Novak Djokovic
-
జొకోవిచ్‌కు చుక్కెదురు
దోహా: కెరీర్లో 100వ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఈ ఏడాది బరిలోకి దిగిన మూడో టోర్నమెంట్లోనూ సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు నిరాశ ఎదురైంది. ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో మూడో సీడ్‌గా పోటీపడ్డ జొకోవిచ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ మాజీ ఆరో ర్యాంకర్, 2021 వింబుల్డన్ టోర్నీ రన్నరప్ మాటియో బెరెటిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో 37 ఏళ్ల జొకోవిచ్ 6–7 (4/7), 2–6తో ఓడిపోయాడు.గతంలో జొకోవిచ్‌తో ఆడిన నాలుగుసార్లూ ఓడిపోయిన బెరెటిని ఐదో ప్రయత్నంలో తొలిసారి గెలుపొందడం విశేషం. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 9 ఏస్‌లు... బెరెటిని 13 ఏస్‌లు సంధించారు. బెరెటిని సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసేందుకు వచి్చన అవకాశాలను జోకోవిచ్ చేజార్చుకోగా... బెరెటిని తన ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. -
‘నమ్మకం కోల్పోయాం’
దోహా: ప్రపంచ టెన్నిస్ నంబర్‌వన్ యానిక్ సినెర్ డోపింగ్ ఉదంతం... ఇటీవలే అతనికి విధించిన శిక్షపై సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ), ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)లు రెండూ పక్షపాత ధోరణితో వ్యవహరించాయని 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల చాంపియన్ బాహాటంగా తన అసంతృప్తిని వెలిబుచ్చాడు. ‘తాజా ఘటనతో టెన్నిస్ ప్లేయర్లంతా నమ్మకం కోల్పోయారు. ఎందుకంటే ఇటు ఐటీఐఏ కానీ, అటు ‘వాడా’ కానీ సహేతుకంగా వ్యవహరించలేదు. నిస్పక్షపాత వైఖరి కనబరచలేదు. ఈ రెండు సంస్థల తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానేకాదు. కచి్చతంగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా... టెన్నిస్ క్రీడ ఇమేజ్ను దిగజార్చేలా వ్యవహరించాయి. సుదీర్ఘకాలంగా నానుతున్న సినెర్ డోపింగ్ ఉదంతానికి కంటితుడుపు శిక్షతో పలికిన ముగింపు అసమంజసంగా ఉంది. ఎందుకంటే నేను ఈ విషయమై చాలా మంది ప్లేయర్లతో మాట్లాడాను. వారి అభిప్రాయలను నాతో పంచుకున్నారు. వాళ్లందరు కూడా రెండుసార్లు పట్టుబడిన సినెర్‌కు విధించిన మూడు నెలల శిక్షపై అసంతృప్తిగా ఉన్నారు’ అని జొకోవిచ్ అన్నాడు. ‘సినెర్–ఐటీఐఏ–వాడా’ల మధ్య కుదిరిన ఒప్పందం జరిగిన తప్పిదానికి తగిన శిక్షను ఖరారు చేయలేకపోయిందని పెదవి విరిచాడు. సినెర్లాగే రెండు నమూనాల్లో పాజిటివ్‌గా తేలిన స్పానిష్ మహిళా ఫిగర్ స్కేటర్ లౌరా బార్కెలోపై ‘వాడా’ ఏకంగా ఆరేళ్ల నిషేధం తాజాగా తెరపైకి వచ్చింది. క్రీడాలోకంలో చర్చనీయాంశమైంది. ‘వాడా’ వివరణ ఇది... మాడ్రిడ్: డోపింగ్‌లో దొరికిన టెన్నిస్ స్టార్ సినెర్‌కు, స్పెయిన్ స్కేటర్ లౌరా బార్కెరోలకు వేర్వేరు శిక్షలు విధించడంపై ‘వాడా’ వివరణ ఇచ్చింది. ‘ఇద్దరి నమూనాల్లో పాజిటివ్‌గా తేలినప్పటికీ లౌరా తన శరీరంలోకి నిషిద్ధ ఉత్రేరకాలు ఎలా ప్రవేశించాయో సరైన కారణాన్ని చెప్పలేకపోయింది. ఈ కారణాన్ని బలపరిచే రుజువు (సాక్ష్యం)ను చూపించలేదు. కానీ సినెర్ కావాలని తీసుకోలేదని, బహుశా తాను తీసుకున్న మెడిసిన్ లేదంటే మసాజ్‌కు వాడిన తైలం రూపంలో తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని తను వాడిన మెడిసిన్లతో సహా సంజాయిషీ ఇచ్చాడు’ అని ‘వాడా’ తెలిపింది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఊహించని సంఘటన.. జొకోవిచ్ గుడ్‌బై చెప్పేస్తాడా?
వయసుతో సంబంధం లేకుండా ఆడుతూ టెన్నిస్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన 37 ఏళ్ళ నోవాక్ జొకోవిచ్ చివరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో ప్రేక్షకుల నిరసనల మధ్య నిష్క్రమించడం చాలా బాధాకరం. శుక్రవారం అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జరిగిన సెమీఫైనల్లో మొదటి సెట్‌ను కోల్పోయిన తర్వాత ఎడమ కాలిలో కండరాల నొప్పుల కారణంగా నిష్క్రమిస్తున్నట్టు జొకోవిచ్ ప్రకటించాడు. జొకోవిచ్ తొలి సెట్ ను 7-6 (5) తేడాతో కోల్పోయిన అనంతరం నెట్ చుట్టూ నడిచి జ్వెరెవ్‌కు కరచాలనం చేసి ఓటమి అంకీకరిస్తూ ప్రేక్షకులకు అభివాదం చేసి వెనుదిరిగాడు.సెర్బియా కు చెందిన జొకోవిచ్ మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రారంభంలో ఒక సెట్ ని కోల్పోయినప్పటికీ మూడో సీడ్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ విసిరిన సవాలును గట్టిగా ఎదుర్కొని 4-6, 6-4, 6-3, 6-4 తేడాతో విజేత గా నిలిచి సెమీఫైనల్ కి దూసుకెళ్లాడు.రికార్డు స్థాయిలో తన పదకొండవ ఆస్ట్రేలియన్ ఓపెన్ కిరీటాన్ని గెలుచుకోవడానికి జొకోవిచ్ తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ చివరికి ఒక అడుగు దూరంలో గాయం కారణంగా తలొగ్గాల్సింది. జొకోవిచ్ మళ్ళీ క్వార్టర్ ఫైనల్స్ ఆడిన రీతిలోనే అదే స్పూర్తితో ఆడి గెలుపొంది ఫైనల్ కి దూసుకెళ్తాడని ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రేక్షకులు ఆశించారు. ఇందుకోసం వారంతా ఏంతో ఖర్చు పెట్టి స్టేడియం కి వచ్చారు. అయితే జొకోవిచ్ ఈ రీతి లో వైదొలగడం వారికి ఎంతో నిరాశ పరిచింది. మ్యాచ్ అనంతరం జొకోవిచ్ మాట్లాడుతూ, జెరెవ్ కు శుభాకాంక్షలు చెప్పాడు. “సాషాకు శుభాకాంక్షలు, అతను తన మొదటి స్లామ్‌కు సాధించడానికి సంపూర్ణంగా అర్హుడు," అని కితాబు ఇచ్చాడు. గత సంవత్సరం కూడా జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో సెమీఫైనల్ దశలోనే నిష్క్రమించడం గమనార్హం. 2017 తర్వాత మొదటిసారిగా జొకోవిచ్ ఒక గ్రాండ్ స్లాం కూడా గెలవక పోవడం ఇదే మొదటి సారి. అయితే జొకోవిచ్ గత ఏడాది ఒలింపిక్ స్వర్ణం సాధించడం విశేషం.ఈ ఏడాదిలో తనకెంతో ఇష్టమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మరోసారి సెమిస్ స్థాయి నుంచే వైదొలగడం తో ఇంక జొకోవిచ్ కూడా తన చిరకాల ప్రత్యర్థులైన ఫెదరర్, రాఫెల్ నాదల్ లాగానే త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అతని అభిమానులు భావిస్తున్నారు. గత కొంత కాలంగా జొకోవిచ్ తండ్రి అతనిని రిటైర్మెంట్ ప్రకటించమని ఒత్తిడి చేస్తుండటం గమనార్హం."గత కొంత కాలంగా నన్ను టెన్నిస్ నుంచి రిటైర్ చేయించడానికి నాన్న ప్రయత్నిస్తున్నారు. టెన్నిస్ లో ఇంకా ఏమి సాధించాలని భావిస్తున్నావ్" అని అయన ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘంగా టెన్నిస్ ఆడటం వల్ల అది అతని శరీరం పై ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే జొకోవిచ్ ని అతని తండ్రి రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి చేసున్నానడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకోవడంతో జొకోవిచ్ పై మరింత ఒత్తిడి పెరుగుతుందనడంలో సందేహం లేదు. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రేక్షకులు జొకోవిచ్ వంటి అరుదైన ఆటగాడిని ఆ విధంగా గేలి చేయడం మాత్రం ఏ విధంగా సమర్థనీయం కాదు. -
ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరిన సిన్నర్..
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మెన్స్ సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ టెన్నిస్ నెం1 జానిక్ సిన్నర్(Jannik Sinner) అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అమెరికా టెన్నిస్ ఆటగాడు బెన్ షెల్టాన్‌ను 7-6(7/2), 6-2, 6-2 తేడాతో ఓడించిన సిన్నర్.. వరుసగా రెండో సారి తన ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాడు.అంతకుముందు జరిగిన మరో సెమీఫైనల్లో గాయం కారణంగా సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్(Novak Djokovic) గాయం కారణంగా తప్పకోవడంతో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఫైనల్‌కు చేరాడు. ఈ క్రమంలో ఆదివారం(జనవరి 27) జరగనున్న ఫైనల్ పోరులో జానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరెవ్ పోటీపడనున్నారు.కాగా ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న జానిక్ సిన్నర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్స్‌కు వరుసగా రెండో సారి ఆర్హత సాధించిన తొలి ఇటాలియన్ టెన్నిస్ ప్లేయర్‌గా సిన్నర్ నిలిచాడు.గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్లను సొంతం చేసుకున్న సిన్నర్.. నోవాక్ జొకోవిచ్ వెనక్కి నెట్టి నెం1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. మెన్స్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో సిన్నర్ ప్రస్తుతం అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు.చదవండి: Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి జొకొవిచ్ అవుట్.. కారణం ఇదే! -
ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి జొకొవిచ్ అవుట్.. కారణం ఇదే!
ఆస్టేలియా ఓపెన్-2025(Australian Open 2025) టోర్నమెంట్లో సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకొవిచ్(Novak Djokovic) ప్రయాణం ముగిసింది. గాయం కారణంగా శుక్రవారం నాటి సెమీ ఫైనల్ మ్యాచ్ మధ్యలోనే అతడు వైదొలిగాడు. తద్వారా టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా నిలవాలన్న జొకొవిచ్ కలకు బ్రేక్ పడింది.కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రికార్డుస్థాయిలో ఏకంగా పది సార్లు టైటిల్ సాధించిన ఘనత జొకొవిచ్ సొంతం. కేవలం గతేడాది మాత్రమే అతడు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సెమీ ఫైనల్లో ఓడిపోయాడు. అయితే, ఈసారి మాత్రం మరింత జాగ్రత్తగా అడుగులు వేసిన జొకొవిచ్‌కు గాయం రూపంలో దురదృష్టం ఎదురైంది.అల్కరాజ్ అడ్డంకిని అధిగమించిక్వార్టర్ ఫైనల్లో.. తనకు ప్రధాన అడ్డంకిగా భావించిన అల్కరాజ్తో హోరాహోరీ పోటీలో గెలుపొందిన జొకొవిచ్ సెమీస్‌కు దూసుకువచ్చాడు. ఈ క్రమంలో జర్మన్ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్(Alexander Zverev)తో సెమీ ఫైనల్లో తలపడ్డాడు. ఇందులో భాగంగా తొలి సెట్‌ను జ్వెరెవ్ 7-6తో గెలుచుకున్నాడు.పోటీ నుంచి తప్పుకొంటున్నాఅయితే, ఆ వెంటనే నెట్ దగ్గరికి వెళ్లిన జొకొవిచ్ జ్వెరెవ్‌తో కరచాలనం చేసి.. తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. దీంతో సెమీస్ విజేతగా నిలిచిన జ్వెరెవ్ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టాడు. కాగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ జొకొవిచ్ కాలి నొప్పితో ఇబ్బంది పడినట్లు కనిపించాడు. తాజాగా సెమీస్ మ్యాచ్‌లో బాధ భరించలేక వైదొలిగాడు.ఈ నేపథ్యంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేసిన కారణంగానే ఈ సెర్బియా స్టార్ గాయపడ్డాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. రిటైర్మెంట్కు చేరువైన 37 ఏళ్ల నొవాక్ జొకొవిచ్ తాజా గాయం వల్ల.. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవకుండానే ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించడం గమనార్హం.జొకొవిచ్‌కు చేదు అనుభవంసెమీ ఫైనల్ బరి నుంచి తప్పించుకుని కోర్టును వీడుతున్న సమయంలో నొవాక్ జొకొవిచ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది ప్రేక్షకులు అతడి గాయం గురించి హేళన చేసేలా మాట్లాడుతూ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జ్వెరెవ్ తన ప్రత్యర్థి ఆటగాడికి మద్దతుగా నిలిచాడు.జ్వెరెవ్ క్రీడాస్ఫూర్తి‘‘గాయం వల్ల కోర్టును వీడిన వ్యక్తిని అవమానించేలా మాట్లాడటం సరికాదు. దయచేసి కాస్త సంయమనం పాటించండి. మీలో ప్రతి ఒక్కరు టికెట్ల కోసం డబ్బులు చెల్లించారని తెలుసు. కాబట్టి ఐదు సెట్ల మ్యాచ్‌ను చూడాలని ఆశించడం మీ హక్కు.కానీ పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. గత ఇరవై ఏళ్లుగా ఆట కోసం తన సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి నొవాక్ జొకొవిచ్. దయచేసి అతడిని ఏరకంగానూ హేళన చేయకండి’’ అని జ్వెరెవ్ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు.చదవండి: Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం -
జొకోవిచ్ 430
మెల్బోర్న్: తనకెంతో కలిసొచ్చిన గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదికపై సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో రికార్డు బద్దలు కొట్టాడు. ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా జొకోవిచ్ అవతరించాడు. 429 మ్యాచ్‌లతో స్విట్జర్లాండ్ లెజెండ్ రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును 430వ మ్యాచ్‌తో జొకోవిచ్ అధిగమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో 10 సార్లు చాంపియన్ జొకోవిచ్ 6–1, 6–7 (4/7), 6–3, 6–2తో కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడిన జైమీ ఫారియా (పోర్చుగల్)పై గెలుపొందాడు. 3 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌కు రెండో సెట్లో మాత్రమే ప్రతిఘటన ఎదురైంది. 14 ఏస్‌లు సంధించిన ఈ సెర్బియా స్టార్ కేవలం రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 33 విన్నర్స్ కొట్టడంతోపాటు 33 అనవసర తప్పిదాలు చేసిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. నెట్ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి 9 సార్లు పాయింట్లు నెగ్గిన ఈ మాజీ చాంపియన్‌కు మూడో రౌండ్లో 26వ సీడ్ టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్) రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. కెరీర్లో 77వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న జొకోవిచ్ ఇప్పటి వరకు 379 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో గెలిచాడు. ఇది కూడా ఒక రికార్డే. 369 ‘గ్రాండ్’ విజయాలతో ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును గత ఏడాదే జొకోవిచ్ సవరించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో జొకోవిచ్, ఫెడరర్ తర్వాత సెరెనా విలియమ్స్ (423), రాఫెల్ నాదల్ (358), వీనస్ విలియమ్స్ (356) ఉన్నారు. జ్వెరెవ్, అల్కరాజ్ ముందంజ మరోవైపు రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టగా... ఆరో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. జ్వెరెవ్ 6–1, 6–4, 6–1తో మార్టినెజ్ (స్పెయిన్)పై, అల్కరాజ్ 6–0, 6–1, 6–4తో నిషియోకా (జపాన్)పై అలవోకగా గెలిచారు. రూడ్ 2 గంటల 44 నిమిషాల్లో 2–6, 6–3, 1–6, 4–6తో జాకుబ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు. ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన రూడ్ ఇప్పటి వరకు ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. బోపన్న జోడీకి షాక్ పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్నకు చుక్కెదురైంది. గత ఏడాది మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో ఈ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన బోపన్న ఈసారి కొత్త భాగస్వామి బారింటోస్ (కొలంబియా)తో కలిసి బరిలోకి దిగాడు. తొలి రౌండ్లో 14వ సీడ్ బోపన్న–బారింటోస్ ద్వయం 5–7, 6–7 (5/7)తో పెడ్రో మార్టినెజ్–జామి మునార్ (స్పెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జంట కూడా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. యూకీ–ఒలివెట్టి ద్వయం 2–6, 6–7 (3/7)తో ట్రిస్టన్ స్కూల్‌కేట్–ఆడమ్ వాల్టన్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో పరాజయం పాలైంది. కిన్వెన్ జెంగ్ అవుట్మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనం నమోదైంది. గత ఏడాది రన్నరప్, ఐదో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్లో 36 ఏళ్ల లౌరా సిగెమండ్ (జర్మనీ) 7–6 (7/3), 6–3తో కిన్వెన్ జెంగ్‌ను బోల్తా కొట్టించి మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్), మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఏడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. సబలెంకా 6–3, 7–5తో బుజాస్ మనీరో (స్పెయిన్)పై, కోకో గాఫ్ 6–3, 7–5తో జోడీ బురాజ్ (బ్రిటన్)పై, పెగూలా 6–4, 6–2తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) 1–6, 6–1, 6–3తో 20వ సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై, 14వ సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా) 6–4, 3–6, 7–6 (10/8)తో మొయూక ఉచిజిమా (జపాన్)పై, 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) 6–1, 6–0తో తాలియా గిబ్సన్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు. -
Australian Open: జొకోవిచ్‌కు ముచ్చెమటలు పట్టించిన తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్
అటువైపు ప్రత్యర్థి 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత... ఏకంగా 1126 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ప్లేయర్... కెరీర్లో ఇప్పటికే 76 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన అనుభవం సొంతం... ఇటువైపు ప్లేయర్‌కు ‘వైల్డ్ కార్డు’ ద్వారా కెరీర్లోనే తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడే అవకాశం... ఎదురైన ప్రత్యర్థి తానెంతో ఇష్టపడే ఆటగాడు... ఇద్దరి బలాబలాలు పరిశీలిస్తే మ్యాచ్ ఏకపక్షంగా వరుస సెట్లలో ముగియడం ఖాయమని విశ్లేషకుల ఏకాభిప్రాయం... కానీ అలాంటిదేమీ జరగలేదు. ఒకే ఒక్క మ్యాచ్‌తో టెన్నిస్ ప్రపంచాన్ని ఆకర్షించేందుకు వచ్చిన అవకాశాన్ని ఆ కుర్రాడు వదులుకోలేదు. తన అసమాన పోరాటపటిమతో అందరి దృష్టిలో పడ్డాడు. అతడే 19 ఏళ్ల నిశేష్ బసవరెడ్డి... తెలుగు సంతతికి చెందిన అమెరికన్ టెన్నిస్ టీనేజ్ రైజింగ్ స్టార్.. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో నిశేష్ తొలి రౌండ్లోనే ఓడిపోయినా... ప్రతి పాయింట్ సాధించేందుకు జొకోవిచ్‌ను తెగ కష్టపెట్టాడు. నిశేష్‌కు ఎంతో భవిష్యత్ ఉందని మ్యాచ్ అనంతరం జొకోవిచ్ కూడా వ్యాఖ్యానించడం విశేషం. మెల్బోర్న్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తొలి అడ్డంకిని అధిగమించాడు. ప్రపంచ 107వ ర్యాంకర్, అమెరికన్ రైజింగ్ టీనేజ్ టెన్నిస్ స్టార్ నిశేష్ బసవరెడ్డితో జరిగిన తొలి రౌండ్ పోరులో జొకోవిచ్ గెలిచి 18వ సారి ఈ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 2 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నిశేష్ 6–4, 3–6, 4–6, 2–6తో జొకోవిచ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. గత నెలలోనే ప్రొఫెషనల్‌గా మారిన 19 ఏళ్ల నిశేష్ ఏమాత్రం తడబడకుండా తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బేస్‌లైన్ వద్ద సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూనే... అడపాదడపా డ్రాప్ షాట్లు... కళ్లు చెదిరే రిటర్న్‌లతో వరుసగా 21వ ఏడాది గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న జొకోవిచ్‌కు ఇబ్బంది పెట్టడంలో నిశేష్ సఫలమయ్యాడు. తొలి సెట్లోని ఎనిమిదో గేమ్‌లో జొకోవిచ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన నిశేష్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 5–3తో ముందంజ వేశాడు. తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్ కాపాడుకోగా... పదో గేమ్‌లో నిశేష్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను 49 నిమిషాల్లో 6–4తో సొంతం చేసుకోవడంతో మ్యాచ్‌ను మైదానంలో ప్రత్యక్షంగా చూస్తున్న వేలాది మంది ప్రేక్షకులు, టీవీల ముందున్న లక్షలాది వీక్షకులు ఆశ్చర్యపోయారు. తొలి సెట్ నెగ్గిన ఉత్సాహంతో రెండో సెట్లోనూ నిశేష్ భేషుగ్గా ఆడాడు. అయితే అపార అనుభవజ్ఞుడైన జొకోవిచ్ టీనేజర్ నిశేష్ ఆటతీరుపై అవగాహన పెంచుకొని దూకుడు పెంచాడు. స్కోరు 4–3 వద్ద ఎనిమిదో గేమ్‌లో నిశేష్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని 44 నిమిషాల్లో రెండో సెట్ దక్కించుకొని లయలోకి వచ్చాడు. రెండో సెట్లోని చివరి గేమ్ ఆడుతున్న సమయంలో నిశేష్ కాలు బెణకడంతో అతను ఆ తర్వాత చురుగ్గా కదల్లేకపోయాడు. మరోవైపు జొకోవిచ్ మరింత జోరు పెంచాడు. మూడో సెట్లోని తొలి గేమ్‌లోనే నిశేష్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సరీ్వస్‌లను కాపాడుకొని 43 నిమిషాల్లో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నాలుగో సెట్లో కూడా తొలి గేమ్‌లో, ఐదో గేమ్‌లో నిశేష్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన జొకోవిచ్ కళ్లు చెదిరే ఏస్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ‘నిశేష్ పరిపూర్ణ క్రీడాకారుడిలా ఆడాడు. అతను ఆడిన కొన్ని షాట్లు నన్నే ఆశ్చర్యానికి గురి చేశాయి. చివరి పాయింట్ వరకు పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. భవిష్యత్ లో నిశేష్ ఆటతీరును చాలాసార్లు చూస్తాము. ఇందులో సందేహం లేదు’ అని మ్యాచ్ ముగిశాక జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. 2005లో అమెరికాలో పుట్టి పెరిగిన నిశేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు. నిశేష్ తల్లిదండ్రులు మురళీ రెడ్డి, సాయిప్రసన్న స్వస్థలం నెల్లూరు జిల్లా. 1999లో ఉద్యోగరీత్యా భారత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తొలి రౌండ్లో ఓడిన నిశేష్‌కు 1,32,000 ఆ్రస్టేలియన్ డాలర్ల (రూ. 70 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ ముగిశాక విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో నిశేష్ కెరీర్ బెస్ట్ 104వ ర్యాంక్‌కు చేరుకుంటాడు. అల్కరాజ్ అలవోకగా... పురుషుల సింగిల్స్‌లో సోమవారం స్టార్ ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 11వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా... డిఫెండింగ్ చాంపియన్ సినెర్ (ఇటలీ), మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. 2023 ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ సిట్సిపాస్ 5–7, 3–6, 6–2, 4–6తో మికిల్సన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. 2018 తర్వాత ఈ టోర్నీలో సిట్సిపాస్ తొలి రౌండ్లోనే ఓడిపోవ డం గమనార్హం. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సినెర్ 7–6 (7/2), 7–6 (7/5), 6–1తో నికోలస్ (చిలీ)పై, అల్కరాజ్ 6–1, 7–5, 6–1తో షెవ్చెంకో (కజకిస్తాన్)పై విజయం సాధించారు. పసారో (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో పదో సీడ్ దిమిత్రోవ్ గాయం కారణంగా రెండో సెట్లో వైదొలిగాడు. 21-టెన్నిస్ ఓపెన్ శకంలో (1968 నుంచి) వరుసగా 21వ ఏడాది జొకోవిచ్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఒక్క విజయమైనా సాధించాడు. ఈ జాబితాలో రోజర్ ఫెడరర్ (22 ఏళ్లు) మాత్రమే ముందున్నాడు. 429-ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ఫెడరర్ (429 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో బరిలోకి దిగితే ఫెడరర్ రికార్డును అధిగమిస్తాడు. -
మ్యాక్స్‌వెల్ ఊచకోత.. సిక్సర్ల సునామీ
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉగ్రరూపం దాల్చాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (45/4) ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మ్యాక్స్‌వెల్.. 52 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మ్యాక్సీ.. ఇన్నింగ్స్ 16వ ఓవర్ నుంచి గేర్ మార్చాడు. ఆడమ్ జంపా వేసిన 16వ ఓవర్లో సిక్సర్, బౌండరీ బాదిన మ్యాక్స్‌వెల్.. కేన్ రిచర్డ్సన్ వేసిన ఆతర్వాతి ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. ఈ ఓవర్లో అతను బౌండరీ, రెండు భారీ సిక్సర్లు బాదాడు. GLENN MAXWELL HITS 122 METER SIX IN BBL. 🤯- Glenn Maxwell, The Big Show..!!! 🔥pic.twitter.com/zcwV3b28Hd— Tanuj Singh (@ImTanujSingh) January 12, 2025ఈ ఓవర్లోని తొలి సిక్సర్ (రెండో బంతి) బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే అతి భారీ సిక్సర్‌గా రికార్డైంది. ఈ సిక్సర్ 122 మీటర్ల దూరం వెళ్లింది. మ్యాకీకి ముందు బీబీఎల్‌లో భారీ సిక్సర్ రికార్డు సహచరుడు హిల్టన్ కార్ట్‌రైట్ పేరిట ఉండింది. ఇదే సీజన్లో కార్ట్‌రైట్ 121 మీటర్ల సిక్సర్ బాదాడు.అనంతరం సదర్‌ల్యాండ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్లో అతను మూడు భారీ సిక్సర్లు సహా ఓ బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో మ్యాక్సీ వరుసగా తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. సెంచరీకి 10 పరుగుల దూరంలో ఉండగా మ్యాక్సీ 20వ ఓవర్ తొలి బంతికి ఔటయ్యాడు. కేన్ రిచర్డ్సన్ మ్యాక్సీని క్లీన్ బౌల్డ్ చేశాడు. మ్యాక్స్‌వెల్ పుణ్యమా అని ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 165 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌కు ఎవరి సహకారం లభించనప్పటికీ ఒక్కడే ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఖాతా కూడా తెరవని ఉసామా మిర్‌తో మ్యాక్స్‌వెల్ ఎనిమిదో వికెట్‌కు 81 పరుగులు జోడించడం విశేషం. ఈ 81 పరుగులను మ్యాక్స్‌వెల్ ఒక్కడే చేశాడు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ స్టార్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఆతర్వాత బెన్ డకెట్ (21), బ్యూ వెబ్‌స్టర్ (15) కొద్దిసేపు క్రీజ్‌లో నిలబడ్డారు. 32 పరుగుల వద్ద బెన్ డకెట్, థామస్ రోజర్స (0) ఔటయ్యారు. అనంతరం 45 పరుగుల వద్ద వెబ్‌స్టర్, 55 పరుగుల వద్ద సోయినిస్ (18), 63 పరుగుల వద్ద కార్ట్‌రైట్ (6), 75 పరుగుల వద్ద జోయల్ పారిస్ (3) పెవిలియన్‌కు చేరారు. 11 ఓవర్లలో మెల్బోర్న్ స్టార్స్ ఏడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేసేలా కనిపించలేదు. ఈ దశలో మ్యాక్సీ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రెనెగేడ్స్ బౌలర్లలో టామ్ రోజర్స్, ఫెర్గస్ ఓనీల్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జేకబ్ బేతెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.NOVAK DJOKOVIC AT THE BBL. 🐐- The reaction after Stoinis was out. 😄pic.twitter.com/eruRdky7yL— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2025సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన జకోవిచ్ఈ మ్యాచ్ చూసేందుకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ వచ్చాడు. జకో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో జకో మెల్బోర్న్ స్టార్స్‌కు మద్దతుగా నిలిచాడు. స్టార్స్ కెప్టెన్ స్టోయినిస్ ఔట్ కాగానే జకో నిరాశ చెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.తడబడుతున్న రెనెగేడ్స్166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రెనెగేడ్స్ 13 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. మార్క్ స్టీకిటీ (3-0-14-3) అద్భుతంగా బౌలింగ్ చేసి రెనెగేడ్స్‌ను దెబ్బకొట్టాడు. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో జోష్ బ్రౌన్ 4, మార్కస్ హ్యారిస్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 19, జేకబ్ బేతెల్ 1, విల్ సదర్‌ల్యాండ్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. టిమ్ సీఫర్ట్ 26, హ్యారీ డిక్సన్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రెనెగేడ్స్ గెలవాలంటే 42 బంతుల్లో 88 పరుగులు చేయాలి. -
