Djokovic: వ్యాక్సిన్‌ తీసుకోకపోయినా ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలో..! | Djokovic Might Play French Open Under New Covid Rules | Sakshi
Sakshi News home page

Djokovic: వ్యాక్సిన్‌ తీసుకోకపోయినా ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలో..!

Published Wed, Jan 26 2022 8:56 PM | Last Updated on Wed, Jan 26 2022 9:39 PM

Djokovic Might Play French Open Under New Covid Rules - Sakshi

Djokovic Might Play French Open 2022 : వ్యాక్సిన్‌ తీసుకోని కారణంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయిన ప్రపంచ నంబర్‌ 1 ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌.. త్వరలో ప్రారంభంకానున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్‌ ప్రభుత్వం కోవిడ్‌ వ్యాక్సిన్‌ నిబంధనలను సడలించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫ్రాన్స్‌లో మహమ్మారి వైరస్‌ అదుపులోకి వస్తున్న నేపథ్యంలో నిబంధనలను సడలించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

ఆరు నెలల క్రితం పాజిటివ్‌ వచ్చిన వారు ఫ్రాన్స్‌లో ఎంట్రీకి తప్పనిసరి వ్యాక్సిన్‌ పాస్‌ చూపాల్సిన అవసరం లేదని ఫ్రాన్స్‌ అధికారులు ప్రకటించారు. దీంతో జకో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఎంట్రీకి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. కాగా, జకో గతేడాది డిసెంబర్‌లో కరోనా బారినపడినట్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సందర్భంగా వెల్లడించిన విషయం తెలిసిందే. 
చదవండి: టీమిండియా క్రికెటర్‌పై చేయి చేసుకున్న పెద్దాయన..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement