Australian Open
-
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఊహించని సంఘటన.. జొకోవిచ్ గుడ్‌బై చెప్పేస్తాడా?
వయసుతో సంబంధం లేకుండా ఆడుతూ టెన్నిస్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన 37 ఏళ్ళ నోవాక్ జొకోవిచ్ చివరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో ప్రేక్షకుల నిరసనల మధ్య నిష్క్రమించడం చాలా బాధాకరం. శుక్రవారం అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జరిగిన సెమీఫైనల్లో మొదటి సెట్‌ను కోల్పోయిన తర్వాత ఎడమ కాలిలో కండరాల నొప్పుల కారణంగా నిష్క్రమిస్తున్నట్టు జొకోవిచ్ ప్రకటించాడు. జొకోవిచ్ తొలి సెట్ ను 7-6 (5) తేడాతో కోల్పోయిన అనంతరం నెట్ చుట్టూ నడిచి జ్వెరెవ్‌కు కరచాలనం చేసి ఓటమి అంకీకరిస్తూ ప్రేక్షకులకు అభివాదం చేసి వెనుదిరిగాడు.సెర్బియా కు చెందిన జొకోవిచ్ మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రారంభంలో ఒక సెట్ ని కోల్పోయినప్పటికీ మూడో సీడ్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ విసిరిన సవాలును గట్టిగా ఎదుర్కొని 4-6, 6-4, 6-3, 6-4 తేడాతో విజేత గా నిలిచి సెమీఫైనల్ కి దూసుకెళ్లాడు.రికార్డు స్థాయిలో తన పదకొండవ ఆస్ట్రేలియన్ ఓపెన్ కిరీటాన్ని గెలుచుకోవడానికి జొకోవిచ్ తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ చివరికి ఒక అడుగు దూరంలో గాయం కారణంగా తలొగ్గాల్సింది. జొకోవిచ్ మళ్ళీ క్వార్టర్ ఫైనల్స్ ఆడిన రీతిలోనే అదే స్పూర్తితో ఆడి గెలుపొంది ఫైనల్ కి దూసుకెళ్తాడని ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రేక్షకులు ఆశించారు. ఇందుకోసం వారంతా ఏంటో ఖర్చు పెట్టి స్టేడియం కి వచ్చారు. అయితే జొకోవిచ్ ఈ రీతి లో వైదొలగడం వారికి ఎంతో నిరాశ పరిచింది. మ్యాచ్ అనంతరం జొకోవిచ్ మాట్లాడుతూ, జెరెవ్ కు శుభాకాంక్షలు చెప్పాడు. “సాషాకు శుభాకాంక్షలు, అతను తన మొదటి స్లామ్‌కు సాధించడానికి సంపూర్ణంగా అర్హుడు," అని కితాబు ఇచ్చాడు. గత సంవత్సరం కూడా జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో సెమీఫైనల్ దశలోనే నిష్క్రమించడం గమనార్హం. 2017 తర్వాత మొదటిసారిగా జొకోవిచ్ ఒక గ్రాండ్ స్లాం కూడా గెలవక పోవడం ఇదే మొదటి సారి. అయితే జొకోవిచ్ గత ఏడాది ఒలింపిక్ స్వర్ణం సాధించడం విశేషం.ఈ ఏడాదిలో తనకెంతో ఇష్టమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మరోసారి సెమిస్ స్థాయి నుంచే వైదొలగడం తో ఇంక జొకోవిచ్ కూడా తన చిరకాల ప్రత్యర్థులైన ఫెదరర్, రాఫెల్ నాదల్ లాగానే త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అతని అభిమానులు భావిస్తున్నారు. గత కొంత కాలంగా జొకోవిచ్ తండ్రి అతనిని రిటైర్మెంట్ ప్రకటించమని ఒత్తిడి చేస్తుండటం గమనార్హం."గత కొంత కాలంగా నన్ను టెన్నిస్ నుంచి రిటైర్ చేయించడానికి నాన్న ప్రయత్నిస్తున్నారు. టెన్నిస్ లో ఇంకా ఏమి సాధించాలని భావిస్తున్నావ్" అని అయన ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘంగా టెన్నిస్ ఆడటం వల్ల అది అతని శరీరం పై ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే జొకోవిచ్ ని అతని తండ్రి రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి చేసున్నానడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకోవడంతో జొకోవిచ్ పై మరింత ఒత్తిడి పెరుగుతుందనడంలో సందేహం లేదు. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రేక్షకులు జొకోవిచ్ వంటి అరుదైన ఆటగాడిని ఆ విధంగా గేలి చేయడం మాత్రం ఏ విధంగా సమర్థనీయం కాదు. -
ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరిన సిన్నర్..
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మెన్స్ సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ టెన్నిస్ నెం1 జానిక్ సిన్నర్(Jannik Sinner) అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అమెరికా టెన్నిస్ ఆటగాడు బెన్ షెల్టాన్‌ను 7-6(7/2), 6-2, 6-2 తేడాతో ఓడించిన సిన్నర్.. వరుసగా రెండో సారి తన ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాడు.అంతకుముందు జరిగిన మరో సెమీఫైనల్లో గాయం కారణంగా సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్(Novak Djokovic) గాయం కారణంగా తప్పకోవడంతో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఫైనల్‌కు చేరాడు. ఈ క్రమంలో ఆదివారం(జనవరి 27) జరగనున్న ఫైనల్ పోరులో జానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరెవ్ పోటీపడనున్నారు.కాగా ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న జానిక్ సిన్నర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్స్‌కు వరుసగా రెండో సారి ఆర్హత సాధించిన తొలి ఇటాలియన్ టెన్నిస్ ప్లేయర్‌గా సిన్నర్ నిలిచాడు.గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్లను సొంతం చేసుకున్న సిన్నర్.. నోవాక్ జొకోవిచ్ వెనక్కి నెట్టి నెం1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. మెన్స్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో సిన్నర్ ప్రస్తుతం అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు.చదవండి: Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి జొకొవిచ్ అవుట్.. కారణం ఇదే! -
ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి జొకొవిచ్ అవుట్.. కారణం ఇదే!
ఆస్టేలియా ఓపెన్-2025(Australian Open 2025) టోర్నమెంట్లో సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకొవిచ్(Novak Djokovic) ప్రయాణం ముగిసింది. గాయం కారణంగా శుక్రవారం నాటి సెమీ ఫైనల్ మ్యాచ్ మధ్యలోనే అతడు వైదొలిగాడు. తద్వారా టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా నిలవాలన్న జొకొవిచ్ కలకు బ్రేక్ పడింది.కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రికార్డుస్థాయిలో ఏకంగా పది సార్లు టైటిల్ సాధించిన ఘనత జొకొవిచ్ సొంతం. కేవలం గతేడాది మాత్రమే అతడు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సెమీ ఫైనల్లో ఓడిపోయాడు. అయితే, ఈసారి మాత్రం మరింత జాగ్రత్తగా అడుగులు వేసిన జొకొవిచ్‌కు గాయం రూపంలో దురదృష్టం ఎదురైంది.అల్కరాజ్ అడ్డంకిని అధిగమించిక్వార్టర్ ఫైనల్లో.. తనకు ప్రధాన అడ్డంకిగా భావించిన అల్కరాజ్తో హోరాహోరీ పోటీలో గెలుపొందిన జొకొవిచ్ సెమీస్‌కు దూసుకువచ్చాడు. ఈ క్రమంలో జర్మన్ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్(Alexander Zverev)తో సెమీ ఫైనల్లో తలపడ్డాడు. ఇందులో భాగంగా తొలి సెట్‌ను జ్వెరెవ్ 7-6తో గెలుచుకున్నాడు.పోటీ నుంచి తప్పుకొంటున్నాఅయితే, ఆ వెంటనే నెట్ దగ్గరికి వెళ్లిన జొకొవిచ్ జ్వెరెవ్‌తో కరచాలనం చేసి.. తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. దీంతో సెమీస్ విజేతగా నిలిచిన జ్వెరెవ్ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టాడు. కాగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ జొకొవిచ్ కాలి నొప్పితో ఇబ్బంది పడినట్లు కనిపించాడు. తాజాగా సెమీస్ మ్యాచ్‌లో బాధ భరించలేక వైదొలిగాడు.ఈ నేపథ్యంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేసిన కారణంగానే ఈ సెర్బియా స్టార్ గాయపడ్డాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. రిటైర్మెంట్కు చేరువైన 37 ఏళ్ల నొవాక్ జొకొవిచ్ తాజా గాయం వల్ల.. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవకుండానే ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించడం గమనార్హం.జొకొవిచ్‌కు చేదు అనుభవంసెమీ ఫైనల్ బరి నుంచి తప్పించుకుని కోర్టును వీడుతున్న సమయంలో నొవాక్ జొకొవిచ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది ప్రేక్షకులు అతడి గాయం గురించి హేళన చేసేలా మాట్లాడుతూ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జ్వెరెవ్ తన ప్రత్యర్థి ఆటగాడికి మద్దతుగా నిలిచాడు.జ్వెరెవ్ క్రీడాస్ఫూర్తి‘‘గాయం వల్ల కోర్టును వీడిన వ్యక్తిని అవమానించేలా మాట్లాడటం సరికాదు. దయచేసి కాస్త సంయమనం పాటించండి. మీలో ప్రతి ఒక్కరు టికెట్ల కోసం డబ్బులు చెల్లించారని తెలుసు. కాబట్టి ఐదు సెట్ల మ్యాచ్‌ను చూడాలని ఆశించడం మీ హక్కు.కానీ పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. గత ఇరవై ఏళ్లుగా ఆట కోసం తన సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి నొవాక్ జొకొవిచ్. దయచేసి అతడిని ఏరకంగానూ హేళన చేయకండి’’ అని జ్వెరెవ్ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు.చదవండి: Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం -
సబలెంకా X కీస్
మెల్బోర్న్: ‘హ్యాట్రిక్’ ఘనత సాధించేందుకు సబలెంకా... కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం చేసుకునేందుకు మాడిసన్ కీస్... ఒక్క విజయం దూరంలో నిలిచారు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బెలారస్ స్టార్ సబలెంకా వరుసగా మూడో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లగా... అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్ తొలిసారి టైటిల్ పోరుకు అర్హత పొందింది. గురు వారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ సబలెంకా 6–4, 6–2తో 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్)పై నెగ్గగా... 19వ సీడ్ మాడిసన్ కీస్ 5–7, 6–1, 7–6 (10/8)తో రెండో సీడ్, ఐదు సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించింది. శనివారం జరిగే ఫైనల్లో సబలెంకా, కీస్ అమీతుమీ తేల్చుకుంటారు. 2023, 2024లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సబలెంకాకు సెమీఫైనల్లో తన ప్రత్యర్థి బదోసా నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా 32 వినర్స్ కొట్టి, బదోసా సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు బదోసా నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 15 అనవసర తప్పిదాలు చేసిన ఈ స్పెయిన్ ప్లేయర్ కేవలం ఒకసారి మాత్రమే సబలెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. స్వియాటెక్‌తో 2 గంటల 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కీస్ నిర్ణాయక మూడో సెట్లోని 12వ గేమ్‌లో మ్యాచ్ పాయింట్ కాపాడుకుంది. 6–5తో ఆధిక్యంలో నిలిచిన స్వియాటెక్ తన సర్వీస్‌లో 40–30తో విజయం అంచుల్లో నిలిచింది. అయితే స్వియాటెక్ వరుసగా మూడు తప్పిదాలు చేసి తన సర్వీస్‌ను కోల్పోయింది. దాంతో స్కోరు 6–6తో సమమైంది. ఫలితంగా విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ అనివార్యమైంది. తొలుత 10 పాయింట్లు సాధించిన వారికి విజయం ఖరారయ్యే ఆఖరి సెట్ టైబ్రేక్‌లో రెండుసార్లు స్వియాటెక్ 5–3తో, 7–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ కీస్ పట్టుదల కోల్పోకుండా పోరాడి చివరకు 10–8తో టైబ్రేక్‌లో నెగ్గి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. 2017లో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన కీస్ రెండో ‘గ్రాండ్’ అవకాశంలోనైనా విజేతగా నిలుస్తుందో లేదో వేచి చూడాలి. నేడు జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో జ్వెరెవ్ (జర్మనీ)తో జొకోవిచ్ (సెర్బియా); బెన్షెల్టన్ (అమెరికా)తో యానిక్ సినెర్ (ఇటలీ) తలపడతారు. -
సెమీస్‌లో స్వియాటెక్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో స్టార్ ప్లేయర్లు ఇగా స్వియాటెక్ (పోలాండ్), యానిక్ సినెర్ (ఇటలీ) తమ దూకుడు కొనసాగిస్తున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ స్వియాటెక్ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ వరుస సెట్లలో నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సినెర్ కూడా వరుస సెట్లలో తన ప్రత్యర్థిని చిత్తు చేశాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–1, 6–2తో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)పై గెలిచింది. 89 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ కేవలం మూడు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. నవారో సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన స్వియాటెక్ 22 విన్నర్స్ కొట్టింది. మరో క్వార్టర్ ఫైనల్లో 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 3–6, 6–3, 6–4తో స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించి మూడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో బదోసా (స్పెయిన్)తో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్); కీస్‌తో స్వియాటెక్ తలపడతారు. షెల్టన్ తొలిసారి... పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ యానిక్ సినెర్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా మరో అడుగు వేయగా... అమెరికా రైజింగ్ స్టార్ బెన్ షెల్టన్ తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–3, 6–2, 6–1తో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)పై... షెల్టన్ 6–4, 7–5, 4–6, 7–6 (7/4)తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలుపొందారు. డిమినార్తో 1 గంట 48 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో సినెర్‌కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. 27 వినర్స్ కొట్టిన సినెర్... ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. -
తగ్గేదేలే...
టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించేందుకు నొవాక్ జొకోవిచ్ రెండు విజయాల దూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ సెర్బియా దిగ్గజం 12వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. రికార్డుస్థాయిలో 10 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన జొకోవిచ్ కేవలం గత ఏడాది మాత్రమే తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లో ఓడిపోయాడు. గత ఏడాది వింబుల్డన్ టోర్నీలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డు నెలకొల్పేందుకు జొకోవిచ్‌కు అవకాశం లభించింది. కానీ తుదిపోరులో స్పెయిన్ యువతార కార్లోస్ అల్కరాజ్ అద్వితీయ ఆటతీరుతో జొకోవిచ్ ఆశలను వమ్ము చేశాడు. తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్లోనే ‘గ్రాండ్’ రికార్డు అందుకోవాలనే లక్ష్యంతో జొకోవిచ్ ఈసారి పక్కా ప్రణాళికతో వచ్చాడు. గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన బ్రిటన్ స్టార్, తన చిరకాల ప్రత్యర్థి ఆండీ ముర్రేను కోచ్‌గా నియమించుకున్నాడు. ముర్రే నియామకం సరైనదేనని ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ ఆటతీరును పరిశీలిస్తే తెలుస్తోంది. క్వార్టర్ ఫైనల్లో పెద్ద అడ్డంకి అల్కరాజ్ను నాలుగు సెట్ల పోరులో జొకోవిచ్ అధిగమించాడు. సెమీఫైనల్లో జొకోవిచ్ జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ రూపంలో మరో కీలక పరీక్షకు సిద్ధంకానున్నాడు. అయితే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జ్వెరెవ్‌తో పోటీపడ్డ మూడుసార్లూ జొకోవిచే గెలుపొందడం గమనార్హం. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 2023, 2024లలో విజేతగా నిలిచిన సబలెంకాకు ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్లో గట్టిపోటీ ఎదురైంది. అయితే సబలెంకా తన ఆధిపత్యం చాటుకొని ‘హ్యాట్రిక్’ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. మెల్బోర్న్: ‘ఈసారి కాకపోతే మరెప్పుడూ కాదు’ అన్న తరహాలో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తన శక్తినంతా ధారపోస్తూ, అపార అనుభవాన్ని రంగరిస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పోరాడుతున్నాడు. 37 ఏళ్ల వయస్సులో రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోవాలనే పట్టుదలతో మెల్బోర్న్లో అడుగు పెట్టిన జొకోవిచ్ ఎంతో ప్రమాదకరమైన అల్కరాజ్ అడ్డంకిని దాటేశాడు. కొత్త కోచ్ ఆండీ ముర్రే రచించిన వ్యూహాలను కోర్టులో అమలు చేసిన జొకోవిచ్... నాలుగు సెట్లలో స్పెయిన్ స్టార్ అల్కరాజ్ ఆట కట్టించేశాడు. 12వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ జొకోవిచ్ 4–6, 6–4, 6–3, 6–4తో మూడో సీడ్ అల్కరాజ్ను ఓడించాడు. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఆట అబ్బురపరిచింది. జొకోవిచ్‌ను నిలువరించేందుకు 21 ఏళ్ల అల్కరాజ్ అన్ని అస్త్రాలను ప్రయోగించినా...సెర్బియా స్టార్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. ర్యాలీ హోరాహోరీగా సాగుతుంటే హఠాత్తుగా దానిని డ్రాప్ షాట్‌గా మలిచి పాయింట్లు నెగ్గడం అల్కరాజ్కు అలవాటు. అయితే ఈసారి అల్కరాజ్ ఈ ‘డ్రాప్ షాట్’ల వ్యూహానికి పక్కాగా సిద్ధమై వచ్చిన జొకోవిచ్ సమర్థంగా అడ్డుకున్నాడు. 54 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో మూడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌లను అల్కరాజ్ బ్రేక్ చేశాడు. అదే జోరులో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ కోల్పోవడంతో జొకోవిచ్పై ఒత్తిడి పెరిగింది. అయితే ఒత్తిడిలోనే జొకోవిచ్లోని మేటి ఆటగాడు మేల్కొన్నాడు. అల్కరాజ్ కంటే అద్భుతంగా ఆడుతూ ముందుకు వెళ్లాడు. రెండో సెట్లోని రెండో గేమ్‌లోనే అల్కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని 3–0తో ఆధిక్యంలో వచ్చాడు. అయితే పట్టువదలకుండా పోరాడిన అల్కరాజ్ ఐదో గేమ్‌లోనే జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 3–3తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకున్నారు. అయితే పదో గేమ్‌లో అల్కరాజ్ సర్వీస్‌లో ఒక్కసారిగా దూకుడు పెంచిన జొకోవిచ్ ఒక్క అవకాశం ఇవ్వకుండా సర్వీస్‌ను బ్రేక్ చేసి 50 నిమిషాల్లో రెండో సెట్‌ను నెగ్గాడు. మూడో సెట్లో కూడా ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. ఆరో గేమ్‌లో అల్కరాజ్ సర్వీస్‌ను జొకోవిచ్ బ్రేక్ చేయగా... ఏడో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను అల్కరాజ్ బ్రేక్ చేశాడు. ఎనిమిదో గేమ్‌లో మళ్లీ అల్కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని 50 నిమిషాల్లో సెట్‌ను 6–3తో దక్కించుకున్నాడు. నాలుగో సెట్లోని తొలి గేమ్‌లోనే అల్కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన అన్ని సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని అందుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 3 గంటల 28 నిమిషాల్లో 7–6 (7/1), 7–6 (7/0), 2–6, 6–1తో 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా)పై గెలిచి మూడోసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఫైనల్లో చోటు కోసం జొకోవిచ్‌తో జ్వెరెవ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 8–4తో జ్వెరెవ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో వీరిద్దరు మూడుసార్లు (2021 యూఎస్ ఓపెన్ సెమీఫైనల్; 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్; 2019 ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్) పోటీపడగా... మూడుసార్లూ జొకోవిచే గెలిచాడు. వరుసగా 19వ విజయంతో... మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సబలెంకా (బెలారస్), 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ సబలెంకా 6–2, 2–6, 6–3తో 27వ సీడ్ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా)పై, బదోసా 7–5, 6–4తో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా)పై గెలిచి సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సబలెంకాకిది వరుసగా 19వ విజయం కావడం విశేషం. వరుసగా రెండేళ్లు (2023, 2024) ఈ టోర్నీలో విజేతగా నిలిచిన సబలెంకా ఈసారీ టైటిల్ సాధిస్తే మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్; 1997, 1998, 1999) తర్వాత ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందుతుంది. పావ్లీచెంకోవాతో ఒక గంట 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా 29 విన్నర్స్ కొట్టింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. బదోసాతో ఒక గంట 43 నిమిషాలపాటు జరిగిన పోరులో కోకో గాఫ్ 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. కోకో గాఫ్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన బదోసా ఈ గెలుపుతో తన కెరీర్లో ఆడుతోన్న 20వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో లొరెంజో సొనెగో (ఇటలీ)తో బెన్ షెల్టన్ (అమెరికా); అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)తో యానిక్ సినెర్; మహిళల సింగిల్స్ రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో మాడిసన్ కీస్ (అమెరికా)తో స్వితోలినా (ఉక్రెయిన్); ఎమ్మా నవారో (అమెరికా)తో ఇగా స్వియాటెక్ (పోలాండ్) తలపడతారు. బోపన్న జోడీ ఓటమి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–షుయె జాంగ్ (చైనా) జోడీ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షుయె జాంగ్ ద్వయం 6–2, 4–6, 9–11తో జాన్ పీర్స్–ఒలివియా గడెస్కీ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది.50 ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధికంగా 50 సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో పురుష సింగిల్స్ సెమీఫైనల్ చేరిన తొలి క్రీడాకారుడిగా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. ఆల్‌టైమ్ రికార్డు క్రిస్ ఎవర్ట్ (52 సార్లు; అమెరికా) పేరిట ఉంది. -