‘అప్పుడు నాపై విష ప్రయోగం జరిగింది’
సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ సంచలన విషయం బయటపెట్టాడు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడేందుకు వచ్చినపుడు తనపై విష ప్రయోగం జరిగిన మాట నిజమేనని వెల్లడించాడు. 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు రాగా తనకు వడ్డించిన ఆహారంలో తీవ్రస్థాయిలో మెర్క్యూరీ, లోహం అవశేషాలున్నట్లు పరీక్షల్లో తెలిందని చెప్పాడు.ఆ మేగజైన్ తిరగేస్తే మీకే తెలుస్తుంది ‘ఈ విషయం జీకే మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాను. ఇప్పుడు మళ్లీ స్పందించకుండా ఉండాలనుకుంటున్నా. అందుకు నన్ను నేను అభినందించుకోవాలి. ఎందుకంటే ఇక్కడికొచ్చిన పని వేరు.ఈ స్పందన వేరు. ఇక్కడ నేను టోర్నీ ఆడాలి. ఆ పనేదో చూసుకుంటే మంచిది’ అని జొకోవిచ్ అన్నాడు. ఆసక్తి గలవారికి మరిన్ని వివరాలు కావాలనుకుంటే తాను ఇంటర్వ్యూ ఇచ్చిన మేగజైన్‌ను తిరగేస్తే బాగుంటుందని పేర్కొన్నాడు.కాగా... మూడేళ్ల క్రితం కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకోని కారణంగా జొకోను టోర్నీ ఆడేందుకు నిరాకరించారు. విమానాశ్రయంలోని హోటల్ గదిలోనే నిర్బంధించారు. ‘ఆ సమయంలో నాకు ఇచ్చిన ఆహరం తినడం వల్లే అస్వస్థతకు గురయ్యాను. కానీ ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరికీ, ఎక్కడ చెప్పనేలేదు. సెర్బియా వెళ్లాక ల్యాబ్ పరీక్షల్లో అత్యధిక స్థాయిలో ప్రమాదకర మెర్క్యురి, లెడ్ అవశేషాలు ఉన్నట్లు తేలింది’ అని 37 ఏళ్ల నొవాక్ గత చేదు అనుభవాన్ని తాజాగా వివరించాడు. ప్రస్తుతం 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో ఉన్న ఈ సెర్బియన్ సూపర్‌స్టార్ 25వ రికార్డు టైటిల్‌పై దృష్టి పెట్టాడు. మరిన్ని క్రీడా వార్తలుపోరాడి ఓడిన యూకీ–ఒలివెట్టి జోడీ ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్–ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం 3–6, 6–1, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ నికోల్ మెక్టిక్ (క్రొయేషియా)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ, ఒలివెట్టి ఒక్క ఏస్ కూడా సంధించకుండానే ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం.తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన యూకీ–ఒలివెట్టి ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశారు. చెరో సెట్ గెలిచాక నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో మెక్టిక్–వీనస్ ద్వయం పైచేయి సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో ఓడిన యూకీ–ఒలివెట్టి జంటకు 11,310 డాలర్ల (రూ. 9 లక్షల 74 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తమిళనాడు డ్రాగన్స్ జోరురూర్కేలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో తమిళనాడు డ్రాగన్స్ జట్టు జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న డ్రాగన్స్ నాలుగో గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో తమిళనాడు డ్రాగన్స్ 2–1 గోల్స్ తేడాతో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్‌పై విజయం సాధించింది. తమిళనాడు డ్రాగన్స్ తరఫున సెల్వం కార్తీ (16వ నిమిషంలో), ఉత్తమ్ సింగ్ (37వ నిమిషంలో) చెరో ఫీల్డ్ గోల్ సాధించారు.బెంగాల్ టైగర్స్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (35వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. తొలి క్వార్టర్లో ఇరు జట్లు గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా... రెండో క్వార్టర్ ఆరంభంలోనే కార్తి గోల్‌తో తమిళనాడు బోణీ కొట్టింది. మూడో క్వార్టర్లో టైగర్స్ ప్లేయర్ రూపిందర్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో స్కోరు సమం కాగా... మరో రెండు నిమిషాల వ్యవధిలో ఉత్తమ్ సింగ్ గోల్ చేయడంతో డ్రాగన్స్ తిరిగి ఆధిక్యంలోకి వెళ్లింది.చివరి వరకు అదే జోరు కొనసాగించిన తమిళనాడు జట్టు విజయం సాధించింది. తాజా సీజన్లో 5 మ్యాచ్‌లాడి నాలుగు విజయాలు సాధించిన డ్రాగన్స్ 12 పాయింట్లతో పట్టిక అగ్రస్థానానంలో నిలిచింది. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 9 పాయింట్లు ఖాతాలో వేసుకున్న బెంగాల్ టైగర్స్ పట్టికలో రెండో స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా శనివారం జరిగే మ్యాచ్‌ల్లో హైదరాబాద్ తూఫాన్స్తో సూర్మా హాకీ క్లబ్, ఢిల్లీ ఎస్జీ పైపర్స్‌తో యూపీ రుద్రాస్ తలపడతాయి. -
రిటైర్మెంట్ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న జకోవిచ్
టెన్నిస్ చరిత్రలో 'ఆల్ టైమ్ గ్రేట్' ఎవరు..? టెన్నిస్ అభిమానులు గంటల తరబడి ఈ ప్రశ్న గురించి చర్చించుకుంటారు. ఇంతకీ పురుషుల టెన్నిస్‌లో "GOAT" ఎవరు..? ఈ ప్రశ్నపై జరిగే చర్చలో జాన్ మెకెన్రో, జాన్ బోర్గ్, పీట్ సాంప్రస్, జిమ్మీ కానర్స్ వంటి దిగ్గజాల పేర్లు కచ్చితంగా ప్రస్తావనకు వస్తాయి. కానీ ఇటీవల కాలంలో గ్రాండ్ స్లాం టెన్నిస్ టోర్నమెంట్లను శాసించిన నోవాక్ జకోవిచ్, రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ల పేర్లు ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాయి.ముగ్గురిలో ఒక్కడే మిగిలాడు సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ ఈ జాబితా లో అగ్రస్థానంలో ఉన్నాడు. 2023 యుఎస్ ఓపెన్ విజయం తరువాత జకోవిచ్ మొత్తం 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల తో ఎవ్వరికీ అందనంత ఎత్తు కి చేరుకున్నాడు. జకోవిచ్ తన 24 స్లామ్లలో 10 ఆస్ట్రేలియా ఓపెన్ లో సాధించి, మెల్బోర్న్ హార్డ్ కోర్టులపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు.ఆల్ టైమ్ "క్లే కింగ్" గా పేరుపొందిన నాదల్ తన 22 గ్రాండ్ స్లాం టైటిళ్ల లో 14 ఫ్రెంచ్ ఓపెన్ లో చేజిక్కించుకోగా.. ఫెదరర్ సాధించిన 20 గ్రాండ్ స్లాం విజయాలలో ఎనిమిది వింబుల్డన్ టైటిళ్లు కావడం విశేషం.ఈ ముగ్గురి లో ప్రస్తుతం జకోవిచ్ మాత్రమే టెన్నిస్ బరిలో మిగిలాడు. ఫెదరర్ 2022 సెప్టెంబర్ లో రిటైర్మెంట్ ప్రకటించాడు. గాయాల బారిన పడిన స్పానిష్ ఆటగాడు నాదల్ సైతం గత నవంబర్ లో ఆటకి స్వస్తి చెప్పాడు.గత ఏడాది ఒలింపిక్ స్వర్ణం ఒక్కటేజకోవిచ్ విషయానికి వస్తే, గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో జకో తన మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించాడు. అయితే జకోవిచ్ గతేడాది ఒలింపిక్ స్వర్ణం మినహా మరే గ్రాండ్ స్లాం టైటిల్ గెలవలేక పోయాడు. వచ్చే ఆదివారం ప్రారంభమయ్యే 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకో తన ప్రారంభ రౌండ్లోభారత సంతతి కి చెందిన వైల్డ్‌కార్డ్ ఆటగాడు నిశేష్ బసవరెడ్డితో తలపడనున్నాడు.జకోవిచ్ ఇప్పటికీ తన అద్భుతమైన ప్రదర్శనతో టెన్నిస్ కెరీర్‌ను కొనసాగిస్తున్నప్పటికీ అతని చిరకాల ప్రత్యర్థులైన ఫెదరర్, రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ లతో అతని దృక్పధం లో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా జకోవిచ్ తండ్రి అతని రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి తెస్తున్నాడు. "గత కొంత కాలంగా నన్ను టెన్నిస్ నుంచి రిటైర్ చేయించడానికి నాన్న ప్రయత్నిస్తున్నారు. టెన్నిస్ లో ఇంకా ఏమి సాధించాలని భావిస్తున్నావ్" అని అయన ప్రశ్నిస్తున్నారు.శరీరం పై టెన్నిస్ ప్రభావం సుదీర్ఘంగా టెన్నిస్ ఆడటం వల్ల అది జకో శరీరం పై ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే జకోవిచ్ ని అతని తండ్రి రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి చేసున్నానడంలో సందేహం లేదు. ఈ నేపధ్యం లో తన రిటైర్మెంట్ గురుంచి జకోవిచ్ ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇందుకు ఖచ్చితమైన సమయం ఎప్పుడు, ఎక్కడా అన్న విషయం పై దృష్టి పెట్టాడు. తన కెరీర్‌ను ఎలా ముగించాలనుకుంటున్నాడనే దానిపై ప్రస్తుతం ఎక్కువ దృష్టి పెట్టాడు. "నేను నా టెన్నిస్ కెరీర్ ని ఎలా ముగించాలి, ఎక్కడ ముగించాలి అన్న విషయం పై వ్యూహం సిద్ధం చేయాలి అని భావిస్తున్నాను. అయితే ఇప్పుడే రిటైర్ అవుతానని చెప్పలేను. ప్రస్తుతం టెన్నిస్ లో అగ్ర స్థాయి ఆటగాళ్ల పై విజయం సాధిస్తున్నందున ఇప్పుడే రిటైర్ అవుతానని చెప్పడం లేదు" అని నర్మగర్భంగా తన ఆలోచనని బయటపెట్టాడు.జకోవిచ్ రిటైర్మెంట్ నిర్ణయం.. ఆతను గ్రాండ్ స్లాం పోటీల్లో తలబడే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. గ్రాండ్ స్లాం టోర్నమెంట్ల విషయానికి వస్తే గతేడాది జకోవిచ్ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. అడపాదప కొన్ని టైటిళ్లు గెలిచినా, గ్రాండ్ స్లాం టైటిల్ సాధిస్తేనే జకోవిచ్ తన క్రీడా జీవితాన్ని మరింత కాలం కొనసాగించే అవకాశముంది. లేనిపక్షంలో జకోవిచ్ ఎక్కువ కాలం టెన్నిస్ లో కొనసాగడం కష్టమే.తన కెరీర్‌ను పొడిగించుకోవడానికి, జొకోవిచ్ ఇప్పటికే తన షెడ్యూల్‌ను సర్దుబాటు చేసుకున్నాడు. తక్కువ టోర్నమెంట్లు ఆడుతున్నాడు మరియు గ్రాండ్ స్లాం వంటి మేజర్లపై దృష్టి పెట్టాడు. చాలా మంది తాను ఉన్నత స్థాయిలో రిటైర్ కావాలని నమ్ముతున్నప్పటికీ, జకోవిచ్ శారీరకంగా మరియు మానసికంగా సమర్థుడిగా ఉన్నంత వరకు టెన్నిస్ లో కొనసాగాలని నిశ్చయించుకున్నాడు. "గ్రాండ్ స్లామ్లలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను ఓడించగల సత్తా నాలో ఇప్పటికీ ఉందని భావిస్తే, నేను నా టెన్నిస్ జీవితానికి ఎందుకు గుడ్ బై చెప్పాలనుకుంటాను" అని జకోవిచ్ వ్యాఖ్యానించాడు. -
‘ఇప్పటికీ ఆ బాధ వెంటాడుతోంది’
మెల్బోర్న్: మూడేళ్ల క్రితం 2022 ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడేందుకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఆసీస్ గడ్డపై అడుగు పెట్టాడు. అయితే ఆ సమయంలో అమల్లో ఉన్న కోవిడ్ ఆంక్షల కారణంగా వ్యాక్సిన్ వేసుకున్న వారినే దేశంలోకి అనుమతించారు. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా జొకోవిచ్‌ను విమానాశ్రయంలోనే నిలిపి వేశారు. ఆ తర్వాత అతను కోర్టును ఆశ్రయించడం, ఇతర పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. చివరకు టోర్నీలో ఆడకుండానే జొకోవిచ్‌ను ఆ్రస్టేలియా దేశం నుంచి అధికారులు పంపించి వేశారు. నాటి ఘటన తనను ఇప్పటికీ వెంటాడుతోందని, ఆస్ట్రేలియాకు ఎప్పుడు వచ్చినా దానిని మర్చిపోలేకపోతున్నానని జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచే లక్ష్యంతో ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడేందుకు అతను ఇప్పుడు మళ్లీ వచ్చాడు. ‘నాటి ఘటన నాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పుడే కాదు గత రెండేళ్లుగా ఎప్పుడు ఆ్రస్టేలియాకు వచ్చినా అదే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. పాస్‌పోర్ట్, ఇమిగ్రేషన్ విభాగం నుంచి వద్ద తనిఖీలు జరుగుతుంటే నావైపు ఎవరైనా వస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. పాస్‌పోర్ట్‌ను చెకింగ్ చేస్తుంటే కూడా నన్ను రానిస్తారా, అదుపులోకి తీసుకుంటారా, వెనక్కి పంపిస్తారా అనే సందేహాలు వస్తుంటాయి’ అని జొకోవిచ్ అన్నాడు. అయితే నిజాయితీగా చెప్పాలంటే నాటి సంఘటనకు సంబంధించి తనకు ఎవరీ మీదా కోపంగానీ, ప్రతీకార భావనగానీ లేదని అతను స్పష్టం చేశాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 10 సార్లు విజేతగా నిలిచిన జొకోవిచ్... గత ఏడాది సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు. అయితే రిటైరయ్యే లోగా ఇక్కడ కనీసం మరో టైటిల్ సాధించాలని కోరుకుంటున్నట్లు అతను చెప్పాడు. బ్రిటన్ మాజీ ఆటగాడు ఆండీ ముర్రేను కోచ్‌గా ఎంచుకున్న తర్వాత జొకోవిచ్ ఆడనున్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇదే కానుంది. ఈనెల 12న ప్రారంభమయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ కోసం జొకోవిచ్ మంగళవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. -
జొకోవిచ్‌కు చుక్కెదురు
బ్రిస్బేన్: కెరీర్లో 100వ సింగిల్స్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో కొత్త ఏడాదిలో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు ఆశించిన ఫలితం రాలేదు. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ జొకోవిచ్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ జొకోవిచ్ 6–7 (6/8), 3–6తో అమెరికాకు చెందిన 293వ ర్యాంకర్ రీలీ ఒపెల్కా చేతిలో ఓడిపోయాడు. 2009లో ఒక్కసారి మాత్రమే ఈ టోర్నీలో ఆడి తొలి రౌండ్లో ఓడిపోయిన జొకోవిచ్‌కు ఈసారి కూడా టోర్నీ కలిసి రాలేదు. 1 గంట 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒపెల్కా ఏకంగా 16 ఏస్‌లు సంధించాడు. హోరాహోరీగా సాగిన తొలి సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నారు. నిర్ణాయక టైబ్రేక్‌లో ఒపెల్కా పైచేయి సాధించి తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో ఒకసారి జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకున్న ఒపెల్కా తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 102 కేజీల బరువున్న ఒపెల్కా 2022లో కెరీర్ బెస్ట్ 17వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత గాయం కారణంగా 2023లో కేవలం ఒక టోర్నీలోనే ఆడాడు. గాయం నుంచి కోలుకుని 2024లో పలు టోర్నీల్లో ఆడినా ఒక్క టైటిల్ కూడా సాధించకపోవడంతో అతని ర్యాంక్ పడిపోయింది. -
ఎందుకీ వివక్ష.. ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలు?!
సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్(Novak Djokovic) అంతర్జాతీయ టెన్నిస్ సమగ్రతా సంస్థ (ఐటీఐఏ) తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. డోపీలుగా తేలిన యానిక్ సినెర్(Jannik Sinner), స్వియాటెక్(Iga Swiatek)ల ఉదంతంపై ఐటీఐఏ వ్యవహారశైలిని దుయ్యబట్టాడు. ఐటీఐఏ అవలంభిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు సిగ్గుచేటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్బేన్ ఈవెంట్ కోసంఅదే విధంగా.. టాప్ స్టార్ల డోపింగ్ మరకలపై గోప్యతను పాటించి టెన్నిస్ సమాజం నుంచి నిజాన్ని దాచడంపై సరికాదని పేర్కొన్నాడు. తన కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్.. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీతో కొత్త సీజన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. 2009 తర్వాత బ్రిస్బేన్ ఈవెంట్ ఆడేందుకు వచ్చిన అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ‘సినెర్ ఉద్దేశ పూర్వకంగా నిషిద్ధ ఉ్రత్పేరకాలు తీసుకున్నాడా లేదంటే ప్రమేయం లేకుండా తీసుకున్నాడా అనే విషయంపై నేను చర్చించడం లేదు.ఇదేం వివక్షో నాకైతే అర్థం కావడం లేదుఎందుకంటే గతంలో డోపీగా తేలితే సస్పెన్షన్‌కు గురైన ఎంతోమంది ప్లేయర్లు ఉన్నారు. కొందరు దిగువ ర్యాంకు ప్లేయర్లు తమ డోపింగ్ కేసు–నిషేధం పరిష్కారమవ్వాలని ఏడాదిగా చూస్తున్నారు. కానీ వీళ్ల (సినెర్, స్వియాటెక్) విషయాన్నేమో ప్రపంచానికి తెలీకుండా గోప్యత పాటించడం, తూతూ మంత్రపు నిషేధం చర్యలతో సరిపెట్టడం, మొత్తం టెన్నిస్ సమాజానికి కళ్లకు గంతలు కట్టడం వంటివి చేస్తున్న టెన్నిస్ ఇంటిగ్రిటీ వ్యవహారశైలీ నన్ను తీవ్రంగా నిరాశపరిచింది.ఇది ఆటకున్న ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ఉంది. ఒక సమాఖ్య అందరు ఆటగాళ్లను సమానంగా చూడదా? ఒక్కొక్కరికి ఒక్కో నిబంధనలు ఉంటాయా? ఇదేం వివక్షో నాకైతే అర్థం కావడం లేదు’ అని జొకోవిచ్ సమాఖ్య తీరుపై విమర్శలతో విరుచుకుపడ్డాడు. తానైతే ప్రస్తుతం కొత్తసీజన్పై తాజాగా దృష్టి సారించినట్లు చెప్పాడు.ఘనమైన రికార్డుఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న జొకోవిచ్ వింబుల్డన్‌లో ఫైనల్ చేరాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ సెర్బియన్ సూపర్‌స్టార్‌కు చక్కని రికార్డు ఉంది. ఇక్కడ అతడు 10 టైటిల్స్ సాధించాడు. -
‘బ్రిస్బేన్’తో జొకోవిచ్ సీజన్ మొదలు
బెల్గ్రేడ్: కొత్త ఏడాదిలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటకు టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ సిద్ధమయ్యాడు. జనవరి 12 నుంచి జరిగే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న జొకోవిచ్... దానికి ముందు మరో టోర్నీతో తన సీజన్ మొదలు పెడుతున్నాడు. డిసెంబర్ 29 నుంచి జనవరి 5 వరకు జరిగే బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఈ సెర్బియా దిగ్గజం ఆడతాడు. 2009 తర్వాత అతను ఈ టోర్నీలో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. జొకోవిచ్‌తో పాటు దిమిత్రోవ్, రూన్, టియాఫో, కిరియోస్ తదితర అగ్రశ్రేణి ఆటగాళ్లు బ్రిస్బేన్ టోర్నీలో పాల్గొంటున్నారు. ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను 10 సార్లు గెలిచిన జొకోవిచ్ మరోసారి టైటిల్ సాధిస్తే రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ అతని ఖాతాలో చేరుతుంది. -
జొకోవిచ్ దూరం
బెల్గ్రేడ్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఈసారి నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఈనెల 10 నుంచి 17 వరకు ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. గాయం కారణంగా తాను ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో పాల్గొనడంలేదని ప్రపంచ ఐదో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ మంగళవారం ప్రకటించాడు. ‘ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ఆడాలని ఆసక్తితో ఎదురుచూశా. కానీ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ టోర్నీలో ఆడటంలేదు. నా ఆట చూసేందుకు ప్రణాళికలు చేసుకున్న వారికి క్షమించాలని కోరుతున్నాను. ఈ టోరీ్నలో ఆడబోతున్న ఆటగాళ్లందరికీ నా తరఫున శుభాకాంక్షలు. త్వరలో మళ్లీ కలుద్దాం’ అని జొకోవిచ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పేర్కొన్నాడు. ఏడుసార్లు విజేతగా... 54 ఏళ్ల చరిత్ర కలిగిన ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్‌ను జొకోవిచ్ ఏడుసార్లు (2008, 2012, 2013, 2014, 2015, 2022, 2023) సొంతం చేసుకున్నాడు. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (6 సార్లు) పేరిట ఉన్న రికార్డును గత ఏడాది జొకోవిచ్ బద్దలు కొట్టాడు. 37 విజయాలతో ముగింపు... ఇప్పటికే అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా గుర్తింపు పొందిన జొకోవిచ్ ఈ ఏడాది తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తోన్న ఒలింపిక్స్ వ్యక్తిగత సింగిల్స్ స్వర్ణ పతకాన్ని అతను ‘పారిస్’లో అందుకున్నాడు.వింబుల్డన్ టోర్నీలో, షాంఘై మాస్టర్స్ టోర్నీలో ఫైనల్ చేరుకున్నా రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడ్డాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది జొకోవిచ్ 37 మ్యాచ్‌ల్లో గెలిచి, 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయి మొత్తం 44,21,916 డాలర్ల (రూ. 37 కోట్ల 19 లక్షలు) ప్రైజ్‌మనీని గెల్చుకున్నాడు. -
‘బాగానే ఉన్నా.. కానీ ఇప్పట్లో ఆడలేను’
స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ చేసిన వ్యాఖ్యలు అతడి అభిమానులను కలవరపెడుతున్నాయి. ఫెడరర్ మాదిరే రాఫెల్నూ ఇక టెన్నిస్ కోర్టులో చూడలేమా అని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా నాదల్ లేవర్ కప్ టెన్నిస్ టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. వచ్చే వారం నుంచి బెర్లిన్ వేదికగా ఈ టెన్నిస్ టీమ్ టోర్నీ జరగనుంది. అయితే, గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న నాదల్ ఈ ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మూడింట పాల్గొనలేదు. చివరగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన 38 ఏళ్ల నాదల్... నిరాశపరిచాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సెర్బియా స్టార్ జొకోవిచ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టాడు. ఈ నేపథ్యంలో లేవర్ కప్ టోర్నీతో తిరిగి వస్తాడని భావించిన అభిమానులకు షాకిచ్చాడు. ‘వచ్చే వారం జరగనున్న లేవర్ కప్‌లో ఆడలేకపోతున్నా. ఇది టీమ్ ఈవెంట్. జట్టుకు ఏది మంచో అదే చేయాలి. టీమ్‌ను విజయ తీరాలకు చేర్చగల ఆటగాళ్లు ఉండటం ముఖ్యం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. మానసికంగా నేనేమీ ఇబ్బందిపడటం లేదు. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాను. వీలైనంత వరకు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. అయితే, ఇప్పటికిప్పుడు కోర్టులో దిగే పరిస్థితి మాత్రం లేదు. అందుకే తప్పుకొంటున్నా. ఒలింపిక్స్ వరకు ఆడతానని చెప్పాను. ఇక ఇప్పుడు ఏం జరుగబోతుందో చూడాలి’ అని నాదల్ పేర్కొన్నాడు. లేవర్ కప్‌నకు దూరం కావడానికి ప్రధాన కారణం చెప్పకపోయినా... గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అదే సమయంలో త్వరలోనే రిటైర్మెంట్ కాబోతున్నాననే సంకేతాలు ఇస్తున్నాడనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కాగా స్విట్జర్లాండ్ దిగ్గజ ఆటగాడు ఫెడరర్ 2022 లేవర్ కప్ అనంతరమే కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక.. పురుషుల సింగిల్స్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన నాదల్... ఇటీవల యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో కూడా గాయం కారణంగానే బరిలోకి దిగలేదన్న విషయం తెలిసిందే. చదవండి: దిగ్గజాలకు గడ్డుకాలం: భవిష్యత్తు అతడిదేనా? -
జొకోవిచ్‌కు షాక్
న్యూయార్క్: కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ గెలిచి ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసే లక్ష్యంతో యూఎస్ ఓపెన్ బరిలోకి దిగిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఆ కల నెరవేరేందుకు మరికొంత ఆగాల్సిందే. పారిస్ ఒలింపిక్స్ స్వర్ణం తర్వాత అమిత విశ్వాసంతో ఈ టోర్నీ బరిలోకి దిగి గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన జొకోవిచ్ అనూహ్యంగా మూడో రౌండ్లోనే వెనుదిరిగాడు.పురుషుల సింగిల్స్‌లో క్రితం రోజు 2022 చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ నిష్క్ర మించగా... జొకో ఆట మూడో రౌండ్లో ముగిసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోరులో అతను 4–6, 4–6, 6–2, 4–6తో 28వ సీడ్ అలెక్సీ పాపిరిన్ (ఆస్ట్రేలియా) చేతిలో కంగుతిన్నాడు. 37 ఏళ్ల వెటరన్ స్టార్ 16 ఏస్‌లు సంధించినప్పటికీ అదేపనిగా 14 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. దిగ్గజానికి దీటుగా 15 ఏస్‌లు కొట్టిన పాపిరిన్ కేవలం 6 డబుల్ ఫాల్ట్‌లే చేశాడు. జొకో 40 విన్నర్లకే పరిమితమైతే... 25 ఏళ్ల ఆ్రస్టేలియన్ 50 విన్నర్లు కొట్టి మ్యాచ్‌ను తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో పదిసార్లు ఫైనల్ చేరిన రెండో సీడ్ జొకోవిచ్ ఇందులో నాలుగు టైటిళ్లు (2011, 2015, 2018, 2023) సాధించాడు. 2007, 2010, 2012, 2013, 2016, 2021లలో రన్నరప్‌గా నిలిచాడు. ఇంతటి ఘనమైన రికార్డు ఉన్న సెర్బియన్ సూపర్‌స్టార్ 17 ఏళ్ల తర్వాత మూడో రౌండ్లో ఇంటిదారి పట్టాడు. యూఎస్ ఓపెన్ ఆడిన తొలినాళ్లలో రెండుసార్లు (2005, 2006) మాత్రమే అతను మూడో రౌండ్లో ని్రష్కమించాడు. ఈ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో రెండుసార్లు నాలుగో రౌండ్ మినహా ప్రతీసారి సెమీస్ లేదంటే ఫైనల్ చేరిన ఘనత జొకోవిచ్ సొంతం. మిగతా మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 5–7, 7–5, 6–1, 6–3తో థామస్ ఎచెవెరి (అర్జెంటీనా)పై, ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–3, 7–5, 6–4తో జిరి లెహెక (చెక్‌రిపబ్లిక్)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–7 (1/7), 3–6, 6–0, 6–3, 6–1తో జన్చెంగ్ షాంగ్ (చైనా)పై, 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–3, 6–4, 6–2తో ఫ్రాన్సిస్కొ కొమెసన (అర్జెంటీనా)పై విజయం సాధించారు. తొమ్మిదో సీడ్ గ్రిగొర్ డిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–3, 6–1తో టాలన్ గ్రీక్స్పూర్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. మూడో రౌండ్లోకి యూకీ బాంబ్రి జోడీ భారత టెన్నిస్ స్టార్లు రోహన్ బోపన్న, యూకీ బాంబ్రి పురుషుల డబుల్స్‌లో వారి భాగస్వాములతో మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో 2వ సీడ్ బోపన్న–ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం 6–2, 6–4తో కార్బలెస్ బేనా (స్పెయిన్)–ఫెడెరికొ కారియా (అర్జెంటీనా) జంటపై గెలిచింది. అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్)తో జోడీకట్టిన యూకీ బాంబ్రి రెండో రౌండ్లో 4–6, 6–3, 7–5తో 15వ సీడ్ క్రాజిసెక్ (అమెరికా)–జీన్ జులియెన్ రోజర్ (నెదర్లాండ్స్) జంటపై విజయం సాధించింది. అయితే మరో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీకి రెండో రౌండ్లో చుక్కెదురైంది. బాలాజీ–గైడో అండ్రియోజ్జి (అర్జెంటీనా) ద్వయం 6–7 (4/7), 4–6తో మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడింది.2002తర్వాత ‘బిగ్–3’ ఫెడరర్, నాదల్, జొకోవిచ్ ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా గెలవని సీజన్‌గా 2024 నిలువనుంది. వరుసగా 21 ఏళ్ల పాటు (2003–2023) ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కనీసం ఒక గ్రాండ్‌స్లామ్ అయినా నెగ్గారు. 2017తర్వాత జొకోవిచ్ కనీసం ఒక్క గ్రాండ్‌స్లామ్ అయినా గెలవని సీజన్‌గా 2024 నిలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ఫైనల్లలో ఓడిన జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో గాయం కారణంగా క్వార్టర్ ఫైనల్‌కు ముందు తప్పుకున్నాడు. -
అత్యంత చెత్తగా ఆడాను.. అందుకే ఇలా: జొకోవిచ్
యూఎస్ ఓపెన్-2024 పురుషుల సింగిల్స్‌లో మరో సంచలనం నమోదైంది. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్లోనే ఇంటిబాటపట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన 28వ ర్యాంకర్ అలెక్సీ పాప్రిన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అలెక్సీ 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో జొకోవిచ్పై నెగ్గి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు.కాగా ఇప్పటి వరకు నాలుగుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన సెర్బియా స్టార్ జొకోవిచ్.. 18 ఏళ్ల చరిత్రలో ఇలా ఆరంభ దశలోనే వెనుదిరగడం ఇదే తొలిసారి. తద్వారా.. రికార్డు స్థాయిలో ఇరవై ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకునే సువర్ణావకాశాన్ని ప్రస్తుతానికి కోల్పోయాడు.అత్యంత చెత్తగా ఆడాను.. అందుకే ఇలాఈ నేపథ్యంలో జొకోవిచ్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్లోనే అత్యంత చెత్తగా ఆడిన సందర్భం ఇది. ఆరంభం నుంచి మూడో రౌండ్ దాకా బాగానే ఆడినా.. ఇక్కడ మాత్రం తడబడ్డాను. ప్యారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ఇక్కడకు రావడం ప్రభావం చూపింది. శారీరకంగా, మానసికంగా అలసిపోయాను. యూఎస్ ఓపెన్‌లో కచ్చితంగా పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను. ప్రస్తుతానికైతే ఎటువంటి ఫిట్నెస్ సమస్యలు లేవు’’ అని పేర్కొన్నాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల వ్యక్తిగత విభాగం ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ను ఓడించి జొకోవిచ్ పసిడి పతకం గెలిచిన విషయం తెలిసిందే.25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అప్పుడు అలా చేజారిందిఆస్ట్రేలియా ఓపెన్-2024లో జెనిక్ సినర్‌తో సెమీస్‌లో జొకోవిచ్ ఓడిపోగా.. సినర్ ఫైనల్లో గెలిచి చాంపియన్ అయ్యాడు. అంతకుముందు.. కార్లోజ్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్, వింబుల్డన్ ట్రోఫీ ఎగరేసుకుపోయాడు.అల్కరాజ్ కూడా ఇంటికే!ఇక ఈ ఏడాది యూఎస్ పురుషుల సింగిల్స్ విభాగంలో 2022 చాంపియన్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. మూడో సీడ్ అల్కరాజ్ను నెదర్లాండ్స్ టెన్నిస్ ప్లేయర్, 74వ ర్యాంకర్ బోటిక్ వాన్ డె జాండ్‌షుల్ప్ వరుస సెట్లలో ఓడించి తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. -
తగ్గేదేలే..! టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సుదీర్ఘ మ్యాచ్‌లు ఇవే
టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన ఏ ఆటగాడైనా గెలవాలనే కసితోనే పోరాడతాడు. కొందరు ప్లేయర్లు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ చూస్తుండగానే మ్యాచ్‌ను లాగేసుకుంటే... మరికొందరు తుదికంటా పోరాడుతూ శక్తి మేరకు ప్రయత్నిస్తారు! టెన్నిస్ కోర్టులో అప్పుడప్పుడు సమఉజ్జీల సమరాలు అభిమానులను అలరిస్తూ ఉంటాయి. శరీరంలో శక్తి క్షీణిస్తున్నా... చెమట ధారగా కారుతున్నా లెక్కచేయకుండా మైదానంలో ఇరువురు ఆటగాళ్లు కొదమ సింహాల్లా పోరాడినపుడు ఆ మ్యాచ్‌లు గంటలకొద్దీ సాగుతూ ఉంటాయి. ఇరువురు ప్లేయర్లు ‘తగ్గేదేలే’ అన్నట్లు చెలరేగిన మ్యాచ్‌లు సుదీర్ఘ పోరాటాలుగా చరిత్ర పుటల్లో చోటు దక్కించుకుంటున్నాయి. టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అలా రికార్డుల్లోకెక్కిన మ్యాచ్‌లను ఓసారి పరిశీలిస్తే... శారీరక శ్రమ అధికంగా ఉండే టెన్నిస్ క్రీడలో అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్‌లు సుదీర్ఘంగా సాగడం పరిపాటే. తాజాగా సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో డేనియల్ ఇవాన్స్ (బ్రిటన్), కరెన్ ఖచనోవ్ (రష్యా) మధ్య పోరు 5 గంటల 35 నిమిషాల పాటు సాగి అభిమానులకు ప్రత్యేక అనుభూతినిచ్చింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఇదే సుదీర్ఘమైన మ్యాచ్ కాగా.. గతంలో వింబుల్డన్ టోరీ్నలో ఇంతకుమించిన మ్యాచ్‌లు చాలా జరిగాయి. 2010 వింబుల్డన్ టోర్నీలో జాన్ ఇస్నెర్ (అమెరికా), నికోలస్ మహుత్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన పోరు ఇందులో ముందు వరుసలో నిలుస్తుంది.వర్షం అంతరాయం కలిగించడంతో... వరుసగా మూడు రోజులు సాగిన ఈ మారథాన్ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన పోరుగా రికార్డుల్లోకెక్కింది. ఇప్పటి వరకు ప్రొఫెషనల్ టెన్నిస్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే 7 గంటలకు పైగా సాగగా... మరో 14 మ్యాచ్‌లు ఆరు గంటలకు పైగా జరిగాయి. ప్లేయర్ల అలసట, అభిమానుల అసౌకర్యం, నిర్వాహకులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రధాన టోర్నీల్లోని చివరి సెట్లోనూ ‘టైబ్రేకర్’ నిబంధనలు తీసుకొచ్చారు. 1970 నుంచి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ‘టైబ్రేకర్’ అమలు చేస్తున్నారు. దీంతో సుదీర్ఘ పోరాటాలకు ఒకింత బ్రేక్ పడింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో... 6 గంటల 33 నిమిషాలుసీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ మారథాన్ మ్యాచ్‌లకు కొదువలేదు. 2004 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుదీర్ఘ మ్యాచ్ జరిగింది. రెండు రోజుల పాటు సాగిన పోరులో ఫ్రాన్స్‌కే చెందిన ఫాబ్రిస్ సాంతోరో, ఆర్నాడ్ క్లెమెంట్ తుదికంటా పోరాడారు. 6 గంటల 33 నిమిషాల తర్వాత ఫాబ్రిస్ సాంతోరో 6–4, 6–3, 6–7 (5/7), 3–6, 16–14తో ఆర్నాడ్ క్లెమెంట్పై గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఇదే సుదీర్ఘ మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. వింబుల్డన్‌లో ఇస్నెర్ డబుల్ ధమాకాటెన్నిస్ చరిత్రలో అత్యంత పురాతన గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన వింబుల్డన్‌లో అమెరికా ఆటగాడు జాన్ ఇస్నెర్ ఒకటికి రెండుసార్లు ఇలాంటి సుదీర్ఘ మ్యాచ్‌ల్లో భాగస్వామి అయ్యాడు. 2010 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఇస్నెర్, నికోలస్ మహుత్ మధ్య పోరు వరుసగా మూడు రోజుల పాటు నడిచింది. వర్షం కారణంగా అంతరాయాల నడుము జరిగిన పోరులో ఇస్నెర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో మహుత్‌పై విజయం సాధించాడు. 11 గంటల 5 నిమిషాల పాటు సాగిన ఈ పోరాటం... ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అత్యంత సుదీర్ఘ పోరుగా చరిత్రకెక్కింది. ఇరువురు ఆటగాళ్లు గంటలకొద్దీ పట్టు వదలకుండా పోరాడటంతో ఈ రికార్డు సాధ్యమైంది. మరో ఎనిమిదేళ్ల తర్వాత 2018 వింబుల్డన్ సెమీఫైనల్లో మరోసారి ఇలాంటి సుదీర్ఘ పోరాటమే జరిగింది. 6 గంటల 36 నిమిషాల పాటు సాగిన పోరులో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7–6 (8/6), 6–7 (5/7), 6–7 (9/11), 6–4, 26–24తో ఇస్నెర్‌పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో... 5 గంటల 53 నిమిషాలుటెన్నిస్ చరిత్రలో దిగ్గజ ప్లేయర్లుగా గుర్తింపు సాధించిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా సుదీర్ఘ పోరాటాల్లో భాగస్వాములయ్యారు. గిరిగీసి బరిలోకి దిగితే అంతుచూసేవరకు వదలని స్వభావం గల ఈ ఇద్దరూ ఎన్నో సార్లు హోరాహోరీగా తలబడ్డారు. అందులో 2012 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ ఒకటి. 5 గంటల 53 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జొకోవిచ్ 5–7, 6–4, 6–2, 6–7 (5/7), 7–5తో నాదల్‌ను ఓడించి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఓపెన్ శకంలో (1968 నుంచి)అత్యంత సుదీర్ఘంగా సాగిన గ్రాండ్‌స్లామ్ ఫైనల్గానూ ఈ పోరు చరిత్రకెక్కింది. 1975కంటే ముందు టైబ్రేక్ నిబంధన లేదు.ఫలితంగా డేవిస్‌కప్‌లోనూ ఎన్నో సుదీర్ఘ మ్యాచ్‌లు జరిగాయి. 1975 తర్వాత నిర్ణాయక ఐదో సెట్ మినహా ఇతర సెట్లలో టైబ్రేక్లను అమలు చేయడం మొదలుపెట్టారు. 12 పాయింట్ల టైబ్రేక్‌లో తొలుత ఏడు పాయింట్లు సాధించిన ప్లేయర్‌కు సెట్ లభించేది. ఒకవేళ మ్యాచ్ ఐదో సెట్‌కు వెళితే స్కోరు 5–5 తర్వాత రెండు గేమ్‌ల ఆధిక్యం సంపాదించిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటించేవారు. 2016 నుంచి డేవిస్ కప్‌లోనూ నిబంధనలు మార్చారు. మ్యాచ్‌లను ‘బెస్ట్ ఆఫ్ 5 సెట్స్’ పద్ధతిలో కాకుండా ‘బెస్ట్ ఆఫ్ 3 సెట్స్’గా నిర్వహించడం ప్రారంభించారు. సెట్లో స్కోరు 6–6తో సమంగా నిలిస్తే టైబ్రేక్‌ను అమలు చేస్తున్నారు.డేవిస్ కప్‌లో సుదీర్ఘ పురుషుల సింగిల్స్ మ్యాచ్లుసమయం- విజేత -పరాజిత- ఏడాది- స్కోరు 👉6గం:43ని- లియోనార్డో మాయెర్ (అర్జెంటీనా)- జొవా సౌజా (బ్రెజిల్)- 2015- 7–6 (7/4), 7–6 (7/5), 5–7, 5–7, 15–13 👉6గం:22ని-జాన్ మెకన్రో (అమెరికా)-విలాండర్ (స్వీడన్) -1982- 9–7, 6–2, 15–17, 3–6, 8–6 👉6గం:21ని-బోరిస్ బెకర్ (జర్మనీ)-జాన్ మెకన్రో (అమెరికా)-1987-6–3, 6–2, 4–6, 14–12 👉6గం:15ని-జోస్ లూయిస్ క్లెర్క్ (అర్జెంటీనా)-జాన్ మెకన్రో (అమెరికా)-1980-6–3, 6–2, 4–6, 14–12 👉6గం: 04ని-హార్స్ స్కాఫ్ (ఆ్రస్టియా)- విలాండర్ (స్వీడన్)-1989-6–7 (5/7), 7–6 (9/7), 1–6, 6–4, 9–7 – సాక్షి క్రీడావిభాగం -
US Open 2024: జొకోవిచ్ అలవోకగా..!
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ టైటిల్ వేటను సెర్బియా దిగ్గజం జొకోవిచ్ అలవోక విజయంతో ప్రారంభించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ జొకోవిచ్ 6-2, 6-2, 6-4తో క్వాలిఫయర్ రాడూ అల్బోట్ (మాల్డొవా)పై గెలిచి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. 2 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఎనిమిది ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి, 23 విన్నర్స్ కొట్టాడు. ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు.మరోవైపు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ (అమెరికా), ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), రెండో సీడ్ సబలెంకా (బెలారస్) రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కోకో గాఫ్ 6-2, 6-0తో వర్వరా గ్రచెవా (ఫ్రాన్స్)ను ఓడించగా... సబలెంకా 6-3, 6-3తో ప్రిసిల్లా హాన్ (ఆస్ట్రేలియా)పై, టాప్ సీడ్ స్వియాటెక్ 6-4, 7-6 (8/6)తో కామిలా రఖిమోవా (రష్యా)పై గెలిచారు. -
25వ గ్రాండ్‌స్లామ్ వేటలో...
2008లో నొవాక్ జొకోవిచ్ తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను గెలిచాడు. ఈ క్రమంలో వరుసగా గత 11 గ్రాండ్‌స్లామ్‌లను పంచుకున్న ఫెడరర్, నాదల్ జోరును నిలువరించాడు. 2011లో జొకోవిచ్ తొలి సారి వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచిన కొత్త అధ్యాయానికి తెర తీశాడు. ఇప్పుడు 2024లో తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి ఆల్‌టైమ్ రికార్డును సృష్టించేందుకు అతను సిద్ధమయ్యాడు. యూఎస్ ఓపెన్‌లో సమరానికి జొకోవిచ్ సై అంటున్నాడు. ట్రోఫీని అందుకొని జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టిస్తాడా అనేది ఆసక్తికరం. న్యూయార్క్: సీజన్లో చివరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెర్బియా స్టార్, వరల్డ్ నంబర్ 2 నొవాక్ జొకోవిచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. నేటి నుంచి జరిగే ఈ టోర్నీలో అతను విజేతగా నిలిస్తే మార్గరెట్ కోర్ట్ (24)ను దాటి అత్యధికంగా 25 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. 2023లో ఇక్కడ టైటిల్ నెగ్గిన జొకోవిచ్ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తే ఫెడరర్ (2004–08) తర్వాత టైటిల్ నెలబెట్టుకున్న మొదటి ఆటగాడిగా కూడా నిలుస్తాడు. తన తొలి రౌండ్లో 37 ఏళ్ల జొకోవిచ్ 138వ ర్యాంకర్ రాడు అల్బాట్ (మాల్డోవా)తో తలపడతాడు. 18వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడనున్న జొకోవిచ్ ఈ టోర్నీలో 2005లో తొలిసారి బరిలోకి దిగి మూడో రౌండ్లో ఓటమి పాలయ్యాడు. అయితే 2011, 2015, 2018, 2023లలో నాలుగు సార్లు టైటిల్ నెగ్గిన అతను మరో ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ‘ఎప్పుడైనా గెలుపు ఒక్కటే లక్ష్యం. బాగా ఆడి ముందుగా ఫైనల్ వరకు చేరడం, ఆ తర్వాత టైటిల్ కోసం పోరాడటమే నాకు తెలుసు. ఈ తరహా దృక్పథంలో ఇప్పుడు కూడా ఎలాంటి మార్పూ లేదు’ అని జొకొవిచ్ అన్నాడు. ఇటీవలే పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకున్న జొకోవిచ్ మరింత ఉత్సాహంతో యూఎస్ ఓపెన్‌కు సన్నద్ధమయ్యాడు. ‘నా జీవితంలో ఒలింపిక్ స్వర్ణం అతి పెద్ద ఘనత. నా కల నెరవేరింది. టెన్నిస్ కోర్టులో అలాంటి భావోద్వేగాలు నేను ఎప్పుడూ ప్రదర్శించలేదు. అంతకుముందు సెర్బియా ఫ్లాగ్‌బేరర్‌గా నిలబడిన ఘట్టం అన్ని గ్రాండ్‌స్లామ్ విజయాలకంటే మిన్న. అన్నీ గెలిచేశావు కదా ఇంకా ఏం కావాలి అని కొందరు అడుగుతున్నారు. అయితే నాలో ఇంకా గెలవాలనే తపన ఉంది. మరిన్ని ఘనతలు సాధించాలని కోరుకుంటా. టెన్నిస్ ఆడేందుకు, చూసేందుకు ఇంకా చాలా మందికి స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నా’ అని జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలు టెన్నిస్‌కు మూలస్తంభాల్లాంటివని... ఇలాంటి చోట బాగా ఆడేందుకు ప్రేరణ లేకపోతే ఇంకెక్కడా ఆడలేరని అభిప్రాయపడ్డాడు. -
ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్.. జొకోవిచ్ సుదీర్ఘ నిరీక్షణకు తెర (ఫోటోలు)
-
ఒలింపిక్స్‌లో తొలి గోల్డ్‌మెడల్.. కన్నీటి పర్యంతమైన జొకోవిచ్
కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్, 7 ఏటీపీ ఫైనల్స్ టైటిల్స్, ఎనిమిది సార్లు నంబర్‌వన్‌గా ఏడాది ముగింపు, 2 సార్లు కెరీర్ గోల్డెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్స్, డేవిస్‌కప్ విజేత, 428 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్... టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ అత్యద్భుత ఆటతో సాధించిన అసాధారణ ఘనతలివి. అయితే ఇన్ని గొప్ప విజయాల తర్వాత కూడా జొకోవిచ్ కెరీర్లో ఒలింపిక్స్ స్వర్ణ పతకం ఒకటి ఇప్పటి వరకు లోటుగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు జొకో దానిని కూడా సాధించి తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జొకోవిచ్ పసిడి పతకం కోసం ఎంతో తపించాడు.దాని కోసం పోరాడుతూ వచ్చాడు. ఇప్పుడు 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఆ కల నెరవేరింది. ‘కెరీర్ గోల్డెన్‌స్లామ్’ నెగ్గిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో అతను తన పేరును లిఖించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకో 7–6 (7/3), 7–6 (7/2) స్కోరుతో కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)పై విజయం సాధించాడు.ఇటీవలే వింబుల్డన్ ఫైనల్లో తనను ఓడించి ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అల్కరాజ్పై తన అనుభవాన్నంతా ఉపయోగించి టైబ్రేక్‌లో సెర్బియా స్టార్ పైచేయి సాధించాడు. 37 ఏళ్ల జొకో అతి పెద్ద వయసులో ఒలింపిక్ టెన్నిస్‌లో స్వర్ణం సాధించిన ఆటగాడిగా నిలిచాడు.భావోద్వేగానికి లోనైన జొకోవిచ్ఇక గోల్డ్ మెడల్ విజయం తర్వాత జొకోవిచ్ భావోద్వేగానికి లోనయ్యాడు. సెర్బియా జాతీయ పతాకంతో తన కుటుంబసభ్యులు, టీమ్ వద్దకు పరుగెత్తిన జొకోవిచ్ కన్నీళ్లపర్యంతమయ్యాడు. తన కొడుకు, కూతురును కౌగిలించుకొని అతను ఏడ్చేసిన తీరు అతని దృష్టిలో ఈ పతకం విలువేమిటో చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Novak Djokovic crying as he can't believe 🥇🇷🇸Congratulations to @DjokerNole, for finally achieving the gold medal for your country & you have completed not only tennis but also my childhood 🥹❤️pic.twitter.com/E8e2HmY173— Shane Gupta (@Shanegupta22) August 4, 2024 Wow - have never seen Djokovic this emotional … incredible Sports. pic.twitter.com/rJjdDnsITP— Tommy Beer (@TommyBeer) August 4, 2024 -
Paris Olympics 2024: స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న జకోవిచ్
పారిస్ ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన ఫైనల్లో స్పెయిన్ యువకెరటం కార్లోస్ అల్కరాజ్పై వరుస సెట్లలో (7-6(3), 7-6(2)) విజయం సాధించాడు. ఒలింపిక్స్‌లో జకోకు ఇది తొలి స్వర్ణం. 37 ఏళ్ల జకో ఒలింపిక్స్ స్వర్ణం నెగ్గిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. NOVAK DJOKOVIC - THE OLYMPIC GOLD MEDALIST AT THE AGE OF 37.🏅- The greatest ever of Tennis! 🐐pic.twitter.com/bj4uxuTRin— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024అలాగే కెరీర్ గోల్డెన్ స్లామ్ (నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో పాటు ఒలింపిక్స్ సింగిల్స్‌లో స్వర్ణం) నెగ్గిన ఐదో టెన్నిస్ క్రీడాకారుడిగా చరిత్రపుటల్లోకెక్కాడు. ఇటీవలి కాలంలో అల్కరాజ్.. జకోవిచ్‌పై ఆధిపత్యం చాలాయించాడు. 2023, 2024 వింబుల్డన్‌లో అల్కరాజ్ జకోకు షాకిచ్చాడు. ఈ రెండు పరాజయాలకు జకో విశ్వవేదికపై బదులు తీర్చుకున్నాడు. జకో తన కెరీర్లో24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించగా.. అల్కరాజ్ చిన్నవయసులోనే నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు తన ఖాతాలో కలిగి ఉన్నాడు. ఒలింపిక్స్ ఫైనల్లో ఓటమితో అల్కరాజ్ రజత పతకంతో సరిపుచ్చుకున్నాడు. -
Paris Olympics 2024: నాదల్‌ను మట్టికరిపించిన జొకోవిచ్
పారిస్ ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ ఈవెంట్ సింగిల్స్ విభాగంలో స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ పోరాటం ముగిసింది. సోమవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–1, 6–4తో నాదల్‌ను ఓడించాడు. వీరిద్దరు ఇప్పటి వరకు 60 సార్లు తలపడగా.. జొకోవిచ్ 31 సార్లు, నాదల్ 29 సార్లు విజయం సాధించాడు. వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న జొకోవిచ్‌కు ఒలింపిక్ స్వర్ణం లోటుగా ఉంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో కాంస్యం నెగ్గిన జొకోవిచ్... 2012 లండన్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం పతకాలు సాధించలేకపోయాడు. -
పదోసారి ఫైనల్లో జొకోవిచ్
లండన్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ విజయం దూరంలో నిలిచాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో రెండో సీడ్ జొకోవిచ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో జొకోవిచ్ 2 గంటల 48 నిమిషాల్లో 6–4, 7–6 (7/2), 6–4తో 25వ సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)తో జొకోవిచ్ తలపడతాడు. గత ఏడాది కూడా వీరిద్దరి మధ్యే ఫైనల్ జరగ్గా... అల్కరాజ్ చాంపియన్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ ఫైనల్ చేరడం ఇది పదోసారి కావడం విశేషం. ఈ టోర్నీలో జొకోవిచ్ 2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022లలో విజేతగా నిలిచి... 2013, 2023లలో రన్నరప్‌గా నిలిచాడు. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో అల్కరాజ్ 6–7 (1/7), 6–3, 6–4, 6–4తో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. 2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ ఆరు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయిన అల్కరాజ్... మెద్వెదెవ్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 53 సార్లు దూసుకొచ్చిన ఈ స్పెయిన్ స్టార్ 38 సార్లు పాయింట్లు గెలిచాడు. అల్కరాజ్, మెద్వెదెవ్ సెమీఫైనల్ మ్యాచ్‌ను భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యక్షంగా తిలకించాడు. -
Wimbledon 2024: అందరి దృష్టి జొకోవిచ్‌పైనే
లండన్: టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించేందుకు సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరోసారి ప్రయతి్నంచనున్నాడు. ఇప్పటికే కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ ఆ్రస్టేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. నేడు మొదలయ్యే సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో జొకోవిచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇటీవల మోకాలి గాయం నుంచి కోలుకున్న జొకోవిచ్‌కు ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ), డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఈసారి తొలి రౌండ్లో క్వాలిఫయర్, ప్రపంచ 123వ ర్యాంకర్ విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)తో జొకోవిచ్ తలపడతాడు. మరోవైపు భారత నంబర్‌వన్, ప్రపంచ 72వ ర్యాంకర్ సుమిత్ నగాల్ సోమవారం జరిగే తొలి రౌండ్లో కెచ్‌మనోవిచ్ (సెర్బియా)తో ఆడతాడు. -
జకోవిచ్ స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్న రోహిత్ శర్మ
టీ20 వరల్డ్‌కప్ 2024ను కైవసం చేసుకున్న అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...టెన్నిస్ లెజెండ్ నొవాక్ జకోవిచ్ స్టయిల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం హిట్‌మ్యాన్ పిచ్‌పై ఉన్న గడ్డిపరకలను నోట్లో పెట్టుకుని విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ సైతం గ్రాండ్‌స్లామ్ విజయానంతరం ఇలాగే చేస్తాడు. View this post on Instagram A post shared by ICC (@icc)జకో.. ఫైనల్ మ్యాచ్‌లో గెలిచాక కోర్టులోని గడ్డిపరకలను లేదా మట్టిని నోట్లో పెట్టుకుని గెలుపు సంబురాలు చేసుకుంటాడు. వరల్డ్‌కప్ విజయానంతరం రోహిత్ చేసుకున్న జకో స్టయిల్ సెలబ్రేషన్స్ నెట్టింట వైరలవుతున్నాయి. వింబుల్డన్ తమ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో జకోవిచ్, రోహిత్ శర్మ గడ్డి తింటున్న ఫోటోలు పోస్ట్ చేసి.. GOATs eating grass అని కామెంట్ పెట్టింది. ఈ పోస్ట్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది.Wimbledon's Facebook post - GOATs eating grass. Rohit Sharma 🤝 Novak Djokovic. pic.twitter.com/jrkCPBi7PX— Mufaddal Vohra (@mufaddal_vohra) June 30, 2024కాగా, నిన్న జరిగిన వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో సారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. భారత్‌కు 11 ఏళ్ల తర్వాత లభించిన తొలి ఐసీసీ ట్రోఫీ ఇది. 2013లో టీమిండియా ధోని నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. వరల్డ్‌కప్ విషయానికొస్తే.. టీమిండియాకు 13 ఏళ్ల తర్వాత లభించిన తొలి వరల్డ్‌కప్ ఇది. 2011లో భారత్..ధోని నేతృత్వంలో వన్డే వరల్డ్‌కప్ సాధించింది. టీ20 వరల్డ్‌కప్ విషయానికొస్తే.. ధోని సారథ్యంలో మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ టైటిల్ సాధించిన టీమిండియా.. 17 ఏళ్ల తర్వాత తిరిగి పొట్టి ప్రపంచకప్‌ను దక్కించుకుంది. ఈసారి రోహిత్ శర్మ టీమిండియాకు పొట్టి ప్రపంచకప్‌కు అందించాడు.ఫైనల్ మ్యాచ్ స్కోర్ వివరాలు..భారత్ 176/7సౌతాఫ్రికా 169/87 పరుగుల తేడాతో భారత్ విజయంప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)ప్లేయర్ ఆఫ్ ద సిరీస్- జస్ప్రీత్ బుమ్రా (8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు) -
జొకోవిచ్ అలవోకగా...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వరుసగా 19వ ఏడాది మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఈ సెర్బియా దిగ్గజం 6–4, 6–1, 6–2తో రొబెర్టో కార్బెలస్ బేనా (స్పెయిన్)పై విజయం సాధించాడు. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ 43 విన్నర్స్ కొట్టడంతోపాటు నెట్ వద్ద 20 పాయింట్లు సాధించాడు. మరోవైపు నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ హుర్కాజ్ (పోలాండ్) కూడా మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో జ్వెరెవ్ 7–6 (7/4), 6–2, 6–2తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై, హుర్కాజ్ 6–7 (2/7), 6–1, 6–3, 7–6 (7/5)తో నకíÙమా (అమెరికా)పై గెలుపొందారు. కెచ్‌మనోవిచ్ (సెర్బియా)తో జరిగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్ తొలి సెట్‌ను 6–1తో నెగ్గి, రెండో సెట్లో 5–0తో ఆధిక్యంలో ఉన్నపుడు కెచ్‌మనోవిచ్ గాయం కారణంగా వైదొలిగాడు. సబలెంకా ముందుకు... మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సబలెంకా 6–2, 6–2తో ఉచిజిమా (జపాన్)పై, రిబాకినా 6–3, 6–4తో అరంటా రుస్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 7–6 (7/1), 1–6, 7–5తో నయోమి ఒసాకా (జపాన్)పై, మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–3, 6–4తో తమారా జిదాన్సెక్ (స్లొవేనియా)పై నెగ్గారు. -
టైటిల్ వేట మొదలైంది...
పారిస్: కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) తొలి రౌండ్‌ను దాటాడు. ప్రపంచ 142వ ర్యాంకర్ హెర్బర్ట్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 2 గంటల 31 నిమిషాల్లో 6–4, 7–6 (7/3), 6–4తో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ప్రత్యర్థి సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ నెట్ వద్ద 19 పాయింట్లు గెలిచాడు. మరోవైపు మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా), తొమ్మిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో అల్కరాజ్, సిట్సిపాస్లకు తమ ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురుకాగా... రుబ్లెవ్ వరుస సెట్లలో విజయాన్ని అందుకున్నాడు. అల్కరాజ్ 3 గంటల 9 నిమిషాల్లో 6–3, 6–4, 2–6, 6–2తో జెస్పర్ డి జాంగ్ (నెదర్లాండ్స్)పై, సిట్సిపాస్ 2 గంటల 43 నిమిషాల్లో 6–3, 6–2, 6–7 (2/7), 6–4తో అల్టమెయిర్ (జర్మనీ)పై, రుబ్లెవ్ 2 గంటల 1 నిమిషంలో 6–3, 6–4, 6–3తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై గెలుపొందారు. జాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్కరాజ్ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి స ర్వి స్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన ఈ స్పెయిన్ స్టార్ ఏకంగా 47 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. మహిళల సింగిల్స్‌లో 2020 ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా), ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీ షియా) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సోఫియా 6–3, 6–3తో 21వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై, ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) 6–3, 1–6, 6–3తో కామిలా ఒసోరియో (కొలంబియా)పై గెలుపొందారు. భారీ వర్షాల కారణంగా బుధవారం ఏకంగా 23 సింగిల్స్ మ్యాచ్‌లను వాయిదా వేశారు. -
జొకోవిచ్‌కు లారియస్ అవార్డు
పురుషుల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ప్రతిష్టాత్మక లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ వార్షిక అవార్డుల్లో మెరిశాడు. 2023 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ఈ సెర్బియా దిగ్గజం ‘ఉత్తమ క్రీడాకారుడు’ పురస్కారం గెల్చుకున్నాడు. జొకోవిచ్‌కు ఈ అవార్డు లభించడం ఇది ఐదోసారి. 2023లో జొకోవిచ్ ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడంతోపాటు వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించాడు. మహిళల విభాగంలో స్పెయిన్ ఫుట్‌బాల్ ప్లేయర్ బొన్మాటి ‘ఉత్తమ క్రీడాకారిణి’ అవార్డు అందుకుంది. -
జొకోవిచ్‌కు చుక్కెదురు
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. 2015 తర్వాత ఈ టోర్నీలో మళ్లీ సెమీఫైనల్ ఆడిన జొకోవిచ్ 4–6, 6–1, 4–6తో కాస్పర్ రూడ్ (నార్వే) చేతిలో ఓడిపోయాడు. జొకోవిచ్పై రూడ్కిదే తొలి విజయం కావడం విశేషం. గతంలో ఈ సెర్బియా స్టార్‌తో ఆడిన ఐదుసార్లూ రూడ్ ఓటమి చవిచూశాడు. మరో సెమీఫైనల్లో సిట్సిపాస్ (గ్రీస్) 6–4, 3–6, 6–4తో యానిక్ సినెర్ (ఇటలీ)పై గెలిచాడు. -
‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
మోంటెకార్లో: భారత ఆటగాడు రోహన్ బోపన్న 44 ఏళ్ల వయసులో టెన్నిస్ వరల్డ్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఇటీవలే నంబర్‌వన్‌కు చేరాడు. సింగిల్స్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కూడా తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన అతి పెద్ద వయస్కుడిగా (36 ఏళ్లు) గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య తమ వయసుకు సంబంధించిన ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘టెన్నిస్ మనకు ఎంతో నేర్పించింది. అనుభవం మంచి విజయాలు అందిస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత ఉంది‘ అని బోపన్న వ్యాఖ్యానించగా... ‘అనుభవం మాత్రమే కాదు. ప్రతీ రోజు ఆట పట్ల అంకితభావం చూపడమే మనల్ని ఈ స్థానంలో నిలిపింది’ అని జొకోవిచ్ బదులిచ్చాడు. ఇద్దరు నంబర్‌వన్ ఆటగాళ్లు కలిసిన అరుదైన ఘట్టం సెర్బియా, భారత టెన్నిస్‌కు సంబంధించి ప్రత్యేకమైందన్న జొకోవిచ్...త్వరలోనే భారత గడ్డపై ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ తమ సంభాషణను నమస్తేతో జొకోవిచ్ ముగించాడు. -
Indian Wells: జొకోవిచ్ శుభారంభం
ఐదేళ్ల తర్వాత ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో బరిలోకి దిగిన సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన జొకోవిచ్ 6–2, 5–7, 6–3తో ప్రపంచ 69వ ర్యాంకర్ అలెగ్జాండర్ వుకిచ్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. ‘మాస్టర్స్ సిరీస్’ ఈవెంట్స్‌లో జొకోవిచ్‌కిది 400వ విజయం కావడం విశేషం. కేవలం రాఫెల్ నాదల్ (స్పెయిన్) మాత్రమే మాస్టర్స్ టోర్నీల్లో 400కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. -
క్వార్టర్ ఫైనల్లో కిరణ్ జార్జి పరాజయం
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి పోరాటం ముగిసింది. జకార్తాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి 14–21, 6–21తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మస్కట్‌లో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రజని కెపె్టన్సీలోని భారత జట్టు 6–3తో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. ఫైనల్లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్లో భారత్ తరఫున అక్షత, మరియానా, ముంతాజ్, రుతుజా, జ్యోతి అజ్మీనా ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోంది. Australian Open 2024- మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఇటలీకి చెందిన 22 ఏళ్ల యానిక్ సినెర్.. ఫైనల్లోమెద్వెదెవ్తో తలపడనున్నాడు. జొకోవిచ్‌ను ఓడించిన సినెర్.. జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచి మెద్వెదేవ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. -
జొకోవిచ్ జోరుగా...
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ సిన్నెర్ (ఇటలీ), మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంక (బెలారస్), నాలుగో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) క్వార్టర్స్ చేరారు. పురుషుల సింగిల్స్‌లో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్‌సీడ్ నొవాక్ జొకోవిచ్ అతి సులువైన విజయంతో ముందంజ వేశాడు. పది సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అయిన జొకో 6–0, 6–0, 6–3తో అడ్రియన్ మనారినొ (ఫ్రాన్స్)ను చిత్తు చేశాడు. ఏకంగా 17 ఏస్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన సెర్బియన్ దిగ్గజం 31 విన్నర్లతో అలవోకగా మ్యాచ్‌ని చేతుల్లోకి తెచ్చుకున్నాడు. తొలి రెండు సెట్లలో అయితే ఫ్రాన్స్ ఆటగాడిని ఖాతా తెరువకుండా చేశాడు. ప్రత్యర్థి సర్వి స్ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. కేవలం గంటా 44 నిమిషాల్లోనే వరుస సెట్లలో ప్రత్యర్థి ఆట కట్టించాడు. తాజా ఫలితంతో గ్రాండ్‌స్లామ్ టోరీ్నల్లో 58 సార్లు క్వార్టర్స్ ఫైనల్ చేరిన ఆటగాడిగా స్విట్టర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సరసన సెర్బియన్ సూపర్‌స్టార్ నిలిచాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్లోనే 14 సార్లు క్వార్టర్స్ చేరిన జొకోవిచ్ 10 సార్లు ముందంజ వేసి టైటిల్ గెలువగలిగాడు. సిట్సిపాస్ అవుట్ నిరుటి రన్నరప్, ఏడో సీడ్ స్టెఫనొస్ సిట్సిపాస్ (గ్రీస్)కు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. గత మూడేళ్లలో ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో అతనికి ఇదే నిరాశాజనక ప్రదర్శన. ఆదివారం జరిగిన పోరులో ప్రపంచ ఏడో ర్యాంకర్ సిట్సిపాస్ 6–7 (3/7), 7–5, 3–6, 3–6తో అమెరికాకు చెందిన 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ చేతిలో కంగుతిన్నాడు. ఈ విజయంతో అమెరికా ఆటగాడు తొలిసారి ఆ్రస్టేలియా ఓపెన్‌లో నాలుగో రౌండ్ అడ్డంకిని దాటి క్వార్టర్ ఫైనల్ చేరాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)కు స్థానిక ప్లేయర్ నుంచి అసాధారణ పోటీ ఎదురైంది. సుదీర్ఘంగా 4 గంటల 14 నిమిషాల పాటు జరిగిన ఈ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో రుబ్లెవ్ 6–4, 6–7 (5/7), 6–7 (4/7), 6–3, 6–0తో పదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా)పై చెమటోడ్చి నెగ్గాడు. దీంతో స్థానిక ఆటగాడు వరుసగా మూడో ఏడాదీ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టాడు. నాలుగో సీడ్ జానిక్ సిన్నెర్ (ఇటలీ) 6–4, 7–5, 6–3తో గత సీజన్ సెమీఫైనలిస్ట్, 15వ సీడ్ కరెన్ కచనొవ్ (రష్యా)కు షాకిచ్చాడు. కొకొ గాఫ్ తొలిసారి... మహిళల సింగిల్స్‌లో యూఎస్ ఓపెన్ చాంపియన్, నాలుగో సీడ్ అమెరికన్ స్టార్ కొకొ గాఫ్ తొలిసారి ఈ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. నాలుగేళ్లుగా బరిలోకి దిగుతున్న ఆమెకు రెండు సార్లు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. కానీ ఈ సారి ఆమె 6–1, 6–2తో మగ్దలెన ఫ్రెచ్ (పోలాండ్)పై సునాయాస విజయంతో ముందంజ వేసింది. కేవలం గంట 3 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించడం విశేషం. రెండో సీడ్ అరిన సబలెంక (బెలారస్) 6–3, 6–2తో అమండ అనిసిమొవ (అమెరికా)పై గెలుపొందగా, 9వ సీడ్ క్రెజ్సికొవా (చెక్ రిపబ్లిక్) 4–6, 6–3, 6–2తో మిర అండ్రీవా (రష్యా)పై విజయం సాధించింది. -
Novak Djokovic-Sania Mirza: ఇండియా అంటే నాకు చాలా ఇష్టం.. సానియాతో కలిసి పనిచేస్తా: జకోవిచ్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరల్డ్ నంబర్ 1, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ అదరగొడుతున్నాడు. జకోవిచ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 35 ఏండ్ల అడ్రియన్ మన్నారినోను జకో చిత్తుగా ఓడించాడు. . వరుస సెట్లలో జోరు కొనసాగించిన ఈ సెర్బియా స్టార్ 6-0, 6-0, 6-3తో అలవోకగా గెలుపొంది రికార్డు స్థాయిలో 58వ సారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా మూడో రౌండ్ అనంతరం సోనీ స్పోర్ట్స్‌కు జకోవిచ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా కూడా పాల్గోంది. భారత్‌తో తనకు మంచి సంబంధం ఉందని, అక్కడ టెన్నిస్ అభివృద్దికి సానియా మీర్జాతో కలిసి పనిచేస్తాని జకోవిచ్ తెలిపాడు. "భారత్‌తో నాకు గొప్ప అనుబంధం ఉంది. సెర్బియా, భారతదేశ చరిత్రను పరిశీలిస్తే చాలా సారూప్యతలు ఉన్నాయి. నాకు భారతీయలు అంటే చాలా ఇష్టం. వారు ఎల్లప్పుడూ నన్ను అభిమానుస్తునే ఉంటారు. భారతీయలకు ప్రేమభిమానాలు ఎక్కువ. ఇండియన్స్ క్రీడలను ఎక్కువగా ఇష్టపడతారు. భారత్‌లో క్రికెట్ ఒక మతంగా ఉన్నప్పటికీ.. టెన్నిస్‌ను కూడా ఎక్కువగా ఆదరిస్తారు. నేను దాదాపు పదేళ్ల క్రితం న్యూ ఢిల్లీలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు వెళ్లాను. రెండు రోజులు పాటు అక్కడే ఉన్నాను. మళ్లీ ఇండియాకు రావాలనుకుంటున్నాను. భారత్‌లో పిల్లల అభివృద్ధికి ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని కార్యక్రమాలలో భాగం కావాలని ఆశిస్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రామాలు నా భార్యకు కూడా ఎంతో ఇష్టం. అదే మా ఫౌండేషన్ లక్ష్యం కూడా. అదే విధంగా భారత్‌లో టెన్నిస్ అభివృద్దికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా నేను భాగం కావాలనకుంటున్నను. ఎక్కువ మంది పిల్లలు టెన్నిస్ రాకెట్ పట్టుకుని టెన్నిస్ ఆడటం నాకు చాలా ఇష్టం. టెన్నిస్ అభివృద్దికి నేను అన్ని విధాలగా కృషి చేస్తాను. ఈ మిషన్ కోసం మనమిద్దరం కలిసి పనిచేద్దాం" అని సానియా మీర్జాతో జకోవిచ్ పేర్కొన్నాడు. చదవండి: #ShoaibMalikSaniamirza: 'షోయబ్‌తో విడాకులు తీసుకుని కొన్ని నెలలైంది.. కానీ ఇప్పుడు తప్పట్లేదు' -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాలు.. టాప్ సీడ్లకు షాకిచ్చిన అనామకులు
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాలు నమోదయ్యాయి. రష్యాకు చెందిన 16 ఏళ్ల మిరా అండ్రీవా అద్భుత ఆటతో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఆరో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యునీషియా)ను ఇంటిదారి పట్టించగా... ఎలీనా అవెనెస్యాన్ (రష్యా) ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్)ను బోల్తా కొట్టించింది. కేవలం 54 నిమిషాల్లో ముగిసిన ఈ రెండో రౌండ్ మ్యాచ్‌లో అండ్రీవా 6–0, 6–2తో ఆన్స్ జెబర్పై, ఎలీనా 6–4, 6–4తో సాకరిపై గెలిచి మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–2తో ఫ్రువిర్తోవా (చెక్ రిపబ్లిక్)పై, నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 7–6 (7/2), 6–2తో డొలెహిడె (అమెరికా)పై, తొమ్మిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో తమారా (జర్మనీ)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 3 గంటల 11 నిమిషాల్లో 6–3, 4–6, 7–6 (7/4), 6–3తో అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. -
Australian Open: శ్రమించిన జొకోవిచ్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. ఆదివారం మొదలైన ఈ టోరీ్నలో తొలి రౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 6–2, 6–7 (5/7), 6–3, 6–4తో ప్రపంచ 178వ ర్యాంకర్, క్వాలిఫయర్ డినో ప్రిజ్మిక్ (క్రొయేíÙయా)పై కష్టపడి గెలిచాడు. 4 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 11 ఏస్‌లు సంధించాడు. 40 విన్నర్స్ కొట్టిన ఈ సెర్బియా స్టార్ 49 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ప్రత్యర్థి సరీ్వస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. సబలెంకా సులువుగా... మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్) అలవోక విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. రెండో సీడ్ సబలెంకా 6–0, 6–1తో 53 నిమిషాల్లో ఇలా సెడెల్ (జర్మనీ)పై గెలిచింది. ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్), తొమ్మిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు. -
Viral Videos: జకోవిచ్ క్రికెట్, బాస్కెట్‌బాల్ ఆడితే...????
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఛారిటీ టెన్నిస్ మ్యాచ్ సందర్భంగా సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిచ్ క్రికెట్ ఆడాడు. జకో.. ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తనయుడు జాక్సన్ వార్న్‌లతో కలిసి టెన్నిస్ కోర్టులోనే సరదాగా బ్యాటింగ్, బౌలింగ్ చేశాడు. ఈ సందర్భంగా స్టీవ్ స్మిత్, జాక్సన్ వార్న్‌లు సైతం కాసేపు జకోతో టెన్నిస్ ఆడాడు. స్టీవ్ స్మిత్ ఆటకు (టెన్నిస్) జకో ఫిదా అయ్యాడు. Is it too late to add him to the test squad?! From the sounds of it the selectors are open to trying things out...@DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/VAJq2KFShr — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Game respects game! (And Novak is just like the rest of us when it comes to Smudge...)@stevesmith49 • @DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/ioL8hjVSrF — #AusOpen (@AustralianOpen) January 11, 2024 మెల్బోర్న్లోని రాడ్ లేవర్ ఎరీనాలో "ఎ నైట్ విత్ నొవాక్ అండ్ ఫ్రెండ్స్" పేరిట జరిగిన ఈ ఛారిటీ మ్యాచ్‌లో జకో.. స్టెఫనాస్ సిట్సిపాస్‌తో తలపడ్డాడు. మధ్యలో ఈ మ్యాచ్ కాసేపు మిక్సడ్ డబుల్స్‌గా కూడా మారింది. జకో.. మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంకతో జతకట్టగా.. సిట్సిపాస్ మరియా సక్కారితో కలిసి ఆడాడు. A challenge?! This is like shelling peas for international gymnast Georgia Godwin, @DjokerNole!#AusOpen • #AO2024 pic.twitter.com/bXs24p8Lfj — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Nothing. But. Net. Like it wouldn't have been 😆@DjokerNole • @alantwilliams • #AusOpen • #AO2024 pic.twitter.com/tzrLjgWTsB — #AusOpen (@AustralianOpen) January 11, 2024 ఈ సందర్భంగా జకో క్రికెట్‌తో పాటు పలు ఇతర క్రీడలను కూడా ఆడాడు. తొలుత పోల్ వాల్ట్ ఛాంపియన్ జార్జియా గాడ్విన్‌తో కలిసి ఫీట్లు చేసిన అతను.. ఆతర్వాత ఆస్ట్రేలియన్ వీల్ చైర్ టెన్నిస్ ఛాంపియన్ హీత్ డేవిడ్సన్తో కలిసి వీల్‌చైర్ టెన్నిస్ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియన్ బాస్కెట్‌బాల్ స్టార్ అలన్ విలియమ్స్‌తో కలిసి బాస్కెట్‌బాల్, మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్, స్లామ్ డంక్ వంటి ఇతర క్రీడలను కూడా ఆడాడు. సరదాసరదాగా సాగిన ఈ ఛారిటీ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. స్క్రీన్‌పై కనిపించినంత సేపు జకో తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ అలరించాడు. Move over, @KingJames!@DjokerNole • @alantwilliams • #AusOpen • #AO2024 pic.twitter.com/bMmPknbXOD — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Race again in Paris? 😅@DjokerNole v @pbol800 #AusOpen • #AO2024 pic.twitter.com/jXgTyzhhbE — #AusOpen (@AustralianOpen) January 11, 2024 -
కొడుకు కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి.. ఇప్పుడిలా ఆటతోనే..
22 మే,1999.. బెల్గ్రేడ్ నగరంలో తనకిష్టమైన టెన్నిస్ కోర్టులో జొకోవిచ్ 12వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఒక వైపు తల్లిదండ్రులు హ్యపీ బర్త్‌డే అంటూ పాడుతున్నారు. ఆ కుర్రాడిలో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఒక్కసారిగా సైరన్ మోత.. పెద్ద శబ్దాలతో యుద్ధ విమానాలు తమపై నుంచే వెళ్లసాగాయి. మరో వైపు నుంచి దూసుకొచ్చిన పెద్ద బాంబు తమకు సమీపంలోనే పడింది. అంతే వారంతా ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగెత్తిపోయారు. బాంబు దాడితో కొద్ది దూరంలోనే ఉన్న పవర్ స్టేషన్ కుప్పకూలడంతో ఆ ప్రాంతమంతా చీకటి అలుముకుంది. అందరిలోనూ తీవ్రమైన భయం. యూగస్లావియా యుద్ధం సాగుతున్న ఆ టైమ్‌లో ఇలాంటి దృశ్యాలను చాలాసార్లే చూశారు అక్కడి ప్రజలు. జొకోవిచ్ కూడా అలాంటి స్థితిని ఎదుర్కొన్నవాడే. 78 రోజుల పాటు సాగిన ఆ యుద్ధంలో బెల్గ్రేడ్పై బాంబుల దాడి కొనసాగింది. అలాంటి వాతావరణం నుంచి ఎదిగిన జొకోవిచ్ కఠోర శ్రమ, పోరాటంతో టెన్నిస్ ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరాడు. యుద్ధం కొనసాగిన సమయంలోనూ 12 ఏళ్ల జొకో ప్రాక్టీస్ ఆపలేదు. ఒకరోజు ఒకచోట బాంబు పడితే మరుసటిరోజు మరో చోటకు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు. వరుసగా రెండు రోజుల పాటు ఒకే చోట బాంబులు వేయరనేది వారి నమ్మకం. 24 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకోవడం, రికార్డు స్థాయిలో వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగడం, లెక్కలేనన్ని ఘనతలు ఖాతాలో వేసుకోవడం మాత్రమే జొకోవిచ్‌ను గొప్పవాడిగా మార్చలేదు. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఎదురొడ్డి అత్యుత్తమ స్థాయికి చేరిన తీరు ఈ సెర్బియా స్టార్‌ను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. ప్రతి వీథిలో అతని పోస్టర్ 2011లో జొకోవిచ్ మొదటిసారి వింబుల్డన్ టైటిల్ గెలిచినప్పుడు సెర్బియా దేశం మొత్తం ఊగిపోయింది. ఒకప్పుడు యుద్ధానికి కేరాఫ్ అడ్రస్‌గా.. చరిత్రలో చెడ్డపేరుతో గుర్తొచ్చిన దేశం నుంచి ఒక స్టార్ పుట్టడం ఆ దేశవాసులకు అమితానందాన్ని పంచింది. ప్రతి వీథిలో అతని పోస్టర్ వెలసింది. సిగరెట్ లైటర్లు, క్యాండీ బ్యాగ్‌లు, కీ చైన్లు ఎక్కడ చూసినా అతనే కనిపించాడు. సెర్బియాకు ఒక కొత్త హీరో అవసరం అనిపించింది. జొకోవిచ్ ఆ స్థానాన్ని అందుకోగలిగాడు. అతను స్వదేశానికి తిరిగొచ్చినప్పుడు బెల్గ్రేడ్లో లక్ష మందితో స్వాగతం లభించింది. దేశాధ్యక్షుడు ‘నా పదవీ నువ్వే తీసుకో’ అంటూ జోక్ కూడా చేశాడు. అమెరికాతో పాటు అగ్రశ్రేణి యూరోపియన్ దేశాల్లో ఉండే సౌకర్యాలు, ప్రోత్సాహంతో పోలిస్తే సెర్బియాలాంటి చోట నుంచి టెన్నిస్‌లో ఒక ఆటగాడు పై స్థాయికి రావడం అసంభవం. అలాంటిది జొకోవిచ్ సాధారణ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. ప్రపంచ టెన్నిస్‌లో అత్యంత విజయవంతమైన ప్లేయర్‌గా నిలిచాడు. ఇంతకన్నా అద్భుతం ఏముంటుంది! యుద్ధం తనలో మరింత పట్టుదలను పెంచిందని, ఎలాంటి స్థితిలోనైనా పోరాడాలనే స్ఫూర్తిని నింపిందని అతను చెప్పుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏదీ సులువుగా దక్కదని, లభించిన ప్రతిదానినీ గౌరవించాలనే విషయాన్ని తెలుసుకున్నానని అంటాడు. ఒకే ఒక లక్ష్యంతో.. జొకోవిచ్ది సాధారణ కుటుంబ నేపథ్యం. తల్లిదండ్రులిద్దరూ కలసి బేకరీ నిర్వహించేవాళ్లు. వారి షాప్ ఎదురుగా ఉండే ఒక టెన్నిస్ కోచింగ్ సెంటర్ కారణంగా అతనికి ఆ ఆటపై ఆసక్తి కలిగింది. సరిగ్గా నాలుగో ఏట.. 1991లో తొలిసారి టెన్నిస్ రాకెట్ పట్టాడు. అప్పటివరకు స్కీయింగ్, ఫుట్‌బాల్‌లను ఇష్టపడ్డా చివరకు టెన్నిస్ వైపే అతని అడుగులు పడ్డాయి. స్కూల్లో ఉన్నప్పుడు సరదాగా ఆడుకునేందుకు స్నేహితులు ఎప్పుడు పిలిచినా అతను వెళ్లలేదు. టెన్నిస్ మాత్రమే ఆడతానంటూ ఠంచనుగా ప్రాక్టీస్‌కు హాజరైపోయేవాడు. దేశం వదలక తప్పదు ఏడేళ్ల ప్రాథమిక శిక్షణ తర్వాత ఇక తాను అతనికి నేర్పించేదేమీ లేదని తొలి కోచ్ జెలెనా జెన్సిచ్ స్పష్టం చేసింది. ‘మీ అబ్బాయి టెన్నిస్‌లో ఎదగాలి అనుకుంటే దేశం వదలక తప్పద’ని చెప్పింది. దాంతో తల్లిదండ్రులు 12 ఏళ్ల జొకోను జర్మనీలోని మ్యూనిక్‌కు పంపించారు ప్రత్యేక శిక్షణ కోసం! దీనికోసం వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. సహాయం చేసేవారు లేక చాలాసార్లు అధిక వడ్డీలకు అప్పులూ తెచ్చారు. ఇందుకు ఒకే ఒక్క కారణం తమ అబ్బాయి ప్రతిభపై ఉన్న నమ్మకమే! ఏదో ఒకరోజు అతను అద్భుతాలు చేస్తాడని విశ్వసించారు. జొకో వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అద్భుతమైన కెరీర్‌కు అంకురార్పణ శిక్షణ ఫలితాలు రెండేళ్ల తర్వాత రావడం మొదలుపెట్టాయి. 14వ ఏట యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు గెలవడంతో పాటు వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అతను రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. 16 ఏళ్ల వయసులో తొలిసారి ఏటీపీ పాయింట్లు అతని ఖాతాలో చేరడంతో జొకో భవిష్యత్తు ఏమిటో స్పష్టంగా తెలిసిపోయింది. తర్వాతి ఏడాదే సెర్బియా జాతీయ జట్టు తరఫున డేవిస్ కప్ ఆడాడు. అదే జోరు కొనసాగిస్తూ 19 ఏళ్ల వయసులో అతను తన తొలి ఏటీపీ టైటిల్‌ను గెలుచుకోవడంతో అద్భుతమైన కెరీర్‌కు అంకురార్పణ జరిగింది. 2006లో నెదర్లాండ్స్‌లోని అమర్స్ఫూర్ట్లో అతను ఈ విజయాన్ని అందుకున్నాడు. అదే ఏడాది ఫ్రాన్స్‌లోని మెట్జ్లోనూ విజేతగా నిలవడంతో టాప్–20 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న పిన్న వయస్కుడిగా జొకోవిచ్ నిలిచాడు. గ్రాండ్‌స్లామ్ ప్రస్థానం.. టెన్నిస్‌లో ఏ ఆటగాడికైనా ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయినా గెలవాలనేది కల. ఇతర ఎన్ని టోర్నీల్లో విజేతగా నిలిచినా.. ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఆటగాడి కెరీర్‌నే మార్చేస్తుంది. తొలి మూడు సీజన్లలో నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లోనూ ఆడి ఒకసారి ఫైనల్ వరకు చేరినా ట్రోఫీ దక్కలేదు. అయితే జొకోవిచ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కలగన్న సమయం 2008లో.. ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో వచ్చింది. ఫైనల్లో విల్‌ఫ్రెండ్ సోంగాను ఓడించి తొలిసారి మేజర్ టైటిల్‌ను జొకో ముద్దాడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డతో అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందంటే అదే గ్రాండ్‌స్లామ్‌ను అతను మరో తొమ్మిదిసార్లు సొంతం చేసుకోగలిగాడు. తర్వాతి రెండేళ్లు గ్రాండ్‌స్లామ్ దూరమైనా.. 2011లో అతని అద్భుతమైన ఆట మళ్లీ స్థాయిని పెంచింది. ఒకే ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్‌లతో వన్నె తగ్గని ప్రతిభను కనబరచాడు. ఆ తర్వాత ఇంకెన్నో గొప్ప విజయాలు, మరెన్నో సంచలనాలను ఝుళిపించిందా రాకెట్. ఇక వరల్డ్ నంబర్‌వన్‌గా అతని కీర్తి అసాధారణం. 2011లో తొలిసారి అగ్రస్థానాన్ని అందుకున్న అతను వేర్వేరు దశల్లో (ఎనిమిది సార్లు) కలిపి ఏకంగా 400 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక ఆటగాడిగా తన ర్యాంక్‌ను పటిష్ఠం చేసుకున్నాడు. రెండోస్థానంలో ఉన్న ఫెడరర్ (310 వారాల) ఒక్కడే 300 వారాలు దాటిన మరో ఆటగాడు కావడం జొకో స్థాయిని చూపిస్తోంది. అభిమానులతోనూ తలపడి.. 2011 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్ మ్యాచ్.. అప్పటికే దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ ప్లేయర్ రోజర్ ఫెడరర్‌తో మూడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత నొవాక్ జొకోవిచ్ తలపడుతున్నాడు. న్యూయార్క్‌లోని ఫ్లషింగ్ మెడోస్ మైదానమంతా ఫెడరర్ నామస్మరణతో ఊగిపోతోంది. అతని ఆటను అభిమానించడంతో పాటు అతనికున్న మంచి అబ్బాయి ఇమేజ్ కూడా అందుకు ఒక కారణం కావచ్చు. జొకోవిచ్ విషయానికి వస్తే.. అప్పుడప్పుడు తన వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో వార్తల్లో నిలిచిన అతనంటే సామాన్య ప్రేక్షకులకు సదభిప్రాయం లేదు. బాగా ఆడుతున్న మరో ఆటగాడిని కూడా కనీసం గౌరవించాలనే ఆలోచన వారిలో కనిపించలేదు. సరిగ్గా చెప్పాలంటే 24 వేల మంది ఉన్న స్టేడియంలో 23 వేల మంది ఫెడరర్‌కు మద్దతు పలుకుతున్నారు. అదే హుషారుతో ఫెడరర్ తొలి రెండు సెట్లు గెలుచుకున్నాడు. ఇక ఫైనల్ చేరడమే తరువాయి అన్నట్లుంది ఆ పరిస్థితి. కానీ జొకోవిచ్ పట్టు వదల్లేదు. ప్రత్యర్థితో పాటు ప్రేక్షకులతోనూ తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఒక్కసారిగా తన అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెచ్చి జొకోవిచ్ చెలరేగిపోయాడు. అంతే.. అతని పదునైన షాట్లకు బదులివ్వలేక ఫెడరర్ అనూహ్య రీతిలో తడబడ్డాడు. దూకుడును కొనసాగించిన జొకో వరుసగా మూడు సెట్లు గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. మ్యాచ్ గెలిచాక జొకోవిచ్.. ‘మీ అంత మంచి అభిమానులు ఎక్కడా ఉండరు. ఎందుకంటే నేను మానసికంగా ఇంకా దృఢంగా, గ్రానైట్‌లా మారేందుకు మీరు సహకరించారు’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇలాంటి వ్యక్తిత్వమే జొకోవిచ్‌ను అందరికంటే భిన్నంగా నిలబెట్టింది. ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్‌ల వేటలో మిగతా ఇద్దరు ఫెడరర్, నాదల్‌లతో పోలిస్తే జొకోవిచ్ దాటిన ప్రతికూలతలు అసాధారణం. అతని సరదా చేష్టలు అతనికి జోకర్ అనే పేరును తెచ్చిపెట్టాయి. సీరియస్ ఆటలో అతనో కమేడియన్ అంటూ కామెంట్లు వినిపించాయి. ఓడినప్పుడు ఆగ్రహావేశాలతో రాకెట్లు విరగొట్టినప్పుడు ఏమాత్రం క్రీడాస్ఫూర్తి లేని ఆటగాడు ప్రపంచటెన్నిస్ చరిత్రలో ఇతనొక్కడే అంటూ విమర్శలూ వినిపించాయి. ఒక దశలో టెన్నిస్ అభిమానులంతా మాకు నచ్చని ఆటగాడు అతనే అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి కాదు.. ఎన్నోసార్లు మైదానంలో అతనికి కనీస మద్దతు కూడా లభించలేదు. కానీ ఎప్పుడూ దానిపై అతను ఫిర్యాదు చేయలేదు. ‘నేనేంటో నా ఆటతోనే చూపిస్తాను’ అంటూ చెలరేగి.. అత్యున్నత స్థానానికి చేరాడు. ‘ఇలాంటివి నన్ను మరింత దృఢంగా మార్చాయే తప్ప నన్ను కుంగదీయలేదు’ అన్న జొకోవిచ్ ఇప్పటికీ తనకు నచ్చినట్లుగానే ఆడుతున్నాడు.. గెలుస్తున్నాడు! -మొహమ్మద్ అబ్దుల్ హాది -
ఓటమిని ఒప్పుకోవడమే క్రీడాస్ఫూర్తి
పది వరుస విజయాల తర్వాత ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోవడం హఠాత్ఘాతమే. తట్టుకోలేని దెబ్బే. అయితే అది ఒక వ్యక్తి ప్రవర్తనను, ప్రవర్తన విధానాన్ని ప్రభావితం చేసినందువల్ల... అతడిలో మనం ఆశించిన సౌమ్యతను, మర్యాదను అతడు విస్మరిస్తే దానిని మనం చూసీ చూడనట్లు వదిలేయాలా? 2021 యు.ఎస్. టెన్నిస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్... నొవాక్ జొకోవిచ్‌కి చాలా పెద్ద మ్యాచ్. అతడు ఆ మ్యాచ్‌ని గెలిస్తే ఒకే ఏడాదిలో మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్లలోనూ విజయం సాధించినట్లు అవుతుంది. అద్భుతంగా ఆడాడు. కానీ ఓడిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినప్పటికీ మెద్వెదేవ్‌ను మనస్ఫూర్తిగా అభినందించాడు. మన క్రికెటర్లు తమ ఓటమిని హూందాగా ఎలా స్వీకరించాలో నేర్చుకోవలసే ఉంది. పెద్దమనిషి అని ఒకర్ని అంచనా వేయడానికి ఉన్న అనేకమైన మార్గాలలో బహుశా అత్యంత సునిశి తమైనది... వారు ఓటమిలో సైతం సహజ నిశ్చల శాంత గాంభీర్యాన్ని కలిగి ఉండటమేనని నేను చెప్పగలను. ఇక ఆ పెద్దమనిషి క్రీడాకారుడు అయితే కనుక ఓటమిలోని అతడి నిశ్చలతకు మరింతగా ప్రాముఖ్యం ఉంటుంది. ఏదైనా మీరు తీవ్రంగా కోరుకున్నదీ, ‘మన చేతుల్లో పనే’ అనేంతగా మీరు తిరుగులేని నమ్మకంతో ఉన్నదీ... ఊహించని విధంగా మీ పట్టు నుంచి జారి, మిమ్మల్నొక కలలు కల్లలైన పరాజితునిగా మిగిల్చినప్పుడు మీ కదలి కలు, మీ కవళికలు ఎలా ఉంటాయన్నది మీ వ్యక్తిత్వంలోని నాణ్యత పాలును పైకి తేలుస్తుంది. గత ఆదివారం ఓటమి అనంతరం మన క్రికెట్ జట్టు నిలదొక్కుకోలేక పోయిన పరీక్ష ఇటువంటిదే. అందుకే నేను గుండెల్ని ముక్కలు చేసిన ఆ ప్రపంచ కప్పు పరాజయానికి భారత జట్టు ఎలా స్పందించిందో ఒక ఎంపికగా ఈ వారం రాయదలచాను. గొప్ప వీరులను మీరు మీ హృదయ పీఠాలపై ప్రతిష్ఠించుకున్నప్పుడే, వారి రూపాలను పంకిలపరిచే లోపాలను సైతం సమస్థాయిలో అంగీకరించడం అన్నది కూడా మీ ఆరాధనలోని ఒక తప్పనిసరి బాధ్యత అవుతుంది.. ముఖ్యంగా టీవీల ప్రత్యక్ష ప్రసారంలో వీరులైన మీ జగజ్జెట్టీలను ప్రపంచం అంతా కళ్లింత చేసుకుని చూస్తున్నప్పుడు! ‘‘భారతజట్టులోని చాలామంది ఆటగాళ్లు... విజేతలైన ఆసీస్ జట్టులోని క్రీడాకారులతో కరచాలనం చేసిన తర్వాత మైదానం విడిచిపెట్టారు. కనీసం ప్యాట్ కమిన్స్ ట్రోఫీని పైకెత్తి చూపడాన్ని వీక్షించేంత వరకైనా అక్కడ ఉండలేకపోయారు’’ అని మేథ్యూ సాల్విన్ ‘న్యూస్.కామ్.ఎయు’లో రాశారు. అదే నిజమైతే అటువంటి ప్రవర్తన అమర్యాదకరమైనది మాత్రమే కాదు, క్షమించరానిది కూడా! ఈ ధోరణి భారత జట్టును, భారత ప్రజలను కూడా చెడుగా ప్రపంచానికి చూపెడుతుంది. విరాట్ కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు అందు కున్నప్పుడు అతడి ప్రవర్తనను నాకు నేనుగా గమనించాను. అతడు నిరుత్సాహానికి గురవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ స్థాయికి తగని అతడి వైఖరి మాత్రం నేను అంగీకరించలేనిది. సచిన్ టెండూల్కర్‌తో మాత్రమే కరచాలనం చేసి, తక్కిన వాళ్లలో ఒక్కర్ని కూడా కోహ్లీ పట్టించుకోలేదు. అది అమర్యాద మాత్రమే కాదు, క్షమార్హం కాని స్వీయాధిక్య భావన కూడా! కోహ్లీని మాత్రమే నేనెందుకు వేరు చేసి చూస్తున్నాను? రెండు కారణాల వల్ల. కోట్లాది మందికి అతడు హీరో. తన ఆదర్శపాత్రను గొప్ప సంపదగా సృష్టించుకున్నవాడు. అతడేం చేస్తే వాళ్లు దానిని అనుసరిస్తారు. అంతేనా, అనుకరిస్తారు కూడా! అందుకే అతడి తప్పి దాలు కనిపించకుండా పోవు. ఒక స్టార్‌గా అతడు ప్రశంసలకు ఎలాగైతే అర్హుడో, విమర్శలకూ అంతే యోగ్యుడు. నేను కఠినంగా మాట్లాడుతున్నానని మీరు అనవచ్చు. పది వరుస విజయాల తర్వాత ఫైనల్లో ఓడిపోవడం హఠాత్ఘాతమే. తట్టుకోలేని దెబ్బే. అయితే అది ఒక వ్యక్తి ప్రవర్తనను, ప్రవర్తన విధా నాన్ని ప్రభావితం చేసినందువల్ల అతడిలో మనం ఆశించిన సౌమ్య తను, మర్యాదను అతడు విస్మరిస్తే దానిని మనం చూసీ చూడనట్లు వదిలేయాలా? అది నాకు సమ్మతి కాని వాదన. ఎందుకో నన్ను చెప్పనివ్వండి. 2021 యు.ఎస్. టెన్నిస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్... నొవాక్ జొకోవిచ్‌కి చాలా పెద్ద మ్యాచ్. అందరి మదిలోనూ ఒకటే, అతడు ఆ మ్యాచ్‌ని గెలిస్తే ఒకే ఏడాదిలో అది అతడి నాలుగో గ్రాండ్ స్లామ్ విజయం అవుతుంది. 1969 నాటి రాడ్ లేవర్ ఘనతకు అతడిని సమం చేస్తుంది. పురుషుల టెన్నిస్‌లో ఒక ఏడాదిలోని గ్రాండ్ స్లామ్‌లు అన్నింటిలో విజయం సాధించిన మూడవ వ్యక్తిగా చరిత్రలో నిలుస్తాడు. కానీ ఏమైంది? ఓడిపోయాడు! ఏ లెక్కన చూసినా గత ఆదివారం విరాట్ కోహ్లీ చవి చూసిన ఓటమి కన్నా కూడా జొకోవిచ్ది చాలా పెద్ద ఓటమి. అంతేకాదు – అది చిన్న సంగతేం కాదు – పైగా వ్యక్తిగతమైనది. కనుక అది అసలు సిసలు పరీక్ష. జొకోవిచ్ అద్భుతంగా ఆడాడు. సందేహమే లేదు. అందుకే ఓటమి అతడిని కుంగదీసింది. అతడి కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. డేనియల్ మెద్వెదేవ్ అతడిని ఓడించిన క్షణాలలో జెకోవిచ్ అతడితో ఏమన్నాడో చూడండి: ‘‘ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్‌కు అర్హులు ఎవరైనా ఉన్నారంటే అది మీరు మాత్రమే. చక్కగా ఆడారు. నిజంగానే చాలా చక్కగా! మంచి సమన్వయంతో ఉన్నారు. గ్లాండ్ స్లామ్ ప్రస్తుత పర్య టనల్లోని గొప్ప ఆటగాళ్లలో మీరు ఒకరు. మన మధ్య మంచి స్నేహపూర్వకమైన పోటీ నడిచింది. మీరింకా మరిన్ని గ్లాండ్ స్లామ్‌లు గెలవాలని, మరిన్ని మేజర్ లీగ్స్‌లో ఆడాలని నేను కోరుకుంటున్నాను. మళ్లీ కూడా మీరు ఇలాంటి విజయాన్ని నిశ్చయంగా సాధించ గలరని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని మెద్వేదేవ్ను మనస్ఫూర్తిగా అభినందించాడు జొకోవిచ్. అదీ క్రీడాస్ఫూర్తి అంటే. అదీ పెద్దరికం అంటే. దురదృష్టవశాత్తూ గతవారం మన క్రికెట్ జట్టు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఇక జొకోవిచ్ ప్రేక్షకులను ఉద్దేశించి ఏమన్నాడో తెలుసా! ‘‘నేను మ్యాచ్ గెలవనప్పటికీ ఈ రాత్రి నా హృదయం పట్టనలవి కాని ఆనందంతో నిండి ఉందని మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ అభిమానంతో మీరు నాకు కలిగించిన ప్రత్యేకమైన అనుభూతి కారణంగా నేనిప్పుడు భూమి మీద జీవించి ఉన్నవారిలో అత్యంత సంతో షకరమైన వ్యక్తిని. మీరు నా హృదయాన్ని స్పృశించారు. న్యూయార్క్‌లో నేనెప్పుడూ ఇలా లేను. నిజాయతీగా చెబుతున్నాను. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను మిత్రులారా! నాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు నాకోసం చేసిన ప్రతిదానికీ కూడా’’ అని ఉద్వేగంగా మాట్లాడాడు. మన క్రికెటర్లు– ప్రధానంగా కోహ్లీ – గొప్ప క్రీడాకారులే అయినప్పటికీ వారు తమ ఓటమిని హుందాగా ఎలా స్వీకరించాలో నేటికింకా నేర్చుకోవలసే ఉంది. ఇందుకు రెండు కావాలి. మొదటిది క్రీడా పరాక్రమం. రెండోది శ్రేష్ఠమైన అంతఃచేతనాశక్తి. రెండోది లేకుండా మాత్రం నిజంగా మీరు గొప్పవారు కాలేరు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
డేవిస్ కప్ సెమీస్‌లో సెర్బియా
మలగ (స్పెయిన్): ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ డేవిస్ కప్ క్వార్టర్ ఫైనల్లో కీలకమైన విజయంతో సెర్బియాను సెమీస్‌కు చేర్చాడు. తద్వారా డేవిస్ కప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా ఘనత వహించాడు. టీమ్ ఈవెంట్లో గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ఫైనల్లో సెర్బియా 2–0తో బ్రిటన్‌పై ఘనవిజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో లోమిర్ కెమనొవిచ్ (సెర్బియా) 7–6 (7/2), 7–6 (8/6)తో జాక్ డ్రాపెర్ (బ్రిటన్)ను ఓడించగా... రెండో సింగిల్స్‌లో జొకోవిచ్ 6–4, 6–4తో కామెరాన్ నోరీ (బ్రిటన్)పై గెలుపొందాడు. 2–0తో ఫలితం తేలడంతో డుసాన్ లాజొవిక్తో కలిసి జొకోవిచ్ డబుల్స్ మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేకపోయింది. డేవిస్ కప్ టోర్నీల్లో గత మూడేళ్లుగా సెర్బియన్ స్టార్ వరుసగా సాధించిన 21వ విజయమిది. ఓవరాల్‌గా ఈ టీమ్ ఈవెంట్లో రికార్డు స్థాయిలో జొకోవిచ్ 44 విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం సింగిల్స్‌నే పరిగణిస్తే జొకోకు ఇది 40వ విజయం అవుతుంది. సెమీస్‌లో సెర్బియా... ఇటలీని ఎదుర్కొంటుంది. మరో క్వార్టర్స్‌లో ఇటలీ 2–1తో నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. -
జొకోవిచ్ రికార్డు విజయం
టురిన్ (ఇటలీ): అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సెర్బియా దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా 36 ఏళ్ల జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఇటలీ ప్లేయర్ యానిక్ సినెర్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–3తో నెగ్గి ఈ టోర్నీని రికార్డుస్థాయిలో ఏడోసారి సొంతం చేసుకున్న తొలి ప్లేయర్‌గా ఘనత సాధించాడు. గతంలో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఆరుసార్లు ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు విన్నర్స్ ట్రోఫీతోపాటు 44,11,500 డాలర్ల (రూ. 36 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీ, 1300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. జొకోవిచ్ 2008, 2012, 2013, 2014, 2015, 2022లలో కూడా ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో చాంపియన్ గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఏడా ది జొకోవిచ్ ఏడు టైటిల్స్‌ను దక్కించుకున్నాడు. అడిలైడ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన జొకోవిచ్ ఆ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టోర్నీ, యూఎస్ ఓపెన్, పారిస్ ఓపెన్ మాస్టర్స్ టోర్నీ, ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్ సాధించాడు. కెరీర్లో 98వ సింగిల్స్ టైటిల్‌తో జొకోవిచ్ టెన్నిస్ చరిత్రలో 400 వారాలు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. -
ఎనిమిదోసారి ‘టాప్’ ర్యాంక్‌తో...
టురిన్ (ఇటలీ): సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనున్నాడు. సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ తొలి లీగ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 7–6 (7/4), 6–7 (1/7) 6–3తో హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచి 2023 సీజన్ ముగింపు ‘టాప్’ ర్యాంక్‌ను ఖరారు చేసుకున్నాడు. 36 ఏళ్ల జొకోవిచ్ రెండేళ్ల క్రితమే ఏడోసారి సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించి సంప్రాస్ (అమెరికా; 6 సార్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. జొకోవిచ్ 2011, 2012, 2014, 2015, 2018, 2020, 2021లలో నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించాడు. ఏటీపీ ఫైనల్స్ ముగిశాక జొకోవిచ్ ఓవరాల్‌గా ఏటీపీ ర్యాంకింగ్స్ లో 400 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందనున్నాడు. సీజన్ ముగింపు నంబర్‌వన్ ర్యాంక్ ట్రోఫీతో జొకోవిచ్ -
నా ఆప్త మిత్రుడు కోబీకి అంకితమిస్తున్నా.. జొకోవిచ్ భావోద్వేగం! వీడియో వైరల్
Novak Djokovic Pays Glorious Tribute To Kobe Bryant: ‘‘మీ అందరి ముందు నిలబడి నేను 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గురించి మాట్లాడతానని ఏనాడూ ఊహించలేదు. ఇది నిజమవుతుందని కూడా అనుకోలేదు. కానీ గత రెండేళ్లలో కొత్త చరిత్ర సృష్టించే అవకాశం నా ముందు ఉందనిపించింది. అందివచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని అనుకున్నాను. నా శరీరం సహకరించినంత వరకు, నా శిక్షణ సిబ్బంది, కుటుంబసభ్యుల సహకారం ఉన్నంతవరకు ఈ జైత్రయాత్రను కొనసాగిస్తాను. అత్యున్నతస్థాయిలో ఉన్నప్పటికీ ఈ ఆటకు ఇప్పుడే వీడ్కోలు పలికే ఆలోచన లేదు. ఈ విజయాన్ని నా ఆప్త మిత్రుడు, మూడేళ్ల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్‌కు అంకితం ఇస్తున్నాను. 24వ గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ గెలిస్తే కోబీ బ్రయాంట్ ఫొటో ఉన్న టీ షర్ట్‌ను ట్రోఫీ ప్రదానోత్సవంలో ధరించాలని అనుకున్నాను’’ అని సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ భావోద్వేగానికి లోనయ్యాడు. యూఎస్ ఓపెన్-2023లో పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన జొకోవిచ్.. కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ గెలిచి చరిత్రకెక్కాడు. ఆదివారం ఉదయం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 7–6 (7/5), 6–3తో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించాడు. వరల్డ్‌నంబర్ 1 తద్వారా యూఎస్ ఓపెన్ విజేతగా నిలవడంతో పాటు ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన జొకోవిచ్.. తన స్నేహితుడు కోబీ బ్రియాంట్‌ను గుర్తు చేసుకున్నాడు. అతడి ఫొటో ఉన్న టీ షర్ట్ ధరించి నివాళి అర్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. రికార్డుల జొకోవిచ్ కాగా ఈ విజయంతో ఒకే ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్స్‌ను నాలుగుసార్లు చొప్పున (2011, 2015, 2021, 2023) సాధించిన తొలి ప్లేయర్‌గా జొకోవిచ్ నిలిచాడు. అదే విధంగా.. అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో కానర్స్ (109; అమెరికా), ఫెడరర్ (103; స్విట్జర్లాండ్) తర్వాత జొకోవిచ్(96) మూడో స్థానంలో ఉన్నాడు. తీరని విషాదం ‘బ్లాక్ మాంబా’గా సుపరిచితమైన బాస్కెట్ బాల్ లెజెండ్ కోబీ బ్రయాంట్, కూతురు జియానా(13) సహా మరో ఏడుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యువాత పడిన విషయం విదితమే. దీంతో కోబీ కుటుంబం సహా అతడి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఈ ఘటన జరిగి మూడేళ్లకు పైనే అయింది. చదవండి: వాళ్లను ఉతికి ఆరేశారు! పాక్ మరీ చెత్తగా.. శ్రీలంక తక్కువేం కాదు! Novak hits 24 and pays tribute to the late Kobe Bryant 💙 pic.twitter.com/rDXVUvYe1Z — US Open Tennis (@usopen) September 10, 2023 -
US Open 2023: 24: తగ్గేదేలే...
న్యూయార్క్: 36 ఏళ్ల వయసు వచ్చినా తన ఆటను మరింత పదునెక్కిస్తూ సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్ చేరిన జొకోవిచ్ సీజన్లో చివరిదైన యూఎస్ ఓపెన్‌లో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఐదు గంటలకు ముగిసిన పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 7–6 (7/5), 6–3తో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. 3 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి పైచేయి సాధించాడు. విజేత జొకోవిచ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 24 కోట్ల 90 లక్షలు), రన్నరప్ మెద్వెదెవ్కు 15 లక్షల డాలర్లు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ గెలుపుతో జొకోవిచ్ ఖాతాలో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. అంతేకాకుండా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. కెరీర్లో 36వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న జొకోవిచ్‌కు తుది పోరులో మెద్వెదెవ్ నుంచి గట్టిపోటీనే ఎదురైంది. 30 లేదా 40 షాట్లతో కూడిన ర్యాలీలను చాలాసార్లు జొకోవిచ్ పాయింట్‌తో ఫినిష్ చేయగా... కొన్నిసార్లు మెద్వెదెవ్ సఫలమయ్యాడు. తొలి సెట్లోని రెండో గేమ్‌లోనే మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్లో మాత్రం ఇద్దరూ ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లోని నాలుగో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ సెర్బియా స్టార్ తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
యూఎస్ ఓపెన్ విజేతగా జొకోవిచ్.. మార్గరెట్ కోర్టు రికార్డు సమం
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. యూఎస్ ఓపెన్-2023 మెన్స్ సింగిల్ విజేతగా జొకోవిచ్ నిలిచాడు. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన సింగిల్స్ ఫైనల్లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్‌ను చిత్తు చేసిన జొకోవిచ్.. నాలుగో సారి యూఎస్ ఓపెనర్ ఛాంపియన్‌గా అవతరించాడు. అంతకుముందు 2021లో ఇదే టోర్నీ ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించి మెద్వెదేవ్ చరిత్రపుటలకెక్కాడు. దీంతో ఈసారి ఫైనల్ పోరు రసవత్తరంగా సాగుతుందని అంతా భావించారు. కానీ జకోవిచ్ మాత్రం ప్రత్యర్ధికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఈ తుది పోరులో వరుస సెట్లలో 6-3, 7-6 (7-5), 6-3 తేడాతో మూడో సీడ్ మెద్వెదెవ్‌ను జకో ఓడించాడు. ఈ విజయంతో కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జకో తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన క్రీడాకారిణిగా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్టు (24) రికార్డును ఈ సెర్భియా యోదుడు సమం చేశాడు. ఏడాది చాంపియన్‌గా నిలిచిన జకోవిచ్‌కు రూ. 25 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. చదవండి: Asia Cup 2023: షాహీన్ అఫ్రిది మంచి మనసు.. బుమ్రాకు సర్ప్రైజ్ గిప్ట్! వీడియో వైరల్ Novak Djokovic continues to write history.@AustralianOpen | @rolandgarros | @Wimbledon pic.twitter.com/RrBFOQdiN6 — US Open Tennis (@usopen) September 11, 2023 -
‘రికార్డు’తో సెమీస్‌లోకి జొకోవిచ్
న్యూయార్క్: ఈ ఏడాది వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ ఫైనల్ చేరడానికి సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో విజయం దూరంలో నిలిచాడు. టెన్నిస్ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 13వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 2 గంటల 35 నిమిషాల్లో 6–1, 6–4, 6–4తో తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. ఫ్రిట్జ్‌తో గతంలో ఆడిన ఏడుసార్లూ గెలుపొందిన జొకోవిచ్ ఎనిమిదోసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. ఏడు ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు గెలిచాడు. 2016 వింబుల్డన్ టోర్నీ మూడో రౌండ్లో సామ్ క్వెరీ (అమెరికా) చేతిలో ఓడిన జొకోవిచ్ ఆ తర్వాత అమెరికా ఆటగాళ్లతో 30 సార్లు తలపడినా ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఫ్రిట్జ్‌పై విజయంతో జొకోవిచ్ రికార్డు పుస్తకాల్లోకి కూడా ఎక్కాడు. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ చేరిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా కెరీర్లో 47వ సారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ బెర్త్ దక్కించుకున్న జొకోవిచ్ స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (46 సార్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 2011 తర్వాత సెమీస్‌లోకి బోపన్న పురుషుల డబుల్స్ విభాగంలో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 43 ఏళ్ల బోపన్న 2011 తర్వా త యూఎస్ ఓపెన్ డబుల్స్‌లో సెమీఫైనల్ చేరుకోవడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 7–6 (12/10), 6–1తో లామోన్స్–జాక్సన్ విత్రో (అమెరికా) ద్వయంపై గెలిచింది. వరుసగా మూడో ఏడాది... మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) ఈ టోర్నీలో వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–1, 6–4తో కిన్వెన్ జెంగ్ (చైనా)పై గెలిచింది. తొమ్మిదో సీడ్, ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీఫైనల్లో సబలెంకా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) 6–0, 6–3తో సొరానా క్రిస్టియా (రొమేనియా)పై గెలిచి తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది. ఐదో అన్‌సీడెడ్ ప్లేయర్‌గా... మరో క్వార్టర్ ఫైనల్లో 20 ఏళ్ల అన్‌సీడెడ్ అమెరికా ప్లేయర్ బెన్ షెల్టన్ 3 గంటల 7 నిమిషాల్లో 6–2, 3–6, 7–6 (9/7), 6–2తో అమెరికాకే చెందిన పదో సీడ్ ఫ్రాన్సెస్ టియాఫోను ఓడించి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గత 23 ఏళ్లలో ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన ఐదో అన్‌సీడెడ్ ప్లేయర్‌గా షెల్టన్ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో టాడ్ మార్టిన్ (అమెరికా; 2000లో), రాబీ జినెప్రి (అమెరికా; 2005లో), మిఖాయిల్ యూజ్నీ (రష్యా; 2006లో), దిమిత్రోవ్ (బల్గేరియా; 2019లో) ఉన్నారు. సెమీఫైనల్లో జొకోవిచ్పై షెల్టన్ గెలిస్తే 1996లో మార్క్ ఫిలిప్పోసిస్ (ఆ్రస్టేలియా) తర్వాత యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలి అన్‌సీడెడ్ ప్లేయర్‌గా ఘనత సాధిస్తాడు. -
గట్టెక్కిన జొకోవిచ్
న్యూయార్క్: కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. తొలి రెండు రౌండ్లలో అలవోకగా నెగ్గిన జొకోవిచ్‌కు మూడో రౌండ్లో తన దేశానికే చెందిన లాస్లో జెరె నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి రెండు సెట్లను చేజార్చుకున్న జొకోవిచ్ 2006 తర్వాత యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్లోనే ఇంటిదారి పడతాడా అనే సందేహం కలిగింది. అయితే అపార అనుభవం కలిగిన ఈ మాజీ చాంపియన్ పట్టుదలతో పోరాడి తేరుకున్నాడు. వరుసగా మూడు సెట్లను సొంతం చేసుకొని ఈ టోర్నీలో వరుసగా 16వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ జొకోవిచ్ 4–6, 4–6, 6–1, 6–1, 6–3తో ప్రపంచ 38వ ర్యాంకర్ లాస్లో జెరెపై గెలుపొందాడు. ఈ పోరులో 12 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్విస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 32 సార్లు దూసుకొచ్చి 21 సార్లు పాయింట్లు గెలిచాడు. 34 విన్నర్స్ కొట్టిన అతను 36 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. మరోవైపు తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), పదో సీడ్ టియాఫో (అమెరికా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఫ్రిట్జ్ 6–1, 6–2, 6–0తో మెన్సిక్ (చెక్ రిపబ్లిక్)పై, టియాఫో 4–6, 6–2, 6–3, 7–6 (8/6)తో 22వ సీడ్ మనారినో (ఫ్రాన్స్)పై నెగ్గారు. నాలుగో సీడ్ రిబాకినాకు షాక్ మహిళల సింగిల్స్‌లో మరో సంచలనం నమోదైంది. గత ఏడాది వింబుల్డన్ చాంపియన్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ రిబాకినా (కజకిస్తాన్) మూడో రౌండ్లోనే నిష్క్రమించింది. 30వ సీడ్ సొరానా క్రిస్టియా (రొమేనియా) 2 గంటల 48 నిమిషాల్లో 6–3, 6–7 (6/8), 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినాను బోల్తా కొట్టించి 15వ ప్రయత్నంలో యూఎస్ ఓపెన్‌లో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్‌వన్, డెన్మార్క్ స్టార్ వొజ్నియాకి తన జోరు కొనసాగిస్తోంది. మూడో రౌండ్లో వొజ్నియాకి గంటా 58 నిమిషాల్లో 4–6, 6–3, 6–1తో జెన్నిఫర్ బ్రేడీ (అమెరికా)ను ఓడించి 2016 తర్వాత ఈ టోర్నీలో మరోసారి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. అమెరికా టీనేజ్ స్టార్, ఆరో సీడ్ కోకో గాఫ్ రెండోసారి ఈ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో రౌండ్లో గాఫ్ 3–6, 6–3, 6–0తో 32వ సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలిచింది. రెండో సీడ్ సబలెంకా (బెలారస్), 13వ సీడ్ దరియా కసత్కినా (రష్యా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. మూడో రౌండ్లో సబలెంకా 6–1, 6–1తో క్లారా బురెల్ (ఫ్రాన్స్)పై, దరియా 6–3, 6–4తో గ్రీట్ మినెన్ (బెల్జియం)పై గెలిచారు. 8 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మ్యాచ్‌ల్లో తొలి రెండు సెట్లను కోల్పోయాక ఆ తర్వాత వరుసగా మూడు సెట్లను దక్కించుకొని విజయం అందుకోవడం జొకోవిచ్‌కిది ఎనిమిదోసారి కావడం విశేషం. గత ఏడాది వింబుల్డన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ఇటలీ ప్లేయర్ యానిక్ సినెర్‌పై కూడా జొకోవిచ్ ఈ తరహాలోనే గెలిచాడు. -
జొకోవిచ్ శుభారంభం
న్యూయార్క్: కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంతో యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ అలవోకగా రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–0, 6–2, 6–3తో అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. ఈ గెలుపుతో 36 ఏళ్ల జొకోవిచ్ యూఎస్ ఓపెన్ ముగిశాక తుది ఫలితంతో సంబంధం లేకుండా మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు. ముల్లర్‌తో గంటా 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ ఆరు ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 23 సార్లు దూసుకొచ్చి 20 సార్లు పాయింట్లు గెలిచాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. మరోవైపు నాలుగో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరిన రూనె 3–6, 6–4, 3–6, 2–6తో కార్బెలాస్ బేనా (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. ఏడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), పదో సీడ్ టియాఫో (అమెరికా), తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) కష్టపడి రెండో రౌండ్‌కు చేరగా... రెండుసార్లు మాజీ రన్నరప్ వొజి్నయాకి (డెన్మార్క్) సులువుగా రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. కోకో గాఫ్ 2 గంటల 51 నిమిషాల్లో 3–6, 6–2, 6–4తో సిగెముండ్ (జర్మనీ)పై, వొజి్నయాకి 6–3, 6–2తో ప్రొజోరోవా (రష్యా)పై గెలిచారు. -
పోటీ ఆ ఇద్దరి మధ్యే!
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ ప్రతిష్టాత్మక టోరీ్నలో అందరి దృష్టి పురుషుల సింగిల్స్ విభాగంపైనే ఉంది. టైటిల్ నిలబెట్టుకునేందుకు ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)... 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర పుటల్లో స్థానం సంపాదించేందుకు నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పట్టుదలతో ఉన్నారు. జొకోవిచ్ విజేతగా నిలిస్తే... టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (ఆ్రస్టేలియా) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టోరీ్నల్లో టైటిల్ నెగ్గి, వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఓడిపోయిన జొకోవిచ్‌కు ఈసారి ఈ స్పెయిన్ స్టార్ నుంచే గట్టిపోటీ ఎదురుకానుంది. కోవిడ్ టీకా వేసుకోని కారణంగా గత ఏడాది జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. కోవిడ్ వ్యాక్సిన్ నిబంధనలు సడలించడంతో జొకోవిచ్ ఈసారి బరిలోకి దిగుతున్నాడు. -
చొక్కా చించుకుని సంబురాలు చేసుకున్న జకో.. వెక్కివెక్కి ఏడ్చిన అల్కరాజ్
టెన్నిస్ దిగ్గజం, వరల్డ్ నంబర్-2 ప్లేయర్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ సింహ గర్జన చేస్తూ, చొక్కా చించుకుని మరీ సంబురాలు చేసుకున్నాడు. సిన్సినాటీ ఓపెన్ ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ను ఓడించిన అనంతరం జకో ఈ తరహా సెలెబ్రేషన్స్‌ను చేసుకున్నాడు. 35 రోజుల కిందట వింబుల్డన్-2023 ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన పరాభవాన్ని గుర్తు చేసుకుంటూ విజయానందంతో ఊగిపోయాడు. Novak Djokovic beat Carlos Alcaraz in a three-set thriller for his 39th Masters title 😤 pic.twitter.com/b0foTBijs8 — Bleacher Report (@BleacherReport) August 21, 2023 3 గంటల 49 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఫైనల్లో జకోవిచ్.. 5-7, 7-6 (7), 7-6 (4)తేడాతో అల్కరాజ్ను మట్టికరిపించి, తన ATP మాస్టర్స్ 1000 టైటిల్స్ సంఖ్యను 39కి పెంచుకున్నాడు. ఈ మ్యాచ్ ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా రికార్డైంది. రోజర్ ఫెదరర్-మార్డీ ఫిష్ మధ్య 2010లో జరిగిన మ్యాచ్ (2 గంటల 49 నిమిషాలు) ఈ మ్యాచ్‌కు ముందు వరకు ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా ఉండింది. One of the best championship point saves you'll ever see 🙌@carlosalcaraz #CincyTennis pic.twitter.com/AHOogM0mj6 — Tennis TV (@TennisTV) August 20, 2023 ఈ మ్యాచ్‌లో జకోవిచ్, అల్కారాజ్ కొదమ సింహాల్లా పోరాడి అభిమానులకు అసలుసిసలు టెన్నిస్ మజాను అందించారు. ఓ దశలో జకో ఛాంపియన్షిప్ పాయింట్ వరకు వచ్చి వెనుకపడి పోయాడు. అయితే ఎట్టకేలకు విజయం జకోనే వరించింది. ఓటమి అనంతరం వరల్డ్ నంబర్ ప్లేయర్ అల్కారాజ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలచి వేయగా.. ఇదే సమయంలో జకో విజయగర్వంతో ఊగిపోయాడు. -
జొకోవిచ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. ఆందోళనలో అభిమానులు
సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన జొకోవిచ్ 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో మెరిశాడు. అయితే ఇటీవలే వింబుల్డన్ ఫైనల్లో అల్కారాజ్ చేతిలో అనూహ్యంగా ఓడినప్పటికి మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కొట్టే సత్తా జొకోవిచ్‌కు ఇంకా ఉంది. ఇప్పటికే 23 టైటిల్స్‌తో పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్ చరిత్రకెక్కాడు. ఆగస్టులో యూఎస్ ఓపెన్ జరగనున్న నేపథ్యంలో జొకోవిచ్ దానికి సంబంధించిన ప్రిపరేషన్‌ను ఇప్పటికే మొదలుపెట్టాడు. తాజాగా జకోవిచ్ తండ్రి స్ర్ద్జన్ జకోవిచ్ అతని కొడుకు రిటైర్మెంట్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జకోవిచ్ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పే అవకాశముందని తెలిపాడు. ''టెన్నిస్ ఆట అనేది శారీరకంగా, మానసికంగా ఎంతో సవాల్‌తో కూడినది. అందుకోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాంతో, జీవితంలో ఇతర పనులు చేసేందుకు అతడికి సమయం ఉండడం లేదు. టెన్నిస్ అనేది జకోవిచ్ జీవితంలో ఓ భాగం. అంతేకానీ, అదే జీవితం'' కాదంటూ పేర్కొన్నాడు. జకోవిచ్ ఆటకు గుడ్ బై చెప్పనున్నాడనే వార్తతో అతడి అభిమానుల్లో ఒకింత ఆందోళన మొదలైంది. చదవండి: WI Vs IND 1st ODI: టాస్ గెలిచిన టీమిండియా.. ఇషాన్ కిషన్ వైపే మొగ్గు Japan Open 2023: క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ జోడి -
గ్రాండ్‌స్లామ్ టైటిళ్లే కాదు జరిమానా పొందడంలోనూ రికార్డే
24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలన్న నొవాక్ జొకోవిచ్ కలను చెరిపేశాడు స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్. ఆదివారం ఇద్దరి మధ్య జరిగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ హోరాహోరీగా సాగింది. కొదమ సింహాల్లా తలపడిన ఇద్దరిలో ఎవరు తేలిగ్గా ఓడిపోయేందుకు ఒప్పుకోలేదు. అయితే తొలి సెట్ ఓడినప్పటికి రెండు, మూడు సెట్లు గెలిచి ఆధిక్యంలోకి వచ్చిన అల్కరాజ్ ఇక ఈజీగా చాంపియన్ అవుతాడని అంతా ఊహించారు. కానీ జొకోవిచ్ నాలుగో సెట్లో ప్రతిఘటించడంతో పాటు సెట్‌ను గెలుచుకొని రేసులోకి వచ్చాడు. అయితే కుర్రాడి కదలికల ముందు జొకోవిచ్ అనుభవం పనికిరాలేదు. ఐదో సెట్లో పోరాడినప్పటికి అల్కరాజ్ దూకుడు ముందు ఓడిపోవాల్సి వచ్చింది. తాజాగా వింబుల్డన్ ఫైనల్ సందర్భంగా టెన్నిస్ రాకెట్‌ను విరగొట్టినందుకు గానూ జొకోవిచ్‌కు భారీ జరిమానా పడింది. ఐదో సెట్లో భాగంగా అల్కరాజ్ సర్వీస్ బ్రేక్ చేసిన జొకోవిచ్.. కాసేపటికే తన సర్వీస్‌ను కోల్పోయాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకొని కోపంతో రాకెట్‌ను నెట్పోస్ట్కు బలంగా విసిరికొట్టాడు. దీంతో రాకెట్ రెండు ముక్కలయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదంతా గమనించిన అంపైర్ ఫెర్గూస్ ముర్ఫీ జొకోవిచ్‌కు ఫీల్డ్‌లోనే వార్నింగ్ ఇచ్చాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం సెర్బియా స్టార్‌కు 8వేల అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 6లక్షల 50వేలు) జరిమానా విధించారు. కాగా టెన్నిస్‌లో 2023 ఏడాదిలో జొకోవిచ్‌కు విధించిన జరిమానా ఇప్పటివరకు అత్యధికమని చెప్పొచ్చు. RACQUET SMASH: Novak Djokovic was unable to keep his cool as his long reign at Wimbledon was brought to an end by Spaniard Carlos Alcaraz in an epic men's singles final. 🎾 #9News HIGHLIGHTS: https://t.co/AxhB6GIW6R pic.twitter.com/QKZZCpmZld — 9News Australia (@9NewsAUS) July 17, 2023 చదవండి: 'భోజన ప్రియుడ్ని చూశాం.. వాహన ప్రియుడ్ని చూడడం ఇదే తొలిసారి' రెక్కలు కట్టుకు తిరుగుతున్న రషీద్ ఖాన్.. ఎక్కడ చూసినా అతడే..! -
జొకోవిచ్‌ను ‘పచ్చిక’ కరిపించిన అల్కరాజ్.. నాదల్ భావోద్వేగ ట్వీట్ వైరల్
Wimbledon 2023 Mens Singles Winner Alcaraz: ఆల్ ఇంగ్లండ్ క్లబ్ వేదికపై కొత్త చరిత్ర నమోదైంది. క్లే కోర్టు స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకొని, హార్డ్‌కోర్ట్‌పై తొలి గ్రాండ్‌స్లామ్ సాధించిన తర్వాత ఇప్పుడు గ్రాస్ కోర్టుపై స్పెయిన్ ‘బేబీ బుల్’ మెరిశాడు. 23 గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్ జొకోవిచ్ వరుస విజయాలకు విరామమిస్తూ యువ సంచలనం కొత్త శకానికి నాంది పలికాడు. జొకోవిచ్‌ను ‘పచ్చిక’ కరిపించి రెండు పదుల వయసుకే కీర్తి శిఖరంపై నిలిచిన కార్లోస్ అల్కరాజ్ అద్భుత ఆటతో ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో విజేతగా నిలిచాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన సమరంలో ‘ఆల్‌టైమ్ దిగ్గజం’ జొకోవిచ్‌ను ‘పచ్చిక’ కరిపించి చాంపియన్‌గా అవతరించాడు. వరల్డ్ నంబర్‌వన్‌గా తన అద్వితీయ ఆటను అతను సాధించిన గెలుపు టెన్నిస్‌లో రాబోయే నూతన శకానికి నాంది పలికింది. 24వ టైటిల్‌తో పాటు క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన జొకోవిచ్ ఆఖరి వరకు తన స్థాయికి తగ్గ ఆటతో ప్రయత్నించినా... ఇద్దరి మధ్య ఉన్న ‘16’ ఏళ్ల అంతరం ఆట చివర్లో అతని జోరుకు అడ్డుకట్ట వేసింది. నాదల్ భావోద్వేగ ట్వీట్ వైరల్ నాదల్ వారసుడిగా గుర్తింపు తెచ్చుకొని పిన్న వయసులోనే పలు రికార్డులకు చిరునామాగా మారిన అల్కరాజ్ సగర్వంగా తన రెండో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో ఈ స్పెయిన్ టెన్నిస్ స్టార్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సెర్బియా స్టార్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్‌ను ఓడించిన అతడి ఆటకు అభిమానులు మాత్రమే కాదు దిగ్గజ ఆటగాళ్లు సైతం ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో మరో స్పెయిన్ స్టార్, లెజెండ్ రాఫెల్ నాదల్ చేసిన ట్వీట్ ప్రత్యేకంగా నిలిచింది. ‘‘కంగ్రాట్యులేషన్స్ అల్కరాజ్. ఈరోజు మాకు నువ్వు ఎనలేని సంతోషాన్ని పంచావు. స్పానిష్ టెన్నిస్‌లో మన మార్గదర్శి, దిక్సూచి, వింబుల్డన్‌లో అద్భుతాలు చేసిన మనోలో సాంటానా కూడా నీ ఆట చూసి ఉప్పొంగిపోయి ఉంటారు. నిన్ను గట్టిగా హత్తుకుని ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని ఉంది చాంపియన్!!! మన టీమ్‌కు ఇదొక గొప్ప క్షణం’’ అని నాదల్.. అల్కరాజ్ను ఉద్దేశించి భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. కాగా తొంటినొప్పి కారణంగా నాదల్ ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్‌షిప్‌నకు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. అల్కరాజ్ అద్భుత ఆట కారణంగా 24వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న జొకోవిచ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇక ఈ విజయంతో.. గతేడాది యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన అల్కరాజ్ ఖాతాలో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. చదవండి: టీమిండియా కొత్త కెప్టెన్ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా.. ‘సెహ్వాగ్.. నీకు బ్యాటింగే రాదు! పాక్‌లో ఉంటే ఇక్కడి దాకా వచ్చేవాడివే కాదు’ జైశ్వాల్ ఒక్కడే కాదు.. అతడు కూడా టాలెంటెడ్.. ఛాన్స్ ఇస్తేనే: పాంటింగ్ Enhorabuena @carlosalcaraz . Nos has dado una alegría inmensa hoy y seguro que nuestro pionero en el tenis español, Manolo Santana, también ha estado animando allá dónde esté como de Wimbledon al que hoy te has unido. Un abrazo muy fuerte y a disfrutar del momento ¡¡¡Campeón!!!… pic.twitter.com/y0j2GowX3O — Rafa Nadal (@RafaelNadal) July 16, 2023 -
అల్కరాజ్ గెలుపు కాదు.. ఫెదరర్ ప్రతీకారం.. కన్నీళ్లు పెట్టుకున్న జకోవిచ్
Wimbledon 2023: నిన్న జరిగిన వింబుల్డన్-2023 ఫైనల్లో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్.. స్పానిష్ యువకెరటం కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ రసవత్తర సమరంలో అల్కరాజ్ 1–6, 7–6 (8/6), 6–1, 3–6, 6–4 స్కోరుతో జొకోవిచ్పై నెగ్గాడు. తద్వారా అల్కరాజ్ తొలి వింబుల్డన్ టైటిల్‌ను, ఓవరాల్‌గా రెండో గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. Classy words from the seven-time champion. An emotional Novak Djokovic speaks after his #Wimbledon final defeat to Carlos Alcaraz... pic.twitter.com/Lvg980Sbn8 — Wimbledon (@Wimbledon) July 16, 2023 కాగా, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయలేక తరుచూ సహనం కోల్పోయే జకోవిచ్.. తనలో ఎప్పుడూ బయటపడని కొత్త యాంగిల్‌ను వింబుల్డన్ 2023 ఫైనల్ అనంతరం చూపించాడు. ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా తనపై గెలిచిన అల్కరాజ్ను ప్రశంసలతో ముంచెత్తిన జకో.. చాలా సేపు ఆహ్లాదంగా మాట్లాడి, ఆ తర్వాత ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూనే.. తాను 2019లో ఫెదరర్‌పై గెలవాల్సింది కాదని జకో అన్నాడు. అల్కరాజ్ చేతిలో ఓటమిని మైదానంలోని కొందరు ప్రేక్షకులు ఫెదరర్ ప్రతీకారమని అరవడమే జకో కనీళ్లకు కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సెంటర్ కోర్టులో జకోవిచ్‌కు పదేళ్ల తర్వాత ఎదురైన తొలి పరాజయం ఇదే. జులై 7, 2013లో ఆండీ ముర్రే చివరిసారిగా సెంటర్ కోర్టులో జకోవిచ్‌పై గెలిచాడు. ఆతర్వాత ఇన్నాళ్లకు అల్కరాజ్.. సెంటర్ కోర్టులో జకోవిచ్‌పై నెగ్గాడు. మరోవైపు తొలి సెట్ గెలిచి గ్రాండ్‌స్లామ్ ఓడిపోయిన తొలి మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. 78 మ్యాచ్‌ల తర్వాత జకోవిచ్.. తొలి సెట్ గెలిచి ఓ మ్యాచ్‌లో ఓడిపోయాడు. -
జొకోవిచ్‌కు షాక్.. వింబుల్డన్ సరికొత్త విజేత అల్కరాజ్ (ఫొటోలు)
-
అల్కరాజ్ అద్భుతం
లండన్: వింబుల్డన్‌లో వరుసగా 35వ విజయంతో ఐదో టైటిల్, ఓవరాల్‌గా 24వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న నొవాక్ జొకోవిచ్ కోరిక నెరవేరలేదు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) చేతిలో రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బి యా) ఓడిపోయాడు. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన పోరులో అల్కరాజ్ 1–6, 7–6 (8/6), 6–1, 3–6, 6–4 స్కోరుతో జొకోవిచ్పై నెగ్గాడు. 2022లో యూఎస్ ఓపెన్ సాధించిన అల్కరాజ్కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ ఏడాది వరుసగా ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి జోరు మీదున్న 36 ఏళ్ల జొకోవిచ్ మూడో గ్రాండ్‌స్లామ్ తుది పోరులో ఓటమితో నిరాశగా నిష్క్రమించాడు. విజేత అల్కరాజ్కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్ జొకో విచ్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. హోరాహోరీగా... అంచనాలకు తగినట్లుగా జొకోవిచ్ దూకుడుగా ఆటను మొదలు పెట్టాడు. 5–0తో దూసుకుపోయాడు. అదే జోరులో తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్లో హోరాహోరీ సమరం సాగింది. అల్కరాజ్ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతో జొకోవిచ్ కూడా ప్రతీ పాయింట్ కోసం శ్రమించాల్సి వచ్చింది. స్కోర్లు 4–4, 5–5, 6–6తో సమమవుతూ వచ్చాయి. టైబ్రేక్‌లో చివరకు బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో పాయింట్ నెగ్గిన అల్కరాజ్ సెట్‌ను గెలుచుకున్నాడు. ఈ సెట్ 85 నిమి షాలు సాగడం విశేషం. ఈ సెట్ నాలుగో గేమ్‌లో 29 షాట్ల ర్యాలీతో స్టేడియం హోరెత్తింది. పట్టు కోల్పోయిన జొకో... రెండో సెట్ గెలిచిన ఉత్సాహంలో అల్కరాజ్ మూడో సెట్లో తన జోరును కొనసాగించాడు. 3–1తో అతను ముందంజ వేశాడు. అయితే ఐదో గేమ్ ఈ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా సాగింది. 27 నిమిషాల పాటు 13 ‘డ్యూస్’లతో సాగిన ఈ గేమ్‌లో ప్రతీ పాయింట్ కోసం ఇద్దరు ఆటగాళ్లు తీవ్రంగా పోరాడారు. ఈ గేమ్‌ను గెలుచుకొని 4–1తో ఆధిక్యంలో నిలిచిన అల్కరాజ్కు మరో రెండు గేమ్‌లు గెలుచుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఓడితే టైటిల్ కోల్పోయేస్థితిలో నాలుగో సెట్ బరిలోకి దిగిన జొకోవిచ్ తన స్థాయి ఆటను ప్రదర్శించి సెట్ సాధించాడు. నిర్ణాయక చివరి సెట్లో 1–1తో సమంగా నిలిచిన తర్వాత మూడో గేమ్‌లో జొకోవిచ్ సర్విస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయం ఖరారు చేసుకున్నాడు. -
అల్కరాజ్తో జొకోవిచ్ ‘ఢీ’
లండన్: రికార్డుస్థాయిలో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం నొవాక్ జొకోవిచ్... కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం కార్లోస్ అల్కరాజ్... ఆదివారం జరిగే వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో తలపడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్) గంటా 50 నిమిషాల్లో 6–3, 6–3, 6–3తో ప్రపంచ మూడో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై... డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 2 గంటల 47 నిమిషాల్లో 6–3, 6–4, 7–6 (7/4)తో ఆరో సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ)పై విజయం సాధించారు. జొకోవిచ్ తన కెరీర్లో 35వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరగా... అల్కరాజ్కిది రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కానుంది. అల్కరాజ్ గత ఏడాది యూఎస్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. సినెర్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ 11 ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 17 సార్లు పాయింట్లు గెలిచాడు. 33 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొమ్మిదోసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్ చేరిన జొకోవిచ్ ఏడుసార్లు విజేతగా నిలిచాడు. మెద్వెదెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్కరాజ్ నాలుగు ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 36 సార్లు దూసుకొచ్చి 28 సార్లు పాయింట్లు నెగ్గాడు. తన సర్విస్‌ను రెండుసార్లు కోల్పోయిన ఈ స్పెయిన్ స్టార్ మెద్వెదెవ్ సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. -
'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!'
టెన్నిస్‌లో ప్రస్తుతం కార్లోస్ అల్కారాజ్ ఒక సంచలనం. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్‌వన్‌గా ఉన్న అల్కారాజ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టాడు. బుధవారం హోల్గర్ రూనె (డెన్మార్క్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అల్కారాజ్ 7–6 (7/3), 6–4, 6–4తో గెలుపొందాడు. ఇక శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో యానిక్ సినెర్ (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా); డానిల్ మెద్వెదెవ్‌తో అల్కారాజ్ తలపడనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్, అల్కారాజ్ల మధ్య ఆసక్తికర పోరు చూసే అవకాశముంది. ఈ విషయం పక్కనబెడితే కార్లోస్ అల్కారాజ్ తండ్రికి టెన్నిస్ అంటే ప్రాణం. అయితే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సందర్భంగా మ్యాచ్‌లను చూడడానికి వచ్చిన అల్కారాజ్ తండ్రి.. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ప్రాక్టీస్ వీడియోనూ ఫోన్లో బంధించాడు. అయితే తన కొడుక్కి జొకోవిచ్ ఆటను చూపించడం కోసమే అతను ఈ పని చేశాడని కొంతమంది అభిమానులు ఆరోపించారు. అల్కారాజ్‌కు సహాయం చేసేందుకే ఇలా చేశాడని పేర్కొన్నారు. దీనిని అల్కారాజ్ ఖండించాడు. ఒక్క వీడియో చూడడం వల్ల తనకు పెద్దగా ఒరిగేది ఏమి లేదన్నాడు. ''మా నాన్నకు వ్యక్తిగతంగా టెన్నిస్ అంటే చాలా ఇష్టం. ఆయన తన ఎక్కువ సమయాన్ని ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్‌లోనే గడుపుతారు. అక్కడే కదా నెంబర్ వన్ నుంచి టాప్-20 ర్యాంకింగ్ ఉన్న ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసేది. వాళ్లందరి ప్రాక్టీస్‌ను గమనిస్తూనే ఫోన్లో వీడియోలు తీసుకొని సంతోషపడడం ఆయనకు అలవాటు. ఇక జొకోవిచ్ ఆటతీరు అంటే నాన్నకు చాలా ఇష్టం. రియల్ లైఫ్‌లో నేను జొకోవిచ్‌తో మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో నాన్న జొకోవిచ్‌కే సపోర్ట్ చేయడం చూశాను. అందుకే జొకో ఎక్కడ కనిపించినా ఆయన ఫోటోలను, ఆటను తన ఫోన్ కెమెరాలో బంధించడం చేస్తుంటాడు. అందుకే ఇందులో ఆశ్చర్యపడడానికి ఏం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. మరి మీ నాన్న జొకోవిచ్ ఆటను కెమెరాలో బంధించారు. ఫైనల్లో చాన్స్ ఉంటే తలపడే మీకు ఇది అడ్వాంటేజ్ కానుందా అని అడగ్గా.. దీనిపై అల్కారాజ్ స్పందిస్తూ.. ''నాకు పెద్దగా ఒరిగేదేం లేదు.. దీనర్థం ఏంటంటే.. జొకోవిచ్ ఆటకు సంబంధించిన వీడియాలు ప్రతీ ప్లాట్ఫామ్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.'' అంటూ తెలిపాడు. View this post on Instagram A post shared by Wimbledon (@wimbledon) చదవండి: T10 League: బ్యాట్ పట్టనున్న టీమిండియా మాజీ స్టార్స్.. ఫ్యాన్స్‌కు పండగే Wimbledon 2023: సెమీస్‌లో బోపన్న జోడి.. మహిళల సింగిల్స్‌లో ఈసారి కొత్త చాంపియన్! -
46వసారి సెమీస్‌లో.. ఫెదరర్ రికార్డు సమం
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 12వసారి వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 4–6, 6–1, 6–4, 6–3తో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై గెలిచాడు. పురుషుల గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 46వసారి జోకొవిచ్ సెమీస్ చేరడం విశేషం. ఈ క్రమంలో అతడు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేశాడు. ఇప్పటికే వరుసగా నాలుగు వింబుల్డన్ టైటిల్స్ గెలిచిన జొకోవిచ్ మరో టైటిల్ కు చేరవవుతున్నాడు. ప్రస్తుతం జోకొవిచ్ ఖాతాలో ఏడు వింబుల్డన్ టైటిల్స్ ఉండగా మరొక్కటి గెలిస్తే 8వ టైటిల్ తో ఫెదరర్ సరసన నిలుస్తాడు. ఇక టెన్నిస్‌లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ పురుషుల విభాగంలో అత్యధిక టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మధ్యే అతడు ఫ్రెండ్ ఓపెన్ కూడా గెలిచిన విషయం తెలిసిందే. ఈ టైటిల్‌తో అతడు రఫేల్ నాదల్‌ను వెనక్కి నెట్టాడు. ఫెదరర్ ఖాతాలో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఒకవేళ జొకోవిచ్ వింబుల్డన్ గెలిస్తే 24వ టైటిల్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో నిలుస్తాడు. జొకోవిచ్ శుక్రవారం అతడు సిన్నర్ తో సెమీఫైనల్లో తలపడనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన జోకొవిచ్.. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ కూడా గెలిచి 1969లోరాడ్ లేవర్ తర్వాత తొలి కేలండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. చదవండి: WCC Suggests ICC: 'వరల్డ్‌కప్ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను తగ్గించండి' Wimbledon 2023: సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా -
కసితో ఆడుతున్నాడు.. నెట్‌ను కూడా వదలడం లేదు!
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ దూసుకెళ్తున్నాడు. కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిలే లక్ష్యంగా సాగుతున్న జొకోవిచ్ వింబుల్డన్‌లో 14వ సారి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. 2021 సెమీఫైనలిస్ట్, ప్రపంచ 18వ ర్యాంకర్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 7–6 (8/6), 7–6 (8/6), 5–7, 6–4తో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. కాగా మ్యాచ్‌లో రెండో సెట్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హుర్కాజ్ సర్వీస్ చేసి డ్రాప్ షాట్ ఆడాడు. దీంతో బంతి జొకోవిచ్ నెట్ దగ్గర్లోనే పడేలా కనిపించింది. ఒక్క పాయింట్ కూడా వదలకూడదన్న ఉద్దేశంతో జొకోవిచ్ వేగంగా పరిగెత్తుకొచ్చి బాడీ బాగా స్ట్రెచ్ చేస్తూ షాట్ ఆడాడు. అయితే ఇదే సమయంలో బాడీ కంట్రోల్ కోల్పోయిన జొకోవిచ్ ఒక్కసారిగా నెట్‌పై పడిపోయాడు. అదృష్టవశాత్తూ జొకోకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే జొకోవిచ్ చర్య తన ప్రత్యర్థి హుర్కాజ్తో పాటు అభిమానులను ఆశ్చర్యపరిచింది. హుర్కాజ్ జొకోవిచ్ దగ్గరికి వెళ్లి అతన్ని పైకి లేపి జాగ్రత్త చెప్పి కాసేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. కాగా జొకోవిచ్‌కు ఇది వింబుల్డన్‌లో వందో మ్యాచ్ కావడం విశేషం. కాగా మ్యాచ్ ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు జరిగింది. టోర్నీ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల వరకే ఆటను కొనసాగించాలి. ఆదివారం రెండు సెట్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు.సోమవారం ఆటను కొనసాగించగా... మూడో సెట్‌ను హుర్కాజ్ గెల్చుకున్నాడు. అయితే నాలుగో సెట్లో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఏడో గేమ్‌లో హుర్కాజ్ సర్విస్‌ను బ్రేక్ చేసి ఎనిమిదో గేమ్‌లో తన సర్విస్‌ను కాపాడుకొని 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం పదో గేమ్‌లో జొకోవిచ్ తన సర్విస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్ టోర్నీ చరిత్రలో జొకోవిచ్‌కిది 90వ విజయం కావడం విశేషం. Djokovic went for it 😅 #Wimbledon pic.twitter.com/q05cHyJJBt — SportsCenter (@SportsCenter) July 9, 2023 చదవండి: MS Dhoni Reaction To Fan: 'భయ్యా.. నొప్పి ఎలా ఉంది?'.. ధోని రియాక్షన్ వైరల్ #LakshyaSen: చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్ -
జొకోవిచ్‌దే పైచేయి, 14వసారి క్వార్టర్ ఫైనల్లోకి డిఫెండింగ్ చాంపియన్
లండన్: కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించే దిశగా సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు వేశాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నలో ఈ సెర్బియా స్టార్ 14వసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి మూడు రౌండ్ మ్యాచ్‌ల్లో రెండున్నర గంటల్లోపే విజయాన్ని అందుకున్న జొకోవిచ్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం అంత సులువుగా గెలుపు దక్కలేదు. 2021 సెమీఫైనలిస్ట్, ప్రపంచ 18వ ర్యాంకర్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 7–6 (8/6), 7–6 (8/6), 5–7, 6–4తో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 18 ఏస్‌లు సంధించగా, హుర్కాజ్ 33 ఏస్‌లతో అదరగొట్టాడు. తొలి సెట్లో జొకోవిచ్ మూడుసార్లు సెట్ పాయింట్లను, రెండో సెట్లో రెండుసార్లు సెట్ పాయింట్లను కాపాడుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్ ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు జరిగింది. టోర్నీ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల వరకే ఆటను కొనసాగించాలి. ఆదివారం రెండు సెట్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం ఆటను కొనసాగించగా... మూడో సెట్‌ను హుర్కాజ్ గెల్చుకున్నాడు. అయితే నాలుగో సెట్లో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఏడో గేమ్‌లో హుర్కాజ్ సర్విస్‌ను బ్రేక్ చేసి ఎనిమిదో గేమ్‌లో తన సర్విస్‌ను కాపాడుకొని 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం పదో గేమ్‌లో జొకోవిచ్ తన సర్విస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్ టోర్నీ చరిత్రలో జొకోవిచ్‌కిది 90వ విజయం కావడం విశేషం. మరోవైపు ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కథ ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అమెరికా ప్లేయర్ క్రిస్టోఫర్ యుబ్యాంక్స్ 3–6, 7–6 (7/4), 3–6, 6–4, 6–4తో సిట్సిపాస్‌ను ఓడించి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరాడు. జిరీ లెహెస్కా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–4, 6–2తో తొలి రెండు సెట్లు గెల్చుకున్నాడు. అనంతరం లెహెస్కా గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలడంతో మెద్వెదెవ్కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కింది. మూడో రౌండ్లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 7–5, 6–3తో జేకబ్ ఫియరెన్లీ–జోనస్ మండే (బ్రిటన్) జోడీపై నెగ్గి మూడో రౌండ్‌కు చేరుకుంది. ఓటమి అంచుల నుంచి... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ఓటమి అంచుల నుంచి గట్టెక్కి తొలిసారి ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ చేరింది. 14వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–7 (4/7), 7–6 (7/2), 6–3తో గెలిచింది. రెండో సెట్లో స్కోరు 5–6 వద్ద స్వియాటెక్ తన సర్విస్‌లో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని స్కోరును 6–6తో సమం చేసింది. టైబ్రేక్‌లో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచిన ఆమె మూడో సెట్లోని నాలుగో గేమ్‌లో బెన్‌చిచ్ సర్విస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని గెలిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో స్వితోలినా (ఉక్రెయిన్) 2–6, 6–4, 7–6 (11/9)తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–4, 6–0తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై, ఆరో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునిíÙయా) 6–0, 6–3తో రెండుసార్లు చాంపియన్ క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై, మాడిసన్ కీస్ 3–6, 7–6 (7/4), 6–2తో మిరా ఆండ్రీవా (రష్యా)పై గెలిచారు. డిఫెండింగ్ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్) తొలి సెట్లో 4–1తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి బీట్రిజ్ హదద్ మయా (బ్రెజిల్) గాయం కారణంగా వైదొలిగింది. -
ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్, స్వియాటెక్
లండన్: టాప్స్టార్లు నొవాక్ జొకోవిచ్, ఇగా స్వియాటెక్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో సెర్బియన్ దిగ్గజం, రెండో సీడ్ జొకోవిచ్ తనదైన శైలిలో స్విట్జర్లాండ్ ఆటగాడు స్టాన్ వావ్రింకాకు ఇంటిదారి చూపాడు. ఇప్పటికే ఈ సీజన్లో జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను చేజిక్కించుకున్న జొకోవిచ్ 6–3, 6–1, 7–6 (7/5)తో వరుస సెట్లలో స్విస్ ఆటగాడిని ఓడించాడు. కేవలం 2 గంటల 7 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించాడు. 11 ఏస్‌లతో రెచ్చిపోయిన జొకో ఒక డబుల్‌ఫాల్ట్ చేశాడు. 26 అనవసర తప్పిదాలు చేసిన సెర్బియన్ 38 విన్నర్లు కొట్టాడు. ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–7 (6/8), 6–3, 7–5తో నికోలస్ జెర్రి (చీలి)పై గెలిచేందుకు కష్టపడ్డాడు. రష్యా స్టార్, మూడో సీడ్ మెద్వెదెవ్ 4–6, 6–3, 6–4, 6–4తో మార్టన్ ఫుక్సొవిక్స్ (హంగేరి)పై, ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–4, 7–6 (7/5), 6–4తో లాస్లొ జేర్ (సెర్బియా)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో 19వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 5–7, 6–2, 6–2తో యోసుకె వాతనుకి (జపాన్)పై గెలుపొందగా, ఎనిమిదో సీడ్ జన్నిక్ సిన్నెర్ (ఇటలీ) 3–6, 6–2, 6–3, 6–4తో క్వెంటిన్ హేలిస్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్)తో పాటు ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్), బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) ప్రిక్వార్టర్స్ చేరారు. స్వియాటెక్ 6–2, 7–5తో పెట్ర మార్టిచ్ (క్రొయేషియా)ను వరుస సెట్లలో ఓడించగా, స్వితోలినా 7–6 (7/3), 6–2తో మాజీ ఆ్రస్టేలియా చాంప్ సోఫియా కెనిన్ (అమెరికా)ను కంగుతినిపించింది. మారి బౌజ్కొవా (చెక్ రిపబ్లిక్) ఐదో సీడ్ కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్)కు షాకిచ్చింది. చెక్ అమ్మాయి 7–6 (7/0), 4–6, 7–5తో సీడెడ్ ప్లేయర్ గార్సియాను మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టించింది. 14వ సీడ్ బెన్సిక్ 6–3, 6–1తో మగ్ద లినెటి (పోలాండ్)పై సునాయాస విజయంతో ముందంజ వేసింది. బోపన్న జోడీ శుభారంభం భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న పురుషుల డబుల్స్‌లో శుభారంభం చేశాడు. ఆస్ట్రేలియన్ మాథ్యూ ఎబ్డెన్తో జోడీకట్టిన బోపన్న ఆరో సీడ్ జంటగా బరిలోకి దిగింది. తొలిరౌండ్లో భారత్–ఆసీస్ జోడీ 6–2, 6–7 (5/7), 7–6 (10/8)తో గులెర్మో డ్యురన్– థామస్ ఎచెవెరీ (అర్జెంటీనా) జంటపై చెమటోడ్చి గెలిచింది. -
Wimbledon 2023: వేట మొదలు...
కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ టోరీ్నలో అడుగు పెట్టిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించాడు. వరుస సెట్లలో గెలిచి టైటిల్ వేటను ఆరంభించాడు. 2018 నుంచి ఈ టోరీ్నలో ఓటమి ఎరుగని ఏడుసార్లు చాంపియన్ ఎనిమిదోసారి విజేతగా అవతరించాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్ టోరీ్నలు ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ జొకోవిచ్ ఖాతాలోకే వెళ్లాయి. వింబుల్డన్‌లోనూ జొకోవిచ్ అజేయంగా నిలిస్తే అరుదైన ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించేందుకు జొకోవిచ్‌కు రెండోసారి అవకాశం లభిస్తుంది. 2021లో జొకోవిచ్ ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టోరీ్నలను గెలిచి చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. 1969లో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా) తర్వాత పురుషుల టెన్నిస్‌లో మరో ప్లేయర్ ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను సాధించలేకపోయాడు. లండన్: కాస్త పోటీ ఎదురైనా... కీలకదశలో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచిన సెర్బియా టెన్నిస్ మేటి నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 7–6 (7/4)తో పెడ్రో కాచిన్ (అర్జెంటీనా)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 2 గంటల 12 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 13 ఏస్‌లు సంధించాడు. తన సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 45 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ నెట్ వద్దకు 35 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. జొకోవిచ్ 18వ సారి వింబుల్డన్ టోరీ్నలో ఆడుతుండగా... కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోరీ్నలో బరిలోకి దిగిన కాచిన్ పది ఏస్‌లు సంధించి, 29 అనవసర తప్పిదాలు చేశాడు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–1, 5–7, 6–4, 6–3తో లారెంట్ లోకిలి (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–3, 7–5, 6–4తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా)పై, 14వ సీడ్ ముజెట్టి (ఇటలీ) 6–3, 6–1, 7–5తో వారిలాస్ (కెనడా)పై, 17వ సీడ్ హుర్కాజ్ (పోలాండ్) 6–1, 6–4, 6–4తో రామోస్ వినోలాస్ (స్పెయిన్)పై నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. స్వియాటెక్ బోణీ మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్), నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), ఐదో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), ప్రపంచ మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో స్వియాటెక్ 6–1, 6–3తో లిన్ జు (చైనా)ను ఓడించగా... పెగూలా 6–2, 6–7 (8/10), 6–3తో లారెన్ డేవిస్ (అమెరికా)పై, గార్సియా 6–4, 6–3తో కేటీ వోలినెట్స్ (అమెరికా)పై, అజరెంకా 6–4, 5–7, 6–4తో యు యువాన్ (చైనా)పై విజయం సాధించారు. -
టీవీకి సరిగ్గా సరిపోయే ఆట!
ఫుట్‌బాల్, క్రికెట్ వ్యక్తిగతమైన ఆటలు కావు. అవి జట్టు ఆటలు. జట్టులోని ఏ ఆటగాడి ఆట తీరునైనా అర్థం చేసుకోవడానికీ, అతడి నైపుణ్యాన్ని గుర్తించడానికీ మిగతా ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవడం అవసరమౌతుంది. అందుకే అవి స్టేడియంలలో చక్కగా కనిపిస్తాయి. అదే టెన్నిస్‌లో కెమెరాలు విడిగా ఒక క్రీడాకారుడిని అత్యుత్తమంగా చిత్రీకరిస్తాయి. అతడు ఫ్రేము నిండుగా ఉన్నప్పుడు అతడి ప్రతి చర్య, ప్రతి కదలిక కనిపిస్తుంది. అతడి నిస్పృహ అయినా, అతడి విజయోద్వేగం అయినా స్పష్టంగా తెలిసిపోతుంది. దానికి తోడు, టెన్నిస్‌లో బంతిని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు కొట్టడం లక్ష్యంగా ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్ల నడుమ బంతి ప్రయాణ మార్గాలను కెమెరా అలవోకగా అనుసరిస్తుంది. నేను క్రీడాకారుడిని కాదు. నిజం చెబు తున్నా, స్క్వాష్ తప్ప నేను ఏనాడూ ఏ ఆటా ఆడింది లేదు. క్రికెట్ అయితే నాకు ఒక దుర్భరమైన ధారావాహికలా తోస్తుంది. ఫుట్‌బాల్ మరీ అంత సాగతీతగా ఉండదు కనుక కొంచెం నయం అనుకుంటాను. ఎప్పుడైనా మర్యాద కోసం తప్ప ఆటల్ని నేను కనీసం చూడనైనా చూడను. కానీ టెన్నిస్... ఆహా! టెన్నిస్. అది నాకు మిగతా ఆటల్లా కాదు. మొత్తంగా అది వేరే కథ. నొవాక్ జొకోవిచ్ మొన్న నేను ఫ్రెంచి ఓపెన్ ఫైనల్స్‌లో నొవాక్ జొకోవిచ్‌ను చూసినప్పుడు టెన్నిస్ అన్నది టెలివిజన్ కోసం తయారైన ఆట అని గ్రహించాను. ఫుట్‌బాల్, క్రికెట్ అలా కాదు. బహుశా అందుకేనేమో ఎప్పుడో గాని గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ని నేను చేజార్చుకోను. ఇతర ఆటల వరల్డ్ కప్పులు ఏమైపోయినా నాకు పట్టదు. టెన్నిస్‌లో కెమెరాలు విడిగా ఒక క్రీడాకారుడిని అత్యుత్తమంగా చిత్రీకరిస్తాయి. అతడు ఫ్రేము నిండుగా ఉన్నప్పుడు అతడి ప్రతి చర్య, ప్రతి కదలిక కనిపిస్తుంది. అతడి నిస్పృహ అయినా, అతడి విజ యోద్వేగం అయినా స్పష్టంగా తెలిసిపోతుంది. సంకల్ప బలం, స్థయిర్య క్షీణత వంటి అంతర్గత గుణాల విషయంలో కూడా ఇది నిజం. కెమెరా ఆ గుణాలను వెలికి తీస్తుంది. దానికి తోడు, టెన్నిస్‌లో బంతిని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు కొట్టడం లక్ష్యంగా ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్ల నడుమ బంతి ప్రయాణ మార్గాలను కెమెరా అలవోకగా అనుసరిస్తుంది. ప్రతి విసురూ ఆట ఊపునుంచి వీక్షకుల చూపును తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. టెన్నిస్‌లా ఫుట్‌బాల్, క్రికెట్ వ్యక్తిగతమైన ఆటలు కావు. అవి జట్టు ఆటలు. అందువల్ల జట్టులోని ఏ ఆటగాడి ఆట తీరునైనా అర్థం చేసుకోడానికీ, అతడి నైపుణ్యాన్ని గుర్తించడానికీ మిగతా ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవడం మీకు అవసరమవుతుంది. అప్పుడు మాత్రమే మీరు బంతిని నియంత్రణలోకి తీసుకున్న ఆట గాడి మదిలోని వ్యూహాన్ని దృశ్యమానం చేయగలరు. అయితే ఒక ఆటగాడి మీద దృష్టిని నిలపడం అన్నది ఆటలోని తక్కిన భాగాన్నంతా కోల్పోయేలా చేస్తుంది. అందుకే ఏ ఆటగాడు ఏ స్థానంలో ఉన్నదీ ఒకేసారి చూడా లంటే మైదానం మీకు తగినంత దూరంగా ఉండాలి. ఆ దూరం ఆట గాళ్లందర్నీ కనిపించేలా చేస్తుంది. అందుకే ఫుట్‌బాల్, క్రికెట్లు స్టేడియంలలో చక్కగా కనిపిస్తాయి. మానవ నేత్రం ఒక్క సారింపుతో అన్నిటినీ చూడగలదు. టీవీ కెమెరా అలా చూడలేదు. అనేక కెమెరాలు పని చేస్తున్నప్పటికీ ఏదైనా ఒక కెమెరాలో వచ్చిన పేలవమైన దృశ్యాన్ని కూడా అవి ఏవీ భర్తీ చేయలేవు. టెన్నిస్‌లో ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు రాయల్ బాక్స్ నుంచి వింబుల్డన్‌ను తిలకిస్తున్నట్లయితే దూరం నుంచి క్రీడా మైదానం సంతృప్తికరమైన వీక్షణను ఇవ్వదు. ఒక వేళ మీరు పక్కల నుంచి చూస్తున్నట్లయితే మీ మెడ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి మళ్లీ ఎడమకు మళ్లుతూ ఉంటుంది. బంతిని ఏ మాత్రం నేలను తాకనివ్వని పోటాపోటీ షాట్ల సుదీర్ఘమైన నిడివి కూడా మీకు అలసటను కలిగించవచ్చు. అదే టీవీలోనైతే రెండు మైదానాలు సమంగా కళ్ల ముందర ఉంటాయి. మీ మెడకు అసౌకర్యం కలుగదు. ఎందుకంటే మీరు స్క్రీన్కు ఎదురుగా కూర్చొని చూస్తుంటారు. బహుశా ఈ సదుపాయం వల్లనే దశాబ్దాలుగా నేను కొందరు టెన్నిస్ క్రీడాకారులను పిచ్చిగా అభిమానిస్తుండవచ్చు. వాళ్లు ఆడుతున్న ప్పుడు ఉత్కంఠగా చూస్తుంటాను. వాళ్లు గెలిచి తీరాలని ఆశ పడ తాను. ఓడిపోతే కలత చెందుతాను. వాళ్ల విజయాలను, వైఫల్యాలను నావిగా మనసులోకి తీసుకుంటాను. ఇలా వ్యక్తిగతంగా తీసుకోవడం 70 లలో బార్న్ బోర్గ్, మార్టినా నవ్రతిలోవాలతో మొదలైంది. వారి స్థానాన్ని 2000–2009 మధ్య రోజర్ ఫెదరర్ ఆక్రమించాడు. ప్రస్తుతం నొవాక్ జొకోవిచ్. 1980లో బోర్గ్ సాధించిన ఐదవ వింబుల్డన్ విజయాన్ని నేనెప్ప టికీ మర్చిపోలేను. నాలుగో సెట్లో అతడి ప్రత్యర్థి జాన్ మెకెన్రో అతడికి ఏడు చాంపియన్‌షిప్ పాయింట్లను దక్కకుండా చేశాడు. అది అతడి ఆత్మను ఛిన్నాభిన్నం చేస్తుందని వ్యాఖ్యాతలు విశ్వసించారు. విజయానికి చేరువై కూడా విఫలం చెందిన విషయాన్ని మర్చి పోయి ముందుకు సాగిపోవడం సాధ్యం అయ్యే పని కాదు. అయితే ఆ వ్యాఖ్యాతల అంచనా తలకిందులైంది. ఆ ఆటలో దృఢనిశ్చయంతో తలపడిన బోర్గ్ తన మోకాళ్లపై కూలబడటానికి ముందు ఐదో సెట్లో 8–6 తేడాతో విజయం సాధించాడు. అతడు చూపేది ఆ ఒక్క భావో ద్వేగమే. గెలిచిన ప్రతిసారీ అతడు అలాగే చేస్తాడు. అతడి వ్యక్తిత్వానికి సూచనప్రాయమైన సంకేతం ఇంకొకటి! టోర్నమెంటు జరుగుతున్నంత కాలం గడ్డం తీసేయకపోవడం! 1979లో సిమ్లాలో ఉండగా మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లోని బ్లాక్ అండ్ వైట్ టీవీలో నేను బోర్గ్ ఆడుతున్న వింబుల్డన్ ఫైనల్ చూస్తు న్నాను. పాకిస్తాన్ టీవీ దానిని ప్రసారం చేస్తోంది. ఐదో సెట్ చివరిలో ఆనాటి అత్యంత భయానక సర్వర్లలో ఒకరైన రాస్కో టానాతో పోరాడుతున్న బోర్గ్‌కు మూడు చాంపియన్ షిప్ పాయింట్లు చేతిలో ఉండగా పాకిస్తాన్ టీవీ చానల్ అకస్మాత్తుగా వార్తల ప్రసారంలోకి మళ్లింది. ఆ తర్వాత బోర్గ్ విజయం సాధించాడని తెలుసుకోడానికి ముందు అరగంట పాటు నేను తీరని వేదనతో టీవీ ముందు వేచి ఉన్నాను. ఆ నిర్దాక్షిణ్యమైన పీటీవీ, బులెటిన్లోకి ఆ వార్తను చేర్చడం సరికాదని భావించినట్లుంది. ఇప్పుడు మళ్లీ నాలుగు వారాల తర్వాత వింబుల్డన్ నన్ను టీవీ తెర ముందుకు తీసుకురానుందా? మొన్నటితో 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన జొకోవిచ్ 24వ టైటిల్‌ను కూడా కోరుకుంటాడు. అందులో సందేహం లేదు. కానీ అది అతడికి ఎంత ముఖ్యమో నాకూ అంత ముఖ్యమా? 1981లో బోర్గ్‌ను ఓడించినందుకు నేను మెకెన్రోని ద్వేషించాను. ఎస్.డబ్ల్యూ18 మైదానంలో జొకోవిచ్ ఓడిపోతే నా ప్రతి స్పందన ఇప్పుడూ అలాగే ఉండబోతుందా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
జూలై 3 నుంచి వింబుల్డన్.. ప్రైజ్‌మనీ భారీగా పెంపు
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ చాంపియన్‌షిప్–2023 ప్రైజ్‌మనీ వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. జూలై 3 నుంచి 16 వరకు జరిగే ఈ టోరీ్నలో ఈసారి పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 24 కోట్ల 43 లక్షలు) చొప్పున లభిస్తాయి. గత ఏడాది సింగిల్స్ విజేతలకు 20 లక్షల పౌండ్లు చొప్పున అందజేశారు. ఈసారి 3 లక్షల 50 వేల పౌండ్లు ఎక్కువగా ఇవ్వనున్నారు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఓడిన క్రీడాకారులకు 55 వేల పౌండ్లు (రూ. 57 లక్షల 18 వేలు) దక్కుతాయి. క్వాలిఫయింగ్‌లో తొలి రౌండ్లో ఓడితే 12 వేల 750 పౌండ్లు (రూ. 13 లక్షల 25 వేలు), రెండో రౌండ్లో ఓడితే 21 వేల 750 పౌండ్లు (రూ. 22 లక్షల 61 వేలు), మూడో రౌండ్లో ఓడితే 36 వేల పౌండ్లు (రూ. 37 లక్షల 42 వేలు) లభిస్తాయి. మరికొద్ది రోజుల్లో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆరంభం కానుంది. జూలై 3 నుంచి 16 వరకు జరగనున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్ (సెర్బియా), మహిళల సింగిల్స్‌లో రిబాకినా (కజకిస్తాన్) డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగనున్నారు. చదవండి: ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు! -
మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్
కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో కొత్త చరిత్ర సృష్టించిన దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన అగ్ర స్థానాన్ని మళ్లీ అందుకున్నాడు. ఏటీపీ సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అతను 7,595 పాయింట్లతో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. 36 ఏళ్ల జొకోవిచ్ తన కెరీర్లో నంబర్‌వన్‌గా 388వ వారంలోకి అడుగు పెట్టడం విశేషం. ఇప్పటివరకు టాప్‌లో ఉండి సెమీస్‌లో జొకోవిచ్ చేతిలో ఓడిన అల్కరాజ్ రెండో స్థానానికి పడిపోగా, రష్యా ప్లేయర్ ఖచనోవ్ మరోసారి టాప్–10లోకి అడుగు పెట్టాడు. చదవండి: WTC Final: ఔను.. ఇంగ్లండ్‌లోనే ఎందుకు జరగాలి? వేరే పిచ్ పెట్టాల్సిందే.. పెరుగుతున్న మద్ధతు -
గర్జించిన సెర్బియా సింహం.. టెన్నిస్ చరిత్రలో ఒకే ఒక్కడు (ఫొటోలు)
-
#NovakDjokovic: సెర్బియా యోధుడి చరిత్ర.. టెన్నిస్‌లో కొత్త రారాజు
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పురుషుల టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం(జూన్ 11న) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా తన ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్ జమ చేసుకున్నాడు. తద్వారా ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన యోధుడిగా రికార్డులకెక్కాడు. ఇంతకవరకు నాదల్‌తో కలిసి 22 గ్రాండ్‌స్లామ్‌లతో సంయుక్తంగా ఉన్న జొకోవిచ్ తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ గెలవడంతో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పురుషుల టెన్నిస్‌లో కొత్త రారాజుగా ఆవిర్భవించాడు. ► జొకోవిచ్ సాధించిన 23 గ్రాండ్‌స్లామ్స్‌లో అత్యధికంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పది ఉండగా.. ఆ తర్వాత వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను ఏడుసార్లు గెలుచుకున్నాడు. ఇక యూస్ ఓపెన్‌తో పాటు ఫ్రెంచ్ ఓపెన్‌ను మూడేసి సార్లు నెగ్గిన జొకోవిచ్.. నాలుగు మేజర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కనీసం మూడుసార్గు నెగ్గిన తొలి ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు. ► ఇక జొకోవిచ్ ఇప్పటివరకు సాధించిన 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో పది గ్రాండ్‌స్లామ్‌లు 30 ఏళ్లలోపే సాధించడం గమనార్హం. ► రోలాండ్ గారోస్‌లో(ఫ్రెంచ్ ఓపెన్)లో ఛాంపియన్‌గా అవతరించిన అతిపెద్ద వయస్కుడిగానూ జొకో చరిత్ర సృష్టించాడు. 2023 ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకునే నాటికి జొకో వయసు 36 ఏళ్ల 19 రోజులుగా ఉంది. ఈ నేపథ్యంలో రఫెల్ నాదల్(35 ఏళ్ల 11 నెలల 19 రోజులు) రికార్డును బద్దలు కొట్టాడు. ► ఇక ఓపెన్ శకంలో మహిళల, పురుషుల టెన్నిస్ విభాగాలను కలిపి చూస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన క్రీడాకారుల్లో సెరెనా విలియమ్స్‌తో కలిసి జొకోవిచ్(23 టైటిల్స్) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలిస్థానంలో ఉంది. ఒకవేళ వచ్చే నెలలో ఆరంభం కానున్న వింబుల్డన్‌లో గనుక జొకోవిచ్ టైటిల్ కొడితే మాత్రం మార్గరెట్ కోర్ట్ సరసన నిలవనున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 7-6(7-1), 6-3, 7-5తో గెలుపొందాడు. మూడు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో తొలిసెట్లోనే జొకోవిచ్‌కు కాస్పర్ రూడ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను జొకోవిచ్ 7-1తో కైవసం చేసుకున్నాడు. ఇక రెండో సెట్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండానే కేవలం 45 నిమిషాల్లో 6-3తో సొంతం చేసుకున్నాడు. కీలకమైన మూడోసెట్లో కాస్పర్ రూడ్ ఫుంజుకోవడంతో మళ్లీ టైబ్రేక్ తప్పదనిపించింది. ఈ దశలో రూడ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 7-5తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. One of the best speeches after winning a grand slam Special achievement, special speech NEVER GIVE UP#RolandGarros #RolandGarros2023 #Djokovic #NovakDjokovic pic.twitter.com/zcwbd4Up6X — Vaibhav Sharma (@vaibhav_4x) June 11, 2023 🏆🇷🇸#RolandGarros | @DjokerNole pic.twitter.com/sopyII3GfQ — Roland-Garros (@rolandgarros) June 11, 2023 A legendary moment ✨#RolandGarros @DjokerNole pic.twitter.com/IdT4LWqqjO — Roland-Garros (@rolandgarros) June 11, 2023 🏆 Forever raising the bar 🏆@DjokerNole masters Casper Ruud 7-6(1), 6-3, 7-5 to win a third Roland-Garros title and an unprecedented 23rd Grand Slam men’s singles title. ⁰#RolandGarros pic.twitter.com/9IfTi39alB — Roland-Garros (@rolandgarros) June 11, 2023 చదవండి: French Open 2023 Final: జొకోవిచ్‌దే ఫ్రెంచ్ ఓపెన్.. ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్ -
జొకోవిచ్‌దే ఫ్రెంచ్ ఓపెన్.. ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మెన్స్ సింగిల్స్ విజేతగా సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో కాస్పర్ రూడ్‌పై 7-6 6-3 7-5 తేడాతో విజయం సాధించాడు. జొకోవిచ్ ఖాతాలో ఇది మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కాగా.. ఓవరాల్‌గా 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఓపెన్ శకంలో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన తొలి ఆటగాడిగా జొకోవిచ్ చరిత్రకెక్కాడు. 🏆 Forever raising the bar 🏆@DjokerNole masters Casper Ruud 7-6(1), 6-3, 7-5 to win a third Roland-Garros title and an unprecedented 23rd Grand Slam men’s singles title.⁰#RolandGarros pic.twitter.com/9IfTi39alB— Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time 21:50: మూడోసెట్లో హోరాహోరీ మూడోసెట్లో జొకోవిచ్, కాస్పర్ రూడ్ల్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటివరకు 5-5తో సమానంగా ఉండడంతో సెట్ టైబ్రేక్‌కు దారితీసే అవకాశం ఉంది. Time: 20:50: రెండో సెట్లో గెలుపు జొకోవిచ్‌దే తొలిసెట్‌ను గెలుచుకోవడానికి కష్టపడిన జొకోవిచ్‌కు రెండో సెట్లో మాత్రం పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వలేదు. 6-3తో రెండో సెట్‌ను గెలుచుకున్న జొకోవిచ్ కేవలం 45 నిమిషాల్లోనే కాస్పర్ రూడ్‌ను ఓడించి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. మరికొద్ది సేపట్లో నిర్ణయాత్మక మూడోసెట్ జరగనుంది. Too strong. @DjokerNole takes the 2nd. #RolandGarros pic.twitter.com/uv2pb44Esh — Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time: 20:45.. రెండో సెట్లో దూకుడు మీదున్న జొకోవిచ్ తొలిసెట్‌ను సొంతం చేసుకున్న జొకోవిచ్ రెండో సెట్లోనూ దూకుడు కనబరుస్తున్నాడు. తొలిసెట్లో పోటీ ఇచ్చిన రూడ్ ఒక్కసారి మాత్రమే జొకోవిచ్ సర్వీస్ బ్రేక్ చేయగలిగాడు. అదే సమయంలో జొకోవిచ్ మాత్రం నాలుగుసార్లు రూడ్ సర్వీస్ బ్రేక్ చేయగలిగాడు. ప్రస్తుతం జొకోవిచ్ 5-2తో రెండోసెట్లో ఆధిక్యంలో ఉన్నాడు. Time:20:06.. తొలి సెట్ సొంతం చేసుకున్న జొకోవిచ్ ఇక హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను జొకోవిచ్ సొంతం చేసుకున్నాడు. తొలి సెట్లో ఇద్దరు పోటాపోటీగా తలపడ్డారు. జొకో సర్వీస్‌లను బ్రేక్ చేస్తూ ఒక దశలో కాస్పర్ రూడ్ 3-0తో ఆధిక్యంలో కనిపించాడు. అయితే జొకోవిచ్ మళ్లీ ఫుంజుకొని రూడ్ సర్వీస్ బ్రేక్ చేసి మూడు పాయింట్లు సాధించాడు. దీంతో 6-6తో తొలి సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. ఇక కీలక టైబ్రేక్‌లో జొకోవిచ్ తన జోరు చూపించి విన్నర్స్ సంధించి 7-6(7-1)తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. Here, there, everywhere 🏃♂️#RolandGarros pic.twitter.com/VuWtw0fCN2 — Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time: 18:30.. ప్రారంభమైన ఫైనల్ పోరు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా జొకోవిచ్, కాస్పర్ రూడ్ మధ్య జరుగుతున్న పురుషుల సింగిల్స్ ఫైనల్ హోరాహోరీగా మొదలైంది. 23వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న పట్టుదలతో జొకోవిచ్ ఒకవైపు ఉంటే.. జొకో జోరుకు అడ్డుకట్ట వేయాలనే యోచనతో కాస్పర్ రూడ్ ఉన్నాడు. -
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్.. చరిత్రకు అడుగు దూరంలో
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2023లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం వరల్డ్ నెంబర్ వన్.. స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్తో జరిగిన సెమీస్ పోరులో జొకోవిచ్ 6-3, 5-7,6-1,6-1తో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో జొకోవిచ్‌ను ప్రతిఘటించిన అల్కరాజ్ తర్వాతి రెండు సెట్లలో అనుభవం ముందు నిలవలేకపోయాడు. అయితే గేమ్‌లో మాత్రం అల్కరాజ్ తనదైన సర్వీస్ షాట్లతో జొకోవిచ్ మనసును గెలుచుకున్నాడు. ఇక జొకోవిచ్ కెరీర్లో 34వ సారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. నాదల్‌తో కలిసి 22 టైటిల్స్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ సాధించిన ఆటగాడిగా జొకోవిచ్ సంయుక్తంగా ఉన్నాడు. ఈసారి ఫైనల్లో గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ అందుకుంటే.. ఓపెన్ శకంలో(23 టైటిల్స్) అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్ చరిత్రకెక్కనున్నాడు. మరో సెమీఫైనల్లో కాస్పర్ రూడ్, అలెగ్జాండర్ జ్వెరెవ్‌ల మధ్య జరగనుంది. ఈ ఇద్దరిలో గెలిచిన ఆటగాడితో జొకోవిచ్ ఆదివారం ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాడు. Never doubt Novak 💪🇷🇸@DjokerNole gets the better of Alcaraz 6-3, 5-7, 6-1, 6-1 to reach a 34th Grand Slam final.#RolandGarros pic.twitter.com/fefJZKKMxn — Roland-Garros (@rolandgarros) June 9, 2023 చదవండి: 'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ షాట్ -
'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ షాట్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా వరల్డ్ నెంబర్ వన్ కార్లెస్ అల్కరాజ్, సెర్బియా స్టాన్ నొవాక్ జొకోవిచ్ మధ్య సెమీఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా కొదమ సింహాల్లా తలపడుతున్నారు. ఇప్పటికైతే తొలి సెట్‌ను జొకోవిచ్ 6-3తో సొంతం చేసుకున్నప్పటికి.. రెండో సెట్లో మాత్రం అల్కరాజ్ లీడింగ్‌లో ఉన్నాడు. హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్‌లో గెలుపు ఎవరిది అని చెప్పడం కష్టంగా మారింది. ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్ సందర్భంగా అల్కరాజ్ చేసిన విన్యాసం జొకోవిచ్ చేత చప్పట్లు కొట్టించింది. వరల్డ్ నెంబర్ వన్ అనే పదానికి సార్థకం చేస్తూ అల్కరాజ్ కొట్టిన బ్యాక్ హ్యాండ్ షాట్ చరిత్రలో మిగిలిపోనుంది. విషయంలోకి వెళితే.. రెండోసెట్లో భాగంగా ఇద్దరు 1-1తో ఉన్నప్పుడు జొకోవిచ్ కాస్త తెలివిగా ర్యాలీ చేశాడు. అయితే అల్కరాజ్ వేగంగా స్పందించి షాట్ ఆడాడు. కానీ అల్కరాజ్ కోర్టు దగ్గరకు రావడం.. అదే సమయంలో జొకోవిచ్ ఆఫ్‌సైడ్ రిఫ్ట్ షాట్ కొట్టాడు. ఇక జొకోకు పాయింట్ వచ్చినట్లేనని అంతా భావించారు. కానీ ఇక్కడే అల్కరాజ్ ఎవరు ఊహించని ఫీట్ నమోదు చేశాడు. వేగంగా పరిగెత్తిన అల్కరాజ్ బ్యాక్‌హ్యాండ్ స్ట్రోక్ ఉపయోగించి షాట్ కొట్టాడు. బంతి కూడా లైన్ ఇవతల పడడంతో అల్కరాజ్ పాయింట్ గెలుచుకున్నాడు. అల్కరాజ్ చర్యకు ఆశ్చర్యపోయిన జొకోవిచ్ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Take a bow, @carlosalcaraz 😱#RolandGarros pic.twitter.com/2m25jQtOy1 — Tennis Channel (@TennisChannel) June 9, 2023 😳#RolandGarros pic.twitter.com/3UA4JbPHz4 — Wimbledon (@Wimbledon) June 9, 2023 చదవండి: 'చాన్స్ కూడా ఇవ్వలేదు'.. సిరాజ్ దెబ్బకు లేచి కూర్చొన్నాడు -
జొకోవిచ్ రికార్డు
పారిస్: కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో జొకోవిచ్ రికార్డు సృష్టిస్తూ 17వసారి ఈ మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో రాఫెల్ నాదల్ అత్యధికంగా 16 సార్లు క్వార్టర్ ఫైనల్ చేరగా... నాదల్‌తో సమంగా ఉన్న జొకోవిచ్ తాజా విజయంతో ఈ స్పెయిన్ దిగ్గజాన్ని దాటి ముందుకు వెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)పై గెలుపొందాడు. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఏడు ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన అతను నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచాడు. ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అత్యధికసార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన రికార్డు ఫెడరర్ (స్విట్జర్లాండ్; 58 సార్లు) పేరిట ఉంది. జొకోవిచ్ (55 సార్లు) రెండో స్థానంలో, నాదల్ (47 సార్లు) మూడో స్థానంలో, జిమ్మీ కానర్స్ (41 సార్లు) నాలుగో స్థానంలో, రాయ్ ఎమర్సన్ (37 సార్లు) ఐదో స్థానంలో ఉన్నారు. క్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా)తో జొకోవిచ్ ఆడతాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 1–6, 6–4, 7–6 (9/7), 6–1తో సొనెగో (ఇటలీ)పై నెగ్గాడు. అల్కరాజ్ అలవోకగా... ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) మరో అలవోక విజయంతో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అల్కరాజ్ 6–3, 6–2, 6–2తో లొరెంజె ముజెట్టి (ఇటలీ)పై గెలిచాడు. ఆరు ఏస్‌లు సంధించిన అల్కరాజ్, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), సెబాస్టియన్ ఆఫ్నర్ (ఆ్రస్టియా) మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. పావ్లీచెంకోవా ముందంజ... మహిళల సింగిల్స్ విభాగంలో 2021 రన్నరప్ పావ్లీచెంకోవా (రష్యా), ముకోవా (చెక్ రిపబ్లిక్), స్వితోలినా (ఉక్రెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో పావ్లీచెంకోవా 3 గంటల 9 నిమిషాల్లో 3–6, 7–6 (7/3), 6–3తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)ను ఓడించగా... ముకోవా 6–4, 6–3తో అవనెస్యాన్ (రష్యా)పై గెలిచింది. స్వితోలినా గంటా 56 నిమిషాల్లో 6–4, 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా)ను బోల్తా కొట్టించింది. కసత్కినా ఓటమితో ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో టాప్–10లో నలుగురు మాత్రమే బరిలో మిగిలారు. 44 ఏళ్ల తర్వాత... బ్రెజిల్‌కు చెందిన 14వ సీడ్ బీత్రిజ్ హదాద్ మాయ మూడో రౌండ్ మ్యాచ్‌లో 5–7, 6–4, 7–5తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై నెగ్గి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. అంతేకాకుండా 44 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన బ్రెజిల్ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. బ్రెజిల్ తరఫున చివరిసారి 1979లో పాట్రిసియా మెద్రాడో ఈ ఘనత సాధించింది. -
French Open: జొకోవిచ్ శుభారంభం
French Open 2023- పారిస్: కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో బరిలోకి దిగిన సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ జొకోవిచ్ 6–3, 6–2, 7–6 (7/1)తో అలెగ్జాండర్ కొవాసెవిచ్ (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటల 26 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 10 ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. వరుసగా 19వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న జొకోవిచ్ రెండుసార్లు టైటిల్ సాధించడంతోపాటు నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) గైర్హాజరీలో టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయర్ ఫ్లావియో కొబొలి (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో అల్కరాజ్ 6–0, 6–2, 7–5తో విజయం సాధించాడు. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు పదో సీడ్ ఫెలిక్స్ అగుర్ అలియాసిమ్ (కెనడా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) 6–4, 6–4, 6–3తో ఫెలిక్స్ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఇతర మ్యాచ్‌ల్లో 14వ సీడ్ కామెరాన్ నోరి (బ్రిటన్) 7–5, 4–6, 3–6, 6–1, 6–4తో బెనోయి పెయిర్ (ఫ్రాన్స్)పై, మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7–6 (7/5), 6–4, 6–7 (2/7), 1–6, 6–4తో రామోస్ వినోలస్ (స్పెయిన్)పై, షపోవలోవ్ (కెనడా) 6–4, 7–5, 4–6, 3–6, 6–3తో నకషిమా (అమెరికా)పై గెలిచి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. 12వ సీడ్ బెన్‌చిచ్ ఓటమి మహిళల సింగిల్స్ విభాగంలో 12వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ‘లక్కీ లూజర్’ ఎలీనా అలనెస్యాన్ (రష్యా) 6–3, 2–6, 6–4తో బెన్చిచ్ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 7–6 (7/4), 4–6, 6–4తో జియు వాంగ్ (చైనా)పై, స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–0, 6–4తో కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై, కేలా డే (అమెరికా) 7–5, 6–1తో మ్లాడోనోవిచ్ (ఫ్రాన్స్)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–2తో మార్టినా ట్రెవిసాన్ (ఇటలీ)పై గెలిచారు. -
French Open 2023: మట్టి కోర్టులో మహా సంగ్రామం షురూ
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ నేడు మొదలుకానుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో స్పెయిన్ దిగ్గజం, 14 సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ తుంటి గాయం కారణంగా ఈ టోర్నీకి తొలిసారి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), సెర్బియా దిగ్గజం జొకోవిచ్, నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. నేడు జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో జిరీ వెసిలీ (చెక్ రిపబ్లిక్)తో సిట్సిపాస్, లాస్లో జెరి (సెర్బియా)తో ఏడో సీడ్ రుబ్లెవ్ తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. స్వియాటెక్‌కు రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), ఐదో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), ఆరో సీడ్, గత ఏడాది రన్నరప్ కోకో గాఫ్ (అమెరికా) ఏడో సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. పురుషుల డబుల్స్ విభాగంలో భారత్ నుంచి రోహన్ బోపన్న, యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేని బరిలోకి దిగనున్నారు. -
ఫైనల్లో కాదు.. సెమీస్‌లోనే..!
French Open 2023: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ ‘డ్రా’ వివరాలను గురువారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ గాయం కారణంగా తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త చాంపియన్ అవతరిస్తాడా లేక మాజీ విజేత జొకోవిచ్ మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుస్తాడా వేచి చూడాలి. పురుషుల సింగిల్స్ ‘డ్రా’ ప్రకారం టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్), మూడో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) ఒకే పార్శ్వంలో ఉన్నారు. దాంతో వీరిద్దరు ఫైనల్లో కాకుండా సెమీఫైనల్లోనే తలపడే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్), ఎనిమిదో సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ)లలో ఇద్దరు సెమీఫైనల్ చేరుకుంటారు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)కు టాప్ సీడింగ్ కేటాయించారు. గత ఏడాది రన్నరప్ కోకో గాఫ్ (అమెరికా)కు ఆరో సీడ్ దక్కడంతో క్వార్టర్ ఫైనల్లో ఆమెకు స్వియాటెక్ ఎదురయ్యే చాన్స్ ఉంది. ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ మొదలవుతుంది. -
జొకోవిచ్‌కు చేదు అనుభవం.. తొలిసారి స్టార్లు లేకుండానే ఫైనల్
Rome Masters: రోమ్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) కథ ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 2–6, 6–4, 2–6తో ఏడో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. 2004 తర్వాత రోమ్ మాస్టర్స్ టోర్నీలో జొకోవిచ్, నాదల్‌లలో ఒక్కరు కూడా లేకుండా తొలిసారి ఫైనల్ జరగనుంది. ఇది కూడా చదవండి: ‘ఎమిలియా’ ఎఫ్1 రేసు రద్దు ఇమోలా (ఇటలీ): ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో భాగంగా ఈనెల 21న ఇటలీలో జరగాల్సిన ఎమిలియా రొమాన్య గ్రాండ్‌ప్రి రేసు రద్దయింది. ఈ రేసుకు వేదికగా నిలవాల్సిన ఇమోలా ప్రాంతాన్ని భారీవర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో రేసును నిర్వహించి అందరినీ ఇబ్బంది పెట్టే యోచన లేదని ఎఫ్1 నిర్వాహకులు తెలిపారు. సీజన్‌లోని తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 28న జరుగుతుంది. -
చరిత్ర తిరగరాసిన జకోవిచ్
రోమ్ మాస్టర్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరడం ద్వారా సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఒకే మాస్టర్స్ 1000 ఈవెంట్లో 17 సార్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2007 నుంచి ఈ టర్నీలో పాల్గొంటున్న జకో.. ఆడిన ప్రతిసారి కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరి రికార్డుల్లోకెక్కాడు. ఈ టోర్నీ ప్రారంభ రౌండ్లలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని జకో.. తాజా ప్రదర్శనతో దిగ్గజ ఆటగాడు రఫెల్ నదాల్ రికార్డును (16 సార్లు క్వార్టర్స్ చేరిన రికార్డు) బద్దలు కొట్టాడు. రోమ్ మాస్టర్స్‌లో ప్రస్తుతం జకోవిచ్ గెలుపోటముల రికార్డు 67-10గా ఉంది. 2007 నుంచి జకో ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు ముందు ఓడింది లేదు. ఇదిలా ఉంటే, 22 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన జకోవిచ్ ఇటీవల తన సహచర ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్‌లను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. తాను ఫెదరర్, నదాల్లతో ఎప్పుడు స్నేహం చేయలేదని జకో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రత్యర్థుల మధ్య స్నేహం ఎప్పటికీ కుదరదని చెప్పిన జకో.. తాను ఫెదరర్, నదాల్‌లను ఎప్పుడూ గౌరవిస్తానని అన్నాడు. తాను ఫెదరర్, నదాల్‌లను చూస్తూ పెరిగానని, ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానంటే వారి వల్లేనని చెప్పుకొచ్చాడు. కాగా, పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన రికార్డును జకోవిచ్.. రఫెల్ నదాల్ (22)తో పాటు షేర్ చేసుకున్నాడు. ఈ ఇద్దరు మోడ్రన్ టెన్నిస్ దిగ్గజాల తర్వాత రోజర్ ఫెదరర్ (20) ఉన్నాడు. చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో ప్రణయ్