న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశంలోకి దూసుకెళ్తూనే ఉన్నాయి. గత ఏడాది మే నుంచి ఇప్పటిదాకా.. కేవలం 18 నెలల్లోనే లీటర్ పెట్రోల్ రూ.35.98, డీజిల్ చొప్పున రూ.26.58 ధరలు పెరిగాయి. చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటేసింది. డీజిల్ సైతం రూ.100 మార్కును అధిగవిుంచింది. అంతర్జాతీయంగా చమురు ధరలను బట్టి భారత్‌లోనూ పెంచకం తప్పడం లేదని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.
కానీ, అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడల్లా కేంద్రంం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ పెంచేస్తుండడంతో ఆ ప్రయోజనం వినియోగదారులకు దక్కడం లేదు. ప్రభుత్వం ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ.32.90, డీజిల్‌పై 31.80 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తోంది. పెట్రో ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం అంటే మన కాళ్లను మనం నరుక్కున్నట్లే అని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ పురి వ్యాఖ్యానించారు. ఈ సొమ్ముతోనే ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్, సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
మరో 35 పైసలు పెంపు
దేశంలో శనివారం సైతం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 35 పైసల చొప్పున పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.24కు, డీజిల్ రూ.95.97కు ఎగబాకింది.
Comments
Please login to add a commentAdd a comment