![Australian Open: Novak Djokovic Secure Medical Exemption Will Play - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/5/novak-djocovic.jpg.webp?itok=H0CYyfOh)
సెర్బియా టెన్నిస్ దిగ్గజం, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ అభ్యర్థనను ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నిర్వాహకులు మన్నించారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోకున్నా ఈనెల 17న మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు జోకోవిచ్‌కు అనుమతి ఇచ్చారు. తాను వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోలేదో జొకోవిచ్ ఇచ్చిన వివరణపట్ల టోర్నీ నిర్వాహకులు సంతృప్తి చెంది ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. ఈ విషయాన్ని జొకోవిచ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
అయితే, జొకోవిచ్‌కు ఈ మేరకు మినహాయింపు ఇవ్వడంపై సహచర ఆటగాళ్లు, నెటిజన్లు, మాజీ ప్లేయర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఆటగాళ్లంతా నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ వేయించుకుని బరిలోకి దిగుతుంటే.. అతడికి మాత్రం మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెన్నిస్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రెగ్ టైలీ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియన్ ఇమ్యూనైజేషన్ రిజస్టర్‌లో పేరు నమోదు చేయించుకున్న వాళ్లకు ఈ వెసలుబాటు ఉంటుందని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియన్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు ఆన్ ఇమ్యూనైజేషన్ మార్గదర్శకాల ప్రకారమే జొకోవిచ్‌కు మినహాయింపు లభించిందని చెప్పుకొచ్చాడు.
చదవండి: Nz Vs Ban: టెస్టు చాంపియన్‌ను మట్టికరిపించి.. బంగ్లాదేశ్ సరికొత్త రికార్డులు.. తొలిసారిగా
Comments
Please login to add a commentAdd a comment