ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందని ఆశించిన భారతీయుల కల, కలగానే మిగిలిపోయింది. టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. గురుగ్రామ్‌కు చెందిన ఓ సంస్థ తన ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టీమిండియా ఓటమి వల్ల తమ ఉద్యోగులు బాధలో ఉంటారని భావించిన గురుగ్రామ్‌లోని 'మార్కెటింగ్ మూవ్స్ ఏజెన్సీ' సోమవారం సెలవు ప్రకటించింది. ఉద్యోగులను బలవంతంగా ఆఫీసులకు రప్పించడం ఇష్టం లేకుండా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సంస్థలో పనిచేసే ఉద్యోగి దీక్షా గుప్తా లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసింది.
ముందుగానే పరిస్థితిని అర్ధం చేసుకున్న కంపెనీ తమ ఉద్యోగులు టీమిండియా ఓటమి షాక్ నుంచి తేరుకునేందుకు సమయం ఇచ్చింది. నిన్నటి బాధ నుంచి కోలుకోవడానికి సెలవు తీసుకోండి, అని బాస్ పంపిన మెసేజ్ స్క్రిన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
ఇదీ చదవండి: సైనా నెహ్వాల్ గ్యారేజిలో చేరిన కొత్త అతిథి - వీడియో వైరల్
నిజానికి ఎవరైనా మ్యాచ్ చూడటానికి సెలవు ఇస్తారు, కానీ ఓటమి నుంచి కోలుకోవడానికి కూడా సెలవు ప్రకటించడం అనేది హర్శించదగ్గ విషయమని పలువు నెటిజన్లు ఆ కంపెనీ బాస్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల టీమిండియా ఓటమిని జీరించుకోలేక పలు చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
Boss ne sach me leave de di aaj😭
— Diksha Gupta (@thedikshagupta) November 20, 2023
Healing Monday 🥹@iMarketingMoves #marketingmoves #INDvsAUS pic.twitter.com/Jc6M20Sia3
Comments
Please login to add a commentAdd a comment