మెల్‌బోర్న్: సెర్బియా స్టార్ నొవాక్ జోకోవిచ్ తన కెరీర్‌లో తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఎగురేసుకుపోయాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ రష్యాకు చెందిన డానిల్ మెద్వెదెవ్( 4వ సీడ్)ను 7-5,6-2,6-2తో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గంటా 53 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్ తొలి సెట్‌లో మాత్రమే జొకోవిచ్‌ను కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. అయితే తర్వాత జొకోవిచ్ అద్భుతమైన స్ట్రోక్‌ప్లేతో పదునైన సర్వీస్ షాట్లు ఆడి రెండు సెట్లను గెలుచుకోవడంతో మ్యాచ్ ముగిసింది.
ఈ విజయంతో కెరీర్‌లో తొమ్మిదో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను.. మొత్తంగా 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. అంతేగాక ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 82-9 తో తన విజయాల రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. కాగా జొకోవిచ్ మరో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తే 20 గ్రాండ్‌స్లామ్స్‌తో ఫెదరర్, నాదల్ సరసన నిలవనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment