2024 ఆటలు...ఆశలు... | Calendar of Major Events Prepared for 2024 | Sakshi
Sakshi News home page

2024 ఆటలు...ఆశలు...

Published Mon, Jan 1 2024 4:26 AM | Last Updated on Mon, Jan 1 2024 4:26 AM

Calendar of Major Events Prepared for 2024 - Sakshi

ప్రపంచ క్రీడా పండుగ ఒలింపిక్స్‌లో ఈ సారి భారత్‌ పతకాల సంఖ్య రెండంకెలకు చేరుతుందా...టి20 ప్రపంచకప్‌ టైటిల్‌తో టీమిండియా ఈ సారైనా పదిహేడేళ్ల కరువు తీరుస్తుందా...మన మహిళల క్రికెట్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ అందుకునే స్థాయికి ఎదిగిందా...అండర్‌–19 స్థాయిలో ప్రపంచ కప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా దిగుతున్న మన కుర్రాళ్లు మళ్లీ సత్తా చాటుతారా... క్రికెట్‌ ఫ్యాన్స్‌ మదిలో ఈ ప్రశ్నలకు కొత్త ఏడాదిలో సమాధానం లభిస్తుంది... బ్యాడ్మింటన్‌ ప్రపంచంలో మరోసారి మన షట్లర్ల హవా సాగుతుందా...ఫార్ములా వన్‌ 23 రేస్‌లలో ఎవరికి పైచేయి అవుతుంది... హాకీలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి... ఫుట్‌బాల్‌లో ఆసియా ఖండంలో మన బలం పెరిగిందా...ఇవన్నీ చూడాల్సిందే.

టెన్నిస్‌లో ఎప్పటిలాగే నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల వేట...ప్రతీ ఏటా అలరించేందుకు వచ్చే ఐపీఎల్‌ ఎలాగూ ఉన్నాయి. వీటికి తోడు ఆర్చరీ, అథ్లెటిక్స్, చెస్, రెజ్లింగ్, షూటింగ్, బాక్సింగ్, టేబుల్‌ టెన్నిస్‌లాంటి క్రీడల్లో పలు ఆసక్తికర టోర్నీలకు ఈ ఏడాది వేదిక కానుంది. 2024లో క్రీడాభిమానులను అలరించేందుకు సిద్ధమైన ప్రధాన ఈవెంట్ల క్యాలెండర్‌ మీ కోసం... 


భారత క్రికెట్‌ జట్టు షెడ్యూల్‌ 
జనవరి 11–17: అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో 3 టి20 మ్యాచ్‌లు 
జనవరి 25–మార్చి 11: ఇంగ్లండ్‌తో స్వదేశంలో 5 టెస్టులు 
ఐపీఎల్‌: మార్చి 22 నుంచి మే 26 వరకు 
జూలై: శ్రీలంకలో భారత్‌ పర్యటన (3 వన్డేలు, 3 టి20లు) 
సెప్టెంబర్: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌ (2 టెస్టులు, 3 టి20లు) 
అక్టోబర్‌: స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ (3 టెస్టులు) 
నవంబర్‌–డిసెంబర్‌: ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటన (5 టెస్టులు) 
పురుషుల టి20 ప్రపంచకప్‌ టోర్నీ 
జూన్‌ 4 నుంచి 30 వరకు 
వేదిక: వెస్టిండీస్, అమెరికా 

ఫుట్‌బాల్‌ 
ఆసియా కప్‌ (ఖతర్‌) 
జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 వరకు 
యూరో–2024 (జర్మనీ) 
జూన్‌ 14 నుంచి జూలై 14 వరకు 
కోపా అమెరికా టోర్నీ (అమెరికా) 
జూన్‌ 20 నుంచి జూలై 14 వరకు 

బ్యాడ్మింటన్‌ 
జనవరి 9–14: మలేసియా ఓపెన్‌–1000 టోర్నీ (కౌలాలంపూర్‌) 
జనవరి 16–21: ఇండియా ఓపెన్‌–750 టోర్నీ (న్యూఢిల్లీ) 
మార్చి 5–10: ఫ్రెంచ్‌ ఓపెన్‌–750 టోర్నీ (పారిస్‌) 
మార్చి 12–17: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌–1000 టోర్నీ (బర్మింగ్‌హమ్‌) 
ఏప్రిల్‌ 28–మే 5: థామస్‌ కప్‌–ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ (చెంగ్డూ, చైనా) 
మే 28–జూన్‌ 2: సింగపూర్‌ ఓపెన్‌–750 టోర్నీ 
జూన్‌ 4–9: ఇండోనేసియా ఓపెన్‌–1000 టోర్నీ (జకార్తా) 
ఆగస్టు 20–25: జపాన్‌ ఓపెన్‌–750 
టోర్నీ (టోక్యో) 
సెప్టెంబర్17–22: చైనా ఓపెన్‌–1000 టోర్నీ (చాంగ్జౌ) 
అక్టోబర్‌ 15–20: డెన్మార్క్‌ ఓపెన్‌–750 టోర్నీ (ఒడెన్స్‌) 
నవంబర్‌ 19–24: చైనా మాస్టర్స్‌–750 టోర్నీ (షెన్‌జెన్‌) 
నవంబర్‌ 26–డిసెంబర్‌ 1: సయ్యద్‌ మోడి ఓపెన్‌–300 టోర్నీ (లక్నో) 
డిసెంబర్‌ 11–15: వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ (హాంగ్జౌ, చైనా) 

టెన్నిస్‌ 
జనవరి 15–28: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ (మెల్‌బోర్న్‌) 
మే 26–జూన్‌ 9: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ (పారిస్‌) 
జూలై 1–14: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ (లండన్‌) 
ఆగస్టు 26–సెప్టెంబర్8: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ (న్యూయార్క్‌) 
నవంబర్‌ 10–17: ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ (టురిన్, ఇటలీ) 

ఫార్ములావన్‌ 
మార్చి 2: బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి 
మార్చి 9: సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి 
మార్చి 24: ఆ్రస్టేలియా గ్రాండ్‌ప్రి 
ఏప్రిల్‌ 7: జపాన్‌ గ్రాండ్‌ప్రి 
ఏప్రిల్‌ 21: చైనా గ్రాండ్‌ప్రి 
మే 5: మయామి గ్రాండ్‌ప్రి 
మే 19: ఎమీలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రి 
మే 26: మొనాకో గ్రాండ్‌ప్రి 
జూన్‌ 9: కెనడా గ్రాండ్‌ప్రి 
జూన్‌ 23: స్పానిష్‌ గ్రాండ్‌ప్రి 
జూన్‌ 30: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి 
జూలై 7: బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి 
జూలై 21: హంగేరి గ్రాండ్‌ప్రి 
జూలై 28: బెల్జియం గ్రాండ్‌ప్రి 
ఆగస్టు 25: డచ్‌ గ్రాండ్‌ప్రి 
సెప్టెంబర్‌ 1: ఇటలీ గ్రాండ్‌ప్రి 
సెప్టెంబర్15: అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి 
సెప్టెంబర్‌ 22: సింగపూర్‌ గ్రాండ్‌ప్రి 
అక్టోబర్‌ 20: యూఎస్‌ గ్రాండ్‌ప్రి 
అక్టోబర్‌ 27: మెక్సికో గ్రాండ్‌ప్రి 
నవంబర్‌ 3: బ్రెజిల్‌ గ్రాండ్‌ప్రి 
నవంబర్‌ 23: లాస్‌ వేగస్‌ గ్రాండ్‌ప్రి 
డిసెంబర్‌ 1: ఖతర్‌ గ్రాండ్‌ప్రి 

హాకీ 
జనవరి 13–21: ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ పురుషుల టోర్నీ (వాలెన్సియా, స్పెయిన్‌) 
జనవరి 13–21: ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ మహిళల టోర్నీ (వాలెన్సియా, స్పెయిన్‌) 
జనవరి 13–19: ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ మహిళల టోర్నీ (రాంచీ, భారత్‌) 
జనవరి 15–21: ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ పురుషుల టోర్నీ (మస్కట్, ఒమన్‌) 

షూటింగ్‌ 
జనవరి 5–18: ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ రైఫిల్, పిస్టల్‌ టోర్నీ (జకార్తా) 
జనవరి 12–22: ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ షాట్‌గన్‌ టోర్నీ (కువైట్‌ సిటీ) 
జనవరి 24–ఫిబ్రవరి 1: ప్రపంచకప్‌ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ టోర్నీ (కైరో, ఈజిప్ట్‌) 
ఫిబ్రవరి 4–13: ప్రపంచకప్‌ షాట్‌గన్‌ టోర్నీ (రబాట్, మొరాకో) 
ఏప్రిల్‌ 11–19: ఫైనల్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ రైఫిల్, పిస్టల్‌ టోర్నీ (రియో డి జనీరో, బ్రెజిల్‌) 
ఏప్రిల్‌ 22–30: ఫైనల్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ షాట్‌గన్‌ టోర్నీ (దోహా, ఖతర్‌) 
మే 1–12: ప్రపంచకప్‌ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ టోర్నీ (బకూ, అజర్‌బైజాన్‌) 
మే 31–జూన్‌ 7: ప్రపంచకప్‌ రైఫిల్, పిస్టల్‌ టోర్నీ (మ్యూనిక్, జర్మనీ) 
జూన్‌ 10–19: ప్రపంచకప్‌ షాట్‌గన్‌ టోర్నీ (లొనాటో, ఇటలీ) 

అండర్‌–19 పురుషుల వన్డే ప్రపంచకప్‌ టోర్నీ 
జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు 
వేదిక: దక్షిణాఫ్రికా 

మహిళల టి20 ప్రపంచకప్‌ టోర్నీ 
సెప్టెంబర్‌–అక్టోబర్‌ 
వేదిక: బంగ్లాదేశ్‌ 


పారిస్‌ ఒలింపిక్స్‌ – 26 జూలై – 11 ఆగస్టు   
అథ్లెటిక్స్‌ 
జనవరి 21: ఆసియా మారథాన్‌ చాంపియన్‌షిప్‌ (హాంకాంగ్‌) 
ఫిబ్రవరి 21–23: ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ (టెహ్రాన్‌) 
మార్చి 1–3: ప్రపంచ ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ (స్కాట్లాండ్‌) 
ఆగస్టు 26–31: ప్రపంచ అండర్‌–20 చాంపియన్‌షిప్‌ (పెరూ) 

చెస్‌ 
ఏప్రిల్‌ 3–25: క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ (టొరంటో, కెనడా) 
జూన్‌ 1–14: ప్రపంచ జూనియర్‌ అండర్‌–20 చాంపియన్‌షిప్‌ (న్యూఢిల్లీ, భారత్‌) 
సెప్టెంబర్10–23: చెస్‌ ఒలింపియాడ్‌ (బుడాపెస్ట్, హంగేరి) 
అక్టోబర్‌ 22–నవంబర్‌ 2: ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌ (బ్రెజిల్‌) 

రెజ్లింగ్‌ 
ఏప్రిల్‌ 11–16: ఆసియా సీనియర్‌ చాంపియన్‌షిప్‌ (బిష్‌కెక్, కిర్గిజ్‌స్తాన్‌) 
ఏప్రిల్‌ 19–21: ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ (బిష్‌కెక్, కిర్గిజ్‌స్తాన్‌) 
మే 9–12: ప్రపంచ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ (ఇస్తాంబుల్, తుర్కియే) 

బాక్సింగ్‌ 
ఫిబ్రవరి 29–మార్చి 12: పారిస్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ (ఇటలీ) 
ఏప్రిల్‌: ఆసియా చాంపియన్‌షిప్‌ 
మే 23–జూన్‌ 3: పారిస్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ (థాయ్‌లాండ్‌) 
అక్టోబర్‌ 20–నవంబర్‌ 6: ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌ (క్రొయేషియా) 

టేబుల్‌ టెన్నిస్‌ 
ఫిబ్రవరి 16–25: ప్రపంచ టీమ్‌ చాంపియన్‌షిప్‌ (బుసాన్, కొరియా) 
డిసెంబర్‌ 1–8: ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌ (స్వీడన్‌)  

ఆర్చరీ 
ఏప్రిల్‌ 23–28: ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నీ (షాంఘై, చైనా) 
మే 21–26: ప్రపంచకప్‌ స్టేజ్‌–2 టోర్నీ (యెచోన్, కొరియా) 
జూన్‌ 18–23: ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నీ (అంటాల్యా, తుర్కియే) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement