final match
-
కప్ కొట్టేది ఎవరు ?.. సర్ ప్రైజ్ ఇచ్చేది ఎవరు ?
-
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం2025 ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా అవతరించింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం ఇది మూడోసారి.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.ఛేదనలో భారత్‌కు రోహిత్ శర్మ (76) శుభారంభం అందించారు. రోహిత్.. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. చివర్లో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ ఔట్203 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో రూర్కీకి క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ (29) ఔటయ్యాడు. 44 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 212/5గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 36 బంతుల్లో 40 పరుగులు చేయాలి. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయస్ ఔట్183 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. వేగంగా పరుగులు రాబట్టే క్రయంలో శ్రేయస్ అయ్యర్ (48) ఔటయ్యాడు. సాంట్నర్ బౌలింగ్‌లో రచిన్ క్యాచ్ పట్టడంతో శ్రేయస్ పెవిలియన్ బాటపట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 68 బంతుల్లో 69 పరుగులు చేయాలి. 38.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 183/4గా ఉంది.జాగ్రత్తగా ఆడుతున్న శ్రేయస్, అక్షర్252 పరుగుల ఛేదనలో స్వల్ప వ్యవధిలో గిల్, విరాట్, రోహిత్ శర్మ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్‌ను శ్రేయస్ అయ్యర్ (47), అక్షర్ పటేల్ (17) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ భారత్‌ను విజయతీరాలవైపు తీసుకెళ్తున్నారు. 37 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 176/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 78 బంతుల్లో 76 పరుగులు చేయాలి. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ శర్మ ఔట్252 పరుగుల ఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం అనంతరం భారత్ 17 పరుగుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద పరుగు వ్యవధిలో గిల్, కోహ్లి వికెట్లు కోల్పోయిన భారత్.. 122 పరుగుల వద్ద రోహిత్ శర్మ (76) వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పటిదాకా చాలా జాగ్రత్తగా ఆడిన రోహిత్.. పరుగులు అస్సలు రాకపోవడంతో ఒత్తిడికి లోనై భారీ షాట్‌కు ప్రయత్నించాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో క్రీజ్ దాటి చాలా ముందుకు వచ్చిన రోహిత్ బంతి కనెక్ట్ కాకపోవడంతో స్టంపౌటయ్యాడు. పరుగు వ్యవధిలో గిల్, కోహ్లి వికెట్లు కోల్పోయిన టీమిండియాపరుగు వ్యవధిలో టీమిండియా రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద గిల్, 106 పరుగుల వద్ద కోహ్లి ఔటయ్యారు. అప్పటిదాకా గెలుపుపై ధీమా ఉన్న టీమిండియా ఒక్కసారిగా ఇద్దరు స్టార్ల వికెట్లు కోల్పోవడంతో డిఫెన్స్‌లో పడింది. గిల్‌ను సాంట్నర్.. కోహ్లిని బ్రేస్‌వెల్ ఔట్ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్ పట్టడంతో గిల్ పెవిలియన్ బాట పట్టగా.. కోహ్లిని బ్రేస్‌వెల్ వికెట్ల ముందు దొరికించుకున్నాడు. 17 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసిన టీమిండియా252 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 17 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసుకుంది. భారత్ వికెట్ నష్టపోకుండా ఈ మార్కును తాకింది. రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 68 పరుగులతో, గిల్ 27 పరుగులతో అజేయంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 152 పరుగులు చేయాలి. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ 252 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 65/0గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 187 పరుగులు చేయాలి.టార్గెట్ 252.. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ252 పరుగుల ఛేదనలో భారత్‌కు రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. రోహిత్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ 13 బంతుల్లో 7 పరుగులు చేసి రోహిత్‌కు ఎక్కువగా స్ట్రయిక్ ఇస్తున్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్ 59/0గా ఉంది. మిచెల్, బ్రేస్‌వెల్ హాఫ్ సెంచరీలు.. టీమిండియా టార్గెట్ 252ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా ముందు 252 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలు చేసి టీమిండియాకు ఫైటింగ్ టార్గెట్‌ను నిర్దేశించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. విరాట్ కోహ్లి సూపర్ త్రో.. సాంట్నర్ రనౌట్విరాట్ కోహ్లి సూపర్ త్రోతో మిచెల్ సాంట్నర్‌ను (8) రనౌట్ చేశాడు. 239 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది.ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్45.4వ ఓవర్: 211 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో డారిల్ మిచెల్ (63) ఔటయ్యాడు. ఔట్ కాకముందు మిచెల్ షమీ బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టాడు.డేంజరెస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఔట్37.5వ ఓవర్: డేంజరెస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి ఫిలిప్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 38 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 165/5గా ఉంది. డారిల్ మిచెల్‌కు (44) జతగా బ్రేస్‌వెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. నిలకడగా ఆడుతున్న మిచెల్, ఫిలిప్స్లాథమ్ వికెట్ పడ్డ తర్వాత న్యూజిలాండ్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. డారిల్ మిచెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (28) నిలకడగా ఆడుతున్నారు. 36 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 156/4గా ఉంది. కివీస్ నాలుగో వికెట్ డౌన్..టామ్ లాథమ్ రూపంలో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన లాథమ్ జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి గ్లెన్ ఫిలిప్స్ వచ్చాడు. 26 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్: 116/4నిలకడగా ఆడుతున్న మిచెల్, లాథమ్..22 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మిచెల్(18), టామ్ లాథమ్(14) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.విలియమ్సన్ ఔట్..కేన్ విలియమ్సన్ రూపంలో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన విలియమ్సన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో విలియమ్సన్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి టామ్ లాథమ్ వచ్చాడు. 15 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్: 82-3కివీస్ స్పిన్ మ్యాజిక్.. రవీంద్ర క్లీన్ బౌల్డ్రచిన్ రవీంద్ర రూపంలో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రవీంద్ర.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి డార్లీ మిచెల్ వచ్చాడు. 11 ఓవర్లకు భారత్ స్కోర్: 73/3వరుణ్ మ్యాజిక్.. కివీస్ తొలి వికెట్ డౌన్న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన విల్ యంగ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కేన్ విలియమ్సన్ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. రవీంద్ర 34 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న రచిన్..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి కివీస్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రచిన్ రవీంద్ర(16), విల్ యంగ్(8) ఉన్నారు.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్‌కు తెరలేచింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగుతున్న ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ దూరమయ్యాడు. అతడి స్ధానంలో నాథన్ స్మిత్ తుది జట్టులోకి వచ్చాడు. భారత్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.తుది జట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిమరి కాసేపటిలో టాస్..ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. మరికాసేపట్లో టాస్ పడనుంది. ఇరు జట్లకు టాస్ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇరు జట్లు తమ ఆస్తశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఐసీసీ వన్డే టోర్నీ ఫైనల్లో ఇరు జట్లు తలపడుతున్నాయి.హెడ్ టు హెడ్ రికార్డ్..ఇప్పటివరకు భారత్-న్యూజిలాండ్ జట్లు ముఖాముఖి 119 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 61 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో 7 మ్యాచ్‌ల్లో ఫలితం తేలకపోగా.. ఓ మ్యాచ్ టై అయింది. -
Ind vs NZ: ఫైనల్‌కు వర్షం ముప్పు లేదు! కానీ ‘టై’ అయితే.. విజేతగా ఎవరు?
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) తుది అంకానికి చేరుకుంది. మొత్తం ఎనిమిది జట్లు భాగమైన ఈ వన్డే టోర్నమెంట్లో టీమిండియా- న్యూజిలాండ్(India vs New Zealand) ఫైనల్‌కు చేరుకున్నాయి. టైటిల్ కోసం దుబాయ్ వేదికగా ఆదివారం ఇరుజట్లు తలపడనున్నాయి. కాగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో కివీస్ భారత జట్టుపై మెరుగైన రికార్డు కలిగి ఉంది.పాతికేళ్ల క్రితం అలా2000లో చాంపియన్స్ ట్రోఫీ(నాడు ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) తుదిపోరులో టీమిండియాపై గెలుపొంది న్యూజిలాండ్ టైటిల్ సాధించింది. అనంతరం 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీ ఫైనల్లో కోహ్లి సేనను ఓడించడంతో పాటు.. 2023 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship) ఫైనల్లోనూ టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ఎగురేసుకుపోయింది.ఈ క్రమంలో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో భారత్ న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్ మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక తాజా చాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ గ్రూప్ దశలోనూ రోహిత్ సేనదే సాంట్నర్ బృందంపై పైచేయిగా ఉంది. గ్రూప్-‘ఎ’ నుంచి పోటీపడ్డ ఈ రెండు జట్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఓడించి సెమీస్ చేరుకున్నాయి. అయితే, గ్రూప్ దశలో ఆఖరిదైన మ్యాచ్‌లో మాత్రం టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి టాపర్‌గా నిలిచింది.అనంతరం సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరగా.. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి టీమిండియాతో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పటిష్టమైన ఇరుజట్ల మధ్య ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. టైటిల్ పోరు ‘టై’గా మారితే పరిస్థితి ఏంటి?మరి ఒకవేళ సమవుజ్జీల మధ్య టైటిల్ పోరు ‘టై’గా మారితే పరిస్థితి ఏంటి?.. సూపర్ ఓవర్లోనూ ఇద్దరూ సరిసమానంగా ఉంటే విజేతగా ఎవరిని నిర్ణయిస్తారు? అనే ప్రశ్నలు సగటు అభిమాని మదిలో మెదులుతున్నాయి.మరి ఇందుకు సమాధానం ఏమిటంటే.. ఒకవేళ మ్యాచ్ ‘టై’ అయితే సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చడం పరిపాటే. అయితే, సూపర్ ఓవర్లోనూ రెండు జట్లు సమానంగా ఉంటే.. విజేత తేలేంత వరకూ సూపర్ ఓవర్లు నిర్వహిస్తూనే ఉంటారు. 2019 వరల్డ్‌కప్ ఫైనల్ విన్నర్‌ను తేల్చిన విధానంపై విమర్శలు రాగా.. ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.అప్పట్లో వివాదంనాడు ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ మ్యాచ్‌ను ‘టై’ చేసుకున్నాయి. అదే విధంగా సూపర్ ఓవర్లోనూ నువ్వా-నేనా అన్నట్లు తలపడి.. మళ్లీ ‘టై’ చేశాయి. దీంతో బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్‌ను చాంపియన్‌గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఐసీసీ తీరుపై విమర్శలు రాగా.. ఇకపై ఐసీసీ టోర్నీల్లో ఒకవేళ మ్యాచ్ ‘టై’ అయితే.. విజేత తేలేంత వరకు సూపర్ ఓవర్ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది.ఇక దుబాయ్‌లో వర్షం ముప్పులేదు. కానీ ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. 2002లో వరణుడి కారణంగా ఫైనల్ మ్యాచ్ సాగే వీలు లేకపోవడంతో భారత్- శ్రీలంకను టైటిల్ విజేతగా ప్రకటించారు. నిజానికి అప్పుడు రెండురోజుల్లో 110 ఓవర్ల ఆట పూర్తైనా.. ఆపై కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
ఇంగ్లండ్, విండీస్‌ల ఆఖరి టి20 రద్దు
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): కరీబియన్ పర్యటనలో ఆఖరిదైన ఐదో టి20 రద్దవడంతో ఇంగ్లండ్ 3–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరగాల్సిన మ్యాచ్ సరిగ్గా ఐదు ఓవర్లు ముగిశాక వర్షంతో ఆగిపోయింది. అప్పటికే మ్యాచ్ నిలిచే సమయానికి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు లూయిస్ (20 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (10 బంతుల్లో 14 నాటౌట్, 3 ఫోర్లు) అజేయంగా ఉన్నారు. అయితే భారీ వర్షంతో అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారింది. తిరిగి ఆట నిర్వహించలేని పరిస్థితి తలెత్తడంతో ఫీల్డు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో మొదటి మూడు టి20ల్లో వరుసగా ఇంగ్లండే గెలిచి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను నెగ్గింది. ఈ సిరీస్‌లో 9 వికెట్లు తీసిన ఇంగ్లండ్ సీమర్ సాకిబ్ మహ్మూద్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ పర్యటనలో ముందు మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య వెస్టిండీస్ 2–1తో కైవసం చేసుకుంది. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ఫలితాలు వచ్చిన ఈ ఏడు మ్యాచ్‌ల్లోనూ టాస్ నెగ్గి... ఫీల్డింగ్ ఎంచుకొని, లక్ష్యాన్ని -
IND VS PAK: రాయుడు, యూసఫ్ విధ్వంసం.. పాక్ చిత్తు! టోర్నీ విజేతగా భారత్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ టైటిల్‌ను ముద్దాడింది.ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(41) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అతడితో పాటు కమ్రాన్ ఆక్మల్(24), మసూద్(21) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. వినయ్ కుమార్, నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలా వికెట్ సాధించారు.రాయుడు ఫిప్టీ.. యూసఫ్ విధ్వంసంఅనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ఓపెనర్ అంబటి రాయుడు మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు.30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు చేసి 50 పరుగులు చేసి రాయుడు ఔటయ్యాడు. ఆఖరిలో యూసఫ్ పఠాన్(16 బంతుల్లో 30 పరుగులు, 1 ఫోర్, 3 సిక్స్‌లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో యమీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. షోయబ్ మాలిక్,అఫ్రిది, రియాజ్ తలా వికెట్ సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అంబటి రాయుడు నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు యూసఫ్ పఠాన్‌కు వరించింది. -
క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఫైనల్లో భారత్-పాకిస్తాన్ ఢీ
భారత్-పాక్ క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. తమ ఆరాధ్య జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయాని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ ఫైనల్లో ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ తలపడనున్నాయి.జూలై 13(శనివారం) నార్తాంప్టన్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో చిరకాల ప్రత్యర్ధులైన భారత్- పాక్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో 86 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించి భారత్ ఫైనల్‌కు రాగా.. తొలి సెమీస్‌లో వెస్టిండీస్‌ను ఓడించి పాక్ తుది పోరుకు ఆర్హత సాధించింది. ఈ ఫైనల్ పోరులో గెలిచి లీగ్ స్టేజ్‌లో ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. గ్రూపు స్టేజిలో పాక్ చేతిలో భారత్ 68 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. అయితే పాక్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. పాక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది.ఈ టోర్నీలో పాక్ ఇప్పటివరకు ఆజేయంగా నిలిచింది. కానీ ఆసీస్‌తో సెమీస్‌లో ఆడినట్లు భారత బ్యాటర్లు చెలరేగితే పాక్ కచ్చితంగా తలవంచాల్సిందే. భారత బ్యాటర్లలో ఉతప్ప, యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. -
టీమిండియా విన్నింగ్ సెలబ్రేషన్స్.. చిన్న పిల్లాడిలా మారిన ద్రవిడ్! వీడియో
టీమిండియా కల నేరవేరింది. గత 11 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ సొంతమైంది. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత జట్టు.. రెండో పొట్టి ప్రపంచకప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. భారత్‌కు ఇది రెండో టీ20 వరల్డ్‌కప్ కాగా.. ఓవరాల్‌గా నాలుగో ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం. అయితే సుధీర్ఘ నిరీక్షణకు తెరపడడంతో భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. భావోద్వేనికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే కప్ అందుకునే సమయంలో మాత్రం భారత ఆటగాళ్లు నవ్వుతూ సంబరాల్లో మునిగి తేలిపోయారు. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే చిన్నపిల్లాడిలా ప్లేయర్స్‌తో కలిపి సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే ద్రవిడ్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకోవడం అందరిని కట్టిపడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ద్రవిడ్‌కు భారత జట్టు హెడ్ కోచ్‌గా ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం. టీ20 వరల్డ్‌కప్-2024తో భారత హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. అదే విధంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నారు.Never expected idhi #RahulDravid 😂❤️pic.twitter.com/n7o3Ffa83O— Harsha... (@harshatweets03) June 29, 2024It's that sigh of relief in the end from Rahul Dravid after his aggressive celebration. pic.twitter.com/ZDeXiiLr7k— Aditya Saha (@Adityakrsaha) June 29, 2024 -
భారత్-దక్షిణాఫ్రికా మధ్య టైటిల్ ఫైట్
-
T20 WC 2024: ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. రద్దైతే విజేత ఎవరంటే..?
టీ20 వరల్డ్‌కప్-2024లో తుది సమరానికి సమయం అసన్నమైంది. శనివారం(జూన్ 29)న బార్బడోస్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్-దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ తుది పోరుకు వర్షం వర్షం ముప్పు పొంచి ఉంది. శనివారం మ్యాచ్ జరగనున్న బార్బడోస్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. జూన్ 29న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో 78 శాతం వర్షం పడే అవకాశం ఉంది. స్ధానిక కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభం కానుంది. మ్యాచ్ జరిగే రోజు బార్బోడస్‌లో ఉదయం 3 గంటల నుండి వర్షం మొదలు కానున్నట్లు అక్కడ వాతవారణ శాఖసైతం వెల్లడించింది. ఈ క్రమంలో ఇరు జట్లు అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని చర్చించుకుంటున్నారు.రిజర్వ్ డే..ఈ ఫైనల్ మ్యాచ్‌కు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. శనివారం (జూన్ 29) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదులు కాకపోతే రిజర్వ్ డే అయిన ఆదివారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు.ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. శనివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. మరోవైపు శనివారం టాస్ పడ్డాక.. వర్షం అటంకం కలిగించి మ్యాచ్ ప్రారంభం కాకపోతే, మళ్లీ తాజాగా రిజర్వ్‌డే ఆదివారం రోజు టాస్ నిర్వహిస్తారు. మ్యాచ్ రద్దు అయితే?కాగా ఈ మ్యాచ్ ఫలితాన్ని ఎలాగైనా తేల్చేందుకు ఐసీసీ అదనంగా 190 నిమిషాలు సమయం కేటాయించింది. ఈ ఎక్స్ట్రా సమయం మ్యాచ్డేతో పాటు రిజర్వ్‌డేకు కూడా వర్తిస్తోంది. అయితే రిజర్వ్‌డే రోజు కూడా ఆటసాధ్య పడకపోతే.. రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. దక్షిణాఫ్రికా, భారత్ రెండు జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటున్నాయి. కాగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను నిర్ణయించాల్సి వస్తే ఇరు జట్లు కనీసం 10 ఓవర్ల చొప్పున అయిన బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. -
IPL 2024 ఫైనల్ జోరుగా బెట్టింగ్..
-
IPL 2024: రైజర్స్ VS రైడర్స్
గత మూడు సీజన్లలో ఎనిమిది, ఎనిమిది, పదో స్థానం... సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇది. గత రెండు సీజన్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడో స్థానానికి పరిమితం. ఐపీఎల్ ఈ ఏడాది ఆరంభానికి ముందుకు ఇరు జట్ల రికార్డు చూస్తే ఈ రెండు టీమ్‌లు ఫైనల్ చేరతాయని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుత ప్రదర్శనలతో రైజర్స్, రైడర్స్ అంచనాలు తిరగరాశాయి. అదరగొట్టే బ్యాటింగ్, రికార్డు ప్రదర్శనలతో హైదరాబాద్ ప్రస్థానం సాగితే... అన్ని రంగాల్లో చెలరేగి కోల్‌కతా అగ్రస్థానంతో ముందుకు దూసుకెళ్లింది. అన్ని అవరోధాలను దాటిన తర్వాత ఇప్పుడు అసలైన అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. పదేళ్ల క్రితం చివరిసారి విజేతగా నిలిచిన కోల్‌కతా తమ మూడో టైటిల్‌పై గురి పెడితే... ఎనిమిదేళ్ల క్రితం చాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్ రెండో ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో చెపాక్ మైదానంలో ఎవరిది పైచేయి కానుందనేది ఆసక్తికరం. చెన్నై: ఐపీఎల్–17లో రెండు నెలలకు పైగా హోరాహోరీగా సాగిన సమరాల తర్వాత టోర్నీ విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. లీగ్ మాజీ చాంపియన్లు మరో ట్రోఫీ వేటలో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడతాయి. తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌నే ఓడించి దర్జాగా తుది పోరుకు అర్హత సాధించిన కోల్‌కతా దానిని పునరావృతం చేసేందుకు సిద్ధంగా ఉంది. మరో వైపు గత మ్యాచ్‌తో పాటు అంతకు ముందు లీగ్ దశలో కూడా కేకేఆర్ చేతిలో ఓడిన హైదరాబాద్ ఈ సారి మాత్రం వెనక్కి తగ్గకుండా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. శుక్రవారం ప్రతికూల పరిస్థితుల మధ్య ఇదే మైదానంలో క్వాలిఫయర్–2లో రాజస్తాన్‌ను ఓడించడంతో రైజర్స్ టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మార్పులు చేస్తారా! ఫైనల్ కోసం హైదరాబాద్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. టాప్–3లో హెడ్, అభిõÙక్, త్రిపాఠి ఖాయం. గత మూడు మ్యాచ్‌లుగా భారీ స్కోరు బాకీ ఉన్న హెడ్ ఫైనల్లో చెలరేగితే నిలువరించడం కష్టం. అదే విధంగా అభిõÙక్ కూడా మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లలో దూకుడైన బ్యాటింగ్‌తో తానేంటో త్రిపాఠి నిరూపించుకున్నాడు. ఎప్పటిలాగే భారీ షాట్లతో క్లాసెన్ మిడిలార్డర్లో ఉన్నాడు. అయితే ఇద్దరు దేశవాళీ బ్యాటర్లు నితీశ్ రెడ్డి, సమద్‌లు మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. నాలుగో విదేశీ ఆటగాడిగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో రైజర్స్ మేనేజ్మెంట్లో గందరగోళం కొనసాగుతోంది. మార్క్రమ్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుండగా, లీగ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఫిలిప్స్‌ను తీసుకోవడం కూడా దాదాపు అసాధ్యం. పిచ్‌ను బట్టి క్వాలిఫయర్‌లో షహబాజ్ను అనూహ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా చేసుకొచ్చి టీమ్ మంచి ఫలితం సాధించింది. అయితే ఈ పిచ్‌ను స్పిన్‌కు అంతగా అనుకూలించేది కాకపోవడంతో పాటు ప్రత్యర్థి టీమ్‌లో నలుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లు ఉన్నారు. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ పేస్ బౌలింగ్‌లో తమ బాధ్యత నిర్వర్తించగలరు. మార్పుల్లేకుండా... కోల్‌కతా మాత్రం ఎలాంటి సందేహం లేకుండా క్వాలిఫయర్–1 ఆడిన టీమ్‌నే కొనసాగించనుంది. మొదటినుంచి చివరి ఆటగాడి వరకు అందరూ ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. ఓపెనర్లుగా నరైన్, గుర్బాజ్ సత్తా చాటగలరు. ఆ తర్వాత వరుసగా వెంకటేశ్, శ్రేయస్, రాణా జట్టు భారం మోస్తారు. చివర్లో రింకూ, రసెల్ విధ్వంసం సృష్టించగల సమర్థులు. కేకేఆర్ బౌలింగ్ కూడా సమతూకంగా ఉంది. స్టార్క్ ఫామ్‌లో ఉంటే ఏం జరుగుతుంతో గత మ్యాచ్‌లో హైదరాబాద్‌కు అర్థమైంది. హర్షిత్, అరోరాలాంటి యువ పేసర్లు కూడా రాణిస్తుండగా... స్పిన్నర్ వరుణ్ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. తుది జట్ల వివరాలు (అంచనా) సన్‌రైజర్స్: కమిన్స్ (కెపె్టన్), హెడ్, అభిõÙక్, త్రిపాఠి, మార్క్రమ్, క్లాసెన్, నితీశ్ రెడ్డి, సమద్, భువనేశ్వర్, ఉనాద్కట్, నటరాజన్, షహబాజ్/ మర్కండే. నైట్‌రైడర్స్: శ్రేయస్ (కెపె్టన్), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్, రింకూ, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్, వరుణ్, వైభవ్. పిచ్, వాతావరణం రెండో క్వాలిఫయర్ మ్యాచ్ నల్లరేగడి మట్టితో కూడిన పిచ్‌పై జరిగి స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. కానీ ఫైనల్‌ను ఎర్రమట్టితో కూడిన మరో పిచ్‌ను నిర్వహిస్తున్నారు. దాంతో బ్యాటింగ్‌కు అనుకూలించి భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. శనివారం సాయంత్రం వర్షం కురిసినా...మ్యాచ్ రోజు చిరు జల్లులకు మాత్రమే అవకాశం ఉంది. ఏదైనా ఇబ్బంది ఎదురైనా రిజర్వ్ డే ఉంది. -
జ్యోతి యర్రాజీకి స్వర్ణం, రజతం!
కొత్త సీజన్లో భారత మహిళా అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ మరోసారి మెరిసింది. జర్మనీలో జరిగిన కుర్ప్‌ఫాల్జ్ గాలా మీట్లో జ్యోతి ఒక స్వర్ణం, ఒక రజత పతకం నెగ్గింది.100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో జ్యోతి 13.06 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకాన్ని గెలిచింది. 200 మీటర్ల ఫైనల్లో జ్యోతి 23.83 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. రెండు వారాల క్రితం నెదర్లాండ్స్‌లో జరిగిన హ్యారీ షులి్టంగ్ గేమ్స్‌లో జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణంతో కొత్త సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.ఇవి చదవండి: IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు! -
అదే మా కొంపముంచింది.. కానీ చాలా గర్వంగా ఉంది: టీమిండియా కెప్టెన్
ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో టీమిండియాను ఓటమి మరోసారి వెక్కిరించింది. 9 నెలల వ్యవధిలో వరుసగా మూడో ఐసీసీ ఈవెంట్ తుది పోరులో భారత్ ఓటమి చవిచూసింది. ఫార్మాట్లు మారిన ప్రత్యర్ధి మాత్రం మారలేదు. అదే ప్రత్యర్థి.. అదే ఆస్ట్రేలియా. తొలి రెండు సందర్భాల్లో సీనియర్ జట్టు వంతు అయితే.. ఇప్పుడు కుర్రాళ్ల వంతు. అండర్ 19 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది. టోర్నీ మొత్తం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు.. ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్టెన్ హ్యూ వీబ్జెన్(48), ఓలీవర్ పీక్(42) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్(77 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 47), హైదరాబాద్ ప్లేయర్ మురుగణ్ అభిషేక్( 46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42 )టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మహిల్ బియర్డ్‌మన్, రాఫ్ మెక్‌మిలన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కల్లమ్ విడ్లే రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకముందు డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో సీనియర్ జట్టు చేతిలో రోహిత్ సేన ఓటమి పాలవ్వగా.. ఇప్పుడు జూనియర్లు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశారు. ఇక ఫైనల్ పోరులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ స్పందించాడు. ఇక ఫైనల్ పోరులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ స్పందించాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని సహారన్ అంగీకరించాడు. "ఈ టోర్నీ మొత్తం మా బాయ్స్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వారి ఆటతీరు పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతీ ఒక్కరూ జట్టు కోసం తమ వంతు కృషి చేశారు. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయాం. బ్యాటింగ్‌లో మేము సమిష్టిగా విఫలమయ్యాం. మేము ఈ మ్యాచ్ కోసం బాగా సన్నద్దమయ్యాం. కానీ మా ప్రణాళికలను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాం. మా బాయ్స్ కొంతమంది ర్యాంప్ షాట్లు ఆడి ఔటయ్యారు. ఆదర్శ్‌తో పాటు ఎవరో ఒకరు క్రీజులో ఉండి ఉండే పరిస్థితి మరోవిధంగా ఉండేది.అయితే ఈ టోర్నమెంట్ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ టోర్నీలో ఆడిన అనుభవం భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సహారన్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో 397 పరుగులు చేసిన సహారన్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఆ రోజు మీటింగ్‌లో కూడా సత్య నాదెళ్లకు అదే ధ్యాస..
ఇటీవల జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఏకంగా అహ్మదాబాద్ స్టేడియానికి వెళ్లారు. మరికొందరు టీవీలకు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయి లైవ్ చూడటం మొదలెట్టసారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ళ' (Satya Nadella) సైతం మ్యాచ్ మిస్ చేసుకోలేదని తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఏఐ ప్రాజెక్టుకి సంబంధించి ఒక ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నారు, అయినప్పటికీ మధ్య మధ్యలో ఫైనల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడం, విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటూనే ఉన్నట్లు ఆంగ్ల మీడియా సంస్థ న్యూయార్కర్ వెల్లడించింది. న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను కూడా రాత్రంగా మేల్కొని మరీ చూసినట్లు సత్య నాదెళ్ల ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదీ చదవండి: మొన్న విప్రో.. నేడు హెచ్‌సీఎల్ - ఎందుకిలా? ఈ ఇంటర్వ్యూలోనే టీమ్ ఇండియా ఓటమికి ప్రతీకారంగా ఆస్ట్రేలియాను కొంటారా? అంటూ సత్య నాదెళ్లను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఓపెన్ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఓపెన్ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్‌ను కూడా ఆస్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు. Next time you think your job is more important than cricket, remember that this man had $12 billion on the line and the potential for a very public egg-on-his-face, but that didn’t stop him from updating an uncomprehending audience about Kohli’s batting https://t.co/dSZP9Wn9Dk pic.twitter.com/EPspe36BwU — Sriram (@sriramin140) December 2, 2023 -
టీమిండియా ఓటమికి ఉద్యోగులకు సెలవు
ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందని ఆశించిన భారతీయుల కల, కలగానే మిగిలిపోయింది. టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. గురుగ్రామ్‌కు చెందిన ఓ సంస్థ తన ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టీమిండియా ఓటమి వల్ల తమ ఉద్యోగులు బాధలో ఉంటారని భావించిన గురుగ్రామ్‌లోని 'మార్కెటింగ్ మూవ్స్ ఏజెన్సీ' సోమవారం సెలవు ప్రకటించింది. ఉద్యోగులను బలవంతంగా ఆఫీసులకు రప్పించడం ఇష్టం లేకుండా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సంస్థలో పనిచేసే ఉద్యోగి దీక్షా గుప్తా లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది. ముందుగానే పరిస్థితిని అర్ధం చేసుకున్న కంపెనీ తమ ఉద్యోగులు టీమిండియా ఓటమి షాక్ నుంచి తేరుకునేందుకు సమయం ఇచ్చింది. నిన్నటి బాధ నుంచి కోలుకోవడానికి సెలవు తీసుకోండి, అని బాస్ పంపిన మెసేజ్ స్క్రిన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇదీ చదవండి: సైనా నెహ్వాల్ గ్యారేజిలో చేరిన కొత్త అతిథి - వీడియో వైరల్ నిజానికి ఎవరైనా మ్యాచ్ చూడటానికి సెలవు ఇస్తారు, కానీ ఓటమి నుంచి కోలుకోవడానికి కూడా సెలవు ప్రకటించడం అనేది హర్శించదగ్గ విషయమని పలువు నెటిజన్లు ఆ కంపెనీ బాస్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల టీమిండియా ఓటమిని జీరించుకోలేక పలు చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. Boss ne sach me leave de di aaj😭 Healing Monday 🥹@iMarketingMoves #marketingmoves #INDvsAUS pic.twitter.com/Jc6M20Sia3 — Diksha Gupta (@thedikshagupta) November 20, 2023 -
వరల్డ్ కప్ ఫైనల్లో ఆ విధానం ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది: విజయశాంతి ఆసక్తికర ట్వీట్!
టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై సినీనటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి స్పందించారు. పది మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఓడిపోవడం బాధ కలిగించే విషయమని అన్నారు. అంత మాత్రాన భారత ఆటగాళ్లను ట్రోలింగ్ సరైంది కాదని హితవు పలికారు. ఈ మేరకు విజయశాంతి ట్వీట్ చేశారు. విజయశాంతి తన ట్వీట్లో రాస్తూ..' లీగ్ గేమ్స్, సెమీస్‌లో భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది. 10 మ్యాచ్‌ల విజయాల తర్వాత కూడా ఎక్కడో ఒక్క వైఫల్యం బాధ కలిగిస్తది ఎవరికైనా.. అలాంటిది వెంటనే భారత్ క్రికెట్ టీం, ప్లేయర్స్‌ని ట్రోలింగ్కి గురి చెయ్యడం, మాటలు అనడం సరికాదు. నిజానికి 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు వచ్చిన భారత్ ముందు ఆస్ట్రేలియా గెల్చిన మ్యాచ్‌లు ఎన్ని? అయితే మిగతా కొన్ని క్రీడల పోటీల మాదిరే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా బెస్ట్ ఆఫ్ -3 అనే విధానం ప్రకారం నడిస్తే, నిజమైన ప్రతిభ ప్రజలకు మరింత తెలియవచ్చు.' అని పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవలే భాజపాకు రాజీనామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నో లీగ్ గేమ్స్, సెమీస్ భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది 10 ఆటలుగా.. ఎన్నో విజయాల తర్వాత కూడా ఎక్కడో ఒక్క వైఫల్యం బాధ కలిగిస్తది ఎవరికైనా.. అట్లాంటిది, వెంటనే భారత్ క్రికెట్ టీం, ప్లేయర్స్‌ని ట్రోలింగ్కి గురిచెయ్యడం, మాటలు అనడం సరికాదు. నిజానికి, 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు… pic.twitter.com/Z7it3d7oKc — VIJAYASHANTHI (@vijayashanthi_m) November 20, 2023 -
అందుకే ఫైనల్ మ్యాచ్ చూడను - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్!
యావత్ భారతావని ఈ రోజు టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విశ్వవిజేత ఎవరనేది తెలుసుకోవడానికి సర్వత్రా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌ను దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా చూడనని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. దేశ సేవలో భాగంగానే జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూడనని నిర్ణయం తీసుకున్నారు. తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక జెర్సీ ఫొటో షేర్ చేస్తూ.. ఎవరైనా వచ్చి మనం గెలిచామని చెప్పేవరకు లైవ్ చూడనని ట్వీట్ చేశారు. నిజానికి ఆనంద్ మహీంద్రా ఓ సెంటిమెంట్ నమ్ముతారు. ఆయన లైవ్ మ్యాచ్ చూస్తే ఇండియా ఓడిపోతుందేమో అని నమ్ముతారు. ఈ కారణంగానే ఆనంద్ మహీంద్రా లైవ్ మ్యాచ్ చూడకూడదని నిర్ణయించుకున్నారు. గతంలో ఈ విషయాన్ని చాలా సార్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఫ్యాన్స్ కూడా కీలకమైన మ్యాచ్‌లు మీరు చూడకండి అంటూ సరదాగా సలహాలు ఇచ్చారు. ఇదీ చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందే కొత్త కారు కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ - వీడియో వైరల్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లలో ఒకరు స్పందిస్తూ మీరు తీసుకున్న నిర్ణయం జట్టుకు మద్దతుగా నిలవడంతో ఒక భాగమే అంటూ వెల్లడించారు. మరొకరు ఎప్పటికీ మీరు మా హీరోనే.. మీ త్యాగాన్ని చరిత్ర గుర్తుంచుకుందని కామెంట్ చేశారు. ఇంకొకరు ఇవన్నీ అపోహలు.. మీరు హ్యాప్పీగా మ్యాచ్ చూడవచ్చని సలహా ఇచ్చారు. No, no, I am not planning to watch the match (my service to the nation 🙂) But I will, indeed, be wearing this jersey and installing myself in a hermetically sealed chamber with no contact with the outside world until someone knocks and tells me we’ve won… pic.twitter.com/HhMENqORp1 — anand mahindra (@anandmahindra) November 19, 2023 -
స్లో పిచ్?..టీమిండియానే ఫేవరెట్
-
భారత్ గెలుస్తుందని అభిమానుల ధీమా
-
తిరుపతిలో క్రికెట్ ఫీవర్
-
దేశమంతటా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్
-
వరల్డ్ కప్ లో టాప్ గేర్ లో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా
-
ఫైనల్ మ్యాచ్.. సంబరంలో రవళి
-
'ఆల్ ది బెస్ట్' టీమ్ ఇండియా..!
సాక్షి: ఐసీసీ మెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్– 2023 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. మెగా టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి లీగ్ మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు ఓటమి లేకుండా అద్భుత ప్రదర్శన ను కనబరిచింది. జట్టులోని కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండడంతో ఈసారి ప్రపంచ విజేతగా రోహిత్ సేన నిలుస్తుందని సగటు క్రికెట్ అభిమాని ఆశిస్తున్నా రు. ఫైనల్ సమరాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. పలు హోటళ్లు, టీసెంటర్స్, బార్లు, రెస్టారెంట్లలో అభిమానులు, ప్రేక్షకులు మ్యాచ్‌ను చూసేందుకు పెద్ద పెద్ద స్క్రీన్లను ఇప్పటికే సిద్ధం చేశారు. పలువురు అభిమానులు ప్రపంచకప్ న మూనాను తలపై కత్తిరించుకొని తమ అభిమానాన్ని చాటుకున్నా రు. క్రికెట్ వరల్డ్‌కప్ నేపథ్యంలో పలువురి అభిప్రాయాలు.. -
ICC World Cup 2023: అంతిమ సమరం కోసం...
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో పోటీపడేందుకు భారత క్రికెట్ జట్టు గురువారం అహ్మదాబాద్ నగరానికి చేరుకుంది. విమానాశ్రయంలో భారత జట్టుకు ఘనస్వాగతం లభించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా జట్టుతో భారత్ తలపడుతుంది. ఫైనల్ వేదికపై ఎయిర్ షో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎయిర్ షో నిర్వహించేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిరథ మహారథులు, లక్ష మంది ప్రేక్షకులు విచ్చేసే మ్యాచ్ వేదికపై ఐఏఎఫ్‌కు చెందిన ‘ది సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్’ ఎయిర్ షోతో మ్యాచ్‌కు ముందే కనువిందు చేయనుంది. దీనికి సంబంధించిన రిహార్సల్స్‌ను నేడు, రేపు స్టేడియంపై చేస్తారని గుజరాత్‌కు చెందిన డిఫెన్స్ ప్రొ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వైమానిక విన్యాసాలతో అలరించడం సూర్యకిరణ్ టీమ్‌కు కొత్తేం కాదు. దేశవ్యాప్తంగా ఎయిర్ షోలు ఈ జట్టే చేస్తుంది. మొత్తం తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు నింగిలో తమ వైమానిక విన్యాసంతో ప్రేక్షకుల్ని ఆకట్టిపడేస్తాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందుగా పది నిమిషాల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. -
ఎయిరిండియా విమానాల్లో ప్రయాణాలొద్దు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగే నవంబర్ 19వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ(ఐజీఐ) విమానాశ్రయాన్ని మూసివేయాలంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. అదే రోజు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని కూడా పేర్కొన్నాడు. ఈ మేరకు çపన్నూ హెచ్చరికలు చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ‘నవంబర్ 19వ తేదీన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించరాదని సిక్కులను కోరుతున్నాం. ఆరోజు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి’అని పేర్కొన్నాడు. ‘19న ఐజీఐ విమానాశ్రయాన్ని మూసివేయాలి, విమానాశ్రయం పేరును మార్చాలి’ అని కూడా డిమాండ్ చేశాడు. ఆ రోజున వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్లో జరగనున్న విషయాన్ని కూడా అతడు ప్రస్తావించడం గమనార్హం. ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం నుంచి పాఠం నేర్చుకోవాలని, లేకుంటే భారత్ కూడా అదే ప్రతిచర్యను చవిచూడాల్సి ఉంటుందని ప్రధాని మోదీని హెచ్చరిస్తూ అక్టోబర్ 10న పన్నున్ వీడియో విడుదల చేశాడు. హింసకు హింసే సమాధానం. అక్రమంగా ఆక్రమించుకుంటే పంజాబ్ నుంచి పాలస్తీనా వరకు ప్రజల సమాధానం ఇలాగే ఉంటుందని అందులో పేర్కొన్నాడు. పంజాబ్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర చర్యలకు ఊతమిస్తున్న పన్నూను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గత ఏడాది ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించింది. అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. If this guy was a Palestinian who operated in Canada & was targeting a Western or Israeli airport, Justin Trudeau would have arrested him & banned his organisation But Khalistani terrorists can say & do what they like in Trudeau’s Canada as long as they only target India https://t.co/4ZfZyDzeOr — vir sanghvi (@virsanghvi) November 4, 2023 -
ఏపీఎల్ నిర్వహణ భేష్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నిర్వహణ చాలా బాగుందని.. యువ క్రికెటర్లకు ఇదొక మంచి వేదిక అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఏపీఎల్ రెండో సీజన్ ఫైనల్ మ్యాచ్‌ను టాస్ వేసి ప్రారంభించడానికి ముందు ఆదివారం ఆయన విశాఖలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. ‘విశాఖపట్నం చాలా అందమైన నగరం. నాకెంతో ఇష్టమైన ప్రదేశమిది. ఇక్కడి వాతావరణం బాగుంటుంది. విశాఖ వేదికగా అనేక టోర్నిల్లో ఆడాను. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనితీరు అద్భుతం. ఏపీలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. వారిని ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏపీఎల్ తరహా టోర్నిల ద్వారా క్రికెటర్లకు అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ఏపీ నుంచి దేశానికి మరింత మంది ప్రాతినిధ్యం వహించేలా ఏసీఏ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి’ అని సూచించారు. ‘టెస్ట్, వన్డే, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలోనూ రాణించేవిధంగా యువ క్రికెటర్లు తమను తాము మలుచుకోవాలి. సచిన్ ప్యాషన్‌తో ఆడితే.. కోహ్లి ప్యాషన్‌తో పాటు అగ్రెసివ్‌గా ఆడుతాడు. అది వారి స్టయిల్. నేను కూడా అగ్రెసివ్‌గానే ఆడేవాడిని. జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఆటతీరుతో పాటు చిత్తశుద్ధి, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. నాకు మీడియాతో మంచి అనుబంధం ఉంది. మీడియా ఒక ఆటగాడిని ఎలివేట్ చేసేందుకు చాలా దోహదపడుతుంది. అది ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం’ అని శ్రీకాంత్ అన్నారు. ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీఎల్ సీజన్–2కు మంచి ఆదరణ లభించిందని చెప్పారు. కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్, ఏసీఏ ఉపాధ్యక్షుడు పి.రోహిత్‌రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. వెంకట్రావు పేరుతో ‘స్టాండ్’ గర్వకారణం అనంతరం విశాఖ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు ఏసీఏ మాజీ కార్యదర్శి ఎన్.వెంకట్రావు పేరు పెట్టగా.. దానిని కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసీఏ కార్యదర్శిగా వెంకట్రావు సేవలందిస్తున్న రోజుల్లోనే తాను క్రికెటర్‌గా ఎదిగానని చెప్పారు.ఆయన పేరుతో స్టాండ్ ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా వెంకటరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. అప్పట్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, అంపైర్ కమిటీ చైర్మన్‌గా, క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా, 2003 వరల్డ్‌కప్‌లో పాల్గొన్న టీమిండియా జట్టు మేనేజర్‌గా తాను అందించిన సేవలకు ఇదో జ్ఞాపికగా భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రమణమూర్తి ఏపీఎల్‌లో తలపడుతున్న బెజవాడ టైగర్స్ జట్టుకు యజమానిగా ఉన్నారు. కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి, కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రియాన్ పరాగ్ మెరుపులు వృథా.. దేవధర్ ట్రోఫీ విజేత సౌత్‌జోన్
దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని సౌత్‌జోన్ జట్టు అజేయ విజేతగా నిలిచింది. పుదుచ్చేరిలో గురువారం జరిగిన ఫైనల్లో సౌత్‌జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్ జట్టును ఓడించి తొమ్మిదోసారి దేవధర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్‌జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. రోహన్ (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. మయాంక్ (63; 4 ఫోర్లు), జగదీశన్ (54; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌జోన్ 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. రియాన్ పరాగ్ (95; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించినా మిగతావాళ్లు రాణించడంలో విఫలమయ్యారు. సౌత్‌జోన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా... వైశాఖ్, కౌశిక్, విద్వత్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్ పరాగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 𝗦𝗢𝗨𝗧𝗛 𝗭𝗢𝗡𝗘 are WINNERS of the #DeodharTrophy 2023-24! 🙌 Congratulations to the @mayankcricket-led unit 👏👏 East Zone fought hard in a high-scoring battle here in Puducherry 👌👌 Scorecard - https://t.co/afLGJxp77b#Final | #SZvEZ pic.twitter.com/x6PEjFp5Pr — BCCI Domestic (@BCCIdomestic) August 3, 2023 చదవండి: IND vs WI: టీమిండియా బౌలర్ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్‌గా -
IND vs WI 3rd ODI: విజయమా... ప్రయోగమా!
వెస్టిండీస్‌తో రెండో వన్డేలో ఓటమి తర్వాత ‘మేం భవిష్యత్తుపై దృష్టి పెట్టాం. ప్రస్తుత ఫలితాలు ముఖ్యం కాదు. అందుకే భిన్నమైన కూర్పుతో తుది జట్టు కోసం ప్రయోగాలు చేస్తున్నాం’ అని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించారు. నిజంగానే ద్రవిడ్ మాటలను చేతలకు అన్వయిస్తే మరోసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మ్యాచ్ ఆడకుండా విశ్రాంతి తీసుకోవడం ఖాయం. ఇలాంటి స్థితిలో భారత్ చివరి వన్డేలో నెగ్గి సిరీస్ గెలుచుకుంటుందా లేక గత మ్యాచ్‌లాగే తలవంచుతుందా చూడాలి. తరూబా (ట్రినిడాడ్): వన్డే వరల్డ్‌కప్ ఆతిథ్య జట్టు హోదాలో సిద్ధమవుతున్న భారత్ జట్టు వరల్డ్ కప్‌కు అర్హత సాధించని టీమ్‌తో సిరీస్ విజయం కోసం బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. తొలి వన్డేలోనే కష్టంగా నెగ్గిన టీమిండియా... రెండో వన్డేలో ఓటమిపాలు కావడంతో సిరీస్ 1–1గా సమంగా నిలిచింది. ఈ నేపథ్యంలో మూడో వన్డే ఏకపక్షంగా మారకుండా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఆ ఇద్దరికీ... రోహిత్, కోహ్లి గత మ్యాచ్‌లాగే ఆడకపోతే భారత జట్టుకు సంబంధించి ఇద్దరు బ్యాటర్లపై ప్రధానంగా చర్చ సాగనుంది. తమను తాము నిరూపించుకోవాల్సిన స్థితిలో సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్‌లు బరిలోకి దిగుతున్నారు. కోచ్ చెప్పిన దాన్ని బట్టి వీరిద్దరికి మరో అవకాశం ఖాయం. సూర్య వన్డేల్లో ఇంకా తడబడుతుండగా... చాలా కాలం తర్వాత దక్కిన అవకాశాన్ని సామ్సన్ ఉపయోగించుకోలేకపోయాడు. మూడు, నాలుగు స్థానాల్లో వీరు రాణిస్తే జట్టుకు మేలు కలుగుతుంది. ఇషాన్ కిషన్ ఆకట్టుకోగా, గిల్ ఇంకా ప్రభావం చూపలేదు. హార్దిక్ కూడా అంచనాలకు తగిన విధంగా రెండు విభాగాల్లోనూ రాణించలేకపోతున్నాడు. బౌలింగ్‌లో ఉమ్రాన్, ముకేశ్, కుల్దీప్లు తమ సత్తా మేరకు ఆడితే విండీస్‌ను కట్టడి చేయగలరు. జడేజా, అక్షర్ కూడా రాణిస్తే భారత్ విజయావకాశాలు మెరుగవుతాయి. ఆత్మవిశ్వాసంతో... తొలి వన్డేలో కుప్పకూలినా... రెండో మ్యాచ్‌లో గెలుపు విండీస్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముఖ్యంగా కెపె్టన్ షై హోప్ చక్కటి ఫామ్‌తో ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. మేయర్స్ గత మ్యాచ్‌లో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు. కింగ్, అతనజ్ కూడా రాణించడంతో పాటు కార్టీ కూడా నిలబడితే జట్టు మంచి స్కోరు సాధించేందుకు అవకాశం ఉంటుంది. విండీస్ బౌలింగ్ గత మ్యాచ్‌లో ఆకట్టుకుంది. పేసర్లలో అల్జారి జోసెఫ్ పదునైన పేస్‌తో భారత్‌ను ఇబ్బంది పెట్టగా రొమారియో షెఫర్డ్ కూడా చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ గుడకేశ్ మోతీ కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి సమష్టిగా రాణించి సొంతగడ్డపై సిరీస్ సాధించాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. పిచ్, వాతావరణం బ్రియాన్ లారా స్టేడియం ఇప్పటి వరకు ఒకే ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచి్చంది. ఈ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ వన్డే. అయితే ఈ వేదికపై జరిగిన దేశవాళీ వన్డేల్లో స్వల్ప స్కోర్లే నమోదు కావడం పిచ్ పరిస్థితికి ఒక సూచిక. మ్యాచ్ రోజు వాన ముప్పు లేదు. -
Asia Cup: చెలరేగిన స్పిన్నర్లు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! పాకిస్తాన్‌తో ఢీ
ACC Mens Emerging Teams Asia Cup 2023- India A vs Bangladesh A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భారత- ఏ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. కొలంబోలో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 51 పరుగులతో చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. తద్వారా తొలి సెమీస్‌లో శ్రీలంకను ఓడించి ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్‌తో టైటిల్ వేటలో తలపడనుంది. యశ్ ధుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ టాస్ గెలిచిన బంగ్లాదేశ్ యువ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్, గత మ్యాచ్‌లో అజేయ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులు సాధించాడు. ఇక నిశాంత్ సింధు 5, రియాన్ పరాగ్ 12, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 1, హర్షిత్ రాణా 9, మానవ్ సుతార్ 21(రనౌట్), రాజవర్ధన్ హంగేర్గకర్ 15, యువరాజ్‌సిన్హ్ దోడియా 0(నాటౌట్) నిరాశ పరిచారు. 49.1ఓవర్లలో కేవలం 211 పరుగులు మాత్రమే చేసిన యశ్ ధుల్ సేన ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్, తంజీ హసన్ షకీబ్, రకీబుల్ హసన్ తలా రెండు వికెట్లు తీయగా.. రిపన్ మొండాల్, కెప్టెన్ సైఫ్ హసన్, సౌమ్యా సర్కార్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చెలరేగిన స్పిన్నర్లు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలో దంచికొట్టింది. ఓపెనర్లు మహ్మద్ నయీమ్ 38, తంజీద్ హసన్ 51 పరుగులతో రాణించారు. వన్‌డౌన్‌లో వచ్చిన జాకీర్ హసన్ మాత్రం 5 పరుగులకే చేతులెత్తేయగా.. భారత స్పిన్నర్లు మానవ్ సుతార్, నిశాంత్ సింధు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. మానవ్ 3 వికెట్లు సాధించగా.. నిశాంత్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. యువరాజ్‌సిన్హ్ దోడియా , అభిషేక్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. దీంతో 160 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది. 51 పరుగులతో భారత జయభేరి మోగించింది. యశ్ ధుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక జూలై 23న ఫైనల్లో పాకిస్తాన్‌ను భారత్ ఢీకొట్టనుంది. చదవండి: అయ్యో రోహిత్.. అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదుగా! వీడియో వైరల్ -
'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!'
టెన్నిస్‌లో ప్రస్తుతం కార్లోస్ అల్కారాజ్ ఒక సంచలనం. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్‌వన్‌గా ఉన్న అల్కారాజ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టాడు. బుధవారం హోల్గర్ రూనె (డెన్మార్క్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అల్కారాజ్ 7–6 (7/3), 6–4, 6–4తో గెలుపొందాడు. ఇక శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో యానిక్ సినెర్ (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా); డానిల్ మెద్వెదెవ్‌తో అల్కారాజ్ తలపడనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్, అల్కారాజ్ల మధ్య ఆసక్తికర పోరు చూసే అవకాశముంది. ఈ విషయం పక్కనబెడితే కార్లోస్ అల్కారాజ్ తండ్రికి టెన్నిస్ అంటే ప్రాణం. అయితే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సందర్భంగా మ్యాచ్‌లను చూడడానికి వచ్చిన అల్కారాజ్ తండ్రి.. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ప్రాక్టీస్ వీడియోనూ ఫోన్లో బంధించాడు. అయితే తన కొడుక్కి జొకోవిచ్ ఆటను చూపించడం కోసమే అతను ఈ పని చేశాడని కొంతమంది అభిమానులు ఆరోపించారు. అల్కారాజ్‌కు సహాయం చేసేందుకే ఇలా చేశాడని పేర్కొన్నారు. దీనిని అల్కారాజ్ ఖండించాడు. ఒక్క వీడియో చూడడం వల్ల తనకు పెద్దగా ఒరిగేది ఏమి లేదన్నాడు. ''మా నాన్నకు వ్యక్తిగతంగా టెన్నిస్ అంటే చాలా ఇష్టం. ఆయన తన ఎక్కువ సమయాన్ని ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్‌లోనే గడుపుతారు. అక్కడే కదా నెంబర్ వన్ నుంచి టాప్-20 ర్యాంకింగ్ ఉన్న ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసేది. వాళ్లందరి ప్రాక్టీస్‌ను గమనిస్తూనే ఫోన్లో వీడియోలు తీసుకొని సంతోషపడడం ఆయనకు అలవాటు. ఇక జొకోవిచ్ ఆటతీరు అంటే నాన్నకు చాలా ఇష్టం. రియల్ లైఫ్‌లో నేను జొకోవిచ్‌తో మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో నాన్న జొకోవిచ్‌కే సపోర్ట్ చేయడం చూశాను. అందుకే జొకో ఎక్కడ కనిపించినా ఆయన ఫోటోలను, ఆటను తన ఫోన్ కెమెరాలో బంధించడం చేస్తుంటాడు. అందుకే ఇందులో ఆశ్చర్యపడడానికి ఏం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. మరి మీ నాన్న జొకోవిచ్ ఆటను కెమెరాలో బంధించారు. ఫైనల్లో చాన్స్ ఉంటే తలపడే మీకు ఇది అడ్వాంటేజ్ కానుందా అని అడగ్గా.. దీనిపై అల్కారాజ్ స్పందిస్తూ.. ''నాకు పెద్దగా ఒరిగేదేం లేదు.. దీనర్థం ఏంటంటే.. జొకోవిచ్ ఆటకు సంబంధించిన వీడియాలు ప్రతీ ప్లాట్ఫామ్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.'' అంటూ తెలిపాడు. View this post on Instagram A post shared by Wimbledon (@wimbledon) చదవండి: T10 League: బ్యాట్ పట్టనున్న టీమిండియా మాజీ స్టార్స్.. ఫ్యాన్స్‌కు పండగే Wimbledon 2023: సెమీస్‌లో బోపన్న జోడి.. మహిళల సింగిల్స్‌లో ఈసారి కొత్త చాంపియన్! -
ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా
బెంగళూరు: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ నేడు బెంగళూరులో మొదలుకానుంది. హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ జట్టు ప్రియాంక్ పాంచాల్ కెప్టెన్సీలోని డిఫెండింగ్ చాంపియన్ వెస్ట్ జోన్ జట్టుతో తలపడనుంది. గత ఏడాది ఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు 294 పరుగుల తేడాతో సౌత్ జోన్ జట్టును ఓడించింది. సౌత్ జోన్ చివరిసారి 2011లో దులీప్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. వెస్ట్ జోన్ జట్టు 19సార్లు చాంపియన్‌గా నిలిచింది. విహారితోపాటు మయాంక్ అగర్వాల్, తిలక్ వర్మ, రికీ భుయ్, సాయి సుదర్శన్ ఆటతీరుపై సౌత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పృథ్వీ షా, పుజారా, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్‌లతో వెస్ట్ జోన్ కూడా పటిష్టంగా ఉంది. చదవండి: విండీస్‌తో తొలి టెస్టు.. ఓపెనర్‌గా జైశ్వాల్, గిల్ మూడో స్థానంలో -
చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్
కాల్గరీ: ఏడాదిన్నర తర్వాత భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ మరో అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో లక్ష్య సేన్ చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–18, 22–20తో ప్రపంచ పదో ర్యాంకర్, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షి ఫెంగ్ లీ (చైనా)పై గెలుపొందాడు. గత ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్ టైటిల్ సాధించాక లక్ష్య సేన్ నెగ్గిన మరో అంతర్జాతీయ టైటిల్ ఇదే కావడం విశేషం. టైటిల్ నెగ్గిన లక్ష్య సేన్‌కు 31,500 డాలర్ల (రూ. 25 లక్షల 99 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గత ఏడాది ఆగస్టులో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగత స్వర్ణ పతకం గెలిచిన లక్ష్య సేన్ ఈ సంవత్సరం తాను పాల్గొన్న 12వ టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచాడు. షి ఫెంగ్ లీపై గతంలో నాలుగుసార్లు నెగ్గిన లక్ష్య సేన్‌కు ఈసారీ గట్టిపోటీనే ఎదురైంది. 50 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో లక్ష్య సేన్ కీలకదశలో విజృంభించి పాయింట్లు గెలిచాడు. తొలి గేమ్‌లో స్కోరు 15–15తో సమంగా ఉన్నపుడు లక్ష్య సేన్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 18–15తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో స్కోరు 5–6 వద్ద ఉన్నపుడు షి ఫెంగ్ లీ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 11–6తో ముందంజ వేశాడు. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ షి ఫెంగ్ లీ 20–16తో నాలుగు గేమ్ పాయింట్లు సంపాదించాడు. అయితే లక్ష్య సేన్ దూకుడుగా ఆడి ఊహించనిరీతిలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచాడు. తద్వారా రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘ఒలింపిక్ అర్హత సంవత్సరం కావడం, దానికి తోడు అన్నీ నాకు ప్రతికూల ఫలితాలు వస్తున్న సమయంలో ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ టోర్నీ కొనసాగినకొద్దీ నా ఆటతీరు మెరుగైంది. ఫైనల్లో రెండో గేమ్‌లో వెనుకబడిన దశలో సంయమనం కోల్పోకుండా ఆడాలని నిర్ణయించుకున్నాను. ఇది ఫలితాన్నిచ్చింది’ అని ఉత్తరాఖండ్‌కు చెందిన 21 ఏళ్ల లక్ష్య సేన్ వ్యాఖ్యానించాడు. Congratulations to the talented @lakshya_sen on his outstanding victory at the Canada Open 2023! His triumph is a testament to his tenacity and determination. It also fills our nation with immense pride. My best wishes to him for his upcoming endeavours. pic.twitter.com/DqCDmNSbhk— Narendra Modi (@narendramodi) July 10, 2023 Sometimes, the hardest battles lead to the sweetest victories. The wait is over, and I am delighted to be crowned the Canada Open winner! Grateful beyond words 🎉🏆 #SenMode #BWFWorldTour#CanadaOpen2023 pic.twitter.com/u8b7YzPX01— Lakshya Sen (@lakshya_sen) July 10, 2023 -
39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్-21 చాంపియన్ ఇంగ్లండ్
అండర్-21 యూరోపియన్ చాంపియన్‌షిప్ విజేతగా ఇంగ్లండ్ అవతరించింది. 1984 తర్వాత ఇంగ్లండ్ మళ్లీ చాంపియన్‌గా నిలవడం ఇదే. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత స్పెయిన్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 1-0తో విజయం సాధించింది. ఇంగ్లండ్ తరపున వచ్చిన ఏకైక గోల్ కర్టిస్ జోన్స్ ఆట 45+4వ నిమిషం(అదనపు)లో గోల్ అందించాడు. ఇక రెండో అర్థభాగంలో స్పెయిన్ అదే పనిగా గోల్ పోస్టులపై దాడులు చేసింది. అయితే ఇంగ్లండ్ గోల్‌కీపర్ జేమ్స్ ట్రాఫర్డ్ రెండుసార్లు స్పెయిన్ పెనాల్టీ కిక్‌లు గోల్ చేయకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. దీంతో టోర్నీలో ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా ఇంగ్లండ్ యూరో అండర్-21 విజేతగా నిలవడం విశేషం. 🏴 Trafford at the death! 😱#LastMinuteMoments | #U21EURO | @Hublot pic.twitter.com/YJNCJBJyV5 — #U21EURO (@UEFAUnder21) July 8, 2023 England's crowning moment 🏆🎉#U21EURO pic.twitter.com/DnsTcDdihc — #U21EURO (@UEFAUnder21) July 8, 2023 చదవండి: #BjornBorg: 18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం IND vs AFG: టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్.. ఆ సిరీస్‌కు ముహూర్తం ఖరారు! -
ఆసియా కప్ విజేతగా భారత్.. ఎనిమిదోసారి టైటిల్ కైవసం
ఏషియన్ కబడ్డీ చాంపియన్‌షిప్ 2023 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. దక్షిణకొరియాలోని బుసాన్ వేదికగా శుక్రవారం ఇరాన్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 42-32 తేడాతో ఓడించింది. కాగా భారత్‌కు ఆసియా కప్ టైటిల్ నెగ్గడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. జూన్ 27న ప్రారంభమైన టోర్నీలో మూడురోజుల పాటు ఆరు మ్యాచ్‌లు జరిగాయి. టాప్-2లో నిలచిన భారత్, ఇరాన్‌లు ఫైనల్లో పోటీపడ్డాయి. భారత కెప్టెన్ పవన్ షెహ్రావత్ 10 పాయింట్లతో సత్తాచాటాడు. ఇక, ఈ మ్యాచ్ తొలి ఐదు నిమిషాల వెనుకబడిన టీమిండియా ఆ తర్వాత సత్తాచాటింది. 10వ నిమిషంలో పవన్, ఇనాందార్ సక్సెస్ఫుల్ రైడ్లతో మ్యాచ్ భారత్ వైపునకు తిరిగింది. అప్పటి నుంటి టీమిండియా చెలరేగింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి భారత్ 23-11తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఆ తర్వాత పోరు హోరాహోరీగా సాగింది. ఓ దశలో పాయింట్లు 38-31కు చేరాయి. అయితే, మళ్లీ భారత్ పుంజుకుంది. 42-32 తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకొని.. ఆసియన్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకుంది. ఇక భారత కబడ్డీ జట్టుకు తదుపరి ఆసియా గేమ్స్ కీలకంగా ఉంది. సెప్టెంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్జవూ వేదికగా ఆసియా గేమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్ జరగనుంది. చదవండి: #MajidAli: రంపం మెషిన్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డ స్టార్ స్నూకర్ -
జొకోవిచ్‌దే ఫ్రెంచ్ ఓపెన్.. ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మెన్స్ సింగిల్స్ విజేతగా సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో కాస్పర్ రూడ్‌పై 7-6 6-3 7-5 తేడాతో విజయం సాధించాడు. జొకోవిచ్ ఖాతాలో ఇది మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కాగా.. ఓవరాల్‌గా 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఓపెన్ శకంలో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన తొలి ఆటగాడిగా జొకోవిచ్ చరిత్రకెక్కాడు. 🏆 Forever raising the bar 🏆@DjokerNole masters Casper Ruud 7-6(1), 6-3, 7-5 to win a third Roland-Garros title and an unprecedented 23rd Grand Slam men’s singles title.⁰#RolandGarros pic.twitter.com/9IfTi39alB— Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time 21:50: మూడోసెట్లో హోరాహోరీ మూడోసెట్లో జొకోవిచ్, కాస్పర్ రూడ్ల్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటివరకు 5-5తో సమానంగా ఉండడంతో సెట్ టైబ్రేక్‌కు దారితీసే అవకాశం ఉంది. Time: 20:50: రెండో సెట్లో గెలుపు జొకోవిచ్‌దే తొలిసెట్‌ను గెలుచుకోవడానికి కష్టపడిన జొకోవిచ్‌కు రెండో సెట్లో మాత్రం పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వలేదు. 6-3తో రెండో సెట్‌ను గెలుచుకున్న జొకోవిచ్ కేవలం 45 నిమిషాల్లోనే కాస్పర్ రూడ్‌ను ఓడించి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. మరికొద్ది సేపట్లో నిర్ణయాత్మక మూడోసెట్ జరగనుంది. Too strong. @DjokerNole takes the 2nd. #RolandGarros pic.twitter.com/uv2pb44Esh — Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time: 20:45.. రెండో సెట్లో దూకుడు మీదున్న జొకోవిచ్ తొలిసెట్‌ను సొంతం చేసుకున్న జొకోవిచ్ రెండో సెట్లోనూ దూకుడు కనబరుస్తున్నాడు. తొలిసెట్లో పోటీ ఇచ్చిన రూడ్ ఒక్కసారి మాత్రమే జొకోవిచ్ సర్వీస్ బ్రేక్ చేయగలిగాడు. అదే సమయంలో జొకోవిచ్ మాత్రం నాలుగుసార్లు రూడ్ సర్వీస్ బ్రేక్ చేయగలిగాడు. ప్రస్తుతం జొకోవిచ్ 5-2తో రెండోసెట్లో ఆధిక్యంలో ఉన్నాడు. Time:20:06.. తొలి సెట్ సొంతం చేసుకున్న జొకోవిచ్ ఇక హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను జొకోవిచ్ సొంతం చేసుకున్నాడు. తొలి సెట్లో ఇద్దరు పోటాపోటీగా తలపడ్డారు. జొకో సర్వీస్‌లను బ్రేక్ చేస్తూ ఒక దశలో కాస్పర్ రూడ్ 3-0తో ఆధిక్యంలో కనిపించాడు. అయితే జొకోవిచ్ మళ్లీ ఫుంజుకొని రూడ్ సర్వీస్ బ్రేక్ చేసి మూడు పాయింట్లు సాధించాడు. దీంతో 6-6తో తొలి సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. ఇక కీలక టైబ్రేక్‌లో జొకోవిచ్ తన జోరు చూపించి విన్నర్స్ సంధించి 7-6(7-1)తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. Here, there, everywhere 🏃♂️#RolandGarros pic.twitter.com/VuWtw0fCN2 — Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time: 18:30.. ప్రారంభమైన ఫైనల్ పోరు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా జొకోవిచ్, కాస్పర్ రూడ్ మధ్య జరుగుతున్న పురుషుల సింగిల్స్ ఫైనల్ హోరాహోరీగా మొదలైంది. 23వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న పట్టుదలతో జొకోవిచ్ ఒకవైపు ఉంటే.. జొకో జోరుకు అడ్డుకట్ట వేయాలనే యోచనతో కాస్పర్ రూడ్ ఉన్నాడు. -
అదే జరిగితే CSK గెలిచేదే కాదు..!
-
శుభమన్ గిల్, రవీంద్ర జడేజా వద్దు ఇంగ్లాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!
-
మోహిత్ కి పాండ్య పాఠాలు చెప్పడం ఏంటి ..!
-
మహి అన్న కోసం ఏదైనా చేస్తా టచ్ చేస్తున్న జడేజా మాటలు..!
-
CSK అభిమానులకు జడేజా భార్య ట్రీట్ ..!
-
ఆటోగ్రాఫ్ ఇవ్వని ధోని బతిమాలుకున్న చాహర్..!
-
గెలిచిన CSK.. పండగ చేసుకుంటున్న పాకిస్థాన్ ఫాన్స్ ..!
-
ఫైనల్ లో జడేజా బాటింగ్ పై సురేష్ రైనా కామెంట్స్
-
ఒక్క ఆటోగ్రాఫ్ కోసం బతిమాలించుకున్నాడు!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సీఎస్కే ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జడేజా ఆఖర్లో వచ్చి సిక్స్, ఫోర్‌తో సీఎస్కేకు విజయాన్ని అందించాడు. కాగా సీఎస్కే ఐపీఎల్ టైటిల్ గెలవడం ఇది ఐదోసారి. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జాబితాలో ముంబై ఇండియన్స్‌తో కలిసి సీఎస్కే సమంగా నిలిచింది. ఈ విషయం పక్కనబెడితే.. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని, దీపక్ చహర్ల మధ్య జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీపక్ చహర్ తన షర్ట్‌పై ఆటోగ్రాఫ్ అడిగితే తొలుత ఇవ్వడానికి ధోని నిరాకరించడం వైరల్‌గా మారింది. అయితే చహర్ ధోనిని బతిమిలాడడంతో చివరకు షర్ట్‌పై తన సంతకం చేశాడు. అయితే ఇదంతా సరదా కోసం మాత్రమే. ఎందుకంటే చహర్ అడిగినప్పుడు స్పందించని ధోని.. మళ్లీ చిరునవ్వుతో అతని జెర్సీపై సంతకం చేయడం.. ఆ తర్వాత స్వయంగా ధోనినే చహర్‌ను హగ్ చేసుకోవడం కనిపించింది. ఈ ఇద్దరి మధ్య ఎంత మంచి రిలేషన్షిప్ ఉందనేది దీన్నబట్టే అర్థమవుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ క్యాచ్‌ను దీపక్ చహర్ మిస్ చేసిన సంగతి తెలిసిందే. మూడు పరుగుల వద్ద లభించిన లైఫ్‌తో గిల్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా చహర్ క్యాచ్ మిస్ చేయడంతోనే ధోని అతనికి ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించాడని అభిమానులు కామెంట్ చేశారు. MS Dhoni when Deepak Chahar came for Autograph. Their bond is so cute.#ChennaiSuperKings #MSDhoni𓃵 #csk pic.twitter.com/3ggKY2mAFM — MS Dhoni Fan (@dhonizero7) May 30, 2023 చదవండి: డానిల్ మెద్వెదెవ్కు షాక్.. ఐదోసారి కలిసి రాని 'ఫ్రెంచ్' -
వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్
సాక్షి, ముంబై: ఐపీఎల్ 2023లో చెన్నై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసుకున్నసంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 5 వికెట్ల తేడాతో విజయం . ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో జడేజా (6 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 15 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) ముఖ్యంగా చివరి 2 బంతులకు 10 పరుగులు చేయాల్సిన ఉండగా, చెలరేగిన జడేజా వరుసగా 6, 4 కొట్టి జట్టుకు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. జడ్డూ బాయ్ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావోద్వేగానికి గురవడమే కాదు..ఎన్నడూ లేని విధంగా మ్యాచ్‌ను గెలిపించిన జడేజాను ఎత్తుకొని సంబరాలు చేసుకున్నాడు మిస్టర్ కూల్. (ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు) దీనికితోడు భర్త ప్రతిభకు ముగ్ధురాలైన జడేజా భార్య భర్త కాళ్లకు దణ్నం పెట్టి, గట్టిగా కౌగిలించుకుని మరీ మురిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Long live true love and patriarchy #IPLFinals #RavindraJadeja #Rajputboy pic.twitter.com/KXuY3kywGv — History Of Rajputana (@KshatriyaItihas) May 29, 2023 దీనిపై ఏఐ ఆర్టిస్ట్ సాహిద్ కూడా సెలబ్రేట్ చేశారు. ఇటీవలి కాలంలో అనేకమంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు, క్రీడాకారుల ఫోటోలను ఆకర్షణీయంగా మల్చిన సాహిద్ ఇపుడు జడేజాను ఎంచుకోవడం విశేషం. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ వారెవ్వా జడేజా అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
550 పరుగుల మార్క్ దాటాడు.. ఎవరికి సాధ్యం కాని చెత్త రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో చెత్త గణాంకాలను నమోదు చేశాడు. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు బౌలింగ్ వేసిన తుషార్ దేశ్‌పాండే 56 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పాండే బౌలింగ్‌ను సాయి సుదర్శన్, సాహాలు చీల్చి చెండాడారు. తుషార్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో సాయి సుదర్శన్ ఒక సిక్స్, మూడు ఫోర్లు సహా 20 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలోనే తుషార్ దేశ్‌పాండే చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో వికెట్ లేకుండా అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా ఫెర్గూసన్‌తో కలిసి దేశ్‌పాండే నిలిచాడు. తొలి స్థానంలో షేన్ వాట్సన్-ఆర్సీబీ.. 4 ఓవర్లలో 61/0 (2016 ఫైనల్లో ఎస్ఆర్హెచ్తో), రెండో స్థానంలో లోకీ ఫెర్గూసన్ కేకేఆర్.. 4 ఓవర్లలో 56/0(2021 సీఎస్కేతో ఫైనల్లో) ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో చెత్త రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న అత్యంత చెత్త బౌలర్‌గా తుషార్ దేశ్‌పాండే రికార్డులకెక్కాడు. ఈ సీజన్లో తుషార్ దేశ్‌పాండే 9.92 ఎకానమీ రేటుతో 564 పరుగులు సమర్పించుకొని ఓవరాల్‌గా తొలి స్థానంలో నిలిచాడు. తుషార్ తర్వాత 2022 సీజన్లో ప్రసిద్ కృష్ణ 8.28 ఎకానమీతో 551 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. 2020 ఐపీఎల్ సీజన్లో కగిసో రబాడ 8.34 ఎకానమీతో 548 పరుగులు సమర్పించుకొని మూడో స్థానంలో, సిద్దార్థ్ కౌల్ 2018లో 8.28 ఎకానమీతో 547 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా.. ఐదోస్థానంలో డ్వేన్ బ్రావో 2018లో 9.96 ఎకానమీతో 533 పరుగులు సమర్పించుకున్నాడు. Most runs conceded by a bowler in an IPL season: 564 - Tushar Deshpande, 2023 (Eco 9.92) 551 - Prasidh Krishna, 2022 (8.28) 548 - Kagiso Rabada, 2020 (8.34) 547 - Siddarth Kaul, 2018 (8.28) 533 - Dwayne Bravo, 2018 (9.96)#GTvCSK #IPL2023Finals pic.twitter.com/wZTuTZlE3V — Bharath Seervi (@SeerviBharath) May 29, 2023 చదవండి: ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర -
ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ సీఎస్కేతో జరిగిన ఫైనల్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లోనే 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కేవలం నాలుగు పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నప్పటికి తన మెరుపులతో ఆకట్టుకున్నాడు. Photo: IPL Twitter అయితే సాయి సుదర్శన్ తన ఇన్నింగ్స్‌ను నిధానంగా ఆరంభించినప్పటికి అసలు సమయంలో తనలోని డేంజరస్ బ్యాటర్‌ను వెలికి తీశాడు. సాహా ఔటైన తర్వాత గేర్ మార్చిన సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండేకు చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో ఒక సిక్సర్ సహా మూడు ఫోర్లు కలిపి 20 పరుగులు పిండుకున్నాడు. 31 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన సాయి సుదర్శన్.. తర్వాతి 16 బంతుల్లోనే 46 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో సాయి సుదర్శన్ ఐపీఎల్లో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. Photo: IPL Twitter ► ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా సాయి సుదర్శన్ చరిత్రకెక్కాడు. ఇంతకముందు మనీష్ పాండే 2014 ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ తరపున పంజాబ్ కింగ్స్‌పై 94 పరుగులు చేశాడు. 2012 ఫైనల్లో సీఎస్కేపై కేకేఆర్ తరపున మన్విందర్ బిస్లా 89 పరుగులు చేశాడు. అయితే రజత్ పాటిదార్(ఆర్సీబీ తరపున 112 నాటౌట్ వర్సెస్ కేకేఆర్) సెంచరీ చేసినప్పటికి అది ఫైనల్ మ్యాచ్ కాదు.. ఎలిమినేటర్‌లో పాటిదార్ సెంచరీ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. అయితే ఫైనల్లో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఘనతను సాయి సుదర్శన్ దక్కించుకున్నాడు. Photo: IPL Twitter ► ఇక ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్‌గా సాయి సుదర్శన్ మూడో స్థానంలో నిలిచాడు. ఇంతకముందు షేన్ వాట్సన్ 117 పరుగులు నాటౌట్(2018లో ఎస్ఆర్హెచ్తో ఫైనల్లో) తొలి స్థానంలో, రెండో స్థానంలో సీఎస్కే తరపున వృద్ధిమాన్ సాహా 115 పరుగులు పంజాబ్ కింగ్స్ తరపున, 2014లో కేకేఆర్‌పై ఫైనల్లో, మురళీ విజయ్ 95 పరుగులు(సీఎస్కే), మనీష్ పాండే(94 పరుగులు, కేకేఆర్) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ► ఐపీఎల్ ఫైనల్లో 50 ప్లస్ స్కోరు చేసిన రెండో యంగెస్ట్ బ్యాటర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. ఇవాళ సీఎస్కేతో ఫైనల్లో (47 బంతుల్లో 96 పరుగులు) 21 ఏళ్ల 226 రోజుల వయసులో సుదర్శన్ ఈ ఫీట్ సాధించాడు. తొలి స్థానంలో మనన్ వోహ్రా 2014లో 20 ఏళ్ల 318 రోజుల వయసులో; శుబ్‌మన్ గిల్ 22 ఏళ్ల 37 రోజుల వయసులో(2021లో సీఎస్కేతో జరిగిన ఫైనల్లో కేకేఆర్ తరపున) మూడో స్థానంలో, రిషబ్ పంత్ 23 ఏళ్ల 37 రోజుల వయసులో(2020లో ముంబై ఇండియన్స్‌తో ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున) నాలుగో స్థానంలో ఉన్నాడు. Sai Sudharsan masterclass in the IPL 2023 Final. pic.twitter.com/SiRywPhOqz — Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2023 చదవండి: శుబ్‌మన్ గిల్ చరిత్ర.. టీమిండియా తరపున రెండో బ్యాటర్‌గా -
శుబ్‌మన్ గిల్ చరిత్ర.. టీమిండియా తరపున రెండో బ్యాటర్‌గా
ఐపీఎల్ 16వ సీజన్ శుబ్‌మన్ గిల్‌కు ఎప్పటికి గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. గుజరాత్ టైటాన్స్ రెండోసారి టైటిల్ కొడుతుందో లేదో తెలియదు కానీ గిల్‌కు మాత్రం కెరీర్లో బెస్ట్ టోర్నీగా మిగిలిపోతుంది. సోమవారం సీఎస్కేతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో సెంచరీ బాదుతాడని గుజరాత్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికి ధోని సూపర్ ఫాస్ట్ స్టంపింగ్‌కు 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో గిల్ ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది. ఈ క్రమంలో ఆరెంజ్ క్యాప్ అందుకోనున్ను శుబ్‌మన్ గిల్ ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు అందుకున్న రెండో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ సీజన్లో గిల్ 17 మ్యాచ్‌లు ఆడి 890 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు సహా నాలుగు అర్థశతకాలు ఉన్నాయి. ఇక ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కింగ్ కోహ్లి పేరిట ఉంది. 2016 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరపున కోహ్లి 973 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్లలోనూ కోహ్లి చేసిన పరుగులే అత్యుత్తమం. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా.. తొలి టీమిండియా బ్యాటర్‌గానూ కోహ్లి తొలి స్థానంలో ఉన్నాడు. కోహ్లి, గిల్ తర్వాత జాస్ బట్లర్ 863 పరుగులు(రాజస్తాన్ రాయల్స్, 2022), డేవిడ్ వార్నర్ 848 పరుగులు(ఎస్ఆర్హెచ్, 2016), కేన్ విలియమ్సన్ 735 పరుగులు(ఎస్ఆర్హెచ్, 2018) వరుసగా ఉన్నారు. ఇక ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక బౌండరీలు బాదిన జాబితాలోనూ గిల్ చోట సంపాదించాడు. ఐపీఎల్ 16వ సీజన్లో గిల్ గుజరాత్ టైటాన్స్ తరపున 118 బౌండరీలు బాదాడు. ఓవరాల్ జాబితాలో గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక జాస్ బట్లర్ 128 బౌండరీలతో(రాజస్తాన్ రాయల్స్, 2022లో) తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి 122 బౌండరీలు(ఆర్సీబీ, 2016లో), డేవిడ్ వార్నర్ 119 బౌండరీలు(ఎస్ఆర్హెచ్, 2016లో) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. Brief but looking dangerous - Shubman Gill was in the mood tonight.#TATAIPL #CSKvGT #IPLonJioCinema #IPLFinal pic.twitter.com/B1IeAqAHCL— JioCinema (@JioCinema) May 29, 2023 చదవండి: సూపర్‌ఫాస్ట్ స్టంపింగ్; చహర్ వదిలినా ధోని వదల్లేదు -
సూపర్‌ఫాస్ట్ స్టంపింగ్; చహర్ వదిలినా ధోని వదల్లేదు
సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తన కీపింగ్ టైమింగ్ ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో గిల్‌ను ధోని స్టంపౌట్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ జడేజా వేశాడు. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలో గిల్ మూడు పరుగుల వద్ద ఉన్నప్పుడు దీపక్ చహర్ క్యాచ్ వదిలేశాడు. దీంతో ఒక లైఫ్ లభించడంతో 39 పరుగులతో గిల్ ధాటిగా ఆడుతున్నాడు. జడ్డూ వేసిన ఆఖరి బంతిని షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. మాములుగానే అలర్ట్‌గా ఉండే ధోని ఈసారి మరింత వేగంగాగా స్పందించాడు. అలా గిల్ క్రీజు దాటాడో లేదో.. ఇలా ధోని బంతిని అందుకొని టక్కున స్టంప్స్ ఎగురగొట్టాడు. అలా చహర్ క్యాచ్ వదిలేసి గిల్‌కు లైఫ్ ఇచ్చినా ధోని తన స్మార్ట్ స్టంపింగ్‌తో పెవిలియన్ పంపించాడు. Photo: IPL Twitter అయితే ధోని స్టంపౌట్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పటికి.. గిల్ మాత్రం డీఆర్ఎస్ కోరాడు. అయితే రివ్యూలో గిల్‌కు నిరాశే మిగిలింది. జడ్డూ బంతి వేయడమే ఆలస్యం.. గిల్ మిస్ చేసి ఫ్రంట్‌ఫుట్ దాటడం.. బంతి అందుకున్న ధోని గిల్ వెనక్కి వచ్చే లోపే సూపర్‌ఫాస్ట్‌గా బెయిల్స్ ఎగురగొట్టడం కనిపించింది. అంతే గిల్ ఔట్ అని బిగ్స్క్రీన్పై కనిపించింది. Still the world's best 'keeper'#EnoughSaid pic.twitter.com/zhgMJEcFUj — JioCinema (@JioCinema) May 29, 2023 MS Dhoni - still the fastest hand behind the stumps. pic.twitter.com/57xOM77nEh — Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2023 Treatment effect 😭 pic.twitter.com/oVDj2RYN7h — Mohammad Junaid (@MDJunaid4377067) May 29, 2023 చదవండి: 'మాకంటే ఎక్కువగా బాధపడ్డారు.. ఇవాళ ఎంటర్టైన్ చేస్తాం' -
'మాకంటే ఎక్కువగా బాధపడ్డారు.. ఎంటర్టైన్ చేసి తీరుతాం'
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ మొదలైంది. వాస్తవానికి ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారానికి వాయిదా పడింది. అయితే ఇవాళ కూడా మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానం కలిగింది. కానీ వర్షం లేకపోవడంతో టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. కాగా టాస్ అనంతరం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''వర్షం పడే సూచనలు ఉండడంతో ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక క్రికెటర్‌గా మంచి ఆట ఆడాలని అనుకుంటాం. నిన్న(ఆదివారం) జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌ల భాగంగా మేం మొత్తం డ్రెస్సింగ్ రూంకే పరిమితమయ్యాం. అయితే మాకంటే ఎక్కువగా బాధపడింది అభిమానులు. నిన్నటి మ్యాచ్ కోసం రాత్రంతా ఎదురుచూసి నిరాశగా వెనుదిరిగారు. అయితే ఇవాళ వాళ్లకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కలుగుతుందని చిన్న నమ్మకం. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంటే ఐదు ఓవర్లు మ్యాచ్ ఆడే అవకాశాలుంటాయనుకున్నాం. కానీ దేవుడి దయవల్ల ఇవాళ 20 ఓవర్ల కోటా గేమ్ జరిగేలా ఉంది. అలా జరిగితేనే టోర్నీకి సరైన ముగింపు ఉంటుంది. ఇక క్వాలిఫయర్-1 ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం.'' అంటూ తెలిపాడు. 🚨 Toss Update 🚨 Chennai Super Kings win the toss and elect to field first against Gujarat Titans. Follow the match ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/HYMcLKhfKy — IndianPremierLeague (@IPL) May 29, 2023 చదవండి: IPL 2023 Final: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సీఎస్కే అప్డేట్స్ వర్కింగ్ డే రోజున ఐపీఎల్ ఫైనల్.. ఉద్యోగుల సిక్‌లీవ్స్ కష్టాలు! -
IPL 2023 Final: గెలిపించిన జడేజా.. ఐపీఎల్16వ సీజన్ విజేత సీఎస్కే
ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా సీఎస్కే నిలిచింది. వర్షం కారణంగా 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని విధించగా.. సీఎస్కే నిర్ణీత 15 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన దశలో జడేజా ఆఖరి రెండు బంతుల్లో సిక్సర్, ఫోర్ కొట్టి సీఎస్కేను గెలిపించాడు. అంతకముందు ఓపెనర్లు రుతురాజ్ 26, డెవాన్ కాన్వే 47 పరుగులతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత శివమ్ దూబే 32 నాటౌట్, రహానే 27 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివర్లో జడేజా ఆరు బంతుల్లో 16 పరుగులు నాటౌట్ తన విలువేంటో మరోసారి చాటిచెబుతూ సీఎస్కేను ఐదోసారి చాంపియన్‌గా నిలిపాడు. ఈ విజయంతో ఐదోసారి టైటిల్ అందుకున్నసీఎస్కే ముంబై ఇండియన్స్‌తో కలిసి సమంగా నిలిచింది. ధోని గోల్డెన్ డక్.. ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్కే గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో సీఎస్కే 150 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే 25, జడేజా రెండు పరుగులతో ఆడుతున్నారు. 12 ఓవర్లలో సీఎస్కే 133/3 12 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే మూడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. శివమ్ దూబే 25, అంబటి రాయుడు 9 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 171.. వంద పరుగులు దాటిన సీఎస్కే 171 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే వంద పరుగుల మార్క్‌ను దాటింది. 10 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అజింక్యా రహానే 26, శివమ్ దూబే 8 పరుగులతో ఆడుతున్నారు. నూర్ అహ్మద్ దెబ్బ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు ధాటిగా ఆడుతున్న సీఎస్కేను నూర్ అహ్మద్ దెబ్బ తీశాడు. ఓపెనర్లు రుతురాజ్, కాన్వే రూపంలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. సీఎస్కే విజయానికి 48 బంతుల్లో 93 పరుగులు కావాలి. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. రుతురాజ్ ఔట్ 26 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. 6 ఓవర్లలో సీఎస్కే 72/0 ఆరు ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. కాన్వే 22 బంతుల్లో 44 పరుగులతో వేగంగా ఆడుతుండగా.. రుతురాజ్ 25 పరుగులతో సహకరిస్తున్నాడు. దంచుతున్న రుతురాజ్, కాన్వే.. 4 ఓవర్లో సీఎస్కే 52/0 171 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. రుతురాజ్ 23, కాన్వే 29 పరుగులతో ధాటిగా ఆడుతున్నారు. టార్గెట్ 171.. 2 ఓవర్లలో సీఎస్కే 24/0 2 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 11, డెవాన్ కాన్వే 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సీఎస్కే టార్గెట్ 15 ఓవర్లలో 171 గంటన్నర పాటు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు టార్గెట్‌ను కుదించారు. 15 ఓవర్లలో సీఎస్కే టార్గెట్ 171 పరుగులుగా నిర్ధేశించారు. వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. టార్గెట్ 215.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం గుజరాత్ టైటాన్స్, సీఎస్కే మధ్య ఫైనల్మ్యాచ్కు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. సీఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభమైన తొలి ఓవర్లో నాలుగు బంతులు పడగానే వర్షం మొదలైంది. ప్రస్తుతం సీఎస్కే వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ మెరుపులు.. సీఎస్కే టార్గెట్ 215 సీఎస్కేతో జరుగుతున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. సాయి సుదర్శన్ (47 బంతుల్లో 96 పరుగులు, 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు) నాలుగు పరుగలతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికి మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ సాహా 54 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. గిల్ 39, పాండ్యా 21 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో పతీరానా రెండు వికెట్లు తీయగా.. జడేజా, దీపక్ చహర్‌లు చెరొక వికెట్ తీశారు. 18 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 182/2 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 79, పాండ్యా 8 పరుగుతో క్రీజులో ఉన్నారు. సాయి సుదర్శన్ ఫిఫ్టీ.. గుజరాత్ 16 ఓవర్లలో 153/2 సీఎస్కేతో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు దిశగా సాగుతుంది. సాయి సుదర్శన్ 32 బంతుల్లో ఫిఫ్టీ సాధించడంతో గుజరాత్ 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 57, పాండ్యా ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. సాహా(54)ఔట్ 54 పరుగులు చేసిన సాహా దీపక్ చహర్ బౌలింగ్‌లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ 131 పరుగులు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సాయి సుదర్శన్ 36, పాండ్యా క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 109/1 12 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. సాహా 48, సాయి సుదర్శన్ 20 పరుగులతో ఆడుతున్నారు. ధోని సూపర్ స్టంపింగ్.. గిల్(39) ఔట్ సీఎస్కేతో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ధోని సూపర్‌ఫాస్ట్ స్టంపింగ్‌కు గిల్ వెనుదిరగాల్సి వచ్చింది. 39 పరుగులు చేసిన గిల్ జడ్డూ బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో ముందుకు వచ్చాడు. అంతే ధోని సూపర్‌ఫాస్ట్‌గా బంతిని అందుకొని వికెట్లను గిరాటేయడంతో గిల్ స్టంపౌట్ అయ్యాడు. ప్రస్తుతం గుజరాత్ వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. 3 ఓవర్లలో గుజరాత్ స్కోరు 24/0 మూడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. సాహా 20, గిల్ 4 పరుగులుతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు మ్యాచ్‌కు వర్షం ముప్పు అంతలా కనిపించడం లేదు. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ 🚨 Toss Update 🚨 Chennai Super Kings win the toss and elect to field first against Gujarat Titans. Follow the match ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/HYMcLKhfKy — IndianPremierLeague (@IPL) May 29, 2023 ఇరుజట్లు ఇప్పటివరకు నాలుగుసార్లు తలపడగా.. గుజరాత్ టైటాన్స్ మూడుసార్లు.. సీఎస్కే ఒకసారి విజయం సాధించాయి. ఇక ఫైనల్లో సీఎస్కే గెలిచి ఐదోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందా లేక గుజరాత్ టైటాన్స్ రెండోసారి విజేతగా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. -
వర్కింగ్ డే రోజున ఐపీఎల్ ఫైనల్.. ఉద్యోగుల సిక్‌లీవ్స్ కష్టాలు!
ఐపీఎల్ 16వ సీజన్‌కు ఆదివారంతోనే(మే 28న) శుభం కార్డు పడాల్సింది. కానీ వర్షం కారణంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన సోమవారానికి(మే 29) వాయిదా పడింది. మ్యాచ్‌కు ఈరోజు కూడా వర్షం ముప్పు ఉన్నప్పటికి అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ విషయం సంతోషం కలిగించేదే అయినా.. సోమవారం వర్కింగ్ డే కావడంతో ఉద్యోగం చేసే కొంతమంది క్రికెట్ ప్రేమికులు మాత్రం తమ బాస్‌కు ఏం కారణం చెప్పి తొందరగా ఆఫీస్ నుంచి బయటపడాలా అని ఆలోచిస్తున్నారు. సోమవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండడంతో ఆలోగా ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే నైట్‌షిఫ్ట్ సహా లేట్‌నైట్ వర్క్ చేసేవాళ్లు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు సిక్‌లీవ్స్ కోసం అప్లై చేసుకుంటున్నారు. ఇక జియో సినిమా కూడా ఐపీఎల్ ఫైనల్ విషయమై ఒక ఫన్నీ మీమ్‌ను షేర్ చేసింది. హెచ్ఆర్ ఉద్యోగి ముందు కుప్పలుతెప్పలుగా సిక్ లీవ్ లెటర్స్ ఉండడం.. ఆమె దానిపై సంతకాలు చేస్తుండడం కనిపించింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వాస్తవానికి మరి ఇంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ.. ఐపీఎల్ ఫైనల్ కావడంతో సాయంత్రం పనిచేసే ఆఫీసుల్లో మాత్రం ఉద్యోగుల నుంచి ఇలాంటి కారణాలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎప్పటిలాగే ఫుల్ ఎంజాయ్ చేసి సోమవారం కాస్త లేట్ అయినా ఆఫీస్‌కు వెళ్లేవారు. స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడలేనివాళ్లు ఫైనల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలని తమ ప్రణాళికలు రచించుకున్నారు. కొందరు పబ్‌లు, బార్లకు వెళ్లి మందు తాగుతూ మ్యాచ్ చూస్తూ చిల్ అవుదామనుకున్నారు. ఇంకొందరు ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఐపీఎల్ ఫైనల్ చూస్తూ ఆనందంగా గడిపేయాలనుకున్నారు. కానీ వరుణుడు వారి ఆశలకు గండికొట్టాడు. దీంతో సోమవారానికి మ్యాచ్ వాయిదా పడింది. కానీ సోమవారం వారంలో మొదటి పని దినం కావడం.. రోజంతా మీటింగ్స్ ఉంటాయన్న కారణంతో ఎక్కడ మ్యాచ్ మిస్ అవుతామేమోనన్న భయం సగటు క్రికెట్ అభిమానికి ఉంటుంది కదా..! Office HR depts across the country dealing with sick leave requests today...#IPLFinal #IPLonJioCinema pic.twitter.com/A0mmlS14xH — JioCinema (@JioCinema) May 29, 2023 ✌🏽No sick leaves, show this to your manager to wind up your work by 6:30 PM today! 🙏🏽#IPLonJioCinema #IPLFinal #GTvCSK #Dhoni pic.twitter.com/Pfzz3XMI60 — JioCinema (@JioCinema) May 29, 2023 చదవండి: పన్నెండులో తొమ్మిదిసార్లు.. క్వాలిఫయర్-1 విజేత #GTvsCSK: ఫైనల్ మ్యాచ్ వాయిదా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి -
IPL 2023 Final: విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్,వైరల్ ట్వీట్
సాక్షి, ముంబై: ప్రస్తుతం ఎక్కడ ఐపీఎల్ 2023 ఫైనల్ చర్చ నడుస్తోంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తుదిపోరు ఆదివారం వాయిదా పడటంతో ఈ ఫీవర్మరింత పెరిగింది. అయితే పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా ఐపీఎల్ విన్నర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ అఫైర్స్ నుండి జోక్స్ వరకు తన అభిప్రాయాలను నిక్కచ్చిగా ప్రకటించే మహీంద్రా ఆదివారం(మే 28) నాటి ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆశ్చర్యకర కమెంట్స్ చేశారు. (వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు) గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, క్రికెట్ ఐకాన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య కీలకమైన ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏ జట్టుకు మద్దతు అని అడిగారు సరే, శుబ్‌మన్ గిల్ ప్రతిభను నమ్ముతున్నాను. అతను మరింత రాణించాలను కుంటున్నా. కానీ తాను మాత్రం ఎంఎస్ ధోనీకి ఫ్యాన్నే అంటూ.. ఈ ఫైనల్ పోరులో కప్పు అతనిదే అన్నట్టు కమెంట్ చేశారు. చివరికి అత్యుత్తమ జట్టును గెలిపిద్దా అంటూ ట్వీట్‌చేశారు. ఈ ట్వీట్ ఇప్పటిదాకా 237.5 వేల లైక్స్‌ను సాధించింది. 2021లో ఆస్ట్రేలియాపై తన అద్భుతమైన ప్రదర్శనకు ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా మహీంద్రా థార్ ఎస్‌యూవీని శుభ్‌మాన్ గిల్‌కు బహుమతిగా ఇచ్చారు. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు!) డోంట్ మిస్ టు క్లిక్ హియర్: సాక్షిబిజినెస్ కాగా వర్షం కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2023 టైటిల్ పోరులో, గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా రిజర్వ్ డే సోమవారం జరగనున్న మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రాజేస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్లో 60.79 సగటుతో శుభ్‌మన్ గిల్ పరుగులు చేసిన ఆటగాడు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను మొత్తం 851 పరుగులు చేశాడు. శుభ్‌మాన్ గిల్ సిక్సర్ మోత మోగించి సూపర్ ఫెర్ఫామెన్స్తో విరాట్ కోహ్లీ, ఎం ధోని, యువరాజ్ సింగ్ , సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు దక్కించుకున్నాడు. (3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!) I was asked which team I’m supporting in tonight’s #IPL2023Final Well, I’m a believer in Shubhman’s talents & would like to see them flower tonight BUT I’m a bigger fan of #MSDhoni & can’t help but hope for him to blaze a trail of glory tonight. 😊So let the best team win…! — anand mahindra (@anandmahindra) May 28, 2023 -
సీఎస్కే, జీటీ తుది పోరు.. వర్షంలో అభిమానులు ఇలా..!(ఫొటోలు)
-
#GTvsCSK: ఫైనల్ మ్యాచ్ వాయిదా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం(మే 28న) ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిపోవాలి. కానీ వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్‌డేకు వాయిదా పడింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మధ్యాహ్నం నుంచి ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కనీసం టాస్ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. రాత్రి 11 దాటినా వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక ఫైనల్ మ్యాచ్ వాయిదా పడడం ఇదే తొలిసారి. వర్షం కారణంగా పలు సీజన్లలో మ్యాచ్‌లు రద్దు కావడం లేదా ఓవర్లు కుదించి ఆడడం జరిగింది. కానీ గత 15 సీజన్లలో ఏ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడింది లేదు.. రిజర్వ్ డేకు వాయిదా పడింది లేదు. ఇక ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. ఫైనల్మ్యాచ్ చూద్దామని వచ్చిన అభిమానులకు వరుణుడి కారణంగా తీవ్ర నిరాశే మిగిలింది. రాత్రి 9 గంటల తర్వాత అభిమానులు ఒక్కొక్కరిగా స్టేడియం నుంచి వెళ్లిపోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May - 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad. Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD — IndianPremierLeague (@IPL) May 28, 2023 Fans leave the Narendra Modi Stadium. A sad end to what could have been an amazing Sunday. #IPLFinals to be played tomorrow it seems. #Ahmedabad #IPL2023Final #CskvsGttickets #MSDhoni𓃵 #rain pic.twitter.com/vGlfVQzBb9 — 7 & 18 & 45 (@Tamil_paiyan_01) May 28, 2023 చదవండి: #IPL2023Final: డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారిపై మహిళ దౌర్జన్యం -
#IPL2023Final: డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారిపై మహిళ దౌర్జన్యం
ఐపీఎల్ 2023 ఫైనల్ ఆదివారం సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరగాల్సి ఉన్నప్పటికి వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందా అన్న అనుమానం కూడా కలుగుతుంది. సోమవారం మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉన్నప్పటికి వర్షం పడే అవకాశం 60శాతం ఉన్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ విషయం పక్కనబెడితే.. స్టేడియంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై ఒక మహిళా అభిమాని దౌర్జన్యం చేసింది. ఏదో విషయమై ఇద్దరి మధ్య వాదన జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు మహిళ పోలీసు అధికారిపై చేయి చేసుకుంది. ఆ తర్వాత అతన్ని కింద పడేసి ఇష్టం వచ్చినట్లుగా తన్నింది. అయితే ఆ అధికారి మాత్రం ఆమెను ఏమనకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా మరోసారి మహిళ తన కాలితో అతన్ని తన్నడం అక్కడి కెమెరాలకు చిక్కింది. పక్కనే ఉన్నవాళ్లు గొడవను చూస్తూ ఆనందిస్తున్నారే తప్ప ఒక్కరు కూడా అడ్డుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. This woman slapped and hit this male officer like anything and the helpless guy couldn't do anything. Is this woman empowerment? Worst Fanbase Ever 🤮🤮@ChennaiIPL #CSKvGT #GTvCSK #Rain #Ahmedabad pic.twitter.com/lH8N0bsSL5 — Harshit 🇮🇳 (@Imharshit_45) May 28, 2023 చదవండి: దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే పడాలా! -
దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే పడాలా!
కరోనాతో రెండేళ్ల పాటు ఐపీఎల్ చాలా చప్పగా సాగింది. స్టేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో ఆటగాళ్లు కూడా కాస్త బోర్ ఫీలయ్యారు. అయితే ఐపీఎల్ 16వ సీజన్ ఆ సీన్‌ను మొత్తం రివర్స్ చేసేసింది. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన సీజన్‌గా ఐపీఎల్ 2023 చరిత్రకెక్కనుంది. కారణం దాదాపు అన్ని మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగడం.. స్టేడియాల్లోకి పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించడం.. ధోని లాంటి ఆటగాళ్ల కోసం ఈ సీజన్‌ను టీవీల్లోనూ చాలా మంది ఎంజాయ్ చేయడం కనిపించింది. అలా దాదాపు రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్‌కు నేటితో తెరపడనుంది. ఆదివారం(మే 28న) ఫైనల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. సీఎస్కే ఐదోసారి కప్పు కొడుతుందా లేక గుజరాత్ వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా అనేది పక్కనబెడితే మాకు మాత్రం ఫుల్ కిక్కు ఖాయం అని అభిమానులు భావించారు. కానీ అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు శనిలాగా తయారయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించాలని మధ్యాహ్నం నుంచే స్టేడియం ముందు ప్రేక్షకులు బారులు తీరారు. అదే సమయంలో వరుణుడు కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో టాస్ కూడా ఆలస్యం అయింది. మ్యాచ్ సమయం గంట దాటినా వర్షం జోరు మాత్రం తగ్గడం లేదు. పూర్తి మ్యాచ్ కాకపోయినా కనీసం ఐదు ఓవర్ల ఆట అయినా సాధ్యపడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉన్నప్పటికి సోమవారం కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మ్యాచ్ జరగకుండానే టైటిల్ విజేతను ప్రకటిస్తారేమోనని అభిమానులు బాధపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే లీగ్‌లో టాపర్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలుస్తుంది. అలా చూస్తే ఇది సీఎస్కేకు నష్టం మిగిల్చే అంశం. ధోనికి చివరి ఐపీఎల్ అని భావిస్తున్న వేళ వర్షం కారణంగా ఇలా జరిగితే మాత్రం సీఎస్కే అభిమానులకు మింగుడుపడని అంశమే. అయితే ఐపీఎల్ 16వ సీజన్లో ఏ మ్యాచ్‌కు అడ్డుపడని వరుణుడు ఫైనల్ మ్యాచ్‌కు ఇలా చేయడం ఏంటని అభిమానులు తెగ ఫీలవుతున్నారు. ఏదో కాసేపు పడి వర్షం ఆగిపోతుందనుకుంటే పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేని వర్షం ఇప్పుడే పడాలా.. అంటూ అభిమానులు కామెంట్ చేశారు. Narendra Modi Stadium leaks rainwater from one side of the stadium and crowd had to leave that area. #CSKvsGT #rain #IPL2023Final pic.twitter.com/0MlxDDxH4g— Silly Context (@sillycontext) May 28, 2023 Rain stoppedToss at 9:10#CSKvGT #IPLFinals #IPL2023Final #Ahmedabad #rain #MSDhoni #Ahmedabad pic.twitter.com/YEyDQef1hm— proper thought. (@ThoughtProper) May 28, 2023 -
IPL 2023 Final: వర్షం కారణంగా మ్యాచ్ సోమవారానికి వాయిదా
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఆదివారం సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా వర్షంతో కనీసం టాస్ వేయడానికి వీలు పడలేదు. మధ్యలో ఒక పది నిమిషాలు తెరిపినివ్వడంతో మ్యాచ్ జరుగుతుందని అభిమానులు సంతోషపడ్డారు. కానీ కాసేపటికే వరుణుడు మళ్లీ జోరందుకున్నాడు. అప్పటినుంచి రాత్రి 11 గంటలయినా ఎంతకు తగ్గకపోవడంతో మ్యాచ్ రిఫరీ సైమన్ డౌల్.. అంపైర్లతో చర్చించి మ్యాచ్‌ను సోమవారానికి(మే 29) వాయిదా వేస్తున్నట్లు తెలిపాడు. ఇక సోమవారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ జరగకుంటే తొలుత 5 ఓవర్లు మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. అదీ సాధ్యపడకపోతే సూపర్ ఓవర్ ద్వారా ఫలితం వచ్చేలా చేస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యపడకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి లీగ్ స్టేజీలో గ్రూప్ టాపర్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు. The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May - 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad. Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD — IndianPremierLeague (@IPL) May 28, 2023 వర్షం కారణంగా టాస్ ఆలస్యం ఐపీఎల్ 16వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం (మే 28న) అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది. ► ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు వేళైంది. విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ పోరులో ఢీ కొంటున్నాయి. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. దాంతో, పాండ్యా సేన రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా? లేదా సీఎస్కే ఐదోసారి కప్పును ఎగరేసుకుపోతుందా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. -
మే 28న తేలనున్న ఆసియాకప్ భవితవ్యం!
ఆసియా కప్ 2023 జరుగుతుందా లేదా అనే దానిపై మే 28న స్పష్టత రానుంది. అదే రోజు ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్‌కు ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC),అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు(BCB) ఆహ్వానాలు అందాయి. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే బీసీసీఐ.. ఆయా క్రికెట్ బోర్డులతో సమావేశం కానున్నట్లు ప్రధాన కార్యదర్శి.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ఒక ట్వీట్ చేశారు. ''మే 28న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్‌కు బీసీబీ, ACB, లంక క్రికెట్ బోర్డు అధ్యక్షులు హాజరు కానున్నారు. ఆసియా కప్ 2023 నిర్వహణకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను ఇక్కడే చర్చించనున్నాం'' అంటూ తెలిపారు. ఈ మీటింగ్‌లో ఆసియా కప్ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కాగా హైబ్రిడ్ మోడ్‌లో ఆసియా కప్‌ను నిర్వహించాలన్న పీసీబీ ప్రతిపాదనను కూడా మీటింగ్‌లో పరిశీలించనున్నారు. అయితే ఇంతకముందు ఆసియా కప్ పాక్‌లో జరిగితే తమ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ ఏసీసీని కోరింది. అందుకు ఏసీసీ అంగీకరించినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తొలుత ఒప్పుకోలేదు. అయితే అలా చేయకపోతే టీమిండియా ఆసియా కప్ ఆడదని.. అందువల్ల ఆయా బోర్డులకు తీవ్ర నష్టం చేకూరుతుందని అలా అయితే ఆసియా కప్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుందని ఏసీసీ.. పీసీబీకీ అర్థమయ్యేలా వివరించింది. దీంతో హైబ్రిడ్ మోడ్‌లో ఆసియా కప్ నిర్వహణకు తాము సిద్దమే అని ప్రతిపాదనలు పంపింది. పీసీబీ ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించినట్లు తెలిసింది. ఇక 2022లో టి20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్‌లో శ్రీలంక విజేతగా నిలిచింది. కాగా ఈసారి వన్డే వరల్డ్‌కప్ దృశ్యా ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక ఆసియా కప్‌ను అత్యధికంగా టీమిండియా ఏడుసార్లు గెలుచుకోగా.. శ్రీలంక ఆరుసార్లు, పాకిస్థాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. చదవండి: 'కింగ్' కోహ్లి రికార్డు.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడు -
టీమిండియా బౌలర్‌కు గాయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతాడా?
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ జైదేవ్ ఉనాద్కట్ గాయపడ్డాడు. సోమవారం ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ వేస్తుండగా స్లిప్ అయ్యాడు. దీంతో ఉనాద్కట్ ఎడమ భుజానికి గాయమైంది. ఆ తర్వాత ఆర్సీబీతో మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. రిపోర్డ్స్ వచ్చాకా కానీ ఉనాద్కట్ ఆడుతాడా లేదా అనేది తేలనుంది. అయితే ఐపీఎల్ కంటే మరొక విషయం కలవరపెడుతుంది. ఎందుకంటే ఐపీఎల్ ముగిసిన వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ వేదికగా జరగనుంది. ఇక జైదేవ్ ఉనాద్కట్ 15 మందితో కూడిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఉనాద్కట్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమైనప్పటికి మేజర్ మ్యాచ్ కావడం టీమిండియా ఆందోళనకు కారణం అని చెప్పొచ్చు. ఇప్పటికే బుమ్రా దూరం కాగా.. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో అజింక్యా రహానే తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఉనాద్కట్ గాయపడిన వీడియోనూ ఐపీఎల్ వెబ్సైట్ తన ట్విటర్లో షేర్ చేసింది. ''గాయపడిన ఉనాద్కట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది. భారత టెస్టు జట్టు WTC ఫైనల్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్. See you back on the field soon @JDUnadkat Wishing a quick recovery to the left-arm pacer 👍🏻👍🏻#TATAIPL | #LSGvRCB pic.twitter.com/w57d7DMadN — IndianPremierLeague (@IPL) May 1, 2023 చదవండి: టెన్నిస్ స్టార్ తల్లికి బెదిరింపులు.. తలకు తుపాకీ గురిపెట్టి -
IPL 2023: ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ తేదీలు ఖరారు
ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. కోవిడ్ కారణంగా ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో రెండేళ్ల పాటు కాస్త చప్పగా సాగిన ఐపీఎల్ ఈసారి మాత్రం దుమ్మురేపుతుంది. ప్రతీ మ్యాచ్ ఆసక్తిగా సాగడంతో పాటు స్టేడియాలన్ని ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. ఇక టీఆర్పీ రేటింగ్ అయితే మునుపెన్నడు లేని విధంగా రికార్డులు సృష్టిస్తోంది. మరో వారంలో లీగ్‌లో తొలి దశ మ్యాచ్‌లు ముగియనున్నాయి. అయితే 16వ సీజన్ ప్రారంభంలో కేవలం లీగ్ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే రిలీజ్ చేసిన బీసీసీఐ తాజాగా శుక్రవారం ప్లేఆఫ్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ తేదీలు, వేదికల వివరాలను వెల్లడించింది. ఐపీఎల్ 16వ సీజన్లో లీగ్ మ్యాచ్‌లు మే21తో ముగియనున్నాయి. అనంతరం మే 23న(మంగళవారం) తొలి క్వాలిఫయర్, మే 24న(బుధవారం) ఎలిమినేటర్ మ్యాచ్, మే 26న(శుక్రవారం) క్వాలిఫయర్-2 జరగనున్నాయి. ఇక మే 28న(ఆదివారం) ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా తొలి క్వాలిఫయర్‌తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుండగా.. క్వాలిఫయర్-2తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ట్విటర్లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. IPL 2023 ప్లే-ఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్: మే 23(మంగళవారం) - క్వాలిఫయర్-1 మ్యాచ్, వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై, సమయం రాత్రి 7:30 గంటలు మే 24(బుధవారం) - ఎలిమినేటర్ మ్యాచ్, వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై, సమయం రాత్రి 7:30 గంటలు మే 26(శుక్రవారం) - క్వాలిఫయర్-2 మ్యాచ్, వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, సమయం రాత్రి 7:30 గంటలు మే 28(ఆదివారం) - ఫైనల్ వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, సమయం రాత్రి 7:30 గంటలు -
WPL 2023 Final: తొలి టైటిల్ కొట్టేదెవరు?
ముంబై: ప్రతిష్టాత్మకంగా తొలి సారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చివరి ఘట్టానికి చేరింది. టోర్నీ మొదటి విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. నేడు డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. టోర్నీ ఆరంభంలో దూకుడు కనబర్చి దూసుకెళ్లిన ముంబై ఆ తర్వాత వెనుకబడటంతో ఫైనల్ చేరేందుకు ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది. ఢిల్లీ మాత్రం సరైన సమయంలో సత్తా చాటి వరుస విజయాలతో పాటు రన్‌రేట్‌ను పెంచుకొని అగ్రస్థానంతో తుది పోరుకు అర్హత సాధింది. ఢిల్లీ బ్యాటింగ్ భారం ఓపెనర్ లానింగ్‌తో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లపై ఉంది. ఆల్‌రౌండర్‌గా మరిజాన్ కప్ ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించింది. మరో వైపు హర్మన్‌ప్రీత్ ఫామ్‌లో లేకపోయినా నాట్ సివర్, హీలీ మాథ్యూస్ ముంబైకి భారీ స్కోరు అందించగలరు. అమేలియా కెర్ రూపంలో ధాటిగా ఆడే మరో బ్యాటర్ కూడా ఉంది. ప్రత్యర్థి కంటే బలమైన బౌలింగ్ లైనప్ ముంబై ఆశలను పెంచుతోంది. సైకా ఇషాక్ 15 వికెట్లతో ఫామ్‌లో ఉండగా, పేసర్ ఇసీ వాంగ్ పదునేమిటో ఎలిమినేటర్‌లో కనిపించింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఫైనల్ సమరం ఖాయం. -
సీసీఎల్ విజేత తెలుగు వారియర్స్
విశాఖ స్పోర్ట్స్: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) విజేతగా తెలుగు వారియర్స్ నిలిచింది. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో శనివారం రాత్రి భోజ్‌పురి దబాంగ్ జట్టుతో జరిగిన ఫైనల్లో పోటీలో తెలుగు వారియర్స్ జట్టు అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దబాంగ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను పది ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఆదిత్య 26, అస్గర్ 11 పరుగులు చేశారు. వారియర్ నందకిషోర్ రెండు వికెట్లు తీశాడు. ప్రతిగా బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓపెనర్ అఖిల్ 67 పరుగులతో రాణించాడు. తరువాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దబాంగ్ ఆరు వికెట్లకు 89 పరుగులు చేసింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన తెలుగు వారియర్స్ 6.1 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి విజయలక్ష్యాన్ని సాధించింది. అశ్విన్ 31 పరుగులు చేశాడు. స్పాన్సర్ల ద్వారా పాస్‌లతో అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. ఫైనల్స్‌లో తెలుగు వారియర్స్ ఆడుతుండడంతో తమ అభిమాన తారల ఆటను వీక్షించేందుకు తరలివచ్చారు. జట్టు మెంటర్ వెంకటేష్ అభిమానులను ఉత్సాహాపరిచాడు. రాష్ట్ర మంత్రి అమర్నాథ్ బాక్స్‌లో కూర్చొని మ్యాచ్‌ను వీక్షించారు. వారియర్స్ జట్టుతో కలిసి తొలి ఇన్నింగ్స్ ముగియగానే అభివాదం చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. -
నీతూ, స్వీటీ ‘పసిడి’ పంచ్ పోరు
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నేడు ఇద్దరు భారత బాక్సర్లు నీతూ (48 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) పసిడి పతకాల కోసం పోటీపడనున్నారు. నేటి ఫైనల్స్‌లో లుత్సయ్ఖాన్ (మంగోలియా)తో నీతూ... లీనా వాంగ్ (చైనా)తో స్వీటీ తలపడతారు. హరియాణాకు చెందిన 22 ఏళ్ల నీతూ 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం నెగ్గింది. 2017, 2018 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలను సొంతం చేసుకుంది. సీనియర్ ప్రపంచ చాంపియన్‌లో నీతూ తొలిసారి ఫైనల్‌కు చేరింది. హరియాణాకే చెందిన 30 ఏళ్ల స్వీటీ రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2014లో రజత పతకం నెగ్గిన స్వీటీ ఈసారైనా తన పసిడి కలను సాకారం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో నిఖత్ జరీన్ (50 కేజీలు), లవ్లీనా (75 కేజీలు) పోటీపడతారు. -
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో బోపన్న జోడీ
ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మూడో టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కాలిఫోర్నియాలో జరుగుతున్న ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 7–6 (8/6), 7–6 (7/2)తో జాన్ ఇస్నెర్–జాక్ సాక్ (అమెరికా) ద్వయంపై గెలుపొందింది. గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ తమ సరీ్వస్‌లో తొమ్మిదిసార్లు బ్రేక్ పాయింట్లు కాపాడుకోవడం విశేషం. ఇటీవల దోహా ఓపెన్‌లో బోపన్న–ఎబ్డెన్ జంట టైటిల్ సాధించగా... రోటర్‌డామ్ ఓపెన్‌లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. బెంగళూరుకు చెందిన 43 ఏళ్ల బోపన్న ఇప్పటి వరకు కెరీర్లో 55 టోరీ్నల్లో ఫైనల్‌కు చేరగా...23 టోరీ్నల్లో టైటిల్స్ నెగ్గి, 32 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచాడు. Matt Ebden and Rohan Bopanna are through to the @BNPPARIBASOPEN men's doubles final 💪 This is @mattebden's first ATP Masters 1000 final 👏#GoAussies #TennisParadisehttps://t.co/mpsSu4K0tT — TennisAustralia (@TennisAustralia) March 18, 2023 -
ఉత్కంఠ.. ఆఖరి బంతికి రనౌట్; టైటిల్ నిలబెట్టుకున్న లాహోర్
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 8వ సీజన్ విజేతగా లాహోర్ ఖలండర్స్ నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన షాహిన్ అఫ్రిది సేన వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను నిలబెట్టుకుంది. అప్పుడు కూడా ఫైనల్ ముల్తాన్ సుల్తాన్స్‌తో ఆడడం విశేషం. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలండర్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన దశలో జమాన్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ చివరి బంతిని కుష్దిల్ షా మిడాన్ దిశగా ఆడాడు. రెండు పరుగులు పూర్తి చేసిన కుష్దిల్ షా మూడో పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న డేవిడ్ వీస్ అఫ్రిదికి త్రో వేశాడు. వేగంగా అందుకున్న బంతిని అఫ్రిది క్షణం ఆలస్యం చేయకుండా వికెట్లకు గిరాటేశాడు. అంతే ముల్తాన్ సుల్తాన్స్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచింది. ఓడినా ముల్తాన్ సుల్తాన్స్ తన ప్రదర్శనతో అభిమానుల మనసులను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. షఫీకి 40 బంతుల్లో 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ షాహిన్ అఫ్రిది 15 బంతుల్లో 2ఫోర్లు, 5 సిక్సర్లతో 44 పరుగులు నాటౌట్ సంచలన ఇన్నింగ్స్ ఆడగా.. ఫఖర్ జమాన్ 39 పరుగులు చేశాడు. ముల్తాన్ సుల్తాన్స్ బౌలింగ్‌లో ఉస్మా మీర్ మూడు వికెట్లు తీయగా.. అన్వర్ అలీ, ఇషానుల్లా, కుష్దిల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్ వికెటఉల పడుతున్న లక్ష్యం దిశగా సాగుతూ వచ్చింది. రిలీ రొసౌ(32 బంతుల్లో 52, 7ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. మహ్మద్ రిజ్వాన్ 34, టిమ్ డేవిడ్ 20, కుష్దిల్ షా 25 పరుగులు చేశారు. లాహోర్ ఖలండర్స్ బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిది నాలుగు వికెట్లతో చెలరేగగా.. రషీద్ ఖాన్ రెండు, డేవిడ్ వీస్ ఒక వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో తన ప్రదర్శనతో అదరగొట్టిన షాహిన్ అఫ్రిది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. ఇషానుల్లా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. 𝘽𝙡𝙤𝙘𝙠𝙗𝙪𝙨𝙩𝙚𝙧 𝙛𝙞𝙣𝙞𝙨𝙝! 🤩#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvLQ pic.twitter.com/QfKcUSSnhj — PakistanSuperLeague (@thePSLt20) March 18, 2023 🏆 W I N N E R S 🏆@lahoreqalandars - owners of the Supernova Trophy 🤩#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvLQ pic.twitter.com/XIDb9hDRlw — PakistanSuperLeague (@thePSLt20) March 18, 2023 చదవండి: బంగ్లా జోరు.. తమ వన్డే చరిత్రలో అత్యంత పెద్ద విజయం -
సంతోష్ ట్రోఫీ ఫైనల్.. 54 ఏళ్ల నిరీక్షణకు తెర
దేశవాలీ ఫుట్‌బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీని కర్ణాటక సొంతం చేసుకుంది. 54 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలవడం విశేషం. శనివారం రాత్రి మేఘాలయాతో జరిగిన ఫైనల్ పోరు నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కర్ణాటక 3-2 తేడాతో మేఘాలయాను ఓడించి కప్‌ను కైవసం చేసుకుంది. కర్ణాటక తరపున సునీల్ కుమార్(ఆట 3వ నిమిషం), బెకి ఓరమ్(20వ నిమిషం), రాబిన్ యాదవ్(44వ నిమిషం) గోల్స్ చేయగా.. మేఘాలయ తరపున బర్లింగ్టన్(8వ నిమిషం), షీన్(60వ నిమిషం) రెండు గోల్స్ కొట్టారు. అయితే ఆట తొలి సగంలోనే ఇరజట్లు కలిపి నాలుగు గోల్స్ కొడితే.. అందులో మూడు కర్ణాటక చేయగా.. ఒకటి మేఘాలయ ఖాతాలోకి వెళ్లింది. అయితే రెండో సగంలో మేఘాలయా మరొక గోల్ చేసినప్పటికి కర్ణాటక డిఫెన్స్‌ను నిలువరించలేక చేతులెత్తేసింది. ఇక కర్ణాటక 1968-69 సీజన్లో తొలిసారి సంతోష్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 😄😄😄#MEGKAR ⚔️ #HeroSantoshTrophy 🏆 #GrandFinale 💥 #IndianFootball ⚽ pic.twitter.com/1gqSRz8jns — Indian Football Team (@IndianFootball) March 4, 2023 🏆 KARNATAKA ARE CHAMPIONS AFTER 5️⃣4️⃣ YEARS 🏆 It was a close call in the end, but Karnataka get over the line in the end 🤩 MEG 2⃣-3⃣ KAR 📺 @FanCode & @ddsportschannel #MEGKAR ⚔️ #HeroSantoshTrophy 🏆 #GrandFinale 💥 #IndianFootball ⚽ pic.twitter.com/tUVsvggPBE — Indian Football Team (@IndianFootball) March 4, 2023 చదవండి: సీఎస్కే కెప్టెన్‌గా బెన్ స్టోక్స్!? ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె కొత్త చరిత్ర.. -
సమిష్టిగా చెలరేగిన సౌరాష్ట్ర బౌలర్లు.. బెంగాల్ 174 ఆలౌట్
రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర, వెస్ట్ బెంగాల్ మధ్య ప్రారంభమైన ఫైనల్ తొలిరోజే ఆసక్తికరంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 174 పరుగులకే ఆలౌటైంది. సౌరాష్ట్ర బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో బెంగాల్ జట్టు తక్కువస్కోరుకే పరిమితమైంది. టాపార్డర్, మిడిలార్డర్ దారుణంగా విఫలమైనప్పటికి.. లోయర్ ఆర్డర్లో షాబాజ్ అహ్మద్ 69, అభిషేక్ పొరెల్ 50 పరుగులు చేయడంతో బెంగాల్ స్కోరు 170 అయినా దాటింది. ఉనాద్కట్, చేతన్ సకారియా చెరో మూడు వికెట్లు తీయగా.. చిరాగ్ జానీ, డీఏ జడేజాలు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర తొలిరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ 38, చేతన్ సకారియా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
వరల్డ్‌కప్ ఫైనల్.. బిడ్డ ఆట చూడడం కోసం ఇన్వర్టర్ కొన్న తల్లి కథ
బిడ్డ దేశం కోసం ఆడుతుందంటే ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి బిడ్డ ఆటను కళ్లారా చూడాలని స్మార్ట్‌ఫోన్‌ను కూడా కాదని ఇన్వర్టర్ కొన్న ఒక తల్లి కథ తప్పక చదవాల్సిందే. విషయంలోకి వెళితే.. షఫాలీ వర్మ నేతృత్వంలోని టీమిండియా అండర్-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఆటతీరుతో అదరగొట్టి టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇదే టీమ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన అర్చనా దేవి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించింది. టోర్నీలో ఆమె మంచి ప్రదర్శననే కనబరిచింది. ఆదివారం భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య అండర్-19 టి20 ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. -సాక్షి, వెబ్‌డెస్క్ ఉత్తర్‌ప్రదేశ్‌లో కూగ్రామంగా ఉన్న ఉన్నావ్‌లో 24 గంటలు కరెంటు ఉండడం అనేది గగనం. కేవలం ఎనిమిది గంటల కరెంటు మాత్రమే ఉంటుందట. అండర్-19 టి20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్ చేరిందన్న సంగతి సావిత్రి తన కూతురు అర్చన ద్వారా తెలుసుకొని తెగ సంతోషపడింది. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో బిడ్డ ఆటను కళ్లారా చూడాలని భావించింది. కానీ కరెంటు సమస్య ఉండడంతో మ్యాచ్ చూడడం కాస్త కష్టమే. కూతురు కొనిచ్చిన స్మార్ట్‌ఫోన్‌పై ఆమెకు నమ్మకం లేదు. ఎందుకంటే ఫోన్లో బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో తెలియని పరిస్థితి. అందుకే సావిత్రి ఒక ఆలోచన చేసింది. ఊర్లో ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లి తన బిడ్డ అర్చనా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుందని.. ఆ మ్యాచ్‌ను చూడాలనుకుంటున్నానని.. తలా ఇంత డబ్బులేసుకొని ఒక ఇన్వర్టర్ కొందామని చెప్పింది. తమ గ్రామానికి చెందిన ఒక ఆడబిడ్డ దేశానికి ఆడుతుందంటే అది మాకు గర్వకారణమే అని భావించిన ఊరివాళ్లు కూడా సావిత్రికి అండగా నిలబడ్డారు. ప్రతీ ఇంటి నుంచి వచ్చిన రూపాయితో సావిత్రి మొత్తానికి ఇన్వర్టర్ కొనేసింది. ఇక ఆదివారం ఊరి సమక్షంలో తన కూతురు మ్యాచ్‌ను చూడడానికి సావిత్రి అంతా సిద్ధం చేసుకుంది. ''మా ఊళ్లో కరెంటు 24 గంటలు ఉంటుందనే దానిపై నమ్మకం లేదు. మొబైల్ ఫోన్లో మ్యాచ్ చూద్దామన్నా బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో తెలియదు. నా కూతురు ఆడనున్న వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ను ఒక్క క్షణం కూడా మిస్ కాకూడాదని అనుకుంటున్నా. అందుకే ఊరివాళ్లతో మాట్లాడి డబ్బు పోగు చేసి ఇన్వర్టర్ కొనుక్కున్నా. ఇప్పుడు నా కూతురు ఆటను చూడడానికి ఎలాంటి అడ్డంకులు లేవు'' అంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో పేర్కొంది. ఇక క్రికెటర్ అర్చనా దేవి తల్లి సావిత్రి జీవితంలో చాలా ఎదగాలని కోరుకుంది. కానీ ఆమె కల నెరవేరకపోయినా కూతురు రూపంలో దానిని అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించిన సావిత్రి.. అర్చనను మాత్రం కష్టపడి పెంచింది. ''ఒక ఎకరం భూమి కౌలుకు తీసుకొని పంట పండించడంతో పాటు రెండు ఆవుల నుంచి వచ్చిన పాలను అమ్మి కూతురును పెంచి పెద్ద చేశాను. అయితే అర్చనను చిన్నప్పుడే హాస్టల్‌కు పంపించిన సావిత్రి గంజిలోని మురదాబాద్‌లో కస్తుర్బా గాంధీ బాలికల పాఠశాలలో చదివించింది. కూతురును దూరం పెట్టిందని ఊరి వాళ్లంతా సూటిపోటి మాటలు అనేవారు. నాలాగా నా కూతురు పెరగకూడదనే ఎంత కష్టమైనా తనను చదివించుకున్నాను. ఇప్పుడు తను ఉన్నత స్థాయికి ఎదగడంతో తిట్టినోళ్ల నోటి నుంచే పొగడ్తలు రావడం సంతోషంగా అనిపిస్తుంది'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక అండర్-19 టి20 ప్రపంచకప్ ఫైనల్ జరగడానికి ముందు టీమిండియా మహిళల జట్టును ఒలింపియన్.. భారత్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా కలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో వారితో సరదాగా గడిపిన నీరజ్ చోప్రా అమ్మాయిలకు తన విలువైన సూచనలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసుకుంది. It's down to two 👀 Who will get their hands on the inaugural ICC Women's #U19T20WorldCup? 🏆 pic.twitter.com/CDh5IGnAaa — T20 World Cup (@T20WorldCup) January 28, 2023 A Gold-standard meeting! 👏👏 Javelin thrower & Olympic Gold medallist @Neeraj_chopra1 interacted with #TeamIndia ahead of the #U19T20WorldCup Final! 👍 👍 pic.twitter.com/TxL5afL2FT — BCCI (@BCCI) January 28, 2023 చదవండి: 'స్లమ్‌డాగ్ మిలియనీర్' పాటతో స్కేటింగ్‌లో గోల్డ్ మెడల్ -
AUS Open 2023: మహిళల సింగిల్స్ విజేత సబలెంకా
ఒకరు 195 కిలోమీటర్ల వేగంతో సర్వీస్ చేస్తున్నారు.... మరొకరు ఏమాత్రం తగ్గకుండా 192 కిలోమీటర్ల వేగంతో జవాబిస్తున్నారు... ప్రతీ పాయింట్ కోసం హోరాహోరీ సమరం... వీరి షాట్లతో బంతి పగిలిపోతుందేమో అనిపించింది... ఒకరు ఇప్పటికే గ్రాండ్‌స్లామ్ చాంపియన్ కాగా, మరొకరు తొలి టైటిల్ వేటలో పోరాడుతున్నారు...దూకుడు ఎలా ఉందంటే తొలి 13 పాయింట్లలో 7 ఏస్‌ల ద్వారానే వచ్చాయి... చివరి వరకు కూడా అదే ధాటి కొనసాగింది... గత కొన్నేళ్లుగా ఏకపక్షంగా జరుగుతున్న మహిళల గ్రాండ్‌స్లామ్ ఫైనల్ మ్యాచ్‌లతో పోలిస్తే పోటీపోటీగా, అత్యుత్తమ స్థాయిలో ఈ తుది పోరు సాగింది. చివరకు 2 గంటల 28 నిమిషాల ఆట తర్వాత విజేత అవతరించింది. ఆ్రస్టేలియన్ ఓపెన్ కొత్త చాంపియన్‌గా అరైనా సబలెంకా నిలిచింది. మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో చాంపియన్‌గా నిలిచిన 29వ క్రీడాకారిణిగా అరైనా సబలెంకా గుర్తింపు తెచ్చుకుంది. శనివారం జరిగిన తుది పోరులో సత్తా చాటిన 24 ఏళ్ల ఈ బెలారస్ స్టార్ తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను అందుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో 22వ సీడ్ సబలెంకా 4–6, 6–3, 6–4 స్కోరుతో ఐదో సీడ్ ఎలెనా రిబాకినా (కజకిస్తాన్)ను ఓడించింది. మ్యాచ్‌లో సబలెంకా 17 ఏస్‌లు కొట్టగా, రిబాకినా 9 ఏస్‌లు బాదింది. ప్రత్యరి్థతో పోలిస్తే 51–31 విన్నర్లతో ఆమె పైచేయి సాధించింది. విజేతగా నిలిచిన సబలెంకాకు 29 లక్షల 75 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (సుమారు రూ. 17.34 కోట్లు), రన్నరప్ రిబాకినాకు 16 లక్షల 25 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 9.47 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా గెలుపుతో సబలెంకా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. హోరాహోరీగా... ఫైనల్‌కు ముందు బలాబలాలు చూస్తే ఇద్దరు సమఉజ్జీలుగానే కనిపించారు. ఇప్పటికే గ్రాండ్‌స్లామ్ గెలిచిన అనుభవంతో పాటు ఈ టోరీ్నలో ముగ్గురు గ్రాండ్‌స్లామ్ విజేతలు స్వియాటెక్, ఒస్టాపెంకో, అజరెంకాలను ఓడించిన ఘనతతో రిబాకినా బరిలోకి దిగగా, ఈ ఏడాది ఓటమి ఎరుగని రికార్డుతో సబలెంకా నిలిచింది. తొలి సెట్లో రిబాకినా ఆధిక్యం ప్రదర్శిస్తూ 3–1తో ముందంజ వేసినా, ఆపై కోలుకొని ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన బెలారస్ ప్లేయర్ 4–4తో స్కోరు సమం చేసింది. అయితే బ్రేక్ సాధించిన రిబాకినా ఆపై సర్వీస్ నిలబెట్టుకొని తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో తన ఫోర్‌హ్యాండ్ పదును ప్రదర్శించిన సబలెంకా 4–1 వరకు వెళ్లింది. ఆపై కజక్ ప్లేయర్ ఎదరుదాడి చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రెండు వరుస ఏస్‌లతో సబలెంకా సెట్ ముగించింది. మూడో సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 3–3కు చేరింది. అయితే ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో కీలకమైన ఏడో గేమ్‌ను బ్రేక్ చేసిన సబలెంకాకు మళ్లీ వెనక్కి చూడాల్సిన అవసరం లేకపోయింది. Your #AO2023 women’s singles champion, @SabalenkaA 🙌@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen pic.twitter.com/5ggS5E7JTp — #AusOpen (@AustralianOpen) January 28, 2023 -
Australian Open: ఆశలు గల్లంతు! ఫైనల్లో సానియా-బోపన్న జోడి ఓటమి
మెల్బోర్న్: కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న హైదరాబాద్ వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో చుక్కెదురైంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో సానియా మీర్జా-బోపన్న జోడి ఓటమి పాలైంది. బ్రెజిల్ జంట స్టెఫానీ-రఫెల్ చేతిలో 6-7, 2-6 తేడాతో భారత జోడి ఓడిపోయింది. ఇప్పటికే మహిళల డబుల్స్‌లోనూ సానియా-అనా డానిలినా (కజకిస్తాన్) జంట నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే, సీనియర్ ఆటగాడు బోపన్న సాయంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో విజయం సాధించి టైటిల్‌తో సానియాకు ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షించగా వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇక బ్రెజిల్ జంట స్టెఫానీ-రఫెల్‌కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 2009 (మిక్స్డ్), 2016 (డబుల్స్)లలో సానియా విజేతగా నిలిచింది. (చదవండి: 'జొకోవిచ్.. మీ తండ్రి చేసిన పని సిగ్గుచేటు')) -
India Open: ప్రపంచ నంబర్‌వన్ అక్సెల్సన్కు బిగ్‌షాక్
ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అక్సెల్సన్ (డెన్మార్క్)కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) 22–20, 10–21, 21–12తో అక్సెల్సన్ను తన కెరీర్లో తొలిసారి ఓడించి విజేతగా నిలిచాడు. కున్లావుత్‌కు 59,500 డాలర్ల (రూ. 48 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. టాప్ సీడ్‌పై గెలిచి... విజేతగా నిలిచి... ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోరీ్నలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఆన్ సె యంగ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె చాంపియన్‌గా నిలిచింది. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) 15–21, 21–16, 21–12తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్)పై గెలిచింది. ఆన్ సె యంగ్ కెరీర్లో ఇది 12వ అంతర్జాతీయ టైటిల్. విజేతగా నిలిచిన ఆన్ సె యంగ్‌కు 59,500 డాలర్ల (రూ. 48 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా?
ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో చిత్తు చేసిన అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి వరల్డ్‌కప్‌ను ఎగురేసుకుపోయింది. అర్జెంటీనా కప్పు కొట్టగానే స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో ఊగిపోయింది. అయితే ఈ గ్యాప్‌లోనే ఒక యువతి నగ్న ప్రదర్శన చేయడం హల్చల్గా మారింది. అయితే మెస్సీ మాయలో దీనిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ లేకుంటే పెద్ద వివాదం అయ్యుండేది. విషయంలోకి వెళితే.. ఫ్రాన్స్‌పై విజయం సాధించాకా అర్జెంటీనా అభిమానులు దేశ జెండాలతో సంబరాలు చేసుకున్నారు. ఇంతలో ఒక అర్జెంటీనా అభిమానుల గుంపులో ఒక యువతి టాప్‌లెస్‌గా దర్శనమిచ్చింది. జెండాల మధ్యలో నిలబడిన యువతి చాతి భాగం కనిపించేలా నగ్న ప్రదర్శన చేసింది. ఆమె చర్యతో ఆశ్చర్యపోయిన మిగతావారు.. ఇక్కడే ఉంటే ఆమె ప్రాణాలకు ప్రమాదమని.. ఎస్కార్ట్ సాయంతో అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఫైనల్ ముగిసిన ఒకరోజు తర్వాత ఈ ఫోటోలు బయటికి రావడంతో పెద్దగా దుమారం జరగలేదు. అయితే యువతి చర్యను తప్పుబట్టిన ఖతర్ అధికారులు ఆమె ఎక్కడ ఉన్నా నోటీసులు ఇస్తామని.. దానికి బదులు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. మెస్సీ బృందం గెలిచిన సంతోషంలో పొరపాటున అలా చేసిందో లేక కావాలనో తెలియదు కానీ తన అందాల ప్రదర్శనతో ఆమె పక్కన నిల్చున్న వారి మతులు మాత్రం పోగొట్టింది. చదవండి: వరల్డ్‌కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలో మరో అరుదైన ఘనత నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె -
నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె
డిసెంబర్ 18(ఆదివారం) జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించాడు ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె. మరో 10 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా రంగంలోకి దిగిన ఎంబాపె మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కదలికల్లో చిరుత కంటే వేగంతో పరిగెత్తాడు. కేవలం 97 సెకన్ల వ్యవధిలోనే రెండు గోల్స్ కొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అలా నిర్ణీత సమయంలోగా 2-2తో ఎలాంటి ఫలితం రాలేదు. అదనపు సమయంలోనూ జట్టు వెనుకబడ్డ దశలో మరో పెనాల్టీ గోల్‌తో మ్యాచ్‌ను షూటౌట్‌కు తీసుకెళ్లాడు. అందులోనూ విజయం సాధించాడు ఎంబాపె. అయితే తాను ఒక్కడే ఆడితే సరిపోదు కదా.. సహచర ఆటగాళ్లు కూడా ఆడాలి. కానీ వాళ్లు ఆడలేదు.. ఫ్రాన్స్ ఓడిపోయింది. ఆ క్షణం ఎంబాపె మొకాళ్లపై మైదానంలో కూలబడ్డాడు. స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మారుమోగుతున్న వేళ.. తాను మాత్రం నిరాశలో మునిగిపోయాడు. కానీ అతని ఆట తీరుకు ముగ్దులైన యావత్ ప్రపంచం వీరుడి పోరాటానికి సలాం కొట్టింది. ఈ తరంలో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలను.. ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్లుగా అభివర్ణిస్తుంటారు. తాజాగా ప్రపంచకప్ కొట్టి మెస్సీ రొనాల్డో కంటే ఒక మెట్టు పైనున్నాడనుకోండి. అది వేరే విషయం. ఈ ఇద్దరు దిగ్గజాలు తమ చివరి వరల్డ్‌కప్‌ను దాదాపు ఆడేసినట్లే. వచ్చే వరల్డ్‌కప్ వరకు అందుబాటులో ఉంటారన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్‌కు మరో కొత్త సూపర్‌స్టార్ కావాల్సిన అవసరం వచ్చింది. నాలుగేళ్ల క్రితమే ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్‌కప్ గెలవడంలో ఎంబాపెది కీలకపాత్ర. 19 ఏళ్ల వయస్సులోనే ఫిఫా టైటిల్‌ను కొల్లగొట్టిన అతను.. ఈసారి కూడా అదే ఆటతీరుతో అదరగొట్టాడు. ముఖ్యంగా అర్జెంటీనాతో ఫైనల్లో ఎంబాపె ఆటతీరుకు ముచ్చటపడని వారుండరు. పట్టుమని పాతికేళ్లు కూడా లేని 23 ఏళ్ల కుర్రాడు ఫుట్‌బాల్‌లో సంచలన ప్రదర్శన చేస్తూ ఇక వచ్చే శకం తనదేనని ప్రపంచానికి సగర్వంగా చాటాడు. మరి అంతలా పేరు సంపాదించిన ఎంబాపె అసలు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడు.. 23 ఏళ్ల వయసులోనే ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఎంబాపె తల్లిదండ్రులిద్దరు క్రీడాకారులే. కామెరూన్ నుంచి శరణార్థిగా పారిస్ శివారులోని బాండీకి వచ్చిన ఎంబాపె ఫుట్‌బాల్ ఆడేవాడు. ఆ తర్వాత కోచ్‌గా మారాడు. అల్జీరియాకు చెందిన అతని భార్య ఫైజా హ్యాండ్‌బాల్ క్రీడాకారిణిగా రాణించింది. 1998లో ఫ్రాన్స్ తొలిసారి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ అందుకున్నప్పుడు పుట్టాడు కైలియన్ ఎంబాపె. అయితే ఎంబాపె పుట్టడమే గోల్డెన్ స్పూన్‌తో పుట్టలేదు. ఇరుకు గదుల్లో ఉంటూ.. కడు పేదరికంలో పెరిగిన ఎంబాపె చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్‌పై ఇష్టాన్ని పెంచుకున్నాడు. చదువు కంటే ఆటనే ఎక్కువగా ప్రేమించిన కొడుకును చూసి సంతోషపడిన తండ్రి విల్ఫ్రైడ్ ప్రోత్సహించాడు. ఎంబాపెకు ఫుట్‌బాల్ ఆటలో ఓనమాలు నేర్పిన మొదటి గురువు కూడా అతని తండ్రే కావడం విశేషం. ఆ తర్వాత ఎంబాపెను తాను పనిచేసే ఏఎస్ బాండీ క్లబ్లో జాయిన్ చేశాడు. అలా ఫుట్‌బాల్ ఆటలో పట్టు సాధించిన ఎంబాపె రెండేళ్ల పాటు మొనాకోకు ఆడాడు. 2017 ఎంబాపె కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. పారిస్ సెయింట్ జెర్మైన్తో(పీఎస్జీ) ఎంబాపెకు ఒప్పందం కుదిరింది. ఇక్కడే మెస్సీ, నెయమర్ లాంటి స్టార్ ఆటగాళ్లతో ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత స్పెయిన్ దిగ్గజ క్లబ్ రియల్ మాడ్రిడ్ నుంచి ఎంబాపెకు పిలుపొచ్చినా .. పీఎస్జీకి కొనసాగడంలో ఆ దేశ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మక్రాన్ ముఖ్య పాత్ర పోషించాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. ఎంబాపెకు ఎంత ప్రాముఖ్యత ఉందనేది. అలా 2018 ఫిఫా వరల్డ్‌కప్ రానే వచ్చింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్ చేరిన ఫ్రాన్స్ విశ్వవిజేతగా అవతరించింది. 19 ఏళ్ల వయసులోనే ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ సాధించిన ఎంబాపె ఆ ప్రపంచకప్‌లో నాలుగు గోల్స్ కొట్టాడు. అయితే ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో అన్నీ తానై నడిపించిన ఎంబాపె ఏకంగా ఎనిమిది గోల్స్ కొట్టి గోల్డెన్ బూట్ ఎగురేసుకుపోయాడు. 23 ఏళ్ల వయసులోనే ప్రత్యర్థి జట్లను అల్లాడిస్తూ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న ఎంబాపె ఇదే ఆటతీరు ప్రదర్శిస్తే భవిష్యత్తులో దిగ్గజ ఆటగాడిగా పేరు పొందడం ఖాయం. సలాం కైలియన్ ఎంబాపె. చదవండి: మెస్సీ మ్యాజిక్కా.. అదృష్టమా.. ఎంబాపె అల్లాడించాడు 36 ఏళ్ల నిరీక్షణకు తెర.. మెస్సీకి ఘనంగా వీడ్కోలు! -
మెస్సీ మ్యాజిక్కా.. అదృష్టమా.. ఎంబాపె అల్లాడించాడు
మొత్తానికి మెస్సీ అభిమానుల ఆశ ఫలించింది. అర్జెంటీనా మేటి ఆటగాడు లియోనల్ మెస్సీ చిరకాల వాంఛ నెరవేరింది. మెస్సీ ఫ్యాన్స్‌కు అర్జెంటీనా ‘ఖతర్’నాక్ విజయం అమితానందాన్ని కలిగించింది. ఫిఫా ప్రపంచకప్ 2022 విజేతగా అర్జెంటీనా నిలవడంతో అభిమానుల సంబరాలు ఆకాశన్నంటాయి. అర్జెంటీనా గెలిచినప్పటికీ ఫ్రాన్స్ పోరాటస్ఫూర్తిని కూడా పలువురు అభినందిస్తున్నారు. ఆట మొత్తంగా చూస్తే అర్జెంటీనా కంటే ఫ్రాన్స్ మెరుగ్గా ఆడిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై చర్చించుకుంటున్నారు. ఆట మొదటి అర్ధభాగంలో వెనుకబడినప్పటికీ పుంజుకుని పెనాల్టీ షూటౌట్ వరకు తీసుకెళ్లడం ఫ్రాన్స్ పోరాట పటిమకు నిదర్శమని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అర్జెంటీనా తప్పిదం వల్ల మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ వరకు వెళ్లిందన్న వాదనలు విన్పిస్తున్నాయి. కైలియన్ ఎంబాపె అయితే అదరగొట్టాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఫస్ట్ హాఫ్ అంతా అర్జెంటీనా దే గేమ్. అర్జెంటీనా డిఫెన్స్‌ను ఫ్రాన్స్ ఛేదించలేకపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఫ్రాన్స్ గోల్ చేసే అవకాశం కూడా రాలేదు. కానీ అర్జెంటీనాకు చాలా అవకాశాలు వచ్చాయి. తేలిగ్గా గెలవాల్సిన మ్యాచ్‌ను అర్జెంటీనా పెనాల్టీ షూట్ అవుట్ వరకు తెచ్చుకుంది. అలా గెలవాలని కోరుకోరు కూడా. ఏదేమైనా గెలుపు గెలుపే. కంగ్రాట్స్ టు అర్జెంటీనా’ అంటూ నెటిజన్ ఒకరు వ్యాఖ్యానించారు. ‘మొదట దెబ్బలు తిని తర్వాత కౌంటర్ అటాక్ చేసేవారిపై సానుభూతి చూపడం మానవ సహజం. అయితే మొదటి నుంచే సమర్థవంతంగా ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు ద్వారా అర్జెంటీనాయే ఒకట్రెండు శాతం ఎక్కువ పైచేయి సాధించింద’ని మరొకరు అభిప్రాయపడ్డారు. ‘అర్జెంటీనా ఆఖరి 12 నిమిషాలు అజాగ్రత్తగా ఆడింది. ఆట మొదటి 65 నిమిషాల వరకు ఫ్రాన్స్‌కు ఎటువంటి ఛాన్స్ ఇవ్వని మెస్సీ టీమ్ చివరలో మాత్రం కాస్త తడబడింది. ఏమైనా మ్యాచ్ మాత్రం సూపర్’ అంటూ ఇంకొరు పేర్కొన్నారు. ‘ఆట మొదటి అర్ధభాగం మొత్తంలో ఫ్రాన్స్ ప్రత్యర్థి గోల్ మీద ఒక షాట్ కూడా కొట్టలేదు. బాల్ 31% సమయం మాత్రమే ఫ్రాన్స్ అధీనంలో ఉంది. అర్జెంటీనా పూర్తిగా డామినేట్ చేసింది. కీలక సమయంలో పెనాల్టీలు ఫ్రాన్స్‌కు కలిసివచ్చాయి. వ్యక్తిగత గోల్స్ మాత్రం మెస్సీ మ్యాజిక్. ఎంబాపె అల్లాడించాడు. చివరలో అర్జెంటీనా గోల్ కీపర్ జట్టును సేవ్ చేశాడ’ని పలువురు వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా మ్యాచ్ మాత్రం తమను ఎంతగానో అలరించిందని క్రీడాభిమానులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఫుట్‌బాట్ ప్రపంచకప్ ఫైనల్ ఊహించిన దానికన్నా తమను ఉత్కంఠకు గురిచేసిందని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’!) -
గోల్డెన్ బూట్ గెలుచుకున్న ఎంబాపే.. రికార్డులు బద్దలుకొడుతున్నాడు!
ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో నరాలు తెగే ఉత్కంఠ పోరులో డిఫెండిగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌పై అర్జెంటీనా గెలిచి కప్ సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో ఘన విజయం అందుకుంది. అయితే, ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే.. తన సత్తా మరోసారి నిరూపించుకున్నాడు. ఫ్రాన్స్‌ను విజేతగా నిలిపే ప్రయత్నం చేశారు. ఫైనల్ మ్యాచ్‌లో ఎంబాపే.. హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. దీంతో, వరల్డ్‌కప్‌లో అధికంగా ఎనిమిది గోల్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. దీంతో, గోల్డెన్ బూట్‌ను అందుకున్నాడు. కాగా, 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఎంబాపే తన మార్క్ ఆటతో ఫ్రాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కైలియన్ ఎంబాపే.. 20 డిసెంబర్ 1998లో పారిస్‌లో జన్మించాడు. బాండీలో ఫుట్‌బాల్ కేరీర్‌ను ప్రారంభించాడు. అంతర్జాతీయ స్థాయిలో 18 సంవత్సరాల వయస్సులో 2017లో ఫ్రాన్స్ తరపున అరంగేట్రం చేసాడు. 2018 ఫిఫా ప్రపంచ కప్‌లో గోల్ కొట్టి ఎంబాపే అతి పిన్న వయస్కుడైన ఫ్రెంచ్ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఫుట్‌బాల్ దిగ్గజం పీలే తర్వాత స్కోర్ చేసిన రెండవ యంగ్ ప్లేయర్‌గా ఎంబాపే రికార్డుల్లోకి ఎక్కాడు. ఫ్రాన్స్ టోర్నమెంట్‌ను గెలుచుకోవడంతో ఎంబాపే.. రెండో అత్యధిక గోల్‌స్కోరర్‌గా నిలిచాడు. దీంతో, ఫిఫా వరల్డ్ కప్ బెస్ట్ యంగ్ ప్లేయర్, ఫ్రెంచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇక, 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఎంబాపే తన మార్క్ ఆటతో ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించాడు. ఫ్రాన్స్ విజయాల్లో కీలక పాత్ర కీలక పాత్ర పోషించాడు. The @adidas Golden Boot Award goes to Kylian Mbappe! 👏#Qatar2022's top goalscorer 📊 — FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022 -
36 ఏళ్ల నిరీక్షణకు తెర.. మెస్సీకి ఘనంగా వీడ్కోలు!
ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి మూడోసారి ఫిఫా టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక అర్జెంటీనాకు తొలి రెండు వరల్డ్‌కప్‌లు సాధించడానికి కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే పడితే.. మూడో టైటిల్ సాధించడానికి మాత్రం 36 సంవత్సరాల ఎదురుచూపులు తప్పలేదు. అర్జెంటీనా 1978లో తొలిసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను సాధించింది. అప్పట్లో నెదర్లాండ్స్‌తో జరిగిన ఫైనల్లో 3-1 తేడాతో నెగ్గిన అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. తొలి వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా నెగ్గడంలో మారియో కెంపెస్ది కీలకపాత్ర. ఇక 1986లో అర్జెంటీనా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గిన సమయంలో డీగో మారడోనా అన్నీ తానై జట్టును నడిపించాడు. జర్మనీతో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఓడించి రెండోసారి విజేతగా అవతరించింది. ఇక మారడోనా తర్వాత అంతటి పేరును సంపాదించిన మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను సాధించింది. 2022లో ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని అందుకుంది. ఈతరం గొప్ప ఆటగాళ్లలో టాప్ పొజీషన్లో ఉన్న మెస్సీ తన కెరీర్లో ఎన్నో టైటిల్స్ సాధించినప్పటికి ఫిఫా వరల్డ్‌కప్ లేదన్న లోటు అలాగే మిగిలిపోయింది. తాజాగా మెస్సీ తన కలను నెరవేర్చుకున్నాడు. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ.. అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ ఆడడం.. తన చివరి మ్యాచ్‌లోనే ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ కొట్టడం అతనికి ఘనమైన వీడ్కోలు అని చెప్పొచ్చు. ఇక ఫుట్‌బాల్ బతికున్నంతవరకు మెస్సీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. The third nation to win a #FIFAWorldCup Final on penalties 🔥 Watch the 🤯 penalty shoot-out from #FRAARG 📽️#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/OwAIjHdqi7 — JioCinema (@JioCinema) December 18, 2022 -
నిరీక్షణ ముగిసింది.. మెస్సీ సాధించాడు
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ నిరీక్షణ ఫలించింది. మారడోనా లిగసీని ఈతరంలో కంటిన్యూ చేస్తూ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టిన మెస్సీ కెరీర్లో ఎన్నో టైటిల్స్, అవార్డులు కొల్లగొట్టాడు. అయినా కానీ ఫిఫా వరల్డ్‌కప్ కొట్టలేదన్న లోటు మాత్రం అలానే ఉండిపోయింది. 2014లో ఫిఫా వరల్డ్‌కప్ మెస్సీ చేతిలోకి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అయితే ఈసారి మాత్రం మెస్సీనే వరించింది. ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ అని ప్రకటించిన మెస్సీ టైటిల్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. మారడోనా తర్వాత తనను ఎందుకంత ఆరాధిస్తారనేది మెస్సీ మరోసారి నిరూపించాడు. ఇక మెస్సీ గెలవడం కోసమే ఈసారి ఫిపా వరల్డ్‌కప్ జరిగిందా అన్న అనుమానం రాకమానదు. సౌదీ అరేబియాతో ఓటమి అర్జెంటీనాను పూర్తిగా మార్చివేసింది. ఆ ఓటమితో కుంగిపోని మెస్సీ అన్నీ తానై జట్టును నడిపించాడు. అక్కడి నుంచి మొదలైన మెస్సీ మాయాజాలం ఫైనల్ వరకు అజరామరంగా కొనసాగింది. జట్టు తరపున అత్యధిక గోల్స్ కొట్టడమే కాదు అత్యధిక అసిస్ట్‌లు చేసి విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇక 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టిన మెస్సీ 17 ఏళ్ల తర్వాత తన ఫిఫా వరల్డ్‌కప్ అందుకోవాలన్న కలను నిజం చేసుకున్నాడు. అంతేకాదు డీగో మారడోనా తర్వాత అర్జెంటీనాకు కప్‌ను అందించి మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఫలితంగా తన వరల్డ్‌కప్ కలతో పాటు అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు. ఇక ఇప్పుడు మెస్సీ ఒక చరిత్ర. ఇన్నాళ్లు అర్జెంటీనా సూపర్‌స్టార్‌గా అభివర్ణించిన మెస్సీని ఇకపై దిగ్గజం అని పిలవాల్సిందే.. కాదు కాదు అలా పిలిపించుకోవడానికి అన్ని అర్హతలు సాధించాడు. ఈ తరానికి మెస్సీనే గోట్(GOAT) అని ఒప్పుకోవాల్సిందే. మెస్సీతో రొనాల్డోను పోల్చడం ఇకపై ఆపేస్తారేమో చూడాలి. ఇక ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం అందుకుంది. నిర్ణీత, అదనపు సమయం ముగిసేలోగా ఇరుజట్లు 3-3తో సమంగా ఉండడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్లో మెస్సీ సేన నాలుగు గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ రెండో గోల్స్‌కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఫిఫా వరల్డ్‌కప్ 2022 విజేతగా అర్జెంటీనా అవతరించింది.2014లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన మెస్సీ సేన ఈసారి మాత్రం కప్పును ఒడిసిపట్టుకుంది. 🏆🏆🏆 The greatest coronation in the history of the #WorldsGreatestShow 💯#Messi guides @Argentina to their third #FIFAWorldCup title 🐐#ARGFRA #ArgentinavsFrance #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Tb6KfWndXa — JioCinema (@JioCinema) December 18, 2022 🎶 𝙈𝙐𝘾𝙃𝘼𝘼𝘼𝘾𝙃𝙊𝙊𝙊𝙎 🎶 pic.twitter.com/TVVt04TVMW — FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022 Lionel Messi with his mum after the game 🥰pic.twitter.com/mvIKQRYfXt — SPORTbible (@sportbible) December 18, 2022 The third nation to win a #FIFAWorldCup Final on penalties 🔥 Watch the 🤯 penalty shoot-out from #FRAARG 📽️#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/OwAIjHdqi7 — JioCinema (@JioCinema) December 18, 2022 -
మెస్సీ మాయ.. అర్జెంటీనాదే వరల్డ్‌కప్
Updates.. ► మెస్సీ మాయ.. అర్జెంటీనాదే వరల్డ్‌కప్ వారెవ్వా ఏమి మ్యాచ్.. క్షణక్షణానికి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మెస్సీ గోల్ కొట్టిన ప్రతీసారి తానున్నానంటూ ఎంబాపె దూసుకొచ్చాడు. నిర్ణీత సమయం ముగిసింది.. అదనపు సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. అయితే ఆ తర్వాత మరో 30 నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. ఈసారి కూడా 3-3తో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్లో మెస్సీ సేన నాలుగు గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ రెండో గోల్స్‌కు మాత్రమే కొట్టగలిగింది. దీంతో అర్జెంటీనా విశ్వవిజేతగా అవతరించింది. The third nation to win a #FIFAWorldCup Final on penalties 🔥 Watch the 🤯 penalty shoot-out from #FRAARG 📽️#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/OwAIjHdqi7 — JioCinema (@JioCinema) December 18, 2022 #FIFAWorldCupFinal | Argentina celebrates after #FIFAWorldCup win 🔗 https://t.co/s26S2Q2R9Q Watch 🇦🇷 🆚 🇫🇷 LIVE on #JioCinema & @Sports18 📺📲#ArgentinaVsFrance #ARGFRA #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/RHqWLAS2sH — Moneycontrol (@moneycontrolcom) December 18, 2022 ► ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ క్షణక్షణానికి చేతులు మారుతుంది. ఆట అదనపు సమయం 108 వ నిమిషంలో మెస్సీ గోల్ కొట్టి అర్జెంటీనాను ఆధిక్యంలోకి తెచ్చాడు. అయితే కొద్దిసేపటికే ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీ కిక్‌ను ఎంబాపె మరోసారి సద్వినియోగం చేసుకున్నాడు. ఆట 118 వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను ఎంబాపె గోల్‌గా మలిచాడు. దీంతో ఇరుజట్ల స్కోర్లు మరోసారి సమం అయ్యాయి. ► అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ ఉత్కంఠగా కొనసాగుతుంది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ ఎలాంటి గోల్స్ నమోదు కాలేదు. అయితే మరోసారి 30 నిమిషాలు అదనపు సమయం ఇచ్చారు. అందులోనూ ఫలితం రాకపోతే అప్పుడు పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం తేల్చనున్నారు. ► ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె నిమిషం వ్యవధిలో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆట 80వ నిమిషంలో తొలుత పెనాల్టీని గోల్‌గా మలిచిన ఎంబాపె.. మలి నిమిషం సహచర ఆటగాడు ఇచ్చిన పాస్‌ను చక్కగా వినియోగించుకున్న ఎంబాపె సూపర్ గోల్‌తో మెరిశాడు. దీంతో 2-2తో మ్యాచ్‌ను సమం చేసింది. ఫిఫా వరల్డ్‌కప్ కొట్టడానికి అర్జెంటీనా అడుగు దూరంలో ఉంది. తొలి అర్థభాగం ముగిసేసరికి ఫ్రాన్స్‌పై స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన మెస్సీ బృందం 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను అన్నీ తానై నడిపిస్తున్న మెస్సీ కీలకమైన ఫైనల్లో మరోసారి గోల్‌తో మెరిశాడు. ఆట 23వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన పెనాల్టీ కిక్‌ను మెస్సీ సద్వినియోగం చేసుకున్నాడు. ఫ్రాన్స్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ సూపర్ గోల్‌తో మెరిసి ఈ వరల్డ్‌కప్‌లో తన గోల్స్ సంఖ్యను ఆరుకు పెంచుకున్నాడు. ఇక ఆట 36వ నిమిషంలో ఏంజెల్ డి మారియా మరో గోల్‌తో మెరవడంతో అర్జెంటీనా ఖాతాలో రెండో గోల్ వచ్చి చేరింది. ఇక రెండో అర్థభాగంలో ఫ్రాన్స్‌ను నిలువరిస్తే చాలు అర్జెంటీనాతో పాటు మెస్సీ కల నెరవేరినట్లే. Lusail witnesses the @Oficial7DiMaria MANIA 💥 The man for the BIG OCCASION with a splendid finish ⭐ Keep watching the #FIFAWorldCup Final ➡ LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGFRA #ArgentinaVsFrance #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/1S9SNBnsjq — JioCinema (@JioCinema) December 18, 2022 BIG BIG step towards the 🏆 dream 🙌🏻#Messi scores his 6️⃣th goal of #Qatar2022 & no better time than this 🔥 Can the @FrenchTeam strike back? Find out LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGFRA #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Io6fyc2uRm — JioCinema (@JioCinema) December 18, 2022 -
పెనాల్టీ కిక్ సందర్భంగా మెస్సీ ఎమోషనల్
ఖతర్ వేదికగా అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి అర్థభాగంలోనే రెండు గోల్స్ సాధించిన అర్జెంటీనా ఫ్రాన్స్‌పై స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఈ వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను అన్నీ తానై నడిపిస్తున్న మెస్సీ కీలకమైన ఫైనల్లో మరోసారి గోల్‌తో మెరిశాడు. ఆట 36వ నిమిషంలో ఏంజెల్ డి మారియా మరో గోల్‌తో మెరవడంతో తొలి అర్థభాగం ముగిసేసరికి అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక పెనాల్టీలు కొట్టడంలో తనకు తానే సాటి అని మెస్సీ మరోసారి నిరూపించుకున్నాడు. ఆట 23వ నిమిషంలో ఫ్రాన్స్ గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ మెస్సీ కొట్టిన పెనాల్టీ అద్భుతమనే చెప్పాలి. అయితే పెనాల్టీ కొట్టడానికి ముందు మెస్సీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. మెస్సీ ఎందుకు ఎమోషనల్ అయ్యాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫిపా వరల్డ్‌కప్ ఫైనల్ అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ అని మెస్సీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఓడితే కప్ లేకుండానే మెస్సీ కెరీర్ ముగుస్తుంది. అందుకే పెనాల్టీ కొట్టడానికి ముందు అంత ఎమోషనల్ అయ్యాడు. ఇక పెనాల్టీని గోల్‌గా మలిచిన తర్వాత మెస్సీ సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. ఇక అర్జెంటీనాకు గోల్ వచ్చిన తర్వాత స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది. BIG BIG step towards the 🏆 dream 🙌🏻#Messi scores his 6️⃣th goal of #Qatar2022 & no better time than this 🔥 Can the @FrenchTeam strike back? Find out LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGFRA #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Io6fyc2uRm — JioCinema (@JioCinema) December 18, 2022 -
టైటిల్‌కు అడుగుదూరం.. మెస్సీని ఊరిస్తున్న ఆరు రికార్డులు
లియోనల్ మెస్సీ.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే పేరు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరినప్పటి నుంచి మెస్సీ జపం మరింత ఎక్కువైంది. ఈసారి ఫైనల్ మ్యాచ్ కేవలం మెస్సీ కోసమే చూస్తున్నవారు కోట్లలో ఉన్నారు. తన ఆటతీరుతో కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న మెస్సీకి ఇదే చివరి వరల్డ్‌కప్ కానుంది. అంతేకాదు ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. మెస్సీకి అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ కానుంది. అందుకే అభిమానులు ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఫైనల్ చేరిన మరో జట్టు ఫ్రాన్స్ అభిమానుల్లో మెజారిటి మెస్సీ సేన వరల్డ్‌కప్ గెలవాలని బలంగా కోరుకుంటుండడం విశేషం. మరి మెస్సీ అందరి అంచనాలను అందుకొని అర్జెంటీనాకు కప్ అందించి తన కలను నెరవేర్చుకుంటాడా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మరోవైపు ఫ్రాన్స్ కూడా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బలంగా కనిపిస్తుంది. కైలియన్ ఎంబాపె ఆ జట్టుకు పెద్ద బలం. వరుసగా రెండో ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గి బ్రెజిల్, ఇటలీ సరసన నిలవాలని ఫ్రాన్స్ భావిస్తోంది. ఇదిలా ఉంటే టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్న మెస్సీని ఆరు రికార్డులు ఊరిస్తున్నాయి. తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్న మెస్సీ ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఐదు గోల్స్ చేశాడు. ప్రీ క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ మెస్సీకి 1000వ మ్యాచ్. తాజాఆ ఫైనల్ మ్యాచ్ ఆడితే ఒక రికార్డు.. గోల్ కొడితే మరొక రికార్డు.. ఇలా అన్ని రికార్డులు ఒక్క మ్యాచ్‌తోనే ముడిపడి ఉన్నాయి. మరి మెస్సీని ఊరిస్తున్న ఆ ఆరు రికార్డులు ఏంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం. వరల్డ్‌కప్‌లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా.. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో మెస్సీ ఒక ఆటగాడిగా ఇప్పటివరకు 16 విజయాలు అందుకున్నాడు. ఒకవేళ ఫైనల్లో అర్జెంటీనా నెగ్గితే మెస్సీ ఖాతాలో 17వ విజయం అవుతుంది. ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్న ఆటగాడిగా మెస్సీ.. జర్మనీ లెజెండరీ ప్లేయర్ మిరాస్లోవ్ క్లోస్ సరసన నిలవనున్నాడు. మిరాస్లోవ్ క్లోస్ తన కెరీర్లో ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 17 విజయాలు అందుకున్నాడు. అత్యధిక మ్యాచ్‌ల్లో పాల్గొన్న ఆటగాడిగా.. ఫ్రాన్స్‌తో జరగనున్న ఫైనల్ మ్యాచ్ మెస్సీకి ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 26వ మ్యాచ్ కానుంది. ఈ నేపథ్యంలో జర్మనీ ఆటగాడు లోథర్ మాథ్యూస్ రికార్డును మెస్సీ బద్దలు కొట్టనున్నాడు. లోథర్ మాథ్యూస్ ఫిఫా వరల్డ్‌కప్స్‌లో జర్మనీ తరపున 25 మ్యాచ్‌లు ఆడాడు. తాజాగా ఫ్రాన్స్‌తో ఫైనల్ మ్యాచ్ ద్వారా మెస్సీ.. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవనున్నాడు. వరల్డ్‌కప్‌లో అత్యధిక నిమిషాలు ఆడిన ఆటగాడిగా.. ఫిఫా వరల్డ్‌కప్స్ చరిత్రలో అత్యధిక నిమిషాలు మ్యాచ్‌లో గడిపిన ఆటగాడిగా ఇటలీ దిగ్గజం పాలో మల్దినీ తొలి స్థానంలో ఉన్నాడు. పాలో మల్దిని 2217 నిమిషాల పాటు మైదానంలో గడిపాడు. ఇక మెస్సీ ఇప్పటివరకు 2197 నిమిషాలతో రెండో స్థానంలో ఉన్నాడు మెస్సీకి, పాలో మల్దినీకి మధ్య వ్యత్యాసం కేవలం 23 నిమిషాలు మాత్రమే ఉంది. తాజాగా ఫ్రాన్స్‌తో జరగనున్న ఫైనల్లో మెస్సీ ఈ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. అత్యధిక అసిస్ట్‌లు చేసిన ఆటగాడిగా.. మెస్సీ ఇప్పటివరకు ఫిఫా వరల్డ్‌కప్స్‌లో తొమ్మిది అసిస్ట్‌లు చేశాడు. ప్రస్తుతం బ్రెజిల్ దిగ్గజం పీలే పది అసిస్ట్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఒకవేళ ఫ్రాన్స్‌తో ఫైనల్లో మెస్సీ ఇతర ఆటగాళ్లు గోల్స్ చేయడంలో రెండు అసిస్ట్ ఇవ్వగలిగితే పీలే రికార్డు బ్రేక్ చేసి తాను మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉంది. మల్టిపుల్ గోల్డెన్ బాల్ అవార్డ్స్.. 2014 ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ తొలిసారి గోల్డెన్ బాల్ అవార్డు గెలుచుకున్నాడు. ఒక వరల్డ్‌కప్‌లో బెస్ట్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఆటగాడికి గోల్డెన్ బాల్ అవార్డు అందిస్తారు. ఈసారి వరల్డ్‌కప్‌లోనూ మెస్సీ సూపర్ ఫామ్‌లో ఉండడం అతనికి గోల్డెన్ బాల్ దక్కే అవకాశం ఉంది. ఒకవేళ మెస్సీ గోల్డెన్ బాల్ గెలుచుకుంటే.. ఫిఫా టోర్నీ చరిత్రలో రెండుసార్లు గోల్డెన్ బాల్ గెలుచుకున్న తొలి ప్లేయర్‌గా మెస్సీ చరిత్ర సృష్టించనున్నాడు. అయితే ఈ అవార్డు కోసం మెస్సీతో ఫ్రాన్స్ సూపర్‌స్టార్ ఎంబాపె పోటీలో ఉన్నాడు. ఏకకాలంలో గోల్డెన్ బాల్, గోల్డెన్ బూట్ అందుకునే అవకాశం.. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక గోల్ చేసిన ఆటగాడికి ఇచ్చే అవార్డు గోల్డెన్ బూట్. ఈసారి ఈ అవార్డుకు మెస్సీతో పాటు ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె కూడా పోటీ పడుతున్నాడు. ఇద్దరు చెరో ఐదు గోల్స్‌తో ఉన్నారు. ఇక ఫైనల్లో వీరిద్దరిలో ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే వారికే గోల్డెన్ బూట్ దక్కుతుంది. ఇక ఏకకాలంలో గోల్డెన్ బూట్‌తో పాటు గోల్డెన్ బాల్ అవార్డు దక్కించుకునే అవకాశం మెస్సీతో పాటు ఎంబాపెకు ఉంది. మెస్సీ లేదా ఎంబాపెలలో ఎవరు దక్కించుకున్నా ఫిఫా చరిత్రలో ఎనిమిదో ఆటగాడిగా చరిత్రకెక్కనున్నారు. ఇంతకముందు లియోనిదాస్ సిల్వా(1938), గారించా(1962), రొనాల్డో(1998), పాలో రోసి(1982), సాల్వటోర్ సిలాచి(1990), మారియో కెంప్(1978) ఏకకాలంలో గోల్డెన్ బాల్, గోల్డెన్ బూట్ అవార్డును కొల్లగొట్టారు. అత్యధిక గోల్స్ కాంట్రిబ్యూషన్స్.. మెస్సీ ఇంతవరకు ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 20 గోల్స్ కాంట్రిబ్యూషన్లో పాల్గొన్నాడు. ఇందులో పదకొండు గోల్స్‌తో పాటు తొమ్మిది అసిస్ట్‌లు ఉన్నాయి. బ్రెజిల్ దిగ్గజం పీలే 22 గోల్స్ కాంట్రిబ్యూషన్తో(12 గోల్స్, 10 అసిస్ట్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇవాళ ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్ ద్వారా మెస్సీ.. పీలే రికార్డును సమం చేయడమో లేక బద్దలు కొట్టే అవకాశం ఉంది. చదవండి: FIFA WC Final: ప్రైజ్‌మనీ.. విన్నర్‌కు ఎంత ; రన్నరప్‌కు ఎంత? చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్ కోసం -
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-9 విజేత జైపూర్ పింక్ పాంథర్స్
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్-9 ఛాంపియన్స్‌గా జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. శనివారం పుణేరీ పల్టన్స్‌తో జరిగిన ఫైనల్లో జైపూర్ 33-29తో విజయం సాధించి విజేతగా నిలిచింది. మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 13 రైడ్ పాయింట్లతో పాటు 15 టాకిల్ పాయింట్లు సాధించింది. ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసిన జైపూర్ పింక్ పాంథర్స్ స్పష్టమైన ఆధిక్యం సాధించి ఛాంపియన్స్‌గా అవతరించింది. ఇక పీకేఎల్ తొలి సీజన్లో విజేతగా అవరతరించిన జైపూర్ పింక్ పాంథర్స్ ఎనిమిది సీజన్ల తర్వాత రెండోసారి ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇక ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో పట్నా పైరేట్స్ తర్వాత రెండోసారి చాంపియన్‌గా నిలిచిన రెండో జట్టుగా జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. ఇక పట్నా పైరేట్స్ అత్యధికంగా మూడుసార్లు ఛాంపియన్స్‌గా నిలవడం విశేషం. 🏆 🏆 🏆 🏆 🏆 🏆 Jaipur 🏆 🏆 Pink 🏆 🏆 Panthers 🏆 🏆 🏆 🏆 🏆 🏆 JAIPUR PINK PANTHERS ARE CROWNED CHAMPIONS OF SEASON 9 🙌#JPPvPUN #vivoProKabaddi #FantasticPanga #vivoPKL2022Final #JaipurPinkPanthers #vivoProKabaddi2022Final #Champions pic.twitter.com/h2Fa7VeI24 — ProKabaddi (@ProKabaddi) December 17, 2022 -
'మెస్సీ కల నెరవేరాలి.. అప్పుడే మనస్పూర్తిగా నవ్వగలను'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ తుది అంకానికి చేరుకుంది. డిసెంబర్ 18న(ఆదివారం) అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య తుది సమరం జరగనుంది. టైటిల్ సాధించి మెస్సీ తన కలను నెరవేర్చుకుంటాడా లేక డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ వరుసగా రెండోసారి వరల్డ్‌కప్‌ను నిలబెట్టుకుంటుందా అనేది చూడాలి. ఇక అర్జెంటీనా జట్టును మెస్సీ అన్ని తానై నడిపిస్తున్నాడు. కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్న మెస్సీ ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఐదుగోల్స్ కొట్టి గోల్డెన్ బైట్ అవార్డు రేసులో ఉన్నాడు. అయితే మెస్సీ ఇంత సక్సెస్ కావడం వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు అదెవరో తెలుసా.. లియోనల్ స్కలోని. అర్జెంటీనా కోచ్‌గా లియోనల్ స్కలోని జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడు. కోచ్‌గా మంచి ఆఫర్స్ వచ్చినప్పటికి మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా ఎలాగైనా ఫిఫా వరల్డ్‌కప్ కొట్టాలని ఆశపడుతున్నాడు. స్కలోని తన కలను నెరవేర్చుకునే పనిలోనే ఉన్నాడు. ఇక ఫ్రాన్స్‌తో జరిగే ఆఖరి సమరంలో గెలిచి అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలవాలని కోరుకుంటున్నాడు. గతేడాది మెస్సీ సేన కోపా అమెరికా కప్ కొట్టడంలోనూ లియోనల్ స్కలోనీ కీలకపాత్ర పోషించాడు. అయితే స్కలోని గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటపడింది. అదేంటంటే.. అర్జెంటీనా ఒక్కో అడుగు వేస్తూ ఫైనల్‌కు చేరుకున్న సందర్భంలో స్కలోని ఒక్కసారి కూడా నవ్వలేదట. ఇక క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో మెస్సీ ఆటకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఒక గోల్ కొట్టడమే గాక.. మూడు అసిస్ట్‌లు అందించి మరో రెండు గోల్స్ కొట్టడంలో మెస్సీదే కీలకపాత్ర. మెస్సీ అంటే ఎంతో అభిమానం చూపించే స్కలోని.. అతను అంత బాగా ఆడుతున్నా ఒక్కసారి కూడా నవ్వలేదు. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత మెస్సీని హగ్ చేసుకొని స్కలోని ఏడ్చేశాడు. అయితే స్కలోని నవ్వకపోవడం వెనుక ఒక కారణం ఉంది. అర్జెంటీనా టైటిల్ కొట్టే వరకు తాను నవ్వలేనని లియోనల్ స్కలోని పేర్కొన్నాడు. తాను నవ్వితే అర్జెంటీనా ఎక్కడా ఓడిపోయి ఇంటికి వస్తుందేమోనని భయపడ్డాడు. మెస్సీ బృందం కప్ అందుకోవాలనే కోరిక నెరవేరిన తర్వాతే తాను మనస్పూర్తిగా నవ్వగలను అంటూ స్కలోని తన మనసులోని మాటను బయటపెట్టాడు. చదవండి: దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. మెస్సీ ముంగిట అరుదైన రికార్డు FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే! -
FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ తుది అంకానికి చేరుకుంది. డిసెంబర్ 18(ఆదివారం) ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య జరిగే ఫైనల్‌తో ఈ మెగాటోర్నీ ముగియనుంది. శనివారం మూడోస్థానం కోసం క్రొయేషియా, మొరాకోలు తలపడనున్నాయి. ఇక మెస్సీకి ఇదే ఆఖరి ఫిఫా వరల్డ్‌కప్. అంతేకాదు దేశం తరపున చివరి మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ తన కలను నెరవేర్చుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగి ఫైనల్లో అడుగుపెట్టిన ఫ్రాన్స్ వరుసగా రెండోసారి కప్ కొట్టాలని భావిస్తోంది. ఫ్రాన్స్ గనుక విజేతగా నిలిస్తే వరుసగా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గిన మూడో జట్టుగా.. ఇటలీ(1934,1938), బ్రెజిల్(1958,1962) సరసన నిలవనుంది. ఇరుజట్ల ముఖాముఖి పోరులో మాత్రం ఫ్రాన్స్‌పై అర్జెంటీనాదే పైచేయిగా ఉంది.అర్జెంటీనా, ఫ్రాన్స్ టీమ్స్ ఇప్పటి వరకూ 12 అంతర్జాతీయ మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో అర్జెంటీనా ఆరు మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఫ్రాన్స్ మూడింట్లోనే విజయం సాధించగా.. మరో మూడు డ్రాగా ముగిశాయి. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లలో ఇప్పటి వరకూ మూడుసార్లు ఈ రెండు టీమ్స్ ఆడాయి. అందులోనూ అర్జెంటీనానే రెండు విజయాలతో పైచేయి సాధించింది. 1930లో ఒకసారి 1-0తో, 1978లో 2-1తో ఫ్రాన్స్‌ను అర్జెంటీనా చిత్తు చేసింది. అయితే చివరిసారి 2018 వరల్డ్‌కప్‌లో మాత్రం ప్రీక్వార్టర్స్‌లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు మాత్రం ఫ్రాన్స్ 4-3తో అర్జెంటీనాను ఓడించి ఇంటిబాట పట్టేలా చేసింది. ఇది మాత్రం ఫ్రాన్స్‌కు ఊరట కలిగించే విషయం. అయితే గత రికార్డులు చూసుకుంటే మాత్రం ఫ్రాన్స్‌పై పైచేయి సాధించిన అర్జెంటీనాదే ఈసారి ఫిఫా వరల్డ్‌కప్ అని అభిమానులు జోస్యం చెప్పారు. చదవండి: ఫైనల్ ముందు ఫ్రాన్స్‌కు గుడ్‌న్యూస్.. కరీం బెంజెమా వచ్చేస్తున్నాడు! FIFA: గాయంతో అన్న దూరం.. తమ్ముడు అదరగొడుతున్నాడు -
ఫైనల్ ముందు ఫ్రాన్స్‌కు గుడ్‌న్యూస్.. కరీం బెంజెమా వచ్చేస్తున్నాడు!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి మొరాకో జరిగిన సెమీఫైనల్లో 2-0 తేడాతో గెలిచిన ఫ్రాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక డిసెంబర్ 18న జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనాతో తలపడనుంది. ఇక కీలకమైన ఫైనల్‌కు ముందు ఫ్రాన్స్‌కు ఒక గుడ్‌న్యూస్ అందినట్లు సమాచారం.గాయం కారణంగా ఫిఫా వరల్డ్‌కప్‌కు దూరమైన జట్టు స్టార్ స్ట్రైకర్ కరీం బెంజెమా ఫైనల్‌కు తిరిగి టీమ్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందు ఖతార్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. బెంజెమా తొడ గాయానికి గురయ్యాడు. దీంతో వరల్డ్‌కప్ టీమ్‌కు దూరమయ్యాడు. మాడ్రిడ్‌కు వెళ్లిపోయిన బెంజెమా అక్కడ గాయం నుంచి కోలుకోవడంపై దృష్టి సారించాడు. గాయం కారణంగా ఇలా టీమ్‌కు దూరమవడంపై బెంజెమా ఎంతో నిరాశ చెందాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తన స్థానాన్ని మరొకరికి ఇచ్చి వెళ్లిపోతున్నట్లు చెప్పాడు. అయితే అప్పటి నుంచీ మాడ్రిడ్‌లో ట్రైనింగ్ చేస్తున్న బెంజెమా.. ఎలాంటి ఫిట్నెస్ సమస్యలతో బాధపడటం లేదని స్పెయిన్ మీడియా వెల్లడించింది. దీంతో అతడు ఫైనల్ మ్యాచ్‌కు తిరిగి ఫ్రాన్స్ టీమ్‌తో చేరతాడన్న వార్తలు ఊపందుకున్నాయి. అదే జరిగితే ఆ టీమ్ బలం మరింత పెరగనుంది. ప్రపంచంలోని అత్యుత్తమ స్ట్రైకర్లలో ఒకడిగా కరీం బెంజెమాకు పేరుంది. ఇప్పటి వరకూ ఫ్రాన్స్ తరఫున 97 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 37 గోల్స్ చేశాడు. చదవండి: మెస్సీతో ఇంటర్య్వూ; ఫిఫా ఫైనల్.. చివరి మ్యాచ్ అని తట్టుకోలేక FIFA: గాయంతో అన్న దూరం.. తమ్ముడు అదరగొడుతున్నాడు -
మెస్సీతో ఇంటర్య్వూ; ఫిఫా ఫైనల్.. చివరి మ్యాచ్ అని తట్టుకోలేక
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తన దేశం తరపున ఆఖరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ మెస్సీకి ఆఖరిది కానుంది. ఈ విషయాన్ని సెమీస్‌లో క్రొయేషియాపై విజయం అనంతరం మెస్సీనే స్వయంగా ప్రకటించాడు. మెస్సీ నిర్ణయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆరాధ్య దైవం ఆఖరి మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో ఎలాగైనా ఫైనల్లో గెలిచి ఫిఫా వరల్డ్‌కప్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ముగిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం అర్జెంటీనా సహా ఫిఫా అభిమానులు మెస్సీ టైటిల్ గెలవాలని పూజలు చేస్తున్నారు. మరి మెస్సీ టైటిల్ కొట్టి తన కలను నెరవేర్చుకుంటాడా లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలియనుంది.ఈ విషయం పక్కనబెడితే.. క్రొయేషియాతో మ్యాచ్ అనంతరం మెస్సీని ఇంటర్య్వూ చేసిన అర్జెంటీనాకు చెందిన మహిళ రిపోర్టర్ కన్నీటిపర్యంతం అయింది. రిపోర్టర్ ఎమోషన్‌కు చలించిపోయిన మెస్సీ చిరునవ్వుతో ఆమెను ఓదార్చాడు. మ్యాచ్ విజయం అనంతరం మెస్సీని ఇంటర్య్వూ చేసింది. ''నా దృష్టిలో ఇది ప్రశ్న కాదు.. అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ ఆదివారం(డిసెంబర్ 18న) ఫైనల్ ఆడబోతున్నాం. ఒక అర్జెంటీనా వ్యక్తిగా కప్పు మనమే గెలవాలని అందరితో పాటు నేను కోరుకుంటన్నా. కానీ దేశం తరపున మీకు ఇది చివరి మ్యాచ్ అని తెలిసినప్పటి నుంచి ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. రిజల్ట్‌తో మాకు సంబంధం లేదు. అది ఎలా అయినా రానీ మీరు మాత్రం మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అర్జెంటీనాలో చిన్న పిల్లాడిని అడిగినా మెస్సీ గురించి ఎంతో గొప్పగా చెప్తుంటారు. అలాంటిది మన జట్టు ఇవాళ ఫైనల్‌కు అడుగుపెట్టడంలో మీది కీలకపాత్ర కావడం మాకు సంతోషకరం. ఇప్పటికి ఇది నిజమా.. కలా అనేది తెలుసుకోలేకపోతున్నాం. ఫుట్‌బాల్‌కు మీరు చేసిన సేవలు ఎన్నటికి మరువం. మారడోనా లీగసీని కంటిన్యూ చేస్తూ ఫుట్‌బాల్‌లో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించారు. మిమ్మల్ని బీట్ చేయడం ఎవరి తరం కాదు. మాలాంటి వాళ్లకు మెస్సీ ఒక స్పూర్తి.. ఒక అర్జెంటీనా మహిళను అయినందుకు గర్వపడుతున్నా థాంక్యూ మెస్సీ'' అంటూ ఎమోషనల్ అయింది. ఇదంతా ఓపికతో విన్న మెస్సీ చిరునవ్వుతో మెరిశాడు. అనంతరం రిపోర్టర్‌ను దగ్గరికి తీసుకొని ఆమెను ఓదార్చాడు. మీతో సహా అర్జెంటీనా ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తా. ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం. ఈసారి వరల్డ్‌కప్‌లో మా జర్నీ అంత ఈజీగా సాగలేదు. క్లిష్ట పరిస్థితులను దాటుకొని ఫైనల్‌కు చేరుకున్నాం. మరొక అడుగు పూర్తి చేస్తే సక్సెస్ అయినట్లే. మీ అభిమానానికి థాంక్స్ అంటూ పేర్కొన్నాడు. ఇక మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ అనంతరం అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. 2005 నుంచి అర్జెంటీనా సీనియర్ జట్టుకు ఆడుతున్న మెస్సీ 171 మ్యాచ్‌లు ఆడి 96 గోల్స్ సాధించాడు.ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. బటిస్టుటా (10 గోల్స్) పేరిట ఉన్న రికార్డును మెస్సీ (11 గోల్స్) సవరించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో మెస్సీ సంయుక్తంగా ఆరో స్థానానికి చేరుకున్నాడు. మిరోస్లావ్ క్లోజ్ (16), రొనాల్డో నజారియో (15), గెర్డ్ ముల్లర్ (14) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 😭 pic.twitter.com/iYhhMAWSwB — Emma 📊 (@emmaiarussi) December 13, 2022 చదవండి: FIFA: గాయంతో అన్న దూరం.. తమ్ముడు అదరగొడుతున్నాడు Kylian Mbappe: 'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు' -
షెల్డన్ జాక్సన్ వీరోచిత సెంచరీ.. విజయ్ హజారే ట్రోఫీ విజేత సౌరాష్ట్ర
దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర నిలిచింది. శుక్రవారం మహారాష్ట్రతో జరిగిన ఫైనల్లో సౌరాష్ట్ర ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. షెల్డన్ జాక్సన్(136 బంతుల్లో 133 పరుగులు నాటౌట్) చివరి వరకు నిలబడి వీరోచిత సెంచరీతో జట్టును గెలిపించాడు. హార్విక్ దేశాయ్ 50 పరుగులు చేశాడు. ఆఖర్లో చిరాగ్ జానీ 25 బంతుల్లో 30 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 108 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సెంచరీతో జట్టును గెలిపించిన షెల్డన్ జాక్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 2002-03 సీజన్ నుంచి విజయ్ హజారే ట్రోఫీని నిర్వహిస్తుండగా 2007-08 సీజన్లో సౌరాష్ట్ర తొలిసారి ఈ ట్రోపీని గెలుచుకుంది. తర్వాత 2017-18 సీజన్ లో ఫైనల్ చేరినా తుదిపోరులో కర్నాటక చేతిలో ఓడింది. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన జయదేవ్ ఉనాద్కట్ సారథ్యంలోని సౌరాష్ట్ర.. అన్ని విభాగాల్లో రాణించి లక్ష్యాన్ని అందుకుంది. ఈ ట్రోఫీని గతంలో తమిళనాడు 5 సార్లు గెలుచుకోగా .. ముంబై నాలుగు సార్లు నెగ్గింది. WHAT. A. WIN! 🙌 🙌 Those celebrations! 👏 👏 The @JUnadkat-led Saurashtra beat the spirited Maharashtra side to bag the #VijayHazareTrophy title 🏆 Scorecard 👉 https://t.co/CGhKsFzC4g #Final | #SAUvMAH | @mastercardindia | @saucricket pic.twitter.com/2aPwxHkcPD — BCCI Domestic (@BCCIdomestic) December 2, 2022 చదవండి: Pak Vs Eng: పాక్ బౌలర్ అత్యంత చెత్త రికార్డు! లిస్టులో భారత క్రికెటర్ కూడా మారడోనా, మెస్సీలను మించినోడు.. జెర్సీ నెంబర్-10 ఆ ఆటగాడిదే -
గెలిస్తే... సిరీస్ మన చేతికి.. సంజూ సామ్సన్, యువ పేసర్‌కు అవకాశం?
నేపియర్: న్యూజిలాండ్ పర్యటనలో టి20 సిరీస్ గెలుపే లక్ష్యంగా టీమిండియా ఆఖరి పోరుకు సిద్ధమైంది. మంగళవారం ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో టి20 జరుగుతుంది. ఇదివరకే రెండో మ్యాచ్ గెలిచిన భారత్ 1–0తో ఆధిక్యంలో ఉండగా.. ఇదే ఉత్సాహంతో ఈ మ్యాచ్ కూడా గెలిచి 2–0తో కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది. మ్యాచ్ ఓడినా సిరీస్ పోయేదిలేదు కాబట్టి తుదిజట్టులో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌తో పాటు బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్‌కు అవకాశమివ్వాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తోంది. మరోవైపు సిరీస్‌లో వెనుకబడిన న్యూజిలాండ్ కీలకమైన మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ విలియమ్సన్ లేకుండా బరిలోకి దిగుతోంది. దాంతో సీనియర్ సీమర్ సౌతీ సారథ్యం వహిస్తాడు. నేపియర్ పిచ్ బ్యాటింగ్ పిచ్ కాగా... మ్యాచ్‌కు వానముప్పు పొంచి ఉంది. -
బాబర్‌కు ఊహించని ప్రశ్న.. మధ్యలో తలదూర్చిన మేనేజర్
టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ రన్నరప్‌గానే మిగిలిపోయింది. పాక్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్ రెండోసారి పొట్టి ఫార్మాట్లో చాంపియన్‌గా అవతరించింది. బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు తోడుగా జట్టు సమిష్టి ప్రదర్శన ఇంగ్లండ్‌కు విజయాన్ని కట్టబెట్టింది. ఇక మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబార్ ఆజంకు ఐపీఎల్ రూపంలో ఊహించని ప్రశ్న ఎదురైంది. దీనిపై బాబర్ ఏం స్పందించలేదు. అయితే మీడియా మేనేజర్ మధ్యలో తలదూర్చి ప్రశ్న అడిగిన జర్నలిస్ట్‌కు కౌంటర్ ఇచ్చాడు. ప్రెస్మీట్లో భాగంగా ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ.. "ఐపీఎల్ వల్ల జరుగుతున్న మేలు గురించి మాట్లాడుకుందాం. బాబర్ ఒకవేళ మీకు కానీ లేదా జట్టు సభ్యుల్లో ఐపీఎల్ ఆడే అవకాశం వస్తే ఆడుతారా లేకపోతే వదులుకుంటారా" అని ప్రశ్న వేశాడు. దీనికి బాబర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. వెంటనే తన మీడియా మేనేజర్‌వైపు తిరిగాడు. ''ప్రస్తుతం టి20 ప్రపంచకప్ గురించి మాత్రమే ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. వేరే విషయాల ప్రస్తావన ఎందుకంటూ'' చురకలంటించాడు. ఇక ఈసారి టి20 ప్రపంచకప్‌లో 1992 సీన్ రిపీట్ అవుతుందని చాలా మంది భావించారు. కానీ ఇంగ్లండ్ బౌలర్ల ముందు పాకిస్తాన్ పప్పులు ఉడకలేదు. అదే విషయాన్ని బాబర్ స్పష్టం చేశాడు. గత మూడు మ్యాచ్‌ల నుంచి చూసుకుంటే మేం సాధించిన విజయాలతో కాస్త ఉత్సాహంగానే ఉన్నా. కానీ ఫైనల్లో పరాజయం చెందడం కాస్త బాధ కలిగించింది. అయితే ఇంగ్లండ్ మంచి ఆటతీరును ప్రదర్శించింది. మ్యాచ్‌లో చివరకు ఒకరిని మాత్రమే విజయం వరిస్తుంది. అయితే మా పేస్ దళం బలంగా ఉండడంతో స్ట్రాటజీ వర్క్ చేస్తున్నట్లగా అనిపించింది. కానీ స్టోక్స్ ఆఖరివరకు నిలబడి మ్యాచ్‌ను మా చేతుల్లోంచి లాగేసుకున్నాడు. గెలవాలన్న తాపత్రయం మాలో ఉన్నప్పటికి కొన్ని పరిస్థితులు మాకు అనుకూలంగా లేకపోవడంతో ఓటమి చెందాల్సి వచ్చింది. కానీ ఫైనల్లో మా ప్రదర్శనతో సంతృప్తిగానే ఉన్నాం.'' అంటూ చెప్పుకొచ్చాడు. In the #T20WorldCupFinal pre match press conference, Babar Azam was asked about what it’s like to not play the IPL. He completely ignored the question. pic.twitter.com/4RhE6dlJFg — Change of Pace (@ChangeofPace414) November 12, 2022 చదవండి: మొయిన్ అలీ, రషీద్ విషయంలో బట్లర్ పెద్ద మనసు -
Ben Stokes: ఆలస్యమైనా కుంభస్థలాన్ని గట్టిగా బద్దలు కొట్టాడు
టి20 ప్రపంచకప్‌లో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లండ్ విజయంలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పాత్ర కీలకం. ఇన్నింగ్స్‌లో చివరి వరకు మూలస్తంభంలా నిలబడిన స్టోక్స్ 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అయితే ఇక్కడ మనకు తెలియని విషయమేంటంటే.. స్టోక్స్ టి20 కెరీర్లో ఇదే తొలి అర్థసెంచరీ కావడం. 48 టి20 మ్యాచ్‌ల కెరీర్లో స్టోక్స్ ఇంతవరకు ఒక్క హాఫ్ సెంచరీ కొట్టలేకపోయాడు. దీనికి చాలా కారణాలున్నాయి. స్టోక్స్ ఎక్కువగా ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. ఈ మధ్య కాలంలో ఇంగ్లండ్ టాపార్డర్ చాలా వరకు మ్యాచ్‌లను పూర్తి చేస్తూ రావడంతో స్టోక్స్ ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఈసారి మాత్రం టాపార్డర్ విఫలం కావడంతో తనలోని బ్యాటర్‌ను బయటకు తీశాడు బెన్ స్టోక్స్. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ ఆల్‌రౌండర్ అనే పదానికి నిర్వచనం చెప్పాడు. ఎట్టకేలకు టి20 ప్రపంచకప్‌లో అదీ ఫైనల్లో తొలి అర్థసెంచరీ చేయడమే గాక జట్టున విశ్వవిజేతగా నిలిపిన ఘనత స్టోక్స్‌కే దక్కుతుంది. 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన స్టోక్స్ అనతికాలంలో గొప్ప ఆల్రౌండర్లలో ఒకడిగా పేరు పొందాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో స్టోక్స్‌దే కీలకపాత్ర. ఆనాటి ఫైనల్లో అతను ఆడిన 84 పరుగుల ఇన్నింగ్స్ ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపింది. తాజాగా మరోసారి ఆఖరి వరకు క్రీజులో నిలిచి పొట్టి ఫార్మాట్లో రెండోసారి ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపాడు. స్టోక్స్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున 86 టెస్టులు, 105 వన్డేలు, 48 టి20 మ్యాచ్‌లు ఆడాడు.ఇక టి20, టెస్టులపై దృష్టి సారించేందుకు స్టోక్స్ ఈ ఏడాది ఆరంభంలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: Ben Stokes: అప్పుడు విలన్.. ఇప్పుడు హీరో -
ఒకసారి అంటే పర్లేదు.. రెండోసారి కూడా అదే తప్పు
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య ఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ చర్య నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 18వ ఓవర్ జోర్డాన్ వేశాడు. ఆ ఓవర్లో జోర్డాన్ వేసిన నాలుగో బంతిని మహ్మద్ వసీమ్ కట్‌షాట్ ఆడగా నేరుగా హ్యారీబ్రూక్ చేతుల్లోకి వెళ్లింది. బ్రూక్ క్యాచ్ పట్టుంటే మాత్రం టోర్నీలో మరొక బెస్ట్ క్యాచ్ నమోదయ్యేది. కానీ ఆఖరి నిమిషంలో బ్రూక్ బంతిని కింద పెట్టేశాడు. అప్పటికే మహ్మద్ వసీమ్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే బ్రూక్ బంతి విసరగా అందుకున్న జోర్డాన్ త్రో వేయడంలో విఫలమయ్యాడు. అలా బంతి మరోసారి పరుగులు పెట్టింది. స్టోక్స్ త్రో వేయగా.. ఈసారి కూడా జోర్డాన్ వికెట్లకు బంతిని వేయడంలో విఫలమయ్యాడు. అలా జోర్డాన్ చేసిన పనికి పాక్‌కు మూడు పరుగులు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఇక టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్‌లో ఘోరంగా తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పాక్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. దీంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్ ఆజం 32, షాన్ మసూద్ 38 పరుగులు చేశారు. pic.twitter.com/rQ5PRkMLg7 — The sports 360 (@Thesports3601) November 13, 2022 చదవండి: T20 WC Final: ఇంగ్లండ్, పాక్ ఫైనల్.. ఆకట్టుకున్న 13 ఏళ్ల జానకి ఈశ్వర్ -
ఇంగ్లండ్, పాక్ ఫైనల్.. ఆకట్టుకున్న 13 ఏళ్ల జానకి ఈశ్వర్
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా ఫైనల్ చేరడంలో విఫలమైనప్పటికి భారత సంతతికి చెందిన 13 ఏళ్ల జానకి ఈశ్వర్ అనే అమ్మాయి ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియన్ రాక్‌బాండ్ గ్రూఫ్తో కలిసి పాట పాడుతూ తన మధుర గానంతో స్టేడియాన్ని హోరెత్తించింది. ఆస్ట్రేలియన్ రాక్బాండ్లో ఒకటైన ఐస్ హౌస్ సాంగ్‌ను ట్రూప్ కంపోజ్ చేయగా.. జానకి ఈశ్వర్ ఎటువంటి బెరుకు లేకుండా పాడడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జానకి ఈశ్వర్ తల్లిదండ్రులు అనూప్ దివకరణ్, దివ్వా రవీంద్రన్‌లు కేరళకు చెందినవారు. అయితే 15 ఏళ్ల క్రితమే ఈ దంపతులు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగిన జానకి ఈశ్వర్ ఆస్ట్రేలియన్ రాక్బాండ్లో తన పాటలతో అదరగొడుతుంది. ఇక వాయిస్ ఆస్ట్రేలియా పేరిట నిర్వహించిన ప్రోగ్రామ్ ద్వారా జానకి ఈశ్వర్ తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఇక కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్‌లో ఘోరంగా తడబడింది. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి పరుగులు చేయడంలో పాక్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్ ఆజం 32, షాన్ మసూద్ 38 పరుగులు చేశారు. pic.twitter.com/u9pqffBQmp — The sports 360 (@Thesports3601) November 13, 2022 చదవండి: సామ్ కరన్ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి బౌలర్‌గా -
సామ్ కరన్ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి బౌలర్‌గా
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ అరుదైన రికార్డు అందుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లలో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. తాజాగా పాకిస్తాన్‌తో జరుగుతున్న ఫైనల్లో మహ్మద్ రిజ్వాన్‌ను ఔట్ చేయడం ద్వారా సామ్ కరన్ ఈ ప్రపంచకప్‌లో 11వ వికెట్ సాధించాడు. సామ్ కరన్ తర్వాత వరుసగా రియాన్ సైడ్‌బాటమ్(10 వికెట్లు, 2010), గ్రేమ్ స్వాన్(10 వికెట్లు, 2010), డేవిడ్ విల్లే(10 వికెట్లు, 2016) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ తడబడుతుంది. 13 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. బాబర్ ఆజం 32 పరుగులు చేసి ఔట్ కాగా.. షాన్ మసూద్ 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు. చదవండి: Pak Vs Eng: చరిత్ర పునరావృతం కాబోతోంది.. ట్రోఫీ గెలుస్తాం: బాబర్ ఆజం -
ఇంగ్లండ్, పాకిస్తాన్ ఫైనల్.. బిర్యానీ కథ తెలుసుకోవాల్సిందే
అది 1992వ సంవత్సరం. పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో అప్పటి పాక్ ఫాస్ట్‌బౌలర్ వసీం అక్రమ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముందు బ్యాటింగ్‌లో 33 పరుగులు చేసిన అక్రమ్.. ఆ తర్వాత బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను శాసించాడు. అలా ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ తొలిసారి వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వసీం అక్రమ్ మాట్లాడుతూ.. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి తిన్న బిర్యానీ వల్లే ఈ ప్రదర్శన అంటూ సరదాగా కామెంట్ చేశాడు. అక్రమ్ మాటలు విన్న ఇప్తికర్ షా అనే వ్యక్తి తెగ సంతోషపడిపోయాడు.ఇఫ్తికర్ షా అంత సంతోషపడడానికి కారణం ఏంటో తెలుసా.. అక్రమ్ తిన్న బిర్యానీ ఈయన తయారు చేసిందే. అప్పటికే ఇప్తికర్ షా ఆస్ట్రేలియాకు వలస వెళ్లి 10 సంవత్సరాలైంది. 1992 వన్డే వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తుందని తెలియగానే.. తన స్వంత దేశమైన పాకిస్తాన్ ఆటగాళ్లకు బిర్యానీ రుచి చూపించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అక్రమ్ ఇప్తికర్ను తన వద్దకు పిలుపించుకొని బిర్యానీ చేసి పెట్టాలని ఆర్డర్ వేశాడంట. అక్రమ్ మాటలకు తెగ సంతోషపడిపోయిన ఇప్తికర్ ఎంతో ప్రేమతో బిర్యానీ తయారు చేసి అక్రమ్ సహా పలువురు ఆటగాళ్లకు రుచి చూపించాడు. కట్‌చేస్తే సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత అదే పాకిస్తాన్ జట్టు మెల్బోర్న్ వేదిగా ఆదివారం(నవంబర్ 13న) ఇంగ్లండ్‌తో టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. కొన్ని గంటల్లో మొదలుకానున్న ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఫైనల్ మ్యాచ్‌కు ముందురోజు అంటే శనివారం పాక్ ఆటగాళ్లు మెల్బోర్న్లోని షా మింట్ అండ్ యునివర్సిటీ ఫుడ్ స్ట్రీట్‌కు వెళ్లారు. అక్కడ తమకు ఇష్టమైన బిర్యానీ తిని ఇప్తికర్ షాను సంతోషపెట్టారు. 1992లో పాకిస్తాన్ వన్డే వరల్డ్‌కప్ గెలిచిన సమయంలో ఇప్తికర్ షా బిర్యానీ తినే తాను ఈ ప్రదర్శన చేసినట్లు అక్రమ్ అప్పట్లో మీడియాకు తెలపడం బాగా వైరల్ అయింది. అందుకే తాజాగా టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన పాక్ సెంటిమెంట్ ప్రకారం ఇప్తికర్ షా వద్దకు వచ్చి బిర్యానీ తిని వెళ్లారు. ఇక మ్యాచ్‌లో విజయం తమదేనని పాక్ జట్టు బలంగా నమ్ముతుంది. ఇది నిజమవుతుందో లేదో తెలియదు కానీ పాక్ ఆటగాళ్ల వల్ల తన బిర్యానీకి మంచి పేరు వచ్చిందని ఇఫ్తికర్ షా తెగ సంతోషపడుతూ పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2022: ఫైనల్‌కు ముంగిట ఇంగ్లండ్ జట్టుకు బ్యాడ్ న్యూస్ -
సెంటిమెంట్ తప్పిస్తే రికార్డులన్నీ ఇంగ్లండ్వైపే.. పాక్‌కు కష్టమే
టి20 ప్రపంచకప్‌లో ఆదివారం(నవంబర్ 13న) మెల్బోర్న్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో ఇంగ్లండ్, పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. మరి పొట్టి ప్రపంచకప్‌లో విజేత ఎవరనేది ఒక్క రోజులో తేలనుంది. సెంటిమెంట్ పరంగా చూస్తే పాక్ గెలుస్తుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ రికార్డులన్నీ ఇంగ్లండ్‌కే అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఇంగ్లండ్‌దే విజయమని.. పాక్ టైటిల్ కొట్టడం కష్టమేనని కొంతమంది పేర్కొంటున్నారు. ► ఇక ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇరుజట్లు 28 టి20ల్లో ఎదురుపడితే.. వాటిలో ఇంగ్లండ్ 18 విజయాలు నమోదు చేయగా.. పాక్ ఖాతాలో తొమ్మిది విజయాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కదానిలో ఫలితం రాలేదు. ► టి20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు తలపడిన రెండు సందర్భాల్లోనూ ఇంగ్లండ్‌నే విజయం వరించింది. ► 2019 నుంచి చూసుకుంటే ఇరుజట్ల మధ్య 14 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో 8 మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలవగా.. ఐదు పాక్ గెలిచింది. ఒక్క దానిలో ఫలితం రాలేదు. ► చివరగా టి20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరిగింది. సిరీస్ ఆద్యంతం ఉత్కంఠగా సాగగా.. 4-3 తేడాతో ఇంగ్లండ్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ► పాకిస్తాన్ ఇది ఫైనల్‌కు చేరడం మూడోసారి కాగా.. ఇంగ్లండ్‌కు కూడా మూడో ఫైనల్ కావడం విశేషం. ఇక రెండు జట్లు ఒక ఫైనల్ గెలిచి.. మరొక ఫైనల్ ఓడి సమానంగా ఉన్నాయి. ► పాకిస్తాన్ 2009లో టి20 చాంపియన్స్‌గా నిలిస్తే.. ఆ మరుసటి ఏడాది అంటే 2010లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా అవతరించింది. ► ఒకవేళ ఇంగ్లండ్ ఈసారి టి20 ప్రపంచకప్ గెలిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఏకకాలంలో వన్డే వరల్డ్‌కప్, టి20 వరల్డ్‌కప్ సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించనుంది ► ఇక ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ అన్ని మ్యాచ్‌లు కలిపి 669 పరుగులు చేస్తే.. అందులో ఓపెనర్లు బట్లర్, హేల్స్ ద్వయం 410 పరుగులు చేయడం విశేషం. ► ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌కు పాక్ ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లపై మంచి రికార్డు ఉంది. బాబర్ మూడుసార్లు ఔట్ చేసిన రషీద్.. రిజ్వాన్‌ను రెండుసార్లు పెవిలియన్ చేర్చాడు. అదే సమయంలో బాబర్ ఆజం, రిజ్వాన్ జంటకు ఇంగ్లండ్‌పై మంచి స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉంది. పాక్ తుదిజట్టు అంచనా: మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మహ్మద్ వసిం జూనియర్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హారీస్ రవూఫ్ ఇంగ్లండ్ తుదిజట్టు అంచనా: జోస్ బట్లర్ (కెప్టెన్), అలెక్స్ హేల్స్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ -
T20 WC: ప్రతిష్టాత్మక ఫైనల్ కోసం రూల్స్ సవరింపు!
క్రికెట్ అభిమానులు నెల రోజుల నుంచి ఎంజాయ్ చేస్తున్న టి20 ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇన్నాళ్లు ఫోర్లు, సిక్సర్ల వర్షంతో పాటు వరుణుడి జడివానల్లోనూ తడిసిన అభిమానులకు కిక్కు దిగిపోనుంది. రేపు(నవంబర్ 13న) పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే ముందు నుంచి చెప్పుకుంటున్నట్లు ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఫైనల్ మ్యాచ్ జరగనున్న రోజున వర్షం పడే సూచనలు 85 శాతం ఉన్నాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. అయితే నాకౌట్ దశలో జరిగే మ్యాచ్‌లకు రిజర్వ్ డేను కేటాయిస్తారు. దీంతో ఫలితం వచ్చే అవకాశాలుంటాయి. అయితే రిజర్వ్ డే కూడా వర్షంలో కొట్టుకుపోతే అప్పుడు ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. అలా చేస్తే ఇప్పటివరకు టి20 ప్రపంచకప్‌పై ఉన్న జోష్ తగ్గిపోతుంది. ఇలా సంయుక్త విజేతలుగా ప్రకటించడం ద్వారా టోర్నీ ఆఖర్లో కళ తప్పినట్లవుతుందని భావించిన ఐసీసీ శనివారం.. ఫైనల్ మ్యాచ్ కోసం రూల్స్‌ను సవరించింది. అయితే ఆ రూల్స్ కేవలం మ్యాచ్ వరకు మాత్రమే పరిమితం. మరి ఐసీసీ సవరించిన కొత్త రూల్ ఏంటంటే.. రిజర్వ్ డే రోజున నిర్ణీత సమయంలో వర్షం తగ్గకపోతే.. మరో రెండు గంటలు అదనంగా కేటాయించనున్నారు. ఒకవేళ ఈ రెండు గంటలు ఎలాంటి వర్షం లేకపోతే 10 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. ఇది కూడా సాధ్యపడకపోతే అప్పుడు ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారని ఐసీసీ పేర్కొంది. ఇప్పటికే ఫైనల్ జరగనున్న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)కి ఉత్తర్వులు పంపామని.. ఆ దిశగా వారు ప్రణాళికను సిద్ధం చేస్తారని తెలిపింది. ''వర్షం అడ్డుపడినా సాధ్యమైనంత వరకు ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించాలనే సంకల్పంతో ఉన్నాం. అందుకే నవంబర్ 13న వర్షంతో మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డే అయిన నవంబర్ 14న మ్యాచ్ కొనసాగిస్తాము. అప్పటికి వర్షం అంతరాయం కలిగిస్తే మరో రెండు గంటలు మ్యాచ్ జరిగేందుకు అదనంగా సమయం కేటాయించాం. అప్పటికి ఫలితం రాకుండా వరుణుడు అడ్డుపడితే మాత్రం ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తాం. ఇది చివరి ఆప్షన్ మాత్రమే. కానీ ఇలా జరగడం మాకు ఇష్టం లేదు. కచ్చితంగా ఫైనల్ మ్యాచ్ సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం'' అంటూ టోర్నీ నిర్వాహుకులు పేర్కొన్నారు. చదవండి: T20 WC: టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే? -
T20 WC 2022: బాబర్ కుడివైపు, బట్లర్ ఎడమవైపు..
