ఆస్ట్రేలియా నుంచి వెనక్కి పంపడంపై జొకోవిచ్
మెల్‌బోర్న్: మూడేళ్ల క్రితం 2022 ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడేందుకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఆసీస్ గడ్డపై అడుగు పెట్టాడు. అయితే ఆ సమయంలో అమల్లో ఉన్న కోవిడ్ ఆంక్షల కారణంగా వ్యాక్సిన్ వేసుకున్న వారినే దేశంలోకి అనుమతించారు. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా జొకోవిచ్‌ను విమానాశ్రయంలోనే నిలిపి వేశారు. ఆ తర్వాత అతను కోర్టును ఆశ్రయించడం, ఇతర పరిణామాలు వేగంగా జరిగిపోయాయి.
చివరకు టోర్నీలో ఆడకుండానే జొకోవిచ్‌ను ఆ్రస్టేలియా దేశం నుంచి అధికారులు పంపించి వేశారు. నాటి ఘటన తనను ఇప్పటికీ వెంటాడుతోందని, ఆస్ట్రేలియాకు ఎప్పుడు వచ్చినా దానిని మర్చిపోలేకపోతున్నానని జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచే లక్ష్యంతో ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడేందుకు అతను ఇప్పుడు మళ్లీ వచ్చాడు. ‘నాటి ఘటన నాపై తీవ్ర ప్రభావం చూపించింది.
ఇప్పుడే కాదు గత రెండేళ్లుగా ఎప్పుడు ఆ్రస్టేలియాకు వచ్చినా అదే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. పాస్‌పోర్ట్, ఇమిగ్రేషన్ విభాగం నుంచి వద్ద తనిఖీలు జరుగుతుంటే నావైపు ఎవరైనా వస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. పాస్‌పోర్ట్‌ను చెకింగ్ చేస్తుంటే కూడా నన్ను రానిస్తారా, అదుపులోకి తీసుకుంటారా, వెనక్కి పంపిస్తారా అనే సందేహాలు వస్తుంటాయి’ అని జొకోవిచ్ అన్నాడు.
అయితే నిజాయితీగా చెప్పాలంటే నాటి సంఘటనకు సంబంధించి తనకు ఎవరీ మీదా కోపంగానీ, ప్రతీకార భావనగానీ లేదని అతను స్పష్టం చేశాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 10 సార్లు విజేతగా నిలిచిన జొకోవిచ్... గత ఏడాది సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు. అయితే రిటైరయ్యే లోగా ఇక్కడ కనీసం మరో టైటిల్ సాధించాలని కోరుకుంటున్నట్లు అతను చెప్పాడు.
బ్రిటన్ మాజీ ఆటగాడు ఆండీ ముర్రేను కోచ్‌గా ఎంచుకున్న తర్వాత జొకోవిచ్ ఆడనున్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇదే కానుంది. ఈనెల 12న ప్రారంభమయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ కోసం జొకోవిచ్ మంగళవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment