు. పుణే నుంచి స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థల విమానాలు ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, చండీగఢ్, కోల్‌కతా, భువనేశ్వర్, పట్నా, లక్నో, కర్నాల్, ముంబై నగరాల్లో సిద్ధం చేసిన రాష్ట్ర స్థాయి డిపోలకు కోవిషీల్డ్ డోసులను తీసుకెళ్లాయన్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి కోవిషీల్డ్ 1.1 కోట్ల డోసులు, కోవాగ్జిన్ 55 లక్షల డోసులు నిర్దేశించిన కేంద్రాలకు చేరుతాయని ప్రభుత్వం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల వరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు 54.72 లక్షల డోసుల కోవిషీల్డ్ టీకా బాక్సులు చేరుకున్నట్లు ప్రకటించింది. 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు పూర్తయిన 14 రోజుల తర్వాతే టీకా ప్రభావం కనిపిస్తుందని చెప్పారు. పుణేలో పూజలు పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్లో మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో పూజల అనంతరం కోవిషీల్డ్ టీకా ఉన్న ట్రక్కులు అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలోని పుణే విమానాశ్రయానికి చేరుకున్నాయి. టీకా బాక్సులతో ఉదయం 8 గంటలకు బయలుదేరిన స్పైస్ జెట్ విమానం ఢిల్లీకి 10 గంటలకు చేరుకుందని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. అలాగే, ఇండిగో విమానాలు చండీగఢ్, లక్నోలకు, స్పైస్ జెట్ గువాహటి, కోల్‌కతా, హైదరాబాద్, భువనేశ్వర్, బెంగళూరు, పట్నా, విజయవాడకు, గో ఎయిర్ విమానం చెన్నైకు వెళ్లాయి. రేసులో మరో నాలుగు టీకాలు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలంటూ మరో నాలుగు టీకా తయారీ సంస్థలు త్వరలోనే డీసీజీఐకి దరఖాస్తు చేసుకునే అవకాశా లున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ చెప్పారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ ముందుంజలో ఉన్న జైడస్ క్యాడిలా, స్పుత్నిక్–వీ, బయోలాజికల్ ఈ, జెన్నోవా వీటిల్లో ఉన్నాయన్నారు. ప్రస్తుత రెండు వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్ ఎఫెక్టుల ప్రమాదం లేదనీ, సురక్షితమైనవని మంగళవారం నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. కోవాగ్జిన్ ధర ఎంతంటే.. కోవాగ్జిన్ టీకా మొత్తం డోసులు 55 లక్షలు. కాగా, ఇందులో రూ.295 చొప్పున 38.5 లక్షల డోసులు, మిగతా 16.5 లక్షల డోసులు ఉచితం కాగా అంతా కలిపి డోసు ధర సరాసరిన రూ.206 అవుతుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. వివిధ టీకాల ధరలు.. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న టీకా ధరలను భూషణ్ వివరించారు. ఫైజర్ డోసు రూ.1,431, మోడెర్నా రూ.2,348 నుంచి రూ.2,715 వరకు, సినోవాక్ రూ.1,027, నోవావ్యాక్స్ రూ.1,114, స్పుత్నిక్ వీ రూ.734, జాన్సన్ అండ్ జాన్సన్ ధర రూ.734కు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వీటిల్లో ఫైజర్ టీకా మైనస్ 70 డిగ్రీల వద్ద మినహా మిగతా వాటన్నిటినీ 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచవచ్చన్నారు. కోవాగ్జిన్ ప్రయోగాల్లో ఉల్లంఘనలు? సాక్షి, హైదరాబాద్: భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కోవాగ్జిన్ ప్రయోగ టీకా తీసుకున్న 9 రోజుల వ్యవధిలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ వలంటీర్ మరణించడం వ్యాక్సిన్ సమర్థతపై కలకలం రేపుతోంది. తమ వ్యాక్సిన్ కారణంగా ఆ వలంటీర్ మరణించలేదని కంపెనీ చెప్పుకున్నప్పటికీ భోపాల్‌లో భారత్ బయోటెక్ నిర్వహించిన ప్రయోగాల తీరు సందేహాలకు తావిస్తోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారత్ బయోటెక్ మూడో దశ ప్రయోగాల నిబంధనలను ఉల్లంఘించిందని, యూనియన్ కార్బైడ్ గ్యాస్ ప్రమాద బాధితుల నుంచి తగిన అనుమతులు తీసుకోకుండానే ప్రయోగ టీకాలు ఇచ్చిందని భోపాల్ దుర్ఘటన బాధితుల కోసం పనిచేస్తున్న కొందరు సామాజిక కార్యకర్తలు ప్రధాని మోదీకి లేఖ రాయడంతో ప్రస్తుతం ఈ ఉదంతం అందరి దృష్టిలోకి వచ్చింది. మా సమ్మతి తీసుకోలేదు: బాధితులు భోపాల్‌లో కోవాగ్జిన్ ప్రయోగాలను నిర్వహించిన పీపుల్స్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ తమ నుంచి ఎలాంటి సమ్మతి తీసుకోలేదని ప్రయోగాల్లో పాల్గొన్న బాధితులు స్వయంగా మీడియా ముందు ఆరోపించారు. చదవడం, రాయడం తెలియని తమతో టీకా ప్రయోగానికి సమ్మతి తీసుకుంటున్నట్లు వీడియో రికార్డింగ్ కూడా నిర్వహించలేదని అన్నారు. అన్ని అనుమతులూ తీసుకున్నాం.. భోపాల్ ఘటనపై స్పందించిన భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ప్రయోగాల్లో మరణించిన వ్యక్తి నుంచి ముందుగానే అన్ని రకాల అనుమతులూ తీసుకున్నామని ప్రకటించింది. అంతేకాకుండా పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆ వ్యక్తి విష ప్రయోగం వల్ల గుండె, ఊపిరితిత్తులు పనిచేయకుండా మరణించాడని ఉందని చెప్పింది. -
రాష్ట్రానికి రావాల్సిన నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీతో విడివిడిగా భేటీ అయ్యారు. నార్త్ బ్లాక్‌లోని కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌ను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో కలిసి సుమారు 50 నిమిషాలపాటు బుగ్గన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటును భర్తీ చేయాలని, వివిధ అంశాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరామని బుగ్గన తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి న్యాయపరంగా రావాల్సిన నిధులపై ఇప్పటికే ఆయా మంత్రులను కలిసి చర్చించామన్నారు. భూసేకరణ, పునరావాసానికి సంబంధించి 1985లో సేకరించిన అంచనాల వివరాలనే గత ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎంత ఖర్చవుతుందో అంత చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని కేంద్రం దృష్టికి రాష్ట్రం తీసుకెళ్లిందని వివరించారు. పోలవరం విషయంలో గత ప్రభుత్వానికి వాస్తవాలు అర్థం కాలేదని తాము భావిస్తున్నామని, అందుకే వివిధ నివేదికలు, ప్రాజెక్టు రిపోర్టులు, స్పెషల్ ప్యాకేజీల విషయంలో కొన్ని ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో కేంద్రానికి వివరాలను సమర్పించారన్నారు. ఓర్వకల్లు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయిన దృష్ట్యా అక్కడి నుంచి ఇండిగో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీని కోరినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు అందించామని, ఆ స్థలాల్లో పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించాలని కోరామన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీ సానుకూలంగా స్పందించారని వివరించారు. కాగా, స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పు కరోనా వారియర్స్ విజయంగా, ప్రజా విజయంగా మంత్రి బుగ్గన అభివర్ణించారు. -
బ్రిటన్ ప్రయాణికులకు కరోనా టెస్ట్
న్యూఢిల్లీ: యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పని సరిచేస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 8 నుంచి జనవరి 30 వ తేదీ వరకు బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులందరూ సొంత ఖర్చుతో తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలంటూ కేంద్రం తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. ప్రయాణానికి 72 గంటల ముందు కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు సర్టిఫికెట్ తెచ్చుకోవాలని మార్గదర్శకాల్లో వెల్లడించారు. కొత్త కరోనా యూకేలో బయటపడి, అత్యంత వేగంగా విస్తరిస్తోండడంతో డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై భారత్ నిషే«ధం విధించింది. ఆ తరువాత నిషేధాన్ని జనవరి 7 వరకు పొడిగించింది. బ్రిటన్ నుంచి భారత్‌కి వారానికి కేవలం 30 విమానాలను నడుపుతున్నారు. జనవరి 23 వరకు ఇలాగే కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రయాణికుల వద్ద తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉండేలా వైమానిక సిబ్బంది చూసుకోవాలి. ఆర్టీ–పీసీఆర్ పరీక్షల ఫలితం వచ్చే వరకు ప్రయాణీకులు వేచి ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి. సంబంధిత రాష్ట్రాల అధికారులను సంప్రదించి కోవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను ప్రత్యేక యూనిట్లలో సంస్థాగత ఐసోలేషన్‌లో ఉంచాలి. పాజిటివ్ పేషెంట్లకు తిరిగి 14వ రోజు మళ్ళీ కోవిడ్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు నెగెటివ్ వచ్చే వరకు వారిని ఐసోలేషన్‌లో ఉంచాలి. పాజిటివ్ వచ్చిన ప్రయాణీకుల పక్క సీట్లలో కూర్చున్న వారినీ, ముందు మూడు వరుసలు వెనక మూడు వరసల్లో ప్రయాణించిన వారిని క్వారంటైన్సెంటర్లలో ఉంచాలని వివరించారు. విమానాశ్రయంలో నెగెటివ్ వచ్చినప్పటికీ 14 రోజుల వరకు హోం క్వారంటైన్‌లోనే ప్రయాణికులు ఉండాలి. రాష్ట్ర లేదా జిల్లా అధికార యంత్రాంగం వీరిని పర్యవేక్షిస్తూ ఉండాలి. ఈ మార్గదర్శకాలు సక్రమంగా అమలు జరిగేందుకు విమానాశ్రయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి. 6 నుంచి యూకేకు విమానాలు ఇండియా–యూకే మధ్య విమాన సేవలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 6వ తేదీన భారత్ నుంచి యూకేకు, 8వ తేదీన యూకే నుంచి ఇండియాకు ఫ్లయిట్లు ప్రారంభమవుతాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రతి వారం 30 విమానాలను నడుపుతాయని చెప్పారు. ఇందులో ఇండియా, యూకేవి తలా పదిహేను విమానాలుంటాయన్నారు. ఈ షెడ్యూల్ జనవరి 23 వరకు కొనసాగుతుందని చెప్పారు. భారత ప్రభుత్వం డిసెంబర్ 23న ఇండియా–యూకేల మధ్య విమాన సర్వీస్‌లను రద్దు చేయడం తెల్సిందే. -
కొత్త విమానాశ్రయాలకు అనుమతివ్వండి: కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రెండోరోజు శనివారం కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశం అయ్యారు. ఢిల్లీలో టీఆర్ఎస్కు పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గృహ నిర్మాణం, పౌర విమానయాన రంగాలకు సంబంధించిన ప్రాజెక్ట్‌లపై చర్చించారు. పట్టణాభివృద్ధికి నిధులు, వరంగల్, సిద్దిపేటలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే రాష్ట్రంలో నూతనంగా ఆరు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సింగిల్ విండోలో అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం మినహా మిగతా విమానాశ్రయాల అభివృద్ధి కోసం భూమిని గుర్తించి, ప్రతిపాదనలను కేంద్రానికి పంపించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన కేసీఆర్ హైదరాబాద్‌లో వరద నష్టానికి ఆర్థిక సాయం చేయాలని కోరిన విషయం విదితమే. 1. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ (బ్రౌన్ ఫీల్డ్) 2. మామునూర్ (వరంగల్) బ్రౌన్ ఫీల్డ్ 3. ఆదిలాబాద్ (గ్రీన్ ఫీల్డ్) 4. జక్రాన్ పల్లి, నిజామాబాద్ (గ్రీన్ ఫీల్డ్) 5. గుడిబండ, మహబూబ్ నగర్ (గ్రీన్ ఫీల్డ్) 6. భద్రాద్రి కొత్తగూడెం (గ్రీన్ ఫీల్డ్) -
విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో స్తంభించిపోయిన ప్రజల జీవన వ్యవస్థ ఇటీవల కేంద్రం అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా సడలింపులు ఇస్తుండటంతో మళ్లీ సాధారణ స్థితికి అడుగులు వేస్తోంది. దీంతో అన్నిరంగాలు మెల్లమెల్లగా పుంజుకుంటుంన్నాయి. ఈ క్రమంలో ప్రజా రవాణా సైతం మళ్లీ పరుగులు పెడుతోంది. దాదాపు రెండు నెలలు తర్వాత మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తుండగా రానురానూ ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో విమానాల రాకపోకలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విమాన ప్రయాణికులకు కేంద్రం శుభ వార్త అందించింది. చదవండి: యూఎస్‌కు నాన్‌స్టాప్ ఫ్లైట్స్: విస్తారా కన్ను మే నుంచి నేటి వరకు భారత విమానయాన సంస్థ ప్రీ-కోవిడ్ దేశీయ ప్రయాణీకుల విమానాలలో 70 శాతం నడిపిస్తుండగా. ఇప్పుడు ఆ సంఖ్యను ఈ రోజు(డిసెంబర్3) నుంచి 80 శాతానికి పెంచినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు. ‘30 వేల ప్రయాణికులతో మే 25న దేశీయ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయి.. నవంబర్ 30వ తేదీ నాటికి ఆ సంఖ్య 2.52 లక్షల గరిష్టాన్ని తాకింది. ఇప్పుడు.. దేశీయంగా ప్రస్తుతం ఉన్న విమానాలు 70 శాతం నుంచి 80 శాతం వరకు నడుపుకోవచ్చు’. అని ట్వీట్ చేశారు. కాగా కరోనా వైరస్ పరిస్థితుల్లోని డిమాండ్ కారణంగా భారత విమానయాన సంస్థలు తమ ప్రీ-కోవిడ్ దేశీయ ప్రయాణీకుల విమానాలలో 70 శాతం వరకు నడపవచ్చని నవంబర్ 11న మంత్రి తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సంఖ్యను మరింత పెంచడంతో మరిన్ని విమానయాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. Domestic operations recommenced with 30K passengers on 25 May & have now touched a high of 2.52 lakhs on 30 Nov 2020. @MoCA_GoI is now allowing domestic carriers to increase their operations from existing 70% to 80% of pre-COVID approved capacity.@PMOIndia @DGCAIndia — Hardeep Singh Puri (@HardeepSPuri) December 3, 2020 -
పది మంది రాజ్యసభ ఎంపీలు ప్రమాణం
సాక్షి, ఢిల్లీ: ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొత్తగా ఎన్నికైన పది మంది రాజ్యసభ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రాజ్యసభ ఛాంబర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కేంద్రమంత్రి హార్దీప్ సింగ్ పూరీ కూడా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన పది మంది సభ్యులలో కర్ణాటకకు చెందిన నారాయణ కొరగప్ప. చదవండి: (రాజీవ్ గాంధీ విగ్రహానికి మసి పూశారు) బ్రిజ్‌లాల్, గీతా అలియాస్ చంద్రప్రభా, రాంజీ, హార్డ్వర్ దుబే, హర్దీప్ సింగ్ పూరి, నీరజ్ శేఖర్, బి ఎల్ వర్మ ,రామ్ గోపాల్ యాదవ్ వీరందరు యూపీ నుంచి ఎన్నికైనారు. నరేష్ బన్సల్ ఉత్తరఖండ్ కి చెందినవారు. కొత్తగా, తిరిగి ఎన్నికైన సభ్యులను స్వాగతించిన రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు వారికి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దల సభకు ఎన్నికైన ఎంపీలపై ప్రజలకు అంచనాలు అధికంగా ఉంటాయని, వారి ఆకాంక్షలకు మించి పనిచేయాలని సూచించారు. రాజ్యసభ పెద్దల సభ కావడంతో, యువకులకు, ప్రజలకు మార్గనిర్ధేశం చేసేందుకు సభ్యులు ప్రవర్తన ఉన్నత ప్రమాణాలతో పాటించడం అత్యవసరం వెల్లడించారు. సభ సంప్రదాయాలను అందరు గౌరవించాలని ఆయన కోరారు. కోవిడ్ మహమ్మారి గురించి ఆందోళన వ్యక్తం చేసిన ఛైర్మన్, ప్రజలకు ఆదర్శంగా నిలిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సభ్యులకు పిలుపునిచ్చారు.మాస్క్ ధరించడం, సురక్షితమైన దూరాన్ని పాటించడం తప్పనిసరి అని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సామాజిక దూరం కన్నా సురక్షిత దూరం అనే పదాన్ని తాను ఇష్టపడుతున్నానని పేర్కొన్నారు. -
మున్సిపల్ గ్రాంట్లు విడుదల చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలకు గ్రాంట్ల కింద విడుదల చేయాల్సిన మొత్తాల్లో కేంద్ర ప్రభుత్వం బకాయిపడిన రూ.581.60 కోట్ల త్వరితగతిన విడుదల చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 2015-16 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను ఏపీలోని మున్సిపాలిటీలకు రూ. 3,635.80 కోట్ల గ్రాంట్లుగా అందించాలని 14వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సు చేసిందని విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. మొత్తం నిధులను పట్టణాలు, నగరాల్లో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాల సంరక్షణ, ఆట స్థలాల అభివృద్ధి వంటి పౌర సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాల్సించి ఉంటుందన్నారు. మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘం మంజూరు చేసిన మొత్తం గ్రాంట్లలో ఇప్పటి వరకు రూ.3054.20 కోట్లు విడుదలైనట్లు ఆయన తెలిపారు. తదుపరి గ్రాంట్ల విడుదలకు అవసరమైన అన్ని నియమ నిబంధనలను ఏపీ ప్రభుత్వం పాటించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేసిన గ్రాంట్లకు సంబంధించి వినిమయ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సమర్పించిందన్నారు. అలాగే ఆర్థిక సంఘం నిర్దేశించిన మూడు ప్రధాన సంస్కరణలు సైతం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ చేసిన వార్షిక అకౌంట్లను సమర్పించిందని వివరించారు. మున్సిపాలిటీల ఆదాయ వనరులను పెంపొందిచేలా పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. నిర్దేశిత స్థాయిలో పౌర సేవల ఉండేలా చర్యలు తీసుకున్నట్లు విజయసాయి రెడ్డి లేఖలో మంత్రికి వివరించారు. ఇదే విషయమై ఏపీ ప్రభుత్వం సైతం కేంద్ర ప్రభుత్వానికి సవివరమైన లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పౌర సేవలు నిరాటంకంగా కొనసాగించేందుకు, వారికి కనీస సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తాలను ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న రూ. 581.60 కోట్ల మున్సిపల్ గ్రాంట్లను త్వరితగతిన విడుదల చేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. బకాయిపడిన గ్రాంట్లను సకాలంలో విడుదల చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను నిరాటంకంగా కొనసాగించేందుకు దోహదం చేస్తుందని లేఖలో ప్రస్తావించారు. -
రాజ్యసభలో వంద దాటిన ఎన్డీయే బలం
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి సహా 9 మంది సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికవడంతో రాజ్యసభలో ఎన్డీయే బలం 100 దాటింది. ప్రధాన విపక్షం కాంగ్రెస్ సభ్యుల సంఖ్య అత్యల్పంగా 38కి పడిపోయింది. తాజా విజయాలతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 92కి చేరింది. మిత్రపక్షం జేడీయూకి ఎగువ సభలో ఐదుగురు సభ్యులున్నారు. వీరు కాకుండా, మిత్రపక్షాలు ఆర్పీఐ–అఠావలే, అసోం గణపరిషత్, మిజో నేషనల్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, పీఎంకే, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్లకు ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభ సభ్యులున్నారు. దీంతో ఎగువ సభలో ఎన్డీయే బలం 104కి చేరింది. ఇవి కాకుండా, నలుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతు కూడా ప్రభుత్వానికి లభిస్తుంది. అలాగే, కీలక బిల్లుల ఆమోదానికి, అవసరమైనప్పుడు అంశాలవారీగా ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు కొన్ని ఉన్నాయి. వాటిలో అన్నాడీఎంకేకు 9 మంది, బీజేడీకి 9 మంది సభ్యులు ఉన్నారు. ఇన్నాళ్లు రాజ్యసభలో కీలక, ప్రతిష్టాత్మక బిల్లుల ఆమోదానికి ఇబ్బంది పడిన ప్రభుత్వానికి తాజా విజయాలతో ఆ సమస్య తొలగనుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 242. యూపీ, ఉత్తరాఖండ్‌ల్లో జరిగిన తాజా ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 3 స్థానాలను, బీఎస్పీ 1 స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం యూపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో బీజేపీకి చెందిన నీరజ్ శేఖర్, అరుణ్ సింగ్, గీతా షాఖ్య, హరిద్వార్ దూబే, బ్రిజ్‌లాల్, బీఎల్ వర్మ, సీమా ద్వివేదీ ఉన్నారు. ఎస్పీ నుంచి రామ్‌గోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి రామ్‌జీ గౌతమ్ కూడా ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్ నుంచి బీజేపీ తరఫున నరేశ్ బస్వాల్ ఎన్నికయ్యారు. -
స్టాంపింగ్ తంటా.. మధు యాష్కీ ట్వీట్ వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు స్టాంప్ వేయడానికి ఉపయోగించే సిరా నాణ్యతపై ఆందోళకర విషయం వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు వేసే స్టాంపింగ్ తరువాత తన చేతిపైవచ్చిన కెమికల్ రియాక్షన్ గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీగౌడ్ ట్వీట్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఉపయోగిస్తున్న ఇంక్ కారణంగా తన చేతికి ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ట్యాగ్ చేశారు. దీన్ని పరిశీలించాలంటూ సంబంధిత ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందిస్తూ హర్దీప్ పూరి ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. మంత్రి సత్వర స్పందనపై మధు యాష్కీ సంతోషం వ్యక్తం చేశారు. తనలాంటి అనుభవం మరో ప్రయాణికుడికి రాకూడదని కోరుకున్నారు. అటుఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ స్పందించిన ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు మధుయాష్కీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి విలయంతరువాత విదేశీ విమాన ప్రయాణీకులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల క్వారంటైన్ నిబంధనల కనుగుణంగా కొన్ని విమానాశ్రయాలలో స్టాంపింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా గడిచిన 24 గంటల్లో 74,441 కరోనా కేసులతో, ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 66,23,815కు చేరింది. మరణించిన వారి సంఖ్య 1,02,695 గా ఉంది. Dear @HardeepSPuri Ji, can you please look into the chemical being used at Delhi airport for stamping on passengers coming from abroad? Yesterday I was stamped at @DelhiAirport and this is how my hands look now. pic.twitter.com/Gt1tZvGc8L — Madhu Goud Yaskhi (@MYaskhi) October 4, 2020 -
పూర్తి నివేదికతో రమ్మన్నారు: కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టును ‘ఉడాన్’ పథకంలో చేర్చాలని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీని కోరినట్లు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) తెలిపారు. అదే విధంగా పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రూ.2537.81 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రితో సోమవారం భేటీ అయిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. (మున్సిపాలిటీల్లో వార్డుకో ఆఫీసర్!) ఈ సందర్భంగా.. కేసీఆర్ సర్కారు ప్రతిపాదించిన నూతన పురపాలక చట్టంలోని అంశాలను హర్దీప్సింగ్ పూరికి వివరించినట్లు తెలిపారు. ఇందుకు స్పందించిన ఆయన.. అక్టోబర్‌లో మరోసారి పూర్తి నివేదికతో రావాలని సూచించినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు స్వచ్ఛ భారత్, అమృత్ పథకం నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ రూ.784 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇళ్ల నిర్మాణం కోసం ఇవ్వాల్సిన రూ.1184 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. -
అందుకే అదానీకి ఇచ్చాం : కేంద్రమంత్రి వివరణ
తిరువనంతపురం: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించే నిర్ణయానికి సంబంధించిన వాస్తవాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆరోపించారు. విమానాశ్రయ ప్రైవేటీకరణపై కేరళ సీఎం పినరయి విజయన్ వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ట్విటర్ ద్వారా స్పందించారు. అంతర్జాతీయ బిడ్డింగ్ ప్రక్రియలో కేరళ ప్రభుత్వం అర్హత సాధించలేదంటూ వరుస ట్వీట్లలో ఈ నిర్ణయంపై వివరణ ఇచ్చారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) రీతిలో 50 ఏళ్లుగా లీజుకు ఇవ్వడానికి కేంద్రం పారదర్శకంగా నిర్ణయ తీసుకుందని (2019లో) వివరించారు. అదానీ ప్రయాణీకుడికి 168 రూపాయల చొప్పున కోట్ చేయగా, కేరళ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ (కెఎస్ఐడీసీ) 135 రూపాయల చొప్పున, మూడవ క్వాలిఫైయింగ్ బిడ్డర్ 63 రూపాయలు కోట్ చేశారన్నారు. 10 శాతం తేడా ఉండి ఉంటే ఈ బిడ్డింగ్ కేరళకే దక్కి ఉండేదని 19.64 శాతం ఉన్న నేపథ్యంలో అదానీని ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. (ప్రైవేటికరణకు ఒప్పుకోం : కేరళ సీఎం) కాగా ప్రధానమంత్రి మోదీ తనకు ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని విజయన్ ఆరోపించారు. స్పెషల్ పర్సస్ వెహికిల్(ఎస్పీవీ)కి ఇవ్వాలని కేరళ పలుసార్లు తాను విజ్ఙప్తి చేసినట్టు విజయన్ గుర్తు చేశారు. 2003లో విమానయానశాఖ ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా కేబినెట్ నిర్ణయం ఉందంటూ ప్రధానికి రాసిన ఒక లేఖలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అటు కేంద్ర నిర్ణయాన్ని కేరళ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండగా, కాంగ్రెస్ నేత తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ స్వాగతించడం గమనార్హం. It was stipulated that if the Kerala State Industrial Development Corporation (KSIDC) bid comes within the 10% range of the winning bid, they would be awarded the work. There was a difference of 19.64% between them & the next bidder when bids were open. — Hardeep Singh Puri (@HardeepSPuri) August 20, 2020 Winning bid quoted ₹168 per passenger, KSIDC quoted ₹135 per passenger & third qualifying bidder was at ₹63 per passenger. Thus, despite special provision of RoFR being given to GoK, they could not qualify in international bidding process carried out in a transparent manner. — Hardeep Singh Puri (@HardeepSPuri) August 20, 2020 -
బెస్ట్ సిటీ ఇండోర్
న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా నాలుగో ఏడాది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఎంపికైంది. ఆ తర్వాతి స్థానాల్లో సూరత్, నవీముంబై నిలిచాయి. అలాగే, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాసి ‘ఉత్తమ గంగా పట్టణం’గా మొదటి స్థానంలో నిలిచింది. 100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీలో ఛత్తీస్‌గఢ్ అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉన్నాయి . రాజధానిలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాలు–2020 వివరాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్సింగ్ పూరి వెల్లడించారు. దేశ రాజధానిలోని ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (రాజ్‌పథ్, ప్రముఖులుండే ల్యుటెన్స్ ప్రాంతం) పరిశుభ్రమైన రాజధాని నగరంగా ఎంపికయింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 97 గంగాతీర నగరాలతోపాటు, 1.87 కోట్ల మంది పౌరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. విజేతలకు ప్రధాని అభినందనలు స్వచ్ఛ్ సర్వేక్షణ్ సర్వేలో మొదటి స్థానాల్లో నిలిచిన వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగతా నగరాలు కూడా మెరుగైన పరిశుభ్రత కోసం కృషి చేయాలని కోరారు. దీంతో కోట్లాది మందికి లాభం కలుగుతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్షకు పైగా జనాభా కలిగినవి) 1. ఇండోర్ 2. సూరత్ 3. నవీముంబై 4. విజయవాడ 5. అహ్మదాబాద్ అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్ష కంటే తక్కువ జనాభా ఉన్నవి) 1. కరాడ్ 2. సస్వద్ 3. లోనావాలా పరిశుభ్రమైన రాష్ట్రం(100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీ) 1. ఛత్తీస్‌గఢ్ 2. మహారాష్ట్ర 3. మధ్యప్రదేశ్ పరిశుభ్రమైన రాజధాని.. 1. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కంటోన్మెంట్లలో పరిశుభ్రమైనవి 1. జలంధర్ కంటోన్మెంట్ బోర్డ్ 2. ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్ 3. మీరట్ కంటోన్మెంట్ బోర్డ్ ► పౌరుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్ ‘ఉత్తమ మెగా సిటీ’గా ఎంపికైంది. ► పౌరుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఉత్తమ కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్ ఎంపికైంది. ► ఇన్నోవేషన్, ఉత్తమ విధానాలు ఆచరిస్తున్న గుజరాత్ రాజధాని గాంధీనగర్ మొదటి ర్యాంకు సాధించింది. -
దేశంలోనే తొలి స్థానంలో ఇండోర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్-2020’ అవార్డులు ప్రకటించింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా వరుసగా నాలుగో సారి ఇండోర్ తొలి స్థానాన్నే కైవసం చేసుకోవడం విశేషం. రెండో స్థానంలో సూరత్(గుజరాత్), మూడో స్థానంలో ముంబై(మహారాష్ట్ర) నిలిచాయి. మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి. గురువారం 'స్వచ్ఛ మహోత్సవ్' కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ఈ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా జలందర్ కాంత్ దేశంలోనే అత్యంత పరిశుభ్రత కల కంటోన్మెంట్‌గా ప్రకటించారు. పరిశుభ్రత గల పట్టణంగా వారణాసి చోటు దక్కించుకుంది. 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డు, 92 గంగా సమీపంలోని పట్టణాల నుంచి మొత్తం 1.87 కోట్ల మంది ఇందుకు సంబంధించిన సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే 28 రోజుల పాటు చేపట్టగా అనంతరం ర్యాంకులు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. ఇండోర్ మళ్లీ తన ఆధిక్యతను ప్రదర్శించడంపై ఆ ప్రాంత ఎంపీ శివరాజ్ చౌహాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి ప్రజలు తమ నగర శుభ్రత పట్ల చూపిన అంకిత భావాన్ని కొనియాడారు. (రూల్స్ బ్రేక్: నడిరోడ్డుపై పెళ్లికొడుక్కి...) ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులు దేశంలో పరిశుభ్ర రాష్ట్రాల్లో జార్ఖండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకోగా తెలంగాణ కూడా టాప్ 10లో చోటు సంపాదించుకుంది. దేశంలోనే పరిశుభ్రత గల నగరంగా విజయవాడ నాలుగో స్థానం దక్కించుకుంది. తిరుపతి ఆరో ర్యాంకు, విశాఖపట్నం తొమ్మిదో ర్యాంకు సాధించింది. బెస్ట్ మెగా సిటీ కేటగిరీలో రాజమండ్రి చోటు సంపాదించుకుంది. దీనితో పాటు ఒంగోలు, కాకినాడ, కడప, తెనాలి, చిత్తూరు, హిందూపురం, తాడిపత్రి కూడా స్థానం దక్కించుకున్నాయి -
చిమ్మచీకట్లో మిన్నంటిన రోదనలు
కోళీకోడ్, న్యూఢిల్లీ: జోరున కురుస్తున్న వానలో 35 అడుగుల లోయలో రెండు ముక్కలైన విమానం మధ్యలో నలిగిపోయిన క్షతగాత్రుల వేదన వర్ణనాతీతం. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విమాన ప్రయాణికులందరూ ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ఎటు చూసినా రోదనలు, అరుపులు కేకలు తప్ప అసలేం జరిగిందో అర్థం కాలేదని, కళ్ల ముందు చిమ్మ చీకటి తప్ప ఏమీ కనిపించలేదని క్షతగాత్రులు చెబుతున్నారు. 184 మంది ప్రయాణికులతో దుబాయ్నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ల్యాండింగ్ అయిన సమయంలో పట్టుతప్పి పక్కనే ఉన్న లోయలోకి జారిన విషయం తెలిసిందే. విమానం రెండు ముక్కలు కావడంతో వాటి మధ్య నలిగిపోయిన క్షతగాత్రుల మనోవేదన అంతా ఇంతా కాదు. ‘‘మొదట పెద్ద శబ్దం వినిపించింది. ఆ వెంటనే తోటి ప్రయాణికులు అరుపులు వినిపించాయి’’ అని రంజిత్ అనే ప్లంబర్ చెప్పారు. ‘‘విమానం ఒక్కసారిగా కుదుపుకి లోనైనట్టుగా అనిపించింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. అది తలచుకుంటే ఇంకా నా శరీరం వణుకుతోంది. చాలామంది రక్తాలోడుతూ కనిపించారు’’ అని స్వల్పంగా గాయపడిన మరో ప్రయాణికుడు రంషద్ చెప్పారు. ‘‘ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర ద్వారాలు తెరుచుకున్నాయి. ఆందోళనకి లోనైన ప్రయాణికులు అందులోంచి కిందకి దూకడం కనిపించింది’’ అని అషిక్ అనే మరో క్షతగాత్రుడు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరు మరణించారు. 149 మంది క్షతగాత్రుల్లో 23 మంది పరిస్థితి విషమంగా ఉందని కేరళ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీకి బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదాల్లో అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్‌ను శనివారం స్వాధీనం చేసుకొని దర్యాప్తు నిమిత్తం ఢిల్లీకి పంపినట్టుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) వెల్లడించింది. పౌర విమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఘటనాస్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ‘‘ప్రమాదానికి గురైన ఎయిరిండియా బోయింగ్ 737ఐఎక్స్ 1344 విమానానికి చెందిన డిజిటల్ ఫ్లయిట్ డేటా రికార్డర్ (డీఎఫ్‌డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)లు లభించాయి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దీనిపై దర్యాప్తు జరుపుతోంది’’ అని పూరి ట్వీట్ చేశారు. విమానంలో ఇంధనానికి ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. డీఎఫ్డీఆర్లో విమాన వేగం, ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది, ఫ్యూయల్ ఫ్లో వంటివి 25 గంటల సేపు రికార్డు చేస్తుంది. ఇక కాక్‌పిట్ వాయిస్ రికార్డులో పైలట్లు మాట్లాడుకున్న మాటలని రెండు గంటల సేపు రికార్డు చేయగల సామర్థ్యం ఉంటుంది. వీటి సాయంతో విమాన ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకోవచ్చు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం చెరో రూ.10 లక్షలు ప్రకటించాయి. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి రూ.50 వేలు అందిస్తామని కేంద్ర మంత్రి పూరి వెల్లడించారు. క్షతగాత్రులకి వైద్య చికిత్సకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. హోరున కురుస్తున్న వానలో కూడా సహాయ చర్యలకు ముందుకు వచ్చిన స్థానికుల్ని సీఎం విజయన్ ప్రశంసించారు. విమాన ప్రమాదంలో కరోనా భయం విమాన ప్రమాద మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉందని వైద్య పరీక్షల్లో తేలడంతో కలకలం రే గింది. విమాన ప్రమాద సహాయ చర్యల్లో పాల్గొన్న వారందరూ తర్వాత సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లాలని కేరళ వైద్య శాఖ మంత్రి కె.కె. శైలజ ఆదేశించారు. పెళ్లి కోసం తిరిగివస్తూ... పెళ్లి ఖరారు కావడంతో ఆనందంగా దుబాయ్ నుంచి తిరిగొస్తున్న యువకుడు విధి వక్రించి విమానప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కేరళలోని మొళ్లూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రియాస్ (24), సోదరుడు నిజాముద్దీన్‌తో కలిసి దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. కుటుంబసభ్యులు ఈ నెలలో పెళ్లి నిశ్చయించడంతో అన్నదమ్ములిద్దరూ ఎయిర్ ఇండియా విమానంలో స్వరాష్ట్రానికి బయలుదేరారు. విమానం ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కలైన దుర్ఘటనలో కాబోయే పెళ్లికొడుకు రియాస్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త తెలియగానే ఆ కుటుంబం తీవ్రవిషాదంలో మునిగిపోయింది. తీవ్రంగా గాయపడ్డ అతని సోదరుడు నిజాముద్దీన్ కోళీకోడ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కో–పైలట్ భార్య నిండుగర్భిణి కోళీకోడ్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన కో– పైలట్ అఖిలేష్ కుమార్(32)ది విషాదగాథ. ఉత్తరప్రదేశ్‌లోని మథురకు చెందిన అఖిలేష్‌కు 2018లో పెళ్లయింది. ఇప్పుడు ఆయన భార్య నిండుగర్భిణి. మరో 15 రోజుల్లో డెలివరీ ఉంది. ఇంతలో అఖిలేష్ మరణవార్త రావడంతో వారి కుటుంబం షాక్‌కు లోనైంది. భార్య మేఘకు భర్త మరణవార్త ఇంకా చెప్పలేదు. ‘అఖిలేష్ చాలా మర్యాదస్తుడు. 2017లో ఎయిర్ ఇండియాలో చేరాడు. అతని భార్య గర్భిణి. మరో 15 రోజుల్లో డెలివరీ ఉంది’అని బంధువు వాసుదేవ్ తెలిపారు. మొదట అఖిలేష్‌కు సీరియస్‌గా ఉందని ఫోన్ వచ్చిందని, తర్వాత చనిపోయాడని చెప్పారని తండ్రి తులసీరామ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రమాదానికి కారణాలివేనా ? కోళీకోడ్‌లో విమానం దిగిన రన్ వే 10 పొడవు 2,700 మీటర్లు ఉంది. అయితే రన్‌వేకి వెయ్యి మీటర్లు ముందు విమానం దిగిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. విమానం ల్యాండింగ్ సమయంలో ఈదురుగాలులు, జోరుగా కురుస్తున్న వాన నేపథ్యంలో 2 కి.మీ.కి మించి పైలట్లకు కనిపించే పరిస్థితి లేదన్నారు. విమానం రన్ వే కంటే వెయ్యి మీటర్ల ముందర దిగి అదుపు తప్పి లోయలోకి జారిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ల్యాండింగ్ సమయంలో విమానం అత్యంత వేగంతో ప్రయాణిస్తోందని ఫ్లయిట్ రాడార్ చెబుతోంది. రన్ వే ఉపరితలానికి 450 అడుగుల ఎత్తులో విమానం గంటకి 350కి.మీ. వేగంతో ప్రయాణం చేస్తోందని, ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో అంత వేగం మంచిది కాదని ఎయిర్ సేఫ్టీ నిపుణుడు కెప్టెన్ అమర్ సింగ్ చెప్పారు. మొదటిసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో గంటకి 276 కి.మీ. వేగంతో ప్రయాణించిందని, రెండోసారి పైలట్ ఎందుకు వేగం పెంచారో అర్థం కాలేదని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. అందులోనూ టేబుల్ టాప్ రన్ వేపై సాధారణ రన్ వేలపై విమానాలను దించినట్టుగా ప్రయత్నించకూడదని ఆయన అన్నారు. టేబుల్ టాప్ రన్ వేలు ప్రమాదకరం కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయం దుర్ఘటనతో టేబుల్ టాప్ రన్ వేలు ఎంత సురక్షితం అన్న చర్చ మొదలైంది. కర్ణాటకలోని మంగళూరులో పదేళ్ల క్రితం ఇదే తరహాలో విమాన ప్రమాదం జరిగి 160 మంది మరణించినప్పుడే ఈ టేబుల్ టాప్ రన్ వేలపై విమానాల రాకపోకలు కత్తి మీద సామేనని నిపుణులు హెచ్చరించారు. అప్పట్లో మంగళూరు విమాన ప్రమాదంపై విచారణ జరిపిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ బీఎన్ గోఖలే కొండ ప్రాంతాల్లో నిర్మించిన విమానాశ్రయాలు ఎంతమాత్రం సురక్షితం కాదని తన నివేదికలో వెల్లడించారు. కోళీకోడ్ విమానాశ్రయం రన్ వే అచ్చంగా ఒక టేబుల్ ఉపరితలం మాదిరిగా ఉండే అతి చిన్న రన్‌వేలపై విమానాలను దించడం అతి పెద్ద సవాల్. పైలట్లు ఎంత నైపుణ్యం కలిగన వారైనా టేబుల్ టాప్ రన్ వేలపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌లో ఎలాంటి ప్రమాదాలైనా చోటు చేసుకోవచ్చునని ఆ నివేదికలో పేర్కొన్నారు. కోళీకోడ్ విమానాశ్రయంలో రన్ వేకి రెండు వైపుల అదనంగా స్థలం లేదని, ఇలాంటి చోట్ల బోయింగ్ విమానాలు దిగడానికి అనుకూలం కాదని పదేళ్ల క్రితమే ఎయిర్ మార్షల్ గోఖలే గట్టి హెచ్చరికలే పంపారు. దేశంలో అయిదు మన దేశంలో అయిదు ప్రాంతాల్లో టేబుల్ టాప్ రన్ వేలు ఉన్నాయి. కోళీకోడ్ (కేరళ), మంగళూరు (కర్ణాటక), షిమ్లా (హిమాచల్‌ప్రదేశ్), పాక్యాంగ్ (సిక్కిం), లెంగ్పూయీ (మిజోరం)లలో ఈ తరహా రన్ వేలు ఉన్నాయి. ఈ రన్ వేలపై షార్ట్ ఫీల్డ్ పెర్ఫార్మెన్స్ (ఎస్ఎఫ్పీ) సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విమానాలే దిగగలవు. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడ్డ విమాన సీట్లు. -
నేటి నుంచి యూఎస్‌కు విమానాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించే దిశగా భారత ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. విమాన సర్వీసు లను ప్రారంభించేందుకు వీలుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీలతో ప్రత్యేక ద్వైపాక్షిక ఒడంబడికలను కుదుర్చుకుంది. త్వరలో యూకేతోనూ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఈ వివరాలను విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. పారిస్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, ముంబైలకు జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు ఎయిర్ ఫ్రాన్స్ సంస్థ 28 విమాన సర్వీసులను నడుపుతుంది. అలాగే, ఈరోజు నుంచి 31 వరకు ఇరుదేశాల మధ్య అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 18 విమాన సర్వీసులను నడుపుతుంది. ఆ సంస్థ ఢిల్లీ– నెవార్క్‌ల మధ్య ప్రతీరోజు ఒక సర్వీసును, ఢిల్లీ– శాన్‌ఫ్రాన్సిస్కోల మధ్య వారానికి మూడు సర్వీసులను నడుపుతుంది. యూకేతో ఒప్పందం కుదిరిన తరువాత.. ఢిల్లీ, లండన్ల మధ్య రోజుకు రెండు సర్వీసులు ఉంటాయని పురి తెలిపారు. జర్మనీ నుంచి లుఫ్తాన్సా సర్వీసులుంటాయన్నారు. భారత్ నుంచి ఎయిర్ ఇండియా సంస్థ ఆయా దేశాలకు విమాన సర్వీసులను నడుపుతుందని వివరించారు. అంతర్జాతీయ సర్వీసులపై భారత్ ఇప్పటికే యూఏఈతో ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో దీపావళి నాటికి దేశీయ ట్రాఫిక్ కరోనా ముందున్న స్థాయితో పోలిస్తే.. 55 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. భౌతిక దూరంపై ప్రయాణికుల ఆందోళన కరోనా సమయంలో కొందరు విమాన ప్రయాణికులు భౌతిక దూరం నిబంధనను సరిగ్గా పాటించకపోవడాన్ని మిగతావారు ప్రధాన సమస్యగా భావిస్తున్నారని ఒక సర్వేలో తేలింది. జూన్ 20 నుంచి జూన్ 28 వరకు ఆన్లైన్లో సుమారు 25 వేల మంది ప్రయాణికులను సర్వే చేశామని ఇండిగో ప్రకటించింది. -
అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తితో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు సుదీర్ఘ విరామం అనంతరం ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి మూడు విదేశీ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని పౌరవిమానయాన మంత్రి మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం తెలిపారు. మొదటగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు విదేశీ విమాన సర్వీసులు నడిపేందుకు మూడు దేశాలతో చర్చలు జరిపామని చెప్పారు. శుక్రవారం అమెరికా నుంచి, శనివారం ఫ్రాన్స్ నుంచి భారత్‌కు అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభమవుతాయని అన్నారు. జులై 17 నుంచి జులై 31 వరకూ భారత్ అమెరికా మధ్య 18 యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాలు నడుస్తాయని వెల్లడించారు. జులై 18 నుంచయి ఆగస్ట్ 1 వరకూ పారిస్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూర్ మధ్య ఎయిర్ ఫ్రాన్స్ 28 విమానాలను నడపనుందని వెల్లడించారు. జర్మనీతో కూడా విమాన సర్వీసులపై సంప్రదింపులు జరిపామని చెప్పారు. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం కొలిక్కివచ్చిందని మంత్రి హర్ధీప్‌సింగ్ తెలిపారు. విదేశీ విమాన సర్వీసులపై ఈ నిర్ణయంలో పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆయా దేశాలతో ఒప్పందాలకు అనుగుణంగా విదేశీ విమాన సేవలను పునరుద్ధరించామని మంత్రి తెలిపారు. చదవండి : కరోనా వైరస్ : రికవరీ అనంతరం అవే లక్షణాలు! -
కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారితో ఇబ్బందిపడుతున్న కార్మికుల కోసం మస్కట్ నుంచి హైదరాబాద్‌కు విమానాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని విజ్ఞప్తి చేశారు. నిత్యావసరాలు, జీతాలు లేక అక్కడ భారతీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ట్విటర్లో పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే కార్మికుడు మస్కట్‌లో 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అయితే మూడు నెలలుగా పని, ఆహారం, జీతాలు లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వీడియో తీసి కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడు. భారత్‌కు వద్దామనుకుంటే హైదరాబాద్‌కు విమానాలు లేక కార్మికులు అవస్థలుపడుతున్నారని పేర్కొన్నాడు. Request Hon’ble Civil Aviation Minister @HardeepSPuri Ji to kindly arrange for flights from Muscat to Hyderabad 🙏 Apparently fellow Indians are in distress without wages & essentials https://t.co/wu3xc8BSS9 — KTR (@KTRTRS) June 6, 2020