సెంటిమెంట్స్‌ను నమ్ముకొని ఆటలు ఆడితే కప్పులు రావు.. ఆరోజు మ్యాచ్‌లో ఎవరు బాగా రాణిస్తే వారినే విజయం వరిస్తుంది. అంతేకానీ ఆడడం మానేసి సెంటిమెంట్‌ను ఎక్కువగా నమ్ముకొని బరిలోకి దిగితే మొదటికే మోసం వస్తుంది. కానీ కొన్నిసార్లు ఆ సెంటిమెంట్లు కూడా నమ్మాల్సి వస్తుంది. ఒక్కోసారి పరిస్థితులు కూడా అందుకు తగ్గట్లే ఉంటాయి. తాజాగా మనం చెప్పుకునేది కూడా ఆ కోవలోకే వస్తుంది. టి20 ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్ 13న(ఆదివారం) ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో ఇంగ్లండ్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నప్పటికి పాక్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ విషయం పక్కనబెడితే ప్రపంచకప్ ఫైనల్ ఆడనున్న ఇరుజట్ల కెప్టెన్లు ట్రోఫీ పక్కన నిలబడి ఫోటోకు ఫోజివ్వడం ఆనవాయితీగా వస్తుంది. 2019 నుంచి ఐసీసీ ట్రోఫీకి కుడిపక్కన నిలబడిన కెప్టెన్లు టైటిల్స్ గెలుస్తూ వస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. తాజాగా ఫైనల్ మ్యాచ్‌కి ముందు ట్రోఫీతో ఫైనలిస్టులు ఫోటోలు దిగారు. కుడి వైపు బాబర్ ఆజం నిలబడగా.. ఎడమవైపు ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఎడమవైపు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. సెంటిమెంట్ ప్రకారం ట్రోఫీకి కుడిపక్కన బాబర్ ఆజం నిలబడడంతో ఈసారి పాక్ టి20 వరల్డ్‌కప్ కొట్టబోతుందని అభిమానులు బలంగా పేర్కొన్నారు. ఇంతకముందు 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కుడి వైపు నిలబడగా.. ఎడమవైపు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిలబడ్డాడు. కుడివైపు నిలబడిన ఇంగ్లండ్‌కు సూపర్ ఓవర్లో 'సూపర్' విజయం దక్కింది. ఇక 2021 టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కుడివైపు నిలబడగా.. కేన్ విలియమ్సన్ మాత్రం మళ్లీ ఎడమవైపే నిలబడ్డాడు. ఈసారి కూడా కుడివైపు నిల్చొన్న ఆరోన్ ఫించ్ సేనకే వరల్డ్ కప్ దక్కింది. ఐసీసీ 2021లో తొలిసారి నిర్వహించిన టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఈసారి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కుడివైపు నిలబడగా.. అప్పటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఎడమవైపు ఉన్నాడు. దీంతో దాదాపు 21 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ జట్టు ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ అంశాలన్ని పరిగణలోకి తీసుకొని చేస్తే ట్రోఫీకి కుడివైపు నిలబడిన బాబర్ ఆజం జట్టు కప్ గెలవబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే చాలా మంది అభిమానులు బలంగా నమ్ముతున్న మరో సెంటిమెంట్‌ను కూడా బలంగా నమ్ముతున్నారు. అదేంటంటే 1992 వన్డే వరల్డ్‌కప్. అప్పటి ఇమ్రాన్ నాయకత్వంలోని జట్టు.. ఇప్పటి బాబర్ ఆజం సేన దాదాపు ఒకేలాగా సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక సెమీఫైనల్లో అద్భుత ఆటతీరు కనబరిచిన పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది. 1992 లాగే ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఇంగ్లండ్‌తో అమితుమీ తేల్చుకోనుంది. మరి పైన చెప్పుకున్నట్లు ట్రోఫీకి కుడిపక్కన నిల్చున్న బాబర్ ఆజం కప్ కొట్టనున్నాడా లేదా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. Pakistan and England have scaled the heights to reach the #T20WorldCup final 💥 Who will come out on top at the MCG? 🏆 pic.twitter.com/J8Azf7belP — ICC (@ICC) November 12, 2022 చదవండి: సూపర్-12లో వెళ్లాల్సినోళ్లు ఫైనల్ దాకా.. హేడెన్ చలవేనా! T20 WC 2022: ఫైనల్లో పాక్ గెలిస్తే, బాబర్ ఆజమ్ ప్రధాని అవుతాడు..! -
T20 WC 2022 Final: హేల్స్ రెచ్చిపోతే.. పాక్ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు..!
ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య రేపు (నవంబర్ 13) జరిగే టీ20 వరల్డ్‌కప్-2022 అంతిమ సమరంలో గెలుపు కోసం ఇరు జట్లు సర్వ శక్తులు ఓడ్డనున్నాయి. హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్న ఫైనల్లో దాయాది పాక్ సెంటిమెంట్లను నమ్ముకుంటే.. ఇంగ్లండ్ మాత్రం ప్రతిభపైనే ఆధాపడింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో అదృష్టం కొద్దీ ఫైనల్ దాకా వచ్చిన పాక్.. 1992 వన్డే వరల్డ్‌కప్ సీన్ రిపీట్ అవుతుందని ధీమా ఉంటే, ఇంగ్లండ్.. పాక్ అంచనాలను తల్లకిందులు చేసేందుకు సమాయత్తమవుతుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో నాసిరకమైన ప్రదర్శనతో నెట్టుకొచ్చిన పాక్.. ఫైనల్లోనూ అదే ప్రదర్శన కొనసాగిస్తే ఒట్టి చేతులు ఊపుకుంటూ ఇంటి దారి పట్టాల్సింది వస్తుందని విశ్లేకులు అంచనా వేస్తున్నారు. మరోపక్క, ఇంగ్లండ్.. ప్రస్తుత టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉంది. ఒక్క ఐర్లాండ్ చేతిలో పరాభవం తప్పించి, దాదాపు అన్ని మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ఆట ఆడింది. అన్ని విభాగాల్లో ప్రపంచ స్థాయి జట్టుకు ఏమాత్రం తీసిపోకుండా రాణించింది. ఇదే ఫామ్‌ను బట్లర్ సేన టైటిల్ పోరులోనూ కొనసాగిస్తే.. పాక్ పరాజయాన్ని అడ్డుకోవడం దాదాపుగా ఆసాధ్యమేనని చెప్పాలి. ముఖ్యంగా భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అలెక్స్ హేల్స్ మరోసారి చెలరేగితే పాక్ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో హేల్స్.. 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు భారత్‌తో జరిగిన సెమీస్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమైన మార్క్ వుడ్ ఫైనల్ మ్యాచ్‌లో తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఇంగ్లండ్ బౌలింగ్‌లో మరింత పటిష్టంగా మారుతుంది. మొత్తంగా ఇరు జట్ల బలాబలాలను పోలిస్తే.. పాక్‌పై ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని చెప్పాలి. చదవండి: ఫైనల్లో ఇంగ్లండ్‌పై పాక్ గెలిస్తే, బాబర్ ఆజమ్ ప్రధాని అవుతాడు..! -
ఫైనల్ చేరగానే కొమ్ములొచ్చాయా?.. విషం చిమ్మిన రమీజ్ రాజా
టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఫైనల్‌కు వెళ్లిందనగానే పీసీబీ చైర్మన్ రమీజ్ రాజాకు కొమ్ములొచ్చాయి. టీమిండియాపై మరోసారి తన అక్కసును వెళ్లగకక్కాడు. పాకిస్తాన్ జట్టు ఫైనల్ వెళ్లినందుకు ప్రశంసలు కురిపించడం తప్పులేదు.. కానీ అదే సమయంలో పని గట్టుకొని టీమిండియాపై విషం చిమ్మడం ఎందుకంటూ క్రికెట్ అభిమానులు విమర్శలు చేశారు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకొని టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే సూపర్-12 దశలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో పాక్ కథ ముగిసిందనుకున్నారు. కానీ అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో అదృష్టం కలిసి వచ్చి పాకిస్తాన్ సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే సెమీస్‌లో కివీస్‌పై మంచి ప్రదర్శన కనబరిచి మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. అదే సమయంలో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. దీనిని అవకాశంగా తీసుకున్న పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా టీమిండియా, బీసీసీఐను హేళన చేస్తూ మాట్లాడాడు. తమ టీమ్‌పై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లకు ఇప్పుడు సమాధానం దొరికిందని.. అదే సమయంలో బిలియన్ డాలర్ ఇండస్ట్రీ టీమ్(టీమిండియా) ఇంటికెళ్లిపోయిందంటూ పేర్కొన్నాడు. "మా టీమ్‌పై మాకు అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి వరల్డ్ క్రికెట్ ఎంత వెనుకబడిపోయిందో పాకిస్థాన్ క్రికెట్ ఎంత ముందుకెళ్లిపోయిందో. ఈ వరల్డ్‌కప్‌లో అది తెలిపి వచ్చింది. టీమిండియా లాంటి బిలియన్ డాలర్ టీమ్స్ వెనుకబడిపోతే మా టీమ్ పైకెళ్లిపోయింది. అంటే కొన్ని విషయాలను మేము సరి చేస్తున్నామనే కదా అర్థం. గత నెలలోనే ముగ్గురు ప్లేయర్స్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచారు. ఇది చాలు మేమేంటో చెప్పడానికి" అంటూ గొప్పలు చెప్పుకున్నాడు. అయితే రమీజ్ రాజా వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానుల ధీటుగా బదులిచ్చారు. టీమిండియాపై విషం చిమ్మడం ఆపండి.. సందు దొరికితే చాలు టీమిండియాపై పడిపోతావు.. నీకు వేరే పని లేదనుకుంటా.. ఫైనల్‌కు వెళ్లగానే కాదు.. ఇంగ్లండ్ చేతిలో పాక్‌కు మూడింది.. పాక్‌ను చావుకొట్టడం ఖాయం అంటూ రమీజ్ రాజాకు చురకలంటించారు. ఇక టి20 వరల్డ్‌కప్ ఫైనల్ ఆదివారం (నవంబర్ 13న) మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు మెల్బోర్న్లో 95 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా సెమీఫైనల్‌కు,ఫైనల్‌కు రిజర్వ్‌డేను ఐసీసీ కేటాయించింది. కాబట్టి ఒక వేళ ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి, ఆదివారం ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి రిజర్వ్ డే(సోమవారం)లో కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. -
సూపర్-12లో వెళ్లాల్సినోళ్లు ఫైనల్ దాకా.. హేడెన్ చలవేనా!
టి20 ప్రపంచకప్ 2022 నవంబర్ 13న ముగియనుంది. ఈ ఆదివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్‌తో పాకిస్తాన్ అమితుమీ తేల్చుకోనుంది. సూపర్-12 దశలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి.. దీంతో పాక్ కథ ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ వారికి ఎక్కడో సుడి రాసిపెట్టుంది. అందుకే ఆ తర్వాత పాక్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా గెలవడం.. ఆపై సౌతాఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడంతో కథ అడ్డం తిరిగింది. అనూహ్యంగా పాకిస్తాన్ సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే కీలకమైన సెమీస్‌లో మాత్రం అద్భుత ఆటతీరును కనబరిచింది. సూపర్-12 వరకు కిందా మీదా పడి ఎలాగోలా గెలిచిన పాకిస్తాన్ జట్టేనా సెమీస్‌లో కివీస్‌పై నెగ్గింది అన్న అనుమానాలు వచ్చాయి. మరి రెండు రోజుల వ్యవధిలో పాక్ జట్టులో అంత మార్పు ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి కారణం మాత్రం ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్ అని క్రీడా పండితులు పేర్కొన్నారు. ప్రస్తుతం మాథ్యూ హెడెన్ పాకిస్తాన్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. పాక్ దశను మార్చే పనిలో ఉన్న హేడెన్ దాదాపు సక్సెస్ అయినట్లే. ఇక ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి పాకిస్తాన్ విజేతగా నిలిస్తే హేడెన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్లే. ఇదంతా ఎందుకు.. అసలు ఆస్ట్రేలియాలోని పిచ్‌లపై పూర్తి అవగాహన ఉన్న ఆ దేశ మాజీ క్రికెటర్‌ను ఎప్పుడైతే మెంటార్‌గా ఏంచుకుందో అప్పుడే పాక్ సగం సక్సెస్ అయినట్లే. అయితే హేడెన్ ప్రభావం తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది.. అది కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో. నిజానికి గతేడాది టి0 ప్రపంచకప్‌కు ముందే అంటే సెప్టెంబర్‌లోనే మాథ్యూ హెడెన్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. కానీ ఆ ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. ప్రధాన కోచ్ అంటే అన్ని విషయాలు పరిశీలిస్తాడు. అదే బౌలింగ్ లేదా బ్యాటింగ్ కోచ్ అయితే కేవలం వారి పరిధి వరకే పనిచేస్తారు. ప్రస్తుతం పాక్ ప్రధాన కోచ్‌గా సక్లెయిన్ ముస్తాక్ ఉన్నాడు. పీసీబీ ఎంపిక చేసింది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. ఇటు చూస్తే ఈసారి ప్రపంచకప్ జరుగుతుంది ఆస్ట్రేలియాలో.బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న హేడెన్‌కు ఆసీస్ పిచ్‌లపై అపార అనుభవం ఉంది. అందుకే ఉన్నపళంగా మాథ్యూ హేడెన్‌ను మెంటార్‌గా నియమించిన పీసీబీ మహ్మద్ యూసఫ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా ఎన్నుకుంది. హేడెన్ అనుభవాన్ని పాకిస్తాన్ చక్కగా ఉపయోగించుకుందనడానికి సెమీస్ మ్యాచ్ ఉదాహరణ. ముందు బౌలింగ్‌తో కివీస్‌ను కట్టడి చేయగా.. ఆ తర్వాత అసలు ఫామ్‌లో లేని బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లు అసలు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలతో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మరి వీటన్నింటి వెనుక కారణం హేడెన్ అంటే అతిశయోక్తి కాదు. అందుకే మ్యాచ్ ముగియగానే హేడెన్ వద్దకు పరిగెత్తుకొచ్చిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం అతన్ని ప్రేమతో హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. సూపర్-12 దశలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తమ జట్టు ముందుకు సాగుతుందా లేదా అని డైలమాలో ఉన్నాడు.. కానీ ఇదే సమయంలో హేడెన్ మాత్రం మా కుర్రాళ్లు తప్పుకుండా రాణిస్తారు.. ఈసారి కప్ పాకిస్తాన్‌దే అని ప్రతీ మ్యాచ్‌కు ముందు చెప్పుకుంటూ వస్తున్నాడు. హేడెన్ వ్యాఖ్యలని బట్టి చూస్తే పాక్ విజయంపై అతను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో అర్థమవుతుంది. ఇక పరిస్థితులు కూడా పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నాయి. 1992 వన్డే వరల్డ్కప్లాగే ఇప్పుడు కూడా పాక్ టైటిల్ కొట్టబోతుంటూ పలువురు జోస్యం చెబుతున్నారు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్‌గా టైటిల్ గెలిచాడు. ఇప్పుడు బాబర్ ఆజం కెప్టెన్‌గా తొలి ఐసీసీ ట్రోఫీని అందుకోబోతున్నాడంటూ పేర్కొంటున్నారు. మరి హేడెన్ దిశానిర్ధేశం పాక్ జట్టుకు ఎంత వరకు పనిచేస్తుందనేది ఫైనల్ మ్యాచ్ పూర్తయ్యాకే తెలుస్తుంది. కాగా కివీస్‌పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాకా.. డ్రెస్సింగ్ రూమ్‌లో హేడెన్ ఇచ్చిన స్పీచ్‌ను పీసీబీ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ జోస్యాల సంగతి పక్కనబెడితే టి20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. పాక్ సంగతి పక్కనబెడితే ఇంగ్లండ్ అంతకంటే బలంగా కనిపిస్తుంది. టీమిండియాతో సెమీస్‌లో ఇంగ్లండ్ ఆడిన ఆటతీరు చూస్తే అర్థమవుతుంది. కానీ పాక్ జట్టులో ప్రస్తుతం బౌలింగ్ విభాగం నెంబర్‌వన్‌గా ఉంది. షాహిన్ అఫ్రిది, మహ్మద్ వసీమ్, నసీమ్ షా పేస్ త్రయానికి తోడుగా మమ్మద్ నవాజ్ స్పిన్ కూడా పెద్ద బలం. మరి అరివీర భయంకరంగా కనిపిస్తున్న పాక్ పేసర్లను ఇంగ్లండ్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. ఇవన్నీ పక్కనబెడితే క్రికెట్ అభిమానులు మాత్రం ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. కొందరేమో 1992 సీన్ రిపీట్ కాబోతుందని.. పాకిస్తాన్‌దే కప్ అని పేర్కొంటున్నారు. అయితే కొంతమంది మాత్రం పాక్‌కు అంత సీన్ లేదని.. మ్యాచ్ కచ్చితంగా వన్‌సైడ్ అవుతుందని.. ఇంగ్లండ్ రెండోసారి విశ్వవిజేతగా నిలవనుందని తెలిపారు. చదవండి: కాలం ఒకేలా ఉండదు.. తిట్టినోడే చప్పట్లతో మెచ్చుకున్నాడు ఆటలో లోపం లేదు.. టాలెంట్‌కు కొదువ లేదు.. ఎప్పుడు గుర్తిస్తారో! -
1992 సీన్ రిపీట్ కానుందా.. అయితే పాక్‌దే టైటిల్!
టి20 ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా సెమీఫైనల్లోనే వెనుదిరగడంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. సూపర్-12 దశలోనే ఇంటికి వెళుతుందనుకున్న పాకిస్తాన్ ఆఖర్లో కీలక విజయాలతో కాస్త అదృష్టం కూడా తోడవ్వడంతో సెమీస్‌లో కివీస్‌పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. అటు ఇంగ్లండ్ మాత్రం సూపర్-12 దశలో పడుతూ లేస్తూ తమ ప్రయాణం కొనసాగించినప్పటికి అసలైన మ్యాచ్‌లో మాత్రం జూలు విదిల్చింది. సెమీస్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టీమిండియాకు చరిత్రలో మరిచిపోలేని పరాజయాన్ని ఇచ్చింది. అలా మొత్తానికి నవంబర్ 13న మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్‌లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఫైనల్ పోరు జరగకముందే రంగంలోకి దిగిన క్రీడా పండితులు అప్పుడే విజేత ఎవరనేది అంచనా వేస్తున్నారు. చాలా మంది క్రీడా పండితులు.. 1992 వన్డే వరల్డ్‌కప్ సీన్ రిపీట్ కానుందంటూ జోస్యం చెబుతున్నారు. కొందరు మాత్రం అంత సీన్ లేదని.. ఫైనల్ వన్‌సైడ్ జరగడం ఖాయమని.. ఇంగ్లండ్ పెద్ద విజయంతోనే టైటిల్ గెలవబోతుందని పేర్కొన్నారు. ఈ సంగతి పక్కనబెడితే ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆటతీరు చూస్తే యాదృశ్చికమో లేక అలా జరిగిందో తెలియదు కానీ అచ్చం 1992 వన్డే వరల్డ్‌కప్‌ను తలపిస్తుంది. 1992 వన్డే వరల్డ్‌కప్‌లో ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్‌ను నడిపించాడు. ఆ వరల్డ్‌కప్‌లో లీగ్ దశలో టీమిండియాతో ఓడిపోవడం.. ఆ తర్వాత ఇంటిబాట పట్టాల్సిన పాక్ అదృష్టానికి తోడుగా ఆఖరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనతో సెమీస్‌కు రావడం.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తోనే సెమీస్ ఆడి ఫైనల్‌కు ఎంటరవ్వడం.. ఇక ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఇమ్రాన్ నాయకత్వంలోని పాక్ జట్టు జగజ్జేతగా నిలవడం జరిగిపోయింది. తాజా వరల్డ్‌కప్‌లోనూ బాబర్ సేనకు 1992 పరిస్థితులే కనిపించాయి. సూపర్-12 దశలో టీమిండియా చేతిలో ఓడడం.. ఆపై ఇంటిబాట పట్టాల్సిన పాకిస్తాన్ బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై విజయాలు సాధించడం.. అదే సమయంలో ప్రొటిస్ నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడం పాక్‌కు అదృష్టంగా మారింది. ఈ దెబ్బతో సెమీస్‌లో అడుగుపెట్టిన పాకిస్తాన్ అక్కడ న్యూజిలాండ్‌ను చావుదెబ్బ కొట్టి ముచ్చటగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ► 1992 వన్డే వరల్డ్‌కప్, 2022 టి20 వరల్డ్‌కప్‌లో పాక్ ఆట సాగిన విధానం.. 1992 వన్డే వరల్డ్‌కప్: అప్పటి వన్డే వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియానే ఆతిథ్యం 2022 టి20 వరల్డ్‌కప్: ఇప్పుడు కూడా ఆస్ట్రేలియానే ఆతిథ్యం 1992: మెల్బోర్న్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి 2022: అదే మెల్బోర్న్లో టీమిండియా చేతిలోనే ఓటమి 1992: ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపు 2022: నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపు 1992: లీగ్ దశలో చివరి రోజు ఒక్క పాయింట్ ఎక్కువగా ఉన్న పాకిస్తాన్ సెమీస్‌కు అర్హత 2022: తాజాగా సూపర్-12 దశలో నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడడం.. బంగ్లాదేశ్‌పై పాక్ గెలవడం.. దీంతో ఒక్క పాయింట్ ఆధిక్యంతో సెమీస్‌కు అర్హత 1992: సెమీస్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు 2022: సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన పాక్ ఫైనల్‌కు 1992: ఫైనల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచిన పాకిస్తాన్ 2022: ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనున్న పాక్ అయితే జరుగుతున్నది టి20 ప్రపంచకప్ కాబట్టి ఈ అంచనాలు నిజమవుతాయని చెప్పలేం. ఎందుకంటే పొట్టి ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. కానీ అనాలసిస్ చూస్తే మాత్రం పాక్ టైటిల్ కొట్టనుందా అనే అనుమానం కలగక మానదు. కానీ ఇప్పుడున్న ఫామ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించడం పాక్‌కు పెద్ద సవాల్. మరి ఆ సవాల్‌ను జయించి పాక్ విశ్వవిజేతగా నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే నవంబర్ 13 వరకు ఆగాల్సిందే. చదవండి: IND Vs ENG: మాట నిలబెట్టుకున్న జాస్ బట్లర్ రోహిత్ శర్మపై ఫ్యాన్స్ ఫైర్.. ఐపీఎల్ కెప్టెన్ అంటూ.. Just like 1992, it’s Pakistan vs England in a final at the MCG! 🇵🇰🏴#T20worldcup22 pic.twitter.com/JIgdNkKCJg — Ansar waris (@Ansarwaris112) November 10, 2022 Just like 1992, it’s #Pakistan vs #England in a final at the MCG! 🇵🇰🏴#T20WorldCup2022#Cricket #cricketchallenge #T20WorldCup pic.twitter.com/jvojJmEL7V — Imran Katoch (@ImranKatoch955) November 10, 2022 Incredible moments captured at the Adelaide Oval after England's thumping win 📸#T20WorldCup | #INDvENG pic.twitter.com/NXqiNLbmrg — ICC (@ICC) November 10, 2022 -
అన్నీ కుదిరితే ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్!
టి20 ప్రపంచకప్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా మారింది. అన్ని దారులు మూసుకుపోయాయన్న దశలో పాకిస్తాన్ అనూహ్యంగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై సంచలన విజయాలు సాధించి సెమీస్‌లో అడుగుపెట్టగా.. కచ్చితంగా సెమీస్‌కు వెళుతుందనుకున్న దక్షిణాఫ్రికా ఒత్తిడిలో మరోసారి చిత్తయ్యి లీగ్ దశలోనే నిష్క్రమించింది. కాగా జింబాబ్వేతో మ్యాచ్‌లో 71 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా గ్రూప్-1 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే టీమిండియా, పాకిస్తాన్‌లు సెమీఫైనల్‌కు వెళ్లడంపై ఇరుదేశాల అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్ని సరిగ్గా కుదిరితే మాత్రం ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్‌లు తలపడితే చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. మాములుగానే ఐసీసీ లాంటి మేజర్ టోర్నీల్లో చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయంటేనే ఫుల్ జోష్ ఉంటుంది. అలాంటిది ఈ రెండు జట్లు ఒక మెగాటోర్నీ ఫైనల్లో తలపడుతున్నాయంటే ఎంత హైవోల్టేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2007 తొలి ఎడిషన్ టి20 ప్రపంచకప్‌లో ఫైనల్లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన టీమిండియా చాంపియన్‌గా అవతరించింది. అయితే సెమీస్‌లో టీమిండియా ఇంగ్లండ్‌తో, పాకిస్తాన్ న్యూజిలాండ్‌తో అమితుమీ తేల్చుకోనున్నాయి. దీంతో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ను దెబ్బతీయడం టీమిండియాకు సవాల్ అయితే.. భీకరమైన ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్‌ను ఓడించాలంటే పాకిస్తాన్ సర్వశక్తులు ఒడ్డాల్సిందే. అయితే న్యూజిలాండ్‌కు నాకౌట్ ఫోబియా ఉండడం పాక్‌కు కలిసిరానుంది. అప్పటివరకు దుమ్మురేపే న్యూజిలాండ్ నాకౌట్ దశలో మాత్రం చేతులెత్తేస్తుంది. ఇప్పటికే 2015, 2019, 2021 ప్రపంచకప్ టోర్నీల్లో వరుసగా ఫైనల్స్‌లోనే ఓడి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం రోజురోజుకు బలంగా తయారవుతూ వస్తుంది. ఒకటో నెంబర్ నుంచి పదో నెంబర్ దాకా బ్యాటింగ్ ఆడగల సత్తా ఉన్న ఇంగ్లండ్‌ను నిలువరించాలంటే టీమిండియా తన సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. ఏమో అన్ని కలిసొస్తే టీమిండియా, పాక్‌లు ఫైనల్లో తలపడితే చూడాలని సగటు అభిమాని బలంగానే కోరుకుంటున్నాడు. చదవండి: థర్డ్ అంపైర్ నిర్ణయం.. బంగ్లా కెప్టెన్‌కు శాపం -
చెలరేగిన టీమిండియా బౌలర్లు.. 16 పరుగులకే ఐదు వికెట్లు
Womens Asia Cup T20 2022 - India Women vs Sri Lanka Women, Final: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టీమిండియా, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. టాస్ గెలిచిన లంక వుమెన్స్ బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే తమ నిర్ణయం ఎంత తప్పిదమో లంకకు కాసేపటికే అర్థమయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచి లంక క్రికెటర్ల పతనం మొదలైంది. 10 పరుగుల లోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన లంక జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 6 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. టీమిండియా మహిళా బౌలర్లలో రేణుకా సింగ్ మూడు వికెట్లు తీయగా.. రెండు రనౌట్లు ఉండడం విశేషం. ఏడోసారి.. ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ హోదాను నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరింది. ఇప్పటికే ఆరు సార్లు టైటిల్ గెలుచుకున్న భారత్ మరోసారి ట్రోఫీని అందుకోవడంపై దృష్టి పెట్టింది. జట్టు తాజా ఫామ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి చూస్తే అది అసాధ్యమేమీ కాదు. తొలి లీగ్ మ్యాచ్‌లో లంకను సునాయాసంగానే భారత్ ఓడించినా... ఆ జట్టు సెమీస్ తరహాలో సంచలనం సృష్టించే అవకాశాలను తక్కువ చేయలేం. అప్డేట్: భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. చదవండి: T20 WC 2022: రోహిత్ నాకంటే పెద్దవాడు! ఇంట్లో వాళ్లు బాగున్నారా? ఏ కారు కొంటున్నావు.. మేము మాట్లాడుకునేది ఇవే! Virat Kohli: ఈ ఏడాది 23 మందిలో 'కింగ్' కోహ్లి ఒక్కడే.. -
ఏడో టైటిల్ వేటలో భారత్
సిల్హెట్: ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ హోదాను నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరింది. ఇప్పటికే ఆరు సార్లు టైటిల్ గెలుచుకున్న భారత్ మరోసారి ట్రోఫీని అందుకోవడంపై దృష్టి పెట్టింది. జట్టు తాజా ఫామ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి చూస్తే అది అసాధ్యమేమీ కాదు. ఈ క్రమంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టుతో హర్మన్ సేన తలపడనుంది. తొలి లీగ్ మ్యాచ్‌లో లంకను సునాయాసంగానే భారత్ ఓడించినా... ఆ జట్టు సెమీస్ తరహాలో సంచలనం సృష్టించే అవకాశాలను తక్కువ చేయలేం. ఇలాంటి నేపథ్యంలో నేడు తుది పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. సమష్టి ప్రదర్శనతో... లీగ్ దశలో పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడం మినహా ఓవరాల్‌గా టోర్నీలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అన్ని మ్యాచ్‌లు (7) ఆడిన ముగ్గురు ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్ అత్యధిక పరుగులు (215) సాధించగా, దీప్తి శర్మ అత్యధిక వికెట్లు (13) తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. షఫాలీ వర్మ కూడా ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు సానుకూలాంశం. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన (4 ఇన్నింగ్స్‌లలో కలిపి 83 పరుగులు) మాత్రం ఆశించిన రీతిలో ఆడలేకపోయినా, ఫైనల్లోనైనా చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. దీప్తి శర్మతో పాటు స్నేహ్ రాణా, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్‌ల స్పిన్ ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగలదు. దీప్తి సూపర్ ఫామ్‌లో ఉండటంతో ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవు. భారత్‌తో పోలిస్తే చమరి అటపట్టు కెప్టెన్సీలోని శ్రీలంక జట్టు బలహీనమనేది వాస్తవం. అయితే పాక్‌తో సెమీఫైనల్లో ఆ జట్టు చివరి బంతి వరకు కనబర్చిన స్ఫూర్తిదాయక ప్రదర్శన చూస్తే తేలిగ్గా ఓటమిని అంగీకరించే తరహా టీమ్ మాత్రం కాదని తెలుస్తోంది. తుది పోరులో ఆ జట్టు పోరాటం ఎంత వరకు సఫలం అవుతుందనేది చెప్పలేం. -
సంయుక్తంగా రాణించిన బ్యాటర్లు.. పాకిస్తాన్‌దే ట్రై సిరీస్
న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో జరిగిన ముక్కోణపు టి20 టోర్నీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌కు ఈ విజయం మంచి ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రై సిరీస్‌కు ముందు ఆసియా కప్ ఫైనల్.. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ల్లో పాకిస్తాన్ ఓటమిపాలయింది. ఇక శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. పాక్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 34 పరుగులు), మహ్మద్ నవాజ్(22 బంతుల్లో 38 పరుగులు), హైదర్ అలీ(15 బంతుల్లో 31 పరుగులు).. చివర్లో ఇప్తికర్ అహ్మద్(14 బంతుల్లో 25 నాటౌట్) సంయుక్తంగా రాణించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 59 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గ్లెన్ పిలిప్స్ 29, మార్క్ చాప్మన్ 25 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హారిస్ రౌఫ్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్, నవాజ్‌లు చెరొక వికెట్ తీశారు. రేపు(శనివారం) ఆస్ట్రేలియాకు బయలుదేరనున్న పాకిస్తాన్ జట్టు టి20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్ 23న(ఆదివారం)తమ తొలి మ్యాచ్ ఆడనుంది. Nawaz and Iftikhar finish it for Pakistan in the final over 🏆#NZvPAK — ESPNcricinfo (@ESPNcricinfo) October 14, 2022 చదవండి: జర్నలిస్ట్ తిక్క ప్రశ్న.. బాబర్ ఆజం దిమ్మతిరిగే కౌంటర్ -
సౌరాష్ట్ర 380 ఆలౌట్.. రెస్టాఫ్ ఇండియా టార్గెట్ 104 పరుగులు
రాజ్‌కోట్: ఇరానీ కప్‌లో భాగంగా సౌరాష్ట్ర రెస్ట్ ఆఫ్ ఇండియా ముందు 104 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆటకు రెండు రోజుల సమయం మిగిలి ఉండడంతో రెస్టాఫ్ ఇండియా విజయం దాదాపు ఖాయమే. ఇక ఓవర్‌నైట్ స్కోరు 368/8తో నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌరాష్ట్ర మరో 12 పరుగులు మాత్రమే చేసి 380 పరుగులకు ఆలౌట్ అయింది. జైదేవ్ ఉనాద్కట్ 89 పరుగులు చేసి ఔట్ కాగా.. మిడిలార్డర్లో షెల్డన్ జాక్సన్ (71; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), అర్పిత్ (55; 7 ఫోర్లు, 1 సిక్స్), లోయర్ ఆర్డర్లో ప్రేరక్ మన్కడ్ (72; 9 ఫోర్లు) రాణించారు. దీంతో సౌరాష్ట్రకు 104 పరుగుల ఆధిక్యం లభించింది. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలోకుల్దీప్ సేన్ ఐదు వికెట్లు తీయగా.. సౌరభ్ 3 వికెట్లు తీశాడు. -
294 పరుగులతో సౌత్‌జోన్ ఓటమి.. దులీప్ ట్రోఫీ విజేత వెస్ట్‌జోన్
దులీప్ ట్రోఫీ 2022 విజేతగా వెస్ట్‌జోన్ నిలిచింది. 529 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్జోన్రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో 294 పరుగులతో వెస్ట్‌జోన్ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగుల క్రితం రోజు స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన సౌత్‌జోన్ మరో 80 పరుగులు చేసి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. సౌత్‌జోన్ బ్యాటింగ్‌లో రోహన్ కన్నుమ్మల్ 93 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హైదరాబాద్‌కు చెందిన రవితేజ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీతో మెరిసిన రవితేజ 53 పరుగులు చేసి ఔటయ్యాడు. వెస్ట్‌జోన్ బౌలర్లలో షామ్స్ ములాని 4, జైదేవ్ ఉనాద్కట్, అతిత్ సేత్ తలా రెండు వికెట్లు తీయగా.. తనుస్ కొటేన్, చింతన్ గజా చెరొక వికెట్ తీశారు. డబుల్ సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. జైదేవ్ ఉనాద్కట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 376/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్‌జోన్ 4 వికెట్లకు 585 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (265; 30 ఫోర్లు, 4 సిక్స్‌లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 56 పరుగులు జోడించి అవుటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (127 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్) సెంచరీతో చెలరేగగా... హెట్ పటేల్ (51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌జోన్ 327 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'అండర్సన్ రిటైర్ అయితే ఇలానే ఏడుస్తానేమో!' BGT in 2021, Duleep Trophy in 2022 - Rahane continues to dominate as a captain in red ball format. pic.twitter.com/s3V6bxsUEE — Johns. (@CricCrazyJohns) September 25, 2022 -
శతకం బాదిన సర్ఫరాజ్ ఖాన్.. సౌత్‌జోన్ విజయలక్ష్యం 529
దులీప్ ట్రోఫీ ఫైనల్ 2022లో భాగంగా వెస్ట్‌జోన్.. సౌత్‌జోన్ ముందు 529 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 3 వికెట్ల నష్టానికి 376 పరుగుల క్రితంరోజు స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 585 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా వెస్ట్‌జోన్‌కు 528 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. డబుల్ సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ 265 పరుగులు చేసి ఔటవ్వగా.. శ్రేయాస్ అయ్యర్ 71 పరుగులు స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ శతకంతో చెలరేగాడు. సౌత్‌జోన్ బౌలర్లను ఉతికారేసిన సర్ఫరాజ్ 178 బంతుల్లో 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. సర్ఫరాజ్‌కు తోడుగా హేల్ పటేల్ కూడా అర్థ సెంచరీతో రాణించాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 318/7తో ఆట కొనసాగించిన సౌత్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ఫెదరర్ మ్యాచ్‌కు ముందు నాటకీయ పరిణామం.. పిచ్చి పరాకాష్టకు డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్.. -
పాక్‌ను మట్టికరిపించాక కొలొంబో వీధులు దద్దరిల్లాయి..!
ఓ పక్క ఆర్ధిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి.. మరో పక్క చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం, బ్రతుకు భారమై ప్రజలంతా రోడ్లెక్కడం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల నడుమ బతుకీడుస్తున్న ద్వీప దేశం శ్రీలంక ప్రజలకు ఓ వార్త భారీ ఊరట కలిగించింది. నిన్న (సెప్టెంబర్ 11) దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్-2022 ఫైనల్లో లంక జట్టు తమకంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్‌కు షాకిచ్చి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా టోర్నీ బరిలోకి దిగిన శ్రీలంక.. ఫైనల్లో పాక్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంక గెలుపొందగానే ద్వీప దేశంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. మాజీ అధ్యక్షుడు గొటబాయ దేశం వదిలి పలాయనం చిత్తగించిన తర్వాత జనాలు మళ్లీ ఆ స్థాయిలో రోడ్లెక్కి సంబురాలు చేసుకున్నారు. కర్ఫ్యూ అంక్షలు సైతం పట్టించుకోని జనం కొలొంబో వీధుల్లో జాతీయ జెండాలు చేతబూని నానా హంగామా చేశారు. ముఖ్యంగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన యువత చాలాకాలం తర్వాత రోడ్డపైకి వచ్చి డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడిపారు. వారి సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఈ టోర్నీలో శ్రీలంక పుంజుకున్న తీరును ఆ దేశ ప్రజలు గొప్పగా చెప్పుకున్నారు. విజయ గర్వంతో నినాదాలు చేస్తూ హోరెత్తించారు. Unlimited HAPPY 😊 Congratulations @OfficialSLC Team! We celebrate #AsiaCup2022Final #Srilankan #SriLanka #Amapara #addalaichenaiBoys @Wanindu49 @dasunshanaka1 @SriLankaTweet @AzzamAmeen @KumarSanga2 @MahelaJay @RusselArnold69 @RajapaksaNamal @fernandoharin pic.twitter.com/iJAJE64Cgy — 𝗦𝗮𝗳𝗻𝗲𝗲 ✹ (@SafneeOfficial) September 11, 2022 కాగా, టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భంగపడ్డ శ్రీలంక.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, పాక్‌లపై వరుస విజయాలు సాధించి టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఫైనల్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. తొలుత 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టుకోల్పోయింది. అయితే భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు).. హసరంగ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్) సాయంతో చెలరేగి శ్రీలంకు డిఫెండింగ్ టోటల్‌ను (170/6) అందించాడు. ఛేదనలో పాక్ ఓ సమయంలో విజయం దిశగా సాగినప్పటికీ.. లంక బౌలర్లు ప్రమోద్ మధుశన్ (4/34), హసరంగ (3/27), చమిక కరుణరత్నే (2/33) చెలరేగి పాక్ ఆటకట్టించారు. పాక్ నిర్ణీత ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. -
ఎన్నాకెన్నాళ్లకు.. ఆసియా కప్‌తో లంకలో పండుగ (ఫొటోలు)
-
పాకిస్తాన్‌పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్
15వ ఎడిషన్ ఆసియా కప్ విజేతగా శ్రీలంక అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ట్రోఫిని అందుకుంది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహ్మద్ రిజ్వాన్(55 పరుగులు), ఇఫ్తికర్ అహ్మద్(32 పరుగులు) క్రీజులో ఉన్నంత వరకు లక్ష్యం దిశగానే సాగింది. అయితే లంక బౌలర్ ప్రమోద్ మదుషన్ నాలుగు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా.. స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా కీలక సమయంలో మూడు వికెట్లతో మెరిశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 71, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. అంతకముందు దనుంజయ డిసిల్వా 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో వనిందు హసరంగాతో కలిసి రాజపక్స ఆరో వికెట్‌కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 36 పరుగులు చేసి హసరంగా వెనుదిరిగిన తర్వాత రాజపక్స పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు చమిక కరుణరత్నే(14 బంతుల్లో 14 పరుగులు) చక్కగా సహకరించడంతో చివరి ఐదు ఓవర్లలో 64 పరుగులు రావడం విశేషం.పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. కాగా శ్రీలంక ఆసియా కప్‌ను సొంతం చేసుకోవడం ఇది ఆరోసారి. తాజాగా దాసున్ షనక కెప్టెన్సీలో లంక టైటిల్ నెగ్గగా.. చివరగా 2014లో ఏంజల్లో మాథ్యూస్ నేతృత్వంలోని లంక జట్టు వన్డే ఫార్మాట్లో జరిగిన అప్పటి ఆసియా కప్‌లోనూ పాక్‌ను ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన రాజపక్స..
ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఫైనల్ పోరులో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 71, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. అంతకముందు దనుంజయ డిసిల్వా 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన లంక.. కనీసం 150 పరుగుల మార్క్‌ను దాటుతుందా అన్న అనుమానం కలిగింది. కానీ వనిందు హసరంగాతో కలిసి రాజపక్స ఆరో వికెట్‌కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 36 పరుగులు చేసి హసరంగా వెనుదిరిగిన తర్వాత రాజపక్స పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు చమిక కరుణరత్నే(14 బంతుల్లో 14 పరుగులు) చక్కగా సహకరించడంతో చివరి ఐదు ఓవర్లలో 64 పరుగులు రావడం విశేషం. శ్రీలంక స్కోరు 170 ఉండగా.. అందులో రాజపక్సవే 71 పరుగులు ఉన్నాయి. పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: Kushal Mendis: అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు -
ఫైనల్ బరిలో శ్రీలంక, పాకిస్తాన్.. ఆసియా కప్ కొట్టేదెవరు?