స్వియాటెక్ ఫటాఫట్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తన ప్రత్యర్థికి కేవలం ఒక్క గేమ్ మాత్రమే ఇచ్చి ఈ మాజీ నంబర్‌వన్ విజయాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ స్వియాటెక్ 6–0, 6–1తో ఇవా లిస్ (జర్మనీ)పై గెలిచి ఈ టోర్నీలో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. వరుసగా ఏడోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న 23 ఏళ్ల స్వియాటెక్ 2022లో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇవా లిస్తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వియాటెక్ మూడు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. మూడో రౌండ్లో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లోనూ ఒక్క గేమ్ మాత్రమే చేజార్చుకున్న స్వియాటెక్... రెబెకా స్రామ్కోవా (స్లొవేనియా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)తో స్వియాటెక్ తలపడుతుంది. కీస్ సంచలనం మరోవైపు టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన ఆరో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్‌కే పరిమితమైంది. అమెరికా ప్లేయర్, 19వ సీడ్ మాడిసన్ కీస్ 6–3, 1–6, 6–4తో రిబాకినాపై సంచలన విజయం సాధించి నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 28వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–1తో కుదెర్మెటోవా (రష్యా)పై, ఎమ్మా నవారో 6–4, 5–7, 7–5తో తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. 12వసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న స్వితోలినా మూడోసారి క్వార్టర్ ఫైనల్ చేరగా... నవారో తొలిసారి ఈ ఘనత సాధించింది. సినెర్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 13వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ ఇటలీ స్టార్ 6–3, 3–6, 6–3, 6–2తో గెలుపొందాడు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ 14 ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన సినెర్ ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా) 6–0, 7–6 (7/5), 6–3తో మికిల్సన్ (అమెరికా)పై, లొరెంజో సొనెగో (ఇటలీ) 6–3, 6–2, 3–6, 6–1తో క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ (అమెరికా)పై విజయం సాధించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)తో జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్ (అమెరికా) 7–6 (7/3), 6–7 (3/7), 7–6 (7/2), 1–0తో ఆధిక్యంలో ఉన్నదశలో మోన్ఫిల్స్ గాయంతో వైదొలిగాడు. దాంతో బెన్ షెల్టన్ రెండోసారి ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. -
స్టార్ టెన్నిస్ ప్లేయర్‌కు షాక్.. అతిగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా
స్టార్ టెన్నిస్ ప్లేయర్, 2021 యూఎస్ ఓపెన్ ఛాంపియన్ డానిల్ మెద్వెదెవ్కు (రష్యా) షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెన్-2025 సందర్భంగా అతి చేసినందుకు గానూ మెద్వెదెవ్కు భారీ జరిమానా విధించారు నిర్వహకులు. మెద్వెదెవ్.. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్లో నిష్క్రమించాడు. రెండు రౌండ్లలో మెద్వెదెవ్ చాలా దురుసగా ప్రవర్తించాడు. ఇందుకు గానూ 76,000 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానాను ఎదుర్కొన్నాడు. తొలి రౌండ్ లో మెద్వెదెవ్.. 418 ర్యాంక్ కసిడిట్ సామ్రెజ్ పై విజయం సాధించాడు. గెలుపు అనంతరం విజయోత్సవ సంబురాల్లో భాగంగా పలు మార్లు తన రాకెట్‌తో నెట్ కెమెరాను బాదాడు. ఇలా చేసినందుకు గానూ క్రమశిక్షణ చర్యల కింద అతనికి 10 వేల ఆసీస్ డాలర్ల జరిమానా విధించారు. మరోసారి ఇలా ప్రవర్తించకూడదని ఘాటుగా హెచ్చరించారు.Daniil Medvedev was fined $76,000 at this year’s Australian Open.$10k for hitting the camera with his racquet during the 1st round.$66k for his behavior during his match against Tien & not attending press. His total winnings were $124k.pic.twitter.com/bDQ4aj064j— The Tennis Letter (@TheTennisLetter) January 18, 2025నిర్వహకులు సీరియస్ వార్నింగ్ ఇచ్చినా మెద్వెదెవ్ తీరు ఏ మాత్రం మారలేదు. రెండో రౌండ్ మ్యాచ్‌లోనూ అలానే ప్రవర్తించాడు. ఈ రౌండ్ లో 19 ఏళ్ల అమెరికా కుర్రాడు, క్వాలిఫయర్ లెర్నర్ టీన్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న మెద్వెదెవ్.. ఓటమి అనంతరం సహనం కోల్పోయి రాకెట్‌ను నేలకేసి బాదాడు. బంతిని కూడా బ్యాక్ వాల్ కేసి కొట్టాడు. తన రాకెట్ బ్యాగ్‌ను విసిరేశాడు. మరోసారి కెమెరాపై తన ప్రతాపాన్ని చూపాడు.మెద్వెదెవ్ ఓవరాక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న నిర్వహకులు ఈసారి 66 వేల ఆసీస్ డాలర్ల జరిమానా విధించారు. అలా మొత్తంగా రెండు రౌండ్లలో మెద్వెదెవ్ 76 వేల డాలర్ల జరిమానాను ఎదుర్కొన్నాడు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.40 లక్షలు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొన్నందుకు గానూ మెద్వెదెవ్కు 1,24,000 ఆసీస్ డాలర్లు ప్రైజ్‌మనీ లభిస్తుంది. దీంట్లో సగానికి పైగా అతను జరిమానా కింద కోల్పోయాడు.కాగా, 2021, 2022, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో భంగపడ్డ మెద్వెదెవ్.. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలతో బరిలో దిగాడు. కానీ మరోసారి అతడికి నిరాశే ఎదురైంది. -
సబలెంకా సాఫీగా...
మ్యాచ్ మ్యాచ్‌కూ తన రాకెట్ పదును పెంచుతున్న బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకా ధాటికి ప్రత్యర్థులు తేలిపోతున్నారు. కచ్చితంగా గట్టిపోటీ ఇస్తారనుకుంటే... సబలెంకా ముందు వారు ఎదురు నిలువలేకపోతున్నారు. దాంతో సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా నాలుగో విజయంతో డిఫెండింగ్ చాంపియన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఒక్క సెట్ కూడా కోల్పోకుండా నెగ్గిన సబలెంకాకు క్వార్టర్ ఫైనల్లో రష్యా సీనియర్ ప్లేయర్ అనస్తాసియా పావ్లీచెంకో ఏమేరకు పోటీనిస్తుందో వేచి చూడాలి. వరుసగా 17వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న 27వ సీడ్ పావ్లీచెంకోవా ఇప్పటి వరకు మూడుసార్లు క్వార్టర్ ఫైనల్ చేరుకొని ముందంజ వేయలేకపోయింది. ఈ టోర్నీలో ఆమె తొలిసారి సెమీఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మెల్బోర్న్: ‘హ్యాట్రిక్’ టైటిల్ లక్ష్యం దిశగా ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా ఇంకో అడుగు వేసింది. 2023, 2024లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన సబలెంకా ఈసారీ టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 6–1, 6–2తో రష్యా రైజింగ్ స్టార్, 14వ సీడ్ మిరా ఆంద్రీవాపై అలవోకగా గెలిచింది. 62 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా కేవలం మూడు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. మూడు ఏస్‌లు సంధించిన సబలెంకా ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. 15 విన్నర్స్ కొట్టిన ఆమె 11 అనవసర తప్పిదాలు చేసింది. ఆంద్రీవా సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన సబలెంకా తన సర్వీస్‌ను ఒక్కసారీ చేజార్చుకోలేదు. నెట్ వద్దకు దూసుకొచ్చిన నాలుగుసార్లూ సబలెంకా పాయింట్లు నెగ్గడం విశేషం. మరోవైపు ఆంద్రీవా మూడు డబుల్ ఫాల్ట్‌లు, 18 అనవసర తప్పిదాలు చేసింది. సబలెంకాతోపాటు మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్), 27వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కోకో గాఫ్ 5–7, 6–2, 6–1తో బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)పై కష్టపడి గెలుపొందగా... బదోసా 6–1, 7–6 ((7/2)తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై, పావ్లీచెంకోవా 7–6 (7/0), 6–0తో 18వ సీడ్ డోనా వెకిచ్ (క్రొయేషియా)పై వరుస సెట్లలో నెగ్గారు. బోపన్న జోడీకి ‘వాకోవర్’ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న–షుయె జాంగ్ (చైనా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బోపన్న–షుయె జాంగ్‌లతో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆడాల్సిన నాలుగో సీడ్ ద్వయం హుగో న్యాస్ (మొనాకో)–టేలర్ టౌన్సెండ్ (అమెరికా) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో బోపన్న–షుయె జాంగ్ కోర్టులో అడుగు పెట్టకుండానే క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. తిమియా బాబోస్ (హంగేరి)–మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్); ఒలివియా గడెస్కీ–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడీల మధ్య మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షుయె జాంగ్ జంట తలపడుతుంది. తొలి రౌండ్లో బోపన్న–షుయె జాంగ్ 6–4, 6–4తో క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)లపై గెలిచారు. గత ఏడాది పురుషుల డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్తో కలిసి టైటిల్ నెగ్గిన బోపన్న ఈ ఏడాది మాత్రం కొత్త భాగస్వామి బారింటోస్ (కొలంబియా)తో కలిసి పోటీపడి తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. జొకోవిచ్ 15వసారి...పురుషుల సింగిల్స్ విభాగంలో 10 సార్లు చాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ 15వసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. చెక్ రిపబ్లిక్ ప్లేయర్, 24వ సీడ్ జిరీ లెహెస్కాతో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–4, 7–6 (7/4)తో విజయం సాధించాడు. 2 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. లెహెస్కా 11 ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 27 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ 21 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు జొకోవిచ్కంటే ఎక్కువ వినర్స్ (39) కొట్టిన లెహెస్కా ఏకంగా 44 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. లెహెస్కా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. నెట్ వద్దకు జొకోవిచ్ 18 సార్లు వచ్చి 16 సార్లు పాయింట్లు సాధించగా... లెహెస్కా 26 సార్లు ముందుకొచ్చి 18 సార్లు పాయింట్లు నెగ్గాడు. క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్తో ‘ఢీ’ రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన జొకోవిచ్‌కు క్వార్టర్ ఫైనల్లో అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. గత ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు నెగ్గిన స్పెయిన్ స్టార్, మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్తో క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ తలపడనున్నాడు. అల్కరాజ్తో ముఖాముఖిగా ఏడుసార్లు పోటీపడ్డ జొకోవిచ్ నాలుగుసార్లు నెగ్గి, మూడుసార్లు ఓడిపోయాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాత్రం వీరిద్దరు తొలిసారి తలపడనున్నారు. ఆదివారమే జరిగిన ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–1, 2–6, 6–3, 6–2తో 14వ సీడ్ ఉగో హంబెర్ట్ (ఫ్రాన్స్)పై, 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 6–1, 6–1, 6–1తో డేవిడోవిచ్ ఫొకీనా (స్పెయిన్)పై నెగ్గారు. 15వ సీడ్ జేక్ డ్రేపర్ (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లో అల్కరాజ్ 7–5, 6–1తో రెండు సెట్లు గెలిచాక అతని ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగాడు. -
సినెర్, స్వియాటెక్ అలవోకగా...
