Coronavirus Vaccine
-
మోదీకి డొమినికా జాతీయ పురస్కారం
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి విజృంభించి దేశాన్ని కలావికలం చేస్తున్న వేళ భారత్ అందించిన ఆపన్నహస్తంతో తెరిపినపడిన డొమినికా దేశం తన కృతజ్ఞత చాటుకునేందుకు సిద్ధపడింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సాయానికి గుర్తుగా మోదీకి ‘ది డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’ను ప్రదానం చేయనున్నట్లు ది కామన్వెల్త్ ఆఫ్ డొమినికా గురువారం ప్రకటించింది. భారత ప్రభుత్వ ఉదార గుణాన్ని స్మరించుకుంటూ ఆ దేశ ప్రధాని హోదాలో ఉన్న మోదీకి తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు డొమినికన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. గయానాలోని జార్జ్‌టౌన్ పట్టణంలో నవంబర్ 19 నుంచి 21వ తేదీదాకా జరిగే ఇండియా–కరికోమ్ శిఖరాగ్ర సదస్సులో మోదీకి ఈ అవార్డ్‌ను అందజేస్తారు. ‘‘2021 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ఆదేశాలతో భారతసర్కార్ మాకు 70,000 డోసుల ఆస్ట్రాజెనికా కోవిడ్19 వ్యాక్సిన్లు అందించింది. మా స్థాయికి అది పెద్ద సాయం కావడంతో వాటిలో కొన్నింటిని మా పొరుగు దేశాలకూ సాయంగా అందించగలిగాం. ఆరోగ్యం, వైద్యం, సమాచార సాంకేతిక రంగాల్లోనూ భారత్ మాకు ఎంతో సాయపడింది. అంతర్జాతీయ స్థాయిలో వాతావరణమార్పు నిరోధక చర్యలు చేపట్టడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకను గుణంగా ముందడుగు వేయడంలో మాకు వెన్నంటి నిలిచింది’’ అని ఆ దేశ ప్రధాని కార్యాలయం కొనియాడింది. -
COVID-19: సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ వేవ్
సింగపూర్: సింగపూర్‌లో కోవిడ్–19 మరోసారి విజృంభిస్తోది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కేవలం వారం వ్యవ ధిలో 25,900 కేసులు నమోద య్యాయి. దీంతో, ప్రభుత్వం మాస్క్‌లు ధరించాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆరోగ్యమంత్రి ఓంగ్ యె కుంగ్ శనివారం ఈ వివరాలను వెల్లడించారు. ‘దేశంలో కోవిడ్ వేవ్ ప్రారంభ దశలో ఉంది. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో, జూన్ మధ్య నుంచి చివరి వరకు భారీగా కేసులు నమోదవుతాయి’ అని చెప్పారు. గత వారంలో మే 5 నుంచి 11వ తేదీ వరకు కేసులు 25,900పైగా నమోదయ్యాయి. అంతకు ముందు వారంలో 13,700 కేసులొచ్చాయి. ఆ వారంలో రోజుకు 181 నుంచి 250 మంది ఆస్పత్రుల్లో చేరారు. అయితే, ఐసీయూ కేసులు సరాసరిన రోజుకు మూడు మాత్రమే ఉన్నాయని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లు పైబడిన, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధాశ్రమాల్లో ఉండేవారు అదనపు డోసు కోవిడ్ టీకా తీసుకోవాలని మంత్రి సూచించారు. -
అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా తాము సరఫ రా చేసిన కోవిడ్ టీకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు యూకేకు చెందిన ఫార్మా కంపెనీ అ్రస్టాజెనెకా వెల్లడించింది. కోవిడ్ అప్డేటెడ్ వ్యాక్సిన్లు పెద్ద సంఖ్యలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయని, అందుకే వాణిజ్య కారణాలతో తమ టీకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేసింది. అ్రస్టాజెనెకా కంపెనీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చే సింది. అస్ట్రాజెనెకా టీకాతో దు్రష్పభావాలు తలెత్తుతున్నట్లు కోర్టుల్లో కేసులు నమోదవడంతో న్యాయ విచారణ జరుగుతోంది. -
వీడిన మిస్టరీ.. వార్న్ ఆకస్మిక మరణానికి కారణం అదేనా!
ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన షేన్ వార్న్ గతేడాది థాయ్‌లాండ్ వెకేషన్లో ఉన్నప్పుడు విల్లాలోనే గుండెపోటుతో చనిపోయాడు. అతని మరణం అప్పట్లో మిస్టరీగా ఉండిపోయింది. పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించిన వైద్యులు వార్న్ గుండెపోటు వల్ల మరణించాడని ద్రువీకరించారు. ఇక వార్న్ మరణం వెనుక ఉన్న మిస్టరీ తాజాగా వీడినట్లు తెలుస్తోంది. వార్న్ మరణానికి కారణం గుండెపోటు అయినప్పటికి పరోక్షంగా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడమేనని భారత సంతతికి చెందిన డాక్టర్ ఆసీమ్ మల్హోత్రా తాజాగా మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. డాక్టర్ ఆసీమ్ మల్హోత్రాతో పాటు ఆస్ట్రేలియా మెడికల్ ప్రొఫెషనల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ క్రిస్ నిల్ షేన్ వార్న్ మరణం వెనుక ఉన్న కారణంపై రీసెర్చీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ''వార్న్ మరణించడానికి తొమ్మిది నెలల ముందు కోవిడ్ వ్యాక్సిన్ అయిన పీ-ఫైజర్(PFizer mRNA) వ్యాక్సిన్‌ను రెండు డోసులు తీసుకున్నాడు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వార్న్ తన ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టకపోగా.. మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడంతో పాటు స్మోకింగ్ చేసినట్లు తేలింది. దీనివల్ల వ్యాక్సిన్ ప్రభావం మందగించింది. అందువల్ల గుండెల్లో రక్తనాళాలు మూసుకుపోయాయి. దీనివల్లే అతను కార్డియాక్ అరెస్టుకు గురయ్యి చనిపోయాడు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు కూడా ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువగా ఉండడం వల్ల అతని బాడీలో బయోమెకానిజమ్ సరిగ్గా లేదు. ఇది కూడా వార్న్ మరణానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ నిబంధనలు సరిగ్గా పాటించి ఉంటే మాత్రం వార్న్ చనిపోయే అవకాశాలు తక్కువగా ఉండేవని'' అభిప్రాయపడ్డారు. కాగా టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఈ స్పిన్ మాంత్రికుడు 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 194 వన్డేల్లో 293 వికెట్లు.. ఓవరాల్‌గా వెయ్యి వికెట్లు తీసిన ఘనత వార్న్ సొంతం. చదవండి: #ShaneWarne: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు -
కోవిన్ పోర్టల్.. ఫుల్ సేఫ్
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం తీసుకొచ్చిన కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన టీకా లబ్ధిదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ వార్తలకు ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. నోడల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) ఈ వ్యవహారాన్ని సమీక్షిస్తోందని వెల్లడించింది. పోర్టల్‌లోని డేటా భద్రంగా ఉందని, డేటా ప్రైవసీ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. డేటా లీక్ అంటూ జరుగుతున్న ప్రచారం ఆకతాయిల పనేనని పేర్కొంది. డేటా లీక్ వార్తలపై సెర్ట్–ఇన్ వెంటనే స్పందించిందని, కోవిన్ యాప్‌పై లేదా డేటాబేస్‌పై ప్రత్యక్షంగా దాడి జరిగినట్లు ఆధారాలు లభించలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెలిగ్రామ్ యాప్‌లో ఫోన్ నెంబర్లు ఎంట్రీ చేస్తే కోవిన్ యాప్ వివరాలను చూపిస్తోందని చెప్పారు. అంతేతప్ప వ్యాక్సిన్ లబ్ధిదారుల వివరాలు లీక్ కాలేదని స్పష్టం చేశారు. కాగా, కోవిన్ పోర్టల్ నుంచి ముఖ్యమైన డేటా లీకైనట్లు తెలుస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మొత్తం డేటా మేనేజ్మెంట్ వ్యవస్థ గోప్యతపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సోమవారం డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? కరోనా టీకా తీసుకున్న వారి వ్యక్తిగత డేటా కోవిన్ పోర్టల్‌లో నిక్షిప్తమైన సంగతి తెలిసిందే. టీకా లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు ఆన్లైన్ మెసెంజర్ యాప్ ‘టెలిగ్రామ్’లో కనిపిస్తున్నట్లు కొందరు ట్విట్టర్ ఖాతాదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. ఈ వ్యవహారంపై కొన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి. ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత లేకపోవడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశాయి. దాంతో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించి, వివరణ ఇచ్చింది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా మాత్రమే కోవిన్ పోర్టల్‌లోని తమ వివరాలను లబ్ధిదారులు తెలుసుకోవచ్చని పేర్కొంది. లబ్ధిదారులు మినహా ఇతరులు తెలుసుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారుల చిరునామాలు తెలుసుకొనే వెలుసుబాటు కూడా లేదని వెల్లడించింది. -
పెరుగుతున్న కేసులు.. కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాపై చేతులెత్తేసిన కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో అతి ముఖ్యమైన వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్రం.. వ్యాక్సిన్ సరఫరాలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తోంది. తమకు వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కోరిన పలు రాష్ట్రాల మంత్రులకు వ్యా క్సిన్ సరఫరా చేసేది లేదని, రాష్ట్రాలే సొంతంగా కొనుగోలు చేసుకోవాలని సూచించింది. దీంతో వ్యాక్సిన్ సరఫరాపై కేంద్రం చేతులెత్తేసినట్లయింది. శుక్రవారం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితులు, సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్, అప్రాప్రియేట్ బిహేవియర్ వంటి 5 అంచెల వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో, వ్యాక్సినేషన్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా పరిస్థితులు రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయని, ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ప్రికాషనరీ డోసులో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లు చెప్పారు. అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడంతో రాష్ట్రంలో నిల్వలు లేకుండా పోయినట్లు చెప్పారు. దీంతో వ్యాక్సినేషన్ నిలిచిపోయిందన్నారు. రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్ డోసులను తక్షణం సరఫరా చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం తమకు వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయిందని, దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతరాయం కలుగుతున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ మాట్లాడుతూ.. కావాల్సిన వ్యాక్సిన్లు ఆయా రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చని, బహిరంగా మార్కెట్లో పుష్కలంగా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా హైదరాబాద్ ఫార్మా సంస్థ బయోలాజికల్ ఇ సహకారంతో 15 లక్షల డోసులు సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన బయోలాజిక్ ఇ ఎండీ మహిమా ధాట్లకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ధన్య వాదాలు తెలిపారు. కాగా భారత్‌లో కొత్తగా ఆరు వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. నానాటికీ కేసుల సంఖ్య ముందుకే పోతోంది. నిన్నటితో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు యూపీ, ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతోంది. देश में कोविड-19 की स्थिति को लेकर राज्यों एवं UTs के स्वास्थ्य मंत्रियों के साथ समीक्षा बैठक की। इस दौरान कोविड टेस्टिंग एवं जीनोम सीक्वेंसिंग के साथ कोविड नियमों के पालन का प्रसार बढ़ाने पर बात हुई। हमें सतर्क रहना है और अनावश्यक भय नहीं फैलाना है। pic.twitter.com/vSmOV9qr80 — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) April 7, 2023 -
Novak Djokovic: వ్యాక్సిన్ వేసుకోలేదని..
ఇండియన్‌వెల్స్: వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను ఇంకా కరోనా వ్యాక్సిన్ కష్టాలు వీడటం లేదు. అతను వ్యాక్సిన్ వేసుకోలేదనే కారణంతో అమెరికా ప్రభుత్వం తమ దేశంలోకి అడుగు పెట్టేందుకు అతడిని అనుమతించలేదు. దాంతో ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ టోర్నమెంట్‌నుంచి అతను తప్పుకున్నాడు. తనకు మినహాయింపు ఇవ్వాలంటూ జొకోవిచ్ చేసిన దరఖాస్తును అక్కడి అధికారులు తిరస్కరించారు. ఇండియన్వెల్స్తో పాటు మరో పెద్ద టోర్నీ మయామీ ఓపెన్‌కు కూడా జొకోవిచ్ దూరం కానున్నాడు. ఈ రెండు టోర్నీలు మార్చి 19 – ఏప్రిల్ 2 మధ్య జరుగుతాయి. -
రష్యా స్పుత్నిక్–5 టీకా సృష్టించిన సైంటిస్టు హత్య
మాస్కో: రష్యా కోవిడ్ టీకా స్పుత్నిక్–5 సృష్టికర్తల్లో ఒకరైన అగ్రశ్రేణి శాస్త్రవేత్త ఆండ్రీ బొటికోవ్ (47) హత్యకు గురయ్యారు. మాస్కోలోని అపార్టుమెంట్లోనే గురువారం గుర్తు తెలియని వ్యక్తులు బెల్టుతో గొంతు నులిమి చంపారు. గమలెయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మేథమేటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా ఉన్నారు. ఇక్కడే మరో 18 మంది శాస్త్రవేత్తలతో కలిసి 2020లో స్పుత్నిక్ వీ టీకాను రూపొందించారు. హత్యకు పాల్పడిన 29 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా ఫెడరల్ దర్యాప్తు కమిటీ శనివారం వెల్లడించింది. ఆండ్రీ బొటికోవ్తో చిన్న విషయమై తలెత్తిన తగాదాతోనే ఈ నేరానికి పాల్పడినట్లు అతడు అంగీకరించాడని కూడా తెలిపింది. నిందితుడికి నేర చరిత్ర ఉందని పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎన్నదగిన పరిశోధనలు జరిపిన వైరాలజిస్ట్ ఆండ్రీ బొటికోవ్ను 2021లో అధ్యక్షుడు పుతిన్ ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ది ఫాదర్లాండ్’పురస్కారంతో సత్కరించారు. -
పసలేని చైనా టీకా.. ఏమాత్రమూ లొంగని కరోనా.. తమకొద్దంటున్న దేశాలు
కరోనా మహమ్మారి మరోసారి చైనాను కబళిస్తోంది. ప్రజాగ్రహానికి లొంగి కఠిన ఆంక్షలు సడలించి నెలైనా కాకముందే దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. 20 రోజుల్లోనే ఏకంగా 40 కోట్ల మంది కరోనా బారిన పడ్డట్టు అంచనా! వచ్చే ఏడాది కరోనా వల్ల చైనాలో కనీసం 20 లక్షల మరణాలు ఖాయమన్నది అంతర్జాతీయ వైద్య నిపుణుల అంచనా. ఆంక్షల సడలింపే ఇంతటి కల్లోలానికి దారి తీసిందని ప్రచారం జరుగుతున్నా చైనా కరోనా వ్యాక్సిన్‌లో పన లేకపోవడమే అసలు కారణంగా కనిస్తోంది. ఎందుకంటే దాదాపు 100 కోట్ల మందికి పైగా చైనీయులు ఇప్పటికే కరోనా టీకాలు వేయించుకున్నారు. అయినా కరోనా ఉధృతి తగ్గడం లేదు. సరికదా, రోజుకు కనీసం 10 లక్షల మందికి పైగా దాని బారిన పడుతూనే ఉన్నారు. టీకాలో రాజకీయం! కరోనా వ్యాప్తి మొదలవగానే దేశాలన్నీ వ్యాక్సిన్ తయారీలో తలమునకలయ్యాయి. చైనాయే తొలి వ్యాక్సిన్‌ను రూపొందించింది. ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీ రూపొందించిన సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు, ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన కరోనావాక్‌కు తొలుత ఆమోదం లభించింది. ఈ రెంటింటిని తమ పౌరులకు వేయడమే గాక పలు దేశాలకు చైనా సరఫరా చేసింది కూడా! వీటి కొనుగోలు నిమిత్తం ఆఫ్రికా దేశాలకు 200 కోట్ల డాలర్లు, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలకు 100 కోట్ల డాలర్ల రుణం కూడా ఇచ్చింది. ఆసియాలోనూ 30 దేశాలకు చైనా టీకాలందాయి. సత్తా శూన్యం? చైనా కరోనా టీకాలు తీసుకున్న వాళ్లు పదేపదే కరోనా బారిన పడుతుండటంతో వాటి సామర్థ్యంపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. భారత టీకాలు అన్ని డోసులూ వేసుకున్న వారిలో అవి 99.3 శాతం సమర్థంగా పని చేయగా చైనా టీకాల సామర్థ్యం 79 శాతమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అది వాస్తవానికి 60 శాతం లోపేనని హాంకాంగ్ వర్సిటీ అధ్యయనం తేలి్చంది. జర్మనీ వ్యాక్సిన్ పైజర్–బయోఎన్‌టెక్‌తో పోలిస్తే చైనా టీకాలు వాడిన వారిలో మరణించే ఆస్కారం మూడు రెట్లు ఎక్కువని ఆసియాలైట్ పత్రిక పేర్కొంది! కరోనావాక్ వాడిన 40 రోజుల్లోనే వ్యాధి నిరోధక యాంటీ బాడీలు సగానికి సగం పడిపోయాయని థాయ్‌లాండ్ పరిశోధనల్లో తేలింది. చైనాలో ప్రస్తుతం విలయం తొలి దశ వ్యాప్తి మాత్రమేనని అంటువ్యాధుల నిపుణుడు వుజున్‌యాంగ్‌ను ఉటంకిస్తూ బీబీసీ పేర్కొంది. ‘‘జనవరి చివరి నాటికి చైనా న్యూ ఇయర్ వేడుకలు తదితరాల పూర్తయ్యాక రెండో వేవ్ వస్తుంది. సెలవులు ముగిసి కోట్లాది మంది చైనీయులు సొంతూళ్లకు మళ్లే క్రమంలో ఫిబ్రవరి చివరి నుంచి మూడో వేవ్ మొదలవుతుంది’’ అంటూ హెచ్చరించింది! మాకొద్దంటున్న దేశాలు చైనా టీకాలపై ఆధారపడ్డ దేశాల్లో ఇండొనేసియా, బ్రెజిల్, పాకిస్తాన్, టర్కీ, ఇరాన్, ఫిలిప్పీన్స్, మొరాకో, థాయ్‌లాండ్, అర్జెంటీనా, వెనెజువెలా, కాంబోడియా, శ్రీలంక, చిలీ, మెక్సికో, బంగ్లాదేశ్ తదితరాలున్నాయి. వాటిలో పస లేదని తేలడంతో అవన్నీ ఇతర టీకాల కోసం పరుగులు పెడుతున్నాయి. కరోనావాక్ తీసుకున్న తమ పౌరులకు ఆ్రస్టాజెనెకా వేయాలని థాయ్‌లాండ్ గత వారమే నిర్ణయించింది. ఇండొనేసియా కూడా కరోనావాక్ తీసుకున్న తమ వైద్య సిబ్బందికి బూస్టర్ డోస్‌గా మోడెర్నా వేస్తోంది. ఇంకా వాడని 40 లక్షల కరోనావాక్ డోసులను పక్కన పెట్టేస్తున్నట్టు నేపాల్ ప్రకటించింది. బ్రెజిల్, బహరైన్, యూఏఈ, ఈజిప్ట్ గతేడాదే చైనా టీకాలపై అనుమానాలు వెలిబుచ్చాయి. కరోనా రోగుల్లో మరణాలను ఆపడంలో వాటి సామర్థ్యం 45 శాతం లోపేనని తేలినట్టు వెల్లడించాయి. జర్మనీ అయితే చైనాలోని తమ దేశస్థులకు బయోఎన్‌టెక్ డోసులిస్తోంది! ఇతర దేశాలూ అదే బాటన నడుస్తున్నాయి. చదవండి: చైనాను కుదిపేస్తున్న కరోనా.. రోజుకు ఏకంగా 10 లక్షల కేసులు ఎవరేమన్నారు... చైనా వ్యాక్సిన్ల సామర్థ్యం పాశ్చాత్య దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటమే చైనాలో ప్రస్తుత విలయానికి కారణం. – అమెరికా అధ్యక్షుని ప్రధాన వైద్య సలహాదారు ఆంటోనీ ఫాసి భారత్‌లో సమర్థమైన టీకాల ద్వారా పరిస్థితిని దాదాపుగా అదుపులోకి తెచ్చి కరోనా ఆంక్షలను ఎత్తేశారు. చైనా మాత్రం నాసిరకం టీకాలతో సమస్యను జటిలం చేసుకుంది. – బ్రిటిష్ పత్రిక ఆసియాలైట్ ఇంటర్నేషనల్ ఒమిక్రాన్ వైరస్ రకాలను గుర్తించడంలో చైనా టీకాలు విఫలమయ్యాయి. – ది లాన్సెట్ జర్నల్ -
Omicron BF 7: ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?
సాక్షి, అమరావతి: చైనా, ఇతర దేశాల్లో పంపిణీ చేసిన కరోనా టీకాలతో పోలిస్తే మన వ్యాక్సిన్లు చాలా శక్తిమంతమైనవని, వైరస్ సోకడం, వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా మన దేశంలో ఇప్పటికే చాలా మందిలో రోగ నిరోధకత వచ్చిందని ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్–7 పట్ల ప్రజలు అలజడికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కొత్త వేరియంట్ ప్రభావం ఎలా ఉండనుంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. చైనాలో అలా ఎందుకంటే? చైనాలో మన కంటే చాలా ముందుగానే టీకాల పంపిణీ చేపట్టినా అన్ని వర్గాలకు పంపిణీ చేయలేదు. వయసు మళ్లిన వారిలో చాలా మందికి టీకాలు వేయలేదు. దీంతో ఎక్కువ మందిలో హైబ్రీడ్ రోగ నిరోధకత లేదు. చాలా ముందే టీకాల పంపిణీ జరిగిన నేపథ్యంలో వాటిని తీసుకున్న వారిలోనూ హైబ్రీడ్ రోగనిరోధకత క్షీణించి ఉంటుంది. జీరో కోవిడ్ పాలసీతో అక్కడ కఠినమైన లాక్డౌన్ విధిస్తూ వచ్చారు. దీంతో సహజసిద్ధమైన రోగ నిరోధకత తక్కువ మందికే ఉంది. తక్కువ మందికి వ్యాక్సినేషన్, ఒక్కసారిగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం లాంటి కారణాలతో చైనాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. వాతావరణం కూడా.. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి వైరస్ల ప్రభావం, కదలికలు ఉంటాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చైనా, జపాన్, కొరియా, అమెరికా దేశాల్లో చలి తీవ్రత ఎక్కువ. వైరస్ వ్యాప్తికి అక్కడి వాతావరణం కూడా ఒక కారణం. ఆయా దేశాల్లో ఏ మేరకు మరణాలు సంభవిస్తున్నాయి? ఆస్పత్రుల్లో ఎంత మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు? అనే అంశాలను బట్టి వైరస్ ప్రభావాన్ని అంచనా వేయాలి. బీఎఫ్–7 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న దేశాల్లో ఎక్కువ మంది వైరస్ బారిన పడుతున్నారనే వార్తలు మినహా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వెల్లడి కాలేదు. రెండు మూడు నెలల క్రితమే.. మన దేశంలో బీఎఫ్–7 వేరియంట్ కేసులు రెండు మూడు నెలల కిందటే వెలుగు చూశాయి. అయితే వ్యాప్తి పెద్దగా లేదు. దీని బారిన పడిన వారికి జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, డయేరియా, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు తలెత్తుతాయి. వారికి బూస్టర్ డోస్ తప్పనిసరి రోగ నిరోధకత తక్కువగా ఉండే వారిపై ఈ వేరియంట్ ప్రభావం చూపే అవకాశం ఉంది. 60 ఏళ్లుపైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వ్యక్తులు తప్పనిసరిగా బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలి. బూస్టర్ డోస్ తీసుకుని చాలా రోజులైన వారు, రోగ నిరోధకత తక్కువగా ఉన్నవారు నాలుగో డోస్ టీకా తీసుకోవడం కూడా మంచిదే. వీలైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండటం ఉత్తమం. అంతర్జాతీయ ప్రయాణాలను విరమించుకోవాలి. జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. -
సూది లేకుండా కరోనా టీకా
న్యూఢిల్లీ: సూదితో అవసరం లేని కోవిడ్–19 టీకా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఇంట్రానాజల్ (బీబీవీ154) కరోనా వ్యాక్సిన్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ముక్కుద్వారా తీసుకొనే ఈ టీకాను 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసుగా పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కోవిషీల్డ్ లేదా కోవాగ్జాన్ టీకా రెండు డోసుల తీసుకున్నవారు బూస్టర్ డోసుగా ఇంట్రానాజల్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. నేషనల్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో దీన్ని చేర్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కో–విన్ పోర్టల్ ద్వారా టీకా పొందవచ్చని వెల్లడించారు. చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ముక్కుద్వారా తీసుకొనే టీకాకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలు ఇన్కోవాక్ అనే బ్రాండ్ పేరుతో పిలిచే బీబీవీ154 వ్యాక్సిన్‌కు ఈ ఏడాది నవంబర్‌లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలియజేశారు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. 18 ఏళ్లు దాటినవారికి బూస్టర్ డోసుగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాలని స్పష్టం చేశారు. టీకాల పరిశోధన, అభివృద్ధి విషయంలో భారతదేశ శక్తిసామర్థ్యాలకు ఇంట్రానాజల్ వ్యాక్సిన్ మరో ఉదాహరణ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ టీకాను ఇవ్వడం చాలా సులభమని తెలిపాయి. ఇన్కోవాక్ను భారత్ బయోటెక్ సంస్థ అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. ప్రొడక్ట్ డెవలప్మెంట్, క్లినికల్ ట్రయల్స్‌కు భారత ప్రభుత్వం డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలోని కోవిడ్ సురక్షా కార్యక్రమం కింద ఆర్థిక సహకారం అందించింది. బీబీవీ154 టీకా విషయంలో మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, సత్ఫలితాలు లభించాయని భారత్ బయోటెక్ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. -
కరోనాపై ఉమ్మడి పోరాటం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మనమంతా ఇక మేల్కొనాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అర్హులైన వారందరికీ కరోనా టీకా బూస్టర్ డోసు ఇవ్వాలని, మహమ్మారి నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కొత్త వేరియంట్ మన దేశంలోకి అడుగుపెట్టే అవకాశాలను తగ్గించడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రకటించారు. విదేశీ ప్రయాణికుల నుంచి విమానాశ్రయాల్లో ర్యాండమ్ శాంపిల్స్ సేకరణ మొదలైందని తెలిపారు. ‘‘మన శత్రువు(కరోనా) కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటోంది. మనం ఇకపై మరింత పట్టుదల, అంకితభావంతో శత్రువుపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలి’’ అని పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం పెంచాలి ప్రపంచమంతటా రోజువారీగా సగటున 5.87 లక్షల కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని, మన దేశంలో మాత్రం సగటున 153 కేసులు మాత్రమే నమోదవుతున్నాయని మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాప్తి, తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుత సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాబోయే పండుగలు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీని వేగవంతం చేయాలని చెప్పారు. బూస్టర్ డోసుతోపాటు కరోనా నియంత్రణ చర్యలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని విన్నవించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తల విషయంలో ప్రజల్లో చైతన్యం పెంచాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని చెప్పారు. ఏమరుపాటు వద్దు కొత్త వేరియంట్లను గుర్తించడానికి పాజిటివ్ కేసుల జినోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు‡’ అనే వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరారు. కరోనా అనే విపత్తు ఇంకా ముగిసిపోలేదు కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయడానికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపై, జీవనంపై ప్రభావం చూపిస్తూనే ఉందని గుర్తుచేశారు. గత కొద్దిరోజులుగా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతుందోన్నారు. చైనా, జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నప్పటికీ మనదేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. అయినప్పటికీ ఏమరుపాటు తగదని స్పష్టం చేశారు. 24 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు టెస్ట్‌లు విదేశాల నుంచి వచ్చేవారికి ఈ నెల 24వ తేదీ నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించిన వారికి ర్యాండమ్ కరోనా వైరస్ టెస్టు నిర్వహించాలంటూ పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. చాలా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి విమానంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల్లో కొందరి నుంచి ఎయిర్‌పోర్టులోనే నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరెవరికి టెస్టులు చేయాలన్నది వారు ప్రయాణించిన విమానయాన సంస్థ నిర్ణయిస్తుంది. ఎంపీలంతా మాస్కులు ధరించాలి: స్పీకర్ కరోనా వ్యాప్తిపై మళ్లీ భయాందోళనలు మొదలైన నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో çసభ్యులంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం సూచించారు. లోక్‌సభ ప్రవేశద్వారాల వద్ద మాస్కులు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఎంపీలందరూ వాటిని ధరించి, సభలో అడుగపెట్టాలని కోరారు. గురువారం పార్లమెంట్లో చాలామంది ఎంపీలు మాస్కులు ధరించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పార్లమెంట్ సిబ్బందిని లోక్‌సభ సెక్రటేరియట్ ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు పాటించాలన్న స్పీకర్ బిర్లా సూచనను పలువురు ఎంపీలు స్వాగతించారు. -
కరోనా టీకా వల్ల మరణిస్తే పరిహారం ఇవ్వలేం: కేంద్రం
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా తీసుకున్నాక దుష్ప్రభావాల వల్ల మరణిస్తే బాధ్యత వహించబోమని కేంద్రం పేర్కొంది. బాధిత కుటుంబానికి పరిహారమివ్వలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల మరణించినట్లు అనుమానిస్తున్న ఇద్దరు యువతుల తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ప్రజలకు అందజేస్తున్న కరోనా టీకాలను థర్డ్ పార్టీలు (ప్రైవేట్ కంపెనీలు) తయారు చేస్తున్నాయని, అన్ని రకాల పరీక్ష తర్వాత నియంత్రణ సంస్థల ఆమోదంతోనే అవి మార్కెట్లోకి వస్తున్నాయని అఫిడవిట్లో పేర్కొంది. కరోనా టీకాలు సురక్షితమేనని, ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు గుర్తించాయని వెల్లడించింది. -
చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా!
భద్రాచలం అర్బన్: లక్ష్యం చేరడంలో ఆలస్యమవుతుందని అనుకుంటున్నారో ఏమో నాలుగు నెలల క్రితం చనిపోయిన వ్యక్తి కూడా వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా వైద్యారోగ్య శాఖ మెసేజ్‌లు పంపిస్తోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రెవెన్యూ కాలనీకి చెందిన చుక్కా సూర్యప్రకాశరావు జూలైలో మరణించగా, ఆయన కుటుంబీకులు మరణ ధ్రువీకరణ పత్రం కూడా తీసుకు న్నారు. అయితే ఆయన కుమారుడు, న్యాయ వాది అంబేడ్కర్ ఫోన్‌కు శుక్రవారం సూర్య ప్రకాశరావు కరోనా బూస్టర్ డోస్ వేయించుకున్నట్లు ఆ మెసేజ్ రావడంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. -
కోవిడ్ వ్యాక్సిన్లతో వైద్య సంక్షోభం!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసిన వ్యాక్సిన్లతో అంతర్జాతీయ వైద్య సంక్షోభం తలెత్తిందని ఈ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలపై పోరాడుతున్న వైద్య బృందం ఆరోపించారు. ఈ వ్యాక్సినేషన్ ప్రభావంపై మెడికల్ క్రైసెస్ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. శనివారం జూమ్ యాప్ ద్వారా పలు దేశాలకు చెందిన వైద్యుల బృందం ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా డాక్టర్ గాయత్రి పండిట్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్లతో తలెత్తిన ప్రతికూల పరిస్థితులను వివరించారు. ‘‘ఆరోగ్యవంతమైన వ్యక్తులు కోవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్నాక అనారోగ్యాల బారిపడినట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యూకేలోని యెల్లోకార్డ్ సిస్టం, ఆస్ట్రేలియన్ అడ్వర్స్ ఈవెంట్ మానిటరింగ్ సిస్టం, యూరప్‌లోని యుడ్రా విజిలెన్స్ సిస్టంలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ వీజీ యాక్సిస్ డేటాబేస్ ద్వారా మేం గణాంకాలను సేకరించి పరిశీలించాం. ఆ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల (కోటీ 10 లక్షల) మంది కోవిడ్ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలకు లోనయ్యారు. అందులో సుమారు 70 వేల మంది వ్యాక్సినేషన్ తదనంతర కారణాలతోనే చనిపోయినట్టు పలు సంస్థల గణాంకాలు చెప్తున్నాయి. నిజానికి క్షేత్రస్థాయిలో బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది..’’ అని వైద్యుల బృందం పేర్కొంది. తక్షణమే కోవిడ్ వ్యాక్సినేషన్లను నిలిపివేసి, వాటిద్వారా తలెత్తిన దుష్ప్రభావాలను గుర్తించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. 34 దేశాల ప్రతినిధుల మద్దతు కోవిడ్ వ్యాక్సినేషన్‌తో అంతర్జాతీయ వైద్య సంక్షోభం (ఇంటర్నేషనల్ మెడికల్ క్రైసెస్) తలెత్తుతోందన్న వాదనకు ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల వైద్యులు మద్దతు పలుకుతున్నట్టు ఈ బృందం పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్లను హడావుడిగా తయారు చేసి, అతి తక్కువ కాలంలో క్లినికల్ ట్రయల్స్ జరిపి.. ప్రజలకు అందించారని.. ఈ క్రమంలో వ్యాక్సిన్ల దీర్ఘకాలిక ప్రభావాల సంగతిని తేల్చలేదని వివరించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారు కొంతకాలం తర్వాత అనారోగ్యాల బారినపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాలను కోరింది. అన్ని కోవిడ్ వ్యాక్సిన్లపై లోతుగా పరిశీలన జరిపి.. మాలిక్యులర్, సెల్యులార్, బయోలాజికల్ ప్రభావాలను తేల్చాలని డిమాండ్ చేసింది. -
Covid-19: ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తయారీ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్.. ఐఎన్‌కోవ్యాక్ (బీబీవీ164)ను 18 ఏళ్లుపైబడిన వారికి ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరుచేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ మంగళవారం ట్వీట్ చేశారు. ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్లలో భారత్ బయోటెక్ తయారీ వ్యాక్సిన్.. ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ కావడం విశేషం. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 4,000 మంది వలంటీర్లపై జరిపిన పరీక్షల్లో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు. క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాధి నిరోధకతను వ్యాక్సిన్ సమర్థవంతంగా ప్రేరేపించిందని వెల్లడించారు. ప్రపంచ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ టెక్నాలజీలో నూతన ఒరవడి మొదలవనుందని ఆయన అన్నారు. -
టీకా వల్లే నా కూతురు చనిపోయింది..వెయ్యి కోట్లివ్వండి..
ముంబై: ‘‘కోవిషీల్డ్ టీకా సైడ్ ఎఫెక్ట్స్ వల్లే నా కుమార్తె మరణించింది. కేంద్ర ప్రభుత్వ కమిటీ కూడా దీన్ని ధ్రువీకరించింది. కనుక రూ.వెయ్యి కోట్ల పరిహారం ఇప్పించండి’’ అంటూ నాసిక్‌కు చెందిన స్నేహాల్ అనే వైద్య విద్యార్థి తండ్రి లునావత్ దిలీప్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతోపాటు, టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్కు, దానికి తోడ్పాటు అందించిన బిల్‌గేట్స్ ఫౌండేషన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే విచారణ నాటికి సమాధానమివ్వాలని ఆదేశించింది. చదవండి: జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..! -
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి జొకోవిచ్ దూరం
న్యూయార్క్: కోవిడ్ టీకా తీసుకోని కారణంతో... సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌కూ దూరమయ్యాడు. కరోనా టీకా వేసుకోకపోవడంతో ఈ ఏడాది ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్‌ను ఆడనివ్వలేదు. అయితే యూఎస్ ఓపెన్ టోర్నీ నుంచి మాత్రం ఈ సెర్బియా స్టార్ స్వయంగా తప్పుకున్నాడు. ‘డ్రా’ విడుదలకు కొన్ని గంటల ముందు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అతను వెల్లడించాడు. ‘యూఎస్ ఓపెన్ ఆడేందుకు నేను న్యూయార్క్‌కు వెళ్లట్లేదు. ఇది బాధాకరమే కాని తప్పలేదు. ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఆశావహ దృక్పథంతో వచ్చే సీజన్లో ఆడేందుకు కృషి చేస్తా’ అని ట్వీట్ చేశాడు. 35 ఏళ్ల సెర్బియన్ ఖాతాలో 21 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లున్నాయి. స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ (22 టైటిల్స్) కంటే ఒకటి తక్కువ. దీన్ని తాజా గ్రాండ్‌స్లామ్‌లో జొకో సాధిస్తాడని అభిమానులు ఆశించారు. అతను 2011, 2015, 2018లో మూడుసార్లు విజేతగా నిలిచాడు. మరో ఆరుసార్లు రన్నరప్‌గా తృప్తి పడ్డాడు. ఇంతటి ఘన రికార్డు ఉన్న అతనికి న్యూయార్క్‌లో మరో టైటిల్ గెలవడం, నాదల్ రికార్డును సమం చేయడం కష్టం కాదు. అయితే అమెరికా, కెనడా దేశాల్లో స్వదేశీయులు తప్ప టీకా తీసుకోని విదేశీయులను అనుమతించడం లేదు. అందువల్లే జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌కు దూరంగా ఉంటున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడిన ఈ సెర్బియన్ క్వార్టర్స్‌లో నాదల్ చేతిలో ఓడాడు. కానీ వింబుల్డన్‌లో విజేతగా నిలిచాడు. -
జొకోవిచ్‌కు మళ్లీ ‘వ్యాక్సిన్’పోటు!
న్యూయార్క్: కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ మరోసారి దాదాపు అదే స్థితిలో నిలిచాడు. అమెరికా దేశపు నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ వేసుకోని విదేశీయులకు ఆ దేశంలో ప్రవేశం లేదు. దాంతో తన ఇష్టానికి కట్టుబడి ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని జొకోవిచ్ వచ్చేవారం ప్రారంభమయ్యే సిన్సినాటి ఓపెన్ నుంచి వైదొలిగాడు. వ్యాక్సిన్ విషయంలో జొకోవిచ్ తీరు మారకపోతే ఈ నెల 29 నుంచి జరిగే చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో కూడా అతను ఆడేది అనుమానమే. అమెరికాలో అడుగు పెట్టగలననే నమ్మకం తనకు ఉందని యూఎస్ ఓపెన్‌ను మూడుసార్లు నెగ్గిన జొకోవిచ్ చెబుతున్నా... వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక సడలింపులు ఇస్తే తప్ప జొకోవిచ్ విషయంలో తాము ఏమీ చేయలేమని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిచి కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. -
వామ్మో కరోనా.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ఢిల్లీ: క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుందనుకున్న కరోనా.. తాజా కేసులు పెరిగిపోతుండడం కలవరపరుస్తోంది. నిత్యం 19వేలకు తక్కువ కాకుండా కేసులు నమోదు అవుతున్నాయి ఈ మధ్య. మరో వేవ్ ముప్పు తప్పినట్లేనని, వైరస్ ప్రభావం తగ్గిందని, వ్యాక్సినేషన్ ప్రభావంతో కరోనా కట్టడి జరుగుతుందని వైద్య నిపుణులు భావించారు ఇంతకాలం. అయితే కొత్త వేరియెంట్ ప్రస్తావన లేకుండా కొత్త కేసులు పెరిగిపోతుండడం కలవరపరుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు రాసింది. కరోనా కేసులు పెరిగిపోతున్నందున కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలను కోరింది. అంతేకాదు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్రేసింగ్‌పై దృష్టి సారించాలని సూచించింది. ముఖ్యమంగా ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిషా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమం తప్పకుండా పెరుగుతూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శిలకు లేఖలు రాసింది. అంతేకాదు.. దేశంలో కొవిడ్-19 జబ్బుతో మరణించేవాళ్ల సంఖ్య సైతం యాభైకి తక్కువ కాకుండా నమోదు అవుతోంది. కాబట్టి, కరోనా ప్రొటోకాల్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య కార్యదర్శి లేఖలో కోరారు. తాజాగా గడిచిన 24 గంటల్లో.. 19,406 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో దేశవ్యాప్తంగా 49 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు దేశంలో నమోదు అయిన మరణాల సంఖ్య 5,26,649కి చేరింది. పాజిటివిటీ రేటు సైతం ఆందోళనకరంగానే ఉంది. అయితే అదే సమయంలో.. గత 24 గంటల్లో రికవరీల సంఖ్య 19,928కి పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,35 వేల నుంచి లక్షా 34 వేలకు తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదీ చదవండి: నా కూతుళ్లకే వ్యాక్సిన్ వేస్తారా! -
US Open: 'జోకర్' ఆడడం కష్టమే.. ఆన్లైన్లో ఫ్యాన్స్ సంతకాల సేకరణ
సెర్బియా టెన్నిస్ స్టార్.. ముద్దుగా 'జోకర్' అని పిలుచుకునే నొవాక్ జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్ రూపంలో మరోషాక్ తగిలేలా ఉంది. ఇటీవలే ముగిసిన వింబూల్డన్ ట్రోఫీ నెగ్గడం ద్వారా 21 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన జొకోవిచ్.. యూఎస్ ఓపెన్‌లో ఆడి స్పెయిన్ ఆటగాడు రఫెల్ నాదల్ రికార్డు (22)ను సమం చేయాలని భావిస్తున్నాడు. అయితే కరోనా వ్యాక్సిన్ విషయంలో మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న జొకోవిచ్‌కు మరో గండం పొంచి ఉంది. గురువారం విడుదలైన డ్రా లో జొకోవిచ్ పేరు ఉన్నప్పటికీ అతడు ఈ టోర్నీ ఆడేది అనుమానంగానే ఉంది. వ్యాక్సిన్ వేసుకోనివారిపై నిషేధం లేకున్నా అమెరికా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు మెలిపెట్టడంతో జొకోవిచ్ ఈ టోర్నీ ఆడటం కష్టమేనంటూ వార్తలు వస్తున్నాయి. యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఒక ప్రకటనలో.. ‘ఈ టోర్నీలో వ్యాక్సిన్ వేసుకున్నవారినే అనుమతించాలన్న ఆదేశాలేం లేవు. కానీ మా ప్రభుత్వ విధానం ప్రకారం మేం నడుచుకుంటాం..’ అని తెలిపింది. అగ్రరాజ్య ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. యూఎస్ పౌరులు మినహాయించి వ్యాక్సిన్ వేసుకోని వారికి దేశంలో ప్రయాణం చేసే ఆస్కారం లేదు. దీంతో జొకోవిచ్‌కు ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ (కరోనా వ్యాక్సిన్ వేసుకోలేదని ఈ టోర్నీ ఆడనివ్వలేదు)లో ఎదురైన అనుభవమే మళ్లీ ఎదుర్కోక తప్పదని వాదనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జొకోవిచ్ అభిమానులు ఆన్లైన్ పిటిషన్ క్యాంపైన్ స్టార్ట్ చేశారు. జొకోవిచ్‌ను యూఎస్ ఓపెన్‌లో ఆడించాలని కోరుతూ ఆన్లైన్లో సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఇప్పటివరకు సుమారు 12 వేల మందికి పైగా దీనిలో సంతకాలు చేశారు. మరి జొకోవిచ్ విషయంలో అమెరికా ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందోనని అతడి అభిమానులతో పాటు టెన్నిస్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆగస్టు 27 నుంచి యూఎస్ ఓపెన్ ప్రారంభం కానుంది. అయితే మొదటినుంచి కరోనా వ్యాక్సిన్ వేసుకొనంటూ మొండి పట్టు పట్టిన ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భంగపాటే ఎదురైంది. కోర్టు మెట్ల వరకు సాగిన వివాదంలో తీర్పు చివరకు జొకోవిచ్‌కు వ్యతిరేకంగానే వచ్చింది. వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాకరించిన జోకోవిచ్‌పై ఆసీస్ ప్రభుత్వం మూడేళ్లపాటు నిషేధం విధించింది. ఒక రకంగా జొకో కెరీర్లో ఈ ఉదంతం మాయని మచ్చ అని చెప్పొచ్చు. Apparently 12000 people have signed an online petition to the US government and the USTA to allow @DjokerNole to play the US Open. These people need to understand it has nothing to do with the USTA, they have no control over the situation. It's a federal government mandate. — Craig Gabriel (@crosscourt1) July 20, 2022 చదవండి: World Athletics Championship: 'నా కొడుకు ప్రపంచ చాంపియన్.. గర్వంగా ఉంది' -
ప్రతి పక్షాలేసుకున్న వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్‌పై కూడా మీ ఫొటో కనిపించేసరికే...
ప్రతి పక్షాలేసుకున్న వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్‌పై కూడా మీ ఫొటో కనిపించేసరికే... ఫీలయ్యారనుకుంటా సార్! -
Wimbledon 2022: వ్యాక్సిన్ విషయంలో తగ్గేదేలే: జకోవిచ్
Novak Djokovic : కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునే విషయంలో ప్రముఖ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ పట్టు వీడడం లేదు. ప్రాణం పోయినా తాను వ్యాక్సిన్ వేసుకునే ప్రసక్తే లేదని మరోసారి తెగేసి చెప్పాడు. ఈ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌కు వేదిక అయిన యునైటెడ్ స్టేట్స్లో అడుగుపెట్టాలంటే కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి అని అక్కడి ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసిన నేపథ్యంలో జకో ఈ మేరకు స్పందించాడు. యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగేందుకైనా సాహసిస్తాను కానీ వ్యాక్సిన్ మాత్రం వేసుకోనని ఖరాకండిగా తేల్చి చెప్పాడు. వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని, ఇష్టం లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడం సహేతుకం కాదని వివరించాడు. వ్యాక్సిన్ వేయించుకోవడం తన వ్యక్తిగత నిర్ణయమని, అలా అని తాను వ్యాక్సిన్‌కు వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశాడు. ప్రస్తుతం వింబుల్డన్ బరిలో ఉన్న జకో.. ఇవాళ (జూన్ 27) తొలి రౌండ్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇదిలా ఉంటే, గతేడాది మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ (వింబుల్డన్ సహా) నెగ్గిన జకోవిచ్ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయాడు. వ్యాక్సిన్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో వైరం కారణంగా అతను ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. అనంతరం ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడినా క్వార్టర్ ఫైనల్లో నదాల్ చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం జకో ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. చదవండి: Wimbledon 2022: జొకోవిచ్‌పైనే దృష్టి -
Corona Alert: దేశంలో 45 శాతం పెరిగిన పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్‌తో దేశంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,073 పాజిటవ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో 21 మంది మృత్యువాతపడ్డారు. ఇక, దేశంలో ప్రస్తుతం 94,420 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,208 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,27,87,606 మంది కరోనా నుంచి కోలుకోగా.. 5,25,020 మంది వైరస్ బారినపడి మృతిచెందారు. ఇక దేశంలో 1,97,11,91,329 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. ఇక, ఆదివారం 11,739 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సోమవారానికి కేసుల సంఖ్య ఒక్కసారిగా 17వేల మార్కును దాటింది. దీంతో, పాజిటివ్ కేసుల సంఖ్య 45 శాతం పెరిగింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 20 తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య 17వేలు దాటడం జూన్ 24న, మళ్లీ సోమవారమే(జూన్ 27) చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో 6493 పాజిటివ్ కేసులు, ఢిల్లీలో 1891 కేసులు నమోదయ్యాయి. India reports 17,073 fresh COVID19 cases & 21 deaths today; Active caseload at 94,420 pic.twitter.com/NBcPK0kcl7 — ANI (@ANI) June 27, 2022 ఇది కూడా చదవండి: దావత్‌లు ఇవ్వరు.. డీజే, బారాత్‌లు బంద్.. ఇక సాదాసీదాగానే పెళ్లిళ్లు అక్కడ!! -
కోవిడ్ అలర్ట్: భారీగా కొత్త కేసులు.. బాధితుల్లో 10 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కేసుల్లో రోజురోజుకు పెరుదల నమోదవడం దేశవ్యాప్తంగా భయాందోళనలను రేకెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 8,329 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28 న 8,013 కేసులు నమోదవగా మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడే బయటపడ్డాయి. 10 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక మొత్తం బాధితుల్లో కిత్రం రోజు 4,216 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కేసుల్లో క్రమం తప్పకుండా పెరుగుదల నమోదవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40,370 కు చేరింది. చదవండి👉 అడిగినంత లంచం ఇవ్వాలి.. లేదంటే నీ సంగతి చెప్తా గురువారం 7,584 కోవిడ్ కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. రోజు వ్యవధిలోనే కేసులు 745 ఎగబాకాయి. తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలో నాలుగో వేవ్ కూడా ఉంటుందా! అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో ఈ భయాలు రెట్టింపవుతున్నాయి. అయితే, వైరస్ బారినపడుతున్న వారిలో స్వల్ప లక్షణాలే ఉండటం.. ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితులు రాకపోవడం గమనించదగ్గ విషయం. ఏదేమైనా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ప్రభుత్వాలు చెప్తున్నాయి. చదవండి👉🏼 స్నేహితుని పెళ్లి.. మత్తు ఎక్కువై రైలుపట్టాలపై పడుకుని.. -
Sakshi Cartoon: కోవిడ్ టీకాకరణలో ప్రపంచానికి భారత్ ఆదర్శం-బిల్‌గేట్స్
కోవిడ్ టీకాకరణలో ప్రపంచానికి భారత్ ఆదర్శం-బిల్‌గేట్స్ -
టీకా తప్పనిసరి కాదు.. జొకోవిచ్‌కు ఊరట
లండన్: ప్రపంచ టెన్నిస్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌లాంటి స్టార్ ప్లేయర్లు కోవిడ్ టీకా తీసుకోకపోయినా ఈసారి వింబుల్డన్ టోర్నీలో ఆడనిస్తామని ‘ఆల్ ఇంగ్లండ్ క్లబ్’ స్పష్టం చేసింది. అలాగే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ కోర్టు నుంచి ‘కోవిడ్ ప్రొటోకాల్’ కూడా అవుట్ అయింది. దీంతో క్వారంటైన్, నిర్బంధ టెస్టులు, నిబంధనలు ఈసారి ఉండబోవు. దీంతో ప్రేక్షకులు రెండేళ్ల తర్వాత తమకెంతో ఇష్టమైన వింబుల్డన్ టోర్నీలో మ్యాచ్‌లను పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా ఆస్వాదించవచ్చు. కరోనాతో 2020 వింబుల్డన్ టోర్నీ రద్దవగా, గతేడాది టోర్నీని ప్రేక్షకుల్లేకుండా నిర్వహించారు. కోవిడ్ తీవ్రత తగ్గడంతో ఇంగ్లండ్‌లో క్వారంటైన్ తదితర ప్రొటోకాల్ నిబంధనల్ని ఎత్తేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో టైటిల్ నిలబెట్టుకునేందుకు వెళ్లి నిబంధనల చట్రంలో... ఆస్ట్రేలియన్ అధికారుల నిర్బంధనంలో విసిగిపోయిన జొకోవిచ్‌కు తన సత్తా చాటేందుకు వింబుల్డన్ సరైన వేదిక కానుంది. డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్‌కు ఇప్పుడు ఏ బంధనం అడ్డుకోదు. ఇదే కాదు ఫ్రెంచ్ ఓపెన్ కూడా కోవిడ్ కోరల్లోంచి బయటపడింది. దీంతో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల జొకోవిచ్ ఈ ఏడాది మరిన్ని విజయాలు అందుకునే అవకాశాలు మెరుగయ్యాయి. ఫ్రెంచ్ ఓపెన్ పారిస్‌లో మే 22 నుంచి జూన్ 5 వరకు... వింబుల్డన్ టోర్నీ లండన్‌లో జూన్ 27 నుంచి జూలై 10 వరకు జరుగుతాయి. -
కరోనా టీకాపై కేంద్రం కీలక నిర్ణయం
-
కొత్త వేరియెంట్లు రావని అనుకోవడానికి లేదు
సాక్షి, హైదరాబాద్: ‘కొన్ని దేశాల్లో కోవిడ్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఐరోపా, చైనా, దక్షిణ కొరియా, వియత్నాం తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే అతి విశ్వాసాన్ని వీడాలి. మరో నెలరోజులపాటు అప్రమత్తంగా ఉంటూ ఇతర దేశాల్లోని పరిస్థితులను గమనిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా.కె. శ్రీనాథ్‌రెడ్డి సూచించారు. ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యల్పస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఇతర దేశాల నుంచి ప్రమాదం పొంచే ఉంది ఒమిక్రాన్ వేరే దేశాల్లో ఇంకా పరిభ్రమిస్తోంది. రూపును మార్చుకుంటోంది. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 కాకుండా ఎక్స్, ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్ అనే కొత్త వేరియెంట్లు అధిక ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అది కొత్తరూపంలో మళ్లీ మనదేశంలోకి ప్రవేశిస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఇప్పుడు మనలో ఏర్పడిన రోగనిరోధక శక్తి మూడు, నాలుగు నెలల తర్వాత కూడా ఉంటుందా అన్నది తెలియదు. అంటే ఆ తర్వాత అధికశాతం మందిలో ఇమ్యూనిటీ స్థాయిలు తగ్గాక కొత్త వేరియెంట్లు ప్రవేశిస్తే పరిస్థితి ఏమిటనేది చెప్పలేం. వైరస్ స్థిమితంగా ఉండటం లేదు ఇప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదని కొందరు చెబుతున్నారు. గతంలోనూ థర్డ్‌వేవ్‌కు ఆస్కారం లేదని చెప్పారు. అయితే, ఒమిక్రాన్ వచ్చింది. అందువల్ల ఇక కొత్త వేరియెంట్లు రావనుకోవడానికి లేదు. ఒకవేళ మన దగ్గర 2, 3 నెలల్లోనే కొత్తవి వచ్చినా పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. ఎప్పుడు ఏ వేరియెంట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పలేం. ఎందుకంటే వైరస్ ఇంకా పరిణామ దశలోనే ఉంది. అది ఇంకా పూర్తిగా స్థిమితంగా ఉండటం లేదు. వచ్చే వేరియెంట్లతో తీవ్రత పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. వైరస్ తీరు తేలేదాకా అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ రక్షణ చర్యలు తీసుకోవడమే మంచిది. 12 ఏళ్లలోపు వారికి పెద్దగా ప్రమాదం లేదు ప్రపంచవ్యాప్తంగా 12 ఏళ్ల లోపు వారికి తీవ్రమైన జబ్బు చేసే ఆస్కారం చాలా తక్కువగా ఉంది. అందువల్ల వారికి టీకాలు వేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో ఆ వయసు వారికి కరోనా టీకాలు ఇవ్వడం వల్ల అంతకంటే ప్రమాదకర జబ్బులను ఎదుర్కునే శక్తిని తగ్గించినట్టు అవుతుందా అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఇప్పటికైతే 12 ఏళ్లలోపు వారికి కోవిడ్ టీకా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. అన్ని వేరియెంట్లపై పనిచేసేలా టీకాలు ఏ వేరియెంట్‌పై అయినా ప్రభావవంతంగా పనిచేసే టీకా తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అయితే కేవలం టీకాపైనే ఆధారపడకుండా మాస్క్‌లు ధరించడం, వ్యక్తిగత, చేతుల పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలను కొనసాగించాలి. ఇదివరకు జపాన్, దక్షిణ కొరియాల్లో ఎవరికైనా జలుబు చేస్తే మాస్క్‌లు వేసుకుని వెళ్లే వాళ్లు. అలాంటి అలవాట్లను మనం కూడా అలవరచుకోవాలి. వారికి బూస్టర్ డోస్‌లు మంచిది 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్‌లు ఇవ్వడం మంచిదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సూచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే 60 ఏళ్లలోపు వయసు వారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక జబ్బులున్న వారికి బూస్టర్‌డోస్‌లు ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఈ కేటగిరిలోని వారు సులభంగా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. -
వైద్య ఆరోగ్య శాఖలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం: హరీశ్‌రావు
ఖైరతాబాద్(హైదరాబాద్): కోవిడ్ ప్రభావం తగ్గిందే తప్ప వైరస్ పూర్తిగా తగ్గలేదని, ప్రతి ఒక్కరు ముందస్తుగా టీకాలు వేయించుకుంటేనే మన ఆరోగ్యానికి భరోసా ఉంటుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా బుధవారం ఖైరతాబాద్‌లోని వెల్నెస్ సెంటర్లో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 12 నుంచి 14 ఏళ్ల వయస్సున్న పిల్లలకు కోవిడ్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజు 16,555 మంది టీకాలు తీసుకున్నారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. కరోనా థర్డ్ వేవ్ ముగిసిందనో, పెద్దగా ప్రభావం చూపలేదనో కొత్త వేరియెంట్ ఇప్పుడే వస్తుందా, రాదా అనే అనుమానాలతో టీకాలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం చేయవద్దన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12–14 ఏళ్ల వయస్సు వారు 17,23,000 మంది ఉంటారని అంచనా వేశామని వారందరికీ టీకాలు వేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలకు నేరుగా వెళ్లి లేదా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని మంత్రి కోరారు. 20 వేల పోస్టుల భర్తీ కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రపం చానికి తెలంగాణ రెండు టీకాలను అందించిందని, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ మొదటిదయితే, బయోలాజికల్ –ఈ తయారుచేసిన కార్బొవ్యాక్స్ రెండోదని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రపంచానికే తెలంగాణ వ్యాక్సిన్‌హబ్‌గా మారిందన్నారు. రాబోయే రోజుల్లో 20వేల మందిని వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేయబోతున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్‌రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రాజేంద్రనగర్‌లోని టీఎస్ పార్డ్ లో 33 జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు,ఉద్యోగులతో ఏర్పాటు చేసిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా, దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ సారథ్యంలో పనిచేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో మందులను ఆన్లైన్ చేస్తామని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వైద్యాధికారులకు, ఉద్యోగులకు నగదు పురస్కారాలు ఇచ్చి గౌరవిస్తామని వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో కొత్తగా 75 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,90,574కు పెరిగింది. -
కరోనా వైరస్: ఐసీఎంఆర్ కీలక ప్రకటన
Corona Virus Update: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. ప్రభావం మాత్రం కొనసాగుతోంది. గత 25 రోజులుగా వరుసగా లక్షకు దిగువనే కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,396 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గురువారం నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 77, 152 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 142 మంది చనిపోగా.. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా కరోనాతో 5, 14, 388 మరణాలు నమోదు అయ్యాయి. ఇక ఈ ఏడాది మరణాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. 2022లో సంభవించిన కరోనా మరణాల్లో బాధితులు చాలామట్టుకు వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్నవాళ్లే(vaccination)నని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. తద్వారా కరోనా మరణాల కట్టడిలో వ్యాక్సినేషన్ కీలకంగా వ్యవహరిస్తోందని, కాబట్టి, అంతా వ్యాక్సిన్ డోసులు వేయించుకోవాలని, నిర్క్క్ష్యం పనికిరాదని చెప్తున్నారు. ఇక గురువారం నాటికి దేశవ్యాప్తంగా 178.26 కోట్ల డోసులు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. -
పూరీ వెళ్లే భక్తులకు గమనిక.. ఆలయ పాలక వర్గం కీలక నిర్ణయం
పూరీ: ఇకపై పూరీ జగన్నాథుడి దర్శనానికి వచ్చే భక్తులకు టీకా సర్టిఫికెట్, కోవిడ్ నెగెటివ్ రిపోర్టు అవసరం లేదని ఆలయ పాలక వర్గం ప్రకటించింది. కరోనా కేసులు భారీగా తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక పై ఆదివారం మినహా ఇతర రోజుల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. భక్తులు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని వెల్లడించారు. -
గుడ్ న్యూస్.. దేశంలో కోర్బెవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతి
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి వేళ డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఫార్మా సంస్థ బయోలాజికల్–ఈ.. 12–18 ఏళ్ల గ్రూపు వారి కోసం రూపొందించిన కరోనా టీకా కోర్బెవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది. కోర్బెవాక్స్‌ను పరిమితులతో వినియోగించేందుకు బయోలాజికల్–ఈకి అనుమతి లభించినట్లు సోమవారం అధికారవర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా కరోనా టీకాను 15 ఏళ్ల లోపు వారికి వేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోని విషయం గమనార్హం. -
విమ్స్‌లో ముక్కు ద్వారా వేసే కరోనా టీకా ట్రయల్స్
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ డ్రాప్స్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్‌లో ప్రారంభించినట్టు డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపారు. ఎథిక్స్ కమిటీ అనుమతుల మేరకు విమ్స్‌లో మొదలు పెట్టామన్నారు. ఇప్పటివరకు కేవలం ఇంట్రా మస్క్యులర్ ఇంజక్షన్ రూపంలో మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందని చెప్పారు. అలా కాకుండా పోలియో డ్రాప్స్ తరహాలో ముక్కు ద్వారా వేసే టీకాను భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిందన్నారు. ఇంజక్షన్ టీకా కంటే డ్రాప్స్ టీకా వల్ల వచ్చే యాంటీబాడీస్ సామర్థ్యం ఎక్కువ ఉన్నట్టు మొదటి, రెండు ట్రయల్ రన్స్‌లో తేలిందని చెప్పారు. ట్రయల్ రన్లో భాగంగా 18 ఏళ్లు దాటిన 3,160 మందికి టీకా వేయనున్నట్టు తెలిపారు. ఇంజక్షన్ టీకా తరహాలోనే మొదటి డోసు వేసుకున్న 28 రోజుల అనంతరం రెండో డోసు వేస్తామన్నారు. ఇంజక్షన్‌గా వేసే టీకా ద్వారా ఒక రకమైన రక్షణ ఉంటే.. ముక్కులో వేసే డ్రాప్స్ టీకా ద్వారా రెండురకాల రక్షణ ఉంటుందని చెప్పారు. చదవండి: (డీజిల్ బస్సులకు టాటా.. ఇ–బస్సులకు స్వాగతం) ఇంజక్షన్ టీకాతో సిస్టమిక్ ఇమ్యూనిటీ మాత్రమే ఉంటుందని, డ్రాప్స్ టీకా వల్ల సిస్టమిక్‌తో పాటు, మ్యూకోజల్ ఇమ్యూనిటీ లభిస్తుందని ఆయన తెలిపారు. మూడోదశ ట్రయల్స్ ప్రధాన పరిశోధకుడిగా డాక్టర్ రాంబాబు, సహాయ పరిశోధకుడిగా డాక్టర్ పి.విజయకుమార్, సహాయకులుగా డాక్టర్ ఊర్మిళ, డాక్టర్ షాఫినా వ్యవహరిస్తున్నారు. -
దేశంలో దారికొచ్చిన కరోనా
-
ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదా.. ఈ విషయం తెలుసుకోండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైరస్ సోకి కోలుకుని అస్సలు టీకాలు తీసుకోని వారిలో దీర్ఘకాలం పాటు కరోనా సమస్యలు, లక్షణాలు కొనసాగుతున్నట్టు వెల్లడైంది. రెండు లేదా ఒక డోసైనా వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే.. తీసుకున్న వారిలో 50 శాతం తక్కువగా లాంగ్ కోవిడ్ సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. శరీరంలోని అన్ని అవయవాలు, వ్యవస్థలపై కరోనా దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని, కొన్ని సందర్భాల్లో ఇవి తీవ్రస్థాయికి కూడా చేరుకోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఇతర నిపుణుల తాజా హెచ్చరికల నేపథ్యంలో ఈ అంశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. స్వల్ప లక్షణాలతో మైల్డ్‌గానే కరోనా సోకి తగ్గిపోయినా.. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు, పోస్ట్ కోవిడ్ చిక్కులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చునని మరికొన్ని అధ్యయనాలు ఇప్పటికే సూచించాయి. ఈ క్రమంలోనే టీకాలు తీసుకున్న వారిలో లాంగ్ కోవిడ్ సమస్యలు తక్కువగా ఉన్నట్టు, వ్యాక్సిన్లు తీసుకోని వారిని సమస్యలు వెంటాడుతున్నట్టు యునైటెడ్ కింగ్డమ్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకే హెచ్ఎస్ఏ) తేల్చింది. వివిధ సంస్థలు నిర్వహించిన దాదాపు 15 అంతర్జాతీయ అధ్యయనాలను పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించింది. టీకాలతో త్వరగా రికవరీ.. ఫైజర్, బయో ఎన్‌టెక్, ఆస్ట్రాజెనికా, మోడెర్నా రెండు వ్యాక్సిన్లు లేదా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకా వేసుకున్న వారిలో, వ్యాక్సిన్ తీసుకోని వారికంటే 50 శాతం తక్కువగా లాంగ్ కోవిడ్ లక్షణాలు ఉంటున్నాయని యూకే హెచ్ఎస్ఏ పేర్కొంది. టీకాలు వేయించుకున్న వారు త్వరగా కోలుకుంటున్నట్టుగా కూడా వెల్లడించింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు తీసుకున్న వారికి మంచి ప్రయోజనాలు కలుగుతున్నట్టుగా తేలిందని సంస్థకు చెందిన డాక్టర్ మేరి రామ్సే తెలిపారు. ‘కోవిడ్ సోకాక వ్యాక్సినేషన్ ద్వారా సీరియస్ లక్షణాల నుంచి రక్షణ లభిస్తుంది.దీర్ఘకాలిక ప్రభావాలు, లక్షణాలు కూడా తగ్గుతాయి. చాలామందికి లాంగ్‌కోవిడ్ లక్షణాలు తక్కువ కాలమే ఉండడమే కాకుండా త్వరలోనే పరిష్కారమౌతాయి. కొందరిలో మాత్రమే ఈ లక్షణాలు తీవ్రంగా మారి రోజువారీ జీవనాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది..’ అని ఆమె చెప్పారు. కరోనా సోకాక నాలుగు వారాల తర్వాత కూడా అసాధారణ, అనూహ్య లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. యూకే హెచ్ఎస్ఏ పరిశీలన ప్రకారం.. - లాంగ్ కోవిడ్‌లో ఎక్కువగా అలసట, - ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, కీళ్లు, కండరాల నొప్పులు, తదితరాలు కొనసాగుతుంటాయి. - యూకే జనాభాలో 2 శాతం మంది దాకా దీర్ఘకాలిక కరోనా లక్షణాలు, సమస్యలతో బాధపడుతున్నారు - వ్యాక్సిన్లు తీసుకున్న వారు 28 రోజుల పాటు కోవిడ్ లక్షణాలు కలిగి ఉన్నారు - పోస్ట్ కరోనా లక్షణాలపై టీకాలు బాగా పనిచేస్తున్నాయి. 60 ఏళ్లు పైబడిన వారిలో వీటి ప్రభావం అత్యధికం కాగా 19–35 ఏళ్ల మధ్యలోని వారిపై తక్కువగా ఉంది. -
కోవిడ్ ఎప్పటికైనా ముగిసేనా?
త్వరలోనే జనం మాస్కులు మరిచిపోవచ్చునని ఒక మాట. అయినా తగిన జాగ్రత్తలు తప్పవని మరో మాట. తీవ్రమైన మూడో దండయాత్ర తర్వాత కొన్ని రోజుల్లోనే నెమ్మదిస్తుందని ఒక సంస్థ ప్రకటన. ‘ఒమిక్రాన్’ అదుపుతప్పి, జనావాసాలను చుట్టబెట్టడంవల్ల దాని వ్యాప్తిని అరికట్టడం అసాధ్యమయ్యేలా ఉందని కొందరు నిపుణుల ఆందోళన. వీటన్నింటికి తోడు రానున్న ‘కోవిడ్’ వేరియంట్లు వ్యాక్సిన్ రక్షణకు కూడా లొంగక పోవచ్చునన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమానం. ఇలాంటి వ్యాఖ్యానాలు ప్రజల్లో కొత్త భయాల్ని రేకెత్తించే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు కూడా భావిస్తున్నారు. అయితే ఒకమాట: లాభాల వేటలో ప్రజల ఆరోగ్యాల్ని శాసిస్తున్న అరాచక వ్యవస్థ ఉన్నంతకాలమూ కరోనా లాంటి వైరస్‌లూ పోవు, ఆ పేరిట రోజుకొక తీరున తలెత్తే వాటి ‘మహమ్మారులూ’ పోవు. అమెరికా పాలకవర్గాలనూ, వారి అను మతితో ప్రజల అవసరాలనూ అక్కడి 84 ఫార్మా కంపెనీలు ఆడింది ఆటగా, పాడింది పాటగా శాసిస్తున్నాయి. లాభాల వేటలో ప్రజల ఆరోగ్యాల్ని శాసిస్తున్న అరాచక వ్యవస్థ ఉన్నంతకాలమూ కరోనా లాంటి వైరస్‌లూ పోవు, ఆ పేరిట రోజుకొక తీరున తలెత్తే వాటి ‘మహమ్మారులూ’ పోవు. ఈ సత్యం తెలిసి కూడా ఫార్మా కంపెనీల లాభాల వేటలో భాగస్వాములయ్యో, లేదా మోసపోతూనో ‘ఆకుకు అందని పోకకు పొందని’ పరిష్కారాలను కొందరు డాక్టర్లు రక రకాలుగా సూచిస్తున్నారు. సరిపడా ఉండాల్సిందేనా? ఈ అవకాశవాద హెచ్చరికలకు తాజా ఉదాహరణ– కొలది రోజుల నాడు (12 ఫిబ్రవరి 2022) అమెరికాలో సర్జన్ జనరల్‌గా ప్రాక్టీసులో ఉన్న గౌరవ వివేక మూర్తి వ్యాఖ్యలు. ‘మాస్క్’లు ఇక త్వరలోనే పోతాయని ఆయన అన్నారు. అయితే చిలవలు–పలవలుగా పుట్టు కొస్తున్న కొత్త మహమ్మారులనూ, వాటి కొత్త అవతారాలనూ అణచి వేయగల వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు మాత్రం సరిపడా సంఖ్యలో ఉండాల్సి వస్తుందని చెప్పారు. అప్పుడే ప్రజల మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, ప్రపంచ ఫార్మా కంపెనీలనూ, ప్రభుత్వాలనూ లాభాల వేట కోసం శాసిస్తున్న ఆ 84 ఫార్మా కంపెనీలను అదుపు చేయగల మొనగాడి కోసమే ప్రపంచం ఇంకా ఎదురుచూస్తోంది. కానీ ఆ కంపెనీల అవసరం పాలక వర్గాలకు ఎంత ఉందో, ఆ కంపెనీలకు పాలక వర్గాల అవసరమూ అంతే ఉంది. అందుకే ఈ ముసుగులో గుద్దులాట సమసిపోవడం లేదు. కనుకనే, సర్జన్ జనరల్ వివేక మూర్తి ఆశిస్తున్నట్లు మాస్కులు త్వరలోనే పోయినా ‘కరోనా’ జాగ్రత్తలు అనివార్యమని అటో ఇటో తెగని ‘భట్టిప్రోలు పంచాయతీ’తో తృప్తి పడవలసి వస్తోంది! అందరూ కోవిడ్ బాధితులేనా? నిజానికి, ‘కరోనా’ వైరస్‌కు పరిష్కారం పేరిట అమెరికన్ 84 ఫార్మా కంపెనీలు, వాటికి ఆసరాగా వివిధ దేశాల్లో అదే పేరిట లాభాల వేట కోసం ‘అర్రులు చాచి’ కూర్చున్న పెక్కు వందిమాగధ ప్రైవేట్ కంపెనీలు సహా అక్కడి కోర్టులో పెక్కు కేసులు ఎదుర్కొంటున్న సంగతి మనం మరవరాదు. చివరికి భారత పాలకులు కూడా తప్పుకోలేని కేసులలో ఇరుక్కుపోవలసి వచ్చింది. చివరికి సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అలాగే ఇతర ‘కోవిడ్–19’ లాంటి లక్షణాలు కనిపించిన వారికల్లా నిర్ధారణలతో నిమిత్తం లేకుండానే ‘కోవిడ్’ బాధితుల కింద జమకట్టే మనస్తత్వమూ పెరిగి పోయింది. అందుకే హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ హృద్రోగ నిపుణులు డాక్టర్ సోమరాజు హార్ట్ పేషెంట్స్‌కు ఇటీవలి కాలంలో రెండు నాణ్యమైన ఔషధాలను సూచించారు. 1. ఏడాదికొకసారి ఇన్ ఫ్లూయెంజా ఇంజెక్షన్, 2. ఐదేళ్లకొకసారి వేసుకోవాల్సిన న్యూమో నియా వ్యాక్సినేషన్. ‘కోవిడ్–19’కు తొలి కేంద్రంగా భావించిన చైనా ఆ వ్యాధిని అరికట్టడంలో అంత వేగంగానూ స్పందించి, అదుపు చేసుకుంది. ఆ పిమ్మట అందుకు సంబంధించిన కొత్త వేరియంట్స్ ఏవి తలెత్తినా వెంటనే స్పందించి అదుపు చేసుకోవడానికి అలవాటుపడింది. ఒక విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకే వ్యాధి పరిష్కారాల విషయంలో చైనా అనుభవం, దాని ప్రతిపాదనలే నేడు దిక్సూచిగా ఉపయోగ పడుతున్నాయి. అలాగే నిన్నగాక మొన్ననే (28 జనవరి 2022) దక్షిణాఫ్రికాలో సరికొత్త ‘కోవిడ్’ ప్రబలినట్టూ, అందువల్ల ప్రజలు ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నట్టూ, దాని వ్యాప్తి అదుపు తప్పు తున్నట్టూ మొదటిగా సోవియట్తోపాటు, చైనా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థను ఏకకాలంలో హెచ్చరించాయి. ప్రభావం తక్కువని చెప్పలేం? కోవిడ్ మూడో దండయాత్ర 14 రోజుల్లో తీవ్ర స్థాయికి చేరి తర్వాత నెమ్మదిస్తుందని ఒక సంస్థ ప్రకటించగా, కొత్తగా తలెత్తిన ‘ఒమిక్రాన్’ అదుపుతప్పి, జనావాసాలను చుట్టబెట్టడంవల్ల దాని వ్యాప్తిని అరి కట్టడం అసాధ్యమయ్యేలా ఉందని కొందరు నిపుణులు తీవ్ర ఆందో ళనను వ్యక్తం చేశారు. ప్రపంచాల్ని లాభాల వేట కోసం కేంద్రంగా మార్చుకున్న ప్రపంచ ఫార్మా కంపెనీలు ఉనికిలో ఉంటూ శాసిస్తు న్నంత కాలం రాబోయే మరిన్ని ‘కోవిడ్’ రూపారూపాల ప్రభావం తక్కువ స్థాయిలో ఉంటుందన్న ‘గ్యారంటీ’ ఇవ్వలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. పైగా ‘ఒమిక్రాన్’ కన్నా రాబోతున్న ‘కోవిడ్–19’ కొత్త వేరియంట్ మరింత ‘మహమ్మారి’గా మారే అవకాశం ఉందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటిస్తూ హెచ్చరిస్తున్నందున ఏదీ ఇంకా ఆరోగ్య సంస్థల, వైద్య ఆరోగ్య నిపుణుల అదుపులోకి పూర్తిగా వచ్చినట్టు భావించకుండా అజాగ్రత్తగా ఉండరాదు. ఒక్క ‘ఒమిక్రాన్’ వేరియంట్ వల్లనే వారం రోజుల్లోగా రెండున్నర కోట్ల కోవిడ్ కేసులు కొత్తగా నమోద య్యాయన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన మరింత ఆందోళన కరంగా తయారైంది. అందువల్ల కొత్తగా తలెత్తగల వేరియంట్ల తీవ్రత తక్కువగా ఉండొచ్చునన్న ‘ఊహాగానాలు’ నమ్మదగినవి కావని ప్రపంచ ఆరోగ్య సంస్థ సందిగ్ధంగా ప్రకటించడం మరింత ఆందో ళనకు దారితీస్తోంది. నిర్దిష్ట అస్థిమితం అయితే అదే సమయంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పే మాటలు కూడా మరిన్ని అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఎందుకంటే, రేపు రాబోయే వేరియంట్ల రూపాలు తీవ్రంగా ఉంటాయా, తక్కువ స్థాయిలో ఉంటాయా అన్న మీమాంస కన్నా ఒక మానసిక స్థితికి ‘ప్రజలు సిద్ధమైతే మెరుగేమో’ అని అనుమానం ప్రకటిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తేలిక ధోరణిని ప్రదర్శిస్తోందిలా: ‘‘మీరు శాశ్వతంగా మాస్క్ ఎల్లప్పుడూ ధరించనక్కర్లేదు. భౌతికంగానూ మరీ దూరంగానూ ఉండనక్కర్లేక పోవచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ నియమాల్ని పాటించాల్సిందే.’’ ఇలా కర్ర విరక్కుండా పాము చావకుండా ఉండేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్పు ఉందంటే, ప్రజల మానసిక స్థితి ఎక్కడ స్థిరపడుతుందో చెప్పలేని విచిత్ర పరిస్థితి నేడు! అంతేగాదు, రానున్న ‘కోవిడ్’ రకరకాల వేరియంట్లు వ్యాక్సిన్ రక్షణకు కూడా లొంగక పోవచ్చునన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమానం ప్రజల్లో కొత్త భయాల్ని, ఆందోళనలను రేకెత్తించే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు కూడా భావిస్తున్నారు. అంతేగాదు, కోవిడ్ వేరియంట్ అంతిమంగా ఒక రూపం తొడిగి స్థిరపడే ముందు అస్థిమితంగా ఉంటుందని కూడా నిపుణులు హెచ్చరిస్తుండటం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దిష్టమైన అభిప్రాయం కూడా ‘అస్థిమితం’గా మారడం ప్రజల మనస్సుల్ని కలవరపెట్టే అంశమని చెప్పక తప్పదేమో! అందుకే అన్నాడేమో మహాకవి... ఇంత మాలోకం మధ్య స్వార్థ రాజకీయ పాలకుల మధ్య, వారి ఆశీస్సులతో ఎదుగుతున్న ఫార్మా కంపెనీల లాభాల వేటను రక్షించడానికే ‘న్యాయస్థానాలూ, రక్షక భట వర్గాలూ, చెరసాలలూ, ఉరికొయ్యలూ ఏర్పడ్డాయి. ఆ స్వార్థపూరిత రేఖను ఇవి కాపాడక తప్పదు’. ఇప్పుడు మనం పచ్చినిజం నీడలోనే ఉన్నామని గ్రహించి, మేల్కొనక తప్పని ముహూర్తాలు ముంచు కొచ్చాయి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మాయలేడి.. కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో వృద్ధురాలిని నమ్మించి..
కర్నూలు: నగర శివారులోని న్యూ పోస్టల్ కాలనీలో నివాసముంటున్న వృద్ధురాలు మద్దమ్మను(70) గుర్తు తెలియని మహిళ కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో మాయమాటలు చెప్పి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును తస్కరించి మాయమైంది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో 50 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ ముఖానికి స్కార్ఫ్ ధరించి మద్దమ్మ ఇంటి వద్దకు వచ్చి తాను సచివాలయం వలంటీర్ అంటూ పరిచయం చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నావా అని ఆరా తీసి బూస్టర్ డోస్ వేయడం కోసం వచ్చానని నమ్మబలికింది. మంచంపై పడుకోబెట్టి తన బ్యాగులో ఉన్న బీపీ మిషన్, స్టెతస్కోప్‌తో పరీక్షించినట్లు నటించింది. చదవండి: ఆనందంగా గడిపి.. కుటుంబ సభ్యులందరూ నిద్రపోయాక.. తలను అటువైపు తిప్పుకోమని చెప్పి మెడలో ఉన్న మూడు తులాల చైన్‌ను కట్టర్‌తో కత్తిరించింది. వృద్ధురాలు గుర్తించి ఇదేమిటని ప్రశ్నించగా మళ్లీ చైన్ ఇస్తానంటూ ఆమె బ్యాగులో ఉన్న నకిలీ చైన్‌ను గొంతులో వేసి కదులకుండా పడుకో ఆఫీసర్‌ను పిలుచుకుని వస్తానంటూ అక్కడి నుంచి కనిపించకుండా మాయమైంది. వృద్ధురాలు కొద్దిసేపటికి తేరుకుని నకిలీ గొలుసు మెడలో వేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని సేకరించారు. రెండు నెలల క్రితం స్టాంటన్‌పురం, నరసింహారెడ్డి నగర్లో కూడా ఇదే తరహాలోనే మహిళ చోరీకి పాల్పడింది. సీసీ పుటేజీ ఆధారంగా పాత నేరస్తురాలిగా పోలీసులు నిర్దారణకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. -
ఇది మంచి పద్ధతి కాదు.. ముగించాల్సిందే!
కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని.. దేశాలన్నీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఉధృతం చేస్తున్నాయి. ఈ తరుణంలో వ్యాక్సినేషన్ తప్పనిసరి ఆదేశాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కెనడాలో ట్రక్కు డ్రైవర్లకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంతో వ్యతిరేక ఉద్యమం మొదలైంది. కానీ, ఈ ఉద్యమాన్ని ‘‘ఆమోదయోగ్యం కాదు” అని అంటున్నాడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. కెనడాలో ట్రక్కర్ల నిరసన చెయ్యి దాటిపోయింది. ఇంతకాలం దేశం మధ్యలో కొనసాగిన నిరసనలు.. ఇప్పుడు సరిహద్దుల దాకా చేరుకున్నాయి. సెంట్రల్ ఒట్టావాతో పాటు సరిహద్దులను సైతం మూసేస్తున్నారు నిరసనకారులు. పరిస్థితులు చేజారిన తరుణంలో.. ప్రధాని ట్రూడో సీరియస్ అవుతున్నారు. ముఖ్యంగా ట్రక్కర్లు నిరసనకు సంఘీభావంగా విండ్సర్, యుఎస్ నగరం డెట్రాయిట్ మధ్య అంబాసిడర్ బ్రిడ్జ్ దిగ్బంధనంలో ఎక్కువ మంది వ్యక్తులు చేరడంతో.. ఈ చేష్టలు కెనడా ఆర్థిక పునరుద్ధరణకు ముప్పు కలిగిస్తుందని ట్రూడో హెచ్చరిస్తున్నారు. ‘‘దిగ్బంధనాలు, చట్టవిరుద్ధమైన ప్రదర్శనలు ఆమోదయోగ్యం కాదు. వ్యాపారాలు, తయారీదారులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి” అని హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రధాని ట్రూడో ప్రసంగించారు. దిగ్బంధనాలతో మహమ్మారిని అంతం చేయలేం.. సైన్స్‌తోనే అంతం చేయడం వీలవుతుంది. ప్రజారోగ్య చర్యలతో దీనిని ముగించాలి అని ట్రక్కర్లను ఉద్దేశించి ప్రసంగించారాయన. ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి ఏం చేయాలో అది ప్రతీదీ చేసుకుంటూ పోతాం అంటూ హెచ్చరికలు జారీ చేశారాయన. కెనడియన్ రాజధాని ఒట్టావాలో రెండు వారాల పాటు సాగిన ట్రక్కర్లు నిరసనకు సంఘీభావంగా విండ్సర్ డెట్రాయిట్ మధ్య అంబాసిడర్ బ్రిడ్జ్ దిగ్బంధనం వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ట్రేడ్ కారిడార్‌గా ఉన్న ఈ వంతెన గుండా నిత్యం 40వేల మంది రాకపోకలు చేస్తుంటారు. దాదాపు 323 మిలియన్ డాలర్ల విలువైన సరుకుల రవాణా సాగుతుంటుంది. కోవిడ్ ఆరోగ్య నిబంధనలపై కోపంతో సరిహద్దు వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తే.. ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సిన కెనడా, మరింత దిగజారిపోక తప్పదని ఆర్థిక నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అంతకుముందు, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి మాట్లాడుతూ.. వంతెన దిగ్బంధనంపై కెనడియన్ సరిహద్దు ఏజెన్సీలతో యుఎస్ అధికారులు టచ్‌లో ఉన్నారని, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. -
ఎమర్జెన్సీలోనూ ఆగని నిరసనలు.. భారతీయులకు అలర్ట్
కెనడాలో రోడ్డెక్కిన ట్రక్కర్లు.. తగ్గేదేలే అంటున్నారు. రోడ్లను బ్లాక్ చేస్తూ మరీ.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అమెరికా కెనడా మధ్య తిరిగే ట్రక్కర్లకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంతో ఈ ఉద్యమం మొదలై.. తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ఒట్టావా రోడ్ల మీదకు వేలమంది చేరుకుని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతిగా దూకుడు చర్యలకు దిగని కెనడా ప్రభుత్వం.. ఎమర్జెన్సీ విధింపు ద్వారా ద్వారా ట్రక్కర్లను నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిణామాల నడుమ.. కెనడాలో ఉంటున్న భారతీయుల భద్రతపై స్వదేశంలోని వాళ్లు బంధువుల్లో ఆందోళన నెలకొంది. అయితే.. ఈ వ్యవహారంపై కెనడాలోని భారత హై కమిషన్ స్పందన కొంచెం ఆలస్యం అయ్యింది. కెనడాలోని భారతీయులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తాజాగా కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. నిరసనలు కొనసాగుతున్న మార్గాల గురించి, అక్కడి అధికారులు ఇచ్చిన సూచనలను పాటించాలంటూ భారతీయ పౌరులను కోరుతోంది. కెనడాలో నివసిస్తున్న భారతీయులు, కెనడాకు వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఈ సూచనలు చేసింది కెనడాలోని భారత హై కమిషన్. ట్రక్కర్ల నిరసనల మధ్య కెనడాలోని తమ దేశ పౌరులను 'అలర్ట్‌గా' ఉండాలని మంగళవారం ఆ ప్రకటనలో భారత్ కోరింది. రాజధాని ఒట్టావో సహా టొరంటో, మరికొన్ని ప్రధాన నగరాల్లో ట్రక్కర్ల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రోడ్డు బ్లాకులు, ప్రదర్శనలు, సామూహిక నిరసనలు నడుస్తున్నాయి. ఇది ట్రాఫిక్‌కు అంతరాయం కలిస్తోంది. కాబట్టి, నిరసనలు జరిగే ప్రాంతాల్లో, అక్కడి ప్రభుత్వం విధించిన ఆంక్షలను, సూచనలను పాటించండి. ఇబ్బంది పడోద్దు. కర్ఫ్యూలు, మీడియా ఇచ్చే సమాచారాన్ని అనుసరించండి. అంటూ ఆ ప్రకటన విడుదలలో పేర్కొంది భారత హై కమిషన్. Advisory for Indian Citizens in Canada or planning travel to Canada- Please take all precautions in light of the ongoing protests and public disturbance in Ottawa and other major Canadian cities. Special #Helpline for distressed Indian citizens in Canada- ☎️ 6137443751 pic.twitter.com/jNLodQuphU — India in Canada (@HCI_Ottawa) February 8, 2022 అంతేకాదు స్పెషల్ ఎమర్జెన్సీ నెంబర్ (+1) 6137443751 ను అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవచ్చని కోరింది. లేదంటే హై కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ద్వారా సాయం కోరవచ్చని సూచించింది. సాయం కోసం, మరింత సమాచారం కోసం టొరంటో, వాకోవర్ కాన్సులేట్స్లను నేరుగా కూడా సంప్రదించవచ్చు. ఇదిలా ఉంటే.. కెనడాలో ట్రక్కర్ల నిరసనతో రోడ్లు బ్లాక్ అయ్యాయి. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఒట్టావాలో ఎమర్జెన్సీని విధించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు 23 మందిని అరెస్ట్ చేసింది. -
అసోంలో 15 నుంచి కరోనా ఆంక్షల ఎత్తివేత
గౌహతి: రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలన్నింటినీ ఫిబ్రవరి 15 నుంచి ఎత్తేయాలని అసోం నిర్ణయించింది. కరోనా విజృంభణ, కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం హిమంత బిశ్వశర్మ సోమవారం మీడియాకు వెల్లడించారు. వచ్చే రెండు నెలల వ్యవధిలో స్కూలు బోర్డు పరీక్షలు, మున్సిపల్ తదితర ఎన్నికలు షెడ్యూల్ మేరకే జరుగుతాయని చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే స్టూడెంట్లంతా వ్యాక్సిన్ రెండు డోసులు విధిగా వేసుకోవాలన్నారు. ‘‘ఇక రాత్రి కర్ఫ్యూలుండవు. షాపింగ్, సినిమా మాల్స్ పూర్తి సామర్థ్యంతో నడుస్తాయి. పెళ్లిళ్లు, వేడుకలను రాత్రిళ్లు కూడా జరుపుకోవచ్చు. వాటిలో పాల్గొనే వాళ్లంతా విధిగా రెండు డోసులూ వేసుకోవాలి. మాస్కు ధరించాలి.’’ అని వివరించారు. దేశంలో 83,876 కేసులు దేశవ్యాప్తంగా సోమవారం 83,876 కొత్త కరోనా కేసులు, 895 మరణాలు నమోదయ్యాయి. మరణాల్లో 515 కేరళలో, 66 మహారాష్ట్రలో జరిగాయి. ఒమిక్రాన్ విజృంభణ తర్వాత గత 32 రోజుల్లో రోజువారీ కరోనా కేసులు లక్ష కంటే తగ్గడం ఇదే తొలిసారి. దేశంలో మొత్తం కరోనా కేసులు 4,2,72,014కు, మరణాలు 5,02,874కు చేరాయి. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 11,08,938కి తగ్గాయి. కోవిడ్ రికవరీ రేటు 96,19 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ పేర్కొంది. -
సింగిల్ షాట్ ‘స్పుత్నిక్’కు అత్యవసర అనుమతి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణ కోసం అభివృద్ధి చేసిన సింగిల్–డోసు స్పుత్నిక్ లైట్ టీకాకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదివారం ట్విటర్లో ప్రకటించారు. స్పుత్నిక్–5 టీకా తరహాలోనే స్పుత్నిక్ లైట్ టీకా పని చేస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. దీంతో డ్రగ్ రెగ్యులేటర్‌లోని నిపుణుల కమిటీ శనివారం ఈ మేరకు అనుమతులు జారీ చేసినట్లు సమాచారం. త్వరలో డీసీజీఐ పూర్తి స్థాయిలో తుది అప్రూవల్ ఇవ్వనుందని తెలుస్తోంది. స్పుత్నిక్ లైట్‌తో భారత్‌లో వ్యాక్సిన్ల సంఖ్య 9కి చేరింది. DCGI has granted emergency use permission to Single-dose Sputnik Light COVID-19 vaccine in India. This is the 9th #COVID19 vaccine in the country. This will further strengthen the nation's collective fight against the pandemic. — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) February 6, 2022 చదవండి: సూది, నొప్పి లేకుండా కరోనా వ్యాక్సిన్.. మనదేశంలోనే! -
అలాగైతే బడులు తెరవచ్చు!
న్యూఢిల్లీ: కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో బడులను తెరవచ్చని కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, కొత్త కేసులు స్థిరంగా తగ్గుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. అందుకే బడులు తెరవడంపై మార్గదర్శకాలు విడుదల చేశామన్నారు. దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, సిక్కిం, కర్ణాటక, త్రిపుర, తమిళనాడు, గోవా, మణిపూర్ సహా 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే పాఠశాలలు పూర్తిస్థాయిలో తెరుచుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి స్వీటీ ఛాంగ్సన్ చెప్పారు. అసోం, ఛత్తీస్‌గఢ్, చండీగఢ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, మిజోరం, రాజస్తాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మేఘాలయ, కేరళ, నాగాలాండ్, గుజరాత్, డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమబెంగాల్ సహా 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పాక్షికంగా తెరుచుకున్నాయని, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, పుదుచ్ఛేరి, జార్ఖండ్, లద్దాఖ్, జమ్మూకశ్మీర్, ఒడిశా, దిల్లీ తదితర 9 రాష్ట్రాల్లో ఇంకా పాఠశాలలు పునఃప్రారంభం కాలేదని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో స్కూలు సిబ్బంది వ్యాక్సినేషన్ పూర్తికావచ్చిందన్నారు. ప్రస్తుతం దేశంలో 268 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉందని పాల్ చెప్పారు. కరోనా వల్ల దేశీయ చిన్నారుల విద్యాభ్యాసం తీవ్రంగా దెబ్బతింటోందని అందరిలో ఆందోళన ఉందన్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు బడులు తెరిచేందుకు యత్నించాలన్నారు. పాఠశాలలకు నూతన మార్గదర్శకాలివే.. ► పిల్లల మధ్య 6 అడుగులు దూరం ఉండేలా తరగతుల్లో సీటింగ్ ఏర్పరచాలి. ► పాఠశాలలో పరిశుభ్ర వాతావరణం ఉంచుతూ, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ► పాఠశాల బస్సులు/వ్యాన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ► విద్యార్థులు, సిబ్బంది అంతా మాస్కులు ధరించాలి. ► పిల్లలను స్కూళ్లకు పంపేందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని తీసుకొనేలా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు చేపట్టాలి. ► ఒకవేళ తల్లిదండ్రులు ఆన్లైన్ తరగతులవైపే మొగ్గుచూపితే అందుకు అనుమతించాలి. ► ఇల్లులేని, వలస కూలీల పిల్లలు, కోవిడ్ సోకిన పిల్లలపై ప్రత్యేక దృష్టిసారించాలి. -
నాదల్ 21వ గ్రాండ్‌స్లామ్.. జొకోవిచ్ దిగిరానున్నాడా!
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎంత మొండిగా వ్యవహరించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు జొకోవిచ్ వ్యాక్సిన్ వేసుకోకుండానే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టాడు. అయితే కరోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు అనుమతిస్తామని ఆ దేశ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ విషయంలో జోకో విభేదించడం వివాదాస్పదంగా మారింది. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, జొకోవిచ్ మధ్య మొదలైన వివాదం కోర్టును కూడా తాకింది. అయితే కోర్టులోనూ జొకోవిచ్‌కు చుక్కెదురవడం.. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్‌ను మూడేళ్ల పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడకుండా నిషేధించడం సంచలనంగా మారింది. అలా గ్రాండ్‌స్లామ్ ఆడకుండానే వివాదాస్పద రీతిలో జొకోవిచ్ వెనుదిరిగాడు. చదవండి: చరిత్ర సృష్టించిన నాదల్.. హోరాహోరి పోరులో మెద్వెదెవ్పై సంచలన విజయం ఇదంతా గతం.. ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్ విషయంలో సెర్బియా స్టార్ దిగిరానున్నాడని సమాచారం. వ్యాక్సిన్ వేయించుకోవడానికి జొకోవిచ్ ఒప్పుకున్నట్లు.. అతని జీవిత కథ రాస్తున్న డానియెల్ ముక్స్ ఒక ప్రకటన చేయడం ఆసక్తి కలిగించింది.''జొకోవిచ్ ఉన్నపళంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి కారణం.. రఫెల్ నాదల్'' అని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను నాదల్ గెలవడం ద్వారా తన ఖాతాలో 21వ గ్రాండ్‌స్లామ్‌ను వేసుకున్నాడు. ప్రస్తుతం నాదల్ పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా ఉన్నాడు. దీంతో నాదల్ రికార్డును బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో జొకోవిచ్ వ్యాక్సిన్ వేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో నాదల్ రికార్డును బ్రేక్ చేయగల సత్తా ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకరు రోజర్ ఫెదరర్.. మరొకరు జొకోవిచ్. గాయాల కారణంగా టెన్నిస్‌కు దూరంగా ఉన్న ఫెదరర్ సాధిస్తాడన్న నమ్మకం లేదు. అయితే ఫామ్ పరంగా చూస్తే జొకోవిచ్‌కు మాత్రం సాధ్యమవుతుంది. జొకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో ఫెదరర్‌తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. చదవండి: Novak Djokovic: పోతూ పోతూ నష్టం మిగిల్చాడు.. కట్టేది ఎవరు? జొకోవిచ్ వ్యాక్సిన్ విషయంలో వెనక్కు తగ్గడానికి నాదల్ రికార్డును బ్రేక్ చేయాలన్న కారణం మాత్రమే కాదు. దీనివెనుక మరొకటి కూడా ఉంది. ఇకపై టెన్నిస్‌లో ఏ టోర్నమెంట్ అయినా ఆటగాళ్లకు వ్యాక్సిన్ తప్పనిసరి అని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య స్పష్టం చేసింది. రానున్న వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ వ్యాక్సిన్ తీసుకున్న ఆటగాళ్లనే అనుమతి ఇస్తామని పేర్కొన్నాయి. దీంతో జొకోవిచ్ దెబ్బకు దిగిరానున్నాడు. ఒకవేళ ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోకుంటే మాత్రం తనను తానే నష్టపరుచుకున్నట్లు అవుతుందని.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ కల నెరవేరదనే ఉద్దేశంతోనే జొకోవిచ్ వ్యాక్సిన్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. చదవండి: Novak Djokovic: కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో జకోవిచ్..! Another chapter is written 🏆@RafaelNadal defeats Daniil Medvedev 2-6 6-7(5) 6-4 6-4 7-5 to win his second #AusOpen title in an epic lasting five hours and 24 minutes. ⁰ 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/OlMvhlGe6r — #AusOpen (@AustralianOpen) January 30, 2022 -
ప్రస్తుతమున్న టీకాలు ఒమిక్రాన్‌ను నిరోధిస్తాయా?
న్యూఢిల్లీ: కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఏ.2 వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. మిగతా సబ్ వేరియంట్స్‌తో పోలిస్తే ఇది చాలా శక్తివంతమైనదని.. భారత్, డెన్మార్క్ దేశాల్లో ఇది ఎక్కువగా ప్రభావం చూపనుందని ‘ఎన్డీటీవీ’తో చెప్పారు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడి రెండు నెలలే అయినందువల్ల దాని ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎటువంటి అంచనాకు రాలేకపోతుందన్నారు. ఒమిక్రాన్ తిరిగి ఇన్ఫెక్షన్కు కారణమవుతుందా, దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి అధ్యయనాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. కొత్త వేరియంట్ నుంచి కోలుకున్న రోగుల రక్తం డెల్టా ఇన్ఫెక్షన్కు కారణమయినట్టు కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయని.. భవిష్యత్ వేరియంట్ల విషయంలో ఇలా జరుగుతుందో, లేదో కచ్చితంగా చెప్పలేమన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను సమర్థవంతంగా పూర్తిస్థాయిలో కట్టడి చేయలేవని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ‘పస్తుతమున్న టీకాలు డెల్టా వేరియంట్ కంటే కూడా తక్కువగా కొత్త వేరియంట్‌ను న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉంది. అయితే, టీకాలు వేసిన రోగులలో మరణాలు.. తీవ్రమైన వ్యాధి కేసులు తక్కువగా ఉన్నట్లు క్లినికల్ డేటా చూపిస్తోంది. కాబట్టి ప్రస్తుత వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌పై పనిచేస్తాయా, లేదా అనే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆసుపత్రిలో చేరడం, మరణాలను తగ్గించే విషయంలో టీకాలు బాగా పనిచేస్తున్నాయి. వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వ్యాక్సిన్లు రక్షణ కవచంగా నిలుస్తున్నాయ’ని చెప్పారు. యాంటీబాడీ ప్రతిస్పందనను మాత్రమే పరిగణనలోకి తీసుకుని వ్యాక్సిన్ల పనితీరుపై అంచనా రాలేమని.. క్లినికల్ డేటాను జాగ్రత్తగా పరిశీలించడంతో పాటు టీ-సెల్ ప్రతిస్పందన వంటి ఇతర అంశాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుందని వివరించారు. కోవిడ్ ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి భవిష్యత్‌లో మరిన్ని వేరింయట్స్ రావొచ్చన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొనే యూనివర్సల్ వ్యాక్సిన్ గురించి డబ్ల్యూహెచ్ఓ కసరత్తు చేస్తోందన్నారు. బూస్టర్ డోస్ తీసుకోవాలా, వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి స్థానిక డేటాను తప్పనిసరిగా అధ్యయనం చేయాలని సౌమ్య స్వామినాథన్ స్పష్టం చేశారు. అధిక జనాభాకు టీకాలు వేయడంలో భారతదేశం విజయవంతం అయిందని ప్రశంసించారు. నోటి ద్వారా తీసుకునే మాత్రలు కోవిడ్ అన్ని వేరియంట్లను నియంత్రించడానికి పనికొస్తాయని తెలిపారు. మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సలు మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదన్నారు. -
మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా..! అయితే ఈ ఆఫర్ మీకోసమే..!
కోవిడ్-19ను ఎదుర్కొవాలంటే వ్యాక్సినేషన్ కచ్చితమని ఇప్పటికే నిపుణులు, డాక్లర్లు వెల్లడించిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు పలు మల్టీనేషన్ కంపెనీలు వినూత్న ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో విమాన ప్రయాణికుల కోసం సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. టికెట్‌పై 10 శాతం రాయితీ..! కరోనా వ్యాక్సిన్ ఒకటి లేదా రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులకు విమాన టికెట్లపై 10శాతం వరకు రాయితీ అందిస్తామని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. అందుకోసం ‘వాక్సి ఫేర్’ అనే కొత్త ఆఫర్‌ను విమాన ప్రయాణికులకోసం తీసుకువచ్చింది. ఈ ఆఫర్‌పై కొన్ని షరతులు ఇండిగో ప్రకటించింది. విమాన ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయానికి భారత్‌లో ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. కేవలం ఇండిగో వెబ్సైట్లో బుకింగ్ చేసుకునేవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. టికెట్లను బుక్ చేసుకున్న తేదీ నుంచి 15 రోజుల తర్వాత మాత్రమే ఈ డిస్కౌంట్ రానుంది. అయితే ప్రయాణించే సమయంలో ఎయిర్పోర్ట్ చెక్ ఇన్‌లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. బుకింగ్ ఇలా చేయండి..! ముందుగా ఇండిగో ఆఫిషియల్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి తరువాత మీరు ప్రయాణించే గమ్యస్థానాన్ని ఎంచుకునే సమయంలో వ్యాక్సి ఫేర్‌ను ఎంచుకోండి. మొదటి డోసు లేదా రెండో డోసు ఆప్షన్‌ను సెలక్ట్ చేయండి. ఈ ఆప్షన్ తరువాత పేమెంట్ చేసిన వెంటనే టికెట్ బుక్ ఐనట్లు మీకు నోటిఫికేషన్ వస్తోంది. అయితే ఇక్కడ టికెట్ బుక్ చేసే సమయంలో కచ్చితంగా మీ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. All vaccinated and ready to travel? Book with Vaxi Fare to make the most of your trip. Know more https://t.co/diRT9rTFtw #LetsIndiGo #Aviation #Vaccination #VaxiFare pic.twitter.com/GBwy9EOgtV — IndiGo (@IndiGo6E) February 1, 2022 చదవండి: విమాన ప్రయాణమంటే ఎయిర్ ఇండియానే గుర్తు రావాలి - రతన్ టాటా -
సాక్షి కార్టూన్
-
ఏ వ్యాక్సిన్‌కైనా పీత రక్తమే దిక్కు.. లీటర్ రక్తం ధరెంతో తెలుసా?
Horseshoe Crab Blood: కరోనాకు వ్యాక్సిన్ వేసుకుంటున్నాం. రెండు డోసులు అయింది. బూస్టర్ డోసు వచ్చింది. తర్వాతా అవసరం పడొచ్చని అంటున్నారు. ఇంత అత్యవసరమైన వ్యాక్సిన్లు ఎంత భద్రమో తేల్చేది ఎవరో తెలుసా? ఎక్కడో సముద్రాల్లో బతికే ఓ చిన్నపాటి పీత. మనకు దాని రక్తం ధారపోసి బతుకునిస్తున్న ఈ పీతల వల్లే.. భారీస్థాయిలో కరోనా వ్యాక్సిన్లు త్వరగా అందుబాటులోకి వచ్చాయి. ఇదే కాదు.. ఏ వ్యాక్సిన్, ఔషధమైనా ప్రమాదకర బ్యాక్టీరియా లేదని తేల్చేందుకు వాటి రక్తమే దిక్కు. మరి ఆ పీతలేమిటి, మనకు జరుగుతున్న ప్రయోజనమేమిటో తెలుసుకుందామా.. తాబేలుకు ఉన్నట్టుగా డొప్పలాంటి తల భాగం.. దానిపై పది కళ్లు.. డొప్ప మధ్యలో వేలాడుతున్నట్టుగా శరీరం.. పదునుగా ఉండే ముళ్లు.. మధ్య నుంచి పొడవాటి తోక.. చిత్రమైన శరీరమున్న జీవి ‘హార్స్‌షూ క్రాబ్’. కోట్ల ఏళ్లుగా పరిణామం చెందకుండా ఉండిపోయిన ‘హార్స్‌షూ’ పీతలు.. ఒక్క విషయం మాత్రం అత్యంత అద్భుతమైన సామర్థ్యాన్ని సంతరించుకున్నాయి. అదే వాటి రోగ నిరోధక శక్తి. అత్యంత సూక్ష్మస్థాయిలో (వెయ్యి కోట్లలో ఒక వంతు) కూడా బ్యాక్టీరియా వంటి ప్రమాదకర సూక్ష్మజీవులు ఉన్నా గుర్తించగల సామర్థ్యం వాటి సొంతం. 1960వ దశకంలో శాస్త్రవేత్తలు దీని ప్రత్యేకతను గుర్తించారు. అప్పటి నుంచీ వ్యాక్సిన్లు, ఇతర ఇంజెక్షన్లు, సర్జికల్ ఇంప్లాంట్లు వంటివి ప్రమాదకర సూక్ష్మజీవులతో కలుషితం కాలేదని తేల్చుకునేందుకు ఈ పీతల రక్తాన్ని వినియోగించడం మొదలుపెట్టారు. చదవండి: బుసలు కొడుతూ పైకి లేచిన 14 అడుగుల కింగ్ కోబ్రా.. ►ఈ పీత రక్తకణాలను వేరుచేసి ‘ఎల్ఏఎల్ (లిమ్యులస్ అమిబోసైట్ లైసేట్)’ను ఉత్పత్తి చేస్తారు. వ్యాక్సిన్లు, యాంటీ బయాటిక్స్, ఇతర ఇంజెక్షన్లు, ఔషధాలలో ప్రతి బ్యాచ్‌ను ఈ ఎల్ఏఎల్తో పరీక్షిస్తారు. సదరు వ్యాక్సిన్/ఇంజెక్షన్/ఔషధంలో ప్రమాదకర బ్యాక్టీరియా ఏమాత్రం ఉన్నా.. ఎల్ఏఎల్ గుర్తిస్తుంది. ► బ్యాక్టీరియా ఉన్నట్టు సదరు వ్యాక్సిన్/ఔషధాన్ని పడేస్తారు లేదా శుద్ధిచేసి మళ్లీ పరీక్షిస్తారు. ప్రమాదమేమీ లేదని తేలితే.. ప్యాకేజింగ్ చేసి, విక్రయానికి పంపుతారు. ►శరీరం లోపల అమర్చే స్టెంట్లు, పేస్మేకర్లు, ఇతర ఇంప్లాంట్లు, సర్జికల్ పరికరాలను కూడా ఎల్ఏఎల్తో పరీక్షిస్తారు. ► కోవిడ్ మహమ్మారి మొదలైన తర్వాత వందల కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నారు. వాటన్నింటినీ హార్స్‌షూ రక్తంతో పరీక్షించి, భద్రమని తేల్చాకే మార్కెట్లోకి వస్తున్నాయి. లీటర్ రక్తం రూ.12 లక్షలు! ‘హార్స్‌షూ’ పీతల రక్తానికి ప్రపంచవ్యాప్తంగా ఔషధ, వైద్యారోగ్య సంస్థల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేగాకుండా పీతల సేకరణ, రక్తం తీయడం వంటివన్నీ క్లిష్టమైన పనులే. దీనితో ఈ రక్తం ధర ఒక్క లీటర్‌కు రూ.12 లక్షలు (16 వేల డాలర్లు) పైనే ఉంటుంది. అందుకే నీలి బంగారం (బ్లూగోల్డ్) అని పిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలు ఏటా వందల కోట్ల రూపాయలను ఈ పీతల రక్తం (ఎల్ఏఎల్) కోసం వెచ్చిస్తుంటాయి. చదవండి: జస్ట్ మిస్.. లేదంటే తలకాయ్ నిమ్మకాయలా నలిగేది.. వీడియో వైరల్! గుండె నాళానికి సూది గుచ్చి.. సముద్రం, తీర ప్రాంతాల నుంచి హార్స్‌షూ పీతలను సేకరించి, ల్యాబ్‌కు తీసుకొస్తారు. అక్కడ వాటి బరువును తూచి, రక్తం సరిపడా ఉన్నవాటిని వేరుచేస్తారు. అనంతరం ఆ పీతలను శుభ్రం చేసి.. వాటి గుండెకు సమీపంలోని రక్తనాళానికి సూదులుగుచ్చి రక్తం సేకరిస్తారు. వాటి శరీరంలో ఉండే మొత్తం రక్తంలో నుంచి సగానికిపైగా లాగేశాక.. తీసుకెళ్లి తిరిగి సముద్రంలో వదిలేస్తారు. ఈ సేకరణ, తరలింపు, రక్తం తగ్గిపోవడం క్రమంలో దాదాపు మూడో వంతు పీతలు చనిపోతుంటాయి. సెప్సిస్‌ను గుర్తించేందుకు.. సాధారణంగా ఏదైనా దెబ్బతగలడం, వ్యాధి వల్ల, శస్త్రచికిత్స ద్వారా అయిన గాయాలు మానకుండా.. పుండ్లుగా మారి, చీముపట్టడాన్ని సెప్టిక్ అంటాం. సదరు గాయంలోని ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపించి.. శరీర అవయవాలను దెబ్బతీసే స్థితిని ‘సెప్సిస్’గా చెప్తారు. మొదట్లోనే దీన్ని గుర్తించలేక.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోటి మంది చనిపోతున్నట్టు అంచనా. హార్స్‌షూ పీతల రక్తం నుంచి తీసే ‘ఎల్ఏఎల్’ ద్వారా ‘సెప్సిస్’ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ రకంగానూ హార్స్‌షూ పీతలు మానవాళికి మేలు చేస్తున్నాయి. లేత నీలి రంగులో.. మనుషుల రక్తంలోని హిమోగ్లోబిన్లో ఇనుము (ఐరన్) ఉండటం వల్ల ఎరుపు రంగులో ఉంటుంది. అదే ‘హార్స్‌షూ’ పీతల రక్తం లేత నీలి రంగులో ఉంటుంది. వాటి రక్త కణాల్లో ఉండే రాగి (కాపర్) అణువులే దీనికి కారణం. ఇది ఈ పీతల మరో ప్రత్యేకత. ప్రమాదం అంచుకు చేరడంతో.. గత 40 ఏళ్లలో ఈ పీతల సంతతి 80 శాతం మేర అంతరించి పోయిందని అంచనా. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లతో వాటికి మరింత కష్టమొచ్చి పడింది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తుండటంతో.. వాటి టెస్టింగ్ కోసం భారీగా పీతలను పడుతూ, రక్తాన్ని సేకరిస్తున్నారు. సాధారణంగా ఏటా ఒక్క అమెరికా తూర్పు తీరప్రాంతంలోనే 5 లక్షలకుపైగా ‘హార్స్‌షూ’ పీతలను సేకరిస్తారని అంచనా. అంతేకాదు మెక్సికో, చైనా, మరికొన్ని దేశాల్లోనూ భారీ ఎత్తున హార్స్‌షూ పీతలను సేకరిస్తుంటారు. మనుషులు రక్త పిశాచాల్లా ఏటా లక్షలాది ‘హార్స్‌షూ’ పీతల నుంచి రక్తాన్ని పిండేస్తున్నారని.. ఇది జీవహింస అని కారుణ్యవాదులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. కోట్ల ఏళ్లుగా మారకుండా.. ఒకప్పటి గొరిల్లా/చింపాంజీల నుంచి మనుషులు అభివృద్ధి చెందినట్టుగా.. కాలం గడిచినకొద్దీ ప్రతి జీవి పరిణామం చెందుతుంది. కానీ ‘హార్స్‌షూ’ పీతలు పెద్దగా పరిణామం చెందకుండా.. సుమారు 45 కోట్ల ఏళ్ల కిందట (డైనోసార్ల కంటే ముందటి కాలం నుంచి) ఎలా ఉన్నాయో, ఇప్పటికీ అలాగే ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే వీటిని బతికున్న శిలాజాలుగా పిలుస్తున్నారు. -
వ్యాక్సీన్ తీసుకోని రోగికి గుండె మార్పిడి శస్త్రచికిత్స నిరాకరించిన వైద్యులు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రెండు, మూడు నెలలకొకసారి తన రూపంతారం మార్చుకుని ప్రజలపై దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌ను కచ్చితం చేశాయి. ఎక్కడికి వెళ్లినా... కరోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే అనుమతులు ఇస్తున్నారు. అయితే ఈ నిబంధన కారణంగా కొన్ని అనర్థాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గుండె మార్పిడి ఆపరేషన్ చేయాల్సిన ఓ వ్యక్తికి కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని సుపత్రి వర్గాలు నిరాకరించాయి. ఈ సంఘటన అమెరికాలోని బోస్టన్‌లో గల ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డీజే ఫెర్గుసన్ అనే అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి గుండె మార్పిడి చికిత్స అత్యవసరంగా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే డీజే ఫెర్గుసన్‌ను బోస్టన్‌లో ఉన్నటు వంటి.. బ్రిఘం & ఉమెన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. గుండె మార్పిడి చికిత్స కోసం ఆసుపత్రి నిబంధనల ప్రకారం.. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేశారు. అంతలోనే ఆస్పత్రి ట్విస్ట్ ఇచ్చింది. డీజే ఫెర్గుసన్.. ఇంత వరకు సింగిల్ డోస్ కూడా వేసుకోలేదని, అతను వ్యాక్సిన్ వేసుకుంటేనే తాము చికిత్స చేస్తామని ఆస్పత్రి వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో డీజే ఫెర్గుసన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చదవండి: మనిషి చర్మంపై ఒమిక్రాన్ ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా? అత్యవసర సమయంలో ఇలాంటి నిబంధనలు ఎంటని నిలదీశారు. తాను అస్సలు వ్యాక్సిన్ వేసుకోబోనని అటు డీజే ఫెర్గుసన్ మొండి పట్టు పట్టారు. ఇంకేముంది.. తాము ఆపరేషన్ చేయలేమని ఆస్పత్రి సిబ్బంది కుండ బద్దలు కొట్టారు. వ్యాక్సిన్ వేయించుకుంటేనే తాము ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పారు. ఇప్పుడు ఈ సంఘటన వివాదంగా మారింది. కాగా అమెరికా జనాభాలో 63 శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకాను తీసుకోగా, 40 శాతం మంది అమెరికన్లు బూస్టర్ డోస్‌ను కూడా వేసుకున్నారు. చదవండి: అరుణాచల్ యువకుడిని అప్పగించేందుకు ఓకే చెప్పిన చైనా -
కోవిడ్ వాక్సినేషన్లో కరీంనగర్ రికార్డు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వాక్సినేషన్లో కరీంనగర్ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోసు పంపిణీ 100 శాతం పూర్తయింది. తద్వారా రాష్ట్రంలోనే రెండు డోసులు 100 శాతం పూర్తి చేసుకున్న తొలి జిల్లాగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డు సొంతం చేసుకుంది. జిల్లాలో అర్హులైన 7,92,922 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మొదటి డోసు లక్ష్యానికి మించి 104 శాతం మందికి వేశారు. ఇప్పటివరకు 8,27,103 డోసులు పంపిణీ చేశారు. ఇదే స్ఫూర్తితో రెండో డోసు సైతం పూర్తిచేశారు. మంగళవారం నాటికి జిల్లాలో 7,94,404 మందికి రెండో డోసు పంపిణీచేసి 100 శాతం అధిగమించిన తొలి జిల్లాగా రికార్డు సృష్టించారు. దక్షిణాది రాష్ట్రాల్లో రెండు డోసులు పూర్తయిన తొలి జిల్లాగా బెంగళూరు అర్బన్ రికార్డు సృష్టించగా, కరీంనగర్ రెండో స్థానంలో నిలిచింది. దీనిపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లాలు వందశాతం దిశగా.. మొదటి డోసులో తెలంగాణ ఇప్పటికే 100% లక్ష్యాన్ని అధిగమించిన సంగతి తెలిసిందే. నిజామాబాద్, సూర్యాపేట, కామారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో వందశాతం పూర్తయితే అన్ని జిల్లాలు రెండు డోసులు వందశాతం పూర్తయిన రికార్డు సొంతం కానున్నది. -
కోవిడ్ టీకా వేసుకోలేదా? జర జాగ్రత్త! 95 శాతం మరణాలు వారివే!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వచ్చిన వారిలో టీకా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోంది. రెండు డోసులు వేసుకున్న వారు కరోనా బారిన పడుతున్నప్పటికీ ప్రమాదకర పరిస్థితులు లేవు. ఇక టీకా తీసుకోని వారు మాత్రం కరోనా బారిన పడితే వారి ఆరోగ్యస్థితి సంకటంలో పడినట్లేనని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్) స్పష్టం చేస్తోంది. దేశంలో గత ఏప్రిల్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 2 వరకు చోటుచేసుకున్న కరోనా మరణాలపై ఐసీఎంఆర్ విశ్లేషణ జరిపింది. ఇందులో సగటున 95 శాతానికిపైగా వ్యాక్సిన్ తీసుకోని వారుగా తేలింది. గత ఏప్రిల్ నుంచి దేశంలో నమోదవుతున్న కోవిడ్–19 మరణాలను నమోదుచేస్తున్న ఐసీఎంఆర్.. వారానికోసారి ఈ గణాంకాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తోంది. గత ఏడాది చివరి వారమైన డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు దేశవ్యాప్తంగా 2,088 మంది మరణించగా, వీరిలో 2,082 మంది (99.70%) టీకా తీసుకోని వారే ఉన్నారు. కేవలం ఆరుగురే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ 60 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కావడం గమనార్హం. ఐదు లక్షలకు చేరువలో... దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3.7 లక్షల మంది రికవరీ కాగా, మరో 23 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,89,848 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. అంటే వైరస్ సోకిన వారిలో సగటున 1.24 శాతం మంది మరణించారు. మొదటివేవ్తోపాటు రెండోవేవ్‌లో అర్ధభాగం వరకు జరిగిన మరణాల్లో అన్ని వయసుల వారుండగా... వ్యాక్సినేషన్ మొదలయ్యాక మాత్రం మరణాల సంఖ్య తగ్గింది. టీకాతో 88 రెట్లు సురక్షితం ♦2021లో చివరి నాలుగు వారాల్లో దేశవ్యాప్తంగా 9,226 మంది కరోనాతో మరణించారు. వీరిలో టీకా వేసుకున్న వారు 24 మంది మాత్రమే. ♦దేశంలో కోవిడ్‌తో అత్యధిక మరణాలు గత మే నెల రెండో వారంలో జరిగాయి. వారం రోజుల వ్యవధిలో 26,820 మంది మరణించారు. ఇందులో టీకా తీసుకోని వారు 26,438 మంది కాగా, సింగిల్ డోస్ తీసుకున్న వారు 243 మంది, డబుల్ డోసు తీసుకున్నవారు 39 మంది ఉన్నారు. ♦వ్యాక్సిన్ తీసుకుని మరణించిన వారిలో 83 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నట్లు ఐసీఎంఆర్ పరిశీలన చెబుతోంది. ♦60 ఏళ్లు పైబడిన వారిలో టీకా తీసుకోని వారితో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకున్న వారు 88 రెట్లు సురక్షితంగా ఉన్నారు. ♦గత నవంబర్ నుంచి 60ఏళ్లు పైబడిన వారి మరణాలు 1.3 రెట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వారిలో రెండు డోసుల టీకా వేసుకున్న తర్వాత ఇమ్యూనిటీ తగ్గుతుండటమే. అందువల్లనే బూస్టర్ డోసు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐసోలేషన్‌లో ఉంటే మేలు డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఐసోలేషన్ పాటించడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయం ఇంట్లో జాగ్రత్తలు పాటిస్తే వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. అదేవిధంగా రెండు డోసులు వేసుకున్న వాళ్లు అర్హతల ఆధారంగా తప్పకుండా బూస్టర్ డోసు తీసుకోవాలి. -
మన చేతుల్లోనే... చేతల్లోనే...
ఒక దుర్వార్త... ఆ వెంటనే ఓ శుభవార్త. కరోనాపై దేశంలో తాజాగా వినిపిస్తున్న విషయాలివి. విజృంభిస్తున్న కరోనా మూడోవేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ ఇప్పుడు సామాజిక వ్యాప్తి దశలో ఉందని ‘ఇన్సాకాగ్’ (ఇండియన్ సార్స్–కోవ్2 జీనోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సార్టియమ్) ఆదివారం హెచ్చరించింది. కరోనా ప్రమాద స్థాయి ఇప్పటికీ అలానే ఉందనీ అప్రమత్తం చేస్తోంది. ఇది ఎవరూ ఇష్టపడని వార్త. కాగా, భయపెడుతున్న ఈ థర్డ్ వేవ్‌కు ఫిబ్రవరి మధ్యకల్లా తెరపడుతుందని ప్రభుత్వ వర్గాల తాజా మాట. ప్రతి ఇంటా ఒకరికి ఇద్దరు జ్వరం, జలుబు లాంటి కరోనా లక్షణా లతో బాధ పడుతున్న వేళ ఇది చెవికి ఇంపైన మాట. రానున్న పక్షం రోజుల్లో ఈ వేవ్ తారస్థాయికి చేరుతుందనే ఐఐటీ మద్రాసు ప్రాథమిక అంచనాతో అప్రమత్తత తప్పనిసరి అని అర్థమవుతోంది. గత తొమ్మిదివారాల్లో ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది ఒమిక్రాన్ బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్క. 170కి పైగా దేశాలకు పాకిన ఈ వేరియంట్, వేవ్ విస్తృతికి ఇదే ఉదాహరణ. అలాగే, ఒమిక్రాన్ పోతే ఇక ప్రపంచానికి కరోనా పీడ విరగడ అయినట్టేనని అందరిలో నెలకొంటున్న ఉదాసీనత పెద్ద పొరపాటు. ఒమిక్రాన్ తర్వాత మరిన్ని కొత్త వేరియంట్లు రావ చ్చంటూ డబ్యూహెచ్ఓ చేసిన తాజా ప్రకటన ఓ పారాహుషార్. మన దేశంలో ఇప్పటికీ రోజుకు 3 లక్షల కేసుల పైనే వస్తున్నాయి. పాజిటివిటీ రేటు 20కి పైనే ఉంది. ఢిల్లీ, ముంబయ్ లాంటి నగరాల్లో ముందుగానే తడాఖా చూపిన థర్డ్ వేవ్ అక్కడ కాస్తంత తగ్గుముఖం పట్టినా, దేశంలోని పలుచోట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు విస్తరిస్తూ ఉండడం ఆందోళనకరం. వేర్వేరు భౌగోళిక పరిస్థితులున్న విశాల భారతావనిలో అంతటా ఒకేసారి కరోనా ఉద్ధృతి కనిపించి, ఒకేసారి తగ్గి పోదనే విషయం గమనంలో ఉంచుకోవడం అవసరం. పెరుగుతున్న కేసులతో వైద్యం మొదలు అన్ని రంగాల్లో సిబ్బంది తగ్గి, పని ఒత్తిడి పెరుగు తుండడం మరో పెద్ద చిక్కు. ఒక పక్క డెల్టా ప్రభావం పూర్తిగా పోలేదనీ, నూటికి 10 – 20 కేసులు ఆ వేరియంట్వీ ఉన్నాయనీ ఓ అంచనా. డెల్టా ఉండగానే ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది గనక రెండిందాలా జాగ్రత్త తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ దేశంలో ఇప్పటికి 162 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు వేయడం సంతోషకరం. దేశంలో 15 ఏళ్ళ పైబడినవారిలో ఇప్పటికి 67.2 శాతం మందికి పూర్తిగా, 91.3 శాతం మందికి కనీసం ఒక డోసు వేసినట్టు లెక్క. కానీ, దురదృష్టవశాత్తూ లోటుపాట్లూ లేకపోలేదు. తొలి డోసే వేస్తున్నా, రెండో డోసు టీకా వేస్తున్నట్టు సర్టిఫికెట్లలో నమోదు చేయడం లాంటి వార్తలు రాజధానుల్లో సైతం రావడం నివ్వెరపరుస్తోంది. చిత్తశుద్ధి లేకుండా లెక్క ల్లోనే టీకా డోసులు చూపించడమనే తప్పిదానికి పాల్పడితే, అది మొదటికే మోసం తెస్తుంది. ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకుంటే తప్ప, ఏ ఒక్కరూ సురక్షితం కాదని ప్రపంచమే ఘోషిస్తున్న వేళ కాకి లెక్కలకు దిగితే కష్టం. జనాన్ని మోసం చేయచ్చేమో కానీ, జాలి లేని మహమ్మారిని మోసం చేయలేం. జీవనం దెబ్బతినకుండా ప్రజల్లో, ఆర్థిక వ్యవస్థలో ధైర్యం కలిగించాల్సింది పాలకులైతే, మహమ్మారిని సైతం జయించగలమని ఆత్మవిశ్వాసం ప్రోది చేయాల్సింది వైద్యనిపుణులు. రోజుకో మాట, పూటకో రకం ప్రోటోకాల్... సందేహాలకు దారి తీస్తున్నాయి. మోల్నుపిరావర్ లాంటి ఔష ధాల వాడకంపై వచ్చిన పరస్పర భిన్నమైన ఆదేశాలే అందుకు నిదర్శనం. కోట్ల జనాభా కారణంగా రోగానికి సత్వర చికిత్సపై పరిశోధకులపై ఒత్తిడి ఉండడం సహజమే కానీ, పరిశోధనా ఫలితాలు మన అవసరాలకు తగ్గట్టుగానే ఉండాలని ఒత్తిడి పెడితే సరి కాదు. సెకండ్ వేవ్‌లో లాగా థర్డ్ వేవ్‌లో ఆక్సిజన్ అవసరం రాకపోవడం సంతోషించాల్సిందే. కానీ, ఒమిక్రాన్ సాధారణ జ్వరం – జలుబు లాంటిదేననీ, మహమ్మారి కాస్తా మామూలు జలుబులా మారిపోతోందనీ అతి ప్రచారం నిర్లక్ష్యానికి బాటలు వేస్తోంది. పాక్షిక నిజమైన ఆ ప్రచారాన్ని పట్టుకొని, అశ్రద్ధ చూపితే అది ప్రమాదమని నిపుణుల మాట. మరి, ఈ సీరియస్ విషయం జనంలోకి మొదటి ప్రచారమంత బలంగా వెళుతోందా అన్నది ప్రశ్న. తొందరపడి ముందే కూసిన కోయిలలా చేస్తే కష్టం, నష్టం మనకే! మన దేశంలో కరోనా మొదటి వేవ్‌కు కారణమైన ఆల్ఫా వేరియంట్ కన్నా, రెండో వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ తీవ్రత ఎక్కువ చూపింది. 18 ఉత్పరివర్తనాలున్న డెల్టాతో పోలిస్తే, 50 మ్యుటేషన్లున్న ఒమిక్రాన్ 70 రెట్లు అధికంగా వ్యాపిస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్‌తో ప్రాణహాని లేదని నిర్లక్ష్యంగా తిరిగి, వ్యాప్తిని పెరగనిస్తే చిక్కే. ఒమిక్రాన్ నుంచి కొత్త వేరియంట్లు తలెత్తే ప్రమాదం ఉంది. టీకా వేసుకున్నా సరే దెబ్బ కొడుతున్న ఒమిక్రాన్‌తో పోలిస్తే, ఆ కొత్తవి మునుపటి డెల్టాలా తీవ్రమైనవి కావచ్చని వైద్యుల హెచ్చరిక. అందుకే, థర్డ్ వేవ్ విజృంభణ వేళ అలకు ఎదురెళ్ళ కుండా, తల వంచుకొని తప్పించుకోవాలి. చేజేతులా కొత్త వేరియంట్‌కు కారణం కారాదు. కరోనా అనంతర దీర్ఘకాలిక కోవిడ్ ఇబ్బందులుంటాయనీ విస్మరించరాదు. కరోనా లెక్కల్లో మనం ఒక అంకె మాత్రమే. కానీ, మన కుటుంబానికి... మనమే సర్వస్వం. తోటివారి పట్ల కూడా బాధ్యతతో కరోనా జాగ్రత్తలు పాటించడమే ప్రస్తుత కర్తవ్యం. ఆఫ్రికాలోని కెన్యా, నైజీరియా లాంటి మధ్యాదాయ దేశాల్లో సైతం టీకాకరణ 10 శాతం లోపలే అయింది. ఈ ఏడాది మధ్యకల్లా ప్రతి దేశంలో కనీసం 70 శాతం జనాభాకు టీకాలేయడం పూర్తయితేనే, ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ సురక్షితం! -
ఒకటి రెండూ కాదు..మొత్తంగా నాలుగు..! కోవిడ్ వ్యాక్సిన్‌పై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
Covid-19: మొదటి, రెండో డోసు తర్వాత.. బూస్టర్ డోసుకు ముందు కొత్తగా అదనపు డోసును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. రోగ నిరోధకశక్తి బాగా తక్కువున్నవారికి ఈ డోసు వేస్తేనే కరోనా నుంచి సమగ్ర రక్షణ లభిస్తుందని స్పష్టం చేసింది. అంటే వీరు మొత్తం నాలుగు డోసులుగా టీకాలు తీసుకోవాలన్నమాట. వ్యాక్సిన్లకు సంబంధించి ప్రాధాన్యాలపై డబ్ల్యూహెచ్ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. రోగనిరోధక శక్తి బాగా తక్కువ ఉన్నవారిలో వ్యాక్సిన్ సంబంధిత రక్షణ ఉత్పత్తి కావడం లేదు. ప్రస్తుత కేన్సర్ రోగులు, అలాగే ఏడాదిలోపు కేన్సర్ మందులు వాడినవారు, రెండేళ్ల లోపు అవయవ మార్పిడి జరిగిన వారు, డయాలసిస్‌లో ఉన్నవారు, ఎయిడ్స్ రోగుల్లో సీడీ4 సెల్స్ 200 కంటే తక్కువున్న వారు.. ఇలా ఏదో ఒకరకంగా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి అదనపు డోసు ఇవ్వాలి. మిగతావారికి ఈ అదనపు డోసు అవసరం లేదు. అందరికీ బూస్టర్ డోసు ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఏవీ కూడా కరోనా వ్యాప్తిని ఆపలేవు. ఒమిక్రాన్ విషయంలో వ్యాక్సిన్ల పనితీరు గతంతో పోలిస్తే తగ్గింది. అందువల్ల అందరికీ బూస్టర్ డోసు తప్పనిసరిగా వేయాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. అయితే హైబ్రిడ్ ఇమ్యూనిటీతోనే కరోనా నుంచి పూర్తిస్థాయి రక్షణ లభిస్తుంది. సాధారణ రోగనిరోధక శక్తి, బూస్టర్ డోసు కంటే కూడా ఇది చాలా శక్తిమంతమైంది. రెండు డోసుల వ్యాక్సినేషన్‌తో పాటు, ఒకసారి ఇన్ఫెక్షన్కు గురైతే హైబ్రిడ్ ఇమ్యూనిటీ వస్తుంది. అలాగే ఒక డోసు టీకాతో పాటు రెండుసార్లు ఇన్ఫెక్షన్ సోకినా ఈ తరహా రోగనిరోధకత అభివృద్ధి చెందుతుంది. ఇది ఎలాంటి కరోనా వైరస్‌నైనా ఎదుర్కొంటుంది. 60 ఏళ్లు పైబడితే హైరిస్క్‌లో ఉన్నట్టే బూస్టర్ డోసు కరోనా మరణాలను, రోగ తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కరోనా సోకినా తక్కువ లక్షణాలుంటాయి. లక్షణాలున్నప్పటికీ జబ్బు తీవ్రం కాకుండా చూస్తుంది. హైరిస్క్ గ్రూప్ వ్యక్తులకు బూస్టర్ డోసును మొదటి ప్రాధాన్యంగా వేయాలి. 60 ఏళ్లు పైబడినవారు హైరిస్క్‌లో ఉన్నట్లు లెక్క. 18–60 మధ్య వయస్సులో ఉన్న దీర్ఘకాలిక జబ్బులు లేనివారికి (లోరిస్క్ గ్రూప్) మొదటి డోసు వేయడం కంటే, హైరిస్క్ గ్రూప్‌కు బూస్టర్ డోసు వేయడం చాలా ముఖ్యం. తక్కువ రోగనిరోధకశక్తి కలిగినవారు... పుట్టుకతోనే తెల్ల రక్తకణాలు తక్కువ ఉండేవారు. పుట్టుకతోనే ఇమ్యునోగ్లోబిలిన్ (ఎం) అధిక సంఖ్యలో ఉండటం, కొన్ని రకాల కణాలు తక్కువగా ఉండటం (ఐఎల్–12, ఐఎల్–23, ఐఎఫ్– గామా) తెల్ల రక్తకణాల కదలికల్లో లోపం ఉండటం పుట్టుకతోనే బీ సెల్స్, టీసెల్స్ సరిగ్గా స్పందించక పోవడం. సీడీ 4 సెల్స్ తక్కువగా ఉండటం వల్ల అరుదైన జన్యు సమస్యలు ఉన్నవారు. కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు ఉన్నవారు. శరీరమంతా పూర్తిగా తెలుపు రంగులోకి మారినవారు. రోగ నిరోధకశక్తి బాగా తక్కువున్నవారికి అడిషనల్ డోసును రెండో డోసు తర్వాత ఒకటి నుంచి మూడు నెలల్లోపు ఇవ్వాలి. ఆ తర్వాత నాలుగు నుంచి ఆరు నెలల మధ్యలో బూస్టర్ డోసు (నాలుగో డోసు) ఇవ్వాలి. – డబ్ల్యూహెచ్ఓ బూస్టర్ డోసులో ప్రాధాన్య గ్రూపులు ఆరోగ్య సిబ్బంది, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, 60 ఏళ్లు పైబడినవారు. 60 ఏళ్ల లోపున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, టీచర్లు, అత్యవసర సిబ్బంది, మురికివాడల్లో ఉండేవారు, శరణార్థులు, వలస కార్మికులు 18– 60 ఏళ్ల లోపున్న దీర్ఘకాలిక వ్యాధులు లేనివారు. 18 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు. ఏ జబ్బూలేని 18 ఏళ్ల లోపు పిల్లలు -
పాజిటివ్ వచ్చినా తల్లి పాలివ్వొచ్చా? డాక్టర్లు చెప్తున్నదేంటి..
వరంగల్ ఎంజీఎం: ‘కరోనా వైరస్ కొద్ది రోజులుగా విస్తరిస్తోంది. కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో పాజిటివ్ నిర్ధారణ అయిన కుటుంబంలో చిన్న పిల్లలు ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతానికి చిన్నారులెవరూ కరోనాతో అస్వస్థతకు గురికాకపోవడం మంచి పరిణామమే’ అని ఎంజీఎం పిడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.సుధాకర్ శుక్రవారం ‘సాక్షి ఫోన్ ఇన్’లో పేర్కొన్నారు. పలువురు చిన్న పిల్లల తల్లులు తమకు పాజిటివ్ వస్తే.. పిల్లలకు పాలు పట్టించొచ్చా అని డాక్టర్‌ను ప్రశ్నించగా.. పిల్లలకు పాలు ఇవ్వొచ్చని, పాల ద్వారా కరోనా వ్యాప్తి జరగదని స్పష్టం చేశారు. గర్భిణులు 12 వారాల తర్వాత కచ్చితంగా వ్యాక్సినేషన్ చేసుకోవాలని సూచించారు. లేదంటే పుట్టిన పిల్లలకు కరోనా సోకే అవకాశం ఉందన్నారు. ఫోన్ ఇన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్ సుధాకర్ నాకు రెండేళ్ల చిన్నారి ఉంది. కరోనా లక్షణాలుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ప్రియ, హన్మకొండ డాక్టర్ : ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ వచ్చినప్పుడు చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్లో జలుబు, జ్వరం, దగ్గును కరోనా లక్షణాలుగా పరిగణిస్తాం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించాలి. నిర్ధారణ అయితే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. సాధారణ జ్వరం వస్తే పారాసిటమాల్ సిరఫ్ వాడుకోవచ్చు. (చదవండి: కరోనా పాజిటివ్ ఉన్నా.. లేనట్లుగా..) నాకు ఈనెల 13న పాజిటివ్ వచ్చింది. ఐదు రోజుల తర్వాత జ్వరం తగ్గింది. మళ్లీ టెస్టు చేయించుకోమంటారా? – నసీరొద్దీన్, హన్మకొండ డాక్టర్ ::ప్రస్తుతానికి మీకు కరోనా లక్షణాలేమీ లేకపోతే పది రోజుల తర్వాత హోం ఐసోలేషన్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లొచ్చు. 14 రోజుల వరకు మాస్క్ తప్పనిసరిగా ధరించి మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. నెగెటివ్ కోసం మళ్లీ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్ నిర్ధారణ అయి ఆరు రోజులైంది. ప్రస్తుతానికి నీరసంగా ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? – ఈశ్వర్, భీమారం డాక్టర్ : కరోనా తగ్గిన తర్వాత కొద్దిగా నీరసంగా ఉన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నడుస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉన్నా.. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నా వైద్యుడిని సంప్రదించి ఆ మేరకు చికిత్స పొందాలి. కరోనా తగ్గిన తర్వాత కూడా మల్టీ మిటమిన్ మాత్రలు వేసుకోవడం మంచిది. ఒకే గదిలో ఇద్దరు మిత్రులం ఉంటాం. నా మిత్రుడికి పాజిటివ్ వచ్చింది? నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది. పరీక్ష చేసుకోవడం తప్పనిసరా? – లక్ష్మణ్, రాయపర్తి డాక్టర్ : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన వ్యక్తికి అతి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్ష చేసుకోవాల్సిందే. తలనొప్పి.. కొద్ది నీరసంగా ఉందని చెబుతున్నారు కదా.. కరోనా పరీక్ష చేసుకున్న తర్వాత చికిత్స పొందాలి. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన తర్వాత వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోమంటారు? – భూక్య రామ్, వరంగల్ డాక్టర్ : కరోనా వ్యాధికి గురైన సమయంలో మన శరీరంలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. అందుకే మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. మా ఇంట్లో నా భర్తకు పాజిటివ్ వచ్చింది. నాకు ఏడాది పాప ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? – భీమారం, అనూష డాక్టర్ : ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ నిర్ధారణ జరిగినప్పుడు వారికి దూరంగా పిల్లలను ఉంచాలి. వారికి ఎలాంటి లక్షణాలు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన తర్వాత చిన్నారులకు పాలు ఇవ్వొచ్చా? – భానుప్రియ, పోచమ్మమైదాన్ డాక్టర్ : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన తర్వాత కూడా మాస్క్, చేతులకు గ్లౌజ్‌లు ధరించి జాగ్రత్తలు పాటిస్తూ చిన్నారులకు పాలు ఇవ్వొచ్చు. తల్లిపాల ద్వారా చిన్నారులకు కరోనా వ్యాప్తి జరగదు. మా ఇంట్లో అందరికి పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న కిట్టు మందులు వాడితే సరిపోతుందా? – సిద్ధార్థ, పలివేల్పుల డాక్టర్ : ప్రభుత్వం అందిస్తున్న కిట్టు మందులు వాడుతున్న సందర్భంలో శ్వాసకోశ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఆక్సిజన్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు చేక్ చేసుకోవాలి. శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి ఆస్పత్రిలో చేరాలి. (చదవండి: కరోనా ఎఫెక్ట్.. 55 రైళ్లు రద్దు..) -
తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణలో పాజిటివ్ కేసులు 4 వేల మార్క్‌ను దాటాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 4,207 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,825 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 26,633 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,22,403కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 6,91,703 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ కారణంగా 4,067 మంది బాధితులు మృతి చెందారు. -
వారిలో కోవిడ్ టీకా ‘రక్షణ’ ఆరు నెలలే!
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆరు నెలల నుంచే రోగ నిరోధక శక్తి తగ్గిపోతోందని.. 30 శాతం మందిలో యాంటీబాడీల సంఖ్య పడిపోతోందని ‘ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ)’అధ్యయనంలో తేలింది. భారతీయులలో వ్యాక్సిన్‌తో వచ్చే రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువ కాలం ఉంటుందన్న దానిపై ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌తో కలిసి ఏఐజీ ఇటీవల అధ్యయనం చేసింది. సంస్థ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. పూర్తిగా రెండు డోసుల టీకాలు వేయించుకున్న 1,636 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ స్టడీ చేసినట్టు తెలిపారు. ‘‘దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. అదృష్టవశాత్తూ వ్యాక్సినేషన్ ప్రభావం, వైవిధ్యం యొక్క అంతర్గత లక్షణం, జనాభాలో ఉన్న సహజ రోగనిరోధక శక్తి వంటి వివిధ కారణాలతో తీవ్రత స్వల్పంగా ఉంది. అయినా కూడా ఈ అంటువ్యాధి వ్యాప్తి తక్కువగా ఉండేలా, వీలైనంత ఎక్కువ మందిని రక్షించగల మార్గాలను అన్వేషించాల్సి ఉంది. ఆ కోవలోనే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం ఎంతకాలం ఉంటుందో తేల్చడం, బూస్టర్ డోసులు అవసరమైన నిర్దిష్ట జనాభా గుర్తించడమే మా పరిశోధన లక్ష్యం’’అని నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. చదవండి: ఒకే కూర.. ఒకే స్వీటు.. మత పెద్దల సంచలన నిర్ణయం 93 శాతం మంది కోవిషీల్డ్ తీసుకున్నవారే.. ఏఐజీ అధ్యయనంలో పాల్గొన్న 1,636 మంది లో 93% మంది కోవిషీల్డ్, 6.2 శాతం మంది కోవాగ్జిన్, 1% స్పుత్నిక్ తీసుకున్నవారు ఉన్నారు. ఈ అధ్యయన ఫలితాలు ఇతర ప్రపంచ అధ్యయనాల తో సరితూగేలా ఉన్నాయి. 6 నెలల తర్వాత దాదా పు 30% మంది రక్షిత రోగనిరోధకశక్తి స్థాయి 100 ఏయూ/ఎంఎల్ కంటే తక్కువస్థాయికి యాంటీబాడీలు తగ్గిపోయినట్టు గుర్తించారు. వీరిలో అధిక రక్త పోటు, మధుమేహం వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న 40ఏళ్లు పైవయసువారే ఎక్కువగా ఉన్న ట్టు తేల్చారు. మొత్తంగా 6% మందిలో రోగనిరోధ క శక్తి అభివృద్ధి చెందలేదని గుర్తించారు. వయస్సు, రోగనిరోధకశక్తి క్షీణించడం అనేవి అనులోమానుపాతంలో ఉంటాయని ఫలితాలు సూచిస్తున్నాయని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. చదవండి: మార్చికల్లా కరోనా మటాష్..! గుడ్ న్యూస్ చెప్పిన టాప్ సైంటిస్ట్ అంటే వృద్ధుల కంటే యువకుల్లో ఎక్కు వ యాంటీబాడీలు ఉంటాయని, వయసు పెరిగినకొద్దీ తక్కువ యాంటీబాడీలు ఉంటా యని వెల్లడించారు. రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న 40 ఏళ్లు పైబడినవారిలో 6 నెలల తర్వాత యాంటీబాడీలు బాగా తగ్గిపోతున్నాయని.. అలాంటివారిలో కోవిడ్ ఎక్కువ ప్రభా వం చూపించే అవకాశం ఉందని తెలిపారు. వీరికి 6 నెలల తర్వాత బూస్టర్ డోసు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించా రు. ఇక 6 నెలలు దాటినా తగినంత యాంటీబాడీలు ఉన్న మిగతా 70% మందికి కూడా 9 నెలల విరామం తర్వాత బూస్టర్‌డోసు ఇవ్వడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. -
వరంగల్: కరోనా పేషెంట్లకు ‘టెక్నికల్’ కష్టాలు
సాక్షి, వరంగల్: కరోనా థర్డ్‌వేవ్ ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. తొలి, రెండో వేవ్‌లు మించి పాజిటివ్ కేసులు నమోదు అవుతాయని ప్రచారమున్నా కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ మేల్కోవడం లేదు. జనవరి తొలివారం నుంచి ముఖ్యంగా సంక్రాంతి పండుగ తర్వాత ఈ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. అధికారుల గణాంకాలు విడుదల చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదే సమయంలో కరోనా పాజిటివ్ రోగులకు అవసరమైన సమయాల్లో సలహాలు, సూచనలిచ్చే ‘టోల్ ఫ్రీ నంబర్లు’ ఇంకా అందుబాటులోకి తీసుకురాకపోవడం ఉన్నతాధికారుల అలసత్వానికి నిదర్శనంగా మారింది. టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంటే ఏ సమయాల్లో ఏఏ మందులు వాడాలి, ఎన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి, రాత్రి సమయాల్లో పరిస్థితి విషమిస్తే ఫోన్ ద్వారా వైద్య సిబ్బందితో మాట్లాడే వీలు లేకపోవడంతో వందల మంది బాధితులు ఆందోళన చెందుతున్నారు. వైద్యుడితో మాట్లాడితే వచ్చే భరోసా కనబడకపోవడంతో కలవరపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి పర్యవేక్షణ లోపంతోనే కరోనా కట్టడిపై సిబ్బంది కూడా సీరియస్‌గా లేరని ఆ శాఖ వర్గాలే అంటున్నాయి. స్వీయ వైద్యం వద్దు.. జిల్లాలో వైరస్ బారిన పడిన వందలాది మంది ఇప్పుడు సొంత వైద్యం బాట పట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అనేక మంది రెండు దశల్లో మహమ్మారి సోకినప్పుడు వాడిన మందులనే ఇప్పుడూ వాడేస్తున్నారు. ఇలా సొంతంగా వాడడం ఆరోగ్యపరంగా మంచిది కాదని, దాని వల్ల ఇతర అవయవాలపై ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రస్తుతం వైరస్ సోకిన వారిలో చాలా మందికి పెద్దగా లక్షణాలు ఉండడం లేదు. స్వల్పంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం ఉంటున్నాయి. ఇలా ఉండి పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చిన వారు వెంటనే వైద్యుడ్ని సంప్రందించి మందులు వాడితే ఆరేడు రోజుల్లో లక్షణాలన్నీ తగ్గిపోతున్నాయి. నాలుగు రోజుల పాటు జ్వరం అలాగే ఉన్నా ఆక్సిజన్ 94 శాతం కంటే తగ్గితే వెంటనే ఆస్పత్రిలో చేరాలి. అయితే చాలా మంది పాజిటివ్ అని తేలగానే పీహెచ్సీ, యూపీహెచ్‌సీలో వైద్యుడు అందుబాటులో లేకుంటే పాత వేవ్‌ల్లో వాడిన మందులు తీసుకెళ్తున్నారు. టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా తెలుసుకుందామన్నా.. అవి పనిచేయక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. భరోసానిచ్చే వైద్యమంత్రం లేక మాన సికంగా క్రుంగిపోతున్నార’ని సామాజిక కార్యకర్త శ్రావణి తెలిపారు. -
బూస్టర్ డోస్‌పై తెలంగాణ సర్కార్ కీలక ప్రతిపాదన..!
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి తీవ్రమైంది. ఎటుచూసినా కేసులే కనిపిస్తున్నాయి. ఇళ్లలో ఎవరికివారే కరోనా టెస్టులు చేసుకునే అవకాశం ఉండటంతో అధికారికంగా ప్రకటించే కేసుల సంఖ్య కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో జనం కరోనా వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నారు. రెండో డోస్ పూర్తయినవారు బూస్టర్ డోస్ (ప్రికాషనరీ) కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్, వైద్య సిబ్బందికి మాత్రమే బూస్టర్ డోస్ వేస్తున్నారు. పైగా వీరికి రెండో డోస్ పూర్తయిన 9 నెలలకు వేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారమే ప్రస్తుతం బూస్టర్ డోస్ వేస్తున్నారు. సుదీర్ఘ గడువు వల్ల కీలకమైన కరోనా కల్లోల సమయంలో చాలామంది బూస్టర్ డోస్ వేయించుకునే పరిస్థితి లేదు. దీంతో యాంటీబాడీస్ లేక కరోనాకు గురయ్యే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. దీంతో డోస్ తర్వాత 9 నెలలకు ప్రికాషనరీ డోస్ వేయించుకోవాలన్న నిబంధనను ఎత్తివేసి, గడువును ఆరు నెలలకే కుదించాలని పలువురు కోరుతున్నారు. పైగా రెండో డోస్ వేయించుకున్న ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ వేయాలన్న ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారు. వ్యాక్సిన్‌తోనే రక్షణ... అందుకే డిమాండ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 5.07 కోట్ల కరోనా టీకా డోస్‌లు వేశారు. అందులో మొదటి డోస్ 100 శాతం పూర్తయింది. రెండో డోస్ కూడా 76 శాతం మందికి వేశారు. 15–17 ఏళ్ల వయస్సు పిల్లల్లో 51 శాతం మందికి వేశారు. 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, హెల్త్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు లక్షన్నర మందికి వేశారు. అయితే బూస్టర్ డోస్ విషయంలో ప్రభుత్వం కొందరికే పరిమితం చేయడం, అది కూడా రెండో డోస్ తర్వాత తొమ్మిది నెలలకు వేయడంపై నిరాశ వ్యక్తపరుస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ బూస్టర్ వేయాలని కోరుతున్నారు. దేశంలో ముందుగా హెల్త్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. తర్వాత 60 ఏళ్లు పైబడినవారికి, ఆ తర్వాత 45–59 ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సినేషన్ జరిగింది. గతేడాది మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికీ వేస్తున్నారు. గత నెల నుంచి 15–17 ఏళ్ల వయసు వారికి వేస్తున్నారు. ఇప్పటికే 18 ఏళ్లు పైబడి రెండో డోస్ పూర్తి చేసుకున్నవారు లక్షల్లో ఉన్నారు. వారందరూ ఇప్పుడు బూస్టర్ డోస్ కావాలని కోరుతున్నారు. ప్రభుత్వం అనుమతించకపోవడంతో చాలామంది అధికారిక ధ్రువీకరణపత్రం అవసరం లేకపోయినా ఫర్వాలేదని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ డబ్బులు పెట్టి బూస్టర్ డోస్ వేయించుకుంటున్నారు. దేశంలో వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నందున బూస్టర్ డోస్ ఇవ్వాలన్న వినతులు వస్తున్నాయి. ఇక ఫ్రంట్‌లైన్, హెల్త్ వర్కర్లకు రెండో డోస్ వేసిన మూడు నెలలకే బూస్టర్ డోస్ ఇవ్వాలని కోరుతున్నారు. వారికి 3 నెలలకే ఇవ్వాలి రెండో డోసు, ప్రికాషనరీ డోసు మధ్య గడువు 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలి. హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, ప్రికాషనరీ డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలి. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా) ప్రికాషనరీ డోసు ఇవ్వాలి. ఇక 18 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోస్ పాలసీలు, వాటి ఫలితాల ఆధారంగా పై ప్రతిపాదనలు ఇస్తున్నాం. ఆ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. – కేంద్రానికి రాసిన లేఖలో మంత్రి హరీశ్ -
డాక్టర్‌కే ఐదు డోసుల వ్యాక్సిన్! దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం
పట్నా: దేశంలో కరోనా వైరస్‌కు అడ్డుకట్టవేయడానికి ప్రభుత్వం కోవిడ్ టీకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు డోసుల టీకాను ప్రజలకు అందిస్తోంది. ఇటీవల ఈ రెండు డోసులతో పాటు మూడో టీకాగా.. బూస్టర్ డోస్ కూడా వేస్తోంది. అయితే ఓ డాక్టర్ ఏకంగా ఐదు డోసుల టీకా వేయించుకున్నట్లు రికార్డులు చూపడం బీహార్‌లో కలకలం రేపింది. దీంతో బిహార్ ప్రభుత్వం ఈ విషయంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. చదవండి: India Covid-19: కాస్త తగ్గిన రోజువారీ కేసులు.. అయినా కొత్తగా 2 లక్షలకు పైనే పట్నాలో సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ విభా కుమారి సింగ్ ఐదు కరోనా టీకాలు వేసుకున్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఈ విషయంపై సదరు డాక్టర్ స్పందిస్తూ.. తాను కోవిడ్ టీకా నిబంధనలకు లోబడి కేవలం మూడు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ (బ్యూస్టర్‌తో కలిపి) మాత్రమే వేయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే తన పాన్‌కార్డును ఉపయోగించుకొని ఎవరో మరో రెండు డోసుల టీకాను వేయించుకున్నారని తెలిపారు. కోవిన్ పోర్టల్ వివరాల ప్రకారం.. డాక్టర్ విభా 28 జనవరి, 2021న మొదటి డోసు, మార్చిలో రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు. అదేవిధంగా 13 జనవరి, 2022న ఆమె బూస్టర్ డోస్ తీసుకున్నారు. అయితే ప్రభుత్వ రికార్డులు ప్రకారంలో ఆమె బూస్టర్ డోస్‌తో కలిపి 5 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు చూపడంతో అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6 ఫిబ్రవరి 2021న మూడో డోసు, 17జూన్ 2021న నాలుగో డోసును ఆమె పాన్‌కార్డు ద్వారా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు రికార్డుల్లో వుంది. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ఇక ‘గురుత్వాకర్షణ’ సుంకాలు!
సముద్రం ఒడ్డున ఉన్న ప్రజలకు ఉప్పునూ, చల్లటి ప్రాంతంలో శీతల పానీయాన్నీ అమ్మాలంటుంది పెట్టుబడీదారీ వ్యవస్థ. దానికి లాభాలే ముఖ్యం. ఆ లాభం అనేదాని కోసం అది ఎంతదూరమైనా వెళ్తుంది. ఎంతదూరం అంటే, ఈ భూమ్మీద మనుషులు నిలబడి ఉండటానికి కారణం గురుత్వాకర్షణ శక్తి కాబట్టి, దానికి కూడా పన్ను కట్టమని ఒత్తిడి చేసేంత! ఇది వ్యంగ్యంలా కనబడుతున్నప్పటికీ, ఈ అసమ సమాజంలో పేద మనిషి ఎన్నిరకాలుగా దోపిడీకి గురవుతున్నాడో అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. అందుకే ప్రపంచం మరింత బాగు పడాలంటే, సోషలిస్టు సమాజం తన విస్తృతిని పెంచుకోవాలి. పెట్టుబడిదారీ సమాజం సమానత్వ దృష్టిని అలవర్చుకోవాలి. ధనిక వర్గ రాజకీయ సామాజిక ఆర్థిక దోపిడీ వ్యవస్థల్లో అమలు జరిగే ఏకైక ప్రామాణిక ఎత్తుగడ ఏమిటంటే, యావత్తు సమాజానికి చెందవలసిన సమష్టి వనరులను కొద్దిమంది ప్రైవేట్ ప్రయోజనాల రక్షణకు వినియోగిం చడం! ప్రజా ప్రయోజనాల ఉమ్మడి రక్షణకు వినియోగ పడాల్సిన దేశ నిధుల్ని ప్రైవేట్ ప్రయోజనాల్ని రక్షించేందుకు దారి మళ్లించి ప్రభుత్వ రంగ పనులు జరక్కుండా కుంటుపరుస్తుంటారు. ఈ దారి ‘మళ్లింపు’ చర్యలనే ప్రజాబాహుళ్యం వ్యతిరేకించాల్సి వస్తోంది. అయినా వర్గ ప్రయోజనాల రక్షణకు కట్టుబడిన పాలకులు ప్రైవేట్ పెట్టుబడులకే పనులు ధారాదత్తం చేస్తారు. – అమెరికన్ మేధావి, విద్యాధికుడు, తత్వవేత్త నోమ్ చామ్స్కీ అలాంటి దారిమళ్లింపు ‘నైపుణ్యం’లో భాగంగా ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కొందరు వాడుకునే పరిస్థితి వస్తే! న్యూటన్ భౌతికవాద శాస్త్రం ఆధారంగా, చెట్టుమీద ఉన్న కాయ పైకి ఎగిరి పోకుండా భూమ్మీదనే ఎందుకు పడుతోందన్న ప్రశ్నకు శాస్త్రీయమైన సమాధానాన్ని కనుగొని, భూమి ఆకర్షణ శక్తినే గురుత్వాకర్షణ శక్తిగా నామకరణం చేసి దాన్ని శాశ్వతంగా స్థిరపరిచాడు. కానీ మనకాలంలో ఈ గురుత్వాకర్షణ శక్తి ధనిక వర్గ సమాజాల్లో ఒకరకంగానూ, సోషలిజం పునాదిగా ఉన్న సమాజాల్లో మరొక విధంగానూ పని చేస్తూంటుంది. తమిళ మిత్రులు, సుప్రసిద్ధ కథకులైన ముత్తులింగం గారు లిఖించిన ‘ఐదు కాళ్ల మనిషి’ అనే పుస్తకంలో గురుత్వాకర్షణ సుంకం కథా కమామీషు ఉన్నాయి (తెలుగు అనువాదకులు అవినేని భాస్కర్ సౌజన్యంతో.) ఇంత గాథకు అసలు పూర్వ రంగాన్ని తెలుసుకోవడం మరింత ఆసక్తిదాయకంగా ఉంటుంది. బడుగు దేశాల ప్రజలను సంపన్న దేశాలు ఇప్పటికీ ఎంత చులకనగా భావిస్తున్నాయో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ ఇది. కోవిడ్ –19 వైరస్ సంహారక వ్యాక్సీన్లు మురిగిపోతున్న దశలో, వాటిని బడుగు, వర్ధమాన దేశాల మీద లాభాల వేటలో ఉన్న విదేశీ, ప్రైవేట్ కంపెనీలు రుద్దాయని ఐక్యరాజ్య సమితి శిశు వైద్య నిధుల సంస్థ (14 జనవరి 2022) వెల్లడించింది. ప్రపంచంలోని అనేక పేద దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలు ఐక్యరాజ్య సమితి సమర్థించిన ‘కోవాక్స్’ టీకా పథకంపై ఆధారపడుతున్నాయి. ఆఫ్రికా దేశాల్లో 10 శాతం మంది ప్రజలకు కూడా టీకాలు అందకుండా మురిగిపోయాయి! చివరికి ఇండియాలో పరిస్థితి కూడా మెరుగ్గా లేదని రోజుకొక తీరున బయటపడుతున్న పరస్పర విరుద్ధమైన కథనాలు చెప్పకనే చెబుతున్నాయి. అమెరికాలో విషక్రిముల వ్యాప్తిని కంట్రోల్ చేసే సర్వాధికారాలు మందుల గుత్త వ్యాపారంలో ఉన్న 84 ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. అమెరికా పాలక వర్గాలు, వాళ్లు రిపబ్లికన్స్ అయినా, డెమో క్రాట్స్ అయినా ఆ కంపెనీల నిర్ణయం పైననే ఆధారపడే దౌర్భాగ్యం ఉంది. ఆ కంపెనీల శాసనమే ప్రపంచ ఫార్మా కంపెనీల్ని కూడా నడుపుతోందని మరచిపోరాదు. ఈ దుస్థితికి కొనసాగింపు అన్నట్టుగా మనం చెప్పుకుంటున్న కథలో ‘స్పేస్ షిప్’ వ్యాపారులు అయిన కాడికి కొన్ని గంటల పాటు రోదసీ యాత్రకు ఉత్సాహపడే విద్యా ర్థులు, బోధకులను దండుకుంటుంటారు. రోదసి నుంచి తిరిగి భూమ్మీదకు వారిని సురక్షితంగా దించుతారు. కానీ వారిని సంవత్స రాల తరబడి తీర్చలేని భారీ బకాయిల్లోకి నెట్టే పథకమే గురుత్వా కర్షణ సుంకం అన్నది వారికి తెలియదు. ఈ సరికొత్త సుంకం ఎలా పెరుగుతూ పోతుంది, మరెలా తీర్మానం అవుతుంది లాంటి అంశాల్ని ముత్తులింగం ప్రస్తావిస్తారు. ఒక్కసారి ‘గురుత్వాకర్షణ సుంకం’ కట్టమని మీకు నోటీసుల మీద నోటీసులు వస్తే ఏం చేస్తారన్నది ప్రశ్న! పైగా ఈ విచిత్రమైన ‘గురుత్వాకర్షణ సుంకం’ నోటీసు అందుకునే ఇంటి సభ్యుల సంఖ్యను బట్టి, వారు పెరిగే బరువును బట్టి కూడా సుంకం ‘పాపపు బండి’లా పెరుగుతూ ఉంటుందట! ఈ సుంకాన్ని వరుసగా ఎనిమిది నెలల పాటు చెల్లించడానికి నిరాకరించిన వ్యక్తికి వేసిన శిక్ష ఎలాంటిదో, దానికి ‘స్పేస్ షిప్’ వ్యాపారులు ఇచ్చిన సమాధానం ఏమిటో మరీ వింతగా ఉంటాయి. ‘‘స్పేస్ షిప్లో యాత్రకు వచ్చిన వ్యక్తిని సురక్షితంగా భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల దింపేశాం. ఆ వ్యక్తి ఒకసారి భూమి ప్రదక్షిణ చేసి వచ్చాడు కాబట్టి, తాను మనసు మార్చుకుని మీరు చెప్పినట్టే సుంకం కట్టేస్తాని ఒప్పుదలయ్యాడు. అలా మా బాకీని వడ్డీతో సహా కట్టేశాడు.’’ అయితే అతనికి ఓ చిక్కు సమస్య ఎదురైంది. స్పేస్‌షిప్ ప్రయాణం కోసం అయిన ఖర్చు, స్పేస్ సూట్ ఖరీదు, ఇతర ఖర్చులు మొత్తానికి ఇప్పుడు నెలనెలా వాయిదాల పద్ధతిలో కడుతున్నాడు. అయితే ఇలా అతను మొత్తం 2,196 మాసాలు కడుతూ ఉండాలి. ‘అమ్మో! అన్ని మాసాల పాటా?’ అంటే– ‘అవును, మొత్తం చెల్లించడానికి 183 సంవత్సరాలు పడుతుం’దని స్పేస్‌షిప్ వ్యాపారి అంటాడు. ‘మనిషి అన్నేళ్లు బతుకుతాడా’ అని ఔత్సాహిక యువకుడంటే – ‘అవన్నీ మాకు తెలీదు గానీ, అతని పిల్లలు కడతామని హామీ ఇచ్చా’రని స్పేస్‌షిప్ వ్యాపారి అంటాడు. అలా ఆ యువకుడు రాజీపడి బిల్లులు చెల్లిస్తూండగానే, భూప్రయాణ శాఖ అన్న కొత్త శాఖ నుంచి మరికొన్ని బిల్లులు వచ్చి మీద పడతాయి. వాటి సారాంశం ఏమంటే – భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆ దూరాన్ని కూడా లెక్కగట్టి అందుకయ్యే ఖర్చుల్ని కూడా ‘గురుత్వాకర్షణ సుంకం’ కిందనే కట్టమంటారు! అందుకే మన ప్రాచీన సాహిత్యంలో కూడా కొందరు లౌకిక వాదులు ఉండబట్టే అందరూ పెద్ద మనుషులేగానీ రొయ్యల బుట్ట ఖాళీ అయిందన్న అర్థంలో సామెత ఒకటి పుట్టుకొచ్చింది! ఇలాంటి గాథలు చదివే ఓపిక ఉండాలే గానీ ‘పురాణవైర గ్రంథమాల’లో కొల్లలు, కొల్లలు. పశ్చిమ యూరప్ అంతా అంధ యుగాలలో మగ్గుతున్నపుడు– ఈజిప్టు, గ్రీస్, రోమ్ ప్రాచీన సంçస్కృతులు, వాటి నాగరికతలకు ప్రాచ్య దేశాల సంస్కృతికి చాలా దగ్గరి సంబంధాలున్నాయి. సమాజ పరిస్థితుల్ని, ప్రజల దైన్యాన్ని కళ్లారా చూసి కలత చెందిన కొందరు రోమన్ రాచరికాల్లో టైబీరియస్ గ్రాచస్ లాంటి సెనేటర్ ఒకరు. ఇటలీలో ప్రజలపై సంపన్నుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేదని భావించిన మరుక్షణమే ఇటాలియన్ కష్టజీవులైన రైతు వ్యవసాయ కార్మికులకు దేశంలోని అదనపు భూమినంతా పంచి, ప్రజా పాలకు నిగా మన్ననలు పొంది, ప్రజావాణిగా ప్రజల చేత సెనేట్‌కు ఏక గ్రీవంగా ఎన్నికయ్యాడు! తన దేశ సంపన్న వర్గాలకు గ్రాచస్ తుది సందేశంలో ఇలా వెలువరించాడు: ‘‘మీ అక్రమ సంపాదనను, సౌభా గ్యాన్ని, విలాసాల్ని కట్టిపెట్టి ప్రజలకిచ్చి, జీవితాల్ని సార్థకం చేసు కోండి. అప్పుడే మీరు ప్రపంచాన్ని జయించగలరు. అంతేగానీ అరం గుళం నేలైనా ‘ఇది నాది’ అని చెప్పి కాలు మోపుకొనే స్థితి లేదని మీరు (సంపన్న వర్గం) గ్రహించా’’లని దండోరా వేయించాడు. అలాగే రైతాంగం పట్ల మన కృష్ణదేవరాయల లాంటి కారుణ్య ప్రభువులు కూడా ఉంటారు. చరిత్ర అందించిన ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ‘ప్రపంచ చరిత్ర పాఠాలు’ అన్న ఉద్గ్రంథంలో సుప్రసిద్ధ చరిత్రకారులు విల్ డూరాంట్, ఏరియల్ డూరాంట్ దంపతులు ఇంతవరకు జరిగిన చరిత్రను క్లుప్తంగా ఇలా క్రోఢీకరించి ఉంటారు: ‘‘పెట్టుబడిదారీ విధానం ప్రపంచాన్ని ఎక్కడికి తీసుకువెడుతోందో నన్న భీతి వల్ల సోషలిజం స్వేచ్ఛా వాతావరణాన్ని తన పరిధిలో విస్తృతం చేయక తప్పలేదు. అలాగే సోషలిజం వల్ల సమానత్వ దృష్టిని పెంచుకోవలసిన అవసరాన్ని గుర్తించక పెట్టుబడిదారీ వ్యవస్థకు తప్పలేదు’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
టీకా తీసుకున్నా.. ఒమిక్రాన్!
సాక్షి,హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ ‘ఒమిక్రాన్’వ్యాప్తి చెందుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ఏకంగా 88 శాతం మంది రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారేనని ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్) పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్‌పై దేశంలో తొలిసారిగా ఐఎల్‌బీఎస్ పరిశీలన చేపట్టింది. గతేడాది డిసెంబర్లో ఢిల్లీలో నమోదైన ఒమిక్రాన్ కేసుల తీరును ఐఎల్‌బీఎస్ విశ్లేషించింది. మొత్తం 264 పాజిటివ్ కేసులను పరిగణనలోకి తీసుకొని అందుకు సంబంధించి లోతైన అధ్యయనం చేసింది. ఒమిక్రాన్ బాధితుల్లో వైరస్ లక్షణాలు, చికిత్స, వారు కోలుకున్న తీరు, రెండు డోసుల టీకాలు తీసుకున్న తేదీల సమాచారం తదితర వివరాలను పరిశీలించింది. ఢిల్లీలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి జరుగుతున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. మూడు రకాలు... దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ మూడు రకాలుగా ఉన్నట్లు ఐఎల్‌బీఎస్ చెబుతోంది. ఒమిక్రాన్ 1, 2 3 వేరియంట్లలో ప్రస్తుతం అత్యధికంగా వ్యాప్తి చెందుతున్నది మొదటి రకంగా వివరించింది. ఐఎల్‌బీఎస్ చేసిన పరిశీలనలో 264 కేసులను పరిగణనలోకి తీసుకోగా వాటిని ఒక క్రమ పద్ధతిలో ఎంపిక చేసుకొని పరిశీలన చేసినట్లు వెల్లడించింది. కోవిడ్–19 ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో పుట్టగా... భారత్‌లోకి వ్యాప్తి చెందే క్రమం విదేశీ ప్రయాణికుల ద్వారా అని గుర్తించారు. అయితే ఐఎల్‌బీఎస్ ఎంపిక చేసుకున్న పాజిటివ్ కేసుల్లో 39 శాతం మంది మాత్రమే విదేశీ ప్రయాణ చరిత్ర ఉన్నట్లు గుర్తించగా... మిగతా 61 శాతం మంది ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. ఈ వ్యాప్తి క్రమాన్ని సామాజిక వ్యాప్తిగా ఐఎల్‌బీఎస్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పరిశీలనకు తీసుకున్న నమూనాల్లో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లున్న వారు ఏకంగా 68 శాతం మంది ఉన్నారు. ఈ లెక్కన 18–60 ఏళ్ల మధ్య వారిలోనే వైరస్ వ్యాప్తి అత్యధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందిన వారిలో 60 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవు. కేవలం 40 శాతం మందిలో లక్షణాలు గుర్తించినప్పటికీ అవన్నీ దాదాపు స్వల్ప లక్షణాలుగా ఐఎల్‌బీఎస్ పరిశీలన చెబుతోంది. వ్యాక్సిన్‌తో ప్రొటెక్షన్... ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోంది. రెండు డోసుల పంపిణీ లక్ష్యం దాదాపు దగ్గరపడింది. ఈ క్రమంలో కోవిడ్ వ్యాప్తి చెందినా రిస్క్ మాత్రం తక్కువగా ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. జనవరి 9–12 మధ్య కరోనాతో ఢిల్లీలో 89 మంది మరణించగా వారిలో 93 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోని వారిగా అక్కడి ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ వేసుకోవడంతో వైరస్ వ్యాప్తి చెందినా... పెద్దగా ప్రమాదం బారినపడే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఇక గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో ప్రస్తుతం నమోదైన అడ్మిషన్ల విషయానికి వస్తే... ఐసీయూలో చేరిన వారిలో 70% మంది టీకా తీసుకోని వారిగా ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఒమిక్రాన్‌తో డెల్టాకు చెక్... ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉంది. ఈ వేరియంట్‌తో పెద్దగా నష్టం లేనప్పటికీ జాగ్రత్తగా ఉండటం మంచిది. మనలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందితే ఇకపై డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 149 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ చిన్నపిల్లల్లో దుష్ప్రభావాలు పెద్దగా చూపట్లేదు. – డాక్టర్ కిరణ్ మాదల క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల -
నాలుగేళ్లుగా మంచంలో.. ఇక జీవితమే లేదనుకున్నాడు.. అంతలోనే..
Jharkhand: కరోనా వ్యాక్సిన్ ఓ మనిషికి కోల్పోయిన జీవితాన్ని ప్రసాదించింది. జార్ఖండ్‌లోని బొలారో జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్లుగా మంచానపడ్డాడు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత తాను మళ్లీ నడవడం ప్రారంభించాడు. వివరాల్లోకెళ్తే.. 44 ఏళ్ల వయసు గల దులార్‌చంద్ నాలుగేళ్ల క్రితం ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం తర్వాత అతను గొంతు కోల్పోయాడు. మంచానికే పరిమితమయ్యాడు. 'దులార్‌చంద్ జనవరి 4న కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్‌ను వేయించుకున్నాడు. కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఒక రోజు తర్వాత అతని శరీరం స్పందించడం ప్రారంభించింది. అనంతరం తను కోల్పోయిన స్వరం, తిరిగి లేచి నడవడం ప్రారంభించాడ'ని బొకారోలోని పెటార్వార్ గ్రామంలోని పెటార్వార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఇన్ఛార్జ్ డాక్టర్ అల్బెల్ కెర్కెట్టా తెలిపారు. చదవండి: (తగ్గేదేలే.. గడ్డకట్టే చలిలో.. చెక్కుచెదరని విశ్వాసంతో..) దీనిపై దులార్‌చంద్ స్పందిస్తూ.. 'వ్యాక్సిన్ తీసుకున్నందుకు ఆనందంగా ఉంది. జనవరి 4న వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కాళ్లపై నిలబడగలుగుతున్నాను. కోల్పోయిన స్వరాన్ని కూడా తిరిగి పొందాను' అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే బొకారో సివిల్ సర్జన్ డాక్టర్ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘటన ఆశ్చర్యం కలిగించినా, అద్భుతమేమీ కాదన్నారు. దులార్‌చంద్ వైద్య చరిత్రను పరిశీలించేందుకు వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని డాక్టర్ జితేంద్రకుమార్ ఆదేశించారు. -
డబ్బులిచ్చి మరీ కోవిడ్ పేషెంట్లతో డిన్నర్లు, పార్టీలు.. ఎందుకంటే
రోమ్: కరోనా వైరస్ గురించి ప్రపంచమంతా భయపడుతోంది. ప్రతి ఒక్కరూ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు పాటిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటున్నారు. కాగా కోవిడ్ సోకిన వారు ఎవరిని కలవడానికి వీలుండదన్న విషయం తెలిసిందే. వారు తప్పకుండా వారం నుంచి పదిహేను రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. డాక్టర్ల సూచనతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కోవిడ్ నుంచి కోలుకోవచ్చు. అయితే ఓ చోట మాత్రం కరోనా వచ్చిన వారితో ఎంచక్కా పార్టీలు చేసుకుంటున్నారు. వాళ్లతో కలిసి ఏకంగా డిన్నర్ చేస్తున్నారు. కలిసి వైన్ తాగుతున్నారు. ఇందుకు డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. ఇదంతా ఇటలీలో జరుగుతోంది. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. ఇటలీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి 50 ఏళ్లు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ వేసుకోని వాళ్లు, భారీ జరిమానా లేదా వాళ్ల ఉద్యోగం వదిలేసుకోవాల్సి ఉంటుందని ఆదేశించింది. అయితే వ్యాక్సిన్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్లకు భయం పట్టుకుంది. దీంతో వ్యాక్సినేషన్‌ను తప్పించుకునేందుకు ఉన్న ఏకైక అవకాశం కోవిడ్ బారిన పడటం. కోవిడ్ సోకి కోలుకున్నవారు యాండీబాడీస్ వృద్ధి చెందే వరకు వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండాలి. దీంతో కోవిడ్ వచ్చిన పేషెంట్లకు డబ్బులు ఇచ్చి మరీ వాళ్లతో డిన్నర్ చేస్తున్నారు. వాళ్లతో కూర్చొని వైన్ తాగుతున్నారు. దీని ద్వారా తమకు కూడా వైరస్ సోకితే వ్యాక్సినేషన్ నుంచి తప్పించుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌ను తప్పించుకోవడం కోసం కోవిడ్ పార్టీల పేరుతో మహమ్మారిని తెప్పించుకుంటే వాళ్లపై కేసులు నమోదు చేస్తామని ఇటలీ ప్రభుత్వం హెచ్చరించింది. -
కోవిడ్ టీకా సర్టిఫికెట్‌పై ప్రధాని ఫొటో ఉండదు
న్యూఢిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో జారీ చేసే కోవిడ్ సర్టిఫికెట్‌పై ప్రధాని మోదీ ఫొటో ఉండదని అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాల అసెంబ్లీ ఎన్నికలకు శనివారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళికి లోబడి చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్యశాఖ కోవిన్ యాప్‌లో ఈ మేరకు మార్పులు చేపడుతుందని వివరించారు. రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో 2021 మార్చిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లోనూ ఈసీ సూచన మేరకు ఆరోగ్య శాఖ ఇలాంటి చర్యలనే తీసుకుంది. -
గ్రాండ్‌స్లామ్ ఆడతాడా లేదా?.. తేలిపోనుంది
మెల్బోర్న్: సెర్బియా టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడేది లేనిది నేడు తేలిపోనుంది. వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక వైద్య మినహాయింపుతో జొకోవిచ్ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు. అయితే మినహాయింపు పొందడానికి జొకోవిచ్ సమర్పించిన కారణాలు సహేతుకంగా లేవని అతడిని ఆస్ట్రేలియా బోర్డర్ అధికారులు మెల్బోర్న్ ఎయిర్‌పోర్టులోనే నిలిపివేసి, వీసాను రద్దు చేశారు. దీనిపై జొకోవిచ్ కోర్టులో కేసు వేయగా... నేడు ఫెడరల్ సర్క్యూట్, ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ కోర్టు దీనిని విచారించనుంది. -
భారత్‌లో థర్డ్‌వేవ్.. మొదటి వారంలో ఆర్– వాల్యూ 4.. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ కరోనా వ్యాప్తిపై ఐఐటీ మద్రాస్ తాజాగా అధ్యయనం నిర్వహించింది. కరోనా వ్యాప్తికి సంకేతంగా నిలిచే ఆర్ నాట్ విలువ జనవరి మొదటి వారంలో 4కి చేరుకుందని తాము చేసిన ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైందని తెలిపింది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఫిబ్రవరి 1–15 మధ్య తారాస్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్ నాట్ వాల్యూ లేదంటే ఆర్ఒ అని పిలుస్తారు. ఈ విలువ ఒకటి కంటే తక్కువగా ఉంటేనే మనం సురక్షితంగా ఉన్నట్టు లెక్క. డెల్టా వేరియెంట్ ప్రబలి కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసిన సమయంలో కూడా ఆర్ నాట్ వాల్యూ 1.69 దాటలేదు. అలాంటిది ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభిస్తున్న వేళ డిసెంబర్ 25–31 తేదీల్లో ఆర్ నాట్ వాల్యూ 2.9 ఉంటే, జనవరి 1–6 తేదీల మధ్య అది ఏకంగా 4కి చేరుకోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కంప్యూటేషనల్ మోడల్లో ఐఐటీ మద్రాస్ కరోనాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని విశ్లేషించింది. ఈ వివరాలను డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా శనివారం వెల్లడించారు. వైరస్ వ్యాప్తికి గల అవకాశం, కాంటాక్ట్ రేటు, వైరస్ సోకడానికి పట్టే సమయం వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని ఆర్ నాట్ వాల్యూని అంచనా వేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రావడంతో కాంటాక్ట్ రేటు తగ్గి ఆర్ఒ విలువ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయని జయంత్ ఝా చెప్పారు. గత రెండు వారాల్లో కేసులు ప్రబలే తీరుపైనే తాము ప్రాథమికంగా విశ్లేషించామని, కోవిడ్‌ని అరికట్టడానికి తీసుకునే చర్యలను బట్టి ఆర్ వాల్యూ మారవచ్చునని జయంత్ తెలిపారు. ఫిబ్రవరి 1–15 మధ్య దేశంలో కేసులు ఉధృతరూపం దాలుస్తాయని, గతంలో కుదిపేసిన వేవ్‌ల కంటే ఈ సారి కేసులు భారీగా పెరుగుతాయని అంచనా వేసినట్టు వివరించారు. 2 కోట్ల మంది బాలలకు మొదటి డోసు టీకా ఈ నెల 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల గ్రూపు బాలబాలికలకు కోసం ప్రారంభించిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో వేసిన 90,59,360 డోసులతో కలుపుకుని శనివారం రాత్రి 7 గంటల సమయానికి ఇప్పటి వరకు అర్హులందరికీ వేసిన మొత్తం డోసుల సంఖ్య 150.61 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ తెలిపారు. దేశంలోని అర్హులైన వారిలో 91% మందికి కనీసం ఒక్క డోసు టీకా అందగా, 66% మందికి టీకా రెండు డోసులూ పూర్తయినట్లు పేర్కొన్నారు. -
కరోనా పాజిటివ్ వచ్చినందుకే జకోవిచ్‌ను..
మెల్బోర్న్: కరోనా వ్యాక్సిన్ తీసుకోకున్నా... ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు ప్రత్యేక మినహాయింపు ఎందుకు ఇచ్చారనే కారణాన్ని ఫెడరల్ సర్క్యూట్ కోర్టుకు అతని తరఫు లాయర్లు వివరించారు. గత నెల డిసెంబర్ 16వ తేదీన జొకోవిచ్‌కు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిందని... ఆ సమయంలో అతనికి ఎలాంటి జ్వరంగానీ, శ్వాస సంబంధిత ఇబ్బందులుగానీ లేవని సెర్బియా స్టార్ తరఫు లాయర్లు శనివారం కోర్టుకు సమర్పించిన పత్రాలలో వివరించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ...గత ఆరు నెలల కాలంలో కరోనా బారిన పడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ తీసుకోకున్నా... ప్రత్యేక మినహాయింపు ద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడేందుకు అవకాశం ఇస్తారు. జొకోవిచ్‌కు డిసెంబర్ 16న కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసినా... అదే రోజు, ఆ మరుసటి రోజు బెల్గ్రేడ్లో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో అతను పాల్గొనడం గమనార్హం. 17వ తేదీన తన ముఖచిత్రంతో ముద్రించిన తపాళా బిళ్లను స్వయంగా జొకోవిచ్ విడుదల చేశాడు. 16వ తేదీన నొవాక్ జొకోవిచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సెమినార్‌లోనూ ఈ సెర్బియా స్టార్ పాల్గొన్నాడు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను జొకోవిచ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ కూడా చేశాడు. ఈనెల 17న మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు 5వ తేదీన మెల్బోర్న్ వచ్చిన జొకోవిచ్ వద్ద అవసరమైన పత్రాలు లేవని ఆరోపిస్తూ ఆస్ట్రేలియా బోర్డర్ ఆఫీసర్లు అతడిని అడ్డుకున్నారు. అతనికి జారీ చేసిన వీసాను రద్దు చేశారు. బోర్డర్ ఆఫీసర్ల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జొకోవిచ్ కోర్టుకెక్కాడు. సోమవారం జొకోవిచ్ కేసు విచారణకు రానుంది. -
టీనేజర్ల టీకాలోనూ ఏపీ టాప్
సాక్షి, అమరావతి: పిల్లల వ్యాక్సినేషన్లో ఏపీ దూకుడు కొనసాగుతోంది. నిర్దేశించిన లక్ష్యంలో శుక్రవారం నాటికి 72 శాతం మందికి వైద్య, ఆరోగ్య శాఖ టీకా ప్రక్రియను పూర్తిచేసి దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఇక రాష్ట్రంలో కేవలం 28 శాతం మందికి మాత్రమే టీకా వేయాల్సి ఉంది. దేశంలో ఇప్పటివరకూ 50 శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తిచేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ, హిమాచల్‌ప్రదేశ్‌లు మాత్రమే ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో 68.40 శాతం మంది పిల్లలకు టీకా వేశారు. దక్షిణాదితో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క పెద్ద రాష్ట్రంలోనూ 50 శాతానికి మించి టీకా పంపిణీ కాకపోవడం గమనార్హం. సీఎం జగన్ ప్రత్యేక దృష్టి.. మరోవైపు.. దేశవ్యాప్తంగా గత సోమవారం నుంచి 15–18 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా పంపిణీ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో అర్హులైన 24,41,000 మంది పిల్లలకు వారం రోజుల్లో టీకా పంపిణీ పూర్తిచేసేలా సర్కారు కార్యాచరణ రూపొందించింది. దీంతో శుక్రవారం నాటికి 17,52,581 మందికి టీకాలు వేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో టీకాలు వేయడంతో పాటు, వీటి పరిధిలో ఉన్న విద్యా సంస్థల వద్దకు ఆరోగ్య సిబ్బంది వెళ్లి మరీ టీకాలు వేస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 1,55,086 మందికి టీకా పంపిణీ చేయాల్సి ఉండగా 91.11 శాతం అంటే 1,41,304 మందికి టీకా పంపిణీ జరిగింది. అదే విధంగా తూర్పు గోదావరిలో 86.36 శాతం, నెల్లూరులో 84.76 శాతం, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 53.59 శాతం మందికి వ్యాక్సినేషన్ చేశారు. -
టీనేజర్లకు టీకాల్లో.. ఆంధ్రప్రదేశ్ టాప్
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: దేశ వ్యాప్తంగా 15–18 ఏళ్ల వారికి మొదటి డోసు వ్యాక్సిన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే 52.82 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,89,501 మంది బాలబాలికలకు టీకా వేశారు. హిమాచల్‌ప్రదేశ్ 49.2 శాతం, గుజరాత్ 45.29 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌లో 33.44 శాతం, రాజస్తాన్‌లో 22 శాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 76.09 శాతానికి పైగా వ్యాక్సినేషన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 24.41 లక్షల మంది టీనేజర్లను గుర్తించగా.. వీరికి మూడు రోజులుగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కోవాగ్జిన్ టీకాను అందిస్తున్నారు. గురువారం (నేటి) నుంచి సచివాలయాలతో పాటు విద్యా సంస్థల్లో కూడా ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. శనివారం నాటికి టీనేజర్లందరికీ వ్యాక్సిన్ వేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. కాగా, దేశ వ్యాప్తంగా జనవరి 3వ తేదీన టీనేజ్ వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 147.72 కోట్ల డోస్‌ల టీకాలను కేంద్రం పంపిణీ చేసింది. -
వ్యాక్సిన్ వేయించుకోకున్నా.. ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో జొకోవిచ్
సెర్బియా టెన్నిస్ దిగ్గజం, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ అభ్యర్థనను ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నిర్వాహకులు మన్నించారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోకున్నా ఈనెల 17న మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు జోకోవిచ్‌కు అనుమతి ఇచ్చారు. తాను వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోలేదో జొకోవిచ్ ఇచ్చిన వివరణపట్ల టోర్నీ నిర్వాహకులు సంతృప్తి చెంది ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. ఈ విషయాన్ని జొకోవిచ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే, జొకోవిచ్‌కు ఈ మేరకు మినహాయింపు ఇవ్వడంపై సహచర ఆటగాళ్లు, నెటిజన్లు, మాజీ ప్లేయర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఆటగాళ్లంతా నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ వేయించుకుని బరిలోకి దిగుతుంటే.. అతడికి మాత్రం మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెన్నిస్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రెగ్ టైలీ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియన్ ఇమ్యూనైజేషన్ రిజస్టర్‌లో పేరు నమోదు చేయించుకున్న వాళ్లకు ఈ వెసలుబాటు ఉంటుందని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియన్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు ఆన్ ఇమ్యూనైజేషన్ మార్గదర్శకాల ప్రకారమే జొకోవిచ్‌కు మినహాయింపు లభించిందని చెప్పుకొచ్చాడు. చదవండి: Nz Vs Ban: టెస్టు చాంపియన్‌ను మట్టికరిపించి.. బంగ్లాదేశ్ సరికొత్త రికార్డులు.. తొలిసారిగా -
Omicron: అగ్రరాజ్యంలో విలయ తాండవం.. వామ్మో... ‘ఒమి’రికా
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజువారీ కేసుల్లో కొత్త రికార్డులు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. ఒమిక్రాన్ ఒక సునామీలా దేశాన్ని కుదిపేస్తోంది. 24 గంటల్లో 10 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. రెండేళ్ల క్రితం చైనాలోని వూహాన్లో బయల్పడిన కరోనా మహమ్మారి ఈ స్థాయిలో విజృంభించడం ఇదే మొదటిసారి. డెల్టా వేవ్‌తో గత ఏడాది మే 7వ తేదీన నమోదైన 4.14 లక్షల కేసులే అమెరికాలో అత్యధికంగా ఉండేది. గత వారంలో 5,90,000 కేసులతో కొత్త రికార్డు సృష్టించిన అమెరికాలో కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లోనే అంతకు రెట్టింపు కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం సోమవారం ఒక్క రోజే అమెరికాలో 10,82,549 కేసులు నమోదయ్యాయి. మేరీల్యాండ్, అలబామా, డెలవేర్, న్యూజెర్సీ, ఒహాయో రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు వెలుగులోకి వచ్చాయి. క్రిస్మస్, న్యూఇయర్ సెలవుల్లో అమెరికన్లు ఎక్కువగా కలుసుకోవడం, ఇండోర్ పార్టీలు, గెట్ టు గెదర్లు అధికంగా జరగడంతో కేసులు విజృంభించాయి. క్రిస్మస్ సెలవుల తర్వాత పాఠశాలలు సోమవారం తెరుచుకోవాల్సి ఉండగా చాలా రాష్ట్రాల్లో సెలవుల్ని పొడిగించారు. కొన్నిచోట్ల ఆన్లైన్ తరగతుల్ని నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గత వారంలో లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వారికి, రెండు మూడు రోజుల్లోనే వ్యాధి తగ్గిపోయిన వారికి క్వారంటైన్ వ్యవధిని అయిదు రోజులకి తగ్గించడం వల్లే కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకి పంపాలంటేనే హడలిపోతున్నారు. అయినప్పటికీ న్యూయార్క్, జార్జియా వంటి రాష్ట్రాల్లో స్కూళ్లను తెరుస్తున్నారు. న్యూయార్క్, మిల్వాకీ, షికాగో, డెట్రాయిట్ వంటి నగరాల్లో క్రిస్మస్ బ్రేక్ తర్వాత పాఠశాలల్ని తెరిచారు. విద్యార్థుల చదువులకి మధ్యలో ఆటంకం కలగకూడదని స్కూళ్లను తీస్తున్నట్టుగా న్యూయార్క్ మేయర్ ఆడమ్స్ చెప్పారు. కరోనాతో సహజీవనం చేయ డం అమెరికన్లు అలవాటు చేసుకోవాలన్నారు. ► జర్మనీలో కరోనా కేసులు 30 వేలకు పైగా నమోదయ్యాయి. అయినప్పటికీ ప్రజలు కరోనా నిబంధనలు పాటించడానికి సుము ఖంగా లేరు. కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి ► బ్రిటన్‌లో కేసులు పెరుగుతున్నప్పటికీ లక్షణాలు తీవ్రంగా లేకపోవడం ఊరటనిస్తోంది. మొత్తం కరోనా కేసుల్లో 90 శాతానికి పైగా ఒమిక్రాన్ కేసులే ఉన్నాయి. ► జపాన్‌లో రోజుకి వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. గత మూడు నెలల్లో కేసులు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. (చదవండి: అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు) మరోవైపు వైరస్ విజృంభణతో బైడెన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఇతర ఉన్నతాధికారులతో అమెరికా అధ్యక్షుడు వర్చువల్‌గా అత్యవసర సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇక 12 నుంచి 15 ఏళ్ల వయస్సు పిల్లలతో పాటు ప్రజలకు బూస్టర్ డోస్ అందించేందుకు ఫైజర్‌కు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతులు ఇచ్చింది. కాగా, యూఎస్‌లో ఇప్పటి వరకూ 62 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. (చదవండి: మనుషులుండే ఊరు.. మనిషిలా ఉండే ఊరు..) -
వేల సంఖ్యలో కేసులు.. భారత్‌లో మొదలైన కరోనా థర్డ్‌వేవ్?
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ మహమ్మారి మరోసారి గుబులు పుట్టిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో విచ్ఛలవిడిగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. గతవారం రోజుల్లో కేసుల్లో భారీ పెరుగుదల.. దేశంలో థర్డ్ వేవ్‌ను సూచిస్తోందని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. అయితే, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. అది మాత్రం మరువొద్దు దక్షిణాఫ్రికా తరహాలోనే భారత్‌లో మూడోవేవ్ ఉద్ధృతి ఉండవచ్చని డాక్టర్ అరోరా అంచనా వేశారు. గత పదిరోజుల్లో ఇన్ఫెక్షన్ ప్రవర్తనను చూస్తుంటే త్వరలోనే మూడో ముప్పు గరిష్ఠానికి చేరుకుంటుందని భావిస్తున్నామన్నారు. సౌతాఫ్రికాలో రెండు వారాలకే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయాన్ని డాక్టర్ అరోరా ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, వ్యాధి తీవ్రత, ఆస్పత్రి బారినపడకుండా రక్షణ పొందాలంటే రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఆయన స్పష్టంచేశారు. వీటితోపాటు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. (చదవండి: కేంద్రమంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా) రెండు వారాల్లోనే భారీ విస్తరణ డిసెంబర్ తొలివారంలో దేశంలో ఒమిక్రాన్ తొలి కేసును గుర్తించగా.. రెండు వారాల్లోనే 23రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించింది. ఇప్పటివరకు 1892 కేసులు వెలుగుచూశాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 568 కేసులు రికార్డ్ అవ్వగా.. ఢిల్లీలో 382, కేరళలో 185, రాజస్థాన్‌లో 174, గుజరాత్ 152, తమిళనాడు 121 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 37,379 కరోనా కేసులు నమోదుకాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 72వేలకు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. (చదవండి: ఒమిక్రాన్ సాధారణ జ్వరం మాత్రమే: యోగి ) -
టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. తెలంగాణలో 22. 78 లక్షల మంది టీనేజర్లకు వాక్సిన్ అందించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4. 5 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ పాజిటివిటీ రేటు 4 శాతం పెరిగిందని, బూస్టర్ ఇవ్వమని కేంద్రాన్ని కోరామని తెలిపారు. ఈమధ్యనే కేంద్రం స్పందించిందని, కోవాగ్జిన్ టీకా పిల్లలకు వేస్తున్నామని చెప్పారు. 1014 సెంటర్లలో వాక్సిన్ వేస్తున్నాంమని పేర్కొన్నారు. హైదరాబాద్ సహా 12 కార్పోరేషన్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి టీకా వేస్తున్నామని తెలిపారు. గుమికూడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. జనవరి 10 నుండి 60 ఏళ్ల పై బడిన వారికి టీకాలు వేయనున్నామని చెప్పారు. కాలేజీలు, స్కూళ్ల ప్రిన్సిపాల్లకు టీకాలు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. -
కోవిడ్ తెచ్చిన కొత్త వైరస్.. ఇజ్రాయెల్‌లో ఫ్లోరోనా కలకలం
టెల్ అవీవ్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ... ఇజ్రాయెల్‌లో ఫ్లోరోనా వ్యాధి కలకలం రేపుతోంది. ఆ దేశంలో తొలి ఫ్లోరోనా కేసు వెలుగుచూసింది. ఈ విషయాన్ని అరబ్ న్యూస్ వార్తా సంస్థ ట్విటర్ వేదికగా వెల్లడించింది. వ్యాధి కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఫ్లొరోనా అంటే కొవిడ్-19, ఇన్‌ఫ్లూయెంజా డబుల్ ఇన్ఫెక్షన్ అని వైద్యులు తెలిపారు. మరోవైపు భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగుచూస్త్ను నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేశామని ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ నచ్‌మన్ యాష్ తెలిపారు. తక్కువ ఇమ్యునిటీ ఉన్నవాళ్లకు నాలుగో డోసు కూడా ఇస్తున్నట్టు వెల్లడించారు. ఒమిక్రాన్ నుంచి రక్షణ పొందేందుకు నాలుగో డోసు వ్యాక్సిన్ తప్పనిసరైందని అన్నారు. ఇక గురువారం ఒక్కరోజే 5 వేల కోవిడ్ కేసులు బయటపడటంతో దేశ ఆరోగ్య శాఖ మంత్రి నిట్జన్ హొరొవిట్జ్ ఆందోళన వ్యక్తం చేశారు. చాలా కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వేనని అన్నారు. తమ దేశంలో ఫిఫ్త్ వేవ్ నడుస్తోందని చెప్పారు. (చదవండి: నాలుగో వేవ్ నుంచి బయటపడ్డట్లే.. రెండేళ్ల తర్వాత కర్ఫ్యూ ఎత్తివేత) -
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: టీనేజర్లకి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూస్టర్ డోసు,15-18 ఏళ్ల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియపై గైడ్ లైన్స్ విడుదల చేసింది. 15-18 ఏళ్లు దాటిన వారికి జనవరి ఒకటి నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు వయసు గల వారికి 2022 జనవరి 3 నుంచి వాక్సినేషన్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: పోలవరం పనులు భేష్ జనవరి 10వ తేదీ నుంచి రెండో డోసు వేసుకొని 9 నెలలు పూర్తయిన హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు, హెల్త్ వర్కర్స్, రెండు డోసులు పూర్తయిన వారికి డాక్టర్ల సూచనల మేరకు జనవరి 10వ తేదీ నుంచి బూస్టర్ డోసు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు,వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఫస్ట్ డోసులో మనమే ఫస్ట్: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: మొదటి కరోనా డోసును వంద శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా దేశంలో తెలంగాణ రికార్డు సృష్టించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఇప్పటివరకు అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, లక్ష ద్వీప్, సిక్కిం వంటి 8 చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే ఈ ఘనత సాధించాయన్నారు. ఈ లక్ష్యం చేరడంలో వైద్యారోగ్య శాఖ కృషి ఎంతో ఉందన్నారు. మొదటి డోసు వంద శాతం పూర్తి అయిన సందర్భంగా ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో మంగళవారం ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... మున్సిపల్, పంచాయతీ, ఇతర శాఖల సమన్వయంతో వైద్య ఆరోగ్యశాఖ ఈ మైలు రాయిని చేరుకుందన్నారు. క్షేత్ర స్థాయిలో ఉంటూ మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి టీకాలు వే స్తున్న ఏఎన్ఎం, ఆశా వర్క ర్లు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జనవరి 3 నుండి 15–18 వయస్సు వారికి, జనవరి 10 నుండి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ముందుగా హైదరాబాద్‌తోపాటు మున్సిపాలిటీల్లో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని, ఆ తర్వాత గ్రామ స్థాయిలో ఇస్తామని చెప్పారు. -
Sourav Ganguly: ఆస్పత్రిలో చేరిన గంగూలీ...
BCCI President Sourav Ganguly Admitted To Hospital: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. కోవిడ్-19 నిర్దారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ఆయన హాస్పిటల్లో చేరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు సమాచారం అందించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. కాగా గంగూలీ రెండో డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన కరోనా బారిన పడటం గమనార్హం. ఇక విధి నిర్వహణలో భాగంగా తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడం, ఈ క్రమంలో కోవిడ్ లక్షణాలు బయటపడటంతో సోమవారం రాత్రి ఆయనకు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘గత రాత్రి వుడ్లాండ్స్ నర్సింగ్‌హోంలో ఆయనను చేర్పించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది’’ అని పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది ఇప్పటికే గంగూలీ రెండుసార్లు అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆంజియోప్లాస్టి నిర్వహించిన తర్వాత అనారోగ్య కారణాల రీత్యా కొన్నిరోజుల పాటు గంగూలీ ఆస్పత్రిలో ఉన్నారు. చదవండి: KL Rahul: భారత వన్డే జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్! BCCI President and former India captain Sourav Ganguly admitted to hospital after testing positive for COVID-19, say BCCI sources — Press Trust of India (@PTI_News) December 28, 2021 -
పిల్లలకు టీకా.. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: వచ్చే జనవరి 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి టీకా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సోమవారం ప్రకటించింది. కోవిన్ యాప్/వెబ్సైట్లో అర్హులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. చదవండి: 2021 రివైండ్: టీడీపీకి పరాభవ ‘నామం’ ప్రభుత్వ గుర్తింపు కార్డులులేని వారు విద్యా సంస్థలు మంజూరు చేసిన గుర్తింపు కార్డులతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో 15–18 ఏళ్ల వయసులోపు వారు 22,41,000 మంది ఉన్నారు. టీకాల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సి ఉంది. కోవిన్ యాప్‌లో రిజస్ట్రేషన్ చేసుకోకుంటే, స్పాట్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుందో, లేదో అనే విషయం కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రిజిస్ట్రేషన్ ఇలా.. ►కోవిన్ మొబైల్ యాప్ లేదా https:// selfregistration. cowin. gov. in// పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ►యాప్ లేదా పోర్టల్‌లోకి లాగిన్ అయ్యాక ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. ►అనంతరం ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. ►ఒక ఫోన్ నంబర్‌పై నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. (ఉదా.. గతంలో తల్లిదండ్రులిద్దరూ కోవిన్ యాప్‌లో రిజిస్టరైన నంబరుతో వారి పిల్లల (15–18ఏళ్ల మధ్య వారైతేనే) పేర్లు కూడా నమోదు చేసుకోవచ్చు.) ► వెరిఫికేషన్ పూర్తయిన అనంతరం రిజిస్ట్రేషన్ పేజీ వస్తుంది. అందులో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి. ►గుర్తింపు కార్డు కింద ఆధార్‌ను ఎంచుకోవాలి. ఆధార్‌లేని పక్షంలో పదో తరగతి విద్యార్థి గుర్తింపు ఐడీ నంబరును నమోదు చేయవచ్చు. -
15–18 ఏళ్ల పిల్లలందరికీ టీకాలు.. హైదరాబాద్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు ఉపశమనం కలగనుంది. జనవరి 3వ తేదీ నుంచి 15– 18 ఏళ్లలోపువారికి టీకాలు వేయనున్నట్లు కేంద్రం ప్రకటించడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఏ జిల్లాలో ఎంత మంది పిల్లలు ఉన్నారు? ఏ వయసు వారు ఎంత మంది ఉన్నారు? వంటి అంశాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వ్యాక్సినేషన్ ప్రారంభం కావడమే ఆలస్యం. జిల్లాల వారీగా గుర్తించిన 15–18 ఏళ్ల పిల్లలందరికీ టీకాలు వేయాలని నిర్ణయించింది. హెల్త్‌కేర్ వర్కర్లతో పాటు 60 ఏళ్లు దాటిన వారికి సైతం జనవరి 10 నుంచి బూస్టర్ డోసు టీకాలు వేయనున్నారు. అంచనా ఇలా.. ►గ్రేటర్ పరిధిలోని కోటి జనాభాలో 18 ఏళ్లలోపు వారు సుమారు 35 లక్షల మంది వరకు ఉన్నట్లు సమాచారం. వీరిలో 15 నుంచి 18 ఏళ్ల లోపు సుమారు 7 లక్షల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏటా నిర్వహించే జాతీయ పల్స్‌పోలియో లెక్కల ప్రకారం నగరంలో 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు 9.5 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ►విద్యాశాఖ లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 1 నుంచి పదో తరగతి వరకు 21 లక్షల మంది చదువుతుండగా, ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కోర్సులు చదువుతున్న వారు మూడు లక్షలకుపైగా ఉన్నారు. 18 ఏళ్లలోపు వయసు ఉండి ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, డిగ్రీ, ఇతర కోర్సులు చదువుతున్న మరో మూడు లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా. వీరితో పాటు మధ్యలో చదువు మానేసిన వారు, అసలు బడి ముఖం కూడా చూడని వారు మరో లక్ష మంది వరకు ఉన్నట్లు అంచనా. ►వీరిలో కేవలం గ్రేటర్ వాసులే కాకుండా ఇతర జిల్లాల వారు కూడా ఉన్నారు. తొలి దశలో 15– 18 ఏళ్ల టీనేజర్లకు టీకాలు వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దశల వారిగా మిగిలిన చిన్న పిల్లలకు కూడా టీకాలు వేయనున్నారు. విద్యార్థులకు ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాకుండా ఎక్కడిక్కడ విద్యాసంస్థల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి టీకా లు వేయడం ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్లో మేడ్చల్ వెనకబాటు.. ►పద్దెనిమిదేళ్లు పైబడిన వారికి ఇప్పటి వరకు నిర్వహించిన వ్యాక్సినేషన్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పోలిస్తే మేడ్చల్ చాలా వరకు వెనకబాటులో ఉంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యానికి తోడు.. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి టీకాలు తెప్పించి, వ్యాక్సినేషన్ కేంద్రాలకు సకాలంలో చేర్చకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. ►ఇక హైదరాబాద్, రంగారెడ్డిలో టార్గెట్ పాపులేషన్‌కు మించి టీకాల సంఖ్య నమోదు కావడం విశేషం. జిల్లాలో ఇప్పటికీ మరో 15 శాతం మంది కనీసం ఫస్ట్ డోసు టీకా కూడా వేసుకోకపోవడాన్ని పరిశీలిస్తే.. ఇక్కడ టీకాల కార్యక్రమం ఎంత అధ్వానంగా జరుగుతోందో అర్థమవుతోంది. పెద్దలకు టీకాలు వేసే విషయంలోనే ఇంత వెనకబడిపోతే.. జనవరి నుంచి ప్రారంభం కానున్న పిల్లలకు టీకాల కార్యక్రమాన్ని ఎలా చేపడతారనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. ఒమిక్రాన్ కేసుల్లో మూడో స్థానం.. ఒమిక్రాన్ కేసుల నమోదులో జీహెచ్ఎంసీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. అత్యధికంగా మహారాష్ట్రలోని ముంబైలో పాజిటివ్ కేసులు నమోదై మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి వరుస స్థానాల్లో దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ మహానగరం ఉండటం గమనార్హం. ఈ వైరస్ తీవ్రత అంతగా లేకున్నా.. డెల్టాతో పోలిస్తే వేగంగా విస్తరించే లక్షణం ఉండటం ఆందోళన కలిగించే అంశం. -
9–12 నెలల తర్వాతే బూస్టర్!
