![Australian Open 2024 Mens Final Jannik Sinner Vs Medvedev - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/27/kiran.jpg.webp?itok=5y0eR9Yp)
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి పోరాటం ముగిసింది. జకార్తాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి 14–21, 6–21తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు.
ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు
మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మస్కట్‌లో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రజని కెపె్టన్సీలోని భారత జట్టు 6–3తో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. ఫైనల్లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది.
సెమీఫైనల్లో భారత్ తరఫున అక్షత, మరియానా, ముంతాజ్, రుతుజా, జ్యోతి అజ్మీనా ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోంది.
Australian Open 2024- మెల్‌బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఇటలీకి చెందిన 22 ఏళ్ల యానిక్ సినెర్.. ఫైనల్లోమెద్వెదెవ్‌తో తలపడనున్నాడు. జొకోవిచ్‌ను ఓడించిన సినెర్.. జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచి మెద్వెదేవ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment