ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మెన్స్ సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ టెన్నిస్ నెం1 జానిక్ సిన్నర్(Jannik Sinner) అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అమెరికా టెన్నిస్ ఆటగాడు బెన్ షెల్టాన్‌ను 7-6(7/2), 6-2, 6-2 తేడాతో ఓడించిన సిన్నర్.. వరుసగా రెండో సారి తన ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాడు.
అంతకుముందు జరిగిన మరో సెమీఫైనల్లో గాయం కారణంగా సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్(Novak Djokovic) గాయం కారణంగా తప్పకోవడంతో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఫైనల్‌కు చేరాడు. ఈ క్రమంలో ఆదివారం(జనవరి 27) జరగనున్న ఫైనల్ పోరులో జానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరెవ్ పోటీపడనున్నారు.
కాగా ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న జానిక్ సిన్నర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్స్‌కు వరుసగా రెండో సారి ఆర్హత సాధించిన తొలి ఇటాలియన్ టెన్నిస్ ప్లేయర్‌గా సిన్నర్ నిలిచాడు.
గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్‌లను సొంతం చేసుకున్న సిన్నర్.. నోవాక్ జొకోవిచ్ వెనక్కి నెట్టి నెం1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. మెన్స్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో సిన్నర్ ప్రస్తుతం అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి జొకొవిచ్ అవుట్.. కారణం ఇదే!
Comments
Please login to add a commentAdd a comment