ఆసియా కప్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. ఇవాళ్టి ఫైనల్లో పాకిస్తాన్, శ్రీలంక తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు చూసుకుంటే ఆసియా కప్‌లో చాలా మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జట్టుదే పైచేయిగా నిలిచింది. దీంతో టాస్ మరోసారి కీలకం కానుంది. ఇక సూపర్-4 దశలో పాకిస్తాన్‌ను ఓడించిన లంక మరింత ఆత్మవిశ్వాసంతో ఫైనల్ ఆడనుంది. ఆసియా కప్ ప్రారంభంలో తమ తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిన శ్రీలంక ఆ తర్వాత ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లంక పటిష్టంగా కనిపిస్తుంది. ఓపెనర్లు నిసాంక, కుశాల్‌లతో పాటు భానుక రాజపక్స బ్యాట్‌తో చెలరేగుతున్నారు. డెత్ ఓవర్లలో కెప్టెన్ షనక, హసరంగ కూడా రాణిస్తుండటం, బౌలింగ్‌లో తీక్షణ, మదుశంక స్థిరంగా వికెట్లు తీయడం జట్టును ఎదురులేని జట్టుగా మార్చింది. గతమ్యాచ్‌లో హసరంగ తన స్పిన్ ఉచ్చులో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ నేపథ్యంలో ఏరకంగా చూసిన లంకను ఆపడం పాక్‌కు కష్టమే! మరోవైపు పాకిస్తాన్ జట్టులో బౌలింగ్ విభాగం బలంగా ఉండగా.. బ్యాటింగ్‌లో మాత్రం కాస్త వీక్‌గా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో ఎదురుపడిన శ్రీలంకతో తేలిపోయింది. ఆ మ్యాచ్‌లో ఐదో వరుస బ్యాటర్స్ దాకా ఒక్క కెప్టెన్ బాబర్ ఆజమ్ మినహా ఇంకెవరూ 14 పరుగులైనా చేయలేకపోవడం జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని చూపిస్తోంది. మిడిలార్డర్ కూడా లంక బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయింది. 20 ఓవర్ల కోటా కూడా పూర్తిగా ఆడలేక 121 పరుగులకే ఆలౌట్ అవడం పాక్ నిలకడలేమికి అద్దం పడుతోంది. అయితే పాక్ బౌలింగ్ విభాగం బలంగా ఉండడం సానుకూలాంశం. శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), దనుష్క గుణతిలక, ధనంజయ డి సిల్వా, భానుక రాజపక్సే, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్ -
లంకదే ఆసియాకప్.. ముందే నిర్ణయించారా!
15వ ఎడిషన్ ఆసియా కప్ టోర్నీ ముగింపుకు మరొక్క రోజు మాత్రమే మిగిలింది. వరల్డ్ కప్ అంత కాకపోయినా.. ఆసియా ఖండంలో చాంపియన్‌గా నిలిచే అవకాశం ఆసియా కప్ ద్వారా ఉపఖండంలో ఉన్న జట్లకు అవకాశం ఉంటుంది. అయితే ఎన్నో అంచనాల మధ్య ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా సూపర్-4 దశలోనే వెనుదిరిగింది. ప్రభావం చూపిస్తుందనుకున్న బంగ్లాదేశ్.. పసికూన హాంకాంగ్ కంటే దారుణంగా ఆడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఇక ఫైనల్ పోరు సెప్టెంబర్ 11న(ఆదివారం) పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరగనుంది. ఇక ఆసియా కప్‌ను అత్యధికంగా భారత్ ఏడుసార్లు గెలవగా.. శ్రీలంక ఐదుసార్లు, పాకిస్తాన్ రెండుసార్లు టైటిల్స్ అందుకున్నాయి. మరి 15వ ఎడిషన్ ఆసియాకప్‌ను శ్రీలంక, పాకిస్తాన్లలో ఎవరు అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి ఆసియా కప్‌ను లంకకు అందివ్వాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ముందుగానే నిర్ణయం తీసుకుందా అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. మొదట ఆసియా కప్‌ను నిర్వహించాల్సింది శ్రీలంకలోనే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ఆసియా కప్‌ను నిర్వహించలేమని చెప్పేసింది. దీంతో ఆఖరి నిమిషంలో ఆసియా కప్ వేదికను శ్రీలంక నుంచి యూఏఈకి మార్చారు. ఇక గత కొన్ని నెలలుగా శ్రీలంక ఎంతో ఆర్థిక సంక్షోభానికి గురయ్యింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స వ్యవహారంపై లంక ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు కొన్ని నెలలపాటు దర్నాలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే లంక టూరిజం బాగా దెబ్బతిని ఆర్థిక సంక్షోభ సమస్య మరింత ముదిరిపోయింది. ముదిరి పాకాన పడడంతో మరో దిక్కులేక దేశం విడిచి పారిపోయిన రాజపక్స తన రాజీనామాను సమర్పించారు. ఆ తర్వాత అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే లంక ఆర్థిక పరిస్థితి గాడినపడ్డట్లు కనిపిస్తోంది. ఇక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక పరిస్థితిని అర్థం చేసుకున్న ఏసీసీ.. లంకను ఆసియాకప్ గెలిచేలా ప్రోత్సహించిందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి శ్రీలంక ఆసియాకప్‌ను కైవసం చేసుకుంటే లంక బోర్డుకు పెద్ద మొత్తంలో అందనున్నట్లు సమాచారం. కాగా లంక క్రికెట్ బోర్డు ఈ మొత్తాన్ని దేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు తమ వంతు సహకారం అందించాలని భావిస్తునట్లు సమాచారం. కాగా ఆసియాకప్‌ను లంక గెలిచినా.. గెలవకపోయినా ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) లంక బోర్డుకు ప్రత్యేక నగదు బహుమతిని అందించాలని ముందే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఆసియా కప్‌ను లంక గెలిచినా.. గెలవకపోయినా.. క్రికెట్ ఫ్యాన్స్ మనసులు మాత్రం గెలుచుకోవడం ఖాయం అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరొక విషయమేంటంటే.. ఎలాగు టీమిండియా సూపర్-4 దశలో వెనుదిరగడంతో.. భారత్ అభిమానుల మద్దతు కూడా శ్రీలంకకే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆట పరంగా ఆసియా కప్‌లో శ్రీలంక ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. లీగ్ దశలో అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దారుణ ఓటమి చవిచూసిన శ్రీలంక.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను మట్టి కరిపించి సూపర్-4లో అడుగుపెట్టింది. ఇక సూపర్-4లో మొదట అఫ్గన్‌పై విజయంతో ప్రతీకారం తీర్చుకున్న లంక.. భారత్‌కు షాక్ ఇచ్చింది. ఇక చివరగా పాకిస్తాన్‌తో జరిగిన పోరులో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి శ్రీలంక మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక తుదిపోరులోనూ పాకిస్తాన్‌ను మట్టి కరిపించి శ్రీలంక ఆరోసారి ఆసియాకప్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా సూపర్-4 ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవడమే గాక మూడోసారి ఆసియాకప్‌ను సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. చదవండి: Kane Williamson: గమ్మత్తుగా కేన్ మామ వ్యవహారం.. వీడియో వైరల్ కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తిన చెన్నై సూపర్ కింగ్స్ -
మనీష్ పాండే కెప్టెన్ ఇన్నింగ్స్.. గుల్బర్గాదే మహారాజా ట్రోపీ
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టి20 లీగ్ 2022 తొలి సీజన్ విజేతగా మనీష్ పాండే నేతృత్వంలోని గుల్బర్గా మైస్టిక్స్ నిలిచింది. శుక్రవారం రాత్రి బెంగళూరు బుల్స్‌తో జరిగిన ఫైనల్లో గుల్బర్గా 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన మనీష్ పాండే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గుల్బర్గా మైస్టిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. దేవదత్ పడిక్కల్(42 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మనీష్ పాండే 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు నాటౌట్ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. అంతకముందు జెస్వాత్ ఆచార్య 39, రోహన్ పాటిల్ 38, కృష్ణన్ షిర్జిత్ 38 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు బుల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఎల్ఆర్ చేతన్ (40 బంతుల్లో 91 పరుగులు, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్రాంతి కుమార్ 41 మినహా మిగతావారెవరు రాణించకపోవడంతో బెంగళూరు బుల్స్ విజయానికి 11 పరుగుల దూరంలో ఆగిపోయింది. Gulbarga Mystics are the CHAMPIONS of the Maharaja Trophy KSCA T20!! 🔥🙌🏼@GulbargaMystics #MaharajaTrophy #KSCA #T20 #Cricket #Karnataka #IlliGeddavareRaja #ಇಲ್ಲಿಗೆದ್ದವರೇರಾಜ pic.twitter.com/7sTniWTvPL — Maharaja Trophy T20 (@maharaja_t20) August 26, 2022 చదవండి: Asia Cup 2022: ‘ఆసియా’ అందుకునేందుకు.. -
చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా
కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించడానికి భారత మహిళల జట్టు ఒక్క అడుగుదూరంలో ఉంది. ఆగస్టు 8(ఆదివారం) రాత్రి జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కోనుంది. ముఖాముఖి రికార్డులో భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అయినప్పటికి.. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్‌ను ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనే వేచి చూడాలి. భారత మహిళా బ్యాటర్లలో స్మృతి మంధాన, జేమీమా రోడ్రిగ్స్‌లు తమ కెరీర్లో అత్యున్నత ఫామ్‌లో ఉండగా.. బౌలింగ్‌లో రేణుకా సింగ్ తన మిస్టరీ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడుతుంది. ఒకవేళ భారత్ గెలిస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్లే. కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల విభాగంలో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన తొలిసారే పతకం సాధించిన జట్టుగా భారత మహిళల జట్లు కొత్త రికార్డు నెలకొల్పనుంది. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా గెలుపు ఇక శనివారం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో సెమీఫైనల్లో ఆసీస్ మహిళలు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 53 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. అమేలియా ఖేర్ 40 పరుగులతో రాణించింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ 3, తాహిలా మెక్‌గ్రాత్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బెత్ మూనీ 36, తాహిలా మెక్‌గ్రాత్ 34 పరుగులు చేశారు. చదవండి: Obed Mccoy: మొన్న 'భయపెట్టాడు'.. ఇవాళ 'భయపడ్డాడు' Katherine Brunt CWG 2022: ఇంగ్లండ్ బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ -
జొకోవిచ్‌దే వింబుల్డన్.. కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్
'నా హృదయంలో ఈ టోర్నీకి ప్రత్యేక స్థానం ఉంది. నా వివాహ వార్షికోత్సవం రోజున నా శ్రీమతికి వింబుల్డన్ ట్రోఫీ రూపంలో కానుక ఇచ్చాను.' –జొకోవిచ్ లండన్: పచ్చిక కోర్టులపై తనకు ఎదురులేదని నిరూపిస్తూ సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఏడోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 4–6, 6–3, 6–4, 7–6 (7/3)తో అన్‌సీడెడ్, ప్రపంచ 40వ ర్యాంకర్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన జొకోవిచ్‌కిది వరుసగా నాలుగో వింబుల్డన్ టైటిల్ కావడం విశేషం. 2018, 2019, 2021లలోనూ జొకోవిచ్ విజేతగా నిలిచాడు. అంతకుముందు 2011, 2014, 2015లలో కూడా ఈ సెర్బియా స్టార్ చాంపియన్ అయ్యాడు. కరోనా కారణంగా 2020లో వింబుల్డన్ టోర్నీని నిర్వహించలేదు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 20 లక్షల బ్రిటిష్ పౌండ్లు (రూ. 19 కోట్ల 7 లక్షలు), రన్నరప్ కిరియోస్‌కు 10 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 10 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓవరాల్‌గా జొకోవిచ్ కెరీర్లో ఇది 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. 35 ఏళ్ల జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను తొమ్మిదిసార్లు, ఫ్రెంచ్ ఓపెన్‌ను రెండుసార్లు, యూఎస్ ఓపెన్‌ను మూడుసార్లు గెలిచాడు. తొలి సెట్ కోల్పోయినా... కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన కిరియోస్ తొలి సెట్లో జొకోవిచ్పై ఆధిక్యం ప్రదర్శించాడు. ఐదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3–2తో ముందంజ వేసిన కిరియోస్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే కెరీర్లో 32వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ ఆడుతున్న జొకోవిచ్ తొలి సెట్ చేజార్చుకున్నా ఆందోళన చెందకుండా నెమ్మదిగా జోరు పెంచాడు. కచ్చితమైన సర్వీస్‌లతోపాటు నెట్ వద్దకు దూసుకొస్తూ కిరియోస్‌ను ఒత్తిడికి గురి చేశాడు. నాలుగో గేమ్‌లో కిరియోస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లో తొమ్మిదో గేమ్‌లో కిరియోస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పదో గేమ్‌లో తన సర్వీస్ నిలబెట్టుకొని జొకోవిచ్ సెట్‌ను గెలిచాడు. నాలుగో సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను కోల్పోలేదు. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించాడు. కాగా నిక్ కిరియోస్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం విశేషం. సెమీస్‌లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ పొత్తి కడుపు నొప్పితో మ్యాచ్ మధ్యలోనే వైదొలగొడంతో కిరియోస్ తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టాడు. 🙏🏼❤️❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/MWP4VRwvfg — Novak Djokovic (@DjokerNole) July 10, 2022 😘#Wimbledon | #CentreCourt100 | @DjokerNole pic.twitter.com/Y6K5hPs58K — Wimbledon (@Wimbledon) July 10, 2022 Magnificent. In its 100 years, Centre Court has seen few champions like @DjokerNole#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/vffvL2f08Q — Wimbledon (@Wimbledon) July 10, 2022 -
కొత్త చరిత్ర ఆవిష్కృతం.. రంజీ ట్రోఫీ విజేత మధ్యప్రదేశ్
రంజీ ట్రోఫీ 2021-22 సీజన్ విజేతగా మధ్యప్రదేశ్ నిలిచింది. ముంబైతో జరిగిన ఫైనల్లో మధ్యప్రదేశ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి రంజీ చాంపియన్‌గా అవతరించింది. 1998-99 రంజీ సీజన్లో రన్నరప్‌గా నిలిచిన మధ్యప్రదేశ్ ఈసారి మాత్రం అవకాశం చేజారనివ్వలేదు. ముంబైతో జరిగిన ఫైనల్ పోరులో ఆధ్యంతం అధిపత్యం చెలాయిస్తూ విజేతగా నిలిచింది. 113/2 క్రితం రోజు స్కోరుతో ఐదోరోజు ఆటను ప్రారంభించిన ముంబై 269 పరుగులకు ఆలౌటైంది. సువేద్ పార్కర్ 51 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. సర్ఫరాజ్ ఖాన్ 45, పృథ్వీ షా 44 పరుగులు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్ కుమార్ కార్తికేయ నాలుగు వికెట్లతో చెలరేగగా.. గౌరవ్ యాదవ్, పార్థ్ సహాని చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 108 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన మధ్యప్రదేశ్ వన్డే తరహా ఆటతీరును ప్రదర్శించింది. హిమాన్షు మాంత్రి 37 పరుగులు చేయగా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరోలు శుభమ్ శర్మ 30, రజత్ పాటిధార్ 30 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏 Madhya Pradesh beat Mumbai by 6 wickets & clinch their maiden #RanjiTrophy title👍 👍 @Paytm | #Final | #MPvMUM Scorecard ▶️ https://t.co/xwAZ13D0nP pic.twitter.com/XrSp2YzwSu — BCCI Domestic (@BCCIdomestic) June 26, 2022 Chandu bhai, tumhaala maanla 🙌🏽 1st Mumbai, then Vidarbha, and now MP, it's incredible! Best coach when it comes to winning trophies 🏆 Many congratulations to skipper Aditya Shrivastava, MP team, and support staff 👏🏽👏🏽 #RanjiTrophyFinal pic.twitter.com/BqR1gGXtDW — Wasim Jaffer (@WasimJaffer14) June 26, 2022 Congratulations Madhya Pradesh on winning the #RanjiTrophy2022! We've witnessed some terrific performances throughout the season. Great efforts by everyone @BCCI for ensuring another successful Ranji season amidst the pandemic. pic.twitter.com/qMxmvUNYZf — Jay Shah (@JayShah) June 26, 2022 చదవండి: రోహిత్ దూరమైతే!.. కోహ్లి లేదా పంత్ కాదనుకుంటే రహానే? -
Ranji Trophy Final 2022: ‘తొలి టైటిల్’కు చేరువలో...
బెంగళూరు: ప్రతిష్టాత్మక దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీని అందుకునేందుకు మధ్యప్రదేశ్ మరింత చేరువైంది. ముంబైతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ మరో రోజు ఆట (కనీసం 95 ఓవర్లు) మాత్రమే మిగిలి ఉండగా... ముంబై లక్ష్యాన్ని నిర్దేశించి ఆపై మధ్యప్రదేశ్‌ను ఆలౌట్ చేయడం దాదాపు అసాధ్యమే! పిచ్ కూడా ఇంకా బ్యాటింగ్‌కు సహకరిస్తుండటంతో ఒకే రోజు పెద్ద సంఖ్యలో వికెట్లు కూలే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో 41 సార్లు విజేత ముంబైపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో మధ్యప్రదేశ్ తొలిసారి చాంపియన్‌గా అవతరించనుంది. శనివారం ఆట ముగిసే సమయానికి ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ప్రస్తుతం ముంబై మరో 49 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 536 పరుగులకు ఆలౌటై 162 పరుగుల ఆధిక్యం సాధించింది. రజత్ పటిదార్ (122; 20 ఫోర్లు) శతకంతో సత్తా చాటాడు. రాణించిన సారాంశ్... ఓవర్‌నైట్ స్కోరు 368/2తో మధ్యప్రదేశ్ నాలుగో రోజు ఆట కొనసాగించింది. మోహిత్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతిని డీప్ కవర్స్ దిశగా ఆడి పటిదార్ రెండు పరుగులు తీయడంతో మధ్యప్రదేశ్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం వచ్చేసింది. ఆపై జట్టు ఇంకా ఎన్ని పరుగులు జోడిస్తుందనేది కీలకంగా మారింది. ఈ సమయంలో రజత్ దూకుడైన బ్యాటింగ్‌తో వేగంగా పరుగులు సాధించాడు. అతనికి సారాంశ్ జైన్ (57; 7 ఫోర్లు) అండగా నిలిచాడు. పటిదార్, సారాంశ్ జోరుతో మధ్యప్రదేశ్ స్కోరు 500 పరుగులు దాటింది. గాయం కారణంగా ముంబై రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ బ్యాటింగ్‌కు దిగలేదు. ప్రత్యర్థికి రెండో ఇన్నింగ్స్‌లో ఎలాంటి అవకాశం ఇవ్వరాదని పట్టుదలగా ఉన్న మధ్యప్రదేశ్ బౌలర్లు ముంబై ఇన్నింగ్స్ ఎక్కువ భాగంలో ఆఫ్ స్టంప్‌కు దూరంగా, లెగ్‌స్టంప్‌పై నెగెటివ్ బౌలింగ్ చేస్తూ కట్టడి చేశారు. -
రవిశాస్త్రి, మియాందాద్ల గొడవకు కారణమైన 'ఆడి' కారు.?!
టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అందరికి సుపరిచితమే. మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రవిశాస్త్రి.. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత కామెంటేటర్‌గా, టీమిండియా హెడ్‌కోచ్‌గానూ సేవలందించాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టిన బ్యాట్స్ మెన్ లిస్టులోనూ తనది ప్రత్యేక స్థానం. ఇక గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న రవిశాస్త్రి టీమిండియా తరపున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. 1983 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా జట్టులో రవిశాస్త్రి సభ్యుడిగా ఉన్నాడు. విషయంలోకి వెళితే.. 1985లో ఆస్ట్రేలియా వేదికగా బెన్సన్ అండ్ హెడ్జెజ్ వరల్డ్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నీ ఫైనల్లో భారత్, పాకిస్తాన్‌లు తలపడ్డాయి. చిరకాల ప్రత్యర్థి పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా కప్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన రవిశాస్త్రి 182 పరుగులతో పాటు 8 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన రవిశాస్త్రి ఆడి కారును సొంతం చేసుకున్నాడు. విజయం అనంతరం ఆడి కారును రవిశాస్త్రి ఎంతో ఇష్టంగా డ్రైవ్ చేయగా.. తోటి టీమిండియా ఆటగాళ్లు కారు మీద కూర్చోని సెలబ్రేషన్స్ చేసుకోవడం అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో అదే ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ తనను అవమానించిన ఒక సంఘటనను.. ఆడి కారు గెలుచుకోవడం వెనుక ఉన్న కథను తాజాగా రివీల్ చేశాడు. ''1985 బెన్సన్ అండ్ హెడ్జెస్ టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించడానికి మాకు మరో 15-20 రన్స్ అవసరం ఉంది. ఆ సమయంలో జావెద్ మియాందాద్ సెట్ చేసిన ఫీల్డ్ ను తెలుసుకోవడానికి స్క్వేర్ లెగ్ వైపు చూస్తున్నాను. అప్పుడు మిడ్ వికెట్ లో ఉన్న మియాందాద్ నా దగ్గరికి వచ్చి.. నువ్వు మళ్లీ మళ్లీ అక్కడేం చూస్తున్నావ్ అని తనదైన స్టైల్లో అన్నాడు. కారును ఎందుకు చూస్తున్నావ్.. అది నీకు దక్కదు అంటూ వెటకారంగా మాట్లాడాడు. దీనికి కౌంటర్‌గా అవును జావెద్.. నేను అటు వైపు చూడడం లేదు.. ఆ కారే నా వైపు చూస్తుంది.. నా ఇంటికి వస్తుంది అని పేర్కొన్నా'' అంటూ తెలిపాడు. ఇక 1983 వరల్డ్ కప్ గెలిచిన రెండేళ్లకే వరల్డ్ సిరీస్ గెలవడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. తన జీవితంలో తాను చేసిన ఎన్నో పనుల కంటే ఆడి కారు టాప్ స్థానంలో ఉంటుందని పేర్కొన్నాడు. ఆరు సిక్స్‌లు కూడా ఎప్పటికీ గుర్తొచ్చేదే అయినా.. తన కెరీర్లో మాత్రం 1985లో సాధించిన ఆడి కారుకే ఎక్కువ విలువుంటుందని తెలిపాడు. అప్పుడప్పుడే వన్డే క్రికెట్ లోకి రంగులు రావడం, డే నైట్ మ్యాచ్ లు, రంగుల దుస్తులు తొలిసారి ఇండియాకు రావడం లాంటివి ప్రత్యేకమైనవి. ఇక ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించడం అంటే అది పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క అని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇక రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్‌గా రాణిస్తున్నాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేసిన రవిశాస్త్రి కొన్ని అద్భుత విజయాల్లో భాగంగా నిలిచాడు. రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా టీమిండియా 43 టెస్టుల్లో 25 విజయాలు సాధించింది. ఇందులో రెండుసార్లు ఆసీస్ గడ్డపై సాధించిన టెస్టు సిరీస్ విజయాలు ఉండడం విశేషం. ఇక రవిశాస్త్రి 76 వన్డేల్లో 51 వన్డేలు, 65 టి20ల్లో 43 మ్యాచ్‌లు గెలిచింది. చదవండి: Arjun Tendulkar: తండ్రి పేరు తొలగించుకుంటే మంచిది.. కనీసం 50 శాతమైనా! Hardik Pandya-Ravi Shastri: ఇద్దరి బంధం ఎంతో ప్రత్యేకం.. అపూర్వ కలయిక -
చరిత్ర సృష్టించిన దీక్ష డాగర్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం
బ్రెజిల్లో జరుగుతున్న బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో భారత మహిళా గోల్ఫర్ దీక్ష డాగర్ స్వర్ణ పతకంతో మెరిసింది. గురువారం అమెరికాకు చెందిన యాష్లిన్ గ్రేస్ జాన్సన్‌తో జరిగిన ఫైనల్లో 5-4తో ఓడించి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా డెఫిలింపిక్స్‌లో దీక్ష డాగర్‌కు ఇది రెండో పతకం. ఇంతకముందు 2017 ఆమె రజతం గెలిచింది. ఓవరాల్‌గా డెఫిలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత గోల్ఫర్గా దీక్ష డాగర్ చరిత్ర సృష్టించింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌లో చివరి నిమిషంలో అర్హత సాధించిన దీక్ష డాగర్.. ఒలిపింక్స్‌తో పాటు డెఫిలింపిక్స్ ఆడిన తొలి గోల్ఫ్ ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించింది. అంతకముందు బుధవారం జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల దీక్ష... అండ్రియా హోవ్‌స్టెయిన్ (నార్వే)పై విజయం సాధించింది. ఇక బధిరుల ఒలింపిక్స్‌లో భారత్ తాజా దానితో కలిపి ఇప్పటివరకు 10 పతకాలు గెలుచుకుంది. ఇందులో ఏడు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: Asia Cup: ఆర్చరీలో భారత్ అదుర్స్ Golfer🏌️♀️Diksha Dagar won GOLD🥇at Brazil #Deaflympics2021! 😍 Congratulations on this amazing victory! 👏#JeetKaJazba https://t.co/jZigPgNSma — Dept of Sports MYAS (@IndiaSports) May 12, 2022 -
IPL 2022: ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలు ఖరారు..
ఐపీఎల్ 15వ సీజన్ రసవత్తరంగా మారింది. ఇప్పటికే సీజన్లో 35 మ్యాచ్‌లు పూర్తవ్వగా.. మరో 35 లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆదివారం ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ జరగబోయే వేదికలను ఖరారు చేసింది. మే 24, 26 తేదీల్లో జరగనున్న క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు కోల్‌కతా ఆతిథ్యమివ్వనుండగా.. మే 27న జరగనున్న క్వాలిఫయర్ 2తో పాటు.. మే 29న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని అధ్యక్షుడు గంగూలీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌కు వంద శాతం ప్రేక్షకులను అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. మే 22 వరకు జరగనున్న లీగ్ మ్యాచ్‌లకు ముందుగా నిర్ణయించినట్లుగానే 50శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉంది. ఇక మహిళల టి20 చాలెంజర్స్‌పై కూడా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మే 24-28 మధ్య లక్నో వేదికగా మూడు జట్లతో మహిళల టి20 చాలెంజర్స్ టోర్నీ నిర్వహించనుంది. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ 2022లో 35 మ్యాచ్‌లు జరగ్గా.. మరో 35 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ తొలి నాలుగు స్థానాల్లో నిలవగా.. లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు, ఆరు.. కేకేఆర్, పంజాబ్.. ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. ఇక ముంబై ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడి ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేక ఆఖరి స్థానానికి పరిమితం కాగా.. గతేడాది చాంపియన్ సీఎస్కే తొమ్మిదో స్థానంలో ఉంది. మరో 35 మ్యాచ్‌లు మిగిలిఉన్న నేపథ్యంలో తొలి నాలుగు స్థానాల్లో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉంది. చదవండి: IPL 2022: ఏప్రిల్ 23.. ఆర్సీబీకి కలిసిరాని రోజు Kohli Golden Duck: మేము చూస్తున్నది కోహ్లిని కాదు.. ఇంకెవరో! -
Sakshi Premier League 2022: విజేతలు ఎంఎల్ఆర్ఐటి, గౌతమ్ కాలేజి
-
ఐపీఎల్ 2022కు సంబంధించి కీలక అప్డేట్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసిన తరువాత జరిగే క్వాలిఫయర్, ఎలిమినేటర్ సహా ఫైనల్ మ్యాచ్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోని నాలుగు వేదికలకు (ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, వాంఖడే, బ్రబోర్న్ స్టేడియం, పూణేలోని ఎంసీఏ స్టేడియం) మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. దేశంలో కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్ మ్యాచ్‌ల వేదికలను విస్తరించాలని బీసీసీఐ భావిస్తుంది. ఇందులో భాగంగా తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీసీఐ రెండో క్వాలిఫయర్ సహా ఐపీఎల్ 15వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ వేదికను కూడా దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కీలక మ్యాచ్‌లను ప్రపంచంలోనే అతి పెద్దదైన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, తొలుత తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ భావించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వచ్చే నెల (మే) 22 వరకు లీగ్ దశ మ్యాచ్‌లు కొనసాగుతాయి. ఆ తరువాత క్వాలిఫయర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. మే 29న ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: IPL 2022: కెప్టెన్‌గా తొలి గెలుపు.. ఆమెకే అంకితం: జడేజా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. మార్పులతో బరిలోకి టీమిండియా!
Ind Vs WI 3rd ODI:- అహ్మదాబాద్: సఫారీ పర్యటనలో వన్డేల్లో క్లీన్‌స్వీప్ అయిన భారత్ ఇప్పుడు సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసే పనిలో పడింది. రెండు వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి పోరులో గెలిచి 3–0తో ముగించాలని ఆశిస్తోంది. పైగా ఆటగాళ్లంతా జోరు మీదున్నారు. బ్యాటర్స్ ఫామ్‌లో ఉండగా... మన బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు వెస్టిండీస్ కనీసం ఈ వన్డేలోనైనా నెగ్గి టి20లకు ముందు కాస్త ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తోంది. అయితే నిలకడలేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్ విండీస్‌ను కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే ఆఖరి పోరులో భారతే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. (చదవండి: అతిథిలా వచ్చి ఆటగాళ్లను పరుగులు పెట్టించింది) ధావన్‌తో ఓపెనింగ్... కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో రెగ్యులర్ ఓపెనర్ ధావన్ బరిలోకి దిగనున్నాడు. అతనితో కలిసి కెప్టెన్ రోహిత్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ కూడా అందుబాటులోకి వచ్చినప్పటికీ కేఎల్ రాహుల్ ఉండటంతో అతనికి అవకాశం లభించకపోవచ్చు. ధావన్ రాకతో పంత్ మిడిలార్డర్లో ఆడనుండగా... సూర్యకుమార్ యా దవ్, దీపక్ హుడాలలో ఒకరికే తుది జట్టులో ఆడే అవకాశముంది. విండీస్ బ్యాటర్స్ పాలిట సింహ స్వప్నమైన బౌలింగ్ దళంలో మార్పులు చేయకపోవచ్చు. ఒక వేళ కుల్దీప్కు చాన్సు ఇవ్వాలనుకుంటే చహల్‌ను పక్కన పెడతారు. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన కోహ్లి ఈ మ్యాచ్‌లో తన బ్యాట్‌కు పనిచెబుతాడని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇదే జరిగితే వెస్టిండీస్‌కు భారత బౌలర్ల నుంచే కాదు... బ్యాటింగ్ నుంచి కూడా కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. ఎందుకంటే గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఓ మోస్తరు స్కోర్లే నమోదయ్యాయి. భారత బ్యాటర్స్ మూకుమ్మడిగా చెలరేగితే భారీ స్కోరు ముచ్చట కూడా ఈ మ్యాచ్‌తో తీరుతుంది. భారత యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా కోవిడ్ నుంచి కోలుకున్నాడు. జట్టుకు అందుబాటులోకి వచ్చినప్పటికీ తుది జట్టుకు ఆడే అవకాశమైతే లేదు. ఒత్తిడిలో విండీస్ సిరీస్‌ను కోల్పోయిన కరీబియన్ జట్టు ఇప్పుడు ఆఖరి మ్యాచ్ విజయంపైనే ఆశలు పెట్టుకుంది. షై హోప్, బ్రాండన్ కింగ్, బ్రేవో, నికోలస్ పూరన్‌లతో వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్ చెప్పుకునేందుకు పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ తీరా బరిలోకి దిగేసరికి తేలిపోతోంది. గత రెండు వన్డేలను పరిశీలిస్తే అంతో ఇంతో విండీస్ బౌలింగే నయం. మన స్టార్ బ్యాటర్స్‌ను కంగారు పెట్టించింది. కానీ బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం వారి టీమ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతూనే ఉంది. రెండు మ్యాచ్‌ల్లోనూ టాపార్డర్ ఆట పేలవంగా సాగింది. గాయంనుంచి కోలుకున్న కెప్టెన్ పొలార్డ్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. చివరి పోరులోనైనా బ్యాటర్స్ బాధ్యతగా ఆడితే ఓదార్పు విజయంతోనైనా సిరీస్‌ను ముగించవచ్చని వెస్టిండీస్ భావిస్తోంది. ఇటీవలే సొంతగడ్డపై ఐర్లాండ్ చేతిలో వన్డే సిరీస్ ఓడిన విండీస్...ఇప్పుడు ఒక్క విజయంతోనైనా పరువు నిలబెట్టుకోవడంతో పాటు వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ కోసం పా యింట్లు తమ ఖాతాలో వేసుకోవాలని ఆశిస్తోంది. (చదవండి: కోవిడ్ నుంచి కోలుకున్న రుతురాజ్.. అయినప్పటికి నిరాశే) That Winning Feeling! 👏 👏@prasidh43 picks his fourth wicket as #TeamIndia complete a 4⃣4⃣-run win over West Indies in the 2nd ODI. 👍 👍 #INDvWI @Paytm Scorecard ▶️ https://t.co/yqSjTw302p pic.twitter.com/R9KCvpMImH — BCCI (@BCCI) February 9, 2022 -
అప్పుడు ధోని.. ఇప్పుడు దినేష్ బనా; అదే విన్నింగ్ సిక్స్
''ధోని ఫినీషెస్ ఆఫ్ ఇస్ స్టైల్.. ఏ మాగ్నిఫిషియెంట్ స్ట్రైక్ ఇన్టూది క్రౌడ్.. ఇండియా లిప్ట్స్ ది వరల్డ్‌కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్''.. ఈ పదం క్రికెట్‌ను అభిమానించే ప్రతీ భారతీయుడు తమ ఊపిరి ఉన్నంతవరకు మరిచిపోడు. మన చెవుల తుప్పు వదిలేలా ఎన్నోసార్లు ఈ వీడియోనూ యూట్యూబ్‌ల్లో ప్లేచేసిన సందర్భం కోకోల్లలు. 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా 2011 ప్రపంచకప్ అందుకున్న మధుర క్షణాలవి. ఇక ఆరోజు శ్రీలంకతో ఫైనల్లో ఎంఎస్ ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ ఎన్నోసార్లు టీవీలో చూసుంటాం. అయినా అది మరిచిపోయే విషయం కాదని కూడా తెలుసు. ఆ ఫైనల్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మహీ 90 పరుగులు నాటౌట్‌గా నిలిచి చరిత్రలో నిలిచిపోయాడు. అయితే ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారనుకుంటున్నారా. విషయం ఏంటంటే.. శనివారం ముగిసిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ భారత్.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఐదోసారి చాంపియన్స్‌గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆఖర్లో వికెట్ కీపర్ దినేష్ బనా కొట్టిన విన్నింగ్ సిక్స్ అచ్చం ధోని సిక్స్‌లా కనిపించింది. అక్కడ ధోని ఎలా అయితే సిక్స్ కొట్టి టీమిండియాకు వరల్డ్‌కప్ అందించాడో.. అచ్చం అదే తరహాలో దినేష్ బనా కూడా లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టి ఇండియాను ఐదోసారి అండర్-19 వరల్డ్ చాంపియన్స్‌లా నిలిపాడు. ఇంకేముంది కొన్ని నిమిషాల్లోనే బనా కొట్టిన సిక్స్‌ను ధోని సిక్స్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐసీసీ కూడా బనా సిక్స్ వీడియోనూ షేర్ చేస్తూ.. ''ఇంతకముందు ఇలాంటి సిక్స్‌తో ముగిసిన ఎండింగ్‌ను మీరెక్కడైనా చూశారా'' అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఎంఎస్ ధోని.. దినేష్ బనాలు ఇద్దరు వికెట్ కీపర్లు కావడమే. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఖాతాలో మరో అరుదైన ఘనత 'నీ ఆట అమోఘం.. ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం' View this post on Instagram A post shared by ICC (@icc) -
'నీ ఆట అమోఘం.. ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం'
అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియాతో ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తడబడింది. 44.5 ఓవర్లలో 189 పరుగులు వద్ద ఆలౌటైంది. ఆరంభం నుంచే టీమిండియా కుర్రాళ్లు బౌలింగ్‌లో చెలరేగడంతో ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. కానీ ఒక్కడు మాత్రం భారత్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని నిలబడ్డాడు. అతనే జేమ్స్ రూ.. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన జేమ్స్ రూ.. చివరివరకు నిలబడ్డాడు. తాను నిలబడడమే కాదు.. అసలు వంద పరుగులు చేస్తుందా అన్న అనుమానం కలిగిన దశలో ఒక్కో పరుగు జత చేస్తూ జేమ్స్ రూ ఇన్నింగ్స్ నడిపించిన విధానం అద్బుతమనే చెప్పాలి. సహచరులు వెనుదిరుగుతున్నా.. తాను మాత్రం పట్టు సడలకుండా ఆడాడు. 116 బంతులెదుర్కొన్న జేమ్స్ రూ 12 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. ఇక సెంచరీ ఖామమనుకుంటున్న దశలో 95 పరుగుల వద్ద రవికుమార్ బౌలింగ్‌లో కౌషల్ తంబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడం జేమ్స్ గుండెను ముక్కలు చేసింది. అయితే జేమ్స్ అసాధారణ పోరాటంతోనే ఇంగ్లండ్ కనీసం 189 పరుగులైనా చేయగలిగింది. ''కఠిన పరిస్థితుల్లో అద్బుత ఇన్నింగ్స్ ఆడావు జేమ్స్ రూ.. ప్రత్యర్థి ఆటగాడినైప్పటికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం..19 ఏళ్ల వయసులోనే ఇంత ఓపికతో ఆడిన జేమ్స్ రూకు ఇంగ్లండ్ క్రికెట్ మంచి భవిష్యత్తు ఉందంటూ'' టీమిండియా ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. A superb partnership of 9️⃣3️⃣ between James Rew and James Sales helps us reach 189 See if that total is enough live on @SkyCricket 📺#ENGvIND | #U19CWC pic.twitter.com/yRlRy0CvjA — England Cricket (@englandcricket) February 5, 2022 -
యశ్ ధుల్ ఒక సంచలనం.. కోహ్లితో ఉన్న పోలికేంటి!
''అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు సభ్యుడిగా ఉంటేనే ఒక బంపర్ టోర్నమెంట్లో ఆడుతున్నాడు.. కెరీర్‌కు మేజర్ స్టార్ట్ దొరికినట్లేనని అంతా అంటారు.. మరి అలాంటిది అదే అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టుకు కెప్టెన్‌గా నువ్వు ఉంటే.. ఇక నీ పేరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.''.. అండర్-19 పెను సంచలనం.. యశ్ ధుల్‌కు తన చిన్ననాటి కోచ్ చెప్పిన మాటలివి.. ఈ మాటలను నిజం చేయడానికి యశ్ ధుల్ ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు. శనివారం టీమిండియా ఇంగ్లండ్‌తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. ఐదో టైటిల్‌పై కన్నేసిన టీమిండియా కళను యశ్ ధుల్ తీర్చనున్నాడా అనేది తేలిపోనుంది. మరి అలాంటి యశ్ ధుల్ ఎక్కడి నుంచి వచ్చాడు.. క్రికెట్లోకి ఎలా అడుగుపెట్టాడు అన్న విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. జనవరి 19,2022.. అండర్-19 ప్రపంచకప్ ప్రారంభమై అప్పటికి ఐదు రోజులు కావొస్తుంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో శుభారంభం చేసింది. ఇక రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇంతలో జట్టును కరోనా కుదుపేసింది. టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్ సహా కొంతమంది ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఇది యశ్ ధుల్‌ను బాగా భయపెట్టింది. టీమిండియా అండర్-19లో ఐదో ప్రపంచకప్ టైటిల్ అందివ్వాలనుకున్న కోరిక నెరవేరదేమోనని అనుకున్నాడు. ఒక్కరోజు వ్యవధిలోనే డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. అయితే ఆ సమయంలో తన చిన్ననాటి కోచ్ రాజేష్ నగర్ గుర్తొచ్చారు. వెంటనే ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాడు. నగర్ ఒక్కటే విషయం చెప్పారు.. భయపడకు.. కంట్రోల్లో ఉంటే అన్ని కంట్రోల్లోనే ఉంటాయి'' అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! కోచ్ నగర్ మాటలు యశ్ ధుల్‌కు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ఐసోలేషన్‌లో ఉన్న యశ్ ధుల్ మూడో రోజు నుంచే తను ఉన్న రూమ్‌లోనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. దాన్నంతా ఒక కెమెరాలో బంధించి తర్వాత రీప్లే చేసుకొని షాట్ల ఎంపికను చూసుకునేవాడు. ఆ తర్వాత కోచ్ వివిఎస్ లక్ష్మణ్‌కు తన వీడియోలను పంపించి బ్యాటింగ్ టెక్నిక్స్ అడిగేవాడు. ఇదంతా చూసిన లక్ష్మణ్.. యశ్ ధుల్ నీ పోరాట పటిమ అద్భుతం.. ఇండియా ఎలెవెన్‌లో కెప్టెన్ ఆర్మ్బాండ్ ధరించి మ్యాచ్‌లు ఆడతావు రెడీగా ఉండు.. అని చెప్పాడు. అన్నట్లే యశ్ ధుల్ బంగ్లాదేశ్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సమయానికి కోలుకొని మళ్లీ అండర్-19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను గెలిపించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఒక చరిత్ర. కష్టాల్లో పడిన టీమిండియాను షేక్ రషీద్ సాయంతో.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన యశ్ ధుల్ సూపర్‌సెంచరీతో మెరిశాడు. 96 పరుగులుతో విజయం సాధించిన భారత్ ఎనిమిదోసారి ఫైనల్లో అడగుపెట్టింది. టీమిండియాకు అండర్-19 ప్రపంచకప్ అందించడానికి ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు. చదవండి: Shaik Rasheed: అవరోధాలు అధిగమించి.. మనోడి సూపర్ హిట్టు ఇన్నింగ్స్ పదేళ్ల వయసు నుంచే.. యశ్ ధుల్ చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే అమితమైన ఆసక్తి ఉండేది. తన పదేళ్ల వయసు నుంచే క్రికెట్‌పై దృష్టి పెట్టిన యశ్‌ధుల్ అండర్-19లో టీమిండియాకు కప్ అందించాలని కోరుకున్నాడు. అలా ద్వారకాలోని బాల్ భవన్ స్కూల్లో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆరో తరగతి వచ్చిన తర్వాత కోచ్ రాజేశ్ నగర్ యశ్‌కు పరిచయమయ్యాడు. అప్పటినుంచి అతని ఆట పూర్తిగా మారిపోయింది. ఒక నెల వ్యవధిలోనే 15 మ్యాచ్‌లు ఆడి సూపర్ ఫామ్‌ను కొనసాగించి మంచి రన్స్ సాధించాడు. కేవలం 15 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఇతను 2వేల మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కనిపిస్తున్నాడని కొందరు కోచ్‌లు మెచ్చుకున్నారు. ఆ తర్వాత అండర్-19 కేటగిరిలో శ్రీలంక, నేపాల్, మలేషియాలో కీలక టోర్నీలు ఆడాడు. 15 ఏళ్ల వయసులో నేపాల్‌లో జరిగిన అండర్-19 టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకొని అందరి దృష్టిలో పడ్డాడు. అయితే యశ్ ధుల్ 16 ఏళ్లకే ఇంత పేరు తెచ్చుకోవడం వెనుక కోహ్లి కూడా ఒక కారణమని అతని కోచ్ నగర్ ఒక సందర్భంలో పేర్కొన్నారు. కోహ్లితో అనుబంధం.. అతనితో పోలిక ''ఢిల్లీలో యశ్ ధుల్ ఇంటికి.. కోహ్లి ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండేది. కోహ్లి ఆటను దగ్గరుండి గమనించిన యశ్ ధుల్ అతన్నే అనుకరించడం మొదలుపెట్టాడు. అండర్-19 జట్టులో మూడోస్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చే యశ్ ధుల్ అచ్చం కోహ్లిని తలపిస్తున్నాడు. ఒక వన్డే మ్యాచ్‌లో 50 ఓవర్లు ఎలా ఆడాలో కోహ్లి నుంచే నేర్చుకున్నాడు. కోహ్లి తన ఇన్నింగ్స్‌ను ఎలా అయితే స్టార్ట్ చేస్తాడో.. అచ్చం అదే మాదిరి యశ్‌ధుల్ కూడా సింగిల్స్, డబుల్స్‌కు ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఓపెనర్లు ఔటైతే.. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చే ఆటగాడు ఎంత కీలకమో తెలుసుకున్నాడు. యశ్ ధుల్ కోహ్లి టెక్నిక్‌ను అందుకోలేకపోవచ్చు.. కానీ అతనిలా మాత్రం ఇన్నింగ్స్‌లు నిర్మించగలడు.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అండర్-19 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకునేందుకు యశ్ ధుల్ బాగా కష్టపడ్డాడు. సెప్టెంబర్- అక్టోబర్ 2021లో జరిగిన వినూ మాన్కడ్ ట్రోఫీలో యశ్ ధుల్ సూపర్ ప్రదర్శన చేశాడు. ఆ ట్రోఫీలో ఢిల్లీ గ్రూప్ స్టేజీ దాటకపోయినప్పటికి యశ్ మాత్రం 302 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆసియా కప్‌లో టీమిండియా కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు. ఇప్పుడు వరల్డ్‌కప్‌లోనూ టీమిండియాకు ఐదో టైటిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతని కోరిక నెరవేరి త్వరలోనే టీమిండియాలోకి కూడా అడుగుపెట్టాలని ఆశిద్దాం. చదవండి: Under-19 World Cup: అప్పుడు కుర్రాళ్లు.. ఇప్పుడు సూపర్స్టార్లు -
గ్రౌండ్లోకి రావడానికి నానాతంటాలు.. అంత కష్టమెందుకు
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ మజిలి చివరి దశకు చేరింది. శనివారం భారత్, ఇంగ్లండ్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. మరి భారత్ ఐదోసారి టైటిల్ గెలుస్తుందా.. లేక ఇంగ్లండ్ రెండోసారి కప్‌ను అందుకుంటుందా చూడాలి. ఇక ఈ టోర్నీలో ఆఫ్ ఫీల్డ్.. ఆన్‌ఫీల్డ్‌లో ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకున్నాయి. ఫైనల్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలిఉండడంతో ఐసీసీ ఫ్యాన్స్‌ను నవ్వించడానికి ఒక ఆసక్తికర వీడియోనూ రిలీజ్ చేసింది. ఈ సంఘటన ఏ మ్యాచ్‌లో జరిగిందో తెలియదు. కచ్చితంగా మనల్ని నవ్విస్తుంది. విషయంలోకి వెళితే.. మ్యాచ్ సందర్భంగా ఆటగాడు గాయపడడంతో మెడికల్ అవసరం ఏర్పడింది. దీంతో ఇద్దరితో కూడిన మెడికల్ టీం సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో ఒక వ్యక్తి బాగా లావుగా ఉన్నాడు.. అతని పక్కన అసిస్టెంట్‌గా ఒక అమ్మాయి ఉంది. కాల్ రావడంతో గ్రౌండ్లోకి వేగంగా వెళ్లాలనే ఉద్దేశంతో బౌండరీలైన్ వద్ద ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డులను దాటే ప్రయత్నం చేశారు. వారికి సాధ్యం కాలేదు. ఏమనుకున్నాడో.. ఒక్కసారిగా అథ్లెట్‌గా మారిన మెడికో దానిపై నుంచి జంప్ చేసి వెళ్లాలనుకున్నాడు. కానీ బొక్కబోర్లా పడ్డాడు.. పాపం అతని దెబ్బకు పక్కనున్న అమ్మాయి కూడా బలయ్యింది. ఆ తర్వాత కిందపడిన దానికి కవర్ చేసుకుంటూ పరిగెత్తడం నవ్విస్తుంది. ఇది చూసిన కామెంటేటర్లు.. ఈ మెడికో సూపర్‌గా ఉన్నాడు.. హార్డిల్స్‌కు పంపిస్తే కచ్చితంగా మెడల్స్ తీసుకొస్తాడు అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టడం ఇది ఎనిమిదోసారి. నాలుగుసార్లు విజేతగా నిలిచిన భారత్.. ఐదో టైటిల్‌పై కన్నేసింది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం 1998 తర్వాత మళ్లీ అండర్-19 ప్రపంచకప్ సాధించలేకపోవడం విశేషం. దీంతో టీమిండియానే మరోసారి ఫెవరెట్‌గా కనిపిస్తోంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఫైనల్ మ్యాచ్.. కత్తులు దూసుకున్న క్రికెటర్లు
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 ఆఖరి అంకానికి చేరింది. శనివారం రాత్రి వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇరుజట్లు సూపర్‌స్టార్ ఆటగాళ్లతో నిండిఉండడంతో రెండు ఫెవరెట్‌గానే కనిపిస్తున్నాయి. అయితే మ్యాచ్ మొదలవడానికి ముందు రెండు జట్లలోని ఇద్దరు ఐకానిక్ ప్లేయర్స్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. వారిలో ఒకరు ఆసియా లయన్స్ తరపున ఆడుతున్న షోయబ్ అక్తర్.. రెండో ఆటగాడు వరల్డ్ జెయింట్స్ ప్లేయర్ బ్రెట్ లీ. విషయంలోకి వెళితే.. ఫైనల్ గెలిచిన తర్వాత అందించే ట్రోఫీని వీడియోలో షేర్ చేస్తూ.. అక్తర్‌ను టాగ్ చేస్తూ... నేను రెడీగా ఉన్నా.. బ్లాక్బాస్టర్ పోరుకు నువ్వు రెడీయే నా అక్తర్ అంటూ పేర్కొన్నాడు. దీనికి బదులుగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్ వినూత్న రీతిలో స్పందించాడు. పుట్టుకతోనే నేను రెడీగా ఉన్నా అంటూ లీకి దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Only a few hours away from the final #legendsleaguecricket 🏆 I hope your ready @shoaib100mph 🏏👑 pic.twitter.com/IktKuMtfSZ — Brett Lee (@BrettLee_58) January 29, 2022 -
రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఆలోచన.. కట్‌చేస్తే
స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ తన కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్ చేరిన నాదల్ ఆదివారం డానియెల్ మెద్వెదెవ్‌తో అమితుమీ తేల్చుకోనున్నాడు. ఫైనల్లో నాదల్ గెలిస్తే గనుక టెన్నిస్‌లో పలు రికార్డులు బద్దలు కానున్నాయి. ఇప్పటివరకు 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో జొకోవిచ్, ఫెదరర్‌లతో సమానంగా ఉన్న నాదల్.. ఒక్క టైటిల్ గెలిస్తే చరిత్ర సృష్టించనున్నాడు. 21 గ్రాండ్‌స్లామ్‌లతో అత్యధిక టైటిళ్లు గెలిచిన తొలి టెన్నిస్ ప్లేయర్‌గా నాదల్ నిలవనున్నాడు. చదవండి: Ashleigh Barty: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత యాష్లే బార్టీ.. 44 ఏళ్ల రికార్డు బద్దలు ఈ నేపథ్యంలో మెద్వెదెవ్‌తో ఫైనల్ ఆడేందుకు సిద్ధమైన నాదల్ ప్రాక్టీస్ సమయంలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ''రెండు నెలల క్రితం తన మనసులో రిటైర్మెంట్ ఆలోచన వచ్చింది. తరచూ గాయాల బారీన పడుతుండడంతో చిరాకు, కోపం ఎక్కువయ్యాయి. దాంతో ఆటకు గుడ్‌బై చెప్పాలని భావించా. ఈ విషయమై తన టీమ్‌తో పాటు కుటుంబసభ్యులతో కూడా చర్చించాను. పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి.. ఇలాగే కొనసాగితే విమర్శలు తప్ప విజయాలు దక్కవు అని కుమిలిపోయా.. అయితే ఇదంతా రెండు నెలల క్రితం. కట్ చేస్తే ఇప్పుడు బౌన్స్‌బ్యాక్ అయ్యాననిపిస్తుంది. మెద్వెదెవ్‌తో జరగబోయే ఫైనల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా. 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధిస్తానో లేదో తెలియదు కానీ.. నా ఆటపై ఆత్మవిశ్వాసం మరింతం పెరిగింది. ఆ ధైర్యంతోనే రేపటి ఫైనల్‌ను ఆడబోతున్నా'' అంటూ ముగించాడు. ఇప్పటివరకు టెన్నిస్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన నాదల్ ఖాతాలో 13 ఫ్రెంచ్ ఓపెన్, నాలుగు యూఎస్ ఓపెన్, రెండు వింబుల్డన్, ఒక ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉన్నాయి. -
సిడ్నీ సిక్సర్స్‌కు ఘోర పరాభవం.. బీబీఎల్ విజేత పెర్త్ స్కార్చర్స్
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 11) సీజన్ విజేతగా పెర్త్ స్కార్చర్స్ నిలిచింది. సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో పెర్త్ స్కార్చర్స్ 79 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పెర్త్ స్కార్చర్స్ బీబీఎల్ టైటిల్ గెలవడం నాలుగోసారి కాగా.. సిడ్నీ సిక్సర్స్‌ను ఫైనల్లో ఓడించడం ఇది మూడోసారి.76 పరుగులు నాటౌట్‌తో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన పెర్త్ స్కార్చర్స్ బ్యాట్స్‌మన్ లారీ ఇవాన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: Beth Mooney: దవడ విరిగింది.. ముఖానికి సర్జరీ.. పడిలేచిన కెరటం మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లారీ ఇవాన్స్(41 బంతుల్లో 76, 4 ఫోర్లు; 4 సిక్సర్లు), ఆస్టన్ టర్నర్(35 బంతుల్లో 54, 4 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 16.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. డేనియల్ హ్యూజెస్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో ఆండ్రూ టై 3, జై రిచర్డ్సన్ 2, జాసన్ బెండార్ఫ్, ఆస్టన్ టర్నర్, పీటర్ హట్జోగ్లో, ఆస్టన్ అగర్ తలా ఒక వికట్ తీశారు. That winning feeling 🤩🏆 #BBL11 pic.twitter.com/FCu3wVSvrJ — KFC Big Bash League (@BBL) January 28, 2022 It’s raining orange under the roof! 🏆 #BBL11 pic.twitter.com/KZgodUli2C — KFC Big Bash League (@BBL) January 28, 2022 -
ఆసియా కప్ విజేతగా టీమిండియా.. ఫైనల్లో లంకేయులపై ఘన విజయం
దుబాయ్: ఆసియా కప్ అండర్-19 విజేతగా యువ భారత్ నిలిచింది. వరుణుడి ఆటంకాల నడుమ 38 ఓవర్లకు కుదించిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక యువ జట్టుపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి టైటిల్ విజేతగా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు.. 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. లంక ఇన్నింగ్స్‌లో యాసిరు రోడ్రిగో(19 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. భారత బౌలర్లు విక్కీ ఓస్వాల్(3/11), కౌశల్ తాంబే(2/23), రాజ్ బవా(1/23), రవికుమార్(1/17), రాజవర్ధన్(1/26) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అనంతరం డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 38 ఓవర్లలో 102 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యువ భారత్.. కేవలం 21.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రఘువంశీ(56 నాటౌట్), గుంటూరు కుర్రాడు షేక్ రషీద్(31 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. కాగా, ఈ టోర్నీ నిర్వహించిన 9 పర్యాయాల్లో టీమిండియా 8 సార్లు విజేతగా నిలవడం విశేషం. 2017లో యువ అఫ్గాన్ జట్టు.. పాక్‌ను ఓడించి అండర్-19 ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత టోర్నీలో భారత యువ జట్టు సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరగా.. లంకేయులు పాక్ యువ జట్టుకు షాకిచ్చి తుది పోరుకు అర్హత సాధించారు. చదవండి: విదేశీ లీగ్‌ల కోసం రెండేసి నెలలు దూరంగా ఉంటారు.. కానీ.. టెస్టులు ఆడరా? -
భారత బౌలర్ల ధాటికి లంక జట్టు విలవిల.. ఛాంపియన్‌గా యువ భారత్
Update: దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో యువ భారత జట్టు ఘన విజయం సాధించి, ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. వరుణుడి అటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం యువ భారత్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 102 పరుగులకు కుదించగా.. కేవలం 21.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఓపెనర్ రఘువంశీ(56 నాటౌట్), గుంటూరు కుర్రాడు షేక్ రషీద్(31 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు విక్కీ ఓస్వాల్(3/11), కౌశల్ తాంబే(2/23), రాజ్ బవా(1/23), రవికుమార్(1/17), రాజవర్ధన్(1/26) లంకేయుల పతనాన్ని శాసించారు. దుబాయ్: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం కలిగించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 33 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు విక్కీ ఓస్వాల్(3/11), కౌశల్ తాంబే(2/23), పేసర్లు రాజ్ బవా(1/11), రవికుమార్(1/8)ల ధాటికి లంక జట్టు విలవిలలాడింది. India U19 are on a roll with the ball! 👌 👌 Vicky Ostwal, Kaushal Tambe, Raj Bawa and Ravi Kumar share the spoils. 👏👏 #BoysInBlue Sri Lanka U19 seven down. #ACC #U19AsiaCup #INDvSL 📸 📸: ACC Follow the match ▶️ https://t.co/GPPoJpzNpQ pic.twitter.com/nbcyvpgbfH — BCCI (@BCCI) December 31, 2021 రవీన్ డిసిల్వా(26 బంతుల్లో 13 నాటౌట్; ఫోర్), యాసిరు రోడ్రిగో(13 బంతుల్లో 4 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. 26.3 ఓవర్ల వద్ద 57 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను రవీన్ డిసిల్వా, యాసిరు రోడ్రిగో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, భారత యువ జట్టు సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరగా.. లంకేయులు పాక్ యువ జట్టుకు షాకిచ్చి తుది పోరుకు అర్హత సాధించారు. చదవండి: ఇంగ్లండ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్! -
‘నా చివరి మ్యాచ్ చెన్నైలోనే’
MS Dhoni Announcement About His Last T20 Match For CSK.. ఐపీఎల్–2021లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను విజేతగా నిలిపిన కెప్టెన్ కెప్టెన్ ధోని లీగ్ నుంచి తప్పుకోవడం లేదని స్పష్టమైంది. అతను కనీసం మరో సీజన్ జట్టు తరఫున ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్లో సీఎస్కే తరఫున తాను ఆడే చివరి మ్యాచ్ వేదిక చెన్నైనే అవుతుందని ధోని వెల్లడించాడు. అయితే అది వచ్చే ఏడాదేనా లేక ఐదేళ్ల తర్వాతా అనేది చెప్పలేనని... పైగా ఐపీఎల్ కూడా ఏప్రిల్‌లో జరుగుతుంది కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఇంకా చాలా సమయం ఉందని ధోని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని టీమ్ యాజమాన్యం ఇండియా సిమెంట్స్ శనివారం విజయోత్సవ వేడుకలను నిర్వహించింది. చదవండి: Mitchell McClenaghan: 72 గంటలు కాలేదు.. భారత్- న్యూజిలాండ్ సిరీస్ 'మీనింగ్లెస్' ధోని మాలో ఒకడు: స్టాలిన్ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే సీజన్లలో కూడా సీఎస్కేకు ధోని కెప్టెన్‌గా వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు. ‘నన్ను ముఖ్యమంత్రి హోదాలో సీఎస్కే యజమాని శ్రీనివాసన్ ఆహ్వానించారు. కానీ నేను ధోని ఫ్యాన్‌గా వచ్చాను. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి పెద్ద స్థాయికి ఎదిగిన ధోని అంటే నాన్నకు కూడా ఎంతో అభిమానం. అతను జార్ఖండ్ నుంచి వచ్చి ఉండవచ్చు. కానీ మా దృష్టిలో మాత్రం అతను తమిళనాడు ప్రజలలో ఒకడు’ అని స్టాలిన్ వ్యాఖ్యా నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ 2022 ఐపీఎల్ భారత్‌లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. A promise from #Thala…#Anbuden awaiting… 💛🦁#WhistlePodu #Yellove pic.twitter.com/zGKvtRliOY — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) November 20, 2021 -
మ్యాగజైన్ స్టోరీ 15 November 2021
-
T20 WC 2021: క్రికెట్ అభిమానులకు ఐసీసీ గుడ్‌న్యూస్
100 Percent Seating Capacity Allowed Final T20 WC 2021.. టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు టి20 ప్రపంచకప్ టోర్నీలో జరిగిన మ్యాచ్‌లకు 70 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉండేది. తాజాగా ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం వంద శాతం సీటింగ్‌ను అనుమతిస్తున్నట్లు ఐసీసీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే నవంబర్ 10, 11న జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లకు మాత్రం 70 శాతంప్రేక్షకులకే అనుమతి ఉందని.. కేవలం నవంబర్ 14న జరిగే ఫైనల్‌కు మాత్రం వంద శాతం అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. చదవండి: T20 WC 2021: ఎలిమినేటెడ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్.. కెప్టెన్ మాత్రం లేడు ఇక నవంబర్10న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ , 11వ తేదీన పాకిస్తాన్, ఆస్ట్రేలియా రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇక సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు నవంబర్ 14న మెగా ఫైనల్లో తలపడనున్నాయి. అయితే టీమిండియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు అఫ్గానిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్లు సూపర్ 12 దశలో వెనుదరిగాయి. -
ధోని ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్.. ఐపీఎల్ ట్రోఫీతో పాటు..?
MS Dhoni And Sakshi Dhoni Expecting Their Second Child In 2022: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను నాలుగోసారి(2010, 2011, 2018, 2021) విజేతగా నిలిపి ఆ ఫ్రాంఛైజీ అభిమానులు గర్వపడేలా చేసిన మహేంద్ర సింగ్ ధోని.. తన ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. ధోని రెండోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని అతని భార్య సాక్షి సింగ్ రావత్ స్నేహితురాలు, సురేశ్ రైనా భార్య ప్రియాంక రైనా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సాక్షి రావత్ ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని.. వచ్చే ఏడాదిలో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వనుందని ప్రియాంక రైనా పేర్కొన్నట్లు సమాచారం. నిన్న సీఎస్కే ట్రోఫీ గెలిచిన అనంతరం సాక్షి, కుమార్తె జీవాతో కలిసి మైదానంలోకి వచ్చి సందడి చేశారు. ఆ సమయంలో సాక్షి బేబీ బంప్ స్పష్టంగా కనిపించడంతో ధోని అభిమానులు విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో ధోని ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా లభించినట్లైంది. ఇదిలా ఉంటే, శుక్రవారం జరిగిన ఐపీఎల్-2021 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించి, నాలుగోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. డుప్లెసిస్ (86), రుతురాజ్ గైక్వాడ్ (32), రాబిన్ ఉతప్ప (31), మొయిన్ అలీ (37) రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (50), శుభ్‌మన్ గిల్ (51) శుభారంభాన్ని అందించినప్పటికీ.. మిగతా బ్యాటర్లంతా తేలిపోవడంతో మోర్గాన్ సేన ఓటమిపాలై, మూడోసారి కప్‌కు గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. చదవండి: తీవ్ర విషాదం... గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి -
IPL 2021 Final: తెలుగులో మాట్లాడిన కేకేఆర్ ఆటగాడు.. ఫ్యాన్స్ ఫిదా
Dinesh Karthik Speaking Telugu In IPL 2021 Final: 2021 ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మెగా ఫైనల్ ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెల్ కోసం మాట్లాడిన డీకే.. ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టమైన ఉచ్చారణతో తెలుగు మాట్లాడి ఆకట్టుకున్నాడు. ప్రముఖ వాఖ్యాత, తెలుగువాడైన హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. డీకే అనర్గలంగా తెలుగులో మాట్లాడాడు. Wow. @DineshKarthik is killing it in Telugu. As fluent as his on field conversations in Tamil with Varun Chakravarthy. #IPLFinal pic.twitter.com/pLABDPES4U — PK - VJ (@msd21888) October 15, 2021 మెగా ఫైనల్ అని ఏమైనా ఒత్తిడి ఉందా అని హర్షా ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, సాధారణ మ్యాచ్‌లానే ఈ మ్యాచ్‌నూ పరిగణిస్తున్నామని తెలిపాడు. అయితే ఫైనల్ మ్యాచ్ అంటే సహజంగా ఎవరికైన కాస్తో కూస్తో ఒత్తిడి ఉంటుందని, దాన్ని అధిగమించేందుకు ప్రాక్టీస్ చేశామని, సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. తమ జట్టు సెకండాఫ్‌లో అద్భుతంగా రాణించిందని, ఫైనల్‌కు చేరేందుకు ఆటగాళ్లు ఎంతో శ్రమించారని అన్నాడు. ఈ సందర్భంగా డీకే.. కేకేఆర్ ఆటగాళ్లందరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. Ha! Never thought I would do a pre-game interview in Telugu with @DineshKarthik. Bagane Telugulo mataladtaadu mana DK! — Harsha Bhogle (@bhogleharsha) October 15, 2021 కాగా, దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడటం పట్ల తెలుగు అభిమానులు ఫిదా అవుతున్నారు. డీకే అచ్చం తెలుగువాడిలా అద్భుతంగా మాట్లాడుతున్నాడంటూ సోషల్‌మీడియాలో వీడియోని షేర్ చేస్తూ ముచ్చటపడిపోతున్నారు. హర్షా భోగ్లే సైతం డీకేను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. తెలుగు ఇంటర్వ్యూ చేస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నాడు. ఇదిలా ఉంటే, డీకే.. 2020 ఐపీఎల్ సందర్భంగా కూడా తెలుగులో మాట్లాడి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చదవండి: IPL 2021 Final: ఐపీఎల్ చరిత్రలో అద్భుత రికార్డు -
IPL 2021 Final: ఐపీఎల్ చరిత్రలో అద్భుత రికార్డు
CSK Opener Ruturaj Gaikwad Became Youngest Orange Cap Holder In IPL History: ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శుక్రవారం జరిగిన ఐపీఎల్-2021 తుది సమరంలో 24 పరుగుల వద్ద పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(626 పరుగులు) నుంచి ఆరెంజ్ క్యాప్‌ను చేజిక్కించుకున్న రుతురాజ్(24 ఏళ్లు).. లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు పంజాబ్ మాజీ ఓపెనర్ షాన్ మార్ష్ పేరిట ఉండేది. 2008లో 25 సంవత్సరాల వయసులో షాన్ మార్ష్ 616 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే 14 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. రుతురాజ్ 32 పరుగుల వద్ద సునీల్ నరైన్ బౌలింగ్‌లో శివమ్ మావికి క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. రాబిన్ ఊతప్ప(31) నరైన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. క్రీజ్‌లో డుప్లెసిస్(57), మొయిన్ అలీ(1) ఉన్నారు. చదవండి: T20 World Cup 2021: టీమిండియాతో మెగా పోరుకు ముందు పాక్ జట్టుకు భారీ షాక్.. -
IPL 2021 Final: పలు అరుదైన రికార్డులపై కన్నేసిన సీఎస్కే ఆటగాళ్లు
CSK Players Set To Reach Milestones In IPL 2021 Final Match Against KKR: చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్‌లో పలు అరుదైన రికార్డులు బద్దలయ్యే ఆస్కారముంది. ఆ రికార్డులు ఏంటో, వాటిని ఏ సీఎస్కే ఆటగాడు బద్దలు కొట్టనున్నాడో ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. * నేటి మ్యాచ్‌తో సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో 200వ మ్యాచ్ ఆడనున్నాడు. * ఇవాళ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్ రాబిన్ ఊతప్ప మరో 55 పరుగులు సాధిస్తే, పొట్టి ఫార్మాట్ మొత్తంలో 7000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. అలాగే మరో 5 బౌండరీలు సాధిస్తే టీ20 ఫార్మాట్ మొత్తంలో 700 ఫోర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. * సీఎస్కే మిడిలార్డర్ ఆటగాడు అంబటి రాయుడు మరో 84 పరుగులు చేస్తే ఐపీఎల్లో 4000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. అలాగే మరో సిక్సర్ బాదితే ఐపీఎల్లో 150, టీ20 ఫార్మాట్ మొత్తంలో 200 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. * నేటి మ్యాచ్‌లో సీఎస్కే ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మరో 5 వికెట్లు తీస్తే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన లసిత్ మలింగ(170) రికార్డును అధిగమిస్తాడు. * సీఎస్కే సారధి ధోని నేటి మ్యాచ్‌లో మరో 65 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్ మొత్తంలో 7000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. * ఇవాళ మ్యాచ్‌లో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మరో 24 పరుగులు చేస్తే పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నుంచి ఆరెంజ్ క్యాప్ చేజిక్కించుకోవడంతో పాటు ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించనున్నాడు. * నేటి మ్యాచ్‌తో సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ 100వ ఐపీఎల్ మ్యాచ్ ఆడనున్నాడు. అలాగే మరో 7 సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 100 సిక్సర్ల ఘనతను, మరో 3 ఫోర్లు కొడితే టీ20 ఫార్మాట్ మొత్తంలో 600 ఫోర్ల మైలురాయిని చేరుకుంటాడు. చదవండి: సీఎస్కే జెర్సీలో వార్నర్.. అసలేం జరిగింది..? -
సీఎస్కే జెర్సీలో వార్నర్.. అసలేం జరిగింది..?
David Warner Shares Pic In CSK Jersey Ahead Of IPL 2021 Final: చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మరికాసేపట్లో మొదలుకానున్న ఐపీఎల్-2021 తుది పోరు నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ సారధి, ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ఇందులో వార్నర్ సీఎస్కే జెర్సీ ధరించి తన కుమార్తెను భుజాలపై ఎత్తుకుని దర్శనమిచ్చాడు. సీఎస్కే, కేకేఆర్ జట్ల మధ్య జరిగే నేటి ఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేను కానీ.. ఓ అభిమాని కోరికను కాదనలేక ఈ పోస్ట్‌ను చేస్తున్నానంటూ క్యాప్షన్ జోడించాడు. David Warner supporting CSK tonight and also posted an edit of him and his daughter in CSK jersey. pic.twitter.com/VlVh4D5P1f — Mufaddal Vohra (@mufaddal_vohra) October 15, 2021 అయితే, ఈ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే వార్నర్ దీన్ని తొలగించడం ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వార్నర్ నేటి మ్యాచ్ వరకే సీఎస్కే అభిమానిగా ఉంటాడా లేక వచ్చే సీజన్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎస్కే జట్టుకు వెళ్లిపోతాడా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో వరుస వైఫల్యాల కారణంగా ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వార్నర్‌ను తుది జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 సీజన్ తొలిదశలో వార్నర్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీని న్యూజిలాండ్ స్కిప్పర్ కేన్ విలియమ్సన్కు కోల్పోయాడు. చదవండి: టీ20 క్రికెట్‌కు అశ్విన్ అనర్హుడు.. నేనైతే అతన్ని జట్టులోకి తీసుకోను -
ఆ మ్యాచ్‌కు "స్టేడియం ఫుల్"గా అనుమతివ్వండి.. బీసీసీఐ విజ్ఞప్తి
BCCI Requests To Have Full Capacity Spectators For T20 World Cup Final Match: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా నవంబర్ 14న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌కు స్టేడియం పూర్తి సామర్థ్యం( 25 వేలు) మేరకు ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐతో పాటు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)లు యూఏఈ ప్రభుత్వాన్ని కోరాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆతిధ్య దేశం అనుమతి తప్పనసరి కావడంతో బీసీసీఐ, ఈసీబీలు ఎమిరేట్స్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. కరోనా కారణంగా మెగా టోర్నీ నిర్వహణ భారత్ నుంచి యూఏఈకి తరలిపోయినప్పటికీ.. ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐతోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌కు అభిమానులను అనుమతించిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్ నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. స్టేడియానికి వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధనతో పాటు 48 గంటల వ్యవధిలో చేయించుకున్న నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్‌ను తప్పనిసరి చేశారు. కాగా, అక్టోబర్ 23న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగబోయే మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామం మొదలుకానుంది. ఆ మరుసటి రోజు( అక్టోబర్ 24న) దాయాదుల(భారత్, పాక్) మధ్య రసవత్తర పోరు జరుగనుంది. చదవండి: టీమిండియాకు 'ఆ చాణక్య బుర్ర' తోడైతే.. -
టీమిండియా చరిత్ర సృష్టించి నేటికి 14 ఏళ్లు..
Teamindia Beat Pakistan To Lift Inaugural T20 World Cup On This Day: పొట్టి క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించి నేటికి 14 ఏళ్లు అవుతుంది. 2007 సెప్టెంబర్ 24న టీమిండియా తొట్ట తొలి టీ20 ప్రపంచకప్‌కు కైవసం చేసుకుని యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ధోని నేతృత్వంలో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ధోని సేన 5 పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. అంతకుముందు కపిల్ నేతృత్వంలో భారత జట్టు 1983 వన్డే ప్రపంచకప్ నెగ్గింది. జోహెనస్‌బర్గ్ వేదికగా జరిగిన ఆ తుది సమరంలో ధోని ప్రపంచకప్‌కు ముద్దాడటం భారత్ క్రికెట్ అభిమానుల మదిలో నేటికీ మెదులుతూనే ఉంది. దీని తర్వాత మరోసారి టీమిండియా ధోని నేతృత్వంలోనే వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా(2011) అవతరించినా.. తొలి పొట్టి ప్రపంచకప్ గెలవడం మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. మ్యాచ్ ఆఖరి ఓవర్లో పాక్ ప్లేయర్ మిస్బా ఉల్ హక్ ఆడిన స్కూప్ షాట్‌కు శ్రీశాంత్ పట్టిన క్యాచ్‌ను ఏ భారత క్రికెట్ అభిమాని మర్చిపోలేడు. ఏమాత్రం అనుభవం లేని జోగిందర్ సింగ్‌తో ఆఖరి ఓవర్ బౌల్ చేయించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ధోనిపై యావత్ క్రికెట్ ప్రపంచం పొగడ్తల వర్షం కురిపించింది. ఇక, మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్((54 బంతుల్లో 75; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో రోహిత్ శర్మ(16 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించాడు. పాక్ బౌలర్లలో ఉమర్ గుల్కు 3 వికెట్లు దక్కగా, సోహైల్ తన్వీర్, మహ్మద్ ఆసిఫ్‌లు చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో పాక్.. పడుతూ లేస్తూ లక్ష్యానికి మరో 5 పరుగుల దూరంలో(19.3 ఓవర్లలో 152) ఆలౌటైంది. భారత బౌలర్లు ఇర్ఫాన్ పఠాన్(3/16), ఆర్పీ సింగ్(3/26), జోగిందర్ శర్మ(2/20), శ్రీశాంత్(1/44) పాక్ నడ్డివిరిచారు. మూడు వికెట్లతో పాక్‌కు దెబ్బకొట్టిన ఇర్ఫాన్ పఠాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. పాక్ ప్లేయర్ షాహిద్ అఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. చదవండి: బౌండరీ కొట్టగానే శ్రీశాంత్ స్టైల్‌ను దింపేశాడు.. -
CPL 2021: గేల్ డకౌట్.. కానీ టైటిల్ మాత్రం అతని జట్టుదే
St Kitts and Nevis Patriots CPL 2021 Champions.. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో కొత్త చాంపియన్‌గా సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియెట్స్ అవతరించింది. సెంట్ లూసియా, సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియెట్స్ మధ్య బుధవారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం అందుకున్న సెంట్ కిట్స్ తొలిసారి సీపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. టోర్నీ ఆధ్యంతం నిలకడగా రాణించిన సెంట్ కిట్స్ ఫైనల్లోనూ అదే జోరు కనబరిచింది. క్రిస్ గేల్ డకౌట్ అయినప్పటికి.. భీకరఫామ్‌లో ఉన్న ఎవిన్ లూయిస్ 6 పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. వికెట్ కీపర్ జోషువా డిసిల్వా రాణించగా.. చివర్లో డొమినిక్ డ్రేక్స్ మ్యాచ్ విన్నర్‌గా నిలిచి తన జట్టుకు తొలిసారి టైటిల్‌ను అందించాడు. చదవండి: CPL 2021: వికెట్ తీశానన్న ఆనందం.. బౌలర్ వింత ప్రవర్తన మ్యాచ్ విన్నర్ డొమినిక్ డ్రేక్స్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ కార్న్‌వాల్ 43, రోస్టన్ చేజ్ 43 రాణించారు. సెంట్ కిట్స్ బౌలర్లలో ఫాబియెన్ అలెన్ , నసీమ్ షా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్ కిట్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. గేల్ డకౌట్‌గా వెనుదిరగ్గా.. కాసేపటికే ఎవిన్ లూయిస్ ఆరు పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత జోషుహ డిసిల్వా(37), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(25)లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. విజయం దిశగా సాగిపోతున్న సమయంలో సెంట్ కిట్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చదవండి: Chris Gayle: గేల్ బ్యాటింగ్.. బ్యాట్ రెండు ముక్కలు; వీడియో వైరల్ ఈ దశలో డొమినిక్ డ్రేక్ అద్భుతం చేశాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో విజృంభించిన అతను చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. అతనికి ఫాబియెన్ అలెన్(20 పరుగులు) నుంచి చక్కని సహకారం లభించింది. ఫైనల్ హీరోగా నిలిచిన డొమినిక్ డ్రేక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. రోస్టన్ చేజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. WHAT A FINISH! Dominic Drakes seals the win with a @fun88eng Magic moment. pic.twitter.com/tvyn72hbmP — CPL T20 (@CPL) September 15, 2021 -
స్వర్ణ పతక విజేతను ఓడించి.. ఫైనల్లో జొకోవిచ్.. గెలిస్తే..
-
స్వర్ణ పతక విజేతను ఓడించి.. ఫైనల్లో జొకోవిచ్.. గెలిస్తే..
Novak Djokovic In US Open 2021 Finals: సెర్బియన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీ ఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్.. 4-6, 6-2, 6-4, 4-6, 6-2 తేడాతో నాలుగో సీడ్ జ్వెరెవ్‌పై చేయి సాధించి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆర్థుర్ ఆషే స్టేడియంలో ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌లో అతడు.. రష్యన్ ప్లేయర్ డానిల్ మెద్వెదేవ్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో గనుక జొకోవిచ్ విజయం సాధిస్తే... ఇప్పటికే ఆస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లను గెలిచిన అతడు.. క్యాలెండర్ స్లామ్ తన పేరిట లిఖించుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ఆల్‌టైమ్ గ్రేటెస్టు దిగ్గజాలు ఫెడరర్ (స్విట్జర్లాండ్), నాదల్ (స్పెయిన్)లను అధిగమించే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సెమీస్‌లో గెలిచిన అనంతరం జొకోవిచ్ మట్లాడుతూ.. ‘‘ఈ క్షణాలు ఎంతో మధురం. ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ మిగిలింది. గెలిచేద్దాం. తుదిపోరులో విజయం సాధించేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’’ అని పేర్కొన్నాడు. చదవండి: వారెవ్వా ఎమ్మా: యూఎస్ ఓపెన్‌లో సంచలనం Is @DjokerNole the most mentally tough player in tennis history? He takes us inside the 🧠 of a legend. pic.twitter.com/AiUfGDQYDT — US Open Tennis (@usopen) September 11, 2021 -
అదితి ఓ సెన్సేషన్.. ఈ పోరు చరిత్రలో నిలవాల్సిందే!
క్రీడాభిమానుల గుండె వేగం పెంచే ఆట క్రికెట్ ఒక్కటేనా?.. ఛా.. ఛా.. ఈసారి ఒలింపిక్స్‌లో అలాంటి క్షణాలు చాలానే కనిపించాయి. క్వార్టర్స్, సెమీస్, ఫైనల్.. అంటూ హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్.. ఆఖరికి రూల్స్‌పై కూడా సరిగా అవగాహనా- ఆటపై అంతగా ఆసక్తి సైతం లేని గోల్ఫ్‌ను సైతం కోట్ల భారతావనిని ఆసక్తిగా తిలకించేలా చేశారు మన ఆటగాళ్లు. అలాంటి ఉత్కంఠంతో చివరిదాకా మ్యాచ్‌ను కొనసాగించి.. ఓడినా చరిత్ర సృష్టించింది భారత యువగోల్ఫర్ అదితి అశోక్ . సాక్షి, వెబ్‌డెస్క్: ఆటల్లో రిచ్చెస్ట్ గేమ్‌గా గోల్ఫ్‌కు ఓ పేరుంది. అలాంటి ఆటలో.. అదీ ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారి ఫైనల్‌దాకా చేరుకుని భారత్‌కు పతాక ఆశలు చిగురింపజేసింది 23 ఏళ్ల అదితి. టోక్యో ఒలింపిక్స్‌కి ముందు.. ప్రారంభమైన తర్వాతా పతకాన్ని తెస్తారనే ఆశలు ఉన్న పేర్ల లిస్ట్‌లో అదితి పేరు కనీసం ఏదో ఒక మూలన కూడా లేదు. కారణం.. మహిళా గోల్ఫ్ ర్యాకింగ్స్లో ఆమెది 200వ ర్యాంక్. అలా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. పతాక పోరు దాకా అదితి చేరుకోవడం, ఆ పోరాటంలో ఓడి కోట్ల మంది హృదయాలను గెల్చుకోవడం ప్రత్యేకమనే చెప్పాలి. బెంగళూరుకు చెందిన అదితి అశోక్.. టోక్యో ఒలింపిక్స్‌లో నిన్నటి పొజిషన్లో(మూడో రౌండ్) రెండో స్థానంలో నిలవగా.. అదృష్టం బావుండి ఇవాళ్టి వాతావరణం బాగోలేకపోతే దాదాపు పతాకం ఖాయమయ్యేదే. అయితే శనివారం ఉదయం సైటమాలోని కాసుమిగాసెకి కౌంట్రీ క్లబ్లో జరిగిన ఫైనల్ గేమ్ రసవత్తరంగా నడిచింది. అయినా అతిది అద్భుతమైన ఆట తీరును కనబరిచింది. టాప్ పొజిషన్లో నిలిచి ఒకానొక టైంలో అభిమానుల్లో స్వర్ణం ఆశలు రేకెత్తించి ఉత్కంఠ పెంచిన అదితి.. ఆపై రెండు, మూడు.. చివరికి స్వీయ తప్పిదం-ప్రత్యర్థులకు కలిసి రావడంతో నాలుగో స్థానానికి సెటిల్ అయ్యింది. పతకం దక్కించుకోకపోతేనేం.. గోల్ఫ్ ఆటలోనూ అసలైన మజాను కోట్ల మంది భారతీయులకు రుచి చూపించింది అదితి. ఇక రియో ఒలింపిక్స్‌లో 41 వ స్థానంలో టైతో నిష్క్రమించిన అదితి అశోక్.. ఈసారి ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా ఫైనల్ దాకా దూసుకెళ్లడం విశేషం. క్యాడీగా(గోల్ఫ్ బ్యాగులు మోస్తూ సాయం చేసే వ్యక్తి) తల్లి వెంటరాగా.. 200వ ర్యాంక్‌తో బరిలోకి దిగిన ఈ యువ కెరటం ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ నెల్లీ కోర్డా, మాజీ ఛాంపియన్ లైడియా కో(11), ఎమిటీ క్రిస్టియన్(72), మోన్ ఇనామీ(28)మధ్య గట్టి పోటీ ఇస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఒకానొక దశలో ప్రపంచ నెంబర్ వన్, మాజీ నెంబర్ వన్లకు ముచ్చెమటలు పోయించింది ఈ భారత గోల్ఫ్ ప్లేయర్. చదవండి: భారత హాకీ: పతాకం నుంచి పతనం.. ఆపై పతకం గోల్ఫ్ ఆట తీరు అర్థంకాకపోయినా.. అదితి ఆడుతున్నంతసేపూ ఉత్కంఠను తట్టుకోలేకపోయారు యావత్ భారత క్రీడాభిమానులు. గోల్ఫ్ అంటే ఆసక్తి లేనోళ్లను.. సైతం శనివారం పొద్దుపొద్దున్నే టీవీలకు, సెల్‌పోన్లకు అతుక్కుపోయేలా చేసింది అదితి అశోక్. అంతేకాదు కొందరిని ఆటలోని పదాలను, ఆట తీరును అర్థం చేసుకునేలా చేసింది. ఇక ఒలింపిక్ జాబితాలో పీటీ ఉష, దీపా కర్మాకర్, ఈ ఒలింపిక్స్‌లో ఉమెన్స్ హాకీ టీం.. ఇప్పుడు అదితి అశోక్.. ఇలా ఫోర్త్ సెటిల్ సెంటిమెంట్(తృటిలో పతకం చేజార్చుకున్న ఆటగాళ్ల) ప్రస్తావనను మరోసారి తెర మీదకు తెచ్చింది. -
17 కోట్ల 70 లక్షల మంది చూశారు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా గత నెలలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను కోట్ల మంది తిలకించారు. జూన్‌లో జరిగిన ఫైనల్‌ను ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల 70 లక్షల మంది టీవీల్లో వీక్షించినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. డబ్ల్యూటీసీలో జరిగిన అన్ని సిరీస్‌ల్లో కంటే ఫైనల్ పోరునే ఎక్కువ మంది చూసినట్లు ఐసీసీ ప్రకటించింది. ఇందులో సింహభాగం భారత ప్రేక్షకులే ఉన్నట్లు ఐసీసీ తెలిపింది.