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో కొందరు సీడెడ్ ప్లేయర్లకు అనూహ్య పరాజయాలు ఎదురవుతుంటే... టాప్ స్టార్లు అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... వీరికి దీటుగా యువ క్రీడాకారులు సైతం మేటి ఆటగాళ్లను ఢీకొట్టి మరీ మూడో రౌండ్‌ను దాటేశారు. క్వాలిఫయర్ లెర్నర్ టియెన్, 22 ఏళ్ల మిచెల్సన్ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లో ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.మెల్బోర్న్: పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ఇటలీ స్టార్ యానిక్ సినెర్...మహిళల విభాగంలో ఫ్రెంచ్ ఓపెన్ ‘హ్యాట్రిక్’ చాంపియన్, పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో స్వియాటెక్‌తో పాటు ఆరో సీడ్ ఎలినా రిబాకినా (కజకిస్తాన్), ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా), తొమ్మిదో సీడ్ డారియా కసత్కినా (రష్యా) ప్రిక్వార్టర్స్ చేరారు. వీరితో పాటు ఎనిమిదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా), 13వ సీడ్ హోల్గర్ రూన్ (డెన్మార్క్) నాలుగో రౌండ్ చేరుకున్నారు. ఇరు విభాగాల్లో నాలుగో సీడ్ ప్లేయర్లు ఫ్రిట్జ్ (అమెరికా), పావొలిని (ఇటలీ)లకు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. భార్యభర్తలు స్వితోలినా (ఉక్రెయిన్), మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) చెప్పుకోదగిన విజయాలతో ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో ముందంజ వేశారు. స్వితోలినా గత సీజన్ రెండు గ్రాండ్‌స్లామ్‌ల రన్నరప్ పావొలినిని కంగుతినిపిస్తే, మోన్ఫిల్స్... గత యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్కు చెక్ పెట్టాడు. సినెర్ జోరు... డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ యానిక్ సినెర్ అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్ చేరాడు. శనివారం పురుషుల సింగిల్స్‌లో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో అతను 6–3, 6–4, 6–2తో అమెరికాకు చెందిన 46వ ర్యాంకర్ మార్కొస్ గిరోన్‌ను వరుస సెట్లలో ఓడించాడు. గత సీజన్లో ఆసీస్, ఫ్రెంచ్ ఓపెన్లను గెలుచుకున్న 23 ఏళ్ల ఇటలీ టాప్‌స్టార్ ఈ సీజన్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. మరో మ్యాచ్‌లో గేల్ మోన్ఫిల్స్ ప్రిక్వార్టర్స్ చేరడం ద్వారా వన్నె తగ్గని వెటరన్ ప్లేయర్‌గా టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సరసన నిలిచాడు. మూడో రౌండ్లో 38 ఏళ్ల మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 3–6, 7–5, 7–6 (7/1), 6–4తో నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)కు షాకిచ్చాడు. 2020లో ఫెడరర్ 38 ఏళ్ల వయసులో తన ఆఖరి ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడి సెమీస్ చేరాడు. డి మినార్ (ఆసీస్) 5–7, 7–6 (7/3), 6–3, 6–3తో సెరుండొలొ (అర్జెంటీనా)పై, 13వ సీడ్ రూన్ (డెన్మార్క్) 6–7 (5/7), 6–3, 4–6, 6–4, 6–4తో కెక్మనోవిచ్ (సెర్బియా)పై గెలిచారు. సంచలన క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ (అమెరికా) 7–6 (12/10), 6–3, 6–3తో ఫ్రాన్స్‌కు చెందిన మౌటెట్ను ఓడించాడు. అన్‌సీడెడ్ మిచెల్సన్ (అమెరికా) 6–3, 7–6 (7/5), 6–2తో 19వ సీడ్ కచనొవ్ (రష్యా)ను కంగుతినిపించాడు. స్వితోలినా ముందంజ మోన్ఫిల్స్ భార్య ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) తన భర్త నెగ్గిన కోర్టులోనే అనంతరం జరిగిన మ్యాచ్‌లో 2–6, 6–4, 6–0తో గత ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ (2024)ల రన్నరప్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)ని కంగుతినిపించింది. రెండో సీడ్ స్వియాటెక్ 6–1, 6–0తో యూఎస్ ఓపెన్ (2021) మాజీ చాంపియన్, బ్రిటన్ ప్లేయర్ ఎమ్మా రాడుకానుపై అలవోక విజయం సాధించింది. 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–4, 6–4తో పదోసీడ్ సహచర ప్లేయర్ కొలిన్స్‌ను ఓడించింది. 6వ సీడ్ రిబాకినా 6–3, 6–4తో డయానా యా్రస్తెస్కా (ఉక్రెయిన్)పై, 8వ సీడ్ నవారో 6–4, 3–6, 6–4తో ఓన్స్ జాబెర్ (ట్యూనిíÙయా)పై, 9వ సీడ్ కసత్కినా (రష్యా) 7–5, 6–1తో పుతిన్‌త్సెవా (కజకిస్తాన్)పై గెలుపొందారు. బాలాజీ జోడీ అవుట్ ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ నుంచి భారత డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ నిష్క్రమించాడు. మెక్సికన్ భాగస్వామి మిగుల్ ఏంజిల్ రేయెస్ వారెలతో జోడీ కట్టిన భారత ఆటగాడు రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. పురుషుల డబుల్స్‌లో శనివారం జరిగిన పోరులో బాలాజీ–ఏంజిల్ రేయెస్ ద్వయం 6–7 (1/7), 6–4, 3–6తో పోర్చుగల్‌కు చెందిన న్యూనో బోర్జెస్–ఫ్రాన్సిస్కొ కాబ్రల్ జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
జొకోవిచ్, సబలెంకా జోరు
మెల్బోర్న్: ‘హ్యాట్రిక్’ టైటిల్ సాధించే దిశగా సబలెంకా... రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచే దిశగా జొకోవిచ్ మరో అడుగు ముందుకు వేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్).... పురుషుల సింగిల్స్‌లో 10 సార్లు విజేత జొకోవిచ్ (సెర్బియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సబలెంకా 7–6 (7/5), 6–4తో క్లారా టౌసన్ (డెన్మార్క్)పై గెలుపొందగా... ఏడో సీడ్ జొకోవిచ్ 6–1, 6–4, 6–4తో 26వ సీడ్ టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. క్లారాతో 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకాకు గట్టిపోటీ ఎదురైనా కీలకదశలో ఆమె పైచేయి సాధించింది. మ్యాచ్‌లో ఒక్క ఏస్ కూడా కొట్టని సబలెంకా తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 39 విన్నర్స్ కొట్టిన ఈ బెలారస్ స్టార్ 29 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు క్లారా ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో సెట్ కోల్పోయిన సెర్బియా దిగ్గజం జొకోవిచ్ మూడో మ్యాచ్‌లో మాత్రం వరుసగా మూడు సెట్లలో గెలుపొందడం విశేషం. మఖచ్తో 2 గంటల 22 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 28 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్...నెట్ వద్దకు 18 సార్లు వచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన ఈ మాజీ చాంపియన్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జిరీ లెహెస్కా (చెక్ రిపబ్లిక్)తో జొకోవిచ్; మిరా ఆంద్రీవా (రష్యా)తో సబలెంకా తలపడతారు. పురుషుల సింగిల్స్ ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–2, 6–4, 6–7 (3/7), 6–2తో బోర్జెస్ (పోర్చుగల్)పై, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 6–4, 6–4తో ఫియరెన్లే (బ్రిటన్)పై, 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 7–6 (7/2), 6–2, 6–0తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. కోకో గాఫ్ సులువుగా... మహిళల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ఏడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) ఇంటిదారి పట్టింది. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కోకో గాఫ్ 6–4, 6–2తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై నెగ్గగా... పెగూలా 6–7 (3/7), 1–6తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా) చేతిలో ఓడిపోయింది. 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్), 27వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా), బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. బెన్‌చిచ్‌తో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో తొలి సెట్ కోల్పోయాక మాజీ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) గాయం కారణంగా వైదొలిగింది. -
మెద్వెదెవ్కు షాక్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం పెను సంచలనం నమోదైంది. గత ఏడాది రన్నరప్, ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. అమెరికాకు చెందిన 19 ఏళ్ల క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ అసాధారణ పోరాటపటిమ కనబరిచి మెద్వెదెవ్‌ను ఓడించి తన కెరీర్లోనే అతిపెద్ద విజయం సాధించాడు. 4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 119వ ర్యాంకర్ లెర్నర్ టియెన్ 6–3, 7–6 (7/4), 6–7 (8/10), 1–6, 7–6 (10/7)తో ఐదో సీడ్, గతంలో మూడుసార్లు రన్నరప్‌గా (2021, 2022, 2024) నిలిచిన మెద్వెదెవ్పై గెలిచాడు. మ్యాచ్ మొత్తంలో మెద్వెదెవ్ 20 ఏస్‌లు సంధించినా... 9 డబుల్ ఫాల్ట్‌లు, 82 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. గత మూడేళ్లు యూఎస్ ఓపెన్‌లో ఆడిన లెర్నర్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. మొదటిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించిన లెర్నర్ టియెన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఐదు సెట్లు ఆడి నెగ్గడం విశేషం. కామిలో కారాబెల్లి (అర్జెంటీనా)తో 3 గంటల 56 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్లో లెర్నర్ టియెన్ 4–6, 7–6 (7/3), 6–3, 5–7, 6–4తో గెలుపొందాడు. మరోవైపు కాసిదిత్ సామ్రెజ్ (థాయ్‌లాండ్)తో 3 గంటల 8 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6–2, 4–6, 3–6, 6–1, 6–2తో గట్టెక్కాడు. రెండో రౌండ్లోనూ మెద్వెదెవ్ ఐదు సెట్లు పోరాడినా అమెరికన్ టీనేజర్ ఆటతీరుకు చేతులెత్తేశాడు. లెర్నర్, మెద్వెదెవ్ మ్యాచ్ ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం తెల్లవారుజాము 2 గంటల 53 నిమిషాలకు ముగియడం గమనార్హం. మూడో రౌండ్లో సినెర్మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో సినెర్ 2 గంటల 46 నిమిషాల్లో 4–6, 6–4, 6–1, 6–3తో స్కూల్‌కేట్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ స్వియాటెక్ (పోలాండ్), నాలుగో సీడ్ పావోలిని (ఇటలీ), ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా), తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా), పదో సీడ్ కొలిన్స్ (అమెరికా) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రిత్విక్ జోడీ ఓటమి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత ప్లేయర్, హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీకి నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్ (భారత్)–సెగర్మన్ (అమెరికా) జోడీ 6–7 (5/7), 1–6తో ఆరో సీడ్ హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్)–హెనీ ప్యాటెన్ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. శ్రీరామ్ బాలాజీ (భారత్)–వరేలా (మెక్సికో) ద్వయం రెండో రౌండ్‌కు చేరగా... జీవన్ నెడుంజెళియన్– విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్)... అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–ద్రజెవ్స్కీ (పోలాండ్) జోడీలు తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాయి. -
జొకోవిచ్ 430
మెల్బోర్న్: తనకెంతో కలిసొచ్చిన గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదికపై సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో రికార్డు బద్దలు కొట్టాడు. ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా జొకోవిచ్ అవతరించాడు. 429 మ్యాచ్‌లతో స్విట్జర్లాండ్ లెజెండ్ రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును 430వ మ్యాచ్‌తో జొకోవిచ్ అధిగమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో 10 సార్లు చాంపియన్ జొకోవిచ్ 6–1, 6–7 (4/7), 6–3, 6–2తో కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడిన జైమీ ఫారియా (పోర్చుగల్)పై గెలుపొందాడు. 3 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌కు రెండో సెట్లో మాత్రమే ప్రతిఘటన ఎదురైంది. 14 ఏస్‌లు సంధించిన ఈ సెర్బియా స్టార్ కేవలం రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 33 విన్నర్స్ కొట్టడంతోపాటు 33 అనవసర తప్పిదాలు చేసిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. నెట్ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి 9 సార్లు పాయింట్లు నెగ్గిన ఈ మాజీ చాంపియన్‌కు మూడో రౌండ్లో 26వ సీడ్ టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్) రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. కెరీర్లో 77వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న జొకోవిచ్ ఇప్పటి వరకు 379 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో గెలిచాడు. ఇది కూడా ఒక రికార్డే. 369 ‘గ్రాండ్’ విజయాలతో ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును గత ఏడాదే జొకోవిచ్ సవరించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో జొకోవిచ్, ఫెడరర్ తర్వాత సెరెనా విలియమ్స్ (423), రాఫెల్ నాదల్ (358), వీనస్ విలియమ్స్ (356) ఉన్నారు. జ్వెరెవ్, అల్కరాజ్ ముందంజ మరోవైపు రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టగా... ఆరో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. జ్వెరెవ్ 6–1, 6–4, 6–1తో మార్టినెజ్ (స్పెయిన్)పై, అల్కరాజ్ 6–0, 6–1, 6–4తో నిషియోకా (జపాన్)పై అలవోకగా గెలిచారు. రూడ్ 2 గంటల 44 నిమిషాల్లో 2–6, 6–3, 1–6, 4–6తో జాకుబ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు. ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన రూడ్ ఇప్పటి వరకు ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. బోపన్న జోడీకి షాక్ పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్నకు చుక్కెదురైంది. గత ఏడాది మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో ఈ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన బోపన్న ఈసారి కొత్త భాగస్వామి బారింటోస్ (కొలంబియా)తో కలిసి బరిలోకి దిగాడు. తొలి రౌండ్లో 14వ సీడ్ బోపన్న–బారింటోస్ ద్వయం 5–7, 6–7 (5/7)తో పెడ్రో మార్టినెజ్–జామి మునార్ (స్పెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జంట కూడా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. యూకీ–ఒలివెట్టి ద్వయం 2–6, 6–7 (3/7)తో ట్రిస్టన్ స్కూల్‌కేట్–ఆడమ్ వాల్టన్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో పరాజయం పాలైంది. కిన్వెన్ జెంగ్ అవుట్మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనం నమోదైంది. గత ఏడాది రన్నరప్, ఐదో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్లో 36 ఏళ్ల లౌరా సిగెమండ్ (జర్మనీ) 7–6 (7/3), 6–3తో కిన్వెన్ జెంగ్‌ను బోల్తా కొట్టించి మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్), మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఏడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. సబలెంకా 6–3, 7–5తో బుజాస్ మనీరో (స్పెయిన్)పై, కోకో గాఫ్ 6–3, 7–5తో జోడీ బురాజ్ (బ్రిటన్)పై, పెగూలా 6–4, 6–2తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) 1–6, 6–1, 6–3తో 20వ సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై, 14వ సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా) 6–4, 3–6, 7–6 (10/8)తో మొయూక ఉచిజిమా (జపాన్)పై, 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) 6–1, 6–0తో తాలియా గిబ్సన్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు. -
Australian Open: మాజీ ఛాంపియన్‌కు షాక్.. తొలి రౌండ్లోనే ఓటమి
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో రెండుసార్లు చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) తొలి రౌండ్లోనే ఓడిపోయింది. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన పోరులో లూసియా బ్రాన్జెట్టి (ఇటలీ) 6–2, 7–6 (7/2)తో అజరెంకాను బోల్తా కొట్టించింది. 17వసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడిన 26వ సీడ్ అజరెంకా తొలి రౌండ్లో ఓడిపోవడం నాలుగోసారి మాత్రమే కావడం గమనార్హం. 2012, 2013లలో విజేతగా నిలిచిన అజరెంకా ఆ తర్వాత ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. బ్రాన్జెట్టితో జరిగిన మ్యాచ్‌లో అజరెంకా 37 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 16వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) 3–6, 6–7 (6/8)తో బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు రెండో సీడ్ స్వియాటెక్ (పోలాండ్), మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఏడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), మాజీ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. స్వియాటెక్ 6–3, 6–4తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, కోకో గాఫ్ 6–3, 6–3తో 2020 చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా)పై, పెగూలా 6–3, 6–0తో మాయా జాయింట్ (ఆస్ట్రేలియా)పై, 2019, 2021 విజేత ఒసాకా 6–3, 3–6, 6–3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. -
Australian Open: జొకోవిచ్‌కు ముచ్చెమటలు పట్టించిన తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్
అటువైపు ప్రత్యర్థి 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత... ఏకంగా 1126 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ప్లేయర్... కెరీర్లో ఇప్పటికే 76 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన అనుభవం సొంతం... ఇటువైపు ప్లేయర్‌కు ‘వైల్డ్ కార్డు’ ద్వారా కెరీర్లోనే తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడే అవకాశం... ఎదురైన ప్రత్యర్థి తానెంతో ఇష్టపడే ఆటగాడు... ఇద్దరి బలాబలాలు పరిశీలిస్తే మ్యాచ్ ఏకపక్షంగా వరుస సెట్లలో ముగియడం ఖాయమని విశ్లేషకుల ఏకాభిప్రాయం... కానీ అలాంటిదేమీ జరగలేదు. ఒకే ఒక్క మ్యాచ్‌తో టెన్నిస్ ప్రపంచాన్ని ఆకర్షించేందుకు వచ్చిన అవకాశాన్ని ఆ కుర్రాడు వదులుకోలేదు. తన అసమాన పోరాటపటిమతో అందరి దృష్టిలో పడ్డాడు. అతడే 19 ఏళ్ల నిశేష్ బసవరెడ్డి... తెలుగు సంతతికి చెందిన అమెరికన్ టెన్నిస్ టీనేజ్ రైజింగ్ స్టార్.. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో నిశేష్ తొలి రౌండ్లోనే ఓడిపోయినా... ప్రతి పాయింట్ సాధించేందుకు జొకోవిచ్‌ను తెగ కష్టపెట్టాడు. నిశేష్‌కు ఎంతో భవిష్యత్ ఉందని మ్యాచ్ అనంతరం జొకోవిచ్ కూడా వ్యాఖ్యానించడం విశేషం. మెల్బోర్న్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తొలి అడ్డంకిని అధిగమించాడు. ప్రపంచ 107వ ర్యాంకర్, అమెరికన్ రైజింగ్ టీనేజ్ టెన్నిస్ స్టార్ నిశేష్ బసవరెడ్డితో జరిగిన తొలి రౌండ్ పోరులో జొకోవిచ్ గెలిచి 18వ సారి ఈ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 2 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నిశేష్ 6–4, 3–6, 4–6, 2–6తో జొకోవిచ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. గత నెలలోనే ప్రొఫెషనల్‌గా మారిన 19 ఏళ్ల నిశేష్ ఏమాత్రం తడబడకుండా తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బేస్‌లైన్ వద్ద సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూనే... అడపాదడపా డ్రాప్ షాట్లు... కళ్లు చెదిరే రిటర్న్‌లతో వరుసగా 21వ ఏడాది గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న జొకోవిచ్‌కు ఇబ్బంది పెట్టడంలో నిశేష్ సఫలమయ్యాడు. తొలి సెట్లోని ఎనిమిదో గేమ్‌లో జొకోవిచ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన నిశేష్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 5–3తో ముందంజ వేశాడు. తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్ కాపాడుకోగా... పదో గేమ్‌లో నిశేష్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను 49 నిమిషాల్లో 6–4తో సొంతం చేసుకోవడంతో మ్యాచ్‌ను మైదానంలో ప్రత్యక్షంగా చూస్తున్న వేలాది మంది ప్రేక్షకులు, టీవీల ముందున్న లక్షలాది వీక్షకులు ఆశ్చర్యపోయారు. తొలి సెట్ నెగ్గిన ఉత్సాహంతో రెండో సెట్లోనూ నిశేష్ భేషుగ్గా ఆడాడు. అయితే అపార అనుభవజ్ఞుడైన జొకోవిచ్ టీనేజర్ నిశేష్ ఆటతీరుపై అవగాహన పెంచుకొని దూకుడు పెంచాడు. స్కోరు 4–3 వద్ద ఎనిమిదో గేమ్‌లో నిశేష్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని 44 నిమిషాల్లో రెండో సెట్ దక్కించుకొని లయలోకి వచ్చాడు. రెండో సెట్లోని చివరి గేమ్ ఆడుతున్న సమయంలో నిశేష్ కాలు బెణకడంతో అతను ఆ తర్వాత చురుగ్గా కదల్లేకపోయాడు. మరోవైపు జొకోవిచ్ మరింత జోరు పెంచాడు. మూడో సెట్లోని తొలి గేమ్‌లోనే నిశేష్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సరీ్వస్‌లను కాపాడుకొని 43 నిమిషాల్లో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నాలుగో సెట్లో కూడా తొలి గేమ్‌లో, ఐదో గేమ్‌లో నిశేష్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన జొకోవిచ్ కళ్లు చెదిరే ఏస్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ‘నిశేష్ పరిపూర్ణ క్రీడాకారుడిలా ఆడాడు. అతను ఆడిన కొన్ని షాట్లు నన్నే ఆశ్చర్యానికి గురి చేశాయి. చివరి పాయింట్ వరకు పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. భవిష్యత్ లో నిశేష్ ఆటతీరును చాలాసార్లు చూస్తాము. ఇందులో సందేహం లేదు’ అని మ్యాచ్ ముగిశాక జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. 2005లో అమెరికాలో పుట్టి పెరిగిన నిశేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు. నిశేష్ తల్లిదండ్రులు మురళీ రెడ్డి, సాయిప్రసన్న స్వస్థలం నెల్లూరు జిల్లా. 1999లో ఉద్యోగరీత్యా భారత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తొలి రౌండ్లో ఓడిన నిశేష్‌కు 1,32,000 ఆ్రస్టేలియన్ డాలర్ల (రూ. 70 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ ముగిశాక విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో నిశేష్ కెరీర్ బెస్ట్ 104వ ర్యాంక్‌కు చేరుకుంటాడు. అల్కరాజ్ అలవోకగా... పురుషుల సింగిల్స్‌లో సోమవారం స్టార్ ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 11వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా... డిఫెండింగ్ చాంపియన్ సినెర్ (ఇటలీ), మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. 2023 ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ సిట్సిపాస్ 5–7, 3–6, 6–2, 4–6తో మికిల్సన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. 2018 తర్వాత ఈ టోర్నీలో సిట్సిపాస్ తొలి రౌండ్లోనే ఓడిపోవ డం గమనార్హం. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సినెర్ 7–6 (7/2), 7–6 (7/5), 6–1తో నికోలస్ (చిలీ)పై, అల్కరాజ్ 6–1, 7–5, 6–1తో షెవ్చెంకో (కజకిస్తాన్)పై విజయం సాధించారు. పసారో (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో పదో సీడ్ దిమిత్రోవ్ గాయం కారణంగా రెండో సెట్లో వైదొలిగాడు. 21-టెన్నిస్ ఓపెన్ శకంలో (1968 నుంచి) వరుసగా 21వ ఏడాది జొకోవిచ్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఒక్క విజయమైనా సాధించాడు. ఈ జాబితాలో రోజర్ ఫెడరర్ (22 ఏళ్లు) మాత్రమే ముందున్నాడు. 429-ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ఫెడరర్ (429 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో బరిలోకి దిగితే ఫెడరర్ రికార్డును అధిగమిస్తాడు. -
సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే...
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో భారత కథ ముగిసింది. బరిలో ఉన్న ఏకైక భారత ప్లేయర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 25వ ర్యాంకర్ టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్)తో ఆదివారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 91వ ర్యాంకర్ నగాల్ 3–6, 1–6, 5–7తో ఓడిపోయాడు. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నగాల్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 20 అనవసర తప్పిదాలు చేశాడు. 19 విన్నర్స్ కొట్టిన నగాల్ తన సరీ్వస్‌ను ఏడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొలి రౌండ్లో ఓడిన నగాల్‌కు 1,32,000 ఆ్రస్టేలియన్ డాలర్ల (రూ. 69 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. హైదరాబాద్ తూఫాన్స్ విజయం రూర్కెలా: పురుషుల హాకీ ఇండియా లీగ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు నాలుగో విజయం నమోదు చేసింది. వేదాంత కళింగ లాన్సర్స్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు 5–1 గోల్స్ తేడాతో గెలిచింది. తూఫాన్స్ తరఫున గొంజాలో పిలాట్ (6వ, 30వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... మైకో కసెల్లా (21వ నిమిషంలో), టిమ్ బ్రాండ్ (47వ నిమిషంలో), అర్‡్షదీప్ సింగ్ (54వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. కళింగ లాన్సర్స్ జట్టుకు అలెగ్జాండర్ హెండ్రిక్స్ (5వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ తూఫాన్స్ జట్టు 10 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో తమిళనాడు డ్రాగన్స్‌తో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టు ఆడుతుంది. ఒడిశా వారియర్స్ బోణీ రాంచీలో ఆదివారం మొదలైన తొలి మహిళల హాకీ ఇండియా లీగ్‌లో ఒడిశా వారియర్స్ జట్టు శుభారంభం చేసింది. ఒడిశా వారియర్స్ 4–0 గోల్స్ తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టును ఓడించింది. ఒడిశా వారియర్స్ తరఫున యిబ్బీ జాన్సెన్ (16వ, 37వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా... బల్జీత్ కౌర్ (42వ నిమిషంలో), ఫ్రీక్ మోయిస్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్‌తో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ తలపడుతుంది. -
గ్రాండ్‌స్లామ్ ఓపెనింగ్ ఎవరిదో
కొత్త తరం చాంపియన్లు కార్లోస్ అల్కరాజ్, యానిక్ సినెర్ ఒక వైపు... ఆల్‌టైమ్ గ్రేట్, 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఇలా హేమాహేమీలంతా ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్‌తో ఈ సీజన్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని పట్టుదలతో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో గత రెండేళ్లుగా విజేతగా నిలుస్తున్న డిఫెండింగ్ చాంపియన్ అరినా సబలెంక ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై కన్నేయగా, స్వియాటెక్, కోకో గాఫ్‌లు కూడా ఈ సీజన్‌కు విజయంతో శుభారంభం పలకాలని చూస్తున్నారు. మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆ్రస్టేలియన్ ఓపెన్ కోసం రంగం సిద్ధమైంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) గత సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ విజయంతో జోరుమీదున్నాడు. 23 ఏళ్ల ఇటలీ సంచలనం డోపింగ్ మరక దరిమిలా ఎదురవుతున్న విమర్శలను టైటిల్ నిలబెట్టుకొని అధిగమించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు నాదల్ శకం తర్వాత స్పెయిన్ జైత్రయాత్రకు కొత్త చిరునామాగా అల్కరాజ్ ఎదిగాడు. 21 ఏళ్ల వయసులోనే ఇప్పటికే నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను సాధించేశాడు. 2022లో యూఎస్ ఓపెన్, 2023లో ప్రతిష్టాత్మక వింబుల్డన్, గతేడాది వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లను గెలుచుకున్నాడు. అయితే నాలుగు గ్రాండ్స్లామ్లనైతే గెలిచాడు.... కానీ ఆ్రస్టేలియన్ ఓపెన్ వెలితి మాత్రం అలాగే వుంది. ఇక్కడ గత సీజన్లో క్వార్టర్ఫైనల్లో నిష్క్రమించిన ఈ స్పెయిన్ స్టార్ బహుశా ఈ ఏడాది ఆ ముచ్చట తీర్చుకుంటాడేమో చూడాలి. మరో వైపు ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరైన 37 ఏళ్ల సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ 25వ రికార్డు గ్రాండ్‌స్లామ్‌పై దృష్టిపెట్టాడు. వీరితో పాటు 27 ఏళ్ల జర్మనీ స్టార్, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) గత సెమీఫైనల్ అంచెను దాటాలనే పట్టుదలతో ఉన్నాడు. జొకో గెలిస్తే రజతోత్సవమే! గతేడాది సెర్బియన్ సూపర్ స్టార్ జొకోవిచ్ సెమీఫైనల్స్‌తో సరిపెట్టుకున్నాడు. అంతమాత్రాన 37 ఏళ్ల వెటరన్ ప్లేయర్లో సత్తా తగ్గిందంటే పొరబడినట్లే. తనకు బాగా అచ్చొచ్చిన ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో పది టైటిళ్లు గెలిచిన నొవాక్ 11వ సారి విజేతగా నిలిస్తే గ్రాండ్‌స్లామ్‌ల రజతోత్సవాన్ని (25వ) మెల్బోర్న్లో జరుపుకుంటాడు. ఏడో సీడ్‌గా ఆసీస్ ఓపెన్ మొదలుపెట్టబోతున్న నొవాక్‌కు ఇక్కడ ఘనమైన రికార్డు ఉంది. 2011–13 హ్యాట్రిక్, 2019–21 హ్యాట్రిక్‌లు సహా 2008, 2015, 2016, 2023లలో విజేతగా నిలిచిన విశేషానుభవం సెర్బియన్ సొంతం. రష్యా స్టార్, ఐదో సీడ్ డానిల్ మెద్వెదెవ్ ఫైనల్‌కు వచి్చన మూడుసార్లు టైటిల్ వేటలో చతికిలబడ్డాడు. రష్యన్ స్టార్ 2021, 2022లతో పాటు గత సీజన్లో సినెర్ చేతిలో అమీతుమీలో మూడో ‘సారీ’ టైటిల్‌ను కోల్పోయాడు. ఇప్పుడు ఫామ్‌లో ఉన్న సినెర్, అల్కరాజ్లను అధిగమించి విజేతగా నిలువడం అంత సులువైతే కాదు. ఆరో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), 9వ సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా)లు సంచలన స్టార్లకు షాక్లిచ్చేందుకు సిద్ధమయ్యారు. తొలిరౌండ్లలో షెవ్చెంకో (కజకిస్తాన్)తో అల్కరాజ్, ఫ్రాన్స్ వైల్డ్‌కార్డ్ ప్లేయర్ లుకాస్ పౌలీతో జ్వెరెవ్, నికోలస్ జెర్రీ (చిలీ)తో టాప్‌సీడ్ సినెర్ ఆసీస్ ఓపెన్‌ను ప్రారంభిస్తాడు. హ్యాట్రిక్ వేటలో సబలెంక మహిళల సింగిల్స్‌లో బెలారస్ స్టార్ ప్లేయర్ అరియానా సబలెంక ‘హ్యాట్రిక్’ కలను సాకారం చేసుకునే పనిలోవుంది. 26 ఏళ్ల ఈ టాప్‌సీడ్ గత రెండేళ్లుగా (2023, 2024లలో) టైటిళ్లను నిలబెట్టుకుంటోంది. ఈ సీజన్లో ఆమె... స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)తో తొలిరౌండ్ సమరానికి సిద్ధమైంది. మిగతా మేటి ప్లేయర్లలో 20 ఏళ్ల అమెరికన్ మూడో సీడ్ కోకో గాఫ్ సహచర ప్లేయర్ సోఫియా కెనిన్‌తో తలపడుతుంది. 2024 సీజన్లో ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్ ఓపెన్లలో వరుసగా సెమీఫైనల్స్ చేరిన గాఫ్ ఈ సారి సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉంది. పోలండ్ సూపర్‌స్టార్ 23 ఏళ్ల ఇగా స్వియాటెక్... చెక్ రిపబ్లిక్కు చెందిన కెటెరినా సినియకొవాతో ఆసీస్ ఓపెన్‌ను ఆరంభించనుంది. ఫ్రెంచ్ ఓపెన్ (2022, 2023, 2024) హ్యాట్రిక్ విజేతకు ఆస్ట్రేలియన్ ఓపెన్ మాత్రం కలిసిరావడం లేదు. ఇక్కడ కనీసం ఆమె క్వార్టర్ ఫైనల్ కూడా చేరలేకపోవడం గమనార్హం. మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. గతేడాది అయితే మూడో రౌండ్నే దాటలేకపోయింది. ఇప్పుడు రెండో సీడ్‌గా ఆరంభ గ్రాండ్‌స్లామ్ పరీక్షకు సిద్ధమైంది. -
రిటైర్మెంట్ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న జకోవిచ్
టెన్నిస్ చరిత్రలో 'ఆల్ టైమ్ గ్రేట్' ఎవరు..? టెన్నిస్ అభిమానులు గంటల తరబడి ఈ ప్రశ్న గురించి చర్చించుకుంటారు. ఇంతకీ పురుషుల టెన్నిస్‌లో "GOAT" ఎవరు..? ఈ ప్రశ్నపై జరిగే చర్చలో జాన్ మెకెన్రో, జాన్ బోర్గ్, పీట్ సాంప్రస్, జిమ్మీ కానర్స్ వంటి దిగ్గజాల పేర్లు కచ్చితంగా ప్రస్తావనకు వస్తాయి. కానీ ఇటీవల కాలంలో గ్రాండ్ స్లాం టెన్నిస్ టోర్నమెంట్లను శాసించిన నోవాక్ జకోవిచ్, రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ల పేర్లు ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాయి.ముగ్గురిలో ఒక్కడే మిగిలాడు సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ ఈ జాబితా లో అగ్రస్థానంలో ఉన్నాడు. 2023 యుఎస్ ఓపెన్ విజయం తరువాత జకోవిచ్ మొత్తం 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల తో ఎవ్వరికీ అందనంత ఎత్తు కి చేరుకున్నాడు. జకోవిచ్ తన 24 స్లామ్లలో 10 ఆస్ట్రేలియా ఓపెన్ లో సాధించి, మెల్బోర్న్ హార్డ్ కోర్టులపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు.ఆల్ టైమ్ "క్లే కింగ్" గా పేరుపొందిన నాదల్ తన 22 గ్రాండ్ స్లాం టైటిళ్ల లో 14 ఫ్రెంచ్ ఓపెన్ లో చేజిక్కించుకోగా.. ఫెదరర్ సాధించిన 20 గ్రాండ్ స్లాం విజయాలలో ఎనిమిది వింబుల్డన్ టైటిళ్లు కావడం విశేషం.ఈ ముగ్గురి లో ప్రస్తుతం జకోవిచ్ మాత్రమే టెన్నిస్ బరిలో మిగిలాడు. ఫెదరర్ 2022 సెప్టెంబర్ లో రిటైర్మెంట్ ప్రకటించాడు. గాయాల బారిన పడిన స్పానిష్ ఆటగాడు నాదల్ సైతం గత నవంబర్ లో ఆటకి స్వస్తి చెప్పాడు.గత ఏడాది ఒలింపిక్ స్వర్ణం ఒక్కటేజకోవిచ్ విషయానికి వస్తే, గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో జకో తన మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించాడు. అయితే జకోవిచ్ గతేడాది ఒలింపిక్ స్వర్ణం మినహా మరే గ్రాండ్ స్లాం టైటిల్ గెలవలేక పోయాడు. వచ్చే ఆదివారం ప్రారంభమయ్యే 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకో తన ప్రారంభ రౌండ్లోభారత సంతతి కి చెందిన వైల్డ్‌కార్డ్ ఆటగాడు నిశేష్ బసవరెడ్డితో తలపడనున్నాడు.జకోవిచ్ ఇప్పటికీ తన అద్భుతమైన ప్రదర్శనతో టెన్నిస్ కెరీర్‌ను కొనసాగిస్తున్నప్పటికీ అతని చిరకాల ప్రత్యర్థులైన ఫెదరర్, రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ లతో అతని దృక్పధం లో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా జకోవిచ్ తండ్రి అతని రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి తెస్తున్నాడు. "గత కొంత కాలంగా నన్ను టెన్నిస్ నుంచి రిటైర్ చేయించడానికి నాన్న ప్రయత్నిస్తున్నారు. టెన్నిస్ లో ఇంకా ఏమి సాధించాలని భావిస్తున్నావ్" అని అయన ప్రశ్నిస్తున్నారు.శరీరం పై టెన్నిస్ ప్రభావం సుదీర్ఘంగా టెన్నిస్ ఆడటం వల్ల అది జకో శరీరం పై ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే జకోవిచ్ ని అతని తండ్రి రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి చేసున్నానడంలో సందేహం లేదు. ఈ నేపధ్యం లో తన రిటైర్మెంట్ గురుంచి జకోవిచ్ ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇందుకు ఖచ్చితమైన సమయం ఎప్పుడు, ఎక్కడా అన్న విషయం పై దృష్టి పెట్టాడు. తన కెరీర్‌ను ఎలా ముగించాలనుకుంటున్నాడనే దానిపై ప్రస్తుతం ఎక్కువ దృష్టి పెట్టాడు. "నేను నా టెన్నిస్ కెరీర్ ని ఎలా ముగించాలి, ఎక్కడ ముగించాలి అన్న విషయం పై వ్యూహం సిద్ధం చేయాలి అని భావిస్తున్నాను. అయితే ఇప్పుడే రిటైర్ అవుతానని చెప్పలేను. ప్రస్తుతం టెన్నిస్ లో అగ్ర స్థాయి ఆటగాళ్ల పై విజయం సాధిస్తున్నందున ఇప్పుడే రిటైర్ అవుతానని చెప్పడం లేదు" అని నర్మగర్భంగా తన ఆలోచనని బయటపెట్టాడు.జకోవిచ్ రిటైర్మెంట్ నిర్ణయం.. ఆతను గ్రాండ్ స్లాం పోటీల్లో తలబడే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. గ్రాండ్ స్లాం టోర్నమెంట్ల విషయానికి వస్తే గతేడాది జకోవిచ్ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. అడపాదప కొన్ని టైటిళ్లు గెలిచినా, గ్రాండ్ స్లాం టైటిల్ సాధిస్తేనే జకోవిచ్ తన క్రీడా జీవితాన్ని మరింత కాలం కొనసాగించే అవకాశముంది. లేనిపక్షంలో జకోవిచ్ ఎక్కువ కాలం టెన్నిస్ లో కొనసాగడం కష్టమే.తన కెరీర్‌ను పొడిగించుకోవడానికి, జొకోవిచ్ ఇప్పటికే తన షెడ్యూల్‌ను సర్దుబాటు చేసుకున్నాడు. తక్కువ టోర్నమెంట్లు ఆడుతున్నాడు మరియు గ్రాండ్ స్లాం వంటి మేజర్లపై దృష్టి పెట్టాడు. చాలా మంది తాను ఉన్నత స్థాయిలో రిటైర్ కావాలని నమ్ముతున్నప్పటికీ, జకోవిచ్ శారీరకంగా మరియు మానసికంగా సమర్థుడిగా ఉన్నంత వరకు టెన్నిస్ లో కొనసాగాలని నిశ్చయించుకున్నాడు. "గ్రాండ్ స్లామ్లలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను ఓడించగల సత్తా నాలో ఇప్పటికీ ఉందని భావిస్తే, నేను నా టెన్నిస్ జీవితానికి ఎందుకు గుడ్ బై చెప్పాలనుకుంటాను" అని జకోవిచ్ వ్యాఖ్యానించాడు. -
‘ఇప్పటికీ ఆ బాధ వెంటాడుతోంది’
మెల్బోర్న్: మూడేళ్ల క్రితం 2022 ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడేందుకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఆసీస్ గడ్డపై అడుగు పెట్టాడు. అయితే ఆ సమయంలో అమల్లో ఉన్న కోవిడ్ ఆంక్షల కారణంగా వ్యాక్సిన్ వేసుకున్న వారినే దేశంలోకి అనుమతించారు. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా జొకోవిచ్‌ను విమానాశ్రయంలోనే నిలిపి వేశారు. ఆ తర్వాత అతను కోర్టును ఆశ్రయించడం, ఇతర పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. చివరకు టోర్నీలో ఆడకుండానే జొకోవిచ్‌ను ఆ్రస్టేలియా దేశం నుంచి అధికారులు పంపించి వేశారు. నాటి ఘటన తనను ఇప్పటికీ వెంటాడుతోందని, ఆస్ట్రేలియాకు ఎప్పుడు వచ్చినా దానిని మర్చిపోలేకపోతున్నానని జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచే లక్ష్యంతో ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడేందుకు అతను ఇప్పుడు మళ్లీ వచ్చాడు. ‘నాటి ఘటన నాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పుడే కాదు గత రెండేళ్లుగా ఎప్పుడు ఆ్రస్టేలియాకు వచ్చినా అదే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. పాస్‌పోర్ట్, ఇమిగ్రేషన్ విభాగం నుంచి వద్ద తనిఖీలు జరుగుతుంటే నావైపు ఎవరైనా వస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. పాస్‌పోర్ట్‌ను చెకింగ్ చేస్తుంటే కూడా నన్ను రానిస్తారా, అదుపులోకి తీసుకుంటారా, వెనక్కి పంపిస్తారా అనే సందేహాలు వస్తుంటాయి’ అని జొకోవిచ్ అన్నాడు. అయితే నిజాయితీగా చెప్పాలంటే నాటి సంఘటనకు సంబంధించి తనకు ఎవరీ మీదా కోపంగానీ, ప్రతీకార భావనగానీ లేదని అతను స్పష్టం చేశాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 10 సార్లు విజేతగా నిలిచిన జొకోవిచ్... గత ఏడాది సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు. అయితే రిటైరయ్యే లోగా ఇక్కడ కనీసం మరో టైటిల్ సాధించాలని కోరుకుంటున్నట్లు అతను చెప్పాడు. బ్రిటన్ మాజీ ఆటగాడు ఆండీ ముర్రేను కోచ్‌గా ఎంచుకున్న తర్వాత జొకోవిచ్ ఆడనున్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇదే కానుంది. ఈనెల 12న ప్రారంభమయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ కోసం జొకోవిచ్ మంగళవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. -
క్వార్టర్ ఫైనల్లో సిక్కి–సుమీత్ జోడీ
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 21–11, 21–11తో కాయ్ చెన్ తియో–కాయ్ కి తియో (ఆ్రస్టేలియా) జంటను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా)తో సిక్కి–సుమీత్ జంట తలపడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్ ప్రణయ్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... కిరణ్ జార్జి ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సమీర్ 21–14, 14–21, 21–19తో 2021 ప్రపంచ చాంపియన్ లో కీన్ యె (సింగపూర్)ను బోల్తా కొట్టించగా... ప్రణయ్ 21–17, 21–15తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)పై గెలిచాడు. కిరణ్ జార్జి 20–22, 6–21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ క్వార్టర్ ఫైనల్ చేరగా... మాళవిక, అనుపమ నిష్క్రమించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆకర్షి 21–16, 21–13తో కాయ్ కి తియో (ఆస్ట్రేలియా)పై గెలిచింది. మాళవిక 17–21, 21–23తో ఎస్తెర్ నురిమి (ఇండోనేసియా) చేతిలో, అనుపమ 11–21, 18–21తో పుత్రి కుసుమ వర్ధిని (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. -
సిక్కి–సుమీత్ జోడీ శుభారంభం
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 21–17, 21–19తో వోంగ్ టియెన్ సి–లిమ్ చియెవ్ సియెన్ (మలేసియా) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకృష్ణప్రియ–కోన తరుణ్ (భారత్) జంట 6–21, 11–21తో హూ పాంగ్ రోన్–చెంగ్ సు యెన్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ప్రణయ్, సమీర్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–10, 23–21తో యోగర్ కోల్హో (బ్రెజిల్)పై, సమీర్ వర్మ 21–10, 21–10తో రికీ టాంగ్ (ఆస్ట్రేలియా)పై, కిరణ్ 21–17, 21–10తో జియోడాంగ్ షాంగ్ (కెనడా)పై గెలిచారు.ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మిథున్ మంజునాథ్ (భారత్) 17–21, 17–21తో అల్వి ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో, శంకర్ ముత్తుస్వామి (భారత్) 16–21, 21–18, 10–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో, అభిషేక్ (భారత్) 9–21, 15–21తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్) చేతిలో ఓడిపోయారు. పోరాడి ఓడిన సామియా మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక, అనుపమ ఉపాధ్యాయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరారు. హైదరాబాద్ అమ్మాయి సామియా ఫారూఖీ తొలి రౌండ్లో 23–21, 13–21, 22–24తో టాప్ సీడ్ పాయ్ యు పో (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఆకర్షి 21–14, 21–11తో పొలీనా బురోవా (ఉక్రెయిన్)పై, మాళవిక 21–10, 21–8తో మోపాటి కెయురపై, అనుపమ 21–14, 23–21తో వోంగ్ లింగ్ చింగ్ (మలేసియా)పై గెలిచారు. -
సబలెంకా బోణీ
పారిస్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో గెలుపు బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–2తో ఇరీకా ఆంద్రీవా (రష్యా)పై అలవోకగా విజయం సాధించింది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.27 విన్నర్స్ కొట్టిన సబలెంకా నెట్ వద్ద 11 పాయింట్లు సాధించింది. ఏడోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న ఈ బెలారస్ స్టార్ గత ఏడాది తొలిసారి సెమీఫైనల్‌కు చేరింది. మరోవైపు ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరో సీడ్ మరియా సాకరి (గ్రీస్) వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయింది. సాకరి 6–3, 4–6, 3–6తో వర్వరా గ్రెచెవా (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకరి ఆరు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 39 అనవసర తప్పిదాలు చేసింది. నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), పదో సీడ్ దరియా కసత్కినా (రష్యా) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రిబాకినా 6–2, 6–3తో గ్రీట్ మినెన్ (బెల్జియం)పై, కిన్వెన్ జెంగ్ 6–2, 6–1తో అలీజా కార్నె (ఫ్రాన్స్)పై, కసత్కినా 7–5, 6–1తో మగ్ధలీనా ఫ్రెచ్ (పోలాండ్)పై గెలుపొందారు. రూడ్ శుభారంభం పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఏడో ర్యాంకర్, 2022, 2023 రన్నరప్ కాస్పర్ రూడ్ (నార్వే) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో రూడ్ 6–3, 6–4, 6–3తో అల్వెస్ మెలెగిని (బ్రెజిల్)పై గెలుపొందాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రూడ్ ప్రత్యర్థి సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 23 విన్నర్స్ కొట్టిన రూడ్ నెట్ వద్ద 10 పాయింట్లు సాధించాడు. వర్షం అంతరాయం కారణంగా మంగళవారం జరగాల్సిన కొన్ని మ్యాచ్‌లను వాయిదా వేశారు. ఇందులో భారత డబుల్స్ ప్లేయర్లు రోహన్ బోపన్న, యూకీ బాంబ్రీ తొలి రౌండ్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. కార్నె వీడ్కోలు... ఈ టోర్నీతో ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ అలీజా కార్నె కెరీర్‌కు వీడ్కోలు పలికింది. కిన్వెన్ జెంగ్ చేతిలో మ్యాచ్ ముగిశాక ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు కార్నెను సన్మానించి చేసి వీడ్కోలు ట్రోఫీని అందజేశారు. 34 ఏళ్ల కార్నె అత్యధిక వరుస గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. కార్నె 2007 ఆ్రస్టేలియన్ ఓపెన్ నుంచి తాజా ఫ్రెంచ్ ఓపెన్ వరకు వరుసగా 69 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడింది. 2014 వింబుల్డన్ టోర్నీ మూడో రౌండ్లో నాటి ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించిన కార్నె 2022 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 2009లో కెరీర్ బెస్ట్ 11వ ర్యాంక్‌ను అందుకున్న కార్నె తాజా ర్యాంకింగ్స్‌లో 106వ స్థానంలో ఉంది. ర్యాంకింగ్‌పరంగా కార్నెకు నేరుగా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే అవకాశం రాకపోవడంతో నిర్వాహకులు వైల్డ్ కార్డు కేటాయించారు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేతగా జనిక్ సినర్..
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సరికొత్త ఛాంపియన్‌గా ఇటలీ యువ సంచలనం జనిక్ సినర్ అవతరించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ -2024 పురుషల సింగిల్ విజేతగా జనిక్ సినర్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్పై 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో సంచలన విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో ఓడిపోయిన సినర్.. తిరిగి పుంజుకుని వరుసగా మూడు సెట్లలో మెద్వెదెవ్‌ను చిత్తు చేశాడు. 22 ఏళ్ల యానిక్ సినెర్‌కు మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. అంతకుముందు సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్, సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌ను సినెర్ ఓడించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విజయంతో గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న మూడవ ఇటాలియన్ ఆటగాడిగా సినర్ రికార్డులకెక్కాడు. సినర్ కంటే ముందు రోలాండ్ గారోస్, నికోలా పిట్రాంజెలీ టైటిల్‌లను గెలుచుకున్నారు. -
క్వార్టర్ ఫైనల్లో కిరణ్ జార్జి పరాజయం
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి పోరాటం ముగిసింది. జకార్తాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి 14–21, 6–21తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మస్కట్‌లో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రజని కెపె్టన్సీలోని భారత జట్టు 6–3తో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. ఫైనల్లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్లో భారత్ తరఫున అక్షత, మరియానా, ముంతాజ్, రుతుజా, జ్యోతి అజ్మీనా ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోంది. Australian Open 2024- మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఇటలీకి చెందిన 22 ఏళ్ల యానిక్ సినెర్.. ఫైనల్లోమెద్వెదెవ్తో తలపడనున్నాడు. జొకోవిచ్‌ను ఓడించిన సినెర్.. జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచి మెద్వెదేవ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. -
జొకోవిచ్‌కు సినెర్ షాక్
మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. డిఫెండింగ్ చాంపియన్, 10 సార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సెర్బియా దిగ్గజం జొకోవిచ్ ఈసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్, ఇటలీకి చెందిన 22 ఏళ్ల యానిక్ సినెర్ ధాటికి జొకోవిచ్ సెమీఫైనల్లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో సినెర్ 3 గంటల 22 నిమిషాల్లో 6–1, 6–2, 6–7 (6/8), 6–4తో జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జొకోవిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో ఆడిన సినెర్ తొమ్మిది ఏస్‌లు సంధించి, 31 విన్నర్స్ కొట్టాడు. జొకోవిచ్ సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన సినెర్ తన సర్విస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశమే ఇవ్వలేదు. మరోవైపు జొకోవిచ్ 54 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)తో సినెర్ తలపడతాడు. రెండో సెమీఫైనల్లో మెద్వెదెవ్ 4 గంటల 18 నిమిషాల్లో 5–7, 3–6, 7–6 (7/4), 7–6 (7/5), 6–3తో ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)పై అద్భుత విజయం సాధించి ఈ టోరీ్నలో మూడోసారి, ఓవరాల్‌గా ఆరోసారి గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఫైనల్‌కు చేరుకున్నాడు.