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ రెండోడోసు తీసుకున్న తర్వాత ఎన్నాళ్లకు బూస్టర్ డోసు (మూడో డోసు... ప్రధాని మాటల్లో ప్రికాషన్ డోసు) ఇవ్వాలనే దానిపై భారత వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ముమ్మరంగా సమాలోచనలు చేస్తున్నారు. రెండో డోసు తీసుకున్న 9 నుంచి 12 నెలల తర్వాతే బూస్టర్ డోసు ఉండొచ్చని విశ్వసనీయ అధికారవర్గాలు ఆదివారం తెలిపాయి. ‘కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు ఎంతెంతకాలం తర్వాత బూస్టర్ డోసును ఇవ్వాలనే విషయంలో సాంకేతికాంశాల మదింపు జరుగుతోంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు’ అని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ 15–18 ఏళ్లలోపు టీనేజర్లకు జనవరి 3 నుంచి కరోనా టీకాలు ఇస్తామని, జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వైద్యరంగంలోని వారికి ‘ప్రీకాషన్ డోసు (ముందు జాగ్రత్త చర్యగా)’ను ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే 60 ఏళ్లు పైబడి, అనారోగ్య సమస్యలు ఉన్న వారికీ డాక్టర్ల సలహా మేరకు ప్రికాషన్ డోసు ఇస్తామని మోదీ అన్నారు. ఒమిక్రాన్ వేరియెంట్ ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. ‘రెండో డోసుకు, ప్రికాషన్ డోసుకు మధ్య వ్యవధి 9 నుంచి 12 నెలలు ఉండొచ్చు. ఇమ్యూనైజేషన్ విభాగం, ఇమ్యూనైజేషన్‌పై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్టీఏజీఐ) ఇదే తరహాలో సమాలోచనలు సాగిస్తున్నాయి’ అని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. టీనేజర్లకు ప్రస్తుతానికి కోవాగ్జినే జనవరి 3 నుంచి 15–18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైనపుడు కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారవర్గాలు ఆదివారం వెల్లడించాయి. దేశంలో 15–18 ఏళ్ల ఏజ్ గ్రూపులో ఏడు నుంచి ఎనిమిది కోట్ల మంది టీనేజర్లు ఉండొచ్చని పేర్కొన్నాయి. హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు... ఈ మూడు కేటగిరీల వారికి మాత్రం గతంలో రెండు డోసులు ఏ కంపెనీ టీకా తీసుకున్నారో ‘బూస్టర్ డోస్’గా అదే టీకా ఇస్తారని తెలిపాయి. -
టీనేజర్ల టీకాకు ఢోకా లేదు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు టీనేజర్లకు జనవరి 3 నుంచి కరోనా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో ఈ వయసు టీనేజర్ల సంఖ్య 22.78 లక్షలుగా ఉందని లెక్కించింది. టీకాకు అర్హుల్లో ఎక్కువ శాతం మంది టెన్త్, ఇంటర్ విద్యార్థులే ఉంటారని భావిస్తోంది. మరోవైపు పిల్లలకు టీకా ఇచ్చే విషయంలో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నాక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని చాలా మంది కంగారుపడుతున్నారు. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోగా అక్కడక్కడా విద్యార్థులు కరోనా బారినపడుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయని వారు అంటున్నారు. అలాగే జనవరి రెండో వారం నుంచి కరోనా తీవ్రత పెరుగుతుందని, ఫిబ్రవరి నాటికి తారస్థాయికి చేరుతుందని ప్రభుత్వం హెచ్చరించిందని... ఈ నేపథ్యంలో టీనేజర్లకు టీకా ఇవ్వడం అత్యంత కీలకమైనదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పరిధిలో ఉచితమే... టీనేజర్లకు ఇవ్వాల్సిన కరోనా టీకాలను ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ ఉచితంగానే టీకా ఇస్తారు. అయితే ప్రైవేటులో ఇచ్చే టీకాను ప్రస్తుత ధరకే ఇస్తారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. పిల్లలకు టీకా ఇస్తున్న నేపథ్యంలో ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మొదటి వారం రోజులపాటు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని, తర్వాత అనుభవాలను బట్టి తదుపరి చర్యలుంటాయని అధికారులు తెలిపారు. మరోవైపు 60 ఏళ్లు పైబడిన అనారోగ్య సమస్యలు ఉన్న వారితోపాటు వైద్యులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రివెంటబుల్ డోస్ (బూస్టర్ డోసు) టీకా ఇవ్వాలని కూడా కేంద్రం నిర్ణయించడంతో ఆయా లబ్ధిదారుల సంఖ్య, వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు 41.60 లక్షల మంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు 6.34 లక్షల మంది ఉంటారని, వారిలో రెండో డోస్ పూర్తయిన వారికి జనవరి 10 నుంచి బూస్టర్ డోస్ ఇస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు నూటికి నూరు శాతం మంది మొదటి డోస్ తీసుకున్నారు. రెండో డోస్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. మార్గదర్శకాలపై స్పష్టత రావాలి... పిల్లలకు కరోనా టీకాతోపాటు పెద్దలకు ప్రివెంటబుల్ డోస్ (బూస్టర్)పై కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటాం. ఇప్పటికైతే ప్రధాని విధాన నిర్ణయాన్నే ప్రకటించారు. దానికి సంబంధించి పూర్తి వివరాలతో మార్గదర్శకాలు రావాల్సి ఉంది. పిల్లలకు ఏ కంపెనీ టీకాలు వేస్తారు? ఎలా వేస్తారు? తదితర అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. – డాక్టర్ రమేశ్‌రెడ్డి, వైద్యవిద్య సంచాలకుడు 15–18 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా వేయాలని కేంద్రం నిర్ణయించడం సబబే. చిన్న వయసులో పిల్లలకు ఇచ్చే ఇతర టీకాలు ఎంత సురక్షితమో కరోనా వ్యాక్సిన్ కూడా అంతే సురక్షితం. ప్రస్తుతం ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీ పిల్లలకు వ్యాక్సిన్ వేయించడానికి తల్లిదండ్రులు వెనుకాడవద్దు. – డాక్టర్ ఎస్.కవిత, పీడియాట్రిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్, నిలోఫర్ -
కోవిడ్ తగ్గడం లేదూ.. ట్రావెల్ తప్పడం లేదు... మరి ఎలా?
ఓ వైపు కోవిడ్ తగ్గడం లేదు... మరోవైపు ప్రయాణాలు చేయాల్సిన అవసరం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ► అన్నిటికంటే ముందుగా రెండు విడతల్లో తాము వ్యాక్సిన్ డోసులను తీసుకున్నామని తెలిపే పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి. ► తాము వెళ్తున్న ప్రదేశంలో ఉండే వాతావరణ పరిస్థితులకు అనువుగా తాము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొని... వాటిని ఆచరించాలి. ► తమకు ఏవైనా సమస్యలుంటే అవి కరోనా ఇన్ఫెక్షన్తో కలిసి కో–మార్డిడ్ (ప్రమాదానికి దారితీసే అవకాశాలున్న వ్యాధులు)గా పరిణమించే అవకాశం ఉన్నట్లయితే ఆ మేరకు అవసరమైన మందులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు హై–బీపీ, డయాబెటిస్, హై–కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు తాము ప్రయాణం చేసే వ్యవధికి అవసరమైన మేరకు మందులను సంసిద్ధం చేసుకోవాలి. (చదవండి: మొసళ్ల కన్నీళ్లు తుడిచారు.. మీరు భేషుగ్గా ఈ నదిలో ఉండవచ్చు!) ► విదేశాలకు వెళ్లేవారు కరోనా పరీక్ష చేయించుకుని, తమకు కోవిడ్ లేదనే సర్టిఫికేట్‌ను వెంట ఉంచుకోవాలి. కోవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ల విషయంలో వివిధ దేశాల నిబంధనలు వేర్వేరుగా ఉండవచ్చు. వాటికి అనుగుణంగా నడుచుకోవాలి. ► పిల్లల విషయంలో కొంత సమస్య వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో 18 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరగలేదు. అయితే విదేశాల్లోని కొన్నిచోట్ల 5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకూ, 12 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడాన్ని అనుమతించారు. ఈ నేపథ్యంలో పిల్లలకు క్వారంటైన్ నిబంధలు వర్తించే అవకాశం ఉంది. అందుకే తమ గమ్యస్థానంలో పిల్లల విషయంలో ఉన్న కోవిడ్ నిబంధలను తెలుసుకున్న తర్వాతే ప్రయాణం నిర్ణయించుకోవడం అవసరం. ► ఆయా దేశాలే కాదు... కొన్ని సందర్భాల్లో తాము ప్రయాణం చేసే విమాన సంస్థలు సైతం కొన్ని ఆంక్షలు పెడుతున్నాయి. ‘‘ఫిట్ టు ఫ్లై’’ నిబంధనలుగా చెప్పే వీటిని ముందుగా తెలుసుకోవాలి. దాంతో మున్ముందు తాము పడబోయే ఇబ్బందులను తేలిగ్గా నివారించుకున్నట్లు అవుతుంది. (చదవండి: హైపో థైరాయిడిజమ్.. ఏం తినాలి? ఏం తినకూడదు!!) ► తాము బస చేయబోయే చోట కొందరు ‘పాస్ట్ ట్రావెల్ హిస్టరీ’ అడిగి తీసుకుంటూ ఉంటారు. అంటే... గతంలో ఏయే ప్రాంతాలు / దేశాలు తిరిగివచ్చారో అడిగి తెలుసుకుంటుంటారు. గతంలో తాము ప్రయాణం చేసివచ్చిన ఆయా ప్రాంతాలు ఒకవేళ కంటెయిన్మెంట్ జోన్లు లేదా నిషేధ ప్రాంతాలుగా ఉంటే... ఆ ప్రయాణికులను అనుమతించబోరు లేదా నిర్దేశిత సమయం కోసం వారిని క్వారంటైన్లో ఉంచవచ్చు. అందుకే తమ పాస్ట్ ట్రావెల్ హిస్టరీ గురించి ఎవరికి వారు ముందుగానే సమీక్షించుకుని, ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. అయితే ప్రజలందరి సంక్షేమం కోసం తమ ట్రావెల్ హిస్టరీని పారదర్శకంగా సమర్పించడం ప్రయాణికులకూ మేలు. ఒక్కోసారి ఏదైనా సమాచారాన్ని దాచిపెట్టడం... వారికే ఇబ్బందులు తెచ్చేందుకు అవకాశమిస్తుంది. ఒకవేళ అక్కడ క్వారంటైన్లో ఉండాల్సి వస్తే ఆ మేరకు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ► ప్రయాణం ఎలా చేసినప్పటికీ (బస్సు, ట్రైన్, విమానం) అక్కడ గుంపులు మనుషులు (క్రౌడ్) ఉన్నచోట మాస్కులు విధిగా ధరించడం, ప్రయాణంలోనూ తరచూ శానిటైజర్‌తోగానీ లేదా సబ్బుతోగానీ చేతులు శుభ్రం చేసుకవడం లాంటి తగిన కోవిడ్ నిబంధనల వల్ల ప్రయాణం చాలావరకు సురక్షితంగా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. -డాక్టర్ ఆర్.వి. రవి కన్నబాబు, సీనియర్ కన్సల్టెంట్, జనరల్ మెడిసిన్, విశాఖపట్నం . -
12 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవాగ్జిన్!
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాను 12ఏళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అత్యవసర వాడుకకు అనుమతినిచ్చింది. అయితే ఈ అనుమతికి పరిమితులు విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2–18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ వాడకంపై భారత్ బయోటెక్ ఫేజ్–2 ట్రయల్స్ నిర్వహించి సీడీఎస్సీఓకు గతంలో సమర్పించింది. పిల్లలకు కొన్ని నిబంధనలతో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని అక్టోబర్‌లో సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ సూచించింది. ఈ సిఫార్సును డీజీసీఐకు చెందిన మరో కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిందని, మరిన్ని వివరాలు సమర్పించాలని కంపెనీని కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వివరాలు పరిశీలించిన అనంతరం డీజీసీఐ కోవాగ్జిన్‌కు శుక్రవారం అనుమతినిచ్చినట్లు వెల్లడించాయి. కమిటీ సూచన మేరకు కోవాగ్జిన్‌ను 12– 18ఏళ్ల వారికి 0– 28 రోజుల వ్యవధిలో అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు అనుమతినిస్తున్నట్లు డీజీసీఐ ప్రకటన వెల్లడించింది. డీజీసీఐ నిర్ణయంపై భారత్ బయోటెక్ హర్షం ప్రకటించింది. ఇప్పటికే దేశంలో జైడస్ క్యాడిలా వారి జైకోవ్– డీ టీకాను 18 ఏళ్లలోపు వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. పిల్లలపై సీరమ్, బయోలాజికల్–ఇ లిమిటెడ్ కంపెనీల టీకాల ఫేజ్2 ట్రయల్స్‌కు డీజీసీఐ గతంలో అనుమతినిచ్చింది. డీజీసీఐ తాజా నిర్ణయాన్ని మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు స్వాగతించారు. -
ఒక్క అడుగే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఒమిక్రాన్ దడ.. ముంగిట్లో థర్డ్‌వేవ్ నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం జనం పరుగులు తీస్తున్నారు. ‘ఏం పర్వాలేదు’అని ఇప్పటివరకు అనాసక్తి చూపిన వాళ్లూ టీకా వేయించుకుంటున్నారు. రాష్ట్రంలో అర్హత గల వ్యక్తుల్లో 100 శాతం (99 శాతం) చేరువలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. రెండో డోస్ వేయించుకున్నవారు కూడా 63 శాతానికి చేరుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వచ్చే నెల మొదటి వారం వరకు రెండో డోస్ అర్హత కలిగిన వ్యక్తులందరికీ కూడా 100 శాతం అందించేలా ప్రత్యేక ప్రణాళిక వేసినట్టు అధికారులు తెలిపారు. టార్గెట్ 2.7 కోట్లు మంది కరోనా వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడినవారికి వేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం 18 ఏళ్లు నిండి వ్యాక్సిన్‌కు అర్హులైన వారు రాష్ట్రంలో 2,77,67,000 మంది ఉన్నారు. వీరందరికీ రెండు డోస్‌లు వ్యాక్సిన్ పూర్తి చేసే దిశగా సర్కారు ప్రణాళిక వేసింది. అర్హత గల వ్యక్తుల్లో ఇప్పటివరకు 2,75,88,003 మందికి వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో అనేక మంది వలస కూలీలు, కార్మికులు, ఇతర ఉద్యోగులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. హైదరాబాద్, మెదక్, ఇతర కొన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి రంగారెడ్డి జిల్లాలో 113 శాతం, హైదరాబాద్‌లో 110 శాతం, మెదక్‌లో 104 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ జరిగిందని అధికారులు తెలిపారు. ఇక రెండో డోస్ 1.76 కోట్ల మందికి (63 శాతం) వేశారు. ఇందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 86 శాతం, హైదరాబాద్‌లో 80 శాతం, రంగారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో 78 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 76 శాతం రెండో డోస్ వేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యంత తక్కువగా కొమురం భీం జిల్లాలో 33 శాతం, వికారాబాద్ జిల్లాలో 36 శాతం, గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో 43 శాతం చొప్పున రెండో డోస్ వేశారు. వ్యాక్సినేషన్లో ముఖ్యాంశాలు ♦మొదటి, రెండో డోస్‌లు కలిపి 4.51 కోట్లు వేశారు. ప్రభుత్వ కేంద్రాల్లోనే ఎక్కువగా వ్యాక్సిన్లు వేస్తున్నారు. ♦రాష్ట్రంలో అందుబాటులో ఉన్న టీకా డోస్‌లు – 33.98 లక్షలు. ఇందులో కోవిషీల్డ్ 19.17 లక్షలు, కోవాగ్జిన్ 14.81 లక్షల డోస్‌లు. ♦ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసేలా మొబైల్ టీంలను ఏర్పాటు చేశారు. ♦కొన్నిచోట్ల కరోనా టీకాలు వేసుకోకపోతే జీతాలు ఇవ్వొద్దని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ♦పొలాలు, గడ్డివాముల మీదికి కూడా ఎక్కి వైద్య సిబ్బంది టీకాలేస్తున్నారు. పనిచేసే చోట కూడా వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ♦18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. -
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ప్రకటన విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: ప్రతి రోజూ మరింత ఎక్కువ మంది అర్హులైన వయోజనులకు కోవిడ్ టీకాలను వేయాలని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు కోవిడ్‌పై సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వివరాలతో కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘క్రిస్మస్, కొత్త ఏడాది నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే రాష్ట్రాలు కంటైన్మెంట్ చర్యలు, ఆంక్షలు విధించాలి. ఆంక్షలు విధిస్తే కనీసం 14 రోజులపాటు అమలుచేయాలి. తొలి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్, అర్హులైన వారికి రెండు డోస్‌లూ ఇవ్వాలి. తొలి, రెండో డోస్‌లు పూర్తి చేయడంలో జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ శాతం నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ’అని కేంద్రం ఆ ప్రకటనలో పేర్కొంది. ‘కరోనా పాజిటివిటీ రేటు 10శాతం కన్నా పెరిగినా, ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయమున్న ఐసీయూ పడకలు 40 శాతానికి మించి నిండినా స్థానికంగా కంటైన్మెంట్ చర్యలు వెంటనే తీసుకోవాలి’అని ప్రకటనలో సూచించింది. (చదవండి: ఆవు తల్లితో సమానం) -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ. 19,675 కోట్లు ఖర్చు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ల కొనుగోలుకు ఈనెల 20వ తేదీ దాకా రూ. 19,675 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేశామని సామాజిక కార్యకర్త అమిత్ గుప్తా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానమిచ్చింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35,000 కోట్లను కేటాయించింది. ఈ ఏడాది జనవరి 16న మనదేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. కోవిన్ పోర్టల్ ప్రకారం దేశంలో ఇప్పటిదాకా 140 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. మే 1 నుంచి డిసెంబరు 20వ తేదీ దాకా 117.56 కోట్ల డోసులను ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో (సీవీసీ) ప్రజలకు ఉచితంగా అందజేశామని, 4.18 కోట్ల డోసులను మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలు తీసుకున్నారని ఆరోగ్య శాఖ వివరించింది. జూన్ 21న మార్చిన నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ నెలవారీ ఉత్పత్తి సామర్థ్యంలో 25 శాతం టీకాలను ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా అమ్ముకోవచ్చు. 60 శాతం మందికి డబుల్ డోస్ దేశంలో అర్హులైన వారిలో (18 ఏళ్లకు పైబడిన వారిలో) 60 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు. 89 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని తెలిపారు. కాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గురువారం 300 దాటింది. -
ఒమిక్రాన్‌తో కరోనా విశ్వరూపం!
న్యూయార్క్: కరోనాతో తీవ్ర అనారోగ్యం పాలుపడకుండా ఉండేందుకు తక్షణమే ప్రజలంతా కోవిడ్ టీకాలు తీసుకోవాలని ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో కరోనా సంక్షోభం అత్యంత తీవ్రదశకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, టీకా తీసుకున్నవారిలో కూడా ఇన్ఫెక్షన్ కలిగిస్తోందని ఇప్పటికే డబ్లు్యహెచ్‌ఓ ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో హాలీడే సీజన్లోకి అడుగుపెట్టడం ఆందోళన కలిగిస్తోందని గేట్స్ చెప్పారు. అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండకపోవచ్చని, భవిష్యత్‌లో ఒక రోజు ఈ మహమ్మారికి అంతం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటివరకు ఒకరికొకరు అండగా ఉండాలన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని భావిం చే సమయంలో కరోనా విజృంభణ మళ్లీ మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ అందరికీ సోకుతోందని, తన స్నేహితుడు దీని బారిన పడడంతో తాను హాలీడే ప్రణాళికలను రద్దు చేసుకున్నానని తెలిపారు. వీలైతే బూస్టర్ డోసు తీసుకోవడం ద్వారా మరింత రక్షణ పొందవచ్చని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్ మనపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో ఇంకా తెలియదని, ఈ విషయాల్లో స్పష్టత వచ్చేవరకు అంతా దీన్ని సీరియస్‌గానే తీసుకోవాలని సూచించారు. డెల్టాలో కనీసం సగం తీవ్రత దీనికున్నా దీని వేగంతో అత్యంత భీభత్సం సృష్టించగలదని హెచ్చరించారు. మూడునెలల్లో వేవ్ పూర్తి ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, ఇది ఒక దేశంలో అడుగుపెట్టి డామినెంట్ వేరియంట్‌గా మారిన తర్వాత వచ్చే వేవ్ 3నెలల్లోపే ముగియడం శుభపరిణామమని గేట్స్ చెప్పారు. అయితే వేవ్ కొనసాగిన కాలం మాత్రం సమస్యలు తప్పవన్నారు. సరైన చర్యలు తీసుకుంటే 2022కు తప్పక కరోనాకు చరమగీతం పాడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఒమిక్రాన్ దడ, థర్డ్‌వేవ్ హెచ్చరిక.. ‘బూస్టర్’ వైపు పరుగులు..
హైదరాబాద్‌కు చెందిన నారాయణకు 60 ఏళ్లు. దీర్ఘకాలిక సమస్యలున్నాయి. రెండో డోస్ పూర్తయి 6 నెలలైంది. థర్డ్‌వేవ్ హెచ్చరికలతో వైద్యుల సలహా మేరకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బూస్టర్ డోస్ వేయించుకున్నారు. డాక్టర్ సూర్యనారాయణరావు (పేరు మార్చాం). 52 ఏళ్లు. కరోనా రెండో వేవ్ సమయంలో ఈయన గుండెకు స్టెంట్లు వేశారు. షుగర్ కూడా ఉంది. పైగా కరోనా రెండో డోస్ వేసుకొని ఆరు నెలలైంది. ఒమిక్రాన్ నేపథ్యంలో ఎందుకైనా మంచిదని మూడో డోస్ వేయించుకున్నారు. సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ దడ, థర్డ్‌వేవ్ హెచ్చరికలతో రాష్ట్రంలో అనేకమంది కరోనా బూస్టర్ డోస్ వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొందరు అనధికారికంగా మూడో డోస్ వేయించుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వయసు పైబడినవారు బూస్టర్ వేయించుకుంటున్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి కూడా బూస్టర్ డోస్ వేయించుకున్నట్లు ఆయనే స్వయంగా అంతర్గతంగా వెల్లడించడం గమనార్హం. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ పలువురు బూస్టర్ డోస్ వేయించుకుంటున్నారు. ఇదంతా అనధికారికంగా జరుగుతుండటంతో ఎంతమంది వేయించుకున్నారో స్పష్టత లేదు. మరోవైపు అవసరమైన వారికి బూస్టర్ డోస్ వేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఇటీవలే కేంద్రానికి విన్నవించిన విషయం తెలిసిందే. చదవండి: ఒమిక్రాన్ అప్డేట్స్.. రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు.. రెండో డోసులేసుకున్న ఆర్నెల్ల తర్వాత.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఒమిక్రాన్ భయంతో టీకాలు వేయించుకోవడానికి అనేకమంది ముందుకొస్తున్నారు. ఇప్పటికే 97.35 శాతం మంది మొదటి డోస్.. 56.08 శాతం మంది రెండో డోస్ వేయించుకున్నారు. 11 జిల్లాల్లో నూరు శాతం ఫస్ట్ డోస్ పూర్తయింది. సహజంగా రెండు డోసులు వేసుకున్న ఆరు నెలల వరకే కరోనా నుంచి రక్షణ ఉంటుంది. ఆ తర్వాత బూస్టర్ డోస్ వేయించుకుంటే మంచిదన్న భావన ఉంది. 60 ఏళ్లు పైబడినవారు, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులున్నవాళ్లకు బూస్టర్ వేయాలన్న చర్చ నేపథ్యంలో ఈ వర్గం ప్రజలు చాలా చోట్ల మూడో డోస్ వేయించుకుంటున్నారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మూడో డోస్ వేయాలని వాదనలు నడుస్తున్నాయి. చదవండి: హైదరాబాద్: ఆరుగురు పరారు.. నలుగురు దొరికారు తొలి, రెండో డోస్‌పైనే కేంద్రం దృష్టి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బూస్టర్ డోస్ వేయించుకునే వారి నుంచి రూ. 1,500 వరకు వసూలు చేస్తున్నట్లు కొందరు తెలిపారు. అధికారికంగా వేయడానికి అనుమతి లేకపోవడంతో రిజిస్ట్రేషన్ లేకుండానే వేస్తున్నారు. కేంద్రం ప్రస్తుతం మొదటి, రెండో డోస్‌పైనే దృష్టి పెట్టింది. అనేక దేశాల్లో వ్యాక్సిన్ల కొరత ఉండటంతో బూస్టర్ వేయడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో కేంద్రమూ బూస్టర్‌పై నిర్ణయం తీసుకోలేదని సమాచారం. చదవండి: క్రికెట్ టోర్నీలో చాన్స్ ఇస్తామని చెప్పి.. మహిళా క్రికెటర్‌ను -
Covid Vaccine: 3 నెలలకే కోవి‘షీల్డ్’ మాయం!
లండన్: ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా రూపొందించిన కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత మూడు నెలలకు అది కల్పించే రక్షణ తగ్గుతోందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. బ్రెజిల్, స్కాట్లాండ్లో సేకరించిన గణాంకాల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించామని, దీన్ని ఇచ్చిన వారికి బూస్టర్ డోసులివ్వడం ద్వారా రక్షణ పెంచాలని సూచించింది. ఈ టీకా కోవిషీల్డ్ పేరిట ఇండియాలో గుర్తింపు పొందింది. వేరియంట్‌ను బట్టి టీకా రక్షణ తగ్గడం ఆధారపడి ఉందని పరిశోధకులు చెప్పారు. తమ పరిశోధన బూస్టర్ డోసుల ప్రాముఖ్యాన్ని వివరిస్తోందని ఇందులో పాల్గొన్న ప్రొఫెసర్ శ్రీనివాస్ విఠల్ కటికిరెడ్డి చెప్పారు. రక్షణ తగ్గుతోందని తెలియగానే భారత ప్రభుత్వం బూస్టర్ డోసులివ్వడం ఆరంభించాలన్నారు. (చదవండి: ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి.. 60 నిద్ర మాత్రలు మింగేశాడు!) -
ఆ ఇమ్యూనిటీతో ఎదుర్కోవచ్చు
సాక్షి, హైదరాబాద్: ‘మన దేశంలోని సగం మందిని ఇప్పటికే డెల్టా ప్రభావితం చేయడం, ఆ తర్వాత వాళ్లు టీకాలు తీసుకోవడం వల్ల కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే శక్తి చాలావరకు వస్తుంది. ఇన్ఫెక్షన్ తర్వాత తీసుకునే వ్యాక్సిన్ శక్తివంతమైనదని కూడా డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. సాధారణ ప్రజలు డెల్టా ఎఫెక్ట్ అయ్యాక టీకా తీసుకుంటే, వైద్యులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లు వ్యాక్సిన్ తీసుకున్నాక వైరస్ బారిన పడ్డారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే సమర్థత వస్తుంది. దీనినే హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటారు. ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలో ఈ ఇమ్యూనిటీ ఎక్కువే..’ అని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డా.కిరణ్ మాదల చెప్పారు. ఒమిక్రాన్, తదనంతర పరిస్థితులపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు వెంటనే టీకా వేసుకోవాలి: ‘డెల్టా కంటే ఒమి క్రాన్ రెండురెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి కుటుంబంలోని ఇతర సభ్యులకు వేగంగా సోకే లక్షణాలున్నాయి. వ్యాక్సిన్ నుంచి తప్పించుకునే లక్షణాల కారణంగా ఎక్కువ మందికి సోకుతుంది. అందువల్ల మూడు, నాలుగు నెలల్లో ఇక్కడ థర్డ్‌వేవ్ రావొచ్చు. టీకాలతో మరణాలు సంభవించకుండా ఆపొచ్చే తప్ప వైరస్ సోకకుండా పూర్తిస్థాయిలో నియంత్రించలేము. సెకండ్ డోస్ తీసుకోనివారు రాష్ట్రంలో 25 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో 80 లక్షల డోసులు అందుబాటులో ఉన్నా వాటిని నిర్ణీత కాలవ్యవధిలో వేసుకోకపో వడం సరికాదు. ఒక్కడోస్ కూడా తీసుకోని వారు వెంటనే టీకా వేసుకోవాలి..’ అని సూచించారు. వీరిని బయటకు పంపకూడదు ‘అరవై ఏళ్లకు పైబడినవారు టీకాలు వేసుకుని 6 నెలలు గడిచినందున వారు ప్రభావితం కావొచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యసమస్యలున్న వారిపైనా దీని తీవ్రత ఎక్కువుండే అవకాశాలున్నాయి. వీరిని 2, 3 నెలలు బయటకు పంపించకుండా చూడాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాస్క్, ఇతర జాగ్రత్తలన్నీ కచ్చితంగా పాటించాలి..’ అని కిరణ్ మాదల చెప్పారు. -
వారే ఎక్కువగా వైరస్ ప్రభావానికి గురవుతారు
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా తీవ్రతను నిరోధించడంలో టీకాల పాత్ర కీలకం కాబట్టి ఇవి అస్సలు తీసుకోనివారు, ఇంకా ఇవ్వని 18 ఏళ్లలోపు పిల్లలు, 86 రోజుల వ్యవధి దాటినా రెండోడోస్ టీకా వేయించుకోనివారు ఈసారి ఎక్కువగా వైరస్ ప్రభావానికి గురయ్యే అవకాశాలున్నాయి’ అని కిమ్స్ ఆస్పత్రి పల్మనాలజీ, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ డాక్టర్ వీవీ రమణప్రసాద్ చెప్పారు. వీరందరికీ వెంటనే టీకాలు వేయాలని సూచించారు. ఇప్పటికైతే సేఫ్ జోన్లో ఉన్నట్టే అనిపిస్తోందని, వచ్చే రెండునెలలు మరింత అప్రమత్తత అవసరమని డాక్టర్ రమణప్రసాద్ అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ‘సాక్షి’ఇంటర్వ్యూలో డాక్టర్ రమణప్రసాద్ వివరించారు. ముఖ్యాంశాలు.. ప్రశ్న: ఒక్క డోస్‌తో రక్షణ ఎంత ? డా.రమణ: భారత్‌లో రెండు టీకాలు తీసుకున్నవారు 20–25 శాతంలోపే ఉన్నారు. ఒక్క డోస్ తీసుకున్నాక ఇక తమకేమి కాదన్న ధీమాతో చాలామందే ఉన్నారు. రెండు టీకాల మధ్య వ్యవధి పెరిగే కొద్ది మొదటి దాని నుంచి వచ్చే రక్షణ కూడా క్రమంగా తగ్గిపోతుంది. వాస్తవానికి ఒక్కడోస్తో వచ్చే రోగనిరోధకశక్తి 30 శాతం లోపే. రెండోది వేసుకుంటేనే టీ–సెల్స్, యాంటీబాడీస్ సంఖ్య బాగా పెరుగుతుంది. సెకండ్‌డోస్ తీసుకున్నాకే పూర్తి ఇమ్యూనిటీ వస్తుంది. ప్రశ్న : కొత్త వేరియెంట్లతో ప్రమాదమా ? డా.రమణ: ఎక్కువ తీవ్రత, ప్రభావం చూపేలా ఒమిక్రాన్‌లో మరో స్ట్రెయిన్ లేదా వైరస్ మరో కొత్త వేరియెంట్ వస్తే ప్రమాదకరమే. గతంలో కూడా ఐరోపా, యూఎస్, యూకే తదితర దేశాల్లో కోవిడ్ తీవ్రంగా ఉంది, మన దగ్గర లేదని భావించాం. ఐతే కొంతకాలానికే పరిస్థితి తలకిందులై సెకండ్‌వేవ్‌తో భారత్ తీవ్రమైన సంక్షోభానికి గురైంది. విదేశాల నుంచి డెల్టా కాస్తా డెల్టాప్లస్గా మారి ఇక్కడికి వచ్చాక సమస్య తీవ్రమైంది. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తపడాలి. తీవ్రమైన లక్షణాలతో కొత్త మ్యుటేషన్ వస్తే మళ్లీ పెద్ద సమస్యగా మారుతుంది. ప్రశ్న: దేశంలో ప్రస్తుత స్థితిని ఎలా అంచనా వేస్తారు? డా.రమణ: ఇప్పటికైతే సేఫ్ జోన్లో ఉన్నట్టే అనిపిస్తోంది. వచ్చే రెండునెలలు మరింత అప్రమత్తత అవసరం. ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో కూడా జనవరిలో కేసుల పెరుగుదల మొదలై మార్చి, ఏప్రిల్ వరకు కొనసాగింది. అందువల్ల ఇప్పుడు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా అంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రశ్న: పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? డా.రమణ: ఈసారి పిల్లలతోనే కరోనా తీవ్రత పెరగొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు టీకా తీసుకోనివారికి, పిల్లలకు, రెండోడోస్ అవసరమైనవారికి వెంటనే వ్యాక్సిన్లు వేయడం మొదలుపెట్టాలి. ఆ తర్వాతే మిగతావారికి మూడో/బూస్టర్ డోసులు వేయాలి. పిల్లలు వైరస్ కారియర్లుగా ఇతరులకు వ్యాపింపజేస్తారు. -
కరోనా రెండో డోసు: గాలించి పట్టుకొని, వారిపై చర్యలు
సాక్షి, ముంబై: కరోనా టీకా రెండో డోసు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న అనేకమందికి రెండో డోసు తీసుకోవడానికి ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసింది. అయినప్పటికీ, అనేక మంది రెండో తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా సుమారు కోటి నుంచి కోటిన్నర వరకు డోసుల నిల్వలు అలాగే పడి ఉన్నాయి. టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ జనాలు ముందుకు రాకపోవడంపై అజిత్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అలాంటి వారిని గాలించి పట్టుకొని, వారిపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు. చదవండి: ('పగ, ద్వేషం ఉంటే నాపై తీర్చుకోండి.. వారు మీకు ఏం అన్యాయం చేశారు') కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు కోసం 28 రోజుల గడువు ఇచ్చారు. ఆ తరువాత టీకాల కొరత ఏర్పడటంతో ఆ గడువును 84 రోజులకు పెంచారు. కానీ, గడువు ముగిసినప్పటికీ అనేకమంది రెండో డోసు తీసుకోవడం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ ఒమిక్రాన్ రూపంలో తెరమీదకు వచ్చింది. రోజురోజుకు ఈ వేరియంట్ కేసులు పెరుగుతుండటం ప్రజల్లో దడ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు రెండు డోసులు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, టీకాను నిర్లక్ష్యం చేస్తున్న వారి వల్ల ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించే ప్రమాదం లేకపోలేదు. రెండో డోసు తీసుకోని వారిలో ముంబై, థానే, నాసిక్, పుణే లాంటి ప్రధాన నగరాల కంటే జిల్లాల్లోనే ఎక్కువమంది ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో రెండో డోసు తీసుకోకుండా బాధ్యతా రహితంగా ప్రవర్తించే వారిపై ఆంక్షలు విధించాలనే యోచనలో ఉన్నట్లు అజిత్ పవార్ తెలిపారు. దీంతో వారు భయపడి స్వచ్చందంగా రెండో డోసు వేసుకునేందుకు ముందుకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. -
టీకా వేసుకుంటేనే థియేటర్లోకి అనుమతి
తిరుత్తణి: కరోనా టీకా వేసుకున్న వారికి మాత్రమే సినిమా థియేటర్లలోకి అనుమతి ఇవ్వనున్నట్టు కలెక్టర్ ఆల్పీ జాన్ వర్గీస్ తెలిపారు. ఆయన శుక్రవారం తిరుత్తణిలో సినిమా థియేటర్ల వద్ద ప్రత్యేక కరోనా వ్యాక్సినేషన్ శిబిరం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో జిల్లాలో గణనీయంగా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఇంకా 20 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోలేదన్నారు. ఈ క్రమంలో రద్దీగా ఎక్కువగా ఉండే ఆలయాలు, సినిమా థియేటర్లు, మాల్స్, రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారిని మాత్రమే సినిమా థియేటర్లలోకి అనుమతించాలని యాజమాన్యాలను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జవహర్హలాల్, ఆర్డీవో సత్య, మున్సిపల్ కమిషనర్ రామజయం పాల్గొన్నారు. -
టీకా వేయకున్నా వేసినట్టుగా ఎస్సెమ్మెస్‌లు!
ఇది ఇద్దరి సమస్య కాదు.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ప్రజలకు ఇలా వ్యాక్సిన్ వేసుకోకున్నా వేసుకున్నట్టుగా ఎస్సెమ్మెస్‌లు వస్తున్నాయి. ఉత్త మెసేజీలే కాదు.. అందులోని లింకును క్లిక్ చేస్తే వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్లు కూడా డౌన్లోడ్ అవుతుండటం కలకలం రేపుతోంది. తొలిడోసు తర్వాత నిర్దేశిత గడువు పూర్తయినా రెండో డోసు తీసుకోని వారితోపాటు ఇంకా గడువు ఉన్నవారికి, అసలు ఒక్క డోసు కూడా వేసుకోని వారికీ.. ఇలా ‘వ్యాక్సినేషన్’ మెసేజీలు, సర్టిఫికెట్లు రావడం ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వం పెట్టిన 100% వ్యాక్సినేషన్ లక్ష్యం కోసం కొందరు వైద్య సిబ్బంది ఈ నిర్వాకానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ‘ఫేక్ వ్యాక్సినేషన్’ వ్యవహారంపై ‘సాక్షి’ చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో కీలక అంశాలు వెలుగు చూశాయి. దీనిపై ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సినేషన్ చేపడుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని వైద్యారోగ్య శాఖకు లక్ష్యంగా నిర్దేశించింది. తక్కువగా వ్యాక్సినేషన్ జరిగిన ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్వయంగా పర్యటిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు కూడా. కానీ టీకాలు వేసుకోకున్నా వేసుకున్నట్టుగా మెసేజీలు వస్తుండటం, సర్టిఫికెట్లు కూడా డౌన్లోడ్ అవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకిలా జరుగుతోందన్న దానిపై ఎవరూ స్పష్టత ఇవ్వకపోవడంతో.. జనంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండో డోసు వేసుకోని వారివే.. రాష్ట్రవ్యాప్తంగా టీకా వేసుకునేందుకు 18ఏళ్లు పైబడిన అర్హులు 2,77,67,000 మంది ఉన్నారు. ఇందు లో ఇప్పటివరకు 94 శాతం మంది తొలి డోసు తీసుకున్నారని, రెండు డోసులూ తీసుకున్నవారు 51 శాతమేనని వైద్యారోగ్య శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఒక్కడోసు కూడా వేసుకోని వారు ఆరు శాతం, రెండో డోసు వేసుకోనివారు 49శాతం మంది ఉండటం.. ఒమిక్రాన్ వేరియంట్ ముంచుకొస్తుందనే అంచనాలతో.. రాష్ట్రం వంద శాతం వ్యాక్సినేషన్‌పై సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే రెండో డోసు తీసుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో జిల్లాల్లో కొందరు వైద్యాధికారులు, సిబ్బంది అడ్డదారి పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి, రెండో డోసు మధ్య గడువు (కోవాగ్జిన్ టీకాకు 6 నుంచి 8 వారాలు, కోవిషీల్డ్ టీకాకు 12 నుంచి 16 వారాలు) దాటినా వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి.. వారికి టీకా వేసినట్టుగా ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్టు సమాచారం. ఒక్కోచోట ఒక్కో సమాధానం: రెండో డోసు తీసుకోకున్నా వేసుకున్నట్టు మెసేజీలు వచ్చినవారు అయోమయానికి గురవుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. వారికి ఒక్కోచోట ఒక్కో సమాధానం వస్తోందని చెప్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ పీహెచ్సీ సిబ్బంది దీనిపై స్పందిస్తూ..‘‘ఆటోమేటిక్ అప్డేట్ చేశాం.. రెండో డోసు వేసుకోలేదా.. ఇప్పుడు వేసుకో..’’ అని సమాధానం ఇచ్చినట్టు బాధితుడు తెలిపారు. మరోచోట వైద్య సిబ్బందిని అడిగితే.. ‘‘టీకా వేసుకోని వారిని అలర్ట్ చేసేందుకే ఇలా మెసేజీలు పెడుతున్నాం’’ అని పేర్కొనడం గమనార్హం. ‘‘రెండో డోసు వేసుకోకున్నా మెసేజీ వచ్చిన వారికి మళ్లీ రెండో డోసు ఇస్తాం. తప్పిదాన్ని సవరిస్తాం..’’ అని నిజామాబాద్ జిల్లాలోని ఓ పీహెచ్సీ వైద్య సిబ్బంది చెప్పారు. జనగామ జిల్లా కేంద్రంలోని కుర్మవాడకు చెందిన పన్నీరు మంజుల ఈమె. జూన్ 28న జిల్లా ఆస్పత్రిలో మొదటి డోసు టీకా వేసుకున్నారు. రెండో డోసు ఇంకా తీసుకోలేదు. కానీ నవంబర్ 11న రెండో డోసు తీసుకున్నట్టు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఇదేమిటని వైద్య సిబ్బందిని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండా దాటవేశారు. మరి తనకు రెండో డోసు టీకా వేస్తారో తెలియడం లేదని మంజుల ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రంలోని వ్యక్తి నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రానికి చెందిన తోట చంద్రశేఖర్. ఈ ఏడాది ఆగస్టు 2న స్థానిక పీహెచ్సీలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. నిర్దేశిత గడువు పూర్తయినా.. వ్యవసాయ పనులు ఉండటంతో రెండో డోసు తీసుకోలేదు. అయితే నవంబర్ 18న ఆయన రెండో డోసు తీసుకున్నట్టుగా ఎస్సెమ్మెస్ రావడంతో ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి, రెండో డోసు వేస్తారా, లేదా అని వాపోతున్నాడు. వ్యాక్సిన్ తీసుకోకున్నా.. నేను ఇప్పటివరకు మొదటి డోసు వ్యాక్సిన్ కూడా తీసుకో లేదు. కానీ గత నెల 11న నేను టీకా తీసుకున్నట్టు మెసేజ్ వచ్చింది. పీహెచ్సీలో ఉన్న వైద్య సిబ్బందిని కలిసి అడిగితే.. ఎవరూ సమాధానం చెప్పలేదు. – కొండ్ర వెంకటేశ్, పోతారం, జనగామ జిల్లా -
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్.. డోసులు 4 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నాలుగు కోట్ల మైలురాయిని చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాటికి మొదటి, రెండో డోస్‌లు కలిపి అర్హులైన లబ్ధిదారులకు 4,02,79,015 కరోనా టీకాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు, వైద్య సిబ్బందికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఇప్పటికీ ఇంకా టీకాలు తీసుకోని లబ్ధిదారులు వెంటనే తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో టీకాలు తీసుకునేందుకు 18 ఏళ్లు వయసు పైబడిన అర్హులు 2.77 కోట్ల మంది ఉండగా అందులో 2.62 కోట్లమంది (94 శాతం)కి మొదటి డోస్, 1.40 కోట్ల మంది (51 శాతం)కి రెండో డోస్ అందించినట్లు వేసినట్లు ప్రజారోగ్య సంచాల కుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నూరు శాతం మొదటి డోస్ వ్యాక్సిన్లు వేయగా, కొమురం భీం జిల్లాలో అత్యంత తక్కువగా 80 శాతం మందికి వేశారు. ఇక రెండో డోస్ హైదరాబాద్‌లో 76 శాతం, కరీంనగర్ జిల్లాలో 75 శాతం, రంగారెడ్డి జిల్లాలో 72 శాతం మందికి వేశారు. అత్యంత తక్కువగా కొమురం భీం జిల్లాలో 17 శాతం మంది రెండో డోస్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్లో ముఖ్యాంశాలు... ►165: రాష్ట్రంలో కోటి టీకాలు వేయడానికి పట్టిన రోజులు. ►78: కోటి నుంచి 2 కోట్ల వరకు డోస్‌లు వేయడానికి పట్టిన రోజులు. ►27: 2 కోట్ల నుంచి 3 కోట్ల డోస్‌లు వేయడానికి పట్టిన రోజులు. ►38: 3 కోట్ల డోస్‌ల నుంచి 4 కోట్ల డోస్‌లకు చేరుకోవడానికి పట్టిన కాలం. ►57.80 లక్షలు: ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కరోనా టీకా డోస్‌లు. ►180: కరోనా టీకాలు వేసేందుకు పనిచేసిన మొబైల్ టీమ్‌ల సంఖ్య. ►35,000: వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వాములవుతున్న సిబ్బంది సంఖ్య. ►24 గంటలు: పగలూరాత్రీ నిరంతరం వ్యాక్సిన్ కేంద్రంగా పనిచేస్తున్న హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్. త్వరలోనే మరొకటి ప్రారంభం కానుంది. -
‘సచ్చినా సరే.. టీకా మాత్రం వేసుకోను’
మెట్పల్లి (కోరుట్ల): కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి మనకున్న ఆయుధం వ్యాక్సిన్. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ను తీసుకుంటున్నారు. అయితే కొంతమందిలో కరోనా వ్యాక్సిన్‌పై ఉన్న భయం మాత్రం ఇంకా పోవడంలేదు. అలాంటి సంఘటనే కోరుట్ల మండలం జగ్గాసాగర్‌లో చోటుచేసుకుంది. ఈ చిత్రంలో టీకా తీసుకుంటున్న మహిళ పేరు బైర రాజవ్వ. కొన్ని రోజులుగా టీకా తీసుకునేందుకు నిరాకరిస్తూ వస్తోంది. దీంతో గురువారం మరోసారి వ్యాక్సిన్ వేయడానికి సిబ్బంది వెళ్లారు. ‘వేసుకోనని చెప్పినా ఎందుకు వస్తున్నారు. నేను చావనన్నా చస్తా. కానీ.. టీకా మాత్రం తీసుకోను’అని మొండికేసింది. టీకాతో తనకేమన్నా జరిగితే పిల్లల సంగతేంటని ప్రశ్నించింది. అందరూ టీకా తీసుకుంటున్నారని, ఎవరికీ నష్టం జరగలేదని సిబ్బంది బదులిచ్చారు. ఊరి వాళ్లతో తనకు సంబంధం లేదని, బలవంతం చేస్తే మీ పేరు రాసి ఉరివేసుకొని చస్తానని బెదిరించింది. ‘నువ్వు ఎన్ని చెప్పినా టీకా తీసుకునే వరకు ఇక్కడి నుంచి కదలబోం’అని సిబ్బంది తేల్చిచెప్పారు. ఈ క్రమంలో అరగంట పాటు రెండువైపులా వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సర్పంచ్ లావణ్య భర్త రాజేశ్.. రాజవ్వకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వినకుండా బోరున విలపించింది. చివరకు అయిష్టంగానే వ్యాక్సిన్ వేసుకుంది. గ్రామానికి చెందిన మరో వృద్ధురాలు బైరవ్వ కూడా ఇలాగే మొండికేయగా, సిబ్బంది నచ్చజెప్పి టీకా వేశారు. -
Omicron Variant: అలసత్వం వద్దు... అప్రమత్తత ముద్దు
మొదటి, రెండో కరోనా వేవ్ నుంచి బయటపడ్డామని ఊరటగా ఉంటున్న సమయంలో మూడో వేవ్ ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరి యంట్‌తో కరోనా విజృంభించడం, అక్కడ నుండి వివిధ దేశాలకు విచ్చేసిన ప్రయాణికుల ద్వారా విస్తరిస్తుండటంతో ఆందోళన మొదలయింది. ఈ ప్రమాదకర వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపించే రకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పలు దేశాలలో గంటగంటకు ఆంక్షలు పెరుగుతున్నాయి. పలు దేశాలను హడలెత్తిస్తున్న ఒమిక్రాన్ మనదేశంలోనూ అడుగుపెట్టింది. దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిస్క్ దేశాలనుంచి వచ్చే వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేశారు. పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రులకు తరలిస్తారు, నెగిటివ్ వచ్చిన వారిని కూడా వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌కు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభమైంది. ప్రజలందరూ తప్పకుండా రెండు డోసులు టీకా వేసుకోవాలని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. (చదవండి: విద్యార్థులు బలిపశువులు కారాదు!) తెలంగాణలో అర్హులైన వారిలో 90 శాతానికి పైగా మొదటి డోసు టీకా వేసుకున్నారని 47 శాతం మందికి పైగా రెండు డోసులు వేసుకున్నారని, ఇంకా 80 లక్షలకు పైగా వ్యాక్సిన్ అందుబాటులో ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. 100% వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కానీ ప్రజలలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుంది. అవసరం ఉన్నా లేకున్నా విచ్చలవిడిగా బయట తిరగడం, మాస్కులు ధరించకుండా, కనీసం భౌతిక దూరం పాటించకుండా, శానిటైజర్ల వాడకం కూడా పూర్తిగా తగ్గించి వేశారు. 85 శాతం నుంచి 90 శాతం వరకు మాస్కులు ధరించకుండా, శానిటైజర్లు వాడకుండా తిరుగుతున్నారు. షాపింగ్ మాల్స్‌లో, సినిమాహాల్లో, మార్కెట్లలో, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు వంటి జన సమర్థం అధికంగా ఉండే బహిరంగ ప్రదేశాలలో కూడా మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు. (BR Ambedkar: అంబేడ్కర్ బాటలో తెలంగాణ) అన్ని రకాల విద్యాసంస్థలు ప్రారంభమవడం, గురుకుల పాఠశాలలో కూడా భౌతిక తరగతులు నిర్వహిస్తుండటంతో అక్కడ అక్కడ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం మొదలయింది. ఖమ్మం జిల్లా వైరా గురుకులంలో 29 మందికి, రంగారెడ్డి జిల్లా ముత్తంగి లోని బాలికల గురుకులంలో 47 మంది విద్యార్థినిలకు, ఒక ఉపాధ్యాయురాలికి వైరస్ సోకింది. ఇలా జగిత్యాల జిల్లా తాటి పెళ్లి గురుకుల పాఠశాలలో తొమ్మిది మందికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూలూరుపాడు లోని కస్తూరిబా గురుకులంలో ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ శివారులోని టెక్ మహీంద్రా వర్సిటీలో 25 మంది విద్యార్థులకు వైరస్ అంటుకున్నది. బాలలు జాతి సంపద, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. వారికి అత్యంత ప్రాముఖ్యత నిచ్చి వారి అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించి పరిరక్షించవలసిన తరుణంలో, మౌలిక వసతుల కల్పన, కోవిడ్ నిబంధనలు పాటించకుండా గురుకులాలు ప్రారంభించడంతో విద్యార్థులు వైరస్ బారిన పడుతుండడం బాధాకరం. కరోనా సమసిపోయింది అన్న ఆనందం క్షణాల్లోనే ఆవిరైపోతుంది. చాపకింద నీరులా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇంత జరుగుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సంగతిని పట్టించుకోవడం లేదు. మాస్కులు, శానిటైజర్ల కొనుగోలు తగ్గిపోయిందని, వ్యాపార వర్గాల ప్రయోజనాల కోసం మళ్లీ మూడవ దఫా వైరస్ విస్తరిస్తున్నదని, కార్పొరేటు పెత్తందార్లు, పెట్టుబడిదారుల లాబీయింగ్ వల్లనే కరోనా వైరస్ వ్యాప్తి ప్రచారం జరుగుతున్నదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో నిజానిజాలు ఎలా ఉన్నా మాస్కుల వాడకం, శానిటైజర్లను ఉపయోగించడం తప్పకుండా కొనసాగించాలి. ఎట్టి పరిస్థితులలోనూ ప్రజలందరూ ఒక దగ్గరికి చేరకూడదు. కనీస రక్షణ చర్యలు పాటించకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తే రాబోయే 1, 2 నెలలో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉన్నది. అందుకని విధిగా మాస్కులు ధరించి, శానిటైజర్లు ఉపయోగించి, భౌతిక దూరం పాటించడం చాలా కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ నుండి మానవాళిని కాపాడడానికి తక్షణమే కనీస రక్షణ చర్యలు అవలంబించాలి. ప్రభుత్వాలు, పౌర సమాజం సంబంధిత కార్యనిర్వాహక శాఖలు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావించి వైరస్ వ్యాప్తి నిరోధానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది... - తండ సదానందం వ్యాసకర్త టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు, మహబూబాబాద్ -
కరోనా టీకా: 49 వేల మందిలో సైడ్ ఎఫెక్ట్స్.. మరణించిన వారు ఎందరంటే
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా నవంబర్ 30నాటికి 127.93 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె మంగళవారం సమాధానం ఇచ్చారు. వ్యాక్సిన్ వల్ల 49వేల మంది దుష్ప్రభావాలకు గురయ్యారని, మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆ బాధితుల శాతం 0.004శాతమేనని ఆమె చెప్పారు. 49వేల మందిలో 47,691మందికి స్వల్ప లక్షణాలుండగా, 163 మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, 1,965 మంది మధ్యస్థంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. టీకా వేసుకున్న తరువాత మరణించిన వారు 946 (0.00008)వత్రమేనని ఆమె తెలిపారు. అందులో 89 మంది మరణానికి కారణాలను అంచనా వేశామని, అయితే వ్యాక్సినే కారణమని నిర్ధారణ కాలేదన్నారు. టీకా తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఎంతకాలముంటాయనే విషయంలో స్పష్టత రాలేదని చెప్పారు. 94 దేశాలకు 7.23కోట్ల డోసుల ఎగుమతి... వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంలో భాగంగా 94దేశాలకు 7.23 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఎగుమతి చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. మొత్తం 150 దేశాలకు కోవిడ్ సంబంధిత మందులను కూడా అందించామన్నారు. 1,509 మందికి పరిహారం ఆరోగ్య రంగంలో పనిచేస్త కోవిడ్ కారణంగా 1,509 మంది చనిపోయారని మంత్రి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.22.12 లక్షల నుంచి రూ.50 లక్షలు అందించినట్టు తెలిపారు. -
Omicron Variant: థర్డ్..ఫోర్త్.. ఫిఫ్త్ ఇలా ఎన్ని వేవ్‌లు వచ్చినా..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోజురోజుకూ విస్తరిస్తోంది. మన దేశంలో వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో థర్డ్‌వేవ్ వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు ఉన్నాయి. వ్యాక్సిన్లు వేస్తున్నా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలోనే థర్డ్..ఫోర్త్.. ఫిఫ్త్ ఇలా ఎన్ని వేవ్‌లు వచ్చినా ఎదుర్కొనేలా యుద్ధానికి సన్నద్ధం కావా ల్సిందేనని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు, మందులు, ఆక్సిజన్ సరఫరా, ఇతర వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయాలని కోరింది. రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలు.. ♦గ్రామాలు, నగరాల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను మరింత బలోపేతం. ♦జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో కొత్తగా క్రిటికల్ కేర్ సంబంధిత పడకల ఏర్పాటు. ♦వ్యాధి నిర్ధారణ లేబరేటరీ వ్యవస్థను బలోపేతం చేయడానికి మెట్రోపాలిటన్ యూనిట్ల ఏర్పాటు. ♦ఇప్పటికే ఉన్న వైరల్ డయాగ్నోస్టిక్ అండ్ రీసెర్చ్ ల్యాబ్‌ల (వీఆర్డీఎల్) బలోపేతం. ♦నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వన్ హెల్త్ ఏర్పాటు. ♦విమానాశ్రయాల వంటి ఇంటర్నేషనల్ పాయింట్స్ ఆఫ్ ఎంట్రీ (పీఓఈ)ల వద్ద పబ్లిక్ హెల్త్ యూనిట్ల బలోపేతం. తద్వారా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావడం. ♦కరోనా నిర్ధారణ పరీక్షల రేట్లు, ఆసుపత్రుల్లో పడకల ధరలపై చేరికల ఆధారంగా పరిమితులు విధించడం. ♦ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది, ఇతర మానవ వనరులను సంసిద్ధం చేసుకోవడం. ఇతర వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ కార్మికులు తదితరులకు అవసరమైన శిక్షణ ఇవ్వడం. ♦కోవిడ్ మేనేజ్మెంట్ విధుల్లో మెడికల్ ఇంటర్న్‌ల సేవలను ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించాలి. ♦ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులను టెలి–కన్సల్టేషన్, తేలికపాటి కోవిడ్ కేసుల పర్యవేక్షణ వంటి సేవలను అందించడానికి ఉపయోగించుకోవచ్చు. ♦మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ ఫైనలియర్ విద్యార్థుల సేవలను ఉపయోగించుకోవాలి. ♦కొత్త నియామకాలు జరిగే వరకు సీనియర్ రెసిడెంట్ల సేవలను వినియోగించుకోవాలి. ♦బీఎస్సీ, జీఎన్ఎం అర్హత పొందిన నర్సులను పూర్తి సమయం కోవిడ్ నర్సింగ్ విధుల్లో ఉపయోగించుకోవాలి. ♦జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్యులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించుకోవాలి. ♦గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో సేవలందించే నిపుణులైన వైద్యులకు భత్యం కోసం అవసరమైన ఆర్థిక సాయం చేయాలి. ♦ఆక్సిజన్ ప్లాంట్ల స్థాపన విషయంలో రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందుతుంది. ♦ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగ ఆడిట్‌ను చేపట్టాలి. -
తర్వాతి వైరస్..మరింత ప్రమాదకారి కావొచ్చు!
లండన్: భవిష్యత్తులో మానవాళికి సోకే వైరస్ ప్రస్తుత కరోనా కంటే మరింత ప్రాణాంతకం, మరింత తీవ్రమైన వ్యాపించవచ్చని కోవిషీల్డ్ టీకా రూపకర్త, ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ హెచ్చరించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన జెన్నర్ ఇన్స్టిట్యూట్లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్‌గా సారా గిల్బర్డ్ పనిచేస్తున్నారు. ‘మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా వైరస్ చిట్టచివరిది కాదు. మున్ముందు ఇంతకంటే ప్రమాదకరమైంది రావచ్చు. చదవండి: కేన్సర్‌ను చంపే రోబోలు! ఆ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందేది, ప్రమాదకరమైంది అయి ఉండొచ్చు. అయితే, ఇప్పటి మాదిరి పరిస్థితులనే మున్ముందు దాపురించే అవకాశం రానీయవద్దు. ప్రస్తుతం సాధించిన విజయాలను ఆసరాగా చేసుకుని ఇలాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు మరింతగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది’అని ఆమె తెలిపారు. పూర్తి సమాచారం తెలిసే వరకు కొత్త వేరియంట్ల వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే డిసెంబర్ నెల నుంచి జీతం ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) నిర్ణయించింది. ఈ మేరకు టెస్కాబ్ ఎం.డి డాక్టర్ నేతి మురళీధర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా తగ్గుముఖం పడుతుందనుకున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియెంట్ వివిధ దేశాలకు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోందన్నారు. అందువల్ల వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ తీసుకుంటేనే డిసెంబర్ నెల నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు ఉద్యోగులంతా వ్యాక్సిన్ తీసుకొని సంబంధిత సర్టిఫికెట్ సమర్పించాలని చెప్పారు. ఒకవేళ ఏదైనా వైద్య సంబంధిత కారణాల వల్ల వ్యాక్సిన్ తీసుకోవడం వీలుకాని వారు దానికి గల కారణాలు తెలుపుతూ డాక్టర్ నుంచి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు. టెస్కాబ్‌లో ఉద్యోగుల కోసం బ్యాంకు ఆవరణలో ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించామని, అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
కృత్రిమ ‘చెయ్యిచ్చాడు’
మిలన్: ఇటలీలో ఆయనో డెంటిస్టు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం సుతారమూ ఇష్టం లేదు. సోమవారం నుంచి దేశంలో ‘సూపర్ హెల్త్ పాస్’ నిబంధన అమల్లోకొస్తోంది. టీకా తీసుకున్న వారికి జారీచేసే ఈ పాస్ చూపితేనే సినిమా థియేటర్, రెస్టారెంట్, బార్లు, సాంస్కృతిక వేదికల్లోకి అనుమతిస్తారు. దాంతో 57 ఏళ్ల ఈ డెంటిస్టు అతి తెలివిని ప్రదర్శించాడు. తన చేయిని షర్ట్‌లోపల (ఛాతి భాగానికి కట్టేసుకొని) పెట్టుకుని భుజానికి సిలికాన్‌తో చేసిన కృత్రిమ చెయ్యిని తగిలించాడు. బీయిలా సిటీలో గురువారం టీకా కేంద్రానికెళ్లి టీకా వేయాలని కృత్రిమ చేతి స్లీవ్స్‌ను పైకి లేపాడు. పరధ్యానంగా నర్సు టీకా వేసేస్తుందని అనుకొన్నాడు. అయితే నర్సు ఫిలిప్పాకు చేయి పట్టుకోగానే అనుమానం వచ్చింది. ‘చర్మం చల్లగా ఉంది. అత్కుక్కుంటోంది. రంగులో తేడా ఉంది. ఒక చెయ్యి ప్రమాదంలో కోల్పోయి ఉంటాడు. పొరపాటున కృత్రిమ చెయ్యి ఇచ్చాడని అనుకొన్నాను. మరో చెయ్యి ఇవ్వమని కోరగా.. ఆయన అసలు నిజం బయటపెట్టాడు. తనకు వ్యాక్సినేషన్ ఇష్టం లేదని, పాస్ కోసమే ఇలా చేశానన్నాడు’ అని ఫిలిప్పా వెల్లడించారు. ఇటలీలో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంతో మనోడు ససేమిరా అంటే... ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేశారు. పాస్ కోసం ఇప్పుడిలా చేసి దొరికిపోయాడు. అతని వివరాలతో ఉన్నతాధికారులకు నర్సు ఫిర్యాదు చేసింది. ఆయనపై క్రిమినల్ అభియోగాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. -
Omicron: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
Karnataka Omicron Restrictions: ఒమిక్రాన్ వైరస్ జాడలు రాష్ట్రంలో బయటపడటంతో ఆ మహమ్మారిని నిలువరించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై చర్చించేందుకు మంత్రి సుధాకర్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఆరోగ్యసౌధ నుంచి 21 మెడికల్ కళాశాల డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ద్వారా మాట్లాడారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రెండు కేసులు బయటపడ్డాయి. ఐదు పాజిటివ్ కేసులు ఉన్నాయి. వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపామని తెలిపారు. కేసులు పెరిగితే పీజీ విద్యార్థులను వైద్య సేవలకు వినియోగించుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో నర్సింగ్ సంఖ్య పెంచేందుకు తీర్మానించినట్లు తెలిపారు. పారామెడికల్ కోర్సు చదివే 18 వేల మంది సేవలను కూడా ఉపయోగించుకుంటామన్నారు. ఐసీయూ ఏర్పాట్లు, పరికరాల కొనుగోలుపై చర్చించినట్లు తెలిపారు. శుక్రవారం మంత్రులు, అధికారులతో అత్యవసర సమావేశంలో పాల్గొన్న సీఎం బసవరాజబొమ్మై సీఎం బొమ్మై నేతృత్వంలో నిపుణులతో సమావేశం ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో నూతన మార్గదర్శకాలు విడుదల చేసే విషయంపై ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో కృష్ణాలో ఆరోగ్య శాఖ మంత్రి క్టర్ కే.సుధాకర్, మంత్రి గోవింద కారజోళ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, సీనియర్ అధికారి మంజునాథ్ ప్రసాద్, బీబీఎంపీ అధికారులు, నిపుణులతో సమావేశం అయ్యారు. డిసెంబర్ 10న విధానపరిషత్ ఎన్నికలు, 13 నుంచి బెళగావి శాసనసభా సమావేశాలు ఉన్నందున ఒమిక్రాన్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రోజూ లక్ష మందికి కోవిడ్ పరీక్షలు జరపాలని, ఆక్సిజన్, ఐసీయూ పడకల ఏర్పాటు, ఔషధాల సమస్య పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చదవండి: (హైదరాబాద్‌లో ఒమిక్రాన్ కలవరం.. వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిక) మార్గదర్శకాలు ఇవే ►సినిమా హాల్, మాల్స్‌కు వెళ్లేందుకు రెండు డోస్‌ల వ్యాక్సిన్ తప్పనిసరి ►తల్లిదండ్రులు రెండు డోస్‌ల టీకాలు తీసుకుంటునే వారి పిల్లలను పాఠశాలల్లోకి అనుమతి ►పాఠశాల, కాలేజీల్లో సభలు, సమావేశాలకు బ్రేక్ ► వివాహాది కార్యాలకు 500 మందికి మాత్రమే అనుమతి 413 కరోనా కేసులు సాక్షి, బెంగళూరు: గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 413 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 256 మంది డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,97,246కు పెరిగింది. 29,52,101 మంది కోలుకున్నారు. మరణాలు 38,220కి చేరాయి. 6,896 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. -
12–18 ఏళ్ల వారికి పరిశీలనలో కోవిడ్ టీకా
న్యూఢిల్లీ: దేశంలోని 12–18 ఏళ్ల గ్రూపు బాలలకు కోవిడ్ టీకా ఇచ్చే విషయంలో నిపుణుల కమిటీ (నెగ్వ్యాక్), వ్యాధినిరోధకతపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం(ఎన్టీఏజీఐ) శాస్త్రీయ ఆధారాలను పరిశీలించి, చర్చలు జరుపుతున్నాయని కేంద్రం శుక్రవారం లోక్‌సభలో తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశీయంగా కేడిలా హెల్త్‌కేర్ సంస్థ తయారు చేసిన జైకోవ్–డి టీకాను పరిమితులకు లోబడి అత్యవసర పరిస్థితుల్లో 12 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చేందుకు అనుమతివ్వాలంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి దరఖాస్తు అందిందని తెలిపారు. అదేవిధంగా, భారత్ బయోటెక్ సంస్థ కూడా కోవాగ్జిన్ టీకా బీఆర్డీతో 2–18 ఏళ్ల వయస్సుల వారిపై చేపట్టిన 2/3 దశల క్లినికల్ డేటా వివరాలతో మధ్యంతర నివేదికను డీసీజీఐకి అందజేసిందన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ 2–17 ఏళ్ల వారికి కోవోవ్యాక్స్ టీకాతో 2/3 దశల క్లినికల్ ట్రయల్స్ చేపట్టిందన్నారు. బయోలాజికల్–ఈ సంస్థ 5–18 ఏళ్ల వారి కోసం రూపొందించిన టీకా 2/2 దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోందన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ 12–17 ఏళ్ల వారి కోసం తయారు చేసిన ఏడీ.26కోవ్.2ఎస్ టీకాతో భారత్ సహా పలు ప్రపంచదేశాల్లో 2/3 క్లినికల్ ట్రయల్స్ జరుపుతోందని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బట్టి అనుమతులిచ్చే విషయం పరిశీలిస్తామన్నారు. -
బూస్టర్ డోసు, చిన్నారులకు టీకాపై
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత బూస్టర్ డోసు తప్పనిసరిగా తీసుకోవాలా? 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ఎప్పటినుంచి ఇస్తారు? అనేదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా స్పందించారు. బూస్టర్ డోసు, చిన్నారులకు కరోనా టీకాపై నిపుణుల నుంచి వచ్చే శాస్త్రీయమైన సలహాలు సూచనల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై పూర్తిస్థాయిలో నిఘా పెట్టామని చెప్పారు. కోవిడ్ మహమ్మారిపై శుక్రవారం లోక్‌సభలో సుదీర్ఘంగా సాగిన చర్చలో మాండవియా మాట్లాడారు. ‘ఎట్–రిస్క్’ దేశాల నుంచి వచ్చిన 16 వేల మంది ప్రయాణికులకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహించామని, 16 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించామని, వారికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా లేదా అనేది అతిత్వరలో తేలుతుందని చెప్పారు. కరోనాను నియంత్రించే విషయంలో ప్రభుత్వం సమర్థంగా పని చేస్తోందని, ప్రతిపక్షాలు మాత్రం అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా టీకాలపై ప్రతిపక్షాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని, దీనివల్ల వ్యాక్సినేషన్‌పై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెలలో అదనంగా 10 కోట్ల డోసులు ఇప్పటిదాకా 85 శాతం మంది లబ్ధిదారులు టీకా మొదటి డోసు తీసుకున్నారని, 50 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని మన్సుఖ్ మాండవియా తెలిపారు. రాష్ట్రాల వద్ద ప్రస్తుతం 22 కోట్ల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని, ఈ నెలలోనే అదనంగా 10 కోట్ల డోసులు అందజేస్తామని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు హర్ ఘర్ దస్తక్(ఇంటింటికీ టీకా) కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. -
వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు..?! సర్క్యులర్ జారీ.. అంతలోనే..
సాక్షి, చెన్నై: డిసెంబర్ నెల జీతం పొందడానికి కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాలంటూ తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మూడు రోజుల కింద సర్క్యులర్ జారీ చేసింది. అయితే దీనిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యకం చేయడంతో సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంది. టీకాలు వేసుకునే నిర్ణయాన్ని వ్యక్తి విచక్షణకు వదిలివేయాలని, ఎవరినీ బలవంతం చేయకూడదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. కాగా సోమవారం, తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ (మధురై) ఉమాదేవి.. ఉద్యోగులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, లేని పక్షంలో వారి డిసెంబర్ జీతం నిలివేయాలని సర్క్యులర్‌లో ఆదేశించారు. నవంబర్ 26న చైర్మన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సర్య్కులర్‌లో పేర్కొన్నారు. వైద్య కారణాల వల్ల ఎవరైనా ఉద్యోగి వ్యాక్సిన్ తీసుకోలేకపోతే, దానిని నిర్ధారిస్తూ వైద్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. చదవండి: (Omicron: భారత్‌లో ఒమిక్రాన్ బయటపడింది ఇలా..!) దీనిపై తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ ట్రేడ్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ ఆర్ ముత్తులింగం మాట్లాడుతూ, 'వ్యాక్సిన్ తీసుకున్న చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్ కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుందని ఎటువంటి ఆధారం లేదు. కార్మిక చట్టాలను ఉల్లంఘించినపుడు లేదా ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినప్పుడు మాత్రమే జీతాన్ని నిలిపివేసే అవకాశం ఉంద'ని అన్నారు. తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఎండీ రాజేష్ లఖానీ మాట్లాడుతూ.. 'ఉద్యోగులు ప్రజలతో మమేకమవుతున్నందున టీకాలు వేయించుకోమని మాత్రమే అధికారులను కోరినట్లు చెప్పారు. 'చీఫ్ ఇంజనీర్ ఉమాదేవి అత్యుత్సాహంతో ఆ సర్క్యులర్ జారీ చేశారు. జీతాలను నిలిపివేయడం సమావేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. ఇప్పుడు, ఆ సర్క్యులర్ రద్దు చేశాము. కేవలం రెండు డోసులను తీసుకోవాలని ఉద్యోగులను అభ్యర్థిస్తూ కొత్త సర్క్యులర్ జారీ చేయబడింది' అని రాజేష్ లఖానీ అన్నారు. -
జర్మనీలో ఒమిక్రాన్ గుబులు.. అలా అయితే కష్టమే.. వారికి ‘లాక్డౌన్’
బెర్లిన్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. టీకా తీసుకోని వారికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ పూర్తికాని వారు.. మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సంచరించడంపై నిషేధం విధిస్తున్నట్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. దీంతోపాటు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో జర్మనీ వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేయనుంది. ప్రతి ఒక్కరికి టీకాలను తప్పనిసరి చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తెలిపారు. ఈ చట్టం పార్లమెంట్లో ఆమోదం తర్వాత.. వచ్చే ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైవు.. జర్మనీ జనాభాలో ఇప్పటివరకు 75శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దాదాపు 68శాతం మందికి మాత్రమే టీకాలు పూర్తి చేసింది. ఇక డెల్టా కంటే అయిదు రెట్ల వేగంతో వ్యాపిస్తున్న ఈ కొత్త వేరియెంట్‌కు సంబంధించి దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు బయటపడితే, ఆ తర్వాత స్థానాల్లో 50కి పైగా కేసులతో నార్వే, 33 కేసులతో ఘనా, 32 కేసులతో బ్రిటన్ ఉన్నాయి. (చదవండి: Viral Video: కలల రాణిని పెళ్లి దుస్తుల్లోచూసి.. ఒక్కసారిగా ఏడ్చిన వరుడు! బ్యూటిఫుల్ కపుల్..) -
కరోనా నియంత్రణలో ఘోర వైఫల్యం
న్యూఢిల్లీ: కోవిడ్ మేనేజ్మెంట్పై కేంద్ర ప్రభుత్వ తీరును లోక్‌సభలో ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. సెకండ్ వేవ్ సమయంలో పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని మండిపడ్డాయి. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడిన నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. కరోనా వ్యాక్సినేషన్, బూస్టర్ డోసుపై రోడ్‌మ్యాప్ గురించి సభకు తెలియజేయాలని సూచించాయి. ఈ వైరస్ కారణంగా అసలు ఎంతమంది చనిపోయారో వాస్తవ గణాంకాలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరాయి. కరోనా మహమ్మారిపై లోక్‌సభలో గురువారం తొలుత శివసేన సభ్యుడు వినాయక్ రౌత్ చర్చ ప్రారంభించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని, వైరస్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్ల పంపిణీలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ డోసులు, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తక్కువ డోసులు ఇస్తోందని దుయ్యబట్టారు. దేశంలోని 130 కోట్ల మంది బాధ్యత ప్రధానమంత్రిపై ఉందని గుర్తుచేశారు. జనాభాను బట్టి రాష్ట్రాలకు టీకా డోసులు కేటాయించాలన్నారు. దేశంలో ఇప్పటివరకు కేవలం 38 శాతం జనాభాకే టీకా రెండు డోసులు ఇచ్చారని అన్నారు. దీంతోనే సంతృప్తి చెందుతారా? అని ప్రశ్నించారు. బీజేపీ సభ్యుడు జగదాంబికా పాల్ మాట్లాడుతూ.. కరోనాను ఎదుర్కొనే విషయంలో రాష్ట్రాల మధ్య కేంద్రం ఎలాంటి వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు. పేదలను ఆదుకోలేరా? కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత తలెత్తే అవకాశం ఉందని ముందుగానే నిపుణులు హెచ్చరించినా కేంద్ర సర్కారు పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ధ్వజమెత్తారు. కరోనా వల్ల నష్టపోయినా ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసి మరిన్ని కష్టాలకు గురిచేస్తోందని అన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి గానీ పేదలను ఆదుకోవడానికి ఉండవా? అని నిలదీశారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం.. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. కానీ, రూ.50 వేలు కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని విమర్శించారు. పలువురు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. కేంద్ర సర్కారు నిర్వాకం వల్లే కరోనా సెకండ్ వేవ్‌లో అధికంగా మరణాలు సంభవించాయని ఆరోపించారు. డ్యామ్ సేఫ్టీ బిల్లుకు ఎగువ సభలో ఆమోదం దేశంలో డ్యామ్‌ల భద్రత కోసం సంస్థాగత యంత్రాంగం ఏర్పాటుకు ఉద్దేశించిన డ్యామ్ సేఫ్టీ బిల్లు–2019 గురువారం రాజ్యసభలో ఆమోదం పొందింది. రెండు అధికారిక సవరణతో బిల్లును మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు. ఎగువ సభలో సవరణలు చేయడంతో ఈ బిల్లు మళ్లీ లోక్‌సభకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. డ్యామ్‌ల భద్రత విషయంలో నిబంధనలు పాటించని రాష్ట్రాలు, ప్రజలకు జరిమానా విధించే అధికారం ఈ అథారిటీకి ఉంటుందన్నారు. ఎన్సీడీఎస్ చేసే సిఫార్సుల అమలును సైతం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్ ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై చర్చకు అనుమతించకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఆయా అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు కోరగా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిరాకరించారు. ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోందని చెప్పారు. దీంతో ముందుగా కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, డీఎంకే, వామపక్షాల సభ్యులు సైతం వాకౌట్ చేశారు. అది అప్రజాస్వామికం కాదు: వెంకయ్య సభలో సభ్యుల హద్దుమీరిన ప్రవర్తనను అంగీకరించకపోవడం అప్రజాస్వామికంగా పరిగణించరాదని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు గురువారం అన్నారు. 12 మంది సభ్యుల సస్సెన్షన్‌పై ప్రతిపక్షాలు రాజ్యసభలో గత నాలుగు రోజలుగా నిరసన కొనసాగిస్తున్నాయి. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వస్తోంది. ఈ పరిణామంపై వెంకయ్య మాట్లాడారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి ప్రతిష్టంభనకు తెరదించాలని సూచించారు. రాజ్యసభ నుంచి సభ్యులను సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. 1962 నుంచి 2010 వరకూ 11 సార్లు సభ్యులను సస్పెండ్ చేసినట్లు గుర్తుచేశారు. అదంతా అప్రజాస్వామికమేనా? అని ప్రశ్నించారు. -
తరుముకొస్తున్న ఒమిక్రాన్.. టీకా రక్షిస్తుందా.. లేదా..?!
జోహన్నెస్‌బర్గ్: కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం అయ్యేలా లేదు. కాలం గడుస్తున్న కొద్ది.. మహమ్మారి తన రూపు మార్చుకుంటూ.. మరింత శక్తిమంతంగా మానవాళి మీద దాడి చేస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు డెల్టా వేరియంట్ జనాలను బెంబెలెత్తించింది. దాన్నుంచి తేరుకుని.. కాస్త ఊపిరి పీల్చుకునే సమయానికి ఒమిక్రాన్ దాడి ప్రారంభించింది. ఒమిక్రాన్ డెల్టా కన్నా కూడా ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్.. అప్పుడే ప్రపంచ దేశాలను చుట్టేస్తూ.. భారత్‌లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ తొలుత వెలుగు చూసిన దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. (చదవండి: మరో వుహాన్.. అక్కడ 90 శాతం కరోనా కేసుల్లో ‘ఒమిక్రాన్’) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ నిపుణుడు అన్నే వాన్ గాట్బర్గ్ మాట్లాడుతూ.. ‘‘గతంలో కోవిడ్ బారిన పడినవారికి.. ఒమిక్రాన్ సోకదనే గ్యారెంటీ లేదు. గతంలో సోకిన ఇన్ఫెక్షన్.. ఒమిక్రాన్ నుంచి కాపాడలేదు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మహమ్మారి ముప్పు ముంచుకొస్తున్న వేళ వ్యాక్సిన్ మాత్రమే మనల్ని కాపాడగలదు. తీవ్రమైన జబ్బుల బారిన పడకుండా ఉండటమే కాక.. మహమ్మారి సోకితే పరిస్థితి విషమించకుండా.. ఆస్పత్రిలో చేరే పరిస్థితి తలెత్తకుండా టీకా మనల్ని సంరక్షిస్తుంది’’ అని తెలిపారు. (చదవండి: భారత్‌లో ఒమిక్రాన్ కలకలం) ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో వెలుగు చూడటంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు.. సౌతాఫ్రికా, దాని చుట్టుపక్కల దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల నిర్ణయంపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల మేలు కోసం మేం ఒమిక్రాన్ ఉనికి గురించి ముందుగానే హెచ్చరిస్తే.. మాపై ఇలా నిషేధం విధించడం తగదన్నారు. చదవండి: ఒమిక్రాన్‌కు ‘సినిమా’ చూపిద్దాం! -
మరో వుహాన్.. అక్కడ 90 శాతం కరోనా కేసుల్లో ‘ఒమిక్రాన్’
Another Wuhan SA Gauteng province 90 Percent Cases Related to Omicron: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గతంలో వెలుగు చూసిన డెల్టా వేరియంట్ కన్నా ఇది చాలా ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేస్తోంది. కరోనా వెలుగు చూసిన ప్రారంభంలో దీని మూల కేంద్రాన్ని చైనా వుహాన్‌గా గురించారు శాస్త్రవేత్తలు. ఇక్కడి నుంచి కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అలానే ఒమిక్రాన్ వేరియంట్ మూల కేంద్రాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ వేరియంట్ ప్రథమంగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాలోని ష్వానే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒమిక్రాన్ కేంద్రమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటికే ఇన్స్టిట్యూట్లోని చాలా మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో పలు పరీక్షలను రద్దు చేశారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’.. హడలిపోతున్న ప్రపంచ దేశాలు) 90 శాతం కేసుల్లో ఒమిక్రాన్... జోహన్నెస్‌బర్గ్‌లోని గౌటెంగ్ ప్రావిన్స్ ప్రస్తుతం మరో వుహాన్‌గా మరింది. ఇక్కడ నమోదవుతున్న కరోనా కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌కి చెందినవే అంటున్నారు నిపుణులు. ఇక్కడ కేసులు ఇంతలా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం... తక్కువ వ్యాక్సినేషన్ రేటు. దక్షిణాఫ్రికాలో 18-34 ఏళ్ల మధ్య ఉన్న వారిలో కేవలం 22 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. టీకాపై అపోహల కారణంగా కూడా చాలామంది వ్యాక్సిన్ వేయించుకోలేదని తెలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్న వారు.. తమ తోటివారిని టీకా వేసుకోమని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ ఒక్కటే కరోనా నుంచి కాపాడగలదని ప్రచారం చేస్తున్నారు. ప్రయాణాలపై నిషేధం.. డెల్టా వేరియంట్ కారణంగా కరోనా కేసులు, మృతుల సంఖ్య కూడా భారీగానే నమోదయ్యింది. ప్రభుత్వాలు డెల్టా వేరియంట్‌ని ప్రారంభంలో నిర్లక్ష్యం చేశాయి. ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూశాయి. డెల్టా కన్నా ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ గురించి తెలిసిన వెంటనే అన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా సౌతాఫ్రికా ప్రయాణాలపై నిషేధం విధించాయి. ఈ నిర్ణయం పట్ల దక్షిణాఫ్రికా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. (చదవండి: ఒమిక్రాన్.. మహమ్మారి అంతానికే వేగం పెంచిందేమో...) అదే సమయంలో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఆదివారం మాట్లాడుతూ.. ‘‘కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు ఉన్నప్పటికీ, దేశంలో అత్యల్ప అంటే 'మొదటి స్థాయి' లాక్డౌన్ మాత్రమే అమలులో ఉంటుంది’’ అని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాలు.. దక్షిణాఫ్రికా, దాని పొరుగు దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించాయి. దీని వల్ల తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని.. తక్షణమే ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేయాలని రమాఫోసా విజ్ఞప్తి చేశారు. చదవండి: ఒమిక్రాన్ గురించి తెలుసుకునే లోపే చాపకింద నీరులా..! -
టీకా వద్దని అవ్వ డ్రామా.. నా బిడ్డా రా నిన్ను నా ఒడిలో చేర్చుకుంటా అంటూ..
సాక్షి, బెంగళూరు: ఒక అవ్వను కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోమంటే పెద్ద డ్రామానే చేసింది. ఇంటింటికీ టీకాలో భాగంగా ఒక తహసీల్దార్ దావణగెరె జిల్లా కైదాళ గ్రామానికి వెళ్లారు. ఒక వృద్ధురాలికి టీకా వేయించుకోవడం ఇష్టం లేక అమ్మవారు పూనినట్లు నటించింది. ‘నా బిడ్డా.. రా... నిన్ను నా ఒడిలో చేర్చుకుంటా’ అంటూ కేకలు వేయసాగింది. తహశీల్దార్ కూడా నాటకీయంగా స్పందించారు. ‘దేవీ నీవే నా కలలోకి వచ్చావు. వచ్చి నీకు టీకా వేయించమన్నావు. ఇది నీ ఆజ్ఞనే’ అని తహశీల్దార్ అరిచేటప్పటికీ అవ్వ కరోనా టీకాకు ఒప్పుకుంది. చదవండి: (ప్రేమించి, శారీరకంగా ఒక్కటై.. గర్భం దాల్చగానే..) -
వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండటానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కోవిడ్ టీకాల పురోగతి, ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యంపై సీఎం జగన్ సమీక్ష నిర్వాహించారు. సమీక్ష అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల నుంచి రాష్ట్రాని వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని సీఎం సూచించారని తెలిపారు. చదవండి: వరదబాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి 15లోపు రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారని తెలిపారు. ఆస్పత్రుల్లో వసతులు, సౌకర్యాలు పెంచుతూ.. కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచాలని తెలిపారని చెప్పారు. కోవిడ్ విషయంలో గతంలో తీసుకున్న అన్ని చర్యలను అధికారులు అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించానట్లు పేర్కొన్నారు. అదే విధంగా ప్రజలంగా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసి, కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసిందని తెలిపారు. ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు ఏపీలో నమోదు కాలేదని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలు పాటించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, కొత్త వేరియంట్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలో అన్ని గైడ్ లైన్స్ విడుదల చేస్తామని మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. -
మరేం భయం లేదు.. ‘ఒమిక్రాన్’ అంత ప్రమాదకరం కాదు: యూకే శాస్త్రవేత్త
లండన్: ఒమిక్రాన్ అందరూ ఊహిస్తున్నంత ప్రమాదకరమైనది కాదని యూకే శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. కోవిడ్వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ వేరియెంట్ నుంచి రక్షణ పొందే అవకాశాలున్నాయని బ్రిటన్ ప్రభుత్వానికి కరోనాపై సలహాలు ఇచ్చే మైక్రోబయోలాజిస్ట్ ప్రొఫెసర్ కేలమ్ సెంపుల్ వెల్లడించారు. ఈ కొత్త వేరియెంట్‌తో తలనొప్పి, జలుబు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటివి వస్తాయే తప్ప ఆస్పత్రిలో చేరే అవకాశాలు, మరణాలు సంభవించడం వంటివి జరిగే అవకాశం తక్కువేనన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి, గతంలో కరోనా సోకడం వల్ల ఇమ్యూనిటీ వచ్చిన వారికి ఒమిక్రాన్ వేరియెంట్ నుంచి ముప్పు ఉండదని సెంపుల్ అభిప్రాయపడ్డారు. స్వల్ప లక్షణాలే: దక్షిణాఫ్రికా ఒమిక్రాన్‌తో లక్షణాలు స్వల్పంగా∙బయటపడుతున్నాయని దక్షిణాఫ్రికా మెడికల్అసోసియేషన్ చైర్పర్సన్ ఏంజిలిక్యూ కాట్జీ చెప్పారు. ప్రస్తుతానికి కోవిడ్ రోగుల్ని ఇంట్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దగ్గు, కండరాల నొప్పులు, అలసట తప్ప అంతకు మించి లక్షణాలేవీ ఈ కొత్త వేరియెంట్ ద్వారా బయటపడలేదని ఆమె చెప్పారు. ‘ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. కేసులు అత్యధికంగానే బయట పడుతున్నాయి. అయితే ఆస్పత్రులపై భారం పడడం లేదు. 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు, వ్యాక్సిన్ తీసుకోని వారే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇంతవరకు ఈ వేరియెంట్ సోకలేదు. ఎంత ప్రమాదకరమో సంపూర్ణ అవగాహన రావాలంటే మరో 15 రోజులు పడుతుంది’ అని వివరించారు. -
బూస్టర్ డోసు అవసరం లేదు!
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కొంతకాలానికి బూస్టర్ డోసు కూడా తప్పనిసరిగా తీసుకోవాలన్న వాదన ఇటీవల గట్టిగా వినిపిస్తోంది. అయితే, కరోనా మహమ్మారి నియంత్రణకు బూస్టర్ డోసు అవసరమని చెప్పడానికి ఇప్పటిదాకా ఎలాంటి శాస్త్రీయ ఆధారం లభించలేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డాక్టర్ బలరాం భార్గవ సోమవారం చెప్పారు. దేశంలో అర్హులైన వారందరికీ కరోనా టీకా రెండో డోసు పంపిణీని పూర్తి చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచమంతటా అర్హులకు కరోనా వ్యాక్సిన్ అందాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ఇమ్యూనైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా విభాగం(ఎన్టీఏజీఐ) త్వరలో భేటీ కానుంది. బూస్టర్ డోసుపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. బూస్టర్ డోసు అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవలే స్పందించారు. దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా రెండు డోసులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అది నెరవేరాక బూస్టర్ డోసుపై నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దేశ అవసరాలకు సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బూస్టర్ డోసు ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్, నిపుణుల బృందం సూచిస్తే కచ్చితంగా పరిశీలిస్తామని వెల్లడించారు. అధికార వర్గాలు ప్రకటించిన గణాంకాల ప్రకారం.. భారత్‌లో అర్హులైనవారిలో ఇప్పటివరకు 82 శాతం మంది కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. 43 శాతం రెండో డోసు కూడా తీసుకున్నారు. గడువు ముగిసినప్పటికీ 12 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఇంకా రెండో డోసు తీసుకోలేదు. ప్రపంచంలో పరిస్థితేంటి? ‘బూస్టర్’ అంటే! కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్స్ తీసుకుంటే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు మన శరీరంలో వృద్ధి చెందుతాయి. ఇవి వైరస్ నుంచి మన శరీరాన్ని కాపాడతాయి. వ్యాక్సిన్స్ రెండుడోసులు తీసుకొని ఐదారునెలలు గడిచాక వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతుంది. వ్యాక్సిన్ ప్రభావశీలత క్రమేపీ తగ్గుతుంది. అప్పుడేం చేయాలి? అదనంగా మరో డోసు... మూడో డోసు (దీన్నే బూస్టర్ డోసు) తీసుకోవాలి. 60 ఏళ్ల పైబడిన వారు, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారు, స్టెరాయిడ్ల వాడటం మూలంగా రోగనిరోధక తగ్గినవారిని అధిక రిస్కు కలిగిన వారిగా భావించి... పలుదేశాలు మొదట వీరికి బూస్టర్ డోసులను సిఫారసు చేశాయి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మార్కెట్లు తెరుచుకొని వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు యధావిధిగా సాగాలన్నా, ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కాలన్నా... కోవిడ్ నుంచి రక్షణతో జనం స్వేచ్ఛగా విహరించే పరిస్థితినే పలుదేశాలు కోరుకుంటున్నాయి. ఏయే దేశాలు ఇస్తున్నాయంటే... నవంబరు నెలారంభం నాటికే ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు బూస్టర్ డోసులను మొదలుపెట్టేశాయి లేదా ఆరంభించే క్రమంలో ఉన్నాయి. ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ బూస్టర్ డోసులిస్తున్నాయి. ఇజ్రాయెల్, యూకే, ద.కొరియా, టర్కీ, బ్రెజిల్ ఈ జాబితాలో ఉన్నాయి. స్వీడన్, స్పెయిన్ వయోధికులకు మొదలుపెట్టాయి. అమెరికా, కెనడా ఒకట్రెండు రోజుల్లో ఆరంభించనున్నాయి. 12 % బూస్టర్లే అందుబాటులో ఉన్న లెక్కలకు బట్టి చూస్తే ఒక్క నవంబరు 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన డోస్‌లలో 12 శాతం బూస్టర్ డోస్‌లేనట! ప్రతి 100 మంది జనాభాలో అత్యధికులకు బూస్టర్ డోసులు ఇచ్చిన దేశాల జాబితాలో ఇజ్రాయెల్, చిలీ, ఉరుగ్వే ముందున్నాయి. పేద దేశాలకు అన్యాయం చేయొద్దు: డబ్ల్యూహెచ్‌వో బూస్టర్ డోసులు అవసరమనడానికి ఆధారాలు పరిమితంగా, అసంపూర్తిగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంటోంది. ఆధునిక దేశాలు అప్పుడే మూడో డోసులు ఇవ్వడం మొదలపెడితే అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద ఆఫ్రికా దేశాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలకు దారితీస్తుందని డబ్ల్యూహెచ్‌వో డెరెక్టర్ జనరల్ ట్రెడోస్ అథనోమ్ ఘెబ్రెయాసస్ ఈనెల 13న హెచ్చరించారు. కొన్ని దేశాల్లో ప్రతి 100 మందిలో 20లోపు మందికే తొలి డోసు అందిందని, ఆఫ్రికా దేశాల్లోనయితే కేవలం 5 శాతం మందే తొలిడోసును పొందగలిగారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం జనాభాలో 52.6 శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందింది. – నేషనల్ డెస్క్, సాక్షి భారత్‌లో.. మనదేశంలో ఇప్పటిదాకా 115 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. రెండు డోసులు తీసుకున్న వారు 38.11 కోట్లు ఉండగా... 37. 45 కోట్ల మంది ఒక్కడోసు (ఈనెల 17 నాటికి కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుఖ్ మాండవియా చెప్పిన ప్రకారం) తీసుకున్నారు. -
టీకా తికమక.. డౌన్లోడ్ అవుతున్న సర్టిఫికెట్
సాక్షి, హైదరాబాద్: ‘‘మీరు కోవిడ్–19 రెండో డోసు టీకాను విజయవంతంగా తీసుకున్నారు. మీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కోసం నిర్దేశించిన లింకును క్లిక్ చేయగలరు..’’ అంటూ వస్తున్న ఎస్సెమ్మెస్‌లతో ఇప్పటికి కేవలం మొదటి డోసు టీకా మాత్రమే తీసుకున్నవారు విస్తుపోతున్నారు. తాము రెండో డోసు టీకా తీసుకోకున్నా తమ ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ ఎందుకు వస్తోందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. పైగా వ్యాక్సినేషన్ పూర్తయినట్లు లింక్ సైతం వస్తుండటం, సర్టిఫికెట్ కూడా డౌన్లోడ్ అవుతుండటంతో గందరగోళంలో పడిపోతున్నారు. ఆన్లైన్ ఎంట్రీ కావడంతో తాము రెండో డోసు వేసుకునే అవకాశం ఉంటుందా? లేదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు లబ్ధిదారులు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదిస్తుండడం గమనార్హం. ఈ ఎస్సెమ్మెస్‌లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. గడువు దాటినా తీసుకోకపోవడంతో.. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,61,10,669 మంది కరోనా టీకాలు తీసుకున్నారు. ఇందులో మొదటి డోసు 2,42,24,911 మంది తీసుకోగా... రెండు డోసులు తీసుకున్నవారు 1,18,85,758 మంది ఉన్నారు. 3,22,02,104 మంది ప్రభుత్వ కేంద్రాల్లో టీకాలు తీసుకోగా, 39,08,565 మంది ప్రైవేటు కేంద్రాల్లో తీసుకున్నారు. కోవాగ్జిన్ టీకా మొదటి డోసు తీసుకున్నవారు 6 నుంచి 8 వారాల గడువులో రెండో డోసు తీసుకోవాలి. కోవిషీల్డ్ తీసుకుంటే 12 నుంచి 16 వారాల మధ్య రెండో డోసు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. రాష్ట్రంలో 80 శాతం మంది కోవిషీల్డ్ టీకాలే తీసుకున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన గడువు దాటినప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని వారు దాదాపు 20 లక్షల మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రెండో డోసు గడువు తీరడంతో వారంతా రెండోసారి టీకా తీసుకున్నట్లుగా భావించి వెబ్సైట్లో ఎంట్రీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండోడోసు తీసుకోనివారికి టీకా రెండో డోసు తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేసిన వారిని గుర్తించి టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినప్పటికీ క్షేత్రస్థాయి నుంచి పెద్దగా స్పందన లేదు. అందువల్ల వారంతా రెండో డోసు తీసుకుని ఉంటారనే భావనతో ఈమేరకు ఆన్‌లైన్‌ఎంట్రీలు జరుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ ఎంట్రీ అయినప్పటికీ రెండో డోసు తీసుకోనివారు వస్తే తప్పకుండా వ్యాక్సిన్ అందిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
వ్యాక్సిన్ వేసుకున్న ప్లేయర్లకే ఆడే అవకాశం.. జొకోవిచ్‌ను ఉద్దేశించి
Players Must Vaccinated To Play Australian Grand Slam.. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆడాలంటే ప్లేయర్లందరూ తప్పనిసరిగా కోవిడ్–19 వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని టోర్నీ చీఫ్ క్రెయిగ్ టిలీ శనివారం స్పష్టం చేశాడు. వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం చూపించని వారిని టోర్నీలో ఆడనిచ్చేది లేదంటూ ఆయన తెలిపారు. క్రెయిగ్ ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌ను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడాలనుకుంటే వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నాడు. దాంతో తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ జొకోవిచ్ ఈసారి టోర్నీలో ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. ఎందుకం టే గతంలో అతడు వ్యాక్సిన్ వేసుకోవడంపై విముఖత వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అది వ్యక్తిగత విషయమని వ్యాఖ్యానించాడు. -
ఉండమ్మా టీకా వేస్తా..
ముంచంగిపుట్టు: మండలం జర్జుల పంచాయతీ చిన్నతమ్మెగుల గ్రామం. సోమవారం వైద్యసిబ్బంది సూదిమందు (కోవిడ్ టీకా) వేసేందుకు వస్తున్నారని తెలిసి అమాయకులైన ఆ గిరిజన గూడెం వాసులు భయపడ్డారు. ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. కొందరు పంట కోతల సాకుతో పొలాలకు వెళ్లారు. అయితే వైద్యసిబ్బంది మాత్రం వారిని వదల్లేదు. టీకా ఎక్స్‌ప్రెస్ కేర్ ఇండియా డీఈవో పి.మనోహర్, ఏఎన్ఎంలు వి.దాలిమ్మ, ఎల్.పద్మ పొలాల వద్దకే వెళ్లి గిరిజన మహిళలకు అవగాహన కల్పించారు. పొలంలోనే వారికి కోవిడ్ టీకా వేశారు. చిన్నతమ్మెగుల, అమలగూడ గ్రామాల్లో సోమవారం మొత్తం 58 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. -
టీకా వేయించుకోని వారికి ఆస్ట్రియాలో లాక్డౌన్
బెర్లిన్: కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో ఆస్ట్రియా ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ టీకా వేయించుకోని వారు ఇల్లు వదిలి బయటకు రావద్దంటూ ఆదివారం ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఈ ఆంక్షలు పది రోజుల పాటు అమలవుతాయని తెలిపింది. దేశ జనాభాలో కేవలం 65% మంది మాత్రమే కోవిడ్ టీకా రెండు డోసులు వేయించుకున్నారు. దీంతో, 12 ఏళ్లు పైబడి టీకా వేయించుకోని వారు మరీ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆంక్షలు విధించింది. కేసులు పెరిగితే ఆస్పత్రుల్లో సరిపోను వైద్య సౌకర్యాలు లేవని పౌరులను హెచ్చరించింది. -
కరోనా వ్యాక్సిన్‌కు స్పందన కరువు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. టీకా డోసులు అందుబాటులో ఉన్నా, అర్హులైన లబ్ధిదారులు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడంలేదని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం పెద్దగా లేదన్న భావనతోనే చాలామంది టీకాలు తీసుకోవడానికి ముందుకు రావడంలేదని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా కరోనా టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, రోజుకు 5 లక్షల వరకు డోసులు వేయాలని భావించారు. అవసరమైతే ఏడెనిమిది లక్షలు కూడా వేసేందుకు సన్నాహాలు చేశారు. అందుకోసం ప్రత్యేక డ్రైవ్ కూడా పెట్టారు. కానీ, ప్రస్తుతం రోజుకు అటుఇటుగా రెండుమూడు లక్షలకు మించి టీకాలు నమోదు కావడంలేదని అధికారులు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ప్రపంచంలో అనేక దేశాల్లో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ కరోనా కేసులు దాదాపు 200 లోపు నమోదవుతున్నాయి. కరోనాతో ఒక్కోరోజు ఒకరు లేదా ఇద్దరు చనిపోతున్నారు. కరోనా పూర్తిగా తగ్గలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. పూర్తిగా తగ్గే అవకాశాలు కూడా లేవంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని స్కూళ్లల్లో కేసులు వెలుగుచూస్తున్నాయి. కాబట్టి ఏమరుపాటు తగదని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొంటున్నారు. 20 రోజుల్లో 52.76 లక్షల డోస్‌లు వచ్చే అవకాశం... ఈ నెలలో ఇప్పటివరకు 20.77 లక్షల కరోనా టీకాలు రాగా, నెలాఖరు వరకు మరో 52.76 లక్షల టీకాలు వస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ అ ంచనా వేసింది. టీకాలు అందుబాటులో ఉ న్నా తీసుకునేవారు ముందుకురాకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. ►ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా డోసులు తీసుకున్నవారిలో ఎక్కువగా ప్రభుత్వం నుంచి ఉచితంగా తీసుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. 3.01 కోట్ల మంది ప్రభుత్వం నుంచి కరోనా వ్యాక్సిన్లు పొందగా, 38.77 లక్షల మంది ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా పొందారు. ►దేశంలో అర్హులైనవారిలో మొదటి డోస్ తీసుకున్నవారు 79% ఉండ గా, తెలంగాణలో 84.3 % ఉన్నారు. ►రెండో డోస్ తీసుకున్నవారు దేశవ్యాప్తంగా 37.5 శాతం ఉండగా, తెలంగాణలో 38.5 శాతం ఉన్నారు. ►ప్రధానమైన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ 8వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు 3.40 కోట్ల డోస్‌లు అందజేత... రాష్ట్రంలో ఇప్పటివరకు 3.40 కోట్ల డోసుల టీకాలు వేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో మొదటి డోసు వేసుకొని రెండో డోసు తీసుకోనివారు చాలామంది ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా మొదటి డోసు టీకా తీసుకున్నవారు నూటికి నూరు శాతం ఉన్నారు. అత్యంత తక్కువగా వికారాబాద్ జిల్లాలో 66 శాతమే ఉన్నారు. రాష్ట్రంలో టీకాకు అర్హుల సంఖ్య: 2.77 కోట్లు ఇందులో మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య: 2.33 కోట్లు రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య: 1.06 కోట్లు -
100% టీకాలే లక్ష్యం: మంత్రి హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ నూరు శాతం జరిగేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామా లు, మండలాలవారీగా లక్ష్యాలను ఖరారు చేసి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నా రు. ఆర్థికమంత్రి హరీశ్ తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ అదనపు బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో శనివారం బీఆర్కేఆర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వాక్సినేషన్‌తోపాటు కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, ఆరోగ్యశ్రీ కింద అందుతున్న సేవల తీరుతెన్నులను అడిగి తెలుసుకొని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్వోలు, డీసీహెచ్లకు పలు ఆదేశాలిచ్చారు. ఇతర శాఖల సహకారం తీసుకోండి... వాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు ఇతర శాఖల సహకారాన్ని తీసుకోవాలని హరీశ్ ఉన్నతాధికారులకు సూచించారు. ప్రతి వారం వ్యాక్సినేషన్లో సాధించిన లక్ష్యాలను సమీక్షించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాష్టంలో 18 ఏళ్లు దాటిన వారు 2.77 కోట్ల మంది ఉండగా 2.35 కోట్ల మందికి మొదటి, 1.08 కోట్లమందికి రెండు డోసులు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. మరో 18.66 లక్షలమంది రెండో డోస్ వేసుకొనేందుకు కేంద్రాలకు రావాల్సి ఉందన్నారు. డిసెంబర్‌లోగా కొత్త వైద్య కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 8 వైద్య కళాశాలల భవనాలను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని కలెక్టర్లను హరీశ్ ఆదేశిం చారు. కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల పడకల సామర్థ్యాలను పెంచాలని, విద్యార్థుల వసతికి అనువైన హాస్టల్ భవనాలను గుర్తించాలన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలికవసతుల కల్పన, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆసుపత్రుల తనిఖీలు.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 946 రకాల వైద్య సేవలు అందిస్తుండగా, కేంద్ర పథకమైన ఆయుష్మాన్ భారత్ కింద 646 రకాల వైద్య సేవలను చేర్చినట్లు మంత్రి హరీశ్ తెలిపారు. వైద్యానికి మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల సేవలను ప్రజలకు విస్తృతంగా అందించాలన్నారు. ఇకపై పీహెచ్సీ మొదలు మెడికల్ కాలేజీ వరకు అన్నిం టినీ తనిఖీ చేస్తామని, ఆశా వర్కర్ నుంచి హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు అందరి పనితీరు ఆధారంగా పోస్టింగ్‌లు, ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి, ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు. -
Vaccine RJ Aswathy Murali: టీవీ కంటే రేడియో ద్వారానే.. అలా
Kerala Vaccine RJ Aswathy Murali: కరోనాకు వ్యాక్సిన్ రాకముందు..వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? ఇంకెన్ని రోజులు ఈ మాస్కులు పెట్టుకోవాలి? బయటకెళ్లాలంటేనే భయమేస్తుంది..అంటూ వ్యాక్సిన్ కోసం ఒకటే ఎదురు చూపులు చూసిన వారు కూడా తీరా వ్యాక్సిన్ వచ్చాక.. కరోనా కంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఎక్కువ ప్రమాదమన్న అపోహతో వ్యాక్సిన్ తీసుకోవడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. అస్వతి బామ్మ కూడా ‘‘ఇప్పటిదాకా నిక్షేపంగా ఉన్నాను నేను... వ్యాక్సిన్ వేసుకుంటే నా ఆరోగ్యం పాడవుతుంది.. వ్యాక్సిన్ వేసుకోను’’ అని మొండికేసింది. వ్యాక్సిన్ గురించి తెలిసిన అస్వతి.. ‘‘బామ్మా ..వ్యాక్సిన్ వేసుకుంటే ఏం కాదు, కరోనా వచ్చినా ప్రమాదం ఉండదు’’ అని ఆమెకు నచ్చజెప్పడంతో వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇవే మాటలు తన కమ్యూనిటీలో ఎంతోమందికి చెప్పి, వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించింది అస్వతి. దీంతో గ్రామంలో ఉన్న వారంతా వ్యాక్సిన్ తీసుకున్నారు. అస్వతి ద్వారక నుంచి ప్రసారమయ్యే ‘మట్టోలి(90.4 ఎఫ్ఎమ్)’ కమ్యూనిటీ రేడియో సర్వీస్‌లో రేడీయో జాకీగా పనిచేస్తుంది. వైనాడ్‌లో ‘పనియార్’ జాతికి చెందిన గిరిజనుల జనాభా 18 శాతం ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది ‘పనియా’ భాషనే మాట్లాడుతారు. మట్టోలి మారుమూల గ్రామం, పనియా భాష ఒక్కటే తెలుసు. వీరికి వ్యాక్సిన్ గురించి సరైన అవగాహన లేకపోవడంతో వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. వీరిలాగే అస్వతి బామ్మ ముందు మొరాయించినప్పటికీ తరువాత వ్యాక్సిన్ వేసుకున్నారు. బామ్మను ప్రేరణగా తీసుకున్న అస్వతి, తను కూడా పనియార్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి కావడంతో గ్రామస్థులందరికి వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలనుకుంది. దీనికోసం ఒకపక్క ఆర్జేగా పనిచేస్తూనే తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా డాక్టర్ల టాక్‌షోలు శ్రద్దగా వినేది. కోవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని వివిధ మార్గాల్లో సేకరించేది. కోవిడ్ లక్షణాలు, జాగ్రత్తలు, వ్యాక్సిన్ ప్రాముఖ్యత గురించి పనియా భాషలో రేడియోలో వివరించేది. ఈ కమ్యూనిటీకి సమాచారం అందించే ఒకే మాధ్యమం రేడియో కావడంతో..కరోనాకు సంబంధించిన ప్రతి విషయాన్ని రేడియో ద్వారా అందించేది. అంతేగాక రేడియోకు కాల్ చేసి ఎవరైనా సందేహాలు అడిగినా వాటిని నివృత్తి చేసి, వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించింది. దీంతో గ్రామస్థులంతా వ్యాక్సిన్ వేసుకున్నారు. టీవీ కంటే రేడియో ద్వారా.. ‘‘మా కమ్యూనిటీలో ఎక్కువ మంది అపోహలతో వ్యాక్సిన్ చేసుకోవడానికి సంకోచిస్తున్నారు. వీరిని విపత్కర పరిస్థితుల్లో నుంచి బయట పడేయడానికి.. నావంతు సాయం కమ్యునిటీకి చేయాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి టీవీలో కంటే రేడియో ద్వారా ఎక్కువ సమాచారం తెలుసుకునేదాన్ని. కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో కూడా రేడియోలో ప్రసారమయ్యే డాక్టర్ కార్యక్రమాలు ఇంగ్లిష్‌లో వచ్చేవి. అవి మా కమ్యూనిటీ వాళ్లకు అర్థం కావు. అందువల్ల అవన్నీ వింటూ రాసుకుని తరువాత మా పనియా భాషలో వివరించేదాన్ని. గ్రామస్థులకు ఉన్న సందేహాలను తెలుసుకుని వాటికి సమాధానాలు చెప్పేదాన్ని. ఈ ప్రశ్నలనే రేడియోలో కూడా ప్రస్తావిస్తూ ఎక్కువమందికి చేరేలా చెప్పాను. నేను కూడా పనియార్ కమ్యూనిటీకి చెందినదాన్ని కావడంతో అంతా నా మాటలపై నమ్మకంతో వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీంతో మట్టోలి గ్రామం పూర్తి వ్యాక్సినేషన్ అయిన గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఇది నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది’’ అని అస్వతి చెప్పింది. చదవండి: సోషల్ స్టార్.. ఇక్కడ కాకపోతే ఇంకోచోట! -
దొరికినోళ్లకు దొరికినట్టు నడి రోడ్డుపై వాక్సిన్
-
జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టీకాల కార్యక్రమం జాతీయ సగటును మించి పూర్తయిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. బుధవారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొదటి డోస్ పూర్తి కాగా, 38.5 శాతం మందికి రెండో డోస్ వేశారని చెప్పారు. జాతీయ స్థాయిలో మొదటి డోస్ 79 శాతం, రెండో డోస్ 37.5 శాతం నమోదైందని వివరించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్‌పై రేపు వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, టీకాలు, కొత్త వైద్య కళాశాలలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం తదితర అంశాలపై హరీశ్‌రావు చర్చించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ వేగం పెంచడంలో భాగంగా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే కరోనా తగ్గుముఖం పట్టడంతో 350 పడకలు గల కింగ్ కోఠి జిల్లా దవాఖానాలో సాధారణ వైద్యసేవలు పునరుద్ధరించాలని, టిమ్స్ ఆస్పత్రిలో 200 పడకలు (ఇవి కోవిడ్ చికిత్స కోసం) మినహా సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలని, టిమ్స్ సిబ్బంది పెండింగ్ జీతాలు, ఆసుపత్రి బకాయిలు చెల్లించాలని నిర్ణయించారు. అంతకుముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్టంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్ పరిస్థితిని వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. -
గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం: వ్యాక్సిన్ వేసుకోకుంటే..
ఆహ్మదాబాద్: ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే. కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అయితే తొలి డోస్ కోసం ఎగబడ్డ జనం.. రెండో డోస్ వేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. కరోనా తగ్గిపోయిందని భావించి, వ్యాక్సిన్ వేసుకుంటే వచ్చే జ్వరం, నొప్పులు వంటి భయాలతో రెండో డోస్ వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు దేశాలు, ప్రభుత్వాలు వ్యాక్సిన్‌పై భయాందోళనలు పోయేలా, అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాయి. చదవండి: కేసీఆర్ ఆరోపణలు పెద్ద డ్రామా: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు ఇస్తామని పలు ఉద్యోగ సంస్థలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకునే అర్హత కలిగి ఉండి, ఇప్పటి వరకు మొదటి, రెండో డోస్ తీసుకోని వారిపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 12 నుంచి 18 ఏళ్లు నిండి ఉండి వ్యాక్సినేషన్ తీసుకొని వారికి పబ్లిక్ ప్లేస్‌లోకి అనుమతి నిషేధించింది. చదవండి: ఏరులైపారుతున్న తేనే! ఈ ఏడాది 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి అహ్మదాబాద్ మునిసిపల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ (ఏఎమ్టీఎస్),అహ్మదాబాద్ బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీర్టీఎస్) బస్సుల్లో ఎక్కడానికి అనుమతి లేదని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాక టీకా తీసుకొని వారు కంకారియా లేక్ ఫ్రంట్, కంకారియా జూ,యు సబర్మతి రివర్ ఫ్రంట్‌లోకి ప్రవేశం లేదని వెల్లడించింది. లైబ్రరీ, జింఖానా, స్విమ్మింగ్ పూల్, ఎంఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సిటీ సివిక్ సెంటర్, కార్పొరేషన్‌లోని అన్ని భవనాల్లోకి ప్రవేశించే ముందు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్లు తప్పని సరి తనిఖీ చేస్తామని తెలిపింది. చదవండి: బంపర్ ఆఫర్....వ్యాక్సిన్ తీసుకో..బహుమతి పట్టు కాగా గత నెలల్లో రోజువారీ కోవిడ్ కోసులు గుజరాత్లో తొలిసారి 40 దాటాయి. అయితే ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. 36 మంది కోలకున్నారు. గుజరాత్లో ఇప్పటి వరకు 8కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. -
వైద్యారోగ్య శాఖపై మంత్రి హరీష్ సమీక్ష.. కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్ పూర్తయిందని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. బుధవారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొదటి డోస్ పూర్తి కాగా, 38.5 శాతం మందికి రెండో డోస్ వేశారని చెప్పారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో మొదటి డోస్ 79 శాతంగా, రెండో డోస్ 37.5 శాతంగా నమోదైందని వెల్లడించారు. మంత్రి హరీష్ రావు గురువారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, టీకాలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్‌లోని మల్టీ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వ్యాక్సినేషన్ వేగం పెంచడంలో భాగంగా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. అధికారులతో చర్చించిన అనంతరం పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అంతకుముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్ రావు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్టంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, కాలోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. చదవండి: (సకాలంలో ఆసుపత్రులకు రావాలి : మంత్రి హరీశ్‌రావు) సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు.. ►కరోనా తగ్గుముఖం పట్టడంతో 350 పడకలు గల కింగ్ కోఠి దవాఖానలో సాధారణ వైద్య సేవలు పునరుద్ధరణ. ►టిమ్స్ హాస్పిటల్లో 200 పడకలు (ఇవి కోవిడ్ చికిత్స కోసం) మినహా సాధారణ వైద్య సేవలు ప్రారంభం. ►టిమ్స్ సిబ్బంది పెండింగ్ జీతాలు చెల్లింపు. ►టిమ్స్ ఆస్పత్రి బకాయిలు చెల్లింపు. ►వ్యాక్సినేషన్ కార్యక్రమంపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్వోలతో వీడియో కాన్ఫరెన్స్. -
ఎకానమీకి విస్తృత వ్యాక్సినేషన్ దన్ను!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని ఆర్థిక మంత్రిత్వశాఖ తన తాజా నివేదికలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో మూల స్తంభాలు పటిష్టంగా ఉండడంతోపాటు, వేగవంతంగా వ్యాక్సినేషన్ పక్రియ జరుగుతుండడం, పండుగల సీజన్ వంటి అంశాలు దేశంలో డిమాండ్ రికవరీ పటిష్టతకు దారితీస్తున్నట్లు తెలిపారు. డిమాండ్–సరఫరాల్లో అంతరం తగ్గుతోందని, ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరగుపడుతున్నాయని కూడా ఆర్థిక వ్యవస్థ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► భారతదేశ ఆర్థిక పునరుద్ధరణలో ఆత్మనిర్భర్ భారత్ మిషన్, వ్యవస్థాగత సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆయా కార్యక్రమాలు, చర్యల వల్ల వ్యాపార అవకాశాలు, డిమాండ్, వ్యయాలు పెరుగుతున్నాయి. ► అధిక విస్తీర్ణంలో రబీ సాగు, మెరుగైన రిజర్వాయర్ స్థాయిలు, ఎరువులు, విత్తనాల విషయంలో రైతులకు తగినంత లభ్యత వంటి అంశాలు వ్యవసాయ రంగం పురోగతికి దోహద పడుతోంది. ఆర్థిక పునరుద్ధరణలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ► వ్యవసాయ–ఎగుమతుల్లో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఈ విభాగంలో 22 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ఆయా అంశాలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తున్నాయి. గ్రామీణ డిమాండ్ పటిష్టంగా ఉంది. 2021 సెప్టెంబర్‌లో ట్రాక్టర్లు, ద్విచక్ర, త్రి చక్ర వాహనాల విక్రయాలు పటిష్ట రికవరీని సూచిస్తున్నాయి. ► రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడి, మార్కెట్లో తగినంత లిక్విడిటీ (ద్రవ్య లభ్యత), బాండ్ల రేట్ల స్థిరత్వం వంటి అంశాలు ఎకానమీకి సానుకూల అంశాలుగా ఉన్నాయి. ► బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలుచేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గింపు ప్రయోజనం వ్యవస్థలో ప్రతిబింబిస్తోంది. 2020 ఫిబ్రవరి– 2021 సెప్టెంబర్ మద్య తాజా రూపీ రుణాలపై సగటు రుణ రేటు 130 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గిడం సానుకూలాంశం. ► భారత్ ఎకానమీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని 2020–21 ఎకనమిక్ సర్వే పేర్కొంటోంది. పలు రేటింగ్, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనాలు 9–10 శాతం శ్రేణిలో ఉన్నాయి. -
ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా టీకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టీకా ప్రక్రియ వేగంగా సాగుతోంది. కరోనా కట్టడికి ప్రధాన అస్త్రమైన టీకా పంపిణీపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాఘాటంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారిలో 55.13 శాతం మందికి రెండు డోసుల టీకా వేయడం పూర్తయింది. 18 ఏళ్లు పైబడిన వారు 3,95,22,000 మంది ఉండగా వీరిలో 2,17,88,482 మందికి రెండు డోసుల టీకా వేశారు. వీరిలో 45 ఏళ్లు పైబడిన వారు 1,26,49,631 మంది, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది 4,77,590 మంది, ఫ్రంట్‌లైన్ వారియర్లు 15,43,843 మంది ఉన్నారు. 71,17,418 మంది ఇతరులు ఉన్నారు. 18 ఏళ్లు పైబడిన వారిలో 84.91 శాతం అంటే.. 3,35,59,940 మందికి (రెండో డోసు కూడా వేయించుకున్న వారితో కలిపి) తొలి డోసు పూర్తయింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 5,53,48,422 డోసుల టీకాను ప్రభుత్వం పంపిణీ చేసింది. అత్యధికంగా నెల్లూరులో 18 ఏళ్లు పైబడిన వారికి అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 63.02 శాతం, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 46.58 శాతం, శ్రీకాకుళంలో 47.80 శాతం మందికి టీకా పంపిణీ పూర్తయింది. మిగిలిన అన్ని జిల్లాల్లో 18 ఏళ్లు దాటిన 50 శాతానికి పైగా ప్రజలకు రెండు డోసుల టీకా వేశారు. నవంబర్ నెలకు రాష్ట్రానికి 86,81,990 డోసుల టీకా కేటాయించారు. ఇందులో 37,70,620 డోసులు రాష్ట్రానికి వచ్చాయి. 99.01 శాతం రికవరీ రేటు రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో వైరస్ సోకి, దాని నుంచి కోలుకొన్న వారు 99.01 శాతం మంది ఉన్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో 20,68,718 పాజిటివ్ కేసులు నమోదవగా, వీరిలో 20,51,082 మంది వైరస్‌ను జయించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో యాక్టివ్ కేసుల రేటు 0.16 శాతం మాత్రమే ఉంది. -
రెండేళ్లలోపే 25 కోట్లు దాటేశాయి..!
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది.. బ్రిటన్ మాత్రల్ని కూడా మార్కెట్లోకి తెచ్చేసింది.. కోవిడ్–19 నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అయినా కొన్ని దేశాలు కరోనా థర్డ్‌వేవ్, ఫోర్త్‌వేవ్‌తో అల్లాడిపోతున్నాయ్ వైరస్ బయల్పడిన రెండేళ్లలో 25 కోట్లకు కేసులు చేరుకొని ప్రపంచ దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. రెండేళ్లలోపే ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 25 కోట్లు దాటేసింది. అన్ని దేశాలు రవాణా ఆంక్షల్ని సడలిస్తున్న నేపథ్యంలో తాజాగా పలుచోట్ల కేసులు మళ్లీ పెరగడం ఆందోళన పుట్టిస్తోంది. రష్యా, యూరప్ దేశాల్లో కరోనా కేసులు ఈ మధ్య కాలంలో విజృంభిస్తున్నాయి. జాన్హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య దాదాపుగా 25.5 కోట్లకు చేరుకుంది. కోవిడ్ బాధితుల మరణాలు 50.05 లక్షలు దాటేశాయి. చైనాలోని వూహాన్లో 2019 డిసెంబర్లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ వాయువేగంతో వ్యాప్తి చెంది రెండేళ్లు గడవకుండానే 25 కోట్ల మందికి సోకింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్, గ్రీస్, జర్మనీ కరోనా హాట్స్పాట్లుగా మారాయి. రష్యాలో రోజుకి 35 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఉక్రెయిన్‌లో 24 గంట్లోనే 833 మంది మృత్యువాతపడ్డారు. అయితే తాజా కేసుల్లో అత్యధిక మందిలో లక్షణాలు లేకపోవడం, వైరస్ లోడు తక్కువగా ఉండడం, ఆస్పత్రి అవసరం లేకుండానే తగ్గిపోవడం కాస్త ఊరటనిస్తోంది. వ్యాక్సినే బ్రహ్మాస్త్రం కరోనాని కట్టడి చేయడానికి వ్యాక్సిన్‌కి మించిన బ్రహ్మాస్త్రం లేదు. అయినా పలు దేశాల్లో టీకా కార్యక్రమం మందకొడిగా సాగుతూ ఉండటంతో కేసులు ఎగబాకుతున్నాయి. వరల్డ్ ఇన్ డేటా ప్రకారం ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా ఒక్క డోస్ కూడా ఇవ్వలేదు.. ఒక డోసు తీసుకున్న వారు 310 కోట్లు ఉంటారు. అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిరుపేద దేశాల్లో టీకా అందుబాటులో లేకపోవడంతో 5% కంటే తక్కువ మందే ఒక్క డోసు తీసుకున్నారు. కోవిడ్–19 టీకా తీసుకోకపోతే ఐసీయూలో చేరడం, లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం 16 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఇటీవల ఆస్ట్రేలియా చేసిన అధ్యయనంలో వెల్లడైంది. సింగపూర్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల్లో కనీసం ఒక్క టీకా డోసు తీసుకున్న వారు 70 శాతానికి పైగా ఉన్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి ప్రభావం ఎలా ఉందంటే.. ►55 దేశాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. ►ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా కేసులు యూరప్ దేశాల నుంచే వస్తున్నాయి. గత నాలుగు రోజుల్లోనే 10 లక్షల కేసులు యూరప్‌లో నమోదయ్యాయి. ►అమెరికా కరోనా కేసుల పట్టికలో టాప్‌లో ఉంది. ఆ దేశంలో ప్రతీ అయిదు మందిలో ఒకరికి కరోనా సోకింది. ఇప్పటివరకు మొత్తం 4.65 కోట్ల కేసులు నమోదయ్యాయి. ►మొదటి 5 కోట్ల కేసులు నమోదవడానికి ఏడాది సమయం పడితే అప్పట్నుంచి ప్రతీ మూడు నెలలకి 5 కోట్ల కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ►కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా కేసులు తగ్గకపోవడానికి డెల్టా వేరియెంట్ విజృంభణే కారణం ►తూర్పు యూరప్‌లో అతి తక్కువగా వ్యాక్సినేషన్ జరగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ►గత ఏప్రిల్ వరకు ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకి 8,26,000 కేసులు నమోదవుతే ప్రస్తుతం 4లక్షల కేసులు వస్తున్నాయి. -
వ్యాక్సిన్ వేస్తే.. ఉరేసుకుంటా.. చుక్కలు చూపించిన బామ్మ
-
వ్యాక్సిన్ వేస్తే.. ఉరేసుకుంటా.. చుక్కలు చూపించిన బామ్మ..
సాక్షి, జనగామ: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోమంటే.. ఓ వృద్ధురాలు వైద్య సిబ్బందికి చుక్కలు చూపించింది. వ్యాక్సిన్ వేస్తే.. ఉరి వేసుకుంటానంటూ హడావుడి సృష్టించింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో 80 ఏళ్ల వృద్ధురాలిని వ్యాక్సిన్ వేసుకోమని అడగగా వ్యాక్సిన్ వేస్తే ఉరి వేసుకుంటానంటూ మొండిగా వ్యవహరించింది. చదవండి: జొన్నలకు పులి కాపలా! వైద్య సిబ్బందిని మీరు వెళ్లిపోండి.. మీ కాళ్లు మొక్కుతా అంటూ ఆ వృద్ధురాలు తల బాదుకుంది. ఎంతగా నచ్చజెప్పినా ఏమాత్రం వినలేదు. సూది మందంటే చిన్న పిల్లల్లా మారాం చేయడంతో కాస్త ఫన్నీగా అనిపించింది. కొందరు కరోనా టీకా వేయించుకోవటానికి భయపడుతున్నారు. దాన్నో భూతంలా చూస్తున్నారు. మరికొందరు లేనిపోని అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఆసక్తి చూపడంలేదు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఏమాత్రం వారి తీరులో మార్పు రావడం లేదు. చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు! -
‘ఇంటింటికి వెళ్లండి.. మత పెద్దల సాయం తీసుకోండి’
-
‘ఇంటింటికి వెళ్లండి.. మత పెద్దల సాయం తీసుకోండి’
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ బుధవారం జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతున్న 40కి పైగా జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా టీకా పట్ల ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని, పుకార్లు సైతం వ్యాపిస్తున్నాయని అన్నారు. అందుకే వారు టీకా తీసుకొనేందుకు చాలామంది ముందుకు రావడం లేదని వెల్లడించారు. టీకాపై సంపూర్ణంగా అవగాహన కల్పించడమే దీనికి పరిష్కార మార్గమని అన్నారు. ఈ విషయంలో మత గురువుల సహాయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. రెండో డోసు తీసుకోకపోతే... కరోనా వ్యాక్సినేషన్లో వ్యూహం మార్చాలని, ప్రజలను టీకా కేంద్రాలకు రప్పించడం కాకుండా, టీకాలనే ఇంటింటికీ తీసుకెళ్లాలని ప్రధాని మోదీ ఉద్బోధించారు. ‘హర్ ఘర్ టీకా, ఘర్–ఘర్ టీకా’ అనే నినాదం స్ఫూర్తితో ప్రతి ఇంటికీ వెళ్లాలని ఆరోగ్య కార్యకర్తలను కోరారు. ‘ప్రతి ఇంటి తలుపునూ తట్టడం’ అనే నినాదాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు టీకా రెండు డోసులూ ఇవ్వాలని, వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మొదటి డోసు తర్వాత నిర్దేశిత గడువులోగా రెండో డోసు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. గడువులోగా రెండో డోసు తీసుకోనివారిని గుర్తించి సంప్రదించాలని చెప్పారు. (చదవండి: జోగిపేట: ఫొటోకు పోజు కోసం.. వృద్ధురాలికి ఒకేసారి రెండు డోసులు ) ఇప్పటిదాకా పంపిణీ చేసిన టీకా డోసులు 100 కోట్లు దాటేశాయని, ముఖ్యమైన మైలురాయిని దాటామని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దీపావళి పండుగను ఆనందంగా జరుపుకుందామని ప్రధానమంత్రి చెప్పారు. వ్యాక్సినేషన్లో కొత్త లక్ష్యాలను సాధించి, క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుందామని అన్నారు. మోదీతో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా మేజిస్ట్రేట్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమ జిల్లాల్లో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతుండడడానికి గల కారణాలను, తమకు ఎదురవుతున్న సవాళ్ల గురించి తెలియజేశారు. చదవండి: 50 లక్షల మంది బలి -
జోగిపేట: ఫొటోకు పోజు కోసం.. వృద్ధురాలికి ఒకేసారి రెండు డోసులు
సాక్షి, జోగిపేట (ఆందోల్): ఓ వృద్ధురాలు కరోనా వ్యాక్సిన్ కోసం వచ్చిది. ఆమెకు వ్యాక్సిన్ వేసిన వైద్య సిబ్బంది.. ఫొటోలకు ఫోజు ఇస్తూ మరోసారి వ్యాక్సిన్ వేసేశారు.. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఈ ఘటన జరిగింది. అందరికీ వ్యాక్సినేషన్లో భాగంగా ఆదివారం జోగిపేట రిక్షాకాలనీలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వైద్య సిబ్బంది ఈ కాలనీకి చెందిన సాబేరా బేగం (63)కు ముందే వ్యాక్సి న్ ఇచ్చారు. చదవండి: ఉడుతకి వైద్యం చేశారని.. అప్పటినుంచి అక్కడే ఉండిపోయింది కాసేపటికే మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకొని వ్యాక్సినేషన్ ఫొటో కావాలని అడిగారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారందరినీ వరుసగా నిలబెట్టారు. అయితే సదరు వైద్య సిబ్బంది సాబేరా బేగం చేతికి సిరంజి పెట్టి ఫొటోకు పోజు ఇచ్చారు. అలాగే రెండో సారి వ్యాక్సిన్ వేశారు. తనకు మళ్లీ ఇంజక్షన్ చేశారేమిటంటూ సాబేరా బేగం ఆందోళన చెందడంతో.. జోగిపేట ఆస్పత్రికి తరలించి అబ్జర్వేషన్లో పెట్టారు. ఘటనపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: ఏమైందో ఏమో.. బయటకెళ్లిన ఇద్దరు యువతులు తిరిగి రాలేదు.. -
‘జైకోవ్–డి’ టీకా ధర తగ్గిస్తాం
న్యూఢిల్లీ: తమ కోవిడ్–19 టీకా ధరను తగ్గించేందుకు అహ్మదాబాద్‌లోని జైడస్ క్యాడిలా సంస్థ అంగీకరించింది. ఒక్కో డోసును రూ.265 చొప్పున విక్రయిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు జైడస్ క్యాడిలా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. అయితే, టీకా ధరపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. ఈ వారంలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. 12 ఏళ్లు పైబడిన వారికోసం జైడస్ క్యాడిలా సంస్థ ‘జైకోవ్–డి’ పేరిట కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ టీకా అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించింది. దేశంలో 12 ఏళ్లు పైబడిన వారి కోసం అనుమతి లభించిన తొలి టీకా ఇదే కావడం గమనార్హం. జైకోవ్–డి టీకా వేయడానికి సూది అవసరం లేదు. డిస్పోజబుల్ పెయిన్లెస్ జెట్ అప్లికేటర్ ఉపయోగించాల్సి ఉంది. దీని ధర రూ.93. ఒక్కో డోసుకు ఒక అప్లికేటర్ కావాలి. దీంతో ఒక్కో డోసు ధర మొత్తం రూ.358కు చేరనుంది. ‘జైకోవ్–డి’ టీకాను మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. మూడు డోసులను రూ.1,900కు విక్రయిస్తామని(ఒక్కో డోసు రూ.633.3) జైడస్ క్యాడిలా గతంలో ప్రతిపాదించింది. ప్రభుత్వంతో చర్చల అనంతరం ఒక్కో డోసును రూ.358కి విక్రయించేందుకు ముందుకొచ్చింది. -
500 కోట్ల టీకా డోసులు
రోమ్: వచ్చే ఏడాది చివరి నాటికల్లా 500 కోట్లకుపైగా కోవిడ్–19 టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తద్వారా తమ దేశంతోపాటు ఇతర దేశాలకూ మేలు జరుగుతుందని అన్నారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రపంచానికి భారత్ తనవంతు సాయం కచ్చితంగా అందిస్తుందని తెలిపారు. తమ దేశంలో ఇప్పటికే 100 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశామని గుర్తుచేశారు. ఆయన శనివారం రోమ్‌లో ప్రారంభమైన జి–20 దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సులో ‘గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ హెల్త్’ అంశంపై మాట్లాడారు. కరోనాపై పోరులో భారత్ పోషిస్తున్న పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో నిబంధనలను మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తించే విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఒక యంత్రాంగం ఉండాలని సూచించారు. భారత్‌లో దేశీయంగానే అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కోవాగ్జి న్’కు అత్యవసర వినియోగ అనుమతి ప్రక్రియ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వద్ద పెండింగ్‌లో ఉందని మోదీ గుర్తుచేశారు. త్వరగా అనుమతి లభిస్తే ఇతర దేశాలకు టీకాల విషయంలో సాయం చేసేందుకు ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో భారత్ నుంచి 150 దేశాలకు అవసరమైన అత్యవసర ఔషధాలు, వైద్య పరికరాలు పంపించామని వివరించారు. సాహసోపేత ఆర్థిక సంస్కరణలు కనిష్ట కార్పొరేట్ ట్యాక్స్‌ను 15 శాతంగా నిర్ధారిస్తూ జి–20 తీసుకున్న నిర్ణయం పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలను శ్రీకారం చుట్టామన్నారు. కరోనా ప్రభావం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవాలంటే అన్ని దేశాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంతోపాటు ఆరోగ్య రంగంలో భవిష్యత్తుల్లో తలెత్తబోయే దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని చెప్పారు. ఈ దిశగా ‘వన్ ఎర్త్, వన్ హెల్త్’ అనే సంకల్పాన్ని తీసుకోవాలని కోరారు. రోమ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమాల వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ శ్రింగ్లా మీడియాకు తెలియజేశారు. పేద దేశాలకు మరిన్ని టీకాలు: ఇటలీ ప్రధాని ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో కూడిన జి–20 శిఖరాగ్ర సదస్సు శనివారం ఇటలీ రాజధాని రోమ్‌లోని నువొలా కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా ప్రారంభమయ్యింది. అతిథ్య దేశం ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ ప్రారంభోపన్యాసం చేశారు. జి–20 దేశాల అధినేతలకు స్వాగతం పలికారు. పేద దేశాలకు కోవిడ్–19 వ్యాక్సిన్లు మరిన్ని అందించాలని జి–20 సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. కరోనా టీకాల పంపిణీ విషయంలో ధనిక దేశాలు, పేద దేశాల మధ్య అంతరం నైతికంగా ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లో ఇప్పటివరకు కేవలం 3 శాతం మందికే పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ జరిగిందని గుర్తుచేశారు. ఇక ధనిక దేశాల్లో 70 శాతం మంది కనీసం ఒక్క డోసైనా తీసుకున్నారని తెలిపారు. తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు మరింత చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. శిఖరాగ్ర సదస్సులో తొలిరోజు ప్రధానంగా ప్రపంచ ఆరోగ్య, ఆర్థిక రంగాలపై చర్చించారు. ఈ సదస్సు ఆదివారం కూడా కొనసాగనుంది. సోమవారం నుంచి స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. -
టీకా తీసుకున్న వారి ద్వారా కూడా కరోనా వ్యాప్తి
లండన్: కోవిడ్–19 వైరస్ నుంచి రక్షణ కోసం టీకా రెండు డోసులు తీసుకున్న వారి నుంచి కూడా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతున్నట్టు లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక వెల్లడించింది. అయితే, వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే టీకా తీసుకున్న వారిలో వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నట్టు తెలిపింది. యూకేలోని ఇంపీరియల్ కాలేజీ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తల అధ్యయనం ఫలితాలను లాన్సెట్ వెలువరించింది. ‘‘టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా వైరస్ సోకుతోంది. అయితే వారు త్వరగానే కోలుకుంటున్నారు. కానీ వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించేవారు వ్యాక్సిన్ తీసుకోకపోతే మహమ్మారి వారిని బాగా వేధిస్తోంది’’ అని ఆ నివేదిక వెల్లడించింది. ‘‘కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో వ్యాక్సిన్లే అత్యంత కీలకం. మన చుట్టూ ఉన్నవారు టీకా వేసుకున్నారు, మనకేం కాదులే అన్న ధీమా పనికిరాదు. టీకా వేసుకున్న వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది’’ అని అధ్యయనం సహ రచయిత ప్రొఫెసర్ అజీ లల్వానీ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ కరోనా కేసులు పెరిగిపోవడానికి ఇదే కారణమని వివరించారు. టీకా రెండో డోసు తీసుకున్న 3 నెలల తర్వాత నుంచి వారికి వైరస్ సోకి ఇతరులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించామన్నారు. -
90 వేల మంది 20 ఏళ్ల లోపు వారే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 90 వేల మంది (13.5 శాతం)కి పైగా 20 ఏళ్లలోపు వారు ఉన్నారు. అందులో 20 వేల మంది వరకు 10 ఏళ్లలోపు వారు ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం నాటికి తెలంగాణలో 6,70,543 కేసులు నమోదు కాగా, అందులో 90,561 మంది 20 ఏళ్లలోపు యువతీ యువకులని పేర్కొంది. 10 ఏళ్లలోపు పిల్లలు 19,445 మంది ఉన్నారని తెలిపింది. 18 ఏళ్లలోపు వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వకపోవడంతో ఆ వయసు వారిలో ఇటీవల కేసులు నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వారి ద్వారా ఇళ్లల్లో ఉండే వారికి కరోనా వ్యాప్తి చెందుతోందని పేర్కొంటున్నారు. పురుషులపైనే ఎక్కువగా దాడి: రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో ఎక్కువ మంది పురుషులేనని నివేదిక తెలిపింది. మొత్తం కేసుల్లో 61.4 శాతం పురుషులు కాగా, 38.6 శాతం మహిళలు ఉన్నారు. 31–40 ఏళ్ల వయస్సువారు 21.8 శాతం ఉంటే, అందులో 14.3 శాతం మంది పురుషులు, 7.5 శాతం మంది మహిళలు ఉన్నారు. 20 ఏళ్లలోపు బాలురు, బాలికలకు దాదాపు సమానంగా కరోనా సోకినట్లు నివేదిక వెల్లడించింది. కరోనాతో ఇప్పటివరకు మరణించినవారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 55.69 శాతం మంది ఉన్నారు. కాగా రాష్ట్రంలో బుధవారం నిర్వహించిన 41,392 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 186 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరికొన్ని ముఖ్యాంశాలు... ►రాష్ట్రంలో రికవరీ రేటు – 98.79 శాతం ►కరోనా మరణాల రేటు– 0.58 శాతం ►ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలు– 2,74,30,113 ►ప్రతి పది లక్షల జనాభాలో 7,36,972 మందికి పరీక్షలు చేశారు. ►మొత్తం పాజిటివ్ కేసుల్లో 79.8 శాతం లక్షణాలు లేనివారు కాగా, మిగిలిన వారికి లక్షణాలున్నాయి. -
బిలియన్ వ్యాక్సిన్లు భరోసా ఇచ్చేనా?
వందకోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తయినట్లు కేంద్రప్రభుత్వం గర్వంగా ప్రకటించి ఉండవచ్చు కానీ వాస్తవాలు ఇప్పటికీ భయపెడుతున్నాయి. రోజువారీగా వేస్తున్న డోసుల సంఖ్య రానురానూ తగ్గిపోతూండగా, ప్రజలందరికీ వ్యాక్సిన్ త్వరితంగా వేసే స్థాయి, ప్రేరణ కూడా తగ్గుముఖం పడుతోంది. అమెరికాలో తాజాగా మరోసారి కరోనా వేవ్ విజృంభణకు ఇదే కారణం. రెండో డోస్ వేసుకోవడానికి అమెరికన్లు ఆసక్తి ప్రదర్శించలేదు. భారత్‌లోనూ పది కోట్లమంది ఇంతవరకు రెండో డోస్‌ని వేసుకోలేదు. కాబట్టి, మన జనాభాలోని అతిపెద్ద భాగం ఇప్పటికీ ఇన్ఫెక్షన్కి గురయ్యే ప్రమాదకర స్థితిలోనే ఉంటోంది. వైరస్ కొత్త రూపాలు వ్యాపిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించడం ఒక్కటే శ్రీరామరక్ష అవుతుంది. జనాభా మొత్తానికి టీకాలు వేయడం ఒక్కటే బిలియన్ వ్యాక్సిన్ల ఘనతకు భరోసానిస్తుంది. కోవిడ్ 19 మహమ్మారి నిరోధంలో భాగంగా నూరు కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని భారతదేశం అక్టోబర్ 21న సాధించింది. దేశంలో కరోనా టీకాలు వేయడం మొదలెట్టిన తొమ్మిది నెలలలోపే ఇంత గొప్ప విజయాన్ని సాధించడం అద్భుతమనే చెప్పాలి. అది కూడా దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్లతో ఈ గొప్ప కార్యాన్ని సఫలం చేయడం గమనార్హం. దాదాపుగా దేశంలోని 75 శాతం వయోజనులు కనీసం ఒక డోస్ వేసుకోగా 31 శాతంమంది రెండు డోసులనూ తీసుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో కనీవినీ ఎరుగని రీతిలో దేశవ్యాప్తంగా 23.6 కోట్ల డోసులు వేశారు. మనదేశంలో రెండు డోసులు వేసుకున్న వారి సంఖ్య అమెరికా మొత్తం జనాభాకు సమానంగా చేరువవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 65 శాతం వ్యాక్సిన్లను ఉపయోగించడం గొప్ప విషయం. మరి ఈ అరుదైన మైలురాయినుంచి మనం ఏవైపు వెళ్లబోతున్నాం? దేశంలోని వయోజనులందరికీ పూర్తిగా వ్యాక్సిన్ వేయాలన్న లక్ష్యాన్ని సాధించాక, బూస్టర్ షాట్లు వేయడం సమస్య కానుంది. అలాగే, కొత్త వైరస్ రూపాలు పెరుగుతున్నందున పిల్లలకు టీకాలు వేయడంపై కూడా భయాలు పెరుగుతున్నాయి. 2022 మార్చి నాటికల్లా అర్హులైన జనాభా మొత్తానికి మనం వ్యాక్సిన్ వేయగలగాలి. మరికొన్ని ఆందోళన కలిగించే ధోరణులు కూడా ఉన్నాయి. అర్హులైన తమ జనాభాలో దాదాపు సగం మందికి హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కేరళ రాష్ట్రాలు టీకాలు పూర్తి చేయగా, ఉత్తరప్రదేశ్, మహా రాష్ట్రలు తమ జనాభాలో 19 శాతం నుంచి 22 శాతంమందికి మాత్రమే ఇంతవరకు టీకాలు వేయగలిగాయి. రోజువారీగా వేస్తున్న డోసుల సంఖ్య రానురానూ తగ్గిపోతూండగా, ప్రజలందరికీ వ్యాక్సిన్ త్వరితంగా వేసే స్థాయి, ప్రేరణ కూడా తగ్గుముఖం పడుతోందని భయపడుతున్నారు. అమెరికాలో తాజాగా మరోసారి కరోనా వేవ్ విజృంభించడానికి సరిగ్గా ఇదే కారణం. ఎందుకంటే రెండో డోస్ వేసుకోవడానికి అమెరికన్లు ఆసక్తి ప్రదర్శించలేదు. భారత్‌లోనూ పది కోట్లమంది ఇంతవరకు రెండో డోస్‌ని వేసుకోలేదు. కాబట్టి, మన జనాభాలోని అతిపెద్ద భాగం ఇప్పటికీ ఇన్ఫెక్షన్కి గురయ్యే ప్రమాదకర స్థితి లోనే ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పెరుగుతున్నప్పటికీ, వ్యాక్సిన్ ద్వారా కలగాల్సిన రోగనిరోధక శక్తి పడిపోతుండటంపై ఆందోళన కలుగుతోంది. ఇజ్రాయెల్‌లో రెండు కరోనా వ్యాక్సిన్లను అయిదు నెలల క్రితమే తీసుకున్న 60 సంవత్సరాల పైబడిన వారిలో మూడోవంతు మందికి ఇటీవల వ్యాక్సిన్ వేసుకున్నవారితో పోలిస్తే మళ్లీ వైరస్ సోకింది. బ్రిటన్‌లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న 20 వారాల తర్వాత దాని వైరస్ నిరోధక శక్తి 67 శాతం నుంచి 47 శాతానికి పడిపోయిందని వెల్ల డయింది. తాజా అధ్యయనం ప్రకారం ఫైజర్–బయోన్టెక్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్ కరోనా ఇన్ఫెక్షన్పై 95.6 శాతం వరకు సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. డెల్టా వైరస్ రకం ప్రబలంగా ఉన్న సమయంలో సాగించిన ఈ అధ్యయనానికి ప్రత్యేకించి ప్రాధాన్యత ఉంది. అమెరికా ఆహార, మందుల నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఇటీవలే రెండు వ్యాక్సిన్లను బూస్టర్ షాట్లుగా అత్యవసరంగా ఇవ్వడానికి అనుమతినిచ్చింది. మోడెర్నా లేక జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ బూస్టర్ డోస్‌కి ఎఫ్‌డీఏ అనుమతించింది. 65 ఏళ్ల వయస్సువారు కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న ఆరు నెలల తర్వాత ఈ బూస్టర్ డోస్ తీసుకోవడానికి అనుమతించారు. అలాగే 18 నుంచి 64 సంవత్సరాల వయస్సు మధ్య ఉండి తీవ్రస్థాయిలో కరోనా వైరస్ ఇన్పెక్షన్ బారినపడిన వారికి, తరచుగా వైరస్ల బారిన పడుతున్నవారికి కూడా ఈ బూస్టర్ డోస్ ఇవ్వవచ్చునని అనుమతించారు. అలాగే మొదట్లో ఒకే రకం వ్యాక్సిన్లను రెండు సార్లు తీసుకున్నవారు ఇప్పుడు రెండు రకాల వ్యాక్సిన్లను కలిపిన బూస్టర్ డోస్‌ని తీసుకుంటే అది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుందని చెప్పి, ‘మిక్స్ అండ్ మ్యాచ్’ రకం బూస్టర్‌కి ఎఫ్డీఎ ఆమోదం తెలిపింది. భారతదేశం కూడా రెండు వ్యాక్సిన్లను వేసుకున్న వ్యక్తులకు బూస్టర్ షాట్లు వేసుకోవడానికి అనుమతించాల్సిన అవసరం ఉన్నట్లు కనబడుతోంది. వ్యాక్సిన్లను వేసుకున్న వ్యక్తుల్లో దాదాపు 10 శాతంమందికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో మళ్లీ వైరస్ సంక్రమించినట్లు డేటా తెలుపుతోంది. ఇప్పుడు కూడా రాష్ట్రాల్లో 10 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నందున, వైరస్ సులభంగా సోకే వృద్ధులకు, ఆరోగ్య సిబ్బందికి బూస్టర్ షాట్లు వేయడం గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఇక పిల్లలకు కూడా వ్యాక్సిన్లు వేయవలసి ఉంది. జైదుస్ కాడిలా కంపెనీకి చెందిన జైకోవ్–డి, భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాక్సిన్ టీకాలను రెండేళ్ల నుంచి 17 సంవత్సరాల వయసు పిల్ల లకు వేయడానికి అత్యవసర అనుమతిని అధికారులు ఇప్పటికే మంజూరు చేశారు. పాఠశాలలు, కాలేజీలను ఇప్పటికే తెరిచినందున వ్యాక్సిన్లకు దూరమైన పిల్లలు వైరస్ బారిన పడే ప్రమాదముంది. ఇప్పటికే బ్రిటన్, అమెరికాతో సహా పలు దేశాలు 18 సంవత్సరాల లోపు పిల్లలకు దశలవారీగా వ్యాక్సినేషన్ని ప్రారంభించేశాయి. మరోవైపున ప్రపంచవ్యాప్తంగా సామాజిక శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులూ వ్యాక్సినేషన్ ప్రక్రియలోని అసమానత్వంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, చైనా, యూరప్ దేశాల్లో సగం కంటే ఎక్కువ జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తవగా, ఆఫ్రికాలో ఇంతవరకు 7 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయింది. పైగా విదేశీ పర్యటనలకు, వాణిజ్య కార్యకలాపాలకు తలుపులు తెరిచినందున, ప్రపంచమంతటా ఏకకాలంలో వైరస్‌ని నియంత్రించకపోతే, కోవిడ్–19ని భూమండలం నుంచి పారదోలడం కష్టసాధ్యమని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గత సంవత్సరమే వ్యాక్సిన్ సమాన పంపిణీకి కోవాక్స్ పేరిట కన్సార్టియమ్ని ఏర్పర్చినప్పటికీ, సంపన్న దేశాలు, పేద దేశాలకు తగినంత స్థాయిలో వ్యాక్సిన్ డోస్‌లను పంపడం లేదు. అంతకుమించి కొత్త వైరస్ రకాలు పెరుగుతుండటం భీతి కలిగిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రాణాంతకమైన డెల్టా వైరస్ రకం భారతదేశంలో విధ్వంసం సృష్టించింది. ఈ సెప్టెంబర్‌లో బ్రిటన్‌లో ఏర్పడిన కొత్త డెల్టా వైరస్ రకం ఏవీ.4.2 ఇతర వైరస్ రూపాలకంటే శరవేగంగా వ్యాపిస్తోందని సమాచారం. వైరస్ ఇలా కొత్తవారికి సోకడం కొనసాగుతున్నందున అది ఉత్పరివర్తనం చెంది మరింత ప్రమాదకర పరిస్థితులను సృష్టించక తప్పదని భావిస్తున్నారు. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన ఘనత సాధిం చిన రష్యాలో కూడా అధిక శాతం ప్రజలు టీకా వేసుకోవడానికి వెనుకాడుతుండటంతో ఇప్పుడు అక్కడ వైరస్ విజృంభిస్తుండటం చూస్తున్నాం. ఇప్పటికైనా మన గతానుభవం నుంచి ఇతర దేశాల అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించనందున రాబోయే నెలల్లో వైరస్ వ్యాప్తి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ సమయాల్లో, సామూహిక కార్యక్రమాల్లో, బహిరంగంగా మాస్కులు వేసుకోకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం ప్రమాదకరం. పండగలు, ఎన్నికలు కూడా కరోనా కేసులను పెంచుతున్నాయి. వ్యాక్సిన్ ద్వారా పెరిగిన రోగనిరోధకత కొంత కాలం తర్వాత తగ్గుముఖం పడుతుండటం దీనికి కూడా తోడవుతోంది. ఈ నేపథ్యంలో వందకోట్ల వ్యాక్సిన్లు కలిగించిన ప్రయోజనాన్ని సుస్థిరపర్చుకోవడానికి, కోవిడ్ నిబంధనలను మనం కచ్చితంగా పాటించాలి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అనవసరంగా గుంపుకూడకుండా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన జనాభాకి కూడా వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేసి, తదుపరి దశలో అందించనున్న బూస్టర్ షాట్లను కూడా తీసుకోవడానికి దేశ జనాభా ఆమోదం తెలపాలి. -జగత్ రామ్, డైరెక్టర్, పీజీఐఎమ్ఈఆర్, చండీగర్ రాకేష్ కొచ్చార్, ప్రొఫెసర్, గ్యాస్ట్రోఎంటెరాలజీ -
వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, బ్రె జిల్, జర్మనీ, నెదర్లాండ్, చైనా తదితర దేశాల్లో కోవిడ్–19 మరో రూపంలో ప్రబలిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి నుంచి కా పాడేందుకు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడమే ఏకైక మార్గమని, ఈ మేరకు రాష్ట్రంలో 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కోరారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో వ్యాక్సినేషన్‌ను మరింత ఉధృతంగా చేపట్టేందుకు గ్రామ/వార్డు స్థాయి ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక బృందంలో ఆశ వర్కర్, అంగన్వాడీ వర్కర్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘వ్యాక్సిన్.. పింఛన్ కట్’ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వైద్య, ఆరోగ్యశాఖ చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు స్పష్టంచేశారు. అలాంటి దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని, ప్రజలు ఈ అసత్య ప్రచారంతో ఆందోళనకు గురికావొద్దని సూచించారు. తప్పుడు వార్తను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలాఉండగా, వ్యాక్సిన్ తీసుకోనివారికి రేషన్, పింఛన్ నిలిపివేస్తామని శ్రీనివాసరావు ప్రకటించినట్లుగా మంగళవా రం భారీగా ప్రచారమైన సంగతి తెలిసిందే. చదవండి: మహమ్మారి ఎఫెక్ట్: రెండేళ్లు తగ్గిన భారతీయుల ఆయుర్దాయం -
ఆలస్యమైనా తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: కరోనా టీకా మొదటి డోస్ తీసుకున్న తర్వాత కోవిడ్ వచ్చి తగ్గింది కదా, ఇంకా రెండో డోసు ఎందుకన్న భావనలో ఉన్నారా... రెండోడోసు తీసుకోవడం ఆలస్యమైంది కదా, ఇక ఎందుకులే అని అనుకుంటున్నారా.. ఇలాంటి ఆలోచనలు సరికాదంటోంది కేంద్ర ప్రభుత్వం. ఆలస్యమైనా సరే, రెండో డోసు వేసుకుంటేనే వైరస్ నుంచి పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్రాలు అప్రమత్తమై రెండోడోస్ వేసుకోనివారి కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. దీంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసి, రెండో డోస్ ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ వారికి టీకాలను అందజేసేలా ప్రణాళిక రచించింది. కరోనా ప్రభావంలేదన్న భావనతో నిర్లక్ష్యం రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు కోట్ల డోసుల కరోనా టీకాలు అందజేశారు. అందులో 76 శాతం మంది మొదటి డోస్, 30 శాతం మంది రెండో డోస్ వేసుకున్నారు. మొదటి డోస్ వేసుకొని నిర్ణీతకాలంలో రెండో డోస్ తీసుకోనివారు 36.55 లక్షల మంది ఉండటం గమనార్హం. దీనికి ప్రధాన కార ణం ప్రస్తుతం కరోనా ప్రభావం అంతగా లేకపోవడమేనన్న భావనతో ఉండటమేనని నిపుణులు అంటున్నారు. మొదటి డోస్ వేసుకున్న తర్వాత కరోనా వచ్చిపోవడం వల్ల కూడా చాలామంది రెండో డోస్ వేసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కొరత వల్ల కూడా చాలామంది రెండో డోస్ పొందలేదని తెలుస్తోంది. మూడు నుంచి ఆరు నెలలలోపైతే మంచిది... ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం కరోనా వ్యాక్సిన్ రెండు డోస్‌లూ నిర్ణీత కాలవ్యవధిలో వేసుకోవాలి. ఒకవేళ రెండో డోస్ వేసుకోవడం ఆలస్యమైనా సరే, ఎప్పుడైనా వేసుకోవచ్చు. మళ్లీ షెడ్యూల్‌ను ప్రారంభించాల్సిన అవసరంలేదు. ఉదాహరణకు కోవిషీల్డ్‌పై చేసిన పరిశోధనలో రెండు డోస్‌లు వ్యవధిలోనే వేసుకుంటే లక్షణాలతో కూడిన కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం 66.7 శాతంగా ఉంటుంది. 4 వారాలలోపు 66.56 శాతం, 4 నుంచి 8 వారాల లోపలైతే 56.42 శాతం. 9–12 వారాల మధ్య అయితే 70.48 శాతం, 12 వారాల తర్వాత తీసుకుంటే 77.62 శాతం సామర్థ్యం ఉంటుంది. ఆలస్యం అవడం వల్ల టీ సెల్ ఆధారిత రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 3 నెలల నుంచి 6 నెలలలోపు రెండో డోసు టీకా వేసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్న 22 రోజులకు దాని ప్రభావం మొదలవుతుంది. ఆరు నెలల తర్వాత మొదటి డోస్ ప్రభావం తగ్గుతుంది. ఆ లోపులో రెండో డోస్ వేసుకుంటే మంచిది. కరోనాను ఎదుర్కొనే శక్తి ఇలా.. తీవ్రమైన కరోనాను ఎదుర్కొనే శక్తి మొదటి డోస్ తర్వాత 71 శాతం, రెండో డోస్ తర్వాత 92 శాతం ఉంటుంది. వయస్సు మళ్లినవారికి మొదటి డోస్ సామర్థ్యం వేగంగా తగ్గుతుంది. కాబట్టి వీళ్లు వీలైనంత త్వరగా రెండో డోస్ వేసుకోవాలి. మొదటి డోస్ వేసుకున్న తర్వాత ఒకవేళ కరోనా వచ్చి నయమైపోతే, మూడు నెలల తర్వాత రెండో డోసు వేసుకుంటే మంచిది. డెల్టా వంటి వైరస్‌లను ఎదుర్కొవాలంటే మూడు నెలల్లోనే వేసుకుంటే మంచిది. ఇలాంటి డోస్‌ను బూస్టర్ లేదా మూడో డోస్‌గా పేర్కొనవచ్చు. మరో వేవ్‌ను తట్టుకోవచ్చు వ్యాక్సిన్‌పై పరిశోధనలు నిరంతరం సాగుతుండటంతో మనకు ఎప్పటికప్పుడు కొత్త సమాచారం అందుబాటులోకి వస్తోంది. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల బీ, టీ, మెమరీ సెల్ ఆధారిత రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. డోసుల వ్యవధిని బట్టి వాటి ప్రభావం మారుతుంది. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం మొదటి డోసుతో 96 శాతం మరణాలను ఎదుర్కొనే శక్తి వస్తే, రెండో డోస్‌తో 98 శాతం వస్తుంది. ఇప్పుడు తీసుకుని ఉంటే, వచ్చే 3–4 నెలల్లో మరో కరోనా వేవ్ వస్తే దాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. వీరిలో చాలామంది ఇప్పటికే కరోనా బారిన పడితే మనమిచ్చే రెండో డోసు కూడా వారికి బూస్టర్ లాగా పనిచేస్తుంది. –డా. కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
AP: ఐదు కోట్ల డోసులు.. కోవిడ్ టీకాల్లో మరో మైలురాయి
సాక్షి, అమరావతి: కోవిడ్ టీకా ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ మరో మైలురాయిని అధిగమించింది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి రాష్ట్రంలో 5.01 కోట్ల డోసుల టీకాలను ఇచ్చారు. ఇప్పటికే దేశంలో ఎక్కువ మంది ప్రజలకు రెండు డోసులు టీకాలు ఇచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఐదు కోట్ల డోసులు పూర్తయ్యాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే మిగతా పెద్ద రాష్ట్రాలకంటే ఏపీలోనే ఎక్కువ శాతం మందికి టీకాలిచ్చారు. పట్టణాలకు దీటుగా ఏజెన్సీలోనూ.. వ్యాక్సినేషన్ ఆరంభంలో దేశంలో తొలి మూడు నెలలు టీకాలు తీసుకునేందుకు ప్రజలు పెద్దగా ముందుకు రాలేదు. ఏప్రిల్ నుంచి కేసులు పెరగడంతో ఒక్కసారిగా టీకాకు డిమాండ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో వార్డు/గ్రామ సచివాలయాల వ్యవస్థ ఉండటం, వలంటీర్లు చురుకుగా పనిచేయడం, ఎక్కువ మంది ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో టీకాలు వేగంగా అందరికీ ఇవ్వగలిగారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు దీటుగా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ టీకాల ప్రక్రియ నమోదు కావడం గమనార్హం. దీన్నిబట్టి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో సైతం టీకాలిచ్చినట్లు స్పష్టమవుతోంది. తొలిడోసు 3.17 కోట్లు ఆదివారం సాయంత్రానికి 3,17,02,897 తొలి డోసు టీకాలిచ్చారు. 1,84,26,366 రెండో డోసులు వేశారు. దీంతో మొత్తం డోసులు 5.01 కోట్లు దాటాయి. ఇప్పటికే హెల్త్‌కేర్ వర్కర్లు.. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45 ఏళ్ల వయసు పైన ఉన్నవారు, ఐదేళ్లలోపు చిన్నారులు తల్లులకు టీకాల ప్రక్రియ పూర్తైన విషయం తెలిసిందే. ప్రస్తుతం 18–44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి వీరికి 2.61 లక్షల డోసులు ఇచ్చారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు రవాణా సదుపాయం సరిగా లేని గ్రామాలకు కూడా వెళ్లి టీకాలు ఇస్తున్నారు. -
18 నెలల్లోనే పెట్రోల్‌పై రూ.35.98 పెంపు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశంలోకి దూసుకెళ్తూనే ఉన్నాయి. గత ఏడాది మే నుంచి ఇప్పటిదాకా.. కేవలం 18 నెలల్లోనే లీటర్ పెట్రోల్ రూ.35.98, డీజిల్ చొప్పున రూ.26.58 ధరలు పెరిగాయి. చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటేసింది. డీజిల్ సైతం రూ.100 మార్కును అధిగవిుంచింది. అంతర్జాతీయంగా చమురు ధరలను బట్టి భారత్‌లోనూ పెంచకం తప్పడం లేదని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. కానీ, అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడల్లా కేంద్రంం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ పెంచేస్తుండడంతో ఆ ప్రయోజనం వినియోగదారులకు దక్కడం లేదు. ప్రభుత్వం ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ.32.90, డీజిల్‌పై 31.80 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తోంది. పెట్రో ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం అంటే మన కాళ్లను మనం నరుక్కున్నట్లే అని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి వ్యాఖ్యానించారు. ఈ సొమ్ముతోనే ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్, సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మరో 35 పైసలు పెంపు దేశంలో శనివారం సైతం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 35 పైసల చొప్పున పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.24కు, డీజిల్ రూ.95.97కు ఎగబాకింది. -
మాస్కు ధరించకుంటే మూడో వేవ్ తప్పదు
సాక్షి, హైదరాబాద్: ‘కోవిడ్ మొదటి రెండు దశలతో జనం బాగా భయపడ్డారు. ఇక మూడో దశ వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందారు. కానీ కొన్ని హెచ్చరికల్లో పేర్కొన్నట్లుగా మూడో దశ వెంటనే రాలేదు. ఇక భయం లేదు, కోవిడ్ అంతమైందన్న భావనలో ఉన్నారు. అందుకే ఇప్పుడు అక్కడక్కడా కొందరు తప్ప ఎవరూ మాస్కులు ధరించటం లేదు. కానీ ఇది చాలా ప్రమాదకర పరిణామం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు, సూచనలను పెడచెవిన పెట్టిన ఫలితంగా అటు రష్యా, ఇటు యూకేల్లో ఇప్పుడు కోవిడ్ విజృంభిస్తోంది. ఇది మనకు ఓ హెచ్చరికలాంటిది. ప్రస్తుతం ఉన్న నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మూడో దశ రావటానికి పెద్దగా సమయం పట్టదన్న విషయాన్ని గుర్తించాలి’ అని ఇంటిగ్రేటివ్ స్పెషలిస్టు, మైక్రోబయోలజిస్టు డాక్టర్ దుర్గా సునీల్ వాస హెచ్చరించారు. కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోందని, ఇది క్రమంగా మూడో దశగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ‘సాక్షి’ తో పేర్కొన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వాక్సిన్లతో అతి ధీమా వల్లే.. కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో వ్యాక్సిల్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా అని జనం ఎదురు చూశారు. ప్రపంచంలో ఎక్కడ తయారైనా సరే, అందుబాటులోకి వస్తే మహమ్మారి అంతమవుతుందని భావించారు. ఇప్పుడు సొంత తయారీ వ్యాక్సిన్లు మనకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వాటి కోసం ఎదురుచూసినప్పుడు ఉన్న అభిప్రాయమే జనంలో ఇప్పటికీ ఉందని ప్రస్తుతం వారి తీరును బట్టి అర్ధమవుతోంది. వ్యాక్సిన్ వస్తే కోవిడ్ వైరస్ అంతమైనట్లేనని ఆదిలో భావించారు. ఇప్పుడు వ్యాక్సిన్లు వచ్చాయి. సింహభాగం జనం వ్యాక్సిన్లు వేసుకున్నారు. క్రమంగా రెండో డోస్ వేయించుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. టీకా తీసుకున్నాం కదా ఇక ఢోకా లేదన్న ధీమాలోకి చేరుకున్నారు. వెంటనే మాస్కులు విసిరేశారు. ఇప్పుడు ఈ ధోరణే ప్రమాదకరంగా మారబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా మళ్లీ క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రులకు వస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్లు సురక్షితం మాత్రమే.. రెండు డోసుల వ్యాక్సినేషన్‌తో ఇక కోవిడ్ సోకదనే భ్రమ ప్రజల్లో ఉంది. దాని నుంచి బయటపడాలి. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నతర్వాతకూడా వైరస్ సోకుతుంది. ప్రస్తుతం ఆసుపత్రులకు వస్తున్న వారిని చూస్తే ఇది అవగతమవుతుంది. ఏ వ్యాక్సిన్ తయారీ కంపెనీ కూడా, రెండో డోసు తర్వాత కోవిడ్ సోకదు అని ప్రకటించని విషయాన్ని జనం గుర్తించాలి. వైరస్ సోకినా ప్రాణాంతకం కాకుండా ఉండేందుకు మాత్రమే వ్యాక్సిన్లు ఉపకరిస్తాయిచ, తప్ప వైరస్ సోకకుండా అడ్డుకోలేవు. వైరస్ సోకద్దంటే కచ్చితంగా మాస్కు ధరించటంతోపాటు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే. మరికొన్ని నెలలు వీటిని పాటిస్తే వైరస్ ప్రభావం బాగా తగ్గిపోయి సురక్షితంగా ఉండొచ్చు. వైరస్ ముప్పు తొలగలేదని, క్రమంగా అది ఎండమిక్ స్థాయికి చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించిన విషయాన్ని గుర్తించాలి. వైరస్ రూపాంతరం చెందినప్పుడలా ప్రభావం చూపుతుంది. సురక్షిత మాస్కులను ధరించటం, భౌతిక దూరం పాటిస్తూ, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం మినహా ప్రస్తుతానికి తరుణోపాయం లేదు. మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితిని మర ఆర్థిక వ్యవస్థ తట్టుకోలేదన్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాలి. వచ్చేది చలికాలం. వ్యాధులు ముసిరే కాలం. దగ్గు, జలుబుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కోవిడ్ వైరస్ విజృంభిస్తే వ్యాధి బారిన పడే వారి సంఖ్య అతి వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. ఆ రెండు దేశాల ధోరణి ఇలాగే.. అమెరికాలో చాలా వేగంగా వ్యాక్సినేషన్ జరిగింది. టీకాలు వేసుకున్నాక మాస్కుల అవసరం లేదన్న ప్రకటనలూ జారీ అయ్యాయి. ఆదిలో కోవిడ్‌తో వణికిపోయిన యూకేలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజలు మాస్కులతో పాటు కోవిడ్ నిబంధనలను పాతరేయటంతో ఒక్కసారిగా తదుపరి దశ ప్రారంభమైంది. ఇప్పుడు మళ్లీ యూకే వణికిపోవటం మొదలుపెట్టింది. రష్యాలో భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకటమే కాదు, శ్మశానవాటికల్లో స్థలం కూడా లభించటం లేదు. ఆ దేశాలకంటే ఎన్నో రెట్లు జనాభా ఉన్న మన దేశంలో మూడో దశ మొదలైతే పరిస్థితి చేయిదాటిపోతుంది. -
భారత్‌పై ప్రపంచ దేశాల ప్రశంసలు.. చైనా తర్వాత మనమే!
న్యూఢిల్లీ: కరోనా కొమ్ములు వంచడానికి చేస్తున్న పోరాటంలో మన దేశం మరో మైలురాయిని అధిగమించింది. తొమ్మిది నెలల్లోనే వంద కోట్ల కోవిడ్–19 వ్యాక్సిన్ డోసుల్ని పంపిణీ చేసి ఘన కీర్తి సాధించింది. కరోనాపై పోరాటంలో రక్షణ కవచమైన భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి 16న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత ఆరోగ్య, వైద్య సిబ్బందికి టీకా డోసులు ఇచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విడతల వారీగా, పక్కా ప్రణాళికతో ఒక్కో వయసు వారికి ఇస్తూ ముందుకు వెళ్లింది. అక్టోబర్ 21 నాటికి వంద టీకా డోసుల్ని పూర్తి చేసి చైనా తర్వాత శతకోటి డోసుల్ని పంపిణీ చేసిన రెండో దేశంగా ప్రపంచ దేశాల ప్రశంసల్ని అందుకుంది. ఈ అపురూపమైన ఘట్టానికి గుర్తుగా దేశమంతటా మువ్వన్నెల వెలుగులు ప్రసరించాయి. (చదవండి: Viral Video: ‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’) వంద కోట్ల మార్క్‌ని దాటిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. వైద్య, ఆరోగ్య సిబ్బందితో ప్రధాని మాట్లాడి వారిని అభినందించారు. లబ్ధిదారులతో కలిసి ముచ్చటించారు. ప్రధాని వెంట కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నారు. అంతకు ముందు ట్విట్టర్ వేదికగా ప్రధాని స్పందించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ చరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారు. ‘‘భారత్ చరిత్ర లిఖించింది. భారత శాస్త్ర, పారిశ్రామిక రంగాలతో పాటు 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్ఫూర్తికి ఈ విజయం నిదర్శనంగా నిలుస్తోంది. ఈ మహోన్నత యజ్ఞంలో పాలుపంచుకున్న మన వైద్యులు, నర్సులు ఇతర సిబ్బందికి పేరు పేరునా కృతజ్ఞతలు. (చదవండి: VK Sasikala: శశికళ చట్టానికి చిక్కేనా?) -
‘అక్టోబర్ 21 దేశ చరిత్రలో ఓ మైలురాయి’
న్యూఢిల్లీ: కోవిడ్‌పై పోరాటంలో భారతదేశం చరిత్ర సృష్టించింది. మహమ్మారి కట్టడి కోసం ప్రారంభించిన టీకా కార్యక్రమంలో అక్టోబర్ 21(గురువారం) వరకు 100 కోట్ల టీకా డోసులు పంపిణీ పూర్తయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం నరేంద్ర మోదీ జాతీనుద్దేశించి ప్రసంగించారు. భారత్ వంద కోట్ల డోసులు పూర్తి చేసింది. ఇది ప్రతీ భారతీయుడి విజయం అని.. దేశ సామర్థ్యానికి ప్రతీక అని ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి భారతీయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘100 కోట్ల డోసులు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. దేశ సామర్థ్యానికి ప్రతీక. మన దేశం ఎంత సంకల్ప బద్ధంగా ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది. భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. గతంలో మనం విదేశాల నుంచి వ్యాక్సిన్ తెప్పించుకునేవాళ్లం. ఇప్పుడు విదేశాలకు టీకాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. శతాబ్ధి కాలంలో ఎన్నడూ చూడనటువంటి మహమ్మారి ప్రపంచం మీద దాడి చేసింది. ఈ మమమ్మారిని అడ్డుకునేందుకు భారత్ వ్యాక్సిన్లను ఎక్కడి నుంచి తీసుకువస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. ప్రస్తుతం 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాయి’’ అన్నారు. (చదవండి: ప్రపంచానికే పాఠాలు!) ‘‘కోవిడ్ మనకో సవాల్ విసిరింది.. భారత్ శక్తి ఏంటో చూపించాం. కరోనాపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యాన్ని తొలి ఆయుధంగా మలుచుకున్నాం. భారత్‌ను ప్రపంచం ఇప్పుడు సురక్షిత దేశంగా చూస్తోంది. భారత్ వ్యాక్సిన్ హబ్‌గా మరింత మన్ననలు పొందుతోంది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి చేయడం అనేది అద్భుత విజయం. మన టెక్నాలజీ, సామర్థ్యానికి ప్రతీక’’ అన్నారు. (చదవండి: డెల్టా వేరియంట్‌పై కోవిషీల్డ్ 90% రక్షణ) ‘‘కోవిన్ వల్ల టీకాలను సులభతరంగా, పారదర్శకంగా అందిస్తున్నాం. వ్యాక్సిన్ సరఫరాను సవాల్‌గా తీసుకున్నాం. అందరికి ఉచితంగా టీకా ఇచ్చాం. శాస్త్రీయ దృక్పథంతో వ్యాక్సిన్ పంపిణీ చేశాం. ప్రస్తుతం మేడిన్ ఇండియా వస్తువులకు ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ విశ్వాసం, ఉత్సామం కనిపిస్తోంది. అయితే రక్షణ కవచం ఉందని నిర్లక్ష్యం వద్దు. కరోనా ఇంకా కొనసాగుతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని పండుగలు జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలి’’ అన్నారు మోదీ. చదవండి: శతకోటి సంబరం! -
సాక్షి కార్టూన్ 22-10-2021
-
కరోనా టీకాల్లో మరో మైలురాయికి తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: కరోనా టీకా కార్యక్రమంలో రాష్ట్రం మరో మైలురాయిని చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల డోస్‌లు పూర్తయ్యాయి. ఇక ఈ ఏడాది చివరి నాటికి అర్హులైన వారందరికీ పూర్తిస్థాయిలో రెండు డోస్‌లూ వేసేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. కరోనాను కట్టడి చేయడంలో వ్యాక్సిన్లు వేయడమే కీలకమైన అంశమని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. టీకాలు వేయడంలో తెలంగాణ దేశంలో 12వ స్థానంలో నిలిచిందని తెలిపారు. దేశవ్యాప్తంగా వంద కోట్ల డోస్‌లు, అందులో భాగంగా రాష్ట్రంలో మూడు కోట్ల డోస్‌లు పూర్తయిన సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. జీహెచ్ఎంసీలో 100% మొదటి డోస్ రాష్ట్రంలో మూడు కోట్ల డోస్‌ల వ్యాక్సిన్లు వేశాం. 18 ఏళ్లు పైబడిన 2.77 కోట్ల మందికి కరోనా టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు రాష్ట్రంలో 2.10 కోట్ల మందికి మొదటి డోస్ వేయగా, మిగిలినవారికి రెండో డోస్ కూడా వేశాం. మొదట్లో వ్యాక్సిన్ కొరత ఉన్నప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాం. మొదటి దశలో వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా అందించాం. ఆ తర్వాత రెండో దశలో 60 ఏళ్లు పైబడినవారికి, 45 ఏళ్లుపై బడిన దీర్ఘకాలిక వ్యక్తులకు ఇచ్చాం. ఇక మూడో దశలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ఇస్తూ వచ్చాం. జీహెచ్ఎంసీ పరిధిలో మొదటి డోస్ నూటికి నూరు శాతం వేశాం. రెండో డోస్ 50 శాతం పూర్తయింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 76 శాతం మందికి మొదటి డోస్, 30% మందికి సెకండ్ డోస్ వేశాం. అయితే మొదటి డోస్ వేసుకున్న వారిలో 36 లక్షల మందికి రెండో డోస్ పెండింగ్‌లో ఉంది. వారందరికీ వ్యాక్సిన్ వేసేలా ప్రణాళిక రచించాం. కరోనా తగ్గిందనుకోవడం సరికాదు రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ను పర్యవేక్షించాం. వేసుకున్న ఇళ్లకు స్టిక్కర్ వేశాం. మొబైల్ వ్యాన్లు పెట్టి వేగవంతం చేశాం. వ్యాక్సిన్ వేసుకున్నవారు మాస్క్ పెట్టుకోవడం వల్ల కొత్త వేరియంట్లకు గురికాకుండా కాపాడుకోవచ్చు. కొందరు వ్యాక్సిన్‌పై వ్యతిరేకతతో వేసుకోవడంలేదు. మొదటి డోస్ వేసుకున్నవారిలో రెండో డోస్ తీసుకోకపోవడానికి ప్రధాన కారణం కరోనా తగ్గుముఖం పట్టిందన్న భావనే. కానీ ఇది సరైన పద్ధతి కాదు. టీకా క్రతువులో 38 వేల మంది సిబ్బంది కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో రాష్ట్రంలో 38 వేల మంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందులో 25 వేల మంది ఆశ కార్యకర్తలు, 8 వేల మంది ఏఎన్ఎంలు, 5 వేల మంది ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు. పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. వారు ఎంతో చురుగ్గా పాల్గొనడం వల్లే వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. అందుకే మూడు కోట్ల డోస్‌లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ చేతుల మీదుగా సిబ్బందికి జ్ఞాపికలు అందజేయాలని నిర్ణయించాం. కోవాగ్జిన్ సర్టిఫికెట్ ఉన్నా ఇబ్బందులు! కోవాగ్జిన్ టీకా వేసుకున్నవారిని అంతర్జాతీయ స్థాయిలో కొన్ని దేశాలు గుర్తించడం లేదు. ఆ వ్యాక్సిన్ వేసుకొని సర్టిఫికెట్ తీసుకెళితే అంగీకరించడంలేదు. ఈ విషయమై ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో కేంద్ర ప్రభుత్వం, భారత్ బయోటెక్ సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ నెల 26వ తేదీన డబ్ల్యూహెచ్ఓ నిర్వహించే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. అందులో సమస్య పరిష్కారం కావొచ్చు. ఆ మేరకు అవసరమైన సమాచారాన్ని డబ్ల్యూహెచ్ఓకు కేంద్రం అందజేసింది. ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది.. కరోనా వైరస్ వల్ల ఇంకా ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. కరోనా బారిన పడటం, ఆసుపత్రిలో చేరాల్సి రావడం, క్లిష్ట పరిస్థితులు తలెత్తడం, దురదృష్టవశాత్తు మరణాలు సంభవించడం చూస్తున్నాం. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో విపరీత పరిణామాలు ఉండటం లేదు. కరోనా అంతం కాలేదనే విషయం ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాలి. పూర్తిగా వ్యక్తుల అజాగ్రత్త వల్లనే వైరస్ వ్యాపిస్తుందనే విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించి మసలుకోవాలి. అందరూ కలిసేందుకు అవకాశం ఉండే పండుగలు, వివాహ, వినోద కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఈ రోజుకూ రాష్ట్రంలో అటుఇటుగా రెండొందల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అది కూడా వ్యాక్సిన్ తీసుకోని 18 ఏళ్లలోపు వారిలో ఎక్కువగా చూస్తున్నాం. అలాగే కుటుంబంలో ఒకరికి వస్తే త్వరితగతిన మిగతా అందరికీ వ్యాపించి కుటుంబం మొత్తం వైరస్ బారినపడుతున్నారు. పిల్లలకు మూడు డోసుల టీకా ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు 18 ఏళ్లు పైబడినవారందరికీ రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్ణయించాం. ఇక రెండు మూడు వారాల్లో 12–18 ఏళ్ల వయస్సు పిల్లలకు టీకా వేస్తాం. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక టీకా కంపెనీకి అనుమతి ఇచ్చింది. పిల్లలకు మూడు డోస్‌లు వేయాల్సి ఉంటుంది. నెల విరామంతో ఈ డోస్‌లు వేస్తారు. అలా రెండు నెలల వ్యవధిలో పిల్లలకు మూడు డోస్‌లు పూర్తవుతాయి. రాష్ట్రంలో 2–18 ఏళ్లలోపు పిల్లలు కోటి మంది ఉంటారు. తొలుత 12–18 ఏళ్ల వయస్సు పిల్లలకు టీకా వేస్తాం. సర్టిఫికెట్ రాకుంటే ఇలా చేయండి రెండు డోస్‌ల వ్యాక్సిన్ వేసుకున్నా కొందరికి సర్టిఫికెట్ రావడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే అన్నీ సక్రమంగా ఉంటే సర్టిఫికెట్ తప్పకుండా వస్తుంది. కొందరు మొబైల్ నంబర్ సరిగా ఇవ్వకపోవడం, సమాచారం సరిగా అందజేయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయినా అలాంటి వారు వ్యాక్సిన్ వేసుకున్న కేంద్రంలో వెరిఫై చేసుకోవాలి. అక్కడి వివరాలను ఆధారంగా చేసుకొని జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి వెళితే రెండు వారాల్లోగా సర్టిఫికెట్ సంబంధిత వ్యక్తుల మొబైల్‌కు పంపిస్తారు. -
ప్రపంచానికే పాఠాలు!
భారతదేశ శక్తి సామర్థ్యాలు, అది సాధించిన ఘనత నన్ను ఎంత గానో ఆకట్టుకున్నాయి. దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న ఉప ఖండం అత్యంత క్లిష్టమైన సమ యంలో ఆరోగ్య సవాళ్లను అధిగ మించి తన సత్తాను చాటింది. 100 కోట్ల డోసుల కోవిడ్-19 టీకాలు వేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఇదే అత్యంత వేగంగా సాగిన అతిపెద్ద టీకా కార్యక్రమం. ఇప్పటివరకూ దేశంలో 75 శాతా నికి మించి పెద్ద వాళ్లకు సింగిల్ డోస్, 31 శాతం మందికి పైగా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఇందులో 48 శాతానికి మించి మహిళలున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాను నిర్మూలించడంలో భారత్ టీకా కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుంది. భారత్ సాధించిన విజయంలోని మౌలిక అంశాలను ఇతర దేశాలు కూడా అనుసరించాలి. మొదటిది-పైనుంచి కింది స్థాయి వరకు రాజకీయ సంకల్పం బలంగా పనిచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం డిసెంబరు 2021 నాటికి అర్హులైన పెద్దవాళ్లందరికీ వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రాలు, జిల్లా స్థాయి నాయకత్వాల వరకూ ప్రధాని ఇచ్చిన లక్ష్యానికి స్పందించి పని చేస్తున్నారు. 2020 లోనే హై పవర్ కమిటీలు వేసి రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. రెండోది– దేశానికి ఉన్న సుదీర్ఘ అను భవం, అవగాహన, మౌలిక వసతులను ఉప యోగించుకుని కోవిడ్‌పై పోరాటానికి ప్రచారం చేసింది. భారతదేశపు రోగనిరోధక కార్యక్రమం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజారోగ్య కార్య క్రమాల్లో ఒకటి. ఏటా 2 కోట్ల 70 లక్షలమంది నవజాత శిశువులకు, 1 నుంచి 5 ఏళ్ల మధ్య ఉండే 10 కోట్ల మంది చిన్నారులకు బూస్టర్ టీకా డోసులు ఇస్తుంటారు. దేశవ్యాప్తంగా దాదాపు 27 వేల కోల్డ్ చెయిన్ సదుపాయాలు న్నాయి. మహమ్మారి సమయంలో, ఈ మౌలిక సదుపాయాలే కీలకంగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,48,000 ప్రభుత్వ, 28,000 ప్రైవేటు సెంటర్లు కోవిడ్ టీకాలు వేస్తున్నాయి. దీంతోపాటు 23 లక్షల మంది ఆశా, అంగన్వాడీ సిబ్బంది, డాక్టర్లు, నర్సులు అందరికీ చేరేలా కీలక పాత్ర పోషిస్తున్నారు. మూడోది– వాస్తవానికి మహమ్మారి కంటే ముందే తన టీకాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు భారత్ నిలబెడుతోంది. ముఖ్యంగా మెనైంజైటస్, నిమోనియా, డయేరియా వంటి ప్రాణాంతక వ్యాధులకు వ్యతిరేకంగా టీకాలు అందిస్తోంది. భారతదేశంలోని టీకా ఉత్పత్తిదారులైన సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్, బయో–ఈ వంటి కంపెనీలతో కలిసి పనిచేస్తున్నందుకు మా ఫౌండేషన్ కూడా ఎంతో గర్వపడుతోంది. ఇప్పుడు కోవిషీల్డ్, కోవాగ్జిన్ ద్వారా భారతీయులను కోవిడ్ నుంచి కాపాడుకుంటున్నాం. మేం కూడా ‘జీఏవీఐ’తో కలిసి సీరమ్‌లో కోవిషీల్డ్ ఉత్పత్తి పెంచేందుకు సహకరించాం. ఇంకా కొన్ని అను మతులు రావాల్సి ఉంది. వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద, మధ్య తరగతి దేశాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాలుగోది– భారతదేశం తన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో మానిటర్ చేయడం కూడా విజయవంతం కావ డానికి మరో కారణం. కోవిన్ ఓపెన్ సోర్స్ ఫ్లాట్‌ఫాం ద్వారా ట్రాక్ చేయడంతో పాటు, షెడ్యూలింగ్ చేయగలిగారు. పరిశీలన అనంతరం సర్టిఫికెట్లు కూడా ఆన్లైన్ ద్వారా అందించారు. దీని ద్వారా ఇన్ఫెక్షన్ ధోరణులను విశ్లేషించగలిగారు. ఈ ప్రక్రియను దేశంలోని ఇతర ఆరోగ్య కార్యక్రమాలకు కూడా విస్తరించడానికి అవకాశాలున్నాయి. ఐదవది-ఏ ప్రజారోగ్య కార్యక్రమం అయినా విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కీలకం. గతంలో పోలియో నిర్మూలనా కార్య క్రమం విజయవంతం చేసిన అనుభవంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని సమీకరించడంపై దృష్టి పెట్టాయి. స్థానికంగా ప్రభావితం చేయ గలిగే వ్యక్తులు, సంస్థలను భాగస్వామ్యం చేశాయి. డిజిటల్ స్ట్రాటజీ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, స్థానిక ప్రభుత్వాలను ఉత్సాహపరిచి డిమాండ్ సృష్టించారు. వ్యాక్సిన్ ఉత్పవాలు, మహోత్సవాల పేరుతో ప్రజల్ని చైతన్య పరిచారు. ప్రపంచవ్యాప్తంగా మరెంతో మంది ప్రజలకు టీకాలు అందేవరకూ మహమ్మారి మన వెనకే ఉందన్న విషయం మరిచిపోరాదు. నిరుపేద దేశాల్లో 3 శాతం లోపు ప్రజలకే ఇప్పటికి టీకా చేరువైంది. అదీ సింగిల్ డోస్ మాత్రమే. ఇంకా భారీ సంఖ్యలో వేగంగా టీకాలు ఉత్పత్తి చేయా ల్సిన అవసరం ఉంది. భారతదేశం ఈ విషయంలో ముందుంది. వ్యాక్సిన్ మైత్రి, కొవాక్స్ రూపంలో పేద దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇండియా ఒక ఆశ కల్పించింది. సంక్షోభ సమయాల్లో దేశాలు ఏం చేయగలవో చేసిచూపింది. బలమైన నాయకత్వం, ఆరోగ్య రంగంలో నిలకడగా పెట్టుబడి పెట్టడం, పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, తమ ప్రజలను అనారోగ్యం నుంచి కాపాడుకోవాలన్న ఆశయం కనిపించాయి. గడిచిన 18 నెలల్లో జరిగిన విషాదాలను, కష్టాలను తలుచుకుని బాధపడి ఏమీ చేయలేము. కానీ రానున్న 18 నెలలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉండగలమని నిరూపించాలి. బిల్ గేట్స్ కో–చైర్పర్సన్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ -
మహమ్మారిపై పోరులో మనమే ఆదర్శం
భారతదేశం టీకాల కార్యక్రమంలో అప్రతిహత విజయం సాధించింది. టీకాలు వేయడం ప్రారంభించిన తర్వాత కేవలం 9 నెలల్లో 2021 అక్టోబరు 21 నాటికి దేశవ్యాప్తంగా 100 కోట్ల టీకాల మైలురాయిని చేరుకుంది. కోవిడ్–19పై సమష్టి పోరులో.. ముఖ్యంగా 2020 తొలి నాళ్ల నాటి పరిస్థితుల దృష్ట్యా ఇదొక అత్యద్భుత విజయ ప్రస్థానం. దాదాపు వందేళ్ల తర్వాత మానవాళి ఇంతటి పెనువిపత్తును ఎదుర్కొనాల్సి వచ్చింది. పైగా ఈ వైరస్ గురించి ప్రపంచానికి ఏమాత్రం తెలి యదు. అలాంటప్పుడు పరిస్థితి ఎంత అనూహ్యంగా కనిపించిందో మనం గుర్తుచేసుకోవచ్చు. వేగంగా రూపాంతరం చెందుతున్న ఒక అపరిచిత, అదృశ్య శత్రువుతో మనం పోరాడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మన పయనం ఆందోళన నుంచి ఆనందానికి భరోసా దిశగా సాగి, జాతి మరింత బలంగా ఆవిర్భవించింది. ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో సాగిన టీకాల కార్యక్రమం ఇందుకు ప్రధానంగా దోహదం చేసింది. సమాజంలోని బహుళ వర్గాల కృషిని పోగు చేయడం నిజంగా ఓ భగీరథ ప్రయత్నమే. ఇది ఎంత భారీ ప్రయత్నమో తెలుసుకోవడానికి ఒక ఊహాత్మక అంచనాతో– ప్రతి టీకా వేయడానికి ఒక ఆరోగ్య కార్యకర్తకు 2 నిమిషాలు పట్టిందనుకుందాం. ఈ వేగంతో వెళ్తే ప్రస్తుత మైలురాయిని అందుకోవడానికి సుమారు 41 లక్షల పనిదినాలు లేదా 11వేల పని సంవత్సరాలు పడుతుంది! అయితే, ఏ ప్రయత్నంలోనైనా నిలవాలన్నా, వేగం నిలబెట్టుకోవాలన్నా భాగస్వాములందరి విశ్వాసం అత్యంత కీలకం. ఒకవైపు ప్రజల్లో అపనమ్మకం, భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు సాగినప్పటికీ టీకాలతోపాటు సంబంధిత ప్రక్రియపై జనంలో ఎంతో నమ్మకం ఏర్పడటం.. అదీ అమిత వేగంగా పుంజుకోవడమే ఈ కార్యక్రమ విజయానికి ఒక కారణం. కేవలం దైనందిన అవసరాలకైనా విదేశీ బ్రాండ్లను మాత్రమే విశ్వసించే వారు కొందరుంటారు. కానీ, కోవిడ్–19 టీకా విషయంలో మాత్రం భారత పౌరులు ‘మేడ్ ఇన్ ఇండియా’ టీకాలపై ఏకగ్రీవ ఆమోదముద్ర వేశారు. కచ్చితంగా ఇదొక వినూత్న మార్పు. జన భాగస్వామ్యం స్ఫూర్తితో ఉమ్మడి లక్ష్యం దిశగా ప్రభుత్వం, ప్రజలు ఏకోన్ముఖులై ముందడుగు వేస్తే దేశం ఎంతటి ఘన విజయాన్ని అందుకోగలదో భారత టీకాల కార్యక్రమం నిర్ద్వం ద్వంగా రుజువు చేసింది. భారతదేశం టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినపుడు మన 130 కోట్ల ప్రజానీకం సామర్థ్యాన్ని అనేకమంది తక్కువగా అంచనా వేశారు. పౌరులందరికీ టీకా ఇవ్వాలంటే కనీసం 3–4 సంవత్సరాలు పడుతుందని కొందరు జోస్యం కూడా చెప్పారు. టీకాలు తీసుకోవడానికి జనం ముందుకు రాబోరని ఇంకొందరు భవిష్యవాణి వినిపించారు. మరికొందరైతే టీకాల ప్రక్రియలో గందరగోళం, దుర్వినియోగం తప్పవని ఏకంగా అమంగళం పలికారు. ఇంకా కొందరు టీకాల సరఫరా ప్రక్రియ నిర్వహణ అసాధ్యమని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, ప్రజలు విశ్వసనీయ భాగస్వాములైతే జనతా కర్ఫ్యూ, తదుపరి దిగ్బంధ చర్యలు ఎంతటి సత్ఫలితాలిస్తాయో మనమంతా ప్రత్యక్షంగా చూశాం. కర్తవ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతను స్వీకరిస్తే అసాధ్యమంటూ ఏదీ ఉండదు. ఆ మేరకు మన ఆరోగ్య కార్యకర్తలు కొండలెక్కారు. నదులు దాటారు. అత్యంత దుర్గమమైన మారుమూల ప్రదేశాలకు వెళ్లి మరీ ప్రజలకు టీకాలు వేశారు. ఈ ఘనత సాధించడంలో మన యువతరం, సామాజిక కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, సామాజిక–ఆధ్యాత్మిక నాయకులు అందరూ భాగస్వాములే. ముఖ్యంగా ప్రపంచంలోని అగ్రదేశాల్లో టీకాలపై తలెత్తిన సందేహాల స్థాయితో పోలిస్తే మన దేశంలో అది అత్యంత స్వల్పం కావడం గమనార్హం. టీకాలు వేయడంలో తమకు ప్రాధాన్యం ఇవ్వడంపై భిన్నవర్గాల ప్రయోజనాల మధ్య తీవ్ర ఒత్తిడి తలెత్తింది. అయినప్పటికీ ప్రభుత్వం మన ఇతర పథకాల్లాగా టీకాల ప్రక్రియలో ‘వీఐపీ’ సంస్కృతికి తావేలేదని ఘంటాపథంగా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2020 తొలినాళ్లలో కోవిడ్–19 మహమ్మారి విజృంభించినపుడు, ఈ మహమ్మారిపై పోరాటంలో టీకాల తోడ్పాటే ప్రధాన ఆయుధం కాగలదని మాకు స్పష్టమైంది. తదనుగుణంగా ఆదినుంచీ సంసిద్ధత చర్యలు చేపట్టాం. అందులో భాగంగా నిపుణుల బృందాలను ఏర్పాటు చేసి 2020 ఏప్రిల్ నుంచే మార్గదర్శక రూపకల్పనకు శ్రీకారం చుట్టాం. నేటికీ ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే సొంతంగా టీకాలు రూపొందించుకున్నాయి. ఆ మేరకు 180కిపైగా దేశాలు ఇప్పటికీ పరిమిత ఉత్పత్తిదారుల సమూహంపై ఆధారపడి ఉన్నాయి. డజన్లకొద్దీ దేశాలు టీకాల సరఫరా కోసం ఎదురుచూస్తునే ఉన్నాయి. కానీ, భారతదేశం అంతలోనే 100 కోట్ల టీకా డోసుల మైలురాయిని అధిగమించింది! భారత్‌కు సొంత టీకా లేకపోవడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఇంత భారీ జనాభా కోసం టీకాలను ఎక్కడినుంచి తెచ్చుకోగలం? అందుకు ఎన్ని సంవత్సరాలు పట్టి ఉండేది? ఈ సందర్భంగా సకాలంలో స్పందించిన భారత శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలకే ఈ ఘనత చెందాలి. వారి ప్రతిభాపాటవాలు, కఠోరశ్రమతో భారత దేశం టీకాల విషయంలో నిజంగా ‘స్వయం సమృద్ధం’ కాగలిగింది. ఇంత భారీ జనసంఖ్య కోసం టీకాల డిమాండ్‌కు అనుగుణంగా మన టీకాల తయారీ దారులు ఎవరికీ తీసిపోని రీతిలో ఉత్పాదన పెంచుతున్నారు. దేశం ముందడుగు వేయడంలో ప్రభుత్వాలే నిరోధకాలన్న భావన నెలకొన్న మన దేశంలో మా ప్రభుత్వం తద్భిన్నంగా ప్రగతికి చోదకంగా, సమర్థ కారకంగా రూపుదాల్చింది. ఆదినుంచీ టీకాల తయారీదారులతో భాగస్వామ్యానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. వ్యవస్థాగత తోడ్పాటు, శాస్త్రీయ పరిశోధన, నిధుల లభ్యత సహా నియంత్రణ ప్రక్రియలను వేగవంతం చేయడం వంటి రూపాల్లో అండగా నిలిచింది. ‘సంపూర్ణ ప్రభుత్వం’ అన్నదే తారకమంత్రంగా మంత్రిత్వ శాఖలన్నీ ఒక్కతాటిపై నిలిచి, టీకా తయారీదారులకు ఎదురయ్యే అవరోధాలను తొలగిస్తూ వచ్చాయి. భారత్ వంటి సువిశాల దేశంలో టీకాలను కేవలం ఉత్పత్తి చేస్తే సరిపోదు. నిరంతర రవాణా సదుపాయంతోపాటు చివరి అంచెవరకూ చేర్చగల సామర్థ్యం కూడా ప్రధానమే. ఈ దిశగా సవాళ్లను అవగతం చేసుకోవడంలో భాగంగా ఒక టీకా బుడ్డీ ప్రయాణాన్ని ఒకసారి ఊహించుకుందాం. పుణే లేదా హైదరాబాద్‌లోని కర్మా గారం నుంచి ఆ బుడ్డీని ఏదైనా రాష్ట్రంలోని కూడలికి చేర్చాలి. అక్కడినుంచి జిల్లా కేంద్రంలోని కూడలికి, ఆపైన టీకాలు వేసే కేంద్రానికి అది చేరాలి. ఇందుకోసం విమానాలు, రైళ్లు వేలాది ట్రిప్పులు తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. పైగా ఈ మొత్తం ప్రయాణంలో కేంద్రీకృత పర్యవేక్షణలో నిర్ణీత ఉష్ణోగ్రతను నిర్వహించాల్సి ఉంటుంది. ఆ మేరకు దేశవ్యాప్తంగాగల లక్షకుపైగా శీతల నిల్వ పరికర సదుపాయాలను వాడుకున్నాం. టీకాల సరఫరా సమయం గురించి రాష్ట్రాలకు ముందస్తు సమాచారం ఇచ్చి, తద్వారా టీకాల కార్యక్రమంపై మెరుగైన సంసిద్ధతకు వీలు కల్పించాం. తదనుగుణంగా టీకాలు నిర్దేశిత రోజుల్లో వారికి చేరాయి. స్వతంత్ర భారతదేశంలో మునుపెన్నడూ ఎరుగని అకుంఠిత దీక్షకు ఇది నిదర్శనం. ఈ కృషి మొత్తానికీ వేగవంతమైన ‘కో–విన్’ వేదిక ఎంతగానో తోడ్పడింది. టీకాల కార్యక్రమం సమానంగా, అంచనాలకు–అనుసరణకు తగినట్లుగా, పారదర్శకంగా, వేగంగా సాగిపోవడంలో దీని పాత్ర అమోఘం. వరుస తప్పి రావడం, ఆశ్రిత పక్షపాతం వంటివాటికి ఇది తావులేకుండా చేసింది. ఓ పేద కార్మికుడు తొలి మోతాదును తన గ్రామంలో స్వీకరించి, నిర్దేశిత వ్యవధి తర్వాత అదే టీకా రెండో మోతాదును తాను పనిచేసే నగరంలో తీసుకునే వెసులుబాటు కలిగింది. దీంతోపాటు పారదర్శకతకు ఊతమిస్తూ ఎప్పటికప్పుడు ‘క్యూఆర్’ కోడ్ సహిత ధ్రువీకరణ పత్రాల జారీ కూడా పూర్తి చేయటం జరిగింది. భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోనే ఇలాంటి ఉదాహరణలు ఇంకెక్కడా లేవంటే అతిశయోక్తి కాబోదు. మన దేశం వేగంగా ముందడుగు వేస్తున్నదని, ఇందుకు ‘భారత జట్టు’ చోదకంగా ఉన్నదని నేను 2015లో నా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించాను. ఈ ‘భారత జట్టు’లో 130 కోట్లమంది భారతీయులూ సభ్యులే. ప్రజా భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలం. ఆ మేరకు 130 కోట్లమంది భారతీయుల భాగస్వామ్యంతో మన దేశాన్ని నడిపిస్తే ప్రతి క్షణానికీ భారత్ 130 కోట్ల అడుగులు ముందుకు వేస్తుంది. మన టీకాల కార్యక్రమం ఈ ‘భారత జట్టు’ సత్తాను మరోసారి ప్రపంచానికి ఘనంగా చాటింది. టీకాల కార్యక్రమంలో భారత్ విజయంతో ‘ప్రజాస్వామ్యం ప్రభావం చూపగలద’ని మొత్తం ప్రపంచానికి నేడు అవగతమైంది. ప్రపంచంలోనే అత్యంత భారీ టీకాల కార్యక్రమంలో మన విజయం యువతరంలో మరింత ఉత్తేజం నింపగలదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాగే మన ఆవిష్కర్తలు, అన్ని స్థాయిలలోని ప్రభుత్వ విభాగాలు ప్రజలకు సేవా ప్రదానంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పగలవని పూర్తిగా నమ్ముతున్నాను. ఇది మన దేశానికే కాదు, ప్రపంచానికే ఆదర్శప్రాయం కాగలదని నొక్కిచెబుతున్నాను. నరేంద్ర మోదీ భారత ప్